ఉద్యమ ముసుగులో సీఎం, మంత్రులు ఆడ్డగోలు దోపిడి'
Published Sun, Dec 22 2013 12:10 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
విశాఖ: వచ్చే ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి అని బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు 150అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయించకపోతే.. రాజకీయ పార్టీలను తరిమి కొడతాం అన్నారు. ఎన్నికల్లో బీసీ ఫారాలను సినిమా టిక్కెట్లలాగా అమ్ముకుంటే ఆయా పార్టీలు దిక్కులేని పరిస్థితులు ఎదుర్కొంటాయని ఆయన హెచ్చరించారు.
5 వేల మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి టిక్కెట్లు అమ్ముకున్న రాజకీయ పార్టీలను నిలదీస్తాం అని కృష్టయ్య తెలిపారు. బీసీల్లో క్రిమిలేయర్ విధానంతో కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తుంది ఆయన మండిపడ్డారు. ఉద్యమాల ముసుగులో సీఎం కిరణ్, మంత్రులు అడ్డగోలు దోపీడీలకు పాల్పడుతున్నారు అని ఆరోపించారు. జనవరి లేదా ఫిబ్రవరిలో విశాఖ బీసీ గర్జన సభను నిర్వహిస్తామని బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
Advertisement
Advertisement