‘శ్రీనివాస కళ్యాణం’కు ముహూర్తం ఫిక్స్‌ | Nithin Srinivasa kalyanam Release Date | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 4 2018 10:24 AM | Last Updated on Wed, Jul 4 2018 11:10 AM

Nithin Srinivasa kalyanam Release Date - Sakshi

శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన సతీష్ వేగేశ్న ప్రస్తుతం నితిన్‌ హీరోగా శ్రీనివాస్ కళ్యాణం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. గోదావరి జిల్లాలతో పాటు ఛండీఘర్‌లో చిత్రకరణ పూర్తి చేశారు.

ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా ప్రారంభమైన ఈ సినిమాను ఆగస్టు 9న రిలీజ్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. తాజా చిత్రయూనిట్ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. లై, ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో శ్రీనివాస కళ్యాణం సక్సెస్‌ నితిన్‌ కెరీర్‌కు కీలకంగా మారింది. నందితా శ్వేత మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement