
హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్‌కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేడు(ఆగస్టు12)న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా హీరో నితిన్ భార్య షాలినితో కలిసి హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను వీక్షించారు. వీరితో పాటు నిర్మాత శిరీష్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment