Catherine Tresa
-
నా కెరీర్లో చేస్తున్న చాలెంజింగ్ క్యారెక్టర్ ‘ఫణి’: కేథరిన్ ట్రెసా
వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాకి ‘ఫణి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో కేథరిన్ ట్రెసా లీడ్ రోల్ చేస్తున్నారు. ఏయు–ఐ స్టూడియో పద్మనాభరెడ్డి సమర్పణలో ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్‌లో మీనాక్షి అనిపిండి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని డా. తోటకూర ప్రసాద్ విడుదల చేయగా, నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘కేథరిన్ లేకుంటే మా ‘ఫణి’ లేదు. ఆమె ధైర్యానికి అభినందనలు’’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత డా. మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ– ‘‘ఫణి’ ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. ‘‘నా కెరీర్లో చేస్తున్న చాలెంజింగ్ క్యారెక్టర్ ‘ఫణి’ సినిమాలోనిదే. ఓ మంచి థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’’ అని కేథరిన్ ట్రెసా చెప్పారు. -
Catherine Tresa: విలేజ్‌లో చక్కర్లు కొడుతున్న హీరోయిన్ కేథరిన్ (ఫొటోలు)
-
నాభి అందాలతో శ్రద్ధాదాస్.. భర్త ముద్దుల్లో ఆ స్టార్ హీరోయిన్
నడుము చూపిస్తూ మెంటలెక్కిస్తున్న శ్రద్ధా దాస్ సంక్రాంతి ముగ్గులతో మరింత అందంగా శ్రీముఖి లంగాఓణీలో కుందనపు బొమ్మలా హీరోయిన్ మాళవిక 'గుంటూరు కారం' సక్సెస్ సెలబ్రేషన్స్.. నమ్రత పోస్ట్ భర్తని ముద్దులతో ముంచెత్తిన హీరోయిన్ కియారా అడ్వాణీ టైట్ ఔట్ఫిట్తో కాక రేపుతున్న హీరోయిన్ కేథరిన్ రొమాంటిక్ పోజుల్లో 'బిగ్‌బాస్' ఫేమ్ రతికా రోజ్ కొంటె చూపుతో తినేసేలా చూస్తున్న హీరోయిన్ రీతూవర్మ View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Byee y'll ...This is fcking cutee 😭😭❤️🫶#SidharthMalhotra #KiaraAdvani #Sidkiara pic.twitter.com/yi4shktcCE — SID'S DAY ❤️ (@Itss_Ritzzzz) January 16, 2024 View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Chandrika Ravi • ॐ (@chandrikaravi) View this post on Instagram A post shared by Tridha Choudhury🪬 (@tridhac) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) -
Catherine Tresa: అందమైన నటి కేథరిన్ థ్రెసా స్టైలిష్ డ్రస్సులు (ఫోటోలు)
-
‘ఓదెల రైల్వేస్టేషన్’ తర్వాత మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా రెడీ
సందీప్ మాధవ్, కేథరిన్ త్రెసా జంటగా ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఫేమ్ అశోక్ తేజ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. కేసీఆర్ ఫిల్మ్స్, శ్రీ మహా విష్ణువు మూవీస్‌పై సోమ విజయ్ ప్రకాష్ నిర్మాణంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఆదివారం (సెప్టెంబర్ 10న) కేథరిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె బర్త్ డేని చిత్ర యూనిట్ సెట్స్‌లో జరిపింది. అశోక్ తేజ మాట్లాడుతూ– ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. రెండవ షెడ్యూల్ ప్రస్తుతం హైదారాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే పవర్ ఫుల్ టైటిల్‌ని ప్రకటించబోతున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్ మాధవ్, హీరోయిన్లు కీర్తీ చావ్లా, నిష్మా, దీక్షా పంత్, దావులూరి జగదీశ్, పల్లి కేశవరావు పాల్గొని, కేథరిన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: అనూప్ రూబె¯Œ ్స, సహ నిర్మాతలు: గౌటి హరినాథ్, రొంగుల శివకుమార్. -
పోలీస్ స్టేషన్లో...
హీరోయిన్ కేథరిన్ ట్రెసా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆమె పోలీసాఫీసర్ కాదు.. ఖైదీ కూడా కాదు. మరి.. పోలీస్ స్టేషన్‌కి ఎందుకు వెళ్లారంటే.. ఓ సినిమా షూటింగ్లో భాగంగా. కేథరిన్ హీరోయిన్గా ‘జార్జిరెడ్డి, వంగవీటి’ చిత్రాల ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సందీప్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. కేథరిన్ క్యారెక్టర్ ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఆమె పాత్రను డిజైన్ చేశారట చిత్రదర్శకుడు అశోక్ తేజ. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ సెట్లో సందీప్, కేథరిన్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని కేసీఆర్ ఫిలిమ్స్, శ్రీమహా విష్ణు మూవీస్ బ్యానర్లపై దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు. ‘‘స్క్రీన్‌ప్లే బేస్డ్æ చిత్రమిది. సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం కొత్త అనుభూతినిచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమాలో ఎవరూ ఊహించని మలుపులు ఉంటాయి. ప్రతి సీన్ ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. -
అందాలు ఆరబోస్తున్న కేథరిన్ త్రెసా లేటెస్ట్ ఫోటోలు వైరల్...
-
Macherla Niyojakavargam Movie: ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ స్టిల్స్
-
మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
అదిరిపోయిన నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్..
Nithin Macherla Niyojakavargam Movie Trailer Released: హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్ హీరోయిన్స్ కృతీ శెట్టి, కేథరిన్ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్ అయితే అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటలో వచ్చే 'రాను రాను అంటూనే చిన్నదో' అనే బీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఈ పాటతో టాలీవుడ్ స్టార్ హీరోల స్టెప్పులను సింక్ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్ చేశారు. అవి కూడా నెటిజన్లను విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్రబృందం తాజాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. 3 నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, యాక్షన్ సీన్లతో ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్లో చూపించిన డైలాగ్‌లు, నితిన్ యాక్షన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బాగున్నాయి. 'ఇంకా డైరెక్ట్ యాక్షనే' అంటూ ఈ మూవీ ట్రైలర్‌ను ట్వీట్ చేశాడు నితిన్. కాగా ఈ మూవీలో నితిన్ కలెక్టర్‌గా నిటిస్తున్న విషయం తెలిసిందే. -
‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Fashion Tips: ఈ హీరోయిన్ ధరించిన అంగ్రఖా కుర్తా ధర 32వేలు! ప్రత్యేకత?
కేథరీన్ త్రెస్సా.. అవును .. సరైనోడు కథానాయిక. సంఖ్యాపరంగా టాలీవుడ్లో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. తెచ్చుకున్న పేరు.. సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. ఇటీవల ‘భళా తందనానా’ తో తెలుగు స్క్రీన్ మీద ఆమె మళ్లీ కనిపించింది. ఆమెను సెలబ్రిటీని చేసిన నటన సరే.. ఆమెను యూనిక్‌గా నిలిపిన ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.. దీప్ థీ.. బ్రాండ్ సృష్టికర్త.. దీప్తి పోతినేని. తనదైన డిజైన్స్‌తో సినిమా స్టార్స్ ఫ్యాషన్ సిగ్నేచర్‌ను మార్చేసింది దీప్తి. ఫ్యాషన్ ప్రేమికుల అభిరుచి, ఫ్యాషన్‌తో వాళ్లు చేయాలనుకున్న ప్రయోగాలను గమనించి.. వాళ్లు నచ్చే.. మెచ్చేలా తన దీప్ థీని తీసుకొచ్చింది. దాన్నే తన బ్రాండ్ వాల్యూగా స్థిరపర్చుకుంది. ఆ వాల్యూ వల్లే దీప్తీ నేడు సినిమా స్టార్స్‌కు ఫేవరెట్ డిజైనర్‌గా మారింది. ఆ క్రేజ్ ఆమెనూ ఓ సెలబ్రిటీగా మార్చింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ అంగ్రఖా కుర్తా బ్రాండ్: దీప్థీ ధర: రూ. 32,800 జ్యూయెలరీ ఇయర్ రింగ్స్ అండ్ ఉంగరం బ్రాండ్: అమ్రపాలి ధర: డిజైన్, నాణ్యతను బట్టి ఉంటుంది. జీవితంలో జరిగే పరిణామాలను మంచి, చెడులుగా చూడను. అలాగే నా కెరీర్‌ను కూడా అలా విభజించలేను. వచ్చిన.. నచ్చిన అవకాశాన్ని స్వీకరిస్తా. నా వంతు కృషి చేస్తా.. సినిమా అయినా.. జీవితమైనా! – కేథరీన్ త్రెస్సా -దీపిక కొండి -
ఓటీటీకి శ్రీవిష్ణు ‘భళా తందనాన’, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Bhala Thandanana Streaming On Disney Plus Hotstar: యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఎందుకంటే అతడు ఎంచుకునే కథలు, మూవీ టైటిల్స్ కాస్తా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దీంతో అతడి సినిమాల్లో ఓ మెసెట్ ఉంటుందని ప్రేక్షకుడి అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా నటించిన మూవీ ‘భళా తందనాన’. మే 6న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో ఇప్పుడీ మూవీ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. చదవండి: కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్ సంచలన ఆరోపణలు డిస్నీప్లజ్ హాట్‌స్టార్ ఈ సినిమా విడుదల కానుందని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. మే 20 నుంచి ఈ మూవీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్. వెండితెరపై పెద్ద ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్‌పై ఏంతమేర ఆకట్టుకుందో చూడాలి. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. Bhala re Bhala! Mee screen ki vachestundi #BhalaThandhanana #BhalaThandanaOnHotstar@sreevishnuoffl @CatherineTresa1 @chaitanyahead @SaiKorrapati_ #manisharma @SrikanthVissa @dopsureshragutu #GarudaRam #MarthandVenkatesh @PeterHeinOffl @VaaraahiCC @MangoMusicLabel pic.twitter.com/rnETXyzBrR — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 13, 2022 -
భళా తందనాన మూవీ రివ్యూ
టైటిల్: భళా తందనాన నటీనటులు: శ్రీవిష్ణు, కేథరిన్, గరుడ రామ్, పొసాని కృష్ణమురళి, సత్య తదితరులు దర్శకుడు: చైతన్య దంతులూరి కథ, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా సంగీతం: మణిశర్మ బ్యానర్: వారాహి చలనచిత్రం నిర్మాత: రజనీ కొర్రపాటి సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్ విడుదల తేది: మే 6, 2022 కొత్తదనం అంటే చాలు రంకెలేస్తాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. డిఫరెంట్ కాన్సెప్టులకు తివాచీ పరుస్తాడు. సినిమా హిట్టా? ఫట్టా అని కాకుండా అది ప్రేక్షకుడి మనసును హత్తుకుందా? లేదా? అన్నదాని మీదే ఎక్కువగా దృష్టి పెడతాడు. అంతేకాదు, తెలుగు భాషపై మమకారంతో తన సినిమాలన్నింటికీ దాదాపు తెలుగు టైటిల్స్ ఉండేలా చూసుకుంటాడు. అలా అన్నమయ్య కీర్తనలో ఉన్న భళా తందనానా అనే పదాన్ని తీసుకుని అదే టైటిల్‌తో సినిమా చేశాడు. ‘బాణం’ఫేం చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు శ్రీవిష్ణు. మరి ఈ మూవీ శ్రీవిష్ణుకి విజయాన్ని అందించిందా? తన సినిమాతో ప్రేక్షకుడికి కొత్తదనం పంచాడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. భళా తందనాన కథేంటంటే.. శశిరేఖ(కేథరిన్) ఓ మీడియా సంస్థలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది. ఓ అనాథాశ్రమంపై ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకొని.. ఆ న్యూస్ కవర్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ అనాథాశ్రమ అకౌంటెంట్ చందు అలియాస్ చంద్రశేఖర్(శ్రీవిష్ణు)తో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు దగ్గరయ్యే క్రమంలో సిటీలో వరుస హత్యలు జరుగుతాయి. హత్యకు గురైన వారంతా హవాలా కింగ్ ఆనంద్ బాలి(గరుడ రామ్) మనుషులు కావడంతో.. ఈ కేసుని సీరియస్ తీసుకొని స్టడీ చేస్తుంది శశిరేఖ. ఈ క్రమంలో ఆనంద్ బాలి దగ్గర ఉన్న రూ.2000 కోట్ల హవాలా మనీ ఎవరో దొంగిచించారనే విషయం తెలుస్తుంది. ఈ వార్తను తన మీడియా సంస్థలో ప్రచురించి ప్రపంచానికి తెలియజేస్తుంది శశిరేఖ. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంతకీ రూ.2000 కోట్లను దొంగిలించిదెవరు? ఈ దొంగతనం కేసుతో చందుకి ఉన్న సంబంధం ఏంటి?అనేదే మిగతా కథ ఎలా ఉందంటే.. బాణం, బసంతి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న చైతన్య దంతులూరి.. చాలా గ్యాప్ తర్వాత క్రైమ్ థ్రిల్లర్ కథతో ‘భళా తందనాన’ తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్‌కి కామెడీ, ప్రేమను యాడ్ చేసి అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే సినిమాకు కాస్త మైనస్ అయింది. కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఉత్కంఠ రేకెత్తించే సీన్స్ ఉన్నప్పటికీ.. కామెడీ, లవ్ ట్రాక్ కారణంగా రొటీన్ సినిమాగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఓ కిడ్నాప్ జరగడం..దానిని కనెక్ట్ చేస్తూ అసలు కథను ప్రేక్షకులకు చెప్పడంతో దర్శకుడు సఫలమయ్యాడు. వరుస హత్యలు.. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. పాట రూపంలో హీరో చెప్పే లవ్ ఫెయిలర్ స్టోరీ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథంతా రూ. 2000 కోట్ల హవాలా మనీ చుట్టే తిరుగుతుంది. ఆ డబ్బుతో చందుకు ఉన్న సంబంధం ఏంటి? అది ఎక్కడా దాచారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుడికి కలుగుతుంది. క్లైమాక్స్ కొత్తగా ఉన్నప్పటికీ.. సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అసలు హీరో ఎవరు? అతని గతం ఏంటి? రూ. 2000 కోట్లు ఎక్కడ దాచాడు? అనే విషయాలను తెలియజేయకుండా.. రెండో భాగం ఉందని చెప్తూ కథని ముగించాడు. ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా.. క్లీన్ ఎంటర్టైనర్గా సినిమా సాగుతుంది. ఎవరెలా చేశారంటే... ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు తన పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్‌లో అమాయక చక్రవర్తిగా, సెకండాఫ్‌లో ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా తనదైన నటనతో మెప్పించాడు. గత సినిమాలతో పోలిస్తే.. ఇందులో శ్రీవిష్ణు నటనలో పరిణితి కనిపించింది. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ మెప్పించే ప్రయత్నం చేసింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేథరిన్.. తెరపై కాస్త బొద్దుగా కనిపించింది. ఇక ఈ సినిమాకు ఆమే డబ్బింగ్ చెప్పుకుంది. అయితే అది కాస్త నప్పలేదు. ‘మేడమ్ మీరు మాట్లాడే తెలుగు.. ఇంగ్లీష్‌లా ఉంటుంది’అని హీరోతో ఓ డైలాగ్ చెప్పించి.. ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇక విలన్‌గా గరుడ రామ్ మెప్పించాడు. అయితే అతనికి బలమైన సీన్స్ లేకపోవడం మైనస్. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న దయామయం పాత్రలో పొసాని కృష్ణమురళి ఒదిగిపోవడమే కాకుండా..తనదైన కామెడీతో నవ్వించాడు. ఫస్టాఫ్‌లో సత్యతో వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. మిగిలిన నటీనటులు తమ, తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధానబలం మణిశర్మ సంగీతం.తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
హీరోయిన్ కేథరిన్ లేటెస్ట్ ఫోటోస్
-
శ్రీ విష్ణు మూవీ వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘భళా తందనాన’. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించారు. మే 6వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ థ్రెసా నటించింది. ‘బాణం’ సినిమా ఫేమ్ చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. -
శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
Sri Vishnu Bhala Thandanana Movie Release Date Lock: శ్రీవిష్ణు, కేథరిన్ థ్రెసా జంటగా నటించిన చిత్రం ‘భళా తందనాన’. ‘బాణం’ సినిమా ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చదవండి: కార్తీకేయతో జతకట్టిన ‘డిజే టిల్లు’ హీరోయిన్ ‘‘కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భళా తందనాన’. మా సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. వేసవి సెలవులు, మే 3న రంజాన్ పండగను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 30న మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించాం. మణిశర్మ సంగీతం అందించిన మా సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రామచంద్రరాజు, శ్రీనివాస్ రెడ్డి, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేష్ రగుతు. -
మై లవ్లీ ఏంజెల్ క్యాథరిన్ సొగసు చూడతరమా...
-
శ్రీ విష్ణు భళా.. ప్రారంభం
వైవిధ్యమైన చిత్రాలు నిర్మించే సాయి కొర్రపాటి తాజాగా ‘భళా తందనాన’ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. శ్రీ విష్ణు హీరోగా ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ కథానాయిక. మంగళవారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కెమెరా స్విచ్చాన్ చేయగా, శ్రీశైల దేవస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణపండ శ్రీనివాస్ క్లాప్‌నిచ్చారు. కీరవాణి సతీమణి శ్రీవల్లి, రాజమౌళి సతీమణి రమా రాజమౌళి స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించారు. మార్చిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
హీరోయిన్ క్యాథరిన్ ట్రెసా ఫోటోలు
-
అవును ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది : క్యాథరిన్
చెన్నై : అవును ఒత్తిడి చేస్తున్నారు అని అంటోంది హీరోయిన క్యాథరిన్ ట్రెసా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడికి ఇప్పుడు మార్కెట్ పెద్దగా లేదు. చేతిలో ఒక్క చిత్రం కూడా కనిపించడం లేదు. గ్లామర్‌కు కేరాఫ్ క్యాథరిన్ ట్రెసా అనడంలో అతిశయోక్తి ఉండదు. మెడ్రాస్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన దుబాయి బ్యూటీ ఈ అమ్మడు. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి ఆ తరువాత నటిగా రంగప్రవేశం చేసింది. మెడ్రాస్ చిత్రంలో కార్తీకు జంటగా దర్శకుడు పా.రంజిత్ పక్కింటి అమ్మాయిగా చూపించారు. అయితే అలా ఆ చిత్రం వరకే పరిమితమైంది క్యాథరిన్ ట్రెసా. ఆ తరువాత అందాలారబోతలో మోత మోగించింది. దీంతో తెలుగు, కన్నడం, మలయాళం సినీ దర్శక నిర్మాతల దృష్టిలోనూ పడింది. అలా నాలుగు భాషల్లో నటిస్తూ కెరీర్‌ను 10 ఏళ్లు లాగించేసింది. ప్రస్తుతం అవకాశాలు అమ్మడి దరి చేరడం లేదు. తమిళంలో క్యాథరిన్ ట్రెసా నటించిన చివరి చిత్రం వందా రాజావాదాన్ వరువేన్. కాగా ఈ బ్యూటీ నటించిన చిత్రాల విజయాల శాతం తక్కువనే చెప్పాలి. తనకు అవకాశాలు అడుగంటడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. దీంతో తనను తాను ప్రచారం చేసుకునే పనిలో పడిందనిపిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఎక్కువగా ఇద్దరు హీరోయిన్ల చిత్రాల్లోనే నటించినట్లున్నారు అన్న ప్రశ్నకు ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. హిందీలో ఇద్దరు కంటే ఎక్కువ హీరో, హీరోయిన్లు కలిసి నటిస్తున్నారని, అలాంటిది దక్షిణాది చిత్రాల్లో నటించడంలో తప్పేంటని ప్రశ్నించింది. ఎందరితో కలిసి నటించినా వారి కుండే ప్రత్యేకత తగ్గదు అని చెప్పింది. సరే పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం మాటేమిటి అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇదే ప్రశ్న చాలా మంది వేస్తున్నారని వరుడు లభిస్తే తాను పెళ్లికి రెడీ అని చెప్పింది. సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నానని అంది. అయితే పెళ్లి కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం తనకు నచ్చదని చెప్పింది. తన ఇంట్లో త్వరగా పెళ్లి చేసుకోమనే ఒత్తిడి ఉన్న మాట నిజమేనంది. అదేవిధంగా ప్రేమంటే ద్వేషం లాంటిఏవీ లేవని, అయితే ఇప్పటి వరకూ ప్రేమించదగ్గ వ్యక్తి తన జీవితంలో ఇంకా తారసపడలేదని చెప్పింది. ప్రేమ అన్నది మనసుకు సంబంధించిందని, దాన్ని వివరించడం కష్టం అనీ చెప్పింది. అదే విధంగా తాను ప్రేమ వివాహం చేసుకుంటానా, పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకుంటానా అన్నది ఇప్పుడు చెప్పలేనని నటి క్యాథరిన్ ట్రెసా చెప్పింది. -
‘వరల్డ్ ఫేమస్ లవర్’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
-
వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
తగ్గిన అవకాశాలు.. ఫొటోషూట్లతో హల్చల్!
తమిళసినిమా : నటి కేథరిన్ ట్రెసా అవకాశాల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడిని సినీ ఇండస్ట్రి పట్టించుకోవడం లేదనే చెప్పాలి. కారణం ఏమిటో తెలియడంలేదు. దుబాయ్‌లో పుట్టి పెరిగిన భారతీయ సంతతికి చెందిన నటి కేథరిన్. అయితే తన ఉన్నత చదువును బెంగళూర్లోనే చదివింది. ఈ బ్యూటీకి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. వయోలిన్ వాయించడం, పాటలు పాడడం వంటి కళల్లో నేర్పరి అయిన కేథరిన్ ట్రెసా మొదట్లో మోడలింగ్ రంగంలో రాణించింది. ఆ తరువాత నటిగా సినీరంగప్రవేశం చేసింది. తొలుత కన్నడంలో శంకర్ ఐపీఎస్ అనే చిత్రంతో నటిగా తన పయనాన్ని ప్రారంభించింది. అది 2010లో తెరపైకి వచ్చింది. అ తరువాత మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలను అందుకుంది. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు సక్సెస్‌ను అందుకుంది. కోలీవుడ్‌లో మెడ్రాస్ చిత్రం ద్వారా కార్తీకి జంటగా దర్శకుడు పా.రంజిత్ పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు కేథరిన్ట్రెసాకు పేరు తెచ్చి పెట్టింది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ అమ్మడిని మెడ్రాస్ చిత్రంలో పక్కింటి అమ్మాయిగా చూపించి దర్శకుడు కేథరిన్ ట్రెసా రూపురేఖలను మార్చేశారు. ఆ తరువాత ఈ జాణ గ్లామర్‌కు మారిపోయింది. అలా విశాల్, అధర్వ, ఆర్య వంటి యువ స్టార్స్‌తో వరుసగా నటించి గుర్తింపు పొందిన కేథరిన్ ట్రెసాకు సడన్‌గా కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. అందంతో పాటు మంచి ట్యాలంట్ ఉన్న ఈ అమ్మడికి కారణాలేమైనా ఇతర భాషల్లోనూ అవకాశాలు తగ్గిపోయాయి. చివరిగా ఈ బ్యూటీ తమిళంలో శింబుకు జంటగా వందా రాజావాదాన్ వరువేన్ చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం అరువమ్ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. అయితే తొలి చిత్రం మెడ్రాస్ తరువాత కోలీవుడ్‌లో కేథరిన్ ట్రెసాకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభించలేదనే చెప్పాలి. అన్నీ గ్లామరస్ పాత్రలే రావడంతో వాటికే పరిమితం అయిపోయింది. ఇప్పుటికీ అందాలారబోతకు సై అంటోంది. నటిగా దశాబ్దం పూర్తి కావస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్ ఇన్నింగ్స్ కోసం రెడీ అయ్యింది. అవకాశాల వేట మొదలెట్టింది. అందులో భాగంగా గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా మెడ్రాస్ చిత్రం తరహాలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో తనను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని, అయితే అలాంటి పాత్రలను తానూ ఆశిస్తున్నా, గ్లామర్ పాత్రలను వదులుకోనని కేథరిన్ ట్రెసా పేర్కొంది. కాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన గ్లామరస్ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇవి అవకాశాలను ఏపాటి తెచ్చి పెడతాయన్నదే చూడాలి. ఎందుకంటే తమిళసినిమా కేథరిన్ ట్రెసాను పక్కన పెట్టేసిందనే చెప్పాలి. -
వింత వ్యాధితో బాధపడుతున్న బన్నీ హీరోయిన్!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఇద్దరు అమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో తన అందాలతో యువతను ఆకట్టుకుంది గ్లామరస్ బ్యూటీ కేథరిన్ ట్రెసా. సరైనోడులో గ్లామరస్ ఎమ్మెల్యేగా తన అందంతో కుర్రకారులకు పిచ్చెక్కించింది. ఆ సినిమాలో ఆమెతో ఉన్న సన్నివేశాలను సినిమాకే హైలెట్. టాలీవుడ్ చాలా సినిమాలే చేసినా ఈ అందాల భామకు ఆశించన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే కోలీవుడ్‌లో మాత్రం వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు చెబుతూ.. వింత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది ఈ అమ్మడు. ఈ జబ్బు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుందట. ఇంతకీ ఈ బ్యూటీకి వచ్చిన జబ్బు ఏంటో తెలుసా.. అనోస్మియ. ఈ జబ్బు ఉన్న వారు వాసన చూడలేరు. ఎంత సువాసన అయినా.. ఎంత దుర్వాసన అయినా వారికి తెలియదు. వాసన చూసే శక్తి వారికి అస్సలు ఉండదు. ఈ జబ్బు ఉన్న కారణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకూడదని భావిస్తుందట. లక్షల్లో ఒక్కరికి వచ్చే ఈ జబ్బు కేథరిన్ కు రావడం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన జబ్బు సినిమాల్లో నటించడానికి అడ్డు కాదని క్యాథరిన్ టెస్రా అంటోంది. -
కావాలని గ్యాప్ తీసుకోలేదు
‘‘నచ్చిన పాత్ర వస్తేనే చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఫస్ట్ హీరోయినా లేక సెకండ్ హీరోయినా అనేది పెద్దగా పట్టించుకోను. నా పాత్ర సినిమాకు ఎంత కీలకం అనేది నాకు ముఖ్యం. అన్ని రకాల పాత్రలు చేస్తూ, చేసే ప్రతీ పాత్రలో ప్రేక్షకులను అలరించాలన్నదే నా లక్ష్యం’’ అని హీరోయిన్ కేథరిన్ అన్నారు. సిద్ధార్థ్, కేథరిన్ జంటగా సాయి శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వదలడు’. దెయ్యమైనా సరే అనేది క్యాప్షన్. అంజయ్య సమర్పణలో టి. నరేశ్ కుమార్, టి శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్ చెప్పిన విశేషాలు. ► ‘వదలడు’ సినిమాలో జ్యోతి అనే టీచర్ పాత్ర చేశాను. తను వాసనలను పసిగట్టలేదు. దాంతో స్నేహితులు జోక్ చేసి, తన కాన్ఫిడెన్స్‌ను తగ్గించేస్తుంటారు. ఈ పాత్ర చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే కళ్లు కనిపించని పాత్ర, చెవులు వినిపించని పాత్ర అంటే ఒక స్టయిల్లో చేయొచ్చు. ఈ పాత్ర చేయడం డిఫరెంట్‌గా అనిపించింది. ఈ చిత్రకథ ఆహార పదార్థాల కల్తీ చుట్టూ తిరుగుతుంది. ► మన దేశం కంటే విదేశాల్లో ఆహార కల్తీ మీద చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్లా కనిపిస్తారు. తనతో నటించడం మంచి ఎక్స్పీరియన్స్. సిద్ధార్థ్‌కు సామాజిక బాధ్యత చాలా ఎక్కువ. తన ట్వీటర్లో ఎప్పుడూ ఏదో ఒక మంచి టాపిక్‌ను ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. ► ఇది హార్రర్ సినిమా అయినా పూర్తిస్థాయి హార్రర్ కాదు. సూపర్ న్యాచురల్ అంశాలు కొన్ని ఉంటాయి. రెగ్యులర్ హారర్ సినిమా కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంజాయ్ చేస్తారు. కథకు అడ్డుపడకూడదని కేవలం రెండు పాటలే ప్లాన్ చేశాం. తమన్ రీ–రికార్డింగ్‌ను అద్భుతంగా అందించారు. సాయిశేఖర్ నూతన దర్శకుడు అయినా సినిమాను బాగా హ్యాండిల్ చే శారు. ► నేను చేసే ప్రతీ సినిమాకు డబ్బింగ్ చెబుతాను అని డైరెక్టర్స్‌ని అడుగుతుంటాను. ‘చమ్మక్ చల్లో, గౌతమ్ నంద’ సినిమాలకు చెప్పాను. ‘సరైనోడు’ సినిమాలో ఎంఎల్ఏ పాత్ర బాగా పాపులారిటీ తెచ్చిపెట్టింది. తెలుగులో చిన్న గ్యాప్ వచ్చింది. అయితే కావాలని తీసుకోలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేస్తున్నాను. ఇందులో నాది మంచి పాత్ర. -
అడవి సాక్షిగా..
అదొక అటవీ ప్రాంతం. అడవి సాక్షిగా ఆ ప్రాంతంలో ఉండే రెండు మనసులు కలుస్తాయి. అయితే వారి ప్రేమకు ఆ అమ్మాయి అన్నలు విలన్లు అవుతారు. మరి.. ఆ జంట తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రం ‘గజేంద్రుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఆర్య, కేథరిన్ జంటగా రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్షీ్మ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై భారతి, వరప్రసాద్ వడ్డెల్ల సమర్పణలో ఉదయ్ హర్ష వడ్డెల్ల తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ – ‘‘హీరోగా, విలన్‌గా ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. కథానాయికగా కేథరిన్ చాలా పాపులర్. వీరిద్దరి జంట తెరపై కనువిందు చేసే విధంగా ఉంటుంది. తమిళంలో ఘన విజయం సాధించి, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్న చిత్రమిది. ఇందులో ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా ఇద్దరూ నటించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఆర్య ఈ సినిమా కోసం వెయిట్ పెరిగారు. సినిమాకు ఓ హైలెట్ గా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఉంటుంది. మార్చిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
‘రౌడీ’తో జోడి..!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రారంభం కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా కథాయికలుగా నటిస్తుండగా మరో హీరోయిన్గా కేథరిన్ తెరిస్సా ఎంపికైంది. గోపిసుందర్ సంగీతం సమకూరుస్తుండగా, జేకే సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పతాకంపై కెఏ వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. -
మరదలు దొరికింది
అత్తారింటికి దారి కనుక్కునే పనిలో తమిళ హీరో శింబు బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయనతో ప్రయాణానికి కేథరిన్ కూడా తోడయ్యారట. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మేఘా ఆకాశ్ ఓ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేథరిన్ థెరీసా కూడా తోడయ్యారు. దీంతో బావకు ఇద్దరు మరదళ్లు దొరికారు. తెలుగులో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే. మరి.. మేఘా, కేథరిన్ ఏయే పాత్రలు చేస్తారన్నది ఇంకా బయటకు రాలేదు. అలాగే శింబుకు అత్తగా ఎవరు నటిస్తారన్నది కూడా చిత్ర బృందం వెల్లడించలేదు. ఖుష్బూ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. -
12 గంటలు 30 కిలోల బరువు
12 గంటలు 30 కిలోల బరువు అంటే అర్థం కాలేదు కదూ! అందాలారబోతకే పరిమితం అనే ముద్ర వేసుకున్న నటి క్యాథరిన్ ట్రెసా. కార్తీకి జంటగా మెడ్రాస్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ ఉత్తరాది బ్యూటీ తొలి చిత్రంతోనే హిట్ అందుకుంది. ఆ చిత్రంలో పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరినీ ఆకర్షించిన ఈ అమ్మడు ఆ తరువాత చిత్రాల్లో గ్లామర్ విషయంలో దుమ్మురేపింది. అలా గ్లామర్నటి ముద్రవేసుకున్న క్యాథరిన్ ట్రెసా గత చిత్రం కలగలప్పు–2 చిత్రంలోనూ అదే బాణీలో నటించింది. తాజాగా సిద్ధార్థ్ సరసన నూతన చిత్రంలో నటిస్తోంది. సాయిశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇందులో నటిస్తున్న క్యాథరిన్ ట్రెసా గురించి దర్శకుడు తెలుపుతూ ఈ చిత్రంలో కష్టపడి నటించే కథానాయకి అవసరం అయ్యిందన్నారు. అలాంటి నటి కోసం పరిశీలిస్తుండగా నటి క్యాథరిన్ ట్రెసా అయితే బాగుంటుందని భావించినట్లు తెలిపారు. వెంటనే ఆమెను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇందులో కథానాయకి పాత్ర సాధారణంగా ఉందని, పలు సన్నివేశాల్లో శ్రమించి నటించాల్సి ఉంటుందని అన్నారు. అయితే తాము భావించించినట్లుగానే క్యాథరిన్ ట్రెసా వాననకా, ఎండనకా కష్టం అని భావించకుండా చాలా బాగా నటించిందని తెలిపారు. చిత్రంలో ఒక సన్నివేశంలో విలన్ హీరోయిన్ తలపట్టుకుని జరజరా ఈడ్చుకుంటూ వచ్చే సన్నివేశం చోటుచేసుకుంటుందన్నారు. మరో సన్నివేశం కోసం 30కిలోల బరువును మోస్తూ నటించాల్సి ఉంటుందని, ఆ సన్నివేశం కోసం క్యాథరిన్ ట్రెసా 12 గంటల పాటు 30 కిలోల బరువును మోస్తూ నటించిందని దర్శకుడు తెలిపారు. మొత్తం మీద చాలా కాలం తరువాత క్యాథరిన్ ట్రెసాను ఒక ముఖ్యమైన పాత్రలో చూడబోతున్నామన్న మాట. ఈ చిత్రంతో అమ్మడి గ్లామరస్ నటి అనే ముద్ర పోతుందేమో చూద్దాం. -
థ్యాంక్స్ అని చెబుతానే కానీ ప్రోత్సహించను
తమిళసినిమా: కోలీవుడ్‌లో మెడ్రాస్ చిత్రంతో మెరిసిన భామ క్యాథరిన్ ట్రెసా. ఆ చిత్రంలో నెక్స్ట్ డోర్ గర్ల్‌గా కనిపించినా, ఆ తరువాత గ్లామరస్ పాత్రల్లో విజృంభించిందనే చెప్పాలి. ఇటీవల సుందర్.సి తెరకెక్కించిన కలగలప్పు–2 చిత్రంలో కూడా కావలసినంత గ్లామర్‌ను ప్రేక్షకులకు పంచేసింది. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ తన అందాలతో అలరించేస్తోంది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంతో గుర్తింపు పొందింది. ఐటమ్ సాంగ్స్‌కు నో చెప్పని ఈ బ్యూటీ తన మనసులోని భావాలను ఇలా పంచుకుంది. తమిళంలో నాకు మంచి కథా పాత్రలు లభిçస్తున్నాయి. చిత్రం చిత్రంకు వైవిధ్యం చూపే అవకాశం లభిస్తోంది. కొన్ని చిత్రాల్లో గ్లామరస్‌గా నటించినా, అందుకు సిగ్గు పడడం లేదు. నిజం చెప్పాలంటే గర్వపడుతున్నాను. పాత్రకు ఏం అవసరమో అది చేస్తున్నాను. ఇక్కడ మంచి అవకాశాలు రావడంతో తానిప్పుడు తమిళ భాషను నేర్చుకుంటున్నాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచే నాట్యాన్ని నేర్చుకున్నాను. అదిప్పుడు చిత్రాల్లో నటించడానికి చాలా ఉపకరిస్తోంది. నేను డాన్స్ బాగా చేస్తానని చాలా మంది అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రేమ,పెళ్లి గురించి అడుగుతున్నారు. తొలిచూపులోనే ప్రేమ పుట్డడంపై నాకు నమ్మకం లేదు. ఒకరిని చూడగానే జీవితాంతం కలిసుండాలన్న భావన కలగాలి. అతను మనకు తోడుగా ఉంటాడన్న నమ్మకం కలగాలి. అలాంటిదే నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ చివరి వరకూ నిలిచిపోతుంది. జీవితాన్ని మధురంగా మారుస్తుంది. చూడగానే కలిగే ప్రేమ అంత వేగంగా పోతుంది. ఇకపోతే నేనిప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదు. నాకైతే చాలా మంది ప్రేమిస్తున్నట్లు చెప్పారు.అలాంటి వారిని ప్రేమిస్తున్నారా? సరే. థ్యాంక్స్ అని చెబుతానే కానీ ప్రోత్సహించను. ప్రస్తుతం చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నాను. మరో ఐదేళ్ల తరువాత పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంది అని క్యాథరిన్ ట్రెసా పేర్కొంది. -
చరణ్ సినిమాలో ఛాన్స్
రంగస్థలం సినిమాతో ఘనవిజయం సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. బోయపాటి సినిమాలో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ కూడా కంపల్సరీ. అందుకే చరణ్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఈ స్పెషల్ సాంగ్‌లో చరణ్ సరసన కేథరిన్ థ్రెస్సా ఆడిపాడినున్నారు. గతంలో బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమాలో కీలక పాత్రలో నటించిన కేథరిన్, తరువాత జయ జానకి నాయకలో స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. ఇప్పుడు మరోసారి బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చరణ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు కేథరిన్. -
న్యూయార్క్‌లో..
తమిళసినిమా: మన హీరోయిన్లు ఆ ఊ అంటే విదేశాలకు చెక్కేస్తున్నారు. అదే మంటే అక్కడ కరాటే నేర్చుకుంటున్నాను. డాన్స్‌లో శిక్షణ పొందుతున్నాను అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్రం చేస్తున్నారు. ఆ మధ్య నటి తమన్నా, అమలాపాల్ లాంటి కొందరు ఇలానే చేశారు. తాజాగా నేనేం తక్కువా అన్నట్టు నటి క్యాథరిన్ ట్రెసా బయలుదేరింది. అవకాశం ఇవ్వాలే గానీ అందాలారబోతలో తన తడాకా చూపిస్తాననే ఈ బ్యూటీ ఇటీవల కలగప్పు–2 చిత్రంలో అలానే అందాలను సిల్వర్‌స్క్రీన్‌పై పరిచేసింది. అలా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్నా, అవకాశాలు అడపాదడపానే వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఒక చిత్రం వరించింది. తమిళంలో విజయ్ హీరోగా నటించిన తెరి చిత్రం తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ కానుంది. ఇందులో ఒక హీరోయిన్గా క్యాథరిన్ ట్రెసా నటించనుందట. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ అమ్మడు అమెరికాలోని న్యూయార్క్ మహానగరంలో ఉందట. అక్కడ డాన్స్‌లో శిక్షణ పొందుతోంది. ఆ ఫొటోను ఇంటర్నెట్లో విడుదల చేసింది. దీని గురించి క్యాథరిన్ ట్రెసా తానిప్పుడు అమెరికాలో ఉన్నానని, అక్కడ న్యూయార్క్, బ్రాడ్వేలోని బాబింగ్ లాగింగ్ అనే డాన్స్ స్కూల్లో శిక్షణ పొందుతున్నట్లు పేర్కొంది. మిస్లీ అనే ప్రముఖ శిక్షకురాలు క్యాథరిన్ ట్రెసాకు డాన్స్‌లో శిక్షణ ఇస్తోందట. అక్కడ రెండు వారాల డాన్స్ శిక్షణను పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి రానుందట. ఈ శిక్షణతో ప్రత్యేక డాన్స్ మూమెంట్స్‌ను తాను ప్రదర్శించగలనని క్యాథరిన్ ట్రెసా అంటోంది. -
సందడి చేసిన సినీనటి కేథరిన్
-
నిఖిల్‌కు జోడిగా కేథరిన్
విభిన్న చిత్రాలతో విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్, ఇప్పుడు రీమేక్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ కిరిక్ పార్టీకి రీమేక్ గా తెరకెక్కుతున్న కిరాక్ పార్టీ సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కూడా మరోసారి రీమేక్ సినిమాలోనే నటించనున్నాడు నిఖిల్. తమిళనాట సంచలన విజయం సాధించిన కనితన్ సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. కోలీవుడ్ అధర్వ నటించిన పాత్రలో నిఖిల్ అలరించనున్నాడు. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన సంతోష్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ సరసన కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
సరైనోడు కంటపడలా..!
తమిళసినిమా: సరైనోడింకా కంటపడలేదు అంటోంది నటి క్యాథరిన్ ట్రెసా. ఈ అమ్మడికి తమిళంలో సరైన హిట్ రాలేదనే చెప్పాలి. గ్లామర్‌గా నటించడానికి ఏమాత్రం వెనుకాడని ధైర్యం ఉన్న నటి క్యాథరిన్ ట్రెసా. అయినా స్టార్స్‌తో జత కట్టే అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఆ మధ్య విశాల్‌తో కథకళి చేసినా, అధర్వ కణిదన్తో విజయం అందుకున్నా, అవకాశాల్లో జోరు పెరగలేదు. అయితే టాలీవుడ్లో అల్లుఅర్జున్ లాంటి స్టార్స్‌తో నటించే అవకాశాలను రాబట్టుకుంటోంది. కోలీవుడ్‌లో ఆర్యతో జతకట్టిన కడంబన్ చిత్రం తరువాత క్యాథరిన్ ట్రెసాను చూడలేదు. ప్రస్తుతం కలగలప్పు–2, కథానాయగన్ చిత్రాలతో రానుంది. ముఖ్యంగా కలగలప్పు–2లో ఈ బ్యూటీ తన అందాలతో మోత మోగించనుందనే ప్రచారం జరుగుతోంది. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన ఈ జాణను ఎలాంటి పాత్రలను ఇష్ట పడుతున్నారంటే చాలా మంది హీరోయన్ల మాదిరిగానే చాలెంజింగ్ అనిపించే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అయితే హీరోలకు అక్కగానో, చెల్లెలిగానో నటించమంటే మొహమాటం లేకుంటా సారీ అనేస్తానంది. కథా పాత్ర బాగుంటే హీరోయిన్గా కాకపోయినా వారికి లవర్ లాంటి పాత్రల్లో గ్లామర్‌గా నటించడానిౖMðనా రెడీ అని చెప్పింది. క్యారెక్టర్ పాత్రలు చేయడానికి సిద్ధమా? అంటే ఆ వయసుకు తానింకా రాలేదని అంది. సరే పెళ్లెప్పుడు? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అన్న ప్రశ్నకు అందుకు సరైనోడింకా తారస పడలేదని, నచ్చినోడు లభిస్తే అప్పుడు పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని క్యాథరిన్ ట్రెసా చెప్పుకొచ్చింది. -
ఆమెకు ఇంకా సరైనోడు దొరకలేదట!
క్యాథరిన్ ట్రెసా సరైనోడు ఇంకా కంటపడలేదు అంటోంది. క్యాథరిన్‌కు తమిళంలో సరైన హిట్ రాలేదనే చెప్పాలి. ఆమె గ్లామర్‌గా నటించడానికి ఏమాత్రం వెనుకాడని ధైర్యం ఉన్న నటి. అయినా స్టార్స్‌తో జత కట్టే అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఆ మధ్య విశాల్‌తో కథకళి చేసినా, అధర్వ కణిదన్తో విజయం అందుకున్నా, అవకాశాల్లో జోరు పెరగలేదు. అయితే టాలీవుడ్లో అల్లుఅర్జున్ లాంటి స్టార్స్‌తో నటించే అవకాశాలను రాబట్టుకుంటోంది. కోలీవుడ్‌లో ఆర్యతో జతకట్టిన కడంబన్ చిత్రం తరువాత క్యాథరిన్ ట్రెసాను చూడలేదు. అయితే ప్రస్తుతం కలగలప్పు-2, కథానాయగన్ చిత్రాలతో రానుంది. ముఖ్యంగా కలగలప్పు-2లో ఈ బ్యూటీ తన అందాలతో మోత మోగించనుందనే ప్రచారం జరుగుతోంది. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన క్యాథరిన్‌ను ఎలాంటి ప్రాతలను ఇష్ట పడుతున్నారంటే చాలా మంది హీరోయన్ల మాదిరిగానే చాలెంజింగ్ అనిపించే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అని చెప్పింది. అయితే హీరోలకు అక్కగానో, చెల్లెలిగానో నటించమంటే మోహమాటం లేకుంటా సారీ అనేస్తానని అన్నది. కథ, పాత్ర బాగుంటే హీరోయిన్గా కాకపోయినా వారికి లవర్ లాంటి పాత్రల్లో గ్లామర్‌గా నటించడానికైనా రెడీ అని చెప్పింది. క్యారెక్టర్ పాత్రలు చేయడానికి సిద్ధమా? అంటే ఆ వయసుకు తానింకా రాలేదని చెప్పింది. సరే పెళ్లెప్పుడు? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా అందుకు సరైనోడు ఇంకా తారస పడలేదని, నాకు నచ్చిన వాడు దొరికితే అప్పుడు పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని క్యాథరిన్ ట్రెసా చెప్పుకొచ్చింది. -
వైజాగ్ లో కాథరీన్, మెహ్రీన్ కౌర్, శాలిని పాండే సందడి
-
బీన్యూ ఏలూరు షోరూమ్ ప్రారంభించిన కేథరీన్
ఏలూరు(సెంట్రల్): స్థానిక ఆర్ఆర్ పేటలో సోమవారం బీన్యూ మల్టీ బ్రాండ్ మొబైల్ షోరూంను హీరోయిన్ కేథరిన్ «థెరెస్సా ప్రారంభించారు. అనంతరం నూతనంగా విడుదలైన కొన్ని కంపెనీల ఫోన్లును ఆమె విడుదల చేశారు. కే«థరిన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక భాగం అయిందని అందుకు అనుగుణంగా లేటెస్ట్ టైక్నాలజీ మొబైల్స్‌ను మార్కెట్లో ముందుగా అతి తక్కువ ధరలకే బీన్యూ వినియోగదారులకు అందిస్తోందన్నారు. బీన్యూలో దీపావళికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారని ఏలూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాను తమిళంలో హీరోలు జీవ, విశాల్తోను, తెలుగులో రవితేజతో ఒక్కో సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. బీన్యూ చైర్మన్ బాలాజీ చౌదరీ మాట్లాడుతూ తమ షోరూమ్‌లో ప్రతి కంపెనీకి ఏజెంట్‌ను నియమించామన్నారు. కస్టమర్లు అభిరుచులకు అనుగుణంగా షోరూంలో యువతీయువకులను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు త్వరలో ఏపీ, తెలంగాణలో కలిపి 100 షోరూంల వరకు ప్రారంభించనున్నట్టు చెప్పారు. బీన్యూ షోరూం ద్వారా 600 మందికి ఉపా«ధి కల్పించడం సంతోషకరమని, కస్టమర్లకు మంచి సర్వీస్ ఇవ్వాలని ప్రముఖ వ్యాపారవేత్త ఉషా బాలకృష్ణ కోరారు. కే«థరీన్ థెరిస్సాను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున షోరూం వద్దకు తరలిరావడంతో ఆమె కొద్దిసేపు వారితో ముచ్చటించారు. బీన్యూ సేల్స్ హెడ్ సాంబయ్య, మార్కెటింగ్ హెడ్ ఆనందవర్దన్, వినోద్ పాల్గొన్నారు. -
ఏలూరులో సందడి చేసిన కేధరిన్
-
ఇద్దరు భామల కనువిందు
తమిళసినిమా: ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే చిత్రంలో నటిస్తే, అదీ తమ అందాలతో కుర్రకారును కనువిందు చేయడానికి ఎంతదాక అయినా వెళ్లడానికి రెడీ అనే బ్యూటీస్ అయితే ఆ చిత్రం కచ్చితంగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక సుందర్.సీ వంటి వినోదాన్ని పండించే దర్శకుడు ఆ చిత్రాన్ని మలిస్తే ఇక ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టెయిన్మెంట్కు కొదవే ఉండదు. కరెక్ట్‌గా అలాంటి చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు సుందర్.సీ దర్శకత్వం వహించిన కలగలప్పు చిత్రం కోలీవుడ్ తెరపై మంచి సందడి చేసింది. అంతే కాదు అంతకు ముందు మార్కెట్ డల్ అయిన నటులు విమల్, శివ, నటీమణులు అంజలి, ఓవియలకు విజయోత్సాహాన్నిచ్చిన చిత్రం అది. కాగా ఆ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు సుందర్.సీ సిద్ధం అయ్యారు. అయితే ఈ సారి మరింత పెద్ద కాస్టింగ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. విమల్, శివలకు బదులు ఇందులో జీవా, జైలను హీరోలుగా ఎంచుకున్నారు. ఇక ఓవియ, అంజలి స్థానంలో అందాల భామలు నిక్కీగల్రాణి, క్యాథరిన్ ట్రెసాలను ఎంపిక చేసుకున్నట్లు తాజా సమాచారం. ఈ కలగప్పు–2 చిత్రాన్ని సుందర్.సీ అక్టోబరులో ప్రారంభించనున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక పూర్వకంగా వెల్లడించే అవకాశం ఉంది. -
కేథరిన్‌తో సరదాగా కాసేపు
-
ఐటమ్‌సాంగ్స్ బాటలో..
సినిమా ఎవరిని ఎటు పయనింపజేస్తుందో ఎవరికి తెలియదు. ఎవరైనా దాని దారిలో పోవలసిందే. నటి క్యాథిరిన్ ట్రెసా పోకడ అలానే ఉంది. మెడ్రాస్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీకి ఇక్కడ కొన్ని అవకాశాలు వచ్చినా, ఆ తరువాత సన్నగిల్లాయి. నిజానికి మెడ్రాస్ చిత్రంలో మప్సల్స్ ఏరియా యువతిగా ఆ పాత్రలో క్యాథరిన్‌ట్రెసా బాగానే ఇమిడింది. ఆ తరువాతనే అమ్మడిని కనిదన్ లాంటి చిత్రాల్లో గ్లామరస్‌కు మారిపోయింది. కోలీవుడ్‌లో అవకాశాలు ఎండమావులుగా కనిపించడంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌పై దృష్టిసారించింది. అక్కడ అవకాశాలు ఆశాజనకంగా ఉన్నా, అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలు, గ్లామర్ పాత్రలే తలుపుతడుతున్నాయి. ఇటీవల నటించిన తెలుగు చిత్రం ‘గౌతమ్‌నందా’లో క్యాథరిన్ట్రెసాను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. కాగా తాజాగా రానాకు జంటగా నటించిన నాన్ ఆణైయిట్టాల్( తెలుగులో నేనేరాజు నేనేమంత్రి) చిత్రంలోనూ అందాలారబోతలో ఇరగదీసిందంటున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. అయితే దీనిపై క్యాథరిన్ ట్రెసా చాలా ఆశలు పెట్టుకుందట. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనను గ్లామర్ పాత్రలకే వాడుకుంటున్నారనే చింత ఏమాత్రం లేదట. దీంతో ఐటమ్ సాంగ్స్ క్యాథరిన్ ట్రెసా తలుపు తడుతున్నాయట. కథానాయకి అవకాశాలు ముఖం చాటేస్తే తన అందాలను నమ్ముకుని ఐటమ్ సాంగ్స్ బాట పట్టాలనే ఆలోచన క్యాథరిన్‌కు లేకపోలేదట. ప్రస్తుతం హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్‌కు చాలా గిరాకీ ఉందన్న విషయాన్ని గ్రహించిన ఈ జాణ అలాంటి లెగ్ షేక్ పాటలకు గేట్లు తెరుస్తున్నట్లు భావించాల్సి వస్తోందంటున్నాయి సినీ వర్గాలు. -
ఆయన కోసమే అలా నటించా!
తమిళసినిమా: సైరైన పాత్రనిచ్చారని..ఈ ఒక్కసారికి కానిచ్చేస్తున్నా. ఇకపై అలా నటించను అంటోంది నటి క్యాథరిన్‌ట్రెసా. విషయం ఏమిటంటే ఈ ముద్దుగుమ్మ ఎంతగా అందాలారబోసినా సెకండ్ హీరోయిన్ పాత్రలకే ఎక్కువగా పరిమితం అవుతోంది. ఇద్దరమ్మాయిలతో చిత్రంలో అమలాపాల్‌తో కలిసి అల్లుఅర్జున్‌తో వీరలెవల్లో అందాలను ఆరబోసినా పెద్దగా ఫలితం దక్కలేదు. ఇటీవల సరైనోడు చిత్రంలోనూ రెండవ నాయకి పాత్రతోనే సరిపెట్టుకుంది. తాజాగా ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శీను తాజా చిత్రంలో ఐటమ్‌గర్ల్‌గా మారిపోయింది. ఇందుకు భారీ పారితోషికమే(రూ.60 లక్షలు) పుచ్చుకుందంటున్నారు సినిమా వర్గాలు. అదేమంటే బోయపాటి కోసమే ఈ చిత్రంలో నటించడానికి సమ్మతించాను అని సాకు చెబుతోంది.ఆయన సరైనోడు చిత్రంలో తనకు అవకాశం ఇచ్చారని,అందుకే ఆయన కోరిక మేరకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న జై జానకి నాయక చిత్రంలో సింగిల్ సాంగ్‌కు అంగీకరించానని చెప్పుకొచ్చింది. అయితే ఇకపై ఐటమ్ సాంగ్‌కు ఆడేది లేదని అంటోంది. ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా లేదు. ఇటీవల ఆర్యతో నటించిన కడంబన్చిత్ర పరాజయం ఎఫెక్ట్ కావచ్చు. విష్ణువిశాల్‌తో నటించిన కథానాయకన్ చిత్రం విడుదల కావలసి ఉంది. -
సొంత గొంతు వినిపిస్తున్న మలయాళీ బ్యూటీ
ఇద్దరమ్మాయిలతో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ కేథరిన్ థెరిస్సా. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి స్టార్ ఇమేజ్ను మాత్రం అందుకోలేకపోయింది. మాలయాళ ముద్దుగుమ్మలందరూ టాలీవుడ్లో దూసుకుపోతుంటే, అక్కడి నుంచే వచ్చిన కేథరిన్ మాత్రం రేసులో వెనకపడింది. తాజాగా గోపిచంద్ సరసన హీరోయిన్గా నటిస్తున్న గౌతమ్ నందతో స్టార్ స్టేటస్ అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ, గౌతమనంద సినిమాలో మరో టాలెంట్‌ను చూపిస్తోంది. ఇప్పటి వరకు తన పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయం తీసుకున్న ఈ బ్యూటీ, గౌతమ్ నంద సినిమాలో సొంత గొంతుతో అలరించనుంది. టాలీవుడ్లో దూసుకుపోతున్న మలయాళ బ్యూటీస్ అందరూ ఇప్పటికే ఓన్ డబ్బింగ్‌తో ఆకట్టుకుంటుండటంతో కేథరిన్ కూడా అదే బాటలో నడిచేందుకు ఫిక్స్ అయ్యింది. యాక్షన్ హీరో గోపిచంద్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న గౌతమ్ నంద సినిమాకు మాస్ స్పెషలిస్ట్ సంపత్ నంది దర్శకుడు. ఈ సినిమాలో కేథరిన్ థెరిస్సాతో పాటు హన్సిక మరో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
శరీర సౌందర్యం ముఖ్యం
టీనగర్: తారలకు శరీర సౌందర్యం ముఖ్యమని నటి కేథరిన్ ట్రెసా అంటోంది. ఇటీవల ఈ బ్యూటీ ఆర్యతో కలిసి నటించిన కడంబన్ చిత్రం విడుదలై అభిమానుల నీరాజనాలు అందుకుంటోంది. అంతేగాకుండా కేథరిన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా కేథరిన్ ట్రెసా మాట్లాడుతూ తాను అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ, కడంబన్ లాంటి చిత్రంలో నటించలేదని, అంతలా కష్టపడింది లేదన్నారు. కొన్ని రోజులపాటు నటించిన తనకే అంత కష్టంగా అనిపిస్తే, అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించే మహిళలను చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. అందుకే వారికి తన సెల్యూట్ అన్నారు. తదుపరి విష్ణుతో కథానాయగన్ చిత్రంలో నటించనున్నానని, తనతోపాటు నటించిన అనేక మంది నటులు తనను ఎంతగానో ప్రశంసించినట్లు తెలిపారు. నటీమణులకు శారీరక సౌందర్యం అతి ముఖ్యమని, తాను ప్రతిరోజూ తప్పకుండా యోగా, ఏరోబిక్స్ చేస్తానన్నారు. అలాగే, ఫాస్ట్ఫుడ్స్ జోలికి వెళ్లనని, స్వీట్స్ కూడా నిషేధించినట్లు తెలిపారు. దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని, ఇందుకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిం చాలని కోరారు. తాను దుబాయ్‌లో పెరిగానని, అక్కడలా మహిళలపై హింసకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మీడియాను సంతృప్తి పరచిన కేథరిన్
‘మెడ్రాస్’ చిత్రంతో తమిళ తెరకు పరిచయమైన అందాల తార కేథరిన్ ట్రెసా. ఆ తర్వాత అమ్మడు కథకళి చిత్రంలో నటించింది. ఇటీవల కేథరిన్ నటించిన ‘కడంబన్’ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్ర విడుదలకు ముందు ప్రమోషన్ పనుల కోసం చెన్నై కొచ్చిన కేథరిన్ ట్రెసా మీడియాతో మాట్లాడింది. అప్పుడు ఆమెతోపాటు భద్రతకు జిమ్ బాయ్స్, మేకప్ ఉమెన్, టచ్ అప్ ఉమెన్ సహా అంతా వచ్చారు. అమ్మడు భేటీ ఇచ్చే సమయంలో టచ్ అప్ ఉమెన్ టచ్ చేస్తూ ఉంది. ఆమె సొంత ఊరు, తల్లిదండ్రుల గురించి ఓ పత్రికా ప్రతినిధి ప్రశ్నించగా తాను నాలుగైదు సినిమాల్లో నటించాననంది. తానేమీ కోలీవుడ్‌కు కొత్తదాన్ని కాదుకదా, మరెందుకు ఇటువంటి పాత ప్రశ్నలు అంటూ బదులు చెప్పడానికి నిరాకరించింది. అప్పుడు తమిళ భాష కూడా రాని కేథరిన్ తెలిసి తెలియని తమిళంలో మాట్లాడింది. చివరిలో తన భేటీని తాను చెప్పినట్టే వేయాలని ఆదేశించింది. మార్చి ప్రచురించవద్దని తెలిపింది. ఏమైనా సందేహం ఉంటే ఇప్పుడే అడగండి అని తెలిపింది. తన భేటీ తప్పుగా రాకూడదని చెప్పింది. సందేహం వస్తే అడగడానికి మీ ఫోన్ నంబరు ఇవ్వండని విలేకరులు అడిగారు. అయితే తన సెల్‌ఫోన్ నంబరును ఎవరికీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అవసరమనుకుంటే నా మేనేజర్ ఫోన్ నంబరుకు సంప్రదించండి అని తెలిపి వెళ్లిపోయింది. మూడు చిత్రాల్లో మాత్రమే నటించిన స్థితిలో కేథరిన్ నడుచుకున్న విధానం మీడియా ప్రతినిధులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ విషయం గ్రహించిన అమ్మడు ‘కడంబన్’ విడులైన తర్వాత మళ్లీ అదే చోట మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సారి భద్రతకు జిమ్ బాయ్స్, టచ్ అప్ ఉమెన్ లేకుండా వచ్చింది. తమిళంలో మాట్లాడింది. మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది. అడిగిన వారికందరికీ తన సెల్‌ఫోన్ నంబరు ఇచ్చింది. కేథరిన్ ట్రెసాలో వచ్చిన ఈ మార్పు మీడియా మిత్రులను ఆశ్చర్యపోయారు. ఎట్టకేలకు తప్పు తెలుసుకున్న కేథరిన్ మిడియా మిత్రులను సంతృప్తి పరిచింది. -
లైంగిక వేధింపులు తగ్గాలంటే శిక్షించాల్సిందే!
లైంగిక వేధింపులు తగ్గాలంటే అందుకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటోంది నటి కథెరిన్ ట్రెసా. కేరళా కొట్టాయంకు చెందిన ఈ మలయాళం కుట్టి మెడ్రాస్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథకళి, కణిదన్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు మధ్యలో టాలీవుడ్లో మెరిసి తాజాగా కడంబన్ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది. ఆర్య కథానాయకుడిగా నటించి సూపర్‌గుడ్ ఆర్బీ.చౌదరితో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాఘవ దర్శకుడు.కడంబన్ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నటి క్యాథరిన్ ట్రెసా ఈ చిత్రంలో నటించిన అనుభవాలను నెమరవేసుకుంది. అవేంటో చూద్దాం..మా స్వస్థలం కేరళలోని కొట్టాయం. అయితే నేను పుట్టి పెరిగింది దుబాయ్‌లో. నాన్న ఉద్యోగం కారణంగా కుటుంబం అంతా అక్కడే నివాసం. సినిమా అంటే ఆసక్తి కారణంగానే నటనను వృత్తిగా ఎంచుకున్నాను. తక్కువ చిత్రాలైనా గుర్తుండిపోయేలాఉండాలని కోరుకుంటున్నాను.అలా ఇష్టపడి నటించిన చిత్రం కడంబన్. చిత్ర షూటింగ్‌ను కోడైకెన్నాల్ సమీపంలోని దట్టమైన అడవుల్లో తీశారు.అక్కడ కరెంట్ లేదు, సెల్ఫోన్లు పనిచేయవు. మా కోసం ఆ ప్రాంతంలోని ఒక గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు.అక్కడ బస చేయడం,ఈ చిత్రంలో నటించడం వ్యత్యాసమైన అనుభవం.చిత్రం ఆధ్యంతం కాళ్లకు చెప్పులు లేకుండా నటించాను.ఆ ప్రాంతంలో షూటింగ్ అనగానే మొదట హడలిపోయాను. తమిళం,తెలుగు భాషల్లో నేను ఎంతగానో కష్టపడి నటించిన చిత్రం ఇదే. అన్నట్టు నేనీ చిత్రంలో ఫైట్స్ కూడా చేశాను.ఆర్యతో నటించడంతో ఆయన మీకు బిరియానీ వండి పెట్టారా?అని అడుగుతున్నారు.నట్టడవుల్లో బిరియాని ఎలా లభిస్తుంది చెప్పండి. అయినా ఆహార విషయంలో నేను కొన్ని కట్టుబాట్లను విధించుకున్నాను. అలాగే వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తాను. ఒక తెలుగు చిత్రంలో సింగిల్ సాంగ్‌కు రూ.65 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నారటగా అని అడుగుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు చేస్తున్న చిత్రం అది.అందులో ఒక పాటకు నటించమని అడిగారు. నాకు నచ్చడంతో నా స్థాయికి తగ్గ పారితోషికాన్ని తీసుకుని నటించాను.అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ పోటీ ఉంది.అది మంచిదే. ప్రతిభను మెరుగుపరచుకునేలా చేస్తుంది.మహిళలపై లైంగిక వేధింపుల గురించి మీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నారు.అలాంటి చర్యలకు పాల్పడేవారిని తీవ్రంగా శిక్షించాలి.అప్పుడే నేరాలు,ఘోరాలు తగ్గుతాయి. -
వారిని శిక్షించాల్సిందే : హీరోయిన్
లైంగిక వేధింపులు తగ్గాలంటే అందుకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటోంది నటి క్యాథరిన్ ట్రెసా. కేరళా కొట్టాయంకు చెందిన ఈ మలయాళం కుట్టి మెడ్రాస్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథకళి, కణిదన్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు మధ్యలో టాలీవుడ్లో మెరిసి తాజాగా కడంబన్ చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది. ఆర్య కథానాయకుడిగా నటించిన సూపర్‌గుడ్ ఆర్బీ.చౌదరితో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాఘవ దర్శకుడు. కడంబన్ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నటి క్యాథరిన్ ట్రెసా ఈ చిత్రంలో నటించిన అనుభవాలను గుర్తుచేసుకుంది. అవేంటో చూద్దాం.. మా స్వస్థలం కేరళలోని కొట్టాయం. అయితే నేను పుట్టి పెరిగింది దుబాయ్‌లో. నాన్న ఉద్యోగం కారణంగా కుటుంబం అంతా అక్కడే నివాసం. సినిమా అంటే ఆసక్తి కారణంగానే నటనను వృత్తిగా ఎంచుకున్నాను. తక్కువ చిత్రాలైనా గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటాను. అలా ఇష్టపడి నటించిన చిత్రం కడంబన్. చిత్ర షూటింగ్‌ను కోడైకెన్నాల్ సమీపంలోని దట్టమైన అడవుల్లో తీశారు. అక్కడ కరెంట్ లేదు, సెల్ఫోన్లు పనిచేయవు. మా కోసం ఆ ప్రాంతంలోని ఒక గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. అక్కడ బస చేయడం, ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం. చిత్రం ఆధ్యంతం కాళ్లకు చెప్పులు లేకుండా నటించాను. ఆ ప్రాంతంలో షూటింగ్ అనగానే మొదట హడలిపోయాను. తమిళం, తెలుగు భాషల్లో నేను ఎంతగానో కష్టపడి నటించిన చిత్రం ఇదే. అన్నట్టు నేనీ చిత్రంలో ఫైట్స్ కూడా చేశాను. ఆర్యతో నటించడంతో ఆయన మీకు బిరియానీ వండి పెట్టారా?అని అడుగుతున్నారు. నట్టడవుల్లో బిరియానీ ఎలా లభిస్తుంది చెప్పండి. అయినా ఆహార విషయంలో నేను కొన్ని కట్టుబాట్లను విధించుకున్నాను. అలాగే వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తాను. ఒక తెలుగు చిత్రంలో సింగిల్ సాంగ్‌కు రూ.65 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నారటగా అని అడుగుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు చేస్తున్న చిత్రం అది. అందులో ఒక పాటకు నటించమని అడిగారు. అందుకు వారు అనుసరించిన విధానం నచ్చడంతో నా స్థాయికి తగ్గ పారితోషికాన్ని తీసుకుని నటించాను. అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ పోటీ ఉంది. అది మంచిదే. ప్రతిభను మెరుగుపరచుకునేలా చేస్తుంది. మహిళలపై లైంగిక వేధింపుల గురించి మీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నారు. అలాంటి చర్యలకు పాల్పడేవారిని తీవ్రంగా శిక్షించాలి. అప్పుడే నేరాలు, ఘోరాలు తగ్గుతాయి. -
ఐటెం సాంగ్‌కు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్!
నటి క్యాథరిన్ ట్రెసా టాలీవుడ్లో దూసుకుపోతోంది. 2016లో ’సరైనోడు’ వంటి సూపర్‌హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఇప్పుడు మంచి అవకాశాలే వస్తున్నాయి. ’ఖైదీ నంబర్ 150’ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమా నుంచి తప్పుకున్నా.. ఈ భామ కెరీర్‌కు పెద్దగా రిస్క్ ఎదురుకాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా సినిమాలో ఓ స్పెషల్ నంబర్ కోసం క్యాథరిన్‌ను తీసుకున్నారు. లావిష్‌గా తెరకెక్కిస్తున్న ఈ ఐటెంసాంగ్ కోసం ఈ అమ్మడికి కళ్లుచెదిరే రీతిలో రూ. 65 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. క్యాథరిన్‌కు ఇది నిజంగా చాలా పెద్దమొత్తమే. పూర్తి సినిమా చేసిన ఇంతస్థాయిలో ఆమెకు రెమ్యూనరేషన్ దక్కేది కాదని, కానీ ఒక్క పాట కోసమే రూ. 65 లక్షలు ఇస్తుండటం పెద్ద విషయమని అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాథరిన్ మంచి డ్యాన్సర్ కావడం.. పాటకు సరిపోయే అందచందాలు తనకు ఉండటంతోనే పెద్దమొత్తంలో చెల్లించారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వల్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్
హీరోయిన్గా నటిస్తున్నవాళ్లు ప్రత్యేక పాటకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే.. ఆ పాటకు సినిమాలో చాలా స్పెషాల్టీ ఉండాలి. ఉంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కేథరిన్ ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి పచ్చజెండా ఊపారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. ఈ చిత్రంలోనే కేథరిన్ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాల్లో బెల్లంకొండ పక్కన తమన్నా ప్రత్యేక గీతాలతో కుర్రకారును ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. తాజా చిత్రంలో కేథరిన్ చేయనున్న ఐటమ్ సాంగ్ వాటికి ధీటుగా చాలా గ్రాండ్‌గా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పాట కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఇప్పటికే భారీ సెట్ సిద్ధం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ప్రత్యేక పాట ట్యూన్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించవచ్చు. -
స్పీడున్నోడితో స్పెషల్ సాంగ్‌లో..!
అల్లుడు శీను సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఆ తరువాత చేసిన స్పీడున్నోడు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో కాస్త గ్యాప్ తీసుకొని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో ప్రయత్నం చేస్తున్నాడు. తొలి రెండు సినిమాల్లో తమన్నాతో స్పెషల్ సాంగ్స్‌లో ఆడి పాడిన సాయి శ్రీనివాస్, నెక్ట్స్ సినిమా కోసం మరో బ్యూటీ క్వీన్‌ను రంగంలోకి దించుతున్నాడు. ఇద్దరమ్మాయిలతో., సరైనోడు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న కేథరిన్ థెరిస్సా, బోయపాటి సినిమా కోసం సాయి శ్రీనివాస్‌తో ఆడిపాడనుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్లో సాయి, కేథరిన్ల మీద పాటను చిత్రీకరిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
కథానాయకన్‌గా విష్ణువిశాల్
యువ నటుడు విష్ణువిశాల్ హీరోగా చిత్ర చిత్రానికి తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సుశీంద్రన్ దర్శకత్వంలో మా వీరన్కిట్టు చిత్రంలో నటిస్తున్నారు. శ్రీదివ్య నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. కాగా విష్ణువిశాల్ ఇటీవల వేలైయన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రంతో నిర్మాతగా కూడా మారి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా తను హీరోగా నటిస్తూ రెండో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికి కథానాయకన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది 1988లో పాండిరాజన్ హీరోగా ముక్తా శ్రీనివాసన్ నిర్మించిన చిత్రం పేరు కావడం గమనార్హం. కాగా ఈ చిత్రానికి మురుగానందం దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విష్ణువిశాల్‌కు జంటగా నటి క్యాథరిన్ ట్రెసా నటించనున్నారు. ఇది మంచి ఎంటర్టెయిన్మెంట్తో సాగే జనరంజక కథా చిత్రంగా ఉంటుందని, నిర్మాతగా తొలి విజయం సాధించిన విష్ణువిశాల్ ఈ చిత్రంంతో మరో విజయాన్ని అందుకుంటారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. -
చిరు 150 నుంచి కేథరిన్ ఔట్..?
స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినా.. బిజీ హీరోయిన్ అనిపించుకోలేకపోయిన బ్యూటి కేథరిన్ థెరిస్సా. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. తమిళ నాట మాత్రం కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇటీవల తెలుగులో కూడా సరైనోడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటికి మరో భారీ ఛాన్స్ తలుపు తట్టింది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో స్పెషల్ సాంగ్‌కు కేథరిన్‌ను తీసుకున్నారు. అయితే షూటింగ్ సమయంలో జరిగిన గొడవ కారణంగా ఈ సినిమా నుంచి కేథరిన్‌ను తీసేశారన్న టాక్ వినిపిస్తోంది. కేథరిన్ స్థానంలో స్సెషల్ సాంగ్ కోసం లక్ష్మీ రాయ్‌ని తీసుకున్నారట. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో ఐటమ్ నంబర్‌తో ఆకట్టుకున్న లక్ష్మీరాయ్ ఇప్పుడు మెగాస్టార్ సరసన స్టెప్పులేసేందుకు రెడీ అవుతోంది. -
చిరు సరసన మెగా చాన్స్ కొట్టేసింది!
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఖైదీ నెం.150'. తొలుత ఈ మూవీ టైటిల్ పై ఎంతో కసరత్తు జరిగింది. కత్తిలాంటోడు అని కొన్ని రోజులు మూవీ యూనిట్ ప్రచారం కూడా చేసినా.. చివర్లో 'ఖైదీ నెం.150'కి ఫిక్స్ అయ్యారు. ఈ మూవీలో చిరు సరసన నయనతార, అనుష్క అని ప్రచారం జరిగినా చివరికి 'చందమామ' కాజల్ అగర్వాల్ ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం దర్శకుడు వి.వి.వినాయక్ దక్షిణాది హీరోయిన్ కేథరిన్ ట్రెసాను సంప్రదించగా ఆమె ఒకే చెప్పేసింది. చిరుతో కలిసి స్టెప్పులు వేసే అవకాశాన్నిఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది. మెగాస్టార్ మూవీ అనగానే దాదాపు మూడు నెలల కిందటే కేథరిన్ ఈ మూవీలో సాంగ్ కోసం సంతకం చేసిందట. తాజాగా ఈ విషయాన్ని మూవీ యూనిట్ వారు వెల్లడించారు. అయితే ఈ సాంగ్ ఇంకా షూట్ చేయలేదట. తమిళ మూవీ ఒరిజినల్ 'కత్తి' లో ఈ పాట లేదని సమాచారం. తమిళ కత్తి రీమేక్ అయినప్పటికీ టాలీవుడ్ ఆడియన్స్ కోసం మూవీ యూనిట్ చిన్న చిన్న మార్పులు చేస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిరు, కేథరిన్ లపై సాంగ్స్ చిత్రీకరణ జరగనుందన్న వార్త ఈ మూవీకి సంబంధించి తాజా అప్ డేట్. చిరుకు ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వి.వి.వినాయక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, లైకా ప్రొడక్షన్స్ తో కలిసి చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహిరస్తున్న విషయం తెలిసిందే. -
కాజల్.. కేథరిన్...మధ్యలో రానా
ప్రేమ కథలతో సంచనాలత్మక చిత్రాలు రూపొందించిన దర్శకుడు తేజ... ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా... వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే రేర్ న్యూసే మరి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నాయిక అంటే అది కూడా స్పెషల్ న్యూసే. ఎందుకంటే తేజ దర ్శకత్వం వహించిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతోనే కాజల్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తేజతో కాజల్ చేయనున్న చిత్రమిదే. ముందు రానా, కాజల్‌ని ఎంపిక చేసి ఫొటోషూట్ కూడా చేశారు. తాజాగా కేథరిన్ చేరారు. మరో నాయికగా ఆమెను ఎంపిక చేశారు. ఓ భిన్నమైన కథాంశంతో తేజ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనూప్ రూబెన్స్ స్వరకర్త. -
ఆర్యతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్
క్యాథరిన్‌ట్రెసా ఆర్యతో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. ఈ కేరళా కుట్టి తమిళ చిత్ర పరిశ్రమలో తన గ్రాఫ్‌ను పెంచుకుంటోందని చెప్పవచ్చు. ఇక్కడ మెడ్రాస్ చిత్రంతో తన కెరీర్‌ను మొదలెట్టిన క్యాథరిన్‌ట్రెసా ఆ చిత్ర విజయం బాగానే హెల్ప్ అయ్యింది. ఇటీవల విశాల్‌తో నటించిన కథకళి చిత్రం కమర్షియల్‌గా హిట్ అనిపించుకోవడంతో క్మాథరిన్ ట్రెసాకి కోలీవుడ్‌లో గిరాకీ పెరిగిందనే చెప్పాలి. అధర్వతో జతకట్టిన కణిదన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో పాటు క్యాథరిన్ అందాలు చిత్రానికి ఆకర్షణ అయ్యాయి. తాజాగా హీరోయిన్ల హీరోగా ప్రచారంలో ఉన్న నటుడు ఆర్యతో డ్యూయెట్లు పాడడానికి ఈ మలయాళీ బ్యూటీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాఘవ లారెన్స్‌తో మొట్టశివ కెట్టశివ చిత్రాన్ని నిర్మిస్తున్న సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్బీ.చౌదరి ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆర్య హీరోగా నటించనున్నారు. ఆయనకు జంట గా నటించే లక్కీచాన్స్ నటి క్యాథరిన్ ట్రెసాను వరించింది. ఇంతకు ముందు మంజాపై వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చిత్రం షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు క్యాథరిన్ ట్రెసా ఇప్పటికే వీర ధీర శూరన్, ముత్తురామలింగన్ చిత్రాలతో పాటు తెలుగులో సరైనోడు చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉందని కోలీవుడ్ టాక్. -
నేనింకా ప్రేమలో పడలేదు!
ఇంటర్వ్యూ ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు దగ్గరయ్యింది క్యాథరీన్ త్రెసా. పైసా, రుద్రమదేవి వంటి చిత్రాల్లో నటించింది. త్వరలో ‘సరైనోడు’తో కలసి రాబోతోంది. ఈ సందర్భంగా తన గురించి చాలా విషయాలు చెప్పింది. చాలా భాషలు వచ్చని, పాటలు వినడమే కాదు పాడతానని, బద్దకంగా ఉండేవాళ్లు నచ్చరని... ఇలా ఎన్నో కబుర్లు చెప్పేసింది. తన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ చదవాల్సిందే! కెరీర్ కాస్త స్లోగా ఉన్నట్టుంది? వట్టి తెలుగు సినిమాల గురించే తీసుకుంటే అలానే అనిపిస్తుంది. నేను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం... ఈ నాలుగు భాషల్లోనూ నటిస్తున్నాను. 2010 నుంచి ఇప్పటి వరకూ వరుసగా ఏదో ఒక భాషలో నటిస్తూనే ఉన్నాను. ఇన్ని చేస్తున్నారు. అన్ని భాషలూ వచ్చా? ఇంగ్లిష్, హిందీ, అరబిక్, కన్నడం బాగా వచ్చు. మలయాళం, తమిళం పూర్తిగా కాకపోయినా చాలావరకూ వచ్చు. తెలుగు నేర్చుకుంటున్నాను. నటన వైపు ఎలా వచ్చారు? అమ్మ త్రెసా, నాన్న ఫ్రాంక్ మారియో అలెగ్జాండర్లిద్దరూ మలయాళీ క్యాథలిక్స్. దుబాయ్‌లో సెటిలయ్యారు. నేనూ అక్కడే పుట్టి పెరిగాను. పన్నెండో తరగతి వరకూ అక్కడే చదివాను. ఆ సమయంలోనే అప్ కమింగ్ ఫ్యాషన్ డిజైనర్ల కోసం మోడలింగ్ చేస్తూండేదాన్ని. డిగ్రీ చేయడానికి బెంగళూరు వచ్చాక్కూడా మోడలింగ్ కంటిన్యూ చేశా. చెన్నై సిల్క్స్, ఫాస్ట్ ట్రాక్, డెక్కన్ క్రానికల్ వంటి యాడ్స చేశాను. తర్వాత ‘శంకర్ ఐపీస్’ అనే కన్నడ చిత్రంలో చాన్సొచ్చింది. తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు? ఎప్పుడూ పాట నా చెవిన పడుతూనే ఉండాలి. బాగా పాడతాను కూడా. డ్యాన్స్, ఐస్ స్కేటింగ్, డిబేటింగ్ ఇష్టం. వీటన్నిటిలో నేను శిక్షణ తీసుకున్నాను. ఇంకా ఏమంటే ఇష్టం? జీన్స్, టీషర్ట్స్ ధరించడానికి ఇష్ట పడతాను. రకరకాల బ్రేస్లెట్స్, రింగ్స్ ధరిస్తుంటాను. ఎరుపు, తెలుపు, నలుపు రంగులు... షేక్స్పియర్ నవలలు... రెహమాన్ సంగీతం... మణి రత్నం సినిమాలు... షారుఖ్-కాజోల్‌ల నటన... పెద్ద లిస్టే ఉంది. ఎదుటివారిలో మీకు నచ్చేది? అమాయకత్వం, కష్టపడి పనిచేసే తత్వం. మరి నచ్చనిది? బద్ధకంగా ఉండేవాళ్లను చూసినా, శుభ్రత పాటించని వాళ్లను చూసినా దూరంగా పారిపోతాను. క్రూర మనస్తత్వం కలవాళ్ల దరిదాపుల్లోకి కూడా పోను. మీలో మీకు నచ్చేదేంటి? సెల్స్ కాన్ఫిడెన్స్. నచ్చనిది? కాస్త బాగా మాట్లాడితే చాలు, మంచోళ్లని డిసైడైపోతా. వాళ్ల నిజ స్వరూపం తెలుసుకుని అవాక్కవుతా. ఎన్నిసార్లు అలా జరిగినా ఆ విషయంలో బోల్తా పడుతూనే ఉంటాను. మీ రోల్ మోడల్? ఏ అమ్మాయికైనా మొదటి రోల్ మోడల్ అమ్మే. నాక్కూడా అమ్మే మార్గదర్శి. ఇంటి పనులు చక్కబెట్టడం, నాన్నకు కావలసి నవి అమర్చిపెట్టడం, నా అవసరాలు తీర్చడం... విసుగన్నదే ఉండదు. ఏ విషయంలోనైనా చక్కగా గైడ్ చేస్తుంది. మీ జీవితంలో మర్చిపోలేని అనుభవం? చాలా ఉన్నాయి. మొదటిసారి మోడ లింగ్ చేయడం, ఇండియాలో అడుగు పెట్టిన క్షణం, తొలి సినిమా అవకాశం, ‘రుద్రమదేవి’లాంటి గొప్ప సినిమాలో చోటు దక్కడం... ఇలా మర్చిపోలేని మంచి అనుభవాలు చాలానే ఉన్నాయి. అత్యంత బాధ కలిగించినది? మా తమ్ముడి మరణం. వాడు ఊహిం చని విధంగా డిప్రెషన్‌కి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. వాడంటే నాకు ప్రాణం. నేను కాస్త డల్‌గా ఉంటే చాలు, ఏదో ఒకటి చెప్పి నవ్వించేసేవాడు. తను లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను. నా లైఫ్‌లో తన ప్లేస్‌ని ఎవ్వరూ రీప్లేస్ చెయ్యలేరు. డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? ‘బ్లాక్’లో రాణీముఖర్జీ చేసిన రోల్ చాలా ఇష్టం నాకు. అలాంటి పాత్రలు చాలా అరుదుగా పుడతాయి. ఎవరినో అదృష్టం కొద్దీ వరిస్తాయి. ఆ అదృష్టం ఒక్కసారైనా నాకు కలగాలని నా కోరిక. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడాలనుంది. దుబాయ్‌లో నేను ‘ఎమిరేట్స్ ఎన్విరాన్మెంట్ వాలంటీర్’గా చేశాను. ఇక్కడ కూడా అలా చేయాలని ఉంది. అయితే ప్రస్తుతానికి సమయం చిక్కడం లేదు. జీవితంలో కాస్త స్థిరపడ్డాక దానిమీద పూర్తిగా దృష్టి పెడతాను. ప్రేమ, పెళ్లి? పెళ్లి అప్పుడే లేదు. ఇక ప్రేమంటారా? నేనింకా ప్రేమలో పడలేదు. నాకు నచ్చే వ్యక్తి ఎదురైతే తప్పకుండా పడతా. చూడాలి ఆ వ్యక్తి ఎప్పుడు కలుస్తాడో! -
ఒక్క రోజులో జరిగే కథ
‘‘టైటిల్ చూసి ఇదేదో డ్యాన్స్‌కు సంబంధించిన చిత్రం అనుకోకండి. ఇది డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే మర్డర్ మిస్టరీ’’ అని హీరో విశాల్ అన్నారు. విశాల్, కేథరిన్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన చిత్రం ‘కథకళి’. సంక్రాంతి సందర్భంగా తమిళంలో ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రాన్ని అదే పేరుతో త్వరలో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘తన మిత్రుడికి జరిగిన సంఘటన ఆధారంగా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కించారు. చెన్నై నుంచి కడలూర్ వెళ్లే వరకూ ఒక్క రోజులో జరిగే కథ ఇది. స్క్రీన్‌ప్లే, ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని విశాల్ తెలిపారు. ‘‘ తమిళంలో సూర్యతో ‘పసంగ 2’ చిత్రం తర్వాత నేను చేసిన మూవీ ఇది’’ అని దర్శకుడు అన్నారు. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సాగే మూవీ ఇది. తమిళంలో నాకిది రెండవ చిత్రం. తెలుగులోనూ విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని కేథరిన్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ, నటులు మధుసూదనరావు, శత్రు తదితరులు మాట్లాడారు. -
విశాల్, క్యాథరిన్ లిప్‌లాక్‌కు కత్తెర
నటుడు విశాల్ నటి క్యాథరిన్ ట్రెసాల లిప్‌లాక్ కిస్‌లకు సెన్సార్ కత్తెర వేసింది. విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కథాకళి. మెడ్రాస్ చిత్రం ఫేమ్ క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. రెజీనా కస్సాంద్ర, నాజర్, కరుణాస్, సూరి, శ్రీజిత్ రవి, లక్ష్మి రామక్రిష్ణన్ పోషించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీత బాణీలు అందించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సంక్రాంతికి బరిలోకి దూకడానికి సిద్ధమవుతున్న కథాకళి చిత్రాన్ని సెన్సార్‌కు పంపనున్నారు. ఈచిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ దృశ్యాలు చోటు చేసుకున్నాయట. ఆ సన్నివేశాలను ముందుగానే ట్రైలర్లో జోడించి సెన్సార్‌కు పంపగా అక్కడ సెన్సార్ సభ్యులు ఆ సన్నివేశాలను నిర్దాక్షణ్యంగా కట్ చేసి విశాల్ క్యాథరిన్ ట్రెసాల చుంబనాలకు దగ్గరయ్యే వరకూ సన్నివేశాలు ఉంచి మిగతావి కట్ చేసి ట్రైలర్‌ను చేతిలో పెట్టారట. దాన్నే ప్రచారం చేస్తున్న చిత్ర యూనిట్ ఇప్పుడు మెయిన్ చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారని సమాచారం. లవ్,కామెడీ, యాక్షన్, అంటూ పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన చిత్రం కథాకళి అంటున్నారు చిత్రవర్గాలు. -
తాప్సీకి క్లాస్ పీకిన దర్శకుడు
ఇదీ కథ అని చెప్పి సినిమా తీసే కాలం కొండెక్కి చాలా ఏళ్లు అయ్యింది.అందుకు కారణం లేకపోలేదు. ఇదీ మా చిత్ర కథ, ఇదీ టైటిల్ అని ప్రకటించగానే ఆ కథ నాది, ఈ టైటిల్ నాకు చెందింది అంటూ కోర్టులు కేసులు పెట్టే సంస్కృతి పెరిగిపోయిందిప్పుడు. దీంతో చిత్ర కథ గురించి కాదు కదా, అందులో చిన్న సన్నివేశం గురించి కూడా దర్శక నిర్మాతలు బయటికి పొక్కనివ్వడంలేదు. చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం నోళ్లకు కూడా హెచ్చరికల తో తాళాలు వేస్తున్నారు. విలేకరుల సమావేశాల్లో కూడా యాక్షన్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఎంటర్టెయినర్, వినోదభరిత కథా చిత్రం అని చెప్పి సరిపెట్టుకుంటున్నారు. శంకర్ లాంటి కొందరు దర్శకులయితే సినిమాకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేయడంలేదు. అలాంటిది నటి తాప్సీ తాను నటిస్తున్న తాజా చిత్ర కథ కాన్సెప్ట్‌ను, తన పాత్ర వివరాలనూ విలేకరుల ముందుంచడంతో ఆ చిత్ర దర్శకుడు అప్సెట్ అవడంతో పాటు నటి తాప్సీకి క్లాస్ పీకాడట. వివరాల్లోకెళితే ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖాన్. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ, క్యాథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఖాన్ చిత్రం ఇంటిల్‌జెన్సీ విభాగానికి చెందిన కథ అనీ, తానిందులో ఇంటిల్‌జెన్సీ అధికారిగా నటిస్తున్నట్లు గొప్పగా చెప్పేశారట. దీంతో దర్శకుడు సెల్వరాఘవన్ తాప్సీకి ఫోన్ చేసి మరీ క్లాస్ పీకాడట.పాపం తాప్సీ? అసలే అరకొర అవకాశాలు. ఇప్పుడీ రాద్దాంతం ఆమెకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో వేచి చూడాల్సిందే. -
మరోసారి టాప్ లేచిపోద్ది!
‘ఇద్దరమ్మాయిలు’ సినిమాలో అల్లు అర్జున్, అమలాపాల్ ల ప్రేమకథను అన్వేషించే పాత్రలో కనిపించిన కేథరిన్ గుర్తున్నారా? అదేనండీ.. అల్లు అర్జున్‌తో కలిసి ‘టాప్ లేచిపోద్ది’ అంటూ దుమ్ము రేపిన ఈ భామ ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ సరసన నటించనున్నారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే ఈ చిత్రంలో ఈ భామ రెండో కథానాయికగా ఎంపిక అయ్యారట. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన నాయిక. హీరోలను తన దైన శైలిలో చాలా శక్తిమంతంగా చూపించే బోయపాటి శ్రీను ఈ చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
ఆహీరోయిన్కి మళ్లీ టైంమొచ్చింది!
-
భార్యే నిర్మాతగా..
ఇరండాం ఉలగం చిత్రం ఆ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్‌ను చాలా విమర్శలకు గురి చేసింది. ఆ ఎఫెక్ట్ ఆయన్ని చాలా కాలం సినిమాకు దూరం చేసింది. ఎట్టకేలకు మళ్లీ చిత్రం చేయడానికి సెల్వరాఘవన్ సిద్ధం అయ్యారు. సంచలన నటుడు శింబు హీరోగా నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అలాగే నటి త్రిష హీరోయిన్గా నటిస్తానని చెప్పి చివర్లో హ్యాండిచ్చారు. ఏదైమైనా చిత్రం నుంచి త్రిష వైదొగలగడం సెల్వరాఘవన్‌కు షాకే. అందులో నుంచి తేరుకుని మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు. అలా క్యాథరిన్ త్రెసా హీరోయిన్గా ఓకే అయ్యారు. అంతా బాగుందనుకున్న సమయంలో చిత్రానికి నిర్మాత లేకపోయారు. అందుకు వేరే కథ ఉంది లెండి. ఇలాంటి పరిస్థితిలో సెల్వరాఘవన్ తన భార్య గీతాంజలిని నిర్మాతగా చేసి గ్లో స్టూడియోస్ పతాకంపై చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం నిరాడంబరంగా ప్రారంభించారు. చిత్రంలో మరో హీరోయిన్గా నటి తాప్సీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. దీంతో ముఖ్య పాత్రలో ప్రముఖ తెలుగు నటుడు జగపతిబాబును నటింప చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
ఛాన్స్ కొట్టేసిన కేథరిన్
శింబు హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి త్రిషా తప్పుకుంది. దాంతో ఆ ఛాన్స్ చెన్నై భామ కేథరిన్ థెరిసా కొట్టేసింది. త్రిషా తప్పుకోవడంతో హీరోయిన్ అన్వేషణకు అంతగా సమయం లేకపోవడంతో దర్శకుడు సెల్వ వెంటనే కెథరిన్ సంప్రదించాడు. అందుకు ఆమె ఓకే అంది. దాంతో గత ఆదివారం కెథరిన్కు ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శింభు సరసన నటించి పాత్రలో ఒదిగిపోయే గుణాలు కేథరిన్లో ఉన్నాయని సెల్వ గ్రహించాడు. దాంతో హీరోయిన్గా ఆమెను ఎంపిక చేశారు. శింబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ గురువారం అంటే రేపు ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో శింబు, తాప్సీ, కేథరిన్ ప్రధాన పాత్రలు పొషించనున్నారు. అసలు ఏం జరిగిందంటే... అయితే త్రిష, వరుణ్ మణియన్‌తో ప్రేమలో పడటం... నిశ్చితార్థం... ఆ వెంటనే వివాహం రద్దు అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే వారి పెళ్లి ఎందుకు రద్దు అయింది అన్నది వేరే విషయం. కాకుంటే ఈ చిత్రంలో త్రిష, తాప్సీలపై పోటో షూట్ చేస్తున్న సమయంలో వరుణ్ మణియన్ అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత త్రిష, వరుణ్ వివాహం రద్దయింది. ఆ చిత్రానికి నిధులు వరుణ్ సమకూరుస్తున్నాడని సమాచారం. త్రిషతో వివాహం రద్దు కావడంతో ఆ చిత్రం నుంచి ఆమెను తప్పించాలని సెల్వను వరుణ్ కోరాడు. అసలే నిధుల సమస్యతో బాధపడుతున్న సెల్వ అలాగే అని ఓకే చెప్పడం... ఆ విషయాన్ని ముందే గమనించిన త్రిష... నాకు డేట్స్ కుదరడం లేదు... నేను ఈ చిత్రంలో నటించలేనని ముందే ప్రకటించింది. దాంతో ఆమె స్థానంలో కేథరిన్ వచ్చి చేరింది. -
శింబుతో రొమాన్స్‌కు ఓకే
ప్రేమించిన నటిని వదిలేసి వెళ్లడం, అలాగే తన సరసన నటించడానికి ముందుకొచ్చిన ఒక నటి ఆ తరువాత చిత్రం నుంచి వైదొలగడం, రెండేళ్లుగా సినిమాలు లేకపోవడం లాంటి కారణాలతో బాధలో ఉన్న నటుడు శింబుతో చిత్రంలో రొమాన్స్ చేయడానికి హీరోయిన్ ఓకే అన్నారు. సంచలన నటి త్రిష ఇటీవల వరుసగా రెండు చిత్రాల నుంచి వైదొలిగారు. అందులో నటుడు శింబు చిత్రం ఒకటి. దాదాపు రెండేళ్ల తరువాత దర్శకుడు సెల్వరాఘవన్ మెగాఫోన్ ఇంచుమించు అదేగ్యాప్ తరువాత శింబు ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వీరిద్దరూ కలసి చేయనున్న చిత్రంలో నటి త్రిష హీరోయిన్గా ఎంపికయ్యారు. నా ఫేవరేట్ దర్శకుడు సెల్వరాఘవన్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలాంటిది చిత్ర ప్రారంభానికి సన్నాహాలు జరుగుతుండగా ఈ చిత్రం చేయడం లేదంటూ తప్పుకున్నారు. దీంతో శింబుకు హీరోయిన్ వేట మళ్లీ మొదలైంది. అలా త్రిష పాత్రలో నటించే లక్కీచాన్స్ నటి క్యాథరిన్ ట్రెసా తలుపుతట్టింది. ఆ మోడ్రన్ చిత్రం ఫేమ్ బ్యూటీ ఆ చిత్రం విజయం సాధించినా తదుపరి అవకాశం లేదన్న బాధలో ఉన్న క్యాథరిన్ ట్రెసాకు లడ్డులాంటి అవకాశం శింబుతో కలిసి నటించడం, దీంతో వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నటి తాప్సీ నటించనున్నారు. చిత్ర షూటింగ్ త్వరలో సెట్‌పైకి రానుంది. -
అండగా ఉన్నారు.. థాంక్యూ: కేథరిన్ ట్రెసా
కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ టాలీవుడ్ హీరోయిన్ కేథరిన్ ట్రెసా కృతజ్ఞతలు తెలిపింది. తన సోదరుడు క్రిస్టోఫర్ మరణించి తాను తీవ్ర వేదనలో ఉన్నప్పుడు అందరూ తనకు ఎంతో ప్రేమను పంచారని, అందుకు తాను ఎంతో రుణపడి ఉంటానని ఫేస్బుక్లో ఓ సందేశం పెట్టింది. ఇక తన సోదరుడు క్రిస్టోఫర్ మరణానికి దారితీసిన పరిస్థితులను కూడా కేథరిన్ వివరించింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 10వ తేదీన క్రిస్టోఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంలో అందరికంటే అతడే చిన్నవాడు. గత రెండేళ్లుగా అతడు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడంలేదు. వాళ్లు ఏం చెప్పినా తిరగబడుతున్నాడు. చదువంటే ఆసక్తి లేకుండా పో్యింది. టీనేజిలో అదంతా సాధారణమేనని తల్లిదండ్రులతో పాటు కేథరిన్ కూడా భావించింది. కొన్నాళ్ల తర్వాత ఆధ్యాత్మికత వైపు కూడా మళ్లాడు. దాంతో అతడు తన సమస్యకు తానే పరిష్కారం చూసుకుంటున్నాడని అంతా సంతోషించారు. అంతలోనే అతడు నేరుగా దేవుడి వద్దకే వెళ్లిపోయాడని కేథరిన్ ఆవేదన వ్యక్తం చేసింది. తమ్ముడు లేడన్న మాటను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పింది. -
స్టార్ రిపోర్టర్ - కేథరీన్
-
తాత మనవరాళ్లు
చిన్నారులకు మధుర జ్ఞాపకాన్ని అందించింది సిటీప్లస్. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన ఆ పల్లె వెలుగులను పట్నం తీసుకొచ్చింది. దర్శకరత్న దాసరి నారాయణరావును వారికి తాతయ్యను చేసింది. సినీ నటి కేథరిన్‌తో సరదాగా కాసేపు ఆడించింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎల్లల్లేని ఆనందాన్ని అందించి బోలెడన్ని స్వీట్ మెమరీస్‌తో తిరిగి ఇళ్లకు చేర్చింది. మెదక్ జిల్లా మాసాయిపేట ట్రైన్ యాక్సిడెంట్ విషాదాన్ని ఇంకా ఎవరూ మరచిపోలేదు. ఆ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ఐదేళ్ల పిల్లలిద్దరినీ కాపాడి తనూ బయటపడింది! ఆ సాహసం పేరే రుచిత.. ఊరు.. వెంకటాయపాలెం! సామాన్యుడి కోసం ఓ వేయింగ్ మెషీన్‌ను తయారు చేసి జాతీయస్థాయి సైన్స్‌ఫేర్‌లో దుబ్బాక జెండా రెపరెపలాడించింది.. అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆ తెలుగు వెలుగు.. పదమూడేళ్ల అర్చన! పచ్చని పంటపొలాలు నేర్పిన జీవన పాఠాల్ని షార్ట్ సినిమాలుగా చూపింది! ఈ ప్రతిభకు ఇండోనేషియా పురస్కారం అందింది! ఆ బాల దర్శకురాలు జహీరాబాద్ వాసి మయూర! ఖోఖోలో నల్లగొండ సత్తా జాతీయస్థాయిలో చాటింది వైజయంతి! ఈ నాలుగు వజ్రాలు చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లో జిగేల్మన్నాయి.. సిటీప్లస్కే కాదు సీనియర్ మోస్ట్ సినిమా పర్సనాలిటీ.. నేడు విడుదలైన ఎర్రబస్ డెరైక్టర్ డాక్టర్ దాసరి నారాయణరావుకీ ఆత్మీయ అతిథులయ్యారు. ఆయన ఇంటికి వెళ్లారు. తాతయ్యా అంటూ మురిపించారు.. ఆయన బిజీ షెడ్యూల్‌ని కాసేపు మరిపించారు!. జూబ్లీహిల్స్.. మధ్యాహ్నం 12.30 ఎర్రబస్ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్‌మీట్ హడావుడిలో ఉన్నారు డాక్టర్ దాసరి నారాయణరావు. రుచిత, అర్చన, మయూర, వైజయంతి తనను కలవడానికి వచ్చారని తెలియగానే అంతటి బిజీని కాసేపు పక్కన పెట్టి పిల్లల్ని లోనికి ఆహ్వానించారు. వారి ప్రత్యేకతలను విని అబ్బురపడ్డారు. రుచిత చూపిన తెగువను తెలుసుకొని మనసారా ఆశీర్వదించారు. ఆ అమ్మాయి ‘మిమ్మల్ని తాతయ్యా అని పిలవచ్చా’ అంటే, ‘తాతయ్యా అనే పిలువమ్మా’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. ఎనిమిదేళ్లప్పుడే ‘నా చేను.. నా చదువు’ అనే షార్ట్ సినిమా తీశానని మయూర చెప్పగానే ‘ఆ వయసులో నేనూ నా తొలి నాటకాన్ని రాశాను. పదమూడేళ్లప్పుడు నా తోటివాళ్లకు నాటకాల్లో యాక్ట్ చేయడానికి ట్రైన్ చేసేవాడిని’ అని తన బాల్యాన్ని నెమరువేసుకున్నారు దాసరి. ‘సైన్స్‌ఫేర్‌లో అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను’ అని చెప్పిన అర్చనను ‘గ్రేట్ మ్యాన్ చేతులమీదుగా అవార్డ్ అందుకున్న గ్రేట్ గర్ల్..’ అంటూ అభినందించారు. ఖోఖోలో జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్న వైజయంతిని ‘అంతర్జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదించారు. డైనమిక్‌గా ఉండాలి.. ఎర్రబస్ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి తాతయ్యా అని అడిగిన పిల్లల ప్రశ్నలకు ‘పిల్లలంటే బాగా ఇష్టపడే తాతయ్య క్యారెక్టరే’ అని చెప్పారు. ‘మీరు తీసిన ఒసేయ్ రాములమ్మా.. సమ్మక్క సారక్క’ సినిమాలంటే మాకు చాలా ఇష్టమ’ని పిల్లలు ఆయన సినిమాలను గుర్తుచేశారు. పల్లెటూళ్లంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమా అని పిల్లలడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ‘నా చిన్నప్పుడు పల్లెటూర్లో చాలా ఎంజాయ్ చేశాను. ఈతలు, కొబ్బరిబొండాలు, కోతికొమ్మచ్చిలు, తాటికాయలు.. ఇలా అన్నీ ఇష్టమే’అని చెప్పారు. హైదరాబాద్‌తో తనకున్న జ్ఞాపకాలను పిల్లలతో పంచుకున్నారు దాసరి. ‘ఈతరం ఆడపిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు తాతయ్యా’ అని వైజయంతి అడిగితే ‘మీలాగే ధైర్యంగా.. డైనమిక్‌గా.. డాషింగ్‌గా ఉండాలి’ అంటూ వాళ్ల భుజం తట్టారు. ‘బాగా కష్టపడి ప్రయోజకులు కావాలమ్మా’ అంటూ ఆశీర్వదిస్తూ, వాళ్ల ప్రతిభాపాటవాలకు ముచ్చటపడి ‘ఈ తాతయ్య చిన్న గిఫ్ట్ ఇస్తున్నాడు తీసుకోండర్రా’ అంటూ తలా పదివేలు క్యాష్‌ప్రైజ్ ఇచ్చారు డాక్టర్ దాసరి నారాయణరావు. ‘ఈ బాలల దినోత్సం నాకిచ్చిన కానుక వీళ్లే. చిల్డ్రన్స్‌డే సందర్భంగా ఈ బాల మేధావులను కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అన్నారు దాసరి. కేథరిన్‌తో షికారు.. ఎర్రబస్సు ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లోనే ఆ సినిమా హీరోయిన్ కేథరిన్ కూడా ఈ పిల్లలతో కలిసి శిల్పారామంలో కాసేపు కేరింతలు కొట్టింది. తన సినిమా విశేషాలను పిల్లలకు చెప్పి పిల్లల వివరాలను తను తెలుసుకుంది. బ్యాటరీ కార్లో శిల్పారామం ఆవరణలో కాసేపు షికారు చేసింది. పిల్లల భవిష్యత్ లక్ష్యాలకు ఆల్ ది బెస్ట్ చెప్పి సైనాఫ్ అయింది. దాసరికి చిన్నారులు చెప్పిన ‘లక్ష్యాలు’.. మాసాయిపేట మానసపుత్రి రుచిత జడ్జి అవుతానంది. ఎందుకంటే.. ‘పేదవాళ్లకు న్యాయం చేయడానికి. అన్యాయం చేసిన వాళ్లను శిక్షించడానికి’ నల్లగొండ ఖేల్త్న్ర వైజయంతి ఏం చెప్పిందంటే.. ‘పోలీస్ ఆఫీసర్‌నై ఆడవాళ్లపై జరుగుతున్న దాడులకు చెక్ పెడతా’ మయూర అగ్రికల్చర్ జర్నలిస్ట్ అవుతానంది. ఎందుకంటే.. ‘దేశానికి వెన్నుముక రైతన్న. ఆయన ఏలే వ్యవసాయరంగాన్ని కలంతో ప్రపంచానికి పరిచయం చేయాలని’ అర్చన సైంటిస్ట్‌గా ఎదిగి.. ‘శాస్త్రీయ పరిశోధనలకు కొత్తమార్గం చూపిస్తా’ ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలున్న ఈ పిల్లలు నిజంగా మణిమాణిక్యాలే. వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వెహికల్ ఎక్కిన బాలల్ని ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా అనిపించింది అని అడిగితే ‘సూపర్! దాసరి నారాయణరావు తాతయ్యను కలవడం.. ఆయనతో మాట్లాడటం ఇంకా హ్యాపీ. ప్రజెంటేషన్: సరస్వతి రమ/ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
‘ఎర్రబస్సు’మూవీ ప్రెస్ మీట్
-
వరుస ఫ్లాపుల తర్వాత కాస్త ఊరట
వరుసపెట్టి ఫ్లాపులు దండెత్తిన చాలా కాలం తర్వాత ఓ సినిమా మంచి హిట్ కావడంతో తమిళ హీరో కార్తీ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అతడు తాజాగా నటించిన తమిళ చిత్రం 'మద్రాస్'ను ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకులు కూడా మెచ్చుకుంటున్నారు. దాంతో ఇన్నాళ్లకు కార్తీ కొంచెం ఊరటగా కనిపిస్తున్నాడు. తాను ప్రతిసారీ మంచి సినిమాలే చేయాలనుకుంటాను గానీ, కొన్ని సార్లు అవి ఎందుకు ఫెయిలవుతాయో తెలియదన్నాడు. మద్రాస్ చిత్రం విడుదలైనప్పటి నుంచి తనకు అన్ని వర్గాల వాళ్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఈ సినిమాను విజయవంతం చేసినందుకు ముందుగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని అన్నాడు. రజనీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన కేథరిన్ త్రెసా నటించింది. వాస్తవానికి కేథరిన్ తెలుగులో చాలా సినిమాల్లో చేసినా ఇక్కడ మాత్రం ఆమెకు సరైన హిట్ ఒక్కటి కూడా రాలేదు. రెండు మైనస్‌లు కలిస్తే ఒక ప్లస్ అయినట్లు.. వరుస ఫ్లాపులతో బాధపడుతున్న కార్తీ, కేథరిన్ కలిసి నటించేసరికి అది కాస్తా మంచి హిట్ అయ్యింది. -
సినిమా రివ్యూ: 'పైసా'
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, 'ఈగ' చిత్రం విజయం తర్వాత నాని కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'పైసా'. ఆరంభంలో 'పైసా' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే అనేక సమస్యలతో విడుదల బాగా ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకూ శుక్రవారం ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక అడ్డంకులను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పైసా' చిత్రం కథేంటో చూద్దాం! డబ్బులంటే విపరీతమైన పిచ్చి ఉండే ప్రకాశ్ (నాని) హైదరాబాద్ పాతబస్తీలో ఓ మోడల్. జీవితంలో కోటి రూపాయలు సంపాదించి సెటిలైపోవాలనుకుంటాడు. పాతబస్తీలో ఉండే నూర్ (కేథెరీనా థెరిసా) అంటే ప్రకాశ్ కు ఇష్టం. అలాగే ప్రకాశ్ అంటే నూర్ కు చెప్పలేనంత ప్రేమ. పైసా అంటే పడిచచ్చే ప్రకాశ్ కు అనుకోకుండా యాభై కోట్ల రూపాయలు చేతికి చిక్కుతాయి. ప్రకాశ్ కు చిక్కిన యాభై కోట్లు ఎక్కడివి? యాభై కోట్ల రూపాయలు దక్కించుకోవడానికి ప్రకాశ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? భారీ మొత్తంలో చిక్కిన సొమ్ము చివరికి ఏమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే 'పైసా' చిత్రం. ప్రస్తుత తరం హీరోల్లో నాని ఈగ చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చిన నానికి ఈ చిత్రంలోని ప్రకాశ్ పాత్ర టైలర్ మేడ్ క్యారెక్టర్. నటుడిగా నిరూపించుకోవడానికి లభించిన ప్రకాశ్ పాత్రను నాని చక్కగా ఉపయోగించుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ పాత్రలో తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్, పాటలతో ఆలరించిన నాని కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ ను చక్కగా పలికించాడు. పైసా చిత్రంలోని ప్రకాష్ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేకూర్చాడని చెప్పవచ్చు. 'ఇద్దరు అమ్మాయిలు' చిత్రం తర్వాత కేథరిన్ థెరిసాకు మంచి పాత్రే లభించింది. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని.. పర్వాలేదనిపించింది. గ్లామర్ తో పాటు, పెర్మార్మెన్స్ తో కూడా కేథరిన్ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే కూతురుగా స్వీటీ పాత్రలో కనిపించిన సిద్దికా శర్మ అందాల ఆరబోతకే పరిమితమైంది. నాని ఫ్రెండ్ గా డ్రైవర్ పాత్రలో నటించిన తాబర్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. విలన్ పాత్రలో చరణ్ రాజ్, సిద్దార్థ్ రెడ్డి, ఆర్ కే, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్ సినిమాకు సపోర్టింగ్ గా నిలిచారు. చిలక జ్యోతిష్కుడి పాత్రలో కొద్దిసేపే కనిపించిన వేణు తన హస్యంతో ఆకట్టుకున్నాడు. విశ్లేషణ: ప్రస్తుత రాజకీయ వాతావరణంలో నెలకొన్న పరిస్థితులను సెంటర్ పాయింట్ గా చేసుకుని, దానికి ప్రేమ కథను జోడించి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ పైసా చిత్రాన్ని రూపొందించారు. చిత్రమంతా పాతబస్తీలోని చార్మినార్ నేపథ్యంగా సాగుతుంది. పాతబస్తీలో ఉండే పరిస్థితులను కృష్ణవంశీ చక్కగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో పతంగి సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు కృష్ణవంశీ క్రియేటివిటీకి అద్దం పడుతుంది. చార్నినార్ వద్ద నాని తో చేయించిన ఓ లెంగ్తీ ఎపిసోడ్, హోలీ సీన్ లు బ్రహ్మండంగా ఉన్నాయి. ఈ చిత్ర ఫస్టాఫ్ ను పర్వాలేదనిపించే రితీలో తెరకెక్కించిన కృష్ణవంశీ.. సెకండాఫ్ లో కొంత గందరగోళమే సృష్టించాడు. కథకు ఉండే పరిమితుల వల్ల కథనంలో గందరగోళం తప్పలేదు. చేజారిన డబ్బును దక్కించుకోవడానికి కొన్ని బ్యాచ్ లు, అనుకోకుండా చేజిక్కిన డబ్బును కాపాడుకోవడానికి నాని వేసే ఎత్తులతో సెకండాఫ్ చేజింగ్ కొంత రొటిన్ గా అనిపించింది. పెద్దగా పేరున్న ఆర్టిస్టులు విలన్ పాత్రల్లో కనిపించకపోవడం ఈ చిత్రానికి మైనస్. సెకండరీ గ్రేడ్ విలన్ పాత్రలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే సెకండాఫ్ చేజింగ్ కథనం ప్రేక్షకుడ్ని ఆకట్టుకుంటుందా అనేది సందేహమే. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ ను పలికించడంలో తనదైన మార్క్ ను కృష్ణవంశీ చూపించాడని చెప్పవచ్చు. గత కొద్దికాలంగా టాలీవుడ్ కు దూరమయ్యారనే ఫీలింగ్ కలిగించిన కృష్ణవంశీ ప్రస్తుత ట్రెండ్ ను మిస్ అవుతున్నాడా అనే ప్రశ్నను రేకెత్తించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. పైసాలో చిత్రంలో టెంపోను కొనసాగించడానికి రీరికార్డింగ్ బాగా ఉపయోగపడింది. పాటల్లో 'నీతో ఏదో' పిక్చరైజేషన్ బాగుంది. 'జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నటు నాకు క్యాష్ కావాలి', 'పైసా ఎవర్నైనా పాగల్ (పిచ్చి) వాణ్ని చేస్తుంది' లాంటి డైలాగ్స్ అక్కడక్కడ ఆకట్టుకున్నాయి. పాతబస్తీ పరిస్థితులను సంతోష్ రాయ్ చక్కగా తెరకెక్కించారు. ఎప్పటిమాదిరిగానే కృష్ణవంశీని ఎక్కువ ఆశించి సినిమా కెళ్లిన ప్రేక్షకుడికి నిరాశ కలిగినా.. నాని తన ఫెర్మార్మెన్స్ తో చక్కటి విందును ఇచ్చాడని చెప్పవచ్చు. పైసా కోసం వెంపర్లాడితే కష్టాలు తప్పవనే సందేశంతో క్రియెటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అందించిన ఈ చిత్రం నిర్మాతలకు 'పైసా' వసూలు చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
పైసా మూవీ ప్రెస్ మీట్