
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీలోని మహిళలకు అధికార ఆప్ ప్రభుత్వం నెలనెలా వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పథకం అమలుకు మరికొన్ని నెలలు పట్టేలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ అని పేరు పెట్టారు. ఈ పథకం గురించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలోని మహిళలకు ఈ వెయ్యి రూపాయల సహాయం ఎలా అందజేయనున్నామో, అందుకు ఉన్న నియమాలు ఏమిటో కేజ్రీవాల్ తెలియజేశారు.
ప్రభుత్వ పెన్షన్ అందుకోని, ప్రభుత్వ ఉద్యోగంలో లేని, పన్నులు చెల్లించని మహిళలకు నెలనెలా వెయ్యి రూపాయలు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం మహిళలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని అధికారులు పరిశీలించాక ఆ మహిళలకు ప్రతినెలా డబ్బు అందుతుంది.
ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుండి ఈ పథకం ఎప్పటి నుండి అమలవుతుందనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్‌లో చర్చించాక ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అంటే ఈ పథకం అమలు కావడానికి కొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది.