Bc leader
-
పాత ఫార్ములానే..!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్ష నియామకంలో కాంగ్రెస్ హైకమాండ్ పాత ఫార్ములానే అనుసరించింది. ముఖ్యమంత్రిగా ఓసీ వర్గాలకు చెందిన వారిని నియమిస్తే... బీసీ వర్గానికి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే సాంప్రదాయాన్ని కొనసాగించింది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోపాటు ఆయన మూడేళ్ల పదవీకాలం కూడా ముగిసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని ఏఐసీసీ చాలా సీరియస్‌గా తీసుకుంది. నాలుగు నెలలుగా దీనిపై కసరత్తు చేసిన అధిష్టానం పలుమార్లు రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపి, అనేక కోణాల్లో పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల పేర్లను ఈ పదవి కోసం పరిశీలించి చివరకు మహేశ్‌గౌడ్ వైపు మొగ్గు చూపింది. చర్చోపచర్చలు.. భిన్న వాదనలుకర్ణాటక ఫార్ములా ప్రకారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని తొలుత ప్రచారం జరిగింది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా అధ్యక్షుడిగా నియమించే అవకాశముందనే చర్చ కూడా జరిగింది. ఆ చర్చల అనంతరం సామాజికవర్గాల లెక్కలు తెరపైకి వచ్చాయి. ఓసీ వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రిగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒకరిని అధ్యక్షుడిగా నియమిస్తారని, ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పోరిక బలరాంనాయక్, మధుయాష్కీగౌడ్, మహేశ్కుమార్గౌడ్లలో ఒకరిని ఈ పదవిలో నియమిస్తారనే ప్రచారం ఊపందుకుంది.దీంతో పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షీలను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినప్పటికీ అధ్యక్షుడి వ్యవహారాన్ని తేల్చలేదు. కేబినెట్ ఖాళీలు భర్తీ చేసే క్రమంలో సామాజిక సమతుల్యత సరిపోలడం లేదంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఇక, ఎస్సీల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాదిగ సామాజికవర్గానికి అవకాశం వస్తుందని, ఈ మేరకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేరు ఖరారైందని ప్రచారం జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్లు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పేరు వినిపించింది. సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఈ పదవిలో నియమిస్తారని మరికొన్నాళ్లు చర్చ జరిగింది. ఇక, ఎట్టకేలకు ఆగస్టు చివరి వారంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో జరిపిన చర్చల్లో బీసీ వర్గానికి అధ్యక్ష పదవిని ప్రతిపాదించిన ఏఐసీసీ మధుయాష్కీ, మహేశ్‌గౌడ్‌ల పేర్లపై కీలక నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఎట్టకేలకు మహేశ్‌గౌడ్ వైపు మొగ్గుచూపింది. రెండు ప్రాంతాలకు చెరో పదవిమహేశ్గౌడ్ను అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో విధేయతకు ఏఐసీసీ పెద్దపీట వేసింది. దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం, సామాజిక సమతుల్యత, రేవంత్ సిఫారసుకు ప్రాధాన్యం, సంస్థాగత వ్యవహారాలపై పట్టు నేపథ్యంలో మధుయాష్కీ, మహేశ్‌గౌడ్‌ల మధ్య దోబూచులాటతో చివరి నిమిషంలో ఉత్కంఠ రేపింది. మహేశ్‌గౌడ్ నియామకం పూర్తయిందని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే సంతకం చేశారని, కేసీ.వేణుగోపాల్ కూడా మహేశ్‌గౌడ్‌తో మాట్లాడి దిశానిర్దేశం చేశారనే వార్తలొచ్చిన తర్వాత కూడా మరోవారం రోజుల పాటు జాప్యం జరిగింది. ఈనేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ మార్కు ఊహాగానాలకు తెరలేచినా ఎట్టకేలకు మహేశ్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. -
బీసీ నేతను అవమానించిన చంద్రబాబు
సాక్షి, అనంతపురం: గతంలో బీసీల తోకలు కత్తిరిస్తానంటూ అవమానించిన చంద్రబాబు తీరు మారడం లేదు. బొకేతో స్వాగతం పలికేందుకు వచ్చిన బీసీ నేతకు అవమానం ఎదురైంది. అనంతపురం జెడ్పీ మాజీ చైర్మన్, బోయ - వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన పూల నాగరాజును చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది గెంటేశారు. కళ్ల ముందే బీసీ నేతకు అవమానం జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉన్నారే తప్ప పట్టించుకోలేదు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ గ్రామంలో ఘటన జరిగింది. చంద్రబాబు వైఖరిపై బీసీ సంఘాలు మండిపడుతున్నారు. గతంలో "బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జడ్జీలుగా పనికిరారు.. వారి తెలివి ఉండదని" కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారని బీసీలు గుర్తుచేసుకుంటున్నారు. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులు వస్తే "మీ తోకలు కత్తిరిస్తా" అని వేలు చూపిస్తూ చంద్రబాబు బెదిరింపులకు తెగిన సంగతి తెలిసిందే. "సార్ మేం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి" అని మత్స్యకారులంటే "ఏయ్.. నోరు మూసుకో తోలు తీస్తా" అంటూ దారుణంగా మాట్లాడారని చంద్రబాబు తీరును బీసీలు గుర్తుచేసుకుంటూ మండిపడుతున్నారు. -
ఒక్క మాటతో చంద్రబాబుకు బుద్ధి చెప్పిన బీసీ మహిళ
-
నాగార్జున సాగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ!
నాగార్జున సాగర్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో కీలక నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న ఆయన.. కారు దిగేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 500 మందితో కలిసి కాషాయ కండువా కప్పుకొనేందుకు ఇప్పటికే ఏర్పాట్లు సైతం పూర్తయినట్లు సమాచారం. నియోజకవర్గ, నాయకులతో కలిసి రెండు రోజులు క్రితం బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. బీజేపీలోకి రావాలని పార్టీ నాయకులు ఆ యంగ్ లీడర్‌ను ఆహ్వానించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలక నేతల హామీ మేరకు బీజేపీలో చేరాలని యువ నాయకుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆయన బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంగా బీఆర్ఎస్లో తనకు లభించే ప్రాధాన్యత మూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జనాల్లో ఆదరణ ఉన్న బీసీ నాయకుడు విదేశాల నుంచి స్వదేశానికి సేవ చేయాలనే ఆలోచనలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ్ సామాజికవర్గం నుంచి గట్టి పట్టు ఉన్న నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ బీజేపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అయింది. ఈ యువ నాయకుడితో పాటు పలువురు నాయకులు కూడా తనతో పాటు కమలం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వనున్నారనే చెప్పవచ్చు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే మనవడు గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్ఎస్ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌కు ఈసారి నాగార్జునసాగర్ నియోజకవర్గం టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్‌కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న మన్నెం రంజిత్ యాదవ్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని పలువరు స్థానికులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ.. నాగార్జునసాగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు అధిష్టానం టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. -
రజకబంధు పథకం ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, కవాడిగూడ(హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం రజకబంధు పథకం ప్రకటించి ఒక్కో రజక కుటుంబానికి రూ.10లక్షలు అందించాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇందుకోసం ప్రధాని మోదీ జాతీయస్థాయిలో కమిటీని వేయాలని కోరారు. అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద గురువారం నిర్వహించిన ధర్నాకు ఆర్.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రజకులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించడంతోపాటు వారికి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కోఠి మహిళా కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు ముగ్గు అనిల్, బీసీ సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పాలన పక్కన పెట్టి కుట్రలు -
50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 50 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో బుధవారం బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీఈడీ, డీఈడీ, పీఈటీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్న మాదిరిగానే టీచర్ పోస్టులను భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను తీ ర్చిదిద్ది పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతున్నారని, వేలకోట్లను వెచ్చిస్తున్నా రని తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో వేకెన్సీ బోర్డులు దర్శనం ఇస్తున్నాయన్నారు. అదే పరిస్థితి తెలంగాణలో కూడా తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో లాల్‌కృష్ణ, లక్ష్మణ్‌యాదవ్, అంజి, సత్యనారాయణ, అనంతయ్య, సతీశ్, చంటి ముదిరాజ్, సుచిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమంతులు.. -
బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం: ఆర్. కృష్ణయ్య
సాక్షి, గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ' బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం' అంటూ తెలిపారు. -
బీసీ బిల్లును రాజ్యసభలో పెట్టిన ఘనత సీఎం జగన్‌దే
సాక్షి, అమరావతి: చరిత్రాత్మక బీసీ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, అవినీతికి తావులేని, సమర్థవంతమైన, ప్రజారంజక పాలన అందిస్తున్న సీఎంగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో గురువారం కృష్ణయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీలకు సంబంధించిన పలు డిమాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సింగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం, కాంట్రాక్ట్‌లు, నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించడం వంటి చర్యలతో పేద వర్గాలకు దగ్గరయ్యారని అభినందించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీల డిమాండ్లు నెరవేర్చేందుకు కృషిచేయాలని సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు ఏపీ: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం -
బీసీ సంఘం నాయకుడి స్టూడియో ధ్వంసం
-
బీసీలకు సీట్లివ్వకుంటే దాడులే: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: బీసీలకు సీట్లు కేటాయించడంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని, జనాభా ప్రాతిపదికన 65 సీట్లు కేటాయించని పార్టీల ఆఫీసులపై దాడులు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గంగపుత్ర మహాసభ నిర్వహించిన రాజకీయ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలంటే ఓట్లు వేసే యంత్రాలా... జెండాలు మోసే కార్యకర్తలా... అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 సీట్లలో 20 మంది, కాంగ్రెస్ కేటాయించిన 65 సీట్లలో 15 మంది బీసీలకు మాత్రమే సీట్లిచ్చారని విమర్శించారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాయకులు గుజ్జ కృష్ణ, కొప్పు పద్మ, గడ్డ సాయి, మెట్టు సూర్యప్రకాశ్, డా.సజయ్ కాల్ నిస్సాల్, లెల్లెల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు కూడా అడుక్కోవాలా..!
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ సిట్టింగులకే సీట్లు ఇస్తామని చెప్పి మరోసారి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం విచారకరం అన్నారు. బీసీ రాజకీయ చైతన్య బస్సు యాత్రలో భాగంగా బోధన్ చేరుకున్న శ్రీనివాస్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా ఇవ్వాలని టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలను ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలోని 112 బీసీ కులాలు జేఏసీగా ఏకమై ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా రాజకీయ వాటా కోసం యాచించాల్సిన పరిస్థితులు ఉండటం బాధాకరమన్నారు. శాసించే స్థాయి కోసమే బీసీ రాజకీయ చైతన్య యాత్ర చేస్తున్నామని తెలిపారు. బీసీలను అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో అన్ని పార్టీ కార్యాలయాలు టులెట్ బోర్డులు పెట్టుకోవాల్సి వస్తుందని ఉద్ఘాటించారు. -
7 నుంచి బీసీల రాజకీయ చైతన్య యాత్ర
హైదరాబాద్: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలన్న నినాదంతో బీసీల రాజకీయ చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ‘పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు’అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 7నుంచి సెప్టెంబర్ 7వరకు చేపట్టనున్న ఈ యాత్ర 80 నియోజకవర్గాల గుండా సాగుతుందన్నారు. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు జరిగిన రోజు నుంచే యాత్ర ప్రారంభమవుతుందని, పార్టీలకు అతీతంగా బీసీలందరూ పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను కార్యకర్తలుగానే చూస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో బీసీల వాటా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన అగ్రకుల నాయకులు హైకోర్టులో కేసు లు వేసి బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బీసీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు శ్రీనివాసరావు, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు. -
2019 ఎన్నికల నాటికి కొత్త పార్టీ: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీలకు రాజ్యాధికారం కోసం 2019 శాసనసభ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. శుక్రవారం వినాయక నగర్లో నిర్వహించిన గ్రేటర్ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే అన్ని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలవుతాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 50 శాతం సీట్ల కేటాయింపుతోపాటు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు నరేశ్‌బాబు, భూపేష్ సాగర్, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పవన్ వ్యవహారశైలి షాట్ రెడీ.. పేకప్..!
సాక్షి, ఆనందపేట(గుంటూరు) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి షాట్ రెడీ... పేకప్ అన్న రీతిలో ఉందని బీసీ సంక్షేమ సంఘం యువజన రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ అన్నారు. స్థానిక చుట్టుగుంటలోని రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షాట్ రెడీ అన్నప్పుడు షూటింగ్లో పాల్గొన్నట్లు పవన్ కల్యాణ్ జనంలోకి రావటం, పేకప్ చెప్పగానే షూటింగ్ ముగించుకుని వెళ్ళిపోయినట్లు పత్తా లేకుండా పోవటం పరిపాటిగా మారిందని విమర్శించారు. ప్రజలకు ఎలాంటి మేలు జరగదు.. ఆరు నెలలకోసారి ప్రత్యక్షమయ్యే పవన్ వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగదని చెప్పారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులే పవన్ కల్యాణ్‌ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఉనికిని చాటుకునేందుకు జనం మధ్యకు వచ్చే పవన్ కల్యాణ్‌ను ప్రజలు సైతం నమ్మటం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తన వ్యవహార శైలి మార్చుకుని జనం మధ్యలోకి వచ్చి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని హితవు పలికారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. -
బీజేపీలో చేరటం లేదు: కృష్ణయ్య
పెద్దపల్లి: బీజేపీలో చేరుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరేది లేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు తనను కలిసింది వాస్తవమేనన్నారు. అయితే తాను మాత్రం బీజేపీలో చేరడం లేదన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పూటకో మాట చెబుతూ పబ్బం గడుపుతూ వచ్చిందన్నారు. మొదట 40వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు 8,972పోస్టులకు తగ్గించిందన్నారు. ఇకనైనా తక్షణమే నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 11 బీసీ ఫెడరేషన్లకు తక్షణం రూ. 200 కోట్ల చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టేలా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. దేశవ్యాప్తంగా 36 రాజకీయ పార్టీలు కలిసి బీసీలకు మద్దతు కూడగట్టామన్నారు. -
‘ఉద్యమాల వల్లే పర్మనెంట్ అయ్యారు’
– టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సర్వేపల్లి(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): తాము చేపట్టిన ఉద్యమాల ఫలితంగా 24 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం పర్మినెంట్ చేసిందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు ఏపీజెన్కో ప్రాజెక్టులో బీసీ విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే–సావిత్రీ బాయి ఫూలే విగ్రహాలను శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వం కూడా తీసుకోవాలన్నారు. వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఉద్యమం చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. జెన్కో డైరెక్టర్లు అప్పారావు, సుందర్‌సింగ్, సీఈలు, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ఆధిపత్యం కోసమే హత్య
►కలకలం రేపుతున్న బీసీ నేత, కౌన్సిలర్ గోపాలకృష్ణ హత్యోదంతం ► ఔరంగాబాద్ ఇసుక ర్యాంపుపై కన్నేసిన టీడీపీలోని ఓ వర్గం నేతలు ► అతని ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు గతంనుంచీ యత్నాలు ► ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ► సీసీ కెమెరా పుటేజీ సాయంతో కేసు ఛేదన ► తెరవెనుక ఎవరున్నారనే అంశంపై దృష్టి సారించిన పోలీసులు కొవ్వూరు : ఇసుకు ర్యాంపుపై ఆధిపత్యం చెలాయించే విషయంలో టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు బీసీ నాయకుడు, కొవ్వూరు మునిసిపల్ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ (52)ను హత్యచేసే స్థాయికి వెళ్లిందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు మరో వర్గం నేతలు. పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కౌన్సిలర్ గోపాలకృష్ణ రోడ్ కం రైలు వంతెన సమీపంలోని ఔరంగాబాద్ మలుపులో శుక్రవారం పట్టపగలే నడిరోడ్డుపై హత్యకు గురైన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆధిపత్య పోరే ప్రాణం తీసింది ఔరంగాబాద్‌లోని ఇసుక ర్యాంపులో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరాటం నేపథ్యంలోనే గోపాలకృష్ణ హత్యకు గురయ్యాడని పోలీస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గోపాలకృష్ణ ఔరంగబాద్ ఇసుక ర్యాంపు నిర్వహణలో మూడు దశాబ్ధాల నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారు. పడవలు, వాహనాలు, కూలీలు అతని చేతిలో ఉండటంతో అక్కడి ర్యాంపులో ఆయన హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలోని ఓ వర్గం నేతలు అతడి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు కొంతకాలంగా పావులు కదుపుతున్నారు. ఇసుక ర్యాంపులు అక్రమంగా సొమ్ము సంపాదించిపెట్టే బంగారు బాతులుగా మారడంతో ఔరంగాాబాద్లోని ఇసుక ర్యాంపుపై ఆ వర్గం నేతలను కన్నేశారని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇటీవల గోపాలకృష్ణ, అతడి కుటుంబ సభ్యులపై టీడీపీలోని ఓ వర్గానికి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. టీడీపీలోని ఒక వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని గోపాలకృష్ణ పార్టీ ముఖ్యనేతలకు చెప్పారని సమాచారం. తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసినా పార్టీ నాయకులు పెడచెవిన పెట్టారనే విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ నేత గోపాలకృష్ణ ఓ సాధారణ పడవ యజమాని చేతిలో హత్యకు గురికావడం చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం ఇలా గోపాలకృష్ణ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు శనివారం వెల్లడించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు. ఔరంగాబాద్‌కు చెందిన గోపాలకృష్ణను అదే గ్రామానికి చెందిన తోట శ్రీరాములు, అతని బంధువు చదలవాడ మధుబాబు కలసి చెరకు నరికే కత్తితో హత్య చేశారని డీఎస్పీ చెప్పారు. శ్రీరాములు తనకున్న 20 సెంట్ల భూమిని అమ్ముకుని ఇటీవలే ఇసుక తరలించే పడవను కొనుగోలు చేశాడన్నారు. ఔరంగాబాద్ వద్ద గోదావరి నది ఒడ్డున ఇసుక దిగుమతి చేసుకునేందుకు అవసరమైన స్థలం లీజు వ్యవహారంలో గోపాలకృష్ణకు, శ్రీరాములుకు మధ్య వివాదం ఏర్పడిందని తెలిపారు. శ్రీరాములు ఔరంగాబాద్ ర్యాంపులోఇసుక దిగుమతి చేసుకునేందుకు కబాబ్ అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకునేందుకు యత్నించగా, అతడి పడవను ర్యాంపులోకి రాకుండా అడ్డుకునేందుకు గోపాలకృష్ణ ఆ స్థలాన్ని తాను లీజుకు తీసుకున్నట్టుగా ఒప్పంద పత్రాలు రాయించుకున్నాడన్నారు. దీంతో శ్రీరాములు పక్కనే ఉన్న మరో స్థలాన్ని లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించగా, గోపాలకృష్ణ అడ్డుపడినట్టు నిందితులు చెప్పారని పేర్కొన్నారు. తన పడవను ఔరంగాబాద్ ర్యాంపులోకి రాకుండా గోపాలకృష్ణ అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన శ్రీరాములు అతడిని హతమార్చేందుకు పథకం రూపొందించాడని డీఎస్పీ వివరించారు. నెల రోజులుగా గోపాలకృష్ణను హతమార్చేందుకు శ్రీరాములు యత్నిస్తున్నాడని, శుక్రవారం మధ్యాహ్నం గోపాలకృష్ణ ఒంటరిగా మోటార్ సైకిల్ కొవ్వూరు వెళ్లాడాన్ని గుర్తించిన శ్రీరాములు అదే గ్రామానికి చెందిన తన బంధువైన చదలవాడ మధుబాబు అనే యువకుడి సహాయం తీసుకున్నాడన్నారు. మధుబాబు తన స్నేహితుడి నుంచి పల్సర్ మోటార్ సైకిల్ తీసుకుని, శ్రీరాముల్ని ఎక్కించుకుని కొవ్వూరు వైపు వెళ్లాడని తెలిపారు. గోపాలకృష్ణ కోసం పాత రైలు వంతెన వద్ద కొద్దిసేపు మాటు వేశారని, వివాహ విందుకు హాజరై తిరుగు ప్రయాణమైన గోపాలకృష్ణను మోటార్ సైకిల్‌పై వెంబడించి రోడ్ కం రైలు వంతెన దాటిన తరువాత మలుపులో అటకాయించారని డీఎస్పీ వివరించారు. మధుబాబు మోటార్ సైకిల్ అడ్డుపెట్టడంతో గోపాలకృష్ణ అదుపు తప్పి కిందపడిపోయాడని, శ్రీరాములు వెంట తెచ్చుకున్న చెరకు నరికే కత్తితో గోపాలకృష్ణపై విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడని చెప్పారు. అనంతరం నిందితులిద్దరూ వేములూరు పుంత రోడ్డు మీదుగా పరారయ్యారన్నారు. టోల్గేట్ జంక్షన్ వద్ద గల సీసీ కెమెరాలోని పుటేజీల ఆధారంగా గోపాలకృష్ణను పల్సర్ మోటార్ సైకిల్‌పై ఇరువురు వ్యక్తులు వెంబడించినట్టు గుర్తించామన్నారు. మధుబాబును అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, హత్యోదంతం బయటపడిందని డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దర్నీ అరెస్ట్ చేశామని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. హత్యకు పాల్పడిన సమయంలో నిందితులు ఇరువురూ వేసుకున్న దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించడంలో సీఐ పి.ప్రసాదరావు, పట్టణ ఎస్సైలు ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్, డి.గంగాభవాని, క్రైమ్ పార్టీ ఎస్సై కె.వెంకటరమణ, హెచ్‌సీలు ఎస్.నాగేశ్వరరావు, ప్రసాద్‌బాబు, ఆర్ఎస్ వాసు, పీవీ రమణ, ఏడు కొండలు సహకరించారని డీఎస్పీ వెల్లడించారు. వీరికి రివార్డు నిమిత్తం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఔరంగబాద్ ర్యాంపులో పాగా వేసిన పాక గోపాలకృష్ణ ఔరంగాబాద్ ఇసుక ర్యాంపులో గత మూడు దశాబ్ధాల నుంచి గోపాలకృష్ణ ఇసుక వ్యాపారంలో చక్రం తిప్పుతున్నారు. అలాగే ర్యాంపులో తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ర్యాంపు నిర్వహణ ఎవరు చేపట్టినా ఇక్కడ ఇసుక తవ్వకానికి, తరలించడానికి పనిచేసే పడవల నుంచి లారీలు, కూలీలు వరకు అన్నింటిలో గోపాలకృష్ణ హవానే నడుస్తోంది. ఇతని ఆదిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఇటీవల తీవ్ర ప్రయత్నాలు సాగాయి. సుమారు 6 నెలల క్రితం ర్యాంపులో ఇసుక లోడింగ్ వ్యవహారంలో వాహనాలను వరుస క్రమంలో పెట్టే ప్రయత్నంలో కొవ్వూరుకు చెందిన కొందరు యువకులు గోపాలకృష్ణ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. అంతేకాక ఇక్కడ ర్యాంపులో గోపాలకృష్ణ ఆదిపత్యాన్ని దెబ్బతీసేందుకు కొవ్వూరుకు చెందిన నాయకులు కొన్ని పడవలును సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం నుంచి ఇసుక వ్యాపారంలో కొనసాగుతున్న గోపాలకృష్ణ ఆర్ధికంగా స్ధిరపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇసుక వ్యాపారం కాసులు కురిపించడంతో, అందరికళ్లు ర్యాంపులపై పడ్డాయి. ఈ నేపద్యంలో ర్యాంపులో పడవలు నిలిపేందుకు , ఇసుకను అన్లోడింగ్ చేసుకునేందుకు స్థలం లీజు వ్యవహారంలో గోపాలకృష్ణకు హత్యకు దారితీసింది. -
రిజర్వేషన్‌పై తీర్మానాలు వస్తే పరిశీలిస్తాం
* బీసీ సంఘ నేతలతో కేంద్ర మంత్రులు సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీ, తెలంగాణ అసెంబ్లీల నుంచి తీర్మానాలు వస్తే పరిశీలిస్తామని కేంద్ర సామాజికన్యాయ, సాధికారిత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ నుంచి తీర్మానాలు అందలేదని వారు స్పష్టీకరించారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీల నుంచి కూడా తీర్మానాలు వస్తే రాజకీయంగా బీసీలకు బలం పెరుగుతుందని, ఈ విషయంలో బీసీ సంఘాలే చొరవ తీసుకోవాలని ఆ నేతల బృందానికి మంత్రులు సూచించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ నేతలు శుక్రవారం పార్లమెంటులో కేంద్ర మంత్రులు థావర్‌చంద్ గెహ్లాట్, అనంతకుమార్‌లతో సమావేశమయ్యారు. ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం సహా బీసీలకు సంబంధించిన 15 డిమాండ్లను మంత్రులకు కృష్ణయ్య వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు మాట్లాడుతూ కేంద్రంలో తాము అధికారం చేపట్టి ఆరునెలలే అయ్యిందని, దశలవారీగా బీసీల డిమాండ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మిన్‌రాజు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ అనుబంధ సంఘాల నేతలు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల వేళ సీన్ రివర్స్
ఆ ఇద్దరూ...ఇద్దరే... ఒకరు ఫైర్‌బ్రాండ్ అయితే, మరొకరు మిస్టర్ కూల్. ఒకరు తన మాటలతో ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతారు. మరొకరేమో అన్నింటికీ చిరునవ్వుతోనే సమాధానం చెబుతుంటారు. కానీ ఎన్నికల వేళ సీన్ రివర్స్ అయ్యింది. ఎప్పుడూ చిరునవ్వుతో సమాధానమిచ్చే నేత ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలమై పోతున్నారు. ఇంత అన్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాటలతోనే ప్రత్యర్థులకు దడ పుట్టించే నేత ఇపుడు మౌనవ్రతం పట్టారు. తన ఇలాఖాలో పరులు పాదం మోపినా సహించని ఆయన ఎన్నికల వేళ సీటుకే ఎసరొస్తున్నా చలించడం లేదు. ఇంతకీ ఎవరా ఇద్దరు.. ఏమా కథ మీరూ చదవండి. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ‘మిస్టర్‌కూల్’ శివతాండవం ‘మిస్టర్ కూల్’’.. శివుని ముందు ‘నంది’ అంతటి నిర్మలత్వం. చిరునవ్వుకు చిరునామా. కానీ ‘సీన్ రివర్స్’ అయింది. నిర్మలమైన మనిషి నిండు సభలో కన్నెర్ర జేశారు. ఉగ్ర నర్సింహావతారం ఎత్తారు. కడుపులోనే అణిచి పెట్టుకున్న ఆవేదనను వెళ్లగక్కారు. ‘ఒకే ఒక్క బీసీ నాయకుడు ఎదిగితే తొక్కాలని కుట్రలు చేస్తారా’..! అంటూ శివతాండవం చేశారు. కుట్రలు, కుతంత్రాలు సహించేది లేదని శపథం చేశారు. ఆయన పేరే నందీశ్వర్‌గౌడ్. పటాన్చెరు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈసారి పటాన్చెరు పీఠం మీద డీసీసీ ప్రెసిడెంట్ భూపాల్‌రెడ్డి కన్నేశారు. ఇటీవల ఏఐసీసీ దూతగా జిల్లాకు వచ్చిన బస్వరాజ్ పాటిల్ వద్ద తన మనుసులో మాట చెప్పిన ఆయన, దామోదర రాజనర్సింహ సాయంతో రాహుల్‌గాంధీని కూడా కలిశారు. పటాన్చెరు టికెట్ తనకే ఇవ్వాలని రాహుల్‌కు లేఖ కూడా ఇచ్చారు. దీంతో నందీశ్వర్‌గౌడ్ ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో భూపాల్‌రెడ్డి గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నారని, ఆయనవర్గాన్ని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేస్తూ టికెట్టు తనకే వస్తుందనే అసత్య ప్రచారంతో కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం నలుగురికి అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి ఉండగా... ఉన్న ఒక్క సీటునే ఊడదీసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ నేత రౌద్రరూపం చూసి నియోజకవర్గం ప్రజలు నమ్మ లేకున్నారు. ‘ఫైర్‌బ్రాండ్’ మౌనవ్రతం ‘ఫైర్‌బ్రాండ్’.. ఎప్పుడూ ముండుతూనే ఉండాలి. కానీ రొటీన్‌కు భిన్నంగా మౌనవ్రతం పట్టారు. తన ఇలాఖాలోకి పరులు పాదం మోపినా ఈ మౌనం వీడలేదు. సంగారెడ్డి ఈ సారి నాదే అంటున్నా... నవ్వేస్తున్నారు. ప్రత్యర్థి పరపతిని ప్రయోగించి టికెట్టే లక్ష్యంగా పాచికలు విసురుతున్నా... తనకు లక్ష ఓట్ల మెజార్టీ వచ్చితీరుతుందంటున్నారు. మరి మౌనం ఎందుకన్నా? అని అడిగితే ‘మోకా రాలేదు తమ్ముడూ’ అని మునీశ్వరుని తరహాలో సమాధానం చెప్తున్నారు. ఇంతకు ఎవరా? మౌనముని అంటే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. వచ్చే ఎన్నికల్లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని సంగారెడ్డి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అవకాశం దొరికినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటి స్తూ సొంత పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ పత్రికలకు ఎక్కారు. తాజాగా దామోదర వర్గంగా బలమైనముద్ర పడిన కొందరు నాయకులు పటాన్చెరు శివారులోని లహరీ రిసార్టులో సమావేశమయ్యారు. ఈసారి ఎన్నికల్లో జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్టు రాకుండా చేయాలని తీర్మాణించారు. ఈ సమావేశం దామోదర కనుసన్నల్లో జరిగిందని ప్రచారంలో ఉంది. జిల్లాలో రాజకీయంగా బలమైన వర్గాన్ని తయారు చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే దామోదర తొలుత తన భార్యను తెరమీదకు తీసుక వచ్చారని, తన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ కాబట్టి ఆమెను సంగారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలిపి జగ్గారెడ్డి ప్రస్థానానికి చెక్ పెట్టేం దుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లోనూ జగ్గారెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్లుగానే ఉంటున్నారు. ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఇప్పటివరకు నోరు విప్పి ఒక్క విమర్శ కూడా చేయక పోవడంతో నియోజకవర్గం ప్రజలు ఇది నిజమా.. లేక భ్రమ అనే మీ మాంసలో ఉన్నారు. -
ఉద్యమ ముసుగులో సీఎం, మంత్రులు ఆడ్డగోలు దోపిడి'
విశాఖ: వచ్చే ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి అని బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు 150అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయించకపోతే.. రాజకీయ పార్టీలను తరిమి కొడతాం అన్నారు. ఎన్నికల్లో బీసీ ఫారాలను సినిమా టిక్కెట్లలాగా అమ్ముకుంటే ఆయా పార్టీలు దిక్కులేని పరిస్థితులు ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు. 5 వేల మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి టిక్కెట్లు అమ్ముకున్న రాజకీయ పార్టీలను నిలదీస్తాం అని కృష్టయ్య తెలిపారు. బీసీల్లో క్రిమిలేయర్ విధానంతో కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తుంది ఆయన మండిపడ్డారు. ఉద్యమాల ముసుగులో సీఎం కిరణ్, మంత్రులు అడ్డగోలు దోపీడీలకు పాల్పడుతున్నారు అని ఆరోపించారు. జనవరి లేదా ఫిబ్రవరిలో విశాఖ బీసీ గర్జన సభను నిర్వహిస్తామని బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.