Republic Day 2024
-
జియో మాల్‌పై పోలీసుల దాడి: లగ్జరీ కార్లు సీజ్.. స్టోరీ ఏంటంటే?
విలాసవంతమైన జీవితానికి, ఖరీదైన కార్లకు పెట్టింది పేరు రిలయన్స్ అధినేత బిలియనీర్ అంబానీ కుటుంబం. తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌పై పోలీసుల దాడి వార్తల్లో నిలిచింది. ఈ మాల్లో 41 ఖరీదైన కార్లతో పాటు ఫెరారీస్, లంబోర్గినీ లాంటి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందంటే..? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అంబానీకి చెందిన మాల్ పార్కింగ్ స్థలంలో ముంబై పోలీసులు 41 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఫెరారీ, లంబోర్ఘిని, పోర్షెస్ తదితర అత్యాధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద మాల్స్‌లో ఒకటి ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్ దేశంలోనే యాపిల్ స్టోర్ ఉన్న తొలి మాల్ కూడా ఇదే. తాజా వార్తలపై రిలయన్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా సంస్థ నిర్వహించిన ఈవెంట్, ర్యాలీకిగా ను ముంబై పోలీసుల ముందస్తు అనుమతి పొందలేని కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ కారు అంబానీ కుటుంబంలోని ఏ ఒక్కరికీ చెందకపోవడం గమనార్హం. ముంబైలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ర్యాలీలో ఫెరారీలు, లంబోర్గినిలు, పోర్షెస్, మెక్లారెన్స్, బిఎమ్‌డబ్ల్యూలు, జాగ్వార్లు, ఆడి, మెర్సిడెస్‌తో సహా 100కి పైగా కార్లు పాల్గొన్నాయని అంచనా. దీంతో పబ్లిక్ సర్వెంట్ అండ్ మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 1951 ద్వారా సక్రమంగా ప్రకటించిన ఆర్డర్‌ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కార్ల యజమానులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్లో 75వ రిపబ్లిక్ డే వేడుకలు
భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అమెరికాలో వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్లో జరిగిన వేడుకలకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథిలుగా 'శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా' డాక్టర్ శ్రీకర్ రెడ్డి, 'చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ మరియం' హాజరై, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని మాతృభూమిపై వారికున్న ప్రేమాభిమానాలను చాటిచెప్పారు. వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏళ్ళ చరిత్రలో భారతదేశం సాధించిన పురోగతిని పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు. -
ఏకంగా రూ.7 కోట్ల భూమిని విరాళమిచ్చిన మహిళ, ఎందుకో తెలుసా?
జనవరి 26 గణ తంత్ర దినోత్సవాల్లో తమిళనాడు సీఎం ప్రత్యేక అవార్డును ఒక పేద మహిళ గెల్చుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.7 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వ పాఠశాల కోసం విరాళంగా ఇచ్చినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఆమె పేరు ఆయి అమ్మాళ్‌ను అలియాస్ పూరణం. ఆమె మదురై జిల్లా పూడూర్నివాసి. నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషి చేసిన తన దివంగత కుమార్తె జ్ఞాపకార్థం ఆమె తన 7 కోట్ల రూపాయల విలువైన భూమిని తమిళనాడు ప్రభుత్వానికి అందించడం విశేషంగా నిలిచింది.. సంబంధధి పత్రాలను చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె కార్తిగాకు అందజేశారు. అమ్మాళ్ చేసిన దాతృత్వానికి స్పందించిన తమిళనాడు సీఎం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అవార్డుతో ఆమెను ఘనంగా సత్కరించారు. అమ్మాళ్ కెనరా బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తోంది. కోడికులంలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్‌కు హైస్కూల్‌గా అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ. 7 కోట్ల విలువైన స్థలాన్ని జనవరి 5న విరాళంగా ఇచ్చింది. రెండేళ్ల క్రితం మరణించిన తన కుమార్తె జనని పేరును పాఠశాలకు పెట్టాలన్నది ఆమె కోరిక. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన పూర్ణం, జనని చిన్నపిల్లగానే ఉన్నపుడే భర్తను కోల్పోయింది. భర్త చనిపోయిన తరువాత కారుణ్య ప్రాతిపదికన తన భర్త ఉద్యోగాన్ని పొందింది. కష్టపడి బిడ్డను బి.కామ్ దాకా చదివించుకుంది. కానీ అనూహ్యంగా జనని కూడా చనిపోయింది. దీంతో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని నిరుపేద పిల్లలు చదువుకోవాలంటూ విరాళంగా ఇచ్చేసింది. అలా తన బిడ్డను కల నెరవేర్చాలని భావించింది. Madurai Woman donates Landto School | சிறப்பு விருது | Madurai Pooranam Amma | CM MK Stalin #maduraiwomandonateslandtoschool #womandonateslandworth7crores #maduraigovernmentschool #maduraipooranamamma #kodikulamschool pic.twitter.com/TWqz1dBMAv — OH Tamil (@ohtamil) January 27, 2024 முதல் நாள் சுமார் ஏழு கோடி மதிப்புள்ள நிலத்தை கல்வித்துறைக்கு கொடையாக அளித்துவிட்டு மறுநாள் வங்கியில் கிளார்க் வேலையை சத்தமில்லாமல் செய்துக் கொண்டிருக்கும் ஆயி பூரணம் அம்மாளின் கரங்களைப் பற்றி வணங்கினேன். pic.twitter.com/5tat2Z7dC9 — Su Venkatesan MP (@SuVe4Madurai) January 11, 2024 -
Republic Day 2024: నారీశక్తి విశ్వరూపం
న్యూఢిల్లీ: భారత 75వ గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. శుక్రవారం ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. దేశ ఘన సాంస్కృతిక చరిత్రకు అద్దం పట్టాయి. ఆర్మీ మిలిటరీ పోలీస్ విభాగానికి చెందిన కెపె్టన్ సంధ్య సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. నేవీ, డీఆర్డీఓ శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆసాంతం నారీ శక్తికి అద్దం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్లు గగుర్పొడిచేలా డేర్‌డెవిల్ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు. బీఎస్ఎఫ్, సీఆరీ్ప ఎఫ్ మొదలుకుని ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వీటన్నింటినీ ఆసాంతం ఆస్వాదిస్తూ కని్పంచారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేయడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన పరేడ్‌లో ముర్ము, మేక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు. 90 నిమిషాలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సైనిక దళాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వణికించే చలిని, దట్టంగా కమ్మేసిన పొగ మంచును లెక్క చేయకుండా భారీ జనసందోహం వేడుకలను తిలకించింది. ఈసారి ఏకంగా 75 వేల మందికి పైగా గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. మోదీ వారితో కలివిడిగా మాట్లాడుతూ గడిపారు. ఫొటోలు, సెలీ్ఫలకు పోజులిచ్చారు. ఆయన ధరించిన రంగురంగుల బంధనీ తలపాగా ఆహూతులను ఆకట్టుకుంది. మోదీ రాక సందర్భంగా భారత్ మాతా కీ జై అంటూ వారు చేసిన నినాదాలతో కర్తవ్య పథ్ మారుమోగింది. ఫ్రాన్స్‌కు చెందిన 95 మంది సభ్యుల కవాతు దళం, 30 మందితో కూడిన సైనిక వాయిద్య బృందం కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. చివరగా వాయుసేనకు చెందిన 29 యుద్ధ విమానాలు, ఏడు రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు, ఒక హెరిటేజ్ ప్లేన్‌తో పాటు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ ఏ330 మల్టీ ట్యాంకర్ రావాణా విమానం, రెండు రాఫెల్ ఫైటర్ జెట్లు చేసిన ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ విన్యాసాల్లో కూడా 15 మంది మహిళా పైలట్లు పాల్గొనడం విశేషం. అలరించిన నాగ్ మిసైల్ వ్యవస్థ ► వేడుకల్లో ప్రదర్శించిన టీ–90 భీష్మ ట్యాంకులు, నాగ్ మిసైల్ వ్యవస్థ, తేజస్ వంటి యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్ వ్యవస్థ స్వాతి, డ్రోన్లను జామ్ చేసే వ్యవస్థ, అత్యాధునిక ఎల్రక్టానిక్ వార్ఫేర్ వ్యవస్థ, క్యూఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులు అలరించాయి. మోదీ నివాళులు శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ తొలుత నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. దేశమాత రక్షణలో ప్రాణాలొదిలిన సైనిక వీరులకు ఘనంగా నివాళులరి్పంచారు. అనంతరం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముర్ము, మేక్రాన్ గుర్రపు బగ్గీలో వస్తున్న దృశ్యాలను కెమెరాలు, సెల్ ఫోన్లలో బంధించేందుకు జనం పోటీ పడ్డారు. అనంతరం జెండా వందనం, జాతీయ గీతాలాపన, 105 ఎంఎం దేశీయ శతఘ్నులతో 21 గన్ సెల్యూట్ అందరినీ ఆకట్టుకున్నాయి. భారత కీర్తి పతాకను వినువీధిలో ఘనంగా ఎగరేసిన చంద్రయాన్ థీమ్‌తో రూపొందిన శకటం అలరించింది. దాంతోపాటు అయోధ్య రామాలయ ప్రారంభం నేపథ్యంలో కొలువుదీరిన బాలక్ రామ్ శకటం ప్రధానాకర్షణగా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర శాఖలకు సంబంధించి 9 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. వేడుకలు ముగిశాక మోదీ కర్తవ్య పథ్ పొడవునా కాలినడకన సాగి ఆహూతులను అలరించారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు వాటిలో పాల్గొన్నారు. గొప్ప గౌరవం: మేక్రాన్ ‘‘గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాతో పాటు ఫ్రాన్స్‌కు కూడా గొప్ప గౌరవం. థాంక్యూ ఇండియా. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు భారత ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. వేడుకల అనంతరం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది ఆరోసారి కావడం విశేషం! ఈ వేడుకలకు దేశాధినేతలను ముఖ్య అతిథిగా ఆహా్వనించడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నెల్సన్ మండేలా (1995లో) మొదలుకుని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (2015లో) దాకా ఎందరో అధినేతలు వీటిలో భాగస్వాములయ్యారు. దేశాధినేతల అభినందనలు బ్రిటన్ రాజు చార్లెస్ 3 మొదలుకుని ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు దాకా పలు దేశాల అధినేతలు భారత్‌కు 75వ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. అభినందన సందేశాలతో సామాజిక వేదికల్లో పోస్టులు పెట్టారు. భారత్‌తో బ్రిటన్ సంబంధాలు నానాటికీ పటిష్టమవుతున్నాయని రాష్ట్రపతి ముర్ముకు పంపిన సందేశంలో కింగ్ చార్లెస్ హర్షం వెలిబుచ్చారు. -
సేంద్రీయ వ్యవసాయంతో ‘నారియల్ అమ్మ’ కు పద్మశ్రీ
సేంద్రీయ వ్యవసాయంతో పద్మశ్రీ అవార్డు దక్కించుకుని ‘నారియల్ అమ్మ’ వార్తల్లోనిలిచారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతానికిచెందిన 67 ఏళ్ల కామాచి చెల్లమ్మాళ్ కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. సేంద్రీయ కొబ్బరి తోటల పెంపకంలో విశేషకృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కింది. సాంప్రదాయ వ్యవసాయం, కొబ్బరి సాగుతో 'నారియల్ అమ్మ' గా ఖ్యాతి గడించారు. దక్షిణ అండమాన్‌లోని రంగాచాంగ్‌కు చెందిన చెల్లమ్మాళ్ కొబ్బరి సాగులో విప్లవాత్మకమైన, వినూత్న పద్ధతులను అవలబించారు. స్థిరమైన వ్యవసాయానికి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ను కూడా అలవర్చుకున్నారు. కొబ్బరి ఆకులు, పొట్టును మల్చింగ్గా ఉపయోగించి వర్షానంతర కాలంలో నేల తేమను కాపాడుకుంటూ తేమ నష్టాన్ని తగ్గించడమే కాకుండా కలుపు, తెగుళ్ల బెడదను నివారించారు. అలాగే హానికర రసాయనాలకు దూరంగా 'ట్రాప్ ప్లాంట్స్'తో తెగుళ్ల నివారణలో వ్యూహాత్మక విధానాన్ని అవలంబించారు. ఫలితంగా ఆరోగ్యకరమైన కొబ్బరి దిగుబడిని సాధించారు. అంతేకాదు తనతోపాటు తోటి రైతులు కూడా సేంద్రీయ పద్ధతులను పాటించేలా కృషి చేశారు.. తన 10 ఎకరాల భూమిలో బహుళ జాతుల పంటలను పండిస్తారు చెల్లమ్మాల్. అలాగే ఏనుగు పాదం, అరటి, వేరుశెనగ, పైనాపిల్, బత్తాయి, పచ్చిమిర్చి, ట్యూబ్ రోజ్, గ్లాడియోలస్, ఆకు, కూరగాయలతో వైవిధ్యమైన సాగు ఆమె ప్రత్యేకత. సమీకృత వ్యవసాయ విధానంతో తక్కువ కొబ్బరి మార్కెట్ ధరల సవాళ్లను అధిగమించడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచింది. స్థిర వ్యవసాయ పద్ధతులు, సరికొత్త ఆవిష్కరణలతో మారుమూల గ్రామం నుంచిజాతీయ అవార్డు దాకా సాగిన చెల్లమ్మాళ్ అద్భుత ప్రయాణం భావి తరం రైతులకు, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చెల్లమ్మాళ్ కొడుకు రామచంద్రన్, ఆమెకు వ్యవసాయంలో ఆసరాగా ఉంటారు. విభిన్న పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపక విశేషాలను స్థానిక విద్యార్థులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ప్రదర్శిస్తూ వ్యవసాయ-పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని యోచిస్తున్నారు. -
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. భారత్ సాంస్కృతిక వైవిధ్యాన్ని, సైనిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అయోధ్య రాముడు, చంద్రయాన్-3 శకటాలు అందర్నీ ఆకర్షించాయి. ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లు రూపొందించిన శకటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది. ► 'విక్షిత్ భారత్', 'భారత్ - లోక్తంత్రకి మాతృక' అనే జంట థీమ్‌ల ఆధారంగా ఈ ఏడాది జరిగిన కవాతులో 13,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. ► మొదటిసారిగా, శంఖం, నాదస్వరం, నగడ వంటి భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ 100 మంది మహిళా కళాకారులు కవాతును ప్రారంభించారు. ► కర్తవ్య మార్గంలో మహిళలతో కూడిన ట్రై-సర్వీస్ బృందం తొలిసారిగా కవాతు చేసింది. మహిళా పైలట్లు కూడా 'నారీ శక్తి'ని సూచిస్తూ ఫ్లై పాస్ట్ సమయంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) దళం కూడా పూర్తిగా మహిళా సిబ్బందిని కలిగి ఉంది. ► భారత అంతరిక్ష పరిశోధక సంస్థ ప్రదర్శించిన చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 శకటం ఆకట్టుకుంది. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ దిగుతున్న దృశ్యాలను ఇందులో పొందుపర్చారు. మహిళా శాస్త్రవేత్తలు ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్‌ను కూడా చూపించారు. ► అయోధ్యలో ఇటీవల ప్రారంభమైన బాల రాముని శకటం ఆకర్షించింది. రామ మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా దీన్ని ప్రదర్శించారు. బాల రాముడు విల్లు, బాణాలు ధరించిన రూపాన్ని శకటంలో రూపొందించారు. ► దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైతోంది. ఈ క్రమంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పడానికి ఎన్నికల సంఘం ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లు రూపొందించిన శకటం ఆకర్షణగా నిలిచింది. ► కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఢిల్లీ పోలీసుల బృందాలకు మహిళా సిబ్బంది నాయకత్వం వహించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాంటింజెంట్కి అసిస్టెంట్ కమాండెంట్ మోనికా లక్రా నాయకత్వం వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు అసిస్టెంట్ కమాండెంట్ తన్మయీ మొహంతి నాయకత్వం వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు అసిస్టెంట్ కమాండెంట్ మేఘా నాయర్ లీడర్‌గా వ్యవహరించారు. ఇదీ చదవండి: భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక -
దాదాపు 40 ఏళ్ల తరువాత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అలా...
#RepublicDay2024- MurmuHorsebuggy for parade రిపబ్లిక్ డే 2024 వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే.. దాదాపు 40 సంవత్సరాల విరామం తర్వాత, రిపబ్లిక్ డే పరేడ్‌లో గుర్రపు బగ్గీ సంప్రదాయం మళ్లీ వచ్చింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ‘సాంప్రదాయ గుర్రపు బగ్గీ’ కర్తవ్య పథానికి చేరుకున్నారు.ప్రెసిడెంట్ ముర్ముతోపాటు ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ ప్రత్యేక వాహనంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకులకు హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ బగ్గీకి రాష్ట్రపతి అంగరక్షకుడు ఎస్కార్ట్ చేశారు. భారత సైన్యంలోని అత్యంత సీనియర్ రెజిమెంట్ రాష్ట్రపతి అంగరక్షకుడుగా ఉంటారు. అయితే భద్రతా కారణాల రీత్యా 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత రిపబ్లిక్ డే కార్యక్రమాలకు అధ్యక్షుడి బగ్గీని ఉపయోగించడం నిలిపివేశారు. అప్పటిక అధ్యక్షులు వారి ప్రయాణానికి లిమోసిన్‌లను ఉపయోగిస్తున్నారు. అంతకుముందు 2014లో, బీటింగ్ రిట్రీట్ వేడుకలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరు గుర్రాల బగ్గీని నడిపి ఈ సంప్రదాయాన్నిపునరుద్ధరించిన సంగతి తెలిసిందే. #WATCH | President Droupadi Murmu and French President Emmanuel Macron riding in a special presidential carriage escorted by the President's Bodyguard make their way to Kartavya Path pic.twitter.com/F4hOovJoua — ANI (@ANI) January 26, 2024 కాగా 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నారీశక్తి థీమ్‌కు అనుగుణంగా 26 శకటాలు దేశంలో మహిళా సాధికారతను ప్రదర్శిస్తూ కర్తవ్య పథంలో కవాతు చేశాయి. అగే తొలి సారి మహిళా అధికారుల సారధ్యంలో త్రివిధ దళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 105 హెలికాప్టర్ యూనిట్‌కు చెందిన నాలుగు Mi-17 IV హెలికాప్టర్లు కర్తవ్య పథంలో హాజరైన ప్రేక్షకులపై పూల వర్షం కురిపించాయి. 100 మంది మహిళా కళాకారులు నారీ శక్తికి ప్రతీకగా వివిధ రకాల తాళ వాయిద్యాలను వాయిస్తూ ‘ఆవాహన్’ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలకు గాను దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ అంతటా 70వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. -
రిపబ్లిక్ డే పరేడ్‌లో చరిత్ర సృష్టించిన మన ‘రాకెట్ గర్ల్స్'
#RepublicDay2024-ISRO Tableau 75వ రిపబ్లిక్ డే పరేడ్‌లో సగర్వంగా కవాతు నిర్వహించి భారతదేశపు రాకెట్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. 'చంద్రయాన్-3 - ఎ సాగా ఇన్ ది ఇండియన్ స్పేస్ హిస్టరీ' కర్తవ్య పథంలోకి దూసుకెళ్లి రికార్డు క్రియేట్ చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని శకటంపై చంద్రయాన్ -3 మిషన్ సాధించిన విజయాలను, ఆదిత్య ఎల్ వన్ ప్రాజెక్ట్ వివరాలు, 'బాహుబలి రాకెట్' లాంచ్ వెహికల్ మార్క్ 3 నమూనా తదితర వివరాలను ప్రదర్శించింది. అలాగే అంతరిక్ష పితామహులు, ఖగోళ శాస్త్రవేత్తలు ఆర్యభట్ట , వరాహమిహిరులు కూడా ఈ శకటంలో దర్శనిమచ్చారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో విజయవంతంగా దిగిన ల్యాండింగ్ సైట్‌ను శివ శక్తి పాయింట్‌తోపాటు విక్రమ్ ల్యాండర్ , ప్రజ్ఞాన్ రోవర్ వివరాలను ప్రదర్శించింది. బెంగుళూరు, అహ్మదాబాద్, తిరువనంతపురం, శ్రీహరికోటలోని వివిధ ఇస్రో కేంద్రాలకు చెందిన ఎనిమిది మంది మహిళా శాస్త్రవేత్తల బృందం ఆహూతులను ఆకట్టుకున్నారుఇస్రో షీరోలైన ఆదిత్య L1 మిషన్ డైరెక్టర్ నిగర్ షాజీ ,చంద్రయాన్-2 మిషన్‌కు నాయకత్వం వహించిన ఎం వనిత, ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం ఓషన్‌శాట్ తయారీ మిషన్ హెడ్ శ్రీమతి తేన్మొళి సెల్వి కె , చంద్రయాన్-3 మిషన్‌కు డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన తదితరులు దీనికి నాయకత్వం వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 220 మంది మహిళా శాస్త్రవేత్తలు కవాతు చేశారు. రెండు చారిత్రాత్మక విజయాల తర్వాత ఇస్రో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంది. Happy Republic Day🇮🇳#ISRO’s #RepublicDay tableau led on Kartavya Path by Bharat’s #NariShakti. pic.twitter.com/XP2g6bAuJY — ISRO InSight (@ISROSight) January 26, 2024 దేశ రాజధాని నగరంలో ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ ఏడాది వేడుకల్లో త్రివిధ దళాల్లో అందరూ మహిళలే ఉండటం విశేషం. కర్తవ్య పథ్‌లో త్రివిధ దళాల మహిళా అధికారుల నేతృత్వంలో మహిళాబృందం తొలిసారిగా మార్చ్ చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఆర్మీ డెంటల్ కార్ప్స్ నుండి కెప్టెన్ అంబా సమంత్, ఇండియన్ నేవీ నుండి సర్జ్ లెఫ్టినెంట్ కాంచన,ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన లెఫ్టినెంట్ దివ్య ప్రియతో కలిసి మేజర్ సృష్టి ఖుల్లర్ నేతృత్వంలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌కు చెందిన పూర్తి మహిళా బృందం కర్తవ్యపథ్‌లో నారీ శక్తి పేరుతో విన్యాసాలను ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. Happy Republic Day to all Indians and #ISRO lovers 🇮🇳 The #RepublicDayParade today featured a Chandrayaan-3/ISRO tableau!! Here's the video of that:pic.twitter.com/6blzAUj8nn — ISRO Spaceflight (@ISROSpaceflight) January 26, 2024 -
ఏపీ ప్రభుత్వ సంక్షేమ పాలనకు అభినందనలు
AP Republic Day 2024 Celebrations Updates.. గవర్నర్ ప్రసంగం ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉండాలి ఐక్యమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పని చేయాలి ఎదురైన అడ్డంకుల్ని అధిగమిస్తూ మన లక్ష్యాల్ని చేరుకోవాలి గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొంది ఒడిదుడుకుల్లో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలు ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నారు 56 నెలలుగా గ్రామస్వరాజ్యం దిశగా సంస్కరణలు మారుమూల గ్రామాలకు కూడా సేవలు అందేలా సంస్కరణలు రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం విలేజీ క్లీనిక్స్‌తో గ్రామాల్లోనే ప్రజలకు వైద్యసేవలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి జగనన్న అమ్మఒడితో ప్రతీ పేద విద్యార్థి చదువుకోగలుగుతున్నారు జగనన విదేశీ విద్యాదీవెన ద్వారా విదేశాల్లో చదివేందుకు అవకాశం కలుగుతోంది ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్‌తో వైద్యం అభినందనీయం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం సమర్థవంతంగా అమలు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం అందుతోంది రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాం గర్బిణులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే చేరుకుంటున్నాయి పెన్షన్లు, రేషన్ నేరుగా ఇళ్లకే వెళ్లి అందజేత ప్రతీనెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి అందించడం అభినందనీయం పరిపాలన సంస్కరణల్లో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు ప్రతీ ఏడాది స్కూళ్లు తెరవక ముందే విద్యాకానుక అందజేత రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుక అందజేత ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు స్కూళ్లలో నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి గ్రామ, వార్డు సచివాలయాలు నేరుగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారు ఏపీ సంక్షేమ పాలనకు నా అభినందనలు ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది ► శకటాల ప్రదర్శన తిలకిస్తున్న గవర్నర్ నజీర్, ఇతరులు ► ప్రత్యేక ఆకర్షణగా సంక్షేమ శకటాలు సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ సాయుధ దళాల పరేడ్‌ను సమీక్ష చేసిన గవర్నర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంక్షేమ పథకాల శకటాలు ►గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేడియంలో పోలీసు , ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతు ►ప్రదర్శనకు సిద్ధమైన వివిధ శాఖలకు చెందిన శకటాలు ►పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ నజీర్ ►జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ► ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు హాజరైన సీఎం జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు ► ఏపీ అసెంబ్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనమండలి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండలి చైర్మన్ మోషేన్ రాజు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన స్పీకర్, మండలి ఛైర్మన్ ► ఏపీ సచివాలయంలో జెండా ఆవిష్కరణ ఏపీ సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించిన ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి పాల్గొన్న పలువురు ఉన్నతాధికారులు ► విజయవాడ స్టేడియంలో.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(IGMC)లో మరికాసేపట్లో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు జెండా ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరణ అనంతరం గవర్నర్ ప్రసంగం ► రాజ్‌భవన్‌లో హైటీ కార్యక్రమం రిపబ్లిక్ డే సందర్భంగా సాయంత్రం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం హాజరుకానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఇదీ చదవండి: సీఎం జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారు: తమిళిసై
Live Updates.. ►ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం ►ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు ►హైదరాబాద్ సెక్రటేరియట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ►జాతీయ పతాకవిష్కరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ►రిపబ్లిడ్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ.. ‘తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చరమగీతం పాడారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ప్రకటించారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించలేదు. ►పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ►ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది’. ►గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారింది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తాం. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ►సైనికుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ తమిళిసై ►పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై. ►జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు ►నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి. ►హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ►రిపబ్లిక్ డే వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్‌ను అధికారులు సిద్ధం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ►శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ సీఎం రేవంత్ చేరుకున్నారు. పరేడ్ గ్రౌండ్లో వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. రిపబ్లిక్ డే సందర్భంగా వీరుల సైనిక్ స్మారకం వద్ద యుద్ధ వీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. -
Republic Day 2024: అలా అనకూడదని తెలుసా?
Republic Day Celebrations 2024: ఇవాళ జెండా పండుగ. గణతంత్ర దినోత్సవం. అయితే ఇవాళ జెండా ఎగరేయడం అనొద్దు అంట. అది ముమ్మాటికీ తప్పంట. ఆవిష్కరించడం అనలాట. ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పైగా ఇవాళ జెండా ఆవిష్కరించబోయేది రాష్ట్రపతి. ఈ వేడుకలకు ప్రధాని హాజరైనా జెండా మాత్రం ఆవిష్కరించరు. ప్రధాని కేవలం స్వాత్రంత్య దినోత్సవం నాడు ప్రధాని జెండా ఎర్రకోటపై ఎగరేయడానికి.. జనవరి 26న రాష్ట్రపతి జెండా ఆవిష్కరించడానికి గల కారణం.. ఆ ఆనవాయితీ ఎన్నేళ్ల నుంచి కొనసాగుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి.. జనవరి 26 రిపబ్లిక్ డే, ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే.. ఈ రెండు తేదీలలో దేశవ్యాప్తంగా జెండాను రెపరెపలాడిస్తారు. పంద్రాగష్టున ప్రధాని ఎర్రకోటలో జెండా ఎగరేస్తారు. అయితే ఈ రోజు జనవరి 26న రాష్ట్రపతి న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జెండా ఆవిష్కరిస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. కాబట్టే దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాం. అదే ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగుతారు. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. కాబట్టే.. జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేశారు. అది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీక. అదలా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. నేడు రాష్ట్రపతి.. ఆరోజున ప్రధాని.. కారణం ఇదే.. ఇక్కడ గమనించాల్సిన మరో వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఘనంగా పరేడ్ నిర్వహిస్తారు. ఇక.. దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి ప్రత్యేకంగా కారణం చెప్పనక్కర్లేదు. ఎర్రకోటపై జెండా ఎగరేశారక ఆయన ప్రసంగం ఇస్తారు. -
ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. అప్డేట్స్
ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు కర్తవ్యపథ్‌లో ముగిసిన 75వ రిపబ్లిక్ డే వేడుకలు వేడకులకు హాజరైన వారికి ప్రధాని మోదీ ప్రత్యేక అభివాదం వేడుకలు ముగియడంతో వెళ్లిపోయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఢిల్లీ గగనతలంలో దూసుకెళ్లిన రాఫెల్ ఫైటర్ జెట్లు రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఢిల్లీ గగనతలంలో దూసుకెళ్లిన రాఫెల్ యుద్ధ విమానాలు పరేడ్‌లో మార్చ్ఫాస్ట్ నిర్వహించిన ఫ్రెంచ్ కంటింజెంట్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యకక్షుడు మాక్రాన్ చంద్రయాన్ శివశక్తి పాయింట్ శకటానికి విశేష స్పందన చంద్రయాన్ శివశక్తి పాయింట్ శకటాన్ని ప్రదర్శించిన ఇస్రో శకటానికి వీక్షకుల నుంచి విశేష స్పందన విశేషంగా ఆకట్టుకున్న ఏపీ,తెలంగాణ శకటాలు రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకున్న ఏపీ, తెలంగాణ శకటాలు డిజిటల్ క్లాస్రూమ్ శకటాన్ని ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ డెమొక్రసీ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్స్ శకటాన్ని ప్రదర్శించిన తెలంగాణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రివిధ దళాల మహిళా కంటింజెంట్ మార్చ్ఫాస్ట్ రిపబ్లిక్ డే వేడుకల్లో త్రివిధ దళాల మహిళా కంటింజెంట్ మార్చ్ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మార్చ్ ఫాస్ట్ లేచి నిలబడి అభినందనలు తెలిపిన వీక్షకులు ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆకట్టుకుంటున్న శకటాల ప్రదర్శన ఆసక్తిగా తిలకించిన రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీ పరేడ్ తిలకిస్తున్న రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ తిలకిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు ముర్ము వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర మంత్రులు ఉత్సాహంగా సాగిన మార్చ్ఫాస్ట్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా కర్తవ్యపథ్‌లో జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్రపతి ముర్ము వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వేడుకల్లో పాల్గొన్న పాల్గొన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సైనికుల గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కర్తవ్యపథ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు సైనికుల గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆయుధ ప్రదర్శనను తిలకిస్తున్న ముఖ్య అతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కర్తవ్యపథ్‌కు రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ గుర్రపు బగ్గీపై కర్తవ్యపథ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్వాగతం పలికిన ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమరజవాన్లకు నివాళుర్పించిన ప్రధాని వార్ మెమోరియల్ వద్ద అమరజవాన్లకు ప్రధాని నివాళులు అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించి వేడుకలకు హాజరు ప్రధాని వెంట రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనంతరం కర్తవ్య్పథ్కు చేరుకుని అభివాదం రిపబ్లిక్ డే వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఢిల్లీ కర్తవ్యపథ్‌లో ఉదయం 10.30 గంటలకు రిపబ్లిక్ డే వేడుకలు ప్రారంభమవనున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ పాల్గొంటారు. వేడుకలు జరిగే కర్తవ్యపథ్‌పై మిగ్-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. ప్రధాని, రాష్ట్రపతితో కలిసి మార్కన్ రిపబ్లిక్ డే పరేడ్‌ను తిలకించనున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా సైన్యానికి చెందిన పలువురికి గ్యాలంట్రీ అవార్డులు అందిస్తారు. రిపబ్లిక్ డే వేడుకలకు 8 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
ఈసారి 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కర్తవ్య పథ్’లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అయితే ఈ 'కర్తవ్య పథ్'లో దేశంలోని నారీ శక్తి ధైర్యమే కనిపించనుంది. అందులోనూ ముఖ్యంగా సాయుధ దళాలకు వైద్య సేవలందించే మహిళ డాక్టర్ల బృందం కవాతు చేయనుండటం విశేషం. అంతేగాదు దేశంలోని 'నారీ శక్తి' పరేడ్‌తో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు సంచలనాత్మకంగా నిలిచిపోనున్నాయి. ఈ సారి రిపబ్లిక్‌డే వేడుకల్లో దేశంలోని నారీ శక్తి ధైర్యమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా తొలిసారిగా సాయుధ దళాల వైద్య సేవలకు సంబంధించి పూర్తి మహిళా బృందం కర్తవ్పథ్లో కవాతు చేయడం విశేషం. దీనికి మేజర్ సృష్టి ఖుల్లార్ నాయకత్వం వహించనున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలు మహిళా బృందంతో చారిత్రత్మక కవాతును ప్రారంభించి సంచలనం సృషిస్తోంది. ఇక వైద్యురాలు ఖుల్లార్ మహిళల బృందానికి నాయకత్వం వహించి సాయుధ దళాల మహిళా డాక్టర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. ఈ కవాతు శౌర్యం, పరాక్రమంతో అడ్డంకులన్నింటిని బద్దలు కొట్టేలా 'నారీ శక్తి 'వేస్తున్న అసలైన అడుగు. ఈమేరకు సృష్టి ఖుల్లర్ మాట్లాడుతూ.. నేత్ర వైద్యురాలిగా, ఆపరేషన్ థియేటర్లో సర్జికల్ కత్తి పట్టుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు కర్తవ్య పథ్‌లో కత్తి పట్టుకోవడం తనకు ఓ ఛాలెంజింగ్‌గా అద్భుతంగా ఉందని సంతోషంగా చెప్పింది. అందుకు తాను భారత ఆర్మీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాని అన్నారు. Met paratrooper & eye surgeon Major Srishti Khullar today. She will lead the all-women Armed Forces Medical Services marching contingent at the Republic Day parade. "From holding the surgical knife to carrying a sword at the parade, the new role is quite challenging & rewarding." pic.twitter.com/1gT5MTQIxZ — Rahul Singh (@rahulsinghx) January 23, 2024 చరిత్ర సృష్టించనున్న ఢిలీ మహిళా పోలీసులు.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 'కర్తవ్య పథ'లో పూర్తిగా మహిళా పోలీసులే ప్రదర్శన ఇవ్వనున్నారు. పరేడ్‌లో ఇలా పూర్తి మహిళా పోలీసులే పాల్గొనడం తొలిసారి. ఇక ఈ మహిళా బృందంలో నగర దళానికి చెందిన మహిళ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. దీనికి ఐపీఎస్ అధికారిణి శ్వేతా కే సుగతన్ నాయకత్వం వహించనున్నారు. ఆమె నేతృత్వంలో దాదాపు 194 మంది మహిళా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు కవాతు చేయనున్నారు. మహిళా అధికారుల సారథ్యంలోనే త్రివిధ దళాల కవాతు ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా మహిళా అధికారుల సారథ్యంలో త్రివిధ దళాల కవాతు నిర్వహిస్తుండటం విశేషం. ఇక భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ శరణ్య రావు తాను ఈ త్రివిధ దళాల ఆర్మీ కాంపోనెంట్కి సూపర్ న్యూమరీ అధికారిగా సారథ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం అని భావోద్వేగంగా మాట్లాడారు కెప్టెన్ శరణ్యరావు. ఈ ఏడాది నారీ శక్తి థీమ్‌కి తగ్గట్టుగా చాలామంది మహిళల నేతృత్వంలో త్రివిధ దళాల కవాతు జరగడం అనేది చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న అపూర్వ ఘట్టం అని కొనియాడారు. తొలిసారిగా ఓ ఆర్మీ దంపతుల కవాతు ఈ కర్తవ్య పథ్‌లో తొలిసారిగా ఒక జంట కలిసి కవాతు చేయనుండటం విశేషం. వివిధ రెజిమెంట్లలో భాగంగా తొలిసారి మేజర్ జెర్రీ బ్లేజ్, కెప్టెన్ సుప్రత అనే జంట కలిసి కవాతు చేయనుంది. వారిద్దరూ గతేడాది జూన్‌లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఇక 'కర్తవ్య పథ్' అంటే..ఏటా గణతంత్ర దినోత్సవాన దేశ సైనికశక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే ఈ మార్గం.ఒకప్పుడూ ఇది ‘రాజ్ పథ్’ అనే పేరుతో ఉండేది. (చదవండి: ఢిల్లీ పరేడ్‌కు అసామాన్యులు) -
Republic Day 2024: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: దేశ సైనిక శక్తిని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటే 75వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ సిద్ధమైంది. కర్తవ్యపథ్‌లో గంటన్నరపాటు సాగే పరేడ్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సారథ్యం వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ హాజరు కానున్నారు. పరేడ్‌లో క్షిపణులు, డ్రోన్జా మర్లు, నిఘా వ్యవస్థలు, సైనిక వాహనాలపై అమర్చిన మోర్టార్లు, పోరాట వాహనాలను ప్రదర్శించనున్నారు. మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులతో కూడిన త్రివిధ దళాల కంటింజెంట్ కవాతులో పాల్గొననుంది. గత ఏడాది ఆర్టిలరీ రెజిమెంట్‌లో విధుల్లో చేరిన 10 మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్లు దీప్తి రాణా, ప్రియాంక సెవ్దా సహా మొట్టమొదటిసారిగా స్వాతి వెపన్ లొకేటింగ్ అండ్ పినాక రాకెట్ సిస్టమ్‌కు సారథ్యం వహించనున్నారు. సంప్రదాయ మిలటరీ బ్యాండ్లకు బదులుగా ఈసారి భారతీయ సంగీత పరికరాలైన శంఖ, నాదస్వరం, నాగడ వంటి వాటితో 100 మంది మహిళా కళాకారుల బృందం పరేడ్‌లో పాల్గొననుంది. భారత వైమానిక దళానికి చెందిన 15 మంది మహిళా పైలట్లు వైమానిక విన్యాసాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాల పాటు కొనసాగనుంది. -
Republic Day 2024: జైపూర్‌లో మోదీ, మేక్రాన్ రోడ్ షో
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ గురువారం జైపూర్‌లో రోడ్ షోలో పాల్గొ న్నారు. మోదీ ఆయనకు అయోధ్య రామాల యం ప్రతిమను కానుకగా అందజేశా రు. ఇద్దరు నేతలు జైపూర్‌లో మసాలా చాయ్ రుచిని ఆస్వాదించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా హాజరు కానున్న ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం జైపూర్‌కు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఫ్రాన్సు అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ పరిచి, అందంగా అలంకరించిన గజరాజులతో స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి మేక్రాన్ అంబర్ కోటకు వెళ్లారు. జంతర్‌మంతర్ వద్ద ప్రధాని మోదీ ఆయన్ను కలిశారు. పరస్పర కరచా లనం, ఆత్మీయ ఆలింగనాల అనంతరం ఓపెన్ టాప్ కారులో జంతర్‌మంతర్ నుంచి రోడ్ షోకు బయలుదేరారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ హవా మహల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి తాజ్ రామ్‌బాగ్ ప్యాలెస్‌కు చేరుకుని, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
President Droupadi Murmu: వారసత్వ ప్రతీక రామమందిరం
న్యూఢిల్లీ: భారత్ తన పురాతన నాగరికత వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసుకున్న అద్భుత ఘడియగా ‘రామ మందిర నిర్మాణ ఘట్టం’ నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశిస్తూ రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ‘‘ అయోధ్యలో రామమందిర దివ్యధామం ప్రజల విశ్వాసాలను మాత్రమే కాదు న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకున్న అచంచల విశ్వాసానికీ నిలువెత్తు నిదర్శనం’’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరునూ ఆమె ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణలు, మానవీయ సంక్షోభాలు, యుద్ధాలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఘర్షణలకు మూలాలను వెతక్కుండా భయాలు, విద్వేషంతో ఆయా దేశాల ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని ఆమె మాటల్లోనే.. జీ20 ఆతిథ్యం ఎన్నో నేరి్పంది ‘‘న్యాయ ప్రక్రియ, సుప్రీంకోర్టు సముచిత తీర్పుల తర్వాతే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బాటలు పడ్డాయి. ఈ ఆలయం నిర్మాణం ద్వారా భారత్ తన నాగరికత వారసత్వ పరంపరను కొనసాగిస్తున్నట్లు మరోమారు ప్రపంచానికి చాటింది. ప్రజల విశ్వాసం మాత్రమే కాదు వారు న్యాయవ్యవస్థ మీద వారికున్న నమ్మకానికి నిదర్శనం ఈ ఆలయం. ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ తన పౌరుల భాగస్వామ్యంలో ఎంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలనైనా నిర్వహించగలదని రుజువు చేసింది. వ్యూహాత్మక, దౌత్య అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించి చూపింది. ప్రజలు తమ సొంత భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోగలరో ప్రపంచ దేశాలకు నేరి్పంది. గ్లోబల్ సౌత్‌కు భారత్ గొంతుకగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టితో ధృఢ విశ్వాసంతో భారత్ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తోంది’’ అని అన్నారు. అభివృద్ధి భారత్ బాధ్యత పౌరులదే ‘‘ స్వతంత్రభారతావని 75 వసంతాలు పూర్తిచేసుకుని శత స్వాతంత్రోత్సవాల దిశగా అడుగులేస్తోంది. రాబోయే పాతికేళ్ల అమృత్‌కాలంలో సర్వతోముఖాభివృద్ధి సాధించి అభివృద్ధి చెందిన భారత్‌గా దేశాన్ని నిలపాల్సిన బాధ్యత పౌరులదే. ఇప్పుడు మహాత్ముని మాటలు గుర్తొస్తున్నాయి. దేశంలో ప్రజలు ప్రాథమిక హక్కులు గురించి మాత్రమే మాట్లాడితే సరిపోదు. ప్రాథమిక విధులు సైతం ఖచి్చతంగా నిర్వర్తిస్తూ బాధ్యతగా మెలిగినప్పుడే భారత్ అభివృద్ది చెందుతుందని గాం«దీజీ ఉపదేశించారు’’ అని ముర్ము గుర్తుచేశారు. -
రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగంలో అయోధ్య ప్రస్తావన
ఢిల్లీ: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం, భారతరత్న పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గురించి ప్రస్తావించారు. అయోధ్యలో మహిమాన్వితమైన రామ మందిర ప్రారంభోత్సవాన్ని ముర్ము ప్రశంసించారు. అయోధ్యను భారతదేశ నాగరికత వారసత్వానికి మైలురాయిగా చరిత్రకారులు భావిస్తారని చెప్పారు. భారతరత్న అవార్డు పొందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు ముర్ము నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాలు ముగిశాయని పేర్కొన్న ముర్ము.. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ప్రజాస్వామ్యానికి తల్లి.. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా పురాతనమైనదని చెప్పారు. భారతదేశం అమృత్కాల్ దశలో ఉందని పేర్కొన్న ముర్ము.. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సువర్ణావకాశం దేశ ప్రజలకు ఉందని పేర్కొన్నారు. 'దేశం అమృత్ కాల్ ప్రారంభ సంవత్సరాల్లో ఉంది. ఇది పరివర్తన సమయం. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మనకు సువర్ణావకాశం లభించింది. మన లక్ష్యాలను సాధించడంలో ప్రతి పౌరుడి సహకారం చాలా కీలకం.’’ అని ఆమె అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ గురించి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. టెక్నాలజీ మన జీవితంలో ఎలా భాగమైందో కూడా వివరించారు. 'అమృత్ కాల్' కాలం అపూర్వమైన సాంకేతిక మార్పుల కాలం అని ముర్ము పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పురోగతులు మన దైనందిన జీవితంలో భాగమవుతున్నాయని చెప్పారు. యువత కొత్త సరిహద్దులను అన్వేషిస్తోందని తెలిపిన ముర్ము.. వారి మార్గం నుండి అడ్డంకులను తొలగించడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని అన్నారు. ఇదీ చదవండి: జైపూర్‌లో మోదీ, మాక్రాన్ రోడ్ షో -
మిడిల్ క్లాస్ డ్రీమ్ వెహికల్: ఐకానిక్ లూనా సరికొత్తగా! రిపబ్లిక్ డే ఆఫర్
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పుంజుకుంటోంది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలన్నీ తమ మోడళ్లలో ఈవీ వెర్షన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పటి మధ్యతరగతి కలల టూవీలర్ లూనా సరికొత్త అవతారంలో ఈవీగా భారతీయ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు భారత్‌లో లాంచ్ కానుంది. ఈవీలకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో కెనటిక్ కంపెనీకి చెందిన పాపులర్ లూనా స్కూటర్‌ను తాజాగా ఈవీ వెర్షన్లో రిలీజ్ చేస్తోంది. అంతేకాదు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మోస్ట్ ఎవైటెడ్ మల్టీ యుటిలిటీ e2W, కైనెటిక్ గ్రీన్ E-Lunaను వచ్చే నెల (ఫిబ్రవరి 2024) ఆరంభంలో రిలీజ్ చేయనుంది. బుకింగ్‌లు జనవరి 26న షురూ అవుతాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Kinetic Green వెబ్సైట్లో కేవలం రూ. 500తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. కైనెటిక్ ఇ-లూనా పూర్తిగా మేడ్-ఇన్-ఇండియాగా వస్తోంది. మెట్రో ,టైర్ 1, టైర్-2, టైర్-3 నగరాలు , అలాగే గ్రామీణ యూజర్లును కూడా దృష్టిపెట్టుకుని అత్యాధునిక ఫీచర్లతో లూనా ఈవీ నితయారు చేసినట్టు కైనెటిక్ గ్రీన్ ఫౌండర్, సీఈవో సులజ్జ ఫిరోడియా మోత్వాని తెలిపారు. అంతేకాదు 'చల్ మేరీ లూనా' అంటూ యాడ్ ప్రపంచంలో సంచలనం రేపిన పియూష్ పాండే తిరిగి ఈ బ్రాండ్ కోసం పని చేయనున్నారట. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ లూనాకోసం సంతోషంగా ఉందని ప్రకటించారు పియూష్. నేటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని మయూర్ అండ్ టీం దీనికోసం పనిచేస్తోందన్నారు.పీయూష్ పాండే ప్రస్తుతం ఒగిల్వీ ఇండియా గ్లోబల్ క్రియేటివ్ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు కాగా కైనెటిక్ 2000 ప్రారంభంలో దాని ఉత్పత్తిని నిలిపివేసింది Unleash the beats, charge up the streets, and ride the rhythm of the future on the Zulu! .#kineticgreen #kineticgreenev #kineticgreen2w #kineticgreenvehicles #kyaboltizulu #kineticgreenjourney #hiphop pic.twitter.com/h3rw3YzSRT — Kinetic Green (@KineticgreenEV) January 17, 2024 కైనటిక్ లూనాఫీచర్లు, అంచనాలు కైనెటిక్ ఇ లూనాకు సంబంధించిన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. 16-అంగుళాల వైర్ స్పోక్ వీల్స్, మోపెడ్ ఆపడానికి రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ లూనా టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది. ఈ లూనా ఒక ‘హై-స్పీడ్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కూడా ఉంటుందని అంచనా. బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. పవర్‌ట్రెయిన్ డిజైన్ ఛార్జ్ టర్న్అరౌండ్ టైమ్‌లను తగ్గించడానికి మార్చుకునే లేదా రిమూవముల్ బ్యాటరీ ప్యా క్తో డిజైన్ చేసింది. -
26న మెట్రోలో వారికి ఉచిత ప్రయాణం!
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జనవరి 26, గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో నిఘా మరింతగా పెంచారు. ఢిల్లీలోని అన్ని కూడళ్లలో పోలీసులను మోహరించారు. వారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రిపబ్లిక్ డే పరేడ్ దృష్ట్యా, జనవరి 26న ఢిల్లీ మెట్రో రాకపోకల సమయాలను మార్చారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తెలిపిన వివరాల ప్రకారం గణతంత్ర దినోత్సవం నాడు ఉదయం నాలుగు గంటల నుండి మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రజలకు పరేడ్‌ను చూసే అవకాశం కల్పించేందుకు డీఎంఆర్సీ మెట్రో రాకపోకల్లో మార్పులు చేసింది. 26న ఉదయం 4 గంటల నుంచి అన్ని రూట్లలో మెట్రో అందుబాటులో ఉండనుంది. రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ-టికెట్లు లేదా ఈ-ఇన్విటేషన్లు కలిగినవారికి ప్రత్యేక కూపన్లు జారీ చేయనున్నట్లు డిఎంఆర్సి ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూజ్ దయాల్ సమాచారం తెలిపారు. ఈ కూపన్లు కలిగిన ప్రయాణికులు ‘కర్తవ్య పథ్’ వరకూ మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణం కోసం ప్రయాణీకులు తమ ఈ-టికెట్, ఈ-ఇన్విటేషన్ లేదా ఫోటో గుర్తింపు కార్డును మెట్రో స్టేషన్‌లోని సంబంధిత కౌంటర్లలో చూపించవలసి ఉంటుంది. ఇదిలావుండగా రిపబ్లిక్ డే సందర్భంగా రాజధానిలోని పలు బస్సుల రూట్లను కూడా మార్చారు. జనవరి 26న విజయ్ చౌక్, రాజ్‌పథ్, ఇండియా గేట్, తిలక్ మార్గ్-బహదూర్ షా జఫర్ మార్గ్-ఢిల్లీ గేట్-నేతాజీ సుభాష్ మార్గ్లలోకి ఎలాంటి వాహనాన్ని అనుమతించరు. Delhi Metro services to commence at 4:00 Am on 26th January. pic.twitter.com/DnK6Ak1sHh — Delhi Metro Rail Corporation (@OfficialDMRC) January 24, 2024 -
రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రత్యక్షంగా చూడాలంటే..
దేశ రాజధాని ఢిల్లీలో రేపు (శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కర్తవ్య పథ్’లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించాలనే ఆసక్తి కలిగినవారి కోసం ఈ వివరాలు.. పరేడ్ జరిగే సమయం రిపబ్లిక్ డే పరేడ్ జనవరి 26న ఉదయం 10:30 గంటలకు విజయ్ చౌక్ నుండి కర్తవ్య పథ్ వరకు సాగుతుంది. ఈ పరేడ్‌ను 77 వేల మంది కూర్చుని తిలకించవచ్చు. ఇందుకు ఏర్పాటు చేసిన కుర్చీలలో 42 వేల సీట్లను సాధారణ పౌరులకు కేటాయించారు. ఇది కూడా చదవండి: ‘కర్తవ్య పథ్’లోనే గణతంత్ర దినోత్సవాలు ఎందుకు? గణతంత్ర దినోత్సవ థీమ్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. ముఖ్య అతిథి ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన ముందుగా జనవరి 25న జైపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అదే రోజున రాష్ట్రపతిని, ప్రధాని నరేంద్ర మోదీని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కలుసుకోనున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. జనవరి 26న ఆయన రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసే ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌కు హాజరవుతారు. పరేడ్ టిక్కెట్ ధర ఎంత? ఎలా తీసుకోవాలి? రిపబ్లిక్ డే పరేడ్ టిక్కెట్లు రిజర్వ్డ్, అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంటాయి. అన్రిజర్వ్డ్ సీట్లకు రూ. 500, రూ. 100 రూ. 20 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఈ టిక్కెట్లను ఎలా కొనుగోలు చేయాలంటే.. 1) రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 2) పేరు, ఈ- మెయిల్ ఐడీ, చిరునామా, మొబైల్ నంబర్ మొదలైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్లో వచ్చిన ఓటీపీని తెలియజేయడం ద్వారా మీ గుర్తింపును ధృవీకరించాల్సి ఉంటుంది. 3) పరేడ్‌లో ఎఫ్డీఆర్ రిపబ్లిక్ డే పరేడ్, రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ ది రిట్రీట్ ఈవెంట్లు ఉంటాయి. దీనిలో టిక్కెట్ కొనుగోలుదారు తనకు కావలసిన ఈవెంట్‌ను ఎంచుకోవచ్చు. 4) టిక్కెట్ కొనుగోలుదారు తన ధృవీకరణ కోసం పేరు, చిరునామా, వయస్సు, లింగం, ఫోటో ఐడీ (డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్) జెరాక్స్ కాపీని సమర్పించాలి. 5) కొనుగోలు చేయాలనుకుంటున్న టిక్కెట్ల సంఖ్యను ఎంచుకోవాలి. టిక్కెట్ల వర్గం ప్రకారం చార్జీలను చెల్లించాలి. 6) టిక్కెట్ల చార్జీలను చెల్లించిన తర్వాత క్యూఆర్ కోడ్‌తో పాటు బుకింగ్ వివరాలు కలిగిన నిర్ధారణ ఇమెయిల్, ఎస్ఎంఎస్ అందుతుంది. 7) ఈ-టికెట్ హార్డ్ కాపీని అందుకున్నాక, టిక్కెట్ కొనుగోలుదారు తన ఒరిజినల్ ఫోటో. ఐడీలను పరేడ్‌లకు వెళ్లేటప్పుడు వెంట తీసుకువెళ్లాలి. వేదిక ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ప్రవేశం పొందవచ్చు. -
‘కర్తవ్య పథ్’లోనే గణతంత్ర వేడుకలు ఎందుకంటే..
భారతదేశం రేపు (జనవరి 26) 75వ గణతంత్ర దినోత్సవాలను చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర బిందువు న్యూ ఢిల్లీలోని కర్తవ్య పథ్ (గతంలో రాజ్‌పథ్). ఇక్కడ జరిగే రిపబ్లిక్ డే పరేడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పరేడ్‌లో సాయుధ బలగాలకు చెందిన మూడు శాఖల బృందాలు చేసే కవాతు, ఆయుధాలు, సైనిక పరికరాల ప్రదర్శనలు, మోటార్ సైకిల్ విన్యాసాలు భారతదేశ సైనిక సత్తాను చాటుతాయి. ఈ సంవత్సరం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను ఆహ్వానించారు. ‘కర్తవ్య పథ్’ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రదేశానికి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1911లో బ్రిటిష్ సర్కారు తన రాజధానిని కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) నుండి ఢిల్లీకి మార్చిన తర్వాత ఈ రహదారిని నిర్మించి, ‘కింగ్స్‌వే’ అనే పేరు పెట్టింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రహదారిని ‘రాజ్‌పథ్’గా మార్చారు. ఆ తరువాత దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరుపెట్టారు. ఇది కూడా చదవండి: గణతంత్ర దినోత్సవ థీమ్ ఏమిటి? ముఖ్య అతిథి ఎవరు? గత ఏడు దశాబ్దాలుగా అంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వార్షిక గణతంత్ర దినోత్సవ వేడుకలను ‘కర్తవ్య పథ్’లోనే నిర్వహిస్తున్నారు. ఈ రహదారి వలస పాలన నుంచి సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం వరకు సాగిన భారతదేశ ప్రయాణానికి చిహ్నంగా నిలిచింది. 2022లో ‘రాజ్‌పథ్’ను ‘కర్తవ్య పథ్’గా మార్చారు. అనంతరం దీనికి సెంట్రల్ విస్టా అవెన్యూలో చేర్చారు. ఒకప్పడు ‘రాజ్‌పథ్’ అధికార చిహ్నంగా ఉండేది. దానిని ‘కర్తవ్య పథ్’గా మార్చాక ఈ రహదారి సాధికారతకు చిహ్నంగా మారింది. ‘కర్తవ్య పథ్’ ప్రారంభోత్సవాన ప్రధాని మోదీ మాట్లాడుతూ నాటి ‘కింగ్స్‌వే’ లేదా ‘రాజ్‌పథ్’ బానిసత్వానికి చిహ్నంగా నిలిచిందని, ఇటువంటి గుర్తింపును శాశ్వతంగా తుడిచివేయడానికే దీనికి ‘కర్తవ్య పథ్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. -
రిపబ్లిక్ డే 2024: ఈసారి థీమ్ ఏంటంటే..
భారతదేశం జనవరి 26న (శుక్రవారం) 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో గణతంత్ర దినోత్సవ చరిత్ర, పరేడ్, థీమ్ తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు ‘రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదు. ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనం. దీని స్ఫూర్తి ఎల్లప్పటికీ నిలచి ఉంటుంది’ అని అన్నారు. 1950లో భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది. నేడు మనం భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకునేందుకు సిద్ధమవుతున్నాం. గణతంత్ర దినోత్సవాలలో భారతదేశ గొప్పదనాన్ని, సాంస్కృతిక వారసత్వం, దేశ పురోగతి, విజయాలను గుర్తుచేసుకోనున్నాం. ఢిల్లీలో జరిగే పరేడ్‌లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే ప్రదర్శనలను మనం చూడబోతున్నాం. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జరిగాయి. భారతదేశ రాజ్యాంగానికి 1950, జనవరి 26న ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతియేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్‌వారి నుండి స్వాతంత్ర్యం లభించినప్పటికీ, 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారత్ ఒక సార్వభౌమ అధికారం కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. ప్రతీయేటా జరిగే గణతంత్ర దినోత్సవం.. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని గుర్తుచేస్తుంది. ప్రతీ సంవత్సరం దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుగుతుంటాయి. ఆ రోజు రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. గణతంత్ర దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి దేశంలోని అర్హులైన పౌరులకు పద్మ అవార్డులను అందిస్తారు. వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక్ష ప్రసారాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. జనవరి 26.. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఇవి 90 నిమిషాల పాటు జరుగుతాయి. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు.