Nithin Macherla Niyojakavargam Movie Trailer Released - Sakshi
Sakshi News home page

Macherla Niyojakavargam Movie: 'డైరెక్ట్‌ యాక్షనే' అంటున్న నితిన్‌.. ఆసక్తిగా ట్రైలర్‌

Published Sat, Jul 30 2022 8:39 PM | Last Updated on Sat, Jul 30 2022 9:07 PM

Nithin Macherla Niyojakavargam Movie Trailer Released - Sakshi

Nithin Macherla Niyojakavargam Movie Trailer Released: హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్‌ హీరోయిన్స్‌ కృతీ శెట్టి, కేథరిన్‌ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్‌ అయితే అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటలో వచ్చే 'రాను రాను అంటూనే చిన్నదో' అనే బీట్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ మారింది. ఈ పాటతో టాలీవుడ్ స్టార్‌ హీరోల స్టెప్పులను సింక్‌ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్‌ చేశారు. అవి కూడా నెటిజన్లను విపరీతంగా ఎంటర్‌టైన్‌ చేశాయి. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్రబృందం తాజాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. 

3 నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, యాక్షన్ సీన్లతో ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌లో చూపించిన డైలాగ్‌లు, నితిన్ ‍యాక్షన్‌ సీన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఎంతో బాగున్నాయి. 'ఇంకా డైరెక్ట్‌ యాక్షనే' అంటూ ఈ మూవీ ట్రైలర్‌ను ట్వీట్‌ చేశాడు నితిన్. కాగా ఈ మూవీలో నితిన్ కలెక్టర్‌గా నిటిస్తున్న విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement