
‘లై’ సినిమాతో నిరాశపరిచిన నితిన్ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కల్యాణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ను పరిశీస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సనరస మరోసారి లై ఫేం మేఘా ఆకాష్ నటిస్తోంది. ఈ సినిమా తరువాత నితిన్ చేయబోయే సినిమా ఇప్పటికే ఫైనల్ అయ్యింది.
దిల్ రాజు బ్యానర్ లో శమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న తెరకెక్కించనున్న శ్రీనివాస్ కళ్యాణం సినిమాలో నటించనున్నాడు నితిన్. ఎంతో మంది హీరోల చేతుల మారి చివరకు నితిన్ చేతికి వచ్చింది ఈ సినిమా. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని భావించారట. కానీ సాయి పల్లివి ఇంట్రస్ట్ చూపించకపోవటంతో పూజ హెగ్డేను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. పూజ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment