సరైనోడు కంటపడలా..! | Catherine Tresa about her next projects | Sakshi
Sakshi News home page

సరైనోడు కంటపడలా..!

Published Mon, Jan 8 2018 7:28 AM | Last Updated on Mon, Jan 8 2018 7:28 AM

Catherine Tresa about her next projects - Sakshi

తమిళసినిమా: సరైనోడింకా కంటపడలేదు అంటోంది నటి క్యాథరిన్‌ ట్రెసా. ఈ అమ్మడికి తమిళంలో సరైన హిట్‌ రాలేదనే చెప్పాలి. గ్లామర్‌గా నటించడానికి ఏమాత్రం వెనుకాడని ధైర్యం ఉన్న నటి క్యాథరిన్‌ ట్రెసా. అయినా స్టార్స్‌తో జత కట్టే అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఆ మధ్య విశాల్‌తో కథకళి చేసినా, అధర్వ కణిదన్‌తో విజయం అందుకున్నా, అవకాశాల్లో జోరు పెరగలేదు. అయితే టాలీవుడ్‌లో అల్లుఅర్జున్‌ లాంటి స్టార్స్‌తో నటించే అవకాశాలను రాబట్టుకుంటోంది. కోలీవుడ్‌లో ఆర్యతో జతకట్టిన కడంబన్‌ చిత్రం తరువాత క్యాథరిన్‌ ట్రెసాను చూడలేదు. ప్రస్తుతం కలగలప్పు–2, కథానాయగన్‌ చిత్రాలతో రానుంది. ముఖ్యంగా కలగలప్పు–2లో ఈ బ్యూటీ తన అందాలతో మోత మోగించనుందనే ప్రచారం జరుగుతోంది.

సుందర్‌.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన ఈ జాణను ఎలాంటి పాత్రలను ఇష్ట పడుతున్నారంటే చాలా మంది హీరోయన్ల మాదిరిగానే చాలెంజింగ్‌ అనిపించే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అయితే హీరోలకు అక్కగానో, చెల్లెలిగానో నటించమంటే మొహమాటం లేకుంటా సారీ అనేస్తానంది. కథా పాత్ర బాగుంటే హీరోయిన్‌గా కాకపోయినా వారికి లవర్‌ లాంటి పాత్రల్లో గ్లామర్‌గా నటించడానిౖMðనా రెడీ అని చెప్పింది. క్యారెక్టర్‌ పాత్రలు చేయడానికి సిద్ధమా? అంటే ఆ వయసుకు తానింకా రాలేదని అంది. సరే పెళ్లెప్పుడు? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అన్న ప్రశ్నకు అందుకు సరైనోడింకా తారస పడలేదని, నచ్చినోడు లభిస్తే అప్పుడు పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని క్యాథరిన్‌ ట్రెసా చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement