Nithin
-
డబ్బు కోసం ఏమైనా చేసే 'రాబిన్ హుడ్' టీజర్ విడుదల
'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. -
అమరన్ సక్సెస్.. నితిన్ సినిమా సాంగ్ పాడిన శివ కార్తికేయన్
-
అమరన్ సక్సెస్.. నితిన్ సినిమా సాంగ్ పాడిన శివ కార్తికేయన్
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అమరన్. వీరసైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆరు రోజుల్లో రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో బుధవారం నాడు హైదరాబాద్‌లో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో నితిన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.మా నాన్న కూడా..శివకార్తికేయన్ మాట్లాడుతూ.. అమరన్ సినిమాలో ముకుంద్ క్యారెక్టర్ చేయడానికి కారణం మా నాన్న. ఆయన పోలీసాఫీసర్. డ్యూటీలోనే మరణించారు. సినిమా రిలీజైనప్పటినుంచి నితిన్ ప్రతిరోజు కాల్ చేసి అప్డేట్స్ చెప్తూనే ఉన్నారు అని పేర్కొన్నాడు. అభిమానుల కోసం ఓ పాట కూడా పాడాడు. ఓ ప్రియా ప్రియా.. తెలుసా నీకైనా.. అంటూ నితిన్ ఇష్క్ సినిమాలోని పాటను రెండు లైన్లు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సినిమాఅమరన్ సినిమా విషయానికి వస్తే ఇందులో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
సత్య టాలెంట్‌ను మొదట గుర్తించిన హీరో ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ ఎవరైనా ఉన్నారా? అంటే అందులో సత్య ముందు వరుసలో ఉంటాడు. 'మత్తు వదలరా' సీక్వెల్‌తో ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాడు. ఎక్కడ చూసినా సత్య కామెడీ క్లిప్పులే కనిపిస్తున్నాయి. ఇంత మంచి నటుడిని టాలీవుడ్‌కు పరిచయం చేసింది.. తనలో కమెడియన్‌ను గుర్తించి ఎవరో తెలుసా? హీరో నితిన్.తెలిసేది కాదుఈ విషయాన్ని సత్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హీరో నితిన్, రచయిత హర్షవర్ధన్, నిర్మాత డీఎస్ రావు.. వీళ్లే నాలో నటుడున్నాడని గ్రహించారు. మొదట్లోనేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడిని. అప్పుడు నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. అందరితోనూ ఒకేలా మాట్లాడేవాడిని. సర్, షార్ట్ రెడీ.. అని పిలిచేవాడిని కాదు.. ఇదిగో మిమ్మల్ని రమ్మంటున్నారు.. వెళ్లండి.. ఇలా అమలాపురం యాసలోనే చెప్పేవాడిని. ఆ హీరో సలహా ఇవ్వడమేగాకనా మాటలు విన్నాక నితిన్ గారు నువ్వు యాక్టర్ అవ్వు, బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా బలవంతంగా నాతో యాక్టింగ్ చేయించారు. అలా నెమ్మదిగా నటుడిగా మారాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన సత్య అభిమానులు.. ఇంత మంచి నటుడిని అందించిన నితిన్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. కాగా నితిన్ ద్రోణ (2009) సినిమాకు సత్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.కమెడియన్‌గా, హీరోగాఇతడు జబర్దస్త్ షోలోనూ పాల్గొన్నాడు. పిల్ల జమీందార్ చిత్రంతో గుర్తింపు అందుకున్నాడు. స్వామిరారా మూవీతో కమెడియన్‌గా పాపులర్‌గా అయ్యాడు. చలో సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు. గతంలో మత్తు వదలరా చిత్రంతో, ఇప్పుడు దాని సీక్వెల్‌తో ఆడియన్స్‌కు నవ్వుల విందు వడ్డించాడు. Thanks @actor_nithiin anna oka manchi actor ni maku ichav #MathuVadalara2 #Satya #Devara pic.twitter.com/hYPSWUG5kP— surya k (@naistam2k) September 15, 2024 చదవండి: జాన్వీ కపూర్ టాలెంట్ చూసి షాకయ్యా..: జూనియర్ ఎన్టీఆర్ -
బన్నీ, నాని స్టోరీస్ తో నితిన్ సినిమా..
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ దంపతులు
టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి షాలిని కొద్దిసేపటి క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సోషల్‌మీడియా ద్వారా నితిన్ ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా నితిన్ పంచుకున్న ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.2020లో నితిన్, షాలిని కందుకూరిల వివాహం జరిగింది. తన చిరకాల స్నేహితురాలు అయిన షాలినితో ప్రేమలో పడిన నితిన్ ఏడడుగుల బంధంతో కలిసి నడిచారు. వీరిద్దరి పెళ్లి అయి సుమారు నాలుగేళ్లు అవుతుంది. అయితే, ఇప్పుడు నితిన్ ఇంటికి వారసుడు రావడంతో అయన అభిమానులు సందడిగా కామెంట్లు పెడుతున్నారు.గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఎక్స్ట్రా.. ఆర్డినరీ మ్యాన్' అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నితిన్ బలమైన కథతో ఈసారి ముందుకు రానున్నాడు. సరికొత్త కథతో ‘తమ్ముడు’గా అలరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్' కూడా లైన్లో ఉంది. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. రాబిన్‌హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. -
హ్యాట్రిక్‌పై కన్నేసిన ఎన్టీఆర్ బామ్మర్ది.. ఆ హిట్ మూవీ డైరెక్టర్‌తో !
మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాలతో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దిగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపుతో మరో చిత్రానికి రెడీ అయ్యారు. తాజాగా "శతమానం భవతి" డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంపద హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు రానుంది.ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ... 'హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి ఫీల్ గుడ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్నారు. వీటికి భిన్నంగా మా సినిమా ఉంటుంది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్లో దర్శకుడు సతీష్ వేగేశ్నతెరకెక్కించారు .ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం' అని అన్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి కీలక పాత్రల్లో నటించారు. -
మా అక్క ఎక్కువగా కలవదు మాట్లాడదు
-
ఫుల్ ఫన్ బాత్... ఆయ్: నార్నే నితిన్
‘‘కులం, మతం కంటే స్నేహం చాలా గొప్పది అనే సందేశాన్ని ‘ఆయ్’ సినిమాలో వినోదాత్మకంగా చూపించాం. ఈ నెల 15న చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే మా ‘ఆయ్’ కి ఉండాల్సిన ఆడియన్స్ మాకున్నారని అనుకుంటున్నాం. మంచి వినోదంతో కూడిన గోదావరి నేపథ్యంలో సినిమా వచ్చి చాలా రోజులైంది. ‘ఆయ్’ని కచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం’’ అని నార్నే నితిన్ అన్నారు. హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఆయ్’. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నార్నే నితిన్ మాట్లాడుతూ–‘‘ అంజి కె.మణిపుత్రది అమలాపురం. ఆయన లైఫ్‌లో చూసినవన్నీ కలిపి చేసిన సినిమానే ‘ఆయ్’. ఈ చిత్రంలో ఫుల్ ఫన్ ఉంటుంది కాబట్టి పోస్టర్స్‌లో అంతా ఫన్ బాత్ అని పెట్టాం.. ఇది డైరెక్టర్‌గారి ఆలోచనే. గోదావరి యాసలో ఆయ్ అనే పదాన్ని సాధారణంగా వాడుతుంటాం. ఆ నేపథ్యంలో సాగే ఈ మూవీకి ‘ఆయ్’ కరెక్ట్ టైటిల్ అని అల్లు అరవింద్‌గారు చెప్పడంతో ఫిక్స్ చేశారు. ‘మ్యాడ్’ చిత్రంలో కథకు తగ్గట్టు బిహేవ్ చేశాను. ‘ఆయ్’లో కథకు తగ్గట్టు నటించాను. గీతా ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థలో సినిమా చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నయన్ సారిక మరాఠీ అమ్మాయి అయినా అచ్చ తెలుగమ్మాయిలా ఉంటుంది. తన పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. రామ్ మిర్యాలగారు మూడు పాటలకు సంగీతం అందించారు.అలాగే అజయ్ అరసాడగారు రెండు పాటలకు మ్యూజిక్ ఇవ్వడంతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చారు. ఎన్టీఆర్‌గారు ‘ఆయ్’ ట్రైలర్ చూశారు. అందులోని కామెడీని ఎంజాయ్ చేశారు. సినిమా చూసిన తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి అలాంటి స్పందన వస్తే బావుంటుందనిపిస్తోంది. ప్రస్తుతం ‘మ్యాడ్ 2’ మూవీలో నటిస్తున్నా’’ అన్నారు. -
ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే?
జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్.. 'మ్యాడ్' సినిమాతో నటుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఓ మాదిరి యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇతడి రెండో సినిమా 'ఆయ్'. గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌తో తీశారు. ఆగస్టు 15న భారీ చిత్రాలతో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)'ఆయ్' ట్రైలర్ చూస్తే.. విలేజీలో ముగ్గురు కుర్రాళ్లు. అందులో హీరో ఒకడు. ఒకమ్మాయితో ప్రేమ, తర్వాత జరిగిన పర్యవసనాలేంటి? అనేది స్టోరీ లైన్ అనిపిస్తోంది. అయితే ఫుల్ ఆన్ కామెడీగా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ట్రైలర్లోనూ డబుల్ మీనింగ్ లాంటి డైలాగ్స్ ఉన్నాయి. అంటే సినిమాలోనూ ఇలాంటివి ఉండొచ్చు. ట్రైలర్ అయితే ఫన్నీగా బాగానే ఉంది. కాకపోతే 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'తంగలాన్' సినిమాలతో పోటీని తట్టుకుని ఎంత మేరకు థియేటర్లలో నిలబడుతుందనేద పెద్ద టాస్క్. నిర్మించింది గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్ల పరంగా ఢోకా ఉండకపోవచ్చు. కానీ 'ఆయ్'కి హిట్ టాక్ కూడా ముఖ్యమే. ఒకవేళ మిగతా సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం 'ఆయ్' పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రశ్న. తొలి సినిమా 'మ్యాడ్'తో హిట్ కొట్టిన తారక్ బావమరిది.. రెండో సినిమాతో ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు/ సిరీస్‌లు రిలీజ్) -
టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‌హుడ్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి నితిన్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో నితిన్ వృద్ధుడి గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. వాస్తవంగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆయన గెటప్ ఉంది. ఫేస్ యాప్, ఏఐ టెక్నాలజీ వంటి సాంకేతికతను ఉపయోగించి అలా వీడియోను క్రియేట్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. రాబిన్‌హుడ్ సినిమాలో నితిన్ ఇలాగే కనిపించనున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబిన్‌హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.Pulling each other's legs is our daily routine on #Robinhood sets..@actor_nithiin anna & @sreeleela14 😂🙈 pic.twitter.com/pTp4yiO32o— Venky Kudumula (@VenkyKudumula) July 11, 2024 -
ఏషియన్ గ్రూప్స్‌తో మరో స్టార్ హీరో మల్టీఫ్లెక్స్ ప్లాన్
టాలీవుడ్ హీరో నితిన్ వరుస సినిమాలతో కొద్దిరోజుల్లో సందడి చేయనున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే ఆయన పెరిగారు. అందుకే తన సోదరి నిఖితతో కలిసి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌ను స్థాపించి పలు సినిమాలను కూడా నిర్మించారు. తాజాగా నితిన్ మరో అడుగు ముందుకు వేశారు. హైదరాబాద్‌లో మల్టీఫ్లెక్స్ థియేటర్‌ను స్థాపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్ పేజీ నుంచి ఒక ఫోటో విడుదలైంది.మహేశ్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి స్టార్స్ ఇప్పటికే ఏషియన్ సినిమాస్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని మల్టీఫ్లెక్స్‌లు నిర్మించారు. త్వరలో బెంగళూరులో AMB ప్రారంభం కానుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో రవితేజ ART కూడా త్వరలో ప్రారంభం కానుంది. అయితే, హీరో నితిన్ కూడా సంగారెడ్డి ప్రాంతంలో ఏషియన్ నితిన్ సితార పేరుతో ఒక మల్టీఫ్లెక్స్ నిర్మిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయనకు సంబంధించిన ఫ్యాన్ పేజీలలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే థియేటర్ పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఓపెనింగ్ కానున్నట్లు సమాచారం.నితిన్ సినిమాల విషయానికి వస్తే.. తమ్ముడు త్వరలో విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కాంతార ఫేం సప్తమి గౌడ నటిస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ లయ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్' చిత్రంలో కూడా నితిన్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by N I T H I I N ✨⚡ (@teamnithiin_) -
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
-
సెంటిమెంట్... అడ్వెంచర్
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తమ్ముడు’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శనివారం (మార్చి 30) నితిన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘భీష్మ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘రాబిన్ హుడ్’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
హీరో నితిన్ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు..
-
నితిన్ 'తమ్ముడు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో నితిన్ నేడు (మార్చి 30) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో నితిన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'తమ్ముడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన మేకర్స్.. నేడు నితిన్ పుట్టినరోజు కావడంతో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాని దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమవుతున్న 56వ సినిమాగా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లో నితిన్ కాస్త డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఆడవాళ్లు లారీ తోలుతుంటే లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్ నుంచి ఈ పోస్టర్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. నితిన్- దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో మరో సినిమాను రానుంది. వీరిద్దరి కాంబోలో ఇష్క్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నితిన్ భారీ హిట్ అందుకున్నాడు. A story of ambition, courage, and determination🎯 Presenting the passion-filled first look of #THAMMUDU ❤️🔥 Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️🎉#HBDNithiin A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ — Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024 -
రాబిన్‌హుడ్ టైటిల్ గ్లింప్స్
-
షూటింగ్లో గాయపడ్డ హీరో నితిన్?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు గాయాలు అయినట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'తమ్ముడు' అనే సినిమా షూటింగ్లో పాల్గొన్న నితిన్‌కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. అక్కడ భారీ యాక్షన్ సీన్లో పాల్గొన్న నితిన్‌కు ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారట. నితిన్‌కు సుమారు మూడు వారాలపాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారట. గతేడాదిలో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం 'ఎక్స్ట్రా - ఆర్డినరి మ్యాన్'తో ఆయన అంతగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. దీంతో దిల్ రాజు బ్యానర్లో వస్తున్న ఈ చిత్రంతో హిట్ కొట్టాలని నితిన్ ఉన్నాడు. గతంలో ఇదే బ్యానర్లో 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంలో ఆయన నటించిన విషయం తెలిసిందే. అక్కా, తమ్ముడు అనుబంధం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే ఈ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. చాలారోజుల నుంచి ఒక సూపర్ హిట్ సినిమా తీసి తన ఫ్యాన్స్‌కు ఆయన గిఫ్ట్‌గా ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో తమ్ముడు చిత్రం కోసం ఆయన ఎక్కువగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో షూటింగ్ స్పాట్లో ఆయనకు ప్రమాదం జరిగింది అనే వార్త బయటకు రావడంతో నితిన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ప్రమాదం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా రాలేదు. -
Extra Ordinary Man OTT: సంక్రాంతికి ఓటీటీలో రానున్న నితిన్ సినిమా
నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం 'ఎక్స్ట్రా - ఆర్డినరి మ్యాన్'. వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. మంచి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా డిసెంబర్ 8న విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమాలో ఎక్కవగా కామెడీ ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. రైటర్‌గా మెప్పించిన వక్కంతం వంశీ.. డైరెక్టర్‌గా మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్ సినిమాకు కొంత నెగటివ్ టాక్ వచ్చింది. ఇదే సమయంలో నాని నటించిన హాయ్ నాన్న చిత్రం కూడా విడుదలై మంచి టాక్ రావడంతో నితిన్ సినిమా కలెక్షన్స్‌పై కూడా ప్రభావం చూపింది. ఈ చిత్రంలో నితిన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన విభిన్నమైన పాత్రలో నటించడం విశేషం. ఈ సంక్రాంతికి ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్ ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుందని భారీగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫిషీయల్ ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రాజశేఖర్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, పవిత్రా నరేష్, హైపర్ ఆది తదితరులు నటించారు. -
నితిన్ 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' టాక్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ హీరో నితిన్ 32వ సినిమా 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' నేడు (డిసెంబర్ 8) విడుదలైంది. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించగా.. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్ అని సినిమా విడుదలకు ముందు నితిన్ చెప్పడం విశేషం. ప్రేక్షకుల్ని నవ్వించాలన్న ఒకే లక్ష్యంతో ఈ చిత్రాన్ని చేశామని ఆయన చెప్పాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని చెప్పుకొచ్చాడు నితిన్. తాజాగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఫుల్ కామెడీ ఉందని ఎంజాయ్ చేస్తున్నారు. భీష్మ తర్వాత నితిన్‌కు సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైన ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఎక్స్ట్రా ఆర్డనరీ మ్యాన్ ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించడం విశేషం. ఈ క్యారెక్టర్లో ఆయన ఫర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని, అతడి కామెడీ టైమింగ్ కూడా బాగుందని నెటిజన్లు చెబుతోన్నారు. 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' ఫుల్ ఫన్‌తో కూడిన చిత్రమని చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా నితిన్ సరికొత్త రోల్లో కనిపించి అదరగొట్టాడని నెటిజన్లు తెలుపుతున్నారు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. ఈ సినిమాకు రావు రమేష్ పాత్ర ప్రధాన బలం అని ఒకరు చెబుతుంటే.. ప్రత్యేక పాత్రలో కనిపించిన రాజశేఖర్ కూడా భారీగానే వినోదాన్ని పంచాడని తెలుపుతున్నారు. ద్వితీయార్దంలో అయితే ఫుల్ ఫన్‌గా కొనసాగుతుందని కామెంట్లు చేస్తున్నారు. రాజశేఖర్ రోల్ తక్కువే అయినా ఆయన కనిపించిన సీన్స్ మొత్తం ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం కథలో ఎలాంటి కొత్తదనం లేదని తెలుపుతున్నారు. అవుట్ డేటెడ్, డిజాస్టర్ అని కామెంట్లు పెడుతున్నారు. వక్కంతం వంశీ ఆర్డినరీ కథనే చెప్పాడని తెలుపుతున్నారు. ద్వితియార్థం నుంచి థియేటర్లో నవ్వులు తెప్పిస్తాయని తెలుపుతున్న నెటిజన్లు.. సినిమా మాత్రం ఎలాంటి డిస్పాయింట్మెంట్కు గురిచేయదని తెలుపుతన్నారు. Hit Kottesam Anna @actor_nithiin #ExtraOrdinaryMan 💓💥 pic.twitter.com/teygT9ygvx — N I T H I I N 🤍🕊 (@MNP_FOLLOWERS) December 8, 2023 One Night Away For #ExtraOrdinaryMan Outdated Music Director @Jharrisjayaraj Asal Edu Mottam Pata Instruments & Worst Production Values @sreshthmoviesoffl Whats Remaining Except Script & Screen Presence Of #ExtraordinaryManFromTomorrow pic.twitter.com/rpUrlet3ut — GK (@Adithya_7M) December 7, 2023 First Half Report: Comedy parledu.#Sreeleela tho unna scenes anni reality ga dooram ga unnai . Story kuda outdated anipinchindhi. But few comedy scenes first half ni save chesayane cheppukovali and same time konni comedy scenes over the top unnai #ExtraOrdinaryMan https://t.co/TwVPvZekiz pic.twitter.com/MEf80ys3SU — Filmy Lagoon (@filmylagoon_) December 8, 2023 #ExtraOrdinaryMan - A decent entertainer after quite a while from Tollywood. Nithin throughout the movie chaala energetic ga chesadu at the same time Ekkada overboard vellaledhu. Leela had a limited screen time and she’s okay. Last song aithey energy anantham Hit movie - 3/5 — Peter (@urstruelypeter) December 8, 2023 #ExtraOrdinaryMan - A decent entertainer after quite a while from Tollywood. Nithin throughout the movie chaala energetic ga chesadu at the same time Ekkada overboard vellaledhu. Leela had a limited screen time and she’s okay. Last song aithey energy anantham Hit movie - 3/5 — Peter (@urstruelypeter) December 8, 2023 just now done 1st half Hilarious Comedy with Good Interval let's see 2nd Half...sree #ExtraOrdinaryMan #ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/YDsqSxJWBS — AK Nellore (@AkNellore) December 8, 2023 -
కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు
‘‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో నేను ఎక్స్ట్రార్డినరీ మ్యాన్. కానీ రియల్ లైఫ్‌లో శ్రీ లీల ఎక్స్ట్రార్డినరీ ఉమెన్. ఎందుకంటే వ్యక్తిగతంగా తను డాక్టర్. అలాగే స్విమ్మింగ్, హాకీ, కూచిపూడి, భరతనాట్యం, వీణ.. ఇలా ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. ఇక సినిమాల్లో మంచి యాక్టర్, డ్యాన్సర్. నాకు, దర్శకుడు వంశీకి ఈ చిత్రం చాలా ముఖ్యం. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి.. నిర్మాతలకు లాభాలు రావాలి. సినిమా చూసిన నా అభిమానులు, ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని హీరో నితిన్ అన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీ లీల జంటగా నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు నేను చేయని పాత్రని ఈ చిత్రంలో ఇచ్చిన వక్కంతం వంశీకి థ్యాంక్స్. రాజశేఖర్‌గారు హీరోగా చేసిన ‘మగాడు’ సినిమాతో మా నాన్న (సుధాకర్ రెడ్డి) డిస్ట్రిబ్యూషన్ ఆరంభించారు. ఆ సినిమా హిట్ అవడం వల్లే నాన్న ఇండస్ట్రీలో ఉన్నారు.. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఉన్నాను. రాజశేఖర్ గారు లేకపోతే ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ లేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రం సూపర్ హిట్ కాబోతోంది. అందరం సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ– ‘‘ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్న నితిన్, సుధాకర్ రెడ్డిగార్లకు థ్యాంక్స్. రాజశేఖర్‌గారు లేకుంటే ఈ సినిమాని ఊహించుకునేవాణ్ని కాదు. ఈ మూవీతో రెండున్నర గంటల సేపు కుటుంబాన్ని కడుపుబ్బా నవ్విస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నాది అతిథి పాత్ర. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు డా. రాజశేఖర్. ‘‘ఈ సినిమా అందర్నీ నవ్విస్తుంది.. థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు శ్రీలీల. -
రాసి పెట్టుకోండి.. అందర్నీ నవ్విస్తాం
‘‘నటుడిగా నా 21 ఏళ్ల కెరీర్లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ నా 32వ సినిమా. నేను చేసిన మంచి పాత్రల్లో ఈ చిత్రం నంబర్ వన్ అవుతుంది. వక్కంతం వంశీగారు కథ అందించిన ‘కిక్, రేసు గుర్రం, టెంపర్’ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఉంటుంది. ప్రేక్షకులందర్నీ నాన్ స్టాప్‌గా నవ్విస్తాం’’ అని హీరో నితిన్ అన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్ మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. మంచి కథ, పాటలు, చక్కని డ్యాన్స్ కూడా ఉంటాయి. డిసెంబర్ 8న హిట్ సాధించబోతున్నాం.. ఇది కచ్చితం.. రాసి పెట్టుకోండి’’ అన్నారు. ‘‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి మమ్మల్ని సపోర్ట్ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు ఎన్. సుధాకర్ రెడ్డి. ‘‘అద్భుతమైన ఔట్పుట్ ఇవ్వటానికి నేను, నితిన్ రెండేళ్లు కష్టపడ్డాం. అందర్నీ ఎంటర్టైన్ చేయాలని రెండేళ్లు కష్టపడి చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం’’ అన్నారు వక్కంతం వంశీ. -
నితిన్ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్
తెలుగులో యాంగ్రీ యంగ్‌మేన్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ పేరే. వెండితెరపై ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... టాప్ హీరోగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించి ఎనలేనీ కీర్తి సంపాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలెన్నో ఆయన చేశారు. తాజాగా ఆయన నితిన్ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్ట్రా’లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా "కోటబొమ్మాళి పీఎస్" సినిమా ప్రమోషన్స్‌లో రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు ఓకే చేశారో ఆయన కూతురు శివాని చెప్పింది. 'నాన్నగారికి చాలా రోజుల నుంచి విలన్‌గా చేయాలని కోరిక ఉంది. అందులో భాగంగ కొన్ని కథలు విన్నాడు. కొన్ని నచ్చలేదని పక్కన పెట్టేశాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి, అరవింద స్వామి వంటి టాప్ హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అలా నాన్నగారికి కూడా విలక్షణ పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు బెటర్ స్టోరీ రాలేదు. నితిన్ సినిమాలోని రాజశేఖర పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర ఎంతగానో నచ్చింది.. అందుకే ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర థియేటర్లో అదిరిపోతుంది.' అని శివాని తెలిపింది. 'కోటబొమ్మాళి పీఎస్' మూవీ గురించి శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. ఇది నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి.. చివరికి ఇలా.. అసలు కారణాలేంటి?
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల, ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంకు చెందిన గద్దల బాలయ్య, దేవవ్వ దంపతుల కుమారుడు నితిన్ ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లాడు. తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నితిన్ తల్లిదండ్రులకు ఒక్కాగానొక్క కుమారుడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా..