
జీ7 సమావేశం కోసం విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తోనూ మోదీ చర్చలు జరిపారు. ‘మా ఇద్దరి మధ్య ఏడాదికాలంలో జరిగిన నాలుగో భేటీ ఇది. అద్భుతంగా జరిగింది. ఇండో–పసిఫిక్ రోడ్‌మ్యాప్, హారిజాన్ 2047 సహా రక్షణ, అణు, అంతరిక్షం, సముద్రమార్గంలో వాణిజ్యం, విద్య, వాతావరణ మార్పులు, డిజిటల్ మౌలిక వసతులు, కనెక్టివిటీ, కృత్రిమ మేథ రంగాల్లో పరస్పర తోడ్పాటుపై చర్చలు జరిపాం.
యువతలో ఆవిష్కరణలు, పరిశోధనలపై మరింత మక్కువ పెంచేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదీ మాట్లాడుకున్నాం’ అని మోదీ చెప్పారు. శుక్రవారం ఇటలీకి చేరుకున్నాక మోదీ తొలుత మేక్రాన్‌ను కలిశారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఒక అంతర్జాతీయ నేతతో మోదీ సమావేశంకావడం ఇదే తొలిసారి. జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సమ్మర్ ఒలంపిక్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మేక్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment