
గురువారం జైపూర్ రోడ్‌షోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ప్రధాని మోదీ
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ గురువారం జైపూర్‌లో రోడ్ షోలో పాల్గొ న్నారు. మోదీ ఆయనకు అయోధ్య రామాల యం ప్రతిమను కానుకగా అందజేశా రు. ఇద్దరు నేతలు జైపూర్‌లో మసాలా చాయ్ రుచిని ఆస్వాదించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా హాజరు కానున్న ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం జైపూర్‌కు చేరుకున్నారు.
విమానాశ్రయం వద్ద గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఫ్రాన్సు అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ పరిచి, అందంగా అలంకరించిన గజరాజులతో స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి మేక్రాన్ అంబర్ కోటకు వెళ్లారు. జంతర్‌మంతర్ వద్ద ప్రధాని మోదీ ఆయన్ను కలిశారు. పరస్పర కరచా లనం, ఆత్మీయ ఆలింగనాల అనంతరం ఓపెన్ టాప్ కారులో జంతర్‌మంతర్ నుంచి రోడ్ షోకు బయలుదేరారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ హవా మహల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి తాజ్ రామ్‌బాగ్ ప్యాలెస్‌కు చేరుకుని, ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment