thousand
-
కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కుక్కకాటు ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో రోజుకు వెయ్యి మందికి పైగా జనం కుక్క కాటుకు గురవుతున్నారు. ఢిల్లీకి చెందిన వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్‌జంగ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, హిందూరావు, జీటీబీ, డీడీయూ, లోక్‌నాయక్, ఇతర ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రేబిస్ వ్యాక్సిన్ కోసం ప్రతి రోజు వెయ్యి మందికి పైగా బాధితులు వస్తున్నారు.కుక్కకాటు కేసుల్లో 60 శాతం మంది చిన్నారులేనని వైద్యులు చెబుతున్నారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి చెందిన యాంటీ రేబిస్ క్లినిక్ హెడ్ డాక్టర్ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ ఆస్పత్రిలో రోజూ దాదాపు 500 రేబిస్ టీకాలు వేస్తున్నారని తెలిపారు. వీరిలో 200 మంది కొత్త రోగులు కాగా, 300 మంది పాత రోగులు. లోక్ నాయక్ ఆస్పత్రి అత్యవసర విభాగం అధిపతి డాక్టర్ రీతూ సక్సేనా మాట్లాడుతూ తమ ఆస్పత్రికి ప్రతిరోజూ దాదాపు 100 మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వస్తున్నారని తెలిపారు. సెలవు దినాల్లో వీరి సంఖ్య మరింతగా పెరుగుతున్నదన్నారు.సాధారణంగా కుక్క, పిల్లి, నక్క, తోడేలు, గబ్బిలం లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు బాధితుడు తప్పనిసరిగా రేబిస్ టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా జంతువు కరచిన వెంటనే బాధితునికి మొదటి డోస్ ఇస్తారు. రెండవది మూడు రోజులు, మూడవది ఏడు రోజులు, నాల్గవ డోస్ 28 రోజులకు అందిస్తారు. మొదటి డోస్‌తో పాటు యాంటీ రేబిస్ సీరమ్ (ఏఆర్ఎస్)ను కూడా బాధితునికి ఇస్తారు.ఇది కూడా చదవండి: ఒకే ఇంటిలో ఐదు మృతదేహాలు.. ఢిల్లీలో కలకలం -
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. అల్మోరా, బాగేశ్వర్ సహా పలు జిల్లాల్లో అడవులు తగలబడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు లేఖ రాశారు. అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు నిరంతం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో కోరారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం గత సంవత్సరం నవంబర్ ఒకటి నుండి ఇప్పటివరకూ ఉత్తరాఖండ్ అడవులలో మొత్తం 910 అగ్నిప్రమాదాలు సంభవించాయి. దాదాపు 1,145 హెక్టార్ల అటవీప్రాంతం ప్రభావితమైంది. రాష్ట్రంలో అడవుల్లోని కార్చిర్చు అదుపు చేయడం గురించి ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. అడవుల్లో చెలరేగున్న మంటల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. అలాగే అడవుల నుంచి వెలువడుతున్న పొగ కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకోవడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బరాహత్ శ్రేణి అడవుల్లో గురువారం సాయంత్రం వ్యాపించిన మంటలు ఇప్పటి వరకూ పూర్తిగా అదుపులోకి రాలేదు. తాజాగా ముఖెంరేంజ్లోని డాంగ్, పోఖ్రీ గ్రామానికి ఆనుకుని ఉన్న అడవితో పాటు దుండా రేంజ్‌లోని చామ్కోట్, దిల్సౌద్ ప్రాంతంలోని అడవులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ధరాసు పరిధిలోని ఫేడీ, సిల్క్యారాకు ఆనుకుని ఉన్న అడవులు కూడా తగడలబడుతున్నాయి. అటవీ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఉత్తరకాశీ అటవీ డివిజన్లో 19.5 హెక్టార్ల అడవి మంటల కారణంగా కాలి బూడిదైంది. -
వెయ్యి రూపాయల పథకానికి మరికొన్ని నెలలు?
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీలోని మహిళలకు అధికార ఆప్ ప్రభుత్వం నెలనెలా వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పథకం అమలుకు మరికొన్ని నెలలు పట్టేలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ అని పేరు పెట్టారు. ఈ పథకం గురించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. ఢిల్లీలోని మహిళలకు ఈ వెయ్యి రూపాయల సహాయం ఎలా అందజేయనున్నామో, అందుకు ఉన్న నియమాలు ఏమిటో కేజ్రీవాల్ తెలియజేశారు. ప్రభుత్వ పెన్షన్ అందుకోని, ప్రభుత్వ ఉద్యోగంలో లేని, పన్నులు చెల్లించని మహిళలకు నెలనెలా వెయ్యి రూపాయలు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం మహిళలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని అధికారులు పరిశీలించాక ఆ మహిళలకు ప్రతినెలా డబ్బు అందుతుంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుండి ఈ పథకం ఎప్పటి నుండి అమలవుతుందనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్‌లో చర్చించాక ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అంటే ఈ పథకం అమలు కావడానికి కొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. -
అడుగడుగునా అవమానించే హోటల్‌కు జనం క్యూ!
అది ఒక ఖరీదైన హోటల్. ఒక రోజు రాత్రి బస చేయాలంటే రూ 20 వేలు చెల్లించాలి. ఈ హోటల్లో బస చేసేందుకు ఓ మహిళ వెళ్లింది. ఆమెకు టీ తాగాలనిపించింది. అయితే ఆ గదిలో టీ కెటిల్ లేదు. దాని హ్యాండిల్ మాత్రమే ఉంది. దీంతో ఆ మహిళ రిసెప్షనిస్ట్‌కి ఫోన్ చేసి, సమస్య చెప్పింది. అయితే దీనికి ఆ రిసెప్షనిస్ట్ చాలా కటువుగా సమాధానమిచ్చింది.. ‘వెళ్లి సింక్‌లోని నీళ్లు తాగండంటూ’ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది. ఆగండాగండి.. రిసెప్షనిస్ట్ ఆ మహిళ విషయంలో అవమానించేలా మాట్లాడిందని అనుకునేముందు ఒక విషయం తెలుసుకోండి. నిజానికి ఆ రిసెప్షనిస్ట్‌కు తాను ఏమి చేయాలో తనకు బాగా తెలుసు. అందుకే ఆమెను రిసెప్షనిస్ట్‌గా నియమించారు. ఆమె డ్యూటీ హోటల్‌కి వచ్చే వారిని అవమానించడం. అయితే ఆ మహిళ కూడా అవమానం పాలయ్యేందుకే ఆ హోటల్‌కు వెళ్లింది. చాలామంది ఈ హోటల్‌కు అవమానాలను ఎదుర్కొనేందుకే వస్తుంటారు. ‘డైలీ మెయిల్’లోని ఒక కథనం ప్రకారం రోజుకు రూ.20 వేలు ఛార్జ్ చేసే ఈ హోటల్లో కనీస సదుపాయాలు సరిగా ఉండవు. టవల్స్, టాయిలెట్ రోల్స్ కూడా ఉండవు. హోటల్లో బస చేసేందుకు వచ్చేవారెవరైనా కనీస అవసరాల గురించి అడిగితే, హోటల్ సిబ్బంది వారిని తీవ్రంగా అవమానిస్తుంటారు. చాలా సందర్భాల్లో అసభ్యకరంగా తిడుతుంటారు కూడా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటువంటి వ్యవహారం కారణంగానే ఈ హోటల్ ఫేమస్ అయ్యింది. తీవ్రంగా అవమానం పాలయ్యేందుకే ఇక్కడికి జనం వస్తుంటారు. ప్రపంచంలోనే ఇలాంటి వింత ఎక్కడా ఉండదేమో. లండన్‌లోని ఈ హోటల్ పేరు కరెన్ హోటల్. దీనికి రెస్టారెంట్ చైన్ కూడా ఉంది. దాని పేరు కరెన్ డైనర్. ఈ కరెన్ డైనర్ చైన్‌లో కరెన్ హోటల్ ఒక భాగం. 2021లో కరెన్ డైనర్ రెస్టారెంట్ ఈ ‘అవమానకర’ సేవలను మొదలుపెట్టింది. తరువాత బ్రిటన్ అంతటా తమ శాఖలను నెలకొల్పింది. -
సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం!
#ShriRamJanmabhoomiMandir అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట వైభవానికి సర్వం సిద్ధమైంది. ఈ అంగరంగ వైభవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకను కనులారా తిలకించేందుకు అతిరథ మహారథులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు, మూవీ రంగ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు అంతా ఇప్పటికే అయోధ్యా నగరానికి చేరుకున్నారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి మందిర్‌ను వెయ్యి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించామని ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. 70 ఎకరాల విస్తీర్ణంలో , 161.75 అడుగుల ఎత్తు, 380 అడుగుల పొడవు , 249.5 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉన్న ఆ ఆలయ సముదాయం కలిగి ఉంది. డిజైన్ ఐదవ శతాబ్దంలో దాని మూలాలున్న నాగారా నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన శిఖరంతో పాటు మూడు అంతస్తులు, నృత్య మండప్, రంగ్ మండప్, గూఢ్ మండప్, కీర్తన మండప్ , ప్రార్థనా మండప్ అనే ఐదు మండపాలు ఉన్నాయి. దీని తయారీకి రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లా నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ రాళ్లను కొనుగోలు చేశారు.అంతేకాదు భారీ భూకంపాలను (జోన్ 4) సైతం తట్టుకునేలా రూపొందించింది. ఆలయానికి ఇరువైపులా 390 స్తంభాలు, 6 మక్రానా పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వాటిలో 10 వేలకు పైగా శిల్పాలు, ఇతివృత్తాలు భక్తులను అబ్బురపరుస్తాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మే 2020 నుండి, దాదాపు మూడేళ్లలో కాంప్లెక్స్‌ను డిజైన్ చేసి నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయానికి 1000 సంవత్సరాల వరకు ఎలాంటి నష్టం జరగదని ఎల్ అండ్ టీ తెలిపింది. దాదాపు 1,500 మంది కళాకారుల బృందం రాళ్లపై క్లిష్టమైన శిల్పాలను తయారుచేశారని, QR కోడ్లతో 26,500 వ్యక్తిగత రాళ్లను పర్యవేక్షించడానికి స్టోన్ ట్రాకింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. వెయ్యేళ్ల పాటు వెలుగొందేలా, ఓర్పుకు చిహ్నంగా ఈ ఇంజినీరింగ్ అద్భుతం నిలుస్తుందని కంపెనీ ఛైర్మన్ , ఎండీ సుబ్రహ్మణ్యన్ అన్నారు. దీని పునాదికి ఐఐటీ సంస్థల సహాయం కూడా తీసుకున్నామని చెప్పారు. ఈ ఆలయంలోని ప్రతి రాయిని ఎంతో శ్రద్ధగా, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్ఠించామని ఎల్అండ్ టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీష్ వెల్లడించారు. దీన్ని ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా, అద్భుత ఇంజనీరింగ్ కళాఖండమని, ఇది తమ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 -
ఢిల్లీ చెన్నై ఒక టికెట్ 63 వేలు
-
సహస్రం.. సంక్షేమం: జగనన్న పాలనకు 1000 రోజులు
సాక్షి, శ్రీకాకుళం: ‘జనానికి మేలు చేయాలన్న మనస్తత్వం ఉండాలి. అనుకునేదానిని ఆచరణలో పెట్టాలన్న పట్టుదల అణువణువునా జ్వలించాలి. కార్యాచరణ ప్రణాళికపై స్పష్టత కుదరాలి. అడుగు ముందుకేయాలన్న ఆరాటం అంతరంగంలో అలలా వెల్లువెత్తాలి. ఇన్ని కలగలిస్తేనే ఓ పాలకుడి వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.’ పై లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న నాయకుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి నేటికి 1000 రోజులైంది. ఈ వెయ్యి రోజుల పాలనలో సిక్కోలుపై సంక్షేమ పథకాల జల్లు కురిసింది. కోవిడ్ సమయంలోనూ ఏ పథకాన్నీ ఆపకుండా కొనసాగించారు. జిల్లాలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య పరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆరోగ్యమస్తు.. ►కిడ్నీ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు వీలుగా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇందుకు అనుసంధానంగా కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్‌ను మంజూరు చేశారు. ఇప్పుడా పనులు జోరుగా సాగుతున్నాయి. ►సీతంపేటలో రూ.49 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేశారు. ►ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ని ఏడు మండలాలకు ఇంటింటికీ మంచినీటిని కుళాయిల ద్వారా నిరంతరం అందించేలా ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేశారు. ఇందుకోసం రూ.700 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. ►ఆరోగ్యశ్రీ పథకంతో పాటు – నాడు–నేడు కింద 83 ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. ►పాతపట్నం 50 పడకల సామాజిక ఆస్పత్రిని రూ.4.2కోట్లతో, జొన్నవలస ఆస్పత్రిని రూ.2.45కోట్లతో, లావేరులో రూ.1.20 కోట్లతో, సోంపేట సామాజిక ఆస్పత్రిని రూ. 4.60కోట్లతో, బారువ సామాజిక ఆస్పత్రిని రూ.5.60కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. చదవండి: (కోవిడ్ తర్వాత పెరిగిన ఆ సమస్యలు.. జాగ్రత్త లేకుంటే ప్రమాదమే..) అతివలకు అండగా.. జిల్లాలో వైఎస్సార్ చేయూత కింద 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కులాల మహిళలకు ఒక్కో ఏడాదికి రూ.18,750 చొప్పున 10,309 మందికి అందజేస్తున్నారు. వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా సంఘాలు గత ఎన్నికల ముందు తీసుకున్న రుణాన్ని ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తోంది. 51,764 సంఘాల్లోని 5,71,369 మందికిరూ.1508.71కోట్లు చెల్లిస్తోంది. ఇప్పటికే రెండు విడతల రుణ మొత్తాన్ని మహిళల ఖాతాలకు జమ చేసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద బ్యాంకుల నుంచి డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలపై పడిన వడ్డీ తిరిగి చెల్లించే కార్యక్రమం కింద 2020లో 48,634 సంఘాల్లోని 5,48,723 మందికి రూ.31.68కోట్లు, రెండో విడత కింద 53,950 సంఘాలకు రూ.31.92కోట్లు చెల్లించింది. గంగపుత్రుల బెంగ తీరేలా.. భావనపాడులో రూ.3200కోట్లతో పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే బుడగట్లపాలెంకు రూ. 332కోట్లతో ఫిషింగ్ హార్బర్ మంజూరు చేశారు. మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణం చేపడుతున్నారు. మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ అందజేస్తున్నారు. విద్యకు అగ్రపీఠం ►జగనన్న అమ్మఒడి కింద 2020లో 2,41,562 మందికి రూ.362.34కోట్లు, 2021లో 3,48,331 మందికి రూ.487.86కోట్లు చెల్లించింది. నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. ►జగనన్న విద్యా కానుక కింద 2020లో 2,49,405మందికి, 2021లో 2,74,509 మందికి కిట్లు పంపిణీ చేసింది. జగనన్న విద్యావసతితో విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. అన్నదాతకు వెన్నుదన్ను.. ►జిల్లాలో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీని అందించారు. నేరడి బ్యారేజీ వివాదాన్ని కొలిక్కి తెచ్చారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అగ్రీ ల్యాబ్, ఆక్వా ల్యాబ్, భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పాలకొండ, పలాసకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేశారు. వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద 27,523 మంది రైతులకు రూ.23.30 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. ఇంకా కొన్ని.. ►జిల్లాలో 1,10,825 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేశారు. వాటిలో 91,600 ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేశారు. ఇప్పటికే 60వేల వరకు ఇళ్ల పనులు జరుగుతున్నాయి. ►3,83,590 మంది వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు అందజేస్తున్నారు. ►జగనన్న తోడు కింద వీధి చిరువ్యాపారులకు రుణ సౌకర్యం కల్పించారు. ►జగనన్న చేదోడు కింద రజక, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం అందించారు. -
నిలువునా ముంచావు.. ఇక దిగిపో బాబూ
సాక్షి, విజయవాడ సిటీ : ఇంటికొక ఉద్యోగం.. లేదంటే రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ యువతను నిలువునా ముంచేసిన చంద్రబాబూ.. ఇక సీఎం పదవి నుంచి దిగిపో అంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగులు సోమవారం విజయవాడలోని యూత్ సర్వీసు కమిషనర్ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే సలాం బాబు, జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ‘నిరుద్యోగ భృతిపై ఆశ కల్పించావు.. నిలువునా ముంచావు’, ‘ఇక చాలు.. దిగిపో బాబు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్కే సలాం బాబు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో యువతను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు.. కొత్తనాటకానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 30 లక్షల మంది నిరుద్యోగులుంటే.. కేవలం 10 లక్షల మందికే నిరుద్యోగ భృతి ఇస్తామని, అది కూడా రూ.వెయ్యి మాత్రమే ఇస్తామని ప్రకటించడం ద్వారా యువతను నట్టేట ముంచేశారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం యూత్ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నగర కార్యదర్శులు అశోక్, అర్జున్, నరసింహ, శ్యామ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అదృష్టం అంటే ఆ అమ్మాయిదే..!
కెనడా : ఆ అమ్మాయిది మధ్యతరగతి కుటుంబం. అయినా బతకడానికి ఏ పని చేయక్కర్లేదు. ఆమె కుటుంబం కూడా ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని కూర్చుని దర్జాగా జీవితాంతం అలా బతికేయెచ్చు. ఆమె ఇంట్లో వాళ్లు ఏ పని చేయకపోయినా వారానికి వెయ్యి డాలర్లు అప్పనంగా వాళ్ల అకౌంట్లో పడతాయి. ఏంటి ఎందుకు అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన చార్లీ లగార్డే అనే యువతికి తన పుట్టిన రోజున లాటరీ తగిలింది. లాటరీయేగా ఏంటి గొప్ప అనుకుంటున్నారా..? అది మామూలు లాటరీ కాదు. అలాగని కోట్లు ఒకటే సారి వచ్చి పడవు. ఆమె బతికున్నంత కాలం వారానికి వెయ్యి డాలర్లు.. మన రూపాయల్లో అక్షరాల యాభై వేల రూపాయలు .. నెలకు మూడు లక్షల రూపాయలు చార్లీ అందుకోనుంది. కొద్ది రోజుల క్రితమే మొదటి వారానికి సంబంధించిన డబ్బును ఆమె అందుకుంది. ఈ సందర్భంగా చార్లీ మాట్లాడుతూ.. వచ్చిన డబ్బుతో ఫోటోగ్రఫీ నేర్చుకుంటానని తెలిపింది. ఇప్పుడు ఇలాంటి లాటరీ మనకు కూడా తగిలితే బాగుండనిపిస్తుంది కదూ... -
కనీస పింఛను రూ.10వేలు ఇవ్వాలి
ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ మహాసభ డిమాండ్ కాకినాడ సిటీ : కనీస పింఛను రూ.10వేలు ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గురువారం స్థ్ధానిక కొండయ్యపాలెంలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స అసోసియేషన్ జిల్లా ప్రథమ మహాసభ హార్లిక్స్ పెన్షనర్స్ సంఘ నాయకులు సీహెచ్.మోహనరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మహాసభలో వివిధ అంశాలు, సమస్యలపై చర్చించిన అనంతరం వక్తలు మాట్లాడుతూ జీపీఎస్ విధానం రద్దు చేయాలని, సమస్యలపై పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెన్షనర్ల సంఘాలు ఐక్యంగా పోరాటాలకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. పీఎఫ్ఆర్yీ ఏ బిల్లు రద్దు చేయాలని, హెల్త్ కార్డులు ఇచ్చి వాటిపై అన్ని ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ జిల్లా కన్వీనర్ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేవీవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.స్టాలిన్, అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్, జిల్లా ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు బూరిగ ఆశీర్వాదం, ఎన్జీవో సంఘ మాజీ అధ్యక్షులు ఆచంట రామారాయుడు, వివిధ పెన్షనర్ల సంఘాల నాయకులు వీవీ కృష్ణమాచార్యులు, పీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి, జి.అప్పారావు, ఏవీయూ సుబ్బారావు, బి.సత్యనారాయణ, సదానందమూర్తి పాల్గొన్నారు. -
జిల్లాలో 10 వేల ఈ పోస్ మెషీన్లు
డిసెంబర్ మొదటి వారానికి ఏర్పాటు వీటి కోసం 3,500 దరఖాసులు జన్‌ధన్ ఖాతాదారులకు రుపే కార్డులు కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : జిల్లాలో డిసెంబర్ మొదటి వారానికి 10 వేల ఈ పోస్ మెషీన్లను అందుబాటులోకి తేనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రజల లావాదేవీలు అధికంగా ఉండే జనరల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఎరువుల దుకాణాలు, వైన్ షాపులు తదితర దుకాణాల్లో ఈ మెషీన్లను బ్యాంకులు అందుబాటులోకి తేనున్నాయని చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు కొరత నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజలను ఆకర్షితులను చేసేందుకు ఈ పోస్ మెషీన్లను గ్రామ, మండల స్థాయిల్లో అన్ని రకాల వ్యాపారులు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ వ్యాపారుల నుంచి ఈ మెషీన్ల కోసం సుమారు 3,500 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంక్‌ల ద్వారా ఈ నెల 27లోగా వాటిని ఆయా వ్యాపార సంస్థల్లో నెలకొల్పనున్నారని తెలిపారు. జిల్లాలో జన్‌ధన్ ఖాతాలు తెరిచిన వారిలో చాలా మంది రూపే డెబిట్ కార్డును తీసుకోలేదని, వారందరికి వాటిని పంపిణీ చేసి నగదు రహిత లావాదేవీలకు వినియోగించుకునేలా చైతన్యపరుస్తామన్నారు. నగదు కొరత నేపథ్యంలో ప్రజల ఇబ్బందుల నివారణకు జిల్లా స్థాయిలో అధికారులు, బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమన్వయ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించి యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. -
దొంగనోట్ల కలకలం
గణపురం : మండలంలోని చెల్పూరు గ్రామం లో 1000 రూపాయల దొంగనోట్లు కలకలం సృష్టించా యి. భూపాలపల్లి మండలం మో రంచపల్లి గ్రామ∙శివారు దుబ్బపల్లికి చెందిన రైతు బొజ్జ లచ్చయ్య స్థానిక చెల్పూరు గ్రామీ ణ వికాస బ్యాంక్‌లో బుధవారం రూ.13 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నాడు. బ్యాంకు క్యాషియర్ అన్ని వెయ్యి రూపాయల నోట్లను ఇచ్చాడు. సదరు రైతు గురువారం ఆ నోట్లను చెలామణి చేయడానికి పలు షాపులు తిరిగా డు. తిరిగిన ప్రతిచోట నోట్లను పరిశీలిం చి ఇవి దొంగనోట్లని దుకాణదారులు అనడంతో రైతు ఆందోళన చెందాడు. శుక్రవారం మోరంచపల్లికి చెందిన కొంతమందిని తీసుకుని బ్యాంకుకు వెళ్లి మేనేజర్, క్యాషియర్‌ను నిల దీశారు. నాలుగు వెయ్యి రూపాయల నోట్లను క్యాషియర్ తీసుకొని వేరేనోట్లను రైతుకు అందజేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది. కాగా ఆ నోట్లు దొంగనోట్లు కావని, గతంలో రిజర్వ్‌బ్యాంకు రద్దు చేసిన నోట్లని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. -
'త్వరలో వెయ్యి బస్సులు రయ్..రయ్'
న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీ నగర వీధుల్లో కొత్తగా వెయ్యి ఆరెంజ్ బస్సులు రయ్‌రయ్‌మంటూ తిరగనున్నాయి. బస్సుల కొరత రాజధాని తీవ్రంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో ఆరు నెలల్లో ఢిల్లీలోని అన్ని బస్సు ఢీపొల్లో కొత్తగా బస్సులు ప్రారంభంకావాలని ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టం(డీఐఎంటీఎస్)కు ఆదేశించారు. ఈ వెయ్యి బస్సుల్లో 300 ఏసీ బస్సులు ఉన్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీలో 5,500 బస్సులు ఉండాల్సి ఉండగా అవి కొరతగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని పౌరులు ఇతర వాహనాలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. -
వెయ్యింతల ఊరింతలు
చింతను చూస్తూ ఊరుకోవడం కష్టమే! కనీసం కాయ కొసల్నైనా కొరక బుద్దేస్తుంది. అందాకా ఎందుకు? చింతకాయను ఊహించుకోండి చాలు... జివ్వుమని మనసు ఊటబావి ఐపోతుంది! చింత వచ్చి చెంతన చేరితే... చప్పిడి పళ్లేలకు కూడా చురుకు పుట్టుకొస్తుంది. ఇక మనమెంత, మానవమాత్రులం? కళ్ల ముందు చింత పులుసో, పప్పో, పచ్చడో ప్రత్యక్షమవగానే... వేళ్లు కలబడి కలబడి ముద్దను కలిపేస్తాయి. చింతలో ఉన్న ‘సి’ట్రాక్షన్ వల్లనే... ఇంత ఎట్రాక్షన్. ఇవన్నీ కాదు... వెయ్యి రకాల కూర గాయలకైనా... వెయ్యి కాంబినేషన్ల రుచులను ఇవ్వగల కెపాసిటీ... చింతది, చింత పులుపుది, చింత తలపుది! చింతకాయ నువ్వుల పచ్చడి కావలసినవి: చింతకాయలు - 8, నువ్వుపప్పు - 100 గ్రా., పచ్చిమిర్చి - 10, ఎండుమిర్చి - 6, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారి: చింతకాయలను ఉడికించి రసం చిక్కగా తీసుకుని పక్కన ఉంచాలి బాణలిలో నువ్వులను వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, ఇంగువ వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో చింతకాయరసం, నువ్వులపొడి, పోపుల పొడి, పసుపు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. దోసకాయ చింతకాయ పచ్చడి కావలసినవి: దోసకాయముక్కలు - రెండు కప్పులు, చింతకాయలు - కప్పు, పచ్చిమిర్చి - 7, కొత్తిమీర - చిన్నక ట్ట, ఉప్పు - తగినంత, మినప్పప్పు - 3 టీ స్పూన్లు, శనగపప్పు - 3 టీ స్పూన్లు, నూనె - 3 టీ స్పూన్లు, మెంతులు - 3 టీ స్పూన్లు, జీలకర్ర - టీ స్పూను, ఆవాలు - 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 6 (ముక్కలు చేసుకోవాలి), కరివేపాకు చిన్న కట్ట, ఇంగువ - చిటికెడు తయారి: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి కరివేపాకు, ఇంగువ వేసి మరో మారు వేయించాలి దోసకాయ ముక్కలను కొద్దిగా ఉడికించాలి. (హాఫ్ బాయిల్ చేయాలి) చింతకాయలను ఉడికించి చిక్కగా రసం తీసుకోవాలి వేయించి ఉంచుకున్న పోపు సామాగ్రి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగాపేస్ట్ చేసుకోవాలి ఒక గిన్నెలో ఉడికించి ఉంచుకున్న దోసకాయముక్కలు, చింతకాయరసం, మెత్తగా చేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. చింతకాయ పులుసు కావలసినవి: చింతకాయలు - 6, టొమాటో తరుగు - పావు కప్పు, ఉల్లితరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి -2, బెల్లం తురుము - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 4, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ధనియాలపొడి - పావు టీ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారి: చింతకాయలను ఉడికించి రసం తీసి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి ఉడికించాలి ఉడికించిన చింతపండు రసం, బెల్లం తురుము, పసుపు వేసి పులుసును బాగా మరిగించాలి ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేగాక పులుసులో వేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ - శనగపిండి కూర కావలసినవి: చింతకాయలు - 10, శనగపిండి - మూడు టేబుల్ స్పూన్లు, ఉల్లితరుగు - పావు కప్పు, టొమాటో తరుగు - పావు కప్పు, పుదీనా ఆకులు - పావు కప్పు, ఎండుమిర్చి - 5, పచ్చిమిర్చి - 3, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ధనియాలపొడి - పావు టీ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - చిన్నకట్ట, నూనె - మూడు టేబుల్ స్పూన్లు. తయారి: చింతకాయలను ఉడికించి చిక్కగా రసం తీసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి టొమాటో ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు వేసి వేయించాలి ఇంగువ, పసుపు జత చేసి బాగా కలపాలి చింతకాయ రసంలో శనగపిండి వేసి బాగా కలిపి ఉడుకుతున్న కూరలో వేసి ఆపకుండా కలపాలి దనియాలపొడి, కరివేపాకు వేసి క లిపి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ ఉల్లిపాయ పచ్చడి కావలసినవి: చింతకాయలు - 6, పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినంత, పసుపు - టీ స్పూను, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 5, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, మినప్పప్పు - రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (చిన్నముక్కలుగా కట్ చేయాలి), కొత్తిమీర - చిన్న కట్ట తయారి: చింతకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి మిక్సీలో చింతకాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి పసుపు జత చేసి గాలి చొరని గాజు సీసాలో కాని జాడీలో కాని రెండు రోజులు ఉంచాలి మూడవరోజు తిరగకలపాలి బాణలిలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి కరివేపాకు జత చేసి మరోమారు వేయించి చింతకాయపచ్చడిలో వేసి కలపాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లిపాయముక్కలు వేసి దోరగా వేయించి తీసేసి పచ్చడిలో వేసి కలపాలి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చింతకాయ పప్పు కావలసినవి: చింతకాయలు - 4, కందిపప్పు - కప్పు, ఉల్లితరుగు - అర కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చిమిర్చి - 4, ఆవాలు - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట తయారి: పప్పులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉడికించాలి చింతకాయలను ఉడికించి రసం తీసుకోవాలి ఒక గిన్నెలో ఉడికించిన పప్పు, చింతపండు రసం వేసి స్టౌ మీద ఉంచాలి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి, పోపు సామాను వేసి వేయించాలి ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి ఉడికిన పప్పులో ఈ పోపు వేసి కలపాలి. సేకరణ: డా.వైజయంతి