
హేమమాలినిపై కేసు నమోదు
మధుర బీజేపీ ఎంపీ, సినీనటి హేమమాలిని తనను దూషించారని గ్రామ ప్రధాన్( సర్పంచ్) భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మధుర: మధుర బీజేపీ ఎంపీ, సినీనటి హేమమాలిని తనను దూషించారని గ్రామ ప్రధాన్( సర్పంచ్) భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాన్సిబట్ పర్యటనకు హేమమాలిన వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని మాంట్ మూలా గ్రామ ప్రధాన్ భగవతీ దేవి భర్త భగవాన్ సింగ్ ఆరోపించాడు.
హేమమాలిని తీరుకు నిరసనగా గ్రామస్తులు ఆమె దిష్టిబొమ్మను దహనంచేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భగవాన్ సింగ్ ఫిర్యాదు మేరకు హేమమాలినిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని డిప్యూటీ ఎస్ పీ సంజయ్ కుమార్ తెలిపారు.