మొరాకోలో మొదలు!
తెలుగుజాతి గొప్పతనాన్ని నలుదిశలా చాటిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. ఆయన చరిత్రను కథాంశంగా తీసుకుని దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొరాకోలో ప్రారంభం కానుంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మొరాకోలోని అద్భుతమైన లొకేషన్లలో ఒకటవ శతాబ్దానికి సంబంధించిన సన్నివేశాలు తీస్తాం.
ఫైట్‌మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్‌తో యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నాం. ఎన్నో హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పాటల రికార్డింగ్ మొదలుపెట్టారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సిరివెన్నెల, సమర్పణ: బిబో శ్రీనివాస్, కెమేరా: జ్ఞానశేఖర్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు.