ఎక్కువ ఫ్లాప్స్‌ ఇచ్చిన స్టార్స్‌ ఎవరని గూగుల్‌ చేసేవాడిని: నితిన్‌ | Nithiin Shares Experience With Macherla Niyojakavargam Movie | Sakshi
Sakshi News home page

Nithiin: ఆ సినిమా చూసి వారం రోజులు నిద్రపోలేదు: నితిన్‌

Published Tue, Aug 9 2022 7:45 PM | Last Updated on Wed, Aug 10 2022 8:50 AM

Nithiin Shares Experience With Macherla Niyojakavargam Movie - Sakshi

Nithiin About Macherla Niyojakavargam Movie: యంగ్  హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ  నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ 'రారా రెడ్డి'లో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో హీరో నితిన్ మీడియా సమావేశంలో నితిన్‌ పంచుకున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్ర విశేషాలివి. 

►కథ కొత్తగా యూనిక్ గా వుంటుంది. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. నేను ఐఎఎస్ పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. మాస్ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్ లో చాలా ఫ్రెష్ నెస్ వుంటుంది. నేను సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, మంచి పాటలు, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యాన్స్ కి  పండగలా ఉంటుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి రోజు మొదటి ఆటకి నేనూ థియేటర్ కి వెళ్తా. 

►ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏమీ లేదు. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రేమ కథలు చేసి కొంత బోర్ ఫీలింగ్ వచ్చింది. డిఫరెంట్ గా చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలనే అలోచనతో 'మాచర్ల నియోజకవర్గం' చేశా. ఇది ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. పవర్ ఫుల్ రోల్. మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. 

►కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో ఉండే కథ చాలా యూనిక్‌గా వుంటుంది. పొలిటికల్ నేపథ్యంలో ఇది వరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ మాచర్ల లో ఉండే పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. కమర్షియల్ ఫార్మెట్ లో ఉంటూనే కొత్త పాయింట్ తో ఉంటుంది. 

►2017 'లై 'షూటింగ్ సమయంలో తన ఎడిటింగ్ స్టైల్‌ నాకు బాగా నచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతున్నపుడు తను  ఇన్ పుట్స్ కూడా బావుండేవి. ''నువ్వు డైరెక్టరైతే బావుంటుంది'' అని అప్పుడే చెప్పాను. నేను చెప్పిన తర్వాత తనలో ఆలోచన మొదలైయింది. కోవిడ్ సమయంలో ఇంట్లో ఉంటూ కథ రాసుకున్నాడు. నాకు చెప్పినపుడు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేశాను. 

►శేఖర్ ఎడిటర్ కావడం వలన షాట్ కటింగ్స్, సీన్ ఓపెనింగ్స్, లెంత్ విషయంలో చాలా క్లారిటీ వుంది. తను ఏది చెప్పాడో స్క్రీన్ మీద అదే కనిపించింది. శేఖర్ ఎడిటర్ కావడం వల్ల .. ఎంత కావాలో అంతే తీశాడు. దీంతో వృథా తగ్గింది. మాచర్లలో చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా కాష్టం. ఐతే శేఖర్ నేను అనుకున్న దానికి కంటే అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. చాలా అనుభవం ఉన్న దర్శకుడి లాగా తీశాడు. 

►శేఖర్ ఒక ఫీల్డ్ మార్చి మరో ఫీల్డ్ కి వస్తున్నాడు. ఇక్కడ ఏదైనా తేడా వస్తే మళ్లీ ఆ ఫీల్డ్ కి వెళ్లాలి. అందుకే ఈ సినిమా నాకంటే కూడా తనకే ఎక్కువ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. 

►ఈ విషయంలో దర్శకుడు శేఖర్ చాలా హోం వర్క్ చేశారు. చాలా మంది ఐఏఎస్ అధికారులని కలవడం, వాళ్ల బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి, షూటింగ్ సమయంలో ఎక్కడ హుందా గా ఉండాలి, ఎక్కడ మాస్‌గా ఉండాలనేది తనే చెప్పాడు. 

►మాచర్ల నియోజకవర్గం కంప్లీట్ ఫిక్షనల్ స్టొరీ. దర్శకుడు శేఖర్‌ది గుంటూరు. మాచర్ల అనే టైటిల్‌లో ఒక ఫోర్స్ ఉంది. అందుకే మాచర్ల నియోజికవర్గం అని టైటిల్ పెట్టాం. సముద్రఖని గారికి శేఖర్ కథ చెప్పినపుడు..  తమిళనాడులో ఇలాంటి ఇన్సిడెంట్ ఉందని సముద్రఖని గారు అన్నారు. 

►ఐఏఎస్ అంటే క్లాస్ అనుకుంటాం. కానీ ఆ పాత్ర మాస్ గా ఉంటే ఎలా ఉంటుందనే కొత్త అలోచనతోనే ఫ్రెష్ గా వెళ్లాం. 

►ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ కామెడీ వుంటుంది. నేను, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ గా వుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఫన్ వుంటుంది. ఊర మాస్ లా కాకుండా మాస్ కూడా  క్లాస్ టచ్ తో  వుంటుంది. 

►మాచర్ల నియోజకవర్గం ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యుమర్, ఫన్ , మాస్, క్లాస్ అన్నీ వుంటాయి.  

►కేథరీన్‌ పాత్ర చిన్నదే అయినప్పటికీ కథలో చాలా కీలకం. ఒక కీ పాయింట్ ఆ పాత్రలో వుంటుంది. 

►చాలా రోజుల తర్వాత చేసిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఫైట్స్, లుక్ విషయంలో కొంచెం ఎకువ శ్రద్ధ తీసుకున్నా. 

►కృతి శెట్టి షూటింగ్ లో ప్రతిది చాలా లాజికల్ గా అడుగుతుంది. కృతి అడిగే ప్రశ్నలు చాలా స్మార్ట్ గా వుంటాయి. హీరోయిన్స్ లో అరుదైన క్యాలిటీ ఇది. 

►ఇది వరకు నా చిత్రాలలో ఫైట్స్ వున్నాయి. కానీ మాచర్ల ఫైట్స్ మాత్రం చాలా స్పెషల్. పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్, స్టయిలీష్ గా వుంటాయి. ఒకొక్క ఫైట్ ఒక్కోలా వుంటుంది. షూటింగ్ లో ఫైట్స్ అలవాటే. కానీ మాచర్ల ఫైట్స్ విషయంలో కాస్త ఎక్కువ ఒత్తిడి తీసుకున్నాను. అలాగే షూటింగ్ లో గాయాలు కూడా అయ్యాయి.

►ఫస్ట్ లాక్ చేసిన కథనే తీశాం. కోవిడ్ తర్వాతే కమర్షియల్ సినిమాకి ఇంకా  స్కోప్ పెరిగింది. సాఫ్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. మాస్, హ్యుమర్, కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయి. 

►కోవిడ్ తర్వాత ప్రేక్షకుల మూడ్ స్వింగ్ ఏమిటో అర్ధం కావడం లేదు. ఏ సినిమా చూస్తున్నారు.. ? ఏ సినిమాకి వస్తున్నారో సరిగ్గా అర్ధం కావడం లేదు.  టీజర్, ట్రైలర్ లో ఏదో నచ్చి వస్తున్నారు. సినిమా నచ్చితే అది నడుస్తుంది. అయితే ఏ సినిమా నడుస్తుందనేది ఊహించలేం. 

►సాగర్ నాకు మంచి మ్యూజిక్ ఇస్తాడు. మా ఇద్దరి సింక్ బావుంటుంది. మాచర్ల పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగా చేశాడు. నేపథ్య సంగీతంలో మణిశర్మ గారిని మైమరపించాడు. 

►ఒక నెలలో సమస్యలకు పరిష్కారం దొరికి మళ్లీ షూటింగులు మొదలవుతాయని ఆశిస్తున్నాను. 

►సలహా అంటే .. సినిమా కొనమని మాత్రమే చెప్పాను. రేట్లు జోలికి మాత్రం వెళ్లను (నవ్వుతూ). విక్రమ్ చూసి వారం రోజులు నిద్రపట్టలేదు. సినిమా అంటే ఇలా వుండాలి కదా, ఇలా తీయాలి కదా అనిపించింది. ఒకే మూసలో వుండే ఫార్ములా కాకుండా.. కథని బలంగా నమ్మి చేస్తే విక్రమ్ లాంటి సినిమాలు వస్తాయి. భవిష్యత్ లో అలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తా. 
 
►ఇరవై ఏళ్ల ప్రయాణంలో చాలా హిట్స్ చూశాను. కొన్ని అపజయాలు కూడా చూశాను. ప్రస్తుతం మంచి స్థితిలో వుండటం తృప్తిగా వుంది. ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలనేదే నా ప్లాన్. 

►ఇండియాలో ఎక్కువ ఫ్లాఫ్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరు అని గూగల్ చేసేవాడిని (నవ్వుతూ) అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ పేర్లు వచ్చేవి. వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని. కొన్ని విమర్శలు బాధ కలిగించేవి. అయితే ఆ విమర్శలనే పాజిటీవ్ గా తీసుకొని ప్రయాణం కొనసాగించాను.

►'రాను రాను' అనే పాట ఆలోచన నాదే. ఏదైనా పాట రీమిక్స్ చేద్దామని అన్నప్పుడు జయం హైలెట్స్ లో ఒకటైన 'రాను రాను' పాటని రీమిక్స్‌ చేద్దామని చెప్పాను. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఆ పాట క్రేజ్ తగ్గలేదు. ఈ చిత్రం లో మూడు పాటలు డ్యాన్స్ వేశాను. డ్యాన్సులన్నీ బావుంటాయి. 

►హైదరాబాద్, విశాఖ పట్నంలో షూట్ చేశాం. పాటల కోసం విదేశాలకు వెళ్లాం. ప్రసాద్ మురెళ్ల గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. 

►పాన్ ఇండియా సినిమా చేద్దామనుకొని చేస్తే కుదరదని నా అభిప్రాయం. సరైన కథ కుదిరినప్పుడే అది జరుగుతుంది. అలాంటి కథలు వస్తే చేస్తాను. 

►వక్కంతం వంశీ గారితో ఒక సినిమా చేస్తున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement