దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కర్తవ్య పథ్’లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అయితే ఈ 'కర్తవ్య పథ్'లో దేశంలోని నారీ శక్తి ధైర్యమే కనిపించనుంది. అందులోనూ ముఖ్యంగా సాయుధ దళాలకు వైద్య సేవలందించే మహిళ డాక్టర్ల బృందం కవాతు చేయనుండటం విశేషం. అంతేగాదు దేశంలోని 'నారీ శక్తి' పరేడ్‌తో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు సంచలనాత్మకంగా నిలిచిపోనున్నాయి.
ఈ సారి రిపబ్లిక్‌డే వేడుకల్లో దేశంలోని నారీ శక్తి ధైర్యమే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా తొలిసారిగా సాయుధ దళాల వైద్య సేవలకు సంబంధించి పూర్తి మహిళా బృందం కర్తవ్‌పథ్‌లో కవాతు చేయడం విశేషం. దీనికి మేజర్ సృష్టి ఖుల్లార్ నాయకత్వం వహించనున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలు మహిళా బృందంతో చారిత్రత్మక కవాతును ప్రారంభించి సంచలనం సృషిస్తోంది. ఇక వైద్యురాలు ఖుల్లార్ మహిళల బృందానికి నాయకత్వం వహించి సాయుధ దళాల మహిళా డాక్టర్‌గా చరిత్ర సృష్టించనున్నారు.
ఈ కవాతు శౌర్యం, పరాక్రమంతో అడ్డంకులన్నింటిని బద్దలు కొట్టేలా 'నారీ శక్తి 'వేస్తున్న అసలైన అడుగు. ఈమేరకు సృష్టి ఖుల్లర్ మాట్లాడుతూ.. నేత్ర వైద్యురాలిగా, ఆపరేషన్ థియేటర్‌లో సర్జికల్ కత్తి పట్టుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు కర్తవ్య పథ్‌లో కత్తి పట్టుకోవడం తనకు ఓ ఛాలెంజింగ్‌గా అద్భుతంగా ఉందని సంతోషంగా చెప్పింది. అందుకు తాను భారత ఆర్మీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాని అన్నారు.
Met paratrooper & eye surgeon Major Srishti Khullar today. She will lead the all-women Armed Forces Medical Services marching contingent at the Republic Day parade. "From holding the surgical knife to carrying a sword at the parade, the new role is quite challenging & rewarding." pic.twitter.com/1gT5MTQIxZ
— Rahul Singh (@rahulsinghx) January 23, 2024
చరిత్ర సృష్టించనున్న ఢిలీ మహిళా పోలీసులు..
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 'కర్తవ్య పథ'లో పూర్తిగా మహిళా పోలీసులే ప్రదర్శన ఇవ్వనున్నారు. పరేడ్‌లో ఇలా పూర్తి మహిళా పోలీసులే పాల్గొనడం తొలిసారి. ఇక ఈ మహిళా బృందంలో నగర దళానికి చెందిన మహిళ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. దీనికి ఐపీఎస్ అధికారిణి శ్వేతా కే సుగతన్ నాయకత్వం వహించనున్నారు. ఆమె నేతృత్వంలో దాదాపు 194 మంది మహిళా కానిస్టేబుళ్‌లు, హెడ్ కానిస్టేబుళ్లు కవాతు చేయనున్నారు.
మహిళా అధికారుల సారథ్యంలోనే త్రివిధ దళాల కవాతు
ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా మహిళా అధికారుల సారథ్యంలో త్రివిధ దళాల కవాతు నిర్వహిస్తుండటం విశేషం. ఇక భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ శరణ్య రావు తాను ఈ త్రివిధ దళాల ఆర్మీ కాంపోనెంట్‌కి సూపర్ న్యూమరీ అధికారిగా సారథ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం అని భావోద్వేగంగా మాట్లాడారు కెప్టెన్ శరణ్యరావు. ఈ ఏడాది నారీ శక్తి థీమ్‌కి తగ్గట్టుగా చాలామంది మహిళల నేతృత్వంలో త్రివిధ దళాల కవాతు జరగడం అనేది చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న అపూర్వ ఘట్టం అని కొనియాడారు.
తొలిసారిగా ఓ ఆర్మీ దంపతుల కవాతు
ఈ కర్తవ్య పథ్‌లో తొలిసారిగా ఒక జంట కలిసి కవాతు చేయనుండటం విశేషం. వివిధ రెజిమెంట్లలో భాగంగా తొలిసారి మేజర్ జెర్రీ బ్లేజ్, కెప్టెన్ సుప్రత అనే జంట కలిసి కవాతు చేయనుంది. వారిద్దరూ గతేడాది జూన్‌లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఇక 'కర్తవ్య పథ్' అంటే..ఏటా గణతంత్ర దినోత్సవాన దేశ సైనికశక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే ఈ మార్గం.ఒకప్పుడూ ఇది ‘రాజ్ పథ్’ అనే పేరుతో ఉండేది.
(చదవండి: ఢిల్లీ పరేడ్‌కు అసామాన్యులు)
Comments
Please login to add a commentAdd a comment