Macherla Niyojakavargam Movie
-
OTT release : 'యశోద', 'ఊర్వశివో రాక్షసివో' మూవీస్ థియేటర్స్‌లో మిస్ అయ్యారా?
సినీ అభిమానులకు శుక్రవారం వచ్చిందంటే పండగే. ఎందుకంటే సినిమాలు చాలావరకు ఆరోజే రిలీజ్ అవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. థియేటర్లో సినిమా మిస్ అయిన వాళ్లు ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. మరి ఒకేరోజు ఓటీటీలో మూడు సినిమాలు విడుదలైతే? ఈ శుక్రవారం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. సమంత ప్రధాన పాత్రలో నటించి యశోద సినిమా రీసెంట్గా హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ. 30కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీని థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. రేపు( శుక్రవారం) యశోద సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హీరో నితిన్, కృతిశెట్టి హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. హీరో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేట్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా శిరీష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయింది.డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ఊర్వశివో రాక్షసివో. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేయండి మరి. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న మాచర్ల నియోజకవర్గం..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరో నితిన్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, కేథరిన్ థ్రేసా జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ చిత్రం'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. తొలి షో నుంచే ఫ్లాప్‌టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (చదవండి: కలెక్టర్‌గా నితిన్ మెప్పించాడా? 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రివ్యూ) అసలు కథేంటంటే..: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ అందుకున్న హీరో ఫ్యాక్షన్‌ను తలపించే మాచర్ల నియోజకవర్గ రూపురేఖలను ఎలా మార్చాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్న కథాంశంతో నూతన దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించారు. నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ నటించారు. ఈ చిత్రం ఓటీటీలో చాలా ఆలస్యంగా వచ్చింది. -
ఓటీటీకి మాచర్ల నియోజకవర్గం.. అక్కడే స్ట్రీమింగ్!
హీరో నితిన్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. తొలి షో నుంచే ఈ మూవీ ఫ్లాప్‌టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, స్పెషల్ సాంగ్ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎలాగైన ఈసారి హిట్ కొట్టాలని ఎదురు చూసిన నితిన్‌ను మాచర్ల నియోజకవర్గం నిరాశ పరిచింది. చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు బిగ్‌స్రీన్‌పై పెద్దగా సందడి లేని ఈ చిత్రం త్వరలో ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 9న మాచర్ల నియోజకవర్గంను ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. ఇక థియేటర్లో నిరాశ పరిచిన ఈ మూవీ సందడి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకొనుంది వేచి చూడాలి. -
నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి: హీరో నితిన్
‘‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని నమ్మాను.. ఈ సినిమాతో నా నమ్మకం మరోసారి నిజమైంది’’ అని నితిన్ అన్నారు. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా, కృతీ శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటింన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలయింది. శనివారం థ్యాంక్స్ మీట్లో నితిన్ మాట్లాడుతూ– ‘‘చాలాకాలం తర్వాత నా జోనర్‌ని మార్చి యాక్షన్‌లోకి వెళ్లాను.. ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. యాక్షన్, కామెడీ సీన్స్‌కి ప్రేక్షకుల చప్పట్లు, విజిల్స్ నాలో ఉత్సాహాన్నిచ్చాయి. ఈ సమయంలో ఇంత మంచి ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిఖితా రెడ్డి. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. ‘‘మా చిత్రం తొలి రోజే రూ. 10కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు కృతీ శెట్టి. -
భార్యతో కలిసి ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా చూసిన నితిన్
హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్‌కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు(ఆగస్టు12)న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా హీరో నితిన్ భార్య షాలినితో కలిసి హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్లో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను వీక్షించారు. వీరితో పాటు నిర్మాత శిరీష్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
కలెక్టర్‌గా నితిన్ మెప్పించాడా? 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రివ్యూ
టైటిల్: మాచర్ల నియోజకవర్గం నటీనటులు: నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి దర్శకత్వం: ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి సంగీతం: మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరేళ్ల విడుదల తేది: ఆగస్టు 12, 2022 నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా హీరోహీరోయిన్లుగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘'మాచర్ల నియోజకవర్గం'’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్టు 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ: సిద్ధార్థ రెడ్డి (నితిన్) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ పొందుతాడు. అక్కడ కొన్ని ఏళ్లపాటు ఎన్నికలు జరగవు. అందుకు కారణం రాజప్ప అని తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో సిద్ధార్థ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: ఎప్పుడు ప్రేమకథా చిత్రాలతో అలరించిన నితిన్.. అందుకు భిన్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ముందుకొచ్చాడు. సినిమాలో పాలిటిక్స్, కలెక్టర్ విధులు చూపిస్తూనే కామెడీని పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి. కొత్త డైరెక్టర్ కొత్త ఫార్ములాతో వస్తే బాగుండేది. కానీ రెగ్యూలర్ రొటీన్ ఫార్ములాతో తెరపై 'మాచర్ల నియోజకవర్గం'ను ఆవిష్కరించాడు. అక్కడక్కడ స్క్రీన్‌ప్లే కొద్దిగా స్లో కావడంతో సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక నితిన్‌ను కొత్తగా చూపించారు. కలెక్టర్‌గా నితిన్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎవరెలా చేశారంటే? గుంటూరు కలెక్టర్ సిద్ధార్థ రెడ్డిగా నితిన్ కొత్తగా కనిపించాడు. స్టైలిష్ లుక్ నుంచి నటన, అభినయం వరకు ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాలతోపాటు ఫైటింగ్ సీన్లలో మెప్పించాడు. ఇక స్వాతి పాత్రలో హీరోయిన్ కృతీశెట్టి నటన అలరిస్తుంది. కేథరీన్ థ్రేసా తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్ర ఖని విలనిజం, వెన్నెల కిశోర్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. తదితర పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సన్నివేశాలు తగినట్లుగా బీజీఎం ఆకట్టుకుంది. ఇక అంజలి మెరిసిన రారా రెడ్డి ప్రధానాకర్షణగా నిలిచింది. ఫైనల్‌గా రొటీన్ ఫార్ములాతో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ఉంది. -
హీరో నితిన్ తో రక్షా బంధన్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
‘మాచర్ల నియోజకవర్గం’మూవీ ట్విటర్ రివ్యూ
యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రం'మాచర్ల నియోజకవర్గం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘మాచర్ల నియోజకవర్గం’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (ఆగస్ట్ 12)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ► సినిమా వేరే లెవల్లో ఉందని.. మాస్ ఎంటర్టైనర్ అని ఓ అభిమాని ట్విటర్లో కామెంట్ చేశాడు. #MacherlaNiyojakavargam Vere level 💥💥 — Sanjay Saahu 🦅 💎 (@MikePanja) August 12, 2022 ► వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. ఇంటర్వెల్ సీన్, సెకండాఫ్ సినిమాకు చాలా కీలకమని ఓ అభిమాని పేర్కొన్నాడు. 1 hr into the movie… Not much going on story wise but @vennelakishore comedy keeps up the movie 👍… Interval and second half will be crucial #MacherlaNiyojakavargam — Rakita (@Perthist_) August 12, 2022 ► సినిమాలో కొత్తదనం లేదని, రొటీన్ స్క్రిప్ట్ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఫస్టాఫ్ మరీ యావరేజ్‌గా ఉందని చెప్పాడు. #MacherlaNiyojakavargam Strictly Below Average 1st Half! Other than a few Vennela Kishore scenes nothing really works so far. Probably one of the most routine scripts and screenplays in recent times. Need a big 2nd half! — Venky Reviews (@venkyreviews) August 12, 2022 ► సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అని ఓ అభిమాని హర్షం వ్యక్తం చేశాడు. #MacherlaNiyojakavargam block buster no .1 telangana megastar @actor_nithiin ..... andhra's jealous of megastar of telangana... common telangana support our megastar — vinc go (@vincgo2) August 12, 2022 ► పాటలు, బీజీఎం పెద్దగా ఆకట్టుకోలేదని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. నితిన్ గత సినిమా భీష్మలో 50 శాతం కూడా మాచర్ల నియోజకవర్గం ఆకట్టుకోలేదని అన్నాడు. Songs and BGM as well not good , bheeshma lo not even 50% #MacherlaNiyojakavargam — NTR30 (@kiran_nine) August 12, 2022 ► వెన్నెల కిశోర్ కామెడీ పండిందని ఓ అభిమాని ట్విటర్లో వెల్లడించాడు. #MacherlaNiyojakavargam poor first half 🙃 Vennala Kishore comedy ✅ worked in some parts 👍#nithin #KrithiShetty#MacherlaNiyojakavargamreview — tollywood_united (@united_tolly) August 12, 2022 ► సినిమా బాగుందని ఓ నెటిజన్ హార్ట్ ఎమోజీ ట్వీట్ చేశాడు. ST: #MacherlaNiyojakavargam @actor_nithiin ❤️ — #TheLegendSarvana Fan 🤗 (@MedaramSampath) August 12, 2022 ► వెన్నెల కిశోర్ కామెడీ బాగుందని, ఫస్టాఫ్ యావరేజ్ అని ఓ అభిమాని ట్విటర్లో వెల్లడించాడు. సినిమాకు కీలకమైన ‘అసలు కథ’ ఇప్పుడే మొదలైందని చెప్పుకొచ్చాడు. 1st half : VENNELA KISHORE COMEDY BIG PLUS 👍 SONGS OKAYISH 😌 ROUTINE DRAMA.. INTERVAL BAGUNDI👍 IPPUDEE ASALU KATHA MODALAINDI.. OVERALL AVG 1ST HALF ✅️ @tollymasti #tollymasti . .#MacherlaNiyojakavargam #MacherlaNiyojakavargamReview #Nithin #MacherlaNiyojakavargamUsa — Tollymasti (@tollymasti) August 12, 2022 -
నితిన్‌కి రాఖీ కట్టిన సింగర్ మంగ్లీ.. గిఫ్ట్ ఇచ్చిన హీరో
నితిన్, కృతీశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది. తాజాగా నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సింగర్ మంగ్లీ నితిన్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను షేర్ చేసుకున్న నితిన్‌కు ఇంటర్వ్యూ చివర్లో మంగ్లీ రాఖీ కట్టింది. దీంతో నితిన్ ఆమెకు బ్యూటిఫుల్ గిఫ్ట్‌ను అందించారు. -
ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్
Nithiin About Macherla Niyojakavargam Movie: యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ 'రారా రెడ్డి'లో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో హీరో నితిన్ మీడియా సమావేశంలో నితిన్ పంచుకున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్ర విశేషాలివి. ►కథ కొత్తగా యూనిక్ గా వుంటుంది. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. నేను ఐఎఎస్ పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. మాస్ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్ లో చాలా ఫ్రెష్ నెస్ వుంటుంది. నేను సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచి పాటలు, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యాన్స్ కి పండగలా ఉంటుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి రోజు మొదటి ఆటకి నేనూ థియేటర్ కి వెళ్తా. ►ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏమీ లేదు. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రేమ కథలు చేసి కొంత బోర్ ఫీలింగ్ వచ్చింది. డిఫరెంట్ గా చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలనే అలోచనతో 'మాచర్ల నియోజకవర్గం' చేశా. ఇది ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. పవర్ ఫుల్ రోల్. మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ►కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో ఉండే కథ చాలా యూనిక్‌గా వుంటుంది. పొలిటికల్ నేపథ్యంలో ఇది వరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ మాచర్ల లో ఉండే పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. కమర్షియల్ ఫార్మెట్ లో ఉంటూనే కొత్త పాయింట్ తో ఉంటుంది. ►2017 'లై 'షూటింగ్ సమయంలో తన ఎడిటింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతున్నపుడు తను ఇన్ పుట్స్ కూడా బావుండేవి. ''నువ్వు డైరెక్టరైతే బావుంటుంది'' అని అప్పుడే చెప్పాను. నేను చెప్పిన తర్వాత తనలో ఆలోచన మొదలైయింది. కోవిడ్ సమయంలో ఇంట్లో ఉంటూ కథ రాసుకున్నాడు. నాకు చెప్పినపుడు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేశాను. ►శేఖర్ ఎడిటర్ కావడం వలన షాట్ కటింగ్స్, సీన్ ఓపెనింగ్స్, లెంత్ విషయంలో చాలా క్లారిటీ వుంది. తను ఏది చెప్పాడో స్క్రీన్ మీద అదే కనిపించింది. శేఖర్ ఎడిటర్ కావడం వల్ల .. ఎంత కావాలో అంతే తీశాడు. దీంతో వృథా తగ్గింది. మాచర్లలో చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా కాష్టం. ఐతే శేఖర్ నేను అనుకున్న దానికి కంటే అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. చాలా అనుభవం ఉన్న దర్శకుడి లాగా తీశాడు. ►శేఖర్ ఒక ఫీల్డ్ మార్చి మరో ఫీల్డ్ కి వస్తున్నాడు. ఇక్కడ ఏదైనా తేడా వస్తే మళ్లీ ఆ ఫీల్డ్ కి వెళ్లాలి. అందుకే ఈ సినిమా నాకంటే కూడా తనకే ఎక్కువ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ►ఈ విషయంలో దర్శకుడు శేఖర్ చాలా హోం వర్క్ చేశారు. చాలా మంది ఐఏఎస్ అధికారులని కలవడం, వాళ్ల బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి, షూటింగ్ సమయంలో ఎక్కడ హుందా గా ఉండాలి, ఎక్కడ మాస్‌గా ఉండాలనేది తనే చెప్పాడు. ►మాచర్ల నియోజకవర్గం కంప్లీట్ ఫిక్షనల్ స్టొరీ. దర్శకుడు శేఖర్‌ది గుంటూరు. మాచర్ల అనే టైటిల్లో ఒక ఫోర్స్ ఉంది. అందుకే మాచర్ల నియోజికవర్గం అని టైటిల్ పెట్టాం. సముద్రఖని గారికి శేఖర్ కథ చెప్పినపుడు.. తమిళనాడులో ఇలాంటి ఇన్సిడెంట్ ఉందని సముద్రఖని గారు అన్నారు. ►ఐఏఎస్ అంటే క్లాస్ అనుకుంటాం. కానీ ఆ పాత్ర మాస్ గా ఉంటే ఎలా ఉంటుందనే కొత్త అలోచనతోనే ఫ్రెష్ గా వెళ్లాం. ►ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ కామెడీ వుంటుంది. నేను, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ గా వుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఫన్ వుంటుంది. ఊర మాస్ లా కాకుండా మాస్ కూడా క్లాస్ టచ్ తో వుంటుంది. ►మాచర్ల నియోజకవర్గం ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యుమర్, ఫన్ , మాస్, క్లాస్ అన్నీ వుంటాయి. ►కేథరీన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ కథలో చాలా కీలకం. ఒక కీ పాయింట్ ఆ పాత్రలో వుంటుంది. ►చాలా రోజుల తర్వాత చేసిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఫైట్స్, లుక్ విషయంలో కొంచెం ఎకువ శ్రద్ధ తీసుకున్నా. ►కృతి శెట్టి షూటింగ్ లో ప్రతిది చాలా లాజికల్ గా అడుగుతుంది. కృతి అడిగే ప్రశ్నలు చాలా స్మార్ట్ గా వుంటాయి. హీరోయిన్స్ లో అరుదైన క్యాలిటీ ఇది. ►ఇది వరకు నా చిత్రాలలో ఫైట్స్ వున్నాయి. కానీ మాచర్ల ఫైట్స్ మాత్రం చాలా స్పెషల్. పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్, స్టయిలీష్ గా వుంటాయి. ఒకొక్క ఫైట్ ఒక్కోలా వుంటుంది. షూటింగ్ లో ఫైట్స్ అలవాటే. కానీ మాచర్ల ఫైట్స్ విషయంలో కాస్త ఎక్కువ ఒత్తిడి తీసుకున్నాను. అలాగే షూటింగ్ లో గాయాలు కూడా అయ్యాయి. ►ఫస్ట్ లాక్ చేసిన కథనే తీశాం. కోవిడ్ తర్వాతే కమర్షియల్ సినిమాకి ఇంకా స్కోప్ పెరిగింది. సాఫ్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. మాస్, హ్యుమర్, కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయి. ►కోవిడ్ తర్వాత ప్రేక్షకుల మూడ్ స్వింగ్ ఏమిటో అర్ధం కావడం లేదు. ఏ సినిమా చూస్తున్నారు.. ? ఏ సినిమాకి వస్తున్నారో సరిగ్గా అర్ధం కావడం లేదు. టీజర్, ట్రైలర్ లో ఏదో నచ్చి వస్తున్నారు. సినిమా నచ్చితే అది నడుస్తుంది. అయితే ఏ సినిమా నడుస్తుందనేది ఊహించలేం. ►సాగర్ నాకు మంచి మ్యూజిక్ ఇస్తాడు. మా ఇద్దరి సింక్ బావుంటుంది. మాచర్ల పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగా చేశాడు. నేపథ్య సంగీతంలో మణిశర్మ గారిని మైమరపించాడు. ►ఒక నెలలో సమస్యలకు పరిష్కారం దొరికి మళ్లీ షూటింగులు మొదలవుతాయని ఆశిస్తున్నాను. ►సలహా అంటే .. సినిమా కొనమని మాత్రమే చెప్పాను. రేట్లు జోలికి మాత్రం వెళ్లను (నవ్వుతూ). విక్రమ్ చూసి వారం రోజులు నిద్రపట్టలేదు. సినిమా అంటే ఇలా వుండాలి కదా, ఇలా తీయాలి కదా అనిపించింది. ఒకే మూసలో వుండే ఫార్ములా కాకుండా.. కథని బలంగా నమ్మి చేస్తే విక్రమ్ లాంటి సినిమాలు వస్తాయి. భవిష్యత్ లో అలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తా. ►ఇరవై ఏళ్ల ప్రయాణంలో చాలా హిట్స్ చూశాను. కొన్ని అపజయాలు కూడా చూశాను. ప్రస్తుతం మంచి స్థితిలో వుండటం తృప్తిగా వుంది. ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలనేదే నా ప్లాన్. ►ఇండియాలో ఎక్కువ ఫ్లాఫ్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరు అని గూగల్ చేసేవాడిని (నవ్వుతూ) అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ పేర్లు వచ్చేవి. వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని. కొన్ని విమర్శలు బాధ కలిగించేవి. అయితే ఆ విమర్శలనే పాజిటీవ్ గా తీసుకొని ప్రయాణం కొనసాగించాను. ►'రాను రాను' అనే పాట ఆలోచన నాదే. ఏదైనా పాట రీమిక్స్ చేద్దామని అన్నప్పుడు జయం హైలెట్స్ లో ఒకటైన 'రాను రాను' పాటని రీమిక్స్ చేద్దామని చెప్పాను. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఆ పాట క్రేజ్ తగ్గలేదు. ఈ చిత్రం లో మూడు పాటలు డ్యాన్స్ వేశాను. డ్యాన్సులన్నీ బావుంటాయి. ►హైదరాబాద్, విశాఖ పట్నంలో షూట్ చేశాం. పాటల కోసం విదేశాలకు వెళ్లాం. ప్రసాద్ మురెళ్ల గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ►పాన్ ఇండియా సినిమా చేద్దామనుకొని చేస్తే కుదరదని నా అభిప్రాయం. సరైన కథ కుదిరినప్పుడే అది జరుగుతుంది. అలాంటి కథలు వస్తే చేస్తాను. ►వక్కంతం వంశీ గారితో ఒక సినిమా చేస్తున్నా. -
పోరాట దృశ్యాల కోసం ఇంత కష్టపడతారా?
Nithiin Macherla Niyojakavargam Making Video Released: హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్ హీరోయిన్స్ కృతీ శెట్టి, కేథరిన్ ట్రేసా కథానాయికలుగా అలరించనున్నారు. పలు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. పలు యాక్షన్ సన్నివేశాలు, సాంగ్స్ షూటింగ్స్‌ను ఈ వీడియోలో చూడొచ్చు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించేందుకు ఎంత కష్టపడతారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అలాగే డ్యాన్స్ విషయంలో తీసుకునే శ్రద్ధ కనిపిస్తుంది. షూటింగ్లో బ్రేక్ సమయంలో నితిన్, కృతిశెట్టి కబుర్లు చెప్పుకుని నవ్వుకోవడం సరదాగా ఉంది. కాగా పొలిటికల్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజేంద్ర ప్రసాద్, సముద్ర ఖని, శుభలేక సుధాకర్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. -
సందడే సందడి.. ఈ వారం బోలెడన్ని సినిమాలు రిలీజ్!
జూలైలో బోలెడు సినిమాలు రిలీజైనా ఏ ఒక్కటీ సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో వరుస విజయాలు అందుకుంటున్న టాలీవుడ్ జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లైంది. అయితే జూలై ఉసూరుమనిపించినా ఆగస్టు తిరిగి ఊపిరి పోసింది. ఒకేరోజు రిలీజైన బింబిసార, సీతారామం రెండూ దిగ్విజయాన్ని అందుకున్నాయి. ఆ ఊపును కొనసాగించడానికి మేము రెడీ అంటూ మరి కొన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి ఆగస్టు రెండో వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూసేద్దాం.. లాల్ సింగ్ చడ్డా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగచైతన్య ముఖ్య పాత్ర పోషించాడు. హాలీవుడ్ హిట్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చై బాలీవుడ్ ఎంట్రీ, తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రక్షా బంధన్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం రక్షా బంధన్. ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్టర్. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతోంది. మాచర్ల నియోజకవర్గం యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కృతీశెట్టి, కేథరిన్ హీరోయిన్స్. హీరోయిన్ అంజలి ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడింది. ఈ మూవీ ఆగస్టు 12న రిలీజవుతోంది. కార్తికేయ 2 నిఖిల్ సూపర్ హిట్ మూవీ కార్తికేయకు సీక్వెల్‌గా వస్తోంది కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలుత ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అదేరోజు మాచర్ల మూవీ వస్తుండటంతో ఒకరోజు వెనక్కి జరిగారు. అంటే కార్తికేయ 2 ఆగస్టు 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు.. హాట్‌స్టార్ ► ది వారియర్ - ఆగస్టు 11 అమెజాన్ ప్రైమ్ ► సోనిక్ ది ఎడ్జ్‌హాగ్ 2 - ఆగస్టు 10 ► ది లాస్ట్ సిటీ - ఆగస్టు 10 ► మలయాన్ కుంజు - ఆగస్టు 11 ► కాస్మిక్ లవ్ - ఆగస్టు 12 ► ఎ లీగ్ ఆఫ్ దైర్ వోన్ - ఆగస్టు 12 ఆహా ► మాలిక్ - ఆగస్టు 12 ► మహా మనిషి - ఆగస్టు 12 ► ఏజెంట్ ఆనంద్ సంతోష్ (నాలుగో ఎపిసోడ్) - ఆగస్టు 12 నెట్‌ఫ్లిక్స్ ► హ్యాపీ బర్త్‌డే - ఆగస్టు 8 ► నరూటో: షిప్పుడెన్ వెబ్‌సిరీస్ - ఆగస్టు 8 ► ఐ జస్ట్ కిల్డ్ మై డాడ్ - ఆగస్టు 9 ► ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 2 - ఆగస్టు 10 ► లాకీ అండ్ కీ సీజన్ 3 - ఆగస్టు 10 ► బ్యాంక్ రాబర్స్: ది లాస్ట్ గ్రేట్ హెయిస్ట్ - ఆగస్టు 10 ► దోతా: డ్రాగన్స్ బ్లడ్: బుక్ 3 - ఆగస్టు 11 ► నెవ్వర్ హావ్ ఐ ఎవర్ సీజన్ 3 - ఆగస్టు 12 ► బ్రూక్లిన్ నైన్-నైన్: సీజన్ 8 - ఆగస్టు 13 ► గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ - ఆగస్టు 14 సోనిలివ్ ► గార్గి - ఆగస్టు 12 జీ5 ► హలో వరల్డ్ వెబ్‌సిరీస్ - ఆగస్టు 12 ► రాష్ట్ర కవచ్ - ఆగస్టు 11 ► బ్యూటిఫుల్ బిల్లో - ఆగస్టు 11 ► శ్రీమతి - ఆగస్టు 12 చదవండి: 'పచ్చళ్ల స్వాతి'గా పాయల్ రాజ్ పుత్ లుక్ చూశారా? సిమ్రాన్ చెల్లెలి సూసైడ్‌కి ఆ కొరియోగ్రాఫర్‌కి సంబంధం ఉందా? -
అందుకే బాలీవుడ్ ఆఫర్ వదులుకున్నా: కృతిశెట్టి
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు కొంత లక్ కూడా ఉండాలి. ఈ రెండూ తోడైతే మాత్రం వారిని ఆపడం ఎవరితరమూ కాదు. ప్రస్తుతం కృతీశెట్టికి గోల్డెన్ టైం నడుస్తోంది. తొలి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆ తర్వాత వెంటవెంటనే శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది ‘బేబమ్మ’. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలో రామ్‌తో 'ది వారియర్', సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌తో 'మాచర్ల నియోజకవర్గం' వంటి సినిమాలకు సంతకం చేసింది. ఇటీవల ది ‘ది వారియర్’ చిత్రం విడుదల కాగా ఈ మూవీతో తొలి పరాజయం అందుకుంది. చదవండి: లోకేశ్ కనకరాజు-విజయ్ చిత్రం, ‘విక్రమ్’ను మించిన స్క్రిప్ట్! అదిరిపోయిందిగా.. ప్రస్తుతం కృతీ ఆశలన్ని మాచేర్ల నియోజకవర్గం చిత్రంపైనే ఉన్నాయి. ఆగస్ట్ 12న ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది ఆమె. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ-రిలీజ్లో ఈవెంట్లో కృతి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఈ సందర్భంగా తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ గరించి బయటపెట్టింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల తనకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని, అయితే తాను ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పింది. టాలీవుడ్ ఏం కావాలో అది ఇచ్చిందని, అందుకే తనకు బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం లేదని కృతి వ్యాఖ్యానించింది. -
మరో ఇరవై ఏళ్లు మీ కోసం కష్టపడతా
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు, అభిమానుల సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు.. మీ అభిమానం, ప్రేమకి థ్యాంక్స్. మరో ఇరవై ఏళ్లు అయినా మీ కోసం నేను ఇలాగే కష్టపడతాను.. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి’’ అని నితిన్ అన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతీశెట్టి, కేథరిన్ హీరోయిన్లు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ మాట్లాడుతూ– ‘‘నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. నేపథ్య సంగీతానికి మణిశర్మగారు కింగ్ అంటారు. కానీ మా సినిమా చూశాక తండ్రికి తగ్గ తనయుడు కాదు.. తండ్రిని మించిన తనయుడిగా స్వరసాగర్ నేపథ్య సంగీతం కొట్టాడు. ఈ సినిమా మీకందరికీ ఫుల్ మీల్స్. ఈ చిత్రంతో రాజశేఖర్ పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడని నమ్ముతున్నాను. ఆగస్టు 12న గట్టిగా కొట్టబోతున్నాం’’ అన్నారు. అతిథిగా పాల్గొన్న దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘దిల్’ సినిమా తర్వాత నితిన్‌ని కలిసి భయం భయంగా ఓ కథ చెప్పాను. అప్పుడు తను ఇచ్చిన ధైర్యంతో వెళ్లి ‘అతనొక్కడే’ సినిమా చేశా. అప్పటి నుంచి నితిన్‌తో సినిమా చేయాలనుకునే వాణ్ణి.. భవిష్యత్‌లో తప్పకుండా చేస్తా. ‘మాచర్ల నియోజకవర్గం’ పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నేను ఈ స్థాయికి రావడానికి పదిహేనేళ్లు పట్టింది. ఇండస్ట్రీలో ఎడిటర్‌గా బ్రేక్ ఇచ్చిన పూరి జగన్నాథ్‌గారికి థ్యాంక్స్. ఎడిటర్‌గా ఉన్న నన్ను డైరెక్టర్ని చేసిన నితిన్‌కి థ్యాంక్స్. ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టబోతున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర సహ నిర్మాత హరి, దర్శకులు హను రాఘవపూడి, వక్కంతం వంశీ, మేర్లపాక గాంధీ, మెహర్ రమేశ్, నటులు బ్రహ్మాజీ, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభిస్తా
‘‘నా సినిమాల ఎంపిక రాంగ్ ఛాయిస్ అని అనుకోవడం లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఏడాదే అవుతోంది. ప్రతిరోజూ ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా? అనే ఆసక్తితో ఉంటాను. ఇలాంటి సమయంలో నాకు షూటింగ్ లేకపోతే అది నా రాంగ్ ఛాయిస్ అవుతుంది’’ అని కృతీశెట్టి అన్నారు. నితిన్ హీరోగా, కృతీ శెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి పంచుకున్న విశేషాలు.. ► ‘మాచర్ల నియోజకవర్గం’ కథ విన్న వెంటనే ఒప్పుకున్నాను. ఇందులో స్వాతి పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్లో విభిన్నమైన షేడ్స్ ఉన్నాయి. ఇది కమర్షియల్ మూవీయే అయినప్పటికీ నా పాత్రకు మచి ప్రాధాన్యం ఉంది. ఓ మంచి ప్యాకేజŒ తో ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ► నితిన్‌గారు తొలి చిత్రం ‘జయం’లో ఎలా ఫ్రెష్‌గా ఉన్నారో ‘మాచర్ల నియోజకవర్గం’ లోనూ అలానే ఉన్నారు. ఆయన నిజాయితీ వల్లే ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని అనుకుంటున్నాను. నాకూ ఇలాంటి ప్రయాణం ఉండాలంటూ దీవించమని నితిన్గారిని అడిగాను(నవ్వుతూ). రాజశేఖర్‌గారికి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా అనిపించారు. ► విలక్షణ నటిగా ప్రేక్షకులు నన్ను గుర్తించాలని విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను. అందుకే ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్ర చేసిన వెంటనే ‘శ్యామ్ సింగరాయ్’లో మోడ్రన్గాళ్గా చేశా. ‘ఉప్పెన’ లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతిగారితో కలిసి నటించాను. నటనలో విలక్షణ పాత్రలు చేయాలనే స్ఫూర్తి ఆయన వల్లే నాలో కలిగిందేమో!. వినోదం, వైవిధ్యం.. రెండూ బ్యాలెన్స్ చేసేలా ప్రాజెక్ట్స్‌కు సైన్ చేశాను. కానీ నేను నటించిన కమర్షియల్ చిత్రాలు ఈ మధ్య వరుసగా విడుదల అయ్యాయి. సూర్యగారి ‘అచలుడు’, సుధీర్ బాబుగారి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో విభిన్నంగా కనిపిస్తాను. ► లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్, బాలీవుడ్ సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించాలని చిన్నతనం నుంచి అనుకుంటున్నాను. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనిని స్టార్ట్ చేస్తాను. నా సినిమాల ఫలితాల గురించి నాకు ఎలాంటి రిగ్రేట్స్ లేవు. ఏదైనా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గానే భావిస్తాను. నా సినిమాలు చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వాలనే కష్టపడతాను. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చేస్తున్నాను. మరికొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాను. వివరాలు త్వరలో వెల్లడిస్తాను. ► నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అమ్మగారే. నేను చూసిన స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఆమె. నాకు చిన్నప్పటి స్నేహితులు కూడా ఉన్నారు. ముంబైలో ఉంటే ఫ్రెండ్షిప్డేని బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. -
తారుమారైన తేదీలు.. ఆలస్యంగా రానున్న సినిమాలు
కరోనా వల్ల సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. 2020లో ముందుగానే విడుదల తేదీ ప్రకటించిన ఏ సినిమా కూడా చెప్పిన తేదీకి దాదాపు రాలేదు. దానికి కారణం లాక్డౌన్. కరోనా కాస్త సద్దుమణిగి, సినిమాల విడుదల జోరు పెరిగినా కానీ రెండేళ్ల కరోనా ప్రభావం సినిమా విడుదలపై ఇంకా ఉంది. ఇప్పటికీ సినిమాల విడుదల తేదీలు తారుమారవుతున్నాయి. దానికి ఒక కారణం కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే సంఖ్య తగ్గడమే అని కొందరు పరిశ్రమ ప్రముఖులు అంటున్నారు. ఏది ఏమైనా సినిమాకి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం కూడా వెలిబుచ్చారు. ఇక విడుదల తేదీలు తారుమారైన చిత్రాల గురించి తెలుసుకుందాం. కాగా సీక్రెట్ ఏజెంట్‌గా అఖిల్ చేపట్టిన ఆపరేషన్ ఏంటి? అనేది తెలియాలంటే ‘ఏజెంట్’ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏజెంట్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కావాల్సి ఉంది. ఇటీవల ‘ఏజెంట్’ ట్రైలర్‌ని కూడా అభిమానుల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని చిత్రబృందం ప్రకటించలేదు. ఇంకోవైపు సమంత లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యశోద’ ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. హరి–హరీశ్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఓ పాట చిత్రీకరించాల్సి ఉండగా మరోవైపు గ్రాఫిక్స్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసినట్లు చిత్రయూనిట్ ఆ మధ్య పేర్కొంది. కొత్త విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. ఇక సముద్రంలోని ద్వారకా నగరంపై నిఖిల్ చేసిన అన్వేషణ కూడా తెరపైకి కాస్త లేట్‌గా రానుంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘కార్తికేయ 2’. ఇందులోనే నిఖిల్ ద్వారకా నగర అన్వేషణ చేశారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఫైనల్‌గా ఒక రోజు ఆలస్యంగా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. కాగా నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ విడుదల తేదీలోనూ మార్పు జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఈ చిత్రం విడుదల కావాల్సింది. అయితే సెప్టెంబరు 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అదే విధంగా వైష్ణవ్ తేజ్ వైభవాన్ని చూడాలంటే సెప్టెంబర్ 2 వరకూ వేచి చూడాలి. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘రంగరంగ వైభవంగా’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదల రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా మూడోసారి ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని తొలుత మే 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా కాలేదు. ఆ తర్వాత జూలై 1న విడుదల అంటూ అనౌన్స్ చేసినా వాయిదా పడింది. ఫైనల్‌గా సెప్టెంబరు 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్ కృష్ణదేవ్ (అడివి శేష్ పాత్ర పేరు) ఓ కేసు విచారణపై శ్రద్ధ పెట్టారు. ఈ విచారణ విశేషాలు తెలియాలంటే ‘హిట్ 2’ రిలీజ్ వరకు వేచి చూడాలి. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్: ది సెకండ్ కేస్’. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘హిట్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘హిట్ 2’ జూలై 29న రిలీజ్ కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ కూడా వాయిదా జాబితాలో ఉంది. నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా జంటగా నాగశేఖర్, భావనా రవి నిర్మించిన ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ విడుదల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేది ఇంకా చిత్రయూనిట్ ప్రకటించలేదు. మరోవైపు బెల్లంకొండ సురేశ్ చిన్న కుమారుడు గణేశ్ హీరోగా పరిచయ మవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇంకా విడుదల తేదీ వాయిదాపడిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. ఒక తేదీకి అనుకున్న సినిమా మరో తేదీకి వాయిదా పడటం అనేది సాధారణ విషయమే. అయితే ఒకేసారి ఇన్ని చిత్రాలు వాయిదా పడటం అంటే విషయమే. -
సాంగ్ చూపించేశాం మావా...
పాట వినిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.. ఇది ఒకప్పటి ట్రెండ్. పాట చూపించి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది ఇప్పటి ట్రెండ్. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించాలంటే గతంలో ఆడియో, సినిమా పోస్టర్స్‌ని పబ్లిసిటీలో భాగంగా విడుదల చేసేవాళ్లు. పాటలు బాగుంటే సినిమా కూడా బాగుంటుందని థియేటర్‌కి వెళ్లేవారు. ఇప్పుడు ‘సాంగ్ చూపించేశాం మావా..’ అంటూ పాట వీడియోను కూడా చూపించి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా మేకింగ్ మారినట్లుగానే పబ్లిసిటీలో కూడా కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాల వీడియో పాటలను ఓ లుక్కేద్దాం.. ఐయామ్ రెడీ.. ‘‘నేను రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ నితిన్‌ని ఆటపట్టించారు అంజలి. వీరిద్దరి మధ్య వచ్చే ఈ మాస్ సాంగ్ ‘మాచర్ల నియోజక వర్గం’ లోనిది. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీ శెట్టి, క్యాథరిన్ హీరోయిన్లు. అంజలి స్పెషల్ సాంగ్ చేశారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. మహతి స్వర సాగర్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి..’, ‘అదిరిందే..’ అంటూ సాగే పాటల ఫుల్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ‘మాచర్ల సెంటర్లో మాపటేల నొనొస్తే.. ఐయామ్ రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ అంజలి, నితిన్‌లపై చిత్రీకరించిన సాంగ్, నితిన్, కృతీపై తీసిన ‘అదిరిందే పసిగుండె.. తగిలిందే హై ఓల్టే’ పాటల వీడియోలు మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. పలికిందేదో ప్రాణం.. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం.. ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం’ అంటూ ఉల్లాసంగా పాడారు కల్యాణ్ రామ్. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీతో ఉంటే చాలు..’ అనే ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం..’ అంటూ సాగే ఈ ఫ్యామిలీ సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. అడిగా.. నన్ను నేను అడిగా... ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని..’ అంటూ అనుపమా పరమేశ్వరన్‌ని అడుగుతున్నారు నిఖిల్. ఈ ప్రేమ పాట నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’లోనిది. కాలభైరవ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని, అడిగా.. నిన్ను నేను అడిగా.. నే నిన్నలా నేనని..’ అంటూ సాగే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. నిఖిల్, అనుపమల మధ్య వచ్చే ఈ ఫీల్ గుడ్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవే కాదు... మరికొన్ని చిత్రాల్లోంచి కూడా వీడియో సాంగ్స్ విడుదలయ్యాయి. ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడానికి కొంతవరకైనా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. -
Macherla Niyojakavargam Movie: ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ స్టిల్స్
-
మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
అదిరిపోయిన నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్..
Nithin Macherla Niyojakavargam Movie Trailer Released: హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్ హీరోయిన్స్ కృతీ శెట్టి, కేథరిన్ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్ అయితే అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటలో వచ్చే 'రాను రాను అంటూనే చిన్నదో' అనే బీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఈ పాటతో టాలీవుడ్ స్టార్ హీరోల స్టెప్పులను సింక్ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్ చేశారు. అవి కూడా నెటిజన్లను విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్రబృందం తాజాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. 3 నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, యాక్షన్ సీన్లతో ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్లో చూపించిన డైలాగ్‌లు, నితిన్ యాక్షన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బాగున్నాయి. 'ఇంకా డైరెక్ట్ యాక్షనే' అంటూ ఈ మూవీ ట్రైలర్‌ను ట్వీట్ చేశాడు నితిన్. కాగా ఈ మూవీలో నితిన్ కలెక్టర్‌గా నిటిస్తున్న విషయం తెలిసిందే. -
పోలీసులను ఆశ్రయించిన మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్
మాచర్ల నియోజకవర్గం సినిమాకు కొత్త చిక్కు వచ్చిపడింది. డైరెక్టర్ ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఓ వ్యక్తి ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి కొన్ని వర్గాలను కించపరిచేలా కామెంట్లు చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ కాగా ఆ మాటలు అన్నది డైరెక్టరే అనుకుని మాచర్ల నియోజకర్గాన్ని బహిష్కరించాలంటూ పలువురూ కామెంట్లు చేస్తున్నారు. ఎవరో పనికట్టుకుని ఇదంతా చేస్తున్నారని ఆగ్రహించిన డైరెక్టర్ బుధవారం నాడు పోలీసులను ఆశ్రయించాడు. తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుగా పోస్ట్ చేస్తున్నారని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజశేఖర్ అనే పేరుతో ఉన్న ఓ అకౌంట్ నుంచి కొందరు మూడేళ్ల క్రితం కొన్ని కులాలను తిడుతూ ఓ ట్వీట్ చేశారని, దాన్ని తనకు అంటగడుతూ, మాచర్ల ముచ్చట్లు అంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించాడు. ఆ అకౌంట్ తనది కాదని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫేక్ ట్వీట్ల స్క్రీన్షాట్లను పోలీసులకు అందించాడు. దర్శకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: బ్రేకప్ చెప్పుకున్న బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ -
బొద్దుగా ఉండే అంజలి.. ఇలా అయిపోయిందేంటి?
Actress Anjali Latest Photos: దక్షిణాదిలో తమిళ, తెలుగు చిత్రాలలో హీరోయిన్గా నటించి, మెప్పించి హోమ్లీ గర్ల్ అని మంచి పేరు తెచ్చుకున్న అమ్మడు అంజలి. ఈమె ఇప్పుడు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో కాస్త అంత విరామం తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించడం మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్‌లలోనూ అందాలను ఆరబోసి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు రామ్‌చరణ్‌తో దర్శకుడు శంకర్ నిర్మిస్తున్న చిత్రంలో ముఖ్య భూమికను పోషిస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఐటం సాంగ్‌లో నటించింది. ప్రస్తుతం విదేశాల పర్యటనకు వెళ్లిన ఈ సుందరి అక్కడి నుంచి తన నాజూకుతనాన్ని చూపుతూ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. దీంతో అవి వైరల్‌గా మారాయి. -
మాచర్ల కోసం నా సమాధిని పునాది వేయడానికి నేను సిద్ధం.. మాచర్ల ధమ్కీ
నితిన్, కృతీశెట్టి జంటగా ఎంఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మాచర్ల ధమ్కీ’అంటూ ఓ వీడియోని వదిలారు మేకర్స్. ‘మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలారి మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాది వేయడానికి నేను సిద్ధం’అంటూ నితిన్ చేప్పే పవర్ఫుల్ డైలాగ్‌లో ఈ స్పెషల్ వీడియో ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో నితిన్..సిద్ధార్థ్ రెడ్డి అనే యంగ్ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నాడు. జులై 30న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అంజలి ఓ స్పెషల్ సాంగ్‌లో నటించించింది. -
'అదిరిందే' అంటూ అదరగొట్టిన నితిన్, కృతీ శెట్టి..
Macherla Niyojakavargam: హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్ హీరోయిన్స్ కృతీ శెట్టి, కేథరిన్ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్ అయితే అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటలో వచ్చే 'రాను రాను అంటూనే చిన్నదో' అనే బీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఈ పాటతో టాలీవుడ్ స్టార్ హీరోల స్టెప్పులను సింక్ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్ చేశారు. అవి కూడా నెటిజన్లను విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. 'అదిరిందే పసిగుండే' అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను శనివారం (జులై 23) ఉదయం రిలీజ్ చేశారు. ఈ పాటలో నితిన్, కృతీశెట్టి తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించగా పాటను సంజిత్ హెగ్డే ఆలపించారు. ఫ్యాక్షన్, పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘రారా రెడ్డి’ సాంగ్
నితిన్, కృతీశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిరాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ ‘రారా రెడ్డి’ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ పాటకి 20 మిలియన్స్ పైగా వ్యూస్, 3లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నితిన్, అంజలి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ , కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. ఇక పాటలోని ‘రాను రాను అంటూనే చిన్నదో’ పల్లవికి లక్షలాది సంఖ్యలో రీల్స్ వచ్చాయి. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.