R Krishnaiah
-
చివరి వరకు వైఎస్ఆర్ సీపీలోనే ఉంటా.. బీసీల కోసం పోరాడతా
-
అవన్నీ తప్పుడు వార్తలు.. పార్టీ మారే ప్రసక్తే లేదు: ఆర్ కృష్ణయ్య
సాక్షి, ఢిల్లీ: పార్టీ మారే ఆలోచన లేదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను వివరణ అడగకుండానే పార్టీ మారుతున్నట్లు వార్తలు రాసుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.బీసీల కోసం కొట్లాడే తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు పూర్తిగా ఉంది. బీసీలు రాష్ట్రానికి దేశానికి వెన్నుముక అని జగన్ చెప్తుండేవారు. బీసీల కోసం ఇంకా పోరాడాలి కృష్ణన్న అంటూ జగన్ నన్ను కలిసినప్పుడల్లా చెప్తుంటారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాడే తనకు పార్టీ మారే పరిస్థితి లేదని.. వైఎస్సార్సీపీ నుంచే బీసీల కోసం కొట్లాడుతానని కృష్ణయ్య అన్నారు. -
ఎంపీ ఆర్ కృష్ణయ్యపై టీడీపీ మూకల రాయి దాడి
-
పేదల అక్షరంపై కక్ష
నిరుపేదల చదువుపై ఇంకా పెత్తందార్ల కక్ష తీరడం లేదు. జగన్ ప్రభుత్వంలో వారికి ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఏపీ విధానాలపై ప్రశంసలు కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సైతం ఇక్కడి విద్యా విధానంలో తెచ్చిన సంస్కరణలను వేనోళ్ల పొగుడుతుంటే వీరికి గిట్టడం లేదు.ఉన్న పళంగా వారికి మాతృభాషపై ప్రేమ పుట్టుకొచ్చేసింది. దానిని జగన్ తొక్కేస్తున్నారంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదోలా జగన్‌ను ఇరుకున పెట్టాలని వారు లేనిపోని కుట్రలు చేస్తున్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సైతం ఇక్కడి పచ్చనేతల స్క్రిప్టునే వల్లె వేస్తూ నిరుపేదల చదువుపై కుట్రకు పన్నాగం పన్నుతున్నారు. –సాక్షి, అమరావతి బడుగులు ఎదుగుతున్నారనే బాబు భయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తుండటంతో బడుగులు ప్రపంచ మానవులుగా ఎదుగుతుండటంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అడగడం మానేసి ఇంగ్లిష్‌పై విషం నూరిపోశారు.చంద్రబాబు మొదట్నుంచి కులవాది, తన కుల ఆధిపత్యం కోరుకునే వ్యక్తి. అందుకే తన సామాజికవర్గం వారే ఇంగ్లిష్ చదువులతో విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పేద పిల్లలు మాత్రం ఇక్కడే అరకొర వేతనాలతో ఉండిపోవాలన్నది ఆయన దురుద్దేశం. విభజనాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఐదేళ్లపాటు నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించి, వారి ఆర్థిక సహకారంతో రాజకీయం నడిపారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యా వ్యవస్థను కులతత్వ పూరితంగా మార్చేశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇంగ్లిష్ చదువులను దూరం చేసే కుట్ర చేశారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందించారు. ఇంగ్లిష్ మీడియంను ప్రోత్సహించారు. ఖరీదైన బైజూస్ కంటెంట్‌ను ఉచితంగా అందించారు. ట్యాబ్‌లు ఇచ్చారు. విశ్వవిజ్ఞానాన్ని అందుకునేలా పేద పిల్లలను తీర్చిదిద్దారు. దీనిపై పెత్తందార్లు కుయుక్తులు పన్నడం సరికాదు. ఇంగ్లిష్ మీడియం పెత్తందారులకే పరిమితమా? పేదలకు ఇంగ్లిష్ వస్తే ఎదుగుతారని భయమా..తెలుగు కోసం కాదు విద్యా వెలుగు అడ్డుకోవాలనే.. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కి దీటుగా జగన్ అభివృద్ధి చేస్తున్నారు. డిజిటల్ విద్యా బోధన కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే క్రమంలో నిరుపేద విద్యార్థులు కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు వీలుగా ఇంగ్లిష్ మీడియం కూడా తీసుకువచ్చారు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఇది ఇంకా పెరిగి దేశం మొత్తం అనుసరిస్తే విద్యా వ్యాపారానికి నూకలు చెల్లుతాయనే కేంద్రంలోని పెద్దల భయం. అయినా ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ప్రభుత్వ ఉన్నతోద్యోగులు ఏ భాషలో చదివారు? తెలుగు మీడియంలో చదువుకున్నవారిలో అత్యధికులు నిరుద్యోగులుగా, లేదా చిరుద్యోగులుగా ఎందుకు మిగిలారు? అమిత్ షా పిల్లలు ఎక్కడ చదివారు? మన రాష్ట్రంలో తెలుగు భాషకు కంకణం కట్టుకున్నామని చెబుతున్న భాజాపా నేత వెంకయ్యనాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు... వాళ్ల పిల్లలు, మనవళ్లను ఏ మీడియంలో చదివించారు? అదే చదువు బడుగు బలహీన వర్గాల వారికి వద్దని ఎలా చెబుతారు? అయినా ఇక్కడ తెలుగు భాషనేమీ తీసేయడం లేదు కదా. ఇంగ్లిష్ మీడియం అదనంగా తెచ్చారు. అందరూ విద్యావంతులైతే హెచ్చుతగ్గులుండవన్నది అంబేడ్కర్ మాట. అందుకు తగ్గట్టుగా ఏపీలో అడుగులు పడుతున్నాయి. ఇది చూసి తమ ఆధిపత్యం ఎక్కడపోతుందోనని కొందరు భయపడుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. – జస్టిస్ ఈశ్వరయ్య అమిత్ షా ఇంట పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు అమిత్‌షా పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలి. డబ్బున్నవారంతా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. కూటమిలో ఉన్న నాయకుల మాట విని తెలుగు భాష గురించి అమిత్‌షా మాట్లాడటం బాధగా ఉంది. చంద్రబాబు కొడుకు ఎక్కడ చదివాడు? ఏం మీడియంలో చదివాడు? పేద ప్రజల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే తప్పేంటి? విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన నాయకుడు సీఎం జగన్. ఓటుకి ఇంగ్లిష్ మీడియానికి ముడిపెట్టడం సరికాదు. ఇంగ్లిష్ మీడియం తీసుకు రాను అని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? – యార్లగడ్డ వెంకటరమణ, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ అమిత్ షా,చంద్రబాబు పిల్లలు మాతృభాషలోనే చదివారా? మాతృభాషకు మద్దతు సాకుతో జరుగుతున్న ప్రచారం వెనుక పేదల చదువులను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది. మాతృభాషను చంపేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్న అమిత్ షా, చంద్రబాబు, రామోజీరావు వంటి పెద్దల వారసులు, మనుమలు మాతృభాషలోనే చదివారా? మాతృభాషపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న వారి పిల్లలు మాత్రం ఇంగ్లిష్‌లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు చెందిన పేదోళ్లు మాత్రం మాతృభాషను బతికించాలనే నిబంధనతో ప్యూన్లు, క్లర్కులు, గుమాస్తాలు, కూలీలుగా మిగిలిపోవాలా? ఇదెక్కడి ఆటవిక న్యాయం. పేద పిల్లలు ఇంగ్లిష్ చదువులు చదవకూడదా? పెత్తందార్లకు మాత్రమే ఇంగ్లిష్ చదువులు రాసిపెట్టారా? ఏ బిడ్డ అయినా పుట్టినప్పటి నుంచి మాతృభాషలోనే అక్షరాభ్యాసం చేస్తారు కదా. అలాంటి మాతృభాషను ఎవరో చంపేస్తే చచ్చిపోతుందా? చంద్రబాబు చెబితే మాత్రం అమిత్ షాకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద బిడ్డలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యమిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఆయన కృషివల్లే ఈ రోజు మన పేద బిడ్డలు అమెరికాలోని శ్వేతసౌధం, ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ వేదికలపై ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి సత్తా చూపారు. ఇక్కడి తల్లిదండ్రులు కూడా ఇంగ్లిష్ మీడియంనే కోరుకుంటున్నారు. ఎన్నికల వేళ దీనిపై రాజకీయం తగదు. –ఆర్.కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడుబాబోస్తే ఇంగ్లిష్ మీడియం తీసేయడం తథ్యం భవిష్యత్తులో చంద్రబాబు తీసుకోబోయే చర్యలకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. మోదీ, అమిత్ షాల మాటను బాబు తూచా తప్పరు కాబట్టి.. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంగ్లిష్ మీడియం తీసేయడం తథ్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పిల్లలకు మంచి స్కూళ్లు, మౌలిక సదుపాయాలు, భోజన వసతి, బైలింగ్వల్ బుక్స్ అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల రానున్న రోజుల్లో పెట్టుబడి దారుల పిల్లలకు పోటీపడే స్థాయిలో పేద వర్గాల పిల్లలు ఎదుగుతారు. ప్రాంతీయ భాషలోనే చదువు అంటున్న అమిత్ షా కొడుకు జయ్ షా పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని చిన్న వయసులోనే నేషనల్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అయ్యాడు.మరి తన కొడుకుని అమిత్ షా గుజరాతీలో ఎందుకు చదివించలేదు? అంబానీకి ధీరూబాయ్ అంబానీ పేరుతో ముంబయిలో పెద్ద ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఉంది. అక్కడ గుజరాతీ, మరాఠీ సబ్జెక్టే లేదు. మరి వాటిని మరాఠీ లోకో, గుజరాతీ భాషలోకో అమిత్ షా ఎందుకు మార్పించలేదు? గుజరాత్‌లోనే అదానీ స్కూల్ ఉంది అది కూడా పూర్తిగా ఇంగ్లిష్ మీడియం స్కూల్. బిర్లా కూడా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు నడుపుతున్నారు.మరి వీటన్నింటినీ కేంద్రంలోని పెద్దలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్లంతా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా చందాలు ఇస్తున్నారనా? గ్రామీణులు, వ్యవసాయదారుల పిల్లలు అంబానీ అదానీ పిల్లలతో సమానమైపోతారేమోననే భయంతోనే ఇంగ్లిష్ వద్దంటున్నారా? ఏ మీడియంలో చదివితే పిల్లలు బాగా రాణించగలరో అదే మీడియంలో చదివించాలి కదా. తాజాగా వచ్చిన పదోతరగతి ఫలితాల్లో కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు 91శాతం పాసైతే తెలుగు మీడియంలో చదువుకున్నవారు 81 శాతమే పాసయ్యారు.అంటే దీనర్థం ఏమిటి? ఇంగ్లిష్‌లో పిల్లలు మరింత సులభంగా చదువుకోగలుగుతున్నారనే కదా. ఇంగ్లిష్ మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు రాకుండా ఎలా పోతుంది? పల్లెల్లో వ్యవసాయ కూలీలు, చెప్పులు కుట్టేవారు, కుండలు చేసుకునేవారికి ఇంగ్లిష్ చదువులు వస్తే తమ పిల్లలతో పోటీ పడతారని వీరి భయం. కూటమి అధికారంలోకి వస్తే విద్యావ్యవస్థను కుక్కలు చింపిన విస్తరి చేద్దామని చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం, ఆయన చేపట్టిన విద్యా సంస్కరణలు ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో నిరుపేదలు ఆదివాసీలు, దళితులు దేశం గుర్తించే విజయాలు సాధిస్తారు. –కంచ ఐలయ్య, విద్యావేత్త ఎన్డీఏ ప్రభుత్వంలోనే తెలుగు భాష నిర్వీర్యంరాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తెలుగు భాషను భ్రష్టు పట్టించారు. అయినా ధర్మవరం సభలో అమిత్‌షా తెలుగును పరిరక్షిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ‘క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు రాసిచ్చిన అబద్ధాలను అమిత్‌షా వల్లెవేయడం సిగ్గుచేటు. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయకుండా, తెలుగు భాష ప్రోత్సాహానికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా భాషా స్ఫూర్తిని నిర్వీర్యం చేశారు.ఐదేళ్లపాటు అధికారంలో ఉండి కనీసం భాషా సంఘాన్ని పెట్టలేని చంద్రబాబు తెలుగు భాషను పరిరక్షిస్తామని చెప్పడం హాస్యాస్పదం. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార భాషా సంఘాన్ని పూర్తిస్థాయిలో నియమించి తెలుగు వికాసానికి బాటలువేశారు. ఎన్నడూ లేనివిధంగా గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలను వారంరోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నాం. వేమన శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో వేమన పద్యాలను చదివించి ఉభయ భాషా ప్రావీణ్యాన్ని ప్రోత్సహించారు.అల్లూరి సీతారామరాజు శత జయంతి, జాషువా వంటి మహోన్నత కవుల జయంతులను అధికారికంగా నిర్వహిస్తూ తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటారు. అందువల్లే ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే స్థాయికి తెలుగు విద్యార్థులు ఎదిగారు. తెలుగుభాషా పరిరక్షణ కంటే ముందుగా లోకేశ్‌కు మంచి తెలుగు నేర్పించాలి..’ అని విజయబాబు అన్నారు. –విజయబాబు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు -
వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా. 12 వేల ఉద్యమాలు చేశాం. 2 వేల జీవోల సాధించామని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్‌ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. సీఎం జగన్‌కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయి. సీఎం జగన్ మాత్రమే తన కుటుంబంలా చూసుకున్నారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి. ప్రజల అభివృద్ధే సీఎం జగన్ అభివృద్ధి. ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటోను పెట్టుకుంటున్నారు. నేను కర్నూలులో స్వయంగా చూశా. సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదు.. సంఘ సంస్కర్త.’’ అంటూ కృష్ణయ్య కొనియాడారు. ‘‘ఎలాంటి పోరాటం చేయకుండానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ మేలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఓటేసి గెలిపించాలి’’ అని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. -
నిజమైన బడుగుజీవుల బంధువు వైఎస్ జగన్ - ఆర్ కృష్ణయ్య
-
అమెరికాలోనూ ఏపీ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు
-
సామాజిక న్యాయంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శం: ఆర్.కృష్ణయ్య
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్.. కుల గణన నిర్ణయం హర్షణీయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని, రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు. చరిత్రలో సీఎం జగన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. గుడిసెలో ఉండేవారు సైతం డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. పిల్లల చదువులతో కుటుంబాల జీవితాలు మారిపోతున్నాయి. విదేశాలలో మన వాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. జగన్ చేపట్టినన్ని సంస్కరణలు మరెవరూ చేయలేదు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. సరైన పదవులు కూడా ఇవకుండా మమ్మల్ని అవమానపరిచారు. ఏ రాష్ట్రం వెళ్లినా ఏపీ గురించి, సీఎం జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు’’ అని కృష్ణయ్య పేర్కొన్నారు. ‘‘లోటు బడ్జెట్ ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్ మాత్రమే. ఇతర నాయకులు జనాన్ని ఓటర్లుగా మాత్రమే చూస్తారు. జగన్ మాత్రమే తమ కుటుంబ సభ్యులుగా చూస్తారు. అందుకే వారందరికీ మేలు చేస్తున్నారు. కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయి. పదవులు ఇంకా పెరుగుతాయి. బీసీల నాయకత్వం జగన్ హయాంలో బాగా పెరిగింది. కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారు. కానీ సీఎం జగన్ ఎంతో ధైర్యంగా ఆ పని చేస్తున్నారు. 18 మందికి ఎమ్మెల్సీలు ఇస్తే అందులో 11మంది బీసీలకే ఇచ్చారు. బస్సుయాత్రలకు జనం నుండి విశేష స్పందన లభిస్తోంది. బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న సహాయం మరువలేనిది’’ అంటూ కృష్ణయ్య కొనియాడారు. చదవండి: ‘ఈసారి కూడా నా మనవడే సీఎం’ -
పారా మెడికల్ సిబ్బంది తొలగింపునకు కుట్ర
ముషీరాబాద్: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బందిని తొలగించి ఆ శాఖను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 142ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5న హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద వేలాది మందితో భారీ ధర్నా తలపెట్టాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల సంఘం నిర్ణయించినట్లు తెలిపారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. పెరుగుతున్న జనాభా ప్రకారం అర్బన్ హెల్త్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, వైద్య కళాశాలలు, ఏరియా ఆస్పత్రులు, నూతన భవనాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. వాటికి సరిపడినంతమంది సిబ్బందిని నియమించకుండా.. ఉన్నవారిని కుదించడానికి కుట్ర పన్నుతూ జీవో 142ను అమలు చేస్తోందని ఆరోపించారు. ఈ జీవో వల్ల దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులకు నష్టం కలుగుతుందని వివరించారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుని కార్యాలయంలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేసే పారా మెడికల్ సిబ్బందిని తొలగించాలని కొందరు అధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. -
కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోలు కరెన్సీ నోట్లపై ముద్రించాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్లో పోరాటానికి కూడా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్బీఐ ఏర్పడటానికి పునాది అయిన అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలన్నారు. పరశురామ్ మాట్లాడు తూ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని ఐదేళ్ల నుంచి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధ యాత్ర, ప్రజా చైతన్య యాత్ర, సైకిల్ యాత్ర నిర్వహించి ఢిల్లీలో 13 సార్లు ధర్నా నిర్వహించామని గుర్తుచేశారు. నేడు పార్లమెంట్ వద్ద ప్రదర్శన మహిళా బిల్లులో బీసీల వాటా కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళా బిల్లు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీల వాటాను స్పష్టం చేస్తూ బిల్లులో పొందుపర్చాలన్నారు. మహిళా బిల్లులో బీసీల వాటాపైనా అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్కు రోజులు దగ్గరపడ్డాయి
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. సూర్యాపేట వేదికగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యపై మంత్రి జగదీశ్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వట్టె జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జానయ్య సతీమణి రేణుక యాదవ్‌తో కలసి హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..బీసీ వర్గానికి చెందిన వట్టె జానయ్య సూర్యాపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన మరుసటి రోజు నుంచి వారం రోజుల వ్యవధిలో ఆ వ్యక్తిపై 90 కేసులు పెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వట్టె జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయకుంటే సూర్యాపేటలో రెండు లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించి బీఆర్ఎస్కు వణుకుపుట్టిస్తామని మందకృష్ణ హెచ్చరించారు. ప్రతి సందర్భంలో తమను కాళ్లకు మొక్కేలా జగదీశ్‌రెడ్డి ప్రవర్తించారంటూ రేణుక యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం అంతరించిపోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. జానయ్య సోదరుడు కృష్ణయాదవ్, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బీసీల పక్షాన కాంగ్రెస్‌కు మద్దతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ సంఘాల పక్షాన తమకు మద్దతివ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, మాజీ ఎంపీ వి.హనుమంతరావు శనివారం సాయంత్రం విద్యానగర్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వెళ్లి ఆర్. కృష్ణయ్యను కలిశారు. బీసీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, బీసీల కులగణన చేపట్టాలన్న డిమాండ్‌కు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారని వారు గుర్తు చేసి.. తమకు సంఘీభావం తెలపాలని కృష్ణయ్యను కోరారు. ఇందుకు స్పందించిన ఆయన బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ నేతల ముందుంచి వాటిని పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీసీల మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగానే కృష్ణయ్య ఆఫీసుకి, ఇంటికి ఠాక్రే, వీహెచ్ వెళ్లారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయాలకు సంబంధం లేదు: కృష్ణయ్య ఠాక్రే, వీహెచ్‌లతో సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని, బీసీ డిమాండ్లపైనే చర్చ జరిగిందని చెప్పారు. బీసీ సంఘం అధ్యక్షుడిగా మాత్రమే వారు తనను కలిశారని స్పష్టం చేశారు. బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని కోరానని, అందుకు కాంగ్రెస్ నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే పార్లమెంటులో వైఎస్సార్సీపీ పక్షాన బీసీ బిల్లు పెట్టి 14 పార్టీల మద్దతు కూడగట్టామని వెల్లడించారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి స్పష్టం: ఠాక్రే ఆర్.కృష్ణయ్యతో చర్చల తర్వాత ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అందుకే కృష్ణయ్యతో మాట్లాడేందుకు తాము వచ్చామన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. కాగా, బీసీ సంఘం కార్యాలయంపైనే ఉన్న కృష్ణయ్య నివాసంలోకి ఠాక్రే, వీహెచ్‌లు వెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. -
గిరిజనులకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారు: ఆర్ కృష్ణయ్య
-
తెలంగాణలో బీసీ సంక్షేమశాఖ ఎత్తేసే కుట్ర!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఏపీ సర్కార్ బీసీలకు మేలు చేస్తుంటే.. తెలంగాణ సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. అంతేకాదు బీసీలకు సాయం అందిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ సర్కార్ మాట తప్పిందని, తెలంగాణలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎత్తేసే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారాయన. ‘‘బీసీల్లో ఆరు కులాలకు మాత్రమే టీఎస్ సర్కార్ రూ. లక్ష సాయం అందిస్తోంది. గతంలో అనేక కులాలకు ఇస్తామని హామీ ఇచ్చింది. బీసీల్లో ఉన్న మిగతా 130 కులాలకు కూడా రూ. లక్ష సాయం అందించాలి’’ అని డిమాండ్ చేశారాయన. ఇక.. బీసీ బంధు ఇస్తామని రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్‌ఉన్న రాష్ట్రం కాబట్టి అందరికీ నిధులు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారాయన. ఉన్నత చదువులు చదివే విద్యార్థులను ప్రభుత్వమే ఆదుకోవాలని గుర్తు చేస్తున్నారాయన. అలాగే ‘‘తెలంగాణలో కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్లకు రూ.10 వేలు ఇస్తున్నారు. కానీ, ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ ఎత్తివేసే కుట్రజరుగుతోందని, సీఎం పేషీలో కూడా అదే విధంగా జరుగుతోందని’’ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సంచలన ఆరోపణలు చేశారు. -
‘చంద్రబాబు.. నీ హయాంలో పేదలకు అర సెంటు స్థలమైనా ఇచ్చావా?’
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు ఉచితంగా సెంటు స్థలం ఇస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. చంద్రబాబు.. నీ హయాంలో పేదలకు అరసెంటు స్థలమైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలమంటే చంద్రబాబుకు ఎందుకంత చులకని అని ఆర్. కృష్ణయ్య నిలదీశారు. ప్రతీ పేదవాడి కల సెంటు స్థలం సాధించుకోవటమని ఆయన స్పష్టం చేశారు. -
బీసీ కుల గణనకు వైఎస్ జగన్ సర్కార్ జై
సాక్షి, అమరావతి : కుల గణన చేపట్టాలన్న బీసీ సంఘాల న్యాయమైన డిమాండ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైకొట్టింది. వెనుకబడిన వర్గాల ఆశల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. వీరి న్యాయమైన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సీఎం వారికి నైతిక మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ తాజా నిర్ణయంపట్ల బీసీ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు.. దేశవ్యాప్త జనాభా లెక్కల సేకరణలో బీసీ కులం కాలమ్ చేర్చి కుల గణన చేపట్టాలంటూ కేంద్రాన్ని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది. పైగా ఇప్పుడు రాష్ట్ర పరిధిలో కుల గణనకు సన్నద్ధమైంది. దీనిపై అధ్యయనానికి రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం వెల్లడించారు. త్వరలో మంత్రి వేణు నేతృత్వంలో కమిటీని కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే బీసీ కుల గణనకు ముందుకొచ్చిన బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం రాష్ట్రంలో బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుంది. తద్వారా జనాభా లెక్కల సేకరణలో కులం కాలమ్ చేర్పి కుల గణన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కుల జనగణనతో ఎంతో మేలు.. నిజానికి.. దేశ జనాభాలో 52శాతం కంటే అధికంగా ఉన్న ఓబీసీల లెక్కలు తేలాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. ప్రస్తుతం కొన్ని బీజేపీ మిత్రపక్షాలతో సహా అనేక రాజకీయ పార్టీలు ఓబీసీ జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీని సైతం ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానం ప్రకారం కులాల వారీగా జనాభా గణనను చేపట్టలేమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పలుమార్లు ప్రకటించింది. కులాల వారీ లెక్కలు తేలితే జనాభా ప్రాతిపదికన (దామాషా ప్రకారం) వారికి నిధులు, విద్య, ఉద్యోగం, పదవులు రిజర్వేషన్ ప్రకారం దక్కుతాయని, తద్వారా ఆయా కులాలకు ఎంతో మేలు జరుగుతుందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. నామి¯óట్ పదవులు, బడ్జెట్ కేటాయింపులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సైతం జనాభా వారీగా అందించి సామాజిక న్యాయం చేయవచ్చన్నది వాటి వాదన. 20 ఏళ్లుగా ఉద్యమాలు.. సీఎంకు కృతజ్ఞతలు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కలు–2022లో కులం కాలమ్ ఏర్పాటుచేసి బీసీ జనాభా లెక్కలు తేల్చాలని ఇటీవల జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాం. కోవిడ్‌తో ఇప్పటికే ఆలస్యమైన జనాభా లెక్కల సేకరణ ఈ ఏడాది చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో ‘హలో బీసీ.. చలో ఢిల్లీ’ అంటూ అనేక సంఘాలతో కలిసి ఢిల్లీలో ధర్నాలు చేశాం. 20 ఏళ్లుగా చేస్తున్న ఈ డిమాండ్‌ను ఏ జాతీయ పార్టీ పట్టించుకోలేదు. కానీ, ఏపీలో చేపట్టేందుకు నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. – ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఇది చరిత్రాత్మకం అవుతుంది కులాల వారీ జనాభా గణన చరిత్రాత్మకం అవుతుంది. అది ఓబీసీల్లోని పేదలకు వరంగా మారుతుంది. ఓబీసీ జనాభాను లెక్కించడంవల్ల ప్రభుత్వ పథకాలను ఇంకా సమర్థంగా అమలుచేయవచ్చు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీసీ బాధలను అర్థం చేసుకుని రాష్ట్రంలో కుల గణనకు సీఎం వైఎస్ జగన్ ముందుకురావడం అభినందనీయం. దీని ద్వారా తాను బీసీల పక్షపాతినని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. – కేశన శంకరరావు, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం -
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య శుక్రవారం భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు చర్చించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వినతించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని అమిత్‌షా అన్నారు. క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని, జాతీయ జనగణనలో బీసీ కులగణన చేయాలని ఆర్.కృష్ణయ్య కోరారు. భేటీ అనంతరం ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ దేశంలో 2,640 బీసీ కులాలున్నాయి. కుల, చేతి, సేవా వృత్తులు పోయాయి. యంత్రాలు, పరిశ్రమలు, గ్లోబలైజేషన్, ఇండస్ట్రీయలైజేషన్‌తో పెనుమార్పులు సంభవించాయన్నారు. చదవండి: Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
బీసీలకు 11 ఎమ్మెల్సీ స్థానాలివ్వడం రికార్డే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 స్థానాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు కేటాయించటం దేశ చరిత్రలో ఓ రికార్డు అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ... బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్న నేతగా సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. శాసన మండలి స్థానాల్లో మూడు లేదా నాలుగు స్ధానాలు బీసీలకు ఇస్తారని భావించానని, కానీ జగన్ ఏకంగా 11 స్ధానాలివ్వడంతో ఆశ్చర్యపోయనని చెప్పారు. గత ప్రభుత్వం అతి తక్కువ స్థానాలు బీసీలకు ఇచ్చి, వారిది బీసీల ప్రభుత్వమని, బీసీలను ఉద్దరిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునేవారన్నారు. ఇప్పడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్లమెంట్ సభ్యుల నుంచి మంత్రులు, ఎంపీటీసీల వరకు బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యం దేశంలో మరే రాష్ట్రంలో కనిపించదని తెలిపారు. అందుకే బీసీలంతా వైఎస్ జగన్ సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ‘2014 –19 మధ్య టీడీపీ శాసన మండలికి 48 మందిని పంపితే.. అందులో ఓసీలు 30 మంది ఉండగా, బీసీలు 12 మంది మాత్రమే. ఓసీలకు ఏకంగా 62.5 శాతం పదవులివ్వగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన పదవులు కేవలం 37.5 శాతమే. టీడీపీ వంచనకు ఇదే నిదర్శనం. దీనికి భిన్నంగా సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 68.18 శాతం పదవులివ్వడం ఈ వర్గాల సాధికారత పట్ల ఆయన చిత్తశుద్ధిని నిరూపిస్తోంది. చంద్రబాబు, సీఎం జగన్ మధ్య ఆ తేడాను అందరూ గుర్తించాలి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి ముందే బీసీ అధ్యయన కమిటీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం కమిటీలు వేశారు. వాటి సిఫార్సులకు అనుగుణంగా బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్‌బోన్ క్లాస్‌గా సీఎం జగన్ గుర్తించారు. కాబట్టే ఆ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. పదవులన్నిటిలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చారు. కులాలను చీల్చే విధంగా కాకుండా స్ఫూర్తిదాయక విధానాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సాధికారత కల్పిస్తున్నారు. సీఎం జగన్ సాధికారతకు సిసలైన నిర్వచనం ఇచ్చారు’ అని కృష్ణయ్య చెప్పారు. -
బీసీ సంక్షేమ బడ్జెట్ పెంచాలి
పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేటాయించిన రూ.6,229 కోట్లు ఏమాత్రం సరిపోవని, దాన్ని రూ.20 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వందలాది మంది విద్యార్థులు, యువకులతో కలిసి గురువారం ఖైరతాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖమంత్రి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్‌ల నాయకత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.2.9 లక్షల కోట్లు అయితే.. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయిస్తే ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. బడ్జెట్లో కొత్త పథకాలేవీ లేవని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపకార వేతనాలు, మెస్‌చార్జీల పెంపు ప్రస్తావనే లేదని, కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీకి బడ్జెట్ కేటాయింపుల్లేవని విమర్శించారు. ఈ విద్యా సంవత్సరంలో 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తా మన్న హామీకి బడ్జెట్ లేదని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్యార్థుల మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలి
విజయనగర్ కాలనీ: పెరిగిన ధరల ప్రకారం రాష్ట్రంలోని 8 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడంతో పాటు 16 లక్షల కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అంజి, నీల వెంకటేశ్, రామకృష్ణ నాయకత్వంలో మాసాబ్‌ట్యాంక్ బీసీ సంక్షేమ భవన్‌ను వేలాది మంది విద్యార్థులతో కలిసి ముట్టడించారు. ముట్టడిలో పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ ఆరేళ్ల కిందటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, ఇటీవల పెరిగిన నిత్యావసర ధరల నూనెలు, పప్పులు, కూరగాయలు తదితర ఆహార వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. హోటల్లో ఒక్క పూట భోజనం కనీసం రూ.60 ఉందని, హాస్టల్ విద్యార్థులకు పూటకు రూ.10 ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలకు నెలకు రూ.2,100 ఇస్తూ, హాస్టల్ విద్యార్థులకు రూ.950 ఇవ్వడంలో ఏమైనా న్యాయం ఉందా? అని ప్రశ్నించారు. 2013 వరకు కోర్సు ఫీజులు మంజూరు చేశారని, 2014 నుంచి ప్రభుత్వం పూర్తి ఫీజు స్కీమ్‌కు పరిమితులు విధిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తోందన్నారు. కార్యక్రమంలో తిరుపతి, అనిల్, అనంతయ్యలతో పాటు వేలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. -
బీసీ సంక్షేమానికి రూ. 2 వేల కోట్లేనా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వార్షిక బడ్జెట్.. బీసీలను తీవ్రంగా అవమానపరిచిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ భవన్లో ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభాలో 56% ఉన్న బీసీల సంక్షేమానికి కేవలం రూ.2వేల కోట్లు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీసీల సంక్షేమానికి కేంద్రం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని, రూ.45వేల కోట్లతో రూపొందించిన బడ్జెట్లో బీసీలకు కనీసం 0.1 శాతం కూడా కేటాయించలేదన్నారు. బడ్జెట్ సవరణ చేపట్టి బీసీలకు కనీసం రూ.2లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్నట్లు బీసీలకు కూడా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలు చేయాలని కోరారు. 80శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చి బీసీ వసతిగృహాలను కేంద్రమే నిర్మించాలని, రూ.50 వేల కోట్లతో జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా 80శాతం బీసీ విద్యార్థులకు విద్యారుణాలు ఇవ్వాలని కోరారు. -
ఆ కేటాయింపులతో బీసీలకు బిస్కెట్లు కూడా రావు
కాచిగూడ(హైదరాబాద్): కేంద్రం ప్రవేశపెట్టిన రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించి తీరని అన్యాయం చేసిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య విమర్మించారు. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు జబ్బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.2 వేల కోట్లతో దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు పంచడానికి బిస్కెట్లు, చాక్లెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా దానిని సవరించి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల ఎంత వ్యతిరేకంగా ఉందో బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతోందని, బీసీ వ్యతిరేక వైఖరిని బీజేపీ విడనాడకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జాతీయ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ, ఆర్థికపరమైన స్కీములను ప్రకటించడంలేదన్నారు. సమావేశంలో నీల వెంకటేశ్, గుజ్జ సత్యం, కోల జనార్దన్, భూపేష్ సాగర్, రాజ్‌కుమార్, సుధాకర్, నంద గోపాల్, వేముల రామకృష్ణ, బి.కృష్ణ, శివమ్మ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు పెద్దపీట వేసింది వైఎస్ జగనే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, అమరావతి: లోకేశ్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు బీసీ రిజర్వేషన్లపై కనీస అవగాహన లేదనే విషయం అర్థమవుతోందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టంచేశారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు 34 శాతానికి పెంచారని, సీఎం వైఎస్ జగన్ తగ్గించారంటూ లోకేశ్ పచ్చి అబద్ధాలు చెప్పడాన్ని జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ విషయమై ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వాస్తవంగా బీసీలకు చంద్రబాబు అన్యాయం చేస్తే సీఎం వైఎస్ జగన్ న్యాయం చేశారని వివరించారు. ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థలకు ఎన్నికలే జరపని చంద్రబాబు.. బీసీలకు 34% రిజర్వేషన్లు ఎలా అమలు చేశారని లోకేశ్‌ను ప్రశ్నించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లకు మించి పార్టీ పరంగా అవకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. 25 మంది ఉండే మంత్రివర్గంలో సైతం ఏకంగా 11 మంది బీసీలకు అవకాశం కల్పించారన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టులు, పనుల్లోనూ 50 శాతంపైగా బీసీలకు కట్టబెట్టారని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని, దమ్మున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని న్పష్టం చేశారు. -
మహిళా సాధికారతపై గుణాత్మక చర్చ జరగాలి
అంబర్‌పేట (హైదరాబాద్): మహిళా సాధికారతపై దేశవ్యాప్తంగా గుణాత్మక చర్చ జరగాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. గురువారం అంబర్‌పేట జైస్వాల్ గార్డెన్లో బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్ల కిందట పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవే పెట్టి అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా ఉంటేనే వారి జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని తెలిపారు. సమావేశంలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శారదగౌడ్ మాట్లాడుతూ అవకాశం వస్తే రాబోయే ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలి
విజయనగర్ కాలనీ: రాష్ట్రంలోని 8 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్, గురుకుల పాఠశాలలు, కళాశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను పెరిగిన ధరల ప్రకారం పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్షిప్లను పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్, జి.అంజిల ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్ బీసీ సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం నాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్‌ఛార్జీలు, స్కాల్‌షిప్‌లను నేడు పెరిగిన నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరల మేరకు పెంచాలన్నారు. ఉద్యోగుల జీతాలు రెండుసార్లు పెంచారని మంత్రులు, శాసన సభ్యుల జీతాలు మూడురేట్లు, వృద్ధాప్య పెన్షన్లు ఐదురేట్లు పెంచిన ప్రభుత్వం విద్యార్థుల స్కాల్‌షిప్‌లు, మెస్‌ఛార్జీలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్‌ఛార్జీలను నెలకు రూ.1500 నుంచి రూ.3 వేలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్‌ఛార్జీలను రూ.950 నుంచి రూ.2 వేలకు పెంచడంతో పాటు గత రెండేళ్లుగా చెల్లించాల్సిన ఫీజు బకాయిలు రూ.3500 కోట్లను వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం అందించారు. జాతీయ నాయకులు గుజ్జకృష్ణ, పి.సుధాకర్, సి.రాజేందర్, గుజ్జ సత్యం, అనంతయ్య, పి.రాజ్‌కుమార్, నిఖిల్, భాస్కర్ పాల్గొన్నారు. -
16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి
కాచిగూడ: కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8, 9 తేదీల్లో పార్లమెంటు వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఈబీసీ సంక్షేమ సంఘం ఏపీ చైర్మన్ చెన్నకృష్ణారెడ్డి, కృష్ణ, వెంకటేశ్, అంజి, రాజేందర్, అనంతయ్య పాల్గొన్నారు. -
పెరిగిన ధరల మేరకు స్కాలర్షిప్ ఇవ్వాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం (హైదరాబాద్): పెరిగిన ధరల మేరకు విద్యార్థులకు ఇచ్చే ఉప కారవేతనాలను కూడా పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు రెండేళ్లుగా బకాయి ఉన్న రూ.3,500 కోట్ల ఫీజులను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలో 16 బీసీ సంఘాలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్ రూ.1,800 నుంచి రూ. 5,000కు, కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,500 నుంచి 1,800కు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2,000లకు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీబంధు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. జూనియర్ అడ్వొకేట్లకు స్టైపెండ్‌ను రూ.10 వేలకు పెంచాలన్నారు. -
జనాభా ప్రాతిపదికన అవకాశాలివ్వాలి: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో అవకాశాలు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గురువారం బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గడిచిన 75 ఏళ్లలో ఏ రంగంలోనూ బీసీలకు కనీస వాటా కూడా లభించలేదని విమర్శించారు. ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకు అన్ని రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇచ్చారని, రాజకీయ రంగంలో బీసీలకు 50 శాతం వాటాను అన్ని స్థాయిల్లో కల్పించారన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కులగణన చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని కోరారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జకృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి నరసింహగౌడ్, బీసీ వి ద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ఉండాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని, నూతన పార్లమెంట్‌కు ఆయన పేరు పెట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని పరశురామ్ చేస్తున్న ఉద్యమం చాలా గొప్పది కాబట్టి.. ఈ అంశంపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం, అంబేడ్కర్‌పై అభిమానం ఉంటే పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టి అమలు చేయాలని.. లేని పక్షంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ పాల్గొన్నారు. -
దొడ్డిదారిన పోస్టులు అమ్ముకుంటున్న అధికారులు
కాచిగూడ (హైదరాబాద్): తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయకుండా కొంతమంది ఉద్యోగులు దొడ్డిదారిన తాత్కాలికంగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ, పదోన్నతులు కల్పిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాచిగూడలో శనివారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణతో పాటు ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. గ్రూప్ –4 ద్వారా 9,164 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ వేశారని, పోస్టులను 25వేలకు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూపు –3 ద్వారా ప్రకటించిన 1,300 పోస్టులను 8వేలకు పెంచాలని కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఖాళీల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
‘పోలీస్’ పరీక్షలో 7 మార్కులు కలపడంపై హర్షం
ముషీరాబాద్ (హైదరాబాద్): ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులకు 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ఇది పోలీస్ కానిస్టేబుళ్ల, ఎస్సై అభ్యర్థుల పోరాట ఫలితమేనని స్పష్టంచేశారు. మల్టిపుల్లోని 7 తప్పుడు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని హైకోర్టు జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో పలు కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు విద్యానగర్‌లోని బీసీ భవన్ వద్ద సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 6 లక్షల మంది రాసిన ఈ పరీక్షలో కేవలం 1,84,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని, 4 లక్షల మందికి పైగా అర్హత సాధించలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, మాసం ప్రదీప్, రాజ్‌కుమార్, నీలం వెంకటేశ్, చందన, రాజా, సునీత, దివ్య, రాజమల్లేశ్, శివ, కల్యాణ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టిన ఘనత సీఎం జగన్ ది : ఆర్ కృష్ణయ్య
-
ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం: ఆర్.కృష్ణయ్య
పంజగుట్ట (హైదరాబాద్): వచ్చే బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు రూ.5,500 నుంచి రూ.20 వేలకు పెంచాలని, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు. సోమ వారం బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఒక్కో విద్యార్థికి రూ.20 వేల స్కాలర్షిప్, పాఠశాల విద్యార్థులకు రూ.15 వేలు, మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారని తెలిపారు. లోటుబడ్జెట్లో ఉన్న రాష్ట్రమే ఇస్తుండగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం. ఎనిమిదేళ్లుగా 5.70 లక్షల మంది బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒక్కరికీ మంజూరు చేయలేదు’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, విద్యార్థి నాయకుడు జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు. -
మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలి
కవాడిగూడ: నాణ్యమైన భోజ నం లేక హాస్టల్ విద్యార్థులు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఐదేళ్ల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగానే మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద ఆదివారం నిర్వహించిన మహాధర్నాలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 లక్షలమంది హాస్టల్ విద్యార్థులకు తక్షణమే మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాలేజీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు రూ.1500 నుంచి 3000 వరకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా దామాషా ప్రకారం మరో 240 గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, రాజ్‌కుమార్, సతీష్, అనంతయ్య, నిఖిల్, భాస్కర్, ప్రజాపతి మల్లేష్, సందీప్, వంశీ, వందలాదిమంది గురుకుల హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి
గన్‌ఫౌండ్రీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖమంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ తాత్కాలిక ఉపాధ్యాయుల ద్వారా కాకుండా శాశ్వత ఉపాధ్యాయుల భర్తీలను చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. త్వరలో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపడతామని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం: ఆర్. కృష్ణయ్య
చైతన్యపురి: ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉన్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏ సీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగ గర్జన సమావేశంలో ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తెలంగాణలో 44 వేల ఉపాధ్యాయ పోస్టులు, కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యం కావటంతో లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలు అగమ్యగోచరంగా మారాయని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
బీసీల బడ్జెట్ రూ.20 వేల కోట్లకు పెంచాలి
ముషీరాబాద్ (హైదరాబాద్): అసెంబ్లీలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేటాయించే మొత్తాన్ని రూ.20 వేల కోట్లకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో బీసీకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. సోమవారం విద్యానగర్ లోని బీసీ భవన్లో 15 బీసీ సంఘాల సమా వేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజ రైన కృష్ణయ్య మాట్లాడుతూ, ఈ డిమాండ్లపై ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ను కలసి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బీసీ బిల్లుపై బీజేపీ విధానం ప్రకటించాలి
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయమై బీజేపీ తన విధానాన్ని ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం చట్టసభలతోపాటు విద్యా, ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థలు, కేంద్రస్థాయిలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జా తీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నేతలు ఆళ్ల రామకృష్ణ, వెంకన్న గౌడ్, మెట్ట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీల మహాధర్నా చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోదీపైనే బీసీల ఆశలు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50 శాతాన్ని సుప్రీంకోర్టు తొలగించడంతో ఎలాంటి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేనందున బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. బీసీల సమస్యల పరిష్కారం విషయంలో బీసీలంతా ప్రధాని నరేంద్ర మోదీపైనే ఆశలు పెట్టుకున్నారని, మోదీ హయాంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టకపోతే చరిత్ర క్షమించబోదని అన్నారు. లోక్‌సభలో ఉన్న 94 మంది బీసీ ఎంపీలు పార్టీలకతీతంగా బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బీసీ ఎంపీలకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. వచ్చే జనగణనలో తప్పనిసరిగా కులాలవారీగా బీసీ జనాభా గణన చేయాలని కోరారు. పులులు తదితర జంతువుల లెక్కలు తీస్తున్న ప్రభుత్వం బీసీ జనగణనకు మాత్రం అభ్యంతరాలు చెప్పడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా బీసీలు బీజేపీపై తిరగబడతారని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న క్రిమీలేయర్‌ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కృష్ణయ్య కోరారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. -
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఊరుకోం..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 29 రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి బిజ్లీ క్రాంతి యాత్ర పేరుతో ఢిల్లీ చేరుకున్న వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు బుధవారం జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగులు నినాదాలిచ్చారు. ఈ భారీ ధర్నాకు వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, సీపీఎం ఎంపీ ఎలమరం కరీం, సీపీఐ నేత డి.రాజా, సహా వివిధ పార్టీల నాయకులు, ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాల నేతలు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే 28 లక్షల మంది ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తారని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేస్తే భవిష్యత్తులో రైతులకు ఉచిత కరెంట్ లభించదని, ఒక్కో రైతు ప్రతి వ్యవసాయ పంపు సెట్టుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు చార్జీలు కట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రైవేటీకరణతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉండదని, దీంతో 25 లక్షల మంది ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం పొంచిఉందని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించొద్దని తీర్మానాలు చేశాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్‌పరం చేసిందని.. ఇంకా చేయాలని చూస్తే ప్రజలు ఎదురు తిరుగుతారని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. పార్లమెంటులో విద్యుత్ ఉద్యోగుల సమస్యపై కేంద్రంతో పోరాడతామని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌ను పెంచాలి బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, చంద్రశేఖర్, మోక్షిత్ తదితరులు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు. దేశమంతా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలు అమలు చేయాలని ఆర్.కృష్ణయ్య కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు కేంద్ర బడ్జెట్లో కేవలం రూ.1,400 కోట్లు కేటాయించి 56 శాతం జనాభాను అవమానించారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
‘దేశంలోనే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం ఏపీ’
సాక్షి, ఏలూరు: దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు ఇంకా లభించలేదు. 45 ఏళ్ల పోరాటం ఫలితంగా విద్యాహక్కు సాధించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. కాగా, కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో 30 లక్షల మంది బీసీ విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. బీసీలకు కూడా జనాభా ప్రకారం 56 శాతం రిజర్వేషన్‌కు పెంచాలి. దేశంలో 16 రాష్ట్రాల నుండి కనీసం ఒక్క ఎంపీ కూడా లేదు. బీసీల బిల్లు ఆమోదానికి దేశంలో అన్ని పార్టీలు పార్లమెంట్లో మద్దతివ్వాలి. బీసీలు భరత మాత ముద్దు బిడ్డలు. జనాభా ప్రాతపదికన మా వాట మాకు కావాలి. ఈ నెల 24 ఛలో ఢిల్లీకి పిలుపునిస్తున్నాము. దేశంలోనే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం ఏపీనే. దేశంలో ఎక్కడా లేని పథకాలు బీసీలకు ఇచ్చారు . మంత్రి పదవులు ఇచ్చారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బీసీలను ఓటర్లుగా చూస్తే.. సీఎం వైఎస్ జగన్ సొంత మనుషుల్లా చూశారు అంటూ కామెంట్స్ చేశారు. -
24న చలో ఢిల్లీ.. పార్లమెంట్ ముట్టడి
కాచిగూడ: దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న బీసీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24వ తేదీన చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని వేలాదిమందితో నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన శనివారం కాచిగూ డలో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లా డారు. చట్ట సభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ రెండేళ్ల కితమే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిందని ఈ బిల్లుకు మద్దతుగా 14 పార్టీలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. కానీ బీజేపీ మద్దతు ఇవ్వకపోవడంతో బిల్లు పాస్ కాలేదన్నారు. బీసీలంతా తమ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోదీపై ఆశలు పెట్టుకున్నారని, ఆయన హయాంలో బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. కార్యక్రమంలో నీలం వెంకటేష్, సి.రాజేందర్, అంగిరేకుల వరప్రసాద్, అనంతయ్య, రాజ్‌కుమార్, నిఖిల్, రాజు పాల్గొన్నారు. -
కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో కోసం పోరాడతా: ఆర్.కృష్ణయ్య
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని కోరుతూ పార్లమెంటులో పోరాటం చేస్తానని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. కరెన్సీపై ఇప్పటికే అనేకమంది ఫొటోలను ముద్రించారని ఆర్బీఐ వ్యవస్థాపకుడైన అంబేడ్కర్ ఫొటోను మాత్రం ఎందుకు ముద్రించడంలేదని ప్రశ్నించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ‘కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి’ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమా వేశంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బల హీన వర్గాలకు రిజర్వేషన్లు అందించిన మహానీ యుడు అంబేడ్కర్ అని, కరడుగట్టిన వ్యవస్థపై పోరాడి మనకు హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి ఫొటోను కరెన్సీపై ముద్రిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఆయన ఫొటో ముద్రించాలనే ఆలోచన పాలకులకు లేకపోవడం దుర్మార్గమన్నారు. అంబేడ్కర్ అందరి వాడని ఆయనను ఒక్క కులానికే పరిమితం చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, పోకల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలు పోరుబాట పట్టాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య
కీసర: రాజ్యాధికారం కోసం బీసీలు పోరుబాట పట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కీసర మండలంలోని రాంపల్లి పూలపల్లి బాలయ్య ఫంక్షన్హాల్లో మంగళవారం జరిగిన కురుమల రాష్ట్ర స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ ఉమతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే రాజకీయాల్లో బీసీలకు ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యం నేడు ధనస్వామ్యంగా మారిందని, ఎన్నికల్లో ధనమే కీలకమైందని తెలిపారు. బీసీలు విద్యావంతులు కావాలంటే.. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో కురుమ యువజన నాయకుడు శ్రీకాంత్, ఆలేరు కాంగ్రెస్ ఇన్చార్జ్ బీర్ల అయిలయ్య, కార్పొరేటర్ కృష్ణ పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టులో మరోసారి సవాల్ చేస్తాం
ముషీరాబాద్ (హైదరాబాద్): ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మెజార్టీ తీర్పు విచారకరమని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో మరోసారి రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించారు. 15 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపాలన్నారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...అగ్ర కులాల్లోని పేదలకు ఆర్థిక పరమైన స్కీములు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదని, ఆర్థిక అభివృద్ధి పథకం అంతకంటే కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి తమతమ జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, అధికార పదవులలో వాటా ఇవ్వాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధమని ఇది రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. -
పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్ ఇవ్వాలి
ముషీరాబాద్: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్ రేట్లు పెంచాలని, చదివే విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు రూ.5500 నుంచి 20 వేలకు పెంచాలని, కోర్సుల్లో చదివే విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, ఫీజుల బకాయిలు రూ.3300 కోట్లు చెల్లించాలని నవంబర్ 10న కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్వో కార్యాలయాల వరకు ర్యాలీలు జరపాలని 14 బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం బీసీ భవన్లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశానికి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హజరై మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్షిప్లు 5 సంవత్సరాల క్రితం నిర్ణయించారని ఆంధ్రప్రదేశ్‌లో రూ. 20 వేలు స్కాలర్షిప్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో కేవలం రూ.5500 మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలన్నారు. 2007లో ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మొత్తం ఫీజులు మంజూరు చేస్తే ప్రభుత్వానికి అదనంగా 150 కోట్లు మాత్రమే భారం పడుతుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ దిక్కులేని శాఖగా మారిందని ఈ శాఖకు కమీషనర్, ఎండీ లేరన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, నీలం వెంకటేష్ పాల్గొన్నారు. -
బీసీల రిజర్వేషన్లు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా ప్రకారం బీసీలకు స్థానిక సంస్థలలో, విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, బీసీ నేతలు మెట్ట చంద్రశేఖర్, మోక్షిత్లు ఢిల్లీలో కేంద్ర కార్మిక, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి చర్చలు జరిపారు. అనంతరం తెలంగాణ భవన్లో కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు సంబంధించిన 15 అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించామని తెలిపారు. విద్యా, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలని కోరినట్టు తెలిపారు. -
కార్పొరేటర్లకు రుణమాఫీ కాదు.. బీసీలకు ఆర్థిక చేయుత అందించాలి
-
అందుకోసమే సీఎం జగన్ నాకు ఎంపీ పదవి ఇచ్చారు: ఆర్ కృష్ణయ్య
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ సమస్యలపై గళమెత్తుతానని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీ సమస్యలపై పోరాటానికే సీఎం జగన్ తనకు ఎంపీ పదవి ఇచ్చారని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లు వివరించారు. దేశంలో బీసీ రిజర్వేషన్లు 18 నుంచి 22 శాతం మాత్రమే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు సైతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేస్తూ బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 'రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును పాస్ చేయాలి. బీసీ కులాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పది లక్షల నుంచి 20లక్షలు ఇవ్వాలి. కార్పొరేట్లకు రుణమాఫీ కాదు, బీసీలకు ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇవ్వాలి. బీసీలకు చారిత్రక అన్యాయం జరిగింది' అని ఎంపీ ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. చదవండి: (ఆ ఇద్దరూ ఏ రకంగా పోటీనో.. ఎవరికి పోటీనో చెప్పాలి: మాజీ మంత్రి వెల్లంపల్లి) -
జనగణనలో కులగణన చేపట్టాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే జనగణనలో కులగణన చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ కులాల జనాభా లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కృష్ణయ్య నేతృత్వంలో ఢిల్లీలో కిషన్‌రెడ్డిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, బీసీ నేతలు మెట్ట చంద్రశేఖర్, మోక్షిత్ తదితరులు కలిసి చర్చలు జరిపారు. బీసీలకు సంబంధించిన 15 ప్రధాన సమస్యలను వివరించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. కులగణన, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం సహా పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. బీసీ ఉద్యోగులకు ప్రమోన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసినట్టు కృష్ణయ్య తెలిపారు. -
విద్యార్థుల స్కాలర్ షిప్ రూ. 20 వేలకు పెంచాలి
ముషీరాబాద్: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్ షిప్‌లను రూ.5,500 నుంచి రూ. 20 వేలకు పెంచాలని, ఫీజు బకాయిలు రూ. 3,300 కోట్లు వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్లో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 10న కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తారని తెలిపారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రూ. 20 వేలు స్కాలర్ షిప్ ఇస్తుంటే తెలంగాణలో కేవలం రూ. 5,500 మాత్రమే ఇస్తున్నారని ప్రస్తుత అవసరాలకు రూ. 20 వేలకు పెంచాలని కోరారు. కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.1,500 నుంచి రూ. 3 వేలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2 వేలకు పెంచాలన్నారు. బీసీలకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బీసీ గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలని కృష్ణయ్య కోరారు. -
27న విజయవాడలో బీసీ ఆత్మగౌరవ సభ
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): ఈ నెల 27న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హైదరాబాద్‌లో నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీ ఆత్మగౌరవ సభ పోస్టర్‌ను కృష్ణయ్య విడుదల చేశారు. ఈ సమావేశ వివరాలను ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఎన్.మారేష్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సన్మానించి బీసీల సత్తా చాటేలా ఆత్మగౌరవ సభను నిర్వహించాలని కృష్ణయ్య సూచించారని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలంతా ఏకమై పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏపీ బీసీ సంఘ మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి పాల్గొన్నారు. అనంతరం బీసీ సంఘ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా మల్లి అప్పారావు, ఉత్తరాంధ్ర కన్వీనర్‌గా సనపాల లక్ష్మీనరసింహ, ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా అనిల్‌కుమార్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా వెంకటాచార్యులు, రాష్ట్ర కన్వీనర్‌గా తన్నీరు సుబ్బారావు, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాధవికి కృష్ణయ్య నియామకపత్రాలు అందించారు. -
అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన సీఎం జగన్
వనస్థలిపురం (హైదరాబాద్): అన్ని వర్గాలకు సమ న్యాయం, బీసీలకు 50 శాతానికి పైగా పద వులు, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిన ఘనత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభసభ్యుడు ఆర్.కృష్ణ య్య అన్నారు. శుక్రవారం వనస్థలిపురం సుభద్రానగర్‌లో శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత పూజలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లవుతున్నా బీసీల్లో ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదన్నారు. బీసీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిరీ్వర్యం చేశారని, దానికి ఎండీ గానీ, సిబ్బంది గానీ లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌కు నిధులు ఇస్తా మని చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ష్యూరిటీ ఇవ్వడం లేదని ఆరోపించారు. చదవండి: కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో -
గొర్రెలొద్దు.. డబ్బులు కావాలి
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పథకం కింద తమకు గొర్రెలు వద్దని, నగదు బదిలీ చేస్తే లబ్ధిదారుడికి అనుకూలంగా ఉన్న చోట గొర్రెలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చావేదికలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్ అధ్యక్షతన జరిగిన చర్చా వేదికలో నగదు బదిలీ తీర్మానాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై పలువురు మాట్లాడిన అనంతరం చర్చా వేదిక ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చర్చా వేదికలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకందారులకు 1లక్ష 75 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచాలని, ఈ పథకం కింద నగద బదిలీ చేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ పథకం అమలులో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఇకనైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఉపాధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య -
పేదలంతా కళ్యాణమస్తు వినియోగించుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణమస్తు పథకాన్ని పేదలంతా వినియోగించుకోవాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. బీసీల కోసం సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీల కోసం ఈ తరహా పథకం అమలు చేసిన ఏకైక సీఎంగా వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాగే బీసీల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టించారని ప్రశంసించారు. పార్లమెంట్లో బీసీ బిల్లుకు ఆమోదం పొందడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ సీఎం జగన్ లాగా నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. బీసీల పార్టీలుగా చెప్పుకుంటున్న డీఎంకే, జనతాదళ్, ఎస్పీ ఎప్పుడూ బీసీల కోసం ఇలా చేయలేదన్నారు. నామినేటె?డ్ పోస్టుల్లో 50 శాతం వెనుకబడిన తరగతులకు కేటాయించడం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్దతు సీఎం జగన్‌కేనన్నారు. ఈ వర్గాల ప్రజలు సీఎంను ఆరాధిస్తున్నారన్నారు. పేదల సర్వతోముఖాభివృద్ధికి, వికాసానికి సీఎం జగన్ ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లోనూ, అధికారంలోనూ బీసీలకు వాటా ఇచ్చిన చరిత్ర ఒక్క సీఎం జగన్‌కే దక్కిందన్నారు. వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాల్లోనే కాకుండా జిల్లా పరిషత్ చైర్మన్లుగా బలహీన వర్గాలకు అవకాశాలు ఇచ్చారని కొనియాడారు. -
గురుకుల సంక్షేమ హాస్టళ్లలో మరణాలు అరికట్టాలి
కాచిగూడ (హైదరాబాద్): గురుకుల హాస్టళ్లు, పాఠశాలల్లో పిల్లల మరణాలను అరికట్టాలని, మెస్ చార్జీలు పెంచాలని, సౌకర్యాలను మెరుగుపర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరపాలని ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురై చనిపోతున్నారని, విషజ్వరాలు, అనారోగ్యం ఒకవైపు, నాసిరకం ఆహారంతో మరోవైపు విద్యార్థులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జోక్యం చేసుకుని ఉన్నతస్థాయి కమిటీ వేసి హాస్టళ్లు, గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థుల కాస్మెటిక్ చార్జీలను బాలురకు నెలకు రూ.62 నుంచి రూ.300 లకు, బాలికలకు రూ.75 నుంచి రూ.400 వరకు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
స్కాలర్షిప్లు పెంచకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో విద్యార్ధులకు స్కాలర్షిప్లు పెంచకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు స్కాలర్షిప్ రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. పేద విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీసీ గురుకులాలకు ఒక ఐఏఎస్‌ను నియమించకపోవటం బాధాకరమన్నారు. తెలంగాణలో బీసీ సంక్షేమశాఖ నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 240 బీసీ హాస్టళ్లు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయని, వాటికి సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో విద్యకోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీ విద్యార్థికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
అమరుల ఆశయాలకు మరో ఉద్యమం
సుందరయ్య విజ్ఞానకేంద్రం/కాచిగూడ (హైదరాబాద్): తెలంగాణ ఉద్యమంలో ప్రజలు దేనికోసం అమరులయ్యారో ఆ అమరుల ఆశయాల సాధనకోసం మరోసారి ఉద్యమాలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ నేడు నిరుద్యోగుల ఆకాంక్షలు కూడా నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి పార్లమెంట్లో చర్చిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం చైతన్యవంతంగా పని చేసిన సంఘాలు తెలంగాణ వచ్చాక రద్దయ్యాయని విమర్శించారు. ఉద్యమకారుల కుటుంబాలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అనేక మంది ఉద్యమకారుల బలిదానం వల్లనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ఉద్యమకారులను అనాథలను చేయటంలో అన్ని పార్టీలు ముందున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కాచం సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనంతరం పలువురు ఉద్యమకారులను సత్కరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు దిలీప్‌కుమార్, రాములు నాయక్, వేముల మారయ్య, సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న బీసీల డిమాండ్లను సాధించే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న సమయంలో దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదిరోజులుగా వేలాది మందితో ఢిల్లీలో పార్లమెంట్ వద్ద ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో జనాభా ప్రకారం సమాన వాటా ఇవ్వాలని కోరారు. త్వరలో జరిగే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కృష్ణయ్య భేటీ
కాచిగూడ (హైదరాబాద్): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ఆహ్వానం మేరకు శుక్రవారం ఆయనను న్యూఢిల్లీలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువ్యక్తి ఉండటం తెలుగు జాతికి గర్వకారణమని ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, మోక్షిత్ తదితరులున్నారు. -
ఉద్రిక్తంగా మారిన బీసీల మహాధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ బీసీల మహాధర్నాతో రెండోరోజు ఉద్రిక్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణల నేతృత్వంలో చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో బీసీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. మహాధర్నాలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రసంగించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయిలో 54 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే, అందులో బీసీ ఉద్యోగులు 4.62 లక్షలు మాత్రమే ఉన్నారని తెలిపారు. దేశంలో బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ప్రదర్శనలో కోల జనార్ధన్, కర్రి వేణు మాధవ్, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
9న చలో ఢిల్లీ–పార్లమెంట్ ముట్టడి
ముషీరాబాద్ (హైదరాబాద్): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, జన గణనలో కుల గణన చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశాకు చెందిన ముఖ్య బీసీ నాయకుల సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ కృష్ణ, తెలంగాణ బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు లాల్‌కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కృష్ణయ్య చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులను కలవడం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం లాంటి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఉన్న కుల గణన కేసును వేగవంతం చేయాలని కోరారు. కుల గణన జరపాలని 8 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. రెండు రాష్ట్రాలకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్‌ను స్తంభింపజేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రాజ్‌కుమార్, అనంతయ్య, రామకృష్ణ, ఉదయ్, చంటి, తరుణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు చేయాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వెనకబడిన వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే కేంద్రం తక్షణమే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నప్పుడు 75 కోట్ల జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ విషయమై త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీని కలిసి విన్నవిస్తామని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీలు ఆర్.కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణారావు, మార్గాని భరత్, బీశెట్టి సత్యవతి, డాక్టర్ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ మాట్లాడారు. ఎవరికీ అభ్యంతరంలేని విషయంపై అలక్ష్యం వద్దు ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ మండల్ కమిషన్ సిఫార్సులు, సంక్షేమ పథకాల అమలుకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ అవసరమని చెప్పారు. పలు రాష్ట్రాల్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ కేంద్రస్థాయిలో లేకపోవడం శోచనీయమన్నారు. ‘1992లోనే సుప్రీంకోర్టు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరాలు లేవు. ఇలాంటప్పుడు శాఖ ఏర్పాటుపై ఆలస్యం తగదు. దీనిపై పార్టీ తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. కేంద్రస్థాయి ఉద్యోగాల్లో, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరతాం..’ అని చెప్పారు. బీసీల అభ్యున్నతికి వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు, సామాజిక న్యాయం చేసేలా బీసీలకు రాజకీయ పదవుల్లో 50 శాతానికిపైగా కట్టబెట్టి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఆమోదం పొందేవరకు ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల్లో 50 శాతం పదవులు బీసీలకు ఇచ్చేలా చట్టం తెచ్చారన్నారు. మాటల్లో కాకుండా ఆచరణలో బీసీల సంక్షేమం కోసం ఏపీ సీఎం జగన్ కృషిచేస్తున్నారని, ఆయన కృషిని చూసి పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. జగన్ నిర్ణయాలు ఓటుబ్యాంకు రాజకీయాల్లా కాకుండా ఒక తత్వవేత్త, సిద్ధాంతవేత్త తీసుకున్నట్లు ఉంటున్నాయన్నారు. బీసీలకు కేంద్ర బడ్జెట్లో కనీసంగా రూ.లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కులగణన కోసం పోరాడతాం ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ బీసీలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు కోసం కృషిచేస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం మ్యాచింగ్ గ్రాంటు ద్వారా భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రస్థాయిలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. బీసీల కులగణన కోసం ప్రధానిని కోరతామని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని కోరారు. బీసీలకు అవరోధంగా ఉన్న క్రీమిలేయర్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ బీసీ నినాదాన్ని బలంగా మోస్తున్న ఎనిమిది ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కృషిచేస్తామని చెప్పారు. -
75కోట్ల మంది బీసీలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ లేకపోవడం అన్యాయం: ఎంపీ ఆర్. కృష్ణయ్య
-
9న చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి: కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, జనగణనలో కుల గణన చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో బీసీ సేన జాతీయ సమావేశం సేన జాతీ య అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్సార్ సీపీ పార్లమెంట్లో బిల్లు పెడితే అధికార బీజేపీ ఆమోదించకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు సాధన కోసం బీసీ ఎంపీలందరూ పార్లమెంట్లో డిమాండ్ చేయాలని కృష్ణయ్య కోరారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులపై క్రిమిలేయర్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బర్క కృష్ణయాదవ్ మాట్లాడుతూ బీసీల డిమాండ్లను ఆమోదించేంత వరకు ఢిల్లీలో పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు మాదప్ప, నాగరాజు, రాములుయాదవ్, అశోక్, అంజి తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీల్లో సమస్యలను పరిష్కరించాలి: కృష్ణయ్య
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు–మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల చదువు దెబ్బతినే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశారు. పూర్తిస్థాయి టీచర్లను నియమించే వరకు 16 వేల మంది విద్యా వాలంటీర్లను కొనసాగిస్తూ వారిని రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. కస్తూర్బా పాఠశాలలో గతంలో పని చేసిన 937 మంది కాంట్రాక్టు టీచర్లను కొనసాగించాలని కోరారు. బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం వలన ఆస్పత్రిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ సంక్షేమ భవన్ ముట్టడి
విజయనగర్‌కాలనీ: బీసీ గురుకుల పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు లక్షల సంఖ్యల్లో వస్తున్న నేపథ్యంలో కొత్తగా 120 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం మాసబ్ ట్యాంక్‌లోని దామోదరం సంక్షేమ సంఘం వద్ద తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ నేతృత్వంలో వందలాది మంది విద్యార్థులతో సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. కార్యక్రమానికి హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్లు లభించక విద్యార్థులు బీసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుతం బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు 3 లక్షల దరఖాస్తులు రాగా 14 వేల మందికి మాత్రమే సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు. మిగతా 2.86 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు లభించక ఆవేదన చెందుతున్నారన్నారు. అలాగే 238 బీసీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతుల వరకు అదనపు సెక్షన్లు ప్రారంభించాలన్నారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు 6 వేల మంది టీచర్లను నియమించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1100 నుంచి రూ. 1600కు, కాలేజీ విద్యార్థుల మెస్ చార్జీలు రూ. 1500 నుంచి రూ. 3000కు పెంచాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి.అనంతయ్య, నేతలు కూనూరు నర్సింహగౌడ్, చరణ్ యాదవ్, మోదీ, రామ్‌దేవ్, మల్లేశ్ యాదవ్, భాస్కర్, నిఖిల్, ప్రజాపతి, సునిత, మాధవి, అంజలి, అనిత, సిరి తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయమే పాలన అజెండా
అభివృద్ధి, రాజ్యాధికారం అట్టడుగు వర్గాలకు బదిలీ కావడం రాజ్యాంగ నిర్మాతల లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్ల పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ 75 ఏళ్ల స్వతంత్ర భారత్ కనీ వినీ ఎరుగని ఘట్టాలకు నాంది పలికింది. విప్లవాత్మకమైన విధానాల ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించడమే అజెండాగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సాధికారతే లక్ష్యమని స్పష్టంగా కనిపిస్తోంది. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం వెనుకా ఉద్దేశం ఇదే. వైసీపీ ప్లీనరీ జరుగుతున్న నేపథ్యంలో, ఈ దిశగా వైసీపీ ప్రభుత్వ కృషిని తలుచుకోవడం ఎంతైనా సముచితం. బలహీన వర్గాలు పాలితులుగా కాదు, పాల కులుగా ఉండాలన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంతి వైఎస్ జగన్ లక్ష్యం. ఆ దిశలోనే ఈ మూడేళ్లలో ప్రభుత్వ పాలన కొనసాగింది. సీఎం విశాల దృక్పథం వల్ల రాష్ట్రంలో వాస్తవ రాజ్యాధికార బదిలీ జరిగింది. సంక్షేమ రంగంతో పాటు, సామాజిక న్యాయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యాలూ, చేసిన పనులూ ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగనంత సామాజిక న్యాయం జగన్ వల్ల, జగన్ చేత పేద వర్గాలకు జరిగింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలలో కుడా పేద కులాలకు ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం జరగలేదు. అధికారంలో, సంపదలో, సామాజిక గౌరవంలో, విద్యలో... జనాభా ప్రకారం ఎవరి వాటా వారికి ఇచ్చిన దేశంలోనే మొదటి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి. ఆర్థికంగా, రాజకీయ సాధికారత పరంగా, సామాజిక హోదా పరంగా, విద్యా పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోంది. సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్‌రాం, మౌలానా ఆజాద్, కొమురం భీమ్ కోరు కున్న సమాజం దిశగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. కేబినెట్ కూర్పు నుంచి కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు, రాజ్యసభ సభ్యత్వాల వరకూ... పదవులు ఏవైనా అన్నింటా ఒకటే సూత్రం: అదే సోషల్ జస్టిస్. తన కేబినెట్లో దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్. శాసన సభ స్పీకర్ పదవిని బీసీ వర్గానికీ, శాసన మండలి ఛైర్మన్ ఎస్సీ వర్గానికీ ఇచ్చిన నాయకుడు కూడా ఆయనే. పార్లమెంటులో రెండేళ్ల క్రితం బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాసింది వైసీపీ. దీనికి మద్దతుగా 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ పార్టీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. విశేషం ఏమిటంటే, గత 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్ల మెంటులో బిల్లు పెట్టలేదు. చివరకు బీసీ పార్టీలుగా చలామణీ అవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, అప్నా దళ్, జనతాదళ్ లాంటి పార్టీలు కూడా బీసీ బిల్లు పెట్ట లేదు. జగన్‌కు బీసీల చరిత్రలో శాశ్వత స్థానం ఉంటుంది. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలు వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్య మంత్రులకు వైసీపీ ప్రభుత్వం సవాల్ విసిరింది. ఏపీలో ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులలో, డైరెక్టర్ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అందులోని చైర్మన్, డైరెక్టర్ పదవులన్నింటినీ (684) ఆయా కులాల వారితోనే భర్తీ చేశారు. 193 కార్పొరేషన్లలో 109 కార్పొరేషన్ చైర్మన్ పదవులు బీసీలకే దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగింది. మొత్తం 58 శాతం చైర్మన్ పదవులు బీసీలకే దక్కాయన్నమాట. దీని మూలంగా ఆయా కులాల నాయకత్వం పెరిగింది. ఈ కులాలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతోంది. ఆ కులాలలో తరతరాలుగా పేరుకుపోయిన భావ దాస్యం, బానిస ఆలోచనా విధానం పోయి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నామినేటెడ్ పదవులలో 50 శాతం బలహీన వర్గాలకు ఇవ్వాలని చట్టం చేయడమే కాదు, అమలులో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి ఈ వర్గాలలో అచంచల విశ్వాసం చూరగొన్నారు. శాశ్వత ప్రాతి పదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ మరో చరిత్రాత్మకమైంది. 25 మంది సభ్యుల మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇవ్వడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని జగన్ ఆవిష్క రించారు. అందులో బీసీ, మైనారిటీలకు 11 పదవులు ఇచ్చారు. ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే... నాలుగింటిని (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చారు. దేశ చరిత్రలో రాష్ట్ర హోం మంత్రిగా ఎస్సీ మహిళను రెండోసారీ నియమించడం ఇదే ప్రథమం. రాజ్యసభలో మొత్తం 9 మంది వైసీపీ సభ్యులు ఉంటే... అందులో మెజారిటీ సభ్యులు(ఐదుగురు) బీసీలే. ఇటీవల నాలుగు ఖాళీలు ఏర్పడితే... అందులో రెండు బీసీలకే! శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనారిటీ మహిళ జకియా ఖానమ్‌కు అవకాశం కల్పించారు. మండ లిలో వైసీపీకి 32 మంది సభ్యులు ఉంటే, 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలవారే. అలాగే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతంకు తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే... దానిని పార్టీ పరంగా అదనంగా 20 శాతం పెంచి మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు అవకాశం ఇచ్చింది వైసీపీ. ఇది జగన్‌కు బీసీల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలువగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో... 648 మండలా లకుగానూ వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిచింది. అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడు మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తం మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సి పాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైసీïపీ రికార్డు స్థాయిలో గెలవగా... చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 73 శాతం ఇచ్చి ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో 196 వ్యవ సాయ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపు 1.30 లక్షలు. వీటిలో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీలకే. ఈ 29 నెలల్లోనే ఇచ్చిన 2.70 లక్షల వలంటీర్ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 6.03 లక్షల మందికి ఉద్యో గాలు కొత్తగా వచ్చాయి. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కనీసం 75 శాతానికి పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ‘జగనన్న అమ్మ ఒడి’, ‘వైఎస్సార్ రైతు భరోసా’, ‘వైఎస్సార్ చేయూత’, ‘వైఎస్సార్ ఆసరా’, ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’, ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ వంటి పథకాల ద్వారా చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల జరిగిన మొత్తం లబ్ధి రూ. 1,87,916.46 కోట్లు. ఇందులో బీసీలకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ. 90,415.92 కోట్లు అందింది. అంటే దాదాపుగా సగం లబ్ధి బీసీలకే చేకూరింది. ఇలా అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయపరంగా వైసీపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త రాజ్యసభ సభ్యులు ‘ మొబైల్: 90000 09164 -
బీసీల అభివృద్ధి విధాన ప్రకటన చేయాలి: కృష్ణయ్య
కాచిగూడ (హైదరాబాద్): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీసీల అభివృద్ధి కోసం బీసీ డిక్లరేషన్ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శుక్రవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అభివృద్ధి పట్ల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి పార్టీ విధాన ప్రకటన చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి బీసీ వ్యతిరేక ప్రభుత్వమని పేరుందని, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య విన్నవించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు, లాల్‌కృష్ణ, కోల జనార్దన్, రవీందర్, చంద్రశేఖర్, జయంతిగౌడ్, వంశీకృష, విజయ, రజిత, మహేశ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలాంటి పని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు: ఆర్ కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ కులాలకు శ్రీరామరక్ష అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌కు బీసీ కులాలకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నా.. బీసీలకు ఇంత ప్రాధాన్యం ఇవ్వరు. 56 కార్పొరేషన్ల ద్వారా బీసీల అభివృద్ధికి బాటలు వేశారు. దేశంలో చదువుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు భవిష్యత్ ఇస్తున్నారు. బీసీలంతా వైఎస్సార్సీపీకి అండగా ఉండాలి. వైఎస్సార్సీపీ ప్లీనరిని విజయవంతం చేస్తాం' అని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి నాని కీలక వ్యాఖ్యలు) -
రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎంపికైన వైఎస్సార్సీపీ సభ్యులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య శుక్రవారం ఉదయం 10 గంటలకు దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీరిద్దరితో ప్రమాణం చేయించారు. ఆర్.కృష్ణయ్య తెలుగులో, నిరంజన్‌రెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అనంతరం చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీరిద్దరికీ అభినందనలు తెలిపారు. మరోవైపు, తెలంగాణ నుంచి ఎన్నికైన టీఆర్ఎస్ సభ్యులు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డిలతో కూడా చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ తదితరులు హాజరయ్యారు. -
డిగ్రీ ఫీజు గడువుపై వీసీని ఒప్పించా: ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్: ఈ నెల 10న ముగిసిన డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును వర్సిటీ 14వ తేదీ సాయంత్రం వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆ మేరకు అమెరికాలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవీందర్‌తో ఫోన్లో మాట్లాడి ఒప్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులు కట్టే వరకు కాలేజీ యాజమాన్యాలు పరీక్ష ఫీజులు తీసుకోవడం లేదన్నారు. సర్దుబాటు చేసి కట్టేలోగా ఫీజు గడువు ముగిసిందని, దీంతో తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని వందలాది మంది విద్యార్థులు బీసీ భవన్‌కు వచ్చి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారని కృష్ణయ్య తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఉస్మానియా వీసీలతో ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు ఓ అవకాశం ఇవ్వాలని తాను కోరగా, వారు సానుకూలంగా స్పందించారన్నారు. రేపు హాల్‌టికెట్లు: రిజిస్ట్రార్ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే బీఏ, బీకాం, బీఎ స్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు నేడు(జూన్14) అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేర కు ఫీజు చెల్లింపు గడువును సడలిస్తూ ఒక్కరోజు అవకాశమిచ్చినట్లు చెప్పారు. బుధవా రం (15న) నుంచి హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నూతన రాజ్యసభ సభ్యులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, ఎస్.నిరంజన్‌రెడ్డి నూతన ఎంపీలుగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన నూతన రాజ్యసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: (ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం) -
నాలుగు స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం
-
‘చంద్రబాబుకి బీసీల ఓట్లు కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు బీసీల ద్రోహి అని బీసీ నేత, వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. సీఎం జగన్ బీసీలను అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఈ దేశంలో ఎవ్వరూ సీఎం జగన్‌లా బీసీలకు మేలు చేయలేదని.. 47 ఏళ్లలో బీసీలను ఇంతలా ప్రోత్సహించే సీఎంను చూడలేదని ఆయన అన్నారు. చదవండి: నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో! ‘‘బీసీల హక్కుల కోసం రాజ్యసభలో పోరాడాలని నాకు అవకాశం ఇచ్చారు. చంద్రబాబుకి బీసీల ఓట్లు కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరు. చంద్రబాబు ఏనాడైనా బీసీలకు ఇన్ని మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇచ్చారా?. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఎన్ని సార్లు అడిగినా బాబు స్పందించలేదు. బీసీలంతా ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటారని ఆర్ కృష్ణయ్య అన్నారు. -
టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ: ఆర్ కృష్ణయ్య
-
పెద్దల సభలో బలమైన బీసీ వాణి!
సాహు మహరాజ్ లాగా ఏపీ సీఎం జగన్ కూడా బలహీనవర్గాల ప్రజలను ఆదరిస్తున్న తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. అత్యున్నత పదవుల్లో అణగారిన, బలహీన వర్గాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం శ్లాఘనీయం. వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయి. అందుకే ‘మనకాలపు సాహు మహరాజ్ జగన్’ అంటాను. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బీసీల కోటా నుంచి ఒక మంత్రి లేదా ఇద్దరు మంత్రులు ఉండేవారు. ఇంకా ఉంటే ఒకటో రెండో కార్పొరేషన్ ఛైర్మన్లు! అంతే బీసీలు, ఎస్సీలకు గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇచ్చిన ప్రాధాన్యం! ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అసలు బీసీలు, ఎస్సీ, ఎస్టీల ఊసే లేదు. కానీ, జగన్ ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వాలకు భిన్నంగా బీసీలకు పెద్ద ఎత్తున స్థానం కల్పించడం గమనార్హం. బీసీ సమాజం, సంఘాలు, సోకాల్డు బీసీ లీడర్లను కూడా ఈ పరిమాణం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. గతంలో సాహు మహరాజ్ వల్లనే అప్పటి అణగారిన సమాజం రిజర్వేషన్లు పొందిందని చరిత్ర చెబుతున్నది. ఆయన సాయంతోనే బీఆర్ అంబేడ్కర్ చదువుకొని భారత రాజ్యాంగ రూపకర్తగా మారారు. సీఎం జగన్ ప్రోత్సా హంతో ఇప్పుడు రాజకీయ అధికార పదవుల్లోకి వచ్చిన వారు ముందు ముందు మరిన్ని కీలక పదవులు పొంది తమ వర్గాల సాధికారత కోసం కృషిచేసే అవకాశం ఉంది. బీసీ ఉద్యమంలో ఆర్. కృష్ణయ్య నిర్వహిస్తున్న పాత్ర చాలా ముఖ్యమైనది. బీసీల కోసం గత నాలుగు దశాబ్దాలకు పైగా ‘బీసీ సంక్షేమ సంఘం’ ద్వారా అలుపెరగని, అవిశ్రాంత పోరాటం చేస్తూన్న పోరాట యోధుడాయన. రెండు తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు ఆర్. కృష్ణయ్య కృషి చిరస్మరణీయం. సుదీర్ఘ కాల ఉద్యమ నేపథ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆర్. కృష్ణయ్యకు ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో సభ్యునిగా స్థానం కల్పించే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఒక విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని 136 బీసీ కులాలకు దక్కిన అరుదైన గౌరవంగా భావించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న బీసీ ఉద్యమనేత ఆర్. కృష్ణయ్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలు పలు రకాల విమర్శలు చేస్తుండటం దురదృష్టకరం. బీసీల సంక్షేమ పార్టీగా చెప్పుకొని టీడీపీ ఈ అంశంలో జగన్ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి, విమర్శించడం దారుణం. 2014లో రాష్ట్ర విభజన తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికలలో నారా చంద్రబాబు బీసీ ముఖ్య మంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను ప్రయోగించినందునే తెలుగుదేశం పార్టీకి నామమాత్రంగానైనా అసెంబ్లీ సీట్లు లభించాయని చెప్పవచ్చు. (👉🏾చదవండి: వైపరీత్య ఘటనల్లో రాజకీయమా?) ఇక ఆర్. కృష్ణయ్య తెలంగాణ వాడు కదా... ఆయనకు ఏ విధంగా రాజ్యసభ సీటు ఇస్తారని టీడీపీ అనుంగు అనుచరులు విమర్శలు చేయడం శోచనీయం. కృష్ణయ్య లాంటి జాతీయ స్థాయి బీసీ ఉద్యమ నేతను కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేస్తూ విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అదే విధంగా బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు, బీసీ కులాల గణాంకాలు లాంటి అనేక డిమాండ్లు బీసీలకు దశాబ్దాల తరబడి ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి. బీసీల పార్టీలుగా ఈ సమస్యలపై ఎప్పటినుంచో ఉద్యమిస్తూ ఉన్న ఆర్. కృష్ణయ్య పార్లమెంట్లో ఉంటే బీసీల వాణి మరింత స్పష్టంగా, ప్రభావవంతంగా వినిపించవచ్చు. బీసీల సమస్యలపై చిత్తశుద్ధితో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అందుకే ఆర్. కృష్ణయ్యను పెద్దల సభకు పంపడానికి నిర్ణయించింది. (👉🏾చదవండి: ఇది ఎదురుకాల్పుల కనికట్టు కథ!) - మన్నారం నాగరాజు తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు -
ప్రారంభమైన వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. ఏపీలో ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు మంగళవారం రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి నోటిఫికేషన్‌ను జారీచేశారు. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. తొలిరోజు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఇక రాజ్యసభ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు. వారు నలుగురూ బుధవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈనెల 31వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వీటిని జూన్ 1న ఉ.11 గంటలకు పరిశీలిస్తారు. జూన్ 3వ తేదీ మ.3 గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నలుగురు అభ్యర్థుల కంటే ఎక్కువమంది పోటీలో ఉంటే జూన్ 10న ఉ.9 గంటల నుంచి మ.4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగు స్థానాలూ ఏకగ్రీవం! ఇక శాసనసభలో వైఎస్సార్సీపీకి 150 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీకి సాంకేతికంగా కేవలం 23 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావాలంటే సగటున 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. టీడీపీకి అంత బలంలేని నేపథ్యంలో.. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎవరూ పోటీచేసే అవకాశంలేదు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. -
ఆర్.కృష్ణయ్యకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సీటు.. ‘బాబు యవ్వారం విడ్డూరంగా ఉంది’
ముషీరాబాద్ (హైదరాబాద్): తమది బీసీల పార్టీ అని గొప్పలు చెప్పుకునే తెలు గుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. ఆర్.కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థిత్వంపై కుట్రలకు తెరలేపడం ఆయన స్థాయికి తగదని పలు బీసీ సంఘాలు ధ్వజమెత్తాయి. గత 4 దశాబ్దాలుగా బీసీల హక్కుల సాధనకు ఉద్యమాలే ఊపిరిగా జీవితం గడుపుతున్న ఆర్.కృష్ణయ్యను.. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయిస్తే చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వారు దుయ్యబట్టారు. కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికైతే బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి ఎక్కడ దూరం అవుతారోననే భయంతోనే చంద్రబాబు విషం కక్కుతున్నారని బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు. శుక్రవారం జాతీ య బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జకృష్ణ, ఏపీ యూత్ అధ్యక్షుడు బోన్ దుర్గానరేశ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్కోటితోపాటు పలు సం ఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలకు ఏనాడూ న్యా యం చేయలేదని, బీసీల పట్ల కపట ప్రేమను ఒలకపోశారని మండిపడ్డారు. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను ప్రకటించిన చంద్రబాబు, ఆ తరువాత టీడీపీ శాసన సభా పక్ష నేతగా ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 70 శాతం పదవులు కేటాయిస్తే చంద్రబాబుకు కుళ్లు ఎందుకని ప్రశ్నించారు. కృష్ణయ్యపై విమర్శలు చేస్తే తెలుగుదేశం పార్టీ మరింత దిగజారడం ఖాయమని అన్నారు. ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బీసీలంతా జగన్మోహన్రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటారని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నాలుగు స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా జూన్ 21తో పదవీ కాలం ముగియనున్న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావును ఎంపిక చేసి ఆయా వర్గాల అభ్యున్నతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డికి అవకాశం కల్పిస్తూ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ముఖ్య నేతలతో మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పార్టీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బీసీలకు సముచిత స్థానం: బొత్స అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిపాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక సాధికారతతో ఆయా వర్గాలను ప్రగతిపథంలో తేవాలన్నదే సీఎం లక్ష్యం. రెండేళ్ల క్రితం రాజ్యసభకు నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నామినేటెడ్ పదవులతోపాటు నామినేషన్ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ లేని రీతిలో సీఎం జగన్ 50 శాతం రాజ్యసభ స్థానాలను బీసీలకు కేటాయించారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్: సజ్జల బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆది నుంచి చెప్పడమే కాకుండా ఆచరించి చూపుతున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాలకుగానూ రెండు స్థానాలను బీసీలకే కేటాయించారు. బీసీల అభ్యున్నతి కోసం జాతీయ స్థాయిలో రాజీలేని పోరాటం చేస్తున్న, బలహీన వర్గాలకు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. రాజ్యసభలో బీసీల గొంతుకను వినిపించి ఆ వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపారు. బీసీలకు చంద్రబాబు కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు, పనికిరాని పనిముట్లు అంటగడితే... చట్టసభలు, మంత్రివర్గం, నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల నేపథ్యాలు ఇవే.. 1.ర్యాగ కృష్ణయ్య పుట్టిన తేదీ: సెప్టెంబర్ 13, 1954 విద్యార్హతలు: ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్ఎం (గోల్డ్ మెడల్) సొంతూరు: రాళ్లడుగుపల్లి, మొయిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో బీసీ సంఘం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ► విద్యార్థి దశ నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ► నిరుద్యోగుల కోసం 12 వేలకుపైగా ఉద్యమాలు, పోరాటాలతో రెండు వేలకుపైగా ప్రభుత్వంతో జీవోలు ఇప్పించారు. ► 2014లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ► 2018లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2. వేణుంబాక విజయసాయిరెడ్డి పుట్టిన తేదీ: జూలై 1, 1957 సొంతూరు: తాళ్లపూడి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యార్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్ పదవులు: ► ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ► వరుసగా రెండుసార్లు టీటీడీ సభ్యుడిగా సేవలందించారు. ► వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ (2016 జూన్ 22 నుంచి 2022 జూన్ 21 వరకు)కు ఎంపికయ్యారు. ► వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అనుబంధ సంఘాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► పెట్రోలియం, సహజవాయువు స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ► రాజ్యసభలో పది ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. 3. బీద మస్తాన్‌రావు పుట్టిన తేదీ: జూలై 2, 1958 సొంతూరు: ఇస్కపల్లి, అల్లూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తల్లిదండ్రులు: రమణయ్య, బుజ్జమ్మ కుటుంబం: భార్య మంజుల, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విద్యార్హతలు: బీకాం, సీఏ (ఇంటర్) ► యాదవ సామాజికవర్గానికి చెందిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ► చెన్నైలో ప్రముఖ హోటల్ గ్రూప్‌లో ఫైనాన్షియల్ మేనేజర్‌గా పనిచేశారు. ► అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. వేలాది మందికి ఉద్యో్గగావకాశాలు కల్పించారు. ► కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు పొందారు. ► బోగోల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ► 2004 ఎన్నికల్లో అల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ► 2009 ఎన్నికల్లో కావలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ► 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ అథారిటీ సలహా సభ్యులుగా పనిచేశారు. ► 2019లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ► 2019 డిసెంబర్లో వైఎస్సార్సీపీలో చేరారు. ► బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ► కోవిడ్ సమయంలో రూ.2.25 కోట్లు విలువ చేసే 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, రూ.కోటి విలువైన మొబిలైజర్స్ కోసం జిల్లా కలెక్టర్‌కు విరాళం ఇచ్చారు. ► 1998లో యూనివర్సిటీ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్ వాషింగ్టన్, యూఎస్ఏ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 4. నిరంజన్‌రెడ్డి పుట్టిన తేదీ: జూలై 22, 1970 సొంతూరు: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ విద్యార్హతలు: హైదరాబాద్‌లో ఉన్నత విద్య, పుణెలో ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబయాసిస్‌లో న్యాయ విద్యను అభ్యసించారు. ► ఉమ్మడి రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ► 1994–95 నుంచి సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ► రాజ్యాంగ అంశాలతోపాటు విభిన్న చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ► ఎన్నికల సంఘంతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కొంతకాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. -
సామాజిక మహావిప్లవంలో ‘పెద్ద’ అడుగు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆవిష్కృతమైన సరికొత్త సామాజిక మహావిప్లవంలో మరో ముందడుగు పడింది. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 2 అంటే 50 శాతం స్థానాల్లో బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు(యాదవ)లను వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. ‘బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్’ అని 2019 ఫిబ్రవరి 18న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో స్పష్టం చేసిన సీఎం జగన్ మరోసారి ఆచరించి చూపారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఉమ్మడి ఏపీలో, రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో అలుపెరగని పోరాటాలు చేపట్టిన కృష్ణయ్య, విద్యావంతుడైన బీద మస్తాన్‌రావులను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా ఆ వర్గాల వాణిని పార్లమెంట్లో బలంగా వినిపించి సమస్యలు పరిష్కరించాలన్నది సీఎం లక్ష్యమని విశ్లేషిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా.. రెండేళ్ల క్రితం నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లను బీసీలైన పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టిబలిజ), మోపిదేవి వెంకటరమణ(మత్స్యకార)లకు సీఎం జగన్ కేటాయించి పెద్దల సభలో అవకాశం కల్పించారు. మూడేళ్లలో ఏపీ నుంచి ఖాళీ అయిన 8 రాజ్యసభ స్థానాల్లో సగం అంటే 4 స్థానాలను బీసీ వర్గాలకే కేటాయించడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ 50% రాజ్యసభ పదవులను బీసీలకు ఇచ్చిన దాఖలాలు లేవని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చట్టసభల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీ బిల్లును ప్రైవేట్ బిల్లుగా రాజ్యసభలో వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా ప్రవేశపెట్టడం, తాజాగా సగం సీట్లను వారికే కేటాయించడం బీసీల అభ్యున్నతిపై సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సాధికారతే లక్ష్యంగా.. ► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు (86.29 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో(88 శాతం) వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. మే 30, 2019న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ► జూన్ 8, 2019న తొలిసారిగా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 14 పదవులు (56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించి సామాజిక విప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఓసీ వర్గాలకు 11 పదవులు(44%) ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ స్థాయిలో మంత్రివర్గంలో స్థానం కల్పించిన దాఖలాలు లేవు. ► ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. నాలుగు (80%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అవకాశం కల్పించారు. ఎస్సీ మహిళ మేకతోటి సుచరితకు హోంమంత్రిగా అవకాశమిచ్చారు. దేశ చరిత్రలో రాష్ట్ర హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం అదే ప్రథమం. ► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌రాజు, మైనార్టీ మహిళ జకియా ఖానంలకు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో మండలి ఛైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళను నియమించడం ఇదే తొలిసారి. ► ఈ ఏడాది ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అందులో బీసీ, మైనార్టీలకు 11 పదవులు ఇచ్చారు. మాటల్లో కాదు.. చేతల్లో పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాతినిధ్యం ఇస్తే ద్వారా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అట్టడుగు వర్గాలకు చేరతాయని, ఇది ఆయా వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన, సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు బాటలు వేస్తుందన్నది సీఎం జగన్ విశ్వాసం. ► మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించారు. ► పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో తొమ్మిది (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67% పదవులను కేటాయించారు. ► 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 7 చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మేయర్ పదవుల్లో 92% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకోగా చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 % ఇచ్చారు. ► నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం వైఎస్సార్సీపీ సర్కారే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం వైఎస్ జగన్ సర్కారే. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60%పదవులు ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39%) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58% పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42%) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58% డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. -
ఆర్ కృష్ణయ్య: గోల్డ్ మెడలిస్ట్.. విద్యార్థి దశ నుంచే పోరుబాట
సాక్షి, అమరావతి: బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్యను వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. దశాబ్దాలపాటు బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీల హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఉద్యమనేతకు సముచిత స్థానం ఇవ్వాలనే సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నేపథ్యం ఏంటో చూద్దాం. ఆర్ కృష్ణయ్య.. పూర్తి పేరు ర్యాగ కృష్ణయ్య. సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లి లో జన్మించారు. ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉద్యమ నేతగా ఎదిగారు. నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్.కృష్ణయ్యకు గుర్తింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం సైతం పోరాటాలు చేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు-ఆర్ కృష్ణయ్య -
‘ఆప్షన్, వెయిటింగ్ లిస్ట్ విధానం ఉండాలి’
కాచిగూడ (హైదరాబాద్): గ్రూప్స్‌తోపాటు ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీలో ఆప్షన్, వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీసీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి ఉద్యోగ ఖాళీల భర్తీ, అప్షన్ విధానాలపై చర్చించారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ గ్రూప్ 1,2,3,4 సర్వీస్ పోస్టు లను నేరుగా భర్తీ చేయాలని అన్నారు. ఇప్పటికే కొన్ని శాఖలలో ఖాళీలను పదోన్న తులతో భర్తీ చేశారని పేర్కొన్నారు. డైరెక్టు రిక్రూట్ మెంట్ ద్వారా యువతను తీసుకుంటే సమర్థవంత మైన, అవినీతి రహిత పాలన అందించవచ్చ న్నారు. గ్రూప్ 4 లోని పోస్టులను జిల్లా, మం డల స్థాయిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
కులాన్ని నిర్మూలిస్తేనే దేశ అభివృద్ధి
లక్డీకాపూల్ (హైదరాబాద్): కుల వ్యవస్థను నిర్మూలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో తెలంగాణ దళిత దండు, తెలంగాణ మాల మహానాడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, తెలంగాణ మాదిగ దండోరా, మాదిగ జేఏసీ, రిపబ్లిక్ పార్టీలు సంయుక్తంగా రాజ్యాంగ గర్జన సమావేశం నిర్వహించాయి. తెలంగాణ దళిత దండోరా అధ్యక్షుడు బచ్చలి కూర బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగా న్ని మార్చాల్సిన అవసరం లేదని, పాలకుల మనసు మార్చాలని అన్నారు. మారుతున్న సమాజానికి తగ్గట్టు ఏదైనా కొత్త అంశాన్ని చేర్చాలంటే రాజ్యాంగ సవరణలు చేసే అవకాశం ఉందన్నారు. ఎస్సీ/ఎస్టీ/బీసీల కోసం రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు పెట్టడానికి.. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా ప్రవేశపెట్టడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 75 కోట్ల జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు రాజకీయ రిజర్వేషన్లు లేవన్నారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతం పెంచాలన్నారు. ఈ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్ నిబంధన తొలగించాలన్నారు. బీసీలకు సాంఘిక భద్రత కల్పించడానికి బీసీల అత్యాచార నిరోధక చట్టం ప్రవేశపెట్టాలన్నారు. బహుజనుల అభివృద్ధి, వికాసం కోసం రాజ్యాంగాన్ని సవరించాలి తప్ప బానిసత్వం పునరుద్ధరించడానికి రాజ్యాంగాన్ని మార్చరాదని కృష్ణయ్య స్పష్టం చేశారు. సమావేశంలో తెలంగాణ దళిత దండోరా ఉపాధ్యక్షుడు మొగిలయ్య, టీఎం ఎస్ఎస్ అధ్యక్షుడు యాదయ్య, మహా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మత్స్య పాద నరసింహారావు, మాదిగ జేఏసీ అధ్యక్షుడు కిరణ్, ఆర్పీఐ నాయకుడు బాల స్వామి ప్రసంగించారు. -
‘బీసీల మహాధర్నా’ ఉద్రిక్తం
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో జరిగిన బీసీల మహా ధర్నా ఉద్రిక్తంగా మారింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో వందలాదిమంది జంతర్‌మంతర్ వేదికగా మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమం పార్లమెంట్ ముట్టడిగా మారింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీస్ ఉన్నతాధికారులు నచ్చజెప్పడంతో బీసీ నేతలు వెనక్కి తగ్గారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి మార్చుకుని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్ర మంత్రులను దేశంలో తిరగనివ్వబోమని, ఆగస్టులో 5 లక్షల మంది బీసీలతో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లుతో పాటు విద్యా, ఉద్యోగ, ఆర్థ్ధిక, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో జనాభా ప్రకారం బీసీలకు వాటా ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ఏపీ సీఎం జగన్‌ను చూసి నేర్చుకోండి బీసీలకు హక్కులను కల్పించే విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. పార్లమెంటులో బీసీ బిల్లును పెట్టింది కేవలం వైఎస్సార్సీపీనే అని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50% బీసీలకే పదవులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వమని కొనియాడారు. -
బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాదా?
దేశ జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందితే దేశం సగానికిపైగా అభివృద్ధి చెందినట్లే. కానీ వారి అభ్యున్నతి నిర్లక్ష్యానికి గురైంది. బీసీల సర్వతోముఖాభివృద్ధికి మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేసింది. కానీ అందులో కేవలం రెండు మూడు సిఫార్సులు మాత్రమే ఇప్పటివరకు అమలుకు నోచుకున్నాయి. విద్య, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారు. జాతీయ బీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు. మిగతా సిఫార్సులు అమలుచేసినప్పుడు మాత్రమే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సంగతిని బాగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి రాజీలేని చర్యలు తీసు కుంటున్నది. 56 బీసీ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో వారి వాటా వారికి ఇవ్వడం వంటి ఎన్నో చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన 39 లక్షల 45 వేల కోట్ల రూపాయల బడ్జెట్లో బీసీలకు బిచ్చమేసినట్లు 1400 కోట్లు కేటాయించి దేశం లోని 56 శాతం జనాభాగల బీసీలను అవమాన పర్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా ఈ దఫా 20 శాతం వరకు నిధుల కేటాయింపు తగ్గించి సామజిక న్యాయానికి తూట్లు పొడిచింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం కేటాయించిన ఈ 1,400 కోట్ల రూపాయలు 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు పంచితే ప్రతి రాష్ట్రానికి రూ. 40 కోట్లు కూడా రావు. ఈ నిధులతో దేశంలో 70 కోట్ల మంది బీసీలకు పంచడానికి బిస్కెట్లు కూడా రావు. గతంలో పాలించిన ప్రభుత్వాలు బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. బీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధానమంత్రిగా ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని ఆశించాం. కానీ గతం కంటే పరిస్థితులు మరింత అన్యాయంగా తయారవుతున్నాయి. ఇంకొక వైపు బీసీ సంక్షేమానికి ప్రతి రాష్ట్రం 5 వేల నుంచి 20 వేల కోట్ల రూపా యల వరకు బడ్జెట్ కేటాయిస్తుంటే... కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రా నికి 40 కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు. రాజ్యాంగబద్ధంగా నియమించిన మండల్ కమిషన్ బీసీల సర్వ తోముఖాభివృద్ధికి 40 సిఫార్సులు చేయగా కేవలం రెండు మూడు సిఫార్సులను మాత్రమే పట్టించుకున్నారు. విద్య, ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారు. జాతీయ బీసీ కార్పొ రేషన్ ఏర్పాటు చేశారు. ఆర్థికపరమైన సిఫార్స్‌లు దాదాపు 14 ఉంటే ఇంత వరకు ఒక్క సిఫార్సు కూడా అమలు చేయలేదు. ఒక్క స్కీమ్ అమలుకు కూడా బడ్జెట్ కేటాయించడం లేదు. మండల్ కమిషన్ బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, ఫీజుల మంజూరు, ప్రత్యేక హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. మండల్ కమిషన్ ప్రకారం 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ప్రారంభించి 29 సంవత్సరాలు గడుస్తున్నా ఆర్థికపరమైన స్కాలర్ షిప్‌ల వంటి స్కీముల అమలుకు బడ్జెట్ కేటాయించకుండా బీసీలకు అన్యాయం చేస్తోంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే జీఎస్టీ పన్నులు, ఆదాయ పన్నులు, ఇతర పన్నుల రూపంగా కేంద్ర బడ్జెట్‌కు బీసీలు 50 శాతంకు పైగా పన్నులు చెల్లిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ఆదాయంలో సింహ భాగం బీసీలదే. కానీ బడ్జెట్లో బీసీలకు ఒక శాతం కూడా కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన కులాలు, సంచారజాతులను ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్య తను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణల వంటివాటివల్ల సమస్త కులవృత్తులు యాంత్రీకరణకు గురయ్యాయి. దీంతో జీవనాధారమైన కుల వృత్తులు కార్పొరేట్ సంస్థల పరమవ్వడంతో ఆయా వృత్తులవారు బజారున బడ్డారు. శ్రమ విభజన వల్ల ఏర్పడిన కులవృత్తుల మూలంగా... కొన్ని వేల సంవత్సరాలుగా కుల వృత్తులు చేస్తూ విద్యా, విజ్ఞానానికి దూరంగా నెట్టివేయబడ్డారు అధిక శాతంగా ఉన్న బీసీలు. గిట్టుబాటుకాని కులవృత్తుల మూలంగా మెజార్టీ ప్రజలు ఆర్థి కంగా చితికిపోయారు. దీనికి తోడు యాంత్రీకరణ, కార్పొరేటీకరణ, పారిశ్రామికీకరణతో కులవృత్తులు, చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. ఈ కులాలకు ఆకలిచావులు శరణ్యమైనాయి. సామాజికరంగంలో, ఆర్థిక రంగంలో వివక్షతలు, అసమానతలు తొలగాలంటే ఆర్థికంగా చితికి పోయిన ఈ చేతివృత్తులు, కులవృత్తుల వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి సబ్సిడీ రుణాలు ఇవ్వడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు గడిచినా ఈ కులాల అభివృద్ధికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసు కోలేదు. బడ్జెట్ కేటాయించలేదు. బడ్జెట్ కేటాయింపులతోనే సమాజం లోని ఆర్థిక అసమానతలు తగ్గి సమసమాజం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని చూడటానికి ఇంత వరకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు. బీసీ జనాభా లెక్కలు తీయడానికి అంగీకరించడం లేదు. కేంద్రంలో 74 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు వంటి వారి అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. కాని 56 శాతం జనాభా గల బీసీల అభివృద్దికి ప్రత్యేకించిన శాఖ లేకపోవడం అన్యాయం కాదా? జనాభా ప్రకారం రిజర్వేషన్ లభించడం లేదు. బడ్జెట్ లేదు... మరి బీసీలను ఎలా అభివృద్ధి చేస్తారు? పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, రాజ్యాంగాన్ని సవరించి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనీ; బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలనీ, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలనీ గత 30 ఏళ్లుగా బీసీ సంఘాలు పోరాడుతున్నా కేంద్రం అంగీకరించడం లేదు. పంచాయతీరాజ్ సంస్థల్లో జనాభా నిష్పత్తి ప్రకారం బీసీ రిజర్వేషన్లను 50 శాతంకు పెంచి... ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలనీ ఉద్యమాలు చేస్తుంటే ఉలుకుపలుకు లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాది రిగా... బీసీలకూ సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్‌ను తీసుకువచ్చి ఈ కులాలకు రక్షణ కల్పించి ఆత్మవిశ్వాసం పెంచవలిసిన అవసరం ఉంది. 95 శాతం ఉద్యోగావకాశాలు గల ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనీ, సుప్రీంకోర్టు–హైకోర్టు జడ్జీల నియామకాలలో కూడా ఈ వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలనీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాడుతున్నా... ఉలుకూపలుకూ లేదు. బీసీ, విద్యా, ఉపాధి, శిక్షణ, స్వయం ఉపాధి పథకాలకు కేంద్ర బడ్జెట్ తగు మేరకు కేటాయించడం లేదు. అలాగే బీసీ సబ్–ప్లాన్ ఏర్పాటు చేసి ఈ కులాలను ఆదుకోవాలని బీసీ లోకమంతా కోడై కూస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. దేశంలోని 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా భారత్ అగ్రదేశంగా తయారవుతుందా? ఆదర్శం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటా బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి బడ్జెట్ కేటాయింపుల్లో దేశంలోనే అగ్ర భాగాన ఉంది. అంతేకాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు... కార్పొరేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం కోటా కేటాయించి దేశానికి ఆదర్శంగా నిలిచారు. అలాగే కాంట్రాక్టు పనులలో, పారిశ్రామిక పాలసీలో భాగంగా బలహీనవర్గాలకు 50 శాతం కోటా కల్పించి ఈ వర్గాలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్నారు. అలాగే ప్రతి కులానికీ ఒక కార్పొ రేషన్ చొప్పున 56 బీసీ కుల కార్పొరేషన్లను మంజూరు చేసి, పాలక మండళ్ళు ఏర్పాటు చేసి ఈ కులాలలో నాయకత్వం పెంచారు. రజకులకు, నాయి బ్రాహ్మణు లకు, దర్జీలకు, మత్స్యకారులకు ఇలా అన్ని కులాలకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటే చైతన్యవంతమైన జ్ఞాన సమాజం ఏర్పడుతుందని ‘అమ్మ ఒడి’ పథకం కింద పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15 వేలు వేయడం నిజంగా ఆశ్చర్యకరం– ఆదర్శవంతం. ఇలాంటి పథకం దేశంలోనే కాదు... ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఈ పథకం వల్ల ప్రతి పిల్లవాడు చదువుకునే అవకాశం కలుగుతోంది. ప్రతి ఒక్కరు చదువుకుంటే అజ్ఞానం– అమాయకత్వం లేని నేర రహిత సమాజం ఏర్పడుతుంది. మానవ వనరులు సమగ్రంగా వినియోగింపబడతాయి. రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించాలనే ఉద్దేశంతో జగన్ మోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీ పార్లమెంటు సభ్యుల ద్వారా పార్ల మెంటులో బీసీ బిల్లు పెట్టి చరిత్ర కెక్కారు. 74 సంవత్సరాల భారత దేశ పార్లమెంటరీ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ బీసీ బిల్లు పెట్టలేదు. పార్లమెంటులో 8 రాజకీయ పార్టీలు బీసీలు నాయకత్వం వహించేవి ఉన్నా... ఏ పార్టీ ఇటువంటి బిల్లు పెట్టలేదు. వ్యాసకర్త: ఆర్. కృష్ణయ్య అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్ : 90000 09164 -
ఉద్యోగుల బదిలీల్లో బీసీలకు అన్యాయం: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: నూతన జోనల్ విధానంప్రకారం ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపుల్లో బీసీలు తీవ్రంగా నష్టపోయారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం జరిగిన బీసీ ఉద్యోగ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 25 శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సి ఉండగా ప్రభుత్వం ఈ నిబంధనను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఆప్షన్ ఫారంలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక కాలమ్ పెట్టలేదని తెలిపారు. మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో జిల్లా కేటాయింపులు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. కేవలం సీనియార్టీని ప్రామాణికంగా తీసుకోవడంతో మెరిట్ ఉన్న ఉద్యోగులు, జూనియర్లు తీవ్రం గా నష్టపోయారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ తప్పిదాలను సవరించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ మెరిట్, రోస్టర్ పద్ధతిని, స్థానికతను పాటించాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచాలి
కవాడిగూడ: రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మెస్‌చార్జీలను రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెస్‌చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నాచౌక్‌లో వందలాది మంది విద్యార్థులు మహాధర్నా నిర్వహిం చారు. కృష్ణయ్య మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగా కాకుండా, పెరిగిన ధరల మేరకు మెస్‌చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచు తున్న ప్రభుత్వం రేపటిపౌరులపట్ల ఎందుకింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. రూ.3,500 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాల న్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్, విద్యార్థి సంఘం రాష్ట్ర అ«ధ్య క్షుడు జిల్లెపల్లి అంజి, వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్, మల్లేష్ యాదవ్, చంటి ముదిరాజ్, జి.కృష్ణయాదవ్,అనంతయ్య, భాస్కర్ పాల్గొన్నారు. -
‘8న పార్లమెంట్ ముట్టడిస్తాం’
ముషీరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేయాలని, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సాకు చెందిన ముఖ్య బీసీ నాయకుల సమావేశం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చలో ఢిల్లీ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే డిసెంబర్ 10న అన్ని ప్రతిపక్ష నాయకులు, బీసీ నాయకులతో అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం జరుపుతామని తెలిపారు. కులగణన జరపాలని 8 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింప చేయా లని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ తదితరులు మాట్లాడారు. -
పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలి: ఆర్.కృష్ణయ్య
కాచిగూడ(హైదరాబాద్): దేశ జనగణన లో భాగంగా కుల గణన చేపట్టే వరకు ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో 65 బీసీ సంఘాల, కుల సంఘాల సమావేశం జరిగింది. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కులగణన విషయమై కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్య త ప్రతిపక్ష పార్టీలదేనని అన్నారు. కులగణన, ప్రభుత్వసంస్థల ప్రైవేటీకరణపై కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ‘బీసీబంధు’ పథకాన్ని ప్రారంభించి అమలు చేయాలని కోరారు. -
ఈటల ఓటమికి ప్రయత్నించారంటూ వెయ్యికి పైగా ఫోన్లు: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ఇచ్చారని, ఈటల రాజేందర్ ఓటమికి ప్రయత్నించారని ఆగంతకులు ఫోన్లు చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. తన ఫోన్ నెంబర్‌ను ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో పెట్టి ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండ్రోజుల నుంచి వెయ్యికి పైగా ఫోన్లు వచ్చాయని, దీని వెనుక ఎవరున్నారో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీని కోరినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. తనపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధిస్తోందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనను ఇటీవల అభినందించిన వ్యవహారాన్ని గుర్తుచేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హోంమంత్రి, డీజీపీ నుంచి న్యాయం చేస్తామన్న హామీ లభించిందని కృష్ణయ్య తెలిపారు. (చదవండి: TSRTC: బస్సు చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్) -
గెల్లు శ్రీనివాస్‌కే మా మద్దతు
ఖైరతాబాద్(హైదరాబాద్): హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాల్సిందిగా 120 బీసీ సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు, సంఘాల నేతలు ఈ అంశంపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు తాము అనేక కారణాలు చెప్పగలమని, ఈటల రాజేందర్‌కు మీరు మద్దతు ఇవ్వడానిగల కారణాలు చెప్పగలరా అని ఆయన సవాలు చేశారు. గురువారం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీబంధు పథకం పెట్టాలని, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశామని, అదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించి బీసీబంధు పథకంపై సానుకూలత వ్యక్తం చేశారని, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. బీసీల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. జనగణనలో బీసీలను లెక్కించడానికి ఒప్పుకోని బీజేపీ, దేశంలోని 70 కోట్లమంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరి మానుకోవాలని హెచ్చరించారు. -
గూప్1,2 ఉద్యోగాలను భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా గ్రూప్1,2 ఉద్యోగాలను భర్తీ చేయడంలేదని బీసీ సంక్షేమ సంఘం విమర్శించింది. సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యో గుల వయో పరిమితి ముగిసిపోతుందని, అందుకే తక్షణం డైరెక్టు రిక్రూట్మెంట్ కింద ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని సంఘం కోరింది. ఈ మేరకు సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో సంఘం నేతలు గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్, దాసు సురేశ్, ఉదయ్ తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను కలసి ఉద్యోగాల భర్తీపై వినతిపత్రం సమర్పించారు. తమ వినతిపై స్పందించిన సీఎస్, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. -
బీసీ కులాలవారీగా జనగణన
సాక్షి, హైదరాబాద్: జనగణన ప్రక్రియలో బీసీ కులాల వారీగా జనాభాను లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమసంఘం నేతలు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం సమర్పించారు. కృష్ణయ్య మాట్లాడుతూ..బీసీలకు కేంద్రంలో కనీసం మంత్రిత్వ శాఖ కూడా లేదని, అదేవిధంగా వారికి సంక్షేమపథకాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలవారీగా జనగణన చేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా సరైన స్పందన లేదని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కాగా, దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి కేంద్రంపై ఒత్తిడితెస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. సీఎంను కలసినవారిలో బీసీ సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ తదితరులు ఉన్నారు. -
కులగణనకు... భయమెందుకు?
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారు చేసిన జనగణనలో దేశంలో సమారు నాలుగు వేల కులాలు ఉన్నట్లు తేలింది. తర్వాత జరిగిన సర్వేలు ఈ సంఖ్యను ఆరు వేలుగా తేల్చాయి. అయితే నలభై ఆరు లక్షల కులాలు, ఉపకులాలు ఉన్నాయనీ, వీరిని లెక్కించడం సంక్లిష్టమైన ప్రక్రియ అనీ కేంద్రం వాదిస్తోంది. పైగా కులతత్వం పెరుగుతుందని చెబుతోంది. కులం పునాదుల మీద నిర్మాణమైన భారత సమాజంలో కులం ఏమిటో తెలిస్తే కులతత్వం పెరుగుతుందనడం అసంబద్ధ వాదన. కులాల వారీ జనగణన బీసీల అభివృద్ధికి అత్యవశ్యం. జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పొందడం వారి హక్కు. ఈ లెక్కలు తేలితే చిక్కులు వస్తాయనే భయంతోనే కేంద్రం దీనికి నిరాకరిస్తోంది. జనాభా గణనలో ‘కులగణన’ చేపట్టాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా, జార్ఖండ్ ముఖ్య మంత్రులు అసెంబ్లీలలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీసీ కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. బీఎస్పీ అధినేత మాయావతి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా అన్ని జాతీయ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా ప్రకటనలు జారీ చేశాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ ఫ్రంట్, మహా రాష్ట్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేశాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ– కులగణన సంక్లిష్టమైన ప్రక్రియ అనీ, ఆచరణలో సాధ్యం కాదనీ వితండవాదం చేస్తోంది. 2011లో జరిపిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో 46 లక్షల కులాలు/ఉప కులాల పేర్లు ప్రజలు చెప్పారని ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. 1931లో బ్రిటిష్ వారు జరిపిన జనగణనలో దేశంలో 4,147 కులాలు ఉన్నట్లు తేలింది. కేంద్ర ప్రభుత్వం చెప్పే 46 లక్షల కులాలు/ ఉపకులాల వాదన సరికాదు. ప్రస్తుతం కేంద్ర ఓబీసీ జాబితాలో 2,642 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలో 2,892 బీసీ కులాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్ర కులాలు అన్నీ కలిసినా ఆరు వేలకు మించవు. గతంలో అనేక సర్వే లలో కూడా దేశంలో 6 వేల కులాలు ఉన్నాయని తేల్చారు. జనాభా గణనలో కులగణన చేపట్టాలని 2010లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసింది. 2018 ఆగస్టు 31న అప్పటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ దఫా జరిగే జనగణనలో కులాల వారీ వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తు న్నట్లు? 1953లో నియమించిన కాక కాలేల్కర్ కమిషన్, 1979లో నియమించిన మండల్ కమిషన్ కులగణన చేయాలని కేంద్రానికి సిఫారసు చేశాయి. వివిధ రాష్ట్రాలలో నియమించిన మొత్తం 246 బీసీ కమిషన్లు కూడా దాన్నే సిఫారసు చేశాయి. రిజర్వేషన్ల కేసులు వచ్చిన ప్రతిసారీ సుప్రీంకోర్టు, హైకోర్టులు కులగణన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాయి. జనాభా గణన పట్టికలో 35 కాలమ్స్ ఉన్నాయి. ఇంకో కాలమ్ పెడితే నష్టమేమిటి? ఒక్క రూపాయి అదనపు ఖర్చు లేకుండా దేశంలోని కులాల వివరాలన్నీ వస్తాయి కదా. కులగణన చేపడితే హిందువుల ఓట్లలో చీలిక వస్తుందని బీజేపీ భయపడుతోంది. ఇది అర్థం లేని వాదన. కుల ప్రస్తావన లేకుండా రోజువారీ వ్యవహారాలు జరగడం లేదు. కులం పునాదుల మీదనే భారతీయ సమాజం నిర్మాణం జరిగింది. కాబట్టి ఒక్కరోజు కులం ఏమిటో అడిగితే కులతత్వం పెరుగుతుందన్నది ఊహాజనితమైన ఆలోచన. కులపరమైన సమాచారాన్ని సేకరించినట్లయితే ఆయా కులాల మధ్యన ఘర్షణ జరిగే ప్రమాదముందని చెబుతోంది ప్రభుత్వం. మరి 1881 నుంచి 1931 వరకు బ్రిటిషు వారి హయంలో 6 సార్లు కుల జనగణన చేయలేదా! ప్రతి కుల గణనలో మతపరమైన, భాషా పరమైన వివరాలు సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలను లెక్కిస్తు న్నారు. ఇవన్నీ చేసినప్పుడు జరగని ఘర్షణలు బీసీల సమాచారం సేకరిస్తే జరుగుతాయనడం అహేతుకం. అణచివేతకు గురైన కులాలు అన్ని రంగాలలోనూ– విద్య, ఉపాధి, చట్ట సభలతో సహా– తమ జనాభా ప్రకారం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తారేమో అని పాలకవర్గాలు భయపడుతున్నట్లు కనిపిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు కులగణన జరుగుతున్నందున వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో రిజర్వేషన్లు పొందుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేశారు. బడ్జెట్ కేటాయిం పులు జరుగుతున్నాయి. కానీ బీసీ కులాల లెక్కలు లేనందున జనాభా ప్రకారం రిజర్వేషన్లు పొందడం లేదు. సబ్ ప్లాన్ లేదు. బీసీల జనాభా 56 శాతం ఉంటే కేవలం 25 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారు. కులాల వారీ లెక్కలు లేనప్పటికీ బ్రిటిష్ వారు 1931లో తీసిన జనాభా గణన ఆధారంగా బీసీలు మన రాష్ట్రంలో గత 47 సంవత్స రాలుగా అనంతరామన్ కమిషన్ రిపోర్టు ప్రకారం 25 శాతం రిజర్వే షన్లు పొందుతున్నారు. కేంద్రంలో మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం 29 సంవత్సరాల నుంచి ఉద్యోగ, విద్యా రంగంలో 27 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈ కాలంలో ఏయే కులాలు రిజ ర్వేషన్ల ఫలాలు పొందాయి, ఇంకా రిజర్వేషన్ ఫలాలు పొందని కులాలు ఏవి అనే వివరాలకు కులాల వారీ లెక్కలు అవసరం. రిజ ర్వేషన్ వలన లాభం పొందిన కులాలు, పొందని కులాల వివరాలు తెలిస్తే కొత్త మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంటుంది. కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లను నాలుగు గ్రూపు లుగా వర్గీకరణ చేయలేదు. ఈ బీసీ కులాల మధ్య సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. వీటి వర్గీకరణ జరగాలంటే ప్రతికులం జనాభా తెలియాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేసిన పిదప కేంద్రంలో బీసీ రిజర్వేషన్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి నాలుగేళ్ల క్రితం జస్టిస్ రోహిణి కమిషన్‌ను నియమించింది. కుల వివరాలు లేకపోవడంతో, జనాభా శాతం తెలియక ఆయా గ్రూపుల శాతం నిర్ణయించలేక కమి షన్ తుది రిపోర్టు ఇవ్వలేకపోతోంది. కుల గణన వివరాలు కావాలని కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ ఆరు లేఖలు రాసింది. బీసీలకు స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లు గత 34 ఏళ్లుగా అమలుచేస్తున్నారు. చట్టబద్ధమైన కులగణన వివరాలు లేక తాత్కా లికంగా ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి, లేదా లాటరీ పద్ధతిలో బీసీ స్థానాలు కేటాయిస్తున్నారు. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటా యించాలనే విషయంలో సరైన లెక్కలు లేక కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదు రవుతున్నాయి. కేంద్రంలో జాతీయ బీసీ కార్పొరేషన్, రాష్ట్రాలలో బీసీ కార్పొరేషన్‌తో పాటు ఆయా కులాలకోసం ప్రత్యేక ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ జనాభా వివరాలు లేక ఎంత బడ్జెట్ కేటాయించాలనే విషయంలో ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకసారి కులగణన చేస్తే 74 ఏళ్ల స్వతంత్ర భారత సాంఘిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం బయటకు వస్తుంది. స్వాతంత్య్ర ఫలాలు, ప్రజాస్వామ్య ఫలాలు ఏయే కులాలు ఎంత శాతం పొందా యనే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజకీయ, ఉద్యోగ, విద్యా, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో ఏయే కులాలకు ఎంత ప్రాతినిధ్యం ఉంది; ఎవరి ఆధీనంలో పరిశ్రమలు, ఆస్తులు, దేశ సంపద కేంద్రీ కృతమై ఉంది; ఇంతవరకు ఈ రంగాలలో అసలు ప్రాతినిధ్యం లేని కులాలు ఎన్ని అనేది గుర్తించి వాటిని ఎలా పైకి తేవాలనే పథకాలు రూపొందించడానికి కులాల వారీ జనగణన ఉపయోగపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద కులాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా బలహీన వర్గాల గృహ నిర్మాణం, భూముల కేటాయింపు, కులవృత్తులు, చేతివృత్తుల వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నాయి. కులగణన ఉంటే జనాభా ప్రకారం వీరికి ఎంత శాతం కేటాయించాలనే శాస్త్రీయమైన ఆధారాలు లభిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాలన సౌలభ్యం కోసం, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కోసం, అభివృద్ధి ఫలాలు అందరికీ అంద జేయడం కోసం కులగణన అవరసరం. ఈ వాస్తవాలను గుర్తించ కుండా కులతత్వం పెరుగుతుందనే సాకుతో, జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా అడుగుతారనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం కులాల వారీ జనగణనకు అంగీకరించడం లేదనేది బహిరంగ రహస్యం. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్: 90000 09164 -
జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దాసు సురేశ్
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: జాతీయ బీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దాసు సురేశ్ నియమితులయ్యారు. శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై.. సురేశ్‌ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అధికారికంగా ప్రకటించి నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాల్లో బీసీలను బలోపేతం చేయడానికి సురేశ్‌ను నియమించామన్నారు. సురేశ్ మాట్లాడుతూ.. అన్ని బీసీ వర్గాలను బలోపేతం చేసి రాజ్యాధికారం దిశగా బీసీలను నడిపించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జాతీయ బీసీ సేనా అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి కృష్ణయ్య హాజరయ్యారు. బీసీబంధు పథకం వెంటనే ప్రవేశపెట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సామాజిక తెలంగాణే లక్ష్మణ్ బాపూజీ లక్ష్యం: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ పనిచేశారని, తెలంగాణ సమాజానికి మహోన్నత వ్యక్తిగా నిలిచిన బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బాపూజీ 106వ జయంతి వేడుకలను ట్యాంక్‌బండ్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందడమే బాపూజీకి అసలైన నివాళి అని వ్యాఖ్యానించారు. అనంతరం జాతీయ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీని కొన్ని వర్గాలకు నాయకుడిని చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సంఘం నేతలు గుజ్జ కృష్ణ, వెంకటేశ్, జయంతి, ఉదయ్, అంజి, రాజు పాల్గొన్నారు. -
రజకబంధు పథకం ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, కవాడిగూడ(హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం రజకబంధు పథకం ప్రకటించి ఒక్కో రజక కుటుంబానికి రూ.10లక్షలు అందించాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇందుకోసం ప్రధాని మోదీ జాతీయస్థాయిలో కమిటీని వేయాలని కోరారు. అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద గురువారం నిర్వహించిన ధర్నాకు ఆర్.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రజకులకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించడంతోపాటు వారికి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కోఠి మహిళా కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు ముగ్గు అనిల్, బీసీ సంక్షేమసంఘం ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పాలన పక్కన పెట్టి కుట్రలు -
కేసీఆర్ అహంకారాన్ని బొందపెడతారు: ఈటల
ముషీరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అహంకారానికి తన ధర్మానికి మధ్య నడుస్తున్న పోటీ అని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కా లగర్భంలో కలసిపోతారని జోస్యం చెప్పారు. విద్యానగర్‌లోని బీసీభవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ«ధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను శనివారం కలసిన అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలవాలని అనుకుంటున్నారని, అయితే అక్కడి ప్రజలు చైతన్యవంతులని, కేసీఆర్ అహంకారాన్ని బొం దపెడతారని చెప్పారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షే మ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, సూర్యారావు, ఉదయ్‌నేత పాల్గొన్నారు. -
బీసీబంధు ఇవ్వకుంటే మహాఉద్యమం
కవాడిగూడ (హైదరాబాద్): బీసీబంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా మహాఉద్యమాన్ని చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. దళితబంధు పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, అయితే బీసీబంధు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో బీసీల సమర శంఖారావం నిర్వహించారు. దీనికి 76 కులసంఘాలు మద్దతు తెలుపగా.. మాజీ ఎంపీలు హనుమంతరావు, అజీజ్‌పాషా, ఆనందభాస్కర్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ హాజరై సంఘీభావం ప్రకటించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ హుజూరాబాద్ ఎన్నిక ముందే బీసీబంధును ప్రకటించకపోతే బీసీలెవరూ టీఆర్ఎస్కు ఓటు వేయరని చెప్పారు. హనుమంతరావు మాట్లాడుతూ హుజూరాబాద్‌లో దళితులు 42 వేల మంది మాత్రమే ఉన్నారని, బీసీలు లక్షా 20 వేల మంది ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు. -
ఇంటికొక ఉద్యోగం ఎక్కడ వచ్చింది?
సుందరయ్యవిజ్ఞానకేంద్రం (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంటికొక ఉద్యోగం వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఇంటికొక ఉద్యోగం ఎక్కడ వచ్చిందో చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కావాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 1,600 గ్రూప్–1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడంలేదని విమర్శించారు. అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చారన్నారు. భూకబ్జాదారులు, దొంగలు, చదవులేని వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని ఆరోపించారు. బహుజనులకు రాజ్యాధికారం కోసం యువత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జేఏసీ చైర్మన్ కోలా జనార్దన్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, సింహాద్రి, అంజి, ఆనందం, చాంద్‌పాషా, శ్రీనివాస్, గుజ్జ సత్యం తదితరులు పాల్గొన్నారు. -
బీసీబంధు పథకంపై కేసీఆర్ స్పందించాలి
కవాడిగూడ (హైదరాబాద్): బీసీ కులాలకు బీసీబంధు ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్ష చేపట్టారు. దీక్షను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ యాంత్రీకరణ, కార్పొరేటీకరణ, ఆధునీకరణ ద్వారా వృత్తులు కోల్పోయి అనేక కులాలు రోడ్డునపడ్డాయని, వీటిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంతో ఉపాధిలేక 46 మంది మనోవేదనకు గురై చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దీక్షలకు మధుయాష్కీ, కోదండరాం, దాసోజు శ్రావణ్, వి.హనుమంతరావు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా సంఘీభావం తెలిపారు. బీసీబంధు ప్రకటించకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు లాల్‌కృష్ణ, అరుణ్‌కుమార్, జనార్దన్, నీల వెంకటేశ్, సత్యనారాయణ, అంజి పాల్గొన్నారు. -
న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్ కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈమేరకు మంగళవారం కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి ఎస్పీ సింగ్ భగేల్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ వివిధ కోర్టుల్లో జరిగిన న్యాయమూర్తుల నియామకాల్లో ఇప్పటివరకు 3% కంటే ఎక్కువ బీసీలకు, 2% కంటే ఎక్కువ ఎస్సీ, ఎస్టీలకు అవకాశం రాలేదన్నారు. తాము చేసిన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు కృష్ణయ్య చెప్పారు. అనంతరం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కిషన్‌రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నేతలు కలిశారు. బీసీలకు సంబంధించిన డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
లక్ష మందితో పార్లమెంటును ముట్టడిస్తాం: ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్(హైదరాబాద్): ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో బీసీ సంఘాల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 27న బీసీల డిమాండ్లపై లక్షమందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామన్నారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో 48 బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలి
రాజమహేంద్రవరం సిటీ (సీటీఆర్ఐ)/పాలకొల్లు అర్బన్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 55 శాతం జనాభా కలిగిన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా అణచివేస్తున్నారన్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టడానికి 14 పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. బీజేపీ అంగీకరిస్తే ఒక్క రోజులోనే ఈ బిల్లు పాసవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీసీ కావడంతో ఆయనపైనే బీసీలు ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. మోదీ హయాంలో ఈ బిల్లు పెట్టకపోతే చరిత్ర ఆయనను క్షమించదన్నారు. లోక్‌సభలో 94 మంది బీసీ ఎంపీలున్నారని, పార్టీలకతీతంగా వీరందరూ బిల్లుకు మద్దతివ్వాలని, లేకుంటే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2021–22 జనగణనలో కులాల వారీగా బీసీ జనాభాను లెక్కించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. జాతీయ స్థాయిలో రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలపై విధించిన షరతులను ఎత్తివేయాలని కోరారు. పంచాయతీరాజ్‌లో సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని, వీటికి రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానించారు. -
బీసీ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్సీపీదే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ రాజ్యసభలో బీసీ బిల్లును పెట్టిన ఘనత ఒక్క వైస్సార్సీపీకే దక్కు తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. భారత దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని కితాబిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవగా, వచ్చే పార్లమెంట్ సమావేశా ల్లో సైతం బీసీ బిల్లు పెడతామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. కాగా, ఆదర్శ పాఠశాల ల్లో పనిచేసే 1,000 మంది టీచర్లకు వెంటనే 7 నెలల జీతాలు చెల్లించడంతో పాటు వీరిని రెన్యువల్ చేయాలని ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఏపీలో నూతన విద్యా విధానం భేష్: ఆర్.కృష్ణయ్య
సాక్షి, ప్రకాశం: ఏపీలో విద్యా విధానం బాగుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న విద్యా పథకాలు బీసీ విద్యార్థులకు మేలు చేస్తున్నాయని కొనియాడారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాల అమలుతో అణగారిన వర్గాలకు వరం లాంటివని ఆర్.కృష్ణయ్య తెలిపారు. -
బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం: ఆర్. కృష్ణయ్య
సాక్షి, గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ' బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం' అంటూ తెలిపారు. -
బీసీ బిల్లును రాజ్యసభలో పెట్టిన ఘనత సీఎం జగన్‌దే
సాక్షి, అమరావతి: చరిత్రాత్మక బీసీ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, అవినీతికి తావులేని, సమర్థవంతమైన, ప్రజారంజక పాలన అందిస్తున్న సీఎంగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో గురువారం కృష్ణయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీలకు సంబంధించిన పలు డిమాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సింగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం, కాంట్రాక్ట్‌లు, నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించడం వంటి చర్యలతో పేద వర్గాలకు దగ్గరయ్యారని అభినందించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీల డిమాండ్లు నెరవేర్చేందుకు కృషిచేయాలని సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు ఏపీ: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం -
ప్రైవేటులోనూ రిజర్వేషన్లు ప్రజల హక్కు
దేశంలో ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు. ఉన్న ఖాళీలను నింపడం లేదు. దీనికితోడు ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి చర్యలు ఊపందుకుంటున్నాయి. మరి దేశంలో ఉన్న ఉద్యోగాలన్నీ ప్రైవేటురంగంలోకే పోయినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల మాటేమిటి? సామాజిక న్యాయం బాధ్యత ఎవరు తీసుకోవాలి? స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఈ వర్గాలు ఇంకా పైకి రాలేవన్నది చేదునిజం. ప్రైవేటు సంస్థల పైస్థాయి ఉద్యోగాల్లో ఈ వర్గాల ప్రజలు నామమాత్రంగా ఉన్నారన్నది నగ్నసత్యం. కాబట్టి కేంద్రప్రభుత్వం సామాజిక అసమానత లను తొలగించే బాధ్యత నుంచి తప్పుకోకూడదు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోకతప్పదు. ‘‘కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తాయి, వ్యాపారాలు చేయడం ప్రభుత్వాల బాధ్యత కాదు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బహి రంగంగా పలుమార్లు ప్రకటించారు. పరిశ్రమ, సేవా రంగాలను దశల వారీగా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నదనేది స్పష్టం. అందులో భాగంగా రైల్వే, ఎల్ఐసీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, బ్యాంకింగ్, రక్షణ, బొగ్గు సంస్థలు, విశాఖ ఉక్కు పరి శ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. దీన్ని ప్రజలు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయన్నది ఒక కారణమైతే, అందులో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతామనే అభద్రత మరో కారణం. అలాగే ప్రైవేటీకరణ వల్ల రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలు జరగదనీ, రద్దు చేయకుండానే రిజర్వేషన్లు రద్దవుతాయనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలుకు అంగీకరించడం లేదు. ప్రైవేటు పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వం వద్ద అన్ని రకాల సహాయ, సహకారాలు తీసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వ నియమాలను పాటించడం లేదు. ఉద్యోగ రంగంలో 90 శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. కేవలం 10 శాతం ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి పాదనలో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తే మరో 26 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పోతాయి. అప్పుడు అవి 7 శాతానికి తగ్గుతాయి. ఉద్యో గాల్లో ప్రైవేటు రంగం విస్తరిస్తున్న క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజ ర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ బలంగా ముందుకు వస్తున్నది. ప్రైవేటురంగం విస్తరిస్తూ పోతే సమాజంలో సాంఘిక, ఆర్థిక అస మానతలు మరింత పెరుగుతాయి. రాజ్యాంగంలో పేర్కొన్న సమ సమాజం, సామాజిక న్యాయం పుస్తకాల్లోని పదాలుగా మిగిలి పోతాయి. ఆర్థిక అసమానతల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. సంపద కొంతమంది బడా పారి శ్రామికవేత్తల చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల రూపంలో లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. అవి కోట్లాది ప్రజల ఆస్తులు. ఇన్ని ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగిం చడం ప్రభుత్వం చేయవలసిన పని కాదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకు ప్రభుత్వం ఆమోదించాలి. ఇది న్యాయమైన డిమాండ్ అని సమాజాన్ని ఒప్పించాలి. అలాగే దీనికి రాజ్యాంగపరంగా న్యాయపరమైన అవరోధాలు ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలించాలి. ఇవి సాధించుకోవడానికి ఉద్యమాలు, వ్యూహాలు రూపొందించుకోవాలి. పార్లమెంటులో పాలక, ప్రతి పక్షాలు ఈ అంశం మీద విస్తృతంగా చర్చించాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టడానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. రాజ్యాంగంలోని 15 (4), 16(4) ప్రకారం ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్న భావన నిబిడీకృతమై ఉంది. ఒకవేళ రాజ్యాంగ సవరణ అవసరమైనా దీనికి అభ్యంతరం చెప్పే రాజకీయ పార్టీలు ఉన్నాయా? సామాజిక న్యాయ సిద్ధాంతానికి విరుద్ధంగా అగ్రకులాల్లోని పేదలకు రెండు రోజుల్లో పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేసి 10 శాతం రిజర్వేషన్లు పెట్టిన కేంద్రం, 90 శాతం జనాభా గల పేద కులాలకు రిజర్వేషన్లు పెడితే అభ్యంతరాలు చెప్పే వారు ఉంటారా? పాలక పక్షం తలుచుకుంటే ఈ రిజర్వేషన్లు అమలు చేయడం ఒక లెక్కలోది కాదు. ఒక్కరోజు పని మాత్రమే. ఇప్పుడు ప్రైవేటు రంగంలో ఏ కేటగిరీ ఉద్యోగాల్లో ఎవరు న్నారు? మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జి్జక్యూటివ్ డైరెక్టర్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? జనరల్ మేనేజర్లు, ఇంజినీర్లు, ఆఫీసర్లు, సూపర్వైజరు వగైరా ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? అటెండర్లు, స్వీపర్ల ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు? ఇందులో పైస్థాయి ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు నామమాత్రంగా కూడా లేరనేది నగ్నసత్యం. వివిధ స్థాయిల్లో అధికార, అనధికార సంస్థలు జరిపిన సర్వేల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్లో ఈ వర్గాల వారు ఐదు శాతం కూడా లేరని తేలింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలావుంటే సామాజిక న్యాయం ఇంకెప్పుడు సాధ్యమవుతుంది? ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల డిమాండ్ రెండు కోణాల్లో సమర్థ నీయం. ఈ కంపెనీలకు ప్రభుత్వమే రాయితీల మీద భూమి, ముడి సరుకు, ఇతర మౌలిక సదుపాయాలు సమకూరుస్తుంది. అలాగే ఇందులో చెమటోడ్చే కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు. అలాంటప్పుడు అధికారం చలాయించే చోట ఈ వర్గాలు ఉండరాదా? ఈ పరిశ్రమల ఉత్పత్తుల్ని సంపన్న వర్గాలే కొనవు. 90 శాతం గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే సింహభాగం కొంటారు. కొనుగోలులో అన్ని కులాల భాగస్వామ్యం ఉన్నప్పుడు పాలనలోనూ వాటా కల్పించడానికి అభ్యంతరం ఏమిటి? ఇంకొక విషయాన్ని గమనించాలి. ఒకనాడు బీసీ కులాల వారు చేసిన కులవృత్తులు, చేతి వృత్తులు నేడు పారిశ్రామికీకరణ చెందాయి. పద్మశాలీలు, దేవాం గులు నేసిన చేనేత వృత్తి బట్టల మిల్లులుగా మారిపోయింది. కమ్మరి, కంచరి పని ఉక్కు, ఇనుము కంపెనీలుగా మారిపోయింది. మేదరి, ఎరుకల వారి గంపలు, బుట్టలు, చాటలను, కుమ్మరివాళ్ల కుండలను ప్లాస్టిక్, స్టీలు పరిశ్రమలు తన్నుకుపోయాయి. ఒకప్పుడు వృత్తులకు యజమా నులైన ఈ కులాలవారు కనీసం ఇందులో ఉద్యోగులు కాకపోతే సామాజిక న్యాయం ఎలా సాధ్యం? మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద పునాదులతో పెట్టుబడిదారీ విధానం అవలం బించే దేశం. అలాంటప్పుడు ప్రభుత్వాలు వ్యాపారం చేసే బాధ్యత తీసుకోవని ప్రధాని ప్రకటించడాన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో వేగ వంతమైన అభివృద్ధికి ప్రైవేటీకరణే కారణమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. ప్రైవేటీకరణ వల్ల యాజమాన్య పర్యవేక్షణ కట్టుదిట్టంగా అమలవుతుంది. పని సంస్కృతి మారుతుంది. జవాబుదారీతనం పెరుగుతుంది. వృథా తగ్గుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. అందులో సందేహం లేదు. చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలు, జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాలు శీఘ్రగతిన అభివృద్ధి చెందడానికి ప్రైవేటీకరణే ప్రధాన కారణం. కానీ మనదేశంలో ఇప్పటికే 95 శాతం పారిశ్రామిక రంగం ప్రైవేట్ రంగంలోనే ఉంది. ఇంకా ముందుకు పోవడం వాంఛనీయం కాదు. కొత్త పరిశ్రమలను ప్రైవేటు రంగంలో చేరిస్తే అభ్యంతరం లేదు. కానీ పాతవాటిని, కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించేవాటిని, ప్రజా సేవలో భాగమైన రైల్వేలను, ప్రభుత్వానికి అవసరమైన అప్పులు ఇచ్చే ఎల్ఐసీ లాంటి వాటిని కూడా ప్రైవేటీకరించడాన్ని సమాజం అంగీకరించదు. రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. రిటైర్ అవుతున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయడం లేదు. కొత్త ఉద్యో గాలు సృష్టించడం లేదు. పైగా శాశ్వత ఉద్యోగాలను తగ్గిస్తూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ లెక్చరర్లు, గెస్టు టీచర్లు విద్యా వాలంటీర్లు, ఎన్‌ఎంఆర్‌లు అంటూ రకరకాల పేర్లతో రిజర్వేషన్లు లేకుండా చేశారు. ప్రైవేటీకరణ రహస్య ఎజెండా వెనకనే ఈ వర్గాలకు ఉద్యోగాలు దక్కకుండా చేయాలనే కుట్ర ఉంది. అలాంటప్పుడు అంత సులభంగా రిజర్వేషన్లు పెడుతారా! అందుకే ఈ కులాలు పెద్ద పోరాటం చేయక తప్పదు. వీరి అభివృద్ధి ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద, సమాజంలోని ఆధిపత్య కులాల సానుభూతి మీద ఆధార పడిలేదు. ఇది భిక్షంగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించాలి. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్ : 90000 09164 -
తుది అంకానికి ఓబీసీ వర్గీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ ఆయా కులాల మధ్య రిజర్వేషన్లను దామాషా ప్రకారం పంచేందుకు వాటిని నాలుగు కేటగిరీలుగా ప్రతిపాదిస్తూ ముసాయిదా నివేదిక రూపొందించింది. ఆయా ప్రతిపాదనలను రాష్ట్రాలు, సంబంధిత భాగస్వాములతో చర్చించేందుకు సిద్ధమైంది. ఈ దిశగా మార్చి నెల నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 2,633 కులాలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తూ.. వరుసగా 2, 6, 9, 10 శాతం రిజర్వే షన్లను పంపిణీ చేస్తూ కమిషన్ ప్రతిపాదించి నట్టు సమాచారం. రిజర్వేషన్ ఫలాలు పొందని, అత్యంత వెనబడిన కులాలను మొదటి కేటగిరీలో పొందు పరిచినట్టు తెలుస్తోంది. నాలుగో కేటగిరీలో 97 కులాలు మాత్రమే ఉన్నప్పటికీ... జనాభా పరంగా చూస్తే సింహభాగం వారే ఉన్నారు. కాబట్టి 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లలో జనాభా ప్రాతిప దికన అత్యధికంగా 10% వారికే దక్కనుందని సమా చారం. 4వ కేటగిరీలో సామాజికంగా బలమైన, అత్యంత ప్రభావవంతమైన కులాలున్నాయి. గతం లోనూ ఈ కులాలే రిజర్వేషన్ల ఫలాలు అధికంగా పొందినప్పటికీ... జనాభా నిష్పత్తికి మించి వీరికి ప్రయోజనం కలిగిందనేది ఇతరుల అభ్యంతరం. మొదటి కేటగిరీలో 1,674 కులాలు, రెండో కేటగిరీలో 534 కులాలు, మూడో కేటగిరీలో 328, నాలుగో కేటగిరీలో 97 కులాలు పొందుపరిచినట్టు సమాచారం. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాలకు ప్రస్తుతం విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లలో మెజారిటీ భాగం కొన్ని కులాలకు మాత్రమే అందుతున్నాయని, ఓబీసీల్లో అత్యంత వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదంటూ బీసీ సంక్షేమ సంఘాల డిమాండ్లు, జాతీయ బీసీ కమిషన్ సిఫారసులు, స్థాయీ సంఘాల సిఫారసుల నేపథ్యంలో 2017 అక్టోబరు 2వ తేదీన ఈ కమిషన్ ఏర్పాటైంది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ అదే ఏడాది అక్టోబరు 10 నుంచి తన పని ప్రారంభించింది. ఈ కమిషన్ 12 వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు కేంద్ర మంత్రిమండలి ఈ కమిషన్ గడువు పొడిగించింది. ప్రస్తుతం 2021 జూలై 31కి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ కమిషన్ నాలుగు విధి విధానాల ఆధారంగా నివేదిక సమ ర్పించాల్సి ఉంటుంది. కేంద్ర జాబితాలో చేర్చిన ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాల పంపిణీలో అసమానతలు పరిశీలించడం, ఓబీసీ కులాల ఉప వర్గీకరణ కోసం శాస్త్రీయ విధానంలో నిబంధనలు రూపొందించడం, కేంద్ర జాబితాలో ఓబీసీలను ఉపకులాల వారీగా వర్గీకరించడం, కేంద్ర జాబితాలోని వివిధ ఎంట్రీలను అధ్యయనం చేసి అక్షర దోషాలు, పునరావృతులు, అస్పష్టతలు, లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడం.. తదితరæ నాలుగు విధివిధానాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ప్రవేశాల్లో... రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందని ఓబీసీ కులాలకు.. ఈ కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఓబీసీ జాబితాలో ఉన్న అటువంటి అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా కమిషన్ సిఫారసులు చేస్తుంది. సున్నితమైన అంశం... రాజకీయంగా ప్రాధాన్యత ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్లలో కొన్ని కులాలకే లబ్ధి చేకూరినట్టు కమిషన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఓబీసీలకు కేటాయించిన వాటిలో 97% మేర విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగాలు కేవలం 25% ఓబీసీ కులాలకే దక్కాయని, ఇందులో 24.95% ఉద్యోగాలు కేవలం 10 ఓబీసీ కులాలకే దక్కాయని, దాదాపు 983 కులాలకు (అంటే 37%) విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేకుండాపోయిందని కమిషన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది. 994 ఓబీసీ కులాలకు 2.68% మేర కోర్సుల్లో సీట్లు, ఉద్యోగాలు దక్కినట్టు సమాచారం. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ తనకు అప్పగించిన విధివిధానాల మేరకు ఆయా అసమానతలను తొలగించాల్సి ఉన్నందున.. ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలను అధికంగా పొందిన కులాలను చివరి కేటగిరీలో చేర్చాల్సి వస్తుందని అంచనా. దేశంలో రాజకీయా లపై కులాల ప్రభావం ఎక్కువ ఉంటున్నందున.. రిజర్వేషన్లు తగ్గితే అధిక ప్రాబల్యం ఉన్న కులాల నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయోనన్న చర్చ నడుస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన రిజ ర్వేషన్లు ఉండనున్నందున అలాంటి సమస్య తలె త్తదని, ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని వారికి లబ్ధి చేకూరుతుందని, తాము లేవనెత్తిన అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ‘సాక్షి’కి తెలిపారు. సమాచారాన్ని విశ్లేషించిన కమిషన్ 11 రాష్ట్రాల్లో ఇప్పటికే బీసీ వర్గీకరణ అమలవుతోంది. అయితే ఆ వర్గీకరణ రాష్ట్ర జాబితాలోని కులాలకు రాష్ట్రస్థాయిలో వర్తిస్తుంది. ఇప్పుడు ఈ జాతీయస్థాయి కమిషన్ కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ల పంపిణీకి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీసీ కులాల ఉప వర్గీకరణ చేపట్టిన అన్ని రాష్ట్రాలతో, రాష్ట్ర స్థాయి వెనుకబడిన తరగతుల కమిషన్లతో ఈ కమిషన్ చర్చించింది. ఉన్నత విద్య కోర్సుల్లో ఓబీసీ విద్యార్థుల ప్రవేశానికి సంబంధించిన సమాచా రాన్ని, ప్రభుత్వంలో భాగమైన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఓబీసీలకు ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కమిషన్ సేకరించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ఇప్పటివరకు రిజర్వేషన్ పంపిణీలో చోటు చేసుకున్న అసమానతలను విశ్లేషించింది. సంబంధిత సమాచారం భారీ పరిమాణంలో ఉన్నందున దానిని శాస్త్రీయంగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించేందుకు సమయం అవసరమైంది. అలాగే లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాల నుంచి సమాచారం రావడం ఆలస్యమైంది. వీటన్నింటినీ విశ్లేషించి, ముసాయిదాను రూపొందించిన కమిషన్ తన ప్రతిపాదనలపై వచ్చే నెల నుంచి రాష్ట్రాలు, ఓబీసీ కులాలు, సంబంధిత అంశంలో భాగస్వాములందరితో చర్చించనుంది. -
ఈ ఎత్తుగడ కోటా ఎత్తివేతకేనా?
కేంద్ర ప్రభుత్వం తన పరిధి తగ్గించుకుంటూ క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడానికి నిర్ణయాలు తీసుకుంటోంది. దీని మూలంగా అవి బడా కార్పొరేట్ల అధీనంలోకి వెళ్లిపోతాయి. అలా జరిగితే వాటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలు ఉండదు. అంటే చట్టబద్ధంగా రద్దు చేయకుండానే ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇది. దీని మూలంగా వందల సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న కులాలకు అధికారంలో వాటా దక్కకుండా అన్యాయం చేయడమే అవుతుంది. సామాజిక న్యాయం, సమ సమాజం నెలకొల్పాలనే రాజ్యాంగ లక్ష్యాలను ఇది విస్మరించడమే. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగని పని. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, పోస్టల్, బీహెచ్ఈఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడానికి నిర్ణయాలు తీసుకుంటోంది. దీని మూలంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు బడా కార్పొరేట్ దిగ్గజాల అధీనంలోకి వెళ్లిపోతాయి. ప్రభుత్వ రంగ సంస్థల వాటా 51 శాతం అమ్మిన, యాజమాన్య హక్కులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పిన వాటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామజిక వర్గాల రిజర్వేషన్ల అమలు ఉండదు. దీని మూలంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన రిజర్వేషన్లకు తిలోదకాలు ఇచ్చినట్లు అవుతుంది. చట్ట బద్ధంగా రద్దు చేయకుండానే ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేయడం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో రెండు కోణాలున్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా తన పరిధిని తగ్గించుకొని బలహీన పరుచుకోవడం. తద్వారా ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. రెండవది, సామాజిక న్యాయా నికి గండికొట్టడం. దీని మూలంగా వందల సంవత్సరాలుగా వివక్ష, అణచివేతల వల్ల అధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు అధికారంలో ఇప్పటికీ వాటా దక్కకుండా అన్యాయం చేయడం. సామాజిక న్యాయం, సమ సమాజం నెలకొల్పాలనే లక్ష్యా లను ఇది విస్మరించడమే. చట్ట ప్రకారం రిజర్వేష న్లను రద్దు చేయ కుండా, దొడ్డి దారిన ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 245 సంస్థలు ఉన్నాయి. ఇందులో దాదాపు 26 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రైల్వేలో 13 లక్షలు, ఎల్ఐసీలో 2 లక్షలు, బీఎస్ఎన్ఎల్లో 3 లక్షలు, బీహెచ్ఈఎల్లో లక్షా 90 వేలు– ఇలా మొత్తం 26 లక్షల ఉద్యోగాలు పోతాయి. 51 శాతం వాటాలను కార్పొరేట్ సంస్థలకు అమ్మితే ప్రభుత్వం యాజమాన్య హక్కును కోల్పోతుంది. దీనితో ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నియంత్రణ ఉండదు. రిజర్వేషన్ల అమలు ఉండదు. ఇది ఇలా ఉండగా మరోవైపు జాతీయ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టారు. దీనితో బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యో గాల సంఖ్య తగ్గి రిజర్వేషన్ల కోటా తగ్గిపోతుంది. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా బలంగా ముందుకు వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను పక్కన పెట్టి, ఉన్న రిజర్వేషన్లకే గండికొట్టే కుట్రకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రంగాల్లో– విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, న్యాయ రంగాల్లో జనాభా ప్రకారం కోటా ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కోటా కల్పించారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో, రాజ్యసభ, కౌన్సిల్, నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం కోటా కల్పిం చలేదు. ఇక బీసీలకు స్వాతంత్య్రం వచ్చిన 36 ఏళ్ల తర్వాత మండల్ కమిషన్ నివేదిక ప్రకారం, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత కేంద్ర విద్యా సంస్థలలో 27 శాతం రిజర్వే షన్లు పాక్షికంగా ప్రవేశ పెట్టారు. జాతీయ స్థాయిలో బీసీల జనాభా 56 శాతం ఉంటే 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టడం లేదు. అనేక సాకులు చూపుతూ దాటవేస్తున్నారు. కానీ రాజ్యాంగంలో లేని అగ్ర కులాల్లోని పేదలకు మాత్రం ఆగమేఘాల మీద రాజ్యాంగ సవరణ చేసి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే ఆటోమేటిగ్గా రిజ ర్వేషన్లు పోతాయి. దీనివల్ల 17 నుంచి 20 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉద్యోగాలు కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 14 లక్షల ఉద్యోగాలను కొన్నేళ్లుగా భర్తీ చేయకుండా పెండింగులో పెట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యో గాల్లో 1993 నుంచి మండల్ కమిషన్ ప్రకారం రిజర్వేషన్ల కోటా ప్రారంభించిన తర్వాత ఉద్యోగాల భర్తీ ఆపేశారు. దీంతో రిజర్వేషన్లు ఉన్నా ఆయా వర్గాలకు ఉపయోగం లేకుండా పోయింది. మండల కమిషన్ అమలు తర్వాత ఈ 37 సంవత్సరాల కాలంలో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2016 నాటికి ఓబీసీ ఉద్యోగులు 14 శాతం దాటలేదు. ప్రత్యేకంగా క్లాస్–1 ఉద్యోగుల్లో ఓబీసీలు 9 శాతం దాటలేదు. సివిల్ సర్వీసులో పూర్తిస్థాయి ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఐఏఎస్‌లో 1657 ఖాళీలు, ఐపీఎస్‌లో 1420 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఇన్ని ఖాళీలున్నా నాణ్యత తగ్గుతుందనే సాకుతో ఏటా ఐఏఎస్‌లో 100 లోపు, ఐపీఎస్‌లో 120 లోపు ఖాళీలు మాత్రమే భర్తీ చేస్తున్నారు. రక్షణ, బ్యాంకింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. దీని మూలంగా రిజర్వేషన్ కోటా భర్తీ కాక ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నా మొత్తం ఉద్యోగాల్లో ఇప్పటి వరకూ 12 శాతం దాటలేదు. ఎస్టీలకు 7.5 శాతం అమలు చేస్తున్నా జాతీయ స్థాయిలో 5 శాతం దాటడం లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కేంద్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 56 లక్షలు కాగా ఇందులో 26 లక్షల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు పోతే, మిగిలేది 30 లక్షల ఉద్యో గాలు మాత్రమే. పెరుగుతున్న జనాభా, బడ్జెట్, సంక్షేమ అభివృద్ధి పథకాలకు తగ్గట్లుగా ఉద్యోగాల సంఖ్య పెరగాలి. ప్రభుత్వరంగ వ్యవ స్థను విస్తరించడం, బలోపేతం చేయడం ప్రజాస్వామ్య లక్షణం. కుదిం చడం, ప్రైవేటీకరించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగదు. ఒకవైపు అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుండగా మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ‘మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ’ సామెతను గుర్తుతెస్తోంది. ఆర్థికమాంద్యంతో దెబ్బతిన్నందువల్లే ఆర్థిక వనరులు పెంచు కోవడానికి ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు విక్రయిస్తున్నామనే కేంద్ర ప్రభుత్వ వాదన సరికాదు. బడ్జెట్ పెంచుకోవడానికి అనేక మార్గాలు న్నాయి. నగదు ముద్రించడం, డిపాజిట్లు సేకరించడం, విదేశీ రుణాలు తేవడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. ఎన్నికలకు ముందు బీజేపీ దేశ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెస్తామని ప్రకటించింది. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు దేశంలో ఉన్న నల«్లధనాన్ని వెలికితీయడానికి అవరోధాలు ఏమిటి? నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. 50 శాతం కేంద్రానికీ, మిగతాది ఆయా వర్గాలకూ ప్రోత్సాహకాల కింద క్రమబద్ధీకరణ చేసుకొమ్మని పిలుపునిస్తే దేశంలోని పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, కాంట్రాక్టు రంగాల నుంచి 60 లక్షల కోట్ల నల్ల ధనం ప్రభుత్వ ఖాతాలో చేరుతుంది. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. ఇలాంటి పథకాలు పెట్టడానికి అవరోధాలు ఏమిటి? ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకోవడం కంటే ప్రభుత్వరంగ ఆస్తులను చౌకగా కార్పొరేటు వర్గాలకు ధారాదత్తం చేయడమే లక్ష్యంగా కనబడుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అధికార చట్రంలోకి వస్తున్న సమయంలోనే ఈ సంస్థలను ప్రైవేటీకరించడం, పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవడం జరుగుతోంది. 2014లో తాము అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. కోటి ఉద్యోగాలు దేవుడెరుగు! ఖాళీ ఉద్యోగాల భర్తీయే లేదు. ప్రభుత్వరంగ సంస్థలను కొనసాగించడం, కొత్తవి ప్రారంభించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. అలా చేయకుండా రైల్వేను కూడా ప్రైవేటీకరిం చడం విచిత్రమైన విషయం. రైల్వేకు లక్షల కోట్ల భూములు, భవ నాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. వీటిని చౌక ధరలకు కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం న్యాయమా? ఏటా వేల కోట్ల లాభాలు ఆర్జించే సంస్థ, ఏటా కోట్లమంది పేద ప్రజలకు తక్కువ చార్జీలకు సేవలందిస్తున్న సంస్థను ప్రైవేటీకరించడంలో హేతుబద్ధత ఉందా? 40 కోట్ల మంది పాలసీదారులకు అండగా నిలిచే ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఉందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేలకోట్ల అప్పులు ఆపత్కాలంలో ఇచ్చి ఆదుకున్న సంస్థ అది. లాభాల్లో నడిచేవాటిని ప్రైవేటీకరణ చేయడంలో ఉన్న రహస్య మేమిటో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ప్రజలకు మరిన్ని సేవలు అందించే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడం న్యాయమా? అధికారంతో ఏది చేసినా చెల్లు తుందని అనుకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్. కృష్ణయ్య మొబైల్: 90000 09164 -
రిజర్వేషన్ల ప్రాణంతీస్తున్న ప్రభుత్వాలు
బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను గండి కొట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఈ వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం కోటా ఇవ్వడాన్ని చట్టబద్ధం చేసింది. కాంట్రాక్టులలో, పారిశ్రామిక పాలసీలలో, నామినేటెడ్ పోస్టులలో జనాభా ప్రకారం కోటా ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అమ్మఒడి, రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ వంటి పథకాలతో పేదకులాల పిల్లలు ప్రతి ఒక్కరూ చదువుకునేటట్లు చేశారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో దేశమంతటా జరుగుతున్న అన్యాయంపై ఐక్యంగా గళమెత్తకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీల బతుకు అంధకారంలో మునిగిపోతుంది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం బీసీ రిజర్వేషన్లకు గండికొట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీసీ/ ఎస్సీ/ఎస్టీ వర్గాలకు అన్ని రంగాలలో జనాభా ప్రకారం కోటా ఇవ్వడాన్ని చట్టబద్ధం చేశారు. కాంట్రాక్టులలో, పారిశ్రామిక పాలసీలలో, నామినేటెడ్ పోస్టులలో జనాభా ప్రకారం కూడా ఇస్తూ చట్టబద్ధం చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ చొప్పున 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్‌తో సహా 13 మంది డైరెక్టర్లను నియమించి, ఆయా కులాల నాయకత్వాన్ని పెంచారు. బడ్జెట్ కేటాయించి ఆయా కులాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పాఠశాల స్థాయిలో అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఒక్కరికీ 15 వేలు చొప్పున అలాగే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్ మంజూరు, కాలేజీ స్థాయిలో 20 వేల స్కాలర్షిప్ మంజూరు చేస్తూ పేద కులాలను ప్రతి ఒక్కరూ చదువుకొనేటట్లు చేశారు. కానీ, ఇంకొకవైపు కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. నీట్లో కేంద్ర ప్రభుత్వ కోటా కింద వచ్చే మెడికల్ అడ్మిషన్లలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. లక్నోలోని అంబేడ్కర్ యూనివర్సిటీ విద్యాసంస్థల అడ్మిషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. అలాగే నల్సార్ యూనివర్సిటీ ‘లా’–అడ్మిషన్లలో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. దీనికి తోడు క్రీమీలేయర్ పరిధిలో మరి కొన్ని వర్గాలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను జాతీయ బీసీ కమిషన్, అలాగే ఓబీసీ–పార్లమెంటరీ కమిటీ వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన ఉపసంహరించుకుంది. అలాగే 2021లో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కులాల వారీగా జనాభా గణన చేయరాదని నిర్ణయించింది. 2018 ఆగస్టు 31న బీసీ కులాల జనాభా లెక్కలు తీయాలని కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయించింది. ఆ తరువాత ఇటీవల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. బీసీల జనాభా లెక్కలు లేకపోవడంతో పంచాయతీరాజ్ సంస్థలలో ఏయే స్థానాలు బీసీలకు కేటాయించాలో ఎంత శాతం నిర్ణయించాలో తెలియక ప్రభుత్వాలే ఇబ్బంది పడుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం బీసీ జాబితాను గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి నియమించిన జస్టిస్ రోహిణి కమిటీకి బీసీల జనాభా లెక్కలు అందుబాటులో లేక వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక పథకం ప్రకారం రిజర్వేషన్లకు గండి కొడుతోంది. ఇటీవల ప్రారంభించిన 5 ప్రైవేటు యూనివర్సిటీలలో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయరాదని నిర్ణయించారు. రాజ్యాంగం ప్రకారం ఇవ్వవలసిన రిజర్వేషన్లను ఈ యూనివర్సిటీలలో పెట్టబోమని దర్జాగా విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో ఈ ఐదు వర్సిటీలకు ఒక్కొక్క యాజమాన్యం క్రింద 20 నుంచి 50 ఇంజనీరింగ్, తదితర కాలేజీలు ఉండేవి. రిజర్వేషన్లు ఎత్తివేయడానికే ఈ కాలేజీలను యూని వర్సిటీలుగా మార్చారా! ప్రైవేటు విద్యాసంస్థల్లో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు పెట్టాలని 2006లో పార్లమెంటులో చట్టం చేశారు. 1980లో అప్పటి ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ ప్రారంభించినపుడు బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు పెట్టలేదు. అప్పుడు బీసీ విద్యార్థి సంఘం పెద్దఎత్తున ఆందోళన చేయగా ప్రభుత్వం దిగివచ్చి ప్రైవేటు విద్యాసంస్థలలో రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో చట్టం చేసింది. అప్పటి నుంచి ప్రైవేటు ఇంజనీరింగ్ పీజీ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలలో బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం. అలాగే పంచాయతీరాజ్ ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ మెంబర్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుండి 22 శాతంకు తగ్గించారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ కులాలవారు ఓట్లు వేసి అగ్ర కులాల వారిని గత 74 ఏళ్లలో 32 మందిని సీఎంలను చేశారు. వేలాది మందిని ఎంపీలు, ఎమ్మెల్యేలుగా, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రులుగా చేశారు. కానీ బీసీలు కనీసం సర్పంచులయితే కూడా ఈ అగ్రకుల నాయకులు ఓర్వలేక పోతున్నారు. బీసీ సంక్షేమ సంఘం 1986లో పోరాడి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పెట్టిస్తే ఓర్వలేని అగ్రకుల ప్రభుత్వాలు వీటిని 34 శాతం నుండి 22 శాతంకు తగ్గించారు. బీసీ కులాల జనాభా గ్రామీణ ప్రాంతాలలో 64 శాతం ఉంటే 22 శాతంకు రిజర్వేషన్లను తగ్గించడంలో ఏమైనా న్యాయం ఉందా! మొత్తం గ్రామ పంచాయతీలు 12,751 కాగా 56 శాతం జనాభా గల బీసీలకు 6,822 గ్రామ పంచాయతీలు దక్కాలి. పోనీ గతంలో మాది రిగా 34 శాతం రిజర్వేషన్లు అమలు ప్రకారం 4,300 గ్రామపంచాయతీలు బీసీలకు దక్కాలి. కానీ బీసీ రిజర్వేషన్లు లెక్కించేటపుడు గిరిజనులకు కేటాయించిన రిజర్వేషన్లను కట్ చేసిన తర్వాత వచ్చే సంఖ్య ఆధారంగా లెక్కించి అన్యాయం చేశారు. దీనితో కేవలం 2,332 పంచాయితీలను మాత్రమే బీసీలకు కేటాయించారు. అంటే 18 శాతం కేటాయించి బీసీలకు అన్యాయం చేశారు. రిజర్వేషన్లు తగ్గించడం వలన రెండు వేల గ్రామ సర్పంచులు, 23 వేల వార్డు మెంబర్లు బీసీలకు రావలసినవి దక్కకుండా పోయాయి. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, మండల్ పరిషత్ చైర్మన్ పదవులను కూడా బీసీ రిజర్వేషన్లను తగ్గించి బీసీల నాయకత్వాన్ని ఉద్దేశపూర్వకంగా అణచివేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును సమర్థిస్తూ వాదించవలసిన రాష్ట్ర ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది. బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించారు. మెడికల్ కౌన్సెలింగ్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బి.సి రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకుండా 550 జీవోకి గండి కొట్టారు. మెడికల్ కౌన్సెలింగ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ల సందర్భంగా గత 20 ఏళ్లుగా పాటిస్తున్న జీవో నంబర్ 550 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ జీవోకు సవరణ చేస్తూ 114 జీవో తెచ్చి రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం చేశారు. రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయకుండా ఈ కులాలకు అన్యాయం చేస్తున్నారని, దీనిని సరిదిద్దాలని వైద్య శాఖ అధికారులను బీసీ సంఘాలు కోరగా, సీఎం కార్యాలయం వారు జోక్యం చేసుకొని బీసీలకు వ్యతిరేకంగా ఒత్తిడి తెచ్చి ఈ కులాలకు రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయకుండా అన్యాయం చేశారు. దీని మూలంగా గత ఏడాది 262 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎంబీబీఎస్ సీట్లు లభించకుండా అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరగా వెంటనే సీఎం జగన్మోహన్రెడ్డి సరిదిద్దుతూ జీఓ నం. 56 జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సరిదిద్దాలని కోరినా ఒక సంవత్సర కాలంగా గడిచిన రిజర్వేషన్ల అక్రమాలను సరిదిద్దడం లేదు. బీసీల విద్యా–ఉద్యోగ రిజర్వేషన్ల అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014లోనే క్రీమీలేయర్ నిబంధన విధించి అన్యాయం చేశారు. గత ప్రభుత్వాలు 1993 నుంచి అంటే దాదాపు 22 ఏళ్ల నుంచి క్రీమీలేయర్ పెట్టలేదు. క్రీమీలేయర్ విధించరాదని బీసీ సంఘాలు గత ప్రభుత్వాలను కోరితే ఆపివేశారు. కానీ, టీఆర్ఎస్ అదికారంలోకి రాగానే బీసీ వ్యతిరేకతను వెళ్ళగక్కుతోంది. క్రీమీలేయర్ నిబంధన విధించి బీసీ రిజర్వేషన్లు బీసీలకు దక్కకుండా అన్యాయం చేశారు. అన్ని వర్గాలకు పారిశ్రామిక పాలసీ ప్రకటించారు. కానీ 52 శాతం జనాభా గల బీసీలకు పారిశ్రామిక పాలసీ ఇంతవరకు ప్రకటించలేదు, అంటే బీసీలు పరిశ్రమలు, కంపెనీలు పెట్టడం కూడా ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేక పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పారిశ్రామిక పాలసీలో, కాంట్రాక్టులలో, నామినేటెడ్ పోస్టులలో బీసీలకు 50 శాతం కోటా ఇచ్చారు. కాని తెలంగాణలో మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. డబుల్ బెడ్రూం పథకంలో ఇతర వర్గాలకు జనాభాకు మించి కోటా కేటాయిస్తూ జీఓ జారీ చేశారు. కానీ బీసీల జనాభా 52 శాతం ఉంటే డబుల్ బెడ్రూం పథకంలో 15 శాతం కేటాయించడం చూస్తే ఎంత అన్యాయం చేస్తున్నారో తెలుస్తుంది. ప్రస్తుతం బీసీలకు విద్యా– ఉద్యోగాలలో 29 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఈ కోటా కూడా డబుల్ బెడ్ రూంలలో ఇవ్వకపోవడం చూస్తే పాలకుల బీసీ వ్యతిరేక వైఖరి స్పష్టంగా కన్పిస్తుంది. సంక్షేమ అభివృద్ధి పథకాలలో, పేదరిక నిర్మూలన పథకాలలో సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం కోటా ఇవ్వడం సంప్రదాయం. కానీ, ఇందుకు భిన్నంగా తగ్గించి ఇవ్వడం న్యాయమా? ఒకవైపు ఈ కులాలలో చైతన్యం పెరుగుతోంది. విద్యా, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాలలో తమ వాటా తమ జనాభా ప్రకారం కావాలని గొంతెత్తి పోరాడుతున్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లకు గండికొట్టే ఆలోచనలకు వ్యతిరేకంగా బీసీ/ ఎస్సీ/ఎస్టీ వర్గాలు పోరాడకపోతే భవిష్యత్ అంధకారమౌతుంది. వ్యాసకర్త ఆర్. కృష్ణయ్య అధ్యక్షులు, జాతీయ బి.సి. సంక్షేమ సంఘం మొబైల్ : 90000 09164 -
సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు
నెహ్రూనగర్(గుంటూరు)/చిలకలూరిపేట: రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలను గుర్తించి వాటికి అనుగుణంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, బీసీ కులాలన్నీ ఆయనకు రుణపడి ఉంటాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీల సమస్యలపై తాను వివిధ రాష్ట్రాల్లో పోరాడుతున్నానని, అయితే ఏపీలో బీసీల సమస్యలపై పోరాడేందుకు ఎలాంటి అవకాశం కలగట్లేదని, సంస్కరణవాది అయిన వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటమే అందుకు కారణమని అన్నారు. ఈ మేరకు శనివారం గుంటూరు, చిలకలూరిపేటల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీలపై చిత్తశుద్ధితో వ్యవహరించారని, ఈనాడు ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకేసి బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారని ప్రశంసించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ..ఇచి్చన మాటకు కట్టుబడి సీఎం జగన్ బీసీలకు 56 కార్పొరేషన్లు ఇవ్వడం గర్వకారణమన్నారు. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్పొరేషన్ చైర్మన్లకు జరిగిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజని అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, జోగి రమే‹Ù, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మద్దాళి గిరిధర్, మద్యపాన విమోచన సమితి అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, పలువురు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. -
రేపటి తరాలకు సీఎం జగన్ ఆదర్శం
సాక్షి, గుంటూరు: దేశంలో ఎక్కడలేని విధంగా ప్రభుత్వ స్కూళ్లను మోడల్ పాఠశాలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చిదిద్దుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పేదలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అమ్మవడి పధకం వంటి పధకం ఎక్కడలేదని ప్రశంసించారు. దేశంలో ఎంతో మంది బీసీ ముఖ్య మంత్రులు రాష్ట్రాలను పరిపాలించారు కానీ, బీసీల ఎదుగుదలకు దోహదపడలేదన్నారు. ఏపీలో ఒక్క వైఎస్ జగన్‌కి మాత్రమే సాధ్యపడిందని తెలిపారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు గొప్ప విద్యా ప్రణాళికలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కి దక్కుతుందని తెలిపారు. రేపటి తరాలు, పాలకులకు సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన పాలనలో ప్రజలు తల ఎత్తుకొని జీవిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సాహసోపేతమైన, జాతీయ స్థాయి నేతలే సీఎం జగన్‌ను అభినందిస్తున్నారని అన్నారు. ఆయన అణగారిన వర్గాల వారికి, జీవన విధానాన్ని మార్చిన నాయకుడని కొనియాడారు. మంత్రి శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ.. రాజమండ్రి బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో బీసీలకు ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ బీసీ అంటే బ్యాక్ వార్డ్ కాదని బ్యాక్‌బోన్ అని నిరూపించారని తెలిపారు. వైఎస్సార్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ.. బీసీ కులానికి చెందిన తనకు సీటు అడగగానే జగనన్న చిలకలూరిపేట నుంచి అవకాశం ఇచ్చారని తెలిపారు.టీడీపీ నాయకుల తీరు చూస్తుంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నట్లుగా ఉందన్నారు. బీసీలంతా తమ వైపే ఉన్నారని చెప్పుకునే టీడీపీ బీసీ కులాలతో ఆడుకుని వారిని ఆర్థికంగా, రాజకీయంగా ఎదగనివ్వకుండా చేసిందని మండిపడ్డారు. -
'ఏపీ ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం'
సాక్షి, అమరావతి : బీసీల అభివృద్ధి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం సాక్షి టీవీతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ' దేశంలో ఎవరు కూడా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోలేదు.ఇతర రాష్ట్రాల్లో బీసీ లు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఎవరూ కూడా ఇలా కార్పొరేషన్ లకు బీసీలను నియమించలేదు. బీసీలకు నాయకత్వం ఇవ్వడం శుభపరిణామం. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తారు. సమగ్రంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారు.ఇంత చిన్న వయస్సులో ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయంగా ఎవరు ఎదగకూడదు అనే మాత్రమే చూశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు..బీసీ కార్పొరేషన్ లలో మహిళలకు పెద్ద పీట వేయడం గొప్ప విషయం. రాష్ట్ర అభివృద్ధి, బీసీల సమగ్రాభివృద్ధి పట్ల సీఎం జగన్ ఉన్న కృషిని గర్వించదగ్గ విశేషం. (చదవండి : 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ... చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకోవడం హర్షనీయం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి అడుగు వేస్తున్నారు.కర్నూలు జిల్లా ను బిసి జిల్లా గా మార్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుంది.అతి తక్కువ కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంక్షేమ పథకాలను అమలు చేశారు.33 వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు ఉపయోగించారు.10 వేల కోట్ల రూపాయలను బిసిలకు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు బిసిలను మోసం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న విద్య కానుకలను అందిస్తున్నారు.108,104 అంబులెన్స్, ఆరోగ్య శ్రీ పథకాలను అమలు చేసి, కరోనా వైరస్ సమయంలో కూడా ఉచితంగా సేవలందిస్తున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీలకు 670 డైరెక్టర్లను ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బీసీ కార్పొరేషన్ లలో 50 శాతం మహిళలకు కల్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావడం విశేషం. (చదవండి : ‘చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది’) పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీ గర్జనలో ఇచ్చిన మాటను వైఎస్ జగన్ ఈ రోజు అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు చేయూత క్రితం సహాయం అందిస్తున్నారు. చెప్పిన మాట అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ కృషి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన అప్పటి నుంచి ఇలాంటి నిర్ణయాలు నేను చూడలేదు. విజయవాడ విశ్వ బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి వైఎస్ జగన్.56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి బీసీల బంగారు భవిష్యత్తుకు తోడ్పాటు అందించారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, పూలే కళలు కన్న కలలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు.బాబు వస్తే జాబు వస్తుంది చెప్పి మోసం చేశాడు చంద్రబాబు, యువభేరి లో చంద్రబాబు ను ప్రశ్నించిన విద్యార్థులపై అక్రమ కేసులు, బెదిరింపు చేశారు. ప్రతి సంక్షేమ పథకాలలో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్య ఇచ్చారు.బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, డైరెక్టర్లను కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. -
‘విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి’
ముషీరాబాద్ (హైదరాబాద్): రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించి, ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్‌లోని రాష్ట్ర బీసీ భవన్లో తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం వ్యవస్థాపకుడు సుతారపు వెంకట నారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. విద్యారంగ సమగ్ర వికాసానికి ఉపాధ్యాయుల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ గా ఉన్న 40 వేల టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలన్నారు. రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక.. తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుతారపు వెంకట నారాయణ, ఉపాధ్యక్షుడిగా పరంకుశం కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఉప్పు మధుకర్, సం యుక్త కార్యదర్శిగా కె.శ్రీనివాస్, కోశాధికారిగా నరేందర్‌లు ఎన్నికయ్యారు. -
రాజకీయ రిజర్వేషన్ల సాధనే ధ్యేయం
ముషీరాబాద్(హైదరాబాద్): చట్లసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల సాధన తన జీవితాశయమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో బీసీల వాటాకోసం పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించామన్నారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగాయి. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడారు. బీసీలను విద్య, విజ్ఞానం, పరిపాలనకు దూరంగా ఉంచారని, అలాంటి సమయంలో సంఘం స్థాపించి వేలాది ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించి విజయం సాధించామన్నారు. మండల్ కమిషన్, మురళీధర్ రావు కమిషన్ సిఫార్సుల అమలు కోసం చేసిన పోరాటం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు, రీయింబర్స్మెంట్ సాధించి బీసీలకు సాధికారత కల్పించగలిగామన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధనకు రెట్టింపు శక్తితో పోరాడతామన్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కోలా జనార్ధన్, విద్యార్థి నేత వేముల రామకృష్ణ, మహిళా రక్షకదళ చైర్మన్ ముట్ట జయంతిగౌడ్, బీసీ రక్షకదళ్ నాయకుడు ఉదయ్ పాల్గొన్నారు. -
ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్: ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరా బాద్): ఏపీ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయా కులాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఆదివారం బీసీ భవన్లో ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్, 12 బీసీ కులాల ఫెడరేషన్ల ద్వారా మూడేళ్ల క్రితం తీసుకున్న 5.77 లక్షల దరఖాస్తులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తుదారులందరికీ రుణాలు మంజూరు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత వాటిని పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. వెంటనే రుణాలు మంజూరు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఏపీ ప్రభుత్వం ప్రతి బీసీ కులానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ చొప్పున 52 బీసీ కుల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న 12 బీసీ కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. పాత ఫెడరేషన్లకు, కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. -
పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల ఫలాలు అందాలంటే వారికి వెంటనే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు కొనివ్వాలని ప్రభు త్వాన్ని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో విద్యార్థులకు డిజిటల్ విధానంలో ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించాలని ప్రభుత్వం సిద్ధమవడం మంచి నిర్ణయమన్నారు. అయితే, మారుమూల, గిరిజన గ్రామాలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఇప్పటికీ లక్షలాది ఇళ్లలో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు లేవని గుర్తుచేశారు. అందువల్ల ఇలాంటి ఇళ్లలోని పిల్లలు ఆన్లైన్ పాఠాలు ఆన్లైన్ పాఠాలు వినే అవకాశం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పేద పిల్లలకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే టీవీల ద్వారా పాఠ్యబోధనలో వివరణ కోరడానికి, విద్యార్థుల సందేహాలు తీర్చడానికి వీలుపడదన్నారు. దీనికితోడు కొన్ని ప్రాంతాలలో ‘‘టీశాట్’’ప్రసారాలు రావడం లేదని చెప్పారు. ‘ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే పాఠాలు ఒకరే వింటారు. మిగతావారి సంగతి ఏమిట’ని ప్రశ్నించారు. దీంతో లక్షలాది విద్యార్థుల చదువు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల పేద విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండాలంటే వారికి వెంటనే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు కొనివ్వాలని ఆ లేఖలో కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. -
ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో ప్రత్యేక శాఖ లేకపోవడం బాధాకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రస్తుతమున్న సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, బీసీలకు సంబంధించిన అనుకూల సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడంలో తీవ్ర అన్యాయం చేసిందని, ప్రత్యేక శాఖ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి పాలన సాగించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. -
కులానికి,అరెస్ట్‌కు సంబంధం లేదు
-
వ్యూహం లేక ఒరిగిన ‘వలస’ పక్షులు
లాక్డౌన్ ప్రకటించగానే వలస కార్మికుల బాధలు పట్టించుకోకుండా చేతులెత్తేశారు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు. వలస కార్మికుల కష్టం మీద వందల వేల కోట్లు సంపాదించిన వీళ్లకు కనీసం భోజనం పెట్టడానికి కూడా దయ రాలేదు. పోనీ నాలుగు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపడానికి కూడా వీరికి మనసొప్పలేదు. జాతీయ, ప్రాంతీయ మీడియాలో విపక్షాలు గోల పెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ హృదయం కొద్దిగా కరిగింది. శ్రామిక రైలు ప్రవేశపెట్టారు. కానీ దేశంలోని పదికోట్ల మంది వలస కార్మికులకు వారి గమ్యస్థానాలకు తరలించడానికి ఎన్ని రైళ్లు కావాలి, ఎన్ని రోజులు నడపాలి అనే ప్లాన్ లేకుండా ఆదరాబాదరాగా ప్రవేశపెట్టారు. ముందుచూపులేని విధానాల వల్ల దేశవ్యాప్తంగా అభివృద్ధి పనులు నిలిచిపోతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని చక్క దిద్దటానికి ప్రణాళిక ప్రకారం వ్యూహరచన చేయాలి. నెత్తిన మూట, సంకన పసిపాప, పక్కన నడిచే పిల్లలు, పైన భగభగ మండే ఎండ, కింద చెప్పులు లేని నడక, ఎండకు కాలిన కాళ్లకు బుగ్గలు, ఎండిన డొక్కలు, కంటినిండా నీరు, గుండెనిండా వేదన–గమ్యం లేని వందల వేల కిలోమీటర్లు నడక. ఇది దేశంలోని ఏ రోడ్డున చూసినా, ఏ మూలను చూసినా కనిపించిన వలస కార్మికుల హృదయ విదారక దృశ్యాలు. వీరి బాధను చూసి రాతి గుండెలు కూడా కరిగిపోతాయి. కానీ మన పాలకుల గుండెలు కరుగలేదు. ఇది కరోనా రక్కసి ప్రభావమని పాలకులు తప్పించుకుంటున్నారు. కానీ ఇది ఏలుతున్న వారి అసమర్ధత. అంతే కాదు పేద వర్గాల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని దొరతనం. సంపన్న వర్గాల పిల్లలు విదేశాలలో చిక్కుకుంటే ఆగమేఘాల మీద ప్రత్యేక విమానాలను పంపి తేవాలనుకునే ప్రభుత్వ నేతలకు వలస కార్మికులను గమ్యస్థానాలకు పంపాలని కానీ, భోజనం పెట్టాలని కానీ, ఉన్నచోటే కనీస సౌకర్యాలు కల్పించాలని కానీ ఆలోచన రాలేదు. (చదవండి: కూలీలను చిదిమేసిన రైలు) లాక్డౌన్ ప్రకటించిన మొదటి రోజే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఓటర్లకు నగదు పంపిణీ, రేషన్ సరుకులు ప్రకటించారు. వెంటనే వలస కార్మికులకు కూడా ఇదే ప్రభుత్వ సహాయాన్ని అందించాలని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మొక్కుబడిగా వలస కార్మికులకు కూడా ఈ సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించింది. కానీ ఆచరణలో అమలు కాలేదు. ఎందుకో తెలుసా వీరికి మీరు పనిచేసే రాష్ట్రాలలో ఓట్లు లేవు. ఓట్లు ఉంటే తప్ప సహాయం చేయరని తేలిపోయింది. పోనీ ఇన్ని రోజులు పని చేయించుకున్న యాజమాన్యాలు ఆదుకుంటాయా అంటే.. వాళ్లూ చేతులెత్తేశారు. దీనితో వలస కార్మికులు నాలుగు వారాలు అర్ధాకలితో నెట్టుకొచ్చారు. ఇక లాభం లేదని ఆకలి చావులకు భయపడి తమతమ గ్రామాలకు వెళ్లాలని బరువైన మనసుతో ఖాళీ గిన్నెలు, గ్లాసులు మూటకట్టుకొని బయలుదేరారు. అక్కడక్కడా ధైర్యం ఉన్న వలస కార్మికులు రవాణా సౌకర్యం కల్పించాలని నిరసన ప్రదర్శనలకు దిగితే, లాఠీ ఛార్జ్, బాష్పవాయు ప్రయోగం చేసి చెదరగొట్టారు. వలస కార్మికుల నడక కష్టాలు ఇంతా అంతా కాదు. కొందరు దారిలోనే ఆకలితో సొమ్మసిల్లి చనిపోతే, మరికొందరు ప్రమాదాలలో చనిపోయారు. ఇంకా చనిపోతున్నారు, కాలినడకన ఒక నిండు గర్భిణీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తన సొంత ఊరు చేరడానికి ఇద్దరు పిల్లలతో వెళుతుంటే, మేడ్చల్ దాటగానే రోడ్డు పక్కనే చెట్ల కింద పండంటి పసిపాపను కన్నది. ఈ సంఘటన భారత జాతి ఆత్మను ప్రశ్నించింది. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆమెను నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. వలస కార్మికుల బాధలు, కన్నీటి గాధను, మూగ రోదనను చూసి భారతమాత కన్నీళ్ళు పెట్టి ఉంటుంది. న్యాయ దేవత తన నిస్సహాయతను చూసి తలదించుకుని ఉంటుంది. జాతీయ రహదారుల వెంట జాతరలా వెళుతున్న వలస కార్మికుల బాధలు టీవీలలో, పత్రికలలో చూసి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమేనా అని ప్రపంచ దేశాలు ఆలోచనలో పడ్డాయి. అభివృద్ధి అంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల అభివృద్ధి కాదు. అందమైన బంగ్లాలు కాదు, ఫ్లైఓవర్ ఫ్లవర్ రోడ్లు కాదు. విమాన సౌకర్యాలు కాదు. రిలయన్స్ అంబానీ, ఆదాని, టాటా– బిర్లాల ఆస్తి సంపద పెరగడం కాదు. దేశంలో ప్రతి పౌరునికి కూడు గూడు ఉద్యోగం ఉపాధి కలిగిననాడు నిజమైన అభివృద్ధి. దేశ సంపద, అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరునికి దక్కిన రోజు.. అదే నిజ మైన అభివృద్ధి. అసలు ఈ వలస కార్మికులు ఎవరు? తాము పుట్టిన గడ్డపై ఉపాధి కరువై బతుకుతెరువు లేక పొట్ట చేత పట్టుకొని దేశం కాని దేశం వచ్చి, రక్తాన్ని చెమటగా మార్చి రాత్రింబవళ్లు పనిచేస్తున్న శ్రమజీవులు. బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న శ్రమజీవులు. మన రాష్ట్రం నుంచి కూడా బొంబాయి, పూణే, సూరత్, బెంగళూరుకు కూడా వెళ్లి వేలాది మంది పని చేస్తున్నారు. అలాగే ప్రపంచంలో కూడా ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, గల్ఫ్ దేశాలలో కూడా కోట్లాది మంది మన భారతీయులు ఉన్నారు. తెలంగాణలో అనధికార లెక్కల ప్రకారం 15 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని అంచనా. దేశంలో పది కోట్ల మంది వలస కార్మికులు పని చేస్తున్నట్టు లెక్కలు తెలుపుతున్నాయి. వలస కార్మికులు లేకుంటే మన రాష్ట్రంలో లేబర్ కొరత తీవ్రంగా ఉండేది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో భవన నిర్మాణ కార్మికులు మొత్తం వలస కార్మికులే. పెద్దపెద్ద అందమైన భవనాలు, అపార్ట్మెంట్లు కట్టినవారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఫ్లై ఓవర్స్ నిర్మించినది వీరే. జాతీయ రహదారులను రింగ్ రోడ్ లను తీర్చి దిద్దింది వీరే. మనం తినే సన్న బియ్యం, సన్ ఫ్లవర్ ఆయిల్ పండించడానికి నిర్మించిన కాళేశ్వరం దాని ఉప ప్రాజెక్టులు, కాలువలు, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణ ప్రాజెక్టులు కాలువలు తవ్వింది, తవ్వుతున్నది, గంపలు పలుగు పారలు పట్టింది వలస కార్మికులే. (చదవండి: కార్మికులను తయారుచేద్దాం!) మనకు కాంతినిచ్చే లైట్లు, చల్లని ఎయిర్ కండిషనర్ మిషన్లు, కరెంటు ఉత్పత్తి చేసే పరికరాలు తయారు చేసే ప్రైవేట్ ఎలక్ట్రికల్ కంపెనీలలో రాత్రింబవళ్లు కష్ట పడేది వలస కార్మికులే. మన రోగాలను నయం చేసే మందులను తయారు చేసే ఫార్మసీ కంపెనీలలో పని చేసేది వలస కార్మికులే. అలాగే రైసు మిల్లుల్లో, సిమెంటు, ఐరన్, ప్లాస్టిక్ కంపెనీలలో పనిచేసే మెజారిటీ కార్మికులు వలస కార్మికులే. రక్తాన్ని చెమటగా మార్చి దేశాన్ని దేశ సంపదను సృష్టిస్తున్న సృష్టికర్తలు వీళ్లు. ప్రాజెక్టులు కట్టకుండానే కట్టినట్లు చెరువులో పూడికలు తీయకుండానే తీసినట్లు, రోడ్లు వేయకుండానే వేసినట్లు దొంగ బిల్లులు సృష్టించి కోట్లకు కోట్లు ధనాన్ని కొల్లగొట్టి లూటీ చేసిన స్కాం బాబులు ఈ కరోనా కష్టకాలంలో, ఇంద్ర భవనాలలో విందు వినోదాలలో తేలి ఆడుతున్నారు. లాక్డౌన్ ప్రకటించగానే వలస కార్మికుల బాధలు పట్టించుకోకుండా చేతులెత్తేశారు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు. ఈ వలస కార్మికులకు పని లేదు, కాబట్టి జీతాలు లేవన్నారు. వీరికి జీతాలు ఇవ్వాలని, వీరిని ఆదుకోవాలని ప్రభుత్వం చేసిన ఉత్తుత్తి ప్రకటనలను ఈ బడాబాబులు లెక్కచేయలేదు. ఇంతవరకు వలస కార్మికుల కష్టం మీద వందల వేల కోట్లు సంపాదించిన పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు కనీసం భోజనం పెట్టడానికి కూడా దయ రాలేదు. పోనీ నాలుగు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపడానికి కూడా వీరికి కఠిన హృదయం కరగలేదు. జాతీయ, ప్రాంతీయ మీడియాలో విపక్షాలు గోల పెట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయం కొద్దిగా కరిగింది. శ్రామిక రైలు ప్రవేశపెట్టారు. అప్పటికే 60 శాతం మంది వలస కార్మికులు కాలినడక మధ్యలో ఉన్నారు. లక్షలాది మంది వలస కార్మికులకు ఈ శ్రామిక రైలు సరిపోదు. దేశంలోని పదికోట్ల మంది వలస కార్మికులకు వారి గమ్యస్థానాలకు తరలించడానికి ఎన్ని రైళ్లు కావాలి. ఎన్ని రోజులు నడపాలి అనే ప్లాన్ లేకుండా ఆదరాబాదరాగా విమర్శలను తప్పించుకోవడానికి నామమాత్రంగా ప్రవేశపెట్టారు. ప్లాన్ లేకుండా సింగిల్ స్టాప్ విధానం పెట్టడంతో అక్కడినుండి గమ్యస్థానాలు చేరడానికి ఒక్కొక్కరు 100 నుండి 200 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం కొనసాగించవలసి వస్తుంది. లాక్డౌన్ ప్రకటించినప్పుడే వలస కార్మికుల విషయంలో ప్రభుత్వ పెద్దలు మనసుపెట్టి ఆలోచన చేయలేదు. లాక్ డౌన్ దశలవారీగా తొలగించిన తర్వాత వలస కార్మికులను పంపడంలో ఏమైనా అర్థం ఉందా? ఎందుకంటే లాక్డౌన్ తరువాత, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత వలస కార్మికులు లేకపోతే అన్ని అభివృద్ధి పనులు ఆగిపోతాయి. 17 లక్షలమంది వలస కార్మికులు వెళ్లి పోతే తెలంగాణలోని వారి స్థానాలను ఎలా భర్తీ చేస్తారు? ప్రభుత్వం ముందు చూపుతో వలస కార్మికులను ఆదుకుంటే బాగుం డేది. ప్రభుత్వం వద్ద ఎఫ్‌సీఐ గోడౌన్లలో లక్షల టన్నుల ధాన్యాలు మురిగిపోతున్నాయి. వాటిని వలస కార్మికులకు ఇస్తే వారి ఆకలి బాధలు తీరేవి. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఉత్పత్తి రంగం కొనసాగేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరి అయిన ప్రణాళిక లేక ఇప్పుడు ఎటూ కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని చక్క దిద్దటానికి ప్రణాళిక ప్రకారం వ్యూహరచన చేయాలి. వ్యాసకర్త: ఆర్. కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
రాజ్యాంగబద్ధతే ‘రిజర్వేషన్ల’కు రక్షణ
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ విధానాలతో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ రిజర్వేషన్ల గరిష్ట పరిమితిపై ప్రతిసారి న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూడవలసిన బాధ్యత అన్ని పార్టీలపై ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. తాజాగా టీడీపీ నేత పిటిషన్ కారణంగా రిజర్వేషన్లను హైకోర్టు మళ్లీ తగ్గించినప్పటికీ వైఎస్ జగన్ స్థానిక ఎన్నికల్లో తన పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పాటించాలని ఆదేశించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీతోపాటు ఇతర పార్టీలైన, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు పాటించి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ/ఎస్టీ/బీసీల రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు చెప్పడంతో రిజర్వేషన్ల సమస్య మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఆశతో తెలుగుదేశం–ఇతర ప్రతిపక్షాలు చూస్తున్నాయే తప్ప ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరి స్తామని ఆలోచించకుండా రాజకీయంగా ఎలా వాడుకుందామని కుట్రలు చేస్తున్నాయి. కానీ ఈ తీర్పు కొత్తదేమీ కాదు. 1993 మండల్ కేసు – ఇందిరా సహాని వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసు నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు 26 కేసులలో ఇదే తీర్పులు వచ్చాయి. సుప్రీం కోర్టు 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక స్టేట్ కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత 2010 నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతంకు తగ్గించాయి. తెలంగాణ ప్రభుత్వం 2019 ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించి ఎన్నికలు జరి పింది. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాలు తగ్గించినప్పటికీ ఈ వర్గాలకు రిజర్వేషన్లు తగ్గరాదనే ఆలోచనతో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు. దీనికనుగుణంగా 2019 డిసెంబర్ 28న జీవో నం.176 జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రతాప్ రెడ్డి అనే టీడీపీ నేత సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు సలహా మేరకు దీన్ని విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లను 50 శాతంకు కుదించాలని తీర్పు చెప్పింది. టీడీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డి సవాల్ చేయకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరికట్టగలిగి ఉంటే ఈ పాటికి ఏపీలో 34% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగేవి. కానీ చంద్రబాబు అలా చేయకుండా ఈరోజు వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేయడాన్ని బీసీలు అసహ్యించుకుంటున్నారు. కాగా, ఈ అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు, ఉపయోగం లేదు. ఇంతకు పూర్వం గత ప్రభుత్వాలు చాలాసార్లు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాయి. కానీ ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు 50 శాతంకి మించి రిజర్వేషన్లు ఉండరాదని తీర్పు చెప్పింది. అలాంటప్పుడు మరలా సుప్రీం కోర్టుకు వెళితే ఈ తీర్పు పునరావృతం అవుతుంది. కాలయాపన తప్ప బీసీలకు ఒరిగేదేమీ ఉండదు. సామాజిక న్యాయం పట్టదా? సుప్రీంకోర్టు, హైకోర్టులు మొదటినుంచి ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి. ఇలా కోర్టులు తీర్పులు ప్రకటిం చిన ప్రతిసారీ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తూ వస్తున్నారు. మొట్టమొదట రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే 1951లో తమిళనాడుకు చెందిన చంపకం దొరై రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు ఈ వర్గాలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. దీంతో 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ప్రారంభమయింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో సాగిన సామాజిక న్యాయం కేసుల విషయంలో సుప్రీంకోర్టు సరైన విధంగా స్పందించడం లేదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంపై ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 2010 సుప్రీంకోర్టు తీర్పు రాగానే దేశంలోని స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అమలులో ఉన్న 25 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలలో వెంటనే బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి తగ్గించారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న కర్ణాటక, బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ 2013–2014 మధ్యలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18–22 శాతం వరకు తగ్గించారు తప్ప బీసీ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చట్టాలను తయారు చేయలేదు. కానీ వైఎస్ జగన్ తనకున్న అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికి బీసీ రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయడానికి మరోసారి జీవో నం.176ను జారీ చేశారు. కానీ టీడీపీ నేత చర్య కారణంగా అంతిమంగా ఏపీ హైకోర్టు కూడా ఈ జీవోకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలో ఏముంది...? కేంద్ర ప్రభుత్వం 73–74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయత్ రాజ్ మున్సిపల్ చట్టం తెచ్చింది. ఈ రాజ్యాంగ సవరణలో రాజ్యాం గంలోని ఆర్టికల్ 243( ఈ–6), 243 ( ఖీ–6) ఆర్టికల్స్ పొందుపరిచి బీసీలకు కూడా జనాభా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెట్టాలని, అందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు చేయాలని ఆదేశించింది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఖరారు చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఇచ్చారు. దీని ప్రకారం 1993లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీసీలకు 34 శాతం ఖరారు చేసింది. ఈ శాతమే ఇంతవరకు అమలు చేస్తూ వచ్చారు. 1980 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగిన పలు ఉద్యమాల ప్రభావంతో 1992లో వచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆధారంగా నాటి సీఎం విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. కొత్తగా గ్రామ పంచాయతీలకు 34% రిజర్వేషన్లు పెట్టారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసనసభలకు వదిలిపెట్టడం తప్పితే స్పష్టంగా రాజ్యాం గంలోనే జనాభా ప్రకారం పెట్టాలని పేర్కొనక పోవడంతో ప్రతిసారి న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. దేశంలో ఇంతవరకు ఏ సీఎం కూడా చేయని విధంగా వైఎస్ జగన్ బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ విధానాలతో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీసీలు, దళితులు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవడం లేదు. జగనన్న వసతి దీవెన–విద్యా దీవెన– అమ్మ ఒడి పథకాలు ఎస్సీ/ఎస్టీ/బీసీలలో చదువుల విప్లవం తీసుకొస్తాయి. దీర్ఘకాలంలో ఈ పథకాల వలన ఎస్సీ/ఎస్టీ/బీసీల మౌలిక జీవన విధానంలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ/ఎస్టీ/బీసీల సమగ్ర అభివృద్ధికి, సాధికారతకు అనేక స్కీములు పెట్టారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవులలో 50 శాతం కోటా కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే కాంట్రాక్ట్ వర్క్‌లలో 50 శాతం కోటా, పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా కల్పించి, ఎస్సీ/ఎస్టీ/బీసీల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారు. ఇదొక గొప్ప మలుపు. అలాగే గత ఏడాది మార్చి నెలలో వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్ – పార్టీ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుంది. దేశంలోని 70 కోట్ల మంది బీసీలు ఇప్పుడు వైఎస్ జగన్ అభిమానులుగా మారిపోయారు. పరిష్కారం ఏమిటి? రిజర్వేషన్ల గరిష్ట పరిమితిపై ప్రతిసారి న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీనికి శాశ్వత పరి ష్కారం చూడవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంది. దీంట్లో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగంలో 9వ షెడ్యుల్ రిజర్వేషన్లను పెట్టింది. అదే విధంగా ఇప్పుడు అన్ని పార్టీలు చొరవ తీసుకుని రాజ్యాంగ సవరణ చేయాలి. అలాగే రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సమయం తీసుకుంటుంది కాబట్టి తాత్కాలిక పరిష్కారంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో బీసీల జనాభా ప్రకారం జనరల్ సీట్లలో బీసీలకు సీట్లు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ప్రతిపాదనను అన్ని రాజకీయ పార్టీల ముందు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర ప్రతిపక్షాలు బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆచరణలో ఈ ప్రతిపాదనను అంగీకరించాలి. జనరల్ సీట్లలో బీసీలకు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. హైకోర్టు రిజర్వేషన్లు తగ్గించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు పాటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఏపీలోని ప్రతిపక్ష పార్టీ టీడీపీతోపాటు ఇతర పార్టీలైన, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు కూడా 34% రిజర్వేషన్లు పాటించి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. వ్యాసకర్త: ఆర్. కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్ : 90000 09164 -
కేసు వేయించింది చంద్రబాబే
-
‘బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది ఆయనే’
సాక్షి, విజయవాడ: బీసీలకు పార్టీపరంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు చేయలేని పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారని అభినందించారు. బీసీలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన వేలల్లో పదవులు బీసీలకు వస్తాయని తెలిపారు. (బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తున్నాం) స్థానిక ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెబుతారు.. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని ఆయన మండిపడ్డారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అడ్డుకుంది చంద్రబాబేనని.. ఆయనే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించారని మండిపడ్డారు. రిజర్వేషన్లు అడ్డుకున్న టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెబుతారని కృష్ణయ్య పేర్కొన్నారు.(బీసీలకు 10 % అదనం) -
ఏపీ సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
పంజగుట్ట: దేశంలోని అందరు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సూచించారు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీల కోసం అమలుచేయని సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నారని కొని యాడారు. ఏపీలో గత బడ్జెట్లో బీసీల కోసం రూ.18 వేల కోట్లు కేటాయించారని, తెలంగాణలో రూ.3 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్లో అయినా తెలంగాణలో బీసీల కోసం రూ.10 వేల కోట్లు కేటా యించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను శనివారం ఖైరతాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. ఏపీలో నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50%, బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, చట్టç సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం లాంటి ఎన్నో పనులు జగ¯Œ చేశారని గుర్తుచేశారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నాయకులు ఎర్ర సత్యనారాయణ, మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ జనగణన ఎప్పుడు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు.. ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధికై అనేక స్కీములు అమలు జరుపుతున్నాయి. అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నాయి. కానీ బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. బీసీ జనాభా లెక్కలు లేని కారణంగానే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేనందువలన రిజర్వేషన్లను ఎంత శాతం నిర్ణయించాలనే అంశంపై మొదటినుంచి బీసీ కమిషన్లు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం కులాల ప్రాతిపదికన ఎస్సీ/ఎస్టీ/బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధి పథకాలు పెట్టాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ సామాజిక వర్గాల పేరుమీద జనాభా గణన మొదటి నుంచి తీస్తున్నారు. అలాగే లింగ విభజన పేరుమీద మహిళా–పురుష జనాభా గణన ఉంది. కానీ బీసీ కులాల జనాభా వివరాలు కావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నా, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా, హైకోర్టు–సుప్రీంకోర్టులు ఆదేశిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఒక బీసీ కులాల కాలమ్ పెట్టడానికి ముందుకు రావడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2021లో భారతదేశ జనగణన చేపట్టడానికి విడుదల చేసిన నమూనా పట్టికలో వివరాల కోసం 32 కాలమ్స్ నమూనా పత్రం విడుదల చేశారు. కేంద్రప్రభుత్వం హోంశాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ/ఎస్టీల వివరాలు కాలం, అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల వివరాలు ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్ నమూనా పత్రాన్ని జారీ చేశారు. కానీ ఈ జనాభా లెక్కల పట్టికలో బీసీ కులాల వివరాలకు సంబంధించిన కాలమ్ పెట్టలేదు. బీసీ జనాభా లెక్కల వివరాలు సేకరించవలసిన ఆవశ్యకత ఉంది. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కేటాయింపు–పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీసీ జనాభా లెక్కల వివరాలు అవసరం అవుతున్నాయి. జనాభా లెక్కలు లేనందున సుప్రీంకోర్టు–హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటాయించాలనే విషయంలో బీసీ జనాభా లెక్కలు లేక, న్యాయపరమైన చట్టపరమైన కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి నేతృత్వంలో కమిటీని నియమించింది. బీసీ కులాలవారీగా జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ వర్గీకరణ చేసి ఏయే గ్రూపుకు ఎంత శాతం రిజర్వేషన్లు నిర్ణయించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటి? 1931లో అంటే 90 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీయడానికి ఊగిసలాడుతూ వచ్చింది. బీసీ సంక్షేమ సంఘం అనేక వీధి పోరాటాలు న్యాయపోరాటాలు చేసిన తర్వాత స్పందించి 2010లో కులాల వారీ లెక్కలు తీయడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. దీనితో ప్రత్యేకంగా బీసీ జనాభా లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 8 వేల కోట్లు కేటాయించి కులాల వారీ జనాభా లెక్కల్ని ప్రత్యేకంగా తీశారు. ఈ లెక్కలతో సమగ్ర పట్టిక తయారు చేయడానికి మాజీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌తో ఒక కమిటీ వేశారు. కానీ ఆ తర్వాత వాటి వివరాలు, జనాభా సంఖ్య ఇంతవరకు ప్రకటించలేదు. గతంలో అంటే 2010లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బీసీ జనాభా కులాల వారిగా లెక్కలు తీయాలని భారతీయ జనతాపార్టీ పార్లమెంటులో డిమాండ్ చేసింది. బీజేపీ కోరినం దుకే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. కావున కులాలు వారీ లెక్కలు తీయవలసిన బాధ్యత అవసరం–ఆవశ్యకత ఉంది. పైగా దీనికి ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదు. ఒక రూపాయి ఖర్చు లేకుండా జనాభా లెక్కలు వస్తాయి. 01.08.2018 నాడు అప్పటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ రెండవ సారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ఎందుకు మార్పు వచ్చింది?. జనాభా లెక్కలు తీస్తే తరాలుగా అణచివేతకు గురైన కులాలు తామే అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిస్తే వారు తిరగబడి.. దేశవనరుల్లో, అధికారంలో తమ వాటా తమకు ఇవ్వాలని అడుగుతారేమోనని పాలకవర్గాలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అంతే కాదు.. వేల సంవత్సరాలు తమ అగ్రకులాలకు సేవలు చేస్తున్న ఊడ్చేపని, స్కావెంజర్ పని, వంట చేసే పని, బట్టలుతికే వారు, హెయిర్ కటింగ్ చేసే వారు ఇలా ఇంటి పని, పొలం పనులు చేసే వారు దొరకరని భయపడి జనాభా లెక్కలు తీయడం లేదా!! అలాగే ఇన్ని రోజులు తమ కాళ్ళ కాడ పడి ఉన్న ఈ పేద కులాల వారికి అధికారంలో వాటా ఇస్తే వీరు కలెక్టర్, ఆఫీసర్, ఎమ్మెల్యే, మంత్రులయి తమ పక్కన కూర్చుంటారని భయమా!! అలాగే జనాభా లెక్కలు తేలితే విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లు పెంచాలని అలాగే స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ బలంగా ముందుకు వస్తుందని భయమా! భయపడవలసిన అవసరం లేదు. మీరు జనాభా లెక్కలలో కులాల వారీ లెక్కలు తీసినంత మాత్రాన ఈ కులాలు తమ డిమాండ్లను తెరమీదకి తీసుకురావు. ఇప్పటివరకు రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ఏమైనా అవలక్షణాలు దొర్లాయా? రాజ్యాంగం రక్షణ సదుపాయాలు రాజ్యాంగంలోని 15 (4) (5) మరియు 16 (4) (5) ప్రకారం బీసీ కులాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా ఉంది. జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెడతారు? రాజ్యాంగంలోని 243 డి–(6) 243–టి–6 ప్రకారం స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. కానీ జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్ల శాతం ఎలా నిర్ణయిస్తారు? రాజ్యాంగంలోని 339–బి–ప్రకారం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ బీసీల సమగ్రాభివృద్ధికి ఏ సిఫార్సు చేయాలన్నా జనాభా లెక్కలు కావాలి. రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు, రక్షణలు, రిజర్వేషన్ల కోసం జనాభా లెక్కలు అవసరం. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రోవిజన్స్–ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే బీసీ కులాల లెక్కలు కావాలి. కోర్టు తీర్పు ప్రకారం లెక్క తీయాలి రిజర్వేషన్లు ప్రవేశపెట్టినపుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో హైకోర్టు–సుప్రీంకోర్టులు జోక్యం చేసుకొని జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడతారని లేదా పెంచుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మండల్ కమిషన్ కేసు సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో ప్రతీ రాష్ట్రంలో నియమించిన ప్రతి కమిషన్ జనాభా లెక్కలు తీయాలని సిఫారసు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అనేక రాష్ట్రాలు కులాల వారిగా జనాభా లెక్కలు తీశాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపు కోసం, ఇతర రిజర్వేషన్ల కోసం ఇతర అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలు బీసీ జనాభా లెక్కలు తీశాయి. కానీ వీటికి చట్టబద్ధత లేదని కోర్టులు కొట్టివేశాయి. ఈ దేశంలో అన్ని వర్గాల వివరాలను జనాభా గణన ద్వారా సేకరిస్తున్నారు. చివరకు పులులు–జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ బీసీ కులాల వారిగా జనాభా లేకపోవడం అన్యాయం. బీసీ జనాభా లెక్కలు సేకరిస్తే జరిగే నష్టం ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు లేదు. కేవలం ఊహాజనితంగా కులాల వారి లెక్కలు తీయడం వలన కులతత్వం పెరుగుతుందని పసలేని విమర్శలు చేస్తుంటారు. ఇది ఊహమాత్రమే; ఎందుకంటే మతాల లెక్కలు తీస్తున్నారు. మతతత్వం పెరుగుతుందా! అలాగే ఎస్సీ/ఎస్టీ కులాల వారి లెక్కలు తీయడం లేదా? ఏమైనా కులతత్వం పెరిగిందా? ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు, రిజర్వేషన్లకు, పరిపాలన సౌకర్యంకోసం కులాల వారీ లెక్కలు ఉపయోగపడుతాయి. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారి లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. జనాభా గణన కాలమ్స్‌లో ఒక కాలమ్ పెరుగుతుంది. ఒక పైసా అదనంగా ఖర్చు కాదు. పైగా ప్రభుత్వానికి చట్టపరమైన, పాలనాపరమైన, అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి కులాల వారి కాలమ్ చేర్చాలని ప్రజలు–అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం -
బీసీలకు వెయ్యి కోట్లు కేటాయించాలి: ఆర్ కృష్ణయ్య
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బీసీలకు రూ. 50వేల కోట్లు కేటాయించాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29 రాష్ట్రాలకు వెయ్యి కోట్లు ఏం సరిపోతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ ను ప్రశ్నించారు. తాజాగా చేపట్టిన జనాభా లెక్కల సేకరణలో బీసీల గణనను కూడా చేర్చాలని కోరారు. చట్ట సభల్లో సాధారణ బీసీ రిజర్వేషన్లను 50శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు. తాజా జనాభా లెక్కల సేకరణ పత్రం నమూనా కాలమ్‌లో బీసీల వివరాలకు సంబంధించిన కాలమ్ ఎందుకు లేదని ప్రశ్నించారు. తమ 18 డిమాండ్లపై పార్టీలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జేపీ నడ్డా, కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ హామీ ఇచ్చినట్లు బీసీ సంఘ నాయకులు తెలిపారు. -
జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
కర్నూలు (సెంట్రల్): బీసీలకు నిర్మాణాత్మక, రాజ్యాంగబద్ధమైన పదవులను కల్పించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం ఆయన కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా జనాభా ప్రకారం చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గతేడాది పార్లమెంట్లో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. దేశంలో 14 బీసీ పార్టీలు ఉన్నాయని, వాటికి రాని ఆలోచన వైఎస్సార్సీపీకి రావడం గొప్ప విషయమని అన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. -
ఫిబ్రవరిలో అనాథల అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: అనాథల అంతర్జాతీయ సదస్సును ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నాగోల్ సమీపంలోని జె–కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నట్లు ఫోర్స్ (ఫోర్స్ ఫర్ ఆర్షన్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్) అధ్యక్షుడు గాదె ఇన్నయ్య తెలిపారు. శనివారం బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సదస్సు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లా డుతూ అనాథల హక్కుల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. వీరికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, ఉచిత విద్యతో పాటు ఉపాధి కలి్పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. అనంతరం గాదె ఇన్నయ్య మాట్లాడుతూ ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, టి.నందగోపాల్, రాంకోటి పాల్గొన్నారు. -
15వేల డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న దాదాపు 15 వేల డాక్టర్ల పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి వినతిపత్రాన్ని అందించారు. చాలా ఆస్పత్రుల్లో స్పెషలైజ్డ్ డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో వివిధ రకాల రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని వివరించారు. వైద్యం పూర్తి ఉచితంగా ఇవ్వాలని, ఈమేరకు ప్రభుత్వ ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. వైద్యుల పోస్టులతో పాటు కింది స్థాయి సిబ్బంది ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని మంత్రిని కోరారు. ఆస్పత్రుల్లో ఖాళీల జాబితాను రూపొందించి భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. -
‘ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలి’
ముషీరాబాద్: ప్రైవేటు రంగ పరిశ్రమలు, కంపెనీలు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగాల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్లో బీసీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ఉండేలా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. -
రాష్ట్రంలో పాఠశాలలను మూసివేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తే దళితులు, బడుగులు, బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరమవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సగం పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతోందని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే తీవ్రంగా నష్టపోతారని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గడానికి కారణాలను గుర్తించి చక్కదిద్దాలని, అలాకాకుండా పాఠశాలలను మూసివేస్తే తరువాతి తరం విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఉపాధ్యాయ ఖాళీ లను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగుల్లో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు దాదాపు 6 లక్షల మంది ఉన్నారని చెప్పారు. స్కూళ్ల మూసివేతతో వీరందరికీ ఉద్యోగావకాశాలు లేకుండా పోతాయని తెలిపారు. -
గొర్రెలు, బర్రెలు కాదు..
సాక్షి, షాబాద్(చేవెళ్ల): బీసీ కార్పొరేషన్లో ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు వెంటనే ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం షాబాద్ మండల కేంద్రంలోని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన యువత స్వయం ఉపాధి కోసం బీసీ కార్పొరేషన్లో రుణాలకు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణవ్యాప్తంగా బీసీ కార్పొరేషన్లో 5,47 లక్షల మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకొని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్లు మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులకు నెలలోపు రుణాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వెనుకబడిన తరగతుల వారికి గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేయడం కాదు, వారి అభ్యున్నతి కోసం గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. చదువుకున్న చదువులకు అనుగుణంగా ఉద్యోగాలను కల్పించాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇందూరి రాములు, జిల్లా కార్యదర్శి రాపోల్ నర్సింలు, నాయకులు సూద యాదయ్య, రామకృష్ణ, శ్రీశైలం, చందు, రమేష్, కృష్ణ, రామకోటి, శివ, తదితరులు ఉన్నారు. -
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : కృష్ణయ్య
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యా విధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని బీసీ నేత ఆర్ కృష్ణయ్య స్వాగతించారు. సీఎం జగన్ నిర్ణయం పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి, వారి బంగారు భవిష్యత్తు పునాది అవుతుందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో ఏ చిన్న ఉద్యోగం కావాలన్నా ఈ రోజు ఆంగ్ల భాష పరిజ్ఞానం తప్పనిసరి అన్నారు. ఆంగ్లం చదవడం ద్వారా మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. ‘ఈ రోజుల్లో కూలీ పని చేసే వారు సైతం అప్పు చేసి మరీ వారి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూళ్ల వైపు వెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. సీఎం జగన్ నిర్ణయంతో పేద పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దీనిని రాజకీయం చేయడం సరికాదు. ఆంగ్ల విద్యా విధానం వచ్చినా అమ్మ భాష ఎక్కడికి పోదు’ అని కృష్ణయ్య అన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50శాతం అవకాశం ఇవ్వడం శుభపరిణామం అన్నారు. నేడు సీఎం జగన్ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇంతకు ముందు ఉన్న ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని ప్రశంసించారు. -
రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్
కవాడిగూడ: పదివేల కోట్ల రూపాయలతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కలి్పంచాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అన్నిరంగాల్లో బీసీల వాటా, కోటా తగ్గించి బీసీల అణిచివేతకు పాల్పడటాన్ని నిరసిస్తూ శుక్రవారం ఇక్కడి ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బడ్జెట్లో బీసీల నిధుల్లో 50 శాతం కోత విధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి 50 శాతం నామినేటెడ్ పదవులను బీసీలకు ఇస్తున్నారని, కానీ కేసీఆర్ మాత్రం బీసీలను అడుగడుగునా తొక్కడానికి ప్రయతి్నస్తున్నారని విమర్శించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ఆర్థిక మాంద్యం పేరుతో బడ్జెట్లో భారీగా కోతపెట్టారని, బీసీలకు అన్యా యం జరుగుతోందని అన్నారు. సంఘటితంగా ఉద్యమించపోతే హక్కులు పోతాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, బీసీ నేతలు భూపే‹Ù, సాగర్, అంజి, నందగోపాల్, కోలా శ్రీనివాస్, మల్లేష్ యాదవ్, ఏపీ నేత వెంగళరావు, 32 కుల, 25 బీసీ, ఎంబీసీ, విద్యార్థి, యువజన సంఘాలు పాల్గొన్నాయి. -
‘హెల్త్ వర్సిటీ వీసీని తొలగించాలి’
హైదరాబాద్: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డిని తొలగించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని 14 బీసీ సంఘాలు హెచ్చరించాయి. ఆదివారం ఇక్కడ విద్యానగర్ బీసీ భవన్లో 14 బీసీ సంఘాల సమావేశం జరిగింది. వీసీని తొలగించాలని ఆ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదని, ఫలితంగా 262 మందికి సీట్లు రాకుండా పోయాయని అన్నారు. వీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మారారని, రాజ్యాంగ హక్కులను అమలు చేయకుండా ఈ వర్గాలపట్ల విషాన్ని వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ కూడా అంగీకరించిందని తెలిపారు. అన్యాయాన్ని సరిదిద్దకుండా వైస్ చాన్సలర్ వితండవాదం చేస్తూ హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు కూడా మెరిట్ మార్కుల ప్రకారం మొదట ఓపెన్ కాంపిటీషన్ సీట్లు భర్తీ చేసి, ఆ తర్వాత రిజర్వేషన్లు భర్తీ చేయాలని తీర్పు చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్ల అమలులో తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ అడ్మిషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం నయీమ్ డైరీని బయటపెట్టాలి
-
వాల్మీకి టైటిల్‌ను మార్చాలి : ఆర్.కృష్ణయ్య
దోమలగూడ: బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలని, లేదంటే బీసీ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. వాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలని కోరుతూ బోయ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వాల్మీకి బోయలు శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు కృష్ణయ్యతో పాటు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ అధ్యక్షుడు కుందారపు గణేషాచారి తదితరులు సంఘీబావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ గ్యాంగ్ స్టర్ సినిమాకు మహర్షి అయిన వాల్మీకి పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. వాల్మీకి అంటే భారతీయ సంస్కృతికి చిహ్నమని, డబ్బులు సంపాదించడం కోసం ఆయన పేరును పెట్టడం మంచిది కాదన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేదిగా సినిమా ఉండాలే తప్ప సమాజాన్ని భష్టుపట్టించేదిగా ఉండరాదన్నారు. ఈ సినిమా టైటిట్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బోయహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మీనగ గోపి బోయ, సమితి నాయకులు కృష్ణయ్య నాయుడు, ఎంబి బాలకృష్ణ, పుట్ట అంజయ్య, ఎం రాములు, హన్మంతు, ఎ కోండయ్య, శ్రీగిరి ఆదిశేషు, చొప్పవరపు విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను గుర్తించింది ఒక్క జగనే!
సాక్షి, అమరావతి : దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ గుర్తించని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను గుర్తించి వారికి పెద్దపీట వేశారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో సోమవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లును ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే పార్లమెంట్లో పెట్టిందని తెలిపారు. అందుకు తన బృందంతో కలిసి సీఎంకు కృతజ్ఞతలు తెలిపి సత్కరించామన్నారు. దేశంలో 36 రాజకీయ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీ చేయని ధైర్యం వైఎస్సార్సీపీ చేసిందన్నారు. టీడీపీ బీసీల పార్టీ అని ప్రగల్భాలు పలకటమే తప్ప, వారికి ఆ పార్టీ చేసిన మేలు ఏమిలేదని ఆయన విమర్శించారు. బీసీలను చంద్రబాబు తన అవసరాలకు మాత్రమే వాడుకున్నారని చెప్పారు. 72 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీ బిల్లుపెట్టడానికి ముందుకు రాలేదన్నారు. ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చరిత్రకెక్కిందని ఆయనన్నారు. రాష్ట్ర తాజా బడ్జెట్లో బీసీలకు ఆయన రూ.15 వేల కోట్లపైగా కేటాయించారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదని.. ఇప్పటివరకు గరిష్టంగా రూ.5 వేల కోట్లు మించలేదని తెలిపారు. అలాగే, బలహీన వర్గాలకు ఐదు డిప్యూటీ సీఎం పదవులు.. కేబినెట్లో 60 శాతానికిపైగా బీసీలకు స్థానం కల్పించారని హర్షం వ్యక్తంచేశారు. -
ఒకటి అడిగితే సీఎం జగన్ రెండు చేస్తున్నారు..
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టించారని బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో బీసీల పార్టీలుగా చెప్పుకునే వాళ్లంతా బీసీలను మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిపారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు పెట్టారు. కేంద్రం ఆ బిల్లును పెండింగ్‌లో పెట్టినా బీసీ బిల్లు కోసం పోరాడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చదవండి: బీసీ బిల్లుకు కేంద్రం నో బడ్జెట్లో కూడా బీసీలకు అత్యధికంగా రూ.15వేల కోట్ల నిధులు కేటాయించారు. అమ్మ ఒడి, విద్యార్థులకు రూ.20వేల మెస్ ఛార్జీలు, ప్రతి బీసీ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాగైతే ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో బీసీల జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే వైఎస్ జగన్ ప్రతి పథకంలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అత్యధికంగా లబ్ది చేకూరేలా చేశారు. మంత్రివర్గంలో 60శాతం పదవులే కాకుండా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చారు. బీసీల కోసం నేను ఒకటి అడిగితే రెండు చేస్తున్నారు. సీఎం జగన్ వల్ల నాకు పోరాటం చేయడానికి సబ్జెక్టే లేకుండా పోయింది’ అని అన్నారు. కాగా చట్టసభల్లో ఓబీసీల జనాభా నిష్పత్తికి అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ‘ప్రైవేట్’బిల్లుపై జూన్ 21న సభలో సుదీర్ఘ చర్చ జరిగిన విషయం తెలిసిందే. -
బీసీ బిల్లు చరిత్రాత్మకం
పంజగుట్ట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం చరిత్రాత్మక ఘట్టమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీలం వెంకటేశం అధ్యక్షతన రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బీసీ బిల్లుకు మద్దతుగా 93 బీసీ కులాలు, 30 సంఘాల విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య బీసీ బిల్లును ప్రవేశపెట్టడంతో ప్రత్యేక శ్రద్ధ చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డిని అభినందించారు. పార్లమెంట్లో ఉన్న 92 మంది బీసీ సభ్యులు వారిని చూసి నేర్చుకోవాలని, ఇప్పటికైనా వారికి పూర్తి మద్దతు పలకాలని కోరారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని గతంలోనే కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిసి కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. బీజేపీ కూడా బిల్లుకు మద్దతు ఇస్తూ బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్లుకు తాము మద్దతివ్వకూడదనుకుంటే వారే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని సూచించారు. త్వరలోనే బీసీ కుల సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు అన్ని పార్టీల ప్రతినిధులను, పార్లమెంట్ సభ్యులను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. బీసీ బిల్లు పాసైతేనే ఎస్సీ, ఎస్టీలతో సమానంగా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు వర్తిస్తాయన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 30 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని, పార్లమెంట్‌వద్ద ఎన్నోసార్లు ధర్నాలు చేశామని, 40 సార్లు ప్రధానమంత్రిని కలిసి చర్చించినట్లు ఆయన గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించి బిల్లు పెట్టారని దీనిని ఆమోదింపజేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చొరవ తీసుకుని అన్ని పార్టీలను సమావేశపరిచి బిల్లు ఆమోదానికి కృషి చేయాలన్నారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు రాజకీయాల్లో 14 శాతం కూడా ప్రాతినిధ్యం లేదని, దేశంలోని 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుండి ఒక్క బీసీ ఎంపీ కూడా లేకపోవడం దారుణమన్నారు. దేశంలో 2600 బీసీ కులాలు ఉండగా 2550 కులాలు ఇంతవరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన పాలకులు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. ఇప్పటివరకు 121 సార్లు రాజ్యాంగ సవరణ జరిగినా బీసీ బిల్లుపై ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్ట సభల్లో బిసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లను 100 శాతానికి పెంచి ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంట్ గడప తొక్కని బిసీ కులాల వారికి నామినేషన్ పద్దతిలో నామినేట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివిధ బీసీ సంఘాల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయి రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయినా ఎంతో గొప్ప మనస్సుతో ఇప్పటివరకు ఎవరూ చేయని సాహసం చేశారన్నారు. సమావేశంలో నాయకులు గుజ్జ కృష్ణ, మల్లయ్య, వేముల వెంకటేష్, లాలు కొట వెంకటాచారి, లక్ష్మణ్ యాదవ్, విరోభ, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లు పెట్టాలి
హైదరాబాద్ : పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆదివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఇంతవరకు అసెంబ్లీ, పార్లమెంటు గడప తొక్కని బీసీ కులాల వారికి నామినేటేడ్ పద్ధతిలో ఆంగ్లో ఇండియన్లకు ఇచ్చిన మాదిరిగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి, రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 50 శాతానికి పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్ర, ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీల వెంకటేష్, దాసు సురేశ్, సి.రాజేందర్, జి. అంజి, వేముల రామకృష్ణ, జి. కృష్ణ యాదవ్, నరేష్‌గౌడ్, బర్క కృష్ణ, మహేందర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లకై ఉద్యమించాలి
హైదరాబాద్: బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని పార్టీలకతీతంగా బీసీలందరూ పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో ఆంధ్రపదేశ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీల సమావేశం ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకానమ్మ అధ్యక్షతన జరిగింది. ఆర్.కృష్ణ య్య మాట్లాడుతూ.. 71 ఏళ్ల స్వతంత్ర భార తంలో పాలకులు బీసీలను అభివృద్ధి చేయకుండా గొర్రెలు, బర్రెలు ఇచ్చి, అడుక్కుతినే బిక్షగాళ్లను చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రంలోగానీ ఇప్పటివరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీలేడని ఆవేదన వ్యక్తం చేశా రు. 545 మంది లోక్‌సభ సభ్యుల్లో 96 మంది మాత్రమే బీసీలు ఉన్నారని, తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉంటే బీసీలు కేవలం 22 మందే ఉన్నారన్నారు. తెలంగాణలో 112 బీసీ కులాలు ఉండగా ఇంతవరకు 104 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, జి.శ్రీనివాసులు, రమ్యశ్రీ (సినీ నటీ) తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా, బద్వేల్‌కు చెందిన జి.శ్రీనివాసులుకు నియమాక పత్రాన్ని ఆర్.కృష్ణయ్య అందజేశారు. తెలంగాణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా అల్లి లక్ష్మి, సభ్యులుగా సుమన్‌బాబు, దేవి మంజిరాలను ఎన్నుకుంది. -
ఎంపికైన టీచర్లకు పోస్టింగ్‌లు ఇవ్వాలి
హైదరాబాద్: పబ్లిక్ కమిషన్ ద్వారా సెలక్ట్ అయిన 8,792 మంది టీచర్లకు వారం రోజులలో పోస్టింగ్స్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకపోతే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో గుజ్జ కృష్ణ అధ్యక్షతన సెలక్టెడ్ టీచర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. సెలక్ట్ అయిన టీచర్లకు వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని విమర్శించారు. జాప్యం మూలంగా నెలకు రూ.100 కోట్లు బడ్జెట్ మిగుల్చుకోవాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. అనేక వివాదాల మధ్య 6 నెలల క్రితం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్టెడ్ టీచర్ల జాబితాను విద్యాశాఖ అధికారులకు పంపారని, గత 6 నెలలుగా సీఎం పేషీలో ఈ ఫైలు పెండింగ్‌లో ఉందన్నారు. సీఎం ఫైళ్లను చూడటం లేదని, అందువల్ల సెలక్ట్ అయిన వేలాదిమంది టీచర్లు నిరుద్యోగులుగా మారా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ స్టాఫ్‌ను నియమించకుండా విద్యను భ్రష్టు పట్టిస్తుందని ఆరోపించారు. ఇప్పుడు జరుగుతున్న ఇంటర్ గందరగోళానికి కారణం సరైన అధ్యాపకులు లేకపోవడమేనన్నారు. దాదాపు 70% జూని యర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో విద్యార్హతలు లేని వారితో పేపర్ వ్యాల్యుయేషన్ చేయించారని ఆరోపించారు. టీచర్ ఉద్యోగాల భర్తీని పీఎస్సీ నుంచి బదిలీ చేసిన డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగా టీచర్ ఉద్యోగాల భర్తీని జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా భర్తీ చేయాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. ఈ సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, దాసు సురేష్, జి.అంజి తదితరులు పాల్గొన్నారు. -
‘సగర ఫెడరేషన్‌కు రూ. 500 కోట్లు కేటాయించాలి’
హైదరాబాద్: సగర ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి 12 ఏళ్లు గడుస్తున్నా ఫెడరేషన్‌కు పాలకమండలి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే పాలకమండలిని ఏర్పాటు చేసి రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. సగరుల డిమాండ్ల సాధన కు ఈ నెల 7న సగర హక్కుల పోరాట సమితి చైర్మన్ నీరడి భూపేశ్ సాగర్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద చేపడుతున్న భగీరథ దీక్ష పోస్టర్‌ను శుక్రవారం బర్కత్‌పురాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణతో కలసి ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న సగరుల బతుకులు దుర్భరంగా ఉన్నాయని, అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడిన సగరుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సగరుల్లో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసి ఆర్ధింగా అభివృద్ధి చెందే విధంగా చూడాలని అన్నారు. -
రాజ్యాంగం కంటే మీ చట్టాలు గొప్పవా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నియంతృత్వంగా వ్యవహరిస్తూ నిరసన తెలిపే, ప్రశ్నించే హక్కులను కాలరాస్తూ కొత్త చట్టాలను రూపొందిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ‘మీరు రూపొందించిన చట్టాలు రాజ్యాంగం కంటే గొప్ప వా..’అని ప్రశ్నించారు. ఎస్.ఐ, కానిస్టేబుల్స్ సెలక్షన్ ప్రక్రియలో సెన్సార్షిప్ సిస్టంని తొలగించాలని, ఆర్.ఎఫ్.డి సిస్టం వల్ల ఇబ్బందులున్నాయని, పరుగుపందెంలో అవకతవకలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ జేఏసీ సభను నిర్వహించింది. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ నిరుద్యోగులేమైనా ఎమ్మె ల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి స్థానాలను ఆశిస్తున్నారా.. వారు చదివిన చదువుకు తగిన ఫలం లాంటి ఉద్యోగాన్ని అడుగుతుంటే, దానిలో కూడా సవాలక్ష ఆంక్షలను విధిస్తూ ఏడిపించడం సరైనది కాదన్నారు. దీని వల్ల ఎందరో అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. మిమ్మల్ని జీవితాంతం కష్టపెడతాం సభ జరుగుతుండగానే ప్రెస్‌క్లబ్ వద్ద పోలీసులు మోహరించారు. టాస్క్‌ఫోర్స్ అడిషినల్ డీసీపీ చైతన్యకుమార్ ఆధ్వర్యంలో నలుగురు ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 200 మంది కానిస్టేబుళ్లు మోహరించారు. సభ ముగిసిన తర్వాత ఆర్.కృష్ణయ్య, కోదండరాం, బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, విద్యార్థి సంఘం నేత అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని 45 నిమిషాలపాటు ప్రెస్‌క్లబ్‌లో నిర్బంధించి తరువాత పోలీసుస్టేషన్‌కు తరలించారు. సభకు వచ్చిన నిరుద్యోగులను బయటకు వెళ్లకుండా గేట్లు మూసేసి అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.‘మమ్మల్ని బయటకు వదలండి. చచ్చిపోయేటట్టు ఉన్నాం’అని వేడుకున్నా పోలీసులు గేట్లు తెరవలేదు. ఆగ్రహానికి గురైన నిరుద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘మమ్మల్ని మీరు గంట, 3 గంటలు లేదా ఒక రోజు, నెల రోజులపాటు కష్టపెడతారేమో... మేం తల్చుకుంటే మిమ్మల్ని అధికారంలోకి రాకుండా జీవితాం తం కష్టపడేటట్లు చేయగలం’అని హెచ్చరించారు. భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు అరగంట తరువాత గేట్లు తెరవడంతో అభ్యర్థులు బయటకు వచ్చారు. పోలీసులు 15 నుంచి 20 మందిని రౌండప్ చేశారు. తమ తోటివారికి ఏమైం దోనని దగ్గరకు వెళ్లి చూసిన ప్రతి ఒక్కరినీ పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. ఓ పక్క ఎండ, మరో పక్క పోలీసుల వ్యవహారశైలితో విసిగిన నిరుద్యోగులు పెద్దఎత్తున ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. సుమారు ఐదారొందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కొంతమందిని అరెస్ట్ చేసి సమీప పోలీసుస్టేషన్లకు తరలించారు. 18 వేల మందిని ముందే ఎంపిక చేసేసుకున్నారా? అభ్యర్థుల ఎంపికను సరైన రీతిలో చేయాలని వేలాదిమంది నిరుద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం స్పందించడంలేదంటే, ముందుగానే ఆ 18 వేల మందిని సెలక్ట్ చేసేసుకున్నారనే అనుమానం వస్తోందని అన్నారు. న్యాయం కావాలని అడిగితే అరెస్ట్ చేస్తారా.. ఇలా ఎంతమందిని అరెస్ట్ చేసి పరిపాలన సాగిద్దామనుకుంటున్నారో పాలకులు అంతర్మథనం చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు చేసే ఉద్యమానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. -
‘స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలి’
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల సమస్య పరిష్కారమయ్యే వరకూ స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 22% నుంచి 34% వరకు పెంచిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీ భవన్లో శనివారం చెరుకుల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లు లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారని, దీనిపై అధికార పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోరుమెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లు యథాతథంగా అమలు జరపొచ్చని, దీనిపై సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చలు జరిపాలని కోరారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
బీసీలను నమ్మించి ముంచేశాడు
బీసీలకు అందరికన్నా వైఎస్ రాజశేఖరరెడ్డి బాగా చేశారు. రాజకీయంగా కూడా బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చింది ఆయన మాత్రమే. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు, స్కాలర్‌షిప్పుల మంజూరును సంతృప్త్త స్థాయికి తీసుకు రావడం, గురుకులాలు ఎక్కువ చేయడం, ప్రతీ అసెంబ్లీ పరిధిలో బాలికలు, బాలుర హాస్టళ్లు పెట్టడంలో అగ్రస్థానంలో ఉన్నారు. దీంతో పేదకులాల వారు పెద్ద చదువులు చదువుకునే అవకాశం ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమంలో పెద్ద కదలిక వచ్చింది. అన్ని బీసీ కులాలకు 12 ఫెడరేషన్లు, కార్పొరేషన్లు పెట్టారు. వీటితో బెనిఫిట్ ఎక్కువైంది. కానీ రాజశేఖరరెడ్డిగారితోనే అవి ఆగిపోయాయి. ఆ తర్వాత వచ్చిన సీఎంలు బీసీలకు ఏమీ చేయలేదు. యర్రా యోగేశ్వరరావు, ఎలక్షన్ డెస్క్, సాక్షి :‘మీ పిల్లలు చదువుకోవాలి. డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు, అఫీసర్లు కావాలి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అప్పుడే పేదరికం నుంచి బయట పడతారు. అది జరగాలంటే బాగా చదువుకోవాలి. దానికయ్యే ఖర్చంతా నేనే భరిస్తా. భోజనం, పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు.. చిన్నారులను బడికి పంపిస్తే వారి తల్లి ఖాతాలో రూ.15 వేలు వేస్తామంటున్న జగన్ గొప్ప నేత అంటున్నారు బీసీ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య. ఈ ఎన్నికల్లో బీసీలు వ్యవహరించాల్సిన తీరు, బాబు మోసం తదితర విషయాలపై ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ఘనత వైఎస్సార్సీపీదే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని 1994 నుంచి ప్రధానంగా ఎక్కువగా పోరాటాలు చేస్తున్నా. అదే నా జీవితాశయం. హాస్టళ్లను రెండు నెలల్లో, గురుకులాలను రెండేళ్లలో ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యాము. స్కాలర్షిప్లను సంతృప్త స్థాయిలో సాధించాము. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నాలుగేళ్ల పోరాటంలో కృతకృత్యులయ్యాం. కానీ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం 1994 నుంచి పోరాటం చేస్తున్నాం. మూడుసార్లు అసెంబ్లీలలో తీర్మానం చేసినా ప్రధాని వద్దకు ఎవరూ పోలేదు. పార్లమెంటులో ఎవరూ చర్చించలేదు. 36 రాజకీయ పార్టీల నాయకులను కలిశాను. ప్రతీ పార్లమెంట్ సమావేశాల్లో కనీసం 200 మంది ఎంపీలను కలిసి వారిపై ఒత్తిడి తెచ్చాను. వైఎస్జగన్.. బీసీల కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టడాన్ని ఎవరూ నమ్మలేకపోయారు. వైఎస్సార్సీపీ బీసీ బిల్లు పెట్టడమేంటి? బీసీలకు అనుకూలమని చెప్పుకునే డీఎంకే, పీఎంకే, ఏఐఏడీఎంకే, అప్నాదళ్, లోక్‌దళ్, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ వంటి పార్టీలు బిల్లు పెట్టకపోవడమేంటి? 62 ఏళ్ల పార్లమెంటు చరిత్రలో ఏ ఒక్క పార్టీ బీసీ బిల్లు పెట్టలేదు. జగన్ పెట్టడంతో హర్షం వ్యక్తం చేశాం. బీసీల్లో ఆయనపై నమ్మకం పెరిగింది. ‘బీసీలకు ఏంకావాలి.. ఎలా డెవలప్ చేయాలి.. మీరు రాజమండ్రి బీసీ గర్జనకు రండి.. చీఫ్ గెస్ట్‌గా ఉండండి. మీ డిమాండ్లు చెపితే మానిర్ణయాన్ని మీముందే ప్రకటిస్తాం. అధికారంలోకి వస్తే వాటన్నింటినీ అమలు చేస్తాం’ అని జగన్ చెప్పారు. చెప్పిన మేరకే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఆయన మద్దతు పలికారు. 130 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ కాంట్రాక్టులన్నింటిలో 50 శాతం బీసీలకు ఇస్తామని ప్రకటించారు. బీసీ కమిషన్ వేసి, వారి సంక్షేమం కోసం ఏటా రూ.75 వేల కోట్లు బడ్జెట్లో ఇస్తామన్నారు. ప్రతి కుంటుంబానికి రూ.5 లక్షల నుంచి కోటి దాకా సున్నా వడ్డీ రుణాలు, కుల వృత్తుల వారికి ఉపాధి పథకాలు ప్రవేశపెడతామన్నారు. 45–60 వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఏడాదికి రూ.75 వేలు చెల్లిస్తామన్నారు. ఆయన నిర్వహించిన బీసీ గర్జన చరిత్రాత్మకం. వైఎస్సార్సీపీ వస్తే చట్టసభల్లో 50 శాతంరిజర్వేషన్లు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాంబీసీ డిక్లరేషన్‌లోని అంశాలు అమలు చేస్తే బీసీల సమూల, సర్వతోముఖాభివృద్ధికి, వికాసానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, రాజకీయంగా ఎదిగే స్కీంలు దానిలో ఉన్నాయి. అన్ని రంగాల్లో.. విద్య, వైద్యం, ఉపాధి, ఇళ్లు, పింఛన్లు ఇలా పేదకులాలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం మీరు బర్లెకాడకు, గొర్లెకాడకు పోండి, ఒడ్డెరోళ్లకు బరిసెలిస్తా, కమ్మరోళ్లకు కొలిమెలిస్తా, గౌండ్లకు చెట్లు ఇస్తా, మీరిట్లనే బతకండని అంటున్నాడు. అధికారంలో మేం ఉంటాం అంటున్నాడు. మా బిడ్డలు బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగాలు చేసుకోవాలని బీసీలు కోరుకుంటున్నారు. జగన్ బీసీలు శాశ్వతంగా, సమగ్రంగా అభివృద్ధి చెందాలని పథకాలను ప్రవేశబెట్టబోతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే అధికారంలో లేనప్పుడే పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టండని చెబితే జగన్ దానిని ప్రాక్టికల్‌గా చేసి చూపించాడు. అందువల్ల ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి ఈ నవరత్నాలు. నిరుద్యోగులు, యువకులు, రైతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడతాయి. హైదరాబాద్‌లో ఆంధ్రా వాళ్లపై ఎక్కడా దాడులు జరగలేదు. అదిదుష్ప్రచారం. సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభపడాలని చేసే దుర్మార్గపు ఎత్తుగడ. జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం మాటతప్పని వ్యక్తి జగన్. ప్రాక్టికల్‌గా రాజశేఖరరెడ్డి పాలన చూశాం. ఆయన చాలా చక్కగా పరిపాలించారు. ప్రతీ పథకం అందరికీ అందే స్థాయికి తీసుకెళ్లారు. పాలన అంటే ఇలా ఉండాలని అందరూ అనుకునేలా చేశారు. ఆయన అడుగుజాడల్లోనే జగన్ నడుస్తున్నాడు. మాటిస్తే ఎంత కష్టమైనా నెరవేరుస్తారని నమ్ముతున్నాం. అందుకే ఒక అవకాశం ఆయనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కుల మతాలకు అతీతంగా అలోచించడం, మాట ఇస్తే తప్పక నెరవేర్చడం. మంచిగుణాలు ఉన్నాయి. అందరికీ ఎంతో కొంత చేయాలనే తపన, స్థిరనిశ్చయం ఉంది. మరి జగన్ మొత్తం ఫీజులు చెల్లిస్తానంటున్నాడు. ఈ పరిస్థితులో బీసీలు ఆయనకే ఓటు వేయాలి. బాబు మాట నిలుపుకోలేదు రాజకీయాల్లోకి రావాలని నేనెపుడూ అనుకోలేదు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా.. 40 ఏళ్ల క్రితమే మంత్రి పదవిని ఆఫర్ చేశారు. ఎన్టీఆర్ కూడా ఇస్తానన్నారు. ఆ తర్వాత నలుగురు సీఎంలు అడిగారు. బీసీలందరి సమగ్ర సంక్షేమమే నా పథం. అందుకే రాజకీయాలవైపు వెళ్లలేదు. 2014లో చంద్రబాబు తన ముఖ్యమైన అనుచరులను నా వద్దకు పంపారు. ఆయన ఫోన్లో మాట్లాడుతూ ‘తెలంగాణకు నేను రాలేను. మేము సర్వే చేశాం. మీకు ప్రజాదరణ ఎక్కువుంది. పార్టీ గెలిస్తే మిమ్మల్ని సీఎంను చేస్తా. ఒకవేళ హంగ్ వస్తే వాళ్లతో చెప్పి నిన్నే సీఎంను చేస్తా.’ అని చెప్పి ఎల్బీనగర్ టికెట్ ఇచ్చారు. ఎన్నికలైన తెల్లారినుంచే చంద్రబాబు ప్లేట్ ఫిరాయించాడు. ఫ్లోర్ లీడర్‌ను కూడా చేయలేదు. టీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చినా నేను పోలేదు. గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది వెళ్లిపోయారు. నేను మాత్రం వెళ్లలేదు. బీసీలను తొక్కేయడమే బాబు విధానం బీసీ ఉద్యమం బలపడకూడదనేది చంద్రబాబు విధానం. ఆయన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వెనుక ఆయన స్వార్థం ఉంది. జనాభాలో బీసీలు కీలకం. నా ద్వారా అయన రాజకీయ లబ్ధి పొందాలనే నాకు సీటు ఇచ్చాడు. బీసీలకు ముఖ్యమంత్రి అంటే బీసీలంతా ఒక్కటవుతారు కదా. ఏపీలో బీసీలంతా తనకు ఓటేస్తారన్న కుయుక్తితో నన్ను వాడుకున్నాడు. బీసీలను ఉపయోగించుకుని ఏపీలో సీఎం కాగానే అవసరం తీరాక విదిలేశాడు. చంద్రబాబు వాడుకుని వదిలేసే గుణాన్ని అక్కడి, ఇక్కడి బీసీలు గ్రహించారు. అది తెలిసి ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. ఇపుడు కొత్త ప్లేకార్డు ఆడుతున్నాడు. డబ్బులు వెదజల్లుతున్నాడు. అట్లా ఎప్పటికప్పుడు పత్తాలాడినట్లు కార్డులను మారుస్తుంటాడు. అందుకోసమే ఇపుడు బీసీలను తొక్కుతున్నాడు. ఏపీ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేయడానికి కారణం నేను గౌరవాధ్యక్షునిగా ఉండటమే. అప్పటికి నేను టీడీపీ ఎమ్మెల్యేనే. అక్కడి నాయకులంతా వెళ్లి అధికారులను ఈ విషయాన్ని అడిగితే, సీఎం గారు చెప్పారని బదులిచ్చారు. గౌరవాధ్యక్షునిగా ఉన్న కృష్ణయ్యను తొలగిస్తేనే గుర్తింపు కొనసాగుతుందని చెప్పారు. దీంతో సంఘం నాయకులు ఈ అంశాన్ని జనరల్ బాడీలో పెట్టారు. సభ్యులంతా ఎదురుతిరిగారు. మాకు గుర్తింపు లేకున్నా మాకు నాయకుడు కృష్ణయ్యేనని తీర్మానించారు. దీంతో చంద్రబాబు ఆ సంఘంలో కొందరిని ప్రలోభాలతో చీల్చి, వారివల్ల కొన్ని రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించారు. బాబుకు అలవాటు కదా చీల్చడం. కులాలను, మతాలను చీల్చి కుట్రలతో సీఎం పదవిని కాపాడుకుంటున్నాడు. ఆయన ఎంత బీసీ వ్యతిరేకో జనాలు అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్ని బీసీ వ్యతిరేక పనులు చేసినా ఓపికతో భరిస్తున్నాం. ఎప్పుడైతే మాలోనే చీలికలు తెస్తున్నాడో అప్పటినుంచే వ్యతిరేకిస్తున్నాం. చేసిన అప్పుంతా ఎక్కడికెళ్లింది? ఐదేళ్లు ప్రజావ్యతిరేక చర్యలు తీసుకుని, మాయమాటలు చెప్పడం, మోసం చేయడం. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇస్తున్నాడు కానీ, ఒక్కో కుటుంబం పేరు మీద రూ.2 లక్షల అప్పు చేసిండు. ప్రజలను ఈ విధంగామోసం చేస్తున్నడు. చేసిన అప్పంతా ఎక్కడ పోయింది. గత ప్రభుత్వాలు 65 ఏళ్లలో చేయని అప్పు చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేశాడు. 65 ఏళ్లలో గతంలో ఒక్కో కుటుంబంపై రూ.50 వేలు అప్పు ఉంటే నేడు రూ.2 లక్షలకు చేరింది. ఈ అప్పు ఆయన కడతాడా? బీసీ సబ్‌ప్లాన్ కేటాయింపుల్లో సగం కూడా ఖర్చుపెట్టలేదు. ఒక్క హాస్టల్ బిల్డింగ్గాని, స్కూల్ బిల్డింగ్గాని కట్టలేదు. సబ్‌ప్లాన్ నిధులను వేరేవాటికి వాడుకుంటున్నారు. అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేయొచ్చో అయనకుతెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు పేద ప్రజలకు పనికొచ్చే పని ఏదీ చేయలేదు. కానీ తన మీడియా ద్వారా ఏదో చేసినట్టు హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ♦ ఫీజుల కోసం రక్తాన్ని అమ్ముకుంటున్న పీజీ విద్యార్థులు కూడా ఉన్నారంటే బీసీల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లను కాలేజీల్లోనే వదిలి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. హాస్టల్ పిల్లలు ముతక బియ్యంతో అన్నం తింటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.10 వేలు పెంచుతున్నట్టు చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించి, దాన్ని అమలు చేయలేదు. ♦ బీసీలందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తున్నా. దేశ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా, ధైర్యంగా మనకోసం అన్నీ చేస్తానని చెబుతున్నాడు. కనుక జగన్‌ను గెలిపిస్తే బీసీల పోరాట ఫలితం అందుతుంది. చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయి. అవసరమైతే ఇతర పార్టీల ఎంపీలను కూడా ఒప్పించి మద్దతు కూడగట్టగల సమర్థుడు. అనుకుంటే దేన్నయినా సాధించగల సత్తాగల నాయకుడు. ♦ బీసీ రిజర్వేషన్ బిల్లుపై అఖిలపక్షంతో ప్రధాని వద్దకు వెళ్లి ఒత్తిడి తెద్దామని చంద్రబాబును కోరా. ఆయన బీజేపీతో మిత్రపక్షంగా ఉండి 42 సార్లు పీఎంను కలిసినా బీసీ బిల్లును ప్రస్తావించలేదు. టీడీపీ ఎంపీలు కూడా ఆ విషయాన్ని పార్లమెంటులో నోరెత్తి అడగలేదు. బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీలో ధర్నాలు చేసినా, అఖిలపక్షాన్ని కలవాలనుకున్నా టీడీపీకి సహకరించవద్దని తన ఎంపీలను చంద్రబాబు హెచ్చరించారు. ఇపుడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇతర పార్టీల కన్నా తక్కువ సీట్లు ఇచ్చాడు. ♦ చంద్రబాబు పాలనలో బీసీలకు ఎలాంటి మేలు జరగలేదు. అంతా కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థలకే బెనిఫిట్ తప్ప ప్రజలకు లేదు. ఇపుడు 5 ఏళ్లు, అంతకు ముందు 9 ఏళ్లు పరిపాలించిండు. బీసీల అభివృద్ధికి ఏమైనా ఇచ్చిండా? గడ్డపారలు, బర్రెలు, గొర్రెలు, సుత్తెలు, బుట్టలు, చిన్నచిన్న కులవృత్తులు చేసుకుంటూ అర్ధాకలితో బతకమని.. ఇవే కదా ఇస్తానన్నాడు. వాళ్లు మంచి ఉద్యోగాలు సంపాదించేందుకు ఏమైనా చేసిండా? కనీసం ఫీజు రీయింబర్స్‌మెంటునైనా పూర్తిగా ఇవ్వలే. ♦ మారుతున్న సమాజానికి అనుగుణంగా బీసీలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యం జగన్‌కు ఉంది. చంద్రబాబు ఆలోచన ఎంతసేపూ బీసీలు కుల వృత్తులను నమ్ముకొని అలాగే ఎదగకుండా ఉండాలని ఉంది. జగన్ ఆలోచన మంచిదా? చంద్రబాబు దురాలోచన మంచిదా? బీసీలుతేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ♦ చంద్రబాబు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దాన్ని గ్రహించి రాజకీయ ఎత్తులు వేస్తున్నాడు. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అవసరానికి తగ్గట్టు వాడుకుంటాడు. పోయిన సారి నన్ను, పవన్ కల్యాణ్‌ను వాడుకున్నాడు. ఇప్పుడు కొత్తవాళ్లను ఉపయోగించుకుంటున్నాడు. ఆయనది అవకాశవాదం. కులాలు, మతాల మధ్య పంచాయితీ పెట్టి పబ్బం గడుపుకోవడం దుర్మార్గం. -
కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీల ఊసేది?
హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీల ప్రస్తావన ఏది? బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వాగ్దానం మేనిఫెస్టోలో ఎందుకు లేదు?’ అని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ బీసీ భవన్లో సంఘం ముఖ్యనాయకుల సమావేశం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అన్నిపార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నాయి కానీ బీసీల రాజకీయ రిజర్వేషన్ల గురించి ఏ ఒక్క పార్టీ మాట్లాడటం లేదని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా ఈ దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంద న్నారు. ఇటీవల సీపీఐ. సీపీఎం, డీఎంకే, సమాజ్‌వాది, ఆర్జేడీ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోల్లో నూ బీసీల ప్రస్తావన లేదన్నారు. బీసీ ప్రధాని ఉన్నా న్యాయం సున్నా? ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయినా, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్కడా స్పష్టమైన హామీ ఇవ్వలేదని విమర్శించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు, పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ప్రధాన డిమాండ్లను నెరవేర్చలేదని ఆరోపించారు. త్వరలో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించి బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు నీల వెంకటేశ్, సి.రాజేందర్ తదితరులు పాల్గోన్నారు. -
చంద్రబాబు బీసీ వ్యతిరేకి