
ఇద్దరినీ స్వాగతిద్దాం..!
చాలా కాలం తరువాత టాలీవుడ్ వెండితెర మీద ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమయ్యింది. ఇద్దరు సీనియర్ హీరోలు సంక్రాంతి పండుగకు ముఖాముఖి తలపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇస్తుండగా, నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్తో జనవరి 11, 12 తేదిల్లో విడుదలవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు భారీ చిత్రాలు ఒకేసమయంలో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అలా రిలీజ్ అయితే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా ఆ రిస్క్ చేయడానికే రెడీ అవుతున్నారు ఈ సీనియర్ స్టార్స్. ఇద్దరికీ ప్రతిష్టాత్మక చిత్రాలు కావటంతో ప్రచారం, రిలీజ్ విషయంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒకేసారి రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవ్వటం పై ఇరు చిత్రాల నిర్మాతలు స్పందించారు. ఇలా భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవ్వటం గతంలో కూడా జరిగిందంటూ రామ్చరణ్ వివరించగా... గౌతమీపుత్ర శాతకర్ణి దర్శక నిర్మాత క్రిష్. ఇద్దరినీ స్వాగతించాలంటూ కోరాడు. 'ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రతిష్టాత్మక చిత్రాలతో వస్తున్నారు. #jan11khaidi, #jan12GPSK హ్యాష్ ట్యాగ్లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ వారిని స్వాగతిద్దాం'. అంటూ ట్వీట్ చేశాడు.
This #Sankranthi two legends r coming to entertain us with their landmark films. Let us all welcome both by trending #Jan11Khaidi #Jan12GPSK
— Krish Jagarlamudi (@DirKrish) 3 January 2017