Bilateral Meeting
-
అంతర్జాతీయ సవాళ్లపై సమాలోచనలు...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్‌కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐఎంఎఫ్ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు, ఇంటర్–అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలాన్ గోల్డ్ఫాజ్్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్‌తో కలిసి పనిచేయాలన్న భారత్ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భేటీ
-
అమెరికా, భారత్ సంబంధాల్లో నూతన అధ్యాయానికి నాంది
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తొలిసారి భేటీ అయ్యారు. తమ సమావేశం అద్భుతంగా జరిగిందని మోదీ వెల్లడించారు. భారత్- యూఎస్ బంధం మరింత దగ్గరవ్వాలని, బలోపేతమవ్వాలని బైడెన్ ఆకాంక్షించారు. చర్చల్లో ఇరువురు నేతలు ఇండో-పసిఫిక్, వాతావరణ మార్పు, వాణిజ్యం, కోవిడ్‌తో సహా పలు అంశాలను చర్చించారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీసులో మోదీకి బైడెన్ స్వాగతం పలికారు. ఇరుదేశాల సంబంధాల్లో ఇదో నూతనాధ్యయంగా బైడెన్ అభివర్ణించారు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ప్రపంపంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల బంధం పలు అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరిస్తుందని, కరోనా కట్టడిపై ఉమ్మడి నిబద్ధత చూపడంతో దీన్ని నిరూపిస్తామని బైడెన్ చెప్పారు. ప్రధాని పదవి స్వీకరించాక మోదీ అమెరికా సందర్శించడం ఇది ఏడవసారి. ‘ఈ దశాబ్దం ఎలా ఉంటుందనే విషయంలో మీ నాయకత్వం కీలకపాత్ర పోషించనుంది. భారత్, అమెరికా మధ్య మరింత బలమైన బంధానికి విత్తనాలు నాటాము’ అని బైడెన్‌తో మోదీ వ్యాఖ్యానించారు. కీలక భౌగోళికాంశాలపై బైడెన్‌కు ఉన్న అవగాహన అధికమని భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. కరోనాపై, వాతావరణ మార్పుపై పోరాటం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం తీసుకురావడం వంటి అంశాలపై మోదీతో చర్చించినట్లు తెలిపారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన గాంధీ మార్గమే శరణ్యం వచ్చేవారం జరగనున్న గాంధీ జయంతి ఉత్సవాలను బైడెన్ ప్రస్తావించారు. ఆయన చూపిన అహింస, ఓర్పులాంటి సూత్రాల అవసరం ఇప్పుడు ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా గాంధీ ప్రవచించే ట్రస్టీషిప్ సిద్ధాంతాన్ని మోదీ గుర్తు చేశారు. ఇరు రాజ్యాల మధ్య రాబోయే రోజుల్లో బంధాన్ని ధృడోపేతం చేసే శక్తి వాణిజ్యానికి ఉందన్నారు. సాంకేతికత రాబోయే రోజుల్లో మరింత కీలక పాత్ర పోషించనుందన్నారు. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుతమైన ఇండో– పసిఫిక్ ప్రాంతమే తమ రెండు దేశాలతో పాటు అనేక దేశాల ఆకాంక్ష అని బైడెన్ చెప్పారు. ఈ ప్రాంతంలో చైనా మిలటరీ విన్యాసాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ భాగస్వామ్యం అంచనాలను మించి మరింత ప్రభావం చూపగలదన్నారు. 40 లక్షల మంది ఇండో– అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తివంతం చేస్తున్నారన్నారు. భారతీయ సంతతి అమెరికా పురోగతిలో భాగం కావడంపై మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిపై ప్రధాని ప్రశంసలు కోవిడ్, క్వాడ్ తదితర అంశాలపై బైడెన్ యత్నాలు అభినందనీయమని మోదీ ప్రశంసించారు. గతంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒకసారి మోదీతో భేటీ అయ్యారు. ఆయన అధ్యక్షుడయ్యాక పలుమార్లు ఫోన్లలో, ఆన్లైన్ సమావేశాల్లో సంభాషించుకున్నా, ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. గతంలో తాము పరిచయమైనప్పుడే ఇరుదేశాల సంబంధాలపై బైడెన్ దూరదృష్టిని చూపారని, ప్రస్తుతం అధ్యక్షుడిగా అప్పటి ఆలోచనలను అమలు చేసేందుకు యతి్నస్తున్నారని బైడెన్‌ను ఆయన కొనియాడారు. ఇరు రాజ్యాలు కలిసి చేసే యత్నాలు ప్రపంచానికి మంచి చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఇరువురి భేటీ అత్యంత ఫలప్రదంగా జరిగిందని విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. భేటీ సందర్భంగా వైట్‌హౌస్‌లోని రూజ్వెల్ట్ రూమ్‌లోని సందర్శకుల పుస్తకంలో ప్రధాని సంతకం చేశారు. ప్రధానితో పాటు జైశంకర్, అజిత్‌దోవల్, హర్షవర్ధన్ శ్రింగ్లా, తరణ్‌జిత్ సింగ్ సంధూ, అమెరికా తరఫున ఆంటోనీ బ్లింకెన్, జేక్ సల్లివాన్, జాన్ కెర్రీ, కర్ట్ చాంబెల్, డోనాల్డ్ లూ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ శాంతికి ‘క్వాడ్’: మోదీ భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమి(క్వాడ్) కేవలం ఇండో–పసిఫిక్ ప్రాంతానికే కాదు మొత్తం ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లడానికి దోహదపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నాలుగు బలమైన దేశాలు జట్టుకట్టి, ఒకే వేదికపైకి రావడం ప్రపంచానికి మేలు కలిగించే పరిణామం అని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆతిథ్యం ఇస్తున్న ‘క్వాడ్’ సదస్సు శుక్రవారం వాషింగ్టన్లో జరిగింది. మోదీ, బైడెన్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు స్కాట్ మోరిసన్, యోషిహిడే సుగా హాజరయ్యారు. కోవిడ్ నుంచి వాతావరణ మార్పుల దాకా ఎన్నో సవాళ్లు మానవాళికి ఎదురవుతున్నాయని బైడెన్ వ్యాఖ్యానించారు.ప్రజాస్వామిక భాగస్వాములతో కూడిన క్వాడ్ కూటమికి భవిష్యత్తుపై ఉమ్మడి దార్శనికత ఉందని అన్నారు. సవాళ్లను ఎలా ఎదిరించాలో తమకు తెలుసని చెప్పారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మానవళి కోసం క్వాడ్ కూటమి రూపంలో నాలుగు దేశాలు ఒక్క తాటిపైకి వచ్చాయని పేర్కొన్నారు. సప్లై చైన్, అంతర్జాతీయ భద్రత, వాతావరణ మార్పులు, కోవిడ్‌పై పోరాటం, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం వంటి కీలకం అంశాలపై తన మిత్రులతో చర్చిస్తున్నానని వివరించారు. సానుకూల దృక్పథంలో ముందుకు సాగాలని తాము నిర్ణయించుకున్నట్లు మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో మోరిసన్, సుగా మాట్లాడారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో బలప్రయోగానికి తావుండరాదని స్పష్టం చేశారు. ఏవైనా వివాదాలు, సమస్యలు ఉంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అవును.. భారత్‌లో మీ చుట్టాలున్నారు! బైడెన్ ప్రశ్నకు మోదీ జవాబు మోదీతో సమావేశం సందర్భంగా ఇండియాలో బైడెన్ చుట్టాల గురించి ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. భారత్‌లో బైడెన్ ఇంటిపేరున్న వారున్నట్లు తనకు తెలిసిందని, కానీ అంతకుమించి వివరాలు దొరకలేదని బైడెన్ చెప్పారు. అయితే భారత్‌లో బైడెన్ ఇంటిపేరున్న వాళ్లు అధ్యక్షుడితో చుట్టరికం ఉన్నవాళ్లేనని, ఇందుకు సంబంధించిన ఆధారాల డాక్యుమెంట్లు తెచ్చానని చెప్పి బైడెన్‌ను ప్రధాని మోదీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 1972లో తాను సెనేటర్‌గా తొలిసారి ఎన్నికైనప్పుడు బైడెన్ అనే ఇంటిపేరున్న ఒక వ్యక్తి ముంబై నుంచి తనకు అభినందనలు తెలుపుతూ లేఖ రాశాడని బైడెన్ గుర్తు చేసుకున్నారు. దాంతో తన ముత్తాతకు ముత్తాతకు ముత్తాత ఎవరో ఇక్కడ ఉండిఉండొచ్చని భావించానని చెప్పారు. అలాగే 2013లో భారత్‌ను సందర్శించినప్పుడు తనకు ఇండియాలో ఎవరైనా చుట్టాలున్నారా అన్న ప్రశ్న ఎదురైందన్నారు. మరుసటి రోజే తనకు ఇండియాలో ఐదుగురు బైడెన్స్ నివశిస్తున్నట్లు తెలిసిందన్నారు. మరింత ఆరా తీయగా జార్జ్ బైడెన్ అని ఈస్ట్ ఇండియా టీకంపెనీలో ఒకరుండేవారని, బహూశ ఆయన ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని స్థానికంగా సెటిలై ఉండొచ్చన్నారు. అయితే నిజంగా ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. భారత్‌తో తన బంధుత్వంపై తనకెవరైనా సాయం చేస్తారేమోనని ఈ విషయాలన్నీ చెబుతున్నానని ఆయన అనగానే మోదీతో సహా సమావేశంలోని వారంత నవ్వుల్లో మునిగారు. అనంతరం నిజంగా నాకు చుట్టాలున్నారా? అని మోదీని బైడెన్ అడగ్గా ఆయన అవునన్నారు. గతంలో కూడా తనతో ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. అందుకే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అన్వేషించామని, ఈ రోజు వీటిని తీసుకువచ్చామని, వీటితో మీకు ఉపయోగం ఉండొచ్చని వివరించారు. ముంబైలో తన కొత్త చుట్టాలతో ఇంతవరకు సంభాషించలేదని, త్వరలో మాట్లాడతానని బైడెన్ చెప్పారు. కమలకు తాతయ్య జ్ఞాపకం: కానుకగా ఇచ్చిన ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అరుదైన జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చారు. కమల తాతయ్య, తమిళనాడుకు చెందిన పి.వి. గోపాలన్ ప్రభుత్వ అధికారిగా వివిధ హోదాల్లో పని చేశారు. ఆయనకు సంబంధించిన ఒక పాత నోటిఫికేషన్‌ను హస్తకళా నిపుణులు తయారు చేసిన కలప ఫ్రేమ్‌లో పెట్టి బహుమానంగా ఇచ్చి కమలను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తారు. దాంతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం, అత్యంత పురాతన నగరమైన వారణాసిలో హస్తకళల నిపుణులు ప్రత్యేకంగా తయారు చేసే గులాబీ మీనాకారి చదరంగం సెట్‌ను బహుమతిగా అందించారు. ఈ చదరంగం సెట్లో ప్రతీ పావు అత్యంత అద్భుతమైన కళతో ఉట్టిపడుతూ చూపరుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. తాను కలుసుకున్న ఇతర ప్రపంచ దేశాల అధినేతలకు కూడా మనసుని ఉల్లాసపరిచే బహుమానాలు ఇచ్చారు. ఆ్రస్టేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్‌కు గులాబీ మీనాకారి కళతో తయారు చేసిన వెండి నౌకను బహుమతిగా ఇచ్చారు. జపాన్ ప్రధాని సుగాకు చందనపు చెక్కతో తయారు చేసిన బుద్ధుడి ప్రతిమను కానుకగా ఇచ్చారు. హస్తకళ నిపుణులు తయారు చేసిన ఈ కళాత్మక వస్తువులన్నింటిలోనూ వారణాసి సాంస్కృతిక చైతన్యం ఉట్టిపడుతూ ఉండడంతో ఆ కానుకలు అందరినీ అమితంగా ఆకర్షించాయి. రూజ్వెల్ట్ రూమ్‌లోని సందర్శకుల పుస్తకంలో సంతకం చేస్తున్న ప్రధాని మోదీ -
ఒక్కరిపైనే ఆధారం.. ప్రమాదం
న్యూఢిల్లీ: గ్లోబల్ సప్లయ్ చైన్ కేవలం ఒకే ఒక్క వనరుపైనే అధికంగా ఆధారపడి ఉండటం ఎంత ప్రమాదకరమో కోవిడ్ తెలియజెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్తో మోదీ సోమవారం వర్చువల్ విధానంలో ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఈ క్లిష్ట సమయంలో గ్లోబల్ సప్లయ్ చైన్‌ను ఒకే దేశానికి బదులు అనేక దేశాలకు విస్తరించుకునే క్రమంలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో భారత్ పనిచేస్తోందనీ, భావసారూప్యం గల దేశాలను ఆహ్వానిస్తోందని మోదీ వివరించారు. గత కొద్ది నెలలుగా సంభవిస్తున్న పరిణామాలు పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థ, నియమాల ఆధారంగా ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు. అధికార గణాంకాల ప్రకారం.. భారత్–డెన్మార్క్ ద్వైపాక్షిక వాణిజ్యం 2016–2019 సంవత్సరాల్లో 2.82 బిలియన్ డాలర్ల నుంచి 3.68 బిలియన్ డాలర్లకు పెరిగింది. సుమారు 200 డెన్మార్క్ కంపెనీలు దేశంలో నౌకాయానం, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. డెన్మార్క్ కంపెనీల్లో 5వేల మంది భారతీయ నిపుణులు పనిచేస్తున్నారు. -
ఆస్ట్రేలియాతో ఏడు ఒప్పందాలు
న్యూఢిల్లీ–మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అత్యంత కీలకమైన రక్షణ రంగం సహా ఏడు ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మధ్య గురువారం ఆన్లైన్ సదస్సు జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇరువురు నేతలు ఆన్లైన్ ద్వారా చర్చలు జరిపారు. మిలటరీ స్థావరాల్లో పరస్పర సహకారానికి వీలుగా ది మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ)పై ఇరువురు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో పరస్పరం సహకారం అందించుకుంటూనే ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాలు మరొకరు వినియోగించుకునే వీలు ఉంటుంది. ఇకపై మరమ్మతులు, సైనికుల అవసరాలను తీర్చే సామగ్రి సరఫరా వంటి వాటి కోసం ఇరు దేశాలు ఒకరి మిలటరీ స్థావరాన్ని మరొకరు వినియోగించుకోవచ్చు. ఎమ్‌ఎల్‌ఎస్‌ఏ ఒప్పందంతో పాటుగా సైబర్ టెక్నాలజీ, ఖనిజాలు తవ్వకాలు, మిలటరీ టెక్నాలజీ, వృత్తి విద్యా కోర్సులు, జల వనరుల నిర్వహణ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ► ఇండో పసిఫిక్ తీర ప్రాంతం భద్రతపై ఇరు పక్షాలు దృష్టి సారించాయి. ‘‘షేర్డ్ విజన్ ఫర్ మ్యారీ టైమ్ కోపరేషన్ ఇన్ ది ఇండో పసిఫిక్’’అన్న పేరుతో ఒక డిక్లరేషన్‌ను ఆవిష్కరించాయి. సంక్షోభాల నుంచి అవకాశాలు ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ ప్రపంచవ్యాప్తంగా కరోనా చూపించిన తీవ్రమైన సామాజిక, ఆర్థిక ప్రభావం నుంచి బయటపడడానికి సమన్వయంతో, సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. దానికనుగుణంగా అన్ని రంగాల్లోనూ సమగ్రమైన సంస్కరణలు తీసుకువచ్చే ప్రక్రియ మొదలైందని చెప్పారు. ► అణు సరఫరా గ్రూపు (ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా సంపూర్ణ మద్దతుని ప్రకటించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌ని శాశ్వత సభ్యదేశంగా చేయడానికి మద్దతునిస్తామని చెప్పింది. సమోసా కిచిడీ దౌత్యం స్కాట్ మారిసన్ గుజరాతీ కిచిడి వండి వడ్డించడానికి సిద్ధమవుతున్నారు. మోదీతో ఆన్లైన్ సదస్సులో పాల్గొన్న ఆయన ఈసారి ఇరువురి సమావేశం జరిగినప్పుడు తానే స్వయంగా కిచిడి వండి తినిపిస్తానన్నారు. భారతీయ సమోసా, మాంగో చెట్నీలు స్వయంగా తయారు చేసిన మారిసన్ వాటి రుచిని ఆస్వాదిస్తూ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తానే స్వయంగా భారత్‌కు వచ్చి మోదీని కలుసుకొని సమోసా తినిపించాలని అనుకున్నానని మారిసన్ చెప్పారు. మోదీ ఆలింగనాన్ని కూడా మిస్ అయ్యానన్నారు. ఈ సారి కలిసినప్పుడు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని గుజరాతీ కిచిడీని స్వయంగా వండి తినిపిస్తానని చెప్పారు. దీనికి మోదీ బదులిస్తూ ‘మీరు సమోసాలు షేర్ చేయగానే దేశమంతా దాని గురించే మాట్లాడారు. ఇంక అందరూ గుజరాతీ కిచిడీ గురించే మాట్లాడుకుంటారు. గుజరాతీయులు చాలా ఆనందపడతారు. ఈ కిచిడీని దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు’అని మోదీ బదులిచ్చారు. -
మోదీకి ఫ్రాన్స్‌లో ఘనస్వాగతం
పారిస్: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఆయనకు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీనివ్స్ లీ డ్రియన్ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ చేరుకున్న మోదీ, శుక్రవారం యూఏఈకి వెళ్లనున్నారు. అనంతరం బహ్రెయిన్‌కు వెళ్లనున్న ప్రధాని.. ఆ దేశపు రాజు షేక్ హమీద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమై చర్చలు జరుపుతారు. చివరగా ఆదివారం ఫ్రాన్స్‌కు తిరిగొచ్చి జీ7 సదస్సులో పాల్గొంటారు. -
పాక్‌కు బుద్ధిచెప్పండి
బిష్కెక్/వాషింగ్టన్: కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో గురువారం ప్రారంభమైన షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు‡ పుతిన్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం మోదీ స్పందిస్తూ.. జిన్‌పింగ్‌తో భేటీ అత్యంత ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. ‘భారత్–చైనాల మధ్య వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ఈ భేటీలో చర్చించాం’ అని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న విషయాన్ని మోదీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకొచ్చారు. ఉగ్రమూకలపై పాక్ కఠినచర్యలు తీసుకునేలా చూడాలన్నారు. ఉగ్రరహిత వాతావరణంలో పాక్‌తో శాంతి చర్చల ప్రక్రియకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జిన్‌పింగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మోదీని జిన్‌పింగ్ అభినందించారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని.. జూన్ 15న 66వ పుట్టినరోజు జరుపుకోనున్న జిన్‌పింగ్‌కు భారతీయులందరి తరఫున శుభాకాంక్షలు చెప్పారు. ఎస్సీవో సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా భారత్–రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను పటిష్టం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. బిష్కెక్లో ఎస్సీవో భేటీ జూన్ 13 నుంచి రెండ్రోజుల పాటు సాగనుంది. మోదీ సరికొత్త నాయకుడు: పాంపియో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సులో పాంపియో మాట్లాడుతూ.. ‘సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుపొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు సరికొత్త నాయకుడిగా మోదీ అవతరించారు’ అని కితాబిచ్చారు. భారత యువతకు సుసంపన్నమైన, ఉజ్వల భవిష్యత్తును మోదీ ఇవ్వగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లతో పాటు అత్యంత భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సాయమందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. జూన్ 24 నుంచి 30 వరకూ పాంపియో భారత్, శ్రీలంక, జపాన్, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించనున్నారు. -
త్వరలో జపాన్‌తో 2+2 చర్చలు
టోక్యో: భారత్, జపాన్ల విదేశాంగ, రక్షణ మంత్రులతో కూడిన 2+2 చర్చలు త్వరలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఈ మేరకు ఇరు దేశాలూ నిర్ణయం తీసుకున్నాయి. భారత్–జపాన్ 13వ ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా సోమవారం టోక్యోలో జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ భేటీ అయ్యారు. ఆర్థిక, రక్షణ, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, జపాన్ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు సహా పలు అంశాలపై వారు విస్తృత చర్చలు జరిపారు. పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇతర దేశాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు తమతమ దేశాలను వాడుకోకుండా అన్ని దేశాలూ చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. భేటీ అనంతరం మోదీ ‘షింజో అబేతో ఫలప్రదమైన, విస్తృత చర్చలు జరిపాను. మరింత మెరుగైన ఆర్థిక బంధాలు, రక్షణ–భద్రత రంగంలో బలమైన సహకారంపై ప్రధానంగా మేం మట్లాడాం’ అని ట్విట్టర్లో తెలిపారు. భారత్–జపాన్ల బంధం ప్రపంచంలోనే అత్యంత బలమైనదని అబే పేర్కొన్నారు. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి జపాన్ మద్దతు తెలిపింది. శాంతంగా పరిష్కరించుకోవాలి.. చర్చల అనంతరం ఇండియా–జపాన్ దార్శనిక ప్రకటనను ఇరువురు ప్రధానులు సంయుక్తంగా విడుదల చేశారు. ప్రపంచ దేశాలు సమస్యలను శాంతితో సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప బెదిరింపులకు, బలప్రయోగాలకు దిగకూడదని కోరారు. ఇరుదేశాల పరస్పర అభివృద్ధి కోసం అవరోధాల్లేని వాణిజ్యం, పౌరుల వలసలు, సాంకేతికతను పంచుకోవడం తదితరాలపై భారత్, జపాన్‌లు కలిసి పనిచేయాలని తాము నిర్ణయించామన్నారు. ‘అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించేందుకు, అణ్వస్త్ర వ్యాప్తి, అణు ఉగ్రవాదం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు ఇద్దరం కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కూల్‌డ్రింక్ కన్నా జీబీ డేటా తక్కువ జపాన్‌లోని భారతీయులతోనూ మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. జపాన్‌లో స్థిరపడిన భారతీయులు స్వదేశంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి దోహదపడాలని కోరారు. దేశంలో డిజిటల్ మౌలిక వసతులు ఎంతగానో మెరుగుపడ్డాయనీ, ఇప్పుడు చిన్న కూల్‌డ్రింక్ బాటిల్ ఖరీదు కన్నా ఒక జీబీ డేటా ధర తక్కువగా ఉందన్నారు. అనంతరం మోదీ భారత్‌కు బయలుదేరారు. -
భారత్–జపాన్.. గెలుపు జోడీ
న్యూఢిల్లీ: భారత్–జపాన్ ద్వైపాక్షిక వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్ చేరుకున్నారు. అంతకుముందు, మోదీ మాట్లాడుతూ భారత్, జపాన్‌లది గెలుపు జోడీ అని అభివర్ణించారు. ఆర్థిక, సాంకేతికాభివృద్ధిలో భారత్‌కు జపాన్ విశ్వసనీయమైన భాగస్వామి అని అన్నారు. టోక్యో విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆదివారం, సోమవారం జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ భేటీ అవుతారు. 2014లో ప్రధాని అయ్యాక మోదీ అబేతో సమావేశమవడం ఇది 13వ సారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలు రక్షణ, ప్రాంతీయ అనుసంధానత సహా పలు అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. ఇరు దేశాల సంబంధాల్లో పురోగతిని సమీక్షించి, వాటిని వ్యూహాత్మక కోణంలో బలోపేతం చేయడమే అజెండాగా ఈ సమావేశం జరుగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆదివారం నాటి షెడ్యూల్లో ఫ్యాక్టరీ ఆటోమేషన్‌లో అతిపెద్ద ఉత్పత్తిదారైన ఓ కంపెనీని మోదీ, అబే సందర్శిస్తారు. జపాన్ రాజధాని టోక్యోకు 110 కి.మీ.ల దూరంలోని యామాన్షి ప్రావిన్సులో ప్రకృతి సోయగాల మధ్య, ఆ దేశంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ ఫుజి ఆవరించి ఉన్న తన విడిది గృహంలో అబే ప్రధాని మోదీకి రాత్రి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఈ గౌరవం పొందబోతున్న తొలి విదేశీ నేత మోదీనే. విందు అనంతరం మోదీ, అబేలు రైలులో టోక్యో బయల్దేరుతారు. ఈ పర్యటనలో మోదీ టోక్యోలో అక్కడి భారత సంతతి ప్రజలతో ముచ్చటిస్తారు. కొన్ని వాణిజ్య వేదికలపై కూడా మోదీ ప్రసంగించనున్నారు. 6న కేదర్‌నాథ్‌కు.. వచ్చే నెల 6న మోదీ ఉత్తరాఖండ్‌లోని కేదర్నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించే అవకాశాలున్నాయి. అలాగే, కేదర్‌పురి ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా సమీక్షించే వీలుంది. అయితే ప్రధాని పర్యటనపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కేదర్‌పురి ఆలయానికి మోదీ గతేడాది శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులను తరచూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. -
గగనతలం.. శత్రు దుర్భేద్యం!
న్యూఢిల్లీ: భారత్, రష్యా రక్షణ సంబంధాల్లో మరో గొప్ప ముందడుగు పడింది. అమెరికా ఆంక్షల బెదిరింపులను తోసిరాజని రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ అనే అధునాతన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నాటికి చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది. ఢిల్లీలో శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీల మధ్య 19వ ఇండియా–రష్యా వార్షిక సమావేశం ముగిశాక ఇరు దేశాల మధ్య అంతరిక్షం, రైల్వేలు, అణుశక్తి, విద్య, ఎరువులుతదితర రంగాల్లో 8 ఒప్పందాలు కుదిరాయి. ఆచితూచి స్పందించిన అమెరికా.. భారత్, రష్యాల మధ్య ఎస్–400 ఒప్పందం కుదిరాక అమెరికా ఆచితూచి స్పందించింది. మిత్ర దేశాల సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడం కాట్సా ఉద్దేశం కాదని పేర్కొంది. ఒక్కో ఒప్పందాన్ని బట్టి దానికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని తెలిపింది. ఉగ్రపోరులో సహకారం బలోపేతం.. సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని భారత్, రష్యాలు తప్పుపట్టాయి. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ద్వంద్వ వైఖరులు పాటించకుండా, కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌ల నిర్మూలన, వాటి ఆర్థిక వనరులు, ఆయుధాల సరఫరా మూలాలను దెబ్బతీసేందుకు, ఉగ్ర నియామకాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. మోదీ, పుతిన్‌ల భేటీ తరువాత సీమాంతర ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఇటీవల పాకిస్తాన్‌కు చేరువయ్యేందుకు రష్యా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఐక్యరాజ్య సమితి వద్ద పెండింగ్‌లో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని ఖరారుచేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. పర్యావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న వర్ధమాన, పేద దేశాలను ఆర్థిక, సాంకేతిక సాయంతో ఆదుకోవాలని ధనిక దేశాలకు పిలుపునిచ్చాయి. కార్బన్ ఉద్గారాల తగ్గింపు, హరిత విధానాలకు ప్రచారం కల్పిస్తూ పారిస్ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని కోరాయి. మెరుగైన వ్యాపార అవకాశాలు: మోదీ ఇరు దేశాల వ్యాపారవేత్తలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ.. భారత్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుచేసేందుకు ముందుకు రావాలని రష్యాను ఆహ్వానించారు. మెట్రో రైలు, సాగరమాల, రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో మెరుగైన వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం రోజురోజుకీ పెరుగుతోందని పుతిన్ అన్నారు. భారత్‌లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం), రష్యాలోని సిరియస్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మోదీ, పుతిన్ సంభాషించారు. ఇరు దేశాల యువత మధ్య నిరంతరం చర్చలు జరగడం ద్వైపాకిక్ష సంబంధాలకు మరింత విలువ చేకూరుస్తుందని పుతిన్ అన్నారు. సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఏఐఎం, సిరియస్లు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులు అధునాతన దీర్ఘశ్రేణి ఎస్–400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనేందుకు భారత్ సంతకం చేసిన ఒప్పందం విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు. రష్యాతో ఆయుధ కొనుగోలు లావాదేవీలు జరిపితే ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించినా ఒప్పందానికే భారత్ సై అంది. రష్యా, ఇరాన్, ఉ.కొరియా కంపెనీలతో రక్షణ వ్యాపారాలు చేసే మిత్ర దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా కాట్సా(కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్) చట్టం తెచ్చింది. ఈ విషయంలో భారత్‌కు మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. వైమానిక దళం శక్తి, సామర్థ్యాలను ద్విగుణీకృతం చేసే ఎస్–400 క్షిపణులను భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులను ప్రయోగించొచ్చు. రష్యా ఈ క్షిపణులను పలు దఫాలుగా భారత్‌కు అందజేస్తుంది. రష్యా అల్మాజ్ యాంటే సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రూపొందించింది. ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంచర్లు, కమాండ్ పోస్టులుంటాయి. ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఏకకాలంలో గుర్తించగలదు. సుమారు 600 కి.మీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడను కనిపెట్టే ఈ క్షిపణి వ్యవస్థ..400 కి.మీ దూరం నుంచి లక్ష్యంపై గురిపెడుతుంది. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాలోని అన్ని వైమానిక స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయి. గగన్‌యాన్ ప్రాజెక్టులో సహకారానికి సంబంధించి ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రాస్కాస్మోస్లు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
ఎవరి వ్యూహాలు వారివి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల భేటీ ఆశించిన ఫలితాలు సాధించి చరిత్ర సృష్టిస్తుందా ? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అణ్వాయుధాల వినియోగం, వ్యాప్తి నిరోధం కోసం తాను ‘శాంతి యాత్ర’కు వెళుతున్నట్లు సింగపూర్‌కు బయలుదేరే ముందు ట్రంప్ ప్రకటించినా.. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరగనున్న ఈ సమావేశం దశ, దిశ ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇరువురు నేతల చంచల స్వభావాల్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం భేటీ అనూహ్యంగా ముగుస్తుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. నిజానికి శిఖరాగ్ర సమావేశాల కోసం ఎజెండాను ముందుగానే ఖరారుచేస్తారు. ఈ భేటీ కోసం రూపొందించిన ఎజెండాపై గోప్యత కొనసాగుతోంది. అణ్వస్త్రాల వ్యాప్తి, తయారీ నుంచి వైదొలిగేందుకు కిమ్ సానుకూలంగా స్పందిస్తారని అమెరికా ఆశిస్తోంది. దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ భేటీ దోహదపడుతుందని ఆ దేశం నమ్మకంతో ఉంది. ఆ దిశగా అగ్రరాజ్యానికి నమ్మకం కలిగించే చర్యల్ని ఉ.కొరియా ఇప్పటికే చేపట్టినా.. తన బలంగా చెప్పుకుంటున్న అణ్వాయుధాలను కిమ్ వదులుకుంటాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. స్నేహ సంబంధాలు చిగురిస్తాయా? బద్ద శత్రువులుగా ఉన్న అమెరికా–ఉత్తరకొరియాల మధ్య స్నేహ సంబంధాలు చిగురిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ట్రంప్–కిమ్‌ల మధ్య మాటల యుద్ధంతో కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. తమపై దాడికి పాల్పడితే అమెరికాపై అణ్వాస్త్రాల్ని ప్రయోగిస్తామంటూ కిమ్ హెచ్చరించగా.. ట్రంప్ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, కిమ్‌లు పరస్పరం దూషణలకు దిగారు. అయితే తన ధోరణికి భిన్నంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి కిమ్ శాంతి మంత్రం మొదలుపెట్టారు. ఇకపై దేశ ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెడతానని చెప్పడంతో పాటు దక్షిణ కొరియాకు స్నేహ హస్తం అందించారు. స్వయంగా కొరియా సరిహద్దుల్లో ద.కొరియా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ట్రంప్‌తో చర్చలకు ప్రతిపాదించడంతో పాటు తానే చొరవ తీసుకున్నాడు. ఒక దశలో ట్రంప్ అర్ధాంతరంగా చర్చల్ని రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించినా.. కిమ్ ఒక మెట్టు దిగొచ్చి ట్రంప్‌ను చర్చలకు ఒప్పించారు. ఇద్దరికీ సవాలే.. అమెరికాలో తన పట్టు నిలుపుకోవడంతో పాటు, ప్రపంచం దృష్టిలో సమర్థనేతగా గుర్తింపు పొందేందుకు ఈ భేటీని సువర్ణావకాశంగా ఉపయోగించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఉత్తరకొరియాను దారికి తెచ్చిన నేతగా చరిత్రలో నిలిచిపోవాలని ఆశిస్తున్నారు. చైనా, రష్యా ఆధిపత్యానికి చెక్‌పెట్టి ఆసియాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రస్తుత చర్చలు ఉపయోగపడతాయనే ఆలోచనతో ఉన్నారు. మరోవైపు అమెరికా, ఇతర దేశాల ఆర్థిక,సైనిక ఆంక్షలతో దారుణంగా దెబ్బతిన్న తన దేశ పునర్నిర్మాణంతోపాటు.. ప్రపంచదేశాల్లో సానుకూల గుర్తింపు పొందేందుకు ఈ శిఖరాగ్ర సమావేశాన్ని వేదికగా చేసుకోవాలని కిమ్ ఆశాభావంతో ఉన్నారు. ఈ చర్చల సందర్భంగా ట్రంప్ తన దుందుడుకు స్వభావానికి భిన్నంగా వ్యవహరిస్తారా? దౌత్యనీతిని ప్రదర్శించి పెద్దన్నపాత్రను పోషిస్తారా? అన్నది వేచిచూడాల్సి ఉంది. కిమ్‌తో భేటీ ట్రంప్ సామర్థ్యానికి సవాల్‌గా నిలవనుంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘రోహింగ్యాల ముచ్చట లేదు’
న్యూయార్క్: విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అయితే వీరి భేటీలో రోహింగ్యాల సంక్షోభంపై ఎలాంటి ప్రస్తావనా చోటుచేసుకోకపోవడం గమనార్హం. బంగ్లా ప్రధానితో సుష్మా కేవలం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారని, ఈ సమావేశంలో రోహింగ్యా ముస్లింల అంశం చర్చకు రాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.ఇరువురి భేటీ కేవలం ద్వైపాక్షిక అంశాలకే పరిమితమైందని తెలిపారు. మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు పోటెత్తుతుండటంతో ఈ సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని మయన్మార్‌పై ఒత్తిడి పెంచాలని బంగ్లాదేశ్ కోరుతోంది. ఆగస్ట్ 25 నుంచి తలెత్తిన మలివిడత ఘర్షణల అనంతరుం మయన్మార్‌లోని రఖీనె రాష్ట్రం నుంచి 4,10,000 మందికి పైగా రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు వచ్చినట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. -
నేడు పాక్ ప్రధానితో మోదీ చర్చలు
-
రేపు పాక్ ప్రధానితో మోదీ చర్చలు
రష్యా: దాయాది దేశం పాకిస్థాన్‌తో చర్చలకు మరో ముందడుగు పడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో రష్యాలో భేటీ అవనున్నారు. అక్కడే షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం జరగనున్న నేపథ్యంలో పాక్, ఇండియాల మధ్య దౌత్య సంబంధాల విషయాన్ని చర్చించుకునేందుకు షరీఫ్‌తో మోదీ సమావేశమవుతున్నారు. ఇరు దేశాల విదేశాంగ కార్యాలయాల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 9.15కు సమావేశం ప్రారంభంకానుంది. అయితే, ద్వైపాక్షిక అంశాల్లో వేటికి ప్రాధాన్యం ఇచ్చి ముందు చర్చిస్తారనే విషయాన్ని బహిర్గతం చేయకుండా నేరుగా చర్చలోకి వెళతారని తెలిసింది. అయితే, ఈ సమావేశంలోని చర్చల అనంతరమే పాక్ విషయంలో భారత్ తన అభిప్రాయాలు వెల్లడించనుంది. కాగా, పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి ఖాజి ఖలిలుల్లా మాట్లాడుతూ భారత్‌తో సహా తమ పొరుగున ఉన్న దేశాలన్నింటితో సత్సంబంధాలను పెంచుకోవాలని, పరస్పర సమన్వయం, సహకారంతో కొనసాగాలని తమ ప్రధాని షరీఫ్ కోరుకుంటున్నారని తెలిపారు. అయితే, ముందుగా నిర్ణయించుకున్న సమావేశం కాదని, వారం రోజుల కిందటే అనుకూని తెరమీదకు తెచ్చినట్లు తెలిపారు.