బీసీ నేతను అవమానించిన చంద్రబాబు  | Chandrababu Insulted BC Leader Pula Nagaraju In Anantapur, Details Inside - Sakshi
Sakshi News home page

బీసీ నేతను అవమానించిన చంద్రబాబు 

Published Tue, Apr 23 2024 9:16 AM | Last Updated on Tue, Apr 23 2024 11:32 AM

Chandrababu Insulted Bc Leader In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: గతంలో బీసీల తోకలు కత్తిరిస్తానంటూ అవమానించిన చంద్రబాబు తీరు మారడం లేదు. బొకేతో స్వాగతం పలికేందుకు వచ్చిన బీసీ నేతకు అవమానం ఎదురైంది. అనంతపురం జెడ్పీ మాజీ చైర్మన్, బోయ - వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పూల నాగరాజును  చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది గెంటేశారు. కళ్ల ముందే బీసీ నేతకు అవమానం జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉన్నారే తప్ప పట్టించుకోలేదు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ గ్రామంలో ఘటన జరిగింది. చంద్రబాబు వైఖరిపై బీసీ సంఘాలు మండిపడుతున్నారు.

గతంలో "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు.. వారి తెలివి ఉండదని" కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారని బీసీలు గుర్తుచేసుకుంటున్నారు. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు వస్తే "మీ తోకలు కత్తిరిస్తా" అని వేలు చూపిస్తూ చంద్రబాబు బెదిరింపులకు తెగిన సంగతి తెలిసిందే.  "సార్ మేం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి" అని మత్స్యకారులంటే "ఏయ్.. నోరు మూసుకో తోలు తీస్తా" అంటూ దారుణంగా మాట్లాడారని చంద్రబాబు తీరును బీసీలు గుర్తుచేసుకుంటూ మండిపడుతున్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement