insulted
-
అవమానించినా మొద్దునిద్రేనా?
న్యూఢిల్లీ: అమెరికాలోని భారతీయ అక్రమ వలసదార్లకు బేడీలు వేసి స్వదేశానికి తరలించిన ఘటనపై గురువారం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. భారతీయులను అమెరికా ప్రభుత్వం ఘోరంగా అవమానించినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. మోదీ సర్కారు వెంటనే సమాధానం చెప్పాలని నిలదీశారు. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. శాంతించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను నాలుగుసార్లు వేయాల్సి వచి్చంది. షెడ్యూల్ ప్రకారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చించాల్సి ఉంది. కానీ, భారతీయులకు జరిగిన అవమానంపై చర్చించడానికి వాయిదా తీర్మానాన్ని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌తోపాటు పలువురు విపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చారు. సభాపతి అంగీకరించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత అవమానం జరుగుతున్నా సర్కారు మొద్దు నిద్ర వీడడం లేదని దుయ్యబట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ నాలుగు సార్లు వాయిదా పడిన పరిస్థితిలో మార్పు రాలేదు. సాయంత్రం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ లోక్‌సభలో ఒక ప్రకటన చదివి వినిపించారు. స్వదేశానికి తరలించే భారతీయులను అవమానించకుండా అమెరికా అధికారులతో చర్చిస్తున్నామని చెప్పారు. జైశంకర్ ప్రకటన తర్వాత కూడా విపక్షాల నిరసన కొనసాగింది. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. మనవాళ్ల పట్ల అమెరికా అధికారులు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే మోదీ సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కంటే ముందు ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ సభ్యులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తోపాటు పలువురు విపక్ష ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు ఎంపీలు చేతులకు సంకెళ్లు ధరించారు. ‘ఖైదీలు కాదు... మనుషులు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. భారత్‌ను, భారతీయులను అవమానిస్తే సహించబోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. గౌరవ మర్యాదలతో వెనక్కి తీసుకురాలేరా? అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై మోదీ ప్రభుత్వం సమగ్రమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. భారతీయులను గౌరవ మర్యాదలతో వెనక్కి తీసుకురావడానికి మన విమానాలు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఆవేదన వెల్లడిస్తున్న భారతీయ వలసదారుడి వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ బాధితుడి ఆవేదన వినాలని ప్రధాని మోదీకి సూచించారు. భారతీయులకు కావాల్సింది గౌరవం, మానవత్వం తప్ప సంకెళ్లు కాదని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికైనా నోరు విప్పాలని ప్రియాంక అన్నారు. మనవాళ్లను మనం ఎందుకు తీసుకురాలేకపోయామని అన్నారు మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ భారతీయులకు ఈ పరిస్థితి ఎందుకు వచి్చందో చెప్పాలని నిలదీశారు. మన దేశం నుంచి ఎవరినైనా పంపించాల్సి వస్తే ఇలాగే బేడీలు వేసి పంపిస్తారా? అని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, శివసేన (ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, శశి థరూర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ తదితరులు మోదీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. -
బీసీ నేతను అవమానించిన చంద్రబాబు
సాక్షి, అనంతపురం: గతంలో బీసీల తోకలు కత్తిరిస్తానంటూ అవమానించిన చంద్రబాబు తీరు మారడం లేదు. బొకేతో స్వాగతం పలికేందుకు వచ్చిన బీసీ నేతకు అవమానం ఎదురైంది. అనంతపురం జెడ్పీ మాజీ చైర్మన్, బోయ - వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పూల నాగరాజును చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది గెంటేశారు. కళ్ల ముందే బీసీ నేతకు అవమానం జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉన్నారే తప్ప పట్టించుకోలేదు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ గ్రామంలో ఘటన జరిగింది. చంద్రబాబు వైఖరిపై బీసీ సంఘాలు మండిపడుతున్నారు. గతంలో "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు.. వారి తెలివి ఉండదని" కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారని బీసీలు గుర్తుచేసుకుంటున్నారు. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు వస్తే "మీ తోకలు కత్తిరిస్తా" అని వేలు చూపిస్తూ చంద్రబాబు బెదిరింపులకు తెగిన సంగతి తెలిసిందే. "సార్ మేం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి" అని మత్స్యకారులంటే "ఏయ్.. నోరు మూసుకో తోలు తీస్తా" అంటూ దారుణంగా మాట్లాడారని చంద్రబాబు తీరును బీసీలు గుర్తుచేసుకుంటూ మండిపడుతున్నారు. -
Narendra Modi: ప్రభుత్వ ప్రకటనల్లో చైనా జెండానా?
సాక్షి, చెన్నై: మన దేశాన్ని, దేశభక్తులైన మన అంతరిక్ష పరిశోధకులను తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. తమిళనాడులోని కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా పత్రికల్లో డీఎంకే ప్రభుత్వం ఇచి్చన ప్రకటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలో రాకెట్‌పై చైనా జాతీయ జెండాను ముద్రించడాన్ని ఆయన తప్పుపట్టారు. డీఎంకే ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై సొంత ముద్రలు వేసుకుంటోందని ఆరోపించారు. పనులేవీ చేయకున్నా తప్పుడు దారుల్లో క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని విమర్శించారు. డీఎంకే నేతలు హద్దులు దాటారని, ఇస్రో లాంచ్‌ప్యాడ్‌ను తమిళనాడుకు తామే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి ఆరాట పడుతున్నారని విమర్శించారు. భారత జాతీయ జెండాను ముద్రించడానికి వారికి మనసొప్పలేదని ఆక్షేపించారు. ప్రజల సొమ్ముతో ఇచి్చన ప్రకటనల్లో చైనా జెండా ముద్రించడం ఏమిటని మండిపడ్డారు. దేశ ప్రగతిని, అంతరిక్ష రంగంలో ఇండియా సాధించిన విజయాలను ప్రశంసించడానికి డీఎంకే సిద్ధంగా లేదని అన్నారు. ఇండియా ఘనతలను ప్రశంసించడం, ప్రపంచానికి చాటడం డీఎంకేకు ఎంతమాత్రం ఇష్టం లేదని ధ్వజమెత్తారు. డీఎంకేను తమిళనాడు ప్రజలు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులో పర్యటించారు. తూత్తుకుడిలో రూ.17,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. కులశేఖరపట్నంలో రూ.986 కోట్ల ఇస్రో లాంచ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరునల్వేలిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కొత్త ప్రాజెక్టులు ‘అభివృద్ధి చెందిన భారత్’ రోడ్‌మ్యాప్‌లో ఒక ముఖ్య భాగమని అన్నారు. అభివృద్ధిలో తమిళనాడు నూతన అధ్యాయాలను లిఖిస్తోందని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పదేళ్ల ట్రాక్ రికార్డు.. వచ్చే ఐదేళ్ల విజన్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో డీఎంకే సర్కారు కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని మోదీ విమర్శించారు. అయోధ్య రామమందిర అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారని అన్నారు. ప్రజల విశ్వాసాలంటే ఆ పార్టీ ద్వేషమని మరోసారి రుజువైనట్లు చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఎల్.మురుగన్‌ను కేంద్ర మంత్రిగా నియమించామని, హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు పంపించామని గుర్తుచేశారు. కాంగ్రెస్, డీఎంకే పారీ్టలకు ప్రజల కంటే వారసత్వ రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. ఆ పారీ్టల నేతలు సొంత పిల్లల అభివృద్ధి గురించి ఆరాటపడతుంటే తాము మాత్రం ప్రజలందరి పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పరిపాలనలో తనకు పదేళ్ల ట్రాక్ రికార్డు ఉందని, రాబోయే ఐదేళ్లకు అవసరమైన విజన్ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రో జన్ ఇంధన సెల్ దేశీ య వాటర్ క్రాఫ్ట్‌ను తూత్తుకుడి వేదికగా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వీఓ చిదంబరనార్ ఓడరేవు ఔటర్ పోర్ట్ కార్గో టెరి్మనల్‌కు శంకుస్థాపన చేశారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 లైట్‌హౌస్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. తమిళనాడు ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలు తనను ఆకట్టుకున్నాయని, ఈ రాష్ట్రానికి సేవకుడిగా వచ్చానని, ఈ సేవ కొనసాగుతుందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. వివాదానికి దారి తీసిన డీఎంకే ప్రభుత్వ ప్రకటన -
అడుగడుగునా అవమానించే హోటల్‌కు జనం క్యూ!
అది ఒక ఖరీదైన హోటల్. ఒక రోజు రాత్రి బస చేయాలంటే రూ 20 వేలు చెల్లించాలి. ఈ హోటల్లో బస చేసేందుకు ఓ మహిళ వెళ్లింది. ఆమెకు టీ తాగాలనిపించింది. అయితే ఆ గదిలో టీ కెటిల్ లేదు. దాని హ్యాండిల్ మాత్రమే ఉంది. దీంతో ఆ మహిళ రిసెప్షనిస్ట్‌కి ఫోన్ చేసి, సమస్య చెప్పింది. అయితే దీనికి ఆ రిసెప్షనిస్ట్ చాలా కటువుగా సమాధానమిచ్చింది.. ‘వెళ్లి సింక్‌లోని నీళ్లు తాగండంటూ’ అరుస్తూ ఆ మహిళకు చెప్పింది. ఆగండాగండి.. రిసెప్షనిస్ట్ ఆ మహిళ విషయంలో అవమానించేలా మాట్లాడిందని అనుకునేముందు ఒక విషయం తెలుసుకోండి. నిజానికి ఆ రిసెప్షనిస్ట్‌కు తాను ఏమి చేయాలో తనకు బాగా తెలుసు. అందుకే ఆమెను రిసెప్షనిస్ట్‌గా నియమించారు. ఆమె డ్యూటీ హోటల్‌కి వచ్చే వారిని అవమానించడం. అయితే ఆ మహిళ కూడా అవమానం పాలయ్యేందుకే ఆ హోటల్‌కు వెళ్లింది. చాలామంది ఈ హోటల్‌కు అవమానాలను ఎదుర్కొనేందుకే వస్తుంటారు. ‘డైలీ మెయిల్’లోని ఒక కథనం ప్రకారం రోజుకు రూ.20 వేలు ఛార్జ్ చేసే ఈ హోటల్లో కనీస సదుపాయాలు సరిగా ఉండవు. టవల్స్, టాయిలెట్ రోల్స్ కూడా ఉండవు. హోటల్లో బస చేసేందుకు వచ్చేవారెవరైనా కనీస అవసరాల గురించి అడిగితే, హోటల్ సిబ్బంది వారిని తీవ్రంగా అవమానిస్తుంటారు. చాలా సందర్భాల్లో అసభ్యకరంగా తిడుతుంటారు కూడా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇటువంటి వ్యవహారం కారణంగానే ఈ హోటల్ ఫేమస్ అయ్యింది. తీవ్రంగా అవమానం పాలయ్యేందుకే ఇక్కడికి జనం వస్తుంటారు. ప్రపంచంలోనే ఇలాంటి వింత ఎక్కడా ఉండదేమో. లండన్‌లోని ఈ హోటల్ పేరు కరెన్ హోటల్. దీనికి రెస్టారెంట్ చైన్ కూడా ఉంది. దాని పేరు కరెన్ డైనర్. ఈ కరెన్ డైనర్ చైన్‌లో కరెన్ హోటల్ ఒక భాగం. 2021లో కరెన్ డైనర్ రెస్టారెంట్ ఈ ‘అవమానకర’ సేవలను మొదలుపెట్టింది. తరువాత బ్రిటన్ అంతటా తమ శాఖలను నెలకొల్పింది. -
దళితులకిచ్చే గౌరవం ఇదేనా బాబూ?
తిరుపతి రూరల్: దళితులను అవమానించి ఆనందపడటం చంద్రబాబుకి అలవాటులా మారిపోయింది. ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారంటూ గతంలో మీడియా ముందే అహంకారంతో మాట్లాడిన బాబు మరోసారి దళితుల పట్ల తనకున్న చిన్నచూపును ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ రోజు తిరుపతి రూరల్ మండలం అవిలాలలోని టీడీపీ నేత వెంకటమణిప్రసాద్ ఇంట్లో నిర్వహించిన సమావేశంలో దళిత మాజీ మంత్రి పరసారత్నాన్ని అందరి ముందు నిల్చోబెట్టి ఘోరంగా అవమానించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి.. రెండు సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రిగా కూడా చేసిన ఆయనను కనీసం తమ పక్కన కూడా బాబు కూర్చోనివ్వలేదు. దాంతో ప్రెస్‌మీట్ జరిగినంతసేపు పరసారత్నం అవమానభారంతో చెమర్చిన కళ్లతో నిల్చోనే ఉండిపోయారు. దళితులను నిత్యం అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని దళిత సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఇదీ చదవండి: చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు -
పల్నాడు జిల్లాలో తెలుగు తమ్ముళ్ల వికృత చేష్టలు
పెదకూరపాడు(పల్నాడు జిల్లా): జాతిపిత మహాత్మా గాంధీని టీడీపీ అవమానపరిచింది. గాంధీ విగ్రహానికి రాజకీయ రంగు పులిమింది. పల్నాడు జిల్లా కంభంపాడులోని గాంధీజీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి జాతిపితను అవమానించారు. ఇటీవల టీడీపీ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఆ పార్టీ జెండాలు, తోరణాలు కట్టారు. కొందరు టీడీపీ కార్యకర్తలు వికృత చేష్టలకు పాల్పడి గాంధీ విగ్రహం చేతికి టీడీపీ జెండాలు కట్టారు. దీంతో సర్వత్రావిమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న పెదకూరపాడు సీఐ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి గాంధీ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగించారు. చదవండి: చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు: సీఎం జగన్ -
T20 WC 2021: అక్తర్‌కు ఘోర అవమానం.. లైవ్‌లో పరువు తీసిన హోస్ట్
Shoaib Akhtar Insulted On Live Television Show: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 26న జరిగిన మ్యాచ్ అనంతరం నిర్వహించిన ఓ లైవ్ షోలో పాక్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌కు ఘోర అవమానం జరిగింది. పీటీవీ నిర్వహించిన ఆ లైవ్ షోలో ప్రముఖ పాకస్థానీ వ్యాఖ్యాత, హోస్ట్ డాక్టర్ నౌమాన్ నియాజ్ అక్తర్‌ను లైవ్ లోనుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. మ్యాచ్ విశ్లేషణలో భాగంగా అక్తర్ పాక్ బౌలర్లు హరీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిదిలపై ప్రశంసలు కురిపిస్తుండగా, నౌమన్ అభ్యంతరం చెప్పాడు. Dr Nauman Niaz and Shoaib Akhtar had a harsh exchange of words during live PTV transmission. pic.twitter.com/nE0OhhtjIm — Kamran Malik (@Kamran_KIMS) October 26, 2021 అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దని వారించాడు. ఇందుకు నొచ్చుకున్న అక్తర్.. ‘మీరు చాలా దురుసుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని బదులిచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన నౌమన్.. 'అతి తెలివిగా మాట్లాడితే సహించేది లేదు.. షో నుంచి వెళ్లిపోండి’ అంటూ లైవ్‌లో ఫైర్ అయ్యాడు. ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన అక్తర్.. మైక్‌ను విసిరేసి షో నుంచి వాకౌట్ చేశాడు. అనంతరం ఆ టీవీ ఛానల్‌తో తనకున్న ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో అక్తర్‌తో పాటు వివ్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గుల్, ఆకిబ్ జావిద్, పాక్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ సనా మీర్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. Multiple clips are circulating on social media so I thought I shud clarify.dr noman was abnoxious and rude wen he asked me to leave the show,it was embarrassing specially wen u have legends like sir Vivian Richards and David gower sitting on the set with some of my contemporaries — Shoaib Akhtar (@shoaib100mph) October 26, 2021 కాగా, సదరు విషయంపై అక్తర్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. టీవీల్లో మిలియన్ల మంది చూస్తుండగా నౌమన్ తనతో దురుసుగా ప్రవర్తించాడని, ఇది తనను ఎంతో బాధించిందని పేర్కొన్నాడు. ఇదంతా జరిగినప్పటికీ.. నౌమన్ తనను క్షమాపణలు కోరతాడని ఆశించానని, కానీ అందుకు అతను సుముఖంగా లేకపోవడం విచారకరమని అన్నాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ నాలుగు వికెట్లతో చెలరేగి కివీస్ పతనాన్ని శాశించాడు. అంతకుముందు టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో సైతం పాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: 'ఆటగాళ్లను గౌరవించండి..' షమీకి మద్దతుగా నిలిచిన పాక్ ఓపెనర్ -
టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం
-
టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం
సాక్షి, కృష్ణా జిల్లా: వీరులపాడు మండలం జూలూరులో టీడీపీ నేత దేవినేని ఉమకు ఘోర పరాభవం ఎదురైంది. రోడ్ల పరిశీలనకు వచ్చిన దేవినేని ఉమను టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. టీడీపీ కార్యకర్తలకు ఏ న్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దేవినేని ఉమ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. -
పోలీసులను బూతులు తిట్టాడు.. కారణం తెలిస్తే షాక్!
సాక్షి, చేవెళ్ల: హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తిని ఆపిన ట్రాఫిక్ పోలీసులపై ఓ వాహనదారుడు విరుచుకుపడ్డారు. పోలీసులు ప్రజల సమయాన్ని వృథా చేస్తున్నారని వాదించాడు. ఈ ఘటన చేవెళ్ల పీఎస్ పరిధిలోని షాబాద్ చౌరస్తాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చనువెళ్లి గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. అప్పటికే షాబాద్ చౌరస్తాలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సుధాకర్‌రెడ్డి వాహనాన్ని ఆపారు. ఆయన వాహనాన్ని నిలుపకపోవడంతో పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు. దీంతో ఆయన మీకు వాహనాలు ఆపి ప్రజల సమయం వృథా చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించాడు. మీరంతా మా జీతగాళ్లు అంటూ వాదించాడు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించాడు. పోలీసుల విధులకు భంగం కలిగించినందుకుగాను సుధాకర్‌రెడ్డిపై చేవెళ్ల పీఎస్‌లో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులతో సుధాకర్‌రెడ్డి వారించిన వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్ చేశారు. చదవండి: దారుణం: ఆసుపత్రి ఆవరణలో ఉమ్మొద్దు అన్నందుకు దాడి! -
ఇంత అవమానమా.. ఆలస్యంగా వెలుగులోకి..
సాక్షి, చెన్నై: వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు అగ్రవర్ణాల తీరుకు అవమానాల్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇటీవల తిరువళ్లూరులో ఓ మహిళా ప్రజాప్రతినిధిని జాతీయ జెండా ఎగురవేయకుండా అడ్డుకుంటే, తాజాగా, కడలూరులో ఓ మహిళా అధ్యక్షురాల్ని ఏకంగా నేలపై కూర్చోబెట్టి అవమానించడం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికార వర్గాలు అట్రాసిటీ కేసు నమోదు చేయడమే కాదు, పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయించారు. కడలూరు జిల్లా మేల్ భువనగిరి యూనియన్ పరిధిలో తెర్కుదిట్టై పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ అధ్యక్షురాలుగా దళిత సామాజిక వర్గానికి చెందిన రాజేశ్వరి గెలిచారు. బాధ్యతలు స్వీకరించిన నాటిని నుంచి ఎన్నో అవమానాల్ని ఆమె చవిచూశారు. ఆమెకు ఇటీవల ఎదురైన అవమానాన్ని ఫొటో చిత్రీకరించిన ఎవరో వ్యక్తులు, దానిని శుక్రవారం సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కించడం వివాదానికి దారి తీసింది. (చదవండి: పాదరసం.. అంతా మోసం) పంచాయతీ పాలక వర్గ సమావేశంలో కుర్చీలో ఉపాధ్యక్షుడు మోహన్‌రాజ్, పంచాయతీ కార్యదర్శి సింధుజా కుర్చీలో కూర్చోగా, అధ్యక్షురాలు నేలపై కూర్చున్న ఫోటో వైరల్ అయింది. కడలూరు ఎస్పీ అభినవ్ దృష్టికి ఈ ఫొటో చేరడంతో భువనగిరి ఇన్స్పెక్టర్ రాబిన్సన్ నేతృత్వంలో బృందాన్ని రంగంలోకి దించారు. శనివారం ఆ గ్రామానికి చేరుకుని రాజేశ్వరి, ఆమె భర్త శరవణన్‌ల వద్ద విచారించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె ఎదుర్కొంటున్న అవమానాలు, వేధింపులు వెలుగులోకి వచ్చా యి. ఆమె నుంచి తీసుకున్న ఫిర్యాదుతో ఉపాధ్యక్షుడు మోహన్ రాజ్, కార్యదర్శి సింధుజాలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సింధుజాను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే, తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని సింధుజా పేర్కొన్నారు. శనివారం ఆమెను అరెస్టు చేశారు. మోహన్ రాజ్ కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారాల గురించి రాజేశ్వరి పేర్కొంటూ, తాను గెలిచానే గానీ, ఏ రోజూ ఆ పదవికి తగిన న్యాయం చేయలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. -
గాంధీని అవమానించిన వారిపై చర్యలు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని హిందూ మహాసభ కార్యకర్తలు గాంధీ విగ్రహాన్ని అవమానించినా ఇంతవరకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని, వెంటనే నింది తులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత నెల 30న గాంధీ విగ్రహాన్ని హిందూ మహాసభ కార్యకర్తలు అవమానపర్చినందుకు నిరసనగా సోమవారం గాంధీభవన్‌లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి జరిగిన అవమానం భారత జాతికి జరిగిన అవమానమని అన్నారు. గాంధీ విగ్రహంపై దాడితోనే హిందూ మహాసభ బీజేపీ అనుబంధ సంఘమని తేలిపోయిందని అన్నారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్‌లో రూమర్... రాజ్‌నాథ్‌కు అవమానం
సాక్షి, జైపూర్ : కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు అవమానం ఎదురైంది. రాజస్థాన్ పర్యటనలో ఆయనకు గౌరవ వందనం దక్కలేదు. వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన ఓ పుకారు కారణంగా కానిస్టేబుళ్లంతా ముకూమ్మడిగా విధులకు గైర్హాజర్ కావటంతో ఇది చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే... ఇటీవలె వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోలీస్ శాఖకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంది. అయితే దాని వల్ల వారి వేతనాల్లో భారీగా కోతలు పడబోతున్నాయంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం 24 వేలుగా ఉన్న వారి జీతాలు 19 వేలకు పడిపోతుందని అందులో పేర్కొని ఉంది. దీంతో కానిస్టేబుళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా సోమవారం జోధ్ పూర్లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటించగా.. నిరసనలో భాగంగా సుమారు 250 మంది కానిస్టేబుళ్లు సామూహికంగా విధులకు డుమ్మా కొట్టారు. దీంతో రాజ్‌నాథ్ గౌరవ వందనం స్వీకరించలేకపోయారు. అధికారులేం చెబుతున్నారు... కాగా, రాజ్‌నాథ్‌కు సైనిక వందనం దక్కకపోవటంపై అధికారులు స్పందించారు. ఆ 250 మందిలో గార్డ్ ఆఫ్ ఆనర్ కోసం నియమించిన కానిస్టేబుళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వారికి ఎలాంటి లీవులు మంజూరు చేయలేదు. పైగా ఖచ్ఛితంగా విధులకు హాజరుకావాల్సిందేనని ముందస్తుగా చెప్పాం కూడా. అయినా కావాలనే వారు రాలేదు అని జోధ్ పూర్ పోలీసు కమిషనర్ అశోక్ రాథోడ్ తెలిపారు. మరోవైపు కానిస్టేబుళ్లు మాత్రం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించలేదని.. తమ ఆందోళనను, భయాన్ని కేంద్రానికి చెప్పేందుకు ఇలా చేశామంటున్నారు. ఏదిఏమైనా విధులకు డుమ్మా కొట్టినందున వీరికి నోటీసులు పంపి శాఖా పరమైన చర్యలు తీసుకోనున్నామని రాజస్థాన్ డీజీపీ అజిత్ సింగ్ తేల్చి చెప్పారు. -
మాహానాడులో పార్టీ సీనియర్లకు అవమానం
-
వివాదాస్పద రచయితపై దాడి
బెంగళూరు: కర్నాటక కల్చరల్ యాక్టివిస్ట్ యోగేష్ మాస్టర్ పై కొంతమంది దుండుగులు దాడికి పాల్పడ్డారు. దావణ గిరిలోని ఆయనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంకుదాడి చేశారు. వివాదాస్పద కన్నడ రచయిత యోగేష్ పై ఆదివారం భౌతికంగా దాడికి తెగబడ్డారు పబ్లిగ్గా అందరూ చూస్తుండగానే సుమారు ఆరుగురు యువకులు ఆయన్ని కొట్టి ముఖంపై నల్ల రంగు పులిమి అవమానించడం వివాదానికి దారి తీసింది. ప్రముఖ పాత్రికేయుడు పి. లంకేష్ 82 వ జయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా ఈ దాడి జరిగింది. సంఘటన అనంతరం యోగేష విలేకరులతో మాట్లాడారు. "జై శ్రీ రామ్" నినాదాలతో బైక్ పై వచ్చిన సుమారు ఆరుగురు వ్యక్తులు, తనను కొట్టి, దాడిచేశారని, ఇంకు పోసి, చొక్కా చించివేశారని ఆరోపించారు. ఫంక్షన్ తరువాత బాపూజీ డెంటల్ కాలేజ్ రోడ్ లో ఒక టీ స్టాల్ వద్ద టీ తాగడానికి వెళ్ళినప్పుడు సంఘటన జరిగిందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పలువురు జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు స్పందించారు. జర్నలిస్టు గౌరి లంకేష్, సీపీఐ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యులు సిద్దన్న గౌడ్ పాటిల్, కార్మికనాయకులు తీవ్రంగా ఖండించారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉందంతంపై రచయిత దావణగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా యోగేష్ మాస్టర్ రచించిన ‘దుంది కరణ్యకనోబ్బ గణపతియాదే కథ’ పుస్తకం వివాదాన్ని సృష్టించింది. దీనిపై నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ పలు హిందూత్వ సంఘాలు ఆందోళనకు దిగాయి. వారి అభ్యంతరాల తర్వాత ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
అమ్మకు అవమానం జరిగిందిలా...
-
కిలారి, కోటంరెడ్డికి అవమానం
హెలిప్యాడ్ వద్దకు అనుమతించని పోలీసులు డోర్‌ఫ్రేం మెటల్ డిటెక్టర్‌ను తోసేసిన కోటంరెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి తీవ్ర అవమానం జరిగింది. హెలిప్యాడ్ వద్దకు వెళ్లబోయిన వీరిని పోలీసులు పక్కకు నెట్టేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ కోటంరెడ్డి పోలీసులు తనిఖీలు నిర్వహించే డోర్ ఫ్రేం మెటల్ డిటెక్టర్‌ను తోసేశారు. రొట్టెల పండగకు సీఎం చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో హెలికాఫ్టర్‌లో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చారు. సీఎంకు స్వాగతం పలకడానికి పలువురు నాయకులు హెలిప్యాడ్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి బొకేలు తీసుకుని వెళ్లబోగా జాబితాలో మీ పేర్లు లేవని పోలీసులు అనుమతించలేదు. లోనికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన వీరిని పోలీసులు పక్కకు నెట్టేశారు. తాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నని కిలారి, తాను నగర పార్టీ అధ్యక్షుడినని కోటంరెడ్డి చెప్పుకున్నా పోలీసులు ఏ మాత్రం లెక్కపెట్టలేదు. జాబితాలో పేర్లు లేనందున అనుమతించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై ఇద్దరు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వివాదానికి దిగారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డోర్ ఫ్రేం మెటల్ డిటెక్టర్‌ను పక్కకు తోసేసి లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు పక్కకు తోసేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదరవిచంద్ర వచ్చి పోలీసులకు సర్ధిచెప్పి వారిని లోనికి తీసుకుని వెళ్లారు. జరిగిన ఘటనపై ఇద్దరు నేతలు తీవ్ర ఆవేదన చెందారు. మాజీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ను అడ్డుకున్న పోలీసులు సీఎం చంద్రబాబు నాయుడు బారాషహీద్ దర్గాకు వస్తున్న సమయంలో పోలీసులు ముఖ్యులను మాత్రమే దర్గాలోనికి అనుమతించారు. వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ సయ్యద్ సమీ దర్గాలోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. తాను వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌నని చెప్పినా జాబితాలో పేరు లేనందున పంపేది లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అతను దర్గా ఎదుట నేల మీద బైఠాయించారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో పోలీసులు అతన్ని పక్కకు ఈడ్చుకునిపోయారు. దర్గా దర్శనం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని సమీ ఆరోపించారు. నగర డీఎస్పీ రాముడు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేసి సమీని దర్గాలోకి పంపేలా ఏర్పాటు చేశారు. -
మేం చేసిన పాపమేంటి?
జ్యోత్స్న, కన్నబాబులకు అందని ఆహ్వానం శిక్షణా తరగతుల సమాచారం కూడా ఇవ్వని టీడీపీ నాయకత్వం –వలస నేతలకు పెద్ద పీట వేసి తమను అవమానించారని మధనపడుతున్న నేతలు సాక్షి ప్రతినిధి – నెల్లూరు : పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి కేడర్‌కు అండగా నిలిచిన గూడూరు, ఆత్మకూరు నియోజక వర్గాల మాజీ ఇన్చార్జిలను శిక్షణా తరగతులకు ఆహ్వానించక పోవడం పట్ల తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా అవసరం కోసం వచ్చిన వారికి పెద్ద పీట వేయడం పట్ల కేడర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరు నుంచి డాక్టర్ జ్యోత్స్నలత, ఆత్మకూరు నుంచి గూటూరు కన్నబాబు టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత కూడా వీరు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ కేడర్‌కు అందుబాటులో ఉంటూ వచ్చారు. రెండేళ్ల తర్వాత గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కమార్ వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అధిష్టానం ఆయనకే అప్పగించింది. అప్పటి దాకా ఇన్చార్జిగా ఉన్న జ్యోత్స్నకు, సునీల్‌కు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వారిని, ఎన్నికల్లో తనకు సహకరించిన వారిని పక్కన పెట్టి ఎమ్మెల్యే తన మనుషులకు పెద్ద పీట వేస్తున్నారని జ్యోత్స్న వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కాంట్రాక్టులు, ఇతర పనులు కూడా ఎమ్మెల్యే ఏకపక్షంగా పంచేస్తున్నారని ఆ వర్గం పార్టీ జిల్లా నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం శృతి మించడంతో సునీల్ మినహా పార్టీలో ముఖ్యమైన ఇతర నాయకులు మిన్నకుండిపోయారు. ఆత్మకూరు నియోజకఽవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. తొలి నుంచి పార్టీలో ఉంటూ, ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న గూటూరు కన్నబాబును ఇన్చార్జి పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా రగిలిపోయిన కన్నబాబును పార్టీ హై కమాండ్ బుజ్జగించింది. అయితే ఇప్పటికి కూడా ఆనంతో కన్నబాబు, ఒక వర్గంతో మరో వర్గం కలిసేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. మరో అవమానం గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ తరగతులకు ఎమ్మెల్యే సునీల్, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ అధిష్టానం ఆహ్వానించింది. నిన్న, మొన్నటి వరకు ఆ నియోజకవర్గాల్లో పార్టీని మోసిన జ్యోత్స్న, కన్నబాబుకు అసలు సమాచారమే పంపలేదు. ఈ విషయాన్ని వీరిద్దరూ అవమానంగా భావిస్తున్నారు. పెద్ద నాయకుల పరిస్థితే ఇలా ఉంటే రేప్పొద్దున తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ద్వితీయ శ్రేణి నాయకులు ఆలోచనలో పడ్డారు. అవసరం కోసం వాడుకుని కూరలో కరివేపాకులా తీసిపారేసే పద్ధతి మార్చుకోక పోతే రాబోయే ఎన్నికల్లో తామెలా పనిచేయాలని కేడర్ అంతర్మథనంలో పడింది. మొత్తం మీద ఈ వ్యవహారం ఆ రెండు నియోజకవర్గాల్లోని పార్టీ గ్రూపుల మధ్య ఉన్న దూరం మరింత పెంచింది. -
హేమమాలినిపై కేసు నమోదు
మధుర: మధుర బీజేపీ ఎంపీ, సినీనటి హేమమాలిని తనను దూషించారని గ్రామ ప్రధాన్( సర్పంచ్) భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాన్సిబట్ పర్యటనకు హేమమాలిన వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని మాంట్ మూలా గ్రామ ప్రధాన్ భగవతీ దేవి భర్త భగవాన్ సింగ్ ఆరోపించాడు. హేమమాలిని తీరుకు నిరసనగా గ్రామస్తులు ఆమె దిష్టిబొమ్మను దహనంచేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భగవాన్ సింగ్ ఫిర్యాదు మేరకు హేమమాలినిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డిప్యూటీ ఎస్ పీ సంజయ్ కుమార్ తెలిపారు. -
స్వీయ నిర్బంధం.. అవమానించారనే
గుంటూరు మెడికల్ :న్యాయబద్ధంగా తనకు రావాల్సిన పదోన్నతిని అడ్డుకోవడమే గాకుండా... తనను వేరే చోటకు బదిలీచేసి.. ఆ ఉత్తర్వులను ఇంటిగోడకు అతికించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సంఘం జీజీహెచ్ అధ్యక్షుడు డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ బుధవారం వినూత్న నిరసన తెలిపి కలకలం రేపారు. ఆస్పత్రిలోని 333నంబర్ వార్డులోగల తన గదిలో స్వీయనిర్బంధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అతనికి అత్యంత సన్నిహితుడు, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం విజయసారధి గదికిటికీ సందులోంచి ఎంతగా బయటకు రావాలని పిలిచినా ఆయన స్పందించలేదు. తరువాత ఆయన భార్య డాక్టర్ వనజ, కుమారుడు అనుదీప్, గుంటూరు వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శైలబాల గదివద్దకు చేరుకుని పలుమార్లు కోరినా ఫలితం లేకపోరుుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, డాక్టర్ ఫర్నికుమార్, డాక్టర్ శ్రీనివాసప్రసాద్, డాక్టర్ రాజ్యలక్ష్మి, నర్శింగ్ సిబ్బంది, పోలీసులు, రోగులు, అధికసంఖ్యలో మీడియా ప్రతినిధులు గది వద్దకు చేరుకున్నారు. కుటుంబ నియంత్రణ విభాగం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మండవ శ్రీనివాసరావు చొరవతీసుకుని కిటికీలోంచి లోపలికి ప్రవేశించి కాసేపు ఆయన్ను సముదారుుంచి తలుపు తీశారు. జీజీహెచ్‌లో ఉదయం 9 గంటల నుంచి 11. 30 గంటల వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు డాక్టర్ కిరణ్‌కుమార్‌కు జరిగిన అన్యాయం గురించి, అవమానాల గురించి మీడియాకు వివరించారు. డాక్టర్ కిరణ్‌కుమార్ కూడా ఆవేదనతో మీడియాతో మాట్లాడారు. తనకు పదోన్నతి రాకుండా అన్యాయం చేశారనే విషయాన్ని ఈ నెల 12న జాతీయ ఎస్సీ కమిషన్‌కు తెలియజేశాననీ, అందుకు డీఎంఈ, హెల్త్ సెక్రటరీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ తనను మానసిక వేధింపులకు పాల్పడ్డారనీ, ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపించారు. ఈ నెల 21 వ తేదీన ఢిల్లీలో ఎస్సీ కమిషన్ మెంబర్ పి.ఎమ్.కమలకుమారి తనను విచారణ జరుపుతుండగానే తనను తిరుపతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారన్నారు. తాను ఫిర్యాదు చేశానన్న కారణంతోనే బదిలీ చేయటమే కాకుండా ఆ ఉత్తర్యులు తన ఇంటి గోడపై అంటించి ఫొటోలు తీసి తనను అవమానించారని వాపోయూరు. జీజీహెచ్‌లో కూడా సూపరింటెండెంట్ తనను పలుమార్లు అవమానించారని, తనకు జరిగిన అన్యాయానికి, న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలో తెలియక తనను తాను నిర్బంధించుకున్నాననీ, ఆత్మహత్యకు పాల్పడనని ఈ మేరకు ఆర్బన్ ఎస్పీకి లేఖ రాస్తున్నానని కిరణ్‌కుమార్ వివరించారు. -
మిల్క్ బ్యూటీ పై గుర్రుగా ఉన్న బ్లాక్ బ్యూటీ...