
సాక్షి, ఢిల్లీ: పార్టీ మారే ఆలోచన లేదని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను వివరణ అడగకుండానే పార్టీ మారుతున్నట్లు వార్తలు రాసుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.
బీసీల కోసం కొట్లాడే తనకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు పూర్తిగా ఉంది. బీసీలు రాష్ట్రానికి దేశానికి వెన్నుముక అని జగన్ చెప్తుండేవారు. బీసీల కోసం ఇంకా పోరాడాలి కృష్ణన్న అంటూ జగన్ నన్ను కలిసినప్పుడల్లా చెప్తుంటారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాడే తనకు పార్టీ మారే పరిస్థితి లేదని.. వైఎస్సార్సీపీ నుంచే బీసీల కోసం కొట్లాడుతానని కృష్ణయ్య అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment