Morocco
-
నిర్మాతతో మొరాకో టూర్లో హీరోయిన్ త్రిష! (ఫొటోలు)
-
50 ఏళ్లలో తొలిసారి సహారా ఎడారిలో వరదలు.. ఫోటోలు వైరల్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారాలో అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు సహారా ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ప్రవహించింది. ఆగ్నేయ మొరాకోలోని ఎడారి ప్రాంతంలో వర్షం పడడమంటే చాలా అరుదైన ఘటన. మొరాకో ప్రభుత్వ సమాచారం మేరకు సెప్టెంబరులో రెండురోజుల పాటు కురిసిన వర్షం.. చాలా ప్రాంతాల్లో ఏడాది సగటును మించిపోయింది.ఇక్కడ ఏటా 250 మి.మీ. కంటే తక్కువగా సగటు వర్షపాతం నమోదవుతుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని రబత్కు 450 కి.మీ. దూరంలోని టాగౌనైట్ గ్రామంలో 24 గంటల్లోనే 100 మి.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసిందని.. ఇది అత్యంత అరుదైన పరిణామమని పేర్కొన్నాయి. జాగోరా, టాటా మధ్య 50 ఏళ్లుగా పాటు పొడిగా ఉన్న ఇరికీ సరస్సు వరద కారణంగా తిరిగి నిండినట్లు నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడవుతోంది. గత 30 నుంచి 50 సంవత్సరాల నుంచి ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ వర్షాలు కురవడం ఇదే తొలిసారి అనిి మొరాకో వాతావరణ సంస్థ అధికారి హౌసీన్ యూబెబ్ పేర్కొన్నారు. కాగా గత నెలలో మొకరాలో సంభవించిన వరదలు 18 మందిని బలిగొన్నాయి.ఇక సహారా ఎడారి, ఉత్తర, మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా అంతటా 9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రమైన వాతావరణ వేడిని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ తరహా తుఫానులు మరింత తరచుగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
మొరాకోలో టాటా డిఫెన్స్ ఫ్యాక్టరీ.. విదేశాల్లో స్వదేశీ బ్రాండ్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మొదటిసారి విదేశాల్లో డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. మొరాకోలోని కాసాబ్లాంకాలో కంపెనీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే విదేశీ గడ్డపై అడుగుపెట్టిన మొట్టమొదటి స్వదేశీ రక్షణ కర్మాగారంగా టాటా రికార్డ్ క్రియేట్ చేయనుంది.ఫ్యాక్టరీ ప్రారంభమైన తరువాత కంపెనీ మొదట రాయల్ మొరాకో ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్‌ఫామ్‌లను (WhAP) ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. ఆ తరువాత ఆఫ్రికన్ మార్కెట్ కోసం ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీ ఏడాది లోపల ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ కర్మాగారంలో ప్రతి ఏటా 100 యుద్ధ వాహనాలను ఉత్పత్తి చేయనుంది.టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో WhAPని అభివృద్ధి చేసింది. సైన్యం కోసం వాహనాలను ఎంపికచేసి ముందు.. ఆఫ్రికా ఎడారుల్లోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించారు. ఆ తరువాత టాటా గ్రూప్ మొరాకోలో సాయుధ వాహనాలను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?ప్రస్తుతం టాటా మోటార్స్ భారత సైన్యం కోసం వాహనాలను తయారు చేస్తోంది. వీటిని మన ఆర్మీ ఇప్పుడు వినియోగిస్తుంది కూడా. అయితే ఈ వాహనాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ తయారు చేసే వాహనాలు చాలా దృడంగా ఉంటాయి. -
అర్జెంటీనాకు షాక్
సెయింట్ ఎటిన్ (ఫ్రాన్స్): పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా శుక్రవారం మొదలు కావాల్సినా... ఫుట్‌బాల్, రగ్బీ సెవెన్స్ క్రీడాంశాల్లో బుధవారం పోటీలు ప్రారంభమయ్యాయి. పురుషుల ఫుట్‌బాల్ ఈవెంట్ సంచలనంతో ఆరంభమైంది. రెండుసార్లు స్వర్ణ పతక విజేత అర్జెంటీనా తొలి లీగ్ మ్యాచ్‌లో 1–2తో మొరాకో చేతిలో ఓడిపోయింది. ఇంజ్యూరీ టైమ్‌లో అర్జెంటీనా చేసిన గోల్‌ను ముందుగా రిఫరీ అనుమతించడంతో స్కోరు 2–2 తో సమమైంది. అయితే రిఫరీ నిర్ణయంతో ఆగ్రహించిన అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేశారు. దాంతో రెండు గంటలపాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఆటను కొనసాగించారు. అర్జెంటీనా రెండో గోల్‌ను టీవీ రీప్లేలో పరిశీలించి ఆఫ్ సైడ్‌గా పరిగణించి గోల్ ఇవ్వలేదు. దాంతో మొరాకో 2–1తో గెలిచింది. -
Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!
ప్రపంచంలో 2023లో భారీ స్థాయిలో భూకంపాలు సంభవించాయి. వీటివల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ప్రపంచంలో వచ్చిన కొన్ని ప్రధాన భూకంపాల గురించి తెలుసుకుందాం..! ఫిబ్రవరి 6: టర్కీ-సిరియా భూకంపం ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ, మధ్య ప్రాంతంలో భూమి రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో కంపించింది. సిరియాలో ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 7.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. భూమిలోపల 95 కిమీ లోపల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ విపత్తులో అపార ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపంలో 59,259 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 50,783 మంది కాగా.. సిరియాలో 8,476 మంది మృత్యువాతపడ్డారు. టర్కీ జనాభాలో 1.4 కోట్ల మంది ప్రభావితమయ్యారని అంచనా. సుమారు 1.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస అంచనా వేసింది. మార్చి 18: గుయాస్ భూకంపం, ఈక్వెడార్ దక్షిణ ఈక్వెడార్‌లో 2023 మార్చి 18న భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ఎల్ ఓరో, అజువే, గుయాస్ ప్రావిన్స్‌లలో భారీ నష్టాన్ని కలిగించింది. దాదాపు 446 మంది గాయపడ్డారు. 16 మంది మరణించారు. ఈక్వెడార్ జనాభాలో దాదాపు సగం మంది 8.41 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితులయ్యారు. దేశంలోని మొత్తం 24 ప్రావిన్సుల్లోని 13 ప్రావిన్సుల్లో భూమి కంపించింది. మార్చి 21: ఆఫ్ఘనిస్థాన్ భూకంపం 2023, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 1000 కిలోమీటర్ల వైశాల్యంలో భూమి కంపించింది. ఆప్ఘనిస్థాన్‌లోని 9 ప్రావిన్స్‌లలో ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితమయ్యారు. కనీసం 10 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. 665 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, క్వెట్టా, పెషావర్లలో ప్రకంపనలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో కారకోరం హైవే మూసుకుపోయింది. బునెర్ జిల్లాలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయి 40 మంది గాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా జమ్ము కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. సెప్టెంబరు 8: మొరాకో భూకంపం 2023 సెప్టెంబరు 8న మొరాకోలోని మరకేష్-సఫీ ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8-6.9 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 2,960 మంది ప్రాణాలు కోల్పోయారు. మరకేష్‌లోని చరిత్రాత్మక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. స్పెయిన్, పోర్చుగల్, అల్జీరియాలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. మొరాకో చరిత్రలో నమోదు చేయబడిన అత్యంత బలమైన భూకంపాల్లో ఇది ప్రధానమైంది. 1960 అగాదిర్ భూకంపం తర్వాత దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. 2023లో టర్కీ-సిరియా భూకంపం తర్వాత ఇందులోనే అత్యంత ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. 1,00,000 మంది పిల్లలతో సహా మరకేష్, అట్లాస్ పర్వతాల పరిసర ప్రాంతాల్లో 2.8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అక్టోబర్ 7: హెరాత్ భూకంపం, ఆఫ్ఘనిస్తాన్ 2023 అక్టోబర్ 7న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. గంటల వ్యవధిలో వరుసగా నాలుగు సార్లు భూకంపం రావడం భారీ నష్టాన్ని కలిగించింది. మొదటి రెండు భూకంపాలు అక్టోబర్ 7న హెరాత్ నగరానికి సమీపంలో సంభవించాయి. అక్టోబర్ 11, 15 తేదీల్లో అదే ప్రాంతంలో మరో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయి. ఈ భూకంపాల్లో 1,482 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,100 మందికి గాయాలయ్యాయి. 43,400 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1,14,000 మందికి మానవతా సహాయం అవసరమైందని అంచనా. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉండటంతో సరైన ఆస్పత్రి సౌకర్యాలు అందలేదు. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నవంబర్ 3: నేపాల్ భూకంపం 2023 నవంబర్ 3న నేపాల్ కర్నాలీ ప్రావిన్స్‌లోని జాజర్కోట్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 375 మంది గాయపడ్డారు. పశ్చిమ నేపాల్, ఉత్తర భారతదేశం అంతటా భూప్రకంపనలు కనిపించాయి. 2015 నుంచి నేపాల్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. మరణాల్లో జాజర్కోట్ జిల్లాలో 101 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారు. మరణించిన వారిలో 78 మంది పిల్లలు కూడా ఉన్నారు. నేపాల్‌లోని పదమూడు జిల్లాల్లో దాదాపు 62,039 ఇళ్లు ప్రభావితమయ్యాయి. వాటిలో 26,550 ఇళ్లు కుప్పకూలాయి. నవంబర్ 17: మిండనావో భూకంపం, ఫిలిప్పీన్స్ 2023 నవంబర్ 17న ఫిలిప్పీన్స్ మిండనావో ద్వీపంలోని సారంగని ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో 11 మంది మరణించారు. 730 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగున ఉన్న ఇండోనేషియాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. 644 ఇళ్లు కూలిపోగా.. 4,248 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదీ చదవండి: Year End 2023: అన్నీ మంచి శకునములే! -
అంతర్జాతీయ సవాళ్లపై సమాలోచనలు...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్‌కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐఎంఎఫ్ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు, ఇంటర్–అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలాన్ గోల్డ్ఫాజ్్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్‌తో కలిసి పనిచేయాలన్న భారత్ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
నిర్మలా సీతారామన్ మొరాకో పర్యటన నేటి నుంచి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం మొరాకో బయలుదేరనున్నారు. ఆ దేశ ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ఈ ఆరు రోజుల అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో ఆర్థికమంత్రి పాల్గొననున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితోపాటు ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలు అక్టోబర్ 11–15 తేదీల మధ్య మరకేచ్‌లో జరగనున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల కోసం వెళుతున్న భారత ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారులు ఈ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉంటారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఈ పర్యటనలో, సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాల్గవ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తారు.ఈ సమావేశంలో జీ20 దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 65 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగం కానున్నాయి. బహుళజాతి బ్యాంకుల పటిష్టతకు సంబంధించి నిపుణుల గ్రూప్ రూపొందించిన రెండవ వ్యాల్యూమ్ నివేదిక ఈ సమావేశాల్లో విడుదల కానుంది. మొదటి వ్యాల్యూమ్ నివేదిక గుజరాత్ గాం«దీనగర్‌లో జూలైలో జరిగిన మూడవ ఎఫ్‌ఎంసీబీజీ సమావేశాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. -
భారత్ 1 మొరాకో 1
లక్నో: డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్–2 టెన్నిస్ పోటీలో తొలి రోజు భారత్, మొరాకో క్రీడాకారులు ఒక్కో మ్యాచ్‌లో గెలిచారు. దాంతో స్కోరు 1–1తో సమంగా నిలిచింది. తొలి సింగిల్స్‌లో శశికుమార్ ముకుంద్ 7–6 (7/4), 5–7, 1–4తో యాసిన్ దిల్మీ చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 6–3, 6–3తో ఆడమ్ మౌన్డిర్పై గెలుపొందాడు. దిల్మీతో జరిగిన మ్యాచ్‌లో ముకుంద్ నిర్ణాయక మూడో సెట్లో 1–4తో వెనుకబడిన దశలో కాలి కండరాలు పట్టేయడంతో వైదొలిగాడు. నేడు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–యూకీ బాంబ్రీ జోడీ బెన్‌చిట్రి–లారూసి జంటతో ఆడుతుంది. రివర్స్ సింగిల్స్‌లో దిల్మీతో సుమిత్ నగాల్, ఆడమ్‌తో శశికుమార్ తలపడతారు. -
నాలుగు రోజుల గ్యాప్‌లో 6వేల మంది మృతి!
రెండూ ఆఫ్రికన్ దేశాలే. కానీ, ప్రకృతి ప్రకోపానికి తీరని నష్టంతో తల్లడిల్లిపోతున్నాయి. కేవలం నాలుగే రోజుల వ్యవధిలో.. ఈ రెండు దేశాల్లో ఆరు వేలమంది ప్రాణాలు పోయాయి. ఒకవైపు మొరాకోలో సంభవించిన భూ విలయం.. మరోవైపు లిబియాలో పోటెత్తిన జల విలయం.. వేల మందిని బలిగొనడమే కాకుండా.. ఊహించని స్థాయిలో ఇరు దేశాలకు నష్టం కలగజేశాయి. ఆఫ్రికా దేశం లిబియాలోని దెర్నా నగరాన్ని వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. ఒక్క ఆ నగరంలో వరదల ధాటికి 2 వేల మందికిపైగా మృతి చెందారు. మిగతా అన్నిచోట్లా కలిపి మృతుల సంఖ్య వెయ్యికి పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మరణాలు కాకుండా.. కొన్ని వేల మంది గల్లంతయ్యారు. 48 గంటలు గడిచినా వాళ్ల జాడపై ఇంకా స్పష్టత రాలేదు. జాడ లేకుండా పోయిన వాళ్ల సంఖ్య పదివేలకు పైనే ఉండొచ్చని అధికారిక వర్గాల అంచనా. అంటే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని లిబియా ప్రధాని ఒసామా హమద్ చెబుతున్నారు. మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి వారం రోజులుగా ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దెర్నా సహా ప్రధాన నగరాలను డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు. ఒక్కసారిగా డ్యామ్‌లు తెగిపోయి ఉప్పెన.. ఊళ్లను ముంచెత్తింది. జనాలు ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రాణాలు పొగొట్టుకున్నారు. దెర్నాలో అయితే వరద పెను విలయం సృష్టించింది. మరోవైపు విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తాగు నీరు, ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు అక్కడి వాతావరణ శాఖ ప్రకటించడంతో.. జనం బిక్కుబిక్కమంటూ గడుపుతున్నారు. మొరాకోలో మృత్యుఘోష శుక్రవారం రాత్రి మొరాకోలో సంభవించిన భూకంపం.. 3 వేల మందికిపైగా ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంది. సహయాక చర్యల్లో ఇంకా మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ప్రకృతి విలయం దాటిచ మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. భూకంపం వచ్చి నాలుగు రోజులు గడుస్తుండడంతో.. బాధితులు సజీవంగా బయటపడతారన్న ఆశలు కనుమరుగైపోయాయని అధికారులు అంటున్నారు. మొరాకోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి ఈ పెను విపత్తు సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం ధాటికి అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు వణికిపోయాయని తెలిపింది. దీంతో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. -
శవాల దిబ్బగా మొరాకో
మర్రకేశ్: భూకంపం సృష్టించిన పెను విధ్వంసం, ప్రాణనష్టం మొరాకో వాసులను షాక్‌కు గురిచేసింది. ఈ ఉత్తర ఆఫ్రికా దేశంలో ఇంతటి తీవ్ర భూకంపం రావడం 120 ఏళ్లలో ఇదే మొదటిసారి. దేశంలోని మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు భయాందోళనలతో వీధుల్లో రెండో రోజూ చీకట్లోనే జాగారం చేశారు. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది. శిథిలాలను తొలగిస్తుండటంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 2,012కు చేరింది. క్షతగాత్రులైన మరో 2,059 మందిలో 1,404 మందికి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని గుర్తించి, కాపాడేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సుదూరంగా కొండ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు సహాయక బృందాలు చేరడం కష్టంగా మారింది. అక్కడి మట్టిరోడ్లపై బండరాళ్లు పడిపోవడంతో టాక్సీలు, అంబులెన్సులు, రెడ్ క్రాస్ సిబ్బంది వాహనాలు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. అక్కడ జరిగిన నష్టం వివరాలు కూడా వెల్లడైతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఈ విలయానికి తీవ్రంగా ప్రభావితమైన అల్ హౌజ్ ప్రావిన్స్‌లో మరణాలు అత్యధికంగా 1,293 నమోదయ్యాయి. ఆ తర్వాత టరౌడంట్ ప్రావిన్స్‌లో 452 మంది చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్, అల్జీరియా, జర్మనీ, యూఏఈ, జోర్డాన్ తదితర దేశాలతోపాటు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి సంస్థలు చేయూత అందించేందుకు ముందుకు వచ్చాయి. కళతప్పిన పర్యాటక పట్టణం అట్లాస్ పర్వతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతం మౌలే బ్రహీం భూకంపం ధాటికి విలవిల్లాడింది. మూడువేల జనాభా కలిగిన ఈ చిన్న పట్టణవాసుల ప్రధాన ఆధారం వ్యవసాయం, పర్యాటకం. ఇక్కడి వందల ఏళ్లనాటి ఇటుకతో నిర్మించిన ఇళ్లు పర్యాటకులను ఆకట్టుకునేవి. భూకంపం తీవ్రతకు ఈ ఇళ్లు చాలా వరకు నామరూపాలు కోల్పోగా మిగిలినవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో, జనం ఇళ్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పట్టణంలోని కూడలిలోనే భారీ టెంట్ వేసుకుని, అందులోనే ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ఇల్లంతా ఒక్కసారిగా కదులుతున్నట్లు అనిపించడంతో తమ కుటుంబసభ్యులంతా కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశామని మౌలే బ్రహీంకు చెందిన హంజా లంఘానీ చెప్పాడు. బయటికి వెళ్లాక చూడగా తమ ఇంటితోపాటు పొరుగిల్లు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయన్నాడు. పొరుగింట్లో ఉండే తన చిన్ననాటి స్నేహితులు అయిదుగురూ ఆ శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయారని నిర్వేదంతో చెప్పాడు. భారతీయులంతా సురక్షితం భూకంపం నేపథ్యంలో మొరాకోలోని భారత దౌత్యకార్యాలయం స్పందించింది. దేశంలోని భారత పౌరులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం లేదన్నారు. స్థానిక యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాల్సిందిగా సలహా ఇచ్చింది. అవసరమైన పక్షంలో తమ హెల్ప్‌లైన్ నంబర్ 212661297491కు కాల్ చేయాల్సిందిగా కోరింది. -
Morocco : 2000 దాటిన భూకంప మృతుల సంఖ్య
మర్రకేశ్: మొరాకోను భూకంపం అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి సంభవించిన భూప్రకంపనలతో జనం ఒక్కసారిగా ఉలికిపడి వీదుల్లోకి పరుగులు తీశారు. వేలాది భవనాలు నేలమట్టం కాగా.. శిధిలాల్లో చిక్కుకుని 2000 మందికిపై పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విపత్తులో 2,012 మంది ప్రాణాలు కోల్పోగా, 2,059 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికా ఖండం ఉత్తరభాగం చరిత్రలో ఇంత పెద్ద భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అధికారులు అన్నారు. తీరప్రాంత నగరాలైన రబాత్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో బలమైన ప్రకంపనలు సంభవించాయని పేర్కొన్నారు. ఘటనాస్థలాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. MOMENTS BEFORE DISASTER: Horrific moments of the earthquake caught on CCTV footage. BREAKING NEWS: A devastating 6.8 magnitude earthquake that rattled Morocco on Friday night is believed to have left at least 300 people dead and 153 injured. pic.twitter.com/U12GfYPfRL — Cypy The Great (@Cypy254) September 9, 2023 భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని ఇఘిల్ పట్టణం సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. #Morocco #earthquake: The next 48 hours will be “#critical” for saving #lives. https://t.co/tmR0ZCnfDg— The Skuup (@TSkuup) September 10, 2023 2004లో, ఈశాన్య మొరాకోలోని అల్ హోసీమాలో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో కనీసం 628 మంది మరణించారు. 926 మంది గాయపడ్డారు.1960లో అగాదిర్‌లో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 12,000 మందికి పైగా ప్రాణాలను హరించింది. US President Joe Biden "deeply saddened" over loss of lives in Morocco earthquake Read @ANI Story | https://t.co/qqLDEElZAq#USPresident #JoeBiden #moroccoearthquake pic.twitter.com/l9heuiUfGB — ANI Digital (@ani_digital) September 10, 2023 మొరాకో భూకంపంపై ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్‌తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి. ఇదీ చదవండి: Morocco earthquake: వణికిన మొరాకో -
Morocco earthquake: వణికిన మొరాకో
మర్రకేశ్: మొరాకోను భారీ భూకంపం వణికించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, వీధుల్లోకి పరుగులు తీశారు. అట్లాస్ పర్వతాల్లోని గ్రామాలు మొదలుకొని చార్రితక మర్రకేశ్ నగరం వరకు వందలాదిగా భవనాలు ధ్వంసం కాగా 1,000 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. సుమారు 45 లక్షల మంది నివసించే మర్రకేశ్–సఫి ప్రాంతంలోనే భూకంప నష్టం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా. సుదూర ప్రాంతాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మర్రకేశ్లోని 12వ శతాబ్దం నాటి చారిత్రక కౌటౌబియా మసీదు భూకంప ధాటికి దెబ్బతింది. ఈ మసీదులోని 226 అడుగుల ఎత్తైన మినారెట్ ‘రూఫ్ ఆఫ్ మర్రకేశ్’గా ప్రసిద్ధి. అదేవిధంగా, నగరం చుట్టూతా ఉన్న ఎర్రటి గోడ అక్కడక్కడా దెబ్బతిన్న దృశ్యాలు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ గోడను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. భూకంప కేంద్రానికి చుట్టుపక్కలున్న మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో వెయ్యి మందికి పైగా చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మరో 672 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 205 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మొరాకో ప్రభుత్వం తెలిపింది. భూకంప కేంద్రం సమీపంలోని ఓ పట్టణంలో చాలా వరకు ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికుడొకరు వెల్లడించారు. అట్లాస్ పర్వతప్రాంతంలోని అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని తలత్ ఎన్ యాకూబ్ పట్టణంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్పారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. పర్యాటకులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రహదారులు దెబ్బతినడంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అత్యవసర బృందాలు భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా అరుదు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో భూకంపాలు చాలా అరుదు. మొరాకోలోని పర్వత ప్రాంతంలో ఇంతటి అత్యంత తీవ్ర భూకంపం గతంలో ఎన్నడూ సంభవించలేదని నిపుణులు చెబుతున్నారు. 1960లో 5.8 తీవ్రతతో మొరాకోలోని అగడిర్ నగరంలో సంభవించిన భూకంపంలో వేలాదిగా జనం చనిపోయారు. 2004లో తీరప్రాంత నగరం అల్ హొసైమాలో భూకంపంతో 600 మంది చనిపోయారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని నగరాలు, పట్టణాల్లో భూకంపాలను తట్టుకునే విధంగా భవనాల నిర్మాణం జరిగింది. అయితే, పల్లెల్లో మాత్రం ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. తాజా భూకంపం ప్రభావం పోర్చుగల్, అల్జీరియా వరకు ఉంది. ప్రమాదకర భూకంపం భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని ఇఘిల్ పట్టణం సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ప్రపంచదేశాల ఆపన్న హస్తం సాయం కోసం మొరాకో ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి విజ్ఞాపన చేయనప్పటికీ..ఈ ఘోర ప్రకృతి విపత్తుపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్‌తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి. సాధ్యమైనంత సాయం అందజేస్తాం: మోదీ మొరాకోలో భూకంపంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు భారత్ సాధ్యమైనంత మేర ఆదుకుంటుందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం మొదలైన జీ20 భేటీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మొరాకో భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం మొరాకోకు మద్దతుగా నిలవాలనీ, సాధ్యమైనంత మేర సాయం అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
Morocco: భూకంప విలయం.. 1000 మంది మృతి
రాబత్: ప్రకృతి విలయంతో ఆఫ్రికా దేశం మొరాకో తల్లడిల్లిపోయింది. శుక్రవారం రాత్రి సమయంలో మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. కనీసం 1000 మంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎటు చూసినా భవనాలు కుప్పకూలిపోయి.. అయిన వాళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 11.11 సమయంలో మధ్య మొరాకో మర్రకేచ్ నగరం కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 7.2 త్రీవతతో భూకంపం సంభవించింది. ఉన్నట్లుండి భవనాలు కుప్పకూలిపోయాయి. రోడ్డుల వెంట ఉన్న జనం.. ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రంతా రోడ్ల మీదే గడిపారు. భూకంపం ధాటికి.. వందల సంఖ్యలో మరణించి ఉంటారని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. మరో 300 మందిదాకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని ప్రభుత్వం చెబుతోంది. Moment when powerful 6.8 magnitude #earthquake rocked #Morocco atleast 296 dead #moroccoearthquake #moroccosismo #Sismo #viral #BREAKING pic.twitter.com/2fyjtgEC2O — Utkarsh Singh (@utkarshs88) September 9, 2023 మొరాకో భూకంపం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్(ట్విటర్)లో ఆయన సంతాప సందేశం ఉంచారు. Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to… — Narendra Modi (@narendramodi) September 9, 2023 యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.11 గం. ప్రాంతంలో కొన్ని సెకండ్ల పాటు భారీగా భూమి కంపించింది. భూమి ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఆ తర్వాత.. 19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు వెల్లడించింది. అయితే మొరాకో నేషనల్ సెయిస్మిక్ మానిటరింగ్ అండ్ అలర్ట్ నెట్వర్క్ మాత్రం.. తీవ్రత 7గా ఉన్నట్లు చెబుతోంది. అలాగే.. కేవలం 8 కిలోమీటర్ల లోతునే ప్రకంపనల కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది. Earthquake Morocco Richter 6.8#marrakech #agadir #casablanca #fes#مراكش #فاس #أغادير #الدار_البيضاء#moroccoearthquake #morocco #earthquakemorocco #earthquake#زلزال_المغرب #هزة_أرضية pic.twitter.com/EXBcv4rw17 — Jalal (@jalaloni) September 8, 2023 Scenes from Morocco's earthquake aftermath Understandably, people don't want to go back indoors because fearing aftershocks#earthquake #Maroc #moroccoearthquake #Morocco #earthquakemorocco #pray #hope #god #Marrakesh pic.twitter.com/cKg1bq0maq — Kinetik (@KinetikNews) September 9, 2023 మొరాకోలో స్వల్పతీవ్రతతో సంభవించే భూకంపాలకు సైతం తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. 1960లో రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం.. వేల మందిని బలిగొనడం గమన్హార్హం. ఇదిలా ఉంటే.. పోర్చుగల్, అల్జీరియాలోనూ భూకంపం సంభవించినా.. అవి స్వల్ఫ ప్రకంపనలే అని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని సమాచారం. -
మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..
రాబాత్: మొరాకోలో ప్యాసింజర్లతో వెళ్తోన్న ఓ బస్సు ప్రమాదకరమైన మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో బోల్తా కొట్టింది. ప్రమాదంలో 24 మందిమృతి చెందినట్లు తెలిపింది మొరాకో వార్తా సంస్థ(MAP ). సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డెమ్నాట్లోని వీక్లీ మార్కెట్‌కు వెళ్తోన్న ఓ బస్సు రోడ్డు మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 24 ముంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే రాయల్ జెండర్మీర్ పౌర రక్షణ సంస్థ వారు సహాయక చర్యలు చేపట్టారు. దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని విచారణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మొరాకోలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఏడాదికి రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించేవారు సంఖ్య సగటున 3500గా ఉందని, గతేడాది 3200 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతంలో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని సరిగ్గా గత ఏడాది ఆగస్టులో తూర్పు కాసాబ్లాంకాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకోగా ఆ ప్రమాదంలో 25 మంది మృతి చెందారని అంతకు ముందు 2015లో యువ అథ్లెట్లు ప్రయాణిస్తున్న ఒక బస్సును సెమీ ట్రైలర్ ట్రక్కు ఢీకొట్టడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: చైనాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు.. -
Monaco Grand Prix: వెర్‌స్టాపెన్‌దే గెలుపు.. సీజన్లో నాలుగో టైటిల్
మోంటెకార్లో: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాలుగో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని ఆరో రేసు మొనాకో గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ నిరీ్ణత 78 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 1 గంట 48 నిమిషాల 51.980 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెర్నాండో అలోన్సో (ఆస్టిన్ మార్టిన్) రెండో స్థానంలో, ఎస్టెబన్ ఒకాన్ (అలై్పన్ టీమ్) మూడో స్థానంలో నిలిచారు. max cమెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, జార్జి రసెల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. ఈ సీజన్లో ఆరు రేసులు జరగ్గా ఆరింటిని రెడ్‌బుల్ డ్రైవర్లే గెల్చుకోవడం విశేషం. వెర్స్టాపెన్ బహ్రెయిన్, ఆ్రస్టేలియన్, మయామి, మొనాకో గ్రాండ్‌ప్రిలలో నెగ్గగా... సెర్జియో పెరెజ్ సౌదీ అరేబియా, అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలలో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం 144 పాయింట్లతో వెర్స్టాపెన్ టాప్ ర్యాంక్‌లో, 105 పాయింట్లతో పెరెజ్ రెండో ర్యాంక్‌లో, 93 పాయింట్లతో అలోన్సో మూడో ర్యాంక్‌లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్‌ప్రి జూన్ 4న జరుగుతుంది. -
135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం
మొరాకోకు చెందిన టెన్నిస్ ఆటగాడికి అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రీటీ ఏజెన్సీ(ITIA) షాక్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ నేరాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు ఐటీఐఏ గురువారం పేర్కొంది. బెల్జియంలోని ఐటీఐఏతో కలిసి లా ఎన్ఫోర్స్మెంట్ పరిశోధనల తర్వాత ఇద్దరు అల్జీరియన్ ఆటగాళ్లతో రచిడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇకపై యూనెస్ రచిడి కోచింగ్ లేదా క్రీడల పాలక సంస్థలు అనుమతించిన ఏ టెన్నిస్ ఈవెంట్లో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు తెలిపింది. కెరీర్లో అత్యధిక డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 473వ ర్యాంక్‌కు చేరుకున్న యూనెస్ రచిడికి 34 వేల డాలర్ల జరిమానా కూడా విధించినట్లు ఐటీఐఏ వివరించింది. చదవండి: ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు -
చివరిసారిగా అందాల ప్రదర్శన.. లుకా మోడ్రిక్ కోసం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం మూడోస్థానం కోసం మొరాకోతో జరిగని ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 2-1 తేడాతో క్రొయేషియా ఘన విజయం సాధించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జట్టు కెప్టెన్ లుకా మోడ్రిక్ తన కెరీర్లో చివరి ఫిఫా వరల్డ్‌కప్ ఆడేసినట్లే. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో క్రొయేషియాను నడిపించిన లుకా మోడ్రిక్ ఒకసారి రన్నరప్, మరోసారి మూడో స్థానంలో నిలిపాడు. టైటిల్ అందుకోవాలన్న తన కలను నెరవేర్చుకోలేకపోయాడు లుకా మోడ్రిక్. అయినా కూడా ఈ క్రొయేషియా స్టార్ తన ఆటతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సంగతి పక్కనబెడితే.. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫుట్‌బాల్ స్టార్స్ తర్వాత మరో పేరు బాగా మార్మోగింది. ఆమెనే క్రొయేషియా మోడల్ ఇవానా నోల్. ఖతర్‌లో పొట్టి దుస్తులు వేసుకోవాన్ని ఆ దేశం బహిష్కరించనప్పటికి ఇవానా నోల్ మాత్రం పొట్టి బట్టలు ధరించి క్లీవేజ్ షో చేస్తూ అందాల ఆరబోతను ప్రదర్శించింది. తనకు ఖతర్ అధికారుల నుంచి అనుమతి ఉందని.. అందుకే పొట్టి దుస్తులు వేసుకొని స్టేడియానికి వచ్చినట్లు ఇవానా పేర్కొంది. ఇక తాజాగా శనివారం క్రొయేషయా, మొరాకోల మధ్య జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో మరోసార దర్శనమిచ్చింది. అయితే ఈసార అందాల ప్రదర్శన కాకుండా తన ఫెవరెట్ అయిన.. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిక్ కోసం మ్యాచ్‌కు వచ్చిందంట. అందుకు తగ్గట్లుగానే లుకా మోడ్రిక్ పేరున్న ప్రత్యేక ఔట్‌ఫిట్‌ను వేసుకొచ్చింది. ఈ సందర్భంగా లుకా మోడ్రిక్కు స్పెషల్ థాంక్స్ చెబుతూ.. థాంక్యూ కెప్టెన్ లుకా మోడ్రిక్.. మన దేశం గర్వించేలా చేశారు. ఇక మూడోప్లేస్లో నిలిచి మెడల్ అందుకోవడమే తరువాయి. ఇంకెందుకు ఆలస్యం పని కానిచ్చేయండి అంటూ రాసుకొచ్చింది. ఇవానా నోల్ కోరికను క్రొయేషియా నిలబెట్టింది. మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-1తేడాతో గెలిచి ఈ వరల్డ్‌కప్‌ను మూడోస్థానంతో ముగించింది క్రొయేషియా జట్టు. ఏది ఏమైనా ఈసారి మాత్రం ఇవానా నోల్ తన అందచందాలతో ప్రత్యేకంగా నిలిచింది. చదవండి: మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
మొరాకోపై ఘన విజయం.. మూడోస్థానం క్రొయేషియాదే
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ను క్రొయేషియా మూడోస్థానంతో ముగించింది. శనివారం మూడోస్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో క్రొయేషియా.. మొరాకోను 2-1 తేడాతో ఓడించింది. క్రొయేషియా తరపున ఆట 7వ నిమిషంలో జోస్కో గ్వార్డియోల్, ఆట 42వ నిమిషంలో మిస్లావ్ ఓర్సిక్ గోల్స్ చేశారు. ఇక మొరాకో తరపున ఆట 9వ నిమిషంలో అచ్రఫ్ డారీ గోల్ చేశాడు. అయితే ఆట తొలి అర్థభాగంలోనే ఇరుజట్లు గోల్స్ చేశాయి. రెండో అర్థభాగంలో గోల్స్ కోసం ప్రయత్నించినప్పటికి సఫలం కాలేకపోయాయి. ఇక గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈసారి మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో తొలిసారి సెమీస్ చేరి సంచలనం సృష్టించింది. గ్రూప్ దశలో బెల్జియం.. నాకౌట్స్‌లో పోర్చుగల్, స్పెయిన్‌లను ఓడించి సెమీస్‌కు చేరుకున్న మొరాకో డిఫెడింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఆదివారం(డిసెంబర్ 18న) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగే ఫైనల్‌తో మెగాటోర్నీ ముగియనుంది. -
FIFA WC: వార్నీ వదిలేస్తే మొత్తం తినేసేలా ఉన్నాడు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శనివారం మొరాకో, క్రొయేషియా మధ్య మూడోస్థానం కోసం ప్లేఆఫ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు అంతా సిద్ధం చేసుకున్నాయి. గతేడాది రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా మూడో స్థానంలో నిలుస్తుందా లేక తొలిసారి సెమీస్ వరకు అందరి దృష్టిని ఆకర్షించిన మొరాకో జట్టు మూడోస్థానం సాధించి కెరీర్ బెస్ట్‌ను అందుకుంటుందా అనేది చూడాలి. ఈ సంగతి పక్కనబెడితే.. మొరాకో గోల్‌కీపర్ యాసీ బౌనౌ కుమారుడు చేసిన పని సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. పోర్చుగల్‌తో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన అనంతరం యాసీ బౌనౌ తన కుమారుడితో కలిసి ఇంటర్య్వూ ఇచ్చేందుకు వచ్చాడు. యాసీ మాట్లాడుతుండగా.. రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్‌ను ఐస్‌క్రీం అనుకొని నాకడానికి ప్రయత్నించాడు. కానీ అది ఐస్‌క్రీం కాదని తెలుసుకొని వెనక్కి తగ్గాడు. కొడుకు చేసిన పనిని గమనించిన యాసీ బౌనౌకు నవ్వు ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక మొరాకో గోల్‌కీపర్‌గా యాసీ బౌనౌ సూపర్ ఫామ్ కొనసాగించాడు. పెనాల్టీ అడ్డుకోవడంలో మంచి ప్రదర్శన కనబరిచిన యాసీ ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అదే ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 పెనాల్టీల్లో ఐదింటిని గోల్స్ కాకుండా అడ్డుకున్నాడు. Yassine Bounou's son thinking the 🎤 to be 🍦 is supremely adorable! ❤️ #FIFAWorldCup pic.twitter.com/YTorvQwDvM — FIFA World Cup (@FIFAWorldCup) December 14, 2022 -
FIFA World Cup Qatar 2022 Second Semi-Final: ఫైనల్‌కు ‘ఫ్రెంచ్ కిక్’
ఎట్టకేలకు మొరాకో తన ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకుంది. మేటి జట్లకే కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఆఫ్రికా జట్టు చివరకు సెమీఫైనల్లో ఓడింది. సంచలనానికి ఛాన్స్ ఇవ్వని ఫ్రాన్స్ నిర్ణీత సమయంలోనే విజయం సాధించింది. ‘డిఫెండింగ్ చాంపియన్’ వరుసగా రెండో ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిజానికి మొరాకో ఆషామాషీగా తలొగ్గలేదు. గోల్ కోసం ఆఖరి ఇంజ్యూరీ టైమ్ దాకా శ్రమించింది. మైదానం మొత్తం మీద ఫ్రాన్స్ స్ట్రయికర్లకు దీటుగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై గురి పెట్టినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. మరోవైపు ఫ్రాన్స్... ఈ టోర్నీలోనే కొరకరాని కొయ్యను ఐదో నిమిషంలోనే దారికి తెచ్చుకుంది. ద్వితీయార్ధంలో ఎదురులేని విజయానికి స్కోరును రెట్టింపు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్‌కు వచ్చి తమ అద్భుత పోరాటపటిమతో తమకంటే ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టించిన మొరాకో ఇక మూడో స్థానం కోసం శనివారం గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తలపడుతుంది. దోహా: అర్జెంటీనా ఫైనల్ ప్రత్యర్థి ఎవరో తేలింది. ఇక ఆఖరి సమరమే మిగిలుంది. విజేత ఎవరో... రన్నరప్‌గా మిగిలేదెవరో ఆదివారం రాత్రి తెలుస్తుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ 2–0 గోల్స్ తేడాతో ఈ టోర్నీలో మింగుడు పడని ప్రత్యర్థి మొరాకోను ఓడించి ఫైనల్ చేరింది. మ్యాచ్ 5వ నిమిషంలో థియో హెర్నాండెజ్... 79వ నిమిషంలో ‘సబ్‌స్టిట్యూట్’ రాన్‌డల్ కొలొముని ఫ్రాన్స్ జట్టుకు చెరో గోల్ అందించారు. 78వ నిమిషంలోనే మైదానంలోకి వచ్చిన సబ్‌స్టిట్యూట్ రాన్‌డల్ 44 సెకన్లలోనే గోల్ చేయడం విశేషం. ఈ మెగా టోర్నీలోనే నిర్ణీత సమయంలో క్వార్టర్స్ దాకా ప్రత్యర్థులెవరికీ గోల్ ఇవ్వని మొరాకో సెమీస్‌లో రెండు గోల్స్ ఇవ్వడమే కాకుండా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మొరాకో గత మ్యాచ్‌లకి, తాజా సెమీఫైనల్స్‌కు ఇదొక్కటే తేడా! దీని వల్లే సంచలనం, టైటిల్ సమరం రెండు సాకారం కాలేకపోయాయి. ఆట మొదలైన కాసేపటికే ఫ్రాన్స్ పంజా విసరడం మొదలు పెట్టింది. గ్రీజ్మన్ ‘డి’ ఏరియాలో బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్ సమీపానికి తీసుకెళ్లాడు. కానీ క్రాస్ షాట్ కష్టం కావడంతో కిలియాన్ ఎంబాపెకు క్రాస్ చేశాడు. కానీ అతని షాట్ విఫలమైంది. అక్కడే గుమిగూడిన మొరాకో డిఫెండర్లు అడ్డుకున్నారు. అయితే బంతి మాత్రం అక్కడక్కడే దిశ మార్చుకుంది. గోల్‌పోస్ట్‌కు కుడివైపు వెళ్లగా అక్కడే ఉన్న థియో హెర్నాండెజ్ గాల్లోకి ఎగిరి ఎడమ కాలితో కిక్ సంధించాడు. దీన్ని ఆపేందుకు గోల్ కీపర్ యాసిన్ బోనో అతని ముందుకెళ్లగా... మొరాకో కెప్టెన్ రొమెయిన్ సైస్, అచ్రాఫ్ డారి గోల్‌పోస్ట్‌ను కాచుకున్నారు. అయినా సరే హెర్నాండెజ్ తన ఛాతీ ఎత్తున ఉన్న బంతిని ఎడమ కాలితో తన్ని లక్ష్యానికి చేర్చాడు. ఆఖరి క్షణంలో గోల్పోస్ట్లోనే ఉన్న అచ్రాఫ్ డారి దాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడు. కానీ అతని కుడి మొకాలికి వెంట్రుకవాసి దూరంలోనే బంతి గోల్ అయ్యింది. ఫ్రాన్స్ 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరో 5 నిమిషాల వ్యవధిలోనే... మొరాకోకు ఆట పదో నిమిషంలో సమం చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘డి’ ఏరియా వెలుపలి నుంచి అజెడైన్ వొవునహి ఫ్రాన్స్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా లాంగ్‌షాట్ కొట్టాడు. ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ ఎడమ చేతితో అడ్డుకున్నప్పటికీ బంతి రీబౌండ్ అయింది. కానీ సమీపంలో తిరిగి షాట్ కొట్టే మొరాకో స్ట్రయికర్లు ఎవరూ లేకపోవడంతో గోల్ అవకాశం త్రుటిలో చేజారింది. 17వ నిమిషంలో ఫ్రాన్స్ స్కోరు రెట్టింపయ్యే ఛాన్స్ కూడా మిస్సయ్యింది. ఒలివియర్ జిరూడ్ మెరుపు వేగంతో మొరాకో ‘డి’ ఏరియాలోకి దూసుకొచ్చి బలంగా కొట్టిన షాట్ ప్రత్యర్థి గోల్‌కీపర్ కూడా ఆపలేకపోయాడు. కానీ బంతి గోల్‌పోస్ట్ కుడివైపున బార్ అంచును తాకి బయటికి వెళ్లిపోయింది. మళ్లీ 36వ నిమిషంలోనూ ఫ్రాన్స్ ఆటగాడు జిరూడ్ గట్టిగానే ప్రయత్నించాడు. వాయువేగంతో కొట్టిన షాట్‌ను మొరాకో డిఫెండర్ జవాద్ ఎల్ యామిక్ కళ్లు చెదిరే కిక్‌తో అడ్డుకున్నాడు. లేదంటే బంతి బుల్లెట్ వేగంతో గోల్‌పోస్ట్‌లోకి వెళ్లేది! 44వ నిమిషంలో కార్నర్‌ను గోల్‌పోస్ట్ కుడివైపున ఉన్న జవాద్ ఎల్ యామిక్ చక్కగా తనను తాను నియంత్రించుకొని బైసైకిల్ కిక్ కొట్టాడు. దాదాపు గోల్ అయ్యే ఈ షాట్‌ను ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ కుడి వైపునకు డైవ్ చేసి చేతితో బయటికి పంపించాడు. ద్వితీయార్ధంలోనూ మొరాకో గోల్స్ కోసం అదేపనిగా చేసిన ప్రయత్నాల్ని ఫ్రాన్స్ ఆటగాళ్లు ఎక్కడికక్కడ కట్టడి చేసి అడ్డుకున్నారు. 78వ నిమిషంలో రాన్‌డల్ మైదానంలోకి వచ్చాడు. అప్పుడే సహచరులు మార్కస్ తురమ్, ఎంబాపెలు మొరాకో ‘డి’ ఏరియాలో పరస్పరం పాస్ చేసుకొని గోల్‌పై గురి పెట్టారు. కానీ డిఫెండర్లు చుట్టుముట్టడంతో గోల్‌పోస్ట్‌కు మరింత సమీపంలో ఉన్న రాన్డల్కు ఎంబాపె క్రాస్పాస్ చేశాడు. 79 నిమిషంలో రాన్‌డల్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సులువుగా గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో ఫ్రాన్స్ ఆధిక్యం రెట్టింపైంది. మొరాకో విజయంపై ఆశలు వదులుకుంది. 4: ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఫ్రాన్స్ నాలుగోసారి (1998, 2006, 2018, 2022) ఫైనల్ చేరింది. రెండుసార్లు (1998, 2018) విజేతగా నిలిచింది. 5: వరుసగా రెండు అంతకంటే ఎక్కువసార్లు ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన ఐదో జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962), నెదర్లాండ్స్ (1974, 1978), పశ్చిమ జర్మనీ (1982, 1986), బ్రెజిల్ (1994, 1998, 2002) ఈ ఘనత సాధించాయి. 4: తమ జట్టును వరుసగా రెండు ప్రపంచకప్ లలో ఫైనల్‌కు చేర్చిన నాలుగో కోచ్‌గా ఫ్రాన్స్‌కు చెందిన దిదీర్ డెషాంప్ గుర్తింపు పొందాడు. గతంలో విటోరియో పోజో (ఇటలీ; 1934, 1938), కార్లోస్ బిలార్డో (అర్జెంటీనా; 1986, 1990), బెకన్బాయెర్ (జర్మనీ; 1986, 1990) ఈ ఘనత సాధించారు. 1998లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో డెషాంప్ ప్లేయర్‌గా ఉన్నాడు. అనంతరం 2018లో విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు ఆయనే కోచ్‌గా ఉన్నారు. 3: ప్రపంచకప్ చరిత్రలో సబ్‌స్టిట్యూట్‌గా ఫాస్టెస్ట్ గోల్ చేసిన మూడో ప్లేయర్‌గా రాన్‌డల్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు. మొరాకోతో మ్యాచ్‌లో అతను సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన 44 సెకన్లకే గోల్ చేశాడు. ఈ జాబితాలో రిచర్డ్ మొరాలెస్ (ఉరుగ్వే; 2002లో సెనెగల్పై 16 సెకన్లలో), ఎబ్బీ సాండ్ (డెన్మార్క్; 1998లో నైజీరియాపై 26 సెకన్లలో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ దర్జాగా ఫైనల్స్‌కు చేరుకుంది. ఇక డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరగనున్న ఫైనల్లో గెలిచి చాంపియన్‌షిప్‌ను నిలుపుకోవాలని ఫ్రాన్స్ భావిస్తోంది. అయితే మొరాకోతో జరిగిన సెమీస్‌లో ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె మెరవనప్పటికి తామున్నామంటూ ఇద్దరు ఆటగాళ్లు అదరగొట్టారు. వారిలో ఒకడు తియో హెర్నాండేజ్ అయితే.. ఇంకొకడు రాండల్ కొలో మునాయ్. ఆట 5వ నిమిషంలో హెర్నాండేజ్ గోల్ కొట్టి ఫ్రాన్స్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్తే.. రెండో అర్థభాగంలో ఆట 79వ నిమిషంలో రాండల్ మరో గోల్ కొట్టి 2-0తో ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు. రాండల్ సంగతి పక్కనబెడితే.. ఆట ఆరంభంలోనే గోల్‌తో మెరిసిన తియో హెర్నాండేజ్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే.. తియో హెర్నాండేజ్ ఎవరో కాదు.. ఫ్రాన్స్ స్టార్ లుకాస్ ఫెర్నాండేజ్ సొంత తమ్ముడు. అన్నదమ్ములిద్దరు ఏకకాలంలో ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహించారు.అయితే గ్రూప్ దశలో ఫ్రాన్స్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. కానీ ఆట ఆరంభమైన కాసేపటికే లుకాస్ ఫెర్నాండేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. మైదానం వీడిన లుకాస్ ఇప్పటి వరకు తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఫిఫా వరల్డ్‌కప్‌కు పూర్తిగా దూరమైనట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. అన్న దూరం కావడం తియో హెర్నాండేజ్ను బాధించింది. ఎలాగైనా అన్న కోసం కప్ గెలవాలని బలంగా కోరుకున్నాడు. అప్పటినుంచి ప్రతీ మ్యాచ్ ఆడినప్పటికి హెర్నాండేజ్కు గోల్ కొట్టే అవకాశం రాలేదు. తాజాగా ఆ సమయం రానే వచ్చింది. మొరాకోతో కీలకమైన సెమీఫైనల్లో తియో హెర్నాండేజ్ గోల్ కొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక అన్న లుకాస్ హెర్నాండేజ్ కల నిజం చేసేందుకు తియో హెర్నాండేజ్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అర్జెంటీనాతో జరగనున్న ఫైనల్లో ఫ్రాన్స్‌ను గెలిపించి అన్నకు టైటిల్ కానుకగా ఇవ్వాలనుకుంటున్నాడు. మొరాకోపై గెలుపు అనంతరం తియో హెర్నాండేజ్ మీడియాతో మాట్లాడాడు. ''లూలూ(లుకాస్ హెర్నాండేజ్).. ఈసారి వరల్డ్‌కప్ మనిద్దరి కోసం ఆడుతున్నా. మొరాకోతో మ్యాచ్‌లో గోల్ కొట్టగానే కోచ్ నన్ను పిలిచి మీ అన్న లుకాస్ నిన్ను అభినందించినట్లు చెప్పమని పేర్కొనడం సంతోషం కలిగించింది. నా ప్రదర్శన పట్ల లుకాస్ గర్వపడుతున్నాడు. ఆటలో నువ్వు లేకపోవచ్చు.. కానీ ఎప్పుడు నాతోనే ఉండాలని ఆశపడుతున్నా. నీ గాయం నాకు కష్టంగా అనిపిస్తున్నప్పటికి తప్పదు. అన్న కోసం కప్ గెలవాలనుకుంటున్నా. మ్యాచ్ ముగిసిన ప్రతీరోజు మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం'' అంటూ పేర్కొన్నాడు. 😬 Is @TheoHernandez a ninja? 🥷🏻 Check out the 🔢 from his 🤯 goal in last night's #FRAMAR 📹 Next 🆙 for the @FrenchTeam 👉🏻 #FIFAWorldCup Final 🆚 @Argentina on Dec 18 - 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/qX69GwBACz — JioCinema (@JioCinema) December 15, 2022 చదవండి: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు' -
'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు'
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయం అందుకుంది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన ఫ్రాన్స్ టోర్నీ ఆసాంతం అందుకు తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తూ వచ్చింది. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె గోల్ కొట్టడంలో విఫలమైనప్పటికి మేమున్నామంటూ తియో హెర్నాండేజ్(ఆట 5వ నిమిషం), రాండల్ కొలో మునాయ్(ఆట 79వ నిమిషం)లో ఫ్రాన్స్‌కు గోల్ అందించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక డిసెంబర్ 18(ఆదివారం) జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమితుమీ తేల్చుకోనుంది. ఇదిలా ఉంటే ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆఫ్రికా జట్టు మొరాకో సెమీస్ చేరి అందర్ని ఆశ్చర్యపరిచింది. గ్రూప్ దశలో బెల్జియం, నాకౌట్స్‌లో స్పెయిన్, పోర్చుగల్‌లను చిత్తు చేసి సెమీఫైనల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. అయితే ఫ్రాన్స్ అనుభవం ముందు మొరాకో తలవంచక తప్పలేదు.. అయినా సరే తమ ఆటతీరుతో ఇంత దూరం వచ్చిన మొరాకో జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె, మొరాకో ఢిపెండర్ అచ్రఫ్ హకీమిలు బయట బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. దాదాపు ఒకేసారి ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించిన ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరు ఫిఫా వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మాత్రం ప్రత్యర్థులయ్యారు. దేశం కోసం మ్యాచ్ ఆడగా.. ఎంబాపె విజయం సాధించగా.. హకీమి ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ వరకు మాత్రమే తాము ప్రత్యర్థులమని.. బయట ఎప్పటికీ ప్రాణ స్నేహితులమేనని మరోసారి నిరూపించారు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి సంచలన విజయాలు అందుకున్న తన జట్టు సెమీస్‌లో నిష్క్రమించడంతో హకీమి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇది గమనించిన ఎంబాపె.. అతని వద్దకు వచ్చి ఓదార్చాడు. బాధపడకు మిత్రమా.. ఓడినా మీరు చరిత్ర సృష్టించారు. మేటి జట్లను చిత్తు చేసి ఇంతదూరం రావడం సామాన్యమైన విషయం కాదు. మీ పోరాటం అమోఘం. అయితే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు మాత్రమే విజయం సాధిస్తుంది. ఇవాళ నీపై నేను పైచేయి సాధించాను. టోర్నీ వరకే ప్రత్యర్థులం.. బయట మాత్రం ఎన్నటికి స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఎంబాపె, అచ్రఫ్ హకీమిలు తమ జెర్సీలను మార్చుకొని తమ స్నేహం గొప్పతనాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Don’t be sad bro, everybody is proud of what you did, you made history. ❤️ @AchrafHakimi pic.twitter.com/hvjQvQ84c6 — Kylian Mbappé (@KMbappe) December 14, 2022 Kylian Mbappe went straight over to console his good friend and teammate Achraf Hakimi.🤗 pic.twitter.com/IvbwKbemEu — Ben Jacobs (@JacobsBen) December 14, 2022 PSG team-mates Mbappe and Hakimi swapping shirts at the end.#Mar #fra #FIFAWorldCup pic.twitter.com/DrufStKHAV — Shamoon Hafez (@ShamoonHafez) December 14, 2022 Hugo Lloris kept his first clean sheet in #Qatar2022 to guide #LesBleus to another #FIFAWorldCup Final 📈 Relive his brilliant saves in #FRAMAR & watch @FrenchTeam go for 🏆 - Dec 18, 8:30 pm, LIVE on #JioCinema & #Sports18 📺📲#FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/2GKLlJL6kX — JioCinema (@JioCinema) December 14, 2022 చదవండి: FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ -
ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం
ఫిఫా ప్రపంచకప్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఖతర్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్.. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. ఇక నాకౌట్ దశలో అదరగొట్టిన మొరాకో.. కీలకమైన సెమీఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. 0-2 తేడాతో ఓటమిపాలైన మొరాకో ఈ మెగా ఈవెంట్ నుంచి ఇంటిముఖం పట్టింది. బ్రస్సెల్స్‌లో అల్లర్లు.. కాగా మొరాకో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మొరాకో అభిమానులు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో విధ్వంసం సృష్టించారు. సుమారు 100 మంది ఫ్యాన్స్ బ్రస్సెల్స్ సౌత్ స్టేషన్ సమీపంలో పోలీసులపై బాణాసంచాలను విసిరారు. అదే విధంగా వీధుల్లో ఉన్న షాప్‌లకు నిప్పు అంటించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ అల్లర్లకు కారణమైన చాలా మంది అభిమానలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, భారీ నష్టం ఏమీ జరగలేదని రాయిటర్స్ పేర్కొంది. చదవండి: FIFA WC:సెమీస్‌లో అదరగొట్టిన ఫ్రాన్స్.. రికార్డులు బ్రేక్ చేస్తూ విజయం 🚨🇫🇷 Breaking: Moroccans start attacking French people celebrating their country's victory in Paris, France. pic.twitter.com/k19wvVeD5J — Terror Alarm (@Terror_Alarm) December 14, 2022 -
FIFA WC: సెమీస్‌లో అదరగొట్టిన ఫ్రాన్స్.. రికార్డులు బ్రేక్ చేస్తూ విజయం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ అదరగొట్టింది. మొరాకోతో జరిగిన కీలక మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అందుకు తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ఫైనల్‌కు చేరింది. ఇక, డిసెంబర్ 18న అర్జెంటీనాతో జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ అమితుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. గత ఏడు ఎడిషన్లలో ఫ్రాన్స్ జట్టు నాల్గొవ సారి ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఈ విజయంతో 2002లో బ్రెజిల్ తర్వాత వరుసగా ఫైనల్స్‌కు చేరిన తొలి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఫ్రాన్స్ నిలిచింది. ఇదిలా ఉండగా.. రష్యాలో జరిగిన 2018 ప్రపంచ కప్‌లో ఫ్రాన్స్ 4-2తో క్రొయేషియాను ఓడించి విన్నర్‌గా నిలిచింది. 🔝 performance 💥@AntoGriezmann covered every blade of grass to ensure @FrenchTeam would reach back-to-back #FIFAWorldCup Finals 🔥 Enjoy his Hero of the Day display, presented by @Mahindra_Auto#FRAMAR #Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/G7UOQ42HCa — JioCinema (@JioCinema) December 14, 2022 -
FIFA WC 2022: మొరాకోతో సెమీ ఫైనల్.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు భారీ షాక్
ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా ఫ్రాన్స్-మొరాకో జట్ల మధ్య రేపు (అర్ధరాత్రి 12:30) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్టర్లు డయోట్ ఉపమెకనో, అడ్రెయిన్ రేబియట్ అనారోగ్యం కారణంగా ఇవాళ ప్రాక్టీస్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో వీరిద్దరు మొరాకోతో జరిగే సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానమేనని సమాచారం. పై పేర్కొన్న ఇద్దరిలో డయోట్ ఉపమెకనో సోమవారం కూడా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదని, అతను తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాడని తెలుస్తోంది. ఉపమెకనో, రేబియట్ సెమీఫైనల్‌కు అందుబాటులో ఉండకపోవడం ఫ్రాన్స్ విజయావకాశాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రేబియట్ ఒక గోల్ సాధించి, మరో గోల్ చేసేందుకు సహాయపడగా.. ఉపమెకనో ఖాతా తెరవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్.. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 గోల్స్ తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరగా, మొరాకో.. పటిష్టమైన పోర్చుగల్‌పై సంచలన విజయం (1-0) సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన మొరాకో.. బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ లాంటి హేమాహేమీ జట్లకు షాకిచ్చి సెమీస్ వరకు చేరింది. మరోవైపు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్.. స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ ఫైనల్ ఫోర్కు చేరింది. కాగా, ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన తొలి సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనా.. క్రొయేషియాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్-మొరాకో మ్యాచ్‌లో విజేత డిసెంబర్ 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది.