
చిరు 150 నుంచి కేథరిన్ ఔట్..?
స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినా.. బిజీ హీరోయిన్ అనిపించుకోలేకపోయిన బ్యూటి కేథరిన్ థెరిస్సా. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. తమిళ నాట మాత్రం కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇటీవల తెలుగులో కూడా సరైనోడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటికి మరో భారీ ఛాన్స్ తలుపు తట్టింది.
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో స్పెషల్ సాంగ్కు కేథరిన్ను తీసుకున్నారు. అయితే షూటింగ్ సమయంలో జరిగిన గొడవ కారణంగా ఈ సినిమా నుంచి కేథరిన్ను తీసేశారన్న టాక్ వినిపిస్తోంది. కేథరిన్ స్థానంలో స్సెషల్ సాంగ్ కోసం లక్ష్మీ రాయ్ని తీసుకున్నారట. సర్థార్ గబ్బర్సింగ్ సినిమాలో ఐటమ్ నంబర్తో ఆకట్టుకున్న లక్ష్మీరాయ్ ఇప్పుడు మెగాస్టార్ సరసన స్టెప్పులేసేందుకు రెడీ అవుతోంది.