srinivasa kalyanam
-
అమెరికాలో ఆ 11 నగరాల్లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం
అమెరికాలోని 11 నగరాల్లో భాగంగా నాలుగు నగరాల్లో అత్యంత వైభవోపేతంగా జరిగిన శ్రీనివాస కల్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూఎస్ఏ లోని జూన్ 17వ తేదీన ర్యాలీ(నార్త్ కరోలినా), 18న జాక్సన్ విల్(ఫ్లోరిడా) 24న డెట్రాయిట్, 25న చికాగో నగరాల్లో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారు ఎన్ఆర్ఐ భక్తులకు దర్శనమిచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆయా నగరాలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించాలని పలు తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల నుంచి ఏపీఎన్ఆర్టీ సొసైటీకి వచ్చిన అభ్యర్థనల మేరకు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు, ఈవో గారి దృష్టికి తీసుకెళ్లగా ఆమోదం తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొదటి నుంచి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. అక్కడి నిర్వాహకులు... భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నాలుగు నగరాల్లో స్వామివారి కల్యాణానికి వేదికను అలంకరించిన తీరు ఒక్కో నగరంలో ఒక్కోలాగా అందంగా అలంకరించారు. ఈ కల్యాణోత్సవాలకు తెలుగు వారే కాక, తమిళనాడు, కేరళ, కర్నాటక ఇలా ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 12 వేలకు పైగా స్వామివారి ఎన్ఆర్ఐ భక్తులు హాజరై కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆయా ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. ఆయా నగరాల్లోని నిర్వాహకులు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని, ఏర్పాట్లన్నీ ఘనంగా చేసారు. హాజరైన భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొన్న అనంతరం భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించటం జరిగింది. ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొన్న ప్రవాసాంధ్రుల వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు అయిన శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో నార్త్ అమెరికాలోని 14 నగరాల్లో చేపట్టిన శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాల్లో, ఇప్పటికే తితిదే చైర్మన్ శ్రీ. వై.వి. సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణలో కెనడా లోని 03 నగరాల్లో పూర్తయ్యాయి. ఇప్పుడు యూఎస్ఏలోని 04 నగరాల్లో నిర్వహించడం జరిగింది. తితిదే అర్చకులు, వేదపండితుల ద్వారా కల్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధాన, అంకురార్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాలు నిర్వహించారన్నారు. ఇంకా USA లోని జూలై 1వ తేదీ నుండి జూలై 23 వ తేదీ వరకు ౦7 నగరాల్లో జరిగే శ్రీవారి కల్యాణంలో టిటిడి చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారు పాల్గొననున్నారని శ్రీ వెంకట్ పేర్కొన్నారు. యూఎస్ఏలో ర్యాలీలో జరిగిన కల్యాణోత్సవంలో ఈశ్వర్ రెడ్డి, మహిపాల్ మాలే, జాక్సన్ విల్లో, మల్లికార్జున జెర్రిపోతుల, ప్రభుత్వ సలహాదారు డా ఎన్ వాసుదేవ రెడ్డి, డెట్రాయిట్లో మహేష్ చింతలపాటి, బాలాజీ సత్యవరపు, ఎస్ నరేన్, చికాగోలో శరత్ ఎట్టపు, నరసింహ రెడ్డి, పీఎన్ఆర్టీఎస్ ప్రతినిధులు తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో తితిదే నుంచి ఏఈఓ బి వెంకటేశ్వర్లు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆయా నగరాలలోని పలువురు ప్రముఖులు భారతీయులు పాల్గొన్నారు. ఎస్వీబీసీ ఛానెల్ కల్యాణోత్సవం మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. (చదవండి: పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వైఎస్సార్సీపీ.. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ దూకుడు!) -
యూకే, యూరోప్ లలో ఘనంగా శ్రీనివాస కళ్యాణోత్సవాలు..
-
యూకే, యూరప్ దేశాలలో ముగిసిన దేవదేవుడి కల్యాణోత్సవాలు
తాడేపల్లి: యూకే , యూరోప్ లలోని వివిధ దేశాలలో ఘనంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలపై ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి పత్రికా ప్రకటన విడుదల చేసారు. యూకే , యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ తేదీ వరకు పదకొండు (11) నగరాల్లో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిసాయి. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అన్ని నగరాల్లో శ్రీవారి కళ్యాణోత్సవానికి అశేసంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తి పులకితులయ్యారు. ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయ సహకారం అందించింది. తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమన్వయ సూచనలతో బేసింగ్ స్టోక్-ఇంగ్లాండ్ లో బేసింగ్ స్టోక్ తెలుగు సంఘం, మాంచెస్టర్ - ఇంగ్లాండ్ లో శ్రీ వైకుంఠమ్, బెల్ఫాస్ట్ -నార్త్ ఐర్లాండ్ లో నార్త్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, డబ్లిన్ - ఐర్లాండ్, ఇండో-ఐరిష్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్, జురిక్-స్విట్జర్లాండ్ లో స్విస్ వేదిక్ భక్తీ ఫౌండేషన్, ఐండ్ హోవెన్ - నెదర్లాండ్స్ లో SVK, నవంబర్ ౩వ తేదీన జర్మనీ లోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్, 6వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్, 12వ తేదీన ఇంగ్లాండ్ లోని లండన్, 13 వ తేదీన స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ నగరాలలో తెలుగు, భారతీయ సంస్థల సహకారంతో శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించడం జరిగింది. ఈ 11 నగరాలలో శ్రీవారి కళ్యాణం నిర్వహించడానికి దాదాపు 15వేల కిలోమీటర్లకు పైగా బస్సు ప్రయాణం చేసిన తితిదే అర్చకులు, వేదపండితులు ప్రతి కల్యాణాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఐండ్ హోవెన్ లో జరిగిన శ్రీవారి కళ్యాణానికి ది హేగ్, నెదర్లాండ్స్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ శ్రీమతి రీనత్ సంధు, సత్య పినిశెట్టి, సెక్రటరీ (ఎకనామిక్స్ అండ్ కామర్స్) బెల్జియం భారత రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు. అలాగే ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన శ్రీవారి కళ్యాణంలో జర్మనీలో భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ పర్వతనేని హరీష్ దంపతులు, స్థానిక మేయర్ పాల్గొన్నారు. ఇక పారిస్ లో జరిగిన కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో తమిళ, పాండిచ్చేరి భక్తులు హాజరయ్యారు. 11 నగరాలలోని కల్యాణోత్సవాల్లో తెలుగు, భారతీయ భక్తులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారుకూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు. 11 నగరాలలోని కల్యాణోత్సవాల్లో ఆయా నగరాల్లోని తెలుగు, భారతీయ, ధార్మిక సేవా సంస్థలు భక్తులకు ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేసారు. ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలలో శ్రీ మలయప్పస్వామి వారి కల్యాణం నిర్వహించాలని భక్తులు, తెలుగు, భారతీయ సంస్థలు ముందుకొస్తే ఆయా దేశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మేడపాటి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని, దీనికి ఏపీఎన్ఆర్టీఎస్ తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. -
జర్మనీలో అంగ రంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం
జర్మనీలోని మ్యూనిచ్ నగరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మ్యూనిచ్ నగరానికి చెందిన స్థానిక శివాలయం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలు నవంబర్ 3న ఉదయం 7 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై మధ్యాహ్నం కల్యాణోత్సవం వరకు నిర్వహించారు. అర్చన, తోమాల సేవ అనంతరం అర్చకులు కన్నుల పండుగగా జరిపించిన కల్యాణోత్సవంలో మ్యూనిచ్ నగర పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జర్మనీ, ఆస్ట్రియాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి టీటీడీ తరఫున ఎస్వీబీసీ ఛానల్ డైరెక్టర్, ప్రఖ్యాత సినీ దర్శకులు శ్రీ శ్రీనివాస రెడ్డి, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్, టీటీడీ ఏఈఓ వెంకట్లు అతిధులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా జరిపించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని శివాలయం తరపున జరిపించేందుకు హైదరాబాద్ నుంచి సత్యనారాయణ మూర్తి, ముక్తేశ్వరం నుంచి కామేశ్వర శాస్త్రిలు తరలి వచ్చారు. మ్యూనిచ్ శివాలయం కార్య నిర్వాహక కమిటీ సోమయాజులు శర్మ , ధృవ్ కాశ్వాల,ఆదూరి రాజశేఖర్, అనిల్ గారు, పవన్, రవి కుమార్ వర్మ, సుజాత, సాయి తేజస్‌లు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో శోభాయమానంగా శ్రీవారి వైభవోత్సవాలు (ఫొటోలు)
-
Hyderabad: ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకగా వెంకన్న వైభవోత్సవాలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు.. తరలివచ్చిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం టీటీడీ నగరంలో వెంకటేశ్వర స్వామి మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి రోజు పది వేల మంది దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవోత్సవాలను ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథం నగరానికి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడే లడ్డూలు తయారు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గోపూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం ఎన్టిఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎన్టిఆర్ స్టేడియం ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ప్రచార రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోలేని వారికోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నగరానికి తరలిరావడం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు ముప్పవరపు హర్షవర్ధన్, బి.సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలివీ.. ఎన్టీఆర్ స్టేడియంలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే రోజు వారి పూజా కార్యక్రమాలు 11న ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కొలుపు, అర్చన, 7.30 నుంచి 8.15 వరకు నివేదన, 8.15 నుంచి 8.30 వరకు పాద పద్మారాదన, ఉదయం 8.30 నుంచి 9.30 వరకు రెండో నివేదన, 9.30 నుంచి 10 గంటల వరకు వసంతోత్సవం, వీధి ఉత్సవం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 5.30 గంటల నుచి 6.30 వరకు, వీధి ఉత్సవం సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు, రాత్రి కైంకర్యం రాత్రి 7.30 నుంచి 8.30 వరకు, ఏకాంత సేవ రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. 15న... 15వ తేదీన ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కోలుపు, అర్చన 7.30 నుంచి 8.15, నివేదన 8.15 నుంచి 8.30 వరకు, పాదపద్మారాధన, ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, పుష్పయాగం, రెండవ నివేదన 10.30 నుంచి 11 గంటల వరకు, సర్వదర్శనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు, సహస్రదీపాలంకరణ సేవ, సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీనివాస కళ్యాణం, సాయంత్రం 6.30నుంచి 8.30 వరకు తోమాల సేవ అర్చన, నివేధన రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డాలస్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, శ్రీదేవి, భూదేవి సమేత తిరుమల శ్రీనివాసుడి కల్యాణం అమెరికాలోని డాలస్‌లో అంగరంగవైభవంగా జరిగింది. జూన 25 శనివారం రోజున డాలస్‌లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్ వేదికగా కన్నుల పండువగా సాగింది. కొవిడ్ వల్ల వెంకన్న దర్శనభాగ్యానికి నోచుకోలేకపోయిన ఇక్కడి తెలుగువారందరూ తమకు దక్కిన అరుదైన అద్భుత అవకాశానికి మురిసిపోయారు. ఏడుకొండలు దిగి, సప్త సముద్రాలు దాటి వచ్చిన వెంకన్నను దర్శించుకునేందుకు పన్నెండువేల మందికి పైగా తరలివచ్చారు. మరో సముద్రంలా కదిలివచ్చిన జనసమూహం తమకు దక్కిన ఈ అవకాశానికి తన్మయులవుతూ వెంకన్న సేవలో ఆనంద పరవశులయ్యారు. చివరకు స్టేడియాన్ని గుడిలా మార్చడంపై అభినందనలు వెల్లువెత్తాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కడప జడ్పీ చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేందర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై విశేష సేవల్లో పాల్గొన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా.. అమెరికాలోనూ తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తూ టీపాడ్ ప్రతినిధులు టీటీడీ అర్చకులు, వేద పండితులు కేవలం వెంకన్న కల్యాణానికే పరిమితం కాకుండా సుప్రభాత సేవతో మొదలుపెట్టి, తోమాల సేవ, అభిషేక సేవలు ఘనంగా నిర్వహించారు. వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించి ఈ సేవల్లో పాల్గొన్న వారికి టీపాడ్ నిర్వాహకులు ఒక్కో సేవను అనుసరించి వేర్వేరుగా లడ్డూ ప్రసాదం, వస్త్రం, ఐదు గ్రాముల బంగారు నాణెం, వెండి నాణెం, కంచిపట్టు చీర, పట్టు దోతీ, గద్వాల్ పట్టుచీర, పట్టు దుపట్టా, ఇక్కత బ్లౌజ్ పీస్తో పాటు వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పించారు. నేత్రపర్వంగా.. తొలుత దేవేరులకు కంకణధారణ చేసిన పండితులు కార్యక్రమం ఆసాంతం శ్రీనివాసుడు ఇక్కడే మనసు లగ్నం చేసేలా మనోజపం చేస్తూ పూజలను మనోరంజకంగా, నేత్రపర్వంగా సాగించారు. తమకు ఇంతటి దర్శన, సేవాభాగ్యం కలగడం పట్ల తెలుగువారందరూ పులకించిపోయి టీపాడ్ నిర్వాహకులకు, టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డి దంపతులకు మరీమరీ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ఎన్ఆర్టీ సమన్వయంతో.. అమెరికాలో ఉంటున్న తెలుగువారందరికీ పద్మావతీ అలిమేలు సమేత తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ నాన రెసిడెంట్ తెలుగు సొసైటీ సమన్వయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలుగువారు ఎక్కువగా ఉండే అమెరికాలోని తొమ్మిది నగరాల్లో శ్రీనివాస కల్యాణానికి అంకురార్పణ చేసింది. జూన 25న డాలస్ వేదికగా స్వామి వారి కల్యాణం నిర్వహించే అవకాశం తమకు దక్కడం పూర్వజన్మ సుకృతంగా డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) పేర్కొంది. ఈ అవకాశం దక్కడం పట్ల ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డికి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి, టీటీడీ అర్చకులు, పండితులకు, ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ మేడపాటికి టీపాడ్ ధన్యవాదాలు తెలిపింది. టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రవాణా తదితర ఏర్పాట్లు చేయడమే కాకుండా డాలస్‌లోని స్థానిక అధికారులు, వ్యాపారులు, రెస్టారెంట్లతో చర్చించి కార్యక్రమ నిర్వహణను సుగమం చేసిన టీపాడ్ ముఖ్యులు రఘువీర్ బండారును వేడుకకు హాజరైన తెలుగువారందరూ అభినందించారు. లాజిస్టిక్ సహకారం అందించిన తిరుపతికి చెందిన ప్రొఫెసర్ భాను సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. అజయ్ రెడ్డి, రావు కల్వల సలహాదారులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి రమణ లష్కర్, ఇందు పంచెర్పుల, అశోక్ కొండల, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, విజయ్ తొడుపునూరి, చంద్రారెడ్డి పోలీస్, కరణ్ పోరెడ్డి, పాండురంగారెడ్డి పాల్వాయి, రవికాంత రెడ్డి మామిడి స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉంటూ కార్యక్రమ నిర్వహణకు విశేష కృషి చేశారు. వివిధ కమిటీలకు చైర్స్‌గా వ్యవహరించిన నరేష్ సుంకిరెడ్డి, బాల గంగవరపు, స్వప్న తుమ్మపాల, మంజుల తొడుపునూరి, రూప కన్నయ్యగారి, మధుమతి వ్యాసరాజు, మాధవి లోకిరెడ్డి, అనురాధ మేకల, లక్ష్మీ పోరెడ్డి, శ్రీనివాస్ అన్నమనేని, రత్న ఉప్పల, శ్రీధర్ వేముల, రేణుక చనుమోలు, జయ తెలకపల్లి, శ్రీనివాస్ తుల, లింగారెడ్డి ఆల్వా, సుమన బసని, రోజా ఆడెపు, గాయత్రి గిరి, మాధవి మెంట, శ్రీనివాస్ రెడ్డి పాలగిరి, వెంకట్ అనంతుల, వీర శివారెడ్డి, రవీంద్రనాథ్ ధూలిపాల, సంతోషి విశ్వనాథుల, రాజా వైశ్యరాజు, అభిషేక్‌రెడ్డి కార్యక్రమం విజయవంతానికి ఎనలేని కృషి చేశారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులకు సత్కారం కాగా, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి ఆదేశానుసారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మూర్తులను అర్చకులు, పండితులతో సహా వెంటబెట్టుకుని వచ్చి, ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి విజయవంతంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన వైవీ సుబ్బారెడ్డి దంపతులను, అర్చకులు, పండితులను టీపాడ్ అధ్యక్ష కార్యదర్శులు విశేష రీతిలో సత్కరించారు. డాలస్‌లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు హాజరై పద్మావతీ అలివేలు సమేత వెంకన్ననను దర్శనం చేసుకున్న వారందరికీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు. -
అగ్రరాజ్యాన అంగరంగ వైభవంగా అచ్యుతుడి కల్యాణం
తిరుమల: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కల్యాణోత్సవ క్రతువులో భాగంగా తొలుత అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరచడానికి నిర్వహించే పవిత్ర కర్మ అయిన పుణ్యాహవాచనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి ఆరాధనను చేపట్టారు. తరువాత కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమగుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లారు. అనంతరం వైదిక క్రతువు అయిన అంకురార్పణలో భాగంగా అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు. వేద మంత్రాల నడుమ ప్రతిష్టా బంధన నిర్వహించారు. ప్రాయశ్చిత హోమం నిర్వహించి దేవతామూర్తలకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం కన్యాదానం, మాంగల్యధారణ, వారణమాయిరం చేపట్టారు. చివరిగా శ్రీదేవిని కుడి వైపున, భూదే విని ఎడమ వైపున కూర్చోబెట్టి స్వామివారికి కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి ఇవ్వడంతో కల్యాణోత్సవం ముగిసింది. ఈ ఘట్టాలను తిలకించి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం: అమెరికాలో టీటీడీ చైర్మన్ దంపతులకు ఘన స్వాగతం
డాలస్: అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న టీటీడీ శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవానికి హాజరయ్యేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైవీ దంపతులకు ఘన స్వాగతం లభించింది. నార్త్ అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కడప రత్నాకర్ తదితరులు వీరిని సాదరంగా ఆహ్వానించారు. జూన్ 18న శాన్ఫ్రాన్సిస్కో, 19,సియాటెల్, డాలస్‌లో 25న , 26న సెంట్ లూయస్, 30న చికాగో, జూలై 2వ తేదీన న్యూఓర్లీన్స్, 3, వాషింగ్టన్ డీసీ, అట్లాంటాలో జూలై 9న, 10న అలబామాలో అత్యంత వైభవంగా శ్రీనివాస కల్యాణాన్ని నిర్వహిస్తారు. డాలస్‌లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్లో తెలుగువారి ఆధ్వర్యంలో టీపాడ్ నేతృత్వంలో జూన్ 25న విశేష పూజాకార్యక్రమం, శ్రీనివాస కల్యాణం ఇతర సేవలు ఘనంగా నిర్వహించనున్నారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, కల్యాణ సేవలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. (డాలస్‌లో శ్రీనివాసుడి కల్యాణం) -
దుబాయ్‌లో కన్నులపండుగగా శ్రీనివాస కళ్యాణం
-
సింగపూర్‌లో ఘనంగా శ్రీనివాస కల్యాణం
సింగపూర్ తెలుగు సమాజం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని సింగపూర్ లోని పాయ లేబర్, శ్రీ శివన్ దేవాలయం ప్రాంగణంలో జరిపించారు. మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రభాత సేవతో మొదలై ఏకాంత సేవ వరకు జరిగిన విశేషసేవలకు భారీగా భక్తులు తరలి వచ్చారు. సింగపూర్‌తో పాటు మలేషియా నుండి కూడా అనేకమంది భక్తులు వచ్చి తిరుమల ఉత్సవ అనుభూతిని పొందారు. కన్నుల పండగగా జరిగిన ఈ ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, చిన్నారుల నాట్యాలు, మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అతి తక్కువ సమయంలో అత్యంత వేడుకగా కళ్యాణమహోత్సవాన్ని చేయడంలో కీలక పాత్ర వహించిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గాన్ని కొనియాడారు. తిరుమల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి టీటీడీ కార్యవర్గం చర్యలు తీసుకుంటుందన్నారు. విదేశాల నుండి వచ్చే భక్తుల కోసం మరింత శీఘ్రగతిన దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు. టీటీడీ బోర్డ్ మెంబర్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. మాట్లాడుతూ సింగపూర్‌లో ఎన్నో దేవాలయాలు ఉండడం ఆనందంగా ఉందని, ఇక్కడి భారతీయుల భక్తి ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈకార్యక్రమంలో సింగపూర్ హోమ్, న్యాయశాఖా మంత్రివర్యులు కె షణ్ముగం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు యస్ ఈశ్వరన్, సింగపూర్ దేశ భారత రాయభారి జావెద్ అష్రాఫ్, హిందూ ఎండోమెంట్ బోర్డ్ ఛైర్మన్ ఆర్ జయచంద్రన్, శివన్ దేవాలయ సలహాదారు దినకరన్, శివన్ దేవాలయ ఛైర్మన్ వెంకటేష్, శివన్ దేవాలయ కార్యదర్శి టి అన్బలగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ సావనీర్ ను ప్రముఖుల చేతులమీదుగా ఆవిష్కరించారు. పుష్కర కాలం తర్వాత ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని సింగపూర్‌లో నిర్వహించడానికి తోడ్పాటునందించిన టీటీడీ యాజమాన్యానికి, స్థానిక హిందూ ఎండోమెంట్ బోర్డు, శివన్ టెంపుల్ యాజమాన్యానికి సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సింగపూర్ భక్తులకి ఈ కార్యక్రమం ద్వారా కలగడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవంలో అహర్నిశలు శ్రమించిన కుటుంబ సమేత కార్యవర్గ సభ్యులు జ్యోతీశ్వర్ రెడ్డి కురిచేటి, నగేష్ టేకూరి, అనిల్ పోలిశెట్టి, సత్య సూరిశెట్టి, మల్లికార్జున్ పాలేపు, వెంకట వినయ్ కుమార్ గౌరిరెడ్డి, ప్రదీప్ సుంకర, సిద్దా రెడ్డి నరాల, భూమ్ రాజ్ రుద్ర, మహేష్ కాకర్ల, సోమా రవి కుమార్, ధర్మ వర ప్రసాద్ బచ్చు, సమ్మయ్య బోయిని, కాసయ్య మేరువ, స్వాతి కురిచేటి, విజయ చిలకల్, సుప్రియ కొత్త, వెంకట శివ రావు పులిపాటి, నరసింహ గౌడ్ పోతగౌని, శ్రీనివాస రెడ్డి పుల్లన్నగారి, నాగరాజు వడ్డి, ఫణింద్ర వర్మ కలిదిండి, అర్జున్ రావు జునెబోయిన లకు సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి చిర్ల దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడిన వాలంటీర్లకు, దాతలకు, సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరున తెలుగు సమాజం ఉపాధ్యక్షులు, కార్యక్రమ నిర్వాహకులు పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. -
నాష్‌విల్లేలో ఘనంగా శ్రీనివాస కల్యాణం
టేనస్సీ : నాష్‌విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు కల్యాణ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కమిటీ సభ్యులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, నరెందర్‌రెడ్డి నూకల, సుషీల్ చంద, కిషోర్‌రెడ్డి గూడూరు, ప్రకాశ్‌రెడ్డి ద్యాప, రాధిక రెడ్డి, లావణ్య నూకల, కళ ఉప్పలపాటి, ప్రశాంతి, మంజు లిక్కి, దీప, శిరీష కేస తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీనివాసుడి కల్యాణం
-
రమేష్ వర్మ దర్శకత్వంలో నితిన్
సక్సెస్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న యంగ్ హీరో నితిన్ మరో సినిమాకు ఓకె చెప్పాడు. అ ఆ తరువాత లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కల్యాణం సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వటంతో తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్వరలో ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. రైడ్, వీర లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రమేష్ వర్మతో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు నితిన్. ఈ సినిమాను ఏ స్టూడియోస్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నారు. -
‘పక్కా ప్రామిస్’.. ఈ ఏడాది 2 సినిమాలు
హీరోగా చాలా కాలంగా కొనసాగిస్తున్న టాప్ స్టార్స్ లిస్ట్ లో చేరటంలో ఫెయిల్ అవుతున్నాడు నితిన్. చివరగా శ్రీనివాస కల్యాణం సినిమాలో కనిపించిన నితిన్ తరువాత మరో సినిమాను ప్రారంభించలేదు. ఛలో ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో భీష్మా సినిమాను ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే ఈ విషయంపై అభిమానులు పదే పదే ప్రశ్నిస్తుండటంతో నితిన్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ నెలాఖరున తదుపరి చేయబోయే సినిమాలపై ప్రకటన చేస్తాను. పక్కా ప్రామిస్.. షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాను’ అంటూ అభిమానులు ఓపిగ్గా ఎదురుచూస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు నితిన్. వరుస డిజాస్టర్లతో ఇబ్బందుల్లో పడ్డ నితిన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. For all those asking..wil update about my future projects by the end of this month..PAKKA PROMISE..shoot wil also start soon!!all are in scripting stages..plannin for 2 releases this year..sorry for the delay and thank u for being patient🙏🙏 LOVE YOU ALL😘😘 — nithiin (@actor_nithiin) 6 March 2019 -
మరో రెండేళ్ల తర్వాత పెళ్లి ప్లాన్స్.. !
ఐదు రోజుల ముందే బర్త్‌డే (నవంబర్, 30) విషెస్ చెప్పేస్తున్నాం.. ఇంతకీ బర్త్‌డే ప్లాన్స్ ఏంటి? రాశీ ఖన్నా: ముందుగా విషెస్‌కి థ్యాంక్స్. బర్త్‌డేకి పెద్ద ప్లాన్ ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నై నుంచి ఫ్రెండ్స్ వస్తున్నారు. హైదరాబాద్‌లోనే పార్టీ కాబట్టి ఇక్కడి ఫ్రెండ్స్ ఎలాగూ వస్తారు. సూపర్ ఫన్‌గా ఉండబోతోంది. ‘థీమ్ పార్టీ’ ప్లాన్ చేçస్తున్నాను. అంతకుముందేమో రెడ్ అండ్ వైట్, గతేడాది గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఈసారి... ఇప్పుడే చెప్పను. సర్ప్రైజ్. ఏ కలర్ థీమ్ అనుకుంటే ఆ కలర్ డ్రెస్సులు వేసుకుంటాం. డెకరేషన్ అంతా కూడా ఆ కలర్ థీమ్‌లోనే ఉంటుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై... త్రీ స్టేట్స్లో ఫ్రెండ్స్‌ని కవర్ చేశారా? (నవ్వేస్తూ).. ఢిల్లీ నేను పుట్టి, పెరిగిన ఊరు కాబట్టి అక్కడ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముంబైలో మోడలింగ్ చేశాను. అందుకని అక్కడ కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. తమిళ సినిమాలు చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. తెలుగు సినిమాలు చేస్తూ హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాను కాబట్టి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను పార్టీలకు దూరంగా ఉంటాను. సంవత్సరానికి నా అంతట నేను ఇచ్చే పార్టీ అంటే అది నా బర్త్‌డేకే. అందుకే వీలైనంత గ్రాండ్‌గానే పార్టీ చేసుకుంటాను. చిన్నప్పటి బర్త్‌డేస్ గురించి? మా పేరెంట్స్ గ్రాండ్‌గా చేసేవాళ్లు. స్కూల్లో స్వీట్స్ ఇవ్వడం, ఇంటి దగ్గర ఫ్రెండ్స్‌కి పార్టీ ఎరేంజ్ చేయడం.. అన్నీ మంచి జ్ఞాపకాలే. చిన్నప్పుడు అమ్మానాన్న అంత గ్రాండ్‌గా చేసేవాళ్లు కాబట్టే నాకు బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే ఇంట్రస్ట్ పెరిగిందేమో. హీరోయిన్గా ఇది మీకు ఐదో బర్త్‌డే అనుకుంటా. అంతకుముందు చిన్ని ప్రపంచం. ఇప్పుడు పెద్ద ప్రపంచం. ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేయడం ఎలా అనిపిస్తోంది? జీవితంలో ఆనందపడటానికి చాలా విషయాలుంటాయి. వాటిలో ఫ్యాన్స్ ప్రేమ ఒకటి. కొందరు ఫ్యాన్స్ నా బొమ్మలు గీసి పంపిస్తుంటారు. జనరల్‌గా నాకు గ్రీటింగ్ కార్డ్స్ ఇష్టం. ఫ్యాన్స్ నాకోçసం బొమ్మలు గీసి ఇచ్చే ఆ గ్రీటింగ్ కార్డ్స్‌ని నేను పెద్ద బహుమతిలా భావిస్తాను. ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేనిది. హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ అయి నాలుగేళ్లయింది. అప్పటికీ ఇప్పటికీ మీ లైఫ్‌లో వచ్చిన మార్పేంటి? నటిగా, మనిషిగా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. యాక్చువల్‌గా నేను ‘కామ్’ పర్సన్. ఇక్కడికొచ్చాక ఇంకా కామ్ పర్సన్ అయ్యాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. సక్సెస్, ఫెయిల్యూర్.. రెండూ చూస్తున్నాను. ఏదీ తలకి ఎక్కించుకోవడంలేదు. ఏది జరిగితే అది జరిగిందిలే అని లైఫ్‌ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నాను. ప్రతీ మూమెంట్‌ని సెలబ్రేట్ చేçస్తున్నాను. ప్రతీ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తాను. కార్తీక పౌర్ణమిలాంటివి కూడా చేస్తారా.. ఉపవాసం ఉంటారా? మొన్న కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించాను. ఈసారి ఉపవాసం చేయలేదు. అయితే మా ఇంట్లో వాళ్లు మాత్రం ఉపవాసం చేస్తుంటారు. యాక్చువల్లీ పండగలు చేసుకోవడం అంటే.. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమే. ఆధ్యాత్మికతలో ఆహ్లాదం ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడుతూ జనరల్‌గా నేను ‘కామ్ పర్సన్’ని అన్నారు. ‘నాలాంటివాళ్లకు ఇండస్ట్రీ సూట్ అవుతుందా’ అని సినిమాల్లోకి వచ్చే ముందు ఏమైనా భయపడ్డారా? ఆ భయం ఉండేది కాదు. మన పని మనం చేసుకుంటూ అనవసరంగా ఇతరుల జోలికి వెళ్లకుండా ఉంటే హ్యాపీగా ఉండగలుగుతాం అనుకున్నాను. బేసిక్‌గా నేను చాలా ప్రైవేట్ పర్సన్‌ని. చాలా సెక్యూర్డ్ పర్సన్‌ని. నా పనేదో నేను చూసుకుంటాను. పక్కనోళ్ళ జోలికి పోను. తర్వాత ఏం జరగబోతోంది అని ఆలోచించను. సినిమాలు చేయడం, వాటిని ప్రమోట్ చేయడం. ఇంటికెళ్లి హ్యాపీగా అమ్మానాన్నలతో గడపడం.. అంతే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘మీటూ’ అంటూ చాలా మంది ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీకేమైనా చెప్పడానికి ఉన్నాయా? చాలా ఏళ్లుగా ఫేస్ చేస్తున్న చేదు అనుభవాలను బయటకు వచ్చి నిర్భయంగా చెప్పగలగడం గ్రేట్. వాళ్ల ధైర్యం నిజంగా అభినందనీయం. ‘మీటూ’ అంటూ నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘ఊహలు గుసగుసలాడె’ సినిమాతో ఇక్కడికి వచ్చాను. అప్పటినుంచి ఇప్పటివరకూ అన్నీ మంచి అనుభవాలే. ‘టాలీవుడ్ ఈజ్ వన్నాఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీస్’. ఇక్కడ చాలా గౌరవిస్తారు. ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా కామ్‌గా అయ్యానన్నారు. ఏం చేస్తే అలా అవ్వడానికి కుదురుతుంది? మెడిటేషన్. రోజూ ఓ పదిహేను నిమిషాలైనా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం అంటే కళ్లు మూసుకోవడం అని చాలామంది అనుకుంటారు. అయితే పరిసర ప్రాంతాలను మరచిపోయి, ఎలాంటి ఆలోచనలు లేకుండా కాసేపు ఉండటమే ధ్యానం. ప్రాక్టీస్ మీద అది కుదురుతుంది. ఆల్రెడీ నేను చాలా కామ్. ధ్యానం నన్నింకా కామ్ పర్సన్‌ని చేసింది. తొలి ప్రేమ, శ్రీనివాస కల్యాణం చిత్రాల్లో చాలా స్లిమ్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపించారు. మెంటల్ పీస్ కోసం ధ్యానం. మరి.. ఫిజికల్ ఫిట్నెస్ కోసం? నిజం చెప్పాలంటే నేనసలు డైటింగ్ చేయను. నచ్చింది తింటా. చాక్లెట్స్, పరాటా.. అన్నీ తింటాను. వారంలో ఆరు రోజులు కనీసం గంట అయినా జిమ్‌లో గడుపుతాను. ఇంటి దగ్గర చేసిన వంటను ఎక్కువగా ఇష్టపడతాను. డైట్ అని తినకపోతే అది మన ముఖంలో ప్రతిబింబిస్తుంది. ఫ్రెష్‌గా కనిపించం. నచ్చినవి తినడం, ఎక్స్ట్రా కేలరీస్ని జిమ్‌లో కరిగించడం (నవ్వేస్తూ). హిట్, ఫ్లాప్.. ఈ రెండు రిజల్ట్స్‌తో మీ ట్రావెల్ ఎన్ని రోజులు ఉంటుంది.. నటిగా అభద్రతాభావం ఏమైనా? యాక్చువల్లీ ఏ రిజల్ట్తోనూ నేను ఎక్కువ సేపు ట్రావెల్ చేయలేను. దాన్నుంచి ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాను. ఇక ఇన్సెక్యూరిటీ అంటారా? అస్సలు లేదు. నిన్ను నువ్వు నమ్మితే ఎటువంటి అభద్రతాభావానికి లోను కావనేది నా ఫిలాసఫి. అంతా నమ్మకమే. నమ్మకం ఉంటే ఏదీ మనల్ని భయపెట్టదు. రీసెంట్గా తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. నాలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ‘అడంగామారు’ సినిమా చేయడం గురించి? నేను చేసిన ఫస్ట్ తమిళ సినిమా ‘ఇమైక్క నొడిగళ్’ చిత్రం ఆగస్ట్‌లో రిలీజైంది. అందులో స్పెషల్ రోల్ అయినప్పటికీ మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ‘జయం’ రవితో ‘అడంగామారు’ (తెలుగులో ‘సుభాష్’) చేస్తున్నాను. నాలుగు భాషల్లో ఈ సినిమా చేయడం నటిగా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది కాకుండా విశాల్‌తో ‘అయోగ్య’ చేస్తున్నాను. ఇది ‘టెంపర్’ సినిమాకి రీమేక్. తెలుగు ‘టెంపర్’ చూశాను. ఆ సినిమా పాయింట్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా క్లైమాక్స్. సాధారణంగా మీ రోజు ఎలా మొదలవుతుంది? నిద్రపోయే ముందు.. ఉదయం లేచాక దేవుణ్ణి ప్రార్థిస్తాను. అలా చేయడం వల్ల మనలో పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతాయని నా నమ్మకం. మీకేదైనా కష్టం వస్తే ఎవరి మీద ఆధారపడతారు? దేవుడు, అమ్మ, నాన్న? దేవుడు. మీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది? దేవుడా... నాకు ఇది కావాలి.. అది కావాలి అన్నట్టుగా ఏం పూజ చేయను. సర్వం తెలిసిన దేవుడి దగ్గరికి వెళ్లి ‘ఇది కావాలి’ అని అడగకూడదనుకుంటాను. మనకేం ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకే కోరికల లిస్ట్ చదవను. కొన్ని సినిమాల్లో సింగర్‌గా గొంతు వినిపించారు. మళ్లీ ఎప్పుడు? ట్రై చేస్తున్నాను. వీలున్నప్పుడల్లా పాడుతూనే ఉంటాను. హీరోయిన్ అయ్యాక ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు? ప్రయాణాలు ఇష్టమేనా? పదిహేడేళ్ల వయసులో కెరీర్ కోసం ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కాను. ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఇప్పుడూ ట్రావెలింగ్ అంటే అంతే ఎగై్జటింగ్‌గా ఉంటుంది. అయితే మరీ వారంలో రెండు మూడు సార్లు వేరే స్టేట్, వేరే కంట్రీ అంటే .. ‘అరే.. ఎంత తిరగాలిరా బాబూ’ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ కాసేపే. పర్టిక్యులర్‌గా ఏదైనా కంట్రీని విజిట్ చేయాలని ఉందా? సినిమా షూటింగ్స్ వల్ల ఆల్మోస్ట్ అన్ని దేశాలు చూసేశాను. అలాగే బెల్జియం మిగిలింది. ఆ ప్లేస్ విజిట్ చేయాలనుంది. మీరు చేసిన పాత్రల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినది ఏదైనా ఉందా? ప్రతీ పాత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాను. ‘శ్రీనివాస కల్యాణం’ నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా తెలుగు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు. ‘తొలిప్రేమ’ సినిమాలో పోషించిన వర్ష పాత్రకు, నాకు ఎటువంటి పోలికా లేదు. తనకంటే నేను చాలా మెచ్యూర్డ్. కానీ ఆ సినిమాలో సెకండ్ హాఫ్‌లో వర్ష చూపించే ఓర్పును (పేషెన్స్) ఎక్కువ నేర్చుకున్నాను. ఇటీవల ‘శ్రీనివాస కల్యాణం’లో మిమ్మల్ని పెళ్లి పీటల మీద చూశాం.. రియల్ లైఫ్‌లో ఎప్పుడు చూడొచ్చు? ఇప్పటికైతే ఆ ప్లాన్స్ లేవు. సినిమాలు.. సినిమాలు.. అంతే. అమ్మానాన్న మరో రెండేళ్ల తర్వాత పెళ్లి ప్లాన్స్ మొదలుపెట్టేట్లు ఉన్నారు (నవ్వుతూ). మరి.. కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్‌ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా ఇద్దరికీ వేవ్‌లెంగ్త్ బాగా కుదరాలి. అతను ‘కైండ్ హార్టెడ్’ అయ్యుండాలి. కైండ్ అని ఎందుకు అన్నానంటే ఎక్కడ ‘దయ’ ఉంటుందో అక్కడ బాగా చూసుకునే మనసు ఉంటుంది. జనరల్‌గా ఏ అమ్మాయిని అడిగినా ‘మంచి మనిషి అయ్యుండాలి’ అంటారు. పెళ్లి చూపుల్లో ఒక్కసారి చూసి, పెళ్లి చేసుకుంటారు. ఒక్క చూపులో జడ్జ్ చేయగలిగే ‘సూపర్ పవర్’ ఏదైనా మీకుందా? (నవ్వేస్తూ). అలాంటి అతీత శక్తులేవీ నాకు లేవు. అయితే ఒక మనిషి లుక్ అతను ఎలాంటివాడో కొంతవరకూ చెప్పేస్తుంది. మాట్లాడే విధానం ద్వారా కూడా కొంత తెలుసుకోవచ్చు. పెళ్లి చేసుకునే అబ్బాయిని అయినా, ఫ్రెండ్‌ని అయినా.. ఎవరినైనా కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో తెలుసుకోవడం కష్టం. వాళ్లతో ట్రావెల్ చేస్తేనే మనసు అర్థమవుతుంది. ఖాళీ సమయాల్లో బుక్స్ బాగా చదువుతారని విన్నాం. మీరు చదివినవాటిలో బాగా ప్రభావితం చేసిన బుక్ గురించి? నాకు బుక్స్ చదవడం ఇష్టం. వాటికోసం స్పెషల్‌గా షాపింగ్ చేస్తాను. ఈ మధ్యకాలంలో చదివిన ‘ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్’ బుక్ నన్ను చాలా ప్రభావితం చేసింది. ద్రౌపది కోణం నుంచి మహాభారతం చెప్పే పుస్తకం అది. ఎవరో ఫ్రెండ్ ఇస్తే చదవడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం నాలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందంటే... ‘వీళ్లు ఇలాంటివాళ్లు’ అని మనుషుల మీద ఓ నిర్ణయానికి రావడం మానేశాను. సంఘటనలను బట్టి మనుషుల ప్రవర్తన మారుతుంటుంది. అందుకని ఏదో ఒక ఇన్సిడెంట్ చూసి, ‘వీరి మనస్తత్వం ఇలాంటిది’ అని జడ్జ్ చేయడం తప్పని తెలుసుకున్నాను. బుక్స్ ఇచ్చే నాలెడ్జ్ అంతా ఇంతా కాదు. అందుకే ఖాళీ దొరికితే చదవాలి. నేను ఖాళీ సమయాల్లో బుక్స్‌తో బిజీ అయిపోతా. ఫైనల్లీ.. ఒక సందర్భంలో ‘దేవుడు నాకు కావల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు’ అని అన్నారు. మరి ఆ ఎక్కువని తిరిగి ఎలా దేవుడికి ఇస్తారు? దేవుడికి మనం ఏదైనా ఇవ్వడమంటే అది సేవ రూపంలోనే అనుకుంటాను. మా అమ్మ ఏం చెబుతారంటే కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదంటారు. అందుకే బయటకు చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడను. మీరు, వాణీకపూర్ (‘ఆహా కల్యాణం’ ఫేమ్) అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్స్‌కి వెళుతున్నారు. అసలు మీ ఇద్దరికీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? మేం ఇద్దరం ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లమే. మోడలింగ్ టైమ్ నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. మా ఫ్రెండ్షిప్ పదేళ్లుగా కొనసాగుతోంది. తను నా సిస్టర్‌లాగా. ప్రొఫెషనల్‌గా తను మీ అంత ఫాస్ట్‌గా లేరు. ఏమైనా సలహాలిస్తారా? వాణీ కపూర్ మంచి నటి. కెరీర్ కొంచెం స్లోగా ఉంది. రీసెంట్గా ఓ పెద్ద ప్రాజెక్ట్ ఓకే చేసింది. రణ్‌బీర్‌తో ఓ పీరియాడికల్ మూవీ చేస్తోంది. ఐదేళ్ల తర్వాత రాశీ ఖన్నా ఎలా ఉండబోతున్నారు? నిజం చెప్పాలంటే అంత ప్లానింగ్ ఉండదు. అనుకోకుండా అనూహ్యంగా జరిగేదే జీవితం. సో... ప్లాన్ చేసుకుని ఏం ఉపయోగం? లైఫ్ ఎలా వెళితే అలా వెళ్లిపోవడమే. మీరేమో అందంగా ఉంటారు. ఒకవేళ డీ–గ్లామరస్ రోల్ వస్తే? డీ–గ్లామరస్ మేకప్ వేసుకోవడానికి రెడీ. ఓన్లీ మేకప్ మాత్రమే కాదు.. హెయిర్ సై్టల్ ఏదైనా ఎలా అయినా చేసుకోవడానికి రెడీ. ఎందుకంటే చాలెంజెస్ ఎప్పుడో కానీ రావు కదా. మీ మనస్తత్వానికి విరుద్ధంగా ఉన్న పాత్ర చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏ పాత్ర చేసినా అందులో సెన్స్ ఉందా? లేదా? అని ఆలోచిస్తాను. అలా ఉంటే బావుంటుంది అని నమ్ముతాను. ఒకవేళ కొంచెం అటూ ఇటూగా ఉంటే నా అభిప్రాయాన్ని చెబుతాను. – డి.జి. భవాని -
అభయ ప్రదాత
కలియుగంలో పెళ్లి కోసం అప్పు చేసిన మొదటివాడు శ్రీనివాసుడేనట. ఈ విషయం మనకు శ్రీ శ్రీనివాస కల్యాణమనే గ్రంథమే చెబుతోంది. పద్మావతీ అమ్మవారిని పెళ్లాడడానికి తన దగ్గర డబ్బులేకపోవడంతో స్వామివారు కుబేరుడి దగ్గర అప్పు చేశారట. కల్యాణం అనంతరం తన దేవేరితో కలిసి తిరుమలకు వెళుతూ, మార్గమధ్యంలో అప్పలాయగుంట వద్ద ఉన్న వేముల పర్వతంపై తపస్సు చేస్తున్న సిద్ధేశ్వర మహర్షి భక్తికి మెచ్చి ఆయనను అనుగ్రహించేందుకు ఆయన వద్దకు వచ్చాడట. తన స్వామి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి అప్పు చేసినట్లు మహర్షికి తెలియడంతో ఆయన స్వామివారిని ‘అప్పులాయన’ అని సంబోధిస్తూ, తనను అనుగ్రహించినందుకు గుర్తుగా ఇక్కడే ఉండిపొమ్మని కోరుకున్నాడట. ఆ మహర్షికి అభయమిచ్చిన చోటే వేంకటేశ్వరుడు వెలిశాడట. అక్కడ నీటికుంట ఉండడంతో అప్పులాయనకుంటగా పేరొచ్చిందని కూడా చెబుతారు. నాటి అప్పులాయన కుంటనే నేడు అప్పలాయగుంటగా పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని టీటీడీ ధార్మిక సంస్థ నిర్వహిస్తోంది. తిరుమలకే ఎందుకు వెళ్లారు...? వేంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత ఎక్కడ ఉండాలనే విషయంపై చర్చ జరిగింది. అప్పుడు అమ్మవారి తండ్రి ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి స్వామివారికి తిరుమల కొండపై ఒక కుటీరం ఏర్పాటు చేశారని, అందువల్ల స్వామివారు అక్కడ కొలువై ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. ఆరునెలలు అగస్త్యేశ్వరుని అతిథిగా.. పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత స్వామివారు కాలినడకన తిరుమలకు వెళ్తుండగా మధ్యలో శ్రీనివాసమంగాపురం దగ్గర తొండాపురంలో అగస్త్యేశ్వర స్వామి మందిరానికి వెళ్తాడు. అప్పుడు అగస్త్యేశ్వరుడు వెంకన్న–పద్మావతి దంపతులకు ‘తిరుమలలో 33 కోట్ల మంది రుషులు తపస్సు చేస్తున్నారు. అందువల్ల మీరు ఆర్నెల్లపాటు ఇక్కడే ఉండాలి’ అని చెబుతాడు. దీంతో స్వామి, అమ్మవారు అగస్త్యేశ్వరుడి మందిరంలో ఆర్నెల్లపాటు అతిథులుగా ఉన్నారని చరిత్ర. తదనంతర కాలంలో ఆ కుటీరం వకుళామాత కుటీరంగా పిలువబడుతోంది. ఆలయానికి విజయనగర రాజుల బహుమానం... నాటి విజయనగర రాజ్యస్థాపకులు అప్పలాయగుంట వేంకటేశ్వరుని ఆలయానికి కొన్ని దీపపు స్తంభాలను బహూకరించినట్లు ప్రతీతి. అప్పటి నుంచి ఇప్పటివరకు స్వామివారి సేవలకు ఆ దీపపుస్తంభాలనే వాడుతున్నారు. దీనికితోడు స్వామివారి ఆలయానికి తూర్పుముఖంగా అభయాంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. తిరుమలలో లాగే పూజా కైంకర్యాలు.. తిరుమలలో జరిగే నిత్యకైంకర్యాలు, ప్రతి వైఖానస పూజా కార్యక్రమం, అన్ని సేవలు, బ్రహ్మోత్సవాలను కూడా టీటీడీ ఆధ్వర్యంలో అప్పలాయగుంటలో జరుగుతాయి. స్వామివారికి శనివారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయి. ఆ రోజు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు ఊంజల్‌సేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోరు.. తిరుమల కొండపై వేలాదిమంది పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ అప్పలాయగుంట అభయహస్తం వేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం పెళ్లిళ్లు చేసుకోరు. చేసుకోవడానికి భక్తులు కూడా ఆసక్తి చూపరు. ఎలా వెళ్లాలంటే.. తిరుపతి బస్టాండులో అప్పలాయగుంటకు వెళ్లే బస్సులు ఉన్నాయి. ఆ బస్సు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సమీపం మీదుగా అప్పలాయగుంటకు చేరుకుంటుంది. అలాగే చెన్నై నుంచి వచ్చే భక్తులు పుత్తూరు మండలం సరిహద్దులోని తడుకు ఆర్ఎస్ గ్రామం జాతీయరహదారి నుంచి ఎడమవైపునకు వెళ్తే అప్పలాయగుంట వస్తుంది. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే ప్రతి బస్సు వడమాలపేట మీదుగా వెళ్తుంది. వడమాలపేట నుంచి ఆటోలో వెళ్లొచ్చు. లేదంటే తడుకు ఆర్ఎస్ గ్రామం వద్ద దిగి అక్కడి నుంచి కూడా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు. ఇక్కడి స్వామివారి గొప్పతనం తిరుమల కంటే ముందే వేంకటేశ్వరుడు అభయహస్తంతో వెలిశారు గనుక ఇక్కడికి వచ్చే భక్తులంతా తమను అప్పుల బాధ నుంచి విముక్తుల్ని చేయాలని వేడుకుంటారు. కొన్నివారాల పాటు అప్పలాయగుంట అభయహస్తం వేంకటేశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. తిరుమలలో వేంకటేశ్వరుడు భక్తుల నుంచి కానుకలు తీసుకుంటాడని, కానీ అప్పలాయగుంట వేంకటేశ్వరుడు మాత్రం భక్తులకు అభయమిస్తాడని నమ్మకం. తిరుమలలో స్వామివారి హస్తం కిందకు ఉంటే.. అప్పలాయగుంటలో స్వామి చేతివేళ్ళు పైకి ఉంటాయి. అందుకే అభయహస్తం వేంకటేశ్వరుడిగా కీర్తింపబడుతున్నారు. – జి.బసవేశ్వరరెడ్డి, సాక్షి, తిరుపతి -
వెంకన్న పెళ్లికొడుకాయెనే....
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల మలయప్ప పెళ్లికొడుకై త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి కలియుగంలో పద్మావతి అమ్మవారిని వివాహమాడి, నడయాడిన క్షేత్రంగా చిత్తూరుజిల్లా నారాయణవనం భాసిల్లుతోంది. వేదవతీ (పద్మావతి), గోదాదేవి(అలివేలు మంగమ్మ)ల సమేతుడై కొలువుదీరిన పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్యంగా పెళ్లి కాని యువతకు కోర్కెలు తీర్చే కల్యాణ ప్రదాతగా దర్శనమిస్తున్నారు. మూడు ప్రాకారాలలో 120 అడుగుల ఎతై ్తన రాజగోపురంతో 14వ శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించిన ఆలయంలో ఎడమచేతిలో హస్తం, కుడిచేతికి కల్యాణ కంకణం, వక్షస్థలంలో లక్ష్మి, దశావతార వడ్యాణం, సాలిగ్రామ హారంతో నిత్య నేత్రదర్శనంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. నిత్యకల్యాణంతో వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలతో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలను అందుకొంటున్న వేంకటేశ్వరుడు ఇద్దరు తాయార్లతోపాటు కొలువుదీరిన ఏకైక క్షేత్రం. కోర్కెను తీర్చడానికై.. త్రేతాయుగంలో వేదవతికి రాముడు ఇచ్చిన వరంతో కలియుగంలో పద్మావతి అమ్మవారిగా అవతరించి వేంకటేశ్వరుడు వివాహమాడటానికి నారాయణవనం వచ్చారని వరాహపురాణం పేర్కొంటోంది. అమ్మవారి వివాహ సందర్భంగా నలుగుపిండిని తయారు చేయడానికి వినియోగించిన తిరగలిని కూడా ఆలయంలో చూడవచ్చు. స్థల పురాణం ఆకాశరాజు కుమార్తె పద్మావతీ అమ్మవారు చెలికత్తెలతో నారాయణపురం సమీపంలోని వనంలో విహరిస్తుండగా మదించిన ఏనుగు వెంబడించింది. లక్ష్మిని వెతుకుతూ వచ్చిన వేంకటేశ్వరుడు ఏనుగు బారి నుండి పద్మావతీదేవిని రక్షించాడు. సుందర, సుకుమార, కోమలాంగి అయిన పద్మావతీదేవిని మొదటి చూపుతోనే మోహించిన వేంకటేశ్వరుడు వివాహమాడదలిచాడు. రాజమాత ధరణీదేవిని ఒప్పించడానికి వెంకన్నకు ఎరుకలసానిగా ఆకాశరాజు రాజప్రాసాదానికి చేరుకుని సోది చెపుతానమ్మ.. సోది చెబుతానంటూ.. పద్మావతీదేవి జన్మరహస్యాన్ని చెప్పి సరైన వరుడు మలయప్పగా వివరించగా ఆకాశరాజు, ధరణీదేవీలు మలయప్పకు ఆశ్రయాన్ని కల్పించిన వకుళమాత సమ్మతితో విళంబి నామ సంవత్సరం తమిళ పంగుణి శుద్ధ ఉత్తర నక్షత్రయుక్త శుభ ఘడియల్లో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.పద్మావతి, వెంకన్నల వివాహవేదికపై ఆకాశరాజు నిర్మించిన ఆలయమే నేడు పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంగా భాసిల్లుతోంది. ఆలయ విశిష్టత పద్మావతీ, గోదాదేవిలు ఇద్దరూ మహావిష్ణువును వివాహమాడాలన్న తలంపుతో వరం పొందినవారే. వీరిరువురిని వివాహమాడి కల్యాణ వేంకటేశ్వరస్వామిగా నారాయణవనంలో కొలువై ఉన్నారు. ఆలయ ప్రాకారంలో హైందవ వైవాహిక సాంప్రదాయానుసారం స్వామి వారి గర్భాలయానికి వెనుకగా కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి కొలువై ఉన్న ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే... తిరుమలతో సహా అన్ని వైష్ణవాలయాల్లో ఉత్సవ మూర్తికి శ్రీదేవీ, భూదేవి సమేతంగా ఆర్జిత కల్యాణాన్ని నిర్వహిస్తుంటారు. అయితే నారాయణవనంలో ఉభయ నాంచారులతో పాటు పద్మావతీ అమ్మవారితో కల్యాణ వెంకటేశ్వరస్వామికి నిత్యకల్యాణం చేయడం ఇతిహాస గా«థకు దర్పణం పడుతుంది. కల్యాణోత్సవంలో పాల్గొన్న అవివాహ యువతీయువకులు కంకణాన్ని ధరిస్తే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ధనుర్మాస శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) రోజున వైష్ణవాలయాల్లో ఉత్తరముఖ ద్వార ప్రవేశాన్ని భక్తులకు కల్పిస్తారు. అయితే నారాయణవనం కల్యాణ వెంకన్న ఆలయంలో ద్వాదశి రోజున ద్వారప్రవేశ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సాంప్రదాయాన్ని తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి అలయంతో పాటు నారాయణవనం కల్యాణ వెంకన్న ఆలయంలో మాత్రమే నిర్వహిస్తారు.విళంబినామ సంవత్సరం తమిళ పంగుణి నెల ఉత్తరా నక్షత్రయుక్త శుభ ఘడియల్లో పద్మావతీ అమ్మవారిని కల్యాణ వెంకన్న వివాహమాడారు. ఏటా అదేరోజున వెంకన్న ఆలయంలో పంగుణోత్తర ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతిరోజూ సుప్రభాత, ఏకాంత సేవలను అందుకునే భోగశ్రీనివాసుడు పంగుణోత్తరం రోజులలో పద్మావతీ అమ్మవారి సన్నిధిలో అమ్మవారితో కలిసి ఏకాంత, సుప్రభాత సేవల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఉత్సవాన్ని ఒక్క నారాయణవనంలో మాత్రమే జరుపుతారు. పంగుణోత్తర ఉత్సవాన్ని ప్రతిబింబించే విధంగా చాంద్రమానం ఆధారంతో ఫాల్గుణ మాసంలో నారాయణగిరి ప్రాంతంలో పద్మావతీ పరిణయోత్సవాలను నిర్వహిస్తారు. వెంకన్న కొలిచిన ఆమ్నాయాక్షి పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు కులదైవమైన ఆమ్నాయాక్షి(అవనాక్షమ్మ) ఆలయం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుండి రెండు కిలోమీటర్ల దూరంలోని సముదాయం గ్రామ శివారుల్లో వెలసి ఉంది.వేదాలను అపహరించిన సోమకాసురుడిని సంహరించడానికి పార్వతీదేవి కాళికగా అవతారమెత్తింది. సోమకాసురుడిని చంపి వేదాలను సంరక్షించిన అమ్మవారిని ఆమ్నాయాక్షిగా (ఆమ్న అంటే వేదాలను, అక్షి అంటే కన్నులుగా గల) ఆకాశరాజు కొలిచాడు. వివాహానికి ముందు పద్మావతీ అమ్మవారు గౌరీపూజను ఆమ్నాయాక్షి ఆలయంలో చేశారని, వివాహానంతరం నవదంపతులైన పద్మావతీ, కల్యాణ వేంకటేశ్వరస్వామివారలు అమ్మవారిని కొలిచినట్లు వరాహ పురాణం పేర్కొంది. ఆలయానికి పైభాగాన రాజధాని నగరం నారాయణపురం పూర్తిగా శి«థిలమైపోయింది. భిన్న స్థితిలోని ఆమ్నాయాక్షి ఆలయాన్ని 4వ శతాబ్దంలో చోళరాజులు మళ్లీ నిర్మించారు. టీటీడీ ఈ ఆలయాన్ని 1967లో స్వాధీనం చేసుకుని నిత్యపూజలను నిర్వహిస్తోంది. నారాయణవనమే.. వరం శ్రీమన్నారాయుణుడి అంశ అయిన వేంకటేశ్వరస్వామి తిరుగాడి, పద్మావతీ అమ్మవారితో వివాహం చేసుకున్న క్షేత్రం నారాయణవనంగా పిలువబడుతోంది. వేటకై వచ్చిన వెంకన్న వరుడై అమ్మవారిని వివాహం చేసుకోవడంతో నారాయణవరంగా కూడా పిలవబడుతోంది. కాలక్రమంలో నారాయణపురం శిథిలమై, అరుణానది తీరాన పద్మావతీ, వెంకన్నల వివాహ చిహ్నంగా ఆకాశరాజు నిర్మించిన ఆలయం చుట్టూ ఏర్పడిన గ్రామమే నారాయణవనంగాను, నారాయణవరంగాను పిలవబడుతోంది. ఇలా చేరుకోవచ్చు.. విమానంలో వచ్చే వారు తిరుపతి విమానాశ్రయం చేరుకుని వాహనంపై సుమారు 24 కిలోమీటర్ల మేరకు పుత్తూరు మీదుగా ప్రయాణించి నారాయణవనం చేరుకోవచ్చు. రైలుప్రయాణంలో తిరుపతి, రేణిగుంట, పుత్తూరు రైల్వే స్టేషన్లకు చేరుకుని నారాయణవనం రావచ్చు. బస్సులో తిరుపతి, చెన్నైల నుండి నారాయణవనం చేరుకోవచ్చు. విశేష పూజలు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవలో మేల్కొన్న స్వామిని నిత్య పూజాకైంకర్యాల అనంతరం రాత్రి 8 గంటల వరకు దర్శించుకొనవచ్చు. ప్రతి మంగళవారం ఉదయం 10.30 గంటలకు అష్టదళ పద్మారాధన సేవ, శుక్రవారం ఉదయం 7.30 గంటలకు వెంకన్న, పద్మావతీ అమ్మవార్లకు అభిషేకం, సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ఊంజల్ సేవ, శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకన్నకు ఊంజల్‌సేవను నిర్వహిస్తారు. 500 రూపాయలు చెల్లించి, ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు ఉభయ నాంచారుల సమేత పద్మావతీ అమ్మవారితో కల్యాణ వెంకన్నకి నిర్వహించే ఆర్జిత కల్యాణంలో పాల్గొనవచ్చు. – ఎ. శ్రీధర్, నారాయణవనం -
మౌత్ టాక్‌తో ముందుకు తీసుకెళ్లాలి
‘‘పదిహేనేళ్లలో 30 సినిమాలు చేశా. ఇప్పుడున్నంత కన్ఫ్యూజన్లో ఎప్పుడూ లేను. ఇన్నేళ్ల కెరీర్లో ఎక్కువ సక్సెస్ పర్సంటేజ్‌తో సినిమాలు చేశాను. స్పీడ్ బ్రేకులు పడ్డప్పుడల్లా సక్సెస్ సాధిస్తూ వచ్చాను’’ అన్నారు ‘దిల్’ రాజు. నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి ఫస్ట్ నుంచే పాజిటివ్ టాక్ ఉంది. యూత్, రివ్యూవర్స్ అందరూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మిక్స్డ్ వార్తలు స్ప్రెడ్ చేశారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మౌత్ టాక్‌తో ఈ సినిమాను ఇంకా ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నాను. సతీష్ దర్శకత్వంలో మా బ్యానర్లోనే ‘థ్యాంక్స్’ అనే సినిమా చేయబోతున్నాం. ‘మీకు ఎలా చెప్పాలో’ అనేది క్యాప్షన్. ఈ సినిమాలో ఏయే అంశాలు మిస్ అయ్యాయని అంటున్నారో అవన్నీ ‘థ్యాంక్స్’లో ఉంటాయి’’ అన్నారు. ‘‘ఏ ఫ్యామిలీ ఆడియన్స్ కోసమైతే ఈ సినిమా చేశామో వారికి ఈ సినిమా నచ్చడం మరో సక్సెస్. ప్రేక్షకుల అభినందనలే మాకు ఆశీర్వాదాలు. మంచి సినిమా చేశామనే తృప్తి కలిగింది’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘కథను నమ్మి, ప్రేమించి చేసిన చిత్రమిది. ఫ్యామిలీ ఆడియన్స్ మరింత సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు నితిన్. సితార, రాశీ ఖన్నా, నందితా శ్వేతా తదితరులు పాల్గొన్నారు. -
ఈ డైలాగ్స్ ఇప్పుడే చెబితే క్లైమాక్స్‌లో ఏం చెబుతాం!!
నూతన వధువరులను ‘శతమానం భవతి’ అని దీవిస్తారు. గొప్ప సంప్రదాయాలను ‘నూరేళ్లు వర్థిల్లాల’ని కోరుకుంటారు. మన వివాహవ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. మన సినిమా భావోద్వేగాల సమ్మిళితం. మంచి విలువలను చెప్పే మంచి సినిమా వర్థిల్లాలి. మన సంస్కృతికి పదే పదే ఆయువు పోస్తూ ఉండాలి. శతమానం భవతి! వేగేశ్న సతీష్‌గారితో ‘శతమానం భవతి’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాక మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘శ్రీనివాస కళ్యాణం’ని ఎందుకు ఓకే చేశారు? ‘దిల్’ రాజు: మేజర్‌గా నేను రెండు విషయాలు ఆలోచిస్తా. ఒకటి స్టోరీ. రెండోది స్టోరీ ఐడియా. కథ, ఐడియా ఇంట్రెస్ట్‌గా ఉంటే ఓకే చేస్తా. వర్కౌట్ అవుతుందా? లేదా? అనే విషయం గురించి ఆలోచించను. ‘శతమానం భవతి’ సినిమాను అలాగే పిక్ చేశాను. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను కూడా అలాగే ఎంపిక చేసుకున్నాను. ‘శతమానం భవతి’ అనేది ఒక కథ అని, ‘శ్రీనివాస కళ్యాణం’ అనేది ఒక మూమెంట్ అనే క్లారిటీ ఉంది. సినిమాలోని 8, 9 మూమెంట్స్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్ నుంచి వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు మంచి టాక్ రావడానికి కూడా ఆ సీన్సే కారణమని నా నమ్మకం.‘శతమానం భవతి’లో కథ వెంటనే స్టార్ట్ అవుతుంది. ‘శ్రీనివాస కల్యాణం’లో ప్రీ ఇంట్రవెల్ నుంచి స్ట్రాంగ్ కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్‌లోని మూమెంట్స్‌కు ఆడియన్స్ ఎంగేజ్ అవుతారనే నమ్మకం ఎలా కలిగింది? ‘దిల్’ రాజు: నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ గురించి భయపడుతూనే ఉన్నాం. కానీ మంచి మూమెంట్స్ ఉన్నాయి కదా అనే ధైర్యం ఓ పక్కన ఉంది. ‘హ్యాపీ డేస్’ కథ కాదు. ఫోర్ ఇయర్స్ ట్రావెలింగ్ మూమెంట్స్. శేఖర్‌గారు చేసిన ‘ఫిదా’ సినిమా కూడా ట్రావెల్ ఫిల్మ్. ఈ సినిమాను కూడా నేను అలానే భావించాను. పెళ్లి మీద ట్రావెల్ ఫిల్మ్ అనే ఆలోచనపై నమ్మకం ఉంచాను. రషెష్ చూసినప్పుడు ఫీల్ గుడ్ ఫిల్మ్ అనిపించింది. ఇదే విషయాన్ని ఎడిటర్‌కు చెప్పాను. ఆ తర్వాత ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని చెప్పడం స్టార్ట్ చేశారు. మంచి ఫీల్ కలిగింది. ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక నా నమ్మకం నిజమైందని అనిపిస్తోంది. ఓ నిర్మాతగా ఈ పెళ్లికి మీరే పెద్ద. పెళ్లిలో ఎన్నో అలకలు, గొడవలు ఉంటాయి. ఈ పెళ్లి తీసేటప్పుడు ఆన్సెట్స్లో ఏవైనా అలకలున్నాయా? ‘దిల్’ రాజు: చంఢీఘడ్‌లో షూటింగ్ చేసినప్పుడు సతీష్ అలిగినట్లు ఉన్నాడు. నితిన్: నాకు తెలుసు.. నాకు తెలుసు(నవ్వులు). ‘దిల్’ రాజు: చండీఘడ్ షెడ్యూల్లో ఓ రోజు సెట్లో సీన్ పేపర్స్ చదివాను. నిజానికి షూటింగ్ ముందే అన్నీ ఓకే చేసుకుంటాం. కానీ సెట్లో ఆ రోజు నాకు ఎందుకో కొత్త కొత్త డౌట్స్ వచ్చాయి. డైలాగ్స్ లెంగ్త్ ఎక్కువగా ఉంది కదా అని సతీష్‌ని అడిగాను. ‘అవునా..సార్ అన్నాడు’. సరే అని నేను బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లొచ్చి చూసే సరికి సతీష్ డైరెక్టర్ సీట్లో లేడు. చూస్తే పక్కకి వెళ్లి ఏదో రాస్తున్నాడు. ఒక మనిషి ఎక్స్ప్రెషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ సడన్‌గా మారవు. అప్పుడు సతీష్‌లో నాకు మార్పు కనిపించింది. ఏమైందో తెలుసుకుందామని అసోసియేట్ డైరెక్టర్ని పిలిచా. మీరు ‘సడన్‌గా సీన్ చేంజ్ చేయమంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా సార్’ అన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. చండీఘడ్ వెళ్లిన శిరీష్ కూడా హైదరాబాద్ తిరిగొచ్చి ‘సతీష్ ఎందుకో ఈ షెడ్యూల్ అంతా డిస్ట్రబ్డ్‌గా ఉన్నాడు’ అన్నాడు. సతీష్ హైదరాబాద్ వచ్చాక అడిగితే చెప్పలేదు. ఇప్పుడు చెబుతాడు. కారణం తెలుసుకుందాం. నితిన్: నేను షూట్లో ఉన్నాను. అంతకుముందు చెప్పినది ఇవ్వకుండా వేరే సీన్ పేపర్స్ ఇచ్చారు. నేను షాక్ అయ్యాను. ఇది కాదు కదా అనుకున్నా. సతీష్: సినిమాలో చండీఘడ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాం. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు బంధువులు, స్నేహితులు ఆ వేడుకలో కనిపించాలి. అయితే చండీఘడ్‌లో క్రౌడ్‌ని చూసినప్పుడు ఏదో నిరుత్సాహం కలిగింది. అక్కడి పంజాబీ లోకల్ ఆర్టిస్టులను తీసుకున్నాం. దాంతో నేటివిటీ మిస్ అవుతుందా? అని ఆలోచిస్తున్నాను. సెట్లో వేరే చిన్న చిన్న డిస్ట్రబెన్సెస్ ఉన్నాయి. అదే టైమ్‌లో ‘దిల్’ రాజుగారు సీన్ కాస్త మార్చుదామా అంటే, ఏదోలా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు ఆయన అలా అనలేదు కదా అనుకున్నాను. ‘దిల్’ రాజు: యాక్చువల్లీ మా ఇద్దరి వేవ్‌లెంగ్త్ చాలా బాగుంటుంది. సతీష్‌తో ఈ రెండు సినిమాల ‘శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం’ 110 రోజుల జర్నీలో ఆ రోజు నాకు క్వశ్చన్ మార్క్‌లా మిగిలిపోయింది. సతీష్: సెట్లో సీన్ కరెక్షన్ అంటే ఎవరికైనా కాస్త టైమ్ పడుతుంది కానీ నేను ఓ పది నిమిషాల్లో కరెక్ట్ చేసేస్తా. అది రైటర్‌గా నా అదృష్టం అనుకుంటున్నాను. ఈ సినిమాలో రైటర్‌గా నేను ఇష్టపడి రాసుకున్న కొన్ని డైలాగ్స్ ఉంటాయి. సెట్ వాతావరణంలో ఆ రోజు నా మూడ్ సరిగా లేదు. ఆ టైమ్‌లో రాజుగారు వచ్చి.. ‘ఈ డైలాగ్స్ ఇప్పుడే చెబితే క్లైమాక్స్‌లో ఏం చెబుతాం’ అన్నారు. నిజానికి ఫస్ట్ హాఫ్‌లో పెళ్లి గురించి నితిన్ మాట్లాడే స్ట్రాంగ్ డైలాగ్స్ అవి. కావాలంటే క్లైమాక్స్ కోసం మళ్లీ రాసుకోవచ్చు కదా అనిపించింది. అలా అని ‘దిల్’ రాజుగారికి ఎదురు చెప్పలేను. ఎందుకంటే నాకంటే సినిమా కథను ఆయన ఎక్కువగా ప్రేమిస్తారు. నా కంటే ఎక్కువగా ఆలోచిస్తారు. నిజానికి తెలుగువారిని తీసుకురమ్మని ప్రొడక్షన్ వారికి చెప్పకపోవడం నా తప్పే. దాంతో మూడాఫ్తో పక్కకు వెళ్లిపోయి రాస్తూ కూర్చున్నాను. అంతే. రాజుగారి మీద నాకేం ఉంటుంది (నవ్వుతూ). ఓకే రాజుగారూ.. మ్యాటర్ క్లియర్ అయింది. ఇక, ఈ సినిమాలో డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నలుగురూ మీకు నచ్చిన ఒక్కో డైలాగ్ చెబుతారా. ముందు రాశీతో స్టార్ట్ చేద్దాం.. రాశీఖన్నా: ఓ సీన్లో సితార గారితో ఇప్పటికీ వాసు (సినిమాలోని నితిన్ క్యారెక్టర్) వాళ్లది జాయింట్ ఫ్యామిలీనే అమ్మా అన్నప్పుడు.. ‘ఎఫెక్షన్స్ ఉన్న దగ్గరే రిలేషన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి’ అని చెబుతారు. ఆ డైలాగ్ నచ్చింది. నందిత: నేను చెప్పిన డైలాగ్స్ అన్నీ నాకు ఇష్టమే. ముఖ్యంగా.. ‘నా అనే వాళ్ల దగ్గర ఏమీ దాచకూడదు. చెప్పాల్సిన టైమ్‌లో చెప్పకపోతే జీవితాంతం బాధపడటం తప్ప ఇంకా ఏమీ మిగలదు’ అనేవి నా మనసుకి బాగా దగ్గర అయ్యాయి. మీ ఇంట్లో చెప్పకుండా దాచిన విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి? నందిత: ఏమీ లేవు. అమ్మానాన్నతో అన్నీ చెప్పేస్తా. ‘దిల్’ రాజు: నిజమే చెబుతున్నావా? ఫ్రెండ్స్ దగ్గర.. బాయ్‌ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా దాచావా? నందిత: అయ్యో.. నాకు బాయ్‌ఫ్రెండ్సే లేరండీ. నితిన్: అబ్బా.. చా.. (నవ్వులు). మీరు చెప్పండి నితిన్.. మీకు నచ్చిన డైలాగ్ ఏది? నితిన్: ఫస్టాఫ్‌లో లవ్ ప్రాబ్లమ్‌తో ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ట్ చేసినప్పుడు..‘జాబ్ ఇచ్చినోడికి జాబ్ వదిలేసేటప్పుడు చెప్పావ్. ఇల్లు అద్దెకి ఇచ్చినోడికి ఇల్లు వదిలేసేటప్పుడు చెప్పావ్. మరి ప్రాణం ఇచ్చిన అమ్మకు ప్రాణాలు వదిలేసేటప్పుడు చెప్పాలి కదరా?’ అనే డైలాగ్‌కు కనెక్ట్ అయ్యాను. ‘దిల్’ రాజు: నాకు పర్టిక్యులర్‌గా ఓ సీన్‌కి కళ్లలో నీళ్లు తిరిగాయి. సెకండాఫ్‌లో ‘నానమ్మా.. నా పెళ్లిలో నీ 70 ఏళ్ల జీవితం కనిపిస్తుంది. రేపు నేను 70 ఏళ్ల జీవితం చూసుకోవాలి కదా. పెళ్లి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి’ అని జయసుధగారిని నితిన్ అడిగినప్పుడు... ‘మీ తాతయ్యగారు ఒక మాట చెప్పేవారు రా. మన కన్న తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటామో. మన లైఫ్‌లోకి వచ్చి, మన పిల్లలకు జన్మనిచ్చే భార్యను కూడా అంతే బాగా చూసుకోవాలి అని’. ఆ డైలాగ్ రాగానే నిజం కదా అనిపించింది. సినిమాలో పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. మీ ముగ్గురూ అలానే చేసుకోవాలనుకుంటున్నారా? నితిన్: నాకైతే అలానే చేసుకోవాలని ఉంది. అంతా మన సంప్రదాయం ప్రకారం జరగాలనుకుంటున్నాను. రాశీఖన్నా: కథ వింటున్నప్పుడే నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మధ్యలో మనం గమనిస్తే చాలా డివోర్స్‌లు చూస్తున్నాం. ఈ సమయంలో ఇలాంటి కథ చెపాల్సిన అవసరం ఉందనిపించింది. నేను చాలా నేర్చుకున్నాను. నార్త్, సౌత్ చాలా డిఫరెంట్. బేసిక్‌గా నేను చాలా ట్రెడిషనల్. ఈ సినిమా చేశాక సౌత్‌లో పెళ్లి ఎలా చేస్తారో తెలిసింది. అన్నీ కుదిరితే అలానే చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఎమోషనల్‌గా కూడా ఈ మూవీకి కనెక్ట్ అయ్యాను. నందిత: మా అమ్మనాన్నాలది లవ్ మ్యారేజ్. ఇద్దరి వైపు బంధువులు రాకపోకలు తక్కువ. అసలు లేదనే చెప్పాలి. దాంతో నాకు రిలేషన్స్ గురించి అంతగా తెలీదు. ‘శ్రీనివాస కళ్యాణం’ చేస్తున్నప్పుడు రిలేషన్షిప్ బాండింగ్ తెలిసింది. తెలుగు సంప్రదాయాలు నచ్చాయి. ఇలాగే పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ కలిగింది. నితిన్.. మీరు క్లైమాక్స్‌లో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పారు. ఏకంగా మంత్రాలు కూడా చెప్పారు. ఎటువంటి హోమ్ వర్క్ చేశారు? నితిన్: ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు డైలాగ్స్ చాలా బావున్నాయి. సినిమా స్టార్ట్ అయ్యే వారం ముందు ప్రాక్టీస్ మొదలుపెడితే సరిపోతుందనుకున్నాం. కట్ చేస్తే.. తర్వాత ‘మీరు చెప్పడంలేదు. పంతులుగారితో చెప్పిస్తున్నాం’ అన్నారు. ఓకే అనుకున్నాను. లాస్ట్ మినిట్‌లో నువ్వే చెప్పాలన్నారు. పెళ్లి మంత్రాలంటే మామూలా? మాంగల్యం తంతునానేన.. ఈజీగానే వస్తుంది. అయితే మిగతావన్నీ అంత ఈజీ కాదు కదా. మనసులో ‘సార్ ఏంటి సార్ ఇదీ’ అనుకున్నాను. సతీష్: ప్లస్ పాయింట్ ఏంటంటే నితిన్‌కి తెలుగు చదవడం బాగా వచ్చు. మా టీమ్‌లో చాలా మంది టింగ్లీష్ బ్యాచ్. (అంటే తెలుగు డైలాగ్స్ ఇంగ్లీష్‌లో రాసుకోవడం). పవిత్రత ఉన్న మంత్రాలు. సరిగ్గా పలకపోతే మంత్రాలు తప్పుగా ఉచ్చరించారు అని మా మీద పడిపోతారు. సో.. చాలా కేర్ తీసుకున్నాం. సింగిల్ టేక్‌లో చెప్పాడు నితిన్. నితిన్: ముందు నీకు ఎంత గుర్తుంటే అంత చెప్పు. కట్ షాట్స్ తీసుకుందాం అన్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో సింగిల్ షాట్లో చేసేద్దామన్నారు. ఇక చూడండి.. చిన్నప్పుడు పద్యాలు బట్టీ పట్టినట్టు నేర్చుకున్నాను. మీ పెళ్లికి మీరే మంత్రాలు చెప్పుకోవచ్చేమో! నితిన్: ఆల్మోస్ట్. ఒకవేళ పంతులుగారు ఎక్కడైనా తప్పు చదివినా సార్ అది కాదు ఇలా అని చెప్పేస్తానేమో. రైటర్, డైరెక్టర్‌గా ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయి అని ‘శతమానం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’లో పెళ్లి విశిష్టతను గుర్తు చేస్తున్నారా? సతీష్: గుర్తు చేయడం ఏం కాదు. హైందవ సంస్కృతి, సంప్రదాయం ప్రపంచంలోనే అందరికీ తలమానికం. అలాంటి సంప్రదాయాలని మనం కనీసం పాటించకుండా వేరే వేరే వాటిని పట్టుకొని పోవడం పర్సనల్‌గా నాకు నచ్చలేదు. అలాగే నేను చెబితే ఆచరిస్తారా? లేదా అనేది వేరే విషయం. స్కూల్లో మాస్టర్ నీతి పద్యం అందరికీ ఒకలానే చెబుతాడు. కొంతమంది అర్థం చేసుకొని, పాటిస్తారు. కొందరు జస్ట్ విన్నాను, ఎగ్జామ్‌లో రాసి వదిలేస్తాను అనుకుని పాస్ అయిపోతారు. వాళ్లదీ తప్పుకాదు, వీళ్లదీ తప్పు కాదు. ‘శతమానం భవతి’ని ఆదరించారు కాబట్టే ‘శ్రీనివాస కళ్యాణం’ వచ్చింది. ఒకవేళ ఆ సినిమా ఆడకపోయింటే ఈ సినిమా కచ్చితంగా వచ్చేది కాదు. నాతో చాలా మంది అన్నారు ఇంతకు ముందు అమ్మానాన్నల దగ్గరకు సంవత్సరానికి ఒకసారి వెళ్లేవాళ్లం. ఇప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి వెళ్లిపోతున్నానని అంటున్నారు. కొందరినైనా కదిలించాం కదా. కొంతమందైనా ఆచరించారు కదా అనే సంతృప్తి. ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ గురించి ఓ ఎగ్జాంఫుల్ చెబుతాను. పెళ్లి సీన్లో చెప్పులు వదిలేసి హీరో హీరోయిన్ మండపం మీదకు వెళ్లాలి. కథ చెప్పినప్పుడు కెమెరామేన్ సమీర్ రెడ్డికి మండపం మీద అష్టదిక్పాలకులు ఉంటారు, ఋషులు ఉంటారు అని చెప్పా. షూట్ చేస్తున్నప్పుడు ఆయన ఆ ఫీల్‌తోనే చేశారు. ఆ తర్వాత రాజమండ్రిలో ఆయన రిలేటివ్స్ పెళ్లికి వెళ్లారు. అక్కడ మండపంలో ఎవరో చెప్పులు వేసుకొని తిరిగేస్తున్నారంట. వాళ్లను పిలిచి ‘పైన దేవుళ్లుంటారంట. చెప్పులు వేసుకొని తిరగకూడదు’ అని చెప్పారట. ఇలా కొంత మంది చేయగలిగినా పెళ్లి మీద ఒక విలువ పెరుగుతుంది. క్రియేటీవ్ సైడ్ రాజుగారు ఎక్కువ క్రెడిట్ తీసుకుంటున్నారని మీకు అనిపించిందా? సతీష్: అనిపించలేదు. ఎందుకంటే నాకంటే ఎక్కువ ఆయన ఆలోచిస్తారు సినిమా గురించి. ఆల్రెడీ ‘దిల్’ రాజు అంటే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. వేగేశ్న సతీశ్‌కి జస్ట్ సెకండ్ మూవీ. ‘శతమానం భవతి’ నుంచి నేను ఆయనలో చూసిందేంటంటే సినిమాను ప్రేమిస్తారు. చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటారు. ఇలా ఉంటే బావుండు అని సలహాలు ఇస్తారు. ‘సతీశ్ ఇలా చెయ్.. ఇలా చేయ్’ అనరు. ఒకవేళ అలానే ఉంటే ‘శతమానం భవతి’ తర్వాత ఈ జర్నీ ఉండదు కదా. ఆయన డామినేట్ చేస్తున్నారు అన్న విషయం కరెక్ట్ అయ్యుంటే ఈ సినిమా చేయను కదా. ఇక్కడ ఎవ్వరి క్రెడిట్‌నీ ఎవ్వరూ తీసుకెళ్లరు. రాజు గారి కాంపౌండ్‌లో అలానే జరిగితే డైరెక్టర్స్ బయటకు వెళ్లి సినిమాలు ఎలా తీస్తారు? ఇప్పుడీ సినిమాకి డైలాగ్స్‌కు మంచి పేరొస్తోంది కదా. అవి నేనే రాసుకోవాలి. యాక్టర్స్‌కి సీన్ నేనే వివరించాలి. రాజుగారు సీన్ బావుందా? బాలేదా అనే సజెషన్ ఇస్తారు. అప్పుడు కూదా కొత్త సీన్ రాసేది నేనే కదా. ‘దిల్’ రాజు: సినిమా అంటే ట్రైన్. దర్శకుడు, నిర్మాత పట్టాలు. పాత రోజుల్లో గొప్ప జర్నీ సాగిందంటే ఇద్దరి మధ్యా మంచి సింక్ ఉండబట్టే. ఏడిద నాగేశ్వరరావు– కె.విశ్వనా«ద్, నాగిరెడ్ది–కేవి రెడ్డి, శ్యామ్‌ప్రసాద్–కోడి రామకృష్ణ.. వీళ్ల జర్నీని తీసుకుందాం. దర్శక–నిర్మాతలిద్దరూ బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టే జర్నీ బాగుంది. నిర్మాత చెబితే ఎందుకు వినాలిరా అంటే కుదరదు. ఇప్పుడు చాలా మంది అలానే ఉన్నారు. నేను సలహాలైతే ఇవ్వగలను కానీ సతీష్ చేసే పని చేయలేను కదా. నేను రాయలేను కదా. కథ తనే రాయాలి. డైలాగ్స్ తనే రాసుకోవాలి. సినిమా తీయాల్సిందీ తనే కదా. ఈ సినిమాకి ముందుగా నితిన్‌ని అనుకోలేదట? ‘దిల్’ రాజు: మా ప్రొడక్షన్లో సినిమాలు ఎలా ఉంటాయంటే ఒక స్టోరీ కుదరగానే, దానికి ఎవరు బాగుంటారా? అని ఓ ముగ్గురు హీరోలను పేర్లను పేపర్ మీద రాసుకుంటాను. ఈ కథకు ఎన్టీఆర్, రామ్‌చరణ్, నితిన్ పేర్లను రాసుకున్నాను. ఎన్టీఆర్‌కు చెప్పాం కూడా. తర్వాత మాకే అనిపించింది. స్టార్ హీరోతో చే స్తే కొన్ని సార్లు ఫ్యాన్స్ కోసం ఫైట్లు, మాస్ ఎలిమెంట్స్ అంటూ కాంప్రమైజ్ అవ్వాలి. వెంటనే నితిన్‌కు కథ చెప్పాం. సూపర్‌గా ఉంది. చేసేద్దాం అన్నాడు మీ సంస్థలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకుంటున్నారా? ‘దిల్’ రాజు: ‘బొమ్మరిల్లు’తో పోల్చలేం. మంచి సినిమా ఇవ్వగలిగాం అన్న సంతృప్తి ఉంది. నితిన్: త్రివిక్రమ్ నాతో ఓ మాట చెప్పారు. మంచి కంటే చెడు ఎక్కువ స్పీడ్‌గా ట్రావెల్ చేస్తుంది. మంచి అనేది స్లోగా వెళ్తుంది.. కానీ వెళ్తుంది. నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా మెల్లి మెల్లిగా రీచ్ అవుతుంది. ‘దిల్’ రాజు: సొసైటీలో నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ. రివ్యూలు, ఇండస్ట్రీ, ఆడియన్స్‌లో కొంతమంది.. ఒక వైపు మంచి. ఒకవైపు చెడు. మంచి సినిమాను ఎవరు ఆపుతారు. షో షోకి మౌత్ టాక్ పెరుగుతుంది. ‘కేరింత’ సినిమాని రిలీజైన రోజున దేవీ థియేటర్లో చూశాను. కలెక్షన్స్ లేవు. కానీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్సెట్ అయ్యాను. ఆఫీసులో కూర్చుని ఆలోచిస్తుంటే థియేటర్ ఫుల్ అని శ్రీకాకుళం నుంచి ఫోన్. వెంటనే సినిమాలో ఏదో స్పార్క్ ఉందని ప్రమోషన్ స్టార్ట్ చేశాను. సినిమా హిట్టయింది. ‘శ్రీనివాస కళ్యాణం’ను వదలను. కొంచెం పుష్ చేయాలి. ఈ సినిమా చూసి, చాలామంది ‘మంచి ఫీల్ కలిగింది. బాగుంది’ అని మెసేజ్ చేశారు. సినిమా సరిగ్గా లేకపోతే ప్రమోట్ చేసి రుద్దడానికి ట్రై చేయను. నేనే సినిమా నుంచి షిఫ్ట్ అయిపోతా. కనెక్ట్ అవుతుంది అని నమ్మితేనే ప్రమోట్ చేస్తాను. ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ముగ్గురు బ్యాచిలర్స్ (నితిన్, నందిత, రాశీ ఖన్నా) పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెప్పాలి? రాశీఖన్నా: పెళ్లి ప్లాన్స్ ఇప్పుడు లేవు. అబ్బాయిలు కూడా లేరు (నవ్వుతూ).. ‘దిల్’ రాజు: ప్లాన్ లేదని చెప్పు. అంతేకానీ అబ్బాయిలు లేరని అనకు (నవ్వుతూ) రాశీని చేసుకోవడానికి అబ్బాయిలు లేరా? (నవ్వుతూ) రాశీఖన్నా: అబ్బాయిలు నిజంగానే లేరండీ.. నమ్మాలి. ‘సాక్షి’: ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ముందుకు రారా. కావాలంటే స్వయంవరం పెడదామా? ‘దిల్’ రాజు, నితిన్: అవును.. స్వయంవరం పెడదాం (నవ్వులు). నితిన్: మా అమ్మవాళ్లు మ్యాచెస్ చూస్తున్నారు. ఇంకో 8 నెలలు టైమ్ పడుతుంది. ‘దిల్’ రాజు: 2019లోపే నీ పెళ్లి ఉంటుందేమో. నితిన్: 2019 ఇయర్ క్లోజింగ్ లోపు చేసుకోకపోతే మా ఇంట్లో వాళ్లు చంపేస్తారు. నందిత: తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పుడే వచ్చాను కదా. ఆర్టిస్ట్‌గా శాటిస్ఫ్యాక్షన్ దక్కాలి. అప్పుడే పెళ్లి. సతీష్: అంటే తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చి ఉంటే ఇప్పుడు చేసుకునేదానివా? నందిత: (నవ్వేస్తూ). తెలియదు. అయినా పెళ్లికి ఇప్పుడు తొందరపడటంలేదు. – సినిమా డెస్క్ -
బెజవాడ గడపలో ‘శ్రీనివాస కల్యాణం’
‘శ్రీనివాస కళ్యాణం’ చిత్ర యూనిట్ సభ్యులు బుధవారం విజయవాడ నగరంలో సందడి చేశారు. సినిమా గురువారం విడుదలవుతున్న నేపథ్యంలో నటీనటులు నగరానికి విచ్చేశారు. విజయవాడ మురళిఫార్చూన్ హోటల్లో చిత్రం హీరో నితిన్, హీరోయిన్ రాసిఖన్నా, నందిత శ్వేత సందడి చేస్తున్న చిత్రమిది. లబ్బీపేట(విజయవాడతూర్పు): మంచి కుటుంబ కథాచిత్రం ‘శ్రీనివాస కల్యాణం’ అని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. శ్రీనివాస కల్యాణం చిత్రం గురువారం విడుదల కానున్న నేపథ్యంలో, ఆ చిత్ర యూనిట్ సభ్యులు బుధవారం నగరంలో సందడి చేశారు. ఈ సందర్భంగా మురళీ పార్క్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దిల్‌రాజ్ క్లాసికల్ సినిమాలు తీస్తారని, ఈ చిత్రంలో నటించేందుకు తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. నితిన్ మొదటి సారి కొడుకుగా నటించాడని, నటీనటులు అంతా చక్కగా నటించినట్లు ఆయన పేర్కొన్నారు. సినిమా హీరో నితిన్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమన్నారు. ఈ సినిమాలో అనేక మంది సీనియర్ నటులు ఉన్నారని, వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు హీరోయిన్లు చక్కగా నటించారని, తన జీవితంలో గుర్తుండుపోయే చిత్రం శ్రీనివాస కల్యాణం అన్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. చిత్ర దర్శకులు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ శతమానం భవతి సినిమాను ప్రేక్షకులు ఆదరించారని, కుటుంబ కథాచిత్రం తీయాలని ప్రేక్షకులు కోరడంతో ఈ సినిమా తీసినట్లు తెలిపారు. సంప్రదాయం, కుటుంబ విలువలను ప్రేక్షకులకు తెలియచేయాలనేదే ఈ చిత్రం ఉద్దేశం అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ 378 రోజుల కిందట ఫిదా తీశానని, ఇప్పుడు ఈ చిత్రం సూపర్‌హిట్ కానుందన్నారు. శ్రీనివాస కల్యాణం చిత్రాన్ని సెన్సార్ వాళ్లు చూసి తమను అభినందించారని, డిస్ట్రిబ్యూటర్స్ చూసి సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒక మంచి చిత్రం తీశామని, ప్రేక్షకులు ఆదరించాలన్నారు. హీరోయిన్ రాశీకన్నా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం శ్రీనివాస కల్యాణం అన్నారు. మరో హీరోయిన్ నందినీ మాట్లాడుతూ తనకు ఈ చిత్రంలో ఒక చక్కని పాత్ర ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో నటుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు.. ఇంద్రకీలాద్రి(విజయవాడ వెస్ట్) : శ్రీనివాస కల్యాణం చిత్ర బృందం బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుంది. హీరో నితిన్, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేతల పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సతీశ్ వేగేశ్న, నటులు రాజేంద్రప్రసాద్, అజయ్‌లు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఇన్చార్జి ఈవో అచ్యుతరామయ్య, సూపరిండెంటెంట్ చందు శ్రీనివాస్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. గురువారం సినిమా విడుదల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు బృందం పేర్కొంది. పాలక వర్గ సభ్యుడు పద్మశేఖర్, ప్రొటోకాల్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తిలు పాల్గొన్నారు. హీరో నితిన్, హీరోయిన్లను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. -
కళ్యాణ శోభ
-
‘శ్రీనివాస కళ్యాణం’ మూవీ రివ్యూ
టైటిల్ : శ్రీనివాస కళ్యాణం జానర్ : ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా తారాగణం : నితిన్, రాశి ఖన్నా, నందితా శ్వేత, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ సంగీతం : మిక్కీ జే మేయర్ దర్శకత్వం : సతీష్ వేగేశ్న నిర్మాత : దిల్ రాజు, లక్ష్మణ్, శిరీష్ శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు సతీష్ వేగేశ్న మరోసారి దిల్ రాజు నిర్మాణంలోనే శ్రీనివాస కళ్యాణం సినిమా చేశారు. శతమానం భవతి సినిమాలో కుటుంబ బంధాలు, ప్రేమల విలువలు చెప్పిన దర్శకుడు, ఈ సారి తెలుగింటి సాంప్రదాయాలు, పెళ్లి విలువలు ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. పెళ్లి అనేది ఓ ఈవెంట్‌లా మారిపోతున్న ఈ రోజుల్లో పెళ్లి బంధుమిత్రులతో కలిసి జరుపుకునే ఓ అందమైన జ్ఞాపకం అని తెలియజేసే ప్రయత్నమే శ్రీనివాస కళ్యాణం. మరీ శ్రీనివాస కళ్యాణం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? కథ ; శ్రీనివాస రాజు (నితిన్) ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కుర్రాడు. చిన్నప్పటి నుంచి తెలుగు సాంప్రదాయలు, పెళ్లి విలువ గురించి నాన్నమ్మ (జయసుధ) చెప్పిన మాటలు విని పెరిగిన శ్రీనివాస్ తన పెళ్లి కూడా నాన్నమ్మకు నచ్చినట్టుగా పండుగలా చేసుకోవాలనుకుంటాడు. చంఢీఘర్‌లో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే శ్రీనివాస్‌కు ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన ఆర్కే (ప్రకాష్ రాజ్) కూతురు శ్రీదేవి(రాశి ఖన్నా)తో పరిచయం అవుతుంది. శ్రీను తన ఫ్యామిలీని, సాంప్రదాయాలను గౌరవించే విధానం నచ్చిన శ్రీదేవి.. అతడితో ప్రేమలో పడుతుంది. ప్రేమా.. పెళ్లి లాంటి విషయాలను కూడా బిజినెస్ లా డీల్ చేసే ఆర్కే... శ్రీనివాస్, శ్రీదేవిల పెళ్లికి అంగీకరించాడా..? శ్రీను తన నాన్నమ్మ కోరుకున్నట్టుగా వారం రోజుల పాటు పెళ్లి వేడుకకు అందరినీ ఒప్పించగలిగాడా..? తన జీవితంలో ప్రతీ నిమిషాన్ని డబ్బుతో లెక్కించే ఆర్కే, తన పనులన్ని పక్కనపెట్టి కూతురి పెళ్లి కోసం వారం రోజులు సమయం కేటాయించాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కుటుంబ బంధాలు సాంప్రదాయల విలువ తెలిసిన కుర్రాడిగా నితిన్ బరువైన పాత్రలో కనిపించాడు. తన లవర్ బాయ్ ఇమేజ్ను కాపాడుకుంటూనే ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా ఒదిగిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. పద్మావతిగా నందిత శ్వేతకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఫస్ట్ హాఫ్‌లో అల్లరి అమ్మాయిగా అలరించిన నందిత సెంకడ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించింది. బిజీ బిజినెస్‌మేన్‌గా ప్రకాష్ రాజ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్, జయసుధ, సితార, విద్యుల్లేఖ రామన్, ప్రవీణ్ ఇలా అంతా రొటీన్ పాత్రల్లో కనిపించారు. విశ్లేషణ ; శతమానం భవతి సినిమాతో యూత్ ఆడియన్స్‌ను కూడా ఫ్యామిలీ సినిమాకు కనెక్ట్ చేసిన దర్శకుడు సతీష్ వేగేశ్న. మరోసారి ఈ దర్శకుడి నుంచి దిల్ రాజు బ్యానర్లో సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలు అందుకోవటంలో సతీష్ ఫెయిల్ అయ్యారు. పెళ్లి నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, ఆ కథను మనసును తాకేలా తెరకెక్కించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కాస్త ఆసక్తి కరంగా అనిపించినా సెకండ్ హాప్లో లో పెళ్లి పనులు మొదలైన తరువాత కథనం మరింత నెమ్మదించింది. పెళ్లింట్లో కామెడీ, ఎమోషన్స్ మరింతగా పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఎక్కువగా పెళ్లి గొప్పతనాన్ని చెప్పడానికి సమయం తీసుకున్నారు. (సాక్షి రివ్యూస్) ఈ నేపథ్యంలో రచయితగా సతీష్ ఆకట్టుకున్నారు. పెళ్లి మంత్రాల్లోని అంతరార్థం చెప్పే డైలాగ్స్‌తో పాటు ‘వద్దనుకుంటూ వెళ్లిపోతే అనుబంధాలు.. వదులుకుంటూ వెళ్లిపోతే సాంప్రదాయాలు మిగలవ్’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. మిక్కీ జే మేయర్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పెళ్లి పాట తప్ప మరే పాట మెప్పించేలాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి పెళ్లి వేడుకకు మరింత అందం తీసుకువచ్చింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి కొన్ని డైలాగ్స్ మైనస్ పాయింట్స్ ; స్లో నేరేషన్ పాటలు సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అంజన్న సన్నిధిలో..
జంగారెడ్డిగూడెం సమీపంలోనిగుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారిని శ్రీనివాస కల్యాణంచిత్ర బృందం బుధవారం దర్శించుకుంది. ఈ సందర్భంగా క్షేత్రంలో మొక్కనాటి నీరు పోస్తున్న హీరో నితిన్ ద్వారకాతిరుమల: సమాజంలో ప్రతిఒక్కరి జీవితంలో ఉండే భావోద్వేగ క్షణాలే శ్రీనివాస కల్యాణం సినిమా అని.. ఈ సినిమాను చూస్తుంటే మీ ఇంట్లో ఓ పెళ్లి జరుగుతున్న అనుభూతి కలుగుతుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ అన్నారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శ్రీనివాస కల్యాణం చిత్ర యూనిట్ బుధవారం సందర్శించింది. నిర్మాత దిల్ రాజ్, దర్శకుడు సతీష్ వేగేశ్న, హీరో నితిన్, హీరోయిన్లు రాశీ ఖన్నా, నందిత శ్వేత, నటులు రాజేంద్ర ప్రసాద్, అజయ్ స్వామి, అమ్మవార్లను దర్శించ ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజ్ శ్రీవారి విమానగోపుర స్వర్ణమయ పథకానికి రూ.1,26,000ను విరాళంగా ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావుకు అందించారు. కొద్దిసేపు వారు క్షేత్రంలో సందడి చేశారు. భక్తులు వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. విలువలు ఉన్న సినిమా శేషాచలకొండపైన అతిథి గృహంలో నిర్మాత దిల్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ ‘శ్రీనివాస కల్యాణం’ టైటిల్ పెట్టినప్పటి నుంచి తనలో ఏదో వైబ్రేషన్ కలిగిందని చెప్పారు. ఏడుకొండల స్వామి దర్శనం వద్ద ఈ చిత్ర కథ తయారైందన్నారు. మనందరి జీవితాల్లో ప్రధానమైన పుట్టుక, పెళ్లి, చావు వంటి సంఘటనలపై దర్శకుడు సతీష్ వేగేశ్నతో షేర్ చేసుకునే సమయంలో ఈ కథకు జీవం ఏర్పడిందన్నారు. బొమ్మరిల్లు, శతమానంభవతి వంటి చిత్రాలు తర్వాత ఎంతో విలువలు ఉన్న సినిమాగా దీనిని రూపుదిద్దామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు తప్పకుండా కొన్ని విషయాలనైనా ఈ సినిమా నుంచి స్వీకరిస్తారన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వారి పెళ్లి ఇలా జరిగితే బాగుంటుందన్న ఆశ కలుగుతుందన్నారు. గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించనుందని చెప్పారు. చిత్ర విడుదలను పురస్కరించుకుని సెంటిమెంట్‌గా చిన వెంకన్నను దర్శించేందుకు ఇక్కడకు వచ్చామన్నారు. మద్దిని దర్శించడం సెంటిమెంట్ జంగారెడ్డిగూడెం రూరల్: సినిమా విడుదలకు ముందు మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకోవడం సెంటిమెంట్ అని, స్వామివారిని దర్శించుకున్న తర్వాత విడుదల చేసిన ప్రతి చిత్రం విజయవంతమయ్యాయని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని బుధవారం శ్రీనివాస కల్యాణం చిత్ర బృందం సందర్శించింది. హీరో నితిన్, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేగేశ్న సతీష్, నటులు రాజేంద్రప్రసాద్, అజయ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు వారికి స్వామి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సుప్రీం, ఫిదా, జవాన్, రాజా ది గ్రేట్ వంటి చిత్రాల విడుదలకు ముందు మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్నట్టు చెప్పారు. దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ తాను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వాడినన్నారు. చిత్ర పంపిణీదారులు ఎల్వీఆర్, జంగారెడ్డిగూడెం రాజేశ్వరి థియేటర్ యాజమాన్యం నవీన్, రాజాన పండు, ఎస్సై వి.జగదీశ్వరరావు పాల్గొన్నారు. క్షేత్రంలోని ఉపాలయం వేంకటేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో హీరో నితిన్, హీరోయిన్లు రాశీఖన్నా, నందితా శ్వేత, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేగేశ్న సతీష్, నటులు రాజేంద్రప్రసాద్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. -
ప్రేక్షకాదరణే ప్రధానం
కంటోన్మెంట్: ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంటూ రెండేళ్ల క్రితం నిఖిల్‌ను పలకరించిన నందిత శ్వేతా తాజాగా ‘శ్రీనివాస కళ్యాణం’లో నితిన్‌కు మరదలుగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. తొలుత వీడియో జాకీగా కేరీర్ ప్రారంభించిన ఈ బెంగళూరు అమ్మాయి తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో విజయవంతంగా ముందుకెళుతోంది. ఇప్పటివరకు ఆమె 8 సినిమాల్లో నటించగా, అందులో ఆరు సినిమాలు ఈ ఏడాదిలోనే కావడం విశేషం. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా రావడంతో తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలుగులో తన రెండో సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ గురువారం విడుదల కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నందిత శ్వేతా కొద్దిసేపు ముచ్చటించారు. ప్రేక్షకుల ‘సపోర్ట్’తో తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించేఅవకాశముందన్నారు. ఇటీవల ఆఫర్లు పెరిగాయి.. 2008లో తొలి సినిమా విడుదలైన నాలుగేళ్లకు 2012లో తమిళ సినిమాలో నటించా. 2013లో విడుదలైన ఎథిర్ నీచల్ చిత్రానికి గానూ సైమా అవార్డు దక్కగా, తెలుగు చిత్రం ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చిందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే మూడు తమిళ చిత్రాలు విడుదలయ్యాయని, వీటిలో కుష్బూ నిర్మించిన ‘కాలకలప్పు–2’లో సీబీఐ ఆఫీసర్ పాత్ర పోషించినట్లు తెలిపారు. హిందీలో, తమిళంలో మరో రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. -
విజయవాడలో ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్ర బృందం
-
ప్రేమలో పడిపోయా
‘‘తొలిప్రేమ’ తర్వాత ఓ మంచి సినిమా చేయాలనుకుంటున్న టైమ్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ కథ విని ఓకే చేశా. కథ చెప్పిన దాని కంటే విజువల్‌గా గ్రాండ్‌గా ఉంది. ఉత్తరాది నుంచి వచ్చిన నాకు తెలుగు సంప్రదాయాల గురించి పెద్దగా తెలియదు. సెకండాఫ్ షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. అంత అందంగా తీశారు. ప్రస్తుత జనరేషన్‌కి ఇలాంటి సినిమా కావాలి’’ అని హీరోయిన్ రాశీఖన్నా అన్నారు. నితిన్, రాశీఖన్నా జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘దిల్’ రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు... ►అందమైన కుటుంబ కథా చిత్రమిది. మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెస్తుంది. సినిమా చూసి ఎమోషనల్ అయ్యాను. నాకు డబ్బింగ్ చెప్పిన ప్రియాంక ఫోన్ చేసి ఏడుస్తూ.. చాలా మంచి సినిమా చేశావని అభినందించింది. క్లయిమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్‌గారు, నితిన్‌ల నటన అద్భుతం. ►ఈ సినిమాలో ఎక్కువ మంది నటీనటులున్నారు. అందరిలో ఓ మూడ్ క్రియేట్ చేసి దాన్ని క్యారీ చేయడం కోసం ఎవరూ ఫోన్స్ వాడొద్దని రాజుగారు చెప్పారు. జయసుధ, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, సితార, నరేశ్‌గారి వంటి సీనియర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమా యూనిట్‌తో ప్రేమలో పడిపోయా. షూటింగ్ ముగిశాక వారిని వదిలి పెట్టడానికి మనసే రాలేదు. ►ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నేనూ అందరిలానే. అయితే.. ఈ మధ్య విడాకులు ఎక్కువ కావడం వల్ల పెళ్లి పట్ల నమ్మకం తగ్గిపోతుంది. అయితే పెళ్లి అనేది గొప్పది. సినిమా రషెస్ చూశాక డైరెక్టర్ సతీశ్‌గారి పాదాలను తాకాను. మా సినిమా అందరి హృదయాలను తాకుతుంది. ఈ చిత్రంలో నా పేరు సిరి. సంప్రదాయాలకు విలువ ఇచ్చే పాత్రలో కనిపిస్తా. ►ఉత్తరాది, దక్షిణాది పెళ్లి సంప్రదాయాలకు చాలా తేడా ఉంది. అయితే అందులో ఫీల్ ఒకటే. ఈ సినిమా టైమ్‌లో నేను తెలుగు అమ్మాయిలా ఫీలై నటించా. మా సినిమా చూసిన తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ వద్దు.. స్వంత గ్రామాలకు వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎమోషనల్ సీన్స్‌కు అమ్మాయిలు కనెక్ట్ అయి ఏడుస్తుంటారు. మా సినిమా చూస్తూ అబ్బాయిలు ఏడవడం చూశాను. ►తొలిప్రేమ’కు చాన్స్ రావడానికి కారణం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం. ‘తొలిప్రేమ’ సినిమా చూసిన రాజుగారు ‘శ్రీనివాస కళ్యాణం’ లో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా సైన్ చేశాను. తమిళంలో నేను చేసిన మూడు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. కంటిన్యూస్‌గా నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తున్నాను. ముందు ముందు కూడా క్యారెక్టర్స్ సెలక్షన్ విషయంలో ఇంతే జాగ్రత్తగా ఉంటా. ప్రేక్షకుల మనసుల్లో నా పాత్రలు నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం. -
శుభలేఖ పంపండి.. పట్టు వస్త్రాలు పొందండి!
ఏంటి ఇదేదో.. ఫోన్‌కొట్టు పట్టుచీర పట్టు లాంటి ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? ఇది అలాంటి కాన్సెప్ట్ కాదులేండి. అచ్చమైన తెలుగుదనాన్ని చూపిస్తూ.. పెళ్లి వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోన్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా నిర్మాత దిల్ రాజు పెట్టిన కాంటెస్ట్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది చిత్ర బృందం. శ్రావణ మాసంలో పెళ్లి జరుపుకుంటున్న జంటలు తమ శుభలేఖలు పంపిస్తే.. ఆ జంటలందరికీ పట్టు వస్త్రాలు పెట్టాలని సంకల్పించినట్టు తెలిపారు. ఇలా అందులోంచి కొందరిని ఎంపిక చేసి.. శ్రీనివాస కళ్యాణం బృందంతో మాట్లాడే వీలును కల్పించనున్నట్లు ప్రకటించారు. మరి శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే వారంతా.. వారి శుఖలేఖలు పంపించి.. పట్టువస్త్రాలను పొందండి. ప్రత్యక్షంగానైనా కలవచ్చు లేక పోస్ట్‌లోనైనా పంపొచ్చు అని పేర్కొన్నారు. మీ శుభలేఖలు మాకు పంపిస్తే ఆ జంటలు అందరికీ పట్టు వస్త్రాలు పెట్టాలని సంకల్పించాము. :) @actor_nithiin @RaashiKhanna @Nanditasweta @mickeyjmeyer Directed by #VegesnaSatish#SrinivasaKalyanam #SrinivasaKalyanamFromAug9th pic.twitter.com/5Jeah1wtbT — Sri Venkateswara Creations (@SVC_official) August 6, 2018 -
ఆ వార్తతో హర్టయ్యా: దిల్ రాజు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వెబ్సైట్ కథనాలపై అసహనం వ్యక్తం చేశారు. శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఘోస్ట్ డైరెక్టర్‌గా దిల్ రాజు వ్యవహరించాడని.. దిల్ రాజు డైరెక్షన్ ‘డెబ్యూ’ అంటూ వెటకారంగా కొన్ని వెబ్సైట్లు కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన శ్రీనివాస కళ్యాణం చిత్రం ప్రెస్ మీట్లో ఆయన స్పందించారు. ‘ఆ కథనాలు చూసి హర్టయ్యా. దిల్‌రాజు డెబ్యూ డైరెక్టర్‌గా చేశారూ.. అంటూ కథనాలు రాశారు. అది రాంగ్. ఇవి దర్శకుల సినిమాలు. వారి వెనుకాల సపోర్ట్‌గా నేను నిలుస్తానే తప్ప.. వారి వ్యవహారాల్లో ఎప్పటికీ జోక్యం చేసుకోను. మంచి చిత్రాన్ని అందించేందుకే మేం కృషి చేస్తాం. దయ చేసి మీడియాలో ఇలాంటి రాయటం సరికాదు’ అంటూ ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్-ప్రొడ్యూసర్ రిలేషన్షిప్ బాగుంటేనే మంచి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఆయన అన్నారు. కాగా, చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నితిన్-రాశీఖన్నా జంటగా.. వేగేశ్న సతీష్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ శ్రీనివాస కళ్యాణం’ ప్రీ–రిలీజ్ వేడుక
-
వెంకటేశ్ వాయిస్‌తో...
వెంకటేశ్ సూపర్ హిట్ సినిమాల్లో కచ్చితంగా గుర్తుకు వచ్చేది ‘శ్రీనివాస కళ్యాణం’. 30 ఏళ్ల తర్వాత అదే టైటిల్‌తో పెళ్లి గొప్పతనాన్ని, విశిష్టతని తెర మీద అందంగా చూపించడానికి రెడీ అయ్యారు ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న. ఇప్పుడు ఈ శ్రీనివాస కళ్యాణానికి ఆ ‘శ్రీనివాస కళ్యాణం’ హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సినిమా వెంకటేశ్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ కానుందట. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా వెంకీ కంప్లీట్ చేశారు. ‘‘వెంకటేశ్‌గారి వాయిస్ ఓవర్‌తో మా సినిమా మొదలవుతుంది. మా సినిమా కోసం మీ వాయిస్ వినిపించినందుకు చాలా థ్యాంక్స్ సార్’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, ప్రకాశ్రాజŒ , జయసుధ, నరేశ్, నందితా శ్వేత ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్. చిన్నోడికీ పెద్దోడికీ థ్యాంక్స్ ‘‘మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నుంచి శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌తో వెంకటేశ్, మహేశ్‌కు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అందులో వెంకటేశ్, మహేశ్ పెద్దోడు, చిన్నోడుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఏడాదిలోనే మా బ్యానర్లో వెంకటేశ్ ‘ఎఫ్ 2’, మహేశ్ బాబు 25వ సినిమా రూపొందుతున్నాయి. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకు వాయిస్ ఓవర్‌ను పెద్దోడు వెంకటేశ్, చిత్రం ట్రైలర్‌ను చిన్నోడు మహేశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిన్నోడు, పెద్దోడికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
‘శ్రీనివాస కళ్యాణం’ సెన్సార్ రిపోర్ట్
లై, ఛల్‌మోహన్ రంగా సినిమాల ఫలితాలతో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఆశించినంత మేర విజయం సాధించలేకపోయాడు. ఈ కుర్ర హీరో తన సినీ కెరీర్లో మరిచిపోలేని హిట్ ఇచ్చిన దిల్ రాజుతో కలిసి మళ్లీ ఇన్నేళ్లకు ఇంకో సినిమాను చేస్తున్నాడు. ‘దిల్’ సినిమా ఇటు నితిన్, దిల్ రాజు కెరీర్స్‌ను నిలబెట్టింది. మళ్లీ వీరిద్దరు కలిసి ‘శ్రీనివాస కళ్యాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్, జయసుధల నటన ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. హీరో హీరోయిన్ల కూల్ లుక్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను శనివారం పూర్తి చేసుకుంది. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికేట్‌ను పొందినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. 2 hours and 20 minutes. Zero cuts. All set for a grand release on August 9th. #SrinivasaKalyanam@actor_nithiin @RaashiKhanna @Nanditasweta @mickeyjmeyer Directed by #vegesnasatish. #SrinivasaKalyanamFromAug9th pic.twitter.com/ActZnbuga6 — Sri Venkateswara Creations (@SVC_official) August 4, 2018 -
‘శ్రీనివాస కళ్యాణం’.. వెంకీ వ్యాఖ్యానం
శతమానం భవతి సినిమాతో ఘన విజయం సాధించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. నితిన్, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి వేడుక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. లై, ఛల్ మోహన్ రంగ సినిమాలతో నిరాశపరిచిన నితిన్.. శ్రీనివాస కళ్యాణం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్, జయసుధ, నందిత శ్వేతలు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. -
టాలీవుడ్లో బిజీబిజీగా..
తమిళసినిమా: మాతృభాష నుంచి ఇతర భాషలపై కన్నేయడం అన్నది హీరోయిన్లకు కొత్తేమీ కాదు. బహుభాషా హీరోయిన్గా పేరు తెచ్చుకుంటే ఆ క్రేజే వేరు. పారితోషికం విషయంలోనూ డిమాండ్ ఉంటుంది. అందుకే చాలా మంది ఇతర భాషల్లోనూ రాణించాలని ఆశ పడుతుంటారు. అయితే అందరికీ అన్ని భాషల్లోనూ అవకాశాలు రావడం జరగదు. అలాంటి అదృష్టం యువ నటి నందిత కు లభించింది. ఈ బ్యూటీ తమిళం, కన్నడం, తెలుగు భాషల్లో ప్రాచుర్యం పొందడం విశేషమే. ముఖ్యంగా ఇప్పుడు టాలీవుడ్లో బిజీబిజీగా ఉంది. కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ అట్టకత్తి చిత్రం ద్వారా పరిచయం చేసిన నటి నందిత. ఆ చిత్ర విజయం నందిత కెరీర్‌కు బాగా ఉపయోగపడింది. ఆ తరువాత ఎదిర్‌నీశ్చల్ వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన నందిత ఎక్కడికి పోతావు చిన్నదానా చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. లవ్, హర్రర్ మిక్సైన ఆ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. అంతే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ప్రస్తుతం అక్కడ నాలుగైదు చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయింది. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన శ్రీనివాస కల్యాణం చిత్రంలో నితిన్‌కు జంటగా నటించే అవకాశం నందితను వరించింది. ఇందులో పద్మావతిగా గ్రామీణ పాత్రలో నటించానని నందిత చెప్పింది. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన దిల్‌రాజు నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే వారం తెరపైకి రానుందని చెప్పింది. ఇందులో పలు సాహసోపేతమైన సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించానని తెలిపింది. అదేవిధంగా తమిళ చిత్రం చతురంగవేట్టై తెలుగు రీమేక్‌లోనూ తాను హీరోయిన్గా నటించానని చెప్పింది. అదే విధంగా తమిళం చిత్రం డార్లింగ్–2 తెలుగులో ప్రేమ కథా చిత్రం 2గా తెరకెక్కుతోందని, అందులోనూ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిపింది. ఇకపోతే తమిళంలో వైభవ్‌కు జంటగా ఒక చిత్రంలోనూ, నర్మద అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నట్లు చెప్పింది. అదే విధంగా కన్నడంలో ఒక ప్రముఖ హీరోకు జంటగా నటించనున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుందని తెలిపింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా నందిత బిజీబిజీగా ఉంది. -
శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ విడుదల చేసిన మహేశ్ బాబు
-
‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్ విడుదల
-
కనువిందు చేస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్
‘అ ఆ’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు నితిన్. తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్‌రంగా’ సినిమాలు చేసినా.. ఆ స్థాయిలో విజయవంతం కాలేదు. అయితే నితిన్ కేరిర్‌కు ఊపునిచ్చిన సినిమా ‘దిల్’. ఈ సినిమాను నిర్మించిన రాజు ‘దిల్’ రాజుగా ఇండస్ట్రీలో ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత నితిన్ హీరోగా, దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ మూవీలో మిక్కి జే మేయర్ అందించిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అందరి దృష్టి నెలకొంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెళ్లంటే.. పెద్ద పండుగ అని జయసుధ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకోగా.. పెళ్లి వేడుకను అద్భుతంగా చూపెట్టారు . నితిన్, రాశిఖన్నా కూల్ లుక్స్‌లో బాగున్నారు. ఇక సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్న ప్రకాష్ రాజ్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్‌ల నటన హైలెట్‌గా నిలవనుంది. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కానుంది. -
సూపర్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్
శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. గోదావరి జిల్లాలతో పాటు ఛండీఘర్‌లో చిత్రకరణ పూర్తి చేశారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా ప్రారంభమైన ఈ సినిమాను ఆగస్టు 9న రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ జోరు పెంచిన చిత్రయూనిట్ సూపర్ స్టార్ చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయిస్తున్నారు. రేపు (గురువారం) సాయంత్రం ఐదు గంటలకు ముప్పై నిమిషాలకు మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. -
ఈ వారం యూట్యుబ్ హిట్స్
జీనియస్ (హిందీ) – అఫీషియల్ టీజర్ నిడివి : 3 ని. 20 సె. హిట్స్ :1,03,95,447 దర్శకుడు అనిల్ శర్మ పేరు వింటే అందరికీ ‘గదర్’ సినిమా గుర్తుకు వస్తుంది. సన్ని డియోల్, అమిషా పటేల్ నటించిన ఆ సినిమా దేశభక్తి–ప్రేమ కథాంశంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకుని అనిల్ శర్మ తన కుమారుడు ఉత్కర్ష్ శర్మను ‘జీనియస్’ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దేశభక్తుడైన ఒక కుర్రాడు ప్రేమ కోసం దేశం కోసం ఏం చేశాడన్నది లైన్. విలన్‌గా నవాజుద్దీన్ సిద్దిఖీ నటించాడు. ఒక పాపులర్ ఫిల్మ్‌లో ఎంత హంగు ఆర్భాటం ఉండాలో అంతా ఈ సినిమాలో కనపడుతోంది. ఇషితా చౌషాన్ హీరోయిన్గా నటించింది. ఆగస్టు 24 విడుదల. శ్రీనివాస కల్యాణం – టీజర్ నిడివి 38 సె. హిట్స్ :28,62,492 ‘శ్రీనివాస కల్యాణం’ పేరుతో గతంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సినిమా వచ్చింది. హిట్ అయ్యింది. నిర్మాత మురారి తీసిన సినిమా అది. అలాంటి మంచి చిత్రాలు తీసే నిర్మాతగా పేరు గడించిన దిల్ రాజు మళ్లీ అదే టైటిల్‌తో సినిమా తీస్తున్నారు. ఈ మధ్య హీరో నితిన్‌కు సరైన సినిమాలు పడలేదు. హిట్ అవుతాయనుకున్న సినిమాలు కూడా నిరాశ పరిచాయి. కాని కొన్ని గ్యారంటీ సెంటిమెంట్లు ఉన్న సినిమాలు హిట్ అవుతాయన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా చేసినట్టున్నారు. దర్శకుడు సతీష్ ‘శతమానం భవతి’తో తన టేస్ట్‌ను నిరూపించుకున్నారు కనుక ఈ సినిమాను కూడా అందంగా తీర్చిదిద్ది ఉంటారన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. రాశీ ఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లు. ప్రకాష్‌రాజ్ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. కనుక సినిమా మంచి ఫలితాన్ని సాధిస్తుందని ఆశిద్దాం. మాటరాని మౌనమిది – షార్ట్‌ఫిల్మ్ నిడివి :9 ని. 56 సె. హిట్స్ :1,50,112 అబ్బాయిల జీవితంలో అత్యంత ఫ్యాన్సీ నిండిన విషయం ఒకే ఒకటి – అమ్మాయిలతో మాట్లాడటం. కొందరు మంచినీళ్లు తాగినంత సులువుగా అమ్మాలను మాటల బుట్టలో పడేస్తారు. కొందరు మాత్రం కాలకూట విషం మింగుతున్నట్టుగా గడియకొకమాట మాట్లాడి అమ్మాయిలకు ఆన్ ది స్పాట్ నరకం చూపిస్తారు. సాధారణంగా మాటల కోసం తడముకునే అబ్బాయిలకు సాయం పట్టడానికి క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి గైడ్ల అవతారం ఎత్తుతుంటారు. గైడ్ల థియరీ ప్రాక్టికల్స్‌లో బెడిసి కొడుతూ ఉంటుంది. ఇదంతా పాత వ్యవహారమే అయినా చూసిన ప్రతిసారీ చిన్న చిరునవ్వు వస్తుంటుంది. ఈ షార్ట్‌ఫిల్మ్ కూడా అలాంటి నవ్వులు పూయిస్తుంది. ‘క్రేజీ ఖన్నా’ పేరుతో ఉన్న యూ ట్యూబ్ చానల్ కోసం రాజేష్ ఖన్నా ముఖ్యపాత్రధారిగా ఈ షార్ట్‌ఫిల్మ్ తయారైంది. హర్షిత ఫిమేల్ లీడ్ చేసింది. సరదాగా చూడొచ్చు. -
‘శ్రీనివాస కళ్యాణం’ మూవీ స్టిల్స్
-
ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకుంటున్నా
‘‘పెళ్లి నేపథ్యంలో చాలా సినిమాలు, పాటలు వచ్చాయి. ఇప్పుడు మా ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో ప్రత్యేకత ఏమై ఉంటుందని ఆడియన్స్ ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతిని ఇంటికి తీసుకెళ్తారని నమ్మకంతో చెప్పగలం’’ అన్నారు ‘దిల్’ రాజు. నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. రాశీఖన్నా, నందితా శ్వేత కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మించారు. జయసుధ, సీనియర్ నరేశ్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు పాత్రికేయులతో మాట్లాడుతూ– ‘‘పన్నెండేళ్ల క్రితం ఆగస్టు 9న విడుదలైన ‘బొమ్మరిల్లు’ చిత్రం మా బ్యానర్లో ల్యాండ్ మార్క్‌గా నిలిచింది. ఇప్పుడు అదే రోజున ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. లక్కీగా ప్రస్తుతం మా బ్యానర్లో సినిమా చేస్తోన్న మహేశ్‌బాబు బర్త్‌డే కూడా అదే రోజు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాన్ని రిలీజ్ చేసిన మే 9న ‘మహానటి’ సినిమాను నిర్మాత అశ్వనీదత్‌గారు రిలీజ్ చేసి హిట్ కొట్టారు. మా ‘బొమ్మరిల్లు’ విడుదలైన ఆగస్టు 9న ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్రం విడుదల చేస్తున్నాం. అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ‘దిల్’ తర్వాత నితిన్‌తో ‘శ్రీనివాసకళ్యాణం’ లాంటి సినిమా చేయడానికే ఈ గ్యాప్ వచ్చిందని అనుకుంటున్నాను. స్క్రిప్ట్‌కు కాస్త టైమ్ పట్టినప్పటికీ షూటింగ్ తొందరగా పూర్తి చేశాం. ఆల్రెడీ రిలీజ్ చేసిన సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ నా లైఫ్‌లో జరిగిన సంఘటనలు ప్రతి కుటుంబంలో జరుగుతాయి. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమాకు తోడయ్యాయి. తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు కొన్ని విషయాలనైనా మా సినిమా నుంచి తీసుకుంటారన్న నమ్మకం ఉంది. పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు, అబ్బాయిలు ‘శ్రీనివాసకళ్యాణం’ లా పెళ్లి జరిగితే బాగుండు అనుకుంటారు. మా బ్యానర్లో ‘బొమ్మరిల్లు, శతమానం భవతి’ తర్వాత వస్తోన్న అటువంటి సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. వెంకటేశ్వర స్వామి మాతో ఈ సినిమా చేయించాడని అనుకుంటున్నాను’’ అన్నారు. -
శ్రీనివాస కళ్యాణం ఆడియో విడుదల
-
పెళ్లి జరుగుతున్న ఫీల్‌ని కలిగిస్తుంది
‘‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా అనుకున్న టైమ్‌కి పూర్తవడానికి నటీనటులు, టెక్నీషియన్స్ కృషి ఎంతో ఉంది. నితిన్ అన్నట్లు.. నేను ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ అసిస్టెంట్లాగానే పనిచేశా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్ హీరోగా, రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదలకానుంది. మిక్కీ జె.మేయర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శతమానం భవతి’ తర్వాత పెళ్లి కాన్సెప్ట్‌తో సినిమా చేద్దామనుకుంటున్నా అని సతీష్ చెప్పాడు. ‘నేను లోకల్’ సినిమా రిలీజ్ తర్వాత తిరుపతికి వెళ్లా. ‘శ్రీనివాస కళ్యాణం’ టైటిల్ పెట్టినప్పుటి నుంచే ఏదో వైబ్రేషన్. నాకే ఐడియాలు వచ్చాయి. ఏడుకొండల స్వామి దర్శనం వద్ద ఈ కథ తయారయింది. నా కూతురి పెళ్లి చేశా.. మనవడు పుట్టినప్పుడు ఆనంద పడ్డా. నా భార్య చనిపోయినప్పుడు బాధపడ్డా. ఈ మూడు ఇన్సిడెంట్లు నా లైఫ్‌లో జరిగాయి. దీన్ని సతీష్‌తో షేర్ చేసుకుంటే ఈ చిత్రం కథకి రౌండప్ అయింది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండే ఎమోషనల్ మూమెంట్సే ఈ సినిమా. ఇందులో పెళ్లి గురించి అద్భుతంగా చెప్పినా, సినిమా చూసిన తర్వాత ఆయా పాత్రల్లో నటించిన వారిని హృదయంలో పెట్టుకుని వెళతారు. ఈ సినిమా చూస్తే మీ ఇంట్లో ఓ పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ‘శ్రీనివాస కళ్యాణం’ ఎంత గొప్ప సినిమా అవుతుందనేది ఆగస్టు 9న తెలుస్తుంది. కానీ, ఓ మంచి సినిమా చేశామని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ‘దిల్’ తర్వాత నితిన్‌తో సినిమా అనుకున్నా కుదరలేదు. నితిన్ ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఇంటికొచ్చి.. అంకుల్.. నాకు ఓ సినిమా కావాలన్నప్పుడూ కుదరలేదు. అవన్నీ ఎందుకు కుదరలేదు అంటే ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ చేయాలని ఉంది కాబట్టే. అది మనకెవ్వరికీ తెలీదు. భగవంతుడు ఇవన్నీ డిజైన్ చేసి పెడతాడు’’ అన్నారు. నితిన్ మాట్లాడుతూ–‘‘నా లైఫ్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ బ్యూటిఫుల్ మెమొరీ. ‘అ ఆ’ తర్వాత మిక్కీ ఈ చిత్రానికి మంచి పాటలిచ్చాడు. ఇందులో ‘కల్యాణం వైభోగం’ పాట నా సినిమాల్లో టాప్ 3లో ఉంటుంది. ప్రతి పెళ్లిలోనూ ఈ పాట మార్మోగుతుంది. రాజుగారి గురించి నటుల్లో నాకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. ఆయన ఫస్ట్ సినిమా ‘దిల్’ హీరో నేనే కాబట్టి. ‘దిల్’ షూటింగ్ లేకున్నా రాజుగారు పొద్దునే ఆఫీసుకి వెళ్లిపోయి రేపటి సీన్స్ గురించి ఆలోచించేవారు. ‘ఫస్ట్ సినిమాకి వీడికి ఎందుకంత బిల్డప్’ అనుకునేవారు. ‘దిల్’ చిత్రంలో ‘మై నేమ్ ఈజ్ రాజు అంటే.. ఎందుకంత ఫోజు’ అంటాను. ఈ డైలాగ్ కావాలనే సరదాగా పెట్టాం. ఆ సినిమా హిట్ అయింది. మళ్లీ మేం చేయాలనుకున్నా సెట్‌కాలేదు. ‘శ్రీనివాస కళ్యాణం’తో కుదిరింది. ఇన్నేళ్ల తర్వాత కూడా రాజుగారి క్రమశిక్షణ చూసి నేను షాక్ అయ్యా. ‘దిల్’ టైమ్‌లో ఆయనది ఓవరాక్షన్ అనుకునే వారు. కానీ, అది ఆయన ప్యాషన్. అందుకే ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత సక్సెస్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయన అసిస్టెంట్‌లాగా పనిచేశారు. నా సినీ కెరీర్ అయిపోయాక చూస్కుంటే టాప్ 1,2 స్థానాల్లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘యుగాలు మారినా, దేవుడు ఏ అవతారం ఎత్తినా.. పెళ్లి గొప్పదనం గురించి చెబుతూనే ఉన్నాడు. అలా చెప్పాలని చేసిన ప్రయత్నమే ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ రోజుల్లో పెళ్లి ఈవెంట్‌గా మారిపోయింది. కానీ, అది బ్యూటిఫుల్ మూమెంట్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతారని నమ్ముతున్నా’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘సమాజానికి విలువలున్న సినిమాలను ఇస్తూ గుర్తింపు పొందుతున్న మంచి సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అందుకే రాజు అంటే నాకు ఇష్టం’’ అన్నారు నటుడు ప్రకాశ్ రాజ్. ‘‘నా 41ఏళ్ల సినీ జీవితంలో ఎన్నోరకాల ఫంక్షన్స్ చూశా. నా జీవితంలో ఎప్పుడూ ఫ్యామిలీతో సినీ ఫంక్షన్‌కి వెళ్లలేదంటే మీరందరూ నమ్మి తీరాలి. కానీ, ఈ రోజు కుటుంబంతో సహా వచ్చానంటే ముఖ్య కారణం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘లేడీస్ టైలర్’, ‘అహనా పెళ్లంట’ సినిమాలు హిట్ అయ్యాక నాకు భయం వేసింది. ఇక ఎలాంటి సినిమాలు తీయాలని. ‘శతమానం భవతి’ వంటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ రెండో సినిమా ఏం తీస్తాడులే అనుకున్నవారికి ‘శ్రీనివాస కళ్యాణం’ చూస్తే తెలుస్తుంది. మా డాడీ రామానాయుడిగారి తర్వాత హ్యాట్సాఫ్ టు ‘దిల్’ రాజు. సినిమా అతని శ్వాస. ఇండస్ట్రీ, నాలాంటి నటీనటులు నాలుగు కాలాలపాటు బాగుండాలంటే రాజులాంటి వ్యక్తి ఉండాలి’’ అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్. ‘‘నరేశ్, నేను తొలిసారి ‘పండంటి కాపురం’ లో నటించాం. అది విడుదలై శనివారంతో 46 ఏళ్లు అయింది. ఈ జర్నీలో ఎన్నో పాత్రలు చేశా. బహుశా రామానాయుడుగారి తర్వాత ‘ఆల్ ఇట్స్ ది వే ‘దిల్’ రాజుగారే అనుకుంటున్నా’’ అని జయసుధ అన్నారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి, రాశీఖన్నా, నందిత శ్వేత, మిక్కీ జె. మేయర్, కెమెరామేన్ సమీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి గొప్పతనం చెప్పే చిన్నిప్రయత్నం...
మరో ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా టాలీవుడ్లో తెరకెక్కుతోంది. నితిన్-రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్ర థీమ్ టీజర్‌ను కాసేపటి క్రితం రిలీజ్ చేశారు. టీజర్ విషయానికొస్తే... మనం పుట్టినప్పుడు మనవాళ్లందరూ ఆనంద పడతారు అది మనకు తెలీదు. మనం దూరం అయినప్పుడు మనవాళ్లందరూ బాధపడతారు అదీ మనకు తెలీదు. మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి, మనవాళ్లందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ శ్రీనివాస కళ్యాణం అంటూ సహజనటి జయసుధ వాయిస్ ఓవర్‌తో టీజర్‌ను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న శ్రీనివాస కళ్యాణం ఆడియో జూలై 22న విడుదల చేయనున్నారు. -
శ్రీనివాస కళ్యాణం టీజర్ విడుదల
-
త్వరలో సెట్స్ మీదకు ‘భీష్మ’
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం పనుల్లో బిజీగా ఉన్న నితిన్ ఈ సినిమాతో త్వరలో ప్రారంభించనున్నాడట. ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండటంతో ఆగస్టు మొదటి వారంలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరితో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సింగిల్ ఫర్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీనివాస కళ్యాణంలో నితిన్ రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా శతమానంభవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. -
శ్రీనివాస్ కల్యాణం పాట విడుదల
-
కళ్యాణం.. వైభోగం.. ఆనంద రాగాల శుభయోగం..
నితిన్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీనివాస్ కల్యాణం’ సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘కళ్యాణం.. వైభోగం.. ఆనంద రాగాల శుభయోగం’ అనే పల్లవితో మొదలై.. రుక్మిణీ కల్యాణం, సీతా స్వయంవరం, శ్రీనివాస కల్యాణ ఘట్టాలను ఉటంకిస్తూ వివాహ ప్రాశస్త్యాన్ని వివరించే ఈ పాట సంగీత ప్రియుల మనసు దోచుకుంటోంది. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా ఎస్పీ బాలు తన స్వరంతో ప్రాణం పోశారు. చాలా కాలం తర్వాత సాహిత్య విలువలు ఉన్న పాట వినడం సంతోషంగా ఉందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను వినేయండి మరి. -
ముహూర్తం కుదిరింది
రీసెంట్గా మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన హీరో నితిన్ పెళ్లి చేసుకున్నారు. కాస్త ఆగి మీ ఆలోచనలకు అడ్డుకట్ట వేయండి. ఆయన పెళ్లి చేసుకున్నది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’ రిలీజ్‌కు ముహూర్తం కుదిరింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. ఇందులో రాశీఖన్నా, నందితా శ్వేతా కథానాయికలుగా నటించారు. ‘‘ఒక సాంగ్, ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. దాదాపు 12 సంవత్సరాల క్రితం మా బ్యానర్లో ‘బొమ్మరిల్లు’ విడుదలైన ఆగస్టు 9న ఇప్పుడు మళ్లీ ‘శ్రీనివాస కల్యాణం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్లీ అదే రోజున అదే స్థాయి విజయాన్ని ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంతో అందుకోవాలని ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
జూలై 6 నుంచి నాటా ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం
ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలో ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) ఆధ్వర్యంలో జూలై 6 నుంచి 8 వరకు శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుపనున్నట్టు నాటా ప్రతినిధులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతులతో ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయని.. హిందూ సంప్రదాయం ప్రకారం కన్నుల పండుగగా కళ్యాణం జరిపించడానికి టీటీడీ నుంచి వేద పండితులు జీఏవీ దీక్షితులు, కే పురుషోత్తం ఆచార్యులు ప్రత్యేకంగా వస్తున్నారని వెల్లడించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తిరుపతి లడ్డు ప్రసాదం ఇవ్వనున్నామన్నారు. కళ్యాణ సమయంలో గాయని కొండవీటి జ్యోతిర్మయి అన్నమాచార్య కీర్తనల రూపంలో శ్రీనివాసుని కళ్యాణ ప్రశస్తిని భక్తులకు వివరిస్తారని.. చైతన్య సోదరుల గాత్రం, పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం మృదంగం, సత్యనారాయణ శర్మ వయోలిన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఫిలడెల్ఫియాలో జరిగే తెలుగు మహాసభల నిర్వహకులు ఎందరో కార్యకర్తలు అహార్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు సకుటుంబ సమేతంగా ఈ కళ్యాణంలో పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాల కోసం nata2018.org వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చని తెలియజేశారు. -
‘శ్రీనివాస కళ్యాణం’కు ముహూర్తం ఫిక్స్
శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన సతీష్ వేగేశ్న ప్రస్తుతం నితిన్ హీరోగా శ్రీనివాస్ కళ్యాణం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. గోదావరి జిల్లాలతో పాటు ఛండీఘర్‌లో చిత్రకరణ పూర్తి చేశారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా ప్రారంభమైన ఈ సినిమాను ఆగస్టు 9న రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. తాజా చిత్రయూనిట్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో శ్రీనివాస కళ్యాణం సక్సెస్ నితిన్ కెరీర్‌కు కీలకంగా మారింది. నందితా శ్వేత మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. -
‘శ్రీనివాస కళ్యాణం’పై నితిన్ ట్వీట్!
దిల్ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా ఇద్దరి కెరీర్‌ను గాడిలో పెట్టింది. హీరోగా నితిన్, నిర్మాతగా రాజును నిలబెట్టింది. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని దిల్ రాజుగా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఈ సినిమాలో వీరిద్దరికి మాత్రమే కాకుండా ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రకు కూడా మంచి గుర్తింపే లభించింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత.. ఈ కాంబినేషన్లో ఓ మూవీ పట్టాలెక్కుతోంది. నితిన్ , రాశిఖన్నా జంటగా దిల్‌రాజు బ్యానర్లో శ్రీనివాస కళ్యాణం మూవీలో తెరకెక్కుతోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీపై నితిన్ ‘మళ్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి దిల్ కాంబో వస్తోందం’టూ.. ట్వీట్ చేశారు. The DIL combo is back to entertain u all once more 😀😀#SrinivasaKalyanam pic.twitter.com/BEfQVwPLlr — nithiin (@actor_nithiin) June 30, 2018 -
ఆజన్మ బ్రహ్మచారిగా నితిన్
టాలీవుడ్ లో పెళ్లికాని ప్రసాదులు చాలా మందే ఉన్నారు. ప్రభాస్, రానా దగ్గుబాటి లతో నితిన్ కూడా వయసు పెరుగుతున్న సినిమాలతోనే కాలం గడిపేస్తున్నారు. తాజాగా నితిన్ సింగిల్ ఫర్ఎవర్ అనే స్టేట్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్‌లో మాత్రం కాదు. రీల్ లైఫ్‌లోనే. ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్న నితిన్ తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పాడు. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు సింగిల్ ఫర్ఎవర్ అనేది ట్యాగ్ లైన్. ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మా పేరుతో లవ్ స్టోరి తెరకెక్కిస్తుండటంతో భీష్మాపై ఆసక్తి నెలకొంది. -
అమలాపురంలో ‘శ్రీనివాస కళ్యాణం’
మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు డైరెక్టర్ సతీష్ వేగేశ్న. శతమానంభవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తీసి అందర్నీ మెప్పించాడు . దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ దిల్ రాజు , సతీష్ వేగేశ్న కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. నితిన్, రాశీ ఖన్నా జోడిగా నటిస్తోన్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అమలాపురంలో జరుగుతోంది. ఈ సినిమాలోని పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ విరామ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను సీనియర్ నరేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Been shooting in #Amalapuram for #SrinivasaKalyanam. Lucky to be part of this amazing film and one more note-worthy character for me. Expecting yet another super hit film in our basket pic.twitter.com/SMLJyV1GBn — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 9, 2018 -
సింగపూర్ టు అమలాపురం
సింగపూర్‌కు బై బై చెప్పి, అమలాపురంలో వాలిపోయారు హీరోయిన్ రాశీ ఖన్నా. ఎందుకు? సింగపూర్ హాలీడే ట్రిప్‌లో చేసినట్లు ఇక్కడ కూడా ఏవైనా అడ్వెంచర్స్ ప్లాన్ చేశారా? అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడానికి అమలాపురంలో అడుగుపెట్టారు రాశీ. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘శ్రీనివాసకల్యాణం’. రాశీ ఖన్నా, నందితా శ్వేత కథానాయికలు. ప్రస్తుతం అమలాపురంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూట్లో జాయిన్ అవ్వడానికే రాశీ అమలాపురం వెళ్లారు. అంతకు ముందు తమిళంలో ‘జయం’ రవితో నటిస్తున్న సినిమా షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకుని హాలీడే కోసం రాశీఖన్నా సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ‘‘గుడ్‌బై చెప్పడం నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ వెళ్లాలి. బై బై సింగపూర్. ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో జాయిన్ అయ్యేందుకు అమలాపురం వచ్చాను’’ అని పేర్కొన్నారు రాశీఖన్నా. -
డల్లాస్‌లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
డల్లాస్( ఇర్వింగ్) : అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు కన్వెన్షన్ డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీనివాస స్వామి కళ్యాణంతో మూడో రోజు ఈ వేడుకు మొదలైంది. జీయార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహాయంతో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. -
నాన్‌స్టాప్
ఐదు కాదు. పది కాదు. ఏకంగా ఇరువై గంటలు కెమెరా ముందే ఉన్నారు కథానాయిక నందితా శ్వేత. అవును... ఉదయం నాలుగు గంటల నుంచి దాదాపు ఇరవై గంటల పాటు షూట్లో పాల్గొన్నారు నందిత. దీన్ని బట్టీ ఆమె ఎంత అకింతభావంతో వర్క్ చేస్తోరో అర్థం చేసుకోవచ్చు. అంతేనా.. ఈ ఏడాది ఆమె సూపర్ స్పీడ్.. కాదు కాదు జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. మరి.. ఏక కాలంలో ఏడు సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదు కదా. ‘‘ఈ ఏడాది లైఫ్ రంగులరాట్నంలా తిరుగుతుంది. గత ఆరు నెలల నుంచి ఏక కాలంలో ఏడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. నా వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం నైట్ షూట్లో పాల్గొంటున్నాను’’ అని పేర్కొన్నారు నందితా శ్వేతా. అంటే నందిత నాన్‌స్టాప్‌గా కెరీర్లో ముందుకెళ్తున్నారన్నమాట. రెండేళ్ల క్రితం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు తెరపై మెరిశారీ బ్యూటీ. ప్రస్తుతం నితిన్ హీరోగా ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు నందిత. మరో కథానాయికగా రాశీఖన్నా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. తమిళ సినిమా ‘నర్మద’లో తల్లి పాత్రలో యాక్ట్ చేస్తున్నారామె. -
సండే ఫన్డే
రోజులో పన్నెండు గంటలంటే.. హాఫ్ డే. షూటింగ్స్‌తో బాగా అలసిపోయిన కథానాయిక రాశీ ఖన్నా కూడా హాఫ్‌డే నిద్రపోవాలనుకున్నారు. కానీ, ‘శ్రీనివాస కల్యాణం’ షూటింగ్లో పాల్గొన్నారు. నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. ఇందులో రాశీఖన్నా, నందిత శ్వేతా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘‘పన్నెండు గంటల నిద్ర అవసరం. కానీ వర్క్ చేయాలి. అది సండే అయినప్పటికీ కూడా’’ అని సరదాగా లొకేషన్ పిక్‌ను షేర్ చేశారు రాశీఖన్నా. అయినా.. వర్క్ పట్ల ఆమె ఎంతో డెడికేటెడ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను ఢిల్లీ, పంజాబ్, చండీఘడ్.. ఇలా నార్త్ ఇండియాలో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘సండే అయినా సెట్లో ఫుల్ ఫన్ ఉంది. సండే ఫన్ డే’ అని పేర్కొంది చిత్ర బృందం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
నాష్‌విల్లేలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
టేనస్సీ: నాష్‌విల్లేలోని గణేష్ ఆలయంలో శ్రీనివాస కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)ల ఆధ్వర్యంలో గత నెల 28న నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో విగ్రహాలను అలంకరించి శ్రీనివాస కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ కమిటీ సభ్యులు ఆల రామకృష్ణా రెడ్డి, నూకల నరేందర్ రెడ్డి, సుషీల్ చందా, గుడూరు కిశోర్ రెడ్డి, దయప ప్రకాశ్ రెడ్డి, పునీత్ దీక్షిత్, రవి కిరణ్, రాధిక రెడ్డి, నూకల లావణ్య, మంజూ లిక్కి, బూస సునీత, అరమండ్ల రాధిక, రాచకొండ సాయిరాం, కేస సిరిషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా పూర్తి చేసినందుకు భక్తులకు, అతిథులకు, దాతలకు, ఆలయ పూజారి, ఆలయ బోర్డు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాష్‌విల్లేలోని గణేష్ ఆలయం విస్తరణ పనులను గత కొన్ని ఏళ్లక్రితమే ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి దాదాపు 4 మిలియన్ల డాలర్లను ఖర్చుచేశారు. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్) సభ్యులు పెద్ద మొత్తంలో ఆలయానికి విరాళాలు ఇచ్చారు. గత ఏడాది కూడా శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. -
చండీఘడ్ టు పటియాలా
కల్యాణం కోసం హీరో నితిన్ ఈ రోజు పంజాబ్‌లోని పటియాలాకి వెళ్లారు. ఈ రోజు అంటున్నారు మరి.. నిన్న ఎక్కడ ఉన్నారు? అంటే చండీఘడ్‌లో ఉన్నారు. ఎందుకు? అంటే.. శ్రీనివాస కల్యాణం కోసం. నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. ఇందులో రాశీఖన్నా, నందితా శ్వేత కథానాయికలు. మంగళవారం వరకు చండీఘడ్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ఈ రోజు పటియాలాలో మొదలైంది. మూడు రోజులు అక్కడే షూటింగ్ జరిపి, తిరిగి చండీఘడ్ చేరుకుని అక్కడ షూటింగ్ జరుపుతారని సమాచారం. సో... చండీఘడ్ టు పటియాలా నితిన్ రౌండ్స్ కొడుతున్నారన్నమాట. -
‘శ్రీనివాస కల్యాణం’కు ముహూర్తం ఫిక్స్
శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన సతీష్ వేగేశ్న ప్రస్తుతం నితిన్ హీరోగా శ్రీనివాస్ కల్యాణం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ గోదావరి జిల్లాల్లో పూర్తయ్యింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను ఛండీఘర్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను జూలై 24న రిలీజ్ చేయాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో శ్రీనివాస కల్యాణం సక్సెస్ నితిన్ కెరీర్‌కు కీలకంగా మారింది. నందితా శ్వేత మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. -
ఖర్చు తగ్గిందన్నమాట!
సోషల్ మీడియాలో ఒకటే చర్చ. హీరో నితిన్ పెళ్లి గురించి. పెళ్లికొడుకు గెటప్‌లో ఉన్న ఫోటోను నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. కానీ నితిన్ పెళ్లికొడుకుగా మారింది రియల్ లైఫ్‌లో కాదు. రీల్ లైఫ్‌లోనే. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీనివాస కల్యాణం’. ఇందులో రాశీఖన్నా, నందిత శ్వేత కథానాయికలుగా నటిస్తున్నారు. ఆల్మోస్ట్ 14 ఏళ్ల తర్వాత నితిన్, ‘దిల్’ రాజుల కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతుండటం విశేషం. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. చిత్రీకరణ మొదలైంది. ‘‘ ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ ఈ నెల 30 వరకు జరుగుతుంది. ఈ ఏడాది జూన్ కల్లా షూటింగ్‌ను కంప్లీట్ చేసి, జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కి జె. మేయర్, కెమెరా: సమీర్ రెడ్డి. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే..‘‘మ్యారేజ్‌కి కెమెరామెన్ అవసరం లేదన్నా, ఇవే పెళ్లి ఫొటోలు అని పోస్ట్ చేసినా నమ్మేలా ఉన్నాయ్’’ అని ఓ నెటిజన్ నితిన్ పోస్ట్ చేసిన ఈ సినిమా ఫొటోను ఉద్దేశించి అన్నాడు. ‘ఖర్చు తగ్గిందన్నమాట’ అంటూ సరదాగా అతనికి బదలు ఇచ్చాడు నితిన్. -
‘శ్రీనివాస కళ్యాణం’ మొదలైంది
-
నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ మొదలైంది
-
‘శ్రీనివాస కళ్యాణం’ మొదలైంది
శతమానం భవతి లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ శ్రీనివాస కళ్యాణం. ఎంతో మంది పేర్లు పరిశీలించిన తరువాత చివరకు నితిన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రాశీఖన్నా నటిస్తోంది. ఈ రోజు (ఆదివారం) వేల కళ్యాణాలు జరుగుతుండగా ఈ శ్రీనివాస కళ్యాణం షూటింగ్‌ను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. షూటింగ్ మొదలైన సందర్భంగా ఓ వీడియో టీజర్‌ను రిలీజ్ చేశారు. టైటిల్ లోగోపాటు హీరోహీరోయిన్లు పెళ్లి పీటలపై పరిచయం చేశారు. నదింతా శ్వేత, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. -
నితిన్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఛల్ మోహన్ రంగ సినిమాలో షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ హీరో నితిన్ తన తదుపరి చిత్రానికి ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఛల్ మోహన్ రంగ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్‌కు రెడీ అవుతోంది. మేఘా ఆకాష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నటించేందుకు నితిన్ ఓకె చెప్పాడు. శ్రీనివాస కళ్యాణం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి 3న లాంచనంగా ప్రారంభించనున్నారు. అదే నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. నితిన్ సరసన రాశీఖన్నా, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. -
నందితతో ‘శ్రీనివాస కళ్యాణం’
ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న యంగ్ హీరో నితిన్, ఆ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాలో నితిన్‌కు హీరోయిన్ను ఫైనల్ చేశారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ బ్యూటి నందిత శ్వేత. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన ఈ అందాల భామ శ్రీనివాస్ కళ్యాణంలో నితిన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. నందిత ఎంపికపై టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్న చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. -
శ్రీనివాస కల్యాణంలో?
‘బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా, జెంటిల్‌మతన్, ఒక్క క్షణం’ చిత్రాల్లో అందం, అభినయంతో ఆకట్టుకున్న సురభి తాజాగా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నార ట. నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘దిల్’ రాజు ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయిలకు చోటు ఉందట. ఓ హీరోయిన్గా పూజా హెగ్డేని ఖరారు చేశాయట చిత్రవర్గాలు. మరో హీరోయిన్గా సురభిని సెలెక్ట్ చేశారని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. -
డబుల్ ధమాకా
బడిలో గుడిలో.. మడిలో నీ తలపే శశివదన.. అంటూ ‘డీజే’ సినిమాలో అగ్రహారం కుర్రాడు అల్లు అర్జున్నే కాకుండా తెలుగు రాష్ట్రాల అబ్బాయిలందరితో తన నామ జపం చేయించారు పూజా హెగ్డే. ఆ మాటకొస్తే ‘ముకుందా’లో ‘గోపికమ్మా.. చాలునులేమ్మా..’ అంటూ కుర్రకారు గుండెలకు గేలం వేశారు. ప్రతి సినిమాకీ అభినయంతో పాటు గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేస్తున్నారు. ఇప్పుడు వరుసగా ఆఫర్లూ కొట్టేస్తున్నారు ఈ భామ. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ‘సాక్ష్యం’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందనున్న సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరునే ఖరారు చేసిందట చిత్రబృందం. ఇది మహేశ్ కెరీర్లో 25వ చిత్రం. ఈ సినిమాను అశ్వినీ దత్, ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. మరో సినిమాకి కూడా పూజ పేరు పరిశీలనలో ఉంది. ‘శతమానం భవతి’ సినిమాతో దర్శకుడిగా మారిన సతీష్ వేగేశ్న తదుపరి సినిమా ‘శ్రీనివాస కల్యాణం’లో హీరోయిన్గా చాలా పేర్లు పరిశీలించినప్పటికి ‘దిల్’ రాజు టీమ్ పూజా హెగ్డే పేరునే ఫైనల్ చేసినట్టు సమాచారం. పైన చెప్పిన రెండు సినిమాల్లో పూజా నటిస్తే.. ‘దిల్’ రాజు సారథ్యంలో ఆమె త్రీ మూవీస్ చేసినట్లవుతుంది. ఒకేసారి రెండు సినిమాలకు ఓ హీరోయిన్ పేరుని పరిశీలిస్తున్నారంటే.. కచ్చితంగా అది ఆమెకు డబుల్ ధమాకానే. -
పూజతో ‘శ్రీనివాస కల్యాణం’
‘లై’ సినిమాతో నిరాశపరిచిన నితిన్ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను పరిశీస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సనరస మరోసారి లై ఫేం మేఘా ఆకాష్ నటిస్తోంది. ఈ సినిమా తరువాత నితిన్ చేయబోయే సినిమా ఇప్పటికే ఫైనల్ అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో శమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న తెరకెక్కించనున్న శ్రీనివాస్ కళ్యాణం సినిమాలో నటించనున్నాడు నితిన్. ఎంతో మంది హీరోల చేతుల మారి చివరకు నితిన్ చేతికి వచ్చింది ఈ సినిమా. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని భావించారట. కానీ సాయి పల్లివి ఇంట్రస్ట్ చూపించకపోవటంతో పూజ హెగ్డేను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. పూజ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. -
శ్రావణ మాసంలో శ్రీనివాస కల్యాణం!
కల్యాణం వచ్చినా! కక్కొచ్చినా ఆగదని తెలుగులో ఓ సామెత. అంటే... ప్రతిదానికీ ఓ టైమ్ రావాలి. టైమ్ వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు. సిన్మాల్లోనూ అంతే! కొన్ని కాంబినేషన్లు కుదరడానికి టైమ్ రావాలి. అలాగే... హీరో నితిన్, నిర్మాత ‘దిల్’ రాజు కాంబి నేషన్ మళ్లీ కుదరడానికి 14 ఏళ్లు పట్టింది. నితిన్ హీరోగా పరిచయమైన ‘దిల్’తో, ఆ చిత్రనిర్మాత వెంకట రమణ అలియాస్ రాజు చిత్రపరిశ్రమలో ‘దిల్’ రాజుగా స్థిరపడ్డారు. అది విడుదలైన 14 ఏళ్లకు ఈ హీరో, నిర్మాత మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘శ్రీనివాస కల్యాణం’ అనే పేరుని నిర్ణయించారు. శనివారం ఈ చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది వసంత మాసం (మార్చి)లో చిత్రీకరణ ప్రారంభించి, శ్రావణ మాసం (ఆగస్టు)లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె. మేయర్. -
అఫీషియల్ : శ్రీనివాస కళ్యాణం నితిన్ తోనే..!
దిల్ రాజు నిర్మాణం లో శ్రీనివాస కళ్యాణం సినిమా తెరకెక్కనుందన్న ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాను నాగార్జున హీరోగా తెరకెక్కిస్తారని భావించారు. తరువాత ఎన్టీఆర్ హీరోగా శ్రీనివాస కళ్యాణం ప్రారంభిస్తారన్న ప్రచారం జరిగింది. శతమానం భవతి లాంటి సూపర్ హిట్ తరువాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కావటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫైనల్ గా ఈ సినిమాను నితిన్ హీరోగా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్న నితిన్, ఆ సినిమా పూర్తయిన వెంటనే శ్రీనివాస కళ్యాణం సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందించనున్నాడు. 2018 మార్చిలో ప్రారంభం కానున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. #SrinivasaKalyanam starring @actor_nithiin Directed by Satish Vegesna. Music by @mickeyjmeyer#DilRaju @SVC_official Production Shoot starts in March 2018. pic.twitter.com/9654OSzzlT — BARaju (@baraju_SuperHit) 25 November 2017 -
నాగ్, ఎన్టీఆర్‌లు కాదు నితిన్
శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన దిల్ రాజు, మరోసారి ఆ సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్నతో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. చాలా రోజుల క్రితం శ్రీనివాస కళ్యాణం పేరుతో సతీష్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా తెలిపారు. ముందుగా ఈ సినిమాను సీనియర్ హీరో నాగార్జునతో చేయాలని భావించాడు దిల్ రాజు. అయితే ఆ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. తరువాత వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా శ్రీనివాస కళ్యాణం సినిమా తెరకెక్కుతుందన్న టాక్ వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేయటం లేదట. మరో యంగ్ హీరో నితిన్ హీరోగా శ్రీనివాస కళ్యాణం సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు దిల్ రాజు. ఇప్పటికే సతీష్ చెప్పిన కథ విన్న నితిన్, ప్రాజెక్ట్ ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది. దిల్ సినిమాతో నితిన్ కు ఘనవిజయాన్ని అందించిన దిల్ రాజు. తిరిగి ఇన్నేళ్ల తరువాత అదే హీరోతో పనిచేస్తుండటంతో శ్రీనివాస కళ్యాణం ఆసక్తికరంగా మారింది. -
శ్రీనివాస కళ్యాణంలో ఎన్టీఆర్..?
ఈ ఏడాది శతమానంభవతి, డీజే దువ్వాడ జగన్నాథమ్, ఫిదా లాంటి బిగ్ హిట్స్ అందుకున్న నిర్మాత దిల్ రాజు, ప్రస్తుతం రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ సినిమాను నిర్మిస్తున్నారు. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మరోసారి ఓ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను రూపొందించే ప్లాన్ లో ఉన్నారు దిల్ రాజు. 2017 సంక్రాంతికి శతమానంభవతితో ఆకట్టుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలోనే మరో సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు. అయితే ముందుగా సినిమాను సీనియర్ హీరో నాగార్జునతో తెరకెక్కించాలని భావించినా.. నాగ్ అంగీకరించలేదు. దీంతో నాని, శర్వానంద్ లాంటి యంగ్ హీరోలను సంప్రదించాడట. ఫైనల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
నెక్ట్స్ సంక్రాంతికి 'శ్రీనివాస కళ్యాణం'
సంక్రాంతి సీజన్లో భారీ విజయాలు నమోదు చేస్తూ రికార్డ్ సృష్టిస్తున్న నిర్మాత దిల్ రాజు, 2018 సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది శతమానంభవతి సినిమాతో ఆకట్టుకున్న దిల్ రాజు, భారీ చిత్రాల నిర్మాణం వైపు మొగ్గుచూపుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా డీజే దువ్వాడ జగన్నాథమ్, వరుణ్ తేజ్‌తో ఫిదా, రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు.. వచ్చే సంక్రాంతి సినిమా కోసం కథ ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. ఈ సంక్రాంతికి శతమానంభవతితో ఆకట్టుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలోనే మరో సంక్రాంతి సినిమాను రెడీ చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. అంతేకాదు ఈ కథకు సీనియర్ అయితే బాగుంటుందన్న ఆలోచనతో నాగార్జునను సంప్రదించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజుగారి గది 2 సినిమా చేస్తున్న నాగ్ తరువాత ఏ సినిమా అంగీకరించలేదు. సతీష్ చెప్పే కథ నచ్చితే వెంటనే శ్రీనివాస కళ్యాణం సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ కనిపిస్తోంది. -
నేత్రపర్వంగా శ్రీనివాస కల్యాణం
నేడు ‘గాడ్’ జన్మదిన వేడుకలు రాయవరం (మండపేట) : మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్) జన్మదిన వేడుకల్లో భాగంగా రెండో రోజు బుధవారం పీఠం కల్యాణ శోభను సంతరించుకుంది. పీఠంలోని విజయదుర్గా అమ్మవారిని నయనానందకరంగా అలంకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పీఠానికి అందజేసిన శ్రీదేవి, భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామి వారి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. పీఠం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవ విగ్రహాలకు పీఠాధిపతి గాడ్ సమక్షంలో శ్రీనివాసమంగాపురం దేవాలయ ప్రధాన అర్చకులు బాలాజీ ఆధ్వర్యంలో వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి తులసి దళాలతో అర్చనలు చేశారు. అనంతరం తిరుమల వైఖానస పండితులతో శ్రీవారి దివ్య కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమా¯ŒS తదితరులు పాల్గొన్నారు. పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. నేడు పలువురు ప్రముఖుల రాక ‘గాడ్’ జన్మదిన వేడుకలకు పలువురు ప్రముఖులు గురువారం పీఠానికి రానున్నారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, బ్రాహ్మణ, అర్చక సంక్షేమ సంఘం చైర్మ¯ŒS ఐవైఆర్ కృష్ణారావు, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ¯ŒS రావులపాటి సీతారామారావు, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర క్రీడలు, యువజన శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఆధ్యాత్మిక, సాహితీవేత్తలు హాజరుకానున్నారు. -
కనుల పండువగా శ్రీనివాస కల్యాణం
హిందూపురం అర్బన్ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీనివాసనగర్‌లోని గణపతి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మూలవిరాట్ అభిషేకాలు నిర్వహించి విశేష అలంకరణతో పాటు ఆకుపూజ చేపట్టారు. అలాగే శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర ఆలయంలో కనుల పండువగా శ్రీనివాస కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీనివాస మాల« భక్తబృందం ఆధ్వర్యంలో మూలవిరాట్ వెంకటేశ్వరస్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. అనంతరం ఆలయంలో కల్యాణవేదికపై శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా వందలాది మంది భక్తుల మధ్య కల్యాణోత్సవం నిర్వహించారు. తర్వాత భక్తులు తీర్థప్రసాదాలు, అన్నదానం చేపట్టారు. కాగా సోమవారం ఆలయంలో విశేష పూజలతో పాటు నారాయణ హోమం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాసమందిరం విశ్వనాథ్, మధు, గురుస్వామి మధు, ఎల్ఐసీడీఓ రవీంద్రుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
స్వామి కార్యం.. స్వకార్యం
రాయదుర్గంలో నేడు శ్రీనివాస కల్యాణం • ప్రైవేట్ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రచారం • మునిసిపల్, ఆర్అండ్బీ సిబ్బందితో పనులు • దగ్గరుండి పర్యవేక్షిస్తున్నఎమ్మెల్యే కాలవ రాయదుర్గం : రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీని వాస కల్యాణం నిర్వహిస్తున్నారు. బెంగళూరుకు చెందిన వెంకటేష్‌మూర్తి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రైవేట్ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఫొటోలు, పేర్లతో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలో ఎటు చూసినా ఇటువంటి ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు నియోజకవర్గ ప్రజల బాగు కోసం తనే సొంతంగా కల్యాణోత్సవం జరుపుతున్నట్లు, డబ్బు ఖర్చు చేస్తున్నట్లుగా నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ ఆ హ్వానించడం చర్చనీయాంశమైంది. ‘ఎవరో డబ్బు ఖర్చు చేస్తే.. డింగ్ డింగ్ యల్లమ్మ జాతర’ అన్న చం దంగా అయిందని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలి.. రాయదుర్గం పట్టణంతో పాటు వివిధ మండలాల్లోని ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు తీరికలేదు. ఎమ్మెల్యే అజమాయిషీతో.. ప్రైవేటు వ్యక్తి చేస్తున్న శ్రీనివాస కల్యాణోత్సవ ఏర్పాట్ల పనుల్లో ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా ఆర్డీఓ రామారావు సైతం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి తన సమయం వెచ్చించడం గమనార్హం. కృష్ణా పుష్కరాల పేరుతో రెండు వారాలపాటు అధికారులు, సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డ ప్రజలకు శ్రీనివాస కల్యాణోత్సవం పేరుతో మరో వారం రోజులు కష్టాలు తప్పలేదు. పాలకుల మెప్పు పొందడం కోసం అధికారులు తమ సిబ్బందిని పురమాయించి పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. -
5 నుంచి ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి కల్చరల్: టీటీడీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు టీటీడీ పీఆర్వో టి.రవి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న విజయనగరం జిల్లా గుమ్మా లక్ష్మీపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 7న విశాఖ జిల్లా జి.మాడుగుల మండల కేంద్రంలోని రామాలయంలో, 11న గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాజవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 12న తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని సోమేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 27న తమిళనాడు శివగంగ జిల్లా దేవకొట్టై మండల కేంద్రంలోని ఎన్ఎస్ఎంవీపీఎస్ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారని తెలిపారు.