అండగా ఉన్నారు.. థాంక్యూ: కేథరిన్ ట్రెసా | Catherine Tresa thanks fans for supporting her in grief | Sakshi
Sakshi News home page

అండగా ఉన్నారు.. థాంక్యూ: కేథరిన్ ట్రెసా

Published Fri, Dec 26 2014 5:26 PM | Last Updated on Tue, Aug 28 2018 5:11 PM

అండగా ఉన్నారు.. థాంక్యూ: కేథరిన్ ట్రెసా - Sakshi

అండగా ఉన్నారు.. థాంక్యూ: కేథరిన్ ట్రెసా

కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ టాలీవుడ్ హీరోయిన్ కేథరిన్ ట్రెసా కృతజ్ఞతలు తెలిపింది. తన సోదరుడు క్రిస్టోఫర్ మరణించి తాను తీవ్ర వేదనలో ఉన్నప్పుడు అందరూ తనకు ఎంతో ప్రేమను పంచారని, అందుకు తాను ఎంతో రుణపడి ఉంటానని ఫేస్బుక్లో ఓ సందేశం పెట్టింది. ఇక తన సోదరుడు క్రిస్టోఫర్ మరణానికి దారితీసిన పరిస్థితులను కూడా కేథరిన్ వివరించింది.

ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 10వ తేదీన క్రిస్టోఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంలో అందరికంటే అతడే చిన్నవాడు. గత రెండేళ్లుగా అతడు తల్లిదండ్రులు చెప్పిన మాట వినడంలేదు. వాళ్లు ఏం చెప్పినా తిరగబడుతున్నాడు. చదువంటే ఆసక్తి లేకుండా పో్యింది. టీనేజిలో అదంతా సాధారణమేనని తల్లిదండ్రులతో పాటు కేథరిన్ కూడా భావించింది. కొన్నాళ్ల తర్వాత ఆధ్యాత్మికత వైపు కూడా మళ్లాడు. దాంతో అతడు తన సమస్యకు తానే పరిష్కారం చూసుకుంటున్నాడని అంతా సంతోషించారు. అంతలోనే అతడు నేరుగా దేవుడి వద్దకే వెళ్లిపోయాడని కేథరిన్ ఆవేదన వ్యక్తం చేసింది. తమ్ముడు లేడన్న మాటను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement