ఐఎంఎఫ్ విధాన ప్రాధాన్యతలు, సభ్య దేశాలకు సంస్థ సహకారంపై మరకేచ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్‌ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్‌లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్‌కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది.
ఐఎంఎఫ్ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు, ఇంటర్–అమెరికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలాన్ గోల్డ్‌ఫాజ్‌్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్‌తో కలిసి పనిచేయాలన్న భారత్ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment