‘శ్రీనివాస కళ్యాణం’పై నితిన్‌ ట్వీట్‌! | Nithin Tweet About Srinivasa Kalyanam Movie | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 30 2018 8:26 PM | Last Updated on Sun, Jul 1 2018 9:51 AM

Nithin Tweet About Srinivasa Kalyanam Movie - Sakshi

దిల్‌ సినిమా ఏ రేంజ్‌లో హిట్‌ అయిందో తెలిసిందే. ఈ సినిమా ఇద్దరి కెరీర్‌ను గాడిలో పెట్టింది. హీరోగా నితిన్‌, నిర్మాతగా రాజును నిలబెట్టింది. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని దిల్‌ రాజుగా ఇండస్ట్రీలో స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఈ సినిమాలో వీరిద్దరికి మాత్రమే కాకుండా ప్రకాష్‌ రాజ్‌ పోషించిన పాత్రకు కూడా మంచి గుర్తింపే లభించింది. 

మళ్లీ ఇన్నేళ్ల తరువాత.. ఈ కాంబినేషన్‌లో ఓ మూవీ పట్టాలెక్కుతోంది. నితిన్‌ , రాశిఖన్నా జంటగా దిల్‌రాజు బ్యానర్‌లో శ్రీనివాస కళ్యాణం మూవీలో తెరకెక్కుతోంది. దాదాపు షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ‍త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీపై నితిన్‌ ‘మళ్లీ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి దిల్‌ కాంబో వస్తోందం’టూ.. ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement