‘శ్రీనివాస కల్యాణం’కు ముహూర్తం ఫిక్స్‌ | Nithin Srinivasa Kalyanam Release Date | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 18 2018 3:41 PM | Last Updated on Wed, Apr 18 2018 3:41 PM

Nithin Srinivasa Kalyanam Release Date - Sakshi

శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన సతీష్ వేగేశ్న ప్రస్తుతం నితిన్‌ హీరోగా శ్రీనివాస్ కల్యాణం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ గోదావరి జిల్లాల్లో పూర్తయ్యింది. 

ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను ఛండీఘర్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను జూలై 24న రిలీజ్‌ చేయాలని ముహూర్తం ఫిక్స్‌ చేశారు. లై, ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో శ్రీనివాస కల్యాణం సక్సెస్‌ నితిన్‌ కెరీర్‌కు కీలకంగా మారింది. నందితా శ్వేత మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement