Gautamiputra satakarni
-
బాలయ్య సంగీత దర్శకుడి ఆవేదన
కంచె సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన సంగీత దర్శకుడు చిరంతన్ భట్. ఈ సినిమాలో చిరంతన్ వర్క్ నచ్చిన దర్శకుడు క్రిష్, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించారు. శాతకర్ణి సినిమా విజయంలో చిరంతన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. పాటలతో పాటు నేపథ్య సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే బాలయ్య తన తదుపరి చిత్రం జై సింహాకు కూడా చిరంతన్ భట్కే అవకాశమిచ్చాడు. అయితే తాజాగా ప్రకటించిన జియో 65వ సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ విషయంలో చిరంతన్ భట్ హర్ట్ అయ్యాడు. ఈ అవార్డ్స్ లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా పలు విభాగాల్లో పోటికి నామినేట్ అయ్యింది. కానీ సంగీతం, సాహిత్య విభాగాల్లో మాత్రం పోటికి నామినేట్ కాలేదు. ఈ విషయంపై తన ట్విటర్లో స్పందించిన చిరంతన్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి చాలా విభాగాల్లో నామినేట్ అయ్యింది సంగీతం, సాహిత్య విభాగాల్లో తప్ప. అంటే సీతారామశాస్త్రీ గారు, నేను మరింత హార్డ్ వర్క్ చేయాలేమో’ అంటూ ట్వీట్ చేశారు. ఈ అవార్డ్స్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో అనూప్ రుబెన్స్, దేవీ శ్రీ ప్రసాద్, కీరవాణి, మిక్కీ జే మేయర్, శక్తికాంత్ కార్తీక్‌లు పోటీ పడుతుండగా.. సాహిత్య విభాగంలో చైతన్య పింగళి, చంద్రబోస్, కీరావాణి, రామజోగయ్య శాస్త్రీ, శ్రేష్టలు పోటిపడుతున్నారు. #gautamiputrasatakarni nominated in most categories except lyrics & music. Guess @sirivennela1955 gaaru & me need to work harder @DirKrish :) #jio65thfilmfareawards https://t.co/5zCsJKRwYr — Chirrantan Bhatt (@bhattchirantan) 7 June 2018 -
నో డూప్... ఆల్ రియల్!
బాలకృష్ణ డిక్షనరీలో ‘డూప్’ అనే పదం దాదాపు కనిపించదు. డూప్ లేకుండా ఆయన చేసే రిస్కీ స్టంట్స్‌ను లైవ్‌లో చూసే యూనిట్ జనాలు క్లాప్స్ కొట్టడం ఈ మధ్య కామన్ అయ్యింది.‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసం వైల్డ్ హార్స్‌ను రైడ్ చేసిన ఆయన, తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో కారును 360 డిగ్రీస్‌లో డ్రిఫ్టింగ్ పద్ధతిలో రైడ్ చేశారట! పూరి మాట్లాడుతూ – ‘‘పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఆదివారం ఓ ఛేజ్ తీశాం. రెండుసార్లు డూప్ లేకుండా బాలకృష్ణగారు కారును డ్రిఫ్టింగ్ పద్ధతిలో 360 డిగ్రీస్‌లో తిప్పే షాట్‌ను షూట్ చేశాం. ఆయన పక్క సీట్లో కూర్చున్న శ్రియ షాక్‌కి గురైంది. షాట్ ఓకే అయ్యాక యూనిట్ అంతా క్లాప్స్ కొట్టారు’’ అన్నారు. ‘‘ఈ నెల 10న బాలకృష్ణగారి బర్త్‌డే సందర్భంగా 9వ తేదీ రాత్రి బాలకృష్ణగారు, పూరిగారు మా ‘భవ్య క్రియేషన్స్’ ఫేస్బుక్ పేజీ లైవ్‌లోకి వస్తారు’’ అన్నారు నిర్మాత వి. ఆనంద్‌ప్రసాద్. -
బాలకృష్ణకి ఉగాది పురస్కారం
-
వినోద పన్నుపై వివరణ ఇవ్వండి
నిర్మాతలు గుణశేఖర్, రాజీవ్‌రెడ్డి, నటుడు బాలకృష్ణలకు హైకోర్టు నోటీసులు సాక్షి, హైదరాబాద్: వినోద పన్ను మినహాయింపు ప్రయోజనాలు సినీ ప్రేక్షకులకు అందడంలేదని, ఆ ప్రయోజనాలు వారికి వర్తింప చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, రుద్రమదేవి సినిమా నిర్మాత గుణశేఖర్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నిర్మాత రాజీవ్‌రెడ్డితో పాటు నటుడు నందమూరి బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాల నుంచి పొందిన వినోదపన్ను మినహాయింపు ప్రయోజనాలను నిర్మాతలే అనుభవిస్తున్నారని ఆ ప్రయోజనాలు ప్రేక్షకులకు కూడా వర్తింప చేయడానికి నిర్మాతల నుంచి ఆ మొత్తాలను రాబట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి ఎం.వేణుగోపాలరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
శాతకర్ణి 50రోజుల వేడుకలో అపశ్రుతి
-
ఎన్టీఆర్‌కి దాన వీర శూర కర్ణ బాలకృష్ణకి శాతకర్ణి...
–టీఎస్సార్ ‘‘తెలుగు సినిమా చరిత్రలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఓ మైలురాయి. తెలుగు వారికి తెలియని ఓ తెలుగు వీరుణ్ణి క్రిష్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎన్టీఆర్‌గారిని ‘దాన వీర శూర కర్ణ’గా ప్రేక్షకులు గుర్తించుకున్నట్లు.. బాలకృష్ణను ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా గుర్తు పెట్టుకుంటారు. ఈ సినిమా తర్వాతి తరాలకు ఒక పాఠ్యాంశంలా నిలుస్తుంది’’ అని ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. బాలకృష్ణ, శ్రియ జంటగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయం సాధించిన సందర్భంగా ఆ చిత్ర యూనిట్‌ను టీఎస్సార్ సన్మానించారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నటించడం నా పూర్వజన్మ సుకృతం. నాన్నగారు ‘శాతకర్ణుడి’ చరిత్రతో సినిమా చేద్దామనుకున్నారు. ఆ అవకాశం నాకు వచ్చిందంటే ఆయన ఆశీస్సులే. కళలను ప్రోత్సహిస్తున్న సుబ్బరామి రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా చరిత్రపై బాలకృష్ణ గారి వేలిముద్ర ‘గౌతమిపుత్ర శాతకర్ణి’’ అని క్రిష్ అన్నారు. బాలకృష్ణ, క్రిష్, నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబు, బిబో శ్రీనివాస్, రచయిత బుర్రా సాయిమాధవ్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, సంగీత దర్శకులు చిరంతన్ భట్ తదితరులను టీఎస్సార్ సన్మానించారు. దర్శకులు కె.రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి, ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, పీవీపీ, సాయి కొర్రపాటి, హీరోలు వెంకటేష్, మంచు విష్ణు, మనోజ్, నటి జయసుధ, హీరోయిన్ తమన్నా పాల్గొన్నారు. -
బాపూగారు బాగా ప్రోత్సహించారు
‘‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో బౌద్ధ సన్యాసి ధర్మనందనుడుగా, ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రంలో విలన్‌గా నటించా. ఈ సంక్రాంతికి విడుదలైన ఆ రెండు చిత్రాలు నటుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చాలామంది అభినందిస్తున్నారు’’ అని నటుడు సునీల్ కుమార్ చెప్పారు. పాత్రికేయుల సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పుట్టి పెరిగిన నేను నటుడిగా రాణించాలనుకున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను. అప్పుడే దర్శకుడు బాపూగారిని కలిశాను. ఆయన ‘భాగవతం’ సీరియల్లో నన్ను రాముడు, కృష్ణుడు పాత్రలిచ్చి, ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘రాధాగోపాలం’, ‘సుందరకాండ’ సినిమాల్లో నటించాను. నాకు యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ధర్మనందనుడు పాత్రకు మేకప్ సెట్ కాకపోవడంతో గుండు కొట్టుకుంటావా అని క్రిష్ అడగడంతో ఓకే అన్నా. సినిమాలో నా పాత్ర చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. బాలకృష్ణ, హేమమాలినిగార్లతో నటించడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు. -
శాతకర్ణికి వంద శాతం పన్ను రాయితీ
పోలవరం సబ్ కాంట్రాక్టర్‌కు రూ.96 కోట్లు చెల్లింపు కేబినెట్ భేటీలో నిర్ణయాలు సాక్షి, అమరావతి: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతుల్లేకుండా నూటికి నూరు శాతం వినోదపు పన్ను రాయితీ కల్పించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు విజ్ఞానం, చరిత్ర తెలుసుకునేందుకు వీలుగా వినోదపు పన్ను రాయితీలను ఇస్తారు. రాయితీ ఇస్తే ఆ మేర టికెట్ ధరలను తగ్గించి విక్రయించాల్సి ఉంది. సినిమా చూసే వారికి రాయితీ వర్తింప చేయాలి తప్ప సినిమా తీసిన వారికి వర్తింపు చేయరాదు. అయితే తొలుత ఈ నెల 9వ తేదీన జారీ చేసిన జీవోలో 75 శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తూ టికెట్ ధరను నిర్ధారించిన ధరలో 75 శాతానికి మించి వసూలు చేయరాదనే షరతు విధించారు. ఇప్పుడు ఆ షరతును తొలగిస్తూ నూరు శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే చిత్ర కధానాయకుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది అయినందున దీనిపై తన ఒత్తిడేమీ లేదన్నట్లుగా కనిపించేందుకు, నిర్ణయం తీసుకునే సమయంలో మంత్రివర్గ సమావేశం నుంచి సీఎం బయటకు వెళ్లడం గమనార్హం. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి విలేకరుల సమావేశంలో వివరించారు. హా పోలవరం ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ సబ్ కాంట్రాక్టరైన ఎల్ అండ్ టీకి రూ.38 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్సుగా, రూ.58 కోట్లు యంత్రపరికరాల నిమిత్తం చెల్లింపులు చేయాల్సి ఉంది. ట్రాన్స్ట్రాయ్కు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.250 కోట్లు చెల్లించింది. సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలైన ఎల్ అండ్ టీ–జర్మనీ కంపెనీలకు ఆ నిధులనుంచి చెల్లింపులు చేయించకుండా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే రూ.96 కోట్లు ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ స్విస్ చాలెంజ్ విధానంలో స్మార్ట్ సిటీ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనకు ఆమోదం. ఏడు కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి స్మార్ట్ సిటీ నిర్మాణం చేపడతాయి.హా నెల్లూరు కేంద్రంగా 1644.17 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో నెల్లూరు పట్టణాభివృద్ధి అధారిటీ ఏర్పాటు చేయడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేయడానికి అనుమతి మంజూరు చేస్తూ ఆమోదం. -
శాతకర్ణి ‘మినహాయింపు’ రికార్డులివ్వండి
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోద పన్ను మినహా యింపునకు సంబంధించిన రికార్డులను తమ ముందుం చాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఏపీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించింది. అదే విధంగా వినోద పన్ను మినహాయింపు పొందినప్పుడు, సినిమా టికెట్‌ను దాని ధరలో 75 శాతానికి మించి అమ్మకూడదన్న నిబంధన అమలుకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలను కూడా అందజేయాలని ప్రభుత్వాన్ని, చిత్ర నిర్మాతలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
శాతవాహనుల కథతో క్రిష్ మరో సినిమా
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు క్రిష్ మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. తెలుగు వారి ఘనకీర్తిని కేవలం 79 రోజుల్లో తెరకెక్కించిన క్రిష్, ఇప్పుడు అదే కథకు కొనసాగింపుగా మరో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. అయితే తొలి భాగంలో పూర్తిగా యుద్ధం, సామ్రాజ్య స్థాపననే చూపించిన క్రిష్.. రెండో భాగాన్ని ప్రేమకథగా రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ రాసిన శ్రావణి అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి తనయుడు వాశిష్టిపుత్ర పులోమావి, శ్రావణి ప్రేమకథే శ్రావణి నవల. ఇప్పుడు అదే కథను క్రిష్ భారీగా వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ క్లాసిక్ మొగల్ ఈ అజం తరహాలో చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారు. -
'సాహో రాజమౌళి... సాహో'
సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై ఇప్పటికీ ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ముఖ్యంగా అతి తక్కువ సమయంలో ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ ప్రతిభకు దిగ్దర్శకులు కూడా సాహో అంటున్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచిన దర్శకుడు రాజమౌళి, గౌతమిపుత్ర శాతకర్ణి యూనిట్‌ను, ప్రత్యేకంగా దర్శకుడు క్రిష్‌ను అభినందించారు. రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్ స్వయంగా అభినందించటంతో దర్శకుడు క్రిష్ పొంగిపోతున్నాడు. అందుకే రాజమౌళికి కృతజ్ఞతలు తనదైన స్టైల్లో తెలిపాడు. ' ప్రియమైన రాజమౌళి గారూ.. నాకు ఆదర్శంగా నిలిచిన దర్శకుల్లో మీరు ఒకరు.. అందరూ విజయం కోసం ఎదురుచూస్తుంటారు, కానీ విజయం మీ కోసం ఎదురుచూస్తుంటుంది.. అలాంటి మీరు విజయం వరించింది క్రిష్ అంటే నాకెలా ఉంటుంది? ఎన్ని ధన్యవాదాలు చెపితే సరిపోతుంది? దర్శకత్వంలోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా నాకు ఆదర్శంగా నిలిచారు.. మీ అబినందన వింటుంటే, ఆదర్శం ఆశీర్వదిస్తున్నట్టుంది.. భుజం తడుతున్న మీ చేతిని ఎన్నిసార్లు నా నుదురు తాకినా తక్కువే.. త్రికరణ శుద్ధిగా చెపుతున్నాను.. సాహో రాజమౌళి.. సాహో.. ప్రేమతో, క్రిష్'. అంటూ ఉద్వేగంగా తన కృతజ్ఞతలు తెలియజేశాడు క్రిష్. సాహో రాజమౌళి.. సాహో!! pic.twitter.com/m3X9DitqVN — AnjanaPutra KRISH (@DirKrish) 22 January 2017 -
‘శాతకర్ణి’కి సర్కారు దాసోహం
సాక్షి, అమరావతి: గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సాగిలపడేందుకు సన్నాహాలు చేస్తోంది. స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేయకుండానే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ నెల 9వ తేదీనే 75 శాతం వినోదపు పన్ను రాయితీ ఇస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నూటికి నూరు శాతం వినోదపు పన్ను రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశంపై బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. -
చారిత్రక కథతోనే మోక్షజ్ఞ ఎంట్రీ..?
గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఘనవిజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ, తన వారసుడి ఎంట్రీకి కూడా అదే తరహా కథ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. అందుకే చారిత్రక కథాంశంతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అద్భుత విజయాన్ని అందించిన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చారిత్రక చిత్రంతో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అయ్యే అవకాశం ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత వెంకటేష్ హీరోగా థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించనున్నాడు క్రిష్. ఆ సినిమా తరువాత మరోసారి బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా చేసేందుకు అంగకీరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత గౌతమిపుత్ర శాతకర్ణికి సీక్వల్గా శాతకర్ణి కుమారుడు వాశిష్టిపుత్ర పులుమావి కథతో మరో భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాతోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఇది చిత్రపరిశ్రమ విజయం
‘‘తరాలను ఏకం చేసిన చిత్రమిది. 30 ఏళ్లుగా సినిమా చూడనోళ్లంతా బయటకు వస్తున్నారు. నడవలేని వృద్ధులు మనవళ్ల సహాయంతో థియేటర్లకు వచ్చారు. అభిమానులు, దురభిమానులు అనే అడ్డుగోడల్ని చెరిపేసిన చిత్రమిది. ప్రేక్షకులతో పాటు చిత్రపరిశ్రమవారు తమ సొంత సినిమాగా భావించి, స్పందించారు. ఇది మా విజయమో.. తెలుగు జాతి విజయమో కాదు. చిత్ర పరిశ్రమ విజయం’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో ఆయన హీరోగా వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈ నెల 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ పత్రికలవారితో సమావేశమయ్యారు. ఆయనతో జరిపిన ఇంటర్వూ్య... ఇంత భారీ విజయం వస్తుందని ముందే ఊహించారా? ఊహించాను కాబట్టే సినిమా చేశా. ఈ చిత్రానికి చక్కని టీమ్ కుదిరింది. గుర్గావ్లోని స్నేహితుడితో మాట్లాడితే.. ఉత్తరాది జనాలంతా ఈలలు, చప్పట్లతో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాడు. ఈ చిత్రానికి భాషాబేధం లేదు. కశ్మీర్, బీహార్ తప్ప దేశాన్నంతటినీ పాలించిన యోధుడి కథ ఇది. భావి తరాలు తెలుసుకోవలసిన చరిత్ర. భారతీయులంతా చూడాల్సిన చిత్రం. ఇతర భాషల్లోనూ డబ్బింగ్ లేదా సబ్ టైటిల్స్‌తో రిలీజ్ చేస్తాం. మీరు తప్ప శాతకర్ణిగా మరొకరు చేయలేరని క్రిష్ అన్నారు.. డైలాగులు మీకు తప్ప మరొకరికి సూట్ కావని కూడా కొందరు అంటున్నారు.. మంచి ఛాన్స్ అనిపిస్తే అంగీకరిస్తా గానీ, ‘నన్నెందుకు అనుకున్నావ్’ అని అడుగుతానా? చిత్రంలో ఆవేశం, సందేశం ఉన్నాయి కనుక నేనైతే బాగుంటుందని ఆయన అనుకున్నారేమో. ఆ రోజుల్లో నాన్నగారు, ఎస్వీ రంగారావుగారి డిక్షన్ బట్టి డైలాగులు రాసేవారు. ఇప్పుడు నాకలా కుదరడం అదృష్టం. సాయిమాధవ్ బుర్రా మంచి డైలాగులు రాయడంతో పాటు లొకేషన్లో అప్పటికప్పుడు ఛేంజ్ చేసేవారు. మీ వందో చిత్రం కాబట్టే శాతకర్ణికి ఇంత హైప్ వచ్చిందంటారా? కచ్చితంగా వందో చిత్రం కావడం ఓ కారణం. ప్రజలకు తెలియని చరిత్ర, ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం వల్ల మంచి హైప్ వచ్చింది. చరిత్రను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి. శాతవాహనుల్లో 23వ రాజైన శాతకర్ణి గురించి చరిత్రలో నాలుగే లైన్లు ఉన్నాయి. త్రిసముద్ర తోయపీత వాహనుడిగా సైన్యాన్ని నాలుగు దిక్కులకి నడిపించిన యోధుడు.. గణరాజ్యాలను ఏకం చేసిన వీరుడు.. అని మా పరిశోధనలో తెలుసుకున్నాం. తర్వాత శాతకర్ణి పాత్రకు తగ్గట్టు మిగతాదంతా మేము ఊహించుకుని సినిమా చేశాం. చిత్రీకరణకి ముందు శాతకర్ణి కోసం ఓ కిరీటం రెడీ చేయించాం. కానీ, ఆ రోజుల్లో కిరీటాలు లేవు. అందుకే, పట్టాభిషేకం సమయంలో రోమన్ తరహా కిరీటం వాడడం జరిగింది. చిత్రీకరణకు వెళ్లేముందు పాత్ర కోసం మీరెలా సన్నద్ధమవుతారు? ఏ పాత్రకైనా ఒక్కటే. అయితే... శాతకర్ణి పాత్ర కోసం కొంచెం ఎక్సర్సైజ్లు చేశా. ఈ మధ్య 6 ప్యాక్స్, 8 ప్యాక్స్ అని వస్తున్నాయి. అవన్నీ మన నేటివిటీ కాదు. నేను చొక్కా విప్పితే మనవాళ్లు ఎవరూ చూడరు. మన చరిత్రలో కోడి రామ్మూర్తిగారు ఉన్నారు. ఆయన ఎలా ఉండేవారు? మంచి దిట్టంగా, ధృడంగా ఉండేవారు. మన నేటివిటీ మనది. ఈ చిత్రంలో తొడ కొట్టే ఐడియా మీదేనా? దర్శకుడిది. కాకపోతే, విడుదలకి ముందు ఫైనల్ కాపీలో ఒక తొడ కొట్టడ మే పెట్టారు. రీ–రికార్డింగ్ టైమ్‌లో నేను చూసి ఫోన్ చేయగానే, రెండు తొడలు కొట్టిన షాట్ పెట్టారు. క్రిష్‌లో గొప్పదనం అదే. మనం చెబితే వింటారు. ‘రైతు’లో అమితాబ్ బచ్చన్ చేస్తున్నారా? రాష్ట్రపతి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించాం. ఐదారు రోజులు షూటింగ్ చేస్తే చాలు. ‘సర్కార్–3’ తర్వాత ఆలోచిద్దామన్నారు. కథ అద్భుతంగా వచ్చింది. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా చేయాలనుకుంటున్నాం. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, సందేశాత్మక సినిమాలే చేయాలనుకుంటున్నారా? రెండిటికీ సంబంధం లేదు. సందేశాత్మక కథలు నచ్చితే చేస్తా. ఫాంటసీ ‘ఆదిత్య 369’, మాయలు మంత్రాల నేపథ్యంలో ‘భైరవద్వీపం’ చేశా. ఇప్పుడీ చారిత్రక సినిమా. నా ఆంగీకం, వాచకం నుంచి కథలు పుడతాయి. నాకు సాహిత్యం మీద అభిరుచి ఎక్కువ. ఆ నేపథ్యంలోనూ సినిమా చేయాలనుంది. దర్శకుడిగా, నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉందా? నా ఊహల స్థాయికి ఎవరూ చేరుకోలేరనుకున్నప్పుడు దర్శకత్వం వహిస్తా. ఈ ఏడాది ఆఖరున నిర్మాణ సంస్థ ప్రారంభిస్తా. మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి సిద్ధమేనా? పౌరాణిక సినిమా చేయాలనుంది. ఇంకో హీరో ఎవరనేది చెప్పను. ‘నర్తనశాల’ని మళ్లీ చేసే ఉద్దేశం ఉందా? నా దృష్టిలో సౌందర్య తప్ప అందులో ద్రౌపది పాత్రకి ఇంకెవరూ న్యాయం చేయలేరు. అప్పుడు శ్రీహరిగారు భీముడి పాత్ర చేశారు. దర్శకుడిగా నేను ఎవరితోనైనా నటింపజేయగలను. ప్రతిభ ముఖ్యం కాదిక్కడ. కానీ, ఆహార్యం కుదరాలి. నా ఊహకి తగినవాళ్లు దొరికితే ఆ సినిమా చేస్తా. ఈ చిత్రానికి ముందు మీరు, మోక్షజ్ఞ కలసి నటిస్తారనే వార్తలు వినిపించాయి! ‘ఆదిత్య 999’ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. ఇంకా కథ సిద్ధం కాలేదు. వీలైతే నేను, మోక్షజ్ఞ కలసి చేయాలనుంది. మేమిద్దరం చేయగలిగిన సినిమా అదొక్కటే. సినిమాలో మా అబ్బాయిని పెట్టాలని కాదు, కథ అలా కుదిరింది. ‘దంగల్’ తరహా సినిమా మీ నుంచి ఆశించవచ్చా? ‘దంగల్’ చూడలేదు. సల్మాన్‌ఖాన్ ‘సుల్తాన్’ చూశా. అప్పుడప్పుడు భార్యాపిల్లలతో ప్రేక్షకుడిగా సినిమాలు చూస్తుంటా. ప్రతిదీ మనం చేయలేం. నేను రొమాంటిక్ హీరో కాదు. నటుడిగా నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. మోక్షజ్ఙ ఎంట్రీ ఎప్పుడు? కథలు ఏవైనా వింటున్నారా? ఈ ఏడాది ఆఖరున మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది. నేను ఏదైనా వేడి వేడిగా వడ్డించాలనుకుంటా. ప్లానింగులు, గట్రా వంటి అలవాట్లు లేవు. మీరు బయట సీరియస్‌గా ఉంటారు. ఇంట్లో కూడా అంతేనా..? లేదండి బాబు! నేను సరదా మనిషినే. ఇంట్లో మామూలు మనిషిలా.. మీలా ఉంటాను. మా అబ్బాయి, నేను కలసి సినిమాలు చూస్తాం. మా అమ్మాయికి తెలియకుండా మనవడితో కూడా సినిమాలు చూస్తా. తనకు తెలిస్తే.. ‘చిన్న పిల్లాడు కదా, కళ్లకి ప్రాబ్లెమ్ అవుతుంది’ అంటుంది. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ విడుదల రోజునే మీ సినిమా కూడా విడుదల చేయాలని అభిమానులు ఒత్తిడి తీసుకొచ్చారట! చిరంజీవితో మీ కాంపిటీషన్, రిలేషన్ గురించి? ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు వస్తే పోటీ ఉంటుంది. కానీ, రెండూ డిఫరెంట్ సినిమాలు. నేను ఇండస్ట్రీలో క్లోజ్‌గా ఉండేది చిరంజీవితోనే. ఇప్పుడు సినిమాలు, హాస్పిటల్, ఎమ్మెల్యేగా వివిధ పనులతో బిజీగా ఉండడం వలన పెద్దగా ఎవరితోనూ కలవడం కుదరడం లేదు. -
రెండోవారం దూసుకుపోతున్న శాతకర్ణి
‘సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ అంటూ వచ్చిన నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'.. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. అమెరికాలో రెండోవారంలోనూ ఈ సినిమా గొప్ప వసూళ్లు రాబడుతున్నది. అగ్రరాజ్యంలో ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగుతున్నదని, సోమవారం 93,419 డాలర్లను, మంగళవారం 68,205 డాలర్లను ‘శాతకర్ణి’ రాబట్టిందని ప్రముఖ బాలీవుడ్ ట్రెడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. ఇప్పటివరకు అమెరికాలో ఈ సినిమా రూ. 9.87 కోట్లను రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా చూసుకుంటే రూ. 50 కోట్ల మార్క్‌ను ఈ సినిమా దాటినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తొలిరోజు రూ. 18 కోట్లు వసూలు చేసిన ‘శాతకర్ణి’ ఇటు బాలకృష్ణ కెరీర్లోనూ, అటు దర్శకుడు క్రిష్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డు సాధించింది. ఫెస్టివల్ సీజన్లో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్ భారీ వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లో రూ. 48 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద ‘శాతకర్ణి’ నిలకడగా వసూళ్లు రాబడుతున్నట్టు సినీ పండితులు చెప్తున్నారు. 'శాతకర్ణి' సినిమా 'ఏ' సెంటర్లలో బాగా ఆడుతున్నప్పటికీ, బీ, సీ సెంటర్లలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నదని అంటున్నారు. తెలుగు చక్రవర్తి శాతకర్ణి చారిత్రక కథతో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. Telugu film #GautamiPutraSatakarni continues its GLORIOUS RUN in USA... Mon $ 93,419, Tue $ 68,205. Total: $ 1,449,617 [₹ 9.87 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) January 18, 2017 -
కొంత చరిత్రశోధన... కొంత కల్పితం!
‘‘కొన్ని కథలకు కొంతమంది మాత్రమే నప్పుతారు. శాతకర్ణి కథకు బాలకృష్ణగారు మాత్రమే కరెక్ట్. ఆయన కోసమే పుట్టిన కథ ఇది. శాతకర్ణి పాత్రను బాలయ్య తప్ప ఎవరూ చేయలేరని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. నన్ను నమ్మి వందో చిత్రానికి అవకాశం ఇచ్చారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అని క్రిష్ అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన బాలకృష్ణ నూరో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ‘‘ఈ చిత్రాన్ని ఆదరించడం ద్వారా కథాబలం ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు అంగీకరిస్తారనే విషయం మరోసారి నిరూపితమైంది’’ అని పాత్రికేయులతో క్రిష్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘శాతవాహనుల గురించి కొన్ని పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను. కొంత చరిత్ర పరిశోధన చేసి, దానికి కొంత కల్పిత కథతో ఈ సినిమా తీశా. అసలు శాతవాహనులు తెలుగువాళ్లే కాదని కొందరు అంటున్నారు. ఆ విషయం గురించి నేను వాదించదల్చుకోలేదు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘ఆంధ్రప్రశస్తి’లో శాతవాహనుల గురించి చెప్పారు. ఆయన కన్నా ఎక్కువ తెలుసా?’’ అని అన్నారు. ‘‘తెరపై కనిపించిన బాలకృష్ణ, శ్రియ తదితర నటీనటులు, తెర వెనక పని చేసిన సాయిమాధవ్ బుర్రా, చిరంతన్ భట్, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి.. ఇలా ఈ చిత్ర విజయానికి టీమ్ మొత్తం కారణం’’ అని క్రిష్ అన్నారు. వెంకటేశ్ 75వ చిత్రానికి తానే దర్శకుణ్ణి అనీ, అశ్వనీదత్ నిర్మించే ఓ చిత్రానికి దర్శక త్వం వహించనున్నాననీ ఆయన తెలిపారు. -
క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటంటే..?
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన క్రిష్ తరువాత చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. తన కెరీర్లో ఇప్పటి వరకు తీసిన జానర్లో మరో సినిమా చేకుండా వస్తున్న క్రిష్, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో చారిత్రక కథాంశాన్ని కూడా అద్భుతంగా డీల్ చేశాడు. ఈ నేపథ్యంలో క్రిష్ నెక్ట్స్ సినిమాకు ఏ జానర్ ఎంచుకుంటాడని ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. క్రిష్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఓ థ్రిల్లర్ అన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన క్రిష్ తన నెక్ట్స్ సినిమాను కూడా సీనియర్ హీరోతోనే చేయాలని భావిస్తున్నాడట. అందుకే విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్‌తో రూపొందించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి క్రిష్ నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపు ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టే అన్న ప్రచారం జరుగుతోంది. -
బాలకృష్ణ 'శాతకర్ణి'కి కలెక్షన్ల బొనంజా!
నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ ల్యాండ్ మార్క్ సినిమా సంక్రాంతి బరిలో కలెక్షన్లతో దూసుకుపోతున్నది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఇప్పటికే తొలిరోజు రూ. 18 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇటు బాలకృష్ణ కెరీర్లోనూ, అటు దర్శకుడు క్రిష్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డు సాధించింది. ఫెస్టివల్ సీజన్లో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్ భారీ వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లో రూ. 48 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. తొలిరోజు దేశీయంగా రూ. 18 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 8 కోట్లు, రెండోరోజు దేశీయంగా రూ. 20 కోట్లు, ఓవర్సీస్ రూ. 5 కోట్లు, మూడు రోజు దేశీయంగా రూ. 10 కోట్ల వరకు వసూలు చేసినట్టు ట్రెడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతున్నట్టు సినీ పండితులు చెప్తున్నారు. 'శాతకర్ణి' సినిమా 'ఏ' సెంటర్లలో బాగా ఆడుతున్నప్పటికీ, బీ, సీ సెంటర్లలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నదని అంటున్నారు. అయితే, తెలుగు చక్రవర్తి శాతకర్ణి చారిత్రక కథతో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అటు బాలకృష్ణకు, ఇటు దర్శకుడు క్రిష్‌కు గర్వించే సినిమా అని వారు అభిప్రాయపడుతున్నారు. -
హిస్టరీ Vs సినిమా
-
వయసుతో పనిలేదు
వృత్తి పరంగా చూస్తే ఇతర రంగాలకు సినిమా రంగం కాస్త భిన్నం అని చెప్పక తప్పదు. ఇక్కడ ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. ఇక కథానాయికల విషయానికి వస్తే అందం, అభియనం, అదృష్టం ఈ మూడు ప్రధాన అర్హతలుగా భావించాల్సి ఉంటుంది. అదే విధంగా కథానాయికలకు సినీరంగంలో రాణించేందుకు వయసు ప్రభావం కూడా పని చేస్తుంది. అందుకే సాధారణంగా హీరోయిన్లు తమ వయసు గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. పుట్టిన తేదీ, నెల చెబుతారు కానీ ఏ సంవత్సరం పుట్టారన్నది ఎక్కడా చెప్పుకోరు. చాలా మంది పది, పదిహేనేళ్లుగా హీరోయిన్లుగా రాణిస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారు తమ వయసు గురించి చెబితే ప్రేక్షకుల్లో తమపై ఆసక్తి తగ్గుతుందేమోనన్న భయం ఇందుకు ఒక కారణం కావచ్చు. అంతే కాదు కొందరైతే సినిమాల్లో తల్లిగా, హీరోకి భార్యగా నటించడానికి సందేహిస్తుంటారు. అలా మంచి అవకాశాలను కోల్పోయిన నాయికలు లేకపోలేదు. అలాంటి వారే హీరోయిన్గా మార్కెట్ తగ్గిన తరువాత అక్కగానో, అమ్మగానో నటించడం చూస్తున్నాం. ఇదే విషయాన్ని నటి శ్రియ వద్ద ప్రస్థావించగా తను ఎలా స్పందించారో చూద్దాం. సినిమా రంగాన్ని వేరే వృత్తులతో పోల్చకూడదు. నా విషయమే తీసుకుంటే 17 ఏళ్ల వయసులో నటిగా పరిచయం అయ్యాను. ఇప్పుడు నా వయసు 34. ఈ విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే వయసెంతైతే ఏమిటీ? 65 ఏళ్ల వరకూ సినిమాల్లో మంచి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు బిగ్‌బీ అమితాబ్‌నే తీసుకుంటే ఆయనకు ఇప్పటికీ అద్భుతమైన పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నాయి. నటినైనందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. అని అంటున్న శ్రియ ఇటీవల తెలుగులో బాలకృష్ణకు భార్యగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో తన నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా శింబుకు జంటగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో మరో వైవిధ్య పాత్రలో కనిపించనున్నారు. -
చారిత్రక అసత్యాలతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’
పంజగుట్ట: గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో చరిత్రను పూర్తిగా వక్రీకరించారని, సినిమా మొత్తం చారిత్రక అసత్యాలతో కూడి ఉందని పలువురు చరిత్రకారులు అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కెప్టెన్ ఎల్.పాండురంగారెడ్డి, హైదరాబాద్ డక్కెన్ డెమోక్రటిక్ అలయన్స్ అధ్యక్షులు డాక్టర్ చిరంజీవి కొల్లూరి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధి డి.పి.రెడ్డిలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ చరిత్రను, ఇక్కడి కళాకారులను ప్రొత్సహించేది పోయి చరిత్రను వక్రీకరించిన సినిమాకు వినోదపన్ను రాయితీ ఇవ్వడం సరికాదని వారు ఆగ్రహంవ్యక్తం చేశారు. (చదవండి : ఇది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కానేకాదు ) వినోదపన్ను రద్దు కమిటీ నివేదిక లేకుండా పన్ను రద్దు చేశారని, వెంటనే పన్ను రద్దును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. సినిమాలో పేర్కొన్నట్లుగా గౌతమీపుత్ర శాతకర్ణి కోటి లింగాలలో జన్మించలేదని, ఇతని తల్లి బాలశ్రీ నాసిక్‌లో వేయించిన శిలా శాసనములో ఈ విషయాన్ని పేర్కొనలేదని గుర్తుచేశారు. ఈయన భారతదేశం మొత్తం పాలించారని చూపారని, కాని కేవలం పశ్చిమ దక్కన్ పీఠభూమి మాత్రమే శాతకర్ణి ఆధీనంలో ఉందని తెలిపారు. శాతకర్ణి ఇండో గ్రీకు రాజైన డిమిట్రిస్తో యుద్ధం చేశాడన్నది చారిత్రక అసత్యమని, డిమిట్రిస్ క్రీస్తుపూర్వం 312కు చెందిన వారని, అతనికి శాతకర్ణికి 390 సంవత్సరాలు తేడా ఉందన్నారు. అతను తెలంగాణ వారిగా చూపారని, కాని మహారాష్ట్రకు చెందిన వారని తెలిపారు. ప్రజల్ని తప్పుదోవపట్టించి డబ్బులు సంపాదించుకునేందుకు సినిమా బృందం వినోదపన్ను రద్దు చేయించుకుని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతోందని ఆరోపించారు. -
‘శాతకర్ణి’కి పన్ను మినహాయింపా?
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు వినోదపు పన్ను చేయడాన్ని వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారెడ్డి తప్పుబట్టారు. ఈ సినిమాకు వినోదపు పన్ను రద్దు చేస్తూ ఇచ్చిన జీవోను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాలో చరిత్రను వక్రీకరించారని ఆరోపించారు. ఫక్తు లాభాపేక్షతో తీసిన సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇవ్వడం సరికాదని అన్నారు. పన్ను రద్దు జీవోను ఉపసంహరించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బుధవారం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చారంటూ ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. బాలకృష్ణ బంధువు అయినందునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వెలుసుబాటు కల్పించారని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సెలవుల నేపథ్యంలో రెగ్యులర్ బెంచ్‌కు వెళ్లాలని పిటిషనర్ కు ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నెల 12న విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. -
‘తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా’
సంక్రాంతి సందర్భంగా ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి, బాలకృష్ణలకు ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఇద్దరు హీరోలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు...చిరు, బాలయ్యను ప్రశంసిస్తూ ట్విట్ చేశారు. చిరంజీవి 'సినిమా చేసి చాలా రోజులు అయింది' అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు... జై చిరంజీవా. జగదేకవీరా. అని అన్నారు. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి...తెలుగు వాడి చరిత్ర.. పాత్రలో అద్భుతమైన నటనతో జీవించిన నందమూరి బాలకృష్ణ తెలుగు వాడు. అద్వితీయంగా తెరకెక్కించిన క్రిష్ ఒక తెలుగు వాడు.. తెలుగు వాడి చరిత్ర ని దశ దిశల చాటి చెప్తున్న చిత్ర బృందానికి నా అభినందనలు...సాటి తెలుగు వాడిగా నేనూ గర్వపడుతున్నా..... సాహో శాతకర్ణి.. జయహో శాతకర్ణి అంటూ ట్విట్ చేశారు. -
దుర్గమ్మ సన్నిధిలో శాతకర్ణి బృందం
-
ఇంద్రకీలాద్రిపై శాతకర్ణి బృందం
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను సినీ నటుడు బాలకృష్ణ, హీరోయిన్ శ్రీయ, దర్శకుడు క్రిష్ లు దర్శించుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల సందర్భంగా నిన్న చిత్ర ప్రముఖులు విజయవాడకు విచ్చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం బాలకృష్ణ బృందం అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బాలకృష్ణ, హీరోయిన్ శ్రేయ, దర్శకుడు క్రిష్ లకు అందచేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ పండుగను తమ సొంత ఊరిలో బంధువుల మధ్య జరుపుకుంటానని అన్నారు. తెలుగు పౌరుషాన్ని దేశానికి చాటిచెప్పిన శాతకర్ణి సినిమాలో నటించడం, దానిని ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా వుందని అన్నారు -
సెహభాష్ శాతకర్ణి
రివ్యూ చిత్రం: ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తారాగణం: బాలకృష్ణ, హేమమాలిని, శ్రియ, కబీర్‌బేడీ స్క్రీన్‌ప్లే కన్సల్టెంట్:భూపతిరాజా మాటలు: బుర్రా సాయిమాధవ్ పాటలు: సీతారామశాస్త్రి సంగీతం: చిరంతన్ భట్ కళ: భూపేశ్ ఆర్. భూపతి కెమేరా: వి.ఎస్. జ్ఞానశేఖర్ (బాబా) ఫైట్స్: రామ్-లక్ష్మణ్ కూర్పు: సూరజ్ జగ్తప్ రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు నిర్మాతలు: రాజీవ్‌రెడ్డి,సాయిబాబు రచన -దర్శకత్వం: క్రిష్ రిలీజ్: జనవరి 12, నిడివి: 135 నిమిషాలు బ్రాహ్మణ వంశ పరిపాలకుడైనా, బౌద్ధాన్ని ఆదరించిన మహాచక్రవర్తి శాతకర్ణి! ఇప్పటి తెలంగాణలోని కోటి లింగాల నుంచి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ధాన్యకటకం (అమరావతి) నుంచి భారతదేశాన్ని ఏకఖండంగా పాలించిన మన తెలుగువాడూ, శాతవాహన వంశ చక్రవర్తీ ఆయన. ఒకప్పుడు ముక్కలు ముక్కలుగా ఉన్న భారతదేశంలో 33 గణరాజ్యాల్ని జయించి ఒకే గొడుగు కిందకు తెచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర గొప్పది. బి.యస్.ఎల్. హనుమంతరావు (‘ఆంధ్రుల చరిత్ర’), ఖండవల్లి లక్ష్మీరంజనం (‘ఆంధ్రుల చరిత్ర–సంస్కృతి’) లాంటి పెద్దల చరిత్ర రచనలు, చరిత్రకారులు– శాసన పరిశోధకులైన బి.ఎన్. శాస్త్రి ‘బ్రాహ్మణరాజ్య సర్వస్వము’, విశ్వనాథ సత్యనారాయణ వారి ‘ఆంధ్రప్రశస్తి’ లాంటి గ్రంథాలు, నాసిక్ తదితర శాసనాలు తప్ప శాతకర్ణి గురించి వివరాలు తక్కువ. యుద్ధంలో ఓటమెరుగని ఈ తెలుగు యోధుడి కథ తెలుగునాట కూడా చాలామందికి తెలియదు. మన గురించి మనకే తెలియడం లేదనే కోపం, ఆవేశం, ఆవేదనతో దర్శకుడు క్రిష్ ఈ కథను తెరకెక్కించారు. ‘యాన్ అన్సంగ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ వారియర్ ఎంపరర్’ అని ప్రచారం చేశారు. కథ ఏమిటంటే..: చిన్న చిన్న రాజ్యాలు ఎక్కువై, దేశమంతటా యుద్ధాలతో సంక్షోభం రేగుతుండడంతో, అయిదేళ్ళ వయసు నుంచి దేశమంతటినీ ఒకే పాలన కిందకి తేవాలని శాతకర్ణి (బాలకృష్ణ) కల. తల్లి గౌతమి (హేమమాలిని) ఆశీస్సులతో దండయాత్రలు సాగిస్తాడు. దక్షిణాపథమంతా జయిస్తాడు. కుటుంబం పట్టడం లేదన్న భార్య వాసిష్టి (శ్రియ) నిష్ఠూరాలు, బౌద్ధ సన్న్యాసుల అపోహల మధ్యనే నహాపాణుడు (కబీర్‌బేడీ) లాంటి బలవంతులైన ఎందరో రాజుల్ని జయిస్తాడు. రాజసూయ పూజ చేసి, తల్లి పేరును తన ముందు చేర్చుకొని, గౌతమీపుత్ర శాతకర్ణి అవుతాడు. భార్య మెప్పు పొంది, పరాయి గ్రీకుల పీచమణిచి, కల నిజం చేస్తాడు. బిగి సడలని కథా సంవిధానం: మొదటి నుంచి వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు తీయడం దర్శక, రచయితగా క్రిష్‌కున్న బలం. ఈ చారిత్రక కథాంశాన్ని కూడా ఒక డాక్యుమెంటరీలా కాక, బిగువైన కమర్షియల్ కథలా అల్లుకున్న తీరు, దాని నుంచి పక్కకు రాకుండా చెప్పడం ఈ సినిమాలో ఆయన అనుసరించిన రచనా వ్యూహం. చారిత్రక కథే అయినా, దీనిలో వ్యూహ ప్రతివ్యూహాలు, విషకన్య (గ్రీకు యువతి ఎథీనా) ప్రయోగాలు, చైల్డ్ సెంటిమెంట్, రాజకోటలో వెన్నుపోట్ల లాంటి జానపద సినిమాల్లో అలవాటైన మసాలాలూ దిట్టంగా పడ్డాయి. స్క్రిప్ట్ పరంగా 3 యుద్ధాలు, వాటి మధ్య నలిగిపోయిన భార్యాభర్తల బంధం, పసి వారసుడి సెంటిమెంట్ – లాంటి వాటి మధ్య ఈ కథను రాసుకోవడం ఒక రకంగా సాహసమే. అయినా సరే, ‘గ్లాడియేటర్’, ‘300’, ‘ట్రాయ్’ లాంటి సినిమాలు చూడడం అలవాటైన కొత్త తరానికి కూడా బాగుండేలా యుద్ధ సన్నివేశాలు, వాటికి ఉపోద్ఘాతంగా ఎప్పటికప్పుడు బలమైన సీన్లు, ట్విస్టులు అల్లుకోవడంతో సినిమా విసుగనిపించదు. రెండుంబావు గంటల సినిమాలో ఎక్కడా లాగ్ కనిపించదు. ఎడిటింగ్ నేర్పునూ ఆ మేరకు మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, హీరో, హీరోయిన్ల టైట్ క్లోజప్‌లు వారి హావభావాలు ముద్ర పడేలా చేయడంలోనూ నైపుణ్యం కనిపిస్తుంది. విశేషమేమిటంటే తెరపై బాలకృష్ణ కాక గౌతమీపుత్ర శాతకర్ణి కనపడడం! కథనీ, పాత్రనీ ఆయన పూర్తిగా ఆవాహన చేసుకొని, తానే ఆ పాత్రగా మారినట్లనిపిస్తుంది. సినిమాలో ఆయన ఆంగికం, వాచికాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. సందర్భానుసారంగా ఆయన హావభావాలూ అంతే! నటనలో ఎక్కడా దర్శక, రచయితల గీతను దాటలేదు. చాలామంది హీరోలు: హీరో రూపురేఖల్ని చక్కదిద్దిన డి.ఐ.లో కరెక్షన్ల దగ్గర నుంచి ప్రతి సాంకేతిక శాఖా శ్రద్ధగా పనిచేసింది. అందుకే హీరో బాలకృష్ణ కావచ్చు కానీ, తెరపై ఈ చరిత్ర సృష్టికి అసలు హీరోలు చాలామందే! దర్శకుడు, మాటల రచయిత, పాటల రచయిత, కెమేరామన్, ఎడిటర్, సౌండ్ డిజైనర్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు – ఇలా అందరి పాత్రా సమష్టికృషిగా సినిమాలో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, అవసరమైన ప్రతిచోటా మాటల రచయిత విశ్వరూపం చూపారు. ‘సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?’, ‘దేశం మీసం తిప్పుదాం’ లాంటి ఇప్పటికే పాపులరైన డైలాగ్స్ మాత్రమే కాకుండా క్లైమాక్స్ సహా అనేక కీలక సందర్భాల్లో రాసిన సందర్భోచితమైన పదునైన డైలాగ్స్ పాత్రల్నీ, సన్నివేశాల్నీ పైయెత్తున నిలిపాయి. ‘ఎకిమీడా...’ (రాజు, ప్రభువు అని అర్థం) లాంటి అచ్చతెలుగు పదాన్ని వాడిన యుగళ గీతం, ఎస్పీబీ, శ్రేయాఘోశల్ గొంతులో కొత్త సొబగులు పోయిన ‘అధరమదోలా అదిరినదేలా... మృగనయనా భయమేలనే’ పాట లాంటి వాటితో సీతారామశాస్త్రి కలం జుళిపించారు. ‘కంచె’ ఫేమ్ జ్ఞానశేఖర్ లైటింగ్, కెమేరా పనితనం, మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్‌భట్ బాణీలు, రీ–రికార్డింగ్ ఈ కథకు పెట్టని కోటలు. హీరోయిన్‌కు గాయని సునీత డబ్బింగ్ బాగుంది. భాష తెలియనితనం, వేరేవాళ్ళ డబ్బింగ్ అక్కడక్కడా కొంత ఇబ్బందైనా, శాతకర్ణి తల్లి – రాజమాత గౌతమిగా హేమమాలిని చూడడానికి నిండుగా ఉన్నారు. ఆ పాత్ర ప్రాధాన్యాన్ని నిలబెట్టారు. శాతకర్ణి భార్య వాసిష్టిగా శ్రియ, పసివాళ్ళను బంధించే సౌరాష్ట్ర రాజైన శక వంశీకుడు నహాపాణుడిగా కబీర్‌బేడీ బాగున్నారు. శివకృష్ణ, ‘శుభలేఖ’ సుధాకర్, తనికెళ్ళ లాంటి సుపరిచితులూ ఉన్నారు. లొకేషన్స్ అదుర్స్: కృష్ణాతీరంలోని అమరావతి రాజధానిగా కోటను చూపించడం కోసం మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ (మషిష్మతి రాజ్యం అని ప్రసిద్ధి)లో రాణీ అహల్యాబాయ్ కోటలో తీసిన సీన్లు, ఏనుగుపై ఊరేగింపు, రాజసూయ యాగం వగైరా మనల్ని ఆ కాలానికి తీసుకెళతాయి. చాలా వరకు వీర రస ప్రధానంగా సాగే ఈ సినిమాలో మొదట వచ్చే ఓడలో ఫైట్, నహాపాణుడితో యుద్ధానికి ఎంచుకున్న మొరాకోలోని కోట (‘గ్లాడియేటర్’, ‘ట్రాయ్’ తదితర హాలీవుడ్ సినిమాలన్నీ చేసిన అట్లాస్ స్టూడియో), యవన (గ్రీకు) సమ్రాట్ డెమెత్రియస్తో క్లైమాక్స్‌లో హిమాలయ పర్వత సానువుల వద్ద యుద్ధాన్ని ప్రతిబింబిస్తూ పచ్చని మైదానాలు, మంచు కొండల నేపథ్యం కోసం రష్యా సరిహద్దు వద్ద జార్జియాలో చేసిన షూటింగ్ – ఇవన్నీ కథకు వన్నెలు అద్దాయి. ఈ ప్రశ్నలకు బదులేది?: అదే సమయంలో, క్రీ.శ. 1వ శతాబ్దం నాటికి ‘దుకాణం’ లాంటి ఉర్దూ భాషా పదప్రయోగాలు తెలుగునాట ఉండేవా? చక్రవర్తి చేతిలో తంజావూరు వీణ, కొన్ని రకాల కాస్ట్యూమ్స్, జ్యువెలరీ చూసినప్పుడు కథాకాలాన్ని సరిగ్గా ప్రతిబింబించారా? ఆ రోజుల్లో వితంతువులు (ఆహార్యం, వస్త్రధారణల్లో) ఎలా ఉండేవారు? ‘ఏకబ్రాహ్మణుడు’ అనే బిరుదున్న ఈ బ్రాహ్మణ పరిపాలకుడిలో ఆ ఛాయలు లేవేంటి? శాతకర్ణి గుర్రం పశ్చిమ, దక్షిణ, తూర్పు సముద్రాలు మూడింటి నీరు తాగిందంటూ ‘త్రిసముద్ర తోయ పీత వాహన’ (తల్లి వేయించిన నాసిక్ శాసనం) అని బిరుదైతే, సినిమాలో ‘...పాన వాహన’ అన్నారేంటి? శాలివాహన శకానికీ, శాతకర్ణికీ నిజంగానే సంబంధం ఉందా? లాంటి ప్రశ్నలు చరిత్ర ప్రియులకు వస్తే తప్పుపట్టలేం. (ఇంటర్వెల్‌ను ‘శకారంభం’ అనాల్సింది ‘శఖారంభం’ అనడమూ పంటి కింద రాయే). అయితే, దాదాపు 2 వేల ఏళ్ళ క్రితం నాటి చరిత్రను... దొరుకుతున్న కొద్దిపాటి ఆధారాలనూ తీసుకొని, ఇవాళ ఊహాత్మకంగా, రాజకీయ వ్యూహాత్మకంగా తెరపై పునఃసృష్టిస్తున్నప్పుడు దీనిని సినిమాటిక్ లిబర్టీగా అర్థం చేసుకోవాలేమో! తొడగొట్టాడంతే...: మొత్తం మీద తెలుగు జాతి చరిత్రలోని ఒక ముఖ్య ఘట్టాన్నీ, ఒక యోధుడి జీవితాన్నీ సంక్షిప్తంగానే అయినా – సీటులో నుంచి కదలనివ్వకుండా పిల్లలు, పెద్దలు చూసేలా తీసిన సినిమా ఇది. ‘బాహుబలి’తో పోలికలూ వస్తాయి. ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపులు ఆల్రెడీ అందుకున్న ఈ చిత్రం సమష్టి సాంకేతిక కృషికి గుర్తింపుగా రానున్న రోజుల్లో అవార్డుల జల్లులో తడిస్తే ఆశ్చర్యం లేదు. వాణిజ్య ఫలితమంటారా? బాలకృష్ణ తొడకొడితే సిన్మా హిట్ అని ప్రచారం! ఈ సినిమాలో ఇంటర్వెల్లో ఆయన ఒకసారి ఒక తొడ కొట్టారు. క్లైమాక్స్‌లో ఏకంగా రెండు తొడలూ కొట్టారు. పైగా, ఆయన సంక్రాంతి సెంటిమెంట్ సరేసరి! ఇక రిజల్ట్ వేరే చెప్పాలా? అన్ని రకాలుగా గుర్తుండిపోయే సిన్మా! ఇలాంటి చారిత్రక పాత్రలకు నప్పే హీరో బాలకృష్ణకు (అతిథి పాత్రపోషణ సినిమాలు కలప కుండా) ఇది 100వ సినిమా. తెలుగులో రెండే రెండు చిత్రాల్లో (ఎన్టీఆర్ ‘పాండవ వనవాసం’– 1965, ‘శ్రీకృష్ణ విజయం’ –1971) నటించిన హిందీ నటి హేమమాలిని 46 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు తెరపైకి వచ్చారు. గ్రాఫిక్ ప్లేట్ వర్క్స్‌తో కలిపి రికార్డు టైమ్‌లో 85 రోజుల్లో ఈ భారీ చిత్రం షూటింగ్ పూర్తవడం విశేషం. రూ. 40 కోట్ల పైగా వ్యయమైనట్లు భోగట్టా. రూ. 60 కోట్లకు పైనే వ్యాపారమై 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. – రెంటాల జయదేవ -
బాబాయ్ సినిమాపై అబ్బాయిలు ఏమన్నారు?
బాలకృష్ణ నూరో చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీనిపై పలువురు అగ్రహీరోలు, దర్శకులు అంతా స్పందించారు. బాలకృష్ణ అన్న కొడుకులు నందమూరి తారక రామారావు, కళ్యాణ్‌రాం కూడా దీనిపై తమ స్పందన ఏంటో తెలిపారు. తారక్ ముందుగానే ఈ సినిమాకు తన శుభాకాంక్షలు తెలిపాడు. బాబాయ్‌తో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ మొత్తానికి అభినందనలని, దర్శకుడు క్రిష్‌కు కూడా ఆల్ ద బెస్ట్ అని సినిమా విడుదలకు ముందే ట్వీట్ చేశాడు. ఇక హరికృష్ణ మరో కొడుకు నందమూరి కళ్యాణ్‌రామ్ అయితే సినిమా విడుదలైన తర్వాత స్పందించాడు. జీపీపెస్కే స్టన్నింగ్‌గా ఉందని అన్నాడు. 2017 ప్రారంభం అదిరిపోయిందని చెప్పాడు. దాంతోపాటు ఖైదీ నెంబర్ 150 హీరో చిరంజీవికి అభినందనలు తెలిపాడు. ఇంకా విడుదల కావాల్సి ఉన్న శతమానం భవతి, కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలకు గుడ్‌లక్ చెప్పాడు. Wishing Babai and the whole team of #GPSK and @DirKrish all the best.#NBK100 — tarakaram n (@tarak9999) 11 January 2017 #GPSK is stunning.Great start to 2017.Congratulations Chiranjeevi garu for Khaidi150. Good luck Shatamanam &Constable Venkatramayya teams — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 12 January 2017 -
ఇది నా పూర్వజన్మ సుకృతం : బాలయ్య
ఈ రోజు(గురువారం) విడుదలైన గౌతమిపుత్రశాతకర్ణి సినిమాను బాలకృష్ణ అభిమానులతో కలిసి చూశారు. రాత్రి భ్రమరాంబ థియేటర్లో ఏర్సాటు చేసిన బెనిఫిట్ షోకు హాజరైన బాలయ్య ఉదయాన్నే ప్రసాద్ ఐమాక్స్ లో సందడి చేశాడు. దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రియలతో ఐమాక్స్ కు వచ్చిన బాలకృష్ణ ఘనవిజయాన్ని అంధించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన బాలకృష్ణ.. ఈ విజయం తెలుగుజాతి విజయంగా భావిస్తున్నానని తెలిపారు. నాన్నగారు చేయాలనుకున్న సినిమాలో తాను నటించటం తన పూర్వజన్మ సుకృతం అన్న బాలయ్య, ఈ విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందని.. ఇక పై కూడా అభిమానులను అలరించే సినిమాలను అందిస్తానని తెలిపాడు. -
ఇది నా పూర్వజన్మ సుకృతం
-
'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీ రివ్యూ
టైటిల్ : గౌతమిపుత్ర శాతకర్ణి జానర్ : హిస్టారికల్ మూవీ తారాగణం : బాలకృష్ణ, శ్రియ, హేమామాలిని, కబీర్ బేడీ, శివరాజ్ కుమార్ సంగీతం : చిరంతన్ భట్ దర్శకత్వం : క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) నిర్మాత : వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చారిత్రక కథాంశం గౌతమిపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ వందో సినిమా కూడా కావటంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను గౌతమిపుత్ర శాతకర్ణి అందుకుందా..? అంత ఘనమైన చరిత్రను కేవలం 79 రోజుల్లోనే తెరకెక్కించిన క్రిష్.. ఆకట్టుకున్నాడా..? కథ : శాతకర్ణి (బాలకృష్ణ) అమరావతి రాజ్య రాకుమారుడు. ఉగ్గుపాలతోనే వీరత్వాన్నీ పుణికి పుచ్చుకున్న మహావీరుడు. యుద్ధానికని తన తండ్రి తరచూ కదనరంగానికి వెళుతున్నాడని.. అసలు అంతా ఒకే రాజ్యమైతే యుద్ధం చేయాల్సిన అవసరమే రాదని, అఖండ భారతాన్ని ఒకే రాజ్యంగా చేస్తానని చిన్నతనంలోనే తల్లి గౌతమి బాలాశ్రీ(హేమామాలిని)కి మాట ఇస్తాడు. అందుకోసం అతడు జైత్రయాత్ర మొదలుపెడతాడు. శాతకర్ణి పరాక్రమానికి యావత్ దక్షిణ భారతం దాసోహం అంటుంది. తరువాత శాతకర్ణి చూపు ఉత్తరభాతరం మీద పడుతుంది. ఇతర రాజ్యాల రాకుమారులను ఎత్తుకెళ్లి ఆ రాజులను తన సామంతులుగా చేసుకునే నహపానుడు ఉత్తర భారతాన్ని పాలిస్తుంటాడు. శాతకర్ణి, సైన్యం తనవైపుగా వస్తుందని తెలుసుకున్న నహపానుడు శాతకర్ణి కొడుకును కదన రంగానికి తీసుకురమ్మని కబురు పంపుతాడు. అందుకు శాతకర్ణి భార్య వాశిష్టి దేవి (శ్రియ) అంగీకరించకపోయినా, శాతకర్ణి పసిబాలుడైన కొడుకుతో కలిసి యుద్ధానికి సిద్ధమవుతాడు. నహపానుడిని గెలిచి అఖండ భారతాన్ని ఒకే రాజ్యంగా మారుస్తాడు. శాతకర్ణి విజయానికి గుర్తుగా అతని తల్లి గౌతమి బాలాశ్రీ(హేమామాలిని) రాజసూయ యాగం తలపెడుతుంది. ఆ యాగంలోనే తనకు ఇంతటి వీరత్వాన్ని అందించిన తల్లి పేరును తన పేరుకు ముందుకు చేర్చుకొని గౌతమిపుత్ర శాతకర్ణి అవుతాడు. యావత్ భరతఖండం ఒకే రాజ్యంగా ఏర్పడిన ఆ రోజును శాలివాహన శఖ ఆరంభంగా, యుగాదిగా ప్రకటిస్తాడు. దేశంలోని అన్ని రాజ్యాలు ఏకమైనా పరాయి దేశాల నుంచి ముప్పు మాత్రం అలాగే ఉంటుంది. సామాంతులను వశపరుచుకున్న యవన సామ్రాట్ డిమెత్రీస్, శాతకర్ణిపై యుద్ధం ప్రకటిస్తాడు. దొంగచాటుగా శాతకర్ణిని హతమార్చి తిరిగి భారతభూమిని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటాడు. ఈ కుట్రను శాతకర్ణి ఎలా జయించాడు..? అఖండ భారతం కోసం శాతకర్ణి కన్న కల నెరవేరిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తన వందో చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక చిత్రాన్ని ఎంపిక చేసుకున్న బాలకృష్ణ మరోసారి జానపద పౌరణిక పాత్రలకు తానే సరైన నటుడని నిరూపించుకున్నాడు. ఆహార్యంలోనూ, రాజసంలోనూ మహారాజులానే కనిపించి ఆకట్టుకున్నాడు. భారీ యుద్ధ సన్నివేశాల్లో బాలయ్య నటన అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది. చారిత్రక కథాంశమే అయినా ఎక్కడ తననుంచి అభిమానులు ఆశించే అంశాలు మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు బాలకృష్ణ. రాణీ వాశిష్టీ దేవిగా శ్రియ మెప్పించింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా పసిబాలుడైన కొడుకును యుద్ధరంగానికి పంపమని భర్త అడినప్పుడు, తిరిగి వస్తాడో రాడో తెలియని సమయంలో భర్తను యుద్ధానికి సాగనంపుతున్నప్పుడు శ్రియ చూపించిన హవాభావాలు అద్భుతం. రాజమాత గౌతమి బాలాశ్రీ పాత్రలో హేమామాలిని హుందాగా కనిపించింది. ఆమె స్టార్ డమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇతర నటీనటులు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : ఇప్పటి వరకు యంగ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన క్రిష్ తొలిసారిగా ఓ సీనియర్ స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించి ఘన విజయం సాధించాడు. బాలయ్య వందో సినిమాగా చారిత్రక కథాంశాన్ని చెప్పి ఒప్పించిన క్రిష్ అక్కడే విజయం సాధించాడు. ఎన్నో యుద్ధాలు చేసిన ఓ మహా చక్రవర్తి కథను కేవలం 79 రోజుల్లో తెరకెక్కించిన క్రిష్ సినిమా నిర్మాణం, దర్శకత్వంలో మీద తనకు ఎంత పట్టు ఉందో నిరూపించింది. అంత తక్కువ సమయంలో సినిమాను తెరకెక్కించినా ఎక్కడా హడావిడి పూర్తి చేసినట్టుగా కనిపించకుండా ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా ఎక్కవగా విజువల్ ఎఫెక్ట్స్ జోలికి వెల్లకుండా వీలైనంత వరకు ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు త్వరగా పూర్తయ్యేలా ప్లాన్ చేశాడు. అయితే లోకేషన్లుగా క్రిష్ ఎంచుకున్న రాజప్రాసాదాలు, యుద్ధ రంగాలు.. అలనాటి శాతకర్ణి వైభవాన్ని కళ్లకు కట్టాయి. క్రిష్ ఊహలకు రూపమివ్వటంలో సినిమాటోగ్రాఫర్ జ్ఞాణశేఖర్ విజయం సాధించాడు. ప్రతీ ఫ్రేమ్ లోనూ శాతవాహనుల రాజసం కనిపించేలా తెరకెక్కించాడు. చిరంతన్ భట్ సంగీతం, సూరజ్,రామకృష్ణల ఎడిటింగ్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని మరింత పెంచాయి. ప్లస్ పాయింట్స్ : బాలకృష్ణ నటన క్రిష్ కథా స్క్రీన్‌ప్లే మాటలు మైనస్ పాయింట్స్ : క్రిష్ మార్క్ డ్రామా లేకపోవటం ఓవరాల్‌గా గౌతమిపుత్ర శాతకర్ణి... తెలుగు వారు గర్వంగా చెప్పుకోవాల్సిన ఘన చరిత్రకు అద్భుత దృశ్యరూపం - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
గౌతమిపుత్ర శాతకర్ణిపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ : గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చారంటూ ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. బాలకృష్ణ బంధువు అయినందునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వెలుసుబాటు కల్పించారని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిబంధనలు అతిక్రమిస్తే నిర్మాత నుంచి డబ్బు వసూలు చేయవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. కాగా కోర్టు సెలవుల నేపథ్యంలో రెగ్యులర్ బెంచ్‌కు వెళ్లాలని పిటిషన్‌కు న్యాయస్థానం సూచించింది. కాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మరి ‘రుద్రమదేవి’ మాటేంటి?
వియ్యంకుడు, బావమరిది అయిన బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి ఏపీ సీయం చంద్రబాబు వినోదపు పన్ను రాయితీ ప్రకటించడాన్ని దర్శకుడు గుణశేఖర్ స్వాగతించారు. అయితే, గతంలో తాను తీసిన ‘రుద్రమ దేవి’ చిత్రానికి తెలంగాణ సీయం కేసీఆర్ వినోదపు పన్ను రాయితీ ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం మాత్రం ఓ కమిటీ వేసి ఫైలుని మూసేసిన సంగతిని ప్రస్తావించారు. ‘శాతకర్ణి’కి పన్ను రాయితీ ఇచ్చినవేళ, మరోసారి తమ దరఖాస్తుని పరిశీలిం చాలని చంద్రబాబుని కోరారు. ‘‘రుద్రమ దేవి వట్టి తెలంగాణ యోధురాలు కాదు. దక్షిణాది నంతటినీ పాలించిన రాణి. ఆమె పట్టాభి షేకం సందర్భంగా అమరావతి వద్ద వేయించిన ‘మార్కాపురం శాసనా’న్ని ఇటీ వల మీరో సభలో ఉదాహరించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ‘రుద్రమదేవి’కి వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సమానమైన ‘ప్రోత్సాహక నగదు’ అందజేసి మీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని మరోమారు రుజువు చేయండి’’ అని గుణశేఖర్ కోరారు. -
ఆరోగ్యకరమైన పోటీ మాది!
బాలకృష్ణ హీరోగా నటించిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బాలకృష్ణ, కథానాయిక శ్రియతో కలసి మీడియాతో సమావేశమయ్యారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ... ► శాతకర్ణి పాత్ర మీకు దక్కినందుకు మీ అనుభూతి ఏంటి? ఈ సువిశాల దేశాన్ని ఒక్క ఏలుబడి కిందకు తెచ్చిన మహా చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగువాడని ఎందరికి తెలుసు? మన కంటూ ఓ సంస్కృతిని, వారసత్వాన్ని, ప్రపంచ పటంలో ఓ గుర్తింపుని ఇచ్చిన శాతకర్ణి చరిత్ర... బిడ్డకు పరిచయం లేని పురిటినొప్పుల లాగా పుడమి గర్భంలో కలసింది. ఎన్టీఆర్ వారసుడిగా, తెలుగు బిడ్డగా... ఈ చిత్రం నేను చేయడం కాకతాళీయమో! యాదృచ్ఛికమో! నాకు ఈ అవకాశం నాన్నగారే కల్పించారేమో! నాన్నగారు చేయాలనుకున్న పాత్రని నా వందో చిత్రంలో చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. శాతకర్ణి జననం నుంచి గ్రీకు చక్ర వర్తి డిమిత్రిస్ని ఓడించడం దాకా సినిమాలో ఉంటుంది. ► శాతకర్ణి చరిత్రను కథగా రూపొందించడం కష్టమైందా? ‘నాణేలపై తమ బొమ్మ ముద్రించిన మొట్టమొదటి రాజు శాతకర్ణి’ అని కృష్ణశాస్త్రిగారు పురావస్తు శాఖ డైరె క్టర్‌గా పనిచేసిన టైమ్‌లో తెలిసింది. చారిత్రక పరిశోధ కులు పరబ్రహ్మ శాస్త్రిగారు పలు పరిశోధనలు చేసిన తర్వాత ‘శాతకర్ణి తెలుగువాడు’ అని నిరూపించారు. పుస్తకాల్లో శాతకర్ణి గురించి తక్కువ ఉంది. నాసిక్‌లో ‘గౌతమీ బాలాశ్రీ’ వేయించిన శాసనాలు, పుస్తకాలు, అప్పటి శిల్పాల నుంచి సమాచారంతో క్రిష్ స్క్రిప్ట్ రెడీ చేశారు. కథ రూపకల్పనలో ఆయనే ఎక్కువ కష్టపడ్డారు. ► మీకు పౌరాణిక పాత్రల్లో నటించిన అనుభవం ఉంది. శాతకర్ణిగా నటించడానికి ఎలా సన్నద్ధమయ్యారు? నాన్నగారు ఓ ఎన్సైక్లోపీడియా. కృష్ణుడు, రాముడు తదితర పాత్రలతో కట్టుబొట్టు దగ్గర నుంచి ఆభరణాల వరకూ ఎలా ఉండాలనేది చెప్పారు. అవన్నీ మా స్టూడి యోలో ఉన్నాయి. త్వరలో మ్యూజియం ఏర్పాటుకి సన్నా హాలు చేస్తున్నాం. నేను చేసిన పౌరాణిక పాత్రలకు హెల్ప్ అయ్యాయి. కానీ, శాతకర్ణి పాత్రకి రిఫరెన్స్‌లు లేవు. దాంతో ఈ పాత్ర నాకో పెద్ద పరీక్ష పెట్టింది. నిజానికి, శాతవాహనులు గిరిజ నులు. వస్త్రధారణ, ఆచారవ్యవ హారాలు వేరు. క్రిష్ సలహాతో, ఆయన చెప్పింది చేశా! ► క్రిష్ దర్శకత్వం గురించి? క్రిష్ ఆరో చిత్రమిది. అతడి గత చిత్రాలు చూస్తే... ఓ చిత్రానికీ, మరో చిత్రానికీ సంబంధం లేదు. కొందరు దర్శకుల దగ్గర జబ్బు ఏంటంటే.. ‘ఒకే రకమైన సిన్మాలు తీస్తూ, మీ కోసమే ఈ కథ తయారు చేశాం’ అంటారు. ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో! అలాంటి కథ తీసుకురమ్మని అడుగుతా. సరిగ్గా క్రిష్ నేను కోరు కున్న కథ తెచ్చాడు. నాతో పాటు ప్రతి ఒక్కరి పాత్రనూ అద్భుతంగా తీర్చిదిద్దాడు. 2.15 గంటల్లో తీశాడు. హ్యాట్సాఫ్ టు క్రిష్. ► ఎన్టీఆర్‌తో చేసిన హేమమాలిని, ఇప్పుడు మీతో నటించడం...? హేమమాలిని లేకపోతే సినిమా లేదండీ. నాన్న గారితో ‘పాండవ వనవాసం’లో చేశారు. తర్వాత ‘శ్రీకృష్ణ పాండవీయం’లో రుక్మిణి పాత్రకు తీసుకోవాలనుకున్నారు. హిందీలో ఐదు సినిమాలు అంగీకరించడంతో ఆమెకు కుదరలేదు. ఇప్పుడీ సినిమాలో పాత్ర ఏంటి? అనేది చూశారామె. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తల్లి పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ►కన్నడ శివరాజ్‌కుమార్‌ను తీసుకోవాలనే ఆలోచన మీరే ఇచ్చారట కదా! రాజ్‌కుమార్ ఫ్యామిలీ ఇతర భాషల్లో నటిస్తే అభిమానులు ఒప్పుకోరు. ఇప్పటివరకూ చేయలేదు కూడా! కానీ, శాతకర్ణి కీర్తిని వివరించే పాట ఆయన చేస్తే బాగుంటుందని నా ఆలోచన. నేను ఫోన్ చేసి అడగ్గానే, సాయంత్రానికి ఒప్పుకున్నారు. ► ఫస్ట్ కాపీ చూశాక మీ ఫీలింగ్ ఏంటి? ఈ కథకి ఓకే చెప్పినప్పటి నుంచీ అనిర్వచనీయ అనుభూతి. ఈ కథకీ, నాకూ సంధానకర్తగా క్రిష్‌ని అదృశ్య శక్తులు పంపాయని నమ్ముతున్నా. ఎప్పుడూ ఇలాంటివి నమ్మని క్రిష్ ఓ సందర్భంలో ‘79 రోజుల్లో చిత్రీకరణ పూర్తవడం వెనుక ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు. ► భారీ చిత్రాన్ని నిర్మాతలెలా చేశారు? సినిమా అంటే కేవలం వినోదం కాదు. భావితరాలకు మన గొప్ప సంస్కృతిని అందిస్తూ, కాపాడు కోవాలి. మా నిర్మాత లకు అంత మంచి ఆలోచన ఉంది కాబట్టే అకుంఠిత దీక్షతో ఇంత మంచి సినిమా,ఎక్కడా రాజీ పడకుండా తీశారు. ► సంక్రాంతికి రెండు పెద్ద చిత్రాలు రిలీజ్. చిరంజీవితో మీ పోటీ అనుకోవచ్చా? ‘పోటీ ఎవరూ లేరు, సక్సెస్ వచ్చే సింది’ అనేది ఆశాజనకంగా ఉండదు. అయినా మా మధ్య ఉన్నది ఆరోగ్య కరమైన పోటీ. పండగకి మంచి చిత్రాలు రావడం సంతోషం. రెండూ హిట్టయితే ఇండస్ట్రీకి మంచిది. చిరంజీవికి నా శుభాకాంక్షలు. ► 101వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ చేయనున్నారా? ‘రైతు’లో కీలక పాత్రలో నటించాల్సిందిగా అమితాబ్ బచ్చన్గారిని కలిశాం. కృష్ణవంశీతో కలసి ఆయనకు కథ వినిపించా. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అమితాబ్ స్పందనను బట్టి నిర్ణయం తీసుకుంటా. ► వందో చిత్రం.. విడుదలకు ముందు నెర్వస్‌గా ఏమైనా ఉందా? ఎలా కనపడుతున్నా! నాట్ ఎట్ ఆల్ నెర్వస్. నా అభిమానులు, ప్రేక్షకదేవుళ్లు కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారీ ఆదరించారు. వాళ్ల అభిమానమే నాకు శ్రీరామరక్ష. నాకు ఏ భయం లేదు. ఇప్పుడు జనరేషన్ మారుతోంది. ఇకపై చేసే ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటా! ప్రేక్షకులు కొత్త బాలకృష్ణని చూస్తారు. నాన్నగారు ఏ పాత్ర చేసినా పాత్రలో లీనమై చేసేవారు. నేను శాతకర్ణిగా ఎలా చేశాననేది రేపు చూస్తారు. నటన అంటే కేవలం నవ్వడం, ఏడవడం, హావభావాలు పలికించడం కాదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటించాలి. కబీర్‌బేడీ ఫస్ట్‌డే షూటింగ్‌కి వచ్చినప్పుడు నాకూ, ఆయనకీ మధ్య ‘బడుగు జాతి కాదురా.. తెలుగుజాతి. మేము అధములం కాదురా.. ప్రథములం’ అనే సీన్ ప్లాన్ చేశారు. నేను డైలాగ్ చెప్ప గానే కబీర్‌బేడి ‘సారీ అండీ. నేను పాత్రలోకి వెళ్లడానికి టైమ్ కావాలి. మన్నించండి’ అని చెప్పి హోటల్‌కి వెళ్లారు. ఆయనకు రాత్రంతా నిద్రపట్టలేదట! డైలాగులు, హావభావాలు ప్రాక్టీస్ చేశానన్నారు. ఎంత పెద్ద నటుడికైనా అలాంటి తపన ఉండాలి. కథ చెప్పగానే నేను చేయగలనా? లేదా? అని కంగారుపడ్డా. ప్రతి అంశంలో క్రిష్ రీసెర్చ్ చేయడంతో ఆయనను ఫాలో అయ్యా. బాలకృష్ణగారితో నటించి పదేళ్లు దాటింది. అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో ఏ మార్పూ లేదు. సెట్లో నటీనటులకు ఎంతో గౌరవం ఇస్తారు.’’ – శ్రియ -
'ఆ సినిమా చూడటం అదృష్టం'
తనకు పిల్లనిచ్చిన మేనమామ నందమూరి బాలకృష్ణ నటించిన నూరో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా అమరావతి చరిత్రను మరోసారి చూడటం అదృష్టమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సినిమా ప్రీమియర్‌ను చూశానని, దర్శకుడు క్రిష్ చాలా అద్భుతంగా తీశారని చెప్పారు. అందులోనూ బాలయ్య మావయ్య స్ఫూర్తిదాయకమైన పెర్ఫామెన్స్ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యానన్నారు. సినిమాలో నటించిన ఇతరుల గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాల్సిందేనని ట్వీట్ చేశారు. ఇక శాతకర్ణి సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని.. నోరప్పగించి సినిమా అలా చూస్తుండిపోయానని బాలకృష్ణ కుమార్తె, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అన్నారు. దర్శకుడు క్రిష్‌కు అభినందనలు తెలిపారు. Fortunate to have revisited the history of #Amaravati through #GautamiPutraSatakarni premiere last night. Kudos to @DirKrish. (1/2) — Lokesh Nara (@naralokesh) 10 January 2017 Mesmerised by #Balayya mavayya's inspiring performance. Contribution of other artists in #GautamiPutraSatakarni deserves special mention 2/2 — Lokesh Nara (@naralokesh) 10 January 2017 Spellbound after watching Satakarni! Congratulations @DirKrish on #nbk100.#respectmother #telugupride #prouddaughter — Brahmani Nara (@brahmaninara) 10 January 2017 -
శాతకర్ణి కుమారుడి సినిమా కూడా తీస్తా!
‘‘వందో సినిమా ఏది చేస్తే బాగుంటుందని ఆకలి మీదున్న సింహానికి (బాలకృష్ణ) వేట (కథ) దొరికింది. అప్పుడా కథని ఎంత గొప్పగా తీయాలని ఆలోచించాను తప్ప, ఒత్తిడికి లోను కాలేదు. బాలకృష్ణగారి నూరవ చిత్రానికి దర్శకత్వం వహించడం ఓ గౌరవం’’ అన్నారు దర్శకుడు క్రిష్. బాలకృష్ణ హీరోగాఆయన దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈ 12న విడుదలవుతోంది. క్రిష్ చెప్పిన విశేషాలు... ► ‘యుద్ధం నుంచి మీ నాన్న ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్నావా?’ అని చిన్నప్పుడు శాతకర్ణిని తల్లి అడుగుతుంది. అప్పుడు ‘ప్రజలెందుకు కొట్టుకుంటున్నారమ్మా?’ అనడుగుతాడు. తల్లి గౌతమి ‘ప్రజలు కొట్టుకోవడం లేదు. అధికారం చలాయించడానికి పాలకులు కొట్టుకుంటున్నారు’ అని బదులిస్తుంది. ‘ఇన్ని రాజ్యాలు కాకుండా ఒకే రాజ్యంగా ఉంటే గొడవలు ఉండవు కదా’ అనే ఆలోచన శాతకర్ణిలో వస్తుంది. ‘గణ రాజ్యాలను ఒక్కటిగా చేసే వీరుడు పుట్టాలి కదరా’ అన్నప్పుడు ‘నేను పుట్టాను కదా’ అని శాతకర్ణి గర్జిస్తాడు. సినిమా ప్రారంభ సన్నివేశమిది. 33 గణ రాజ్యాలుగా ఉన్న భారతాన్ని ఏకం చేసిన యుద్ధ పిపాస, గ్రీకులు, పర్షియన్లు తదితరులను ఎదిరించిన గొప్ప చక్రవర్తి కథే – ఈ సినిమా. ► ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’ చిత్రాల్లోని గెటప్స్‌లో బాలకృష్ణగారి హుందాతనం చూశాం. 99 సినిమాల అనుభవాన్ని రంగరించి బాలకృష్ణగారు చేసిన చిత్రమిది. కథ చెబుతున్నప్పుడే ఆయన హావభావాల్లో నేను శాతకర్ణిని చూశా. బాలయ్యlతప్ప ఈ పాత్రను ఎవరూ చేయలేరు. ఆయనలా ఎవరూ డైలాగులు చెప్పలేరు. అద్భుతంగా నటించారు. హేమమాలిని, శివ రాజ్‌కుమార్, శ్రియ, కబీర్‌బేడీ.. ప్రతి ఒక్కరూ బాగా చేశారు. ► ‘యుద్ధాన్ని గెలిచేది సైన్యం కాదు, వ్యూహం’ అని బాలయ్య డైలాగ్ చెబుతారు. మేమూ పక్కా వ్యూహంతో పని చేశాం. ఏదో తెలియని శక్తి మమ్మల్ని నడిపించింది. అమ్మ తోడు... ఈ మాట మా టీమ్‌తో వందసార్లు చెప్పా. ఈ చిత్ర ప్రకటన దగ్గర్నుంచీ ఇప్పటివరకూ మా తప్పులన్నీ ఒప్పులయ్యాయి. ► రాజమౌళి సృష్టించిన ఓ ఫ్యాంటసీ సినిమా ‘బాహుబలి’. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో చరిత్ర చెప్తున్నా. రెండిటికీ పోలిక పెట్టకూడదు. మొరాకోలో షూటింగ్‌కి వెళ్లడానికి ముందు రాజమౌళికి కథ చెప్పగానే.. ‘గ్రాఫిక్స్ తక్కువ ఉండేలా చూసుకో. గ్రాఫిక్స్ వర్క్ నీ చేతిలో ఉండదు. వీలైనంత లైవ్‌లో షూటింగ్ చెయ్’ అన్నారు. ట్రైలర్ రిలీజ్ కాగానే ఫోన్ చేసి ‘ఎలా తీసేశావ్?’ అనడిగారు. ‘నీ సలహా పాటిం చా’ అన్నాను. ‘గొప్ప సినిమా తీశావ్. టైమ్‌కి రిలీజ్ చేయాలంటే ఇప్పట్నుంచీ నువ్వు పడుకోవద్దు. ఎవ్వర్నీ పడుకోనివ్వకు’ అన్నారు. ఈ రెండు సలహాలూ నాకు ఎంతో సహాయపడ్డాయి. దేశమంతా చెప్పదగిన చారిత్రక కథను తెలుగు ప్రేక్షకుల కోసం కాస్త ప్రాంతీయ అభిమానంతో తీశా. దానికి తోడు హిందీలో ప్రమోట్ చేసే, తీసే టైమ్ లేదు. అందుకే బాలీవుడ్ మీద దృష్టి పెట్టలేదు. ►శాతకర్ణి కుమారుడు వాసిష్ఠీపుత్ర పులోమావి కథను సినిమాగా తీసే ఆలోచన ఉంది. అదెప్పుడో చెప్పలేను. ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మధ్య యుద్ధమంటూ సోషల్ మీడియాలో అభిమానుల మధ్య నడుస్తున్న యుద్ధంపై క్రిష్ స్పందిస్తూ – ‘‘అభిమానం వేరు. మూర్ఖాభిమానం వేరు. ట్విట్టర్లో కొన్ని పోస్టులు ఎంత దారుణంగా ఉంటున్నాయో చెప్పలేను. పైగా, వాళ్లంతా చదువుకున్నవారు. పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. చిన్న పిల్లలకు కులం ఎందుకు? అసలు చిరంజీవి, బాలకృష్ణగార్ల గురించి వాళ్లకు ఏం తెలుసు? మా సినిమా ప్రారంభానికి బాలకృష్ణగారు ఆప్యాయంగా చిరంజీవిగారిని ఆహ్వానించారు. అప్పుడు నేను అరగంట కథ చెప్పా. బాలయ్య భలే కథ చేస్తున్నాడని చిరు చెప్పారు. మెగాభిమానులు ఎవరైనా... తమ అభిమాన హీరో శుభాకాంక్షలు అబద్ధం అవ్వాలని కోరుకోకూడదు. నిజమైన బాలకృష్ణ అభిమానులు శుభాకాంక్షలు అందజేసిన చిరంజీవి సినిమా పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించకూడదు. ఒకరు ఓడితే మరొకరు గెలవడానికి ఇవి ఎన్నికలు కావు. ఏ సినిమాను అయినా కళాత్మక దృష్టితో చూడాలి’’ అన్నారు. -
అభిమానుల ఆశీస్సులే బలం
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జ్యోతి థియేటర్లో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర పతాకావిష్కరణ పాతపోస్టాఫీసు: ‘అభిమానుల ఆశీస్సులే నా బలం.. మీరు ఇచ్చే తీర్పు నా తండ్రి ఇచ్చే తీర్పుగా భావిస్తా’ అని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. నగరానికి వచ్చిన ఆయన జ్యోతిథియేటర్లో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త సినిమా విడుదల సందర్భంగా పతాకావిష్కరణ అనే కొత్త ఒరవడిని తీసుకువచ్చామన్నారు. ఇలా సినిమా విడుదలయ్యే లోపు వంద థియేటర్లలో పతాకాలను ఆవిష్కరించనున్నామని చెప్పారు. ప్రపం చ పటంలో భారతావనికి ఎనలేని కీర్తీని, గుర్తింపును తీసుకువచ్చిన శాతకర్ణి తెలుగువాడు కావడం మనం దరి అదృష్టమన్నారు. తండ్రి ఎన్టీఆర్‌లా వైవిధ్యమైన పాత్రలు వేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఒక యోధుని యధార్థ గాథే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పారు. సినిమాను పూర్తి చేయడానికి 79 రోజులు పట్టిందని, అందరి సమష్టి కృషితోనే ఇంత గొప్పగా రూపొందిందిన్నారు. చిత్రంలో తల్లిపాత్రకు హేమమాలిని ఒప్పుకోకపోతే ఈ సినిమాకు న్యాయం జరిగేది కాదన్నారు. మంచి చేసేవాడికి పంచభూతాలు సహకరిస్తాయని, ప్రజలకు మేలు చేయడం పాలకుని బాధ్య తని గుర్తుచేశారు. మన గొప్పలు మనం చెప్పుకోవడం తప్పని ఇతరులు మనలను గొప్పగా చెప్పుకోవాలన్నారు. కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు -
నేడు విశాఖలో శాతకర్ణి పతాక ఉత్సవం
-
ఇంద్రసేన వర్సెస్ సమరసింహ
సినిమాలో డ్రామా ఉంటుంది... యాక్షన్ ఉంటుంది... ఎంటర్టైన్మెంట్ ఉంటుంది... ఫస్టాఫ్ ఉంటుంది... సెకండాఫ్ ఉంటుంది... క్లైమాక్సూ ఉంటుంది... హీరోయిన్లుంటారు... క్యారెక్టర్లుంటాయి... కామెడీ ఉంటుంది... అబ్బో! చాలానే ఉంటుంది. అవును... అసలు విషయం మర్చిపోయాం! సినిమా బయట కూడా డ్రామా ఉంటుంది. అభిమానులుంటారు. ఆడియన్స్ ఉంటారు. ప్రొడ్యూసర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లుంటారు. వాళ్ళంతా హ్యాపీయే!... టెన్షన్ అంతా అభిమానులది. కటౌట్లు పెట్టాల... దండలు వెయ్యాల... అభిషేకాలు చెయ్యాల... సమ్‌టైమ్స్... ప్రాణాల మీదకు తెచ్చుకోవాల... ఇవన్నీ హీరోలకు కల్ట్ ఇమేజ్ తెచ్చిపెట్టాయ్. గవర్నమెంట్ పందెంరాయుళ్ళపై ఆంక్షలు విధించవచ్చు. పందెంకోళ్ళను జైళ్ళలోనూ పెట్టవచ్చు. కానీ, ఈ అభిమాన పందెంపై కంట్రోలు ఏ ప్రభుత్వం మాత్రం పెట్టగలదు? దిస్ స్టోరీ ఈజ్ బిగ్గర్ దేన్ టూ మూవీస్టోరీస్! రెండు సినిమాల కన్నా గొప్ప డ్రామా ఉన్న స్టోరీ! చదవండి. ఇది వెండితెర మహా సంగ్రామం... సంక్రాంతి ... థియేటర్లలో జరుగుతున్న సినిమా కోడి పందెం... ఒకరు మెగా స్టార్... మరొకరు నందమూరి యుగా స్టార్... ఒకరిది (హీరోగా) 150వ సినిమా... ఇంకొకరిది 100వ సినిమా... ఒకరిది తమిళ సూపర్ హిట్ కథ... ఇంకొకరిది తెలుగు జాతి యోధుడి జీవితం... ఒకరేమో శక్తిపీఠాల్లో పూజలు, మరొకరు ఆలయాల్లో అభిషేకాలు... ఎవరూ తగ్గేది లేదు... ఎక్కడా తలొగ్గేది లేదు... అందుకే... తెలుగు సినీ జనంలో... ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్... ‘ఖైదీ నంబర్ 150’ వర్సెస్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’... చిరంజీవి సిన్మా వర్సెస్ బాలకృష్ణ సిన్మా.. సంక్రాంతి సీజన్లో... మరికొన్ని సినిమాలు బరిలోకి వస్తున్నా... ఈ ‘స్టార్ వార్స్’ పైనే అందరి దృష్టి. కథ కోసం కసరత్తులు బాస్ ఈజ్ బ్యాక్ కెరీర్లో మైలురాళ్ళ లాంటి ఈ సినిమాలు చేయడానికి సరైన కథల కోసం స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చాలా కసరత్తులే చేశారు. కొన్నేళ్ళపాటు ఊరించి, పరుచూరి బ్రదర్స్‘ఉ య్యాలవాడ నరసింహారెడ్డి’ స్క్రిప్ట్ దగ్గర నుంచి పూరీ జగన్నాథ్ ‘ఆటో జానీ’ దాకా వందల కథలు విన్న చిరంజీవి చిట్టచివరికి తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన హిట్ ‘కత్తి’ (2014) రీమేక్‌కు జెండా ఊపారు. అదీ కుమారుడు రామ్‌చరణ్ నిర్మాతగా తొలి యత్నం కావడం విశేషం. గతంలో ‘ఠాగూర్’(తమిళ ‘రమణ’కి రీమేక్)తో విజయం అందించిన వినాయక్‌కు దర్శకత్వ బాధ్యతలు అందించారు. తెలుగు వాడి పౌరుషం హీరోగా 100వ సినిమాకు బాలకృష్ణ చాలా స్క్రిప్ట్‌లు విన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్‌మిషన్ కాన్సెప్ట్‌తో పాతికేళ్ళ క్రితం వచ్చిన ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా‘ఆదిత్య 999’ స్క్రిప్ట్‌కు ఓకే చెప్పారు. కుమారుడు మోక్షజ్ఞనీ దాంతో తెరంగేట్రం చేయాలని ఊగారు. తర్వాత రైతుల కష్టాన్ని ప్రతిబింబించే ‘రైతు’ కథ నచ్చి, కృష్ణవంశీ దర్శకుడిగా దాదాపు ఖరారు చేశారు. అదే టైమ్‌లో దర్శకుడు క్రిష్ వచ్చి, తల్లి పేరును తన పేరు ముందుపెట్టుకొన్న చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఏకధాటిన 2 గంటలు చెప్పారు. విని 24 గంటలైనా గడవక ముందే ఇదే నూరో సినిమాకు కరెక్ట్ అని బాలయ్య అటు మొగ్గారు. ఇంతకీ... కథేంటి? మెగా రీమేక్ బేసిక్‌గా ఇది తమిళ ‘కత్తి’ చిత్రానికి రీమేక్. కాకపోతే, తెలుగు నేటివిటీ, చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ సహా పలువురు కలసి, స్క్రిప్ట్‌కు మార్పులు చేశారు. కార్పొరేట్ సంస్థల దురాక్రమణలతో ఉపాధి కోల్పోయి, దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలకు పాల్పడడమనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. చూడడానికి ఒకేలా కనిపించే రైతుల కోసం పోరాడే ప్రగతిశీలవాది జీవానందంగా, అల్లరి చిల్లరిగా ఉండే ఖైదీ కదిరేశన్ అలియాస్ కత్తిగా రెండు పాత్రలూ తమిళ్లో విజయ్ చేశారు. జీవానందం గాయపడగా, అతని స్థానంలోకి కత్తి వెళ్ళి రైతుల పక్షాన పోరాడతాడు. హిస్టరీ రిపీట్స్ చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉన్న భారతావనిని ఒకే ఏలుబడికి తెచ్చిన తొలి భారతీయ చక్రవర్తి, తెలుగు యోధుడి కథ ఇది. దర్శకుడు క్రిష్ లభిస్తున్న కొద్దిపాటి చరిత్ర ఆధారాల్నీ తీసుకొని, ఊహ జోడించి, స్క్రిప్ట్ చేసుకున్నారు. క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన ఈ తెలుగు యోధుడి కథను 1900 ఏళ్ళ తరువాత ఇప్పుడు తెర మీదకు తెస్తున్నారు. శాతకర్ణి జీవితంలో తల్లి ఎంతటి కీలకపాత్ర వహించిందో, భార్యాబిడ్డల కన్నా దేశాన్ని ఒక్క తాటి మీదకు తేవాలన్న ఆకాంక్షకే అతనిచ్చిన ప్రాధాన్యం ఏమిటో ఈ కథ చెబుతుంది. అయితే, ఈ చిత్రం శాతకర్ణి విజయగాథలకే పరిమితం.పూర్తి జీవితం చూపడం లేదు. ముసురుకున్న వివాదాలు కథ ఎవరిది?: తమిళ ‘కత్తి’ సినిమా ఒరిజినల్ కథ తనదేననీ, పేరు, డబ్బులు – ఏమీ ఇవ్వకుండా ఆ కథను అడ్డంగా వాడేసుకున్నారనీ దర్శక – రచయిత ఎన్. నరసింహారావు వీధికెక్కారు. ఆ కథ ఒరిజినల్‌గా నరసింహారావు రిజిస్టర్ చేసుకున్న స్క్రిప్ట్లోదేనని ‘రచయితల సంఘం’ కమిటీ కూడా తేల్చింది. తమిళ దర్శక, నిర్మాతల నుంచి డబ్బుల వ్యవహారం తేలే లోగానే, ‘కత్తి’ని చిరంజీవి రీమేక్ చేస్తున్నారనే వార్తతో కాపీరైట్ వివాదాన్ని మళ్ళీ ఫిల్మ్‌నగర్‌లో గుప్పుమనిపించారు. అలా ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ కన్నా ముందే వార్తల్లో నిలిచింది. నో పర్మిషన్: ‘ఖైదీ నంబర్ 150’ ట్రైలర్ కమ్ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కు విజయవాడలో అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ మరో వివాదం రేగింది. నిజానికి, మొదట డిసెంబర్ ఆఖరులో విజయవాడలోని మునిసిపల్ స్టేడియమ్లో చిత్ర ఆడియో ఫంక్షన్ జరపాలనుకొని, ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాతలు ‘శాతకర్ణి’ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ ఫంక్షన్నే రద్దు చేసుకొన్నారు. తీరా సినిమా రిలీజ్‌కు పట్టుమని వారం రోజులైనా లేక ముందు ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం పెట్టుకొన్నారు. అయితే, ఆ ఫంక్షన్‌కు స్టేడియమ్లో అధికారపక్షం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వడం లేదని చిరు అభిమాన వర్గం ఆరోపించింది. అధికారులు మాత్రం మునిసిపల్ స్టేడియమ్‌లను, బయటి ఫంక్షన్లకివ్వరాదంటూ ఉమ్మడి రాష్ట్ర కాలంలో వచ్చిన జీవో వల్లే అనుమతులు ఇవ్వడం లేదంటూ సన్నాయినొక్కులు నొక్కారు. చివరకు చిరు వర్గం తమ వేదికను బెజవాడ – గుంటూరు మధ్యకు మార్చి, కార్యక్రమం శనివారం చేసింది. ఎవరు లెజెండ్? డేట్ ముందుకు మార్చుకొని, జనవరి 11న రిలీజ్‌కు వచ్చిన ‘ఖైదీ...’ వర్గం ‘ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకే రోజు రావడం మంచిది కాదని నాన్న (చిరంజీవి) గారన్నారు’ అంటూ తెలివిగా ప్రకటించింది. అలా పోటీ సినిమా సేమ్ డే రిలీజ్‌కి రాకుండా, ముందరి కాళ్ళకి బంధం వేసింది. ఈ పరిస్థితుల్లో రకరకాల ఒత్తిళ్ళ మధ్య జనవరి 3వ తేదీ రాత్రి పొద్దుపోయాక, క్రిష్ సైతం పోటీ సినిమాకు స్నేహహస్తం చాపుతూ, ‘‘ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ తమ మైలురాళ్ళ లాంటి సినిమాలతో వస్తున్నారు... స్వాగతిద్దాం’’ అని ట్వీట్ చేశారు. కానీ, ఇరు వర్గాల అభిమానులూ ఎవరికి వారు ‘మా హీరో తప్ప మరొకరు లెజెండ్ ఎలా అవుతారు’ అంటూ బుస కొట్టారు. సోషల్ మీడియాలో విషం కక్కారు. అంత మాటంటారా? ఖబడ్దార్! డిసెంబర్ 26న తిరుపతిలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, దర్శకుడు క్రిష్ మాటల ఉరవడిలో ‘సంక్రాంతికి వస్తున్నాం. ఖబడ్దార్’ అనే పదప్రయోగం చేయడం వివాదమైంది. అది చిరు వర్గాన్ని ఉద్దేశించి అన్న మాటలుగా సోషల్ మీడియాలో ప్రచారమైంది. దానికి తోడు ‘అన్నయ్య’ కోసం మెగా బ్రదర్ నుంచి వచ్చిన వరుస ఫోన్‌కాల్స్! ఒకరికి నలుగురు హీరోలు చేతిలో ఉన్న మెగా ఫ్యామిలీతో వ్యవహారం కావడంతో, ఈ ఉక్కిరిబిక్కిరి మధ్య, క్రిష్ మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధం, అపార గౌరవం గురించి వివరణ ఇవ్వాల్సొచ్చింది. సోషల్ మీడియాలో వార్ ! బాలకృష్ణ సినిమా వస్తున్న రోజున అసలు బయటకే రావద్దంటూ ఎగతాళి వాట్సప్ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా తిరిగింది. మరోపక్క, చిరంజీవి సిన్మాలో ‘అమ్మడు... కుమ్ముడు’ లాంటి మరీ మాస్ పాట ఏమిటని నెట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ‘ట్రాలింగ్’లను పక్కన పెడితే, ‘మా టీజర్, ట్రైలర్ లుక్కు ఇన్ని లక్షల వ్యూస్ వచ్చాయి’ అని మొదట ఒక సిన్మా వారు ప్రకటించారు. మా పాటనీ అంతమంది చూశారంటూ మరొక సినిమావారు అంతకన్నా పెద్ద అంకెలతో, పోటీ ప్రకటన చేశారు. ఇలా ప్రకటనలతో పోటాపోటీలు పడుతున్నారు. మీడియాలో స్టార్ వార్ చూసి, హద్దు మీరినా, బ్యానర్లు చింపినాlచర్య తప్పదని ఏపీ రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. హాళ్ళ వద్ద బందోబస్తు పెట్టారు. అందరూ సర్ప్రైజ్ అవుతారు! – ‘ఖైదీ...’ దర్శకుడు వినాయక్ ⇔ తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవినెలా చూపిస్తున్నారు? వినాయక్: సినిమా రిలీజయ్యాక చూస్తే, అసలు ఆ తొమ్మిదేళ్ళ గ్యాపూ చెరిగిపోతుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, దాదాపు 20 ఏళ్ళ క్రితం ‘చూడాలని ఉంది’ (1998) టైమ్‌లో ఎలా ఉన్నారో, అలా అనిపిస్తారు చిరంజీవి. ఆయనను చూసి అందరూ సర్ప్రైజ్ అవుతారు. నో డౌట్. ఆయన డ్యాన్స్‌లు, ఫైట్లు చూసి అదిరిపోతారు. ⇔ ఇది తమిళ ‘కత్తి’కి రీమేక్ కదా! మరి తెలుగులో...? చాలా మార్పులు చేర్పులు చేశాం. అక్కడ యువ హీరో విజయ్ కోసం, అతని ఇమేజ్‌కి తగ్గట్లుగా చేసిన స్క్రిప్ట్ ఇది. దాన్ని మన తెలుగు నేటివిటీకీ, ‘అన్నయ్య’ బాడీ లాంగ్వేజ్‌కీ తగ్గట్లు మార్చడం కోసం సమష్టిగా కృషి చేశాం. ⇔ ‘ఠాగూర్’ లానే ‘ఖైదీ నంబర్ 150’లో కూడా సామాజిక సమస్యను ప్రస్తావించినట్లున్నారు! ఏ బాధ్యతా లేని ఒక వ్యక్తి – ఒక ఊరిలో ఒక రైతుకు జరిగిన అన్యాయం తెలుసుకొని కదిలిపోతాడు. ‘నేను వీళ్ళ కోసమే బతకాలి’ అని నిర్ణయించుకొని, ఆ దిశలో చేసే అలుపెరుగని పోరాటం చిత్ర కథ. రైతు సమస్య, నీటి సమస్య లాంటి అంశాలెన్నో వస్తాయి. ⇔ రైతు గురించి వచ్చే ‘నీరు నీరు నీరు...’ పాట ఇవాళ మీడియాలో హాట్‌టాపిక్ అయినట్లుంది! చాలా మంచి పాట అది. దేవిశ్రీ సంగీతం, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం, శంకర్ మహదేవన్ గానం – అద్భుతం. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుందీ పాట. ⇔ చిరంజీవి కమ్‌బ్యాక్ ఫిల్మ్ వరమాల ఎందరినో దాటి మీ మెడలో పడినప్పుడు ఏమనిపించింది? చిరంజీవి గారు పిలిచి, ‘కత్తి’ సినిమా తెలుగులో చేద్దామన్నారు. వెంటనే ఆ దృష్టితో సినిమా చూశాను. చూస్తుండగా నా మనసులో తిరిగిన ఆలోచనలు, మార్పులు చేర్పులతో – నాదైన పద్ధతిలో ఆయనకు కథను నేరేట్ చేశాను. నా అప్రోచ్ నచ్చి, చేసేద్దామన్నారు. ∙మీకు ఈ సినిమా పెద్ద ఎఛివ్‌మెంట్. మరి, ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే, ‘ఠాగూర్’లో ఉన్న నిజాయతీ, ‘రౌడీ అల్లుడు’లోని కామెడీ, ‘ఇంద్ర’లోని పాటలు – ఇవన్నీ కలిసే ఒకే సినిమాలో ఉంటే? అదే – ‘ఖైదీ నంబర్ 150’! ⇔ అంచనాలతో పాటు సినీ పోరాటమూ భారీగానే ఉంది! మరి, టార్గెట్... అంచనాలన్నీ అందుకుంటాం. ఇంకా చెప్పాలంటే, అధిగమిస్తాం. సినిమా సూపర్ హిట్. చరిత్రలో గౌతమీపుత్ర శాతకర్ణి -– ‘...శాతకర్ణి’ చిత్ర దర్శకుడు క్రిష్ చరిత్రలోకి వెళితే, శాతవాహనులు తెలుగు వారు. ఇప్పటి తెలంగాణ ప్రాంతంలోని కోరులింగాల (కోటి లింగాల) నుంచి తెలుగు ప్రాంతంతో పాటు భారత భూభాగాన్నే ఏలినవారు. ఆ వంశానికి వన్నె తెచ్చిన చక్రవర్తి – గౌతమీపుత్ర శాతకర్ణి. క్రీ.శ. 78 –102 (కొందరు 60 నుంచి 90 దాకా అంటారు) మధ్య పరిపాలన సాగించిన గౌతమీపుత్ర శాతకర్ణి నిజానికి శాతవాహన వంశంలో ఏ రాజూ సాధించనన్ని విజయాలు సాధించాడు. శత్రువులైన శకులు, పల్హవులు, యవనులను (గ్రీకులు) జయించి, జంబూద్వీపాన్ని (భారతభూభాగానికి పురాణనామం) పరాయి పాలన నుంచి విముక్తం చేసిన అరుదైన చక్రవర్తి. తాత, ముత్తాతలు కోల్పోయిన భూభాగాలనే కాక, కొత్త భూభాగాలను జయించి, సువిశాల సామ్రాజ్యంగా విస్తరించాడు. అలా మూడు సముద్రాల పర్యంతం తన ఆధిపత్యాన్ని స్థాపించి, ‘త్రిసముద్ర తోయ పీతవాహన’ (మూడు సముద్రాల నీళ్ళు తాగిన గుర్రాన్ని వాహనంగా కలవాడా) అనే బిరుదు పొందాడు. తన బొమ్మను ముద్రించిన వెండి నాణాలను విడుదల చేసిన మొదటి భారతీయ చక్రవర్తి అతనే! పేరుకు ముందు తల్లి (గౌతమీ బలసరి/బాలాశ్రీ) పేరు చేర్చుకొన్న తొలి భారతీయుడూ అతనే! కొత్త యుగానికి ఆదిగా ‘యుగాది’ (ఉగాది, మహారాష్ట్రలో ‘గుడీ పడవా’) ఆయన మొదలు పెట్టిందనే అంటారు. శాలివాహన శకమనే కొత్త శకాన్ని స్థాపించి, కాలాన్ని మలుపు తిప్పిందీ ఈయనే అని కొందరి భావన. చిన్నతనంలో మా తాతయ్య గారి ఊరికి వెళ్ళినప్పుడు అమరావతి చాలాసార్లు చూశా. అమరావతి రాజధానిగా పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ లీలగా విన్నా. కొన్నేళ్ళుగా ఈ కథ నా మనసు తొలిచేస్తోంది. మన తెలుగు వాడి కథ మనకి కూడా తెలియకపోవడం కోపం వచ్చింది. 2013 నుంచి ముంబైలో ఉన్నప్పుడు ఆ చరిత్ర మరింత తెలిసింది. ఇది అందరికీ చెప్పాల్సిన కథ అనిపించింది. అందుకే, ఈ సినిమా తీశా. సినిమా తీస్తున్నంత సేపూ ఏదో అదృశ్యశక్తి నా వెంట ఉండి నడిపింది. ఇది నిజం. రిలీజ్ దోబూచులాట.. రచ్చ నిజానికి, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం 2016 ఏప్రిల్ ప్రారంభమైనప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ 2017 జనవరి 12న రిలీజ్ చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. అయితే, చారిత్రక నేపథ్యం, యుద్ధ సన్నివేశాలున్న భారీ చిత్రం తీయడం కాబట్టి, అది జరిగేపని కాదని పరిశ్రమ వర్గీయులు, ప్రత్యర్థి చిత్రాలవాళ్ళు పెదవి విరిచారు. వాళ్ళ అంచనాల్ని తలకిందులు చేస్తూ, రికార్డు టైమ్‌లో చిత్ర యూనిట్ సినిమా పూర్తి చేసింది. ఇలా ఉండగా, ‘శాతకర్ణి’ ప్రారంభమైన రెండు నెలల తర్వాత 2016 జూన్ 23న చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ మొదలైంది. దాన్ని కూడా సంక్రాంతికే జనవరి 13న రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు మొదట ప్రకటించారు. అయితే, తీరా రెండు సినిమాలూ షూటింగ్ పూర్తి చేసుకొని, రిలీజ్‌కు దగ్గర పడుతుండేసరికి రచ్చ మొదలైంది. కలిసొచ్చిన ‘నరసింహనాయుడు’ రిలీజ్ డేట్ జనవరి 11కే ఈ సినిమానూ రిలీజ్ చేయాలంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తూ వచ్చారు. అందుకు, దర్శక, నిర్మాతలు కూడా సరేనంటూ, బాక్సాఫీస్ వద్ద ప్రత్యర్థుల వ్యూహాల్ని బట్టి, తుది రిలీజ్ డేట్ ప్రకటిద్దామని కూర్చున్నారు. ఆడియో రిలీజ్ వేదికపైనా డేట్ చెప్పనిది అందుకే! అయితే, ఇంతలో ‘ఖబడ్దార్’ పదప్రయోగంపై వివాదం క్రిష్‌ను చుట్టుముట్టింది. ఒక ఏరియా ‘శాతకర్ణి’ రిలీజ్లో భాగస్థుడూ, చేతిలో పలు థియేటర్లూ ఉన్న ఒక అగ్ర నిర్మాత మధ్యవర్తిగా రంగప్రవేశం చేశారు. ఆ నిర్మాత తమ్ముడితో నెక్స్›్ట సినిమా చేయడానికి సిద్ధమవుతున్న ‘శాతకర్ణి’ దర్శక, నిర్మాతలతో జనవరి 12న ‘శాతకర్ణి’ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన కమిట్ చేయించారు. ఆ ప్రకటన వచ్చాక, పోటీ నివారించడానికి ఒక రోజు ముందే జనవరి 11న చిరు సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ ఆ చిత్ర నిర్మాత – హీరో రామ్‌చరణ్ ప్రకటించారు. దాంతో, రిలీజ్ డేట్ విషయంలో అగ్ర నిర్మాతతో కుట్ర చేయించారని బాలకృష్ణ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పూజలు, అభిషేకాలు, జెండా పండగలకే తప్ప, సిన్మా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం దర్శక – నిర్మాతలు తమ కన్నా, ప్రత్యర్థి చిత్ర వర్గీయుల మాటకే తలొగ్గారంటూ విమర్శించారు. జనవరి 5, గురువారం నాడు వంద మంది దాకా అభిమానులు సాక్షాత్తూ హైదరాబాద్‌లోని ‘శాతకర్ణి’ చిత్ర ఆఫీసుకు వెళ్ళి, జనవరి 11నే తమ హీరో సిన్మా రిలీజ్ చేయాలంటూ ఆందోళన చేయడం కొసమెరుపు. కానీ, చివరకు జనవరి 12నే ‘శాతకర్ణి’ రిలీజ్ చేయాలని దర్శక,నిర్మాతలు ఖరారు చేసేశారు. ఒక్క రోజు ముందొస్తే... 10 కోట్లు! ఒక రోజు ముందు రిలీజ్ కావడం వల్ల అత్యధిక థియేటర్లు అందుబాటులో ఉండి, రికార్డు కలెక్షన్లకు వీలు చిక్కుతుంది. తమ హీరో గొప్ప అంటే, తమ హీరో గొప్ప అనుకొనే ఫ్యాన్స్‌కూ, బాక్సాఫీస్ రికార్డులే ప్రమాణం అనుకొనే సినీజీవులకూ, నంబర్ వన్ స్థానంపై కన్నేసిన తారలూ రిలీజ్ డేట్‌పై పట్టుపట్టేది అందుకే! ‘మా సినిమా అన్ని వేల థియేటర్లలో రిలీజ్, ఇన్ని వేల థియేటర్లలో హంగామా’ అని కొందరు సినిమావాళ్ళు చెబుతుంటారు కానీ, వాస్తవాలు వేరు. ఉన్న థియేటర్లెన్ని? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1650 చిల్లర థియేటర్లే (మల్టీప్లెక్స్‌లలోని స్క్రీన్స్ కూడా కలిపి) ఉన్నాయి. ఇక, తమిళనాడు, కర్ణాటక, విదేశాల్లో క్రేజీ తెలుగు సినిమాలకు అందుబాటులో ఉండేవి కూడా కలుపుకొన్నా, మహా అయితే, 2 వేల స్క్రీన్స్‌కు మించవు. ఆర్భాటపు కబుర్లను పక్కనపెట్టి, అసలు లెక్కల్లోకి వెళితే – థియేటర్లపై పట్టున్న ‘దిల్’ రాజు ‘శతమానం భవతి’కి దాదాపు 250 థియేటర్లు, ఆర్. నారాయణమూర్తి ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’కు సుమారు 50కి పైగా థియేటర్లు ఈ సంక్రాంతికి అందుబాటులో ఉంటాయని అంచనా. ఇక, మిగిలిన 1700 స్క్రీన్స్నే చిరు, బాలయ్య సిన్మాలు పంచుకోవాలి. వీటిలో ‘గీతా ఆర్ట్స్’ పట్టు మూలంగా సుమారు 900 దాకా స్క్రీన్స్ చిరు సిన్మాకీ, 800 దాకా స్క్రీన్స్ బాలయ్య సిన్మాకొస్తాయని అంచనా. అయితే, ‘శాతకర్ణి’ కన్నా ఒక రోజు ముందే చిరు సిన్మా రిలీజ్ వల్ల ఆ ఒక్కరోజుకీ, ‘శాతకర్ణి’ సిన్మాకు దక్కాల్సిన స్క్రీన్స్‌లో అధిక భాగం కూడా లభించడం ‘ఖైదీ నం. 150’కి ఎడ్వాంటేజ్ అవుతుంది. అలా ప్రత్యర్థి సిన్మా కన్నా ముందు రావడం వల్ల థియేటర్లన్నీ చేతిలో ఉండి, ఆ ఒక్క రోజులో దాదాపు 7 నుంచి 10 కోట్ల మేర ఓపెనింగ్ కలెక్షన్స్ అదనంగా వస్తాయి. ఆ ఎడ్వాంటేజ్ కోసం ‘ఖైదీ నం. 150’ వ్యూహం వేస్తే, అది లేకుండా రెండు సిన్మాలూ ఒకే రోజు వచ్చి, బాక్సాఫీస్ బలపరీక్షకు నిలబడాలని ‘శాతకర్ణి’ అభిమానులు కోరుకున్నారు. అందుకే, జనవరి 11నే ‘శాతకర్ణి’నీ రిలీజ్ చేసెయ్యమంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒత్తిడి చేశారు. నైజామ్‌లో... ఎత్తులు పై ఎత్తులు సినీ వ్యాపారంలో మొదటి నుంచి నైజామ్ ఏరియాది ప్రధాన వాటా. ఒకప్పుడు అది చిరంజీవి సినిమాలకు కంచుకోట. తాజా పోటీ వాతావరణంలోనూ మంచి రెవెన్యూ తెచ్చే ఆ ఏరియాపై పట్టు కోసం రెండు వర్గాలూ వ్యూహ ప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. ‘ఖైదీ...’ చిత్ర నిర్మాతలు ఒక అడుగు ముందుకేసి, నైజామ్ ఏరియాలో సినిమాను అమ్మకుండా, అలాగని సొంతంగా కాకుండా, చాలా థియేటర్స్ చేతిలో ఉన్న ‘గ్లోబల్’ డిస్ట్రిబ్యూటర్స్ సునీల్ నారంగ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్కిచ్చారు. నిజానికి, ‘గ్లోబల్’లో భాగస్వామి అయిన నిర్మాత ఎన్. సుధాకరరెడ్డే ‘శాతకర్ణి’ని ఆ ఏరియాకు కొన్నారు. కానీ, ఇప్పుడు ‘ఖైదీ...’ డిస్ట్రిబ్యూషన్‌కి గ్లోబల్ ఒప్పుకోవడంతో, రెండు సినిమాలకూ హాళ్ళను సర్దుబాటు చేయక తప్పదు. ఆ రకంగా ‘ఖైదీ...’ వ్యూహంతో నైజామ్‌లో ‘శాతకర్ణి’కి హాళ్ళ సంఖ్యలో గండి పడనుంది. ఊరికొక్క థియేటరైనా ఇవ్వండి బాబూ! ప్రముఖ పంపిణీదారు, థియేటర్ల లీజుదారు కావడంతో, ‘దిల్’ రాజు సినిమాకు మల్టీప్లెక్స్‌ల నుంచి మామూలు థియేటర్ల దాకా తగినన్ని స్క్రీన్స్ దొరుకుతాయి. అయితే, ఎటొచ్చీ ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ లాంటి చిన్న సినిమాలకే పెద్ద తలనొప్పి. థియేటర్లన్నీ ఈ స్టార్ల వార్తో నిండిపోవడంతో, ‘పీపుల్స్ స్టార్’ ఆర్. నారాయణమూర్తికి థియేటర్లే లేని పరిస్థితి. ‘‘ఇలా అయితే చిన్న సినిమాలు ఎలా బతుకుతాయి? కనీసం ఊరికొక్క థియేటరైనా ఇవ్వండి బాబూ’’ అని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బిజినెస్ అదుర్స్! చిరంజీవి హీరోగా, ఆయన కుమారుడే నిర్మాతగా వస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ను 86 డేస్‌లో పూర్తి చేశారు. నిర్మాణ వ్యయం 40 కోట్ల పైమాటే కావచ్చని అంచనా. తొమ్మిదేళ్ళ తరువాత వస్తున్న చిరంజీవి సిన్మా కావడంతో, భారీ క్రేజ్ ఉంది. హక్కులు తీసుకున్నవారిలో ఎక్కువమంది కొత్తవాళ్ళు, రోజువారీ‡ సినీ వ్యాపారంతో సంబంధం లేనివాళ్ళేనని భోగట్టా. గుంటూరు, నెల్లూరు, తూర్పు గోదావరి ఏరియాలు సొంత మనుషులతో రిలీజ్ చేసుకుంటున్న నిర్మాతలు వైజాగ్, సీడెడ్ ప్రాంతాల హక్కుల్ని తమకు అత్యంత సన్నిహితులైన ఆ ప్రాంత రాజకీయ నేతలకూ (గంటా శ్రీనివాసరావు, సి. రామచంద్రయ్య), వారి బంధువులకూ ఇచ్చారట. ఇవి కాక, కర్ణాటక, శాటిలైట్ రైట్స్ (‘మా’టి.వికి రూ. 10.5 నుంచి 12 కోట్లకి) అమ్మారు. అన్నీ కలిపి రూ. 50 కోట్ల పైగా అయింది. ఇక రూ. 25 కోట్ల పైగా విలువైన కృష్ణా, నైజామ్, ఓవర్సీస్– నిర్మాతలే అట్టిపెట్టుకొని, సొంత రిలీజ్ చేస్తున్నారట. అన్నీ చేరి, రూ. 75 కోట్ల పైగా లావాదేవీలు జరిగినట్లు లెక్క. రికార్డు టైమ్‌లో 85 రోజుల్లో షూటింగ్ పూర్తి అయిన బాలకృష్ణ చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి దాదాపు రూ. 40 కోట్ల పైగా వ్యయమైనట్లు భోగట్టా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ హక్కులు హాట్‌కేక్స్‌లా అమ్ముడవడంతో, సుమారు రూ. 60 కోట్లకు పైగా వ్యాపారమైంది. అలా ఏకంగా రూ. 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. హీరోల సొంత సంస్థలు కాక, బయటి నిర్మాత సిన్మాకింత టేబుల్ ప్రాఫిట్ రావడం ఇటీవల లేదని సినీ వర్గాల మాట. శాటిలైట్ రైట్లే రూ.8.5 కోట్లు (‘మా’ టివి) పలికాయి. ఇంకా తమిళ, హిందీ చిత్రాల థియేటరికల్ రైట్స్‌తో అదనపు ఆదాయం వచ్చే ఛాన్సుంది. ష్... సెన్సార్ అవుతోంది! ఇంటిపేరుతో కొత్తగా పెట్టిన ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం విడుదలకు చాలా ముందే, డిసెంబర్ 29నే సెన్సార్ పూర్తి చేసుకుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం – సినిమాలో ఫస్టాఫ్ ప్రధానంగా వినోదాత్మకం. ఆడవేషంలో అలీ, బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్లు వస్తాయి. సెకండాఫ్‌లో కథలో అసలు ఘట్టం సాగుతుంది. ‘రైతు’పై వచ్చే పాట కన్నీరు పెట్టిస్తుంది. ఆరు పదులు దాటిన వయసులోనూ చిరు నవ యువకుడిలా తయారై చేసిన ఇంటర్వెల్ ఫైట్, 2 పాటలకు డ్యాన్సులు అదిరిపోయాయి. మొత్తం మీద 9 ఏళ్ళు గ్యాప్ తర్వాత, ‘యస్... బాస్ ఈజ్ బ్యాక్’ అని అభిమానులు కేరింతలు కొట్టేలా సినిమా ఉందని సెన్సార్ టాక్. ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చిన ఈ సినిమా తుది నిడివి 2 గంటల 27 నిమిషాలు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 5న సెన్సార్ జరుపుకొంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ‘సిన్మా బ్రహ్మాండం సార్! ఇంతలా ఉంటుందని ఊహించలేదు’ అన్నారట. అభిజ్ఞ వర్గాల కథనం ప్రకారం – హీరో పాత్రచిత్రణ, యుద్ధ సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఎపిసోడ్ సూపర్. సినిమా ముగింపు సమయంలో హీరో చెప్పే డైలాగులు, ‘ఇది మన కథ... ప్రతి తెలుగువాడి కథ...’అంటూ నేపథ్యం నుంచి వచ్చే మాటలు సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధంగా నిలబెట్టేస్తాయి. యుద్ధాలే కాక, కర్తవ్యానికీ, కుటుంబ బంధానికీ మధ్య నలిగిపోయే ఒక చక్రవర్తి కథగా ఎమోషన్ సీన్లూ పండాయి. బుర్రా సాయిమాధవ్ డైలాగ్‌లు, సీతారామశాస్త్రి పాటలు, బాలకృష్ణ డైలాగ్ డెలివరీ – అన్నీ కలిసి, ప్రేక్షకులు మీసం తిప్పేలా ఉందీ సినిమా అని సెన్సార్ టాక్. సెన్సారైన రోజు సాయంత్రానికే పరిశ్రమలో దీనిపై ఒకటే చర్చ. రెండు చోట్ల డైలాగుల్లో చిన్న చిన్న సవరణలతో ‘యు/ఏ’ సర్టిఫికెట్ వచ్చిన ఈ సినిమా తుది నిడివి 2 గంటల 14 నిమిషాలే! అప్పుడూ ఇలాగే... బాక్సాఫీస్ యుద్ధం సంక్రాంతి సీజన్లో థియేటర్ల బరిలో ఇలా చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు ఢీ అంటే ఢీ అనుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1987లో తొలిసారిగా చిరు ‘దొంగమొగుడు’ (జనవరి 9), బాలయ్య ‘భార్గవరాముడు’ (జన. 14) సంక్రాంతి పందెం కోళ్ళయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా గత 30 ఏళ్ళలో – ఏడుసార్లు ఇలాంటి పోటీ జరిగింది. ‘ఖైదీ నంబర్ 150’ వర్సెస్ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎనిమిదోసారి జరుగుతున్న పోటాపోటీ. ఈ 30 ఏళ్ళలో ఇద్దరి సినిమాలూ ఒకే తేదీన రిలీజైంది ఒక్క 2001లోనే! అదీ సంక్రాంతికే! ఆ తరువాత మరెప్పుడూ ఒకే తేదీకి వాళ్ళ చిత్రాలు పోటీ పడలేదు. గడచిన 7 సార్లలో ఇప్పటి దాకా 3 సార్లు (‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘లక్ష్మీనరసింహా’ – ఈ మూడూ కూడా 70కి పైగా కేంద్రాల్లో వంద రోజులాడాయి) బాలకృష్ణ పైచేయి సాధించారు. మరో రెండుసార్లు (‘అన్నయ్య’, ‘దొంగమొగుడు’) చిరంజీవిదే అగ్రస్థానం. మిగతా రెండుసార్లు (‘మంచిదొంగ’– ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’, ‘హిట్లర్’–‘పెద్దన్నయ్య’) ఇద్దరు హీరోలూ బాక్సాఫీస్ వద్ద సమానంగా నిలిచారు. ఎన్నెన్నో హైలైట్స్... ఎవరికీ అందని అంచనాలు! ‘నచ్చిందే చేస్తా’నంటున్న ఖైదీ నంబర్ 150 ⇔ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న చిరంజీవి చిత్రంలో అభిమానులకు కన్నులపండువ కోసం చాలా హంగామానే చేస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఎన్ని కసరత్తులతో ఏం మాయ చేశారో కానీ, తెరపై కనీసం 20 ఏళ్ళు తగ్గినట్లు కనిపిస్తున్నారు. దీని కోసం దాదాపు ఏడాది పాటు శ్రమించినట్లు సాక్షాత్తూ చిరంజీవే ‘సాక్షి’కి చెప్పారు. ⇔ ఒకప్పుడు ఫైట్లు, డ్యాన్సులకు ఫేమస్ అయిన చిరు మళ్ళీ ఆ ఊపు తరహా మాస్ పాటలు, బీట్స్‌కు నర్తించినట్లు అభిజ్ఞ వర్గాల భోగట్టా. ⇔ రామ్‌చరణ్ నటించిన ‘మగధీర’, ‘బ్రూస్లీ’ చిత్రాల్లో తండ్రి చిరంజీవి గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తే, ఈసారి తండ్రి కమ్‌బ్యాక్ సినిమాను రామ్‌చరణ్ నిర్మించడమే కాక, ‘అమ్మడు’ పాటలో కొద్ది క్షణాలు కనిపించనున్నారు. ⇔ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ‘ఖైదీ నంబర్ 150’లో తండ్రి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి, సై్టలిస్ట్‌గా వ్యవహరించారు. ⇔ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్ పరిసరాల్లో చేశారు. పాటల కోసం ప్రత్యేకంగా స్లొవేనియా, క్రొయేషియా దేశాలకు వెళ్ళి, చిత్రీకరణ జరిపారు. ∙ఫస్టాఫ్ సరదాగా ఉంటే, సెకండాఫ్‌లో దాదాపు 45 నిమిషాలు ఎమోషనల్‌గా పీక్కు చేరుస్తుందని చిత్ర యూనిట్ కథనం. నీటి కోసం కన్నీరు కార్చే రైతుల వెతల్ని చూపే రామజోగయ్య శాస్త్రి రచన ‘నీరు నీరు నీరు... రైతు కంట నీరు...’ పాట కదిలిస్తుందని అంచనా. ‘శరణమా... రణమా’ అంటున్న శాతకర్ణి ⇔ తెలుగు జాతి చరిత్ర చెప్పే చారిత్రక కథ కావడం, ఇలాంటి పాత్రలకు నప్పే హీరో బాలకృష్ణకు 100వ సినిమా కావడం ‘శాతకర్ణి’లో విశేషం. ⇔ తెలుగులో ఎన్టీఆర్ ‘పాండవ వనవాసం’– 1965, ‘శ్రీకృష్ణ విజయం’ –1971లో నటించిన హేమమాలిని 46 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు తెరపైకి వచ్చారు. తండ్రి ఎన్టీఆర్‌తో నటించిన డ్రీమ్ గర్ల్ ఇప్పుడు కుమారుడు బాలకృష్ణకు తల్లిగా చేశారు. ⇔ చరిత్ర కాబట్టి, ‘బాహుబలి’లా ఊహాలోకపు విహారాల లాంటివి లేకపోయినా, సినిమాలో 3 యుద్ధ సన్నివేశాలు ఆకర్షణ. కబీర్ బేడీ లాంటి అంతర్జాతీయ నటులూ, టెక్నీషియన్లూ అదనపు ఆకర్షణ. ⇔ ఆకట్టుకొనే హీరో పాత్రచిత్రణతో పాటు, ‘సమయం లేదు మిత్రమా... శరణమా? రణమా?’, ‘దేశం మీసం తిప్పుదాం!’, ‘దొరికినవాణ్ణి తురుముదాం... దొరకనివాణ్ణి తరుముదాం’ లాంటి మోస్ట్ పాపులర్ డైలాగ్స్ బోలెడున్నాయి. ఈ సినిమాతో పాటు ‘ఖైదీ నంబర్ 150’కి కూడా కొన్ని పవర్ఫుల్ డైలాగులు రచయిత బుర్రా సాయిమాధవ్ రాయడం విశేషం. ⇔ మొరాకో, జార్జియాలతో పాటు మన దేశంలో మధ్యప్రదేశ్‌లో ఇండోర్ సమీపంలోని నర్మదా నదీ తీరంలోని మహేశ్వర్ లాంటి చోట్ల షూటింగ్ జరిపారు. చిలుకూరులో కోటి రూపాయల ఓడ సెట్ వేశారు. ఎన్టీఆర్ ఆశ తీర్చిన బాలకృష్ణ పెద్ద ఎన్టీయార్ గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని స్వయంగా నటిస్తూ, నిర్మించాలనుకొన్నారు. 1993 ప్రాంతంలో రచయితలతో చర్చించి, స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయించారు. ఈ సుప్రసిద్ధ తెలుగు శాతవాహన చక్రవర్తి జీవితం మొత్తాన్నీ సినిమాగా తెరపై చూపాలని ఆయన భావించారు. గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైన నవ యువకుడు వాసిష్టీపుత్ర పులుమావి పాత్రను హీరో వెంకటేశ్‌తో వేయించాలని కూడా భావించారు. గెటప్, కాస్ట్యూమ్ స్కెచ్‌లూ వేయించారు. కానీ, అనివార్య కారణాల వల్ల అప్పట్లో అది తెరకెక్కలేదు. అప్పుడు తెరకెక్కని ఆ కథాంశం 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు క్రిష్ మనసులో ఆలోచనగా బాలకృష్ణతో రావడం యాదృచ్ఛికం. తప్పని తిప్పలు... మార్పులు! ⇔ ‘ఖైదీ నంబర్ 150’లో ఐటమ్ సాంగ్ కోసం ముందుగా క్యాథరిన్ థెరిసాను తీసుకున్నారు. అయితే, చిరు కుమార్తె సై్టలిస్ట్ అయిన సుష్మితతో ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ విషయంలో సెట్లో తలెత్తిన పేచీతో ఆ అమ్మాయిని పక్కకు తప్పించారు. రాయ్ లక్ష్మితో ఆ పాట చిత్రీకరించారు. ⇔ ‘ఖైదీ..’కీ, ‘శాతకర్ణి’కీ – రెంటికీ మొదట మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాదే! అయితే, తగినంత సమయం కేటాయించడం లేదనే కారణంతో, దేవిశ్రీ స్థానంలో చిరంతన్ భట్‌ను ప్రవేశపెట్టారు. ‘రుద్రమదేవి’కి నై..! ‘శాతకర్ణి’కి మాత్రం సై! తెలుగు జాతి చరిత్రకు సంబంధించిన కథాంశం కావడంతో, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి అండగా నిలిచేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి వినోదపు పన్ను నుంచి మినహాయించగా, ఏపీ ప్రభుత్వం ఆ బాటలోనే ఉంది. వినోదపు పన్ను కట్టనవసరం లేకపోవడంతో, సాధారణంగా అయితే ప్రేక్షకుడికి టికెట్ రేటు తగ్గాలి. అయితే, ఇలాంటి చారిత్రక చిత్రాలు నిర్మించేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, టికెట్ రేట్ మామూలుగానే ఉంచేసి, పన్ను మినహాయింపు లాభాన్ని నిర్మాతలకు అందజేయాలని భావిస్తున్నారు. దాంతో, సినిమాకు వచ్చే వసూళ్ళలో ఆ మేరకు (దాదాపు 15 శాతం) నిర్మాతకు లాభిస్తుంది. వచ్చిన నికర వసూళ్ళు (షేర్) అదనంగా 7 నుంచి 8 శాతం దాకా పెరుగుతాయని వ్యాపార వర్గాల అంచనా. వరంగల్ నుంచి తెలుగు ప్రాంతాన్ని అంతటినీ పాలించిన కాకతీయ సామ్రాజ్ఞి ‘రుద్రమదేవి’ కథను అదే పేరుతో దర్శక – నిర్మాత గుణశేఖర్ ఆ మధ్య సినిమాగా తీశారు. అయితే, ఆ తెలుగు రాణి కథకు తెలంగాణ ప్రభుత్వమే తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండదండగా నిలబడ లేదు. దాదాపు 15 నెలల క్రితం వచ్చిన ఆ చిత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినోదపు పన్ను మినహాయింపు నిచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఇదుగో.. అదుగో’ అని తిప్పించుకొని, ఆఖరికి మొండిచెయ్యి చూపించారు. ఈసారి తన బావమరిది – వియ్యంకుడైన బాలకృష్ణ నటించిన ‘శాతకర్ణి’ సినిమాకు రిలీజ్‌కు ముందే పన్ను మినహాయింపునకు సిద్ధమవుతున్నారు. అన్నట్లు అప్పట్లో ఈ పన్ను మినహాయింపు లాభమంతా ఎప్పటిలా ప్రేక్షకులకూ, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకూ కాకుండా చరిత్రను తెరకెక్కించిన నిర్మాతలకే దక్కేలా కేసీఆర్ జీవో జారీ చేశారు. కానీ, ‘రుద్రమదేవి’కి దక్కాల్సిన ఆ ప్రోత్సాహం తాలూకు సొమ్మంతా ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన పేరున్న తెలంగాణ చిత్ర నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ దగ్గరే ఉండిపోవడం విచిత్రం. పరిశ్రమ వర్గీయులు మధ్యవర్తిత్వం చేసినా, ప్రభుత్వమిచ్చిన ఆ ప్రోత్సాహం అసలు నిర్మాతకు చేరకనేపోవడం విషాదం. పోటీపడుతున్న అభిమానం అతిథి పాత్రపోషణల్ని కలిపితే, సినిమాల సంఖ్య పెరిగినా, చిరంజీవి, బాలకృష్ణలు ఈ తాజా చిత్రాల్ని 150... 100... సినిమాలుగానే ప్రకటిస్తూ వచ్చారు. అలా ఇవి ‘మేజికల్ ఫిగర్’ సినిమాలు కావడంతో, చిరు, బాలయ్య అభిమానులు కూడా వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే, దేశమంతా పుణ్యక్షేత్రాల్లో పూజల దగ్గర నుంచి తమ హీరోల ప్రత్యేక పుస్తకాల విడుదల దాకా అనేకం చేస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు తమ హీరో చిత్ర అఖండ విజయం కోసం గత నవంబర్ ఆఖరులో కార్తీక సోమవారానికి 1116 శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించారు. 3 వ్యాన్లలో తిరుగుతూ, సుమారు 9 రాష్ట్రాల్లో 39 రోజుల పాటు, 95 పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసి, ‘భారతదేశ శతపుణ్యక్షేత్ర జైత్రయాత్ర’ చేశారు. చిరు అభిమానులు తామేం తక్కువంటూ అన్నయ్య రీఎంట్రీ సిన్మా విజయం కోసం... పుణ్యక్షేత్రాల సందర్శనకు దిగారు. కాశీ విశ్వనాథుడికీ, విశాలాక్షికీ, కొల్హాపూర్‌లో మహాలక్ష్మి అమ్మవారికీ పూజలు చేశారు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఏమో వంద సినిమాల లోగోలు, స్టిల్స్‌తో ‘ఎన్.బి.కె. 100 – నెవర్ బిఫోర్’ అంటూ ప్రత్యేక పుస్తకం, క్యాలెండర్లు, డైరీలు ప్రింట్ చేసి, ఆడియో రిలీజ్ వేదికపై విడుదల చేశారు. ఇక, చిరు వర్గం అండతో, ఆయన సినిమా జీవితంపైనా కొన్ని పుస్తకాలు రిలీజ్‌కు ముందే విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ అభిమానులు ప్రొద్దుటూరులోని ఒక థియేటర్లో ఆయన నటించిన 100 సినిమాల్నీ రోజుకొకటి చొప్పున ప్రదర్శిస్తూ, శతచిత్రోత్సవం చేస్తున్నారు. చరిత్రలో శాతకర్ణి ప్రవేశపెట్టిన ‘గుడీపడవా’ (గుడిసెపై జెండా) పండుగకు గుర్తుగా 100 థియేటర్లపై శాతకర్ణి జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు. మరోపక్క ‘అన్నయ్య’ రీ–ఎంట్రీకి తగ్గట్లు కర్ణాటకలోని చిరు వీరాభిమాని ఒకరు ప్రత్యేకంగా పాట రాయించుకొని, ప్రముఖ గాయకుడు దీపూతో పాడించి, ‘వచ్చాడు వచ్చాడు చిరంజీవి వచ్చాడు...’ అంటూ దాన్ని ఆల్బమ్‌గా రిలీజ్ చేశారు. ఇక, సిన్మా రిలీజ్ రోజు హంగామాకైతే ఇరు వర్గాల లక్షలాది అభిమానులూ సర్వసన్నద్ధమవుతున్నారు. బరిలో... మిగతా పందెం కోళ్ళు! గత ఏడాది సంక్రాంతికి ఏకంగా 4 తెలుగు సినిమాలు వచ్చాయి. ఈ సారీ నాలుగు వస్తున్నాయి. చిరు, బాలయ్య సినిమాల్ని పక్కనపెడితే, శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌లతో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘శతమానం భవతి’ సరిగ్గా సంక్రాంతి రోజున జనవరి 14న రిలీజ్ కానుంది. అలాగే, ఆర్. నారాయణమూర్తి చాలా కాలం తర్వాత బయటి నిర్మాతలకు పనిచేసిన ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ కూడా జనవరి 14నే వస్తోంది. ‘శతమానం భవతి’ పూర్తిగా కుటుంబకథా చిత్రం ఫీల్‌తో సంక్రాంతి పండుగ ఫీల్ తెస్తుంటే, నల్లధనంపై పోరాటమనే లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ మీద వస్తున్న ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ ఆలోచింపజేస్తోంది. వరుసగా వచ్చే సెలవులు, ఇంటిల్లపాదీ సినిమాలు, షికార్లతో ఆనందించాలనుకునే పండుగ వాతావరణం ఒకటికి, నాలుగు సినిమాల్ని బాక్సాఫీస్ దగ్గర సునాయాసంగా గెలుపునిస్తుంది. అదే ఇప్పుడీ పోటాపోటీ రిలీజ్‌లకు పెద్ద ఊపిరి. సామాన్య ప్రేక్షక జనం కూడా ఇప్పుడు చెబుతున్నది ఒకే మాట .. ‘మాకు నచ్చిందే చూస్తాం... నచ్చితేనే చూస్తాం...’ మరి, ఈసారి సినిమా బరిలో సంక్రాంతి మొనగాడెవరో? జస్ట్ మరొక్క మూడు రోజులు... లెటజ్ వెయిట్ అండ్ సీ! సంక్రాంతికే.. శతమానం భవతి, హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య – డాక్టర్ రెంటాల జయదేవ -
ట్రైలర్ వార్: ఖైదీ వర్సెస్ శాతకర్ణి..
ఖైదీ నం 150.. చిరంజీవికి 150వ సినిమా. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలకు దూరమైన చిరంజీవి మళ్లీ ముఖానికి రంగు వేసుకొని తెరపై తన స్టామినా చూపేందుకు సిద్ధమవుతున్న సినిమా. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరు మళ్లీ తెరపై దర్శనమివ్వబోతుండటంతో అభిమానులు ఫుల్ పండుగ చేసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో వారి సందడి మరింత పెరిగిపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల్లో 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ కామెంట్లతో చిరు అభిమానులు హోరెత్తిస్తున్నారు. ట్రైలర్‌ను సూపర్బ్‌గా ఉందని అంటున్నారు. తమిళంలో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 'కత్తి' సినిమాకు రీమేక్‌గా 'ఖైదీనంబర్ 150' వస్తున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి అభిమానులు ఊహించినట్టుగానే దుమ్మురేపాడు. సినిమాలకు దూరమై చాలారోజులైనా ఆ నటనలో ఆ 'ఈజ్' అలాగే ఉండటం మెగా ఫ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చిరు స్టెప్పులు ట్రైలర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. డ్యాన్స్‌లో తన దూకుడు ఏమాత్రం తగ్గలేదని చిరు నిరూపించుకున్నారు. ముఖ్యంగా ట్రైలర్ ముగింపులో 'పొగరు నా ఒంట్లో ఉంటది. హీరోయిజం నా ఇంట్లో ఉంటది.. వెయింటింగ్' అంటూ చిరు చెప్పిన డైలాగ్ అభిమానులకు రొమాలు నిక్కబొడిచేలా చేస్తోంది. ఇక చిరు 'ఖైదీనంబర్ 150'కి పోటీగా వస్తున్న బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి చెప్పాల్సిన పనిలేదు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసింది. బాలకృష్ణ 'శాతకర్ణి' చారిత్రాత్మక కథ.. 'బాహుబలి'రీతిలో భారీ హంగులతో నిర్మితమైన సినిమా. చిరు 'ఖైదీనంబర్ 150' సామాజిక సందేహంతో కూడిన సాంఘిక సినిమా. రెండు సినిమాలు ఎక్కడా రాజీపడకుండా దీటుగా నిర్మితమై.. సంక్రాంతి పండుగకి పందెకోళ్లలాగా బరిలోకి దూకేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే రెండు సినిమాల ట్రైలర్లను పోల్చిచూసి.. వ్యాఖ్యానాలు చేస్తున్నారు నెటిజన్లు. ఇటు బాలయ్య 'శాతకర్ణి', అటు చిరు 'ఖైదీ..' వెటికవే భిన్నంగా ఉండి.. ప్రత్యేకతలు చాటుకుంటుండటంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రంజైన పోటీ తప్పదని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎవరి అభిమానులు వారి హీరోల సినిమాలకు 'వీరతాళ్లు' వేస్తుండగా.. నెటిజన్లు మాత్రం ఈ ఇద్దరి సినిమాల ట్రైలర్లు ఆకట్టుకుంటున్నాయని, అంచనాలు పెంచేశాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి మరోసారి బాలయ్య వర్సెస్ చిరు పోరు హోరాహోరీగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఎవరి అభిమానుల మాట ఎలా ఉన్నా ఇంతకు మీకు ఏ ట్రైలర్ నచ్చిందో.. ఒక మాట చెప్పండి? -
‘శాతకర్ణి’కి పన్ను మినహాయింపు
సీఎం కేసీఆర్‌ను కలసిన సినీ హీరో బాలకృష్ణ సాక్షి, హైదరాబాద్: గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సినీ హీరో బాలకృష్ణ శుక్రవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. చారిత్రక నేపథ్యంలో నిర్మించిన గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. సానుకూలత వ్యక్తం చేసిన సీఎం, వెంటనే పన్ను మినహాయింపు ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక నేపథ్యమున్న చిత్రాలు, చారిత్రక వ్యక్తుల ఇతివృత్తంతో తీసిన సినిమాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని తెలిపారు. గతంలో రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చామని, ఇప్పుడు శాతకర్ణికి కూడా ఇస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ విధానం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైందని.. కేవలం 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుందని బాలకృష్ణ చెప్పారు. తెలంగాణలోని కోటి లింగాలతోపాటు దేశవ్యాప్తంగా అనేక చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్ జరిపినట్లు తెలిపారు. జనవరి 12న విడుదలయ్యే చిత్రం మొదటి ప్రదర్శన చూడాలని సీఎంను ఆహ్వానించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సినీ నిర్మాత రాజీవ్‌రెడ్డి, చిత్ర సమర్పకుడు బిటో శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీఎల్పీ కార్యాలయంలో బాలకృష్ణ సందడి చేశారు. రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితరులతో కొద్దిసేపు మాట్లాడారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణలో వినోదపు పన్ను మినహాయింపుపై సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చారు. ఆయనకు రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. అప్పటికే అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన కారులో సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. -
జనవరి 8న శాతకర్ణి పతాక ఉత్సవం
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చారిత్రక చిత్రంలో బాలీవుడ్ నటి హేమామాలినీ, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్, ఆడియో రిలీజ్ కార్యక్రమాలను భారీగా నిర్వహించిన యూనిట్ సభ్యులు త్వరలో మరో ఉత్సవాన్ని ప్లాన్ చేశారు. శాతకర్ణి పతాక ఉత్సవం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లోని వందో థియేటర్లలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలకు చిహ్నంగా శాలివాహన రాజ్య చిహ్నం ఉన్న జెండాలను వంద థియేటర్లలో ఎగురవేసేలా ప్లాన్ చేస్తారు. జనవరి 8న ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. హీరో నందమూరి బాలకృష్ణ స్వయంగా విశాఖలోని జ్యోతి థియేటర్లో జెండా ఎగురవేసి ఈ పతాక ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇతర ప్రాంతాల్లో నందమూరి అభిమాన సంఘం నాయకులు ఇతర ప్రముఖులు జెండాలు ఎగురవేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
ఇద్దరినీ స్వాగతిద్దాం..!
చాలా కాలం తరువాత టాలీవుడ్ వెండితెర మీద ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమయ్యింది. ఇద్దరు సీనియర్ హీరోలు సంక్రాంతి పండుగకు ముఖాముఖి తలపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇస్తుండగా, నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌తో జనవరి 11, 12 తేదిల్లో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు భారీ చిత్రాలు ఒకేసమయంలో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అలా రిలీజ్ అయితే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా ఆ రిస్క్ చేయడానికే రెడీ అవుతున్నారు ఈ సీనియర్ స్టార్స్. ఇద్దరికీ ప్రతిష్టాత్మక చిత్రాలు కావటంతో ప్రచారం, రిలీజ్ విషయంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవ్వటం పై ఇరు చిత్రాల నిర్మాతలు స్పందించారు. ఇలా భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవ్వటం గతంలో కూడా జరిగిందంటూ రామ్‌చరణ్ వివరించగా... గౌతమీపుత్ర శాతకర్ణి దర్శక నిర్మాత క్రిష్. ఇద్దరినీ స్వాగతించాలంటూ కోరాడు. 'ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రతిష్టాత్మక చిత్రాలతో వస్తున్నారు. #jan11khaidi, #jan12GPSK హ్యాష్ ట్యాగ్‌లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ వారిని స్వాగతిద్దాం'. అంటూ ట్వీట్ చేశాడు. This #Sankranthi two legends r coming to entertain us with their landmark films. Let us all welcome both by trending #Jan11Khaidi #Jan12GPSK — Krish Jagarlamudi (@DirKrish) 3 January 2017 -
అందుకే... 11న వస్తున్నాం!
‘‘బాలకృష్ణ గారి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి, 12న మా చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. రెండు అగ్ర హీరోల చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం చిత్ర పరిశ్రమకి మంచి పరిణామం కాదని నాన్నగారు (చిరంజీవి) చెప్పడంతో మేం 11న రావాలని నిర్ణయం తీసుకున్నాం’’ – ‘ఖైదీ నంబర్ 150’ నిర్మాత, హీరో రామ్‌చరణ్ తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు? అనే ఉత్కంఠకు రామ్‌చరణ్ మంగళవారం ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రీ–రిలీజ్ ఫంక్షన్ తేదీ, వేదిక విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 11న చిరంజీవి రీ–ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే 7న మంగళగిరి దగ్గర ప్రీ–రిలీజ్ ఫంక్షన్ జరుపుతున్నామన్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడ క్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించిన ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకకి ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు, ‘దర్శకేం ద్రులు’ కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరవు తున్నట్టు రామ్‌చరణ్ చెప్పారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా అభిమా నులతో సంభాషించిన ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. (చదవండి :‘ఖైదీ’ విడుదల తేదీ ప్రకటించిన చరణ్ ) రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘కొన్ని అనుమతులు రాని కారణంగా ఇందిరాగాంధీ స్టేడియంలో (విజయవాడ) జనవరి 4న ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేయలేకపోతున్నాం. అందువల్ల, గుంటూరు– విజయవాడ హైవేలో ఉన్న హాయ్‌ల్యాండ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 7న ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. ట్రైలర్ కూడా 7న విడుదల చేస్తున్నాం. పలువురు దర్శక–నిర్మాతలు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ రోజు బాబాయ్ పవన్‌కల్యాణ్‌ను కలసి ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. వస్తారా? లేదా? అనేది ఆయన చేతుల్లోనే ఉంది’’ అన్నారు. బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పోటీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? అని ఓ అభిమాని ప్రశ్నించగా... ‘‘ఇది పోటీ కాదు. రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదల కావడమనేది సహజమే. పండక్కి ఎన్ని సినిమాలైనా రావొచ్చు. 2013 సంక్రాంతికి వెంకటేశ్, మహేశ్‌బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, నేను చేసిన ‘నాయక్’ సినిమాలు విడుదలయ్యాయి. రెండూ బాగా ఆడాయి. మా సినిమాతో పాటు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత చిరంజీవి నటించబోయే తదుపరి సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఉంటుందని రామ్‌చరణ్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రీ–రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి మంగళగిరి వద్దకు వెళ్లిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్... ‘‘సినిమాలను రాజకీయా లతో ముడి పెట్టొదు. చిత్ర పరిశ్రమలో రాజకీయాలపై అవసరమైన సమయంలో స్పందిస్తా’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
పది రోజులే మిత్రమా!
సమయం లేదు మిత్రమా... సరిగ్గా పదంటే పది రోజులు మాత్రమే! ‘శరణమా? రణమా?’ అనే ప్రచార చిత్రంలో డైలాగులు, తర్వాత పాటలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా విడుదల తేదీ ప్రకటించారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ వందో చిత్రం సంక్రాంతి బరిలో సందడి చేయడానికి వచ్చేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. -
శ్రీవారి సేవలో 'శాతకర్ణి' చిత్ర బృందం
-
ఇదీ వెయ్యి రోజులాడుతుంది!
– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘‘వెయ్యిరోజులాడిన తొలి దక్షిణ భారతీయభాషా చిత్రం ‘లెజెండ్’. మామూలు చిత్రమే వెయ్యి రోజులు ఆడితే ఓ చరిత్ర ఉన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వెయ్యి రోజులు... ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు ఆడుతుంది’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మించిన సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. చిరంతన్ భట్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను సోమవారం తిరుపతిలో విడుదల చేశారు. చంద్రబాబు ఆడియో సీడీలను ఆవిష్కరించి, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి అందజేశారు. చంద్రబాబు మాట్లాడుతూ – ‘‘తెలుగు వారి చరిత్ర మళ్లీ అమరావతితో ముందుకొచ్చింది. నేను లండన్‌లో మ్యూజియానికి వెళ్లినప్పుడు అక్కడ రెండే గ్యాలరీలున్నాయి. వాటిలో ఒకటి గ్రీసుది కాగా రెండోది అమరావతి గ్యాలరీ. మహిళలకు గౌరవం ఇవ్వాలని చరిత్రలో తొలిసారి తల్లిపేరును తన పేరు ముందు పెట్టుకున్న వ్యక్తి శాతకర్ణి. ఆయన చరిత్రని సిన్మాగా అందిస్తున్న క్రిష్‌కు అభినందనలు. అమరావతి నుంచి అఖండ భారతదేశాన్ని పరిపాలించిన శాతకర్ణి తెలుగు జాతికి గర్వకారణం. యేసు ప్రభువు పుట్టిన తర్వాత క్రీస్తు శకం ప్రారంభమైంది. క్రీస్తు శకం వచ్చిన డెబ్భై సంవత్సరాలకు శాలివాహన శకం ఆరంభమైంది. ఈ సినిమా కంటే మించిన రాజధాని కట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. దేశంలో నంబర్‌వన్‌గా అమరావతిని తీర్చిదిద్దుతాం’’ అన్నారు. సమయం లేదు... సంక్రాంతికే వస్తున్నాం! బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘వంద సినిమాలు చేయడానికి 43 ఏళ్లు పట్టింది. ఇన్నేళ్లూ నన్ను ముందుకు నడిపించింది ప్రేక్షకులూ, నా అభిమానులే. ఈనాడు ‘నటసింహం’గా, ఓ ఎమ్మెల్యేగా మీ (ప్రేక్షకులు)తో మన్ననలు అందుకోవడానికి నా తల్లితండ్రులు, మీ ఆశీస్సులే కారణం. శాతకర్ణి కథను వందో సినిమాగా చేయడం దైవసంకల్పం. ఎటువంటి భావోద్వేగాన్నయినా సమర్థంగా తెరకెక్కించగల క్రిష్, మంచి నటీనటులు, చిత్రబృందం కుదరడంతో సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. సినిమాలోని డైలాగ్ గుర్తుకొచ్చేలా, ‘‘ఇంక సమయం లేదు మిత్రమా... సంక్రాంతికి వస్తున్నాం’’ అని చిత్ర రిలీజ్ సమయాన్ని ప్రస్తావించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ – ‘‘సరదా కోసమో, వినోదం కోసమో సినిమాలు ఎక్కువ తీస్తుంటారు. విజ్ఞానం కోసం, సందేశం కోసం సినిమాలు తీయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ, ఒక సందేశంతో మన చరిత్రను మనకు గుర్తు చేసే విధంగా ఈ సినిమా తీయడం నా మనసుకు ఎంతో నచ్చింది. అందువల్ల ఈ వేడుకకి వచ్చా. కేంద్ర సమాచార మంత్రిగా నాపై ఓ బాధ్యత కూడా ఉంది’’ అన్నారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ – ‘‘అంజనాపుత్ర క్రిష్ అని నా పేరుకి ముందు మా అమ్మగారి పేరు వేశా. ‘అమ్మా! ఈ సినిమాతో నీ పేరు నిలబెడతా’. పెళ్లైన తర్వాత పట్టుమని పది రోజులు కూడా నా అర్ధాంగితో ఉండలేదు. ‘పద్మావతీపుత్రిక రమ్యా! నువ్వు నేనూ చాలా గర్వపడే సినిమా తీశా’ అని చెప్తున్నా. తెలుగుజాతి గర్వపడే సినిమా తీశా. శాతకర్ణి కథ చదువుతుంటే నా రక్తం మరిగింది. ఇలాంటి శాతకర్ణి ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి? చూపు తీక్షణంగా.. మాటలు రాజసంగా... నడుస్తుంటే కాగడా రగులుతున్నట్టుగా ఉండాలి. ఈ కథే కథానాయకుణ్ణి ఎన్నుకుంది. ‘అదిగో.. బాలకృష్ణ ఉన్నాడు. బసవరామతారకపుత్ర బాలకృష్ణ ఒక్కడు మాత్రమే నా ఖ్యాతిని దశదిశలా విస్తరించగలడు’ అని ఆ శాతకర్ణి నాకు శాసించినట్టు చెప్పాడు. కేవలం పది నిమిషాల్లో కథ విని, ఈ సినిమా చేస్తున్నామని 14 గంటల్లో బాలకృష్ణ ఓకే చెప్పారు. నేనే సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్నాను. రోజూ సెట్లోకి మొదట వచ్చేది, చివర వెళ్లేది బాలకృష్ణగారే. నాతో పాటు ఆయన కూడా ఈ సినిమాకి కెప్టెనే’’ అన్నారు. ‘‘చాలా ఏళ్ల క్రితం స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన ‘పాండవ వనవాసం’లో చిన్న నృత్యం చేశా. ఆ సినిమాతో నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ చేసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో హీరో అమ్మ పాత్రలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రముఖ హిందీ నటి హేమమాలిని. ‘‘బాలకృష్ణ 100వ చిత్రానికి సంగీతం అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ‘కంచె’ తర్వాత దర్శక, నిర్మాతలతో కలసి మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు చిరంతన్ భట్. ‘‘అమరావతి ఖ్యాతి ప్రతి తెలుగు మనిషికీ తెలియాలని బాలకృష్ణ ఈ సినిమా చేశారు. వంద సెంటర్లలో వంద రోజులు ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు బోయపాటి శ్రీను. ఈ వేదికపై ‘ఎన్బికె 100... నెవర్ బిఫోర్’ అనే పుస్తకాన్ని హేమమాలిని, ‘ఎన్బికె 100’ డైరీలు, క్యాలెండర్లను వెంకయ్యనాయుడు విడుదల చేశారు. నిర్మాతలు సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు నిర్మాతలు డి.సురేశ్‌బాబు, అంబికా కృష్ణ, అనిల్ సుంకర, దర్శకులు బి.గోపాల్, కోదండ రామిరెడ్డి, రచయిత సాయిమాధవ్ బుర్రా, హీరో నారా రోహిత్, టీ టీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎంపీ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాతకర్ణి విజువల్స్ కాపీనా..?
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అతి తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. చారిత్రక కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. భారీ యుద్ధ సన్నివేశాలతో కలిపి మొత్తం షూటింగ్‌ను నాలుగు నెలల లోపే పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. ఇంత తక్కువ సమయంలో ఇంత గ్రాండ్ విజువల్స్ ఎలా సాధ్యమయ్యాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. అంతేకాదు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్‌ను, గ్రాఫిక్స్‌ను వాడుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్ వాడుకునేందుకు ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నుంచి క్రిష్ ముందుగానే పర్మిషన్ కూడా తీసుకున్నాడట. గతంలో సంజయ్ నిర్మాతగా తెరకెక్కించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాతో క్రిష్ బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ అనుబంధం తోనే గ్రాఫిక్స్ విషయంలో సంజయ్ సాయం చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి యూనిట్ కొట్టి పారేస్తోంది. ట్రైలర్లో కనిపించిన విజువల్స్ అన్ని ఈ సినిమా కోసం స్పెషల్‌గా క్రియేట్ చేసినవే గాని.., కాపీ చేసినవి కాదని తేల్చి చెపుతోంది. బాలయ్య సరసన శ్రియ హీరోయిన్గా నటిస్తున్న., ఈ సినిమాలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని కీలక పాత్రలో నటిస్తోంది. -
శ్రియను ఏడిపించిన యువకుడెవరు?
తనను ఒక యువకుడు అవమానించి, ఏడిపించాడని నటి శ్రియ స్వయంగా చెప్పి వాపోయారు. అయితే ఈ విషయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం శ్రియను ఏడిపించిన ఆ యువకుడు ఎవరన్న అంశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు ఆ సంగతేంటో చూద్దాం. అందాలభామ శ్రియ తమిళం, తెలుగు భాషల్లో ఒక రౌండ్ కొట్టేసి, ప్రస్తుతం రెండో రౌండ్‌కు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో సంచలన నటుడు శింబుకు జంటగా అన్భానన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక తెలుగులో బాలకృష్ణకు జంటగా భారీ చారిత్రక కథా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్య నటి శ్రియ ఒక ఇంటర్వ్యూ లో తనను ఒక ధనవంతుడైన యువకుడు అవమానించి, ఏడ్చేలా చేశాడని చెప్పారు. తాను అంతగా ఏడుస్తున్నా, అతను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం సముదాయించకుండా పైగా నవ్వుతూ ఎంజాయ్ చేశాడని తెలిపారు. అది భరించలేని తాను పొంగుకొస్తున్న ఏడుపును ఆపుకోలేక బాత్రూంకు వెళ్లి గట్టిగా ఏడ్చేశానని చెప్పారు. అయితే తనను అవమాన పరిచి ఆవేదనకు గురి చేసిన ఆ యువకుడెవరన్నది శ్రియ వెల్లడించలేదు. ఆమె వేదనతో కూడిన మాటలు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారాయి. -
ఈ కథ చెప్పడం నా ధర్మం
‘‘మహాకవి దాశరథి ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కనరాని భాస్కరులెందరో’ అన్నారు. అలాగే, ప్రపంచపటంలో మన దేశానికి ఓ గౌరవాన్ని ఇచ్చిన, పురిటినొప్పుల ఈ పుడమిగర్భంలో కానరాని ఒక భాస్కరుని వీరగాధ ఈ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఓ తెలుగు బిడ్డగా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జెండాని ఎగురవేసిన నందమూరి తారకరామారావు వారసుడిగా ఈ కథను చెప్పడం నా ధర్మంగా భావించాను’’ అన్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించిన సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. శుక్రవారం కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత, ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్‌రెడ్డి విడుదల చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘వందో సినిమా ఏది చేయాలా? అని చాలా కథలు విన్నా. కొన్ని నచ్చలేదు. మరికొన్ని నేను అనుకున్న స్థాయికి రాలేదని సతమతమవుతున్న సమయంలో క్రిష్ ఈ కథ చెప్పారు. ప్రతి రెండు సినిమాల మధ్య వ్యత్యాసం చూపించాలని, కొత్తదనం అందించాలని ఉవ్విళ్లూరే వ్యక్తి క్రిష్. అంతకు ముందు మాకు పరిచయం లేదు. యాదృచ్ఛికమో... కాకతాళీయమో... ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు. దురదృష్టం ఏంటంటే... శాతకర్ణి చరిత్ర మన దగ్గర తక్కువ ఉంది. వాళ్ల అమ్మగారు గౌతమి శాసనాలపై చెక్కించారు. అవి కాశీలో ఉన్నాయి. ఈ పాత్ర లభించడం నా పూర్వజన్మ సుకృతం. నేనూ ట్రైలర్‌ను చూడడం ఇదే మొదటిసారి. అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగేది కాదు. ఇంతకాలం నా నుంచి ఏమీ ఆశించకుండా మీరు చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామరక్ష. అటువంటి అభిమానుల మధ్యలో ట్రైలర్ చూడాలనుకున్నా’’ అన్నారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ – ‘‘వందో చిత్రాన్ని మా యూనిట్ చేతిలో బాలకృష్ణగారు ఎందుకు పెట్టారో ఈ ట్రైలర్ మీకు (ప్రేక్షకులకు) చూపించిందని ఆశిస్తున్నా’’ అన్నారు. మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ – ‘‘నేను మాటలు రాస్తున్నది ఓ సినిమాకి కాదు, ఒకేసారి వంద సినిమాలకు... అని ప్రతిక్షణం మనసులో అనుకునేవాణ్ణి. నేను ఎన్టీఆర్ భక్తుణ్ణి. ఆయనకు రాసే అవకాశం రాదు. నేను రాసిన డైలాగులు బాలకృష్ణగారు చెప్తుంటే నాకు రామారావుగారు గుర్తొచ్చారు’’ అన్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
దుమ్మురేపుతున్న శాతకర్ణి ట్రైలర్
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కరీంనగర్‌లోని తిరుమల థియేటర్లో వినూత్నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య అభిమానులు భారీగా పాల్గొన్నారు. 'మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయము లేదు మిత్రమా శరణమా.. రణమా' అంటూ బాలకృష్ణ తనదైన శైలి డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక చిత్రాన్ని అదే స్థాయితో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
కోటిలింగాలలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు
కోటిలింగాల: ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం జగిత్యాలకు చేరుకున్న బాలకృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పర్యటన ప్రారంభించారు. అనంతరం కోటిలింగాలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట దర్శకుడు క్రిష్(రాధాకృష్ణ జాగర్లముడి) ఉన్నారు. బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు స్థానిక తిరుమల 70 ఎమ్ఎమ్ థియేటర్ లో సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. -
శాతకర్ణి జన్మస్థలంలో ట్రైలర్ లాంచ్
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక చిత్రాన్ని అదే స్థాయితో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బాలయ్య వందో చిత్రం కావటంతో వంద థియేటర్లలో ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు చక్రవర్తి శాతకర్ణి జీవితకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆయన జన్మస్థలమైన కోటిలింగాలలో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల శాతకర్ణి తల్లి గౌతమీ ఊరు. ఆయన జన్మస్థలం కూడా అదే. అందుకే ఈ నెల 16న గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా కోటిలింగాలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. -
గౌతమీపుత్ర శాతకర్ణి... ఆడియో తిరుపతిలో
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు - మీడియాకు చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి వెల్లడి తిరుపతి సెంట్రల్: నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో వేడుకలకు తిరుపతి వేదిక కానుంది. ఈ నెల 16న భారీగా నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించిన స్థల పరిశీలన నిమిత్తం చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి, బాలకృష్ణ వ్యక్తిగత పీఆర్వో సురేంద్ర నాయుడు ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. వీరు ఎస్వీ యూనివర్శిటీ, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడామై దానాలను పరిశీలించారు. అనంతరం చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ వేడుకలకు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బాల కృష్ణతో చర్చించాక 2 రోజుల్లో వేదికను అధికారికంగా ప్రకటి స్తామని తెలిపారు. ఈ నెల 16న తేదిన నిర్వహించే ఈ ఆడియో వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అతిథులుగా హాజరు కానున్నట్టు వెల్లడించారు. -
చారిత్రక కథనూ షార్ట్‌గా చెప్తున్నాడు
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో చారిత్రక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాలకృష్ణ సినిమాలతో పోలిస్తే గౌతమీపుత్ర శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా దూసుకుపోతోంది. తన ప్రతీ సినిమాను సందేశాత్మకంగా మానవీయ కోణంలో తెరకెక్కించే క్రిష్ ఆ సినిమాలన్నింటినీ తక్కువ నిడివితోనే రూపొందిస్తుంటాడు. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక కథ కావటంతో షార్ట్ రన్ టైంలో పూర్తిచేయటం కష్టామని భావించారు. కానీ క్రిష్ మరోసారి షాక్ ఇచ్చాడు. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా కేవలం 2 గంటల 12 నిమిషాల్లోనే ముగించేశాడట. క్రిష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. డిసెంబర్ 16న భారీ ఎత్తున ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు. -
`గౌతమిపుత్ర శాతకర్ణి` జైత్రయాత్ర
-
శాతకర్ణి వీణ మీటితే...
శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి యుద్ధంలో అపజయం ఎరుగని వీరుడు మాత్రమే కాదు.. సంగీత ప్రియుడు, శృంగార పురుషుడు అట. క్రిష్ దర్శకత్వంలో శాతకర్ణిగా బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ప్రచార చిత్రాల్లో యుద్ధ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో చూపించారు. యుద్ధంతో పాటు నవరసాలు ఉన్నాయని చెప్పడానికి శాంపిల్ అన్నట్టు, నేడు క్రిష్ పుట్టినరోజు సందర్భంగా ఈ వర్కింగ్ స్టిల్ విడుదల చేశారు. శాతకర్ణి వీణ మీటితే ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ తర్వాత చూడాలి. ఓ పాట, శివ రాజ్‌కుమార్‌పై రెండు రోజుల పాటు సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉందట. ఈ చిత్రాన్ని వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తు న్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.. -
ఎవరో చెప్పుకోండి!
ఈ ఫొటోలో శ్రీయ చూపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా?! వీరి వీరి గుమ్మడిపండు.. దాగుడుమూతల దండాకోర్.. వీరి పేరు ఏంటో? చెప్పుకోండి చూద్దాం - అనే చిన్నపిల్లల ఆటలు శ్రీయ ఆడుతున్నట్టు లేదూ! నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లొకేషన్ ఈ సరదా దృశ్యానికి వేదికైంది. నృత్య దర్శకురాలు బృందా నేతృత్వంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు విరామంలో ఆటవిడుపుగా తీసుకున్న ఫొటో ఇది. ఇంతకీ, ఆ కళ్లు మూసుకున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా? దర్శకుడు క్రిష్ అండీ. -
మరో వారంలో ఎంట్రీ!
బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో కన్నడ రాజ్‌కుమార్ తన యుడు, ప్రముఖ హీరో శివ రాజ్‌కుమార్ నటిస్తున్నారనే వార్తను నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయి బాబా అధికారికంగా ధ్రువీకరించారు. అయితే, ఏ పాత్రలో అనేది వెల్లడించలేదు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఇప్పటి వరకూ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నడ మినహా ఇతర భాషల్లో నటించలేదు. మా చిత్రంలో నటించడానికి అంగీకరించిన శివరాజ్‌కుమార్‌కి థ్యాంక్స్. వచ్చే వారం నుంచి ఆయన నటించే సీన్స్ చిత్రీకరించనున్నాం. జనవరి 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: సీతారామశాస్త్రి, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్. -
శాతకర్ణిలో శివరాజ్?
నందమూరి తారక రామారావు నటించిన పలు చిరస్మరణీయ సినిమాల్లో ‘భూకైలాస్’, ‘శ్రీకృష్ణ దేవరాయ’ సినిమాలు కూడా ఉంటాయి. ఈ రెండూ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించిన సినిమాలకు రీమేక్. అలాగే తెలుగులో ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలను కన్నడలో రాజ్‌కుమార్, ఆయన సినిమాల తెలుగు రీమేక్‌లో ఎన్టీఆర్ చేశారు. ఎన్టీఆర్, రాజ్‌కుమార్‌లు మంచి స్నేహితులు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. ఈ స్నేహితులిద్దరి తనయులు కలసి నటించనున్నారట. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో రాజ్‌కుమార్ తనయుడు శివ రాజ్‌కుమార్ అతిథి పాత్ర చేయనున్నారని సమాచారం. ఓ పవర్ఫుల్ పాత్రలో కన్నడ హీరో కనిపిస్తారట. శాతకర్ణిగా బాలకృష్ణ, వశిష్ఠదేవిగా శ్రీయ, గౌతమి బాలాశ్రీగా హేమమాలిని తదితరులు నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. మహేశ్‌తో నో మల్టీస్టారర్: బాలకృష్ణ, మహేశ్‌బాబు హీరోలుగా ఓ మల్టీస్టారర్ రూపొందించడానికి దర్శకుడు కొరటాల శివ సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. ‘జనతా గ్యారేజ్’ తర్వాతి సినిమా మహేశ్‌తోనే అని కొరటాల ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. ఆ సినిమా ఈ మల్టీస్టారరేనంటూ ఫిల్మ్‌నగర్‌లో షికారు చేస్తున్న పుకారుకి దర్శకుడు చెక్ పెట్టారు. ‘నా నెక్ట్స్ సినిమాలో ఫ్యాన్సీ కాంబినేషన్లు లేవు, మల్టీస్టారర్ కూడా కాదు’ అని కొరటాల చెప్పారు. అంటే... బాలకృష్ణ-మహేశ్ మల్టీస్టారర్ జస్ట్ రూమర్ అన్నమాట. లెజెండ్.. 950 టు 1000!: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సినిమా ‘లెజెండ్’. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అర్చన థియేటర్లో ఈ చిత్రం 950 రోజులు పూర్తి చేసుకుని 1000 రోజుల దిశగా పయనిస్తోంది. నేడు 964వ రోజు. గతంలో రజనీకాంత్ ‘చంద్రముఖి’ సినిమా చెన్నైలోని ఓ థియేటర్లో 891 రోజులు ప్రదర్శింపబడింది. దక్షిణాదిలో వెయ్యి రోజులకు చేరువ కానున్న సినిమా ‘లెజెండ్’ కావడం గమనార్హం. -
సర్కార్‌తో శాతకర్ణి.. మధ్యలో రాము
-
వీరమాత గౌతమి
విరామం లేదు.. విశ్రాంతి లేదు.. రణభూమిలో రక్తం ఏరులై ప్రవహిస్తోంది. యుద్ధంలో కత్తి దూసిన కుమారుడి జైత్రయాత్రపై అపార నమ్మకం ఉన్నప్పటికీ.. కన్నతల్లి మనసు తల్లడిల్లడం సహజమే. గౌతమిగా హేమమాలిని ఫస్ట్ లుక్.. తల్లి మనోవేదనను కళ్లకు కట్టినట్లుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిసున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇందులో శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీగా హేమమాలిని నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు హేమమాలిని పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘దసరాకు విడుదల చేసిన టీజర్, అందులో ‘మా కత్తికంటిన నెత్తుటిచార ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా.. రణమా?’ అని బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌లకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి మాటలు: బుర్రా సాయిమాధవ్, పాటలు: సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, సంగీతం: చిరంతన్‌భట్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్. -
శరణమా.. రణమా?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టీజర్ ను విజయదశమి కానుకగా మంగళవారం విడుదల చేశారు. అఖండ భారతాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మహా చక్రవర్తి కథతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ అభిమానులకు అలరించేలా ఉంది. 'విరామం లేదు విశ్రాంతి లేదు. నా కత్తికంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే వుంది.. సమయం లేదు మిత్రమా, శరణమా.. రణమా?' అంటూ ఏకచ్ఛత్రాధిపతిగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ఈ సినిమాను జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శాతకర్ణి భార్యగా శ్రీయ, తల్లిగా హేమమాలిని నటిస్తున్నారు. డిసెంబర్ లో పాటలు విడుదల చేస్తారు. -
ఏకచ్ఛత్రాధిపతి
ఇప్పటివరకూ వెండితెరపై ఎవరూ చూపని చారిత్రక గాథ.. అఖండ భారతాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మహా చక్రవర్తి కథ.. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందవ చిత్రమిది. క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్నారు. ఇందులో ఏకచ్ఛత్రాధిపతి శాతకర్ణిగా బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం సింహాసనంపై రాజసం ఉట్టిపడేలా కుర్చున్న శాతకర్ణి రాయల్ లుక్ విడుదల చేశారు. విజయదశమి కానుకగా మంగళవారం ఉదయం టీజర్ విడుదల చేయనున్నారు. శాతకర్ణి భార్యగా శ్రీయ, తల్లిగా హేమమాలిని నటిస్తున్నారు. డిసెంబర్లో పాటల్ని, సంక్రాంతి సందర్భంగా వచ్చే జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
విజయదశమికి రాయల్ లుక్!
నందమూరి బాలకృష్ణ, శ్రీయ జంటగా క్రిష్ దర్శకత్వంలో జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ ‘శాతకర్ణి’, శ్రీయ ‘వశిష్ఠిదేవి’ ప్రీ లుక్స్‌కి మంచి స్పందన లభించింది. విజయదశమి కానుకగా ఈ నెల 9న బాలకృష్ణ రాయల్ లుక్, 11వ తేదీ ఉదయం 8 గంటలకు టీజర్ విడుదల చేయనున్నారు. ప్రారంభోత్సవం రోజునే చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని తెలిపారు. అదే విధంగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అనుకున్న తేదీకి విడుదల చేయాలని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. హేమ మాలిని, కబీర్ బేడీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వంద రోజులు.. వంద సినిమాలు..!! నేటి నుంచి ప్రొద్దుటూరు (కడప జిల్లా) అర్చన థియేటర్లో జనవరి 11 వరకూ బాలకృష్ణ నటించిన 99 సినిమాలను ప్రదర్శించనున్నారు. 100వ రోజైన జనవరి 12న బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల కానుంది. ఆ చిత్రం ప్రదర్శనతో వంద రోజులు.. వంద చిత్రాలు పూర్తవుతాయి. ఓ హీరో వంద చిత్రాలను వరుసగా ఒక్కో రోజు, ఒకే థియేటర్లో ప్రదర్శించడం తెలుగులో ఇదే తొలిసారి అని ఈ సినీ ఉత్సవాలు నిర్వహిస్తున్న అభిమానులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కనున్నాయట! -
నందమూరి అభిమానులకు దసరా కానుక
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి. ఇది బాలకృష్ణ వందో సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2017 సంక్రాంతి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ ఫోస్టర్లను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ దసరా కానుకగా ఫస్ట్ టీజర్‌ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. బాలయ్య యుద్ధవీరుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. హేమామాలిని బాలకృష్ణ తల్లిగా నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కంచె ఫేం చింతరంజన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. -
ఎదురు చూపులు ఎవరి కోసం?
మనిషిక్కడ... మనసెక్కడో... కళ్లల్లో తడి... మనసులో వేదన... ఆ కళ్లు ఏదో కథ చెబుతున్నట్లు ఉన్నాయి కదూ! అఖండ భారతాన్ని జయించి.. ఏకఛత్రాధిపత్యంగా పాలించాలనే విజయకాంక్షతో యుద్ధభూమిలో అడుగుపెట్టిన భర్త శాతకర్ణి రాకకై ఎదురు చూస్తున్నట్టు లేదూ! నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇందులో శాతకర్ణి భార్య వశిష్ఠిదేవిగా శ్రీయ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం శ్రీయ పుట్టినరోజు సందర్భంగా వశిష్ఠిదేవి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయ తదితరులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్నారు. -
పురాణాల్లో ధర్మరాజు...చరిత్రలో శాతకర్ణి
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయాలపై రాజసూయ యాగం సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ - ‘‘అఖండ భారతావనిని ఏకతాటిపైకి తీసుకు రావడానికి పురాణాల్లో ధర్మరాజు, చరిత్రలో శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ రాజసూయ యాగ సమయంలోనే శాతకర్ణి తన పేరును గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజున కొత్త యుగానికి ఆది ఉగాది అని, అప్పట్నుంచీ ఉగాది పండుగను నిర్వహిస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున రాజసూయ యాగం సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమవడం దైవ సంకల్పం. బాలకృష్ణ తనయుడు మోక్షజ ్ఞపుట్టినరోజు కూడా అదే రోజే (సెప్టెంబర్ 6) కావడం సంతోషం’’ అన్నారు. ఈ నెల 20 వరకూ మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. -
అమ్మకు... బాలయ్య కానుక!
కట్టుదిట్టమైన భద్రత మధ్య పెద్ద సినిమాల షూటింగ్ జరుగుతుంటుంది. తాము విడుదల చేసేవరకూ ఆ సినిమా తాలూకు ఫొటోలు, వార్తలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా, ఎలా వచ్చేస్తాయో కానీ ఒకట్రెండు ఫొటోలు, చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ బయటికొచ్చేసి, చిత్ర బృందానికి షాకిస్తుంటాయ్. ఇప్పుడు బాలకృష్ణ టైటిల్ రోల్లో రూపొందుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ యూనిట్‌కి కూడా ఈ షాక్ తగిలింది. బాలకృష్ణ నూరవ చిత్రమిది. వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. ఈ చిత్రానికి సంబంధించిన రెండు ఫొటోలు ఎలాగో బయటికొచ్చాయ్. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు ఓ రేంజ్లో వీర విహారం చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ గెటప్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. హేమ మాలిని, శ్రీయల గెటప్ ఎలా ఉంటుందో ఈ ఫొటోలు తెలియజేశాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ తల్లిగా హేమమాలిని నటిస్తున్న విషయం విదితమే. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో తాజా షెడ్యూల్ మొదలైంది. షెడ్యూల్ తొలి రోజున హేమ మాలినికి బాలకృష్ణ లేపాక్షి చీరను బహుమతిగా ఇచ్చి, సర్ప్రైజ్ చేశారు. రీల్ సన్ ఇచ్చిన ఈ గిఫ్ట్‌కి రీల్ మదర్ ఆనందపడ్డారట. -
ఆనందంలో శాతకర్ణి తల్లి
‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణ విజయం’లో నటించిన అలనాటి డ్రీమ్ గాళ్ హేమమాలిని దాదాపు నలభై ఐదేళ్ల తర్వాత తెలుగు తెరపై మళ్లీ కనిపించనున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. టైటిల్ రోల్ చేస్తున్న బాలకృష్ణకు ఆమె తల్లిగా నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొన్ని నెలలుగా జరుగుతోంది. సోమవారం హేమమాలిని పాత్ర చిత్రీకరణ మొదలైంది. యుద్ధంలో ఓటమి ఎరుగని వీరుడు.. తన విజయంలో తల్లి పాత్రను సగర్వంగా చాటిన ధీరుడు.. ఒకటవ శతాబ్దంలో అఖండ భారతావనిని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన రారాజు శాతకర్ణి. అంతటి మహావీరుడి తల్లి పాత్ర చేయడం ఎగ్జైటింగ్‌గా ఉందని హేమమాలిని పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో తల్లీకొడుకుల మధ్య సీన్స్ తీస్తున్నారు. 18 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ చిత్రానికి మాటలు: బుర్రా నరసింహ, పాటలు: సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్. -
నో డూప్.. ఆల్ రియల్!
చారిత్రక అంశాలతో సినిమాల రూపకల్పన కత్తిమీద సామే. ప్రతి సన్నివేశం ఆ కాలాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. అది మాత్రమే కాదు, నటీనటుల వేషధారణ కూడా అప్పటిలా ఉండాలి. చారిత్రాత్మక కథతో రూపొందుతున్న బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతక ర్ణి’ కోసం దర్శకుడు క్రిష్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేస్తుంటడం విశేషం. కాస్ట్యూమ్స్ తయారీ కోసం శాతవాహనుల కాలం నాటి వే షధారణను నీతా లుల్లా అధ్యయనం చేశారు. అప్పటి సంస్కృతిని అనుసరిస్తూనే రాజసం ఉట్టిపడేలా దుస్తులను డిజైన్ చేస్తున్నారు. నీతా లుల్లా మాట్లాడుతూ - ‘‘చాలా పరిశోధన తర్వాత ప్రతి క్యారెక్టర్‌కు తగిన దుస్తులు సిద్ధం చేస్తున్నాం. రాజుల నుంచి యుద్ధ వీరుల వరకు అందరి దుస్తులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా’’ అన్నారు. ‘దేవదాసు’, ‘జోథా అక్బర్’ వంటి హిందీ చిత్రాలతో పాటు తెలుగు చిత్రం ‘రుద్రమదేవి’కి నీతా లుల్లా అద్భుతమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో బాలకృష్ణ, కబీర్ బేడీ తదితరులు పాల్గొంటున్నారు. డూప్ లేకుండా బాలకృష్ణ క్లైమాక్స్ పోరాటాలు చేయడం యూనిట్‌కు ఉత్సాహాన్నిస్తోంది. ఈ నెల 20 వరకూ అక్కడ చిత్రీకరణ జరుగుతుంది. -
బాలయ్య కోసం బాలీవుడ్ డిజైనర్
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కు సంబందించి రోజుకో వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో సందడి చేస్తోంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం జార్జీయలో భారీ యుద్ధ సన్నివేశాల షూటింగ్ జరుపుకుంటోంది. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లతో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేస్తున్నారు. అదే బాటలో మరో టాప్ డిజైనర్ గౌతమీ పుత్ర శాతకర్ణి టీంతో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దేవదాస్, జోథా అక్బర్ లాంటి సినిమాలకు పనిచేసి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా మూడు జాతీయ అవార్డులు సాధించిన నీతూలుల్లా గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా టీంలో జాయిన్ అయ్యింది. ఇప్పటికే దర్శకుడు క్రిష్, సినిమాటోగ్రఫర్ జ్ఞాన శేఖర్లతో చర్చలు జరిపిన నీతా సినిమాకు నేపథ్యానికి తగ్గ కాస్ట్యూమ్స్‌ను సిద్దం చేస్తున్నారు. రెగ్యులర్ ఫోక్ లోర్ సినిమాల తరహాలో కాకుండా.. శాతవాహనుల కాలంలో వారి సంస్కృతి సాంప్రదాయాలపై రిసెర్చ్ చేసి అలాంటి దుస్తులనే సిద్దం చేస్తున్నారు. ముఖ్యంగా యుద్ద వీరులు వేసుకునే కాస్ట్యూమ్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
గౌతమీపుత్రుడితో ఢీ!
ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటే కథానాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. అందుకే కథకు తగ్గ హీరోని ఎంపిక చేసే విషయంలో కేర్ తీసుకోవడంతో పాటు విలన్ని ఎంపిక చేసే విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటారు. భారతదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తాను రాసుకున్న కథ బాలకృష్ణకు మాత్రమే సూట్ అవుతుందనుకున్నారు క్రిష్. ఈ కథ విన్న బాలకృష్ణ తన నూరవ చిత్రానికి ఇలాంటి కథే కరెక్ట్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గౌతమీపుత్రుడికి దీటైన విలన్ కోసం క్రిష్ చాలా అన్వేషించారట. ఫైనల్‌గా హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ అయితే బాగుంటుందని ఆయన్ను ఎంపిక చేశారని సమాచారం. స్వతహాగా మల్లయోధుడైన నాథన్‌కి నటుడిగా ‘ట్రాయ్’ మూవీ చాలా పేరు తెచ్చింది. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆయన తమిళంలో ‘భూలోగం’ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘ఎ ఫ్లయింగ్ జాట్’లో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి ఎంపికయ్యారని ఫిలిం నగర్ టాక్. ప్రపంచాన్ని జయించాలనే ఆశయంతో దండయాత్రలు చేసే గ్రీకురాజుగా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ- నాథన్ మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. -
జార్జియాలో భారీ యుద్ధం
మూడొందల గుర్రాలు.. వెయ్యి మంది సైనికులు.. ఇరవై రథాలు... ఓటమి ఎరుగని వీరుడు.. అఖండ భారతావనిని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన తెలుగు మహాచక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక వందవ చిత్రమిది. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నారు. వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. ఈ నెల 4న మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ షెడ్యూల్లో మూడు వందల గుర్రాలు, ఇరవై రథాలు, వెయ్యి మంది సైనికులతో శాతవాహనులకు, గ్రీకులకు మధ్య జరిగే పోరాట ఘట్టాలను చిత్రీకరించనున్నాం. జార్జియాలో మౌంట్కజ్ బెగ్ పర్వతం వద్ద చిత్రీకరణ జరగనుంది’’ అన్నారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ - ‘‘జార్జియాలో పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. త్వరలో సీజీ వర్క్స్ కూడా ప్రారంభమవుతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి పోరాటాలు: రామ్ లక్ష్మణ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం: సీతారామ శాస్త్రి, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర రావు, సమర్పణ: బిబో శ్రీనివాస్. -
గౌతమీపుత్రుడు ఇలా ఉంటాడు!
‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలకృష్ణ ఎలా కనిపిస్తారు? ఆయన గెటప్ ఎలా ఉంటుంది? అనేది ఇప్పటివరకూ ఊహకందని ప్రశ్న. ఈ సినిమా కోసం ఆయన మీసాలు పెంచిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గెటప్ ఎలా ఉంటుందో గురువారం విడుదలైన ప్రీ-లుక్ చూస్తే కొంతవరకూ ఊహించుకోవచ్చు. శుక్రవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్‌ని విడుదల చేశారు చిత్రదర్శకుడు క్రిష్. తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన శాతవాహన సామ్రాజ్య 23వ రాజు గౌతమీ పుత్ర శాతకర్ణిగా ఈ చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ మొరాకోలో పూర్తయింది. త్వరలోనే మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
పధ్నాలుగేళ్ల తర్వాత బాలకృష్ణతో...
నందమూరి బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో కథానాయికగా అవకాశం దక్కించుకునేదెవరు? అనే చర్చకు బుధవారం ఫుల్స్టాప్ పడింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో బాలకృష్ణ చేస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి పాత్ర సరసన శ్రీయ కథానాయికగా ఎంపికయ్యారు. ఈ జంట ఎప్పుడో పధ్నాలుగేళ్ల క్రితమే ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రంలో అలరించారు. ఆ చిత్రంలో ‘దాయి దాయి దాయీ దాయి.. నువ్వు నాకు నచ్చావోయి..’ పాటకు బాలకృష్ణ, శ్రీయ చాలా క్యూట్‌గా డ్యాన్స్ చేశారు. రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సో.. తాజా చిత్రంలో జంట బాగుంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ మొరాకోలో జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో వేసిన భారీ యుద్ధ నౌక సెట్లో మలి షెడ్యూల్ చేయనున్నారు. ఈ నెలలోనే ఈ షెడ్యూల్ ఆరంభమవుతుంది. -
యుద్ధం కోసం సిద్ధం!
భారతదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూపొందుతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న నూరవ చిత్రం కావడంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శాతకర్ణి భార్య పాత్రకు నయనతార, శ్రీయ పేర్లను పరిశీలిస్తున్నారట. బిబో శ్రీనివాస్ సమర్పణలో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇటీవల మొరాకోలో పూర్తయింది. మలి షెడ్యూల్‌ను ఈ నెల 30న హైదరాబాద్‌లో మొదలుపెట్టనున్నారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ- ‘‘ ఈ నెల 30న మొదలుపెట్టి, జూన్ 7 వరకూ చిలుకూరి బాలాజీ ఆలయం సమీపంలో చిత్రీకరణ జరుపుతాం. ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అని చెప్పారు. హైదరాబాద్‌లో జరపనున్న షెడ్యూల్ కోసం భారీ యుద్ధనౌక సెట్ వేశారు. ఇంత పెద్ద నౌక సెట్‌ను వేయడం ఇదే తొలిసారి అని నిర్మాతలు తెలిపారు. ఈ సెట్లో షూటింగ్ చేయడం కోసం ఫైట్‌మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో రెండు వందల మంది ఆర్టిస్టులకు కత్తి సాము శిక్షణ ఇప్పిస్తున్నామనీ, అత్యంత భారీ ఎత్తున ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నామనీ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, మాటలు: బుర్రా సాయిమాధవ్, ఆర్ట్: భూపేష్ భూపతి, సహ-నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు. -
పోరాటమే ఊపిరిగా..!
ఒకటో శతాబ్దం నాటి కాలం అది. గౌతమీ పుత్ర శాతకర్ణి తన శత్రు దేశపు రాజుతో విజయమో... వీరస్వర్గమో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఎంతో మంది సైనికులు యుద్ధభూమిలో తమ ప్రాణాలను ఒడ్డి పోరాడుతున్నారు. మరి విజయం ఎవరిది...? ఆ సంగతి పక్కన పెడితే... ఈ పోరాట దృశ్యాలను ‘గౌతమీ పుత్ర శాతకరి’్ణ టీమ్ చిత్రీకరించింది. క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి పతాకంపై వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మొరాకోలో జరుగుతోంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయింది. క్రిష్ మాట్లాడుతూ- ‘‘ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో దాదాపు వెయ్యి మంది షూటింగ్లో పాల్గొనగా బాలకృష్ణ, కబీర్బేడీల మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాం. బాలకృష్ణ ఏకంగా రోజుకు 14 గంటల పాటు ఈ చిత్రం కోసం శ్రమిస్తు న్నారు. అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియాస్లలో చిత్రీకరణ జరిపాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, మాటలు: బుర్రా సాయి మాధవ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు. -
మొరాకోలో మొదలు!
తెలుగుజాతి గొప్పతనాన్ని నలుదిశలా చాటిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. ఆయన చరిత్రను కథాంశంగా తీసుకుని దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొరాకోలో ప్రారంభం కానుంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మొరాకోలోని అద్భుతమైన లొకేషన్లలో ఒకటవ శతాబ్దానికి సంబంధించిన సన్నివేశాలు తీస్తాం. ఫైట్‌మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్‌తో యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నాం. ఎన్నో హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పాటల రికార్డింగ్ మొదలుపెట్టారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సిరివెన్నెల, సమర్పణ: బిబో శ్రీనివాస్, కెమేరా: జ్ఞానశేఖర్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు. -
సంగీత చర్చల్లో... గౌతమీపుత్రుడు!
అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథాంశంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న తెలుగువారి చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవలే అట్టహాసంగా ప్రారంభమైంది. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా సంగీత చర్చలు ప్రారంభమయ్యాయి’’ అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న దేవిశ్రీప్రసాద్ ఈ సంగతి ట్విట్టర్లో వెల్లడించారు. దేవిశ్రీ ప్రసాద్, బాలకృష్ణ కాంబినేషన్ అనగానే ఆ మధ్య వచ్చిన మంచి మ్యూజికల్ హిట్ ‘లెజెండ్’ అందరికీ గుర్తొస్తుంది. దాంతో, ఇప్పుడు ఈ చిత్ర సంగీతంపై కూడా అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. -
కేసీఆర్‌కు బాలకృష్ణ ఆహ్వానం
హైదరాబాద్ : ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తన 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ముహుర్తం షాట్‌కు బాలయ్య ఈ సందర్భంగా కేసీఆర్‌ను ఆహ్వానించారు. కాగా అమరావతి చరిత్ర, అమరావతి రాజధానిగా శాతవాహన చక్రవర్తుల పరిపాలనపై బాలకృష్ణ హీరోగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని బాలకృష్ణ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమి టైటిట్‌ను ఉగాదిరోజున అమరావతిలో ప్రకటించగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా 22న పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించబోతుంది. అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను బాలయ్య ఆహ్వానించారు. ఆయనతో పాటు దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి మొదలవుతుంది.