అది ఒక ఖరీదైన హోటల్. ఒక రోజు రాత్రి బస చేయాలంటే రూ 20 వేలు చెల్లించాలి. ఈ హోటల్‌లో బస చేసేందుకు ఓ మహిళ వెళ్లింది. ఆమెకు టీ తాగాలనిపించింది. అయితే ఆ గదిలో టీ కెటిల్ లేదు. దాని హ్యాండిల్ మాత్రమే ఉంది. దీంతో ఆ మహిళ రిసెప్షనిస్ట్‌కి ఫోన్ చేసి, సమస్య చెప్పింది. అయితే దీనికి ఆ రిసెప్షనిస్ట్ చాలా కటువుగా సమాధానమిచ్చింది.. ‘వెళ్లి సింక్‌లోని నీళ్లు తాగండంటూ’ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది.
ఆగండాగండి.. రిసెప్షనిస్ట్ ఆ మహిళ విషయంలో అవమానించేలా మాట్లాడిందని అనుకునేముందు ఒక విషయం తెలుసుకోండి. నిజానికి ఆ రిసెప్షనిస్ట్‌కు తాను ఏమి చేయాలో తనకు బాగా తెలుసు. అందుకే ఆమెను రిసెప్షనిస్ట్‌గా నియమించారు. ఆమె డ్యూటీ హోటల్‌కి వచ్చే వారిని అవమానించడం. అయితే ఆ మహిళ కూడా అవమానం పాలయ్యేందుకే ఆ హోటల్‌కు వెళ్లింది. చాలామంది ఈ హోటల్‌కు అవమానాలను ఎదుర్కొనేందుకే వస్తుంటారు.
‘డైలీ మెయిల్’లోని ఒక కథనం ప్రకారం రోజుకు రూ.20 వేలు ఛార్జ్ చేసే ఈ హోటల్‌లో కనీస సదుపాయాలు సరిగా ఉండవు. టవల్స్, టాయిలెట్ రోల్స్ కూడా ఉండవు. హోటల్‌లో బస చేసేందుకు వచ్చేవారెవరైనా కనీస అవసరాల గురించి అడిగితే, హోటల్ సిబ్బంది వారిని తీవ్రంగా అవమానిస్తుంటారు. చాలా సందర్భాల్లో అసభ్యకరంగా తిడుతుంటారు కూడా.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటువంటి వ్యవహారం కారణంగానే ఈ హోటల్ ఫేమస్ అయ్యింది. తీవ్రంగా అవమానం పాలయ్యేందుకే ఇక్కడికి జనం వస్తుంటారు. ప్రపంచంలోనే ఇలాంటి వింత ఎక్కడా ఉండదేమో. లండన్‌లోని ఈ హోటల్ పేరు కరెన్ హోటల్. దీనికి రెస్టారెంట్ చైన్ కూడా ఉంది. దాని పేరు కరెన్ డైనర్. ఈ కరెన్ డైనర్ చైన్‌లో కరెన్ హోటల్ ఒక భాగం. 2021లో కరెన్ డైనర్ రెస్టారెంట్ ఈ ‘అవమానకర’ సేవలను మొదలుపెట్టింది. తరువాత బ్రిటన్ అంతటా తమ శాఖలను నెలకొల్పింది.
Comments
Please login to add a commentAdd a comment