మోదీకి ఫ్రాన్స్‌లో ఘనస్వాగతం | Narendra Modi begins trip to France, UAE and Bahrain | Sakshi
Sakshi News home page

మోదీకి ఫ్రాన్స్‌లో ఘనస్వాగతం

Published Fri, Aug 23 2019 5:13 AM | Last Updated on Fri, Aug 23 2019 5:13 AM

Narendra Modi begins trip to France, UAE and Bahrain - Sakshi

పారిస్‌లో మక్రాన్, మోదీ ఆలింగనం

పారిస్‌: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఆయనకు ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీనివ్స్‌ లీ డ్రియన్‌ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌ చేరుకున్న మోదీ, శుక్రవారం యూఏఈకి వెళ్లనున్నారు. అనంతరం బహ్రెయిన్‌కు వెళ్లనున్న ప్రధాని.. ఆ దేశపు రాజు షేక్‌ హమీద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫాతో సమావేశమై చర్చలు జరుపుతారు. చివరగా ఆదివారం ఫ్రాన్స్‌కు తిరిగొచ్చి జీ7 సదస్సులో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement