యార్‌ అంటున్న రాయ్‌లక్ష్మి | rai laksmi busy in Bollywood | Sakshi
Sakshi News home page

యార్‌ అంటున్న రాయ్‌లక్ష్మి

Published Thu, Jan 12 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

యార్‌ అంటున్న రాయ్‌లక్ష్మి

యార్‌ అంటున్న రాయ్‌లక్ష్మి

ఇంతకు ముందు తరచూ వార్తల్లో కనిపించిన నటి రాయ్‌లక్ష్మి పేరు ఈ మధ్య ఎక్కడా వినిపించడం లేదు. దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయా అన్న సందేహం కోలీవుడ్‌ వర్గాల్లో నెలకొంది. అయితే అలాంటిదేమీ లేదని, తాను బాలీవుడ్‌ చిత్రంతో బిజీగా ఉండడం వల్ల కోలీవుడ్‌పై దృష్టి సారించలేకపోయానంటున్న రాయ్‌లక్ష్మి ఇటీవల టాలీవుడ్‌లో ఖైదీనంబర్‌ 150 చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవితో ఐటమ్‌ సాంగ్‌లో చిందులేశారన్నది గమనార్హం. చాలా గ్యాప్‌ తరువాత మరోసారి కోలీవుడ్‌లో మెరవడానికి సిద్ధమయ్యారు.యార్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు.దీని గురించి రాయ్‌లక్ష్మి చెబుతూ  తాను హిందీ చిత్రం జూలీ–2 కోసం చాలా రోజులు కేటాయించానన్నారు. దీంతో తమిళ చిత్రాలపై దృష్టి సారించలేకపోయానని చెప్పారు.

జూలీ–2 హిందీ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యిందని, ఇక కోలీవుడ్‌ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. నెలన్నర క్రితమే యార్‌ అనే తమిళ చిత్రానికి కమిట్‌ అయ్యానని తెలిపారు. ఇది  థ్రిల్లర్‌ కథా చిత్రం అని చెప్పారు. స్క్రిప్ట్‌ ఆసక్తిగా ఉండడంతో ఆ చిత్రాన్ని అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. రవి కొటారకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జూలీ–2 హిందీ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. ఇంతకు ముందు ఏడాదికి ఐదు చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పుడు మూడు చిత్రాలు చేస్తే చాలని భావిస్తున్నట్లు అన్నారు. కారణం వైవి««దl్యభరిత కథా చిత్రాలను ఎంచుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ఈ అమ్మడు ఇప్పటికే మలయాళం చిత్రం 100 డిగ్రీ సెల్సియస్‌ తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement