‘శ్రీనివాస కళ్యాణం’ మొదలైంది | Nithin Srinivasa Kalyanam Shoot Begins | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 4 2018 10:09 AM | Last Updated on Sun, Mar 4 2018 10:13 AM

Nithin Srinivasa Kalyanam Shoot Begins - Sakshi

‘శ్రీనివాస కళ్యాణం’ మూవీ ఫస్ట్‌ లుక్‌

శతమానం భవతి లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శ్రీనివాస కళ్యాణం. ఎంతో మంది పేర్లు పరిశీలించిన తరువాత చివరకు నితిన్‌ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రాశీఖన్నా నటిస్తోంది.

ఈ రోజు (ఆదివారం) వేల కళ్యాణాలు జరుగుతుండగా ఈ శ్రీనివాస కళ్యాణం షూటింగ్‌ను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్‌. షూటింగ్ మొదలైన సందర్భంగా ఓ వీడియో టీజర్‌ను రిలీజ్‌ చేశారు. టైటిల్‌ లోగోపాటు హీరోహీరోయిన్లు పెళ్లి పీటలపై పరిచయం చేశారు.  నదింతా శ్వేత, ప్రకాష్‌ రాజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement