Khaidi number 150
-
అందాల భామ త్రిపాత్రాభినయం
సరైన సక్సెస్ కోసం పోరాడుతున్న సీనియర్ హీరోయిన్లలో నటి రాయ్‌లక్ష్మీ ఒకరు. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటించే అవకాశాలు మాత్రం వస్తున్నాయి కానీ, విజయాలే కానరావడం లేదు. ఆ మధ్య ఎలాగైనా బాలీవుడ్లో పాగా వేయాలని జూలీ–2 చిత్రంలో బోల్డ్‌గా నటించారు. అయినా సక్సెస్ మాత్రం దక్కలేదు. తెలుగులో ఖైదీ నంబర్ 150లో చిరంజీవితో రత్తాలు రత్తాలు అనే పాటలో యువతను ఉర్రూతలూగించారుత. సక్సెస్ లేకపోయినా ఇంకా కథానాయకిగా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఈ అమ్మడు నటించిన నీయా 2 తెరపైకి వచ్చింది. అది ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా అందులో ప్రియురాలిగా నాగుపాముగా తన పాత్రకు న్యాయం చేసిందనే ప్రశంసలను అందుకున్నారు. కాగా తాజాగా నటిస్తున్న చిత్రంపై రాయ్‌లక్ష్మీ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ చిత్రమే సిండ్రెల్లా. ఇది హర్రర్ ఇతివృత్తంతో కూడిన చిత్రం అట. విశేషం ఏమిటంటే ఈమూవీలో తొలిసారిగా రాయ్‌లక్ష్మీ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. అందులో ఒకటి టైటిల్ పాత్ర సిండ్రెల్లా. ఇంకో పాత్ర రాక్‌స్టార్‌గా ఉంటుందని, మరో పాత్ర గురించి ప్రస్తుతానికి సప్సెన్స్ అని అని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. కొత్త దర్శకుడు వినూ వెంకటేశ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఇటీవలే కొడైక్కెనాల్లో పూర్తి చేసుకుందని, త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. మరో పాత్రలో నటి సాక్షీ అగర్వాల్ నటిస్తోంది. పలు ట్విస్ట్‌లతో సాగే ఈ సిండ్రెల్లా చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు చిత్ర వర్గాలు. మరి ఈ చిత్రం అయినా నటి రాయ్‌లక్ష్మీని సక్సెస్‌తో సంతోష పెడుతుందో లేదో చూడాలి. -
మెగాస్టార్ పాటకు.. అమెరికాలో స్టాండింగ్ ఒవేషన్!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీఇచ్చిన ఖైదీ నంబర్ 150 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసినిమాతో తనలోని గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు మెగాస్టార్. మెగా మేనియాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన ఈ సినిమా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఓ అంతర్జాతీయ రియాలిటీ షోలో ఖైదీ నంబర్ 150 సినిమాలోని సన్నజాలి లా నవ్వేస్తోందిరో పాటకు డ్యాన్స్చేశారు అక్కడి డ్యాన్సర్. ఫాక్స్ టీవీలో నిర్వహించే షో టైం ఎట్ ది అపోలో షోలో ఈ పాటను ప్రదర్శించారు. ఎమ్మీ అవార్డ్ విన్నర్ స్టీవ్ హార్వే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో ష్రాయ్ ఖన్నా టీం ఈ పాటను ప్రదర్శించారు. మెగాస్టార్ పాట అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. డ్యాన్స్ పూర్తయిన తరువాత ఆడిటోరియంలోని ఆడియన్స్ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ష్రాయ్ ఖన్నా టీంను అభినందించారు. ఈ వీడియోను మెగా అభిమానుల కోసం తన ఫేస్ బుక్ పేజ్‌లో షేర్ చేశాడు చిత్ర నిర్మాత చిరు తనయుడు రామ్ చరణ్. -
చిరు 150..అక్కడ అట్టర్ ఫ్లాప్..!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఖైదీ నంబర్ 150. ఆ అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా వెండితెర మీద సరికొత్త సంచలనాలను నమోదు చేసింది. కుర్ర హీరోలకు కూడా షాక్ ఇస్తూ మెగాస్టార్ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరోసారి సత్తా చాటాడు. నాన్ బాహుబలి రికార్డు లన్నింటినీ బద్ధలు కొట్టిన ఖైదీ నంబర్ 150, బుల్లి తెర మీద మాత్రం నిరాశపరిచింది. చిరు రీ ఎంట్రీ టెలివిజన్ ప్రీమియర్‌కు కూడా భారీ ప్రచారమే చేశారు. ముఖ్యంగా బుల్లితెరపై చిరు చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో చిరు సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మరోసారి బుల్లితెరపై మెగాస్టార్ నిరాశపరిచాడు. వెండితెరపై కనక వర్షం కురిపించిన ఖైదీ నంబర్ 150 బుల్లి తెర మీద మాత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమాను కనీసం రెండకెల టీఆర్పీ కూడా దక్కకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ సినిమాకు కూడా 7.52 టీఆర్పీ రాగా.. మెగా 150కి అంతకన్నా తక్కువగా 6.9 రేటింగ్ మాత్రమే వచ్చింది. గతంలో ఏ సినిమా ప్రీమియర్ విషయంలో లేని విధంగా హిట్ సాంగ్స్‌ను రెండు సార్లు ప్లే చేసినా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ముఖ్యంగా అదే సమయంలో మరో ఛానల్లో సినీ వేడుక ప్రసారం కావటమే చిరు సినిమాకు టీఆర్పీ రేటింగ్ రాకపోవటానికి కారణం అన్న టాక్ వినిపిస్తోంది. -
చిరు సినిమాకు సెన్సెషనల్ రికార్డు!
మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ తీసిన సినిమా ’ఖైదీ నెంబర్ 150’ .. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ అయింది. వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించి చిరు సినీ ఛరిష్మా తగ్గలేదని నిరూపించింది. కొన్ని నెలల కిందట విడుదలైన ఈ సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదని తాజాగా బుల్లితెరపైనా రుజువైంది. గత ఆదివారం ఓ టీవీ ఛానెల్లో ఈ చిత్రాన్ని ప్రసారం చేసింది. ఊహించినట్టే బుల్లితెర టీఆర్పీ రేటింగ్స్‌లో ఈ సినిమా నెంబర్ వన్‌గా నిలిచింది. ఇంకో ఛానెల్లో ఐఫా అవార్డుల వేడుకను ప్రసారం చేసినా.. ప్రేక్షకులు మాత్రం ‘ఖైదీ నెంబర్ 150’కే మొగ్గు చూపారు. దీంతో అభిమానుల ఉత్సాహానికి మరింత ఊపునిస్తూ.. చానెల్ నిర్వాహకులు ఈ సినిమాలోని ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’, ‘రత్తాలు రత్తాలు’ పాటలను రెండేసిసార్లు ప్రసారం చేయడం గమనార్హం. ఇలా రెండేసిసార్లు రిపీటెడ్‌గా ప్రసారం చేయడం బుల్లితెర చరిత్రలో ఇదే మొదటిసారట. -
వినాయక్ నెక్ట్స్ విన్నర్ తోనే..?
ఖైదీ నంబర్ 150 సక్సెస్ తో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న వి వి వినాయక్, నెక్ట్స్ సినిమాను ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన వినాయక్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేస్తున్న సాయి, వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఖైదీ లాంటి భారీ హిట్ తరువాత వినాయక్, నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయాలని భావించాడు. అయితే బాలయ్య ఇప్పటికే వరుసగా సినిమాలకు కమిట్ అయి ఉండటంతో ఇప్పట్లో బాలయ్య, వినాయక్ ల కాంబినేషనేషన్ సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. దీంతో ఈ గ్యాప్ లో ఓ మీడియం రేంజ్ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు వినాయక్. ఇప్పటి వరకు ఎక్కువగా స్టార్ హీరోలను మాత్రమే డీల్ చేసిన వినాయక్, చాలా కాలం తరువాతా సాయిలాంటి మీడియం రేంజ్ హీరోతో కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నాడు. తిక్క, విన్నర్ లు ఫ్లాప్ అవ్వటంతో ఆలోచనలో పడ్డ సాయి, ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇలాంటి సమయంలో వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే సాయి కెరీర్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్. -
కోలీవుడ్‌లో కాజల్ హవా
కోలీవుడ్‌లో ఇప్పుడు నటి కాజల్ అగర్వాల్ హవా సాగుతోందని చెప్పవచ్చు.తెలుగులో చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150లో నటించే అవకాశం వచ్చే వరకూ కాజల్ క్రేజ్ సాధారణంగానే ఉంది. ఒక సమయంలో ఈ భామ పని అయిపోయింది, ఇక మూటా ముల్లె సర్దుకోవలసిందే అనే ప్రచారం జరిగింది. అలాంటిది అనూహ్యంగా కాజల్‌కు కాలం కలిసొచ్చింది.అలా చిరంజీవితో జంటగా నటించడం ఒక ఎత్తైతే, ఖైదీ నంబర్–150 విజయం కాజల్ డిమాండ్‌ను అమాంతం పెంచేసింది. ఇక కోలీవుడ్‌లో స్టార్ హీరోలు అజిత్, విజయ్‌లతో వరుసగా రొమాన్స్ చేసే అవకాశాలు వరించడంతో ఈ అమ్మడి హవా అంతా ఇంతా కాదు. అజిత్‌కు జంటగా నటిస్తున్న వివేగం చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం విజయ్ 61వ చిత్రంలో ఆయనతో నటిస్తున్నారు. దీనితో పాటు మరో తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. తెలుగులో రానా సరసన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలోనూ నటిస్తున్నారు. మరిన్ని తెలుగు, తమిళ చిత్రాల అవకాశాలు కాజల్ తలుపు తడుతున్నా సారీ నో కాల్షీట్స్ అంటూ చెప్పేస్తున్నారట. మరో నాలుగైదు నెలల వరకూ కొత్త చిత్రాలను అంగీకరించలేని పరిస్థితి అని, ఆ తరువాత నూతన చిత్రాల గురించి ఆలోచించే అవకాశం ఉందని కాజల్ అగర్వాల్ సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట. మొత్తం మీద కాజల్ కాలం నడుస్తోందన్న మాట. -
ఖైదీ బాగానే కలిసొచ్చింది..!
వరుస ఫ్లాప్‌లతో కెరీర్ ముగిసిపోయిందనుకున్న దశలో మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కాజల్. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలతో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటి కెరీర్, వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడింది. ఇక కెరీర్ ముగిసిపోయనట్టే అనుకుంటున్న సమయంలో చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్‌కు జోడిగా నటించిన ఖైదీ నంబర్ 150 ఘన విజయం సాధించటంతో కాజల్ మళ్లీ బిజీ అవుతోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న నేనే రాజు.. నేనే మంత్రి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కాజల్. ఈ సినిమాతో పాటు మరో మూడు తమిళ సినిమాలకూ కమిట్ అయ్యింది. ఒకప్పుడు ఫ్లాప్ హీరోయిన్గా అవకాశాల కోసం ఎదురుచూసిన కాజల్, ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా హీరోయిన్ అయ్యింది. మరోసారి కాజల్ లక్కీ గర్ల్‌గా మారిపోవటంతో తెలుగు నిర్మాత కూడా కాజల్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట. -
నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి!
‘‘సుమారు పదేళ్లు చిత్ర పరిశ్రమకీ, వినోదానికీ దూరంగా ఉన్న మాట వాస్తవమే. రీ–ఎంట్రీలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? గతంలో చూపిన ప్రేమాభిమానాలు చూపిస్తారా? అనే మీమాంస నాలో ఉండేది. ‘ఖైదీ నంబర్ 150’ విజయంతో నా అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘స్టార్‌మా’ కొత్త లోగోను ఆవిష్కరించారాయన. ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని అలరించిన ‘మాటీవీ’ ఇక నుండి ‘స్టార్‌మా’గా అలరించనుంది. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కానున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో ఛానల్ లోగో మారనుంది. ఈ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గతంలో సినిమా ఒక్కటే ప్రేక్షకులకు వినోదం. ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్‌లూ సినిమాలకు సమాంతరంగా వినోదం అందిస్తున్నాయి. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో ప్రేక్షకులకు చేరువయ్యే ఛాన్స్ వచ్చింది. ఈ షో మరో లెవల్‌కి వెళ్లడానికి నా ఇమేజ్ దోహదపడుతుంది. అలాగే ప్రేక్షకులకు మరింత దగ్గర కావడంతో పాటు విభిన్న వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించింది’’ అన్నారు. ఈ షోలో సినీ ప్రముఖులు ఎవరైనా పాల్గొంటున్నారా? అని చిరంజీవిని అడగ్గా... ‘‘నాగార్జున, వెంకటేశ్‌లు వస్తున్నారు. ఈరోజు నాగార్జున ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా రాధికా శరత్‌కుమార్, సుమలత వస్తారు’’ అని చెప్పారు. మరి, షోకి బాలకృష్ణను కూడా ఆహ్వానిస్తారా? అని ప్రశ్నించగా... ‘‘తప్పకుండా! నా స్నేహితుడు వస్తే సంతోషమే కదా. నిర్వాహకులకు బాలయ్యను ఆహ్వానించమని చెబుతా’’ అన్నారు చిరంజీవి. సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో రాత్రి 9.30 నుంచి 10.30 గంటల మధ్య ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌షో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో స్టార్ ఇండియా సౌత్ సీఈఓ కెవిన్ వాజ్, స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. -
ఖైదీ దర్శకుడితో సాయిధరమ్ తేజ్..?
టాలీవుడ్ టాప్ హీరోలతో భారీ చిత్రాలను తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ వినాయక్, త్వరలో ఓ మీడియం రేంజ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన వినాయక్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమాను ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేస్తున్న సాయి, వినాయక్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా స్టార్ హీరోలను మాత్రమే డీల్ చేసిన వినాయక్, చాలా కాలం తరువాతా సాయిలాంటి మీడియం రేంజ్ హీరోతో కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నాడు. తొలి సినిమాతోనే మెగా ఆడియన్స్ కు దగ్గరైన సాయి ధరమ్ తేజ్, ప్రతీ సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. పిల్లానువ్వలేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి హిట్స్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం విన్నర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తరువాత కూడా రెండు మూడు ప్రాజెక్ట్ చేతిలో ఉన్నా.. వినాయక్ సినిమా ఓకె అయితే మాత్రం అన్ని పక్కన పెట్టేసి వినాయక్ దర్శకత్వంలో సినిమా చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. -
మెగాస్టార్ మెగా రికార్డ్
రీ ఎంట్రీలో మెగాస్టార్ రికార్డ్ల హవా కొనసాగుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు చిరంజీవి. ఖైదీ నంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ వందకోట్ల కలెక్షన్లతో సత్తా చాటాడు. ఈ జనరేషన్ హీరోలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న భారీ కలెక్షన్ రికార్డ్లను సైతం మెగాస్టార్ ఈజీగా అందుకున్నాడు. సౌత్‌లో వందకోట్ల సినిమాలు గతంలోనూ ఉన్నా.., చిరంజీవి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు సౌత్‌లో వందకోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు ఉన్నా, అవన్ని రెండు, మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయి ఆ రికార్డ్‌ను సాధించాయి.. కానీ కేవలం ఒక్క భాషలోనే రిలీజ్ అయి వందకోట్ల క్లబ్లో చేరిన సినిమాలు మాత్రం చాలా అరుదు అలాంటి అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగాస్టార్. -
మెగా అభిమానుల కోసం మరో వేడుక..?
ఖైదీ నంబర్ 150 సినిమాతో బిగ్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, తనకు ఇంతటి ఘనవిజయాన్ని అంధించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయనున్నాడు. ఈ సినిమా థ్యాంక్స్ మీట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుందుకు ప్లాన్ చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్గా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150, సంక్రాంతి కానుకగా రిలీజ్ వందకోట్ల కలెక్షన్లతో సత్తాచాటింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముందుగా ఈ థ్యాంక్స్ మీట్‌ను వైజాగ్‌లో నిర్వహించాలని భావించినా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. జనవరి 28న హైదరాబాద్ వేదికగా భారీ ఈవెంట్ ను నిర్వహించేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా దాదాపు ఇదే డేట్ ఫిక్స్ అన్న టాక్ వినిపిస్తోంది. -
మరో మెగా హీరోతో వినాయక్
మాస్ సినిమాల దర్శకుడు వినాయక్, ఖైదీ నంబర్ 150 సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అల్లుడు శీను, అఖిల్ సినిమాలు నిరాశపరచటంతో కష్టాల్లో పడ్డ వినాయక్, చిరు రీ ఎంట్రీ సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చాడు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న యంగ్ హీరోలకు మరోసారి వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక కలిగించాడు. అందుకే ఇప్పటికే సక్సెస్‌పుల్ హీరోలుగా ప్రూవ్ చేసుకున్న యంగ్ హీరోలు వినాయక్ డైరెక్షన్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దర్శకుడిగా సక్సెస్ అయిన తరువాత వినాయక్ ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్లతోనూ సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన ఈ మాస్ డైరెక్టర్ ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్‌తో వినాయక్ సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మంచి ఫాంలో ఉన్న సాయి, వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్‌తో కలిసి సినిమా చేస్తే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నాడు. అందుకే త్వరలో వినాయక్ దర్వకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
సాగరతీరంలో ఖైదీ విజయోత్సవం..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతీష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్ 150. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ, రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ్లను సృష్టిస్తూ దూసుకుపోతోంది. యంగ్ హీరోలను సవాల్ చేస్తూ చిరంజీవి వందకోట్ల క్లబ్లో అడుగుపెట్టడంతో తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు ఖైదీ నంబర్ 150 టీం. అందుకే భారీ విజయోత్సవ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకను హైదరాబాద్ లేదా.. విశాఖలలో నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో మెగా హీరోల సక్సెస్మీట్లను విశాఖలో నిర్వహించిన నేపథ్యంలో ఖైదీ విషయంలో కూడా అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఖైదీ నంబర్ 150 ఉత్తరాంద్రలో 8 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో అక్కడే విజయోత్సవాన్ని నిర్వహిస్తే 10 కోట్ల మార్క్ చేరుకోవచ్చని కూడా భావిస్తున్నారు. -
జోరు తగ్గని ఖైదీ.. పెరిగిన కలెక్షన్లు
తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. అమెరికాలో తొలిరోజు భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా అదే జోరు కొనసాగిస్తోంది. యూఎస్‌లో శుక్రవారం కంటే శనివారం ఎక్కువ వసూళ్లు రాబట్టింది. శుక్రవారం 1,39,547 డాలర్లు వసూలు కాగా, శనివారం 2,52,513 డాలర్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపాడు. యూఎస్‌లో శనివారం నాటికి ఖైదీ నంబర్ 150 సినిమా మొత్తం 13.11 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్వీట్ చేశాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా కలెక్షన్లు రావచ్చని అభిప్రాయపడ్డాడు. తొలి రోజు కలెక్షన్ల విషయంలో ఖైదీ నంబర్ 150 సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగెస్ట్ హిట్‌గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా చిరంజీవి తాజా సినిమా ఆ రికార్డ్‌ను దాటి కొత్త చరిత్ర సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఒక్క రోజులో 47 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చిరు స్టామినా చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
అన్నయ్య సినిమా చూసిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఖైదీ నంబర్ 150 చూశాడన్న టాక్ అభిమానులకు మరింత కిక్ ఇస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ అవ్వటంతో పండగ చేసుకుంటున్న మెగా అభిమానులు నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ ఖైదీ నంబర్ 150 స్పెషల్ షో చూశాడన్న వార్త విని మరింత ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ హాజరు కాకపోవటం అనుమాలకు దారితీసింది. పవన్ పెద్దగా వేడుకలకు రావడానికి ఇష్టపడడని చిరు చెప్పిన అభిమానులు సంతృప్తి చెందలేదు. అయితే ఇప్పుడు ఖైదీ నిర్మాత రామ్ చరణ్ ఏర్పాటు చేసిన స్పెషల్ షోను పవన్ చూశాడని తెలియంటంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150, ఈ బుధవారం రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. తొలి రోజు కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిన మెగాస్టార్, పదేళ్ల విరామం తరువాత వచ్చినా బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్లో మిలియన్ మార్క్ కోసం హీరోలు ఎన్నో కష్టాలు పడుతుంటే మెగాస్టార్ ప్రీమియర్ షోలతోనే అన్ని రికార్డ్లను చెరిపేశాడు. -
బాహుబలి రికార్డ్‌ను చెరిపేసిన ఖైదీ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఖైదీ నంబర్ 150. చిరు తొమ్మిదిన్నరేళ్ల విరామం తరువాత మెగాస్టార్ హీరోగా నటించిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా చిరంజీవి కూడా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్తో అభిమానులను అలరించాడు. ఆడియో సూపర్ హిట్ కావటంతో పాటు చిరు లుక్స్ ఆకట్టుకోవటంతో ఖైదీ నంబర్ 150 భారీ ఓపెనింగ్స్ సాధించింది. గతంలో రికార్డులు సాధించిన ప్రతీ తెలుగు సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ చెప్పుకునేది. కానీ ఖైదీ దెబ్బకు బాహుబలి రికార్డ్స్ కూడా చెరిగిపోయాయంటున్నారు ఫ్యాన్స్. తొలి రోజు కలెక్షన్ల విషయంలో ఖైదీ నంబర్ 150 సరికొత్త రికార్డ్‌ను సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధించిన ఖైదీ నంబర్ 150 ఒక్క రోజులో 39 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగెస్ట్ హిట్‌గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా ఖైదీ నంబర్ 150, ఆ రికార్డ్‌ను దాటి కొత్త చరిత్ర సృష్టించాడు. తొమ్మిదేళ్ల విరామం తరువాత కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న చిరు స్టామినా చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
యార్ అంటున్న రాయ్‌లక్ష్మి
ఇంతకు ముందు తరచూ వార్తల్లో కనిపించిన నటి రాయ్‌లక్ష్మి పేరు ఈ మధ్య ఎక్కడా వినిపించడం లేదు. దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయా అన్న సందేహం కోలీవుడ్ వర్గాల్లో నెలకొంది. అయితే అలాంటిదేమీ లేదని, తాను బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉండడం వల్ల కోలీవుడ్‌పై దృష్టి సారించలేకపోయానంటున్న రాయ్‌లక్ష్మి ఇటీవల టాలీవుడ్లో ఖైదీనంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో ఐటమ్ సాంగ్‌లో చిందులేశారన్నది గమనార్హం. చాలా గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్‌లో మెరవడానికి సిద్ధమయ్యారు.యార్ అనే చిత్రంలో నటిస్తున్నారు.దీని గురించి రాయ్‌లక్ష్మి చెబుతూ తాను హిందీ చిత్రం జూలీ–2 కోసం చాలా రోజులు కేటాయించానన్నారు. దీంతో తమిళ చిత్రాలపై దృష్టి సారించలేకపోయానని చెప్పారు. జూలీ–2 హిందీ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని, ఇక కోలీవుడ్ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. నెలన్నర క్రితమే యార్ అనే తమిళ చిత్రానికి కమిట్ అయ్యానని తెలిపారు. ఇది థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. స్క్రిప్ట్ ఆసక్తిగా ఉండడంతో ఆ చిత్రాన్ని అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. రవి కొటారకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జూలీ–2 హిందీ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. ఇంతకు ముందు ఏడాదికి ఐదు చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పుడు మూడు చిత్రాలు చేస్తే చాలని భావిస్తున్నట్లు అన్నారు. కారణం వైవి««దl్యభరిత కథా చిత్రాలను ఎంచుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ఈ అమ్మడు ఇప్పటికే మలయాళం చిత్రం 100 డిగ్రీ సెల్సియస్ తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. -
'ఖైదీ నంబర్ 150' మూవీ రివ్యూ
టైటిల్ : ఖైదీ నంబర్ 150 జానర్ : మాస్ యాక్షన్ డ్రామా తారాగణం : చిరంజీవి, కాజల్, అలీ, తరుణ్ అరోరా సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : వి వి వినాయక్ నిర్మాత : రామ్ చరణ్ ఇటీవల కాలంలో టాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. తొమ్మిదిన్నరేళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించటం. తండ్రి రీ ఎంట్రీ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారటం. తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాకు ఖైదీ నంబర్ 150 రీమేక్ కావటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మెగాస్టార్ ఆ అంచనాలను అందుకున్నాడా..? ఖైదీ నంబర్ 150 గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడా..? కథ : తమిళంలో ఘన విజయం సాధించిన కత్తి కథకు దాదాపు ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ సినిమాను తెరకెక్కించారు. దొంగతనాలు, మోసాలు చేసి కోల్‌కతా సెంట్రల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కత్తి శ్రీను (చిరంజీవి). ఆ జైలు నుంచి ఓ ఖైదీ పరారవ్వటంతో ఆ ఖైదీని పట్టుకోవడానికి జైలర్, కత్తి శ్రీనును సాయం అడుగుతాడు. ఖైదీని పట్టించి శ్రీను జైలు నుంచి పారిపోతాడు. ఇండియాలో ఉంటే పోలీసులను తప్పించుకోలేమని తన ఫ్రెండ్(అలీ) సాయంతో బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఎయిర్ పోర్ట్ లో లక్ష్మీ(కాజల్)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడి, బ్యాంకాక్ ప్రయాణం మానుకొని ఇండియాలో ఉండిపోతాడు. లక్ష్మీ అడ్రస్ ఎలా సాధించాలని ఆలోచిస్తుండగా అచ్చు శ్రీనులానే ఉన్న శంకర్(చిరంజీవి) ను కొంత మంది వ్యక్తులు యాక్సిడెంట్ చేసి కాల్చి వెళ్లిపోతారు. కొన ఊపిరితో ఉన్న శంకర్ ను కాపాడి శంకరే శ్రీను అని పోలీసులు నమ్మేలా తన వస్తువులు శంకర్ దగ్గర ఉంచి వెళ్లిపోతాడు. దీంతో శంకర్ ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేస్తారు. లక్ష్మీ హ్యాండ్ ఇచ్చిందని తెలుసుకున్న శ్రీను తిరిగి బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న సమయంలో శంకర్ కు సంబంధించిన వాళ్లు శ్రీనును శంకర్ అనుకొని తీసుకెళతారు. అదే సమయంలో శంకర్ ను చంపడానికి ప్రయత్నించిన కార్పోరేట్ ఇండస్ట్రియలిస్ట్ అగర్వాల్(తరుణ్ అరోరా) శ్రీనును పిలిపించి 25 కోట్లు ఇస్తా నీతో ఉన్న ముసలి వాళ్లను వదిలేసి వెళ్లిపోమని చెపుతాడు. అందుకు ఒప్పుకున్న శ్రీను డబ్బు తీసుకొని బయల్దేరతాడు. కానీ శంకర్ కోసం ఏర్పాటు చేసిన ఓ సన్మాన సభలో అతని పోరాటం గురించి తెలుసుకున్న శ్రీను.. మనసు మార్చుకుంటాడు. నిజాయితిగా శంకర్ చేస్తున్న పోరాటం గెలవటం కష్టమని.. తానే శంకర్ గా మారి రైతులను గెలిపించాలని నిర్ణయించుకుంటాడు. అసలు శంకర్ చేస్తున్న పోరాటం ఏంటి..? ఓ టీవీ రిపోర్ట్ కూడా పట్టించుకోని సమస్యను శ్రీను దేశం దృష్టిలో పడేలా ఎలా చేశాడు..? చివరకు శంకర్ ఆశయం గెలిచిందా..? శంకర్, శ్రీనులు కలిసారా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొమ్మిదిన్నరేళ్ల తరువాత వెండితెర మీద హీరోగా కనిపించిన మెగాస్టార్ చిరంజీవి తనలో ఏమాత్రం జోష్, గ్రేస్ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. మాస్ డ్యాన్స్ లు, యాక్షన్స్ సీన్స్ తో తన అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు. ముఖ్యంగా తన మార్క్ కామెడీ టైమింగ్ తో రీ ఎంట్రీలో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో చిరు నటన కంట తడి పెట్టిస్తోంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పరిథి మేరకు ఆకట్టుకుంది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. గ్లామర్ సీన్స్ తో మెప్పించింది. మెయిన్ విలన్ గా నటించిన తరుణ్ అరోరా తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా.. స్లైలిష్ లుక్స్ తో పరవాలేదనిపించాడు. చిరు ఫ్రెండ్ గా అలీ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ, జయప్రకాష్ రెడ్డిలు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మురుగదాస్ అందించిన కథ. నేటివిటీ సమస్య రాకుండా దేశంలో ఏ ప్రాంతం వారినైనా కదిలించే రైతు సమస్యను కథగా తీసుకున్న మురుగదాస్. ఆ సమస్యను ఓ కమర్షియల్ కథగా మలచటంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. గతంలో మురుగదాస్ సినిమాను ఠాగూర్ గా రీమేక్ చేసిన అనుభవం ఉన్న వినాయక్ మరోసారి అదే ప్రయత్నంలో విజయం సాధించాడు. చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా చేసిన మార్పులు బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. అయితే క్లైమాక్స్ విషయంలో మాత్రం ఒరిజినల్ లో కనిపించిన ఎమోషనల్ ఖైదీ నంబర్ 150లో మిస్ అయ్యింది. ముఖ్యంగా కామెడీ కోసం క్రియేట్ చేసిన బ్రహ్మానందం క్యారెక్టర్, చిరు బ్రహ్మీల మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. శంకర్ స్థానంలోకి వచ్చిన చిరు తన వేషం భాషా ఏ మాత్రం మార్చుకోకపోయినా తన వారు గుర్తుపట్టకపోవటం లాంటివి పక్కన పెడితే.. సినిమాను చిరు అభిమానులను అలరించే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించటంతో వినాయక్ విజయం సాధించాడు. 60 ఏళ్ల చిరును ఇప్పటికీ మాస్ హీరోగా చూపించేందుకు టెక్నికల్ టీం చాలా కృషి చేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, జానీ, శేఖర్, లారెన్స్ మాస్టర్ల కొరియోగ్రఫీ ఇలా అన్ని మెగా రీ ఎంట్రీ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. తన తండ్రి రీ ఎంట్రీ కోసం నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఖర్చు వెనుకాడకుండా బెస్ట్ అవుట్ పుట్ కోసం పడిన కష్టం తెర మీద ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. అంతేకాదు అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ అంటూ మెగాస్టార్ తో కలిసి చరణ్ వేసిన స్టెప్పులు మెగా అభిమానులకు బోనస్. ప్లస్ పాయింట్స్ : చిరంజీవి నటన స్టోరీ స్క్రీన్‌ప్లే సంగీతం మైనస్ పాయింట్స్ : విలన్ పాత్ర బలంగా లేకపోవటం క్లైమాక్స్ ఓవరాల్ గా ఖైదీ నంబర్ 150.. మాస్ క్లాస్ ఆడియన్స్ ను అలరించే పక్కా కమర్షియల్ సినిమా. బాస్ ఈజ్ బ్యాక్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
150+100= మూవీ బిగ్గెస్ట్ ఫెస్టివల్
సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకొచ్చేవి రెండే రెండు. ఒకటి కోడి పందాల సంబరాలు, రెండోది విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ సినిమా ప్రాజెక్టులు. కాగా, ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి, శర్వానంద్ మూవీ శతమానం భవతి నిలిచాయి. అయితే ఇందులో రెండు మూవీలకు ఓ ప్రత్యేకత ఉంది. చిరు లెటెస్ట్ మూవీ ఆయనకు 150వ చిత్రం, బాలయ్యకు శాతకర్ణి మూవీ 100వ చిత్రం కావడంతో వారి అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీల్లోనూ ఈ ఫీవర్ కనిపిస్తోంది. యంగ్ హీరో రామ్ ఈ రెండు మూవీలపై ట్వీట్ చేశారు. 'దిస్ ఈజ్ నో మ్యాథమేటిక్స్.. దిస్ ఈజ్ హిస్టరీ! 150+100= ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఎవర్' అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. చిరు, బాలయ్య మూవీలు కేవలం నంబర్లు మాత్రమే కాదు. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన మూవీలు తెలుగు ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని పంచనున్నాయని పేర్కొన్నాడు. కాగా నేడు ఖైదీ నెంబర్ 150 విడుదల నేపథ్యంలో ఈ మూవీలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలవాలని ఎనర్జిటిక్ హీరో రామ్ ఆకాంక్షించాడు. #KhaidiNo150 #GPSK ట్యాగ్స్‌తో ట్వీట్ చేశాడు. సంక్రాంతి బరిలో ఉన్న మూవీలు అన్ని బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టాలని మరో యంగ్ హీరో నితిన్ కూడా ఇదే తరహాలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. This is no Mathematics.. This is History! 150 + 100 = The biggest festival ever!Wishing for the biggest blockbusters!! #KhaidiNo150 #GPSK — Ram Pothineni (@ramsayz) 11 January 2017 -
ఇకపై నా కథలు అన్నయ్యకు వినిపిస్తా
– వీవీ వినాయక్ ‘‘ఈ చిత్రానికి ముందు చిరంజీవి గారు ఓ యాభై కథలు విన్నా, నచ్చలేదు. ‘కత్తి’ నచ్చడంతో రీమేక్ చేద్దామని నాతో అన్నారు. నేను తమిళ ‘కత్తి’ చూసి, ఆయన ఇమేజ్‌కి, నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ నేడు. వినాయక్ మాట్లాడుతూ... ► నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లో హిట్స్, ఫ్లాపులు రెండూ ఉన్నాయి. ఫ్లాప్ అయిన చిత్రాల కథలు బాగున్నా ప్రేక్షకులకు నచ్చలేదు. అన్నయ్య రీ–ఎంట్రీ అని ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని దేవిశ్రీ ప్రసాద్ ఓ ట్యూన్ ఇచ్చాడు. అది అభిమానులను కూడా అలరిస్తుందని ‘ఖైదీ నంబర్ 150’ కి ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని ట్యాగ్‌లైన్ పెట్టాం. ► పరుగులు పెట్టి సినిమాలు తీసేరకం కాదు నేను. నాకు కథ బాగుండాలి. అప్పుడే ముందు కెళతా. ఎటువంటి కథ అయితే బాగుంటుందనే విషయంలో అన్నయ్యకు (చిరంజీవి) మంచి జడ్జిమెంట్ ఉంది. ఇకపై నేను ఏ కథ రాసినా, ముందుగా అన్నయ్య చిరంజీవి గారికి వినిపించాలనుకుంటున్నా. ► ‘ఠాగూర్’ చిత్రమప్పుడు అన్నయ్య ఎలా ఉన్నారో ఇన్నేళ్ళ తర్వాత ‘ఖైదీ నంబర్ 150’కి వచ్చినా అలాగే ఉన్నారు. అరవై ఏళ్లు వచ్చినా డ్యాన్స్, ఫైట్స్‌లో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. అల్లరి చిల్లరగా తిరిగే దొంగగా కత్తి శ్రీను పాత్రలో, గ్రాడ్యుయేట్ శంకర్ పాత్రలో అన్నయ్య కనిపిస్తారు. ‘ఠాగూర్’లో క్లయిమాక్స్ కోర్ట్ సీన్ లాగా ఇందులోనూ ఓ సీన్ ఉంటుంది. రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ► హీరోయిన్లుగా అనుష్క, సమంతలను అనుకున్నా ఫైనల్‌గా కాజల్‌ని ఓకే చేశాం. ‘గణితన్’ చిత్రం చూసి విలన్‌గా తరుణ్ అరోరాను ఎంచుకున్నా. తర్వాతే తెలిసింది తను అంజలా ఝవేరీ భర్త అని. ‘థర్టీ ఇయర్స్’ పృథ్వి మంత్రి పాత్ర చేశారు. లెన్త్ ఎక్కువైందని తనకు చెప్పి, కొంత తీసేశాం. కానీ, తను బాధపడుతూ మెసేజ్ పెట్టడంతో అలాగే ఉంచాం. ► సరైన కథ కుదిరితే పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయడానికి ఎప్పుడైనా రెడీ. నా తదుపరి చిత్రాలు ఏమిటన్నది ఇంకా ఫైనల్ కాలేదు. రెండు, మూడు చర్చల దశలో ఉన్నాయి. ఫైనల్ అయ్యాక చెబుతా. -
ఖైదీ నంబర్ 150లో బన్నీ కూడానా..?
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. దాదాపు పదేళ్ల విరామం తరువాత చిరు హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావంటతో మెగా అభిమానులు సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా చిరు ఫ్యాన్స్ కోరుకునే అన్ని రకాల మాస్ మసాలా ఎలిమెంట్స్‌తో సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించారు చిత్రయూనిట్. ఈ భారీ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సెకన్ల పాటు చిరు తో కలిసి డ్యాన్స్ చేశాడు చెర్రీ. అయితే ఇప్పటి వరకు రివీల్ చేయని విషయం ఒకటి తాజాగా బయటికి వచ్చింది. చరణ్‌తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో కనువిందు చేయనున్నాడట. మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఖైదీ నంబర్ 150 సక్సెస్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చరణ్‌తో పాటు అల్లు అర్జున్ కూడా చిరు సినిమాలో కనిపించి అభిమానులను అలరిస్తున్నాడు. -
హర్ట్ అయ్యాడు! అందుకే రియాక్ట్ అయ్యాడు!
చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించిన సినిమా ‘ఖైదీ నెంబర్ 150’. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిరంజీవి పాత్రికేయులతో ముచ్చటించారు. ► ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో నాగబాబు వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మీ స్పందన ఏంటి? నాగబాబు హర్ట్ అయ్యాడు. అందుకే, రియాక్ట్ అయ్యాడు. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు నేనూ హర్ట్ అవుతా. కానీ, పెద్దగా పట్టించుకోను. అందరూ ఒకలా ఉండరు కదా! ఇక, తను మాట్లాడిన వేదిక సరైనదా? కాదా? అనే విషయం గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. ► 150 సినిమాలు చేశారు. నటుడిగా సాధించాల్సిన లక్ష్యాలు, డ్రీమ్ రోల్స్ ఏవైనా ఉన్నాయా? ‘తుదిశ్వాస వరకూ నటించాలనుంది’ అని అక్కినేని నాగేశ్వరరావుగారు అనేవారు. మహానుభావుడు అలాగే చేశారు. ఏ నటుడైనా ప్రేక్షకాదరణ ఉన్నంత వరకూ నటిస్తూనే ఉండాలని కోరుకుంటారు. ప్రేక్షకాదరణ లేదంటే మాత్రం ఆలోచించుకోవాలి. ► అసలు రీమేక్ ఎందుకు చేయాల్సి వచ్చిందని చాలామంది ప్రశ్నిస్తున్నారు కదా! ‘ఠాగూర్’ రీమేక్ చేస్తే ప్రేక్షకులు అభినందించారు. ‘ఠాగూర్’, ‘స్టాలిన్’ తరహా సందేశాత్మక సినిమా ‘కత్తి’. బ్యాంకుల్లో వేలకోట్లు రుణం ఎగ్గొట్టినోళ్లు విదేశాల్లో స్కాచ్ తాగుతున్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతు పురుగుల మందు తాగుతున్నాడు. మన దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎందరు? అందులో తెలుగువాళ్లు ఎంత మంది? వంటి సమస్యలను చిత్రంలో ప్రస్తావిస్తున్నాం. మంచి కథాంశం కాబట్టి, రీమేక్ చేశాం. ► 24 గంటల్లో సినిమా విడుదల.. టెన్షన్ ఏమైనా? కథ, సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నా. తమిళ ‘కత్తి’లో మొనాటనీ ఫీలైన సీన్స్, సాంగ్స్ సిట్యువేషన్స్ ఛేంజ్ చేశాం. కొత్తగా కామెడీ ఎపిసోడ్ క్రియేట్ చేశాం. సినిమా ట్రీట్మెంట్ ఫాస్ట్‌గా ఉంటుంది. తమిళ డైలాగులకూ, మన డైలాగులకూ సంబంధం లేదు. ఇక, కాంపిటీషన్లో చిన్న స్ట్రెస్ ఉంటుంది. దాన్ని ఎవరూ ఎవాయిడ్ చేయలేరు. ► ఇప్పుడు సినిమాలు వందరోజులు ఆడే పరిస్థితి లేదు. అంతా ఫస్ట్‌డే కలెక్షన్స్, రికార్డుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఆ లెక్కల గురించి ఆరా తీస్తారా? లేదు. కలెక్షన్స్ పరంగా నాది జీరో నాలెడ్జ్. ఫస్ ్టకాపీ చూశాక, మిగతా విషయాలు ఆలోచించను. నా సినిమాతో పాటు వస్తున్న బాలకృష్ణ సినిమా, ఆర్. నారాయణమూర్తి సినిమా, శర్వానంద్ సినిమా ఇలా అన్ని సినిమాలూ బాగా ఆడాలి. ► ఇటీవల సోషల్ మీడియాలో స్టార్స్‌పై కామెంట్స్ ఎక్కువయ్యాయి. దీనిపై మీ స్పందన? అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరినైనా నియంత్రించడం కష్టం అవుతోంది. హద్దు మీరి ఎవరు ప్రవర్తించినా తప్పే. యూ ట్యూబ్ హిట్స్ కోసం దారుణమైన హెడ్డింగ్స్ పెడుతున్నారు. లోపల ఏం ఉండదు. స్వీయ నియంత్రణ ఉండాలి. ► హిందీ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. తెలుగులో మాత్రం అలా లేకపోవడం... ఇప్పుడు వెంకటేశ్ ‘గురు’ చేస్తున్నారు కదా! ‘రోబో’, ‘లింగా’ సినిమాల్లో యువకుడిగా నటించిన రజనీకాంత్, ‘కబాలి’లో వయసుకు తగ్గ పాత్ర చేశారు. అలాంటి ఛాన్స్ వస్తే నేనూ రెడీ. ఛాలెంజింగ్ పాత్రలు, సినిమాలు చేయడానికి నేను వెనకాడను. ► మీ నుంచి ‘పీకే’ వంటి సినిమా ఆశించవచ్చా! ఫస్ట్ సీన్ (కేవలం రేడియో అడ్డుపెట్టుకుని ఆమిర్‌ఖాన్ నగ్నంగా నటించిన సన్నివేశం) తప్ప! (నవ్వు) నటుడిగా నాకంటూ పరిమితులున్నాయి. నాకు ఆమిర్ అంత టాలెంట్ ఉందనుకోవడం లేదు. ► ఈ సినిమా కోసం విన్న కథల్లో దేన్నయినా నెక్ట్స్ సినిమాగా చేసే ఛాన్సుందా? పరుచూరి బ్రదర్స్ చెప్పిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేసే ఛాన్సుంది. సురేందర్‌రెడ్డి వైవిధ్యమైన కథ చెప్పారు. 151కి అది పరిశీలనలో ఉంది. బోయపాటి శ్రీనుతో గీతా ఆర్ట్స్‌లో 152వది అనుకుంటున్నాం. సెప్టెంబర్‌లో అది మొదలు కావొచ్చు. -
ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ ఖాయం
చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ గాదరాడ (కోరుకొండ) : మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 సూపర్ హిట్ ఆవుతుందని ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. గ్రామంలోని ఆయన చెల్లి, బావ కుంచే శ్రీదేవి శ్రీనివాస్ ఇంటికి సోమవారం ఆయన వచ్చారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ చిత్రం అడ్వా¯Œ్స టికెట్లు బుక్కింగ్తోనే అన్ని రికార్డులు బద్ధలైనట్టు చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చిరంజీవితో తీసిన ఠాగూర్ చిత్రం హిట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్, రష్యా దేశాల్లో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తీశామన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని మెప్పిస్తుందని, చిరంజీవి అభిమానులు కోరుకున్నట్టుగా ఉంటుందన్నారు. చిరంజీవి తనకు పెద్ద అన్నగా ఉన్నారని, మెగా కుటుంబం మా కుటుంబానికి అభిమానమన్నారు. ఇప్పటికి 15 సినిమాలకు దర్శకత్వం వహించానని తెలిపారు. గాదరాడలో సందడి వినాయక్ రావడంతో గ్రామంలో సందడి నెలకుంది. ఆమె చెల్లెలు ఇంట వినాయక్ భోజనం చేశారు. ఇంతలో మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు, పలువురు నాయకులు గ్రామానికి వచ్చి ఆయనను కలిశారు. వీరిలో టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు, కాపు నేతలు, చిరంజీవి అభిమానులు, మహిళలు ఉన్నారు. వినాయక్‌తో ఫొటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. -
అప్పుడు కబాలి.. ఇప్పుడు 'ఖైదీ నెం 150'..
దాదాపు దశాబ్దకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150. తమిళ సూపర్ హిట్ మూవీ కత్తికి రీమేక్ అయిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ విడుదల రోజున(జూలై 22న) చెన్నై, బెంగళూరుల్లోని పలు స్టార్టప్‌లతో పాటు సౌదీ అరేబియాలోనూ కొన్ని కంపెనీలు సెలవుదినంగా ప్రకటించగా.. తాజాగా రియాద్ లోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ మెగా మూవీ ఖైదీ నెంబర్ 150 రిలీజు అవుతున్న జనవరి 11ను ఉద్యోగులకు సెలవుదినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. హాలీడే వివరాలను పేర్కొంటూ ఓ నోటిస్ పేపర్‌ను పోస్ట్ చేశాడు. (చదవండి: ఉద్యోగులకు దసరా లాగే.. కబాలి బోనస్!) గతంలో కబాలి మూవీకి కూడా మస్కట్, ఒమన్, రియాద్‌లోని తమ కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇదే విధంగా యాజమాన్యం హాలీడే ఇచ్చింది. ఈ హ్యాపీ న్యూస్‌ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. మూవీ మొఘల్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 ని అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించింది. దాదాపు పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి సినిమాలో చిరు నటించడం కూడా మూవీ ఫీవర్‌ను పెంచేసింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిరు తనయుడు రాంచరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా, దేవీశ్రీ సంగీతాన్ని సమకూర్చాడు. Holiday declared on Jan11th for Riyadh Construction Company on account of #KhaidiNo150 Release. కబాలి కి ఇలానే... @RGVzoomin @Shekar_News pic.twitter.com/aRRax4azyc — #AkkuPakshi (@urstrulyRD) 8 January 2017 -
‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
ఖైదీ నంబర్ 150లో చిరు సెకండ్ లుక్..!
దాదాపు దశాబ్దకాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. మెగా రీ ఎంట్రీగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ కత్తికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన కత్తి తమిళ నాట వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే సినిమాను కొద్ది పాటి మార్పులతో చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరకు ఖైదీ ట్రైలర్స్ చిరంజీవి ఒక క్యారెక్టర్ కు సంబంధించిన గెటప్స్ మాత్రమే చూపిస్తూ వచ్చారు. చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా మాస్ సీన్స్ ఉన్న క్యారెక్టర్ నే ట్రైలర్ లో రివీల్ చేశారు. కానీ కీలక మైన రెండో పాత్రలో చిరు హైడ్రాలజీలో పోస్ట్ గ్రాడ్యూయెట్ చేసి తన ఊరి దాహార్తిని తీర్చడానికి పోరాడే నాయకుడు కే శంకర్ గా కనిపించనున్నాడు. క్లాస్ లుక్‌లో కనిపిస్తున్న రెండో పాత్రను రివీల్ చేయకపోయినా ట్రైలర్ లో కొన్ని క్షణాల పాటు ఈ క్యారెక్టర్ కనిపించింది. రీ ఎంట్రీలో తన మార్క్ మాస్ లుక్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు చిరు. -
రాంగోపాల్ వర్మపై మెగాఫ్యాన్స్ ఫైర్
-
రాంగోపాల్ వర్మపై మెగాఫ్యాన్స్ ఫైర్
'ఖైదీనంబర్ 150' ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు రచయిత యెండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు రాంగోపాల్ వర్మపై చేసిన విమర్శలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనపై విమర్శలు చేసిన నాగబాబుకు అంతే ఘాటుగా వర్మ బదులిచ్చారు. నాగబాబుకు చురకలంటించారు. ఈ ఎపిసోడ్లో వర్మ తీరుపై మెగాఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మెగా కుటుంబంపై, నాగబాబుపై వర్మ శృతిమించి ఆరోపణలు చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. 'ఖైదీనంబర్ 150' వేడుకలో నాగాబాబు మాట్లాడుతూ.. 'తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ముంబై వెళ్లిన ఒకడు రకరకాల కూతలు కూస్తున్నాడు. ఈ కూతలు ఆపేసి దర్శ కత్వం సక్రమంగా చేసుకుని, ఆ బాంబ్ ఏదో అక్కడే ముంబై లో పేల్చుకుంటే... వాడికీ మంచిది, మాకూ మంచిది. చిరంజీవి సినిమా ఎలా ఉండాలి? ఆయన ఎలా చేయాలి? అని మాట్లాడడం. ఇలాంటి అక్కుపక్షి, పనికిమాలిన సన్నాసి కూసే కూతలతో మాకేం కాదు. ఇలాంటి పక్షి ఎన్ని కూతలు కూసినా.. సూపర్‌హిట్ సినిమాని ఆపలేవు. ఫెయిల్యూర్ సినిమాని లేపలేవు’’ అంటూ వర్మపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు దర్శకుడు వర్మ అంతే ఘాటుగా బదులిచ్చారు. దశాబ్ద కాలం లొ ఒక్క రక్తచరిత్ర తప్ప (తెలుగు లో) హిట్ లెదు. ఆయన జయ అపజయాల గురించి హితబోధలు. #KhaidiNo150 #BossIsBack — Stay Strong !! (@pepparsalt9) 8 January 2017 ‘నాగబాబు సార్.. మీకు ఇంగ్లిష్ అర్థం కాదు ఎవరితోనైనా చదివించుకోండి. నాకు సలహా ఇచ్చేముందు మీ ‘జబర్దస్త్’ కెరీర్ గురించి ప్రశ్నించు కోండి. ‘ప్రజారాజ్యం’ టైమ్‌లో మీ అన్నయ్యకు తప్పుడు సలహాలిచ్చి ఆయన ఓడిపోయేలా చేశారు. ‘అక్కుపక్షి’ అనే కామెంట్స్ చేసి టైమ్ వృథా చేసుకునే బదులు మీ సోదరు లను బతిమాలుకోండి. లేదంటే రోడ్డున పడే అవకాశం ఉంది’’ అని వర్మ ట్వీట్స్ చేశారు. నాగబాబు మాట్లాడిన దానిలో తప్పు ఎంటి ? ఒకరిని విమర్శించేటప్పుడు స్వీకరించే గుణం కూడా ఉండాలి. #KhaidiNo150 #BossIsBack — Stay Strong !! (@pepparsalt9) 8 January 2017 మొత్తానికి ఈ ఎపిసోడ్లో వర్మ తీరును మెగా అభిమానులు తప్పుబడుతున్నారు. 'నాగబాబు మాట్లాడిన దానిలో తప్పు ఎంటి? ఒకరిని విమర్శించేటప్పుడు స్వీకరించే గుణం కూడా ఉండాలి.. ఆయన మాత్రం శివ పేరు చెప్పుకొని ఇంకా సన్మాన సభలు పెట్టుకోవచ్చు. అందరి చేత భజన చెయించుకోవచ్చు.. దశాబ్దకాలంలో తెలుగులోఒక్క రక్తచరిత్ర తప్ప హిట్ లేదు. ఆయన జయాపజయాల గురించి హితబోధలా' అంటూ ఒక నెటిజన్ వర్మను విమర్శించారు. ఇలా వర్మను విమర్శిస్తూ పలు పోస్టులు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు వర్మ అభిమానులు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. 'మా అన్న మెగాస్టార్ కదా అని వాడు వీడు అని వాగితే అక్కడ సైలెంట్ గా ఉండటానికి వాడు బాలయ్య అభిమానో లేదా చంద్రబాబు ఫ్యాన్ కాదు దటీజ్ రాంగోపాల్ వర్మ' అంటూ ఓ నెటిజన్ ఫేస్బుక్లో కామెంట్ చేశారు. కాగా, మెగాఫ్యాన్స్ తనపై గుర్రుగా ఉండి పెడుతున్న కామెంట్లపై వర్మ కూడా స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న వరుసగా నాగబాబుపై విమర్శలు ట్వీట్ చేసిన వర్మ.. ఈ రోజు మెగాస్టార్ ఫ్యాన్స్ మార్ఫింగ్ చేసి పెట్టిన ఓ ఫొటోను ట్వీట్ చేశారు. ఖైదీనంబర్ 150 పోస్టర్‌కు వర్మ ఫేస్ అంటించి.. రౌడీనంబర్ 150 అంటూ మెగాస్టార్ అభిమానులు ఈ ఫొటోను ట్వీట్ చేశారు. ఇది ఆయనకు నచ్చినట్టే ఉంది. -
అదే జోరు.. అదే హుషారు
♦ ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి ♦ అభిమానులే నా శక్తి ♦ సినిమాను రామ్‌చరణ్ బాగా నిర్మించాడు ♦ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నీ బాగా ఆడాలి ♦ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి: దాసరి ♦ చిరుతో సినిమా: టీఎస్సార్ సాక్షి, సినిమా డెస్క్: ‘‘రాననుకున్నారా? రాలేననుకున్నారా? ఢిల్లీకి పోయాడు, డ్యాన్సులకు దూరమైపోయాడు! హస్తినాపురానికి పోయాడు, హాస్యానికి దూరమైపోయాడు! ఈ మధ్య కాలంలో మా మధ్య లేడు. అందుకని, మాస్‌కి దూరమైపోయాడు అనుకుంటున్నారేమో! అదే మాసు.. గ్రేసు.. అదే హోరు.. జోరు! అదే హుషారు’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాత్రి గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో జరిగింది. ‘బాస్ ఈజ్ బ్యాక్ ఫెస్టివల్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకుముఖ్య అతిథిగా హాజరైన దర్శకరత్న దాసరి నారాయణరావు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘కృషితో, పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి. ఇంత భారీగా వేడుక జరగడం ఇది మొదటిసారి. తొమ్మిదేళ్ల తర్వాత ఓ హీరో మళ్లీ నటించడం అనేది చరిత్రలో మొదటిసారి. ఆయన సినిమా కోసం ఎదురు చూసిన లక్షలాది మెగా ఫ్యాన్స్‌కి సమాధానం ఈ ‘ఖైదీ నంబర్ 150’. ‘ఖైదీ’ రోజుల్లో ఎలా ఉన్నాడో.. అదే విధంగా వచ్చాడు. ఏ ప్రభుత్వాలూ రైతు సమస్యలను పట్టించుకోని పరిస్థితుల్లో.. ప్రజల్ని చైతన్యపరిచిన మనిషి ఈ సినిమాలో హీరో’’ అని చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ అభిమానుల్ని చూస్తుంటే కృష్ణానది పక్కన ఉన్నానా? విశాఖ సముద్రతీరంలో ఉన్నానా? అనే అనుమానం కలుగుతోంది. బాస్ ఈజ్ బ్యాక్ అంటుంటే... నాకు ఓ ఉర్దూ షాహిరిలో చెప్పినట్లు ఈ పదేళ్లు నాకు పది క్షణాల్లా గడిచాయి. పదేళ్ల తర్వాత కూడా పాతికేళ్ల ముందున్న ఊపు, ఉత్సాహం నాలో నింపిన ఆ శక్తి మీరే.. నా తమ్ముళ్లే (అభిమానులు) ఆ శక్తి. 150వ సినిమాగా ఏ సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ‘కత్తి’ చూశా. ఈ కథ అనుకోగానే నాకు మొదట స్ఫురణకు వచ్చిన దర్శకుడు వీవీ వినాయక్. రామ్‌చరణ్ ఈ సినిమాని బాగా నిర్మించాడు. టీమ్ అందరూ కష్టపడి పని చేశారు. ఫంక్షన్ సజావుగా జరగడానికి సహకరించిన ఏపీ పోలీసులకు, ఇతర సిబ్బందికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. సంక్రాంతి సందర్భం గా విడుదలవుతున్న నా సోదరుడు బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, శర్వానంద్ ‘శతమానం భవతి’, ఆర్. నారాయణమూర్తి ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’తో పాటు ఏ సినిమా రిలీజైనా సూపర్ హిట్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ఆకాంక్షిం చారు. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సినిమాలు తీయడంలేదు. చిరంజీవి, పవన్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో ఓ సినిమా తీస్తా’’ అన్నారు. తర్వాత దర్శకుడు వినాయక్, నిర్మాత రామ్‌చరణ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబ సభ్యులు, నిర్మాత డీవీవీ దానయ్య, ‘ఆదిత్య కన్స్ట్రక్షన్’ తోట చంద్రశేఖర్, నటులు బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, రచయితలు పరుచూరి బ్రదర్స్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, ‘లహరి మ్యూజిక్’ మనోహర్ తదితరులు హాజరయ్యారు. మెగా‘ఖైదీ’పై పోటెత్తిన అభిమానం మంగళగిరి/తాడేపల్లి రూరల్: ఖైదీ నంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహనాల పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాల ను పార్కింగ్ చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపో యింది. ఇక హాయ్‌ల్యాండ్ ప్రధాన ద్వారం వద్దే అభిమానులను ఆపివేయడంతో ఆగ్రహిం చిన అభిమానులు పోలీసులపై దాడికి దిగడం తో ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో తొక్కిసలాట జరిగింది. దాదాపు 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ పలువురిని పరిసర ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రులకు తరలించా రు. అభిమానుల సంఖ్యలను అంచనా వేయలేకపోయిన పోలీసులు.. పరిస్థితిని అదుపు చేయడంలో చేతులెత్తేశారు. -
ఇంద్రసేన వర్సెస్ సమరసింహ
సినిమాలో డ్రామా ఉంటుంది... యాక్షన్ ఉంటుంది... ఎంటర్టైన్మెంట్ ఉంటుంది... ఫస్టాఫ్ ఉంటుంది... సెకండాఫ్ ఉంటుంది... క్లైమాక్సూ ఉంటుంది... హీరోయిన్లుంటారు... క్యారెక్టర్లుంటాయి... కామెడీ ఉంటుంది... అబ్బో! చాలానే ఉంటుంది. అవును... అసలు విషయం మర్చిపోయాం! సినిమా బయట కూడా డ్రామా ఉంటుంది. అభిమానులుంటారు. ఆడియన్స్ ఉంటారు. ప్రొడ్యూసర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లుంటారు. వాళ్ళంతా హ్యాపీయే!... టెన్షన్ అంతా అభిమానులది. కటౌట్లు పెట్టాల... దండలు వెయ్యాల... అభిషేకాలు చెయ్యాల... సమ్‌టైమ్స్... ప్రాణాల మీదకు తెచ్చుకోవాల... ఇవన్నీ హీరోలకు కల్ట్ ఇమేజ్ తెచ్చిపెట్టాయ్. గవర్నమెంట్ పందెంరాయుళ్ళపై ఆంక్షలు విధించవచ్చు. పందెంకోళ్ళను జైళ్ళలోనూ పెట్టవచ్చు. కానీ, ఈ అభిమాన పందెంపై కంట్రోలు ఏ ప్రభుత్వం మాత్రం పెట్టగలదు? దిస్ స్టోరీ ఈజ్ బిగ్గర్ దేన్ టూ మూవీస్టోరీస్! రెండు సినిమాల కన్నా గొప్ప డ్రామా ఉన్న స్టోరీ! చదవండి. ఇది వెండితెర మహా సంగ్రామం... సంక్రాంతి ... థియేటర్లలో జరుగుతున్న సినిమా కోడి పందెం... ఒకరు మెగా స్టార్... మరొకరు నందమూరి యుగా స్టార్... ఒకరిది (హీరోగా) 150వ సినిమా... ఇంకొకరిది 100వ సినిమా... ఒకరిది తమిళ సూపర్ హిట్ కథ... ఇంకొకరిది తెలుగు జాతి యోధుడి జీవితం... ఒకరేమో శక్తిపీఠాల్లో పూజలు, మరొకరు ఆలయాల్లో అభిషేకాలు... ఎవరూ తగ్గేది లేదు... ఎక్కడా తలొగ్గేది లేదు... అందుకే... తెలుగు సినీ జనంలో... ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్... ‘ఖైదీ నంబర్ 150’ వర్సెస్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’... చిరంజీవి సిన్మా వర్సెస్ బాలకృష్ణ సిన్మా.. సంక్రాంతి సీజన్లో... మరికొన్ని సినిమాలు బరిలోకి వస్తున్నా... ఈ ‘స్టార్ వార్స్’ పైనే అందరి దృష్టి. కథ కోసం కసరత్తులు బాస్ ఈజ్ బ్యాక్ కెరీర్లో మైలురాళ్ళ లాంటి ఈ సినిమాలు చేయడానికి సరైన కథల కోసం స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చాలా కసరత్తులే చేశారు. కొన్నేళ్ళపాటు ఊరించి, పరుచూరి బ్రదర్స్‘ఉ య్యాలవాడ నరసింహారెడ్డి’ స్క్రిప్ట్ దగ్గర నుంచి పూరీ జగన్నాథ్ ‘ఆటో జానీ’ దాకా వందల కథలు విన్న చిరంజీవి చిట్టచివరికి తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన హిట్ ‘కత్తి’ (2014) రీమేక్‌కు జెండా ఊపారు. అదీ కుమారుడు రామ్‌చరణ్ నిర్మాతగా తొలి యత్నం కావడం విశేషం. గతంలో ‘ఠాగూర్’(తమిళ ‘రమణ’కి రీమేక్)తో విజయం అందించిన వినాయక్‌కు దర్శకత్వ బాధ్యతలు అందించారు. తెలుగు వాడి పౌరుషం హీరోగా 100వ సినిమాకు బాలకృష్ణ చాలా స్క్రిప్ట్‌లు విన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్‌మిషన్ కాన్సెప్ట్‌తో పాతికేళ్ళ క్రితం వచ్చిన ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా‘ఆదిత్య 999’ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పారు. కుమారుడు మోక్షజ్ఞనీ దాంతో తెరంగేట్రం చేయాలని ఊగారు. తర్వాత రైతుల కష్టాన్ని ప్రతిబింబించే ‘రైతు’ కథ నచ్చి, కృష్ణవంశీ దర్శకుడిగా దాదాపు ఖరారు చేశారు. అదే టైమ్‌లో దర్శకుడు క్రిష్ వచ్చి, తల్లి పేరును తన పేరు ముందుపెట్టుకొన్న చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఏకధాటిన 2 గంటలు చెప్పారు. విని 24 గంటలైనా గడవక ముందే ఇదే నూరో సినిమాకు కరెక్ట్ అని బాలయ్య అటు మొగ్గారు. ఇంతకీ... కథేంటి? మెగా రీమేక్ బేసిక్‌గా ఇది తమిళ ‘కత్తి’ చిత్రానికి రీమేక్. కాకపోతే, తెలుగు నేటివిటీ, చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ సహా పలువురు కలసి, స్క్రిప్ట్‌కు మార్పులు చేశారు. కార్పొరేట్ సంస్థల దురాక్రమణలతో ఉపాధి కోల్పోయి, దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలకు పాల్పడడమనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. చూడడానికి ఒకేలా కనిపించే రైతుల కోసం పోరాడే ప్రగతిశీలవాది జీవానందంగా, అల్లరి చిల్లరిగా ఉండే ఖైదీ కదిరేశన్ అలియాస్ కత్తిగా రెండు పాత్రలూ తమిళ్లో విజయ్ చేశారు. జీవానందం గాయపడగా, అతని స్థానంలోకి కత్తి వెళ్ళి రైతుల పక్షాన పోరాడతాడు. హిస్టరీ రిపీట్స్ చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉన్న భారతావనిని ఒకే ఏలుబడికి తెచ్చిన తొలి భారతీయ చక్రవర్తి, తెలుగు యోధుడి కథ ఇది. దర్శకుడు క్రిష్ లభిస్తున్న కొద్దిపాటి చరిత్ర ఆధారాల్నీ తీసుకొని, ఊహ జోడించి, స్క్రిప్ట్ చేసుకున్నారు. క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన ఈ తెలుగు యోధుడి కథను 1900 ఏళ్ళ తరువాత ఇప్పుడు తెర మీదకు తెస్తున్నారు. శాతకర్ణి జీవితంలో తల్లి ఎంతటి కీలకపాత్ర వహించిందో, భార్యాబిడ్డల కన్నా దేశాన్ని ఒక్క తాటి మీదకు తేవాలన్న ఆకాంక్షకే అతనిచ్చిన ప్రాధాన్యం ఏమిటో ఈ కథ చెబుతుంది. అయితే, ఈ చిత్రం శాతకర్ణి విజయగాథలకే పరిమితం.పూర్తి జీవితం చూపడం లేదు. ముసురుకున్న వివాదాలు కథ ఎవరిది?: తమిళ ‘కత్తి’ సినిమా ఒరిజినల్ కథ తనదేననీ, పేరు, డబ్బులు – ఏమీ ఇవ్వకుండా ఆ కథను అడ్డంగా వాడేసుకున్నారనీ దర్శక – రచయిత ఎన్. నరసింహారావు వీధికెక్కారు. ఆ కథ ఒరిజినల్‌గా నరసింహారావు రిజిస్టర్ చేసుకున్న స్క్రిప్ట్లోదేనని ‘రచయితల సంఘం’ కమిటీ కూడా తేల్చింది. తమిళ దర్శక, నిర్మాతల నుంచి డబ్బుల వ్యవహారం తేలే లోగానే, ‘కత్తి’ని చిరంజీవి రీమేక్ చేస్తున్నారనే వార్తతో కాపీరైట్ వివాదాన్ని మళ్ళీ ఫిల్మ్‌నగర్‌లో గుప్పుమనిపించారు. అలా ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ కన్నా ముందే వార్తల్లో నిలిచింది. నో పర్మిషన్: ‘ఖైదీ నంబర్ 150’ ట్రైలర్ కమ్ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కు విజయవాడలో అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ మరో వివాదం రేగింది. నిజానికి, మొదట డిసెంబర్ ఆఖరులో విజయవాడలోని మునిసిపల్ స్టేడియమ్లో చిత్ర ఆడియో ఫంక్షన్ జరపాలనుకొని, ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాతలు ‘శాతకర్ణి’ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ ఫంక్షన్నే రద్దు చేసుకొన్నారు. తీరా సినిమా రిలీజ్‌కు పట్టుమని వారం రోజులైనా లేక ముందు ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం పెట్టుకొన్నారు. అయితే, ఆ ఫంక్షన్‌కు స్టేడియమ్లో అధికారపక్షం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వడం లేదని చిరు అభిమాన వర్గం ఆరోపించింది. అధికారులు మాత్రం మునిసిపల్ స్టేడియమ్‌లను, బయటి ఫంక్షన్లకివ్వరాదంటూ ఉమ్మడి రాష్ట్ర కాలంలో వచ్చిన జీవో వల్లే అనుమతులు ఇవ్వడం లేదంటూ సన్నాయినొక్కులు నొక్కారు. చివరకు చిరు వర్గం తమ వేదికను బెజవాడ – గుంటూరు మధ్యకు మార్చి, కార్యక్రమం శనివారం చేసింది. ఎవరు లెజెండ్? డేట్ ముందుకు మార్చుకొని, జనవరి 11న రిలీజ్‌కు వచ్చిన ‘ఖైదీ...’ వర్గం ‘ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకే రోజు రావడం మంచిది కాదని నాన్న (చిరంజీవి) గారన్నారు’ అంటూ తెలివిగా ప్రకటించింది. అలా పోటీ సినిమా సేమ్ డే రిలీజ్‌కి రాకుండా, ముందరి కాళ్ళకి బంధం వేసింది. ఈ పరిస్థితుల్లో రకరకాల ఒత్తిళ్ళ మధ్య జనవరి 3వ తేదీ రాత్రి పొద్దుపోయాక, క్రిష్ సైతం పోటీ సినిమాకు స్నేహహస్తం చాపుతూ, ‘‘ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ తమ మైలురాళ్ళ లాంటి సినిమాలతో వస్తున్నారు... స్వాగతిద్దాం’’ అని ట్వీట్ చేశారు. కానీ, ఇరు వర్గాల అభిమానులూ ఎవరికి వారు ‘మా హీరో తప్ప మరొకరు లెజెండ్ ఎలా అవుతారు’ అంటూ బుస కొట్టారు. సోషల్ మీడియాలో విషం కక్కారు. అంత మాటంటారా? ఖబడ్దార్! డిసెంబర్ 26న తిరుపతిలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, దర్శకుడు క్రిష్ మాటల ఉరవడిలో ‘సంక్రాంతికి వస్తున్నాం. ఖబడ్దార్’ అనే పదప్రయోగం చేయడం వివాదమైంది. అది చిరు వర్గాన్ని ఉద్దేశించి అన్న మాటలుగా సోషల్ మీడియాలో ప్రచారమైంది. దానికి తోడు ‘అన్నయ్య’ కోసం మెగా బ్రదర్ నుంచి వచ్చిన వరుస ఫోన్‌కాల్స్! ఒకరికి నలుగురు హీరోలు చేతిలో ఉన్న మెగా ఫ్యామిలీతో వ్యవహారం కావడంతో, ఈ ఉక్కిరిబిక్కిరి మధ్య, క్రిష్ మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అపార గౌరవం గురించి వివరణ ఇవ్వాల్సొచ్చింది. సోషల్ మీడియాలో వార్ ! బాలకృష్ణ సినిమా వస్తున్న రోజున అసలు బయటకే రావద్దంటూ ఎగతాళి వాట్సప్ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా తిరిగింది. మరోపక్క, చిరంజీవి సిన్మాలో ‘అమ్మడు... కుమ్ముడు’ లాంటి మరీ మాస్ పాట ఏమిటని నెట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ‘ట్రాలింగ్’లను పక్కన పెడితే, ‘మా టీజర్, ట్రైలర్ లుక్కు ఇన్ని లక్షల వ్యూస్ వచ్చాయి’ అని మొదట ఒక సిన్మా వారు ప్రకటించారు. మా పాటనీ అంతమంది చూశారంటూ మరొక సినిమావారు అంతకన్నా పెద్ద అంకెలతో, పోటీ ప్రకటన చేశారు. ఇలా ప్రకటనలతో పోటాపోటీలు పడుతున్నారు. మీడియాలో స్టార్ వార్ చూసి, హద్దు మీరినా, బ్యానర్లు చింపినాlచర్య తప్పదని ఏపీ రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. హాళ్ళ వద్ద బందోబస్తు పెట్టారు. అందరూ సర్ప్రైజ్ అవుతారు! – ‘ఖైదీ...’ దర్శకుడు వినాయక్ ⇔ తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవినెలా చూపిస్తున్నారు? వినాయక్: సినిమా రిలీజయ్యాక చూస్తే, అసలు ఆ తొమ్మిదేళ్ళ గ్యాపూ చెరిగిపోతుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, దాదాపు 20 ఏళ్ళ క్రితం ‘చూడాలని ఉంది’ (1998) టైమ్‌లో ఎలా ఉన్నారో, అలా అనిపిస్తారు చిరంజీవి. ఆయనను చూసి అందరూ సర్ప్రైజ్ అవుతారు. నో డౌట్. ఆయన డ్యాన్స్‌లు, ఫైట్లు చూసి అదిరిపోతారు. ⇔ ఇది తమిళ ‘కత్తి’కి రీమేక్ కదా! మరి తెలుగులో...? చాలా మార్పులు చేర్పులు చేశాం. అక్కడ యువ హీరో విజయ్ కోసం, అతని ఇమేజ్‌కి తగ్గట్లుగా చేసిన స్క్రిప్ట్ ఇది. దాన్ని మన తెలుగు నేటివిటీకీ, ‘అన్నయ్య’ బాడీ లాంగ్వేజ్‌కీ తగ్గట్లు మార్చడం కోసం సమష్టిగా కృషి చేశాం. ⇔ ‘ఠాగూర్’ లానే ‘ఖైదీ నంబర్ 150’లో కూడా సామాజిక సమస్యను ప్రస్తావించినట్లున్నారు! ఏ బాధ్యతా లేని ఒక వ్యక్తి – ఒక ఊరిలో ఒక రైతుకు జరిగిన అన్యాయం తెలుసుకొని కదిలిపోతాడు. ‘నేను వీళ్ళ కోసమే బతకాలి’ అని నిర్ణయించుకొని, ఆ దిశలో చేసే అలుపెరుగని పోరాటం చిత్ర కథ. రైతు సమస్య, నీటి సమస్య లాంటి అంశాలెన్నో వస్తాయి. ⇔ రైతు గురించి వచ్చే ‘నీరు నీరు నీరు...’ పాట ఇవాళ మీడియాలో హాట్‌టాపిక్ అయినట్లుంది! చాలా మంచి పాట అది. దేవిశ్రీ సంగీతం, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం, శంకర్ మహదేవన్ గానం – అద్భుతం. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుందీ పాట. ⇔ చిరంజీవి కమ్‌బ్యాక్ ఫిల్మ్ వరమాల ఎందరినో దాటి మీ మెడలో పడినప్పుడు ఏమనిపించింది? చిరంజీవి గారు పిలిచి, ‘కత్తి’ సినిమా తెలుగులో చేద్దామన్నారు. వెంటనే ఆ దృష్టితో సినిమా చూశాను. చూస్తుండగా నా మనసులో తిరిగిన ఆలోచనలు, మార్పులు చేర్పులతో – నాదైన పద్ధతిలో ఆయనకు కథను నేరేట్ చేశాను. నా అప్రోచ్ నచ్చి, చేసేద్దామన్నారు. ∙మీకు ఈ సినిమా పెద్ద ఎఛివ్‌మెంట్. మరి, ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే, ‘ఠాగూర్’లో ఉన్న నిజాయతీ, ‘రౌడీ అల్లుడు’లోని కామెడీ, ‘ఇంద్ర’లోని పాటలు – ఇవన్నీ కలిసే ఒకే సినిమాలో ఉంటే? అదే – ‘ఖైదీ నంబర్ 150’! ⇔ అంచనాలతో పాటు సినీ పోరాటమూ భారీగానే ఉంది! మరి, టార్గెట్... అంచనాలన్నీ అందుకుంటాం. ఇంకా చెప్పాలంటే, అధిగమిస్తాం. సినిమా సూపర్ హిట్. చరిత్రలో గౌతమీపుత్ర శాతకర్ణి -– ‘...శాతకర్ణి’ చిత్ర దర్శకుడు క్రిష్ చరిత్రలోకి వెళితే, శాతవాహనులు తెలుగు వారు. ఇప్పటి తెలంగాణ ప్రాంతంలోని కోరులింగాల (కోటి లింగాల) నుంచి తెలుగు ప్రాంతంతో పాటు భారత భూభాగాన్నే ఏలినవారు. ఆ వంశానికి వన్నె తెచ్చిన చక్రవర్తి – గౌతమీపుత్ర శాతకర్ణి. క్రీ.శ. 78 –102 (కొందరు 60 నుంచి 90 దాకా అంటారు) మధ్య పరిపాలన సాగించిన గౌతమీపుత్ర శాతకర్ణి నిజానికి శాతవాహన వంశంలో ఏ రాజూ సాధించనన్ని విజయాలు సాధించాడు. శత్రువులైన శకులు, పల్హవులు, యవనులను (గ్రీకులు) జయించి, జంబూద్వీపాన్ని (భారతభూభాగానికి పురాణనామం) పరాయి పాలన నుంచి విముక్తం చేసిన అరుదైన చక్రవర్తి. తాత, ముత్తాతలు కోల్పోయిన భూభాగాలనే కాక, కొత్త భూభాగాలను జయించి, సువిశాల సామ్రాజ్యంగా విస్తరించాడు. అలా మూడు సముద్రాల పర్యంతం తన ఆధిపత్యాన్ని స్థాపించి, ‘త్రిసముద్ర తోయ పీతవాహన’ (మూడు సముద్రాల నీళ్ళు తాగిన గుర్రాన్ని వాహనంగా కలవాడా) అనే బిరుదు పొందాడు. తన బొమ్మను ముద్రించిన వెండి నాణాలను విడుదల చేసిన మొదటి భారతీయ చక్రవర్తి అతనే! పేరుకు ముందు తల్లి (గౌతమీ బలసరి/బాలాశ్రీ) పేరు చేర్చుకొన్న తొలి భారతీయుడూ అతనే! కొత్త యుగానికి ఆదిగా ‘యుగాది’ (ఉగాది, మహారాష్ట్రలో ‘గుడీ పడవా’) ఆయన మొదలు పెట్టిందనే అంటారు. శాలివాహన శకమనే కొత్త శకాన్ని స్థాపించి, కాలాన్ని మలుపు తిప్పిందీ ఈయనే అని కొందరి భావన. చిన్నతనంలో మా తాతయ్య గారి ఊరికి వెళ్ళినప్పుడు అమరావతి చాలాసార్లు చూశా. అమరావతి రాజధానిగా పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ లీలగా విన్నా. కొన్నేళ్ళుగా ఈ కథ నా మనసు తొలిచేస్తోంది. మన తెలుగు వాడి కథ మనకి కూడా తెలియకపోవడం కోపం వచ్చింది. 2013 నుంచి ముంబైలో ఉన్నప్పుడు ఆ చరిత్ర మరింత తెలిసింది. ఇది అందరికీ చెప్పాల్సిన కథ అనిపించింది. అందుకే, ఈ సినిమా తీశా. సినిమా తీస్తున్నంత సేపూ ఏదో అదృశ్యశక్తి నా వెంట ఉండి నడిపింది. ఇది నిజం. రిలీజ్ దోబూచులాట.. రచ్చ నిజానికి, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం 2016 ఏప్రిల్ ప్రారంభమైనప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ 2017 జనవరి 12న రిలీజ్ చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. అయితే, చారిత్రక నేపథ్యం, యుద్ధ సన్నివేశాలున్న భారీ చిత్రం తీయడం కాబట్టి, అది జరిగేపని కాదని పరిశ్రమ వర్గీయులు, ప్రత్యర్థి చిత్రాలవాళ్ళు పెదవి విరిచారు. వాళ్ళ అంచనాల్ని తలకిందులు చేస్తూ, రికార్డు టైమ్‌లో చిత్ర యూనిట్ సినిమా పూర్తి చేసింది. ఇలా ఉండగా, ‘శాతకర్ణి’ ప్రారంభమైన రెండు నెలల తర్వాత 2016 జూన్ 23న చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ మొదలైంది. దాన్ని కూడా సంక్రాంతికే జనవరి 13న రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు మొదట ప్రకటించారు. అయితే, తీరా రెండు సినిమాలూ షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్‌కు దగ్గర పడుతుండేసరికి రచ్చ మొదలైంది. కలిసొచ్చిన ‘నరసింహనాయుడు’ రిలీజ్ డేట్ జనవరి 11కే ఈ సినిమానూ రిలీజ్ చేయాలంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తూ వచ్చారు. అందుకు, దర్శక, నిర్మాతలు కూడా సరేనంటూ, బాక్సాఫీస్ వద్ద ప్రత్యర్థుల వ్యూహాల్ని బట్టి, తుది రిలీజ్ డేట్ ప్రకటిద్దామని కూర్చున్నారు. ఆడియో రిలీజ్ వేదికపైనా డేట్ చెప్పనిది అందుకే! అయితే, ఇంతలో ‘ఖబడ్దార్’ పదప్రయోగంపై వివాదం క్రిష్‌ను చుట్టుముట్టింది. ఒక ఏరియా ‘శాతకర్ణి’ రిలీజ్లో భాగస్థుడూ, చేతిలో పలు థియేటర్లూ ఉన్న ఒక అగ్ర నిర్మాత మధ్యవర్తిగా రంగప్రవేశం చేశారు. ఆ నిర్మాత తమ్ముడితో నెక్స్›్ట సినిమా చేయడానికి సిద్ధమవుతున్న ‘శాతకర్ణి’ దర్శక, నిర్మాతలతో జనవరి 12న ‘శాతకర్ణి’ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన కమిట్ చేయించారు. ఆ ప్రకటన వచ్చాక, పోటీ నివారించడానికి ఒక రోజు ముందే జనవరి 11న చిరు సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ ఆ చిత్ర నిర్మాత – హీరో రామ్‌చరణ్ ప్రకటించారు. దాంతో, రిలీజ్ డేట్ విషయంలో అగ్ర నిర్మాతతో కుట్ర చేయించారని బాలకృష్ణ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పూజలు, అభిషేకాలు, జెండా పండగలకే తప్ప, సిన్మా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం దర్శక – నిర్మాతలు తమ కన్నా, ప్రత్యర్థి చిత్ర వర్గీయుల మాటకే తలొగ్గారంటూ విమర్శించారు. జనవరి 5, గురువారం నాడు వంద మంది దాకా అభిమానులు సాక్షాత్తూ హైదరాబాద్‌లోని ‘శాతకర్ణి’ చిత్ర ఆఫీసుకు వెళ్ళి, జనవరి 11నే తమ హీరో సిన్మా రిలీజ్ చేయాలంటూ ఆందోళన చేయడం కొసమెరుపు. కానీ, చివరకు జనవరి 12నే ‘శాతకర్ణి’ రిలీజ్ చేయాలని దర్శక,నిర్మాతలు ఖరారు చేసేశారు. ఒక్క రోజు ముందొస్తే... 10 కోట్లు! ఒక రోజు ముందు రిలీజ్ కావడం వల్ల అత్యధిక థియేటర్లు అందుబాటులో ఉండి, రికార్డు కలెక్షన్లకు వీలు చిక్కుతుంది. తమ హీరో గొప్ప అంటే, తమ హీరో గొప్ప అనుకొనే ఫ్యాన్స్‌కూ, బాక్సాఫీస్ రికార్డులే ప్రమాణం అనుకొనే సినీజీవులకూ, నంబర్ వన్ స్థానంపై కన్నేసిన తారలూ రిలీజ్ డేట్‌పై పట్టుపట్టేది అందుకే! ‘మా సినిమా అన్ని వేల థియేటర్లలో రిలీజ్, ఇన్ని వేల థియేటర్లలో హంగామా’ అని కొందరు సినిమావాళ్ళు చెబుతుంటారు కానీ, వాస్తవాలు వేరు. ఉన్న థియేటర్లెన్ని? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1650 చిల్లర థియేటర్లే (మల్టీప్లెక్స్‌లలోని స్క్రీన్స్ కూడా కలిపి) ఉన్నాయి. ఇక, తమిళనాడు, కర్ణాటక, విదేశాల్లో క్రేజీ తెలుగు సినిమాలకు అందుబాటులో ఉండేవి కూడా కలుపుకొన్నా, మహా అయితే, 2 వేల స్క్రీన్స్‌కు మించవు. ఆర్భాటపు కబుర్లను పక్కనపెట్టి, అసలు లెక్కల్లోకి వెళితే – థియేటర్లపై పట్టున్న ‘దిల్’ రాజు ‘శతమానం భవతి’కి దాదాపు 250 థియేటర్లు, ఆర్. నారాయణమూర్తి ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’కు సుమారు 50కి పైగా థియేటర్లు ఈ సంక్రాంతికి అందుబాటులో ఉంటాయని అంచనా. ఇక, మిగిలిన 1700 స్క్రీన్స్నే చిరు, బాలయ్య సిన్మాలు పంచుకోవాలి. వీటిలో ‘గీతా ఆర్ట్స్’ పట్టు మూలంగా సుమారు 900 దాకా స్క్రీన్స్ చిరు సిన్మాకీ, 800 దాకా స్క్రీన్స్ బాలయ్య సిన్మాకొస్తాయని అంచనా. అయితే, ‘శాతకర్ణి’ కన్నా ఒక రోజు ముందే చిరు సిన్మా రిలీజ్ వల్ల ఆ ఒక్కరోజుకీ, ‘శాతకర్ణి’ సిన్మాకు దక్కాల్సిన స్క్రీన్స్‌లో అధిక భాగం కూడా లభించడం ‘ఖైదీ నం. 150’కి ఎడ్వాంటేజ్ అవుతుంది. అలా ప్రత్యర్థి సిన్మా కన్నా ముందు రావడం వల్ల థియేటర్లన్నీ చేతిలో ఉండి, ఆ ఒక్క రోజులో దాదాపు 7 నుంచి 10 కోట్ల మేర ఓపెనింగ్ కలెక్షన్స్ అదనంగా వస్తాయి. ఆ ఎడ్వాంటేజ్ కోసం ‘ఖైదీ నం. 150’ వ్యూహం వేస్తే, అది లేకుండా రెండు సిన్మాలూ ఒకే రోజు వచ్చి, బాక్సాఫీస్ బలపరీక్షకు నిలబడాలని ‘శాతకర్ణి’ అభిమానులు కోరుకున్నారు. అందుకే, జనవరి 11నే ‘శాతకర్ణి’నీ రిలీజ్ చేసెయ్యమంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒత్తిడి చేశారు. నైజామ్‌లో... ఎత్తులు పై ఎత్తులు సినీ వ్యాపారంలో మొదటి నుంచి నైజామ్ ఏరియాది ప్రధాన వాటా. ఒకప్పుడు అది చిరంజీవి సినిమాలకు కంచుకోట. తాజా పోటీ వాతావరణంలోనూ మంచి రెవెన్యూ తెచ్చే ఆ ఏరియాపై పట్టు కోసం రెండు వర్గాలూ వ్యూహ ప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. ‘ఖైదీ...’ చిత్ర నిర్మాతలు ఒక అడుగు ముందుకేసి, నైజామ్ ఏరియాలో సినిమాను అమ్మకుండా, అలాగని సొంతంగా కాకుండా, చాలా థియేటర్స్ చేతిలో ఉన్న ‘గ్లోబల్’ డిస్ట్రిబ్యూటర్స్ సునీల్ నారంగ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్కిచ్చారు. నిజానికి, ‘గ్లోబల్’లో భాగస్వామి అయిన నిర్మాత ఎన్. సుధాకరరెడ్డే ‘శాతకర్ణి’ని ఆ ఏరియాకు కొన్నారు. కానీ, ఇప్పుడు ‘ఖైదీ...’ డిస్ట్రిబ్యూషన్‌కి గ్లోబల్ ఒప్పుకోవడంతో, రెండు సినిమాలకూ హాళ్ళను సర్దుబాటు చేయక తప్పదు. ఆ రకంగా ‘ఖైదీ...’ వ్యూహంతో నైజామ్‌లో ‘శాతకర్ణి’కి హాళ్ళ సంఖ్యలో గండి పడనుంది. ఊరికొక్క థియేటరైనా ఇవ్వండి బాబూ! ప్రముఖ పంపిణీదారు, థియేటర్ల లీజుదారు కావడంతో, ‘దిల్’ రాజు సినిమాకు మల్టీప్లెక్స్‌ల నుంచి మామూలు థియేటర్ల దాకా తగినన్ని స్క్రీన్స్ దొరుకుతాయి. అయితే, ఎటొచ్చీ ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ లాంటి చిన్న సినిమాలకే పెద్ద తలనొప్పి. థియేటర్లన్నీ ఈ స్టార్ల వార్తో నిండిపోవడంతో, ‘పీపుల్స్ స్టార్’ ఆర్. నారాయణమూర్తికి థియేటర్లే లేని పరిస్థితి. ‘‘ఇలా అయితే చిన్న సినిమాలు ఎలా బతుకుతాయి? కనీసం ఊరికొక్క థియేటరైనా ఇవ్వండి బాబూ’’ అని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బిజినెస్ అదుర్స్! చిరంజీవి హీరోగా, ఆయన కుమారుడే నిర్మాతగా వస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ను 86 డేస్‌లో పూర్తి చేశారు. నిర్మాణ వ్యయం 40 కోట్ల పైమాటే కావచ్చని అంచనా. తొమ్మిదేళ్ళ తరువాత వస్తున్న చిరంజీవి సిన్మా కావడంతో, భారీ క్రేజ్ ఉంది. హక్కులు తీసుకున్నవారిలో ఎక్కువమంది కొత్తవాళ్ళు, రోజువారీ‡ సినీ వ్యాపారంతో సంబంధం లేనివాళ్ళేనని భోగట్టా. గుంటూరు, నెల్లూరు, తూర్పు గోదావరి ఏరియాలు సొంత మనుషులతో రిలీజ్ చేసుకుంటున్న నిర్మాతలు వైజాగ్, సీడెడ్ ప్రాంతాల హక్కుల్ని తమకు అత్యంత సన్నిహితులైన ఆ ప్రాంత రాజకీయ నేతలకూ (గంటా శ్రీనివాసరావు, సి. రామచంద్రయ్య), వారి బంధువులకూ ఇచ్చారట. ఇవి కాక, కర్ణాటక, శాటిలైట్ రైట్స్ (‘మా’టి.వికి రూ. 10.5 నుంచి 12 కోట్లకి) అమ్మారు. అన్నీ కలిపి రూ. 50 కోట్ల పైగా అయింది. ఇక రూ. 25 కోట్ల పైగా విలువైన కృష్ణా, నైజామ్, ఓవర్సీస్– నిర్మాతలే అట్టిపెట్టుకొని, సొంత రిలీజ్ చేస్తున్నారట. అన్నీ చేరి, రూ. 75 కోట్ల పైగా లావాదేవీలు జరిగినట్లు లెక్క. రికార్డు టైమ్‌లో 85 రోజుల్లో షూటింగ్ పూర్తి అయిన బాలకృష్ణ చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి దాదాపు రూ. 40 కోట్ల పైగా వ్యయమైనట్లు భోగట్టా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ హక్కులు హాట్‌కేక్స్‌లా అమ్ముడవడంతో, సుమారు రూ. 60 కోట్లకు పైగా వ్యాపారమైంది. అలా ఏకంగా రూ. 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. హీరోల సొంత సంస్థలు కాక, బయటి నిర్మాత సిన్మాకింత టేబుల్ ప్రాఫిట్ రావడం ఇటీవల లేదని సినీ వర్గాల మాట. శాటిలైట్ రైట్లే రూ.8.5 కోట్లు (‘మా’ టివి) పలికాయి. ఇంకా తమిళ, హిందీ చిత్రాల థియేటరికల్ రైట్స్‌తో అదనపు ఆదాయం వచ్చే ఛాన్సుంది. ష్... సెన్సార్ అవుతోంది! ఇంటిపేరుతో కొత్తగా పెట్టిన ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం విడుదలకు చాలా ముందే, డిసెంబర్ 29నే సెన్సార్ పూర్తి చేసుకుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం – సినిమాలో ఫస్టాఫ్ ప్రధానంగా వినోదాత్మకం. ఆడవేషంలో అలీ, బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్లు వస్తాయి. సెకండాఫ్‌లో కథలో అసలు ఘట్టం సాగుతుంది. ‘రైతు’పై వచ్చే పాట కన్నీరు పెట్టిస్తుంది. ఆరు పదులు దాటిన వయసులోనూ చిరు నవ యువకుడిలా తయారై చేసిన ఇంటర్వెల్ ఫైట్, 2 పాటలకు డ్యాన్సులు అదిరిపోయాయి. మొత్తం మీద 9 ఏళ్ళు గ్యాప్ తర్వాత, ‘యస్... బాస్ ఈజ్ బ్యాక్’ అని అభిమానులు కేరింతలు కొట్టేలా సినిమా ఉందని సెన్సార్ టాక్. ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చిన ఈ సినిమా తుది నిడివి 2 గంటల 27 నిమిషాలు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 5న సెన్సార్ జరుపుకొంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ‘సిన్మా బ్రహ్మాండం సార్! ఇంతలా ఉంటుందని ఊహించలేదు’ అన్నారట. అభిజ్ఞ వర్గాల కథనం ప్రకారం – హీరో పాత్రచిత్రణ, యుద్ధ సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఎపిసోడ్ సూపర్. సినిమా ముగింపు సమయంలో హీరో చెప్పే డైలాగులు, ‘ఇది మన కథ... ప్రతి తెలుగువాడి కథ...’అంటూ నేపథ్యం నుంచి వచ్చే మాటలు సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధంగా నిలబెట్టేస్తాయి. యుద్ధాలే కాక, కర్తవ్యానికీ, కుటుంబ బంధానికీ మధ్య నలిగిపోయే ఒక చక్రవర్తి కథగా ఎమోషన్ సీన్లూ పండాయి. బుర్రా సాయిమాధవ్ డైలాగ్‌లు, సీతారామశాస్త్రి పాటలు, బాలకృష్ణ డైలాగ్ డెలివరీ – అన్నీ కలిసి, ప్రేక్షకులు మీసం తిప్పేలా ఉందీ సినిమా అని సెన్సార్ టాక్. సెన్సారైన రోజు సాయంత్రానికే పరిశ్రమలో దీనిపై ఒకటే చర్చ. రెండు చోట్ల డైలాగుల్లో చిన్న చిన్న సవరణలతో ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చిన ఈ సినిమా తుది నిడివి 2 గంటల 14 నిమిషాలే! అప్పుడూ ఇలాగే... బాక్సాఫీస్ యుద్ధం సంక్రాంతి సీజన్లో థియేటర్ల బరిలో ఇలా చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు ఢీ అంటే ఢీ అనుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1987లో తొలిసారిగా చిరు ‘దొంగమొగుడు’ (జనవరి 9), బాలయ్య ‘భార్గవరాముడు’ (జన. 14) సంక్రాంతి పందెం కోళ్ళయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా గత 30 ఏళ్ళలో – ఏడుసార్లు ఇలాంటి పోటీ జరిగింది. ‘ఖైదీ నంబర్ 150’ వర్సెస్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎనిమిదోసారి జరుగుతున్న పోటాపోటీ. ఈ 30 ఏళ్ళలో ఇద్దరి సినిమాలూ ఒకే తేదీన రిలీజైంది ఒక్క 2001లోనే! అదీ సంక్రాంతికే! ఆ తరువాత మరెప్పుడూ ఒకే తేదీకి వాళ్ళ చిత్రాలు పోటీ పడలేదు. గడచిన 7 సార్లలో ఇప్పటి దాకా 3 సార్లు (‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘లక్ష్మీనరసింహా’ – ఈ మూడూ కూడా 70కి పైగా కేంద్రాల్లో వంద రోజులాడాయి) బాలకృష్ణ పైచేయి సాధించారు. మరో రెండుసార్లు (‘అన్నయ్య’, ‘దొంగమొగుడు’) చిరంజీవిదే అగ్రస్థానం. మిగతా రెండుసార్లు (‘మంచిదొంగ’– ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’, ‘హిట్లర్’–‘పెద్దన్నయ్య’) ఇద్దరు హీరోలూ బాక్సాఫీస్ వద్ద సమానంగా నిలిచారు. ఎన్నెన్నో హైలైట్స్... ఎవరికీ అందని అంచనాలు! ‘నచ్చిందే చేస్తా’నంటున్న ఖైదీ నంబర్ 150 ⇔ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న చిరంజీవి చిత్రంలో అభిమానులకు కన్నులపండువ కోసం చాలా హంగామానే చేస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఎన్ని కసరత్తులతో ఏం మాయ చేశారో కానీ, తెరపై కనీసం 20 ఏళ్ళు తగ్గినట్లు కనిపిస్తున్నారు. దీని కోసం దాదాపు ఏడాది పాటు శ్రమించినట్లు సాక్షాత్తూ చిరంజీవే ‘సాక్షి’కి చెప్పారు. ⇔ ఒకప్పుడు ఫైట్లు, డ్యాన్సులకు ఫేమస్ అయిన చిరు మళ్ళీ ఆ ఊపు తరహా మాస్ పాటలు, బీట్స్‌కు నర్తించినట్లు అభిజ్ఞ వర్గాల భోగట్టా. ⇔ రామ్‌చరణ్ నటించిన ‘మగధీర’, ‘బ్రూస్లీ’ చిత్రాల్లో తండ్రి చిరంజీవి గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తే, ఈసారి తండ్రి కమ్‌బ్యాక్ సినిమాను రామ్‌చరణ్ నిర్మించడమే కాక, ‘అమ్మడు’ పాటలో కొద్ది క్షణాలు కనిపించనున్నారు. ⇔ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ‘ఖైదీ నంబర్ 150’లో తండ్రి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి, సై్టలిస్ట్‌గా వ్యవహరించారు. ⇔ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్ పరిసరాల్లో చేశారు. పాటల కోసం ప్రత్యేకంగా స్లొవేనియా, క్రొయేషియా దేశాలకు వెళ్ళి, చిత్రీకరణ జరిపారు. ∙ఫస్టాఫ్ సరదాగా ఉంటే, సెకండాఫ్‌లో దాదాపు 45 నిమిషాలు ఎమోషనల్‌గా పీక్కు చేరుస్తుందని చిత్ర యూనిట్ కథనం. నీటి కోసం కన్నీరు కార్చే రైతుల వెతల్ని చూపే రామజోగయ్య శాస్త్రి రచన ‘నీరు నీరు నీరు... రైతు కంట నీరు...’ పాట కదిలిస్తుందని అంచనా. ‘శరణమా... రణమా’ అంటున్న శాతకర్ణి ⇔ తెలుగు జాతి చరిత్ర చెప్పే చారిత్రక కథ కావడం, ఇలాంటి పాత్రలకు నప్పే హీరో బాలకృష్ణకు 100వ సినిమా కావడం ‘శాతకర్ణి’లో విశేషం. ⇔ తెలుగులో ఎన్టీఆర్ ‘పాండవ వనవాసం’– 1965, ‘శ్రీకృష్ణ విజయం’ –1971లో నటించిన హేమమాలిని 46 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు తెరపైకి వచ్చారు. తండ్రి ఎన్టీఆర్‌తో నటించిన డ్రీమ్ గర్ల్ ఇప్పుడు కుమారుడు బాలకృష్ణకు తల్లిగా చేశారు. ⇔ చరిత్ర కాబట్టి, ‘బాహుబలి’లా ఊహాలోకపు విహారాల లాంటివి లేకపోయినా, సినిమాలో 3 యుద్ధ సన్నివేశాలు ఆకర్షణ. కబీర్ బేడీ లాంటి అంతర్జాతీయ నటులూ, టెక్నీషియన్లూ అదనపు ఆకర్షణ. ⇔ ఆకట్టుకొనే హీరో పాత్రచిత్రణతో పాటు, ‘సమయం లేదు మిత్రమా... శరణమా? రణమా?’, ‘దేశం మీసం తిప్పుదాం!’, ‘దొరికినవాణ్ణి తురుముదాం... దొరకనివాణ్ణి తరుముదాం’ లాంటి మోస్ట్ పాపులర్ డైలాగ్స్ బోలెడున్నాయి. ఈ సినిమాతో పాటు ‘ఖైదీ నంబర్ 150’కి కూడా కొన్ని పవర్ఫుల్ డైలాగులు రచయిత బుర్రా సాయిమాధవ్ రాయడం విశేషం. ⇔ మొరాకో, జార్జియాలతో పాటు మన దేశంలో మధ్యప్రదేశ్‌లో ఇండోర్ సమీపంలోని నర్మదా నదీ తీరంలోని మహేశ్వర్ లాంటి చోట్ల షూటింగ్ జరిపారు. చిలుకూరులో కోటి రూపాయల ఓడ సెట్ వేశారు. ఎన్టీఆర్ ఆశ తీర్చిన బాలకృష్ణ పెద్ద ఎన్టీయార్ గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని స్వయంగా నటిస్తూ, నిర్మించాలనుకొన్నారు. 1993 ప్రాంతంలో రచయితలతో చర్చించి, స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయించారు. ఈ సుప్రసిద్ధ తెలుగు శాతవాహన చక్రవర్తి జీవితం మొత్తాన్నీ సినిమాగా తెరపై చూపాలని ఆయన భావించారు. గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైన నవ యువకుడు వాసిష్టీపుత్ర పులుమావి పాత్రను హీరో వెంకటేశ్‌తో వేయించాలని కూడా భావించారు. గెటప్, కాస్ట్యూమ్ స్కెచ్‌లూ వేయించారు. కానీ, అనివార్య కారణాల వల్ల అప్పట్లో అది తెరకెక్కలేదు. అప్పుడు తెరకెక్కని ఆ కథాంశం 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు క్రిష్ మనసులో ఆలోచనగా బాలకృష్ణతో రావడం యాదృచ్ఛికం. తప్పని తిప్పలు... మార్పులు! ⇔ ‘ఖైదీ నంబర్ 150’లో ఐటమ్ సాంగ్ కోసం ముందుగా క్యాథరిన్ థెరిసాను తీసుకున్నారు. అయితే, చిరు కుమార్తె సై్టలిస్ట్ అయిన సుష్మితతో ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ విషయంలో సెట్లో తలెత్తిన పేచీతో ఆ అమ్మాయిని పక్కకు తప్పించారు. రాయ్ లక్ష్మితో ఆ పాట చిత్రీకరించారు. ⇔ ‘ఖైదీ..’కీ, ‘శాతకర్ణి’కీ – రెంటికీ మొదట మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాదే! అయితే, తగినంత సమయం కేటాయించడం లేదనే కారణంతో, దేవిశ్రీ స్థానంలో చిరంతన్ భట్‌ను ప్రవేశపెట్టారు. ‘రుద్రమదేవి’కి నై..! ‘శాతకర్ణి’కి మాత్రం సై! తెలుగు జాతి చరిత్రకు సంబంధించిన కథాంశం కావడంతో, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి అండగా నిలిచేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి వినోదపు పన్ను నుంచి మినహాయించగా, ఏపీ ప్రభుత్వం ఆ బాటలోనే ఉంది. వినోదపు పన్ను కట్టనవసరం లేకపోవడంతో, సాధారణంగా అయితే ప్రేక్షకుడికి టికెట్ రేటు తగ్గాలి. అయితే, ఇలాంటి చారిత్రక చిత్రాలు నిర్మించేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, టికెట్ రేట్ మామూలుగానే ఉంచేసి, పన్ను మినహాయింపు లాభాన్ని నిర్మాతలకు అందజేయాలని భావిస్తున్నారు. దాంతో, సినిమాకు వచ్చే వసూళ్ళలో ఆ మేరకు (దాదాపు 15 శాతం) నిర్మాతకు లాభిస్తుంది. వచ్చిన నికర వసూళ్ళు (షేర్) అదనంగా 7 నుంచి 8 శాతం దాకా పెరుగుతాయని వ్యాపార వర్గాల అంచనా. వరంగల్ నుంచి తెలుగు ప్రాంతాన్ని అంతటినీ పాలించిన కాకతీయ సామ్రాజ్ఞి ‘రుద్రమదేవి’ కథను అదే పేరుతో దర్శక – నిర్మాత గుణశేఖర్ ఆ మధ్య సినిమాగా తీశారు. అయితే, ఆ తెలుగు రాణి కథకు తెలంగాణ ప్రభుత్వమే తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండదండగా నిలబడ లేదు. దాదాపు 15 నెలల క్రితం వచ్చిన ఆ చిత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినోదపు పన్ను మినహాయింపు నిచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఇదుగో.. అదుగో’ అని తిప్పించుకొని, ఆఖరికి మొండిచెయ్యి చూపించారు. ఈసారి తన బావమరిది – వియ్యంకుడైన బాలకృష్ణ నటించిన ‘శాతకర్ణి’ సినిమాకు రిలీజ్‌కు ముందే పన్ను మినహాయింపునకు సిద్ధమవుతున్నారు. అన్నట్లు అప్పట్లో ఈ పన్ను మినహాయింపు లాభమంతా ఎప్పటిలా ప్రేక్షకులకూ, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకూ కాకుండా చరిత్రను తెరకెక్కించిన నిర్మాతలకే దక్కేలా కేసీఆర్ జీవో జారీ చేశారు. కానీ, ‘రుద్రమదేవి’కి దక్కాల్సిన ఆ ప్రోత్సాహం తాలూకు సొమ్మంతా ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన పేరున్న తెలంగాణ చిత్ర నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ దగ్గరే ఉండిపోవడం విచిత్రం. పరిశ్రమ వర్గీయులు మధ్యవర్తిత్వం చేసినా, ప్రభుత్వమిచ్చిన ఆ ప్రోత్సాహం అసలు నిర్మాతకు చేరకనేపోవడం విషాదం. పోటీపడుతున్న అభిమానం అతిథి పాత్రపోషణల్ని కలిపితే, సినిమాల సంఖ్య పెరిగినా, చిరంజీవి, బాలకృష్ణలు ఈ తాజా చిత్రాల్ని 150... 100... సినిమాలుగానే ప్రకటిస్తూ వచ్చారు. అలా ఇవి ‘మేజికల్ ఫిగర్’ సినిమాలు కావడంతో, చిరు, బాలయ్య అభిమానులు కూడా వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే, దేశమంతా పుణ్యక్షేత్రాల్లో పూజల దగ్గర నుంచి తమ హీరోల ప్రత్యేక పుస్తకాల విడుదల దాకా అనేకం చేస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు తమ హీరో చిత్ర అఖండ విజయం కోసం గత నవంబర్ ఆఖరులో కార్తీక సోమవారానికి 1116 శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించారు. 3 వ్యాన్లలో తిరుగుతూ, సుమారు 9 రాష్ట్రాల్లో 39 రోజుల పాటు, 95 పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసి, ‘భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర’ చేశారు. చిరు అభిమానులు తామేం తక్కువంటూ అన్నయ్య రీఎంట్రీ సిన్మా విజయం కోసం... పుణ్యక్షేత్రాల సందర్శనకు దిగారు. కాశీ విశ్వనాథుడికీ, విశాలాక్షికీ, కొల్హాపూర్‌లో మహాలక్ష్మి అమ్మవారికీ పూజలు చేశారు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఏమో వంద సినిమాల లోగోలు, స్టిల్స్‌తో ‘ఎన్.బి.కె. 100 – నెవర్ బిఫోర్’ అంటూ ప్రత్యేక పుస్తకం, క్యాలెండర్లు, డైరీలు ప్రింట్ చేసి, ఆడియో రిలీజ్ వేదికపై విడుదల చేశారు. ఇక, చిరు వర్గం అండతో, ఆయన సినిమా జీవితంపైనా కొన్ని పుస్తకాలు రిలీజ్‌కు ముందే విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ అభిమానులు ప్రొద్దుటూరులోని ఒక థియేటర్లో ఆయన నటించిన 100 సినిమాల్నీ రోజుకొకటి చొప్పున ప్రదర్శిస్తూ, శతచిత్రోత్సవం చేస్తున్నారు. చరిత్రలో శాతకర్ణి ప్రవేశపెట్టిన ‘గుడీపడవా’ (గుడిసెపై జెండా) పండుగకు గుర్తుగా 100 థియేటర్లపై శాతకర్ణి జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు. మరోపక్క ‘అన్నయ్య’ రీ–ఎంట్రీకి తగ్గట్లు కర్ణాటకలోని చిరు వీరాభిమాని ఒకరు ప్రత్యేకంగా పాట రాయించుకొని, ప్రముఖ గాయకుడు దీపూతో పాడించి, ‘వచ్చాడు వచ్చాడు చిరంజీవి వచ్చాడు...’ అంటూ దాన్ని ఆల్బమ్‌గా రిలీజ్ చేశారు. ఇక, సిన్మా రిలీజ్ రోజు హంగామాకైతే ఇరు వర్గాల లక్షలాది అభిమానులూ సర్వసన్నద్ధమవుతున్నారు. బరిలో... మిగతా పందెం కోళ్ళు! గత ఏడాది సంక్రాంతికి ఏకంగా 4 తెలుగు సినిమాలు వచ్చాయి. ఈ సారీ నాలుగు వస్తున్నాయి. చిరు, బాలయ్య సినిమాల్ని పక్కనపెడితే, శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌లతో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘శతమానం భవతి’ సరిగ్గా సంక్రాంతి రోజున జనవరి 14న రిలీజ్ కానుంది. అలాగే, ఆర్. నారాయణమూర్తి చాలా కాలం తర్వాత బయటి నిర్మాతలకు పనిచేసిన ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ కూడా జనవరి 14నే వస్తోంది. ‘శతమానం భవతి’ పూర్తిగా కుటుంబకథా చిత్రం ఫీల్‌తో సంక్రాంతి పండుగ ఫీల్ తెస్తుంటే, నల్లధనంపై పోరాటమనే లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ మీద వస్తున్న ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ ఆలోచింపజేస్తోంది. వరుసగా వచ్చే సెలవులు, ఇంటిల్లపాదీ సినిమాలు, షికార్లతో ఆనందించాలనుకునే పండుగ వాతావరణం ఒకటికి, నాలుగు సినిమాల్ని బాక్సాఫీస్ దగ్గర సునాయాసంగా గెలుపునిస్తుంది. అదే ఇప్పుడీ పోటాపోటీ రిలీజ్‌లకు పెద్ద ఊపిరి. సామాన్య ప్రేక్షక జనం కూడా ఇప్పుడు చెబుతున్నది ఒకే మాట .. ‘మాకు నచ్చిందే చూస్తాం... నచ్చితేనే చూస్తాం...’ మరి, ఈసారి సినిమా బరిలో సంక్రాంతి మొనగాడెవరో? జస్ట్ మరొక్క మూడు రోజులు... లెటజ్ వెయిట్ అండ్ సీ! సంక్రాంతికే.. శతమానం భవతి, హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య – డాక్టర్ రెంటాల జయదేవ -
ఖైదీపై పవన్ ట్వీట్ వస్తున్నట్టా..రానట్టా.?
-
ఖైదీపై పవన్ ట్వీట్.. ఇంతకీ వస్తున్నట్టా..రానట్టా..?
మెగా మూవీపై పవన్ మౌనం వీడాడు. ఇప్పటి వరకు మెగాస్టార్ రీ ఎంట్రీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని పవర్ స్టార్ తాజాగా ఖైదీ నంబర్ 150 యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపాడు. ' చరణ్, మా వదిన సురేఖగారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు'. అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ లో సాయంత్రం జరగబోయే వేడుకకు తాను వచ్చేదీ రానిదీ క్లారిటీ ఇవ్వలేదు. శుక్రవారం సాయంత్రం నుంచి పవన్ ఖైదీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవుతాడన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. పవన్ స్వయంగా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారంటున్నారు అభిమానులు. పనవ్ మాత్రం తన ట్వీట్ లో ఎక్కడా వేడుకకు సంబంధించి స్పందించకపోవటంతో మరోసారి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు వస్తాడా.. రాడా.. తెలియాలంటే సాయంత్ర ఫంక్షన్ మొదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. pic.twitter.com/U88JV4A5oh — Pawan Kalyan (@PawanKalyan) 7 January 2017 -
అభిమానులు హద్దుదాటితే తాట తీస్తాం
-
అభిమానులకు ఏపీ పోలీస్ బాస్ హెచ్చరిక
సంక్రాంతి రేసులో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు భారీగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టారు. గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నం.150 చిత్రాల విడుదల నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఏపీ డీజీపీ శనివారం సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా అభిమానులు హద్దు దాటితే తాటా తీస్తాం అంటూ హెచ్చరించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇతర హీరోల బ్యానర్లు, పోస్టర్లు చించేవారిపై, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలుంటాయన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీలు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. కాగా ఈ రోజు సాయంత్రం గుంటూరు సమీపంలోని హాయ్ లాండ్ వేదికగా చిరంజీవి సినిమా "ఖైదీ నంబర్ 150'' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ ప్రకటన ప్రాదాన్యం సంతరించుకుంది. ఇప్పటికే మెగా వేడుకకు అనుమతి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీస్ బాస్ హెచ్చరికలు అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి. -
ఆ మూవీలు బాక్సాఫీసును షేక్ చేయాలి: హీరో
ప్రేక్షకులకే కాదు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు సంక్రాంతి ఫీవర్ పట్టుకుంది. సంక్రాంతి బరిలో నిలిచే ఏ మూవీలు సక్సెస్ సాధిస్తాయి... ఏ మూవీ ఫ్లాఫ్ అవుతుందని కొన్ని రోజుల ముందు నుంచే టాక్ మొదలవుతుంది. సంక్రాంతికి విడుదలకానున్న మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి భారీ సక్సెస్ సాధించాలని టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ అకాంక్షించాడు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150, నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన గౌతమీపుత్ర శాతకర్ణి, యువహీరో శర్వానంద్ నటించి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'శతమానం భవతి' సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నాయి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్న ఈ మూడు చిత్రాలు ఈ నూతన సంవత్సరంలో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో అద్భుత విజయాన్ని సాధించాలని నితిన్ ట్వీట్ చేశాడు. మరోవైపు రెండు భారీ మూవీలు విడుదలైనా శతమానం భవతిని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని.. స్టోరీ తమకు ప్లాస్ పాయింట్ అవుతుందని నిర్మాత దిల్ రాజు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. I wish n hope that al d 3 sankranti releases perform extremely well and start this new year with a bang at the boxoffice..#khaidi #gpsk #Sb — nithiin (@actor_nithiin) 7 January 2017 -
ఖైదీ ఫంక్షన్ పవన్‌కు ఇష్టం లేదా..?
మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150కి వీలైనంత హైప్ తీసుకువచ్చేందుకు మెగా ఫ్యామిలీ అంతా కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా రాంచరణ్, అల్లు అరవింద్‌లు అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టేసి ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సక్సెస్ చేసేందుకు కష్టపడుతున్నారు. మెగా హీరోలందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి మెగా కంబ్యాక్‌కు మరింత హైప్ తీసుకురావాలని భావిస్తున్నారు. కొంత కాలంగా మెగా ఈవెంట్లకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్‌ను ఈ వేడుకకు తీసుకు రావాలని మెగా క్యాంప్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పవన్ రారంటూ అల్లు అరవింద్ ప్రకటించినా.. రాంచరణ్ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ అన్న నినాదాలు తప్పక వినిపిస్తాయని భావిస్తున్న మెగా టీం పవన్ వస్తేనే ఆ నినాదాలను అదుపు చేసే అవకాశం ఉంటుంది. అయితే పవన్‌కు మాత్రం ఖైదీ ప్రీ రిలీజ్ వేడుక హజరయ్యే ఉద్దేశం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయిందని భావిస్తున్న పవన్ ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక అవసరం లేదని భావిస్తున్నాడట. ఈ విషయాన్ని తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. మెగా కాంపౌండ్ మాత్రం ఎలాగైనా పవన్ ఈ వేడుకకు హజరయ్యేలా చూడాలని ప్రయత్నిస్తోంది. -
మెగా150 మొబైల్ గేమ్ లాంచ్
మెగాస్టార్ రీ ఎంట్రీని అన్ని రకాలుగా ప్రమోట్ చేసేందుకు రకరకాల ప్లాన్ చేస్తున్నారు మెగా టీం. ఇప్పటికే భారీగా ప్రమోట్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్న చిత్రయూనిట్, సినిమాను జనాలకు చేరువ చేసేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను ట్రై చేస్తోంది. బాలీవుడ్ తరహాలో సినిమా రిలీజ్‌కు ముందు ఓ మొబైల్ గేమ్‌ను రిలీజ్ చేయనుంది. తాజాగా ఈ గేమ్‌కు సంబంధించిన టీజర్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చిరంజీవి సినిమాల్లోని క్యారెక్టర్లను పోలిన పాత్రలు ఈ గేమ్‌లో దర్శనమివ్వనున్నాయి. ఖైదీ, అడవిదొంగ సినిమాలతో పాటు జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ గెటప్స్‌లో చిరంజీవి యానిమేషన్ పాత్ర చేసే సాహసాలు అభిమానులను అలరిస్తున్నాయి. చివర్లో వేసి 'బాస్ ఇన్ గేమ్ మెగా150' అనే టైటిల్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. జనవరి 9న మార్కెట్ లోకి విడుదలవుతున్న ఈ గేమ్‌ను ఎమ్-యాప్ సోర్స్ డెవలప్మెంట్ రెండు వాల్యూమ్స్‌గా విడుదల చేస్తోంది. -
మెగా150 మొబైల్ గేమ్ లాంచ్
-
ఇద్దరినీ స్వాగతిద్దాం..!
చాలా కాలం తరువాత టాలీవుడ్ వెండితెర మీద ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమయ్యింది. ఇద్దరు సీనియర్ హీరోలు సంక్రాంతి పండుగకు ముఖాముఖి తలపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇస్తుండగా, నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌తో జనవరి 11, 12 తేదిల్లో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు భారీ చిత్రాలు ఒకేసమయంలో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అలా రిలీజ్ అయితే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా ఆ రిస్క్ చేయడానికే రెడీ అవుతున్నారు ఈ సీనియర్ స్టార్స్. ఇద్దరికీ ప్రతిష్టాత్మక చిత్రాలు కావటంతో ప్రచారం, రిలీజ్ విషయంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవ్వటం పై ఇరు చిత్రాల నిర్మాతలు స్పందించారు. ఇలా భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవ్వటం గతంలో కూడా జరిగిందంటూ రామ్‌చరణ్ వివరించగా... గౌతమీపుత్ర శాతకర్ణి దర్శక నిర్మాత క్రిష్. ఇద్దరినీ స్వాగతించాలంటూ కోరాడు. 'ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రతిష్టాత్మక చిత్రాలతో వస్తున్నారు. #jan11khaidi, #jan12GPSK హ్యాష్ ట్యాగ్‌లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ వారిని స్వాగతిద్దాం'. అంటూ ట్వీట్ చేశాడు. This #Sankranthi two legends r coming to entertain us with their landmark films. Let us all welcome both by trending #Jan11Khaidi #Jan12GPSK — Krish Jagarlamudi (@DirKrish) 3 January 2017 -
అందుకే... 11న వస్తున్నాం!
‘‘బాలకృష్ణ గారి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి, 12న మా చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. రెండు అగ్ర హీరోల చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం చిత్ర పరిశ్రమకి మంచి పరిణామం కాదని నాన్నగారు (చిరంజీవి) చెప్పడంతో మేం 11న రావాలని నిర్ణయం తీసుకున్నాం’’ – ‘ఖైదీ నంబర్ 150’ నిర్మాత, హీరో రామ్‌చరణ్ తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు? అనే ఉత్కంఠకు రామ్‌చరణ్ మంగళవారం ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రీ–రిలీజ్ ఫంక్షన్ తేదీ, వేదిక విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 11న చిరంజీవి రీ–ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే 7న మంగళగిరి దగ్గర ప్రీ–రిలీజ్ ఫంక్షన్ జరుపుతున్నామన్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడ క్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకకి ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు, ‘దర్శకేం ద్రులు’ కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరవు తున్నట్టు రామ్‌చరణ్ చెప్పారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా అభిమా నులతో సంభాషించిన ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. (చదవండి :‘ఖైదీ’ విడుదల తేదీ ప్రకటించిన చరణ్ ) రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘కొన్ని అనుమతులు రాని కారణంగా ఇందిరాగాంధీ స్టేడియంలో (విజయవాడ) జనవరి 4న ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేయలేకపోతున్నాం. అందువల్ల, గుంటూరు– విజయవాడ హైవేలో ఉన్న హాయ్‌ల్యాండ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 7న ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. ట్రైలర్ కూడా 7న విడుదల చేస్తున్నాం. పలువురు దర్శక–నిర్మాతలు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ రోజు బాబాయ్ పవన్‌కల్యాణ్‌ను కలసి ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. వస్తారా? లేదా? అనేది ఆయన చేతుల్లోనే ఉంది’’ అన్నారు. బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పోటీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? అని ఓ అభిమాని ప్రశ్నించగా... ‘‘ఇది పోటీ కాదు. రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదల కావడమనేది సహజమే. పండక్కి ఎన్ని సినిమాలైనా రావొచ్చు. 2013 సంక్రాంతికి వెంకటేశ్, మహేశ్‌బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, నేను చేసిన ‘నాయక్’ సినిమాలు విడుదలయ్యాయి. రెండూ బాగా ఆడాయి. మా సినిమాతో పాటు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత చిరంజీవి నటించబోయే తదుపరి సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఉంటుందని రామ్‌చరణ్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రీ–రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి మంగళగిరి వద్దకు వెళ్లిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్... ‘‘సినిమాలను రాజకీయా లతో ముడి పెట్టొదు. చిత్ర పరిశ్రమలో రాజకీయాలపై అవసరమైన సమయంలో స్పందిస్తా’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
పవన్ కల్యాణ్‌పై రాం చరణ్ కామెంట్
హైదరాబాద్: తొమ్మిదేళ్ల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ వస్తాడా రాడా అన్న విషయం సినీ వర్గాలు, అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. పవన్ వచ్చే అవకాశం లేదని సినీ వర్గాలు చెబుతుండగా, ఆయన్ను రప్పించేందుకు మెగా ఫ్యామిలీ ప్రయత్నిస్తోంది. బాబాయ్‌ను కలసి ఇన్విటేషన్ ఇస్తానని రాంచరణ్ ఫేస్ బుక్ లైవ్‌లో చెప్పాడు. దీంతో పవన్ రాకకోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 7వ తేదీన గుంటూరులోని హాయ్లాండ్లో ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావులు రానున్నారు. నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
'కారణాలు చిరంజీవే వివరిస్తారు'
ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకోకుండా వేదిక మార్చాల్సి రావటంతో ఏర్పాట్లను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గుంటూరులోని హాయ్లాండ్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడగా.. తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ఫంక్షన్‌కు అనుమతులు వచ్చినట్టుగా ప్రకటించారు. అయితే వేదిక మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చిరంజీవే వివరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే ఖైదీ వేడుకకు అనుమతి ఇవ్వలేదని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. మెగా హీరోలందరూ ఈ వేడుకలో పాల్గొంటారన్న ప్రచారం జరుగుతుండగా.. పవన్ వస్తాడా రాడా అన్న అనుమానం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ విషయం పై కూడా క్లారిటీ ఇచ్చిన అరవింద్, పవన్ ఖైదీ వేడుకకు హాజరు కావటం లేదని తెలిపారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రాలేకపోతున్నారన్నారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు. -
ఖైదీ x శాతకర్ణి
♦ గత సంక్రాంతికి బాబాయ్, అబ్బాయి.. థియేటర్ల వార్ ♦ జూనియర్ సినిమా బెనిఫిట్‌షో అనుమతికి నిరాకరణపై వివాదం ♦ తాజాగా పండుగ బరిలో మెగాస్టార్, యువరత్న చిత్రాలు ♦ విజయవాడలో ఖైదీ నెంబర్–150 ట్రైలర్ రిలీజ్‌కు అనుమతించకపోవడంపై మెగా అభిమానుల ఆగ్రహం ♦ హాయ్‌ల్యాండ్‌లో ఈ నెల 7న ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ రిలీజ్ సాక్షి, అమరావతి: ఏడాదికో మారు వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి నందమూరి బాలకృష్ణకు సంకటంగా మారుతోంది. గడిచిన సంక్రాంతికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల రిలీజ్‌తో థియేటర్ల కొరత నందమూరి వారసుల మధ్య వార్‌కు తెరతీసిన సంగతి తెల్సిందే. ఈ సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాల మధ్య పోటీ సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ జనవరి 11 న, యువరత్న బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వియ్యంకుడి గా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సినిమా రిలీజ్‌కు సినిమా హాళ్ల సమస్య ఉండ దు. అదే సమయంలో సినీ నిర్మాత అల్లు అర వింద్‌కు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సినిమా థియేటర్లు ఉండటంతో ఆయన బావ చిరంజీవి సినిమా విడుదలకు ఇబ్బందిలేదు. అయితే రెండు చిత్రాల టీజర్, ఆడియో, ట్రైలర్, సినిమా విడుదల వరకు చోటు చేసు కుంటున్న వరుస పరిణామాలు మెగా అభి మానుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. చిరు సినిమా ట్రైలర్ రిలీజ్‌పై మెగా వివాదం... చిరంజీవి సినిమా ట్రైలర్ రిలీజ్‌కు వేదిక విషయంలో తలెత్తిన సమస్య అధికార తెలుగుదేశం పార్టీపై మెగా అభిమానులు ఆగ్రహానికి దారితీసింది. ఖైదీ నెంబర్ 150 సినిమా ఈ నెల 4 న విజయవాడలో ట్రైలర్ విడుదల చేయాలని భావించారు. అయితే అందుకు మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడానికి ప్రభుత్వ ఒత్తిడే కారణమని మెగా ఫ్యాన్స్ గత కొద్ది రోజులుగా సోషల్ నెట్‌వర్క్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చివరకు గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఈ నెల 7న ఖైదీ నెంబర్ 150 సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేలా సోమవారం నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 26 న తిరుపతిలో నిర్వహించిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఈ సినిమా వెయ్యి రోజులకు పైగా ఆడాలని అభిలషించారు. ఈ నేపథ్యంలోనే తన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన శాతకర్ణి సినిమాకు మెగాస్టార్ సినిమా ఖైదీ నెంబర్ 150 పోటీ కాకుండా ఉండాలనే ముందుచూపుతోనే అధికార పార్టీ అడ్డంకులు కల్పిస్తోందని మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఈ మేరకు పోస్టింగుల్లో తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్‌తో... గత ఏడాది సంక్రాంతి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలయ్య ‘డిక్టేటర్’ల నడుమ థియేటర్ల వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమా ఆగస్టు 31 అర్ధరాత్రి తరువాత బెనిఫిట్ షో ప్రదర్శనకు అనుమతి రాకుండా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరిగింది. అప్పట్లో జూనియర్ సినిమాలు చూడొద్దం టూ బాలయ్య అభిమానుల పేరుతో అధికార పార్టీ శ్రేణులు పలువురికి సెల్ మెసేజ్‌లు పంపడం, సోషల్ నెట్‌వర్క్‌లో పోస్టులు పెట్టడం వివాదాస్పదమయ్యాయి. చివరకు ఆ పంచాయతీ సీఎం వద్దకు చేరి అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమా బెనిఫిట్ షో కి ప్రభుత్వం అనుమతి ఇవ్వక తప్పలేదు. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు చినకాకాని (మంగళగిరి): మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ కార్యక్రమం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకానిలో జరగనుంది. హాయ్‌ల్యాండ్ ఎదుట గల ఖాళీ భూములలో నిర్వాహకులు వేదికను ఏర్పాటు చేస్తున్నారు. చాలాకాలం అనంతరం చిరంజీవి సినిమాలలో నటిం చడం సినిమా ప్రీ రిలీజ్‌కు మంగళ గిరిని వేదికగా చేసుకోవడంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. -
సంక్రాంతి రేసులో మరో హీరో
గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్ వెండితెర మీద సంక్రాంతి పోటి భారీగా కనిపిస్తోంది. ఇప్పటికే సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలు ముఖాముఖి తలపడుతుండగా యంగ్ హీరో శర్వానంద్ కూడా బరిలో దిగుతున్నాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న శతమానంభవతి దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతుండటంతో థియేటర్ల సమస్య ఉండే అవకాశం లేదు. అయితే ఇంత భారీ పోటిలోకి ఓ చిన్న సినిమా అడుగుపెడుతోంది. విప్లవ సినిమాలతో పీపుల్స్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆర్ నారాయణమూర్తి.. హెడ్ కానిస్టేబుల్ వెంట్రామయ్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటి జయసుధ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభవతి లాంటి సినిమాలు రిలీజ్ అవుతుండగా ఆర్ నారాయణమూర్తికి థియేటర్లు దొరికే ఛాన్స్ కనిపించటం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఆర్ నారాయణమూర్తి రిస్క్ చేసి తన సినిమా రిలీజ్ చేస్తాడా..? లేక కొద్ది రోజులు వాయిదా వేస్తాడా..? చూడాలి. -
కేక పెట్టిస్తున్న 'రత్తాలు రత్తాలు'
-
కేక పెట్టిస్తున్న 'రత్తాలు రత్తాలు'
సంక్రాంతి కానుకగా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150, ప్రమోషన్ లో స్పీడు పెంచుతుంది. ఇప్పటికే మూడు పాటలతో అభిమానులను అలరించిన ఖైదీ.., ఇప్పుడు మెగా మార్క్ మ్యాజిక్‌తో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు. మాస్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ లాంటి మెగాస్టార్ ఫుల్ మాస్ సాంగ్‌కు ఆడిపాడి దశాబ్దం పైగానే అయ్యింది. ఇన్నేళ్ల తరువాత ఓ ఫుల్ మాస్ బీట్తో అలరించాడు చిరు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రత్తాలు రత్తాలు అంటూ ఉర్తూతలూగించే మాస్ బీట్స్‌కు ఇరగదీసే స్టెప్స్ వేశాడు. చిరు కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌గా నిలిచిన పాటలకు కొరియోగ్రఫీ చేసిన లారెన్స్ మాస్టర్ ఈ మాస్ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించాడు. చిరు పక్కన అందాల భామ లక్ష్మీ రాయ్ ఆడిపాడింది. మేకింగ్ బిట్స్‌తో రత్తాలు పాటను రిలీజ్ చేశారు. ఈ పాటతో కలిపి ఇప్పటికే నాలుగు పాటలు రిలీజ్ కాగా.. ఈరోజు రాత్రి పూర్తి ఆల్బమ్‌ను ఆన్లైన్ లోకి రిలీజ్ చేస్తున్నారు. అభిమానుల కోసం జనవరి 4న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. -
ఓవర్సీస్లోఖైదీకి భారీ టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్ 150. చిరు 150వ సినిమా కూడా కావటంతో ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో మెగా అభిమానులను అలరించే అన్ని రకాల అంశాలతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది ఖైదీ నంబర్ 150. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి రీఎంట్రీ సంచలనాలు నమోదు చేయటం కాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో మెగాస్టార్ సినిమాకు ఓవర్సీస్లో కూడా భారీ టార్గెట్లు సెట్ అవుతున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావటంతో విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఆసక్తికనబరుస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ మొత్తాలకు ఖైదీ నంబర్ 150 రైట్స్ అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే జరిగిన బిజినెస్ ప్రకారం 1.8 మిలియన్ డాలర్లు వసూళు చేస్తే ఖైదీ నంబర్ 150 ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. మరి చిరు ఈ ఫీట్ సాధిస్తాడో లేదో చూడాలి. -
ఖైదీ కోసం రానా, నవదీప్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ఖైదీ నంబర్ 150. చిరు 150వ సినిమా కూడా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ అంచనాలను మరింతగా పెంచేస్థాయిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తోంది మెగా టీం. విజయవాడ వేదికగా జరగనున్న ఈ ఈవెంట్‌కు యువ నటులు రానా, నవదీప్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారట. ఇప్పటికే పలు సినీ వేడుకలకు యాంకరింగ్ చేసిన నవదీప్, తన సినిమాల ఆడియో వేడుకల్లో యాంకరింగ్ చేసే రానా.. ఇద్దరు కలిసి మెగాస్టార్ రీ ఎంట్రీకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ వేడుకలో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, లైవ్ పర్ఫామెన్స్ మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. -
విజయవాడలో ఖైదీ...
చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్న సినిమా ‘ఖైదీ నంబర్ 150’. జనవరి 4న విజయవాడలో ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించనున్నట్లు రామ్‌చరణ్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ‘అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు’ పాటకు మంచి స్పందన లభిస్తోందని చరణ్ అన్నారు. శనివారం ‘సుందరి...’ పాటను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
‘సుందరి’ అంటూ వచ్చేసిన మెగాస్టార్
-
‘సుందరి’ అంటూ వచ్చేసిన మెగాస్టార్
హైదరాబాద్ : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. క్రిస్మస్ కానుకగా మెగా అభిమానులు ఒకరోజు ముందే గిప్ట్ అందుకున్నారు. వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' మూవీలోని 'సుందరి' అంటూ సాగే మరో పాటను చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఇప్పటికే ఆ పాటకు సంబంధించిన చిరు లుక్‌ను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిన్న తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాట విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే లక్షకు పైగా వీక్షించారు. ఈ సినిమాలోని ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ పాటకు అత్యథిక హిట్స్ వచ్చిన విషయం తెలిసిందే. యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన ఈ ఆడియో సాంగ్‌ను మెగా అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షించారు. ఈ పాటను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా వీక్షించారని, ఇంత తక్కువ సమయంలో ఓ ఆడియో సాంగ్‌కు ఇన్ని లక్షల వ్యూస్ రావడం అరుదని లహరి మ్యూజిక్ ట్వీట్ చేయగా, దాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రీ ట్వీట్ చేశాడు. తొమ్మిదేళ్లు విరామం తర్వాత అయినప్పటికీ అమ్మడు పాట ద్వారా బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న చిరు తాజాగా సుందరీ అంటూ మళ్లీ దుమ్మరేపనున్నారని అభిమానులు సంబరపడుతున్నారు. మరి ‘సుందరి’ ‘అమ్మడు లెట్స్ కుమ్ముడు’ రికార్డులను బ్రేక్ చేసి సునామీ సృష్టిస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంబంధించి మిగతా పాటలు ఆదివారం డైరెక్ట్‌గా మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. -
చరణ్ కాదు చిరునే..!
మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా, ఖైదీ నంబర్ 150 సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్లో బిజీగా ఉంది. మెగా సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ఆడియో వేడుక లేకుండా పాటలను డైరెక్ట్‌గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ పాట యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది. ఇప్పుడు సుందరీ అనే పాటను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ పాట రిలీజ్ చేస్తున్నారు అన్న న్యూస్ కన్నా.. ఆ విషయాన్ని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టర్లో చిరు అచ్చు చరణ్ లాగే కనిపిస్తున్నాడు. మరింత యంగ్‌గా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడంటున్నారు ఫ్యాన్స్. 61 ఏళ్ల వయసులోనే చిరు గ్లామర్ లుక్స్‌తో ఆకట్టుకోవటంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. -
ఖైదీ నెంబర్ 150 పాట మేకింగ్ వీడియో
-
ఎంతవరకు?
కలువ కళ్ల పిల్ల కాజల్ అగర్వాల్ ఇప్పుడు మాంచి జోరు మీదున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రానా సరసన నటిస్తున్నారు. తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య ‘జనతా గ్యారేజ్’లో చేసిన ప్రత్యేక పాట ద్వారా తెరపై కనిపించారామె. ఇయర్ ఎండింగ్లో మరోసారి తెరపై కనిపించనున్నారు. జీవా, కాజల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘కవలై వేండాం’ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డి.వెంకటేష్ ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇది మంచి కామెడీ ఎంటర్టైనర్. జీవా, కాజల్ మధ్య రొమాంటిక్ సీన్స్ యువతను ఆకట్టు కుంటాయి. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల చేయా లనుకున్నాం. కానీ, తెలుగులో సెన్సార్ సకాలంలో పూర్తి కాకపోవడంతో కుదర లేదు. తమిళంలో లానే తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
కుమ్మేస్తున్న చిరు ఖైదీ నెంబర్ 150 పాట
తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమాలోని పాట ఆన్లైన్లో దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు అనే సాంగ్ టీజర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన ఈ ఆడియో సాంగ్‌ను మెగా అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షిస్తున్నారు. ఈ పాటను రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 20 లక్షల మందికి పైగా వీక్షించారని, ఇంత తక్కువ సమయంలో ఓ ఆడియో సాంగ్‌కు ఇన్ని లక్షల వ్యూస్ రావడం అరుదని లహరి మ్యూజిక్ ట్వీట్ చేయగా, దాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రీ ట్వీట్ చేశాడు. ఈ పాటను వీక్షించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. ఆడియో సాంగ్‌తో పాటు మూవీ స్టిల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి రెడ్ షర్టు వేసుకుని, ఫ్యాంటుపై లుంగీ కట్టుకుని, కళ్లజోడు పెట్టుకుని మాస్ లుక్‌లో యంగ్‌గా కనిపించాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించింది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. Thank U everyone.. for loving #AMMADUletsdoKUMMUDU !! -
దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్
-
దుమ్మురేపుతున్న చిరు లేటెస్ట్ మూవీ సాంగ్
హైదరాబాద్: దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘ఖైదీ నంబర్ 150’. ఈ మూవీకి సంబంధించిన ఓ పాట ‘అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు’ అనే సాంగ్ టీజర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. యూట్యూబ్‌లో అప్ లోడ్ ఇలా చేశారో లేదో అంతే.. మెగా అభిమానులు ఈ టీజర్ ను ఓ రేంజ్ లో వీక్షిస్తున్నారు. అందులోనూ మెగాస్టార్ మూవీ అంటే ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. నిమిషానికి వేల వ్యూస్ తో రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ మూవీ దర్శకుడు వీవీ వినాయక్ చెప్పినట్లుగానే 'అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు.. ఎర్రచీర ఈరోజే కొన్నాను' అనే సాంగ్ లిరిక్స్ టీజర్ విడుదలైంది. వీడియోలో లిరిక్స్ తో పాటు మూవీ స్టిల్స్ అభిమానులను ఉత్సాహ పరుస్తాయనడంలో సందేహమే లేదు. సాంగ్ కంపోజింగ్ పై మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. చిరంజీవిగారి మూవీకి మ్యూజిక్ ఇవ్వడం గౌరవంగా భావిస్తాను. కింగ్ ఆఫ్ మాస్ ఈజ్ బ్యాక్ టు రాక్ అని తన ట్వీట్ లో దేవీశ్రీ పేర్కొన్నాడు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన ‘సరైనోడు’, ‘ధృవ’ సినిమాల పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసి, తర్వాత ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేయనున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. -
అమ్మడూ...ఇక కుమ్ముడే!
చిరంజీవి స్టెప్పులు, డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?! స్టార్ నుంచి మెగాస్టార్ కావడంలో ఆయన యాక్టింగ్‌తో పాటు డ్యాన్సులకు క్రెడిట్ దక్కుతుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. మరి, రీ–ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’లోనూ మునుపటిలా స్టెప్పులు వేస్తారా అనడిగితే... సందేహాలు అవసరం లేదంటున్నారు దర్శకుడు వీవీ వినాయక్. శాంపిల్‌గా ఈరోజు సాయంత్రం ‘అమ్మడూ.. లెట్స్ డు కుమ్ముడు’ అనే సాంగ్ టీజర్ రిలీజ్ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన ‘సరైనోడు’, ‘ధృవ’ సినిమాల పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసి, తర్వాత ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేశారు. ఇప్పుడీ ‘ఖైదీ నంబర్ 150’కి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ.. దేవిశ్రీ ప్రసాద్ బాణీలను ఈ నెల 25న నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేయనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను చిరంజీవి సతీమణి సురేఖ సమర్పణలో ఆయన తనయుడు రామ్‌చరణ్ నిర్మించారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. -
మెగా అభిమానులకు మరో షాక్
దాదాపు దశాబ్ద కాలంగా మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ రోజు దగ్గరకొచ్చింది. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో సందడి మొదలైపోగా, ఆడియో వేడుక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో మెగా అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు చిత్రయూనిట్. మెగా ఫ్యామిలీ గత చిత్రాలు సరైనోడు, ధృవ మాదిరిగానే ఖైదీ నంబర్ 150కి ఆడియో ఫంక్షన్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది. అభిమానుల కోసం ఈ నెల 18న 'అమ్మడు లెట్స్ డు కుమ్మడు' అనే సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 25న ఆడియోను డైరెక్ట్‌గా మార్కెట్ లోకి రిలీజ్ చేసి.. తరువాత సినిమా రిలీజ్‌కు ముందు ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా. సెంటిమెంట్ పరంగా కూడా ఆడియో వేడుకను క్యాన్సిల్ చేసే అవకాశాలే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది. -
గుమ్మడికాయ కొట్టేసిన ఖైదీ
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఖైదీ నంబర్ 150 షూటింగ్ పూర్తయ్యింది. దాదాపు దశాబ్దకాలంగా మెగా అభిమానులను ఊరిస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరు మార్క్ మాస్ యాక్షన్ కామెడీలతో రూపొందిన ఈ సినిమా మెగాస్టార్ స్టామినాను మరో సారి ప్రూవ్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయ్యింది. ఈ విషయాన్ని మెగాతనయ, ఖైదీ నంబర్ 150 కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మితా కొణిదల స్వయంగా ప్రకటించారు. తన ట్విట్టర్ పేజ్ లో ఖైదీ నంబర్ 150 షూటింగ్ పూర్తయ్యిందంటూ పోస్ట్ చేసిన సుస్మిత, రత్నవేళు, వినాయక్, దేవీ శ్రీ ప్రసాద్ లతో కలిసి పనిచేయటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో యూనిట్ సభ్యుల నుంచి ఎంతో నేర్చుకున్నానంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది సుస్మిత. It's a wrap on #KhaidiNo150 been a great experience. Best team to work with @KonidelaPro @RathnaveluDop #VVVinay garu @ThisIsDSP — sushmita konidela (@sushkonidela) 14 December 2016 And with the most fun costume team it's been a super journey and lot of learning from everyone @ind_pat @archa_mehta @Gauri_Naidu — sushmita konidela (@sushkonidela) 14 December 2016 -
దర్శకుడు చిరంజీవి
చిరంజీవి హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఠాగూర్’లో దర్శకుడు ఓ సీన్లో నటించారు. ఆ సినిమా సూపర్‌హిట్. బహుశా... ఆ సెంటిమెంట్ అనుకోవాలో? మరో కారణమో? చిరంజీవి, వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా సినిమా ‘ఖైదీ నంబర్ 150’లోనూ దర్శకుడు అతిథి పాత్ర చేశారు. విశేషం ఏంటంటే... వినాయక్ నటించిన సన్నివేశానికి చిరంజీవి దర్శకత్వం వహించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోస్‌లో సినిమా చిత్రీకరణకు ముగింపు పలుకుతూ, ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ లాస్ట్ షాట్‌కు చిరంజీవి అఫిషియల్‌గా ‘యాక్షన్... కట్’ చెప్పారు. అన్నట్టు... తమిళంలో దర్శకుడు మురుగదాస్ తీసిన ‘రమణ’కు తెలుగు రీమేక్ ‘ఠాగూర్’. ఈ ‘ఖైదీ నంబర్ 150’ మురుగదాస్ తీసిన మరో సినిమా ‘కత్తి’కి తెలుగు రీమేక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో పాటల్ని క్రిస్మస్కి, చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. -
బ్లాక్ అండ్ వైట్ చందమామ
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్న అందాలభామ కాజల్ అగర్వాల్. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అనిపించుకున్న ఈ బ్యూటి, తరువాత అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల వరుసగా ఆఫర్లు వస్తున్నా.., సక్సెస్ మాత్రం రావటం లేదు. దీంతో అభిమానులను అలరించేందుకు ఫోటోషూట్లతో సందడి చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో షూట్ చేసిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన ఈ చందమామ, ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ టెడ్ గ్రాంట్ చేసిన కామెంట్‌ను ఫోటోతో పాటు పోస్ట్ చేసింది. 'నువ్వు ఎప్పుడైనా ఓ మనిషిని కలర్లో ఫోటో తీస్తే, అందులో అతని దుస్తులు మాత్రమే కనిపిస్తాయి. అదే నువ్వు ఓ వ్యక్తిని బ్లాక్ అండ్ వైట్‌లో ఫోటో తీస్తే, అందులో అతని ఆత్మ కనిపిస్తుంది' అనే టెడ్ గ్రాంట్ కామెంట్‌ను పోస్ట్ చేసింది. "Wen u photograph ppl in color, u photograph their clothes. But when u photograph ppl in Black & white, u photograph their souls" -Ted Grant pic.twitter.com/mEcBtv314B — Kajal Aggarwal (@MsKajalAggarwal) 10 December 2016 -
మెగా ఆడియోకి ముహూర్తం ఫిక్స్
మెగా అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ రోజు.., ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినీ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్‌ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మెగా ఫ్యామిలీ హీరోలందరూ పాల్గొనే ఈ ఈవెంట్‌కు ముహుర్తం వేదిక ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ శుక్రవారం రామ్‌చరణ్ ధృవ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో పాటు ఖైదీ నంబర్ 150 ట్రైలర్‌ను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఆ తరువాత డిసెంబర్ 25న ఈ సినిమా ఆడియో వేడుకను మెగా అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు విజయవాడలోని ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రామ్‌చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తుండగా, మాస్ సినిమాల స్పెషలిస్ట్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
అవును.. హీరోలం మారుతుండాలి!
‘‘ఎప్పుడూ ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహంలా కాకుండా.. మేము (హీరోలం) మారుతుండాలి. గత సినిమాల ఇమేజ్, విజయాలను పట్టించుకోకూడదు. కథను బట్టి ముందుకు వెళ్లాలి’’ అన్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మించిన ‘ధృవ’ రిలీజ్ రేపు. రామ్‌చరణ్ చెప్పిన విశేషాలు... ► ప్రతి సినిమా విడుదల ముందు టెన్షన్ పడడం సహజమే. రీమేక్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ పడుతున్నా. అల్రెడీ తమిళంలో హిట్టయిన సినిమా అయినా, అలవాటైన హీరో సెంట్రిక్ ఫిల్మ్ కాదు కదా! ► ఎన్వీ ప్రసాద్‌గారు చెప్పడంతో ‘తని ఒరువన్’ చూశా. కొత్తగా ఉంటుందనుకున్నా. పైగా, పక్కా మాస్ ఏరియా అయిన సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ (ఎన్వీ ప్రసాద్) నన్ను కొత్తగా చూడాలనుకుంటున్నారు. దాంతో ఓకే చేశా. కథను నమ్మాను. నా క్యారెక్టర్, స్క్రీన్‌ప్లే డిఫరెం ట్‌గా ఉంటాయి. రీమేక్, పోలీస్ పాత్ర- అవేవీ ఆలోచించలేదు. కథలో చాలా మార్పులు చేశాం. ► అరవింద్‌స్వామి పాత్ర నిడివి తగ్గుతోంది. కానీ, ఆయన తప్ప సిద్ధార్థ్ అభిమన్యు పాత్రకు మరో ఆప్షన్ కనిపించలేదు. ఆయనతో మంచి బాండింగ్ ఏర్పడడం వల్ల సీరియస్ సీన్స్ చేయడం నాకు కష్టమైంది. ► ‘మళ్లీ రకులే హీరోయిన్ కదా’ అని అడుగుతున్నారు. హీరోయిన్లు ఎవరున్నారు చెప్పండి. ‘నాన్నకు ప్రేమతో’, ఇతర సినిమాల్లో రకుల్ బాగా నటించింది కదా! ►నేను మెథడ్ యాక్టర్‌ని కాదు. ప్రతి సినిమా ఓ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. సిక్స్‌ప్యాక్ ఎప్పుడో చేయాల్సింది. ► పెద్ద నోట్ల ఉపసంహరణ వల్లే ఈ నెల 2 నుంచి 9కి విడుదల తేదీని మార్చాం. ప్రస్తుతం రిలీజవుతోన్న పెద్ద సినిమా మాదే. ఆ ప్రభావం ఎంతవరకూ ఉంటుందో చూడాలి! ►సుకుమార్ సినిమా సంక్రాంతి తర్వాత, బాబాయ్ (పవన్‌కల్యాణ్) నిర్మాతగా చేసే సినిమా వచ్చే ఏడాది ఉంటాయి. ముందు ఇద్దరి చేతిలోనూ ఉన్న సినిమాలు పూర్తవ్వాలి. దర్శకులు మణిరత్నం, కొరటాల శివలతో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ► ప్రస్తుతానికి తెలుగులోనే చేస్తా. హిందీలో నటించే ఆలోచన ఏదీ లేదు. డాడీతో మళ్లీ డ్యాన్స్ చేశా! ‘ఖైదీ నంబర్ 150’లో తళుక్కున మెరుస్తా. నాన్నగారి (చిరంజీవి) తో కలసి ఓ పాటలో డ్యాన్స్ చేశా. ఈ రోజుతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. క్రిస్మస్కి పాటల్ని విడుదల చేస్తాం. జనవరి 11.. 12 తేదీల్లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. -
యూరప్‌లో `ఖైదీ నంబర్ 150` సాంగ్ షూట్..
మెగాస్టార్ `ఖైదీ నంబర్ 150` జెట్స్పీడ్తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్రమిస్తోంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తున్నారు. . కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ప్రీరిలీజ్ బిజినెస్‌లోనూ బాస్ అంతే స్పీడ్ చూపించడం సౌత్ ఇండస్ట్రీస్, ఓవర్సీస్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం యూరప్‌లో పాటల చిత్రీకరణకు యూనిట్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌చరణ్ ఖైదీ నంబర్ 150 పాటల చిత్రీకరణకు యూరప్ వెళుతున్నట్టుగా తెలిపారు. స్లోవేనియా, క్రొయేషియా (సెంట్రల్ యూరప్) లాంటి అరుదైన దేశాల్లో రెండు పాటల్ని తెరకెక్కించనున్నారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఈ పాటలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందించారు. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత తోటతరణి కళాదర్శకత్వం వహిస్తున్నారు. -
చిరు 150 రిలీజ్ పై డైలమా.?
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్‌పై టాలీవుడ్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ మెగా మూవీని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ విషయంలోనే వచ్చింది అసలు సమస్య. అదే రోజు మరో సీనియర్ స్టార్ హీరో కూడా బరిలో దిగుతుండటంతో మెగా మూవీ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారట. అదే రోజు నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా రిలీజ్ అవుతోంది. బాలయ్య వందో చిత్రం కావటంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ జానర్లో తెరకెక్కుతున్న సినిమా కూడా కావటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో మెగా మూవీ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే సినిమా బిజినెస్ కూడా జరిగిపోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా రిలీజ్ డేట్ విషయంలో వత్తిడి ఉందన్న టాక్ వినిపిస్తోంది. అనుకున్న డేట్ కన్నా ఒక్క రోజు ముందే రిలీజ్ చేస్తే రికార్డ్ కలెక్షన్లు సాధించటంతో పాటు సేఫ్ జోన్ లోకి వెళ్లోచ్చని భావిస్తున్నారు.మరి ఈ ఒత్తిళ్లతో మెగా కాంపౌండ్ రిలీజ్ డేట్ విషయంలో నిర్ణయం మార్చుకుంటుందేమో చూడాలి. -
కాటమరాయుడు సెట్లో ఖైదీ
చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఒకటి రెండు సార్లు చిరు, పవన్ లు కలిసినా.. అంతా ఓకె అన్న భావన మాత్రం కలిగించలేకపోయారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల సినీ వేడుకలలో, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పవన్ కనిపించకపోవటంతో ఏదో జరుగుతుందన్న భావనలో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కాటమరాయుడు సెట్ లో సందడి చేస్తున్నాడు. ఊరికే కాదులేండి..ఖైదీ నంబర్ 150 సినిమాలోని కొన్ని సీన్స్ ను కాటమరాయుడు సెట్ లో షూట్ చేస్తున్నారట. ఈ సందర్భంగా ఒకే సెట్ లో కలుసుకున్న చిరు, పవన్ లు గంటపాటు విడిగా మాట్లాడుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే చర్చ సంగతి అటుంచితే.. మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకే సెట్ లో షూటింగ్ చేస్తున్నారన్న వార్తలతో మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. -
చిరు ఇమేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు
ప్రస్తుతం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. దాదాపు దశాబ్ద కాలం తరువాత చిరు హీరోగా నటిస్తున్న సినిమా కావటంతో పాటు, అది చిరంజీవి 150వ సినిమా కూడా కావటంతో ఈ మూవీ పై భారీ క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా భారీ ప్రచారం సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు చిన్న సినిమా నిర్మాతలు. ప్రస్తుతం కోలీవుడ్‌లో సక్సెస్ సీక్రెట్‌గా మారిన హర్రర్ జానర్లో తెరకెక్కిన ఓ సినిమా, తెలుగు డబ్బింగ్ వర్షన్‌కు ఖైదీ నంబర్ 150 గుర్తుకు వచ్చేలా టైటిల్ నిర్ణయించారు. 'కాందబరి ఇంటి నంబర్ 150' అనే పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. నవంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాకు 150 నంబర్ ఎంత వరకు హెల్ప్ చేస్తుందో చూడాలి. -
నేనెప్పుడూ హద్దులు దాటలేదు
గ్లామర్ విషయంలో తానెప్పుడూ హద్దులు దాటలేదని అంటున్నారు నటి కాజల్ అగర్వాల్. ఐరన్‌లెగ్ ముద్రను నెమ్మదిగా గోల్డెన్ నటిగా మార్చుకున్న నటి ఈ ఉత్తరాది భామ. ఆదిలో బొమ్మలాట్టం అంటూ కోలీవుడ్‌కు పరిచయం అయినా చందమామ చిత్రంతో తెలుగులోనే సక్సెస్ రుచి చూశారు. ఆ తరువాత మగధీర చిత్రం స్టార్ హీరోయిన్ అంతస్తును అందించింది. ఇక కోలీవుడ్‌లో తుపాకీ తన సినీ జీవితానికి వెలుగునిచ్చింది. అలా నటిగా ఎదుగుతూ వచ్చిన కాజల్ ఇప్పుడు ఏకంగా చిరంజీవి సరసన ఆయన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించే లక్కీ చాన్సను దక్కించుకున్నారు. ఇటీవలే నేను పక్కా లోకల్ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌తో ఐటమ్ సాంగ్‌లో లెగ్ షేక్ చేసిన కాజల్‌అగర్వాల్ గ్లామర్ గురించి ఇటీవల చాంతాడంత చెప్పుకొచ్చారు. అదేంటో చూద్దామా! హీరోయిన్లకు గ్లామర్ అన్నది అవసరమే. ఒక్కోసారి అందులో మోతాదు దాటాల్సివస్తుంది. అందుకే హీరోయిన్లు డ్రస్సులు, అలంకార సామగ్రిపై ఆసక్తి కనబరసాల్సి ఉంటుంది. నేనూ గ్లామర్ పాత్రలు పోషించాను. అయితే ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఇటీవల జనతాగ్యారేజ్ అనే తెలుగు చిత్రంలో సింగిల్ సాంగ్‌లో నటించాను కూడా. అది ఐటమ్ సాంగ్ అయినా గ్లామర్ విషయంలో ఎల్లలు దాటలేదు. అందాలారబోతలో నాకంటూ కొన్ని హద్దులు నిర్ణయించుకున్నాను. వాటినెప్పుడూ మీరను. నిజం చెప్పాలంటే స్త్రీకి చీరకట్టులోనే శృంగారం దాగుంటుంది. నేను నన్ను మోడరన్ దుస్తుల్లోనే ఎక్కువ చిత్రాల్లో చూసి ఉంటారు. అయితే అలాంటి చిత్రాల్లో కూడా ఒక్క సన్నివేశంలోనైనా చీరలో కనిపిస్తాను. ఎలాంటి దుస్తులు ధరించామన్నది ముఖ్యం కాదు. ఎంత అందంగా ఉన్నామన్నదే ప్రధానం.నన్ను చూసిన వారు గౌరవించాలి అని పేర్కొన్నారు కాజల్ అగర్వాల్. -
మెగాస్టార్ సినిమా కాదని.. తమిళ్లో చేస్తున్నాడు
బాలీవుడ్ యాక్టర్స్‌కు హీరో, విలన్ అన్న తేడా ఉండదు. కథలో తమ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏ పాత్రకైనా రెడీ అయిపోతారు. అందుకే అమితాబ్, షారూఖ్, ఆమిర్ లాంటి టాప్ స్టార్లు కూడా నెగెటివ్ రోల్స్‌లో అలరించారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా రోబో సినిమా సీక్వల్ కోసం విలన్‌గా మారిపోయారు. అదే బాటలో మరో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన క్రిష్ 3 సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నాడు. దీంతో తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో విలన్‌గా వివేక్‌ను నటించాల్సిందిగా కోరారు. కానీ అప్పట్లో చిరుకు విలన్‌గా చేసేందుకు నో చెప్పిన వివేక్ ఇప్పుడు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో విలన్‌గా నటించేందుకు అంగకీరించాడట. ఇప్పటికే అజిత్ హీరోగా వరుస సూపర్ హిట్స్ అందించిన శివ మరోసారి తలాతో కలిసి మ్యాజిక్ రిపీట్చేయాలని భావిస్తున్నాడు. ఈ కాంబినేషన్‌పై ఉన్న నమ్మకంతో పాటు జేమ్స్‌బాండ్ తరహా సినిమా కావటంతో విలన్ పాత్ర స్టైలిష్‌గా ఉండబోతోందని వివేక్ ఈ ఆఫర్‌ను ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది. -
బాహుబలి రికార్డ్ చెరిగిపోయిందా..?
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి. నిర్మాణం పరంగానే కాదు.., బిజినెస్, కలెక్షన్ల పరంగా కూడా బాహుబలి సాధించిన రికార్డ్ లు ఇప్పట్లో చెరిగిపోయే అవకాశమే లేదని భావించారు. కానీ అంచనాలను దాటుతున్న స్టార్ వాల్యూ., పెరిగిన తెలుగు సినిమా మార్కెట్, నిర్మాణం, ప్రమోషన్ పరంగా వస్తున్న మార్పులతో బాహుబలి రికార్డ్‌లు ఎక్కువ కాలం నిలిచేలా కనిపించటం లేదు. తాజాగా బాహుబలి సినిమాకు సంబందించిన ప్రీ బిజినెస్ రికార్డ్ బద్దలయ్యిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150, బాహుబలి.. ఆంధ్రా రైట్స్ రికార్డ్‌ను చెరిపేసిందట. ఇప్పటికే ఆంధ్ర రైట్స్ విషయంలో బాహుబలి సినిమాకు చెల్లించిన 30 కోట్లే హైయస్ట్ కాగా, ఖైదీ నంబర్ 150 సినిమాకు 32 కోట్లు చెల్లించి రైట్స్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒక్క వైజాగ్‌కే 7.7 కోట్లు చెల్లించారట. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన లేకపోయినా మెగాఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలతో పండగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడు. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటున్న చిరు రీ ఎంట్రీ మూవీ 2017 సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
ఆ ఇద్దరూ అవుట్..ఈ ఇద్దరూ ఇన్..!
ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరూ చెప్పలేరు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అంతే. కథ, నటీనటులు, టెక్నీషియన్లు.. అనూహ్యంగా మారుతుంటారు. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, విశాల్ కొత్త సినిమాలోనూ ఇటువంటి మార్పులే చోటు చేసుకున్నాయి. ‘ఖైదీ నంబర్ 150’ నుంచి కేథరిన్, విశాల్ సినిమా నుంచి రకుల్ ప్రీత్‌సింగ్ బయటకు వచ్చేయగా.. వాళ్ల ప్లేస్సుల్లోకి రాయ్ లక్ష్మి, అనూ ఇమ్మాన్యుయేల్ ఎంటరయ్యారు. అప్పుడు తమ్ముడితో.. ఇప్పుడు అన్నయ్యతో..! పవన్ కల్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో ‘తప్పు తప్పే.. శుద్ధ తప్పే’ పాటలో డ్యాన్స్ చేసిన రాయ్ లక్ష్మి, ఇప్పుడు అన్నయ్య చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’లో ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేస్తున్నారు. మొదట ఈ పాటలో నటించే అవకాశం ఇటీవల ‘సరైనోడు’లో ఓ హీరోయిన్గా నటించిన కేథరిన్‌కు దక్కింది. చిరంజీవి, కేథరిన్‌లపై ఓ రోజు షూటింగ్ కూడా చేశారట. కానీ, హఠాత్తుగా సీన్లోకి రాయ్ లక్ష్మి వచ్చేశారు. ఈ మార్పుకి కారణం చిత్ర బృందానికే ఎరుక. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిత్రకథానాయకుడు చిరంజీవి, రాయ్‌లక్ష్మి పాల్గొనగా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి రాఘవా లారెన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రకుల్ బిజీ.. అనూ రెడీ..! మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించనున్న సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారు. మూడేళ్ల విరామం తర్వాత కోలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి రకుల్ కూడా రెడీ అన్నారు. అయితే.. విశాల్ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే సమయానికి, రకుల్ తెలుగులో బాగా బిజీ అయ్యారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘ధృవ’, మహేశ్‌బాబు-ఏఆర్ మురుగదాస్ సినిమాల్లో నటిస్తున్నారామె. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న సాయిధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లోనూ రకులే హీరోయిన్. తెలుగులో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రకుల్‌కు, విశాల్ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదట. చేసేదేం లేక చిత్రబృందం మలయాళీ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌ను సంప్రదించారట. ఇటీవల చెన్నై వెళ్లిన అనూ.. కథ, అందులో తన క్యారెక్టర్ గురించి దర్శకుడితో డిస్కస్ చేశారట. కథ, ఆమె పాత్ర బాగా నచ్చడంతో విశాల్ సరసన నటించడానికి వెంటనే అంగీకరించారని సమాచారం. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఒక్కటే బ్యాలెన్స్. ఇంతకీ.. ఈ అనూ ఇమ్మాన్యుయేల్ ఎవరనుకున్నారు? ఇటీవల విడుదలైన నాని ‘మజ్ను’లో మెయిన్ హీరోయిన్గా నటించారు. గోపీచంద్ ‘ఆక్సిజన్’లోనూ తనే హీరోయిన్. -
చిరు 150 నుంచి కేథరిన్ ఔట్..?
స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినా.. బిజీ హీరోయిన్ అనిపించుకోలేకపోయిన బ్యూటి కేథరిన్ థెరిస్సా. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. తమిళ నాట మాత్రం కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇటీవల తెలుగులో కూడా సరైనోడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటికి మరో భారీ ఛాన్స్ తలుపు తట్టింది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో స్పెషల్ సాంగ్‌కు కేథరిన్‌ను తీసుకున్నారు. అయితే షూటింగ్ సమయంలో జరిగిన గొడవ కారణంగా ఈ సినిమా నుంచి కేథరిన్‌ను తీసేశారన్న టాక్ వినిపిస్తోంది. కేథరిన్ స్థానంలో స్సెషల్ సాంగ్ కోసం లక్ష్మీ రాయ్‌ని తీసుకున్నారట. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో ఐటమ్ నంబర్‌తో ఆకట్టుకున్న లక్ష్మీరాయ్ ఇప్పుడు మెగాస్టార్ సరసన స్టెప్పులేసేందుకు రెడీ అవుతోంది. -
మెగా మూవీలో తమన్నా..?
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 ని సక్సెస్ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ కాస్టింగ్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు తాజాగా మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాను హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌నే ఫైనల్ చేసిన యూనిట్, ఇప్పుడు మిల్కీ బ్యూటి తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. కత్తి సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఒరిజినల్ వర్షన్లో స్పెషల్ సాంగ్ లేకపోయినా.. అభిమానులు చిరు నుంచి ఆశించే మాస్ డ్యాన్స్‌ల కోసం ప్రత్యేకంగా ఈ సాంగ్ ను రూపొందిస్తున్నారు. గతంలో చాలా సందర్భాంలో తమన్నా కలిసి నటించాలన్న ఆసక్తి కనబరిచిన చిరు తన రీ ఎంట్రీ సినిమాలోనే ఆ కోరిక కూడా తీర్చేసుకుంటున్నాడు. -
వర్మ క్షమాపణలు కోరాడు..!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు షాక్ ఇచ్చాడు. ఎప్పుడు నేనింతే.. నాఇష్టం అంటూ అడ్డంగా మాట్లాడే వర్మ, అనూహ్యంగా సారీ చెప్పాడు. గతంలో మెగా ఫ్యామిలీ హీరోల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను నన్ను క్షమించండి అంటూ అభిమానులను కోరాడు. సోమవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు 150వ సినిమా ఖైది నంబర్ 150 ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా వర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ 'మెగాస్టార్ లుక్ అమేజింగ్, ఈ లుక్ చూస్తుంటే సినిమా గ్యారెంటీ బ్లాక్ బస్టర్ అనిపిస్తోంది. ఇది మెగాస్టార్ కెరీర్ లోనే బెస్ట్ లుక్. ఖైదీ నంబర్ 150 సూపర్ క్లాసీ, సూపర్ ఇంటెన్స్ లుక్. ఈ లుక్ చూసిన తరువాత నేను గతంలో చేసిన కామెంట్స్ విషయంలో మెగా అభిమానులను క్షమాపణ కోరాలనుకుంటున్నాను'. అంటూ కామెంట్ చేశాడు. Mega Star's Look is Amazingly Mindblowing...Looks Like A Sure Shot Block Buster..Million Cheers