bc
-
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతల భేటీ
-
బీసీలకు స్వాతంత్య్ర ఫలాల్లో సమవాటా ఎప్పుడు?
దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబడిన చేతి వృత్తుల, కుల వృత్తులపై బతికే బీసీల అభ్యు న్నతే లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేయాల్సిన అవసరం ఉంది. దేశా నికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లకు పైగా గడిచిపోయాయి. అయినా బీసీలు, ఎంబీసీలు తమకు న్యాయమైన వాటా దక్కాలనిఇంకా పోరాటం చేస్తూ ఉండాల్సి రావడం నిజంగా బాధా కరం. వారు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అట్ట డుగున ఉండడం మన కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోడానికి ముందుకు రావడం కొంత ఆశాజనక అంశమే. అయితే అవి తమ చిత్త శుద్ధిని అమలులో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా; విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన... బీసీ లకు ఆ యా రంగాలలో సరైన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘బీసీ డెడికేటెడ్ కమిషన్’ నివే దిక ఇవ్వాల్సిన అవసరం ఉంది.రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా వారిసంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ కమిటీ పదవుల్లో 33 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమే. దానితో పాటుగా బీసీ లను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం కోసం గొర్రెల పంపిణీ చేయడం, చేపల పెంపకానికి కృషి చేయడం, నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం, వందల సంఖ్యలో కొత్తగా బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ‘జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్’ను అందించడం, బీసీ కులాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేయడం... వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు.ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డిలో బీసీ వర్గాలకు చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యతో డిక్లరేషన్ ఇప్పించింది. ఆ డిక్లరేషన్‌కు కట్టుబడి బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కూడా ఎన్నో విమర్శలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.ఎందుకంటే సర్వే పత్రాలు రోడ్లపై ప్రత్యక్షమవుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి బీసీల జనాభా లెక్కలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ కానీ, కాంగ్రెస్ పార్టీగా తాను తెలంగాణ ప్రజ లకు ఇచ్చిన హామీలను కానీ చిత్తశుద్ధితో అమలు చేయాలంటే అధికారంలో ఉన్న వారికి బడుగుల పట్ల ప్రేమ ఉండాలి. ఎన్నికల నినాదాలు ప్రభుత్వ విధానా లుగా మారాలి. హడావిడిగా జనాభా లెక్కలను సేకరించి చేతులు దులుపుకొనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయ కూడదు. రాజకీయ అధికారంతో సామాజిక, ఆర్థిక అసమా నతలు తొలగిపోతాయన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీలకు, వారి ఉప కులా లకు రాజకీయ అధికారంలో జనాభా నిష్పత్తి ప్రకారం వాటాను కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు ఉండా లని డిమాండ్ చేస్తున్నాం.కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు జరుగు తున్న, జరిగిన బీసీ రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉదాహరణగా తీసుకొని, అదే స్థాయిలో రాష్ట్రంలో బీసీలకు రాజకీయ వాటా దక్కే విధంగా రిజర్వే షన్లను ఖరారు చేసి అమలు చేయాలి. ఒక నెల కాల పరి మితికే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఈ స్వల్ప సమయం సరిపోకపోవచ్చు. బీసీ, బీసీ ఉప కులాల్లో కచ్చితమైన జనాభా గణాంకాలను వెలికి తీయడానికి కమిషన్‌కు కింది స్థాయి ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ కాలపరిమితిని మరికొంత కాలం పాటు పొడిగించి, బీసీ కులాల కచ్చితమైన డేటా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి.డెడికేటెడ్ కమిషన్ కూడా అంతే చిత్తశుద్ధితో సమగ్రంగా అధ్యయనం చేసి ఎటువంటి లోపాలకూ తావు లేకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా తమ నివేది కను ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు సరైన న్యాయం జరగాలనే ఆకాంక్ష, చిత్తశుద్ధిని వ్యక్తం చేస్తూ డెడికేటెడ్ కమిషన్‌కు ‘తెలంగాణ జాగృతి సంస్థ’ తరఫున నివేదికను అందజేశాం. అన్ని కులాలు, తరగతులు, వర్గాలకు మధ్య ఉన్న తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామా జిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వా లను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రాతినిధ్యం లేని, లేదా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వివిధ కులాలకు, తరగతులకు అవకాశాలు కల్పించేందుకు అనేక మార్పులను, చర్యలను ప్రభుత్వాలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.తమ శ్రమను, మేధస్సును మానవ నాగరికతా వికా సానికి ధారపోసిన కులవృత్తుల వారు స్వాతంత్య్ర ఫలాల్లో సమవాటా పొందాలి. ఈ సమాజ నిర్మాణానికి తమ రక్త మాంసాలను కరిగించి వందల వేల సంవత్సరాలుగారంగులద్దిన చేతి వృత్తుల వారికి ఇప్పటికైనా చట్ట సభల్లో గళమెత్తే అవకాశం కల్పించాలి. ఊరికి నాలుగు దిక్కులా మన తాత ముత్తాతల కథాగానం చేసిన సంచార జాతులు కనీసం పంచాయతీ వార్డు మెంబర్ అయినా కాలేకపోతే స్వరాజ్యానికి అర్థమేముంది? ఇకనైనా మార్పు రావాలి. -కల్వకుంట్ల కవిత వ్యాసకర్త ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు -
తప్పుడు సమాచారమిస్తే క్రిమినల్ చర్యలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీసీలు కాకున్నా కులగణన సర్వేలో బీసీలుగా నమోదు చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్లు ఖరారు చేసే అం«శంపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా వేదికగా బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ సమగ్ర వివరాలు సేకరించనున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ఇవే కీలకమని, దీని ఆధారంగానే రిజర్వేషన్లు, పథకాలు ఉంటాయని వివరించారు. కులాల వారీగా సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుసుకునేందుకు కలెక్టర్లకు బహిరంగ విచారణ చక్కటి అవకాశమని, 13 వరకు జరిగే కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొనాలని సూచించారు. కొన్ని కులాలు డీ నుంచి ఏ కు మార్చాలని, మరికొన్ని కులాలు బీసీ ఏ నుంచి ఎస్టీకి, బీసీ బీ నుంచి ఈకి రిజర్వేషన్లు మార్చాలని నివేదించారని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీ కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సత్యప్రకాశ్, కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.విచారణ రసాభాసబీసీ కమిషన్ బహిరంగ విచారణ రసాభాసగా మారింది. వివిధ బీసీ కుల సంఘాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వినతిపత్రాలు సమర్పించగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్ బీసీ కమిషన్‌కు వినతిపత్రమిస్తూ కమిషన్ విచారణపై అనుమానాలు వ్యక్తం చేశారు. బిహార్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రొసీజర్ ల్యాప్స్ పేరుతో కోర్టు కొట్టివేసిందని, తెలంగాణలో కేవలం కాలయాపన కోసమే విచారణ, సర్వేలు చేస్తుందని దుయ్యబట్టారు. సర్వే కోర్టులో నిలబడుతుందా.. ఏ రకంగా నిలబడుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తన అభిప్రాయం చెప్పేందుకు కమిషన్ అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరూ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేశారని, రిజర్వేషన్ల అమలులో ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
మీ రాజకీయ పొత్తుల కంటే తక్కువైపోయారా బీసీలు?
-
అవన్నీ తప్పుడు వార్తలు.. పార్టీ మారే ప్రసక్తే లేదు: ఆర్ కృష్ణయ్య
సాక్షి, ఢిల్లీ: పార్టీ మారే ఆలోచన లేదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను వివరణ అడగకుండానే పార్టీ మారుతున్నట్లు వార్తలు రాసుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.బీసీల కోసం కొట్లాడే తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు పూర్తిగా ఉంది. బీసీలు రాష్ట్రానికి దేశానికి వెన్నుముక అని జగన్ చెప్తుండేవారు. బీసీల కోసం ఇంకా పోరాడాలి కృష్ణన్న అంటూ జగన్ నన్ను కలిసినప్పుడల్లా చెప్తుంటారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాడే తనకు పార్టీ మారే పరిస్థితి లేదని.. వైఎస్సార్సీపీ నుంచే బీసీల కోసం కొట్లాడుతానని కృష్ణయ్య అన్నారు. -
బీసీలకు బిగ్ షాక్
-
చంద్రబాబు ఆదేశాలతో బీసీ నేతను ఈడిపడేసి..!
-
బీసీలకు మోసం
-
బడుగులకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: మూడు జాబితాల్లోనూ కాపు, బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. బడుగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తన సొంత సామాజికవర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికే 30 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. వెలమ సామాజిక వర్గాన్ని కేవలం ఒక్క సీటుకే పరిమితం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొండిచేయి చూపారు. టీడీపీ జాబితాలో ముస్లిం మైనార్టీ సీట్లు కేవలం మూడే కేటాయించారు. ఇప్పటివరకు 139 స్థానాలకు అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించగా, బీసీ-31, ముస్లిం మైనార్టీ-3, ఎస్సీ-26, ఎస్టీ-04, కాపు-09, కమ్మ 30, రెడ్డి-28, వైశ్య-02, క్షత్రియ-05, వెలమ-01 సీట్లు కేటాయించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ చేసి చూపారు సీఎం జగన్. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పదేపదే స్పష్టం చేసిన ఆయన అదే నినాదాన్ని అక్షరసత్యం చేశారు. 50 శాతం సీట్లు బడుగు బలహీనవర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. జనబలమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు. -
చంద్రబాబులో నో ఛేంజ్.. లోకేష్ కు మరో ఓటమి
-
కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? రగిలిపోతున్న బీసీ నేతలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తనసామాజికవర్గ నేతలు ఉంటే.. ఇంక ఎవరితోనూ పని ఉండదు. బీసీలను అసలు పట్టించుకోరు. మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో చంద్రబాబును మోస్తున్న బీసీ నేతలు ఆయన తీరుతో మండిపడుతున్నారు. ఇంతకాలం తమతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఇప్పుడు బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారిని పక్కన పెట్టి ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్ చేస్తే సహించేది లేదంటున్నారు. అసలు కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన కుర్చీ కదిలిపోతోంది. ఏడుసార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా కూడా సొంత నియోజకవర్గానికి కనీసం తాగు, సాగునీరు కూడా తీసుకురాలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కుప్పం దశ తిరిగింది. అన్నివిధాలుగానూ కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నది నీటిని కుప్పంకు తీసుకువచ్చి వారి దాహార్తిని తీర్చుతున్నారు. పొలాల్ని సస్యశ్యామలం చేస్తున్నారు. నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించారు. గండం నుంచి గట్టెక్కడానికి కుప్పం పార్టీని తన సామాజికవర్గానికి చెందిన ప్రకాశం జిల్లా నేత, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు అప్పగించారు. దీంతో దశాబ్దాలుగా పార్టీకి ఊడిగం చేసిన తాము పనికిరాకుండా పోయామా అంటూ అక్కడి బీసీ నేతలు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీసీ నేతలతో పాటు..కుప్పంలో ఆయనకు పీఏలుగా పనిచేసినవారిని కూడా పక్కన పెట్టేశారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసేశారు. దీంతో వారు లోపల ఉండలేక..బయటకు పోలేక అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్ళుగా తమను వాడుకుని..ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తామేంటో ఎన్నికల్లో చూపిస్తామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కుప్పంలోని బీసీ సామాజికవర్గ నేతలు. తమను నమ్మకుండా బాధ్యతలు లేకుండా చేసినపుడు ఇంకా తాము టీడీపీకి, చంద్రబాబుకు ఎందుకు సేవ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇంతకాలం భారీ మెజారిటీ రావడానికి, అసలు ఆయన విజయం సాధించడానికి అక్కడ చేర్పించిన దొంగ ఓట్లే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కుప్పంలో చంద్రబాబు చేర్పించుకున్న దొంగ ఓట్లలో 33 వేలకు పైగా తొలగించారు. అందుకే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటున్నారు అక్కడి బీసీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కుప్పంలో అధికార పార్టీ బాగా బలం పుంజుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఒకవైపు కేడర్‌లో నైరాశ్యం..బీసీ నేతల్లో పార్టీ అధినేత పట్ల ఆగ్రహం..ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత...మొత్తం కలిపి కుప్పంలో చంద్రబాబు కోట కూలడం ఖాయమనే టాక్ నడుస్తోంది. -
దెబ్బకు బాబు, పవన్ మబ్బులు వీడిపోతాయి: కొడాలి నాని
సాక్షి,ఎన్టీఆర్: టీడీపీ బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు బీసీ భజన చేస్తానంటే ఎవరూ నమ్మరన్నారు. ఈ విషయమై కొడాలి నాని శుక్రవారం నాని మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌ను వెనకాల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు టీడీపీకి బీసీలు వెన్నెముక అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప...బీసీల కోసం చంద్రబాబు కొత్తగా ఏం పాటు పడ్డాడో చెప్పాలని నాని నిలదీశారు. ఓసీలకు టికెటివ్వాల్సిన జనరల్ సీట్లలోనూ బీసీలకు పదవులు ఇస్తూ వారికి సీఎం జగన్ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. సీఎం జగన్ నాలుగు రాజ్యసభ సీట్లు బీసీలకు ఇస్తే 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీ కైనా రాజ్యసభ సీటు ఇచ్చారా చెప్పాలన్నారు. విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారని నాని చెప్పారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడి మబ్బులన్నీ వీడిపోతాయన్నారు. ఇదీచదవండి..చేనేత కార్మికుడి కానుక.. సీఎం జగన్ అభినందనలు -
టీడీపీ కుల అహంకారంపై మండిపడిన YSRCP బీసీ నేతలు
-
సబ్‌ప్లాన్ .. జనగణన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సబ్‌ప్లాన్‌ను బీసీలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సబ్‌ప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయించడం ద్వారా రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న ‘బీసీ గర్జన’సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్‌లో సబ్‌ప్లాన్‌ను పొందుపరచాలని నిర్ణయించింది. దీనితో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం బీసీ విద్యార్థులకు ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సులో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజు చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది. ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీసీ బంధు పేరుతో అమలు చేస్తున్న రూ.లక్ష నగదు సాయం పథకానికి కౌంటర్‌గా బీసీ డిక్లరేషన్ సభ వేదికగానే కొత్త పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే నగదు మొత్తాన్ని పెంచి ఇవ్వాలా? నగదు కాకుండా బీసీల అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేకంగా మరో పథకాన్ని రూపొందించాలా? అన్న దానిపై టీపీసీసీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కామారెడ్డి సభలో సిద్ధరామయ్య ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో పాటు కుల కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి నిధుల కేటాయింపు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లాంటివి కూడా ప్రకటించనుంది. బీసీలతో పాటు మైనారీ్టల కోసం కూడా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా, ఈనెల 9న ఆ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి రేవంత్ రాష్ట్ర పర్యటన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ప్రయాణించడం ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 7వ తేదీన ఆలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభం కానుంది. అదే రోజు గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లోనూ రేవంత్ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో, 9వ తేదీన పాలకుర్తిలో, హైదరాబాద్‌లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.10వ తేదీన కామారెడ్డిలో జరిగే బీసీ గర్జన సభకు హాజరవుతారు. అదే రోజున కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్‌లో మైనార్టీ ముఖ్యులతో డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఈనెల 11వ తేదీన బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
నేడే మోదీ బీసీ గర్జన సభ
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి సదరు బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునే చర్యలనూ పేర్కొనవచ్చని అంటున్నారు. బీసీలను ఆకట్టుకునేందుకు.. నిజానికి గతంలో ఎప్పుడు కూడా ఏ వర్గం నుంచి, ఎవరు సీఎం అవుతారని ముందే ప్రకటించే ఆనవాయితీ బీజేపీలో లేదని.. తెలంగాణ జనాభాలో 54శాతందాకా ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ఇప్పటివరకు బీసీ వర్గానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రి కాలేదని.. ఈ క్రమంలో బీసీ ఎజెండా, బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎస్టీల రిజర్వేషన్లను 10–12 శాతానికి పెంచుతామన్న హామీ ఇవ్వొచ్చని అంటున్నారు. గంటన్నర పాటు పర్యటన ప్రధాని మోదీ యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5.30 గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. -
బీసీన్ మారుస్తుందా?
కె. రాహుల్: తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు చెందిన నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం ద్వారా బీసీ ఎజెండాతో బీజేపీ ఎన్నికల గోదాలోకి దిగుతున్న విషయం స్పష్టమైంది. గత కొంతకాలంగా ఆ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం పెంచుతున్న నేపథ్యంలో బీసీ సీఎంపై కూడా పార్టీ అధినాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అటు అధికార బీఆర్ఎస్, ఇటు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించే అవకాశాలు లేకపోవడంతో బీజేపీకి ఇప్పుడు ఇదే ప్రధాన ఎజెండాగా మారింది. కచ్చితమైన వ్యూహంతో ముందుకు.. కచ్చితమైన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయంలో భాగంగానే అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం అంత బలంగా ఎత్తుకోని బీసీ నినాదాన్ని బీజేపీ తలకెత్తుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. తాజాగా ఈ నిర్ణయాన్ని సూర్యాపేట సభలో అమిత్‌షా ప్రకటించడానికి ముందే సంస్థాగతంగా పార్టీలో వివిధ స్థాయిల్లో చర్చించి, ముఖ్యనేతలు, రాష్ట్రకార్యవర్గం, కౌన్సిల్ సభ్యుల స్థాయిలో అభిప్రాయసేకరణ చేపట్టారు. ఈ భేటీల్లోనూ రెడ్డి, ఇతర సామాజికవర్గనేతల నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో బీసీ ఎజెండాతోనే ముందుకెళితేనే మంచి ఫలితాలు సాధించవచ్చుననే నిశ్చితాభిప్రాయానికి జాతీయ నాయకత్వం వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల గెలుపోటముల్లో బీసీల ఓట్లు కీలకం. రాష్ట్ర జనాభాలో 54 శాతం వరకు బీసీ వర్గాల వారు ఉన్నారనే అంచనాల నేపథ్యంలో అధికశాతం బీసీల ఓట్లు బీజేపీ ఖాతాలో పడేందుకు బీసీ సీఎం నినాదం పనిచేస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఇదే సమయంలో బీసీ ఎజెండాతో ఇతర సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా తగిన జాగ్రత్తలూ తీసుకోవాలని నిర్ణయించింది. విస్తృత ప్రచారంతో... వారిని చేరుకోవడమే కీలకం 2014 అసెంబీ ఎన్నికల్లో టీడీపీ బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకున్నా అది అస్సలు వర్కవుట్ కాలేదు. సీనియర్‌నేత టి దేవేందర్‌గౌడ్ కూడా బీసీల కోసం పార్టీ పెట్టినా ఈ వర్గాల నుంచి పెద్దగా మద్దతు కూడగట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో బీసీ సీఎం ఎజెండాతో ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ, ఎంబీసీ కులాల పెద్దలు, నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. బీసీ సీఎం అభ్యర్థిని ఎవరన్నది కూడా త్వరలో ప్రకటించే యోచనలో బీజేపీ ఉంది. 40కి పైగా సీట్లు ఇచ్చేలా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40కి పైగానే బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేలా నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం సీట్లలో మూడోవంతుకు పైగానే సీట్లు ఇచ్చామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తొలిజాబితాను 52 మంది అభ్యర్థులతో విడుదల చేయగా, అందులో బీసీవర్గాలకు చెందిన వారికి 19 మందికి అవకాశం కల్పించారు. రెండో జాబితాలో ఒకరికి, తాజాగా 35 మందితో మూడో జాబితాను ప్రకటించగా అందులో 13 మంది బీసీలకు టికెట్లు కేటాయించారు. మొత్తంగా చూస్తే.. ప్రకటించిన 88 సీట్లలో 32 మంది బీసీ వర్గాలకు వచ్చారు. ఇంకా 31 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, జనసేనకు 11 సీట్లు కేటాయిస్తే.. మిగిలిన 20 సీట్లలో పదిదాకా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. ఆయా కులాల వారీగా చూస్తే ముదిరాజ్–గంగపుత్రులు కలిపి (45 లక్షలు) యాదవ (35 లక్షలు), గౌడ (28 లక్షలు), మున్నూరుకాపు (22 లక్షలు), పద్మశాలి (18 లక్షలు),రజక (12 లక్షలు ),వడ్డెర (10 లక్షలు), ఇతర ఎంబీసీ కులాలకు చెందిన వారు 40 లక్షలదాకా ఉండొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయా కులాల వారీగా టికెట్లు కేటాయిపునకు కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ పథకాలతో.. జాతీయస్థాయిలో బీజేపీ తీసుకున్న ‘సబ్కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో బీసీలు, ఎంబీసీల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తే మంచి ఫలితాలను సాధించొచ్చునని భావిస్తున్నారు. మోదీ హయాంలో ఆయా బీసీవర్గాలకు అందిన ప్రయోజనాలను వివరించనున్నారు. ఎంబీసీ వర్గానికి చెందిన మోదీని బీజేపీ తొలిసారిగా ప్రధానిగా నియమించడం, కేంద్ర కేబినెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 27 మంది వెనుకబడిన తరగతుల వారి నియామకం, అదే విధంగా ఎస్సీ, ఎస్టీవర్గాల వారికి కూడా అత్యధిక ప్రాతినిధ్యం కల్పించడం... ఈ పరిణామాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇక సీఎం అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం, ఆనవాయితీ బీజేపీలో లేకపోయినా తెలంగాణలో ఈ సారి ముందుగానే బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. -
బీసీ సీఎం ప్రకటనపై బీజేపీ కార్యాలయంలో సంబురాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని బీజేపీ అధిష్టానం చేసిన ప్రకటనకు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు సంబురాలు జరిపారు. పార్టీ ఆఫీస్ బయట పటాసులు కాల్చి, డప్పులు వాయిస్తూ, స్వీట్లు పంచుకున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పార్టీ నేతలు క్షీరాభిషేకం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఓబీసీ మెర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, పార్టీ నేతలు ఆకుల విజయ, టి.వీరేందర్‌గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా ప్రకటన చరిత్రాత్మకమని అన్నారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభా ఉన్నా రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించాయని చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని, దీనిపై బీసీ సమాజం ఆలోచించాలని అన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కేసీఆర్‌కు బీసీలంటే చిన్నచూపని ఆరోపించారు. బీజేపీ 40 స్థానాలకు పైగా బీసీలకు అవకాశాలు కల్పించబోతోందని, తెలంగాణ సమాజం నిండు మనస్సుతో పార్టీని ఆశీర్వదించాలని కోరారు. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదని అన్నారు. సీఎం స్థానం బీజేపీ బీసీలకు ఇవ్వడం బీసీ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. -
బీజేపీకి బీసీ బూస్ట్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటన ఓవైపు.. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని ఆయన చేసిన ప్రకటన మరోవైపు ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాయి. బీసీలకు రాజ్యాధికారంలో ప్రాధాన్యత, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని కొంతకాలం నుంచి చెప్తున్న బీజేపీ అధిష్టానం.. అధికారికంగా బీసీ ఎజెండాను ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఆ వర్గాలు ఎంతమేర ప్రభావితం అవుతాయి, ఏ మేర ఓట్లుగా మారుతాయని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందే బీసీని సీఎం చేస్తామని ఇలా ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమేనని నేతలు అంటున్నారు. అంతేకాదు ఆ బీసీ అభ్యర్థి ఎవరనేది కూడా ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. బీజేపీ చిత్తశుద్ధిని చాటేలా.. 2014లోనే ఓబీసీ వర్గానికి చెందిన మోదీని ప్రధాని చేయడం, 2019లోనూ ఆయననే కొనసాగించడం, మోదీ కేబినెట్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా 27 మంది బీసీ, ఓబీసీ మంత్రులు, ఎస్సీ,ఎస్టీలకూ సముచిత సంఖ్యలో మంత్రి పదవులను బీజేపీ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా తెలంగాణలో బీసీ సీఎం ప్రకటన పార్టీ చిత్తశుద్ధిని చాటేలా ఉందని అంటున్నాయి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం రాష్ట్ర పర్యటన సందర్భంగా అమిత్‌షా పలువురు ముఖ్యనేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. గురువారం రాత్రి అమిత్‌షాతో కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ వేర్వేరుగా సమావేశమైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి శుక్రవారం ఢిల్లీ వెళ్లే ముందు బేగంపేట విమానాశ్రయంలో అమిత్‌షాను కలసి ‘ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్ట్’ప్రతిని అందజేశారు. దానిని జాతీయ నాయకత్వం పరిశీలించి ఖరారు చేయనుంది. -
నేడు ‘జగనన్న చేదోడు’ సాయం
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. దానిని మనసా, వాచా, కర్మణా ఆచరిస్తున్నారు కూడా. రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలన్న సంకల్పంతో జగనన్న చేదోడు పథకాన్ని చేపట్టారు. ఈ పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తున్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదీ పథకం ♦ షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం ♦ బుధవారం అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం అందించిన జగనన్న ప్రభుత్వం. ♦ గురువారం అందిస్తున్న సాయంతో కలిపి ఈ 4 ఏళ్ళలో కేవలం ఈ పథకం లబ్దిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు ♦ 1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి ♦ 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి ♦ 1,04,551 మంది రజకులకు ఈ విడతలో రూ. 104.55 కోట్ల లబ్ధి ♦ లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ ప్లే చేసి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక. ♦ ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే మిస్ కాకుండా సాయం అందాలని తపన పడుతున్న జగనన్న ప్రభుత్వం... ♦ అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్ నెలల్లో సాయం అందజేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. -
‘కులగణన’ నివేదిక సభలో ప్రవేశపెట్టడంపై హర్షం
సాక్షి, అమరావతి: కులగణన అంశానికి సంబంధించిన నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టడంపై బీసీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, బీసీ సంక్షేమం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ,, ఎమ్మెల్యేలు ఎం శంకరనారాయణ, పొన్నాడ సతీష్ ఉన్నారు. -
బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాల సమస్యలు పరిష్కరించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా నినాదాలతో హోరెత్తింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, లేకపోతే సమాజంలో మార్పు ఉండదని ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీల బతుకులు మార్చే బీసీ బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని, పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, డాక్టర్ ఎన్ మారేష్‌ల అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో ఆర్.కృష్ణయ్యతో పాటు ఎంపీలు బీద మస్తాన్ రావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో జబ్బల శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, పద్మలత, నీలం వెంకటేష్, భూపేష్ సాగర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టి అందులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈమేరకు ఆయన శనివారం రాజకీయ పార్టీ లకు లేఖలు రాశారు. మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్ర ప్రభు త్వంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా బీజేపీతో పాటు కాంగ్రెస్, జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, ఎన్సీపీ, రాష్ట్రీయ జనతాదళ్ తదితర పార్టీల అధ్యక్షులకు కృష్ణయ్య వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళలకు అతి తక్కువగా ప్రాతినిధ్యం ఉందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వా టా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదన్నారు. -
మంత్రి ఈశ్వర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితుల సంక్షేమం అమలైందన్న విషయాన్ని ఈశ్వర్ గుర్తుంచుకోవాలని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్కు దమ్ముంటే డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలన్నారు. గత నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దళితుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, వాటిని తాము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాకుండా దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్‌ను ఈశ్వర్ ప్రశ్నించాలని జీవన్‌రెడ్డి సూచించారు. -
టీడీపీ కొత్త డ్రామా.. అర్జంటుగా బీసీ కార్డు గుర్తుకొచ్చిందా?
సాక్షి, విశాఖపట్నం: బీసీ నేత అయ్యన్నను అరెస్టు చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాకు తెరతీసింది. అర్జంటుగా టీడీపీకి బీసీ కార్డు గుర్తుకొచ్చింది. నానా బూతులు తిడుతున్నప్పుడు అయ్యన్నకు గుర్తుకు రాని బీసీ కార్డు.. అయ్యన్నను అదుపు చేయనప్పుడు గుర్తుకు రాని బీసీ కార్డు.. అరెస్ట్ అనగానే టీడీపీకి గుర్తుకువచ్చిందా? అంటూ ఆ పార్టీ వైఖరీపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్గేట్ వద్ద వదిలేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే. పత్రికల్లో రాయలేనంత దారుణంగా అయ్యన్న రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ -
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్‌తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్: జాజుల
సాక్షి,యాదాద్రి/కాజీపేట రూరల్: ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసి తన వ్యతిరేకతను చాటుకున్న బీఆర్ఎస్ను వదిలేది లేదని, వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీ కి గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ సీట్ల కేటాయింపుపై గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే రెడ్లు, రావుల సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెంటనే సవరించి 60 సీట్లను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 136 కులాల్లో కేవలం ఆరింటికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని, మిగిలిన 130 కులాలకు ప్రాతినిధ్యమే లేదన్నారు. మహిళలకు 7 టికెట్లు కేటాయించగా, అందులోనూ ఆరింటిని అగ్రకుల మహిళలకు ఇచ్చి, బీసీ మహిళలపట్ల వివక్ష చూపార ని ధ్వజమెత్తారు. కాగా, హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా జనాభా ప్రకారం బీసీలకు సీట్లు ప్రకటించాలని, సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 10న హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో తలపెట్టిన బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలు అధికారం కోసం తిరుగుబాటు చేయాలన్నారు. -
బీసీల సభలో టీడీపీ నేతలే ఎక్కువ..
రామవరప్పాడు/గన్నవరం : లోకేశ్ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు, ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చేరుకున్న పాదయాత్ర విజయవాడ మీదుగా సోమవారం గన్నవరం నియోజకవర్గానికి చేరుకోగా.. సాయంత్రం నిడమానూరు క్యాంప్ సైట్లో బీసీ సామజికవర్గాల ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. సమావేశంలో బీసీ ప్రతినిధుల కంటే టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. సమావేశంలో.. ‘ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడ’ని లోకేశ్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ మాట్లాడుతుండగానే జనం మెల్లగా జారుకున్నారు. గన్నవరం చేరుకున్న పాదయాత్ర అనంతరం.. లోకేశ్ పాదయాత్ర సోమవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం చేరుకుంది. అంతకుముందు, కేసరపల్లి వద్ద మండలంలోకి ప్రవేశించిన యాత్ర ఎయిర్పోర్ట్, దుర్గాపురం, గన్నవరం మీదుగా చిన్నఆవుటపల్లిలోని ఎన్ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆవరణలో క్యాంప్ సైట్‌కు చేరుకుంది. పాదయాత్ర జాతీయ రహదారిపై కొనసాగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం ఫలితంగా ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. కొంతమంది మద్యం మత్తులో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఇక లోకేశ్ సమక్షంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. మరోవైపు.. మండల పార్టీ ఇచ్చిన రూటుకు భిన్నంగా ఎమ్మెల్యే కార్యాలయం మీదుగా పాదయాత్ర వెళ్లాని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే, పోలీసులు అంగీకరించలేదు. దీంతో రూట్‌మ్యాప్ ప్రకారం పాదయాత్ర కొనసాగింది. -
నా విజన్‌తో యువత ఆకాశానికి
సాక్షి అమలాపురం: తన విజన్‌తో యువత ఆకాశానికి ఎగిరిపోతారని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. తన సైన్యం యువతని.. వారికి ఉపాధి కల్పించే బాధ్యత తనదేనన్నారు. అమలాపురంలో వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని.. ఇక్కడే ఉంటూ అమెరికాలో పనిచేసేలా చేస్తానని వెల్లడించారు. బీసీల్లో 150 కులాలకు మేలు చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. కాపులకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లో ఐదు శాతం కేటాయిస్తానని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్‌కు ఎక్స్‌పెయిరీ డేట్ వచ్చిందన్నారు. ఆయనలా తాను అప్పులు చేయనని.. సంపద సృష్టించి సంక్షేమం వైపు నడిపిస్తానని తెలిపారు. జిల్లా పేరుతో పచ్చని కోనసీమలో అమాయకులపై తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, మద్యం అమ్మకాలతో దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమలలో చిరుతలు ఉంటే మీకు కర్రలు ఇస్తారంట.. ఇంటికొక కర్ర పట్టుకుని వైఎస్సార్సీపీ దొంగలను కొట్టండని ప్రజలను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ నేతలు ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం తెచ్చారా అని నిలదీశారు. కోనసీమలో కొబ్బరి, ఆక్వాలకు ప్రత్యేక పాలసీ తెస్తానని చెప్పారు. ఈ సభలో పార్టీ నేతలు గంటి హరీష్ మాధుర్, అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. అమలాపురం సభ అట్టర్ ఫ్లాప్ కాగా అమలాపురంలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనుకున్న దానిలో మూడో వంతు కూడా జనం రాలేదు. తొలి నుంచి జనం రాక మీద నమ్మకం లేని పార్టీ నేతలు గడియారస్తంభం సెంటర్లో సమావేశ వేదికను రివర్స్‌లో ఏర్పాటు చేశారు. జనం రాకపోతే సెంటర్‌కు ఆనుకుని ఉన్న రోడ్లు ఖాళీగా కనిపించే ప్రమాదముందని ఇలా చేశారు. ఫ్లెక్సీలు కట్టి రోడ్డును ఇరుకుగా చేసినా జనం రాకపోవడంతో పార్టీ నేతలు డీలా పడ్డారు. -
సర్దార్ పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం
గన్‌పౌండ్రీ (హైదరాబాద్): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ మహరాజ్ 373వ జయంతి జాతీయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ కులస్తుల అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. పాపన్న చరిత్ర తెలుసుకుంటే జాతిపట్ల అప్పట్లో ఎంత వివక్షత ఉందో తెలుస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని పెట్టేందుకు జీవో జారీ చేశామని హెచ్ఎండీఏ అధికారులు స్థలాన్ని అన్వేషీస్తున్నట్లు వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ, బహుజనులంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు భరత్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. 75 సంవత్సరాల రాజమండ్రి పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తి పార్లమెంటుకు ఎంపిక కావడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ బయోపిక్‌పై రూపొందించిన సినిమా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లే రవికుమార్‌గౌడ్, జై గౌడ్ ఉద్యమం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వి.రామారావుగౌడ్ పాల్గొన్నారు. -
మందు పోయను, ఓడిపోతే మాత్రం.. : కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ప్రతి పక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి చెప్పి నిలదీయండి అంటూ తెలంగాణ సమాజానికి మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. బీసీ బందు పథకంలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. సుమారు 600 మందికి చెక్కులను కేటీఆర్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా. మందు పోయను. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఎలాగైనా మీకు సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటా అంటూ వ్యాఖ్యానించారాయన. అలాగే.. పింఛన్ పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా కేటీఆర్ స్పందించారు. ‘‘ప్రతిపక్షాలు మాకు సలహాలు ఇస్తే కేసీఆర్ పెన్షన్ పెంచలేదు. ఆరువందల మందికి పెన్షన్ వస్తే వార్త కాదు.. ఆరుగురికి రాకపోతే ఇవాళ రేపు వార్త అవుతోంది. తెలంగాణాలో 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. వేములవాడ తిప్పాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 70% శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లాలో వచ్చే నెలలో కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. చేనేత దినోత్సవం సందర్భంగా 9 రకాల పథకాలు అమలు చేసుకున్నాం. అలాగే.. బీసీబంధు అంటే లోన్ కాదు. ఇది కేవలం మీ(బీసీ లబ్ధిదారుల్ని ఉద్దేశించి..) కులవృతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. తిగిగి కట్టవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ‘‘వేములవాడకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. 24 గంటలు మంచి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాం. వేములవాడ ఆలయాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తాం’’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇదీ చదవండి: కోకాపేట వేలంపాటపై సంచలన ఆరోపణలు -
బీసీల పక్షాన కాంగ్రెస్‌కు మద్దతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ సంఘాల పక్షాన తమకు మద్దతివ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, మాజీ ఎంపీ వి.హనుమంతరావు శనివారం సాయంత్రం విద్యానగర్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వెళ్లి ఆర్. కృష్ణయ్యను కలిశారు. బీసీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, బీసీల కులగణన చేపట్టాలన్న డిమాండ్‌కు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారని వారు గుర్తు చేసి.. తమకు సంఘీభావం తెలపాలని కృష్ణయ్యను కోరారు. ఇందుకు స్పందించిన ఆయన బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ నేతల ముందుంచి వాటిని పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీసీల మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగానే కృష్ణయ్య ఆఫీసుకి, ఇంటికి ఠాక్రే, వీహెచ్ వెళ్లారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయాలకు సంబంధం లేదు: కృష్ణయ్య ఠాక్రే, వీహెచ్‌లతో సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని, బీసీ డిమాండ్లపైనే చర్చ జరిగిందని చెప్పారు. బీసీ సంఘం అధ్యక్షుడిగా మాత్రమే వారు తనను కలిశారని స్పష్టం చేశారు. బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని కోరానని, అందుకు కాంగ్రెస్ నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే పార్లమెంటులో వైఎస్సార్సీపీ పక్షాన బీసీ బిల్లు పెట్టి 14 పార్టీల మద్దతు కూడగట్టామని వెల్లడించారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి స్పష్టం: ఠాక్రే ఆర్.కృష్ణయ్యతో చర్చల తర్వాత ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అందుకే కృష్ణయ్యతో మాట్లాడేందుకు తాము వచ్చామన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. కాగా, బీసీ సంఘం కార్యాలయంపైనే ఉన్న కృష్ణయ్య నివాసంలోకి ఠాక్రే, వీహెచ్‌లు వెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. -
ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం
ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే సుమారు ఐదున్నర లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించకపోగా కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యం విద్యాభ్యాసం పూర్తయినా సర్టీఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇవ్వాలని, అవసరమైతే అదనపు సెక్షన్లు తెరవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1575 నుంచి రూ. 2500లకు పెంచాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యను 300 మందికి మాత్రమే ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎం చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంసీఏ చదివే విద్యార్థులకు ఎందుకు నిరాకరిస్తుందని ఇది సవతి తల్లి ప్రేమ కాదా అని ప్రశ్నించారు. బీసీ హాస్టల్స్‌కు ఒక్క సొంత భవనం కూడా లేదని అద్దెలకు మాత్రం కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అధికారులు మధ్య దళారుల పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. -
తెలుగు రాష్ట్రాల్లో బీసీలంటే గుర్తొచ్చేది ఆర్ కృష్ణయ్య పేరే
-
Telangana: కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు
సాక్షి, హైదరాబాద్: బీసీ వర్గాలలోని కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కులవృత్తులు చేసుకునేవారు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకునేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం నుంచే అవకాశం కల్పించింది. గత కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల మంగళవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం నుంచి ఈనెల 20 వరకు https://tsobmmsbc.cgg. gov. in వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా దరఖాస్తు ఫారాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వీటిని ఆయా జిల్లాల యంత్రాంగం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 9న మంచిర్యాలలో ప్రారంభించనున్నారు. అదేరోజు నుంచి లబ్దిదారులుగా ఎంపికైన వారికి ఆర్థిక సహాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల రూపంలో అందించనున్నారు. వెనుకబడిన వర్గాలలో అనాదిగా కులవృత్తులు, ఇతర చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి వచి్చన పథకమే ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం అని గంగుల అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు పాల్గొన్నారు. బీసీల్లోని ఎన్ని వర్గాలకు? వెనుకబడిన వర్గాలలో కులాలను బట్టి చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వపరంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం ఉద్దేశం. బీసీ కులాల్లో లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకానికి ఎవరిని అర్హులుగా చేయాలన్న విషయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులదే తుది నిర్ణయం. బీసీ వర్గాలలో కుల, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఓ అధికారి తెలిపారు. చదవండి: మండిపోయిన మంగళవారం.. వచ్చే 5 రోజులు వడగాడ్పుల హెచ్చరిక ఇవీ అర్హతా నిబంధనలు ►ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ►ఈ పథకం కింద లబి్ధపొందగోరే వారు గ్రామాల్లో అయితే లక్షన్నర మేరకు, పట్టణాల్లో రూ.2 లక్షల వరకు ఆదాయ పరిమితిని కలిగి ఉండాలి. ►దరఖాస్తు చేసుకునే వారి వయసు 18–55 ఏళ్ల మధ్య ఉండాలి. ►గడిచిన ఐదేళ్లలో వివిధ పథకాల కింద రూ.50 వేల కంటే ఎక్కువ లబ్ధి పొందిన వారు అనర్హులు. -
పవన్ కళ్యాణ్ బీసీలకు క్షమాపణ చెప్పాలి
-
బీసీలకు గౌరవం పెంచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్: మంత్రి ఉష శ్రీ చరణ్
-
బీసీలకు భరోసా..
-
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో బీసీ కుటుంబాల్లో వెలుగులు : మంత్రి చెల్లుబోయిన
-
బిగ్ క్వశ్చన్: బీసీల గుండె చప్పుడుగా వైఎస్ జగన్
-
బీసీల పల్లకీ మోస్తున్న మహానేత సీఎం జగన్ : ఉష శ్రీ చరణ్
-
మీ గుండెల్లో జగన్.. జగన్ గుండెల్లో మీరు..
-
బీసీలకు రాజ్యసభ సభ్యుల వరకు పదవులు దక్కాయి : మంత్రి బొత్స సత్యనారాయణ
-
డిసెంబర్ 7 న జయహో బీసీ సభ
-
జయహో బీసీ మహాసభపై వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశం
-
బీసీ ఆత్మీయ సమ్మెళనం
-
సామాజిక న్యాయానికి బీసీ జనగణన
భారత సమాజం కులాల దొంతర అన్న సంగతి తెలిసిందే. ఈ దొంతరలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదిమ తెగలవారూ, అసలు మనుషులుగా గౌరవం పొందని హిందూ సామాజిక బహిష్కృత ఎస్సీలూ అట్టడుగున ఉంటే... అటు ఓసీలలా గౌరవానికి నోచుకోనివారూ, ఇటు ఎస్సీల్లా మరీ తక్కువ చూపుకు గురికాని బీసీలు మధ్యస్తరంలో ఉన్నారు. దేశ జనాభాలో వీళ్లశాతం సగం కన్నా ఎక్కువే. వీరంతా సంప్రదాయ వృత్తులను అనుసరిస్తూ దేశ సంపద సృష్టిలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో అణగారిన, వెనుక బడిన వర్గాలకు ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించినా... జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అందడం లేదనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం రిజర్వేషన్ పొందుతున్న వర్గాల్లో ఉంది. మరీ ముఖ్యంగా బీసీల్లో ఈ అభిప్రాయం ఉంది. తాము దేశ జనాభాలో ఎంతమందిమి ఉన్నామో తెలిస్తే... ఆ నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందవచ్చని వారు భావిస్తున్నారు. అందుకే బీసీ జన గణన జరగాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినా అది పట్టించుకోవడం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో బీసీ జనాభాను లెక్కించాలనీ, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనీ కోరుతూ ఉద్యమాలు రగులుకుంటున్నాయి. బీసీ జనగణన చేయమని అడిగితే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఉద్యమం చేయక తప్పని స్థితి వచ్చింది. ఈ ఉద్యమం దేశ చరిత్రలోనే మరో శాంతియుత బీసీల హక్కుల సాధన జాతీయ ఉద్యమంగా కొనసాగాలి. అది ఏ విధంగా అంటే 14 ఏళ్లు శాంతియుతంగా కొనసాగిన మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ నమూనాలో కొనసాగాలి. వ్యవసాయరంగాన్ని రక్షించుకోవడానికి ఇటీ వల జరిగిన శాంతియుత రైతాంగ ఉద్యమ రూపం ధరించాలి. రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం భావించి ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానం పంపి ఇప్పటికి సరిగ్గా ఆరేళ్లు అవుతోంది. కేంద్రం ఇప్పటికీ పెదవి విప్పటం లేదు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుని కేంద్రానికి పంపింది. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 60 శాతం నుంచి 77 శాతానికి రిజర్వేషన్లు పెంచాలనే చట్టసవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రిజర్వేషన్ల పెంపుకోసం రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో మార్పులు చేయాలని కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో తెలంగా ణకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇలా రిజర్వేషన్ల శాతం పెరిగినప్పుడే జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కుతుంది. రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ను అనుసరించి భారత దేశంలో ప్రప్రథమంగా 1953 జనవరిలో కాకా కాలేల్కర్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియ మించడం జరిగింది. ఇది 1955లో తన నివేదికను సమ ర్పిస్తూ దేశంలో 2399 కులాలను వెనుకబడిన కులాలుగా అందులో 837 కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి కొన్ని సిఫార్సులు చేసింది. అయితే ప్రభుత్వం ఈ కమిషన్ చేసిన సిఫార్సులను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం 1979లో బి.పి. మండల్ నేతృత్వంలో రెండవ బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కమిషన్ బీసీల జనాభాను 52 శాతంగా లెక్కకట్టి వీరికి విద్యా ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని 1980లో నివేదిక సమర్పించింది. అయితే, ఈ సిఫారసులు 1992 నుండి మాత్రమే అమలులోకి వచ్చాయి. 2017 అక్టోబర్‌లో జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాను వర్గీకరించడం ఈ కమిషన్ ముఖ్య విధి. ఇప్పటికి ఈ కమిషన్ గడువును 13 సార్లు పొడిగించడం జరిగింది. ఇంతవరకు ఈ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత బి.ఎస్. రాములు నేతృత్వంలో నియమించబడ్డ తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఏప్రిల్ 2017లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తూ, బీసీ–ఇ గ్రూప్‌లో ఉన్న ముస్లింలలోని కొన్ని వెనుకబడిన వర్గాలకు అందించబడుతున్న రిజర్వే షన్లను 4 శాతం నుండి 10 శాతానికి పెంచాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను ప్రభుత్వం అంగీక రిస్తూనే, సుధీర్ కమిషన్, ఇతర నివేదికలను అనుసరించి వీరికి రిజర్వేషన్లను పన్నెండు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2019లో ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ మరో నివేదిక సమర్పిస్తూ... సంచార, అర్ధ సంచార జాతులకు చెందిన 17 కులాలను తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను కేసీఆర్ క్యాబినెట్ యధాతథంగా ఆమోదించి అమలుచేయడం జరిగింది. 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగణన వివరాలు ఉన్నాయని చెప్పిన కేంద్రం ఆ వివరాలు ఎందుకో బైట పెట్టకుండా దాటవేసింది. దేశంలో సగానికి పైగా జనాభా వున్న బీసీల విషయంలో కేంద్రం లెక్కలేనితనం చూపడం దారుణమైనది. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ల ఆర్థిక స్థితి గతులేమిటి? వీరి చదువులు ఎలా వున్నాయి? వీరి ఉద్యోగ అవకాశాలేమిటి? వీరింకా దారిద్య్ర రేఖకు దిగువన ఉండటానికి కారణాలు ఏమిటి? బీసీలలో ఇంకా సంచారజాతులుగా వున్న వారి దీనస్థితికి విముక్తి ఎప్పుడు? ఈ సమాచారం లేకుండా దేశాభివృద్ధికి వ్యూహాలు రచించడం కష్టం. అందుకే బీసీ జన గణన అత్యంతావశ్యం. జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ -
బీసీల గురుంచి మాట్లాడే అర్హత చంద్రబాబు కు లేదు : మంత్రి కారుమూరి
-
చంద్రబాబుకు గత ఎన్నికల్లో బుద్ది చెప్పినా సిగ్గు లేదు : ఎమ్మెల్సీ పోతుల సునీత
-
తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి తెలుగుదేశం పార్టీలో కీలక నేత గంజి చిరంజీవి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అందులో చేరాను. నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజం. పార్టీ కోసం అహర్నిశలు పని చేశా. అయితే టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానపరిచారు. మంగళగిరి నియోజకవర్గం చేనేతలకు సంబంధించినది. ఆ ఒక్క సీటును కుమారుడి కోసం లాగేసుకొని మాకు ద్రోహం చేశారు. లోకేష్ కోసం ఒక పథకం ప్రకారం బీసీ సామాజికవర్గానికి చెందిన నన్ను పక్కకు పెట్టారు. పార్టీని నేను మోసం చేస్తే నేను నమ్ముకున్న దేవుడు నన్ను నాశనం చేస్తాడు. ఒకవేళ పార్టీ నన్నుమోసం చేస్తే అదే దేవుడు తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తాడు. 2019 చివరి వరకు సీటు నీదే అని నమ్మించి టికెట్ ఇవ్వకుండా తీవ్రంగా అమానించారని' గంజి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీతోనే: బాలినేని) -
బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్.. అసెంబ్లీలో మంత్రి వేణుగోపాలకృష్ణ
సాక్షి, అమరావతి: బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అని.. 1931లో జనగణన ఆధారంగానే బీసీలను ఇప్పటికీ లెక్కిస్తున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, వెనుకబడిన కులాల జనగణన అత్యవసరం అని.. నిజమైన నిరుపేదలకు ఎంతగానో ఉపయోగమన్నారు. సంక్షేమ పథకాల అమలకు ఇది ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ప్రత్యేక వాదం వచ్చింది అందుకే.. మండలిలో మంత్రి బుగ్గన ‘‘90 ఏళ్లుగా బీసీల లెక్కలు దేశంలో లేవు. బీసీల జీవన స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల్లో 139 కులాలు ఉన్నాయి. కుల గణన కచ్చితంగా జరగాలి. ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ వరంగా మారింది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బీసీలకు అనేక మేళ్లు. బీసీలను చైతన్యం దిశగా సీఎం జగన్ నడిస్తున్నారు. ఇది బీసీల ప్రభుత్వం. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం. కాంట్రాక్టు పనుల్లో బీసీలకు 50 శాతం. బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. వైఎస్సార్ చేయూత గొప్ప పథకం. బీసీల కోసం వైఎస్సార్ రెండడుగులు ముందుకు వేస్తే.. వైఎస్ జగన్ పదడుగులు వేస్తున్నారని’’ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. -
బీసీబంధు కోసం 8న రాష్ట్రవ్యాప్త ధర్నాలు
ముషీరాబాద్ (హైదరాబాద్): బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతీ కుటుం బానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ ఈ నెల 8న అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని, ధర్నాలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. -
కరోనాతో కుటుంబ పెద్ద మరణిస్తే.. రూ. 5 లక్షలతో స్వయం ఉపాధి
సాక్షి, హైదరాబాద్: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కరోనా కాటుకు బలి అయితే, ఆ కుటుంబ సభ్యులు వీధిన పడకుండా చేయూత ఇచ్చేందుకు జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ) ‘స్మైల్’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, ఆ కుటుంబానికి ఆర్థికపరమైన అంశాల్లో ఆసరా ఇచ్చే లక్ష్యంతో స్మైల్‌ను ముందుకు తీసుకొచ్చింది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న కోవిడ్–19 వ్యాప్తితో చాలా కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. పలు రంగాల్లో ఉద్యోగాల కోత విధించడంతో ఉపాధి కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. కోవిడ్–19తో కుటుంబ పెద్ద మరణిస్తే... ఆ కుటుంబానికి స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు ఎన్‌బీసీఎఫ్‌డీసీ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ స్వయం ఉపాధి యూనిట్‌పై గరిష్టంగా రూ.5 లక్షలు సమకూరిస్తే.. అందులో రూ.4 లక్షలు రాయితీ కింద ఎన్‌బీసీఎఫ్‌డీసీ లబ్ధిదారుకు అందిస్తుంది. మిగతా రూ.లక్షను బ్యాంకు నుంచి రుణం రూపంలో మంజూరు చేస్తుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఈ ప్రతిపాదనలను ఈనెల 26లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దరఖాస్తుకు అర్హతలివీ... కరోనా వైరస్ సోకి మరణించిన కుటుంబ పెద్ద వయసు 60 సంవత్సరాలలోపు ఉండాలని ఎన్‌బీసీఎఫ్‌డీసీ స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుడి మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు తహసీల్దారు నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉన్నట్లు నిర్ధారణ పత్రం దరఖాస్తుతో జతచేయాలి. వీటిని నేరుగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో సమర్పించవచ్చు. దరఖాస్తులో మరణించిన కుటుంబ సభ్యుడి పేరు, మరణించిన రోజుకు వయసు, ఆధార్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, కులం తదితర వివరాలను భర్తీ చేయాలి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా సంక్షేమాధికారులు ఈనెల 26లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపితే... రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎన్‌బీసీఎఫ్‌డీసీ కార్యాలయానికి పంపుతుంది. బీసీ కుటుంబాలకు ప్రయోజనకరమైన ఈ పథకంపై పెద్దగా ప్రచారం లేకపోవడం... రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఈ నెల 23న సూచనలు జారీ చేసి కేవలం మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించడం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే అంశమే. -
ఇది కోర్టు ధిక్కరణే...!
-
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీసీ గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించాలంటూ 2010లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. బీసీ సమగ్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులపై బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను నిర్ణయించామంటూ గతంలో అదనపు ఏజీ పేర్కొన్న నేపథ్యంలో, బీసీ కమిషన్ నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే గతంలో తాను పొరపాటున అలా చెప్పానని, జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నిర్ణయించామని అదనపు ఏజీ నివేదించారు. బీసీ గణన కోసం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని, ఈ నేపథ్యంలో ఎటువంటి నివేదిక ప్రభుత్వం వద్ద లేదని పేర్కొన్నారు. కాగా, ఏజీ పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు చట్టబద్ధమైన బీసీ కమిషన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మేష్ డీకే జైశ్వాల్ నివేదించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 201ను ఎందుకు చట్టవిరుద్ధంగా ప్రకటించరాదో స్పష్టం చేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ( చదవండి: హైదరాబాద్ ఐఎస్బీ.. దేశంలోనే టాప్! ) -
ఓటర్లంతా ఎస్సీ.. బీసీ సర్పంచ్ !
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి పంచాయతీ సర్పంచ్‌గా ఖాదర్‌బీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో అన్నీ ఎస్సీ కుటుంబాలే నివసిస్తున్నాయి. 677 మంది ఓటర్లున్న ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించారు. ఓటర్లంతా ఎస్సీలే కావడంతో మొదట్లో సందిగ్ధానికి గురయ్యారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదరి దామతోటి ముని మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్‌బీని వివాహం చేసుకున్నారు. ఆమెది బీసీ వర్గం కావడంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలేకపో వడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదవండి: విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్ మా జాబితా తప్పని నిరూపించగలవా! -
దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం
సాక్షి, అమరావతి: బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సందడి చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల రోజులు ముందే వచ్చినట్లుగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్లకు పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించారు. ‘బీసీల సంక్రాంతి’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు.. అగ్రవర్ణాల్లో పేదలు సామాజికంగా, ఆర్థికంగా, సదుపాయాల పరంగా నాలుగు మెట్లు పైన ఉండటమే అభివృద్ధి అని నమ్మి ఓ ఉద్యమంలా పని చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. ఏడాదిన్నర క్రితం ఇదే చోట... ఇదే స్థలంలో 18 నెలల ముందు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు అదే వేదిక మీద మీరందరూ ప్రమాణ స్వీకారం చేయడం నా మనసుకు ఎంతో సంతోషాన్నిస్తోంది. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైన మిమ్మల్ని చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల ముందే వచ్చిందా అన్నట్లుగా ఉంది. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే. 672 మంది డైరెక్టర్లలో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ప్రమాణ సీక్వారం చేశారని గర్వంగా చెబుతున్నా. మహిళాభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఇంట్లోనూ సంతోషం.. నా 3,648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు చూశా. ఓ గ్రామంలో వెయ్యిమంది ఉంటే నాడు కనీసం ఇద్దరు ముగ్గురికి కూడా మేలు జరిగిన దాఖలాలు కనిపించ లేదు. అది కూడా టీడీపీ జెండా మోసినట్లు సర్టిఫికెట్ చూపిస్తే కానీ, జన్మభూమి కమిటీలు ఒప్పుకుంటే కానీ రాలేదు. ఆ స్థాయిలో దిగజారిన కార్పొరేషన్ వ్యవస్థలో మార్పులు తెచ్చాం. బీసీ పేద వర్గాల ప్రతి ఇంట్లోనూ సంతోషం కనిపించాలి. నాడు చెప్పా.. నేడు అమలు చేశా మనం అధికారంలోకి వస్తే బీసీల జీవితాలు మారుస్తానని నాడు మాట ఇచ్చా. 90 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదలకు తోడుగా నిలబడకపోతే ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం? అని నేను ప్రతి రోజూ అనుకుంటూ ఉంటా. వారికి తోడుగా నిలబడడం కోసమే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని అనుకుంటా. ఐదేళ్లలో విదిల్చింది రూ.19,329 కోట్లు.. 2014 మేనిఫెస్టోలో టీడీపీ ఏం చెప్పిందో చూశాం. 118 వాగ్దానాలు ఇచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పింది. అంటే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేయాల్సి ఉంటే కేవలం రూ.19,329 కోట్లు మాత్రమే విదిల్చింది. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు.. మనందరి ప్రభుత్వం వచ్చాక బీసీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నా. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు చేయగలిగాం. ఒక్కో కుటుంబంలో ఆరేడు పథకాలు కూడా అందాయి. ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అట్టడుగున ఉన్న ఈ పేద వర్గాల కోసం మొత్తం రూ.59,317 కోట్లు చేశాం. తద్వారా 4.45 కోట్ల మందికి మేలు చేయగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 83 శాతం వరకు ఉన్నారు. ఏడాదిన్నరలో దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ స్వరాజ్యాన్ని చూస్తున్నాం. అభివృద్ధి అంటే ఇదీ.. పిల్లలు మంచి చదువులు చదువుకుంటే అది అభివృద్ధిగా భావించి 100 శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నాం. కాళ్లు అరిగేలా తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా మన గ్రామంలోనే పనులు జరిగితేనే అభివృద్ధి జరిగినట్లు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇళ్లు వెతుక్కుంటూ వస్తేనే అభివృద్ధి అంటారు. నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మారుస్తున్నాం. అభివృద్ధిపై కోవిడ్ సమయంలో కూడా నాలుగు అడుగులు ముందుకే వేశాం కానీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ఏడాదిన్నరలో ప్రత్యేకంగా ఇవీ – శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు – క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దాదాపు 60 శాతం పదవులు. – ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. – సౌమ్యుడైన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా బీసీనే. – గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేం నలుగురిని రాజ్యసభకు పంపితే అందులో ఇద్దరు బీసీలే ఉన్నారు. – నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం. అందులో సగం అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా చట్టం. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. బీసీల సంక్రాంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అంజాద్‌బాషా, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరామ్, ఎం.శంకరనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలకు 18 నెలల్లో రూ.38,519 కోట్లు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చరిత్రను తిరగరాస్తూ బలహీనవర్గాలను బలపరిచేలా మరో అడుగు ముందుకు వేశాం. బీసీలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. అందులో 50 శాతం పదవులు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం మహిళాభ్యుదయంలో మరో చరిత్ర. అధికారంలోకి వస్తే బీసీల జీవితాలను మారుస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చా. ఈ 18 నెలల్లో అది చేసి చూపించా. బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం. దిగిపోయిన పాలకుడి చెడిపోయిన బుర్ర.. ఈ అభివృద్ధి అంతా ఎక్కడ చూస్తారో అని ప్రజలను మభ్యపెట్టేందుకు గత పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఒక దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో చేస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రాజధాని అక్కడే పెట్టాలని ముందే నిర్ణయించి, బినామీలతో భూములు కొనిపించి ఇప్పుడు వాటి విలువ ఎక్కడ పడిపోతుందోనని ఆందోళన చేస్తున్నాడు. ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తుంటే అలా ఉంటుంది. ఒక మంచి బుర్ర పని చేస్తే అభివృద్ధి ఇలా ఉంటుందని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సాక్షి, అమరావతి: కొత్తగా నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, 672 మంది డైరెక్టర్లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంతి’ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తమ కులాల్లోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వానికి తమ కులాలకు మధ్య వారధిగా ఉంటామని బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్లు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రికి జ్ఞాపిక అందిస్తున్న మంత్రులు చెల్లుబోయిన, శంకర నారాయణ, జయరాం, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేశ్ -
బీసీలంతా ఆయన వెంటే ఉంటారు
-
కృష్ణా మీదుగా తెనాలి వరకు..భారీగా బైక్ ర్యాలీ
విజయవాడ : కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో బీసీ సంగీభావ బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మూడు నియోజకవర్గాల మీదుగా గుంటూరు జిల్లా తెనాలి వరకు ఈ సంగీభావ ర్యాలీ కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు వేలసంఖ్యలో బీసీలు తరలివచ్చారు. ఎమ్మెల్యే పార్థసారధి 130 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేస్తూ ర్యాలీకి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణ నిధి, జోగి రమేష్ , కైలే అనీల్ కుమార్‌లు పాల్గొన్నారు. వీరంకి లాకు వద్ద బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొననున్నారు. బీసీల సంక్షేమం కోసం నాడు వైఎస్సార్ కృషి చేస్తే, నేడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. అధికారంలో ఉండగా టీడీపీ కల్లబొల్లి మాటలతో బీసీలకు బాబు శఠగోపం పెట్టి ఓటుబ్యాంకు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. (వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్ ) వైఎస్ జగన్ పద్నాలుగు నెలల్లోనే తన మార్కు పాలన చూపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి అన్నారు. ఐదేళ్ల టిడిపిలో జనానికి చీకటి చూపిస్తే..ఏడాదిలోనే జగన్ వెలుగులు నింపారని, రాజకీయ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. వైఎస్సార్ లేని లోటును తీర్చి ప్రజారంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ బకాయిలు పెట్టిపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని, ఆరోగ్యశ్రీలో పేదలకు మెరుగైన చికిత్స అందేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయ అవసాన దశలో ఉన్నాడని, కుట్రలు ,కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నాడని ద్వజమెత్తారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా, అవినీతి లేని పాలన అందిస్తున్నామని వెల్లడించారు. (సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ ! ) -
సంచార జాతులు మరువలేని రోజు
2020 సెప్టెంబర్ 7. సంచార జాతులు, అత్యంత వెనుకబడిన 17 బీసీ కులాలు మర్చిపోలేనిరోజు. తరాలు మారినా మారని తలరాతను మార్చిన రోజది. ‘‘పెద్ద సారులూ! మా బాధను వినండి. ఎక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేడు. మమ్మల్ని కనీసం బీసీ కులాల జాబితాలో కలుపుకోండి. మేం ఆశ్రితకులం. మేం సంచార జాతులం...’’ అన్న ఆ మూగవేదనలు ఈ నేలంతా విన్పిస్తూనే ఉన్నాయి. వాళ్ల పిల్లలకు చదువులు లేవు. జనజీవితంలో కలగలిసి ఉన్నట్లే ఉంటారు, బతుకు దెరువుకోసం సంచారులై సాగిపోతుంటారు. గత 70 ఏళ్లుగా వీళ్లను కాలం ఎట్లా వదిలివేసిందో తెలియదు. అందరూ అట్టడుగు వర్గాల గురించి పెద్దగా మాట్లాడేవాళ్ళే. కానీ, ఈ సంచార జాతులకు కనీస గుర్తింపును కూడా ఎందుకు ఇవ్వలేకపోయారన్నది ప్రశ్న. ఈ జాతుల వాళ్లు కనీసంగా విజ్ఞాపనా పత్రాన్ని రాసి వ్వలేని స్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత అన్ని రంగాలలో పునర్నిర్మాణం జరుగుతున్నట్లుగానే బహుజన బతుకుల పునర్నిర్మాణం మొదలయ్యింది. ఇందులో భాగంగా సమగ్రంగా బీసీల జీవన విధానంపై అధ్యయనం చేయటానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో సామాజిక సూత్రాలను అమ లుచేసే దిశగానే అధ్యయనం కొనసాగించాలని, సమాజంలో సగభాగమైన బీసీల బతుకుచిత్రం మార్చటానికి అధ్యయనమే తొలిపునాది కావాలని కమిషన్ నియామకం తర్వాత సుదీర్ఘంగా ఐదుసార్లు సమావేశాలు జరిపి కమిషన్‌కు దిశానిర్దేశం చేశారు. బీసీ(ఇ) గ్రూపులోని ముస్లింల జీవన విధానాన్ని అధ్యయనం చేయాల్సిందిగా కమిషన్‌ను ఆదేశిం చారు. ఆ నివేదికను ముఖ్యమంత్రికి అందివ్వగానే ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటుచేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించటం జరిగింది. అదే రోజు ఎస్టీలకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభు త్వానికి నివేదించింది. కనీసం కుల సర్టిఫికెట్లకు నోచుకోకుండా ఉన్న సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చాల్సి వుంది. 70 ఏళ్ల పాలకులు చేయలేని పనిని కేసీఆర్ చేశారు. సంచార జాతులను బీసీ కులాల్లో కలిపే విషయంపై చీఫ్ సెక్రటరీ బాధ్యతలు తీసుకోవలసిందిగా చెప్పారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన చరిత్రాత్మ కమైనది. అది ఉద్యమకాలం నుంచి ఆయనను దగ్గ రగా చూసిన వాళ్లకు బాగా తెలుసు. ఒక విషయాన్ని తెలుసుకోవటానికి పుస్తక పఠనం ఉండాలి, క్షేత్ర స్థాయి అధ్యయన అనుభవం ఉండాలి. ఈ రెండూ కేసీఆర్‌లో ఉన్నాయి. బీసీ కులాల్లో చేర్చాల్సిన వారి పట్టికను ఇవ్వగానే వీళ్లంతా సంచార జాతుల వాళ్లే అన్నారు. 1. అద్దపువారు, 2. అహీర్/అహీర్ యాదవ కులము, 3. బాగోతుల/ భాగవతుల, 4. బైల్ కమ్మర/ ఘిసాడి/ గడియ లోహార్, 5.ఏనూటి/ యేనేటివాళ్లు, 6.గంజికూటి, 7.గౌడజెట్టి, 8.గవిలి/ గోవ్లీ/గౌలి/గవ్లి, 9.కాకిపడగల, 10.కుల్లకడిగి/ కుల్లె కడిగి/ చిట్టెపు, 11.పటంవారు/ మాసయ్యలు, 12. ఓడీ, 13.సారోల్లు/ సోమవంశ క్షత్రియ, 14. సొన్నా యిల/ సన్నాయిల/ సన్నాయోల్లు, 15. శ్రీక్షత్రియ రామజోగి/ రామబోగి/ రామజోగులు, 16. తెర చీరల/ తెల్వూరి/ బైకాని, 17. తోలుబొమ్మలవారు/ బొప్పలకులాల సంచారజాతుల వాళ్లు ఇప్పటిదాకా అనుభవించిన బాధలు అలవికానివి. వీళ్లది ఏ కులమో బీసీ కులపట్టికలో లేకపోవటంతో ఏ రెవెన్యూ అధికారి వీళ్లకు కులసర్టిఫికెట్లు ఇచ్చేవారు కాదు. బళ్లలో, హాస్టళ్లలో చేర్చుకునేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. రుణాలు పొందే సౌకర్యాలు ఉండేవి కావు. విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు వీటన్నింటి నుంచి విముక్తి కలగబోతోంది. తరతరాలుగా సామాజిక చరిత్రను మోస్తున్న, గానం చేస్తున్న సంచార జాతులకు మంచి రోజులు రావాలి. పటం కథలు చెప్పుకుంటూ తిరిగే వారి పిల్లలు ఖగోళశాస్త్ర రంగంలోకి అడుగులు మోపాలి. తెలం గాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందంటే, సంచార జాతుల బహుజనానికి విముక్తి లభిస్తుంది. జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు -
బీసీలకు ద్రోహం చేసింది మీరు కాదా?
-
నాడు రాజన్న.. నేడు జగనన్న..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ అత్యధికంగా ఉన్న బీసీలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అనేక సంక్షేమ ఫలాలు అందేవి. బీసీ రుణాలతో ఆ సామాజిక వర్గం వారు ఆర్థికాభివృద్ధి సాధించేవారు. టీడీపీ అధికంలోకి వచ్చిన తరువాత బీసీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బీసీలను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన మాజీ సీఎం చంద్రబాబు వారి సంక్షేమాన్ని అటకెక్కించారు. ఆ సమయంలో ప్రజా సంకల్పయాత్ర చేపట్టి బీసీల కష్టాలను తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో అదనంగా పదిశాతం సీట్లను బీసీలకు కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ సామాజిక వర్గం వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం సంచలన నిర్ణయం ఎన్నికల్లో సీట్లు కేటాయింపులో బీసీ, ఉపకులాలకు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యమిచ్చారు. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెంచినప్పటికీ టీడీపీ వేసిన పిటిషన్ల కారణంగా ఆ ప్రయత్నం ఫలించలేదు. 50 శాతానికే రిజర్వేషన్లు నిర్ణయించాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో కోర్టు తీర్పును గౌరవించిన అధికారపార్టీ ఇచ్చిన మాటను నిలుపుకోవడంలోనూ వెనుకంజ వేయలేదు. జనరల్‌కు కేటాయించిన స్థానాల్లో కొన్నింటిని బీసీలకు ఇవ్వడం ద్వారా మరో కోర్టు తీర్పు వల్ల కోల్పోయిన 10 శాతం రిజర్వేషన్లను పార్టీ తరఫున ఇస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంచలన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ అలా.. చంద్రబాబు ఇలా.. బీసీ వర్గాల్లో చదువుకునే విద్యార్థులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్కరంటే ఒక్కరికీ ఫీజులు గానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌గానీ పెండింగ్ లేకుండా అందజేసేవారు. చంద్రబాబు హయాంలో జిల్లాలో 74,800 మంది విద్యార్థులు ఫీజులు, రీయింబర్స్‌మెంట్‌కోసం ఎదురుతెన్నులు చూసేవారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఫీజులు కట్టలేక అల్లాడారు. ఉన్నత తరగతులకు వెళ్లాల్సిన వారు, ఇతర కళాశాలలకు వెళ్లాల్సిన వారికి ఫీజులు కట్టడం లేదని ఆయా కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధించాయి. ఎంతో ఉన్నత ఆశయంతో ఆనాడు వైఎస్ తలపెట్టిన ఈ ఫీజురీఎంబర్స్మెంట్ పథకాన్ని అమలు కానివ్వలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ఫీజులకు ఎంత మొత్తం ఉంటే అంత మొత్తం చెల్లించేవారు. దీంతో పూర్తిగా విద్యార్థుల పేరిట కళాశాలలకు ఫీజులందేవి. తల్లిదండ్రులకు కూడా ఎటువంటి ఆవేదన కానీ, ఇబ్బందులు కానీ పడేవారు కాదు. చంద్రబాబు హయాంలో విద్యార్థి సంఘాలు పోరాడుతుంటే పోలీసులతో వారిని చావగొట్టించారు. వైఎస్ హయాంలో కొన్ని కులాలను బీసీల్లోకి చేర్చి వారికి అన్ని రంగాలలోను అభివృద్ధి చెందేలా దోహదపడ్డారు. కొన్ని కులాల వర్గీకరణ లేకపోతే వర్గీకరణ చేసి వారికి వివిధ పథకాల ద్వారా న్యాయం జరిగింది. ప్రతి కుటుంబానికి పింఛన్, పేద రైతుకు ఉచిత విద్యుత్‌ని అందజేసి ఆదుకున్నారు. చంద్రబాబు హయాంలో బీసీలకు దిశా, దశాలేని కులాలకార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన చేశారు. తండ్రిని మించిన తనయుడు... మళ్లీ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు. బీసీల్లో 135 ఉపకులాలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 14.40 లక్షల బీసీ జనాభా ఉంది. తూర్పుకాపు, యాదవ, కుమ్మరి, చాకలి, వండ్రంగి, కంసాలి, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, యాత, ఈడిగ, తదితర కులాలు అధికంగా ఉన్నారు. ఎన్నికల ముందు ఏలూరులో బీసీ గర్జన సదస్సు నిర్వహించిన జగన్ వారికి భరోసా ఇచ్చారు. బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చాచు. అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వారికి తీపి కబురు చెప్పారు. క్షౌ రశాలలకు 250 యూనిట్లు విద్యుత్ ఉచితం ఇస్తామన్నారు. డొమెస్టిక్ పర్పస్ 500 యూనియట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాల్లో ఉద్యోగులకు ట్రస్టుబోర్డులో నామిటెడ్పోస్టులో అవకాశం ఇస్తామన్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రాధాన్యత వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఇచ్చారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పదిశాతం అదనంగా సీట్లు కేటాయించిన వైఎస్ జగన్ మడమ తిప్పని నైజంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఔదార్యం మరువలేనిదని, ఆయన రుణం తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయతకు నిదర్శనం సీఎం ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలుచేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మాదిరిగా బీసీల గుర్తింపు, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. ఇప్పుడు వాటిని నెరవేర్చారు. ఇక బీసీల పయనమంతా ఆయన వెంటే. – ముద్దాడ మధు, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విజయనగరం తండ్రిని మించిన తనయుడు తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగన్మోహన్రెడ్డి పేరుతెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలో మంచి సీఎంగా మన్ననలు పొందుతున్నారు. జనాభా ప్రాతిపదికతో పాటు మానవతా దృక్పథంతో బీసీల అభ్యున్నతికి చట్టబద్ధంగా అడుగులు వేయడం అభినందనీయం. బీసీల అభివృద్ధిని కాంక్షించే సీఎంగా పేరుకెక్కారు. – సానమునేటి శ్రీనివాసరావు, నగరాల సంఘం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం సముచిత స్థానం బీసీలకు రాజ్యాధికారం దిశగా సీఎం అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సేవ చేస్తారని అనిపిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ కూర్పులోగాని, బడ్జెట్ కేటాయింపుల్లో గాని బీసీలకు సముచిత స్థానం కలి్పంచారు. గత 30 ఏళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి బీసీలకు చేయలేని విధంగా చేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలు అమలవుతున్నాయి. ఆయనలో అద్భుతమైన ఆలోచనలు, ఆచరణలు కనిపిస్తున్నాయి. – రామేశ్వరపు రామారావు, నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విజయనగరం బీసీల అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం బీసీల అభివృద్ధి, సంక్షేమం సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. గతంలో అధికారంలో లేకపోయినా బీసీల పక్షపాతిగా సేవలందించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసి గుర్తింపునిచ్చారు. ఎన్నికల్లో బీసీలంతా జగన్మోహన్రెడ్డికి ఏకపక్షంగా ఓట్లు వేశారు. – లెంక అప్పలరాజు, పూల్‌భాగ్‌కాలనీ, విజయనగరం -
ఇది బీసీలకు దక్కిన అరుదైన గౌరవం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజ్యసభలో నలుగురికి అవకాశం లభిస్తే అందులో రెండింటిని వెనకబడిన తరగతుల వారికి కేటాయించడం చరిత్రాత్మక సందర్భంగా చెప్పుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. బీసీల పట్ట చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారన్నారు. ప్రధానమైన రెండు వెనుకబడిన తరగతుల అగ్నికుల క్షత్రియ), పిల్లి సుభాష్‌చంద్రబోష్ (శెట్టిబలజ)లను రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇదొక చరిత్ర అని, సమైక్య రాష్ట్రంలో కూడా బీసీలకు ఇటువంటి అవకాశం రాలేదన్నారు. బీసీలపై జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయడంలో చూపిన శ్రద్ధ చెప్పలేనిదన్నారు. రాష్ట్రంలో బీసీంతా హర్షించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన సమయంగా భావిస్తున్నానన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు ఇచ్చారంటే ఎంత గొప్ప నిర్ణయమో ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం బీసీల్లో ఉత్సాహం నింపిందని అభిప్రాయపడ్డారు. ఇదే టీడీపీ విషయానికి వస్తే ఏం చేసిందో అందరికీ తెలుసునన్నారు. అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన బీసీలకు ఎప్పుడైనా ఈ రకమైన గుర్తింపు, అవకాశాలు కలి్పంచిందా? అని ప్రశ్నించారు. టీడీపీ పల్లకీ మోసిన బీసీలను తొక్కేసారు తప్ప నిలబెట్టిన దాఖలాల్లేవన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఏలూరులో జరిగిన బీసీ సదస్సులో స్పష్టం చేశానన్నారు. బీసీలకు టీడీపీ చేసిన అన్యాయాన్ని, అధికారంలోకి వస్తే వైఎస్సార్సీపీ చేసే న్యాయాన్ని వివరించానని, ఇప్పుడది అమలు కావడంతో తనకెంతో గర్వంగా ఉందన్నారు. -
బీసీల కోటాపై టీడీపీ ఆట
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందనే వాదనకు బలం చేకూర్చేలా న్యాయ వివాదాలకు పురిగొల్పుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా విపక్షం కుట్రపూరితంగానే బీసీ రిజర్వేషన్లపై వివాదం రాజేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ఆటంకాలు కల్పించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల కోట్లకుపైగా నిధులను అడ్డుకునే దుర్బుద్ధి దీని వెనక దాగుందని పేర్కొంటున్నారు. అన్ని రాష్ట్రాలు తగ్గిస్తున్నా.. ధైర్యంగా ముందుకే జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఇచ్చే రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశంలో 24 రాష్ట్రాలు ఒక్కొక్కటిగా బీసీలకిచ్చే రిజర్వేషన్లను 16–25 శాతం వరకు తగ్గించుకున్నాయి. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. అయినప్పటికీ ఆ తర్వాత 2019 డిసెంబరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా ముందుకెళ్లి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్లో ఆమోదించి జీవో కూడా జారీ చేసింది. ఆ జీవో మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు కూడా ఆమోదం తెలిపింది. అయితే టీడీపీ నేతలు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85%రిజర్వేషన్ల జీవోతో ఎన్నికలు జరపడంపై స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనతో తిరిగి దీనిపై హైకోర్టులో విచారణ జరగడంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తీర్పు వెలువడింది. 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు మొదట రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపిన తర్వాత టీడీపీ నేత సుప్రీంకోర్టులో కేసు వేయకుంటే బీసీలకు 34 శాతంతోనే ఎన్నికలు జరిగేవని పేర్కొంటున్నారు. ఎన్నికలు, నిధులను అడ్డుకోవడమే విపక్షం ధ్యేయం రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు గ్రామ పంచాయతీలకు తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకాగా టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవి పొందిన ఆ పార్టీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి సుప్రీంకోర్టు, హైకోర్టులలో వరుసగా కేసులు వేయడంతో వాయిదా పడుతూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.5,100 కోట్ల నిధులను అడ్డుకోవడమే టీడీపీ ధ్యేయమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్లో చట్టమే మార్గం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై వివాదాలకు రాజ్యాంగ బద్ధతే శాశ్వత పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. పార్లమెంట్లో చేసిన చట్టం కారణంగా తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం గతంలోనే కేంద్రంపై ఒత్తిడి తేవడంతో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో చేర్చారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు గతేడాది మార్చిలో పార్లమెంట్లో బిల్లు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు సుప్రీంకు వెళితే ప్రయోజనమా? బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలైన కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రముఖ బీసీ ఉద్యమ నాయకుడు సిద్ధరామయ్య హయాంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. బీసీ నేతలైన బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం చౌహాన్ కూడా 2013–2014లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 – 22 శాతం తగ్గించారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు వాదనలో పసలేదు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు, ఉపయోగం లేదు. గత ప్రభుత్వాలు చాలాసార్లు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాయి. ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు చెప్పింది. అలాంటప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళితే ఆ తీర్పు పునరావృతం అవుతుంది. చంద్రబాబు చర్యలతో కాలయాపన తప్ప బీసీలకు ఒరిగేదేమీ ఉండదు’ – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో టీడీపీ పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. -
‘బీసీల ఎదుగుదల ఓర్చుకోలేకపోతున్నారు’
సాక్షి, విజయవాడ: బీసీలను టీడీపీ ఓటుబ్యాంకుగానే చూసిందని.. వారి అభివృద్ధికి పాటు పడలేదని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక నారా లోకేష్ అనుచరులు అడ్డుపడటమే అందుకు నిదర్శనమని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకో వార్డులో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెడుతున్నారు. మంగళవారం 26వ డివిజన్లో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించిన మంత్రి.. సమస్యలపై ఆరాతీసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సీఎం వైఎస్ జగన్ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు. (చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..) టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడ్డారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష టీడీపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని సీఎం భావిస్తే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డు పడ్డారని ఆరోపించారు. బీసీల పై టీడీపీ కి ఉన్న ప్రేమ ఏపాటిదో బట్టబయలు అయిందని చెప్పారు. (బడుగుల ద్రోహి చంద్రబాబు) ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప టీడీపీ కి ప్రజా సంక్షేమం అవసరం లేదన్న విషయం తేటతెల్లం అవుతోందంటున్నారు. టీడీపీ హయాంలో 44 నాలుగు లక్షల మందికి పెన్షన్ లు ఇస్తే సీఎం జగన్ 60 లక్షల మందికి అందిస్తున్నారని పేర్కొన్నారు. పదహారు లక్షల మందికి కొత్తగా పెన్షన్ లు ఇస్తుంటే ఉన్నవి తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు గ్లోబల్ ప్రచారం చేయటం సిగ్గుచేటని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. -
రాయికల్ మినహా నాలుగింట్లో వారే..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నాలుగింట్లో మహిళలకే పట్టాభిషేకం జరిగింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురిలో చైర్పర్సన్లుగా మహిళలు ప్రమాణస్వీకారం చేశారు. ఒక్క రాయికల్‌లోనే జనరల్‌కు రిజర్వ్ కావడంతో మోర హన్మాండ్లు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో బీసీలే చైర్మన్ పీఠాలను అలంకరించారు. వీరిలో నలుగురు మహిళలు ఉండడం గమనార్హం. మెట్పల్లిలో వరుసగా మూడోసారి మహిళలే చైర్పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. రాయికల్‌లో చైర్మన్ పదవి జనరల్ కాగా.. వైస్ చైర్పర్సన్ పదవి మహిళకు దక్కింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగిత్యాలలో గులాబీ జెండా రెపరెపలాడింది. సాక్షి, జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకున్నారు. జగిత్యాల చైర్‌పర్సన్‌గా డాక్టర్ బోగ శ్రావణి, కోరుట్లలో అన్నం లావణ్య, మెట్పల్లిలో రణవేణి సుజాత, రాయికల్‌లో మోర హన్మండ్లు, ధర్మపురి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా సంగి సత్తెమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాలలో వైస్‌చైర్మన్‌గా గోలి శ్రీనివాస్, కోరుట్లలో గడ్డమీది పవన్, మెట్పల్లిలో బోయినిపల్లి చంద్రశేఖర్‌రావు, రాయికల్‌లో గండ్ర రమాదేవి, ధర్మపురిలో ఇందారపు రామన్న మున్సిపల్ వైస్చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. సామాజికవర్గాల వారీగా.. మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్ల పదవులను సామాజికవర్గాల వారీగా సర్దుబాటు చేశారు. జగిత్యాలలో పద్మశాలి సామాజికవర్గానికి చెందిన డాక్టర్ బోగ శ్రావణికి చైర్మన్ పదవి దక్కగా.. ఓసీ సామాజికవర్గంలోని వైశ్యులు గోలి శ్రీనివాస్ వైస్‌చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారు. కోరుట్లలో చైర్మన్ పదవి బీసీల్లోని గౌడ సామాజిక వర్గానికి చెందిన అన్నం లావణ్యకు దక్కగా, వైస్‌చైర్మన్‌గా బీసీల్లోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గడ్డమీది పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. మెట్పల్లిలో చైర్మన్ పీఠం బీసీల్లోని ముదిరాజ్‌కు చెందిన రణవేణి సుజాత దక్కించుకోగా, ఓసీకి చెందిన బోయినపల్లి చంద్రశేఖర్‌రావు వైస్‌చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. రాయికల్‌లో బీసీ పద్మశాలి వర్గానికి చెందిన మోర హన్మండ్లు చైర్మన్‌కాగా ఓసీకి చెందిన గండ్ర రమాదేవి వైస్‌చైర్‌పర్సన్ అయ్యారు. ధర్మపురిలో బీసీల్లోని మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన సంగి సత్తెమ్మ చైర్పర్సన్ కాగా ఓసీకి చెందిన ఇందారపు రామన్న వైస్‌చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఊహించినట్లే.. జిల్లాలోని మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ముందుగా ఊహించినట్లుగానే జరిగినా వైస్ చైర్మన్ల విషయంలో కాస్త సస్పెన్స్ ఏర్పడింది. కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ చైర్మన్లను ఎమ్మెల్యేలు ముందుగానే ప్రకటించారు. ధర్మపురి, జగిత్యాలలో చైర్పర్సన్ పీఠానికి పలువురు పోటీలో ఉన్నప్పటికీ ముందు నుంచి ప్రచారంలో ఉన్నవారే చైర్మన్ పదవులను అలంకరించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగిత్యాలలో టీఆర్ఎస్ మొదటి సారిగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కొంగొత్త ఆశలు.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్న రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఇక్కడ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల స్థానంలో చైర్మన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్లతో కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. నూతనంగా ఏర్పడిన పాలకవర్గాలతో పట్టణాల్లో కొత్త శోభ సంతరించుకుంది. పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే ఆశలు కొత్త పాలకవర్గాలపై పట్టణవాసులు పెట్టుకున్నారు. -
‘పురపాలక మొదటి దశ రిజర్వేషన్లు పూర్తి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తైంది. ఆయా వర్గాలవారీగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు పుర్తి అయ్యాయి. రిజర్వేషన్ల వివరాలను శనివారం తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పంపించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు మున్సిపల్ వార్డుల పదవుల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. ఎస్టీల జనాభా ఒక్కశాతం తక్కువగా ఉన్నా కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లను కల్పించారు. రేపు( ఆదివారం) వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. -
‘తీన్మార్ మల్లన్నకు రక్షణ కల్పించాలి’
గన్‌ఫౌండ్రీ: తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని బీసీ కులాల సమన్వయ వేదిక విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జూలూరి మహేష్‌గౌడ్ అన్నారు. సోమవారం నిజాం కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ సమాజాన్ని చైతన్యం చేస్తున్న మల్లన్నను కొందరు నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి మల్లన్నకు ప్రాణాపాయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట చేస్తున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుపై ప్రజలకు వివరిస్తున్నందుకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. సమావేశంలో లక్ష్మీనారాయణ, సందీప్, మల్లేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, అమరావతి: సామాజికంగా వెనుకబడిన బీసీలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో బీసీలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆయన పేర్కొన్నారు. బీసీలను కేవలం కులవృత్తులకు పరిమితం చేయాలనే దురాలోచన చంద్రబాబుకు ఉందని ఆయన మండిపడ్డారు. బీసీల్లో అనేకమైన సంచార జాతులు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి టీడీపీకి లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఉన్నతమైన స్థానంలో చూడాలనే దృఢ సంకల్పం సీఎం వైఎస్ జగన్‌ది అని ఆయన స్పష్టం చేశారు. -
‘జగన్ బీసీల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు’
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు బీసీలను మోసం చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు అన్నారు ఎమ్మెల్యే పార్థసారధి. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. చరిత్రలో బీసీలకు ఇన్ని నిధులను ఎప్పుడు కేటాయించలేదని తెలిపారు. బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన మాట ప్రకారం బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు కేటాయించారన్నారు. ఆటోడ్రైవర్లు, టైలర్లు, చేనేతలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారికి అండగా నిలిచారని ప్రశంసించారు. ఈ బడ్జెట్ బీసీల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు దోహదం చేస్తుందన్నారు. -
‘టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఆ హత్య జరిగింది’
సాక్షి, పశ్చిమ గోదావరి : కొవ్వూరులో బీసీ వర్గానికి చెందిన గోపాల కృష్ణ అనే వ్యక్తి హత్య తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లోనే జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వర రావు ఆరోపించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోపాల కృష్ణ హత్య కేసును న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షిస్తానని టీడీపీ నాయకుడు ముళ్లపూడి బాపిరాజు హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఈ హత్య టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరిగిందని అందరికి తెలుసన్నారు. అందుకే మంత్రి జవహర్, బాపిరాజులు జనాల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఏలూరులో ఇందుమతి అనే రజక స్త్రీ స్నానానికి వెళ్తే నిప్పు పెట్టి హత్య చేశారని వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఈ దారుణాన్ని జిల్లా ఎస్పీ ఆత్మహత్యగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఇలాంటి టీడీపీ నాయకులకు బీసీలను ఓట్లు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో 400 మంది బీసీలు లోన్లకు దరఖాస్తు చేస్తే కేవలం ముగ్గిరికి మాత్రమే లోన్ ఇచ్చారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
బీసీ మహిళలను కారుతో ఢీకొట్టీన టీడీపీ నేతలు
-
బీసీ ద్రోహి చంద్రబాబు
సాక్షి, కోరుకొండ (రాజానగరం): ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. కోరుకొండలో వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజ్యాధికారంలో వాటా కోసం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాది కిందటే పార్లమెంట్లో బిల్లు పెట్టిందన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 41, లోక్‌సభలో 7 సీట్లు కేటాయించడం హర్షించదగిన విషయమన్నారు. వడ్డెర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వాల్మీకి, కురుబ, మత్స్యకారుల్లాంటి అత్యంత వెనుకబడిన కులాలకు జగన్ అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. బీసీల విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్టు జగన్ ప్రకటించారన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడడం జగన్‌తోనే సాధ్యమని చెప్పారు. చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు గుర్తింపు లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలందరూ చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజానగరం అసెంబ్లీ అభ్యర్థి జక్కంపూడి రాజాను, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌లను సీలింగ్ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు బీసీ వ్యతిరేకి
-
జయహో బీసీ!
-
ఎన్నికల పోరుకు సిద్ధం
బీసీలే టీడీపీకి అండ అనే నినాదంతో ఇన్నాళ్లూ బలహీనవర్గాల గడ్డ సిక్కోలులో పాగా వేయగలిగారు.. కానీ ఆచరణలో బీసీల అభ్యున్నతికి టీడీపీ చేసిందేమీ లేదని తేలిపోయింది! ఇలాంటి నేపథ్యంలో బీసీలకు నేనున్నాను అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభయమిచ్చారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సహా జిల్లాలో రాజాం (ఎస్సీ), పాలకొండ (ఎస్టీ) మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లోనూ బీసీ అభ్యర్థులకే టిక్కెట్లు ఇచ్చి తన ఉద్దేశమేమిటో చెప్పకనే చెప్పారు. మరోవైపు టీడీపీ కూడా అభ్యర్థులను ఖరారు చేయడంతో బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. జగన్‌కో అవకాశం ఇద్దామని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్న నేపథ్యంలో ప్రజల అండతో టీడీపీ కోట బద్దలుకొట్టడానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు సై అంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మరోసారి ధర్మాన వర్సెస్ గుండ శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుండ కుటుంబంతో మరోసారి తలపడనున్నారు. 2004, 2009 ఎన్నికలలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణను ఓడించారు. 2014 ఎన్నికలలో మాత్రం చంద్రబాబు అప్పలసూర్యనారాయణను కాదని ఆయన భార్య లక్ష్మీదేవిని పోటీకి దింపారు. ఈ ఎన్నికలలో ధర్మాన ఓటమి పాలయ్యారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే కాదు జిల్లా మొత్తంమీద ఎక్కడా అభివృద్ధి కానరాలేదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ధర్మాన హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి ఏదైనా ధర్మాననే గెలుపించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జగన్ మరోసారి ఆయననే బరిలోకి దించారు. టీడీపీ కూడా లక్ష్మీదేవికే ఈసారీ అవకాశం ఇచ్చింది. పాత ప్రత్యర్థుల మధ్యే ఆమదాలవలస పోరు ఆమదాలవలసలో 1983, 1985, 1991 (ఉప ఎన్నిక), 1994, 1999 ఎన్నికలలో మొత్తం ఐదుసార్లు గెలిచి ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో సభ్యుడిగా వ్యవహరించిన తమ్మినేని సీతారాంకు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. గత మూడు దఫాల్లో ఆయనకు విజయం దక్కకపోయినా ఈసారి విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చింతాడ రవికుమార్, కోట బ్రదర్స్, మున్నా సహా పలువురు నాయకులను పార్టీలోకి చేర్పిస్తూ ఆమదాలవలసలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేశారు. తిత్లీ తుఫానులో అనేకమంది బాధితులకు విశేషంగా సహాయం చేసిన యువ శాస్త్రవేత్త గేదెల శ్రీనుబాబు కూడా గత వారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన కూడా ఆమదాలవలస నియోజకవర్గంలో బూర్జ మండలానికి చెందినవారే కావడం విశేషం. మరోవైపు సిటింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్‌నే టీడీపీ మరోసారి బరిలోకి దించింది. నాగావళి, వంశధార నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలతో చెరబట్టిన మాఫియాకు కూన అండదండలు అందించడంపై ప్రజలు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. అక్రమ సంపాదన వెదజల్లినా ప్రజలు మాత్రం ఫ్యాన్‌కే చాన్స్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. నరసన్నపేటలోనూ పాత ప్రత్యర్థులే.. ధర్మాన కుటుంబానికి తొలి నుంచి బాసటగా నిలుస్తున్న నరసన్నపేట నియోజకవర్గంలో కృష్ణదాస్ 2009, 2012 (ఉప ఎన్నిక) ఎన్నికలలో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉన్నారు. గత ఎన్నికలలో కృష్ణదాస్‌పై గెలిచిన బగ్గు రమణమూర్తికే టీడీపీ ఈసారి కూడా టికెట్ ఇచ్చింది. పాత ప్రత్యర్థినే మరోసారి ఎదుర్కొనేందుకు కృష్ణదాస్ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. టెక్కలిలో త్రిమూర్తుల విశ్వరూపం టెక్కలిలో టీడీపీ అభ్యర్థిగా కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఏదిఏమైనా అచ్చెన్నపై విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ యువకుడైన పేరాడ తిలక్‌కు టికెట్ ఇచ్చింది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగిన దువ్వాడ శ్రీనివాస్ సొంత ప్రాంతం కూడా టెక్కలే. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా ఈ ప్రాంతవాసే. త్రిమూర్తుల్లాంటి ముగ్గురు నాయకులు సమష్టి కృషితో టీడీపీని మట్టి కరిపించడానికి కృషి చేస్తున్నారు. పలాసలో కొత్తవారి మధ్య పోటీ పలాసలో వైఎస్సార్సీపీ తరఫున యువ వైద్యుడు సీదిరి అప్పలరాజు పోటీచేస్తుండగా, ఆయనకు పోటీగా గౌతు శివాజీకి బదులు ఆయన కుమార్తె శిరీషకు టీడీపీ టికెట్ ఇచ్చింది. పలాస బరిలో పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టినవారే. సిట్టింగ్‌ల వైపే వైఎస్సార్సీపీ మొగ్గు పాలకొండలో వైఎస్సార్సీపీ సిటింగ్ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతినే జగన్ మరోసారి బరిలోకి దించారు. గత ఎన్నికలలో ఆమె చేతిలో ఓడిపోయిన నిమ్మక జయకృష్ణనే టీడీపీ ఈసారి కూడా నమ్ముకుంది. రాజాంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే గత ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన కావలి ప్రతిభాభారతిని కాదని, అదే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా కనీసం డిపాజిట్ కూడా దక్కని కొండ్రు మురళీమోహన్ను ఇటీవల టీడీపీ పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చింది. గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొండ్రు దూకుడు కూడా జిల్లా ప్రజలకు తెలిసిందే. అలాంటి కొండ్రు కన్నా సౌమ్యుడైన జోగులుకే రాజాం ప్రజలు పట్టం కడతారనే విశ్లేషణలు ఉన్నాయి. ఇచ్ఛాపురంలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌కు పోటీగా టీడీపీ తరఫున బెందాళం అశోక్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇటీవలే టీడీపీలోకి వెళ్లిన యాదవ సంఘ నాయకుడు నర్తు నరేంద్ర యాదవ్ అక్కడి పరిస్థితుల్లో ఇమడలేక మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. మరో మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాల (లల్లూ) కూడా చేరడంతో ఇప్పుడు ఇచ్ఛాపురంలో వైఎస్సార్సీపీ బలీయంగా కనిపిస్తోంది. ఇక ఎచ్చెర్లలో కిమిడి కళావెంకటరావుకే టీడీపీ మరోసారి టికెట్ ఇచ్చింది. గత ఎన్నికలలో స్వల్ప తేడా ఆయన చేతిలో ఓటమి చూసిన గొర్లె కిరణ్‌కుమార్ ఈసారి కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అవినీతి టీడీపీ నాయకులను ప్రజలు తిప్పికొట్టి ఈసారి ఫ్యాన్‌కే ప్రజలు పట్టం కడతారని కిరణ్‌కుమార్ బలంగా చెబుతున్నారు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ జెండాపై గెలిచి టీడీపీ ప్రలోభాలతో ఫిరాయించిన కలమట వెంకటరమణ మరోసారి పాతపట్నంలో పోటీపడటానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. తాను నమ్మి వెళ్లిన టీడీపీ అధిష్టానమే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు టికెట్ ఇచ్చేందుకు తటాపటాయించాల్సి వచ్చింది. చివరి నిమిషంలో సీటు తెచ్చుకున్నా వైఎస్సార్సీపీ తరఫున రెడ్డి శాంతి రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. శాంతి ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ గ్రామగ్రామాన పార్టీని పటిష్టం చేస్తూ వచ్చారు. ఆమె కృషికి తగినట్లుగానే వైఎస్సార్సీపీలోకి చేరికలు కూడా భారీగా సాగుతున్నాయి. -
మాట తప్పని వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికశాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీలకు చెందిన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించడంతో బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకున్నారని వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా చూపించి ఆయనకు అండగా నిలుస్తామంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితేనే రాష్ట్రంలో బీసీల అభివృద్ధి సాధ్యమంటున్నారు. వైఎస్ జగన్‌తోనే బీసీలకు న్యాయం రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే ఒక్క వైఎస్ జగన్‌తోనే సాధ్యం. వైఎస్సార్సీపీ అభ్యర్ధుల జాబితాలో ఎక్కువ బాగం బీసీలకు కేటాయించారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం బీసీలు ఉండటంవల్ల వైఎస్ జగన్ ఎన్నికల అభ్యర్థుల విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. – బాబు, బీసీ సంఘం నాయకుడు, పులివెందుల అధిక శాతం సీట్లు బీసీలకే.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక శాతం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలలో బీసీలకు కేటాయించారు. పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. – అంబకపల్లె నారాయణస్వామి, వాల్మీకీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బీసీలకు అగ్రస్థానం కల్పించారు రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఆయనతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీలపట్ల చిన్నచూపు చూస్తున్న టీడీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలే గుఠపాఠం చెబుతారు. సీట్ల కేటాయింపులో బీసీలకు అగ్రస్థానం కల్పించారు. – రసూల్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పులివెందుల అన్ని వర్గాలకు న్యాయం ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల వారికి న్యాయం చేశారు. బీసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే జగన్‌తోనే సాధ్యం. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపే అందుకు నిదర్శనం. అన్ని వర్గాలకు న్యాయం కల్పిచడం హర్షణీయం. ఎన్నికల్లో జగనన్నకు బీసీలంతా అండగా నిలుస్తాం. – బాషా, బీసీ యువజన సంఘ రాష్ట్ర నాయకుడు, పులివెందుల -
బాబు డైలమా!
ఎన్నికల వేళ టీడీపీ అధినేత ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. టీడీపీకి ‘అనంత’ కంచుకోట అంటూ పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. అభ్యర్థులను మాత్రం ఎంపిక చేయలేక సతమతమవుతున్నాడు. నామినేషన్ స్వీకరణ రోజు సమీపిస్తున్నా బరిలో నిలిచే వారిని ప్రకటించలేకపోతున్నారు. ఎంపీ జేసీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేక.. సొంత నిర్ణయంపై మొగ్గుచూపలేక సందిగ్ధంలో పడిపోయారు. మరోవైపు కళ్యాణదుర్గం టిక్కెట్‌పై ఇటు ఉన్నం, అటు అమిలినేని ఆశలు పెంచుకున్నారు. ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఇక గుంతకల్లులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనమాట నెగ్గించుకునేందుకు బ్లాక్‌మెయిల్‌కు కూడా దిగారు. సిట్టింగ్‌లను మార్చి తాను చెప్పిన వారికే టిక్కెట్లు కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే జేసీ సిఫార్సు చేసిన వారికి టిక్కెట్లు ఇస్తే పార్లమెంట్ పరిధిలో జేసీ తనకంటూ ప్రత్యేక వర్గం ఏర్చరుచుకుంటారనీ, ఇది పార్టీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదముందనే యోచనలో పార్టీ ఉంది. అందుకే జేసీ సిఫార్సులపై ఆచితూచి అడుగేయాలనే భావనలో బాబు ఉన్నారు. మళ్లీ మొదటికొచ్చిన కళ్యాణదుర్గం పంచాయితీ జేసీ సిఫార్సు చేసిన మూడు ప్రధాన నియోజకవర్గాల్లో కళ్యాణదుర్గం పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి సిద్ధమయ్యారు. సోమవారం నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఇక కళ్యాణదుర్గం అభ్యర్థిత్వంపై అమిలినేని సురేంద్రకు టీడీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో సురేంద్ర నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారు. ఈ క్రమంలో చౌదరి నామినేషన్ వేస్తానని ప్రకటించడంతో సురేంద్రలో గుబులు మొదలైంది. దీనికి తోడు జేసీ దివాకర్‌రెడ్డి కూడా సురేంద్రను వ్యతిరేకిస్తున్నారు. బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వరనాయుడు పేరు ఖరారు చేయాలని చంద్రబాబు వద్ద పట్టుబడుతున్నారు. మరోవైపు చౌదరి వర్గం మాత్రం ఉమా, సురేంద్ర స్థానికేతులరని.. వీరిద్దరికీ కాకుండా తమలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానానికి స్పష్టం చేశారు. తద్వారా ఇద్దరినీ వ్యతిరేకిస్తున్నామని బాహాటంగానే చెప్పారు. చౌదరికి ఎసరు పెట్టాలనీ.. ఎంపీ జేసీ కళ్యాణదుర్గం టిక్కెట్ ఉమాకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో అది తెలుసుకున్న అమిలినేని సురేంద్ర, జేసీతో మాట్లాడినట్లు తెలిసింది. తన అభ్యర్థిత్వానికి సహకరించాలని కోరగా.. ఆయన ససేమిరా అన్నట్లు సమాచారం. కావాలంటే అనంతపురం అర్బన్‌కు వెళ్లాలని, సీఎంకు కూడా తాను సిఫార్సు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌చౌదరిని మార్చాలని ముందు నుంచి దివాకర్‌రెడ్డి అధిష్టానం వద్ద తన వాణి వినిపిస్తున్నారు. మరోవైపు చౌదరి ఏకంగా ప్రచారం సాగిస్తున్నారు. జేసీ దివాకర్‌రెడ్డిని గట్టిగా వ్యతిరేకిస్తున్న ప్రభాకర్ చౌదరిని వదులుకోకూడదని చంద్రబాబుకు టీడీ జానార్దన్తో పాటు మంత్రి దేవినేని సూచించినట్లు తెలుస్తోంది. ఆయన దూకుడుకు బ్రేక్ వేయాలంటే కచ్చితంగా చౌదరి ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపే జేసీ, మాజీ ఎంపీ సైఫుల్లా వర్గంతో పాటు బలిజ, కమ్మ సామాజికవర్గ నేతలు కూడా చౌదరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చౌదరికి టిక్కెట్ ఇస్తే గెలిచే అవకాశాలు లేవని సర్వే రిపోర్టులు కూడా రావడంతో చంద్రబాబు కూడా డైలమాలో ఉన్నట్లు సమాచారం. దీంతో సురేంద్ర పేరును అనంతపురం నియోజకవర్గానికి కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను చెప్పిన స్థానాల్లో అభ్యర్థులను మార్చకపోతే ఎంపీగా తాము బరిలోకి దిగమని కూడా జేసీ బాహాటంగానే చెబుతున్నారు. ఇంత నేరుగా అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న జేసీ తీరుతో ‘అనంత’ నేతలు కూడా విస్తుపోతున్నారు. అసలు ఈ ఎన్నికల్లో పార్టీకి జేసీనే మైనస్ కాబోతున్నారని, పవన్ ఎంపీగా ఓడిపోవడం ఖాయమని, ఆయన స్థానంలో మరొకరిని బరిలోకి దించితే ఎంపీగా ఓడిపోయినా కనీసం కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనైనా గట్టి పోటీ ఇవ్వగలమనే అభిప్రాయాన్ని మంత్రి దేవినేనికి కొందరు నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. జితేంద్రగౌడ్ వైపే మొగ్గు ఇక గుంతకల్లు స్థానాన్ని జితేంద్రగౌడ్కే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా పార్లమెంట్ అభ్యర్థినే బీసీని బరిలోకి దించుతోందని.. టీడీపీ తరఫున పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాలవ మినహా మరో బీసీ నేత లేరని, గౌడ్‌ను తప్పిస్తే అంతా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే అవుతారని ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ రెండు పార్లమెంట్ సీట్లూ తలారి పీడీ రంగయ్య, గోరంట్ల మాధవ్‌కు కేటాయించడంతో టీడీపీ బలమైన బీసీ ఓటు బ్యాంకు దారి మళ్లిందని, ఇది పార్టీకి తీరని నష్టం చేస్తుందని చెప్పినట్లు సమాచారం. మరోవైపు జేసీ మాత్రం గౌడ్‌ను తప్పించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో ‘అనంత’ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లపై చంద్రబాబు తేల్చలేకపోతున్నారని తెలుస్తోంది. రెండో జాబితా ప్రకటిస్తే అందులోనూ ‘అనంత’ పార్లమెంట్‌లోని స్థానాలు లేకపోతే బాగుండదని జాబితాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
జయహో బీసీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌లను ఆ పార్టీ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ స్థానాల్లో 9 స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. ఇందులో జిల్లాకు చెందిన రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. జిల్లాలోని బీసీల్లో మెజార్టీ వర్గంగా ఉన్న బోయ సామాజికవర్గం నుంచి రంగయ్య, కురుబ సామాజిక వర్గం నుంచి మాధవ్‌కు టిక్కెట్లు కేటాయించారు. దీంతో బీసీల అభ్యన్నుతికి, రాజకీయ ఉన్నతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసినట్లయింది. ఈ నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా బీసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. పైగా ఇద్దరూ రాజకీయాలకు కొత్త ముఖాలే. విద్యావంతుడైన రంగయ్యను, పోలీసు శాఖలో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న మాధవ్‌లను పార్టీలో చేర్చుకుని పార్లమెంట్ బరిలో నిలపడంతో సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్లడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పినట్లయింది. పోలీసు నుంచి ఎంపీ అభ్యర్థి దాకా.. గోరంట్ల మాధవ్ అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ, లా కోర్సు పూర్తి చేశారు. 1996 బ్యాచ్ ఎస్ఐగా పోలీసు శాఖలోకి ప్రవేశించారు. అనంతపురం నగరంలోని సిద్ధప్ప జ్యూవెలర్స్ అధినేత రేవన సిద్ధప్ప మనువరాలును వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. ఉద్యోగ నిమిత్తం పలు స్టేషన్లలో పనిచేసిన ఆయన 2003 నుంచి జిల్లాలోని పలు స్టేషన్లలో ఎస్ఐగా, ఆ తర్వాత సీఐగా విధులు నిర్వహించారు. ఉద్యోగ జీవితంలో నిజాయతీ అధికారిగా, లా అండ్ ఆర్డర్ అమలులో రాజీపడని పోలీసుగా మాధవ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కీలకభూమిక పోషించి వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేశారు. గ్రూప్–1 అధికారి నుంచి... తలారి రంగయ్య అనంతపురం జిల్లాకు పీడీ రంగయ్యగా సుపరిచితులు. 21 ఏళ్లు గ్రూప్–1 అధికారిగా పని చేశారు. ఇంకా 13 ఏళ్ల సర్వీస్ ఉంది. 2018 ఫిబ్రవరి 14న వీఆర్ఎస్ ఆమోదం పొందింది. 1997లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్–1 అధికారిగా ఎంపికై చేనేత జౌళిశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. 1998–99 చిత్తూరు జిల్లాలో, తర్వాత 1999 నుంచి 2002 వరకు నెల్లూరు జిల్లాలో పని చేశారు. ఆ తర్వాత 2002 నుంచి 2006 వరకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలుగు ప్రాజెక్ట్‌లో.. 2006–07లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అడిషనల్ డైరెక్టర్‌గా అనంతపురంలో సేవలందించారు. 2007 నుంచి 2009 వరకు కడప మెప్మా డైరెక్టర్‌గా పని చేశారు. 2009లో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌గా.. 2009 నుంచి 2012 వరకు అనంతపురం డీఆర్డీఏ పీడీగా ఉన్నారు. 2012–13లో హిందూపురం మునిసిపల్ కమిషనర్‌గా, 2013–14లో అనంతపురం మునిసిపల్ కమిషనర్‌గా పని చేశారు రాష్ట్ర భవిష్యత్తు వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు చాలా బాధిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రశ్నించలేకపోయా. రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో కమిట్మెంట్ రాజకీయాలు చేస్తున్న యువకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలిపి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరా. అత్యంత సామాన్యులకు సైతం పెద్దపీట వేసి రాజకీయ భవిష్యత్తు కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మంతా రుణపడి ఉంటా. – తలారి రంగయ్య బీసీలకు ఇచ్చిన గౌరవం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాననే ప్రకటన ఉద్వేగానికి గురిచేస్తోంది. సామాన్య కుటుంబంలో జన్మించా. పోలీసు ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. ఎలాగైనా డిపార్ట్మెంట్లోకి రావాలనే పట్టుదలతో ఎస్ఐగా వచ్చా. ఆ తర్వాత నాయకుల పరిస్థితి, స్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలు చూసి రాజకీయాల్లోకి రావాలనే కాంక్ష ఉండేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరు, పట్టుదల చూసిన తర్వాత ఆయన నాయకత్వంలో పనిచేయాలనే కోరికతోనే వైఎస్సార్సీపీలో చేరా. ఇప్పుడు పురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటా. ఇది బీసీలకు మా పార్టీ ఇచ్చిన గౌరవం. అలాగే ‘అనంత’ పార్లమెంట్ అభ్యర్థి రంగయ్యకు అభినందనలు. కచ్చితంగా రెండు పార్లమెంట్ స్థానాలను గెలవబోతున్నాం. జగన్మోహన్రెడ్డి సీఎం కాబోతున్నారు. ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం చూడబోతున్నారు. – గోరంట్ల మాధవ్ -
వైఎస్సార్‌సీపీతోనే బీసీల అభ్యున్నతి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం టీజే షాపింగ్ మాల్లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. పేరుకే టీడీపీ బీసీల పార్టీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..బడుగుల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. వారిని కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చరిత్రాత్మకమన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయని సాహసాన్ని జననేత చేశారని కొనియాడారు. బీసీ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే రాష్ట్రవ్యాప్తంగా బడుగు వర్గాల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తాయన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బీసీలు రాజకీయంగా బలపడేందుకు నామినేటెడ్ పదవుల నియామకాలు జరుగుతాయని తెలిపారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమన్నారు. జనంలో చంద్రబాబుపై నమ్మకం పోయిందని, రాష్ట్ర ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. బీసీల పునాది మీద ఏర్పడిన పార్టీగా చెప్పుకోవడమే తప్ప టీడీపీ..బడుగుల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. బీసీల అభవృద్ధికి వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నాగరాజు యాదవ్, సత్యం యాదవ్, బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవపూజ ధనుంజయాచారి, రాష్ట్ర కార్యదర్శి రియల్‌టైం నాగరాజు, ఆదిమోహన్‌రెడ్డి, రఘునాథ్, రాజశేఖర్, కటారి సురేశ్, కరుణాకర్‌రెడ్డి, రైల్వేప్రసాద్, సాంబశివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, హనుమంతురెడ్డి, రంగ, కిశోర్, విఠల్, మున్నా, సయ్యద్ ఆసిఫ్, మదారపు రేణుకమ్మ, ఏసన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘జగన్ సీఎం అయితేనే బీసీలకు న్యాయం’
సాక్షి, పశ్చిమగోదావరి : ఏలూరులో ఈ నెల 17న జరిగే ‘బీసీ గర్జన సభ’ను విజయవంతం చేస్తామని వైఎస్సార్సీపీ నాయకుడు ముదునూరి ప్రసాద రాజు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. గత నాలుగేళ్లలో బాబుకు బీసీలు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీసీలను పట్టించుకోని చంద్రబాబు.. ఎన్నికల ముందు ‘బీసీ కులాలకు పనిముట్లం’టూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మోసపూరిత హామీలను బీసీలు నమ్మే స్థితిలో లేరని ఆయన తెలిపారు. దివంగత వైఎస్సార్ హాయంలోనే బీసీలకు న్యాయం జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రసాద రాజు ఆశాభావం వ్యక్తం చేశారు -
బీసీ న్యాయమూర్తులను అణగదొక్కిన చరిత్ర బాబుది
-
‘ఫిబ్రవరి 17న వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్’
సాక్షి, విజయవాడ : ఐదేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు నాయుడు చేసిందేమి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో బీసీల జీవితాలు దుర్భర పరిస్థితిలో ఉన్నాయన్నారు. బీసీలకు న్యాయం చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏడాదిన్నర క్రితమే బీసీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. బీసీల పరిస్థితిపై కమిటీ అధ్యయనం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాలతో సమావేశమై నివేదిక రూపొందించామని తెలిపారు. ఫిబ్రవరి 17న ఏలూరులో జరిగే బీసీ గర్జనలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. బీసీలు ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదు : జంగా ఐదేళ్లుగా బీసీలను గాలికొదిలేసిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోజయహో బీసీ అంటూ మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. చంద్రబాబు పాలనలో బీసీల జీవితాలు దుర్భర పరిస్థితికి వచ్చాయని ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో బీసీలకు చంద్రబాబు చేసిందేమి లేదన్నారు. చంద్రబాబు బీసీలపై చేసే వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. బీసీలు ఎవరూ చంద్రబాబుని నమ్మడం లేదన్నారు. వైఎస్ జగన్ మాత్రమే బీసీలకు న్యాయం చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రమంతా పర్యటించి సమస్యలను గుర్తించిదని, వాటి పరిష్కారం కొరకు వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. బీసీ కులాలన్ని ఏకమై చంద్రబాబుకు బుద్ది చెప్పాలని కోరారు. -
‘ఓటు ధరను 10వేల రూపాయలకు తీసుకెళ్లారు’
సాక్షి, హైదరాబాద్: నాలుగున్నరేళ్ల పాలన కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను ఏనాడు పట్టించుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఓటుకు 500 రూపాయలు ముట్ట చెప్పే పద్దతిని చంద్రబాబు 1996లోనే ప్రవేశ పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు అదే ఓటు ధరను పదివేల రూపాయలకు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ధరను 20 కోట్ల రూపాయలకు, ఎంపీల ధరను 50 కోట్ల రూపాయలకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో చంద్రబాబు అపద్ధర్మ ముఖ్యమంత్రి కానున్నారని తెలిపారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. కులానికొక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గుర్తొచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంక్‌గా తప్ప.. ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా అని నిలదీశారు. ఇద్దరు బీసీలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించ రాదని తప్పుడు ఆరోపణలతో లేఖ రాసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ఆధారాలతో సహా బయటపెట్టారని గుర్తుచేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో బిసిల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకుంది లేదు. నెల రోజల్లో అపద్ధర్మ ముఖ్యమంత్రి కానున్నారు. ఇప్పుడు గుర్తుకొచ్చింది కులానికో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని. మోసాలకూ ఒక హద్దుండాలి చంద్రబాబు గారూ. — Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2019 బిసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా చంద్రబాబు? ఇద్దరు బిసిలను హైకోర్టు జడ్జిలుగా నియమించరాదని తప్పుడు ఆరోపణలతో లేఖ రాసిన విషయం నిజం కాదా? జస్టిస్ ఈశ్వరయ్య ఆధారాలతో సహా బయట పెట్టారు కదా? బతుకంతా నయవంచనే గదా? — Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2019 దేశంలో ఓటుకు 500 ముట్టచెప్పే పద్థతిని 1996 లోనే చంద్రబాబుగారు ప్రవేశపెట్టారు. ఇప్పడు దానిని పది వేల స్థాయికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు ధర 20 , ఎంపీలు ధరను 50 కోట్లకు చేర్చారు. రాజకీయ మనుగుడకు ఇంత నీచత్వానికి పాల్పడే వ్యక్తి ఎవరంటే చంద్రబాబునే చూపిస్తారు. — Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2019 -
బీసీలపై చిత్తశుద్ది ఉంటే నాలుగేళ్లుగా ఎందుకు మేలు చేయలేదు
-
‘చంద్రబాబు బీసీలను అవహేళన చేశారు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలకు ఇచ్చిన 119 హామీలను నెరవేర్చకుండా వారిని అవహేళన చేశారని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరదు కల్యాణి మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. వైఎస్సార్ స్వర్ణయుగం మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలో కలిసి ఉన్నపుడు ఏపీకి ప్రత్యేకహోదా కావాలని అడగని.. ఏనాడూ దీక్షలు చేయని చంద్రబాబు ప్రజలను మోసం చేయటానికే దొంగ దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను మభ్య పెట్టడానికే పోస్ట్ డేటెడ్ చెక్‌లు ప్రవేశపెట్టారని తెలిపారు. నిజంగా మహిళలకు సహాయం చేయాలని ఉంటే తక్షణమే చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారు
-
బీసీల మద్దతు వైఎస్ఆర్సీపీకే
-
బాబు సర్కారుకు వ్యతిరేకంగా కదం తొక్కిన బీసీలు
సాక్షి, అమరావతి: బీసీలను అన్ని రకాలుగా అణచివేతకు గురిచేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీకి విశేష స్పందన లభిస్తోంది. ఉదయం నుంచే అన్ని జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ నాయకులు, బీసీ సంఘాల నేతలు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఎన్నికలకు ముందే టీడీపీ బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బీసీల ఓట్ల ద్వారా సమాధానం చెప్పాలని ముక్త కంఠంతో నినదించారు. నిరసన ర్యాలీలు జిల్లాల వారీగా.. విజయవాడ: బీసీల కష్టాలు తీరాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. గురువారం వైఎస్సార్ సీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీసీలను పదేపదే మోసగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఓటుతో తగిన గుణపాఠం చెబుదామన్నారు. ఆదరణ పేరుతో బీసీలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. బీసీల సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే సీఎం హోదాలో వుండి అవహేళన చేసిన ఘనత చంద్రబాబుకే చెందుతుందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు బీసీలకు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా స్థానిక వైఎస్సార్ సీపీ కార్యలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, జడ్పీ వైస్ చైర్మన్ ఇరాగం రెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అనంతపురం: ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకిచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే ఓటుతో గుణపాఠం చెబుతామని అనంతపురం వైఎస్సార్ సీపీ బీసీ నేతలు, ఇతర సంఘాల నేతలు హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ గురువారం తలపెట్టిన నిరసన ర్యాలీ దిగ్విజయంగా సాగింది. ఈ ర్యాలీలో వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి రంగయ్య, కళ్యాణదుర్గం సమన్యయకర్త ఉషాశ్రీ చరణ్, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాగే పరుశురాం, కృష్ణప్ప, రాష్ట్ర కార్యదర్శులు బోయతిప్పే స్వామి, పైలా నరసింహయ్య, గిర్రాజు నగేష్, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టింది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిరసన క్యార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బీవై రామయ్యా, చెరుకులపాడు శ్రీదేవమ్మ, హఫీజ్ ఖాన్, ప్రదీప్ రెడ్డి, నరసింహులు యాదవ్, తెర్నకల్ సురేందర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నంద్యాల: టీడీపీ ప్రభుత్వం బీసీల పట్ల మోసపూరిత విధానాల పట్ల నిరసనగా నంద్యాలలో వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్ర హర్షవర్దన్ రెడ్డి, గంగుల నాని, శిల్పా రవిచంద్ర రెడ్డి, దేశం సులోచన సిద్దార్థ రెడ్డి, పార్టీ నాయకులు, బీసీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. తిరుపతి: సీఎం చంద్రబాబు పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన ర్యాలీకి విశేష స్పందన లభిస్తోంది. తిరుపతిలో వైఎస్సార్ సీపీకి చెందిన బీసీ విభాగం నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసనకు దిగారు. ఈ మహా ర్యాలీకి వైఎస్సార్ సీపీ బీసీ విభాగం నేతలు గోపి యాదవ్, పురుగు బాబు యాదవ్, పుల్లయ్య, వాసు యాదవ్, ఎస్కే బాబు, పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు, బీసీ సంఘాల నేతలు పాల్గొని విజయవంతం చేశారు. విశాఖపట్నం: టీడీపీ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఎల్ఐసీ జంక్షన్ నుంచి వైఎస్సార్ సీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీకి ఆ పార్టీ నగర అధ్యక్షుడు విజయ ప్రసాద్, బీసీ విభాగం అధ్యక్షుడు రామన్న పాత్రుడు, పార్టీ సమన్వయకర్తలు ఎంవీవీ సత్యనారాయణ, కేకే రాజు, నాగిరెడ్డి, అక్కరమాని విజయ నిర్మల, డాక్టర్ రమణ మూర్తి, సీనియర్ నాయకులు తైనాల విజయ్ కుమార్, కొయ్య ప్రసాద్ రెడ్డి, జాన్ వెస్లీ, పక్కి దివాకర్, రొయ్య వెంకట రమణ, మహిళా కన్వీనర్ గరికిన గౌరి, శీదేవి వర్మ, సాగరిక, పార్టీ కార్యకర్తలు, వివిధ బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
చంద్రబాబు బీసీ ద్రోహి..
-
బీసీలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది
-
పన్నెండేళ్ల కక్ష!
బీసీలపై అధికార పార్టీ దాడులకు తెగబడుతోంది. 8 సెంట్ల స్థలం విషయంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై 12ఏళ్లుగా దౌర్జన్యం సాగుతోంది. ఏకంగా మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం రంగంలోకి దిగడంతో అదే పార్టీలో కొనసాగుతున్న బీసీ నేత బాబయ్య ఆత్మహత్యకు సిద్ధమవుతున్న ఘటన కలకలం రేపుతోంది. కోర్టు ఉత్తర్వులనూ ధిక్కరిస్తున్నారు.. అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.. ఇప్పటికే ఒక తహసీల్దార్ సిక్ లీవులో వెళ్లిపోగా, మరో తహసీల్దార్ విధిలేని పరిస్థితుల్లో తన ఉద్యోగాన్ని ఫనంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అనంతపురం, రాప్తాడు: మరూరు గ్రామానికి చెందిన చీర్ల నల్లప్ప, చీర్ల వెంకటరాముడుకు చెందిన 8 సెంట్ల స్థలాన్ని 2006లో బాబాయ్య అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ స్థలానికి తూర్పు వైపు ఖాళీగా ఉన్న మరో 8 సెంట్ల స్థలం కూడా తమదేనంటూ అదనంగా మరికొంత నగదు తీసుకున్నారు. ఆ మేరకు బాబయ్య హద్దులు ఏర్పాటు చేసుకున్నాడు. 2012లో చీర్ల నల్లప్పకు చెందిన 4 సెంట్ల స్థలాన్ని బాబాయ్య భార్య లక్ష్మీదేవి.. చీర్ల వెంకటరాముడుకు చెందిన 4 సెంట్ల స్థలాన్ని బాబయ్య కుమారుడు భాస్కర్ పేరిట 2012లో పట్టాలు తీసుకున్నారు. ఒకే చోట దాదాపుగా 16 సెంట్ల స్థలం ఖాళీగా కన్పించడంతో ఆ స్థలంపై ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరి కళ్లు పడ్డాయి. ఆ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని పథకం రచించారు. ఇంతలో బాబాయ్య తన భార్యకు ఇచ్చిన పట్టా స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం కొనసాగుతుండగానే ముం దున్న స్థలం తమదనిఅదే గ్రామానికి చెందిన వెంకట్‌నాయుడు, మీనుగ రాజప్ప, జయన్న అనే వ్యక్తులు అడ్డుపడ్డారు. అయితే బాబయ్య 2013లో ఆ స్థలం కూడా తనదేనని కోర్డులో కేసు వేశాడు. 2014లో కోర్టు మీనుగ రాజప్ప, వెంకట్ నాయుడు, జయన్నలకు మీ దగ్గర ఏమైనా ఆధారాలుఉంటే తీసుకుని రండి అని కోరగా తమ వద్ద ఏమీ లేవని చెప్పారు. ఆ మేరకు కోర్టు ఆ స్థలం బాబయ్యకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేత ఆదినారాయణ రంగంలోకి దిగాడు. దీంతో వెంకటరముడు తన బంధువులైన ఆదినారాయణ, చంద్ర, నారాయణప్ప, గోవింద్, నాయుడు, క్రిష్టప్ప, వడ్లమూడి వెంకటరాముడులు బాబయ్యపై దాడి చేసి ఇంట్లోకి వెళ్లకుండా ఖాళీ స్థలంలో బండలు, ముళ్లకంప కొట్టారు. ఈ విషయమై తిరిగి బాబయ్య కోర్టును ఆశ్రయించాడు. అప్పుడు కూడా కోర్టు ఆ స్థలం బాబయ్యకే చెందుతుందని, వెంకటరాముడు పేరుతో ఉన్న పట్టా నకిలీదని తీర్పు ఇచ్చింది. మూడు రోజుల్లోగా బండలు, ముళ్లకంప తొలగించాలని ఆదేశించింది. అయితే కేసు ఓడిపోయిన వర్గం నేతలు మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాంను ఆశ్రయించారు. బండలు, ముళ్లకంప తొలగించకుండా అధికా రులపై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు 13.04.2015న అప్పటి డీఎస్పీ మల్లికార్జున వర్మ స్వయంగా మరూరుకు చేరుకొని పాతిన బండలు, ముళ్ల కంపను తొలగించారు. డీఎస్పీ మారడంతో మళ్లీ రంగంలోకి దిగిన నేతలు డీఎస్పీ మల్లికార్జున వర్మ బదిలీ కావడంతో వ్యతిరేక వర్గం నేతలు రంగంలోకి దిగారు. ఆ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఏడాదిగా పావులు కదుపుతున్నారు. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం, ఆమె సోదరుడు ధర్మవరపు మురళీలతో అధికారులకు ఫోన్లు చేయించి ఎలాగైనా ఆ స్థలాన్ని దక్కించుకోవాల ని కుట్ర పన్నారు. అందులో భాగంగానే రెండు నెలల క్రితం తహసీల్దార్ వరప్రసాదరావు నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది మరూరుకు వెళ్లి నీ స్థలం 8 సెంట్లు మాత్రమేనని, ఇంటి ముందున్న స్థలం నీది కాదంటూ సర్వే చేసి చుట్టూ రాళ్లు పాతించారు. తాను లేనప్పుడు రాళ్లు ఎలా పాతుతారని బాబయ్య వాటిని తీసేయగా వ్యతిరేక వర్గానికి చెందన నాయుడు, ఆదినారాయణ, క్రిష్టప్ప, వెంకటరాముడు, చంద్ర, నారాయణప్ప, గోవింద్ ఆయనపై గొడ్డలితో దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాబయ్యను అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించా రు. ఘనటపై బాబయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. తహసీల్దార్‌పై తీవ్ర ఒత్తిళ్లు కురుబ సామాజిక వర్గానికి చెందిన బాబయ్య ఇంటి ముందున్న స్థలం విషయంలో పరిటాల శ్రీరాం జోక్యం చేసుకున్నాడు. గత నెల రోజులుగా పరిటాల శ్రీరాం, ధర్మవరపు మురళి ఆ స్థలాన్ని ఎలాగైనా వెంకటరాముడుకు చెందేలా చూడాలని తహసీల్దార్ వరప్రసాదరావుపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీరి ఒత్తిడి భరించలేని తహసీల్దార్ 10 రోజుల పాటు సెలవులో వెళ్లాడు. తిరిగి విధుల్లో చేరగానే ఆ స్థలంలో బండలు పాతాలంటూ తహసీల్దార్‌పై వేధింపులు మొదలయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో మంగళవారం బాబయ్య ఇంటి ముందు బండలు పాతాలని కింది స్థాయి సిబ్బందిని తహసీల్దార్ ఆదేశించారు. ఈ విషయాన్ని తలారి ద్వారా బాబయ్యకు చేరవేశారు. ఇంతలోనే ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం ఉండటంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇలాంటి వేధింపులు భరించలేక అంతకు ముందున్న తహసీల్దార్ కూడా సీక్ లీవుపై వెళ్లిపోవడం గమనార్హం. నేను సమాధానం చెప్పలేను నాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తలారికి నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రాజకీయ ఒత్తిళ్లపై నేను సమాధానం చెప్పలేను. ఉదయం ఆఫీసుకు రండి.. అప్పుడు మాట్లాడదాం. – వరప్రసాదరావు,రాప్తాడు తహసీల్దార్ -
వాళ్ల పిల్లలకు పదవులు..మా పిల్లలకు గొర్రెలు, బర్రెలా?
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ జరగాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు ఒక్కటే ప్రాతిపదిక కాకుండా.. కుల బలం, జన బలం కూడా ముఖ్యమనే కీలకాంశాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. సోషల్ ఇంజనీరింగ్‌తోనే బీసీలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపవచ్చన్నారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కినపుడే.. బీసీలు అభివృద్ధిలో భాగస్వాములవుతారన్నారు. అప్పుడే వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ విషయాన్ని బీసీలు కూడా అర్థం చేసుకోవాలని కృష్ణయ్య కోరారు. టీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ విధానాల్లో మార్పు చేసుకోవాలని ఆయన సూచించారు. తాను ఎల్బీనగర్ నుంచే పోటీచేయాలా.. అసెంబ్లీ బరిలో నిలవాలా? వద్దా? అని నిర్ణయించుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఈసారి ఎన్నికలలో బీసీలు కీలకపాత్ర పోషించనున్నారన్న కృష్ణయ్య.. అన్ని పార్టీల మేనిఫెస్టోల ప్రకటన, టికెట్ల కేటాయింపు పూర్తయిన తర్వాతే ఏ పార్టీకి, కూటమికి మద్దతివ్వాలన్నది నిర్ణయించుకుంటామని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సాక్షి: బీసీలకు రాజ్యాధికారం కల్పించాలన్న లక్ష్యం దిశగా.. మీ వ్యూహమేంటి? కృష్ణయ్య : స్వాతంత్య్రం వచ్చిన 71ఏళ్లలో బీసీలకు రాజ్యాధికారంలో జనాభా నిష్పత్తి ప్రాతిపదికన సరైన వాటా దక్కలేదు. ఇటీవలే.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. దేశంలో బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సంఖ్య 14% మాత్రమే. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా ఇవ్వాలి. కానీ అది జరగడం లేదు. చట్టసభలన్నీ అగ్రకులాలతో నిండిపోతున్నాయి. మా పోరాటం వెనుక రెండు పవిత్రమైన ఆశయాలు, లక్ష్యాలున్నాయి. రాజ్యాధికారంలో బీసీలకు వాటా వస్తేనే అభివృద్ధి, ఆత్మవిశ్వాసం సాధ్యమవుతుంది. చట్టాలు, శాసనాలు చేయడంలో ప్రమేయం ఉంటేనే బీసీ వర్గాలకు ప్రయోజనం దక్కుతుంది. సామాజికంగా మా గౌరవం, హోదా పెరుగుతాయి. బీసీలది ఆకలిపోరాటం కాదు.. ఆత్మగౌరవ పోరాటం. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో 29 మంది సీఎంలుంటే.. అందులో ఒక్క బీసీ కూడా లేడు. ఇదెలా ప్రజాస్వామ్యం అవుతుంది? సీట్ల పంపకం, పదవులు అనుభవించడంలో ఈ సమానత్వం ఎందుకుండదు? ఈ మౌలికసూత్రాన్ని పాలకులు, రాజకీయపార్టీలు విస్మరిస్తున్నాయి. దీన్ని బద్దలు కొట్టే వ్యూహంతోనే ముందుకెళతాం. 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలేవీ బీసీలకు సరైన సంఖ్యలో టికెట్లిచ్చే పరిస్థితి లేదు. మీ డిమాండ్ ఏంటి? టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో బీసీలు కేవలం 20 మందే. ఇది బీసీలకు అన్యాయం చేయడమే. పార్టీ అభ్యర్థులను చూడొద్దు, నన్ను చూసి ఓట్లేయండి, నేనే గెలిపిస్తానని సీఎం కేసీఆర్ అంటున్నారు. మరి ఆయన్ను చూసి ఓట్లేసి గెలిపించాలనుకుంటే అభ్యర్థిగా ఎవరున్నా ఒక్కటే. అలాంటప్పుడు టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయాన్ని అమలుచేయడంలో కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బందేంటి? కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రాతిపదికగా టికెట్లు ఇస్తామంటోంది. అంటే అగ్రకులాలకిస్తేనే గెలుస్తారా? గెలుపు ప్రాతిపదిక డబ్బే కాదు.. జనబలం, కులబలం కూడా. ఈ విషయాన్ని కాంగ్రెస్ గమనించాలి. బీజేపీ కూడా టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించడం లేదు. వాళ్ల వైఖరి కూడా మారాలి. సాక్షి: బీసీలు ఇప్పటికీ పల్లకీ మోసే బోయీలుగానే ఉంటున్నారనే అభిప్రాయం ఉంది.. ఈ పరిస్థితుల్లో మార్పు ఎలా వస్తుందంటారు? కృష్ణయ్య: ఈ పార్టీలన్నీ అగ్రకుల పార్టీలే. బీసీల ప్రయోజనాలు కాపాడేవి కావు. అందుకే రాజకీయ పార్టీల్లోని బీసీ నాయకులకు నేను ఒక్కటే పిలుపునిస్తున్నా. ఎప్పుడూ జెండాలు మోసి, జిందాబాద్‌లు కొట్టి కట్టుబానిసలుగా ఉండడం కాదు. టికెట్ల కోసం నాయకత్వంపై తిరుగుబాటు చేయాలి. పోరాడాలి. మేం కూడా బీసీ సంఘాలుగా ఒత్తిడి తీసుకువస్తాం. రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. అప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా సులభంగా గెలుస్తారు. అనామకులైనా ప్రజానాయకులై.. పాలనలో భాగస్వామ్యం పొందుతారు. మేనిఫెస్టోల్లో బీసీలకు మేలు చేకూర్చే ఎలాంటి అంశాలు ఉండాలనేది మీ డిమాండ్? బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నది మా ప్రధాన డిమాండ్. దీంతో పాటు రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ పెట్టేలా బడ్జెట్ కేటాయింపులుండాలి. పంచాయతీరాజ్ రిజర్వేషన్లను జనాభా దామాషాలో పెంచి చట్టబద్ధత కల్పించాలి. బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల నుంచి కోటి వరకు 90% సబ్సిడీతో రుణాలివ్వాలి. పారిశ్రామిక విధానంలో 50% వాటా ఇవ్వాలి. రాష్ట్రంలో బీసీల కోసం 500 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇతర వర్గాలతో సమానంగా బీసీ విద్యార్థులందరికీ పూర్తిఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో జనాభా ప్రాతిపదికన 50% వాటా ఇవ్వాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు వర్తింపజేయాలి. ఈ అంశాలన్నింటినీ ప్రధాన రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో పెడితేనే బీసీల మద్దతు లభిస్తుంది. రాజకీయ పార్టీ పెట్టాలంటూ మీపై ఒత్తిడి ఉంది. దీనిపై మీరేమంటారు? పార్టీ పెట్టాలని అందరూ ఒత్తిడి చేస్తున్నారు. మన ఓటు మనమే వేసుకుందాం అంటున్నారు. అధికారం ఉన్న చోటే అభివృద్ధి అనే విషయాన్ని బీసీలు గుర్తించారు. అభివృద్ధి పీఎంలు, సీఎంల చేతుల్లోనే ఉందని.. ఆ అభివృద్ధి తాము వేసే ఓట్లలో ఉందని గ్రహించారు. అయితే, తెలంగాణలో ఇప్పుడు పొత్తులకు మాత్రమే సిద్ధపడుతున్నాం. ఏపీలో పార్టీ పెట్టే కసరత్తు తీవ్రంగా జరుగుతోంది. గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. అక్కడ పార్టీ పెట్టడం.. 175 స్థానాల్లో పోటీచేయడం ఖాయం. నాలుగేళ్లలో బీసీలకు మేలు చేసే పథకాలు తెచ్చామని కేసీఆర్ అంటున్నారు కదా.. బీసీలకు కాస్తయినా మంచి చేసుంటే మేం అభినందించే వాళ్లం. అయితే.. బీసీలకు కేసీఆర్ మంచి చేయకపోగా చెడు చేశాడు. విద్య, ఉద్యోగాల్లో క్రీమిలేయర్‌ను బలవంతంగా బీసీలపై రుద్దాడు. దీని వెనుక కసి కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ పెట్టి బీసీలకు ఎందుకు ఇవ్వరు? అదనంగా రూ.150 కోట్లు లేవా? వేల మంది బీసీ విద్యార్థులు చదువు మానుకుని ఇండ్ల దగ్గర ఉంటున్నారు. బర్రెలు, గొర్రెలకు డబ్బులుంటాయి కానీ, ఫీజులకుండవా? వాళ్ల పిల్లలకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు కావాలి.. మా పిల్లలు గొర్రెలు, బర్రెలు కాయాల్నా? ఏటా రూ.5వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని చెప్పి మొదటి రెండేళ్లు రూ.2వేల కోట్లిచ్చారు. అవి కూడా ఖర్చు చేయలేదు. కేసీఆర్ బీసీ వ్యతిరేక చర్యల లెక్క తీస్తే ఒక పుస్తకం అవుతుంది. పొత్తుల్లో భాగంగా టీడీపీ పోటీచేసే స్థానాల జాబితాలో మీ పేరుందా? అది టీడీపీ పార్టీని, చంద్రబాబును అడగాల్సిన ప్రశ్న. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీచేసే జాబితాలో నా పేరు, నా నియోజకవర్గం పెట్టకుండానే ఇచ్చారని తెలిసింది. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈసారి ఎన్నికల బరిలో ఉండాలనే ఆలోచన ఉందా? పోటీ చేయాలా.. వద్దా అనేది ఆలోచిస్తున్నా. ఎల్బీనగర్లోనే చేయాలని ప్రజలు అడుగుతున్నారు. నేను గెలిచిన తర్వాతే అభివృద్ధి జరిగిందని, నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని అక్కడి ప్రజల అభిప్రాయం. ఎల్బీనగర్లోనే పోటీచేయాలని అనుకుంటున్నా. తుది నిర్ణయానికి కొద్ది సమయం పడుతుంది. ఈసారి ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతివ్వబోతున్నారు? ఇప్పటివరకు బీసీలను రాజకీయ పార్టీలు ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప.. మా సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం లేదు. ఈ సారి ఎన్నికలలో బీసీలు చూస్తూ ఊరుకోరు. వారి విజన్ వారికుంది. ఆయా పార్టీల పట్ల వారి అభిప్రాయం వారికుంది. బీసీ సంఘాలుగా మా వాదన మేం వినిపిస్తున్నాం. నాలుగు దశాబ్దాల నా ఉద్యమ జీవితం ఇందుకు పునాది అవుతుంది. ఆయా పార్టీల మేనిఫెస్టోలు, టికెట్ల కేటాయింపులు పూర్తయిన తర్వాతే దీనిపై మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. -
మేనిఫెస్టోలో బీసీల ఊసేది: జాజుల
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల ఊసేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసిన టీఆర్ఎస్ బీసీల కనీస డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తోంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు బీసీల ఓట్లు అవసరం లేదేమోననిపిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర జనాభాలో 50%కు పైగా ఉన్న బీసీలకు కేవలం 20 టికెట్లు మాత్రమే కేటాయించడమేమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన బీసీ ఉప ప్రణాళిక ఇంతవరకు అమలుకే నోచుకోలేదని దుయ్యబట్టారు. కల్వకుర్తిలో బీసీలంతా కలసి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను సైతం ఓడించిన సంగతిని కేసీఆర్ మరిచిపోవద్దని సూచించారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. -
సరైన సమయంలో బీసీ పార్టీపై ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సరైన సమయంలో బీసీ పార్టీ ఏర్పాటుపై స్పష్టతనిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా తెలుగు రాష్ట్రాల్లో బీసీలు సీఎం కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, యూపీ, రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బీసీలు సీఎంలు అయ్యారన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో బీసీలు 20 మందే ఉన్నారని, ఇటు కాంగ్రెస్ లీకులిస్తోన్న జాబి తాల్లోనూ బీసీలకు పెద్దగా ప్రాధాన్యం కన్పించడం లేదని ఆరోపించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే, బీసీలకు రాజ్యాధికారమే ఏకైక మార్గమని తెలిపారు. మాతో కలసి రండి: బీఎల్ఎఫ్ బీసీల ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే ఓ ప్రత్యేక పార్టీ ఉండాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ చెప్పారు. అప్పుడే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. కృష్ణయ్య తమతో కలసి రావాలని.. తమ కూటమి తరఫున కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ, కృష్ణయ్యను కూటమి సీఎం అభ్యర్థిగా బలపరుస్తామని, అధిష్టానంతో ప్రకటనకు కృషి చేస్తామని తెలిపారు. అయితే దీనిపై కృష్ణయ్య ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు. తన అనుచరులతో సమావేశమైన తర్వాత తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో టీజేఎస్ నేత విశ్వేశ్వర్, పీసీసీ అధికార ప్రతినిధి మహేశ్‌కుమార్, బీసీ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ నేతలు మల్లయ్య, రాజలింగం తదితరులు ప్రసంగించారు. -
‘బీసీలను అన్నివిధాల ముంచింది బాబే’
సాక్షి, వైఎస్సార్ : ‘బీసీలను ఎన్నికలలో అన్ని విధాల వాడుకుని మోసం చేసింది చంద్రబాబు నాయుడు మాత్రమే. బీసీలకు అన్ని విధాల న్యాయం జరగబోయేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. అందుకే ప్రజా సంకల్ప యాత్ర అనంతరం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నా’మని వైఎస్సార్సీపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణ మూర్తి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మిన వారిని నట్టేట ముంచే నైజం చంద్రబాబుది. ఎన్నికల సమయంలో బీసీలను వాడుకున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి బీసీలు ఆయనను గెలిపించారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక బీసీల గురించి పట్టించుకోకుండా వారిని నట్టేట ముంచారని విమర్శించారు. కానీ వైఎస్సార్ కుటుంబం అలా కాదు. మాట తప్పని, మడమ తిప్పని నైజం వారిది. నమ్మిన వారి కోసం ఏం చేయడానికైనా సిద్దపడతారని తెలిపారు. బాబు హయాంలో బీసీలకు ఒరిగిందేం లేదని ఆరోపించారు. బీసీలకు తగు న్యాయం జరగాలంటే అది కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యపడుతుందని తెలిపారు. అందుకే ప్రజా సంకల్ప యాత్ర అనంతరం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో బీసీ గర్జన సభను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాక త్వరలోనే బీసీ అధ్యాయన కమిటీ నివేదికను జగన్మోహన్ రెడ్డికి అందచేయనున్నట్లు తెలిపారు. బీసీలకు న్యాయం చేసేది జగన్ మోహన్ రెడ్డి : ఆకేపాటి అమరనాథరెడ్డి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తమకు న్యాయం జరుగుతుందని బీసీలు విశ్వసిస్తున్నారని రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి తెలిపారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అనే విశ్వాసం ప్రజల్లో పాతుకుపోయిందని అన్నారు. అందుకే కేవలం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో బీసీలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. -
మదనపల్లెలో వైఎస్ఆర్సీపీ బీసీల సదస్సు
-
‘కేసీఆర్.. దమ్ముంటే ఎన్నికలకు రా’
సాక్షి, యాదాద్రి : కేసీర్‌కు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు సవాల్ విసిరారు. సోమవారం ఆయన భువనగిరిలో మాట్లాడుతూ.. ఓట్లకోసమే పాలకులు పథకాలు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. పేదలకు అందించాల్సింది ఓట్ల పథకాలు కాదని వారికి ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టాలనివ్యాఖ్యానించారు. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూం, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, నరేంద్ర మోదీలకు ప్రజాగోడు పట్టదని ఆరోపించారు. తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీల లెక్కలు లేవనడం భూటకమని ఆరోపించారు. సమగ్ర సర్వే లెక్కలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీసీల జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సామాజిక ఎజెండాతో ముందుకెళ్తున్నది బీఎల్ఎఫ్ మాత్రమేనని పేర్కొన్నారు. ఓటర్ల చైతన్యం కోసం జులై 15న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా!
తాడేపల్లిరూరల్: తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే అంచెలంచెలుగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేసేందుకు కొత్త కొత్త విధానాలను అమలు చేస్తోంది. దానిలో భాగంగా మహ్మద్ ఇంటి పేరు కలిగిన ముస్లిం లకు తీవ్ర ద్రోహం తలపెట్టింది. ప్రస్తుతం వారికి ఓసి సర్టిఫికెట్ ఇస్తాం, బిసి సర్టిఫికెట్లు ఇవ్వమంటూ చెప్పడంతో, చదువుకునే విద్యార్థుల్లోను, వారి తల్లిదండ్రుల్లోను ఆందోళన ప్రారంభమైంది. 2014లో బీసీ–ఈ గా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఓసి సర్టిఫికెట్ ఇస్తామని తెలపడంతో, గతంలో విద్యను అభ్యసించిన వారు బీసీ–ఈ సర్టిఫికెట్ పొంది ఉన్న వారు ఓసి సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఆందోళన చెందుతున్నారు. 2014లో పదో తరగతి పూర్తిచేసుకున్న ఓ విద్యార్థి ప్రస్తుతం బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుకునేందుకు సర్టిఫికెట్ అవసరం కావడంతో మంగళగిరిలోని ఓ ఈ–సేవా కేంద్రంలో కుల ధ్రువీకరణ పత్రం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం మహ్మద్‌లకు బీసీ–ఈ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని, ఓసీ సర్టిఫికెట్ ఇస్తామని, కావాలంటే తీసుకోవచ్చని చెప్పడంతో, ఆ విద్యార్థి తల్లితండ్రులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. తల్లిదండ్రులు కూడా ఈసేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయగా, వెబ్సైట్లో ఓసీ సర్టిఫికెట్టే ఓపెన్ అవుతుందని, బీసీ–ఈ ఓపెన్ కావడం లేదని, 2014 తర్వాత మహ్మద్‌లకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వడంలేదని తెలియచేశారు. మీ ప్రాంతంలోని తహసీల్దార్‌ను వివరణ అడగాలని చెప్పడంతో తాడేపల్లికి చెందిన ఎం.డి.చాంద్‌బాషా తహసీల్దార్‌ను కలిసి తన గోడును వివరించుకున్నాడు. ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఈ సమస్యను చెప్పుకోవాలని సూచించారు. 2014లో ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలు 2018లో ఎందుకివ్వరో తెలిపాలని ప్రశ్నించినా, తహసీల్దార్ దగ్గరనుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో సామాన్యుడైన చాంద్‌బాషా ఏం చేయాలో అర్థంకాక వెనుదిరిగి వెళ్లాడు. ఇప్పుడేం చేయాలి నా కుమారుడు అమీర్‌కు 2014లో బీసీ–ఈ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నాం. ఓసీ సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. ఒకే విద్యార్థి రెండు రకాల కుల ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉంటే, భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులకు తెలియదా. మహ్మద్ ఇంటిపేరు కలవారిని చిన్నచూపు చూస్తూ ఓసీలుగా ధ్రువీకరించడం ఏంటో అర్థం కావడంలేదు. –ఎండీ.చాంద్‌బాషా లంచం ఇస్తే ఎలా ఇచ్చారు వేరేవారికి ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలను చూపించి, చేతులు తడిపితే తప్ప బీసీ–ఈ సర్టిఫికెట్ ఇవ్వలేదు. తాడేపల్లి మున్సిపాలిటీలో బీసీలకు కార్పొరేషన్ లోన్లు అందచేయడంతో వాటికి దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రం అడిగాం. మొదట ఓసి సర్టిఫికెట్టే ఇస్తామన్నారు. నులకపేటలో మహ్మద్‌లకు ఇచ్చిన బీసీ–ఈ కుల ధ్రువీకరణపత్రాలను చూపించి చేతులు తడిపితే తప్ప ఇవ్వలేదు. – ఎండీ మస్తాన్‌వలి -
అంతా ఆర్భాటం
సాక్షి, కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది చేసినా అంతకంతా ప్రచారం లేనిదే ముందుకెళ్లరని అందరికీ తెలుసు. చేసేది కొంత.. చెప్పుకునేది కొండంత కావడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. అణగారిన వర్గాలుగా గుర్తింపు ఉన్న బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ప్రభుత్వం ఆదరణ–2 పేరుతో చేస్తున్న ఆర్భాటం చూస్తే చంద్రబాబు ప్రచార ఆర్భాటం ఏమిటో ఇట్టే తెలిసిపోతోంది. విజయవాడలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ఒకసారి ప్రారంభిస్తే.. తర్వాత అన్ని జిల్లాల్లోనూ వరుసగా ప్రారంభోత్సవాల పేరుతో ఎగ్జిబిషన్లు పెట్టి భారీగా ఖర్చు చేస్తూ వస్తున్నారు. మండలాల నుంచి 139 బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారిని తీసుకొచ్చి పరికరాలను చూపించే ఎగ్జిబిషన్ కార్యక్రమానికి తెర లేపారు. అయితే ఆదరణ–2 కింద బీసీ వర్గాలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం ద్వారా 2.55 లక్షల మందికి రూ. 750 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే 2.55 లక్షల మందికి ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం రూ. 330.40 కోట్లు మాత్రమే సరిపోతోంది. మిగిలిన రూ. 400 కోట్లకు పైబడిన సొమ్మంతా ప్రచారానికే వినియోగిస్తున్నారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నికల ముందు హడావుడి రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ నాలుగేళ్లు అయిపోయిన తర్వాత చివరి అంకంలో ఎన్నికలకు ముందు తాపత్రయపడుతోంది. ఎలాగోలా బీసీ ఓట్లను కొల్లగొట్టాలన్న లక్ష్యంతో ఆదరణ–2 పేరుతో ఇప్పుడు శ్రీకారం చుట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు 1999 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 1996లో ఒకసారి ఈ పథకం ప్రవేశపెట్టి ఎన్నికల వరకు ప్రచారం చేసుకుని తర్వాత ఎత్తేశారు. అనంతరం 2003లోనూ ఇలాగే జరిగింది. అప్పట్లో బీసీలు బాబు మాటలను పెద్దగా పట్టించుకోకపోవడంతో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ ప్రస్తుతం చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు పట్టించుకోకుండా ఇప్పుడు బీసీలకు సంబంధించి ఆదరణ పథకం–2 పేరుతో అధునాతన పరికరాలు అందిస్తామని ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఇప్పటివరకు అతీగతీ లేదు మార్చి 15న చంద్రబాబు ఆదరణ–2 పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తే ఇప్పటివరకు అసలు అతీగతీ లేదు. పైగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఆదరణ–2 ఎగ్జిబిషన్ల పేరుతో ప్రచార పర్వానికి తెర లేపారు. ఇంతవరకు కనీసం మండలాల వారీగా జిల్లాలకు సంబంధించి కేటాయింపులు లేవు. ఏ జిల్లాకు కూడా నిధుల మంజూరులో స్పష్టత లేదు. లబిధదారులు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ కాలేదు. కానీ జిల్లాల్లో జరిగే సదస్సులకు మండలాల నుంచి బీసీ వర్గాలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాలు, ప్రచార హోర్డింగ్‌లతో çహోరెత్తిస్తూ నిధుల వరద పారిస్తున్నారు. బీసీ జనాభా 2.55 కోట్లయితే..2.55 లక్షల మందికే లబ్ధి రాష్ట్రంలో బీసీల జనాభా దాదాపు 2.55 కోట్లకు పైగా ఉంటే ఆదరణ పథకం కింద కేవలం 2.55 లక్షల మందికి మాత్రమే అవకాశం కల్పించేలా పథకం రూపొందించారు. అధునాతన పరికరాల పేరుతో ఒక్కొక్క వ్యక్తికి కేటగిరి–1 కింద రూ. 10 వేలు (రూ. 7 వేలు సబ్సిడీ+రూ. 1000 లబ్ధిదారుని వాటా+రుణం కింద రూ. 2000) కలుపుకుని అందిస్తారు. ఉదాహరణకు నాయీ బ్రాహ్మణులు బార్బర్ షాపులో ఉండే వీల్ చైర్ విలువే దాదాపు రూ. 14 వేలు ఉంది. అయితే రూ. 10 వేలు ఎంతమాత్రం సరిపోదని పలువురు పెదవి విరుస్తున్నారు. కేటగిరి–2 కింద రూ. 20 వేలు, కేటగిరి–3 కింద రూ. 30 వేలు కేటాయిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కేటగిరి–1 కింద లక్షా 5 వేల మందికి మనిషికి రూ. 10 వేలు చొప్పున.. కేటగిరి–2 కింద 83 వేల మందికి సంబంధించి ఒక్కొక్కరికి రూ. 20 వేలు చొప్పున.. కేటగిరి–3 కింద 67 వేల మందికి సంబంధించి ఒక్కొక్కరికి రూ. 30 వేలు చొప్పున అందించాలని జీఓలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో 70 శాతం సబ్సిడీతోనూ, 10 శాతం లబ్ధిదారుని వాటా, 20 శాతం రుణం కింద అందజేయనున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పరిశీలిస్తే మొత్తం లబ్ధిదారులు 2.55 లక్షల మందికి గాను దాదాపు రూ. 330.40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే మిగిలిన రూ. 400 కోట్లు బీసీల అభ్యున్నతి పేరుతో ప్రచారానికి వినియోగిస్తున్నారని బీసీ సంఘాలు రగిలిపోతున్నాయి. బీసీలకు అందించే లబ్ధికంటే ప్రచార ఖర్చులకే ఎక్కువ మొత్తాన్ని వినియోగిస్తున్నారని బీసీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నేడు కడపలో ఆదరణ–2 కడపలోని మున్సిపల్ స్టేడియంలో ఆదరణ–2 పథకం కింద సోమవారం పరికరాల ప్రదర్శన పెడుతున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి జిల్లా కేంద్రానికి ప్రత్యేక వాహనాల ద్వారా తీసుకు వస్తున్నారు. కుల వృత్తుల వారికి అన్యాయం చేస్తున్న బాబు రాష్ట్రంలో బీసీల్లో ఉన్న 139 సామాజిక వర్గాల్లోని ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారు. లబ్ధిదారులకు అంతంత మాత్రం ఇచ్చి ప్రచారానికి ఎక్కువ వినియోగించుకుంటున్నారు. అసలు రూ.10 వేలు, రూ.20 వేలతో ఏం వ్యాపారం చేస్తారు? ఆదరణ పథకం కింద లబ్ధి చేకూరితే మిగతా వాటికి అర్హులు కాదంటూ ప్రభుత్వం ప్రకటించడం అన్యాయం. లబ్ధిదారుల ఎంపికలోనూ సామాజిక కార్యకర్తల పేరుతో జన్మభూమి కమిటీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. – సిద్దవటం యానాదయ్య, రాష్ట్ర కన్వీనర్, ఏపీ బీసీ జేఏసీ -
బీసీని కాబట్టే పట్టించుకోలేదు: బీజేపీ మంత్రి
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ పార్టీ నాయకులను దళితుల ఇళ్లను సందర్శించమని ఆదేశించగా, మరోవైపు వెనుకబడిన వర్గాలకు చెందిన మంత్రులకు కనీస గౌరవం దక్కడం లేదు. ఈ విషయాన్ని యోగి కేబినెట్లోని మంత్రే స్వయంగా వెల్లడించారు. మంత్రి ఓంప్రకాశ్ రాజ్‌భర్ బహ్రైచ్ పట్టణంలోని సర్క్యూట్ హౌస్‌ను సందర్శించినప్పుడు ఇతర మంత్రులకు ఇచ్చే గౌరవాన్ని అధికారులు తనకు ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు కారణం తాను వెనకబడిన కులానికి చెందినవాడిని కావడమే అని ఆయన వాపోయారు. రెండు రోజుల క్రిత్రం బహ్రైచ్‌లో ఓ వివాహ వేడకకు హాజరయిన ఓంప్రకాశ్ అనంతరం పట్టణంలోని సర్క్యూట్ హౌస్‌కు వెళ్లారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీఐపీలు ఎవరైనా సర్క్యూట్ హౌజ్‌కు సందర్శించినప్పుడు అధికారులు వారిని ప్రొటోకాల్ ప్రకారం గౌరవంగా ఆహ్వానించాలి. అయితే ఓంప్రకాశ్ సర్క్యూట్ హౌజ్ వద్దకు వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ ఆయనకు స్వాగతం పలకలేదు. దీని గురించి ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘మన సమాజంలో కొన్ని వందల ఏళ్లుగా వెనకబడిన వర్గాల వారిని అవమానిస్తూనే ఉన్నారు. నేను వెనుకబడిన వర్గానికి చెందిన వాడిని కావడం వల్లే అధికారులు నన్ను పట్టించుకోలేదు. అదే ఏ ఉన్నత వర్గానికి చెందిన మంత్రో వస్తే వారు పరుగున వెళ్లి అతనికి అధికార లాంఛనాలతో స్వాగతం పలికేవార’ని విమర్శించారు. -
మీ పాలనలో ఒక్క బీసీకైనా న్యాయం జరిగిందా?
-
చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమా?
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అన్యాయంపై అందరూ రగిలిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ప్రశ్నించారు. బీసీలపై జస్టిస్ ఈశ్వరయ్య లేవనెత్తిన అంశాలపై చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలపై బీసీలు ఆధారపడరని, చంద్రబాబు బీసీలను వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చింది వాస్తవంకాదా? అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రిపై సీబీఐ విచారణ జరిపించాలి. చంద్రబాబు పాలనలో ఒక్క బీసీకైనా న్యాయం జరిగిందా? బలహీన వర్గాల ప్రజలు చంద్రబాబుకు తగ్గిన బుద్ధి చెబుతారు. ఒకవేళ నిజం అయితే చంద్రబాబుని వెంటనే బర్తరఫ్ చేయాలి’ అని పార్థసారథి డిమాండ్ చేశారు. -
బీసీల గొంతుకోసిన బాబు
బీసీ న్యాయవాదులు అమరనాథ్ గౌడ్, అభినవ కుమార్‌లు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించటానికి అర్హులు కారంటూ ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాసిన లేఖ బహిర్గతమైంది. బీసీ న్యాయవాదులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, వారి నియామకాలను అడ్డుకోవాలని బాబు ప్రయత్నించారు. అయితే, ఇంటెలిజెన్స్ శాఖ పరిశీలనలో బీసీ న్యాయవాదులపై చేసిన ఆరోపణలపై అబద్ధాలని తేలిపోవడంతో, వారిని కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తులుగా నియమించింది. కేంద్రమంత్రికి బాబు రాసిన లేఖల్ని జస్టిస్ ఈశ్వరయ్య బయటపెడుతూ మరిన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. వాటన్నింటిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉంది.సుప్రీంకోర్టులోగానీ, రాష్ట్ర హైకోర్టులోగానీ, జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్ సూత్రాన్ని పాటించడం లేదు, పైగా కొలీజియం పద్ధతి ద్వారా జడ్జీలే, జడ్జీలను నియమించే విధానం కొనసాగుతున్నందువల్ల ఉన్నత న్యాయస్థానాల్లో బీసీ జడ్జీల సంఖ్య బహు స్వల్పంగా ఉంటోంది. గత 68 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో మొత్తం సుమారు 200మంది న్యాయమూర్తులు నియమితులు అవగా, వారిలో ఒకరిద్దరు తప్ప బీసీ న్యాయమూర్తులు లేరు. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రస్తుతం 600 మందికి పైగా న్యాయమూర్తులు పనిచేస్తుండగా బీసీ న్యాయమూర్తులు 80 మంది కూడా లేరు. జనాభాలో 50 శాతానికి మించి ఉన్న బీసీలకు న్యాయ వ్యవస్థలో న్యాయం జరగటం లేదు. జిల్లా స్థాయిలో ఉన్న రిజర్వేషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో ఎందుకు పాటించరు? రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎక్కువమంది బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. కనుక బీసీ న్యాయవాదులు హెచ్చు సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. వై. కోటేశ్వరరావు, సీనియర్ న్యాయవాది, రాష్ట్ర అధ్యక్షులు, బీసీ మహాజన సమితి, మొబైల్ : 98498 56568 (నేడు సాయంత్రం 4 గంటలకు విజయవాడలో గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బీసీ న్యాయవాదుల సభ సందర్భంగా) -
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు: కాంగ్రెస్
సాక్షి, విజయవాడ : బీసీలకు న్యాయమూర్తి పదవులు రాకుండా అడ్డుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీసీల పట్ల చంద్రబాబు అనురిస్తున్న వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. బీసీలకు న్యాయమూర్తి పదవులు రాకుండా తప్పుడు నివేదికలు పంపిన చంద్రబాబు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే.. బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. వారిని చంద్రబాబు ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైఎస్సార్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు. నిరసన కార్యక్రమంలో జీ గంగాధర్, సుంకర పద్మశ్రీతోపాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
త్వరలో బీసీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల బహిరంగ సభ
నల్లగొండ టూటౌన్ : జిల్లాలోని బీసీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల బహిరంగ సభను త్వరలో నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలకు ఏడు శాసనసభ స్థానాలు కేటాయించేలా ఆయా పార్టీలపై ఒత్తిడి తెస్తామన్నారు. బీసీలందరినీ ఐక్యం చేసి పార్లమెంట్లో, శాసన సభలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ఉద్యమాన్ని తీవ్ర రూపం చేద్దామన్నారు. అనంతరం బీసీ సంఘం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్న బీసీ యువజన సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీలా వెంకటేశ్, లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, అశోక్ పాల్గొన్నారు. -
బడ్జెట్లో బీసీలకు అన్యాయం
హుజూరాబాద్‌రూరల్: టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఎర్రబొజ్జు నారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని బృందావన్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ గత బడ్జెట్లో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించిన ప్రభుత్వం.. ప్రస్తుతం నిధులు కేటాయించకుండా మాట తప్పిందన్నారు. రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి.. ఇప్పటికీ రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ తిరుణహరి శేషు, జిల్లా సెక్రెటరీ జె.కె. ప్రభాకర్, జేఏసీ మండల అధ్యక్షుడు సబ్బని తిరుపతి, ఉపాధ్యక్షుడు సాధుల లక్ష్మీనారాయణ, మహిళ సభ్యులు పాల్గొన్నారు. -
బీసీ-ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోండి: ముద్రగడ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారందరూ బీసీ-ఎఫ్ సర్టిఫికేట్లకు దరఖాస్తు చేసుకోవాలని ముద్రగడ పద్మనాభం బుధవారం కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో, బయట సభల్లో కాపులను బీసీ-ఎఫ్ కేటగిరీ కింద చేర్చినట్లు చెబుతున్నారని అన్నారు. ఈ మేరకు కాపులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లి బీసీ-ఎఫ్ కుల ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
‘క్రీమీలేయర్’ ఎత్తేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో 50 శాతానికిపైగా జనాభా ఉన్న ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. క్రీమీలేయర్ నిబంధన ఎత్తేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్ట్ కమిటీ సమావేశంలో ఆయన అధిష్టానానికి సూచించారు. ఆదివారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్ట్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీలో సభ్యుడైన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..క్రీమీలేయర్ నిబంధన ఎత్తేసేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన అధిష్టానానికి సూచించారు. ఏపీ నుంచి కమిటీలో సభ్యుడైన కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలపై సూచనలు చేయాల్సిందిగా కమిటీ సభ్యుల ను మన్మోహన్ సింగ్ కోరినట్టు తెలిసింది. -
బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన బీసీ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. జనాభాలో సగభాగం బీసీలున్నారని, వారి ఓట్లతోనే ఏ పార్టీకైనా అధికారం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రలోభాల రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకపై బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే ఓట్లు పడతాయన్నారు. ఇప్పటివరకు పార్లమెంటులో బీసీలకు సముచిత న్యాయం జరగలేదని.. వందల కులాలకు ప్రాతినిధ్యం దక్కలేదని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. -
రారా..కృష్ణయ్య..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బలమైన సామాజికవర్గం నేతలపై కాంగ్రెస్ కన్నేసింది. ఫలించిన గుజరాత్ ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించిన పార్టీ ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే వివిధ వర్గాల నాయకులతో టచ్‌లో ఉన్న కాంగ్రెస్ తాజాగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కూడా సంప్రదించినట్లు తెలిసింది. 2014 ఎన్నికల సమయంలో రాజకీయ అరంగ్రేటం చేసిన కృష్ణయ్య ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి శాసనసభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. టీడీపీ శిబిరం దాదాపుగా ఖాళీ కాగా.. కృష్ణయ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మిగతా ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ గూటికి చేరినా..ఆయన మాత్రం సాంకేతికంగా టీడీపీలోనే కొనసాగుతున్నారు. బలహీనవర్గాల్లో గట్టి పట్టున్న కృష్ణయ్యతో చేతులు కలపడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అంతేగాకుండా.. ఇటీవల ఆ పార్టీ అంతర్గత సర్వేలలోను కృష్ణయ్యకు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నట్లు తేలింది. మూడు నెలల క్రితం జరిగిన గుజరాత్ ఎన్నికల్లో సామాజిక సమీకరణలు బాగా పనిచేసినందున.. ఇదే సిద్ధాంతాన్ని మన రాష్ట్రంలోను అమలు చేయాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయా వర్గాల్లో బలమైన నేతలుగా పేరెన్నికగన్న నేతలకు గాలం వేస్తోంది. కుంతియా మంతనాలు..! ఏఐసీసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాష్ట్ర కాంగ్రెస్ వ్వవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా ఇటీవల కృష్ణయ్యను కలుసుకొని సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తమతో చేతులు కలిపితే బంగారు భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ దాదాపుగా కనుమరుగైనందున.. కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో బీసీలను ఏకతాటి మీదకు తేవడం ద్వారా బీజేపీ గట్టి పోటీ ఇచ్చామని, ఇదే ఎత్తుగడ తెలంగాణలోను అవలంభిస్తామని కుంతియా స్పష్టం చేశారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపుతామని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించే సంప్రదాయం తమ పార్టీలో లేదని, ముందే ప్రకటిస్తే.. మొదట్నుంచి పార్టీని ఆదరిస్తున్న బలమైన సామాజికవర్గం దూరమయ్యే అవకాశముందని కూడా చెప్పినట్లు సమాచారం. రాజ్యసభ సీటు వద్దనుకుంటే చేవెళ్ల లోక్‌సభను కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కుంతియా ఆఫర్లపై నోరుమెదపని కృష్ణయ్య.. కాంగ్రెస్‌లో చేరే అంశంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతనివ్వలేదని సమాచారం. -
జగన్‌తోనే బీసీలకు న్యాయం
కర్నూలు (టౌన్): తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ అధ్యయన కమిటీ కన్వీనర్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం కర్నూలులోని మెగాసిరి ఫంక్షన్ హాలులో బీసీ అధ్యయన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం కర్నూలు పార్లమెంట్ జిల్లా పరిధిలో నిర్వహించారు. వివిధ కులాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. దేశంలో అనేక కులాలు ఉండగా.. రాజ్యాంగం వీరికి కల్పించిన హక్కులు ఇప్పటికీ అందడం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాలనలో కులవృత్తులు నిర్వీర్యం అయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు న్యాయం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బీసీ అధ్యయన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. వివిద కులాల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నట్లు చెప్పారు. వీటిపై మేధావులతో చర్చించి ప్రజాసంకల్ప యాత్ర ముగిసిన తరువాత జననేతకు నివేదిక రూపంలో సమర్పిస్తామన్నారు. త్వరలోనే విజయవాడలో బీసీ గర్జన సభ ఏర్పాటు చేసి అక్కడే డిక్లరేషన్‌ను ప్రతిపక్ష నేత ప్రకటిస్తారని చెప్పారు. ఈ డిక్లరేషన్‌ను వచ్చే 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి, నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ఇంకెనాళ్లు బీసీలను మోసం చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. త్వరలోనే బీసీలకు మంచి రోజులు రానున్నాయన్నారు. మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదన్నారు. ఫెడరేషన్లకు రూ.23 కోట్లు ఇస్తున్నట్లు చెప్పి రూ. 3 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట జగన్మోహన్రెడ్డి సమావేశంలో మాట్లాడారు. సుదీర్ఘ చర్చ.. రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సమస్యలపై అధ్యయన కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీసీల సమస్యలను తెలుసుకున్నారు. వాటన్నింటినీ రికార్డు చేశారు. సభ్యులు నర్సేగౌడ్, గుమ్మనూరు జయరాం, మారక్కగారి కృష్టన్న , రాగె పరశురాం, అవ్వారు ముసలయ్య, సుగుమంచి పల్లె రంగన్న, తొండమల్ల పుల్లయ్య, పల్లెపు వరప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, పీఏసీ సభ్యులు డాక్టర్ మధుసూదన్, పార్టీ నాయకులు గురువాచారి, దుర్గారావు, ధనుంజయచారి, మురళీకృష్ణ, ప్రవీణ్, సత్యం యాదవ్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక కర్నూలు (టౌన్) : వైఎస్స్సార్సీలో పలువురు బీసీ సంఘాలకు చెందిన నాయకులు చేరారు. బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించిన కాళిదాస్ యాదవ్, సత్యనారయణ, రామచంద్రుడు, వై.రాఘవులు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ పథకాలు అందడం లేదు కర్నూలు సీక్యాంప్: ప్రభుత్వ పథకాలు అందక బీసీ విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కర్నూలు మండలం రేమట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు వినతిపత్రం అందజేశారు. టీడీపీ పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. పంట రుణం మాఫీ కాక.. గిట్టుబాటు ధర లభించక చాలా మంది బీసీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. బీసీ విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్షిప్లు అందక చదువు మధ్యలోనే ఆపేసుకుంటున్నారన్నారు. వాల్మీకి, కురువ ఫెడరేషన్లు ఏర్పాట్లు చేయాలన్నారు. -
బీసీల హక్కుల కోసం పోరాడాలి: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: బీసీలు తమ హక్కుల కోసం నిరంతర పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీలు గొర్రెలు, బర్రెలు, చేపలకు ఆశపడకుండా రాజ్యాధికారానికై అడుగులు వేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాజ్యాధికారం ద్వారానే బీసీలకు ఆత్మగౌరవం దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, బీసీలు ఐక్యంగా ఉంటేనే జాతికి మేలు జరుగుతుందన్నారు. కులవృత్తులను, కులాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. బీసీలు రాజకీయ, ఆర్థిక రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులపై ఒత్తిడి తెచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. -
‘బీసీ’ నిధికి 30 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన కులాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. భారీ మొత్తంలో నిధిని కేటాయించి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు బీసీ నివేదికకు మెరుగులు దిద్దుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల కోసం ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీ ఎస్డీఎఫ్), షెడ్యూల్డ్ తెగల కోసం ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీ ఎస్డీఎఫ్)ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో బీసీలకు సైతం ప్రత్యేక అభివృద్ధి నిధిని ప్రవేశపెట్టాలనే డిమాండ్ రావడంతో గతేడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దీనిపై ప్రకటన చేశారు. అనంతరం బీసీల సమగ్రాభివృద్ధికి సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్న కమిటీ తొలిసారి సీఎం నేతృత్వంలో గతేడాది డిసెంబర్ 3న అసెంబ్లీ హాలులో సమావేశమైంది. సంతృప్తికర స్థాయిలో నిధులిస్తామని సీఎం ఈ భేటీలో స్పష్టం చేశారు. తర్వాత కమిటీ సభ్యులు డజనుకుపైగా సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం దీనికి తుది రూపు ఇస్తున్నారు. మెజారిటీ సభ్యులు బీసీ ప్రత్యేక అభివృద్ధి నిధి(బీసీ ప్లాన్)కి మొగ్గు చూపారు. దీంతో బీసీల కోసం అమలు చేసే కార్యక్రమాలన్నీ ఒకేచోటుకు తీసుకొచ్చి ప్రత్యేక అభివృద్ధి నిధిగా రూపొందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బీసీ ఎస్డీఐఫ్ వైపు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. జన సంఖ్యకు అనుగుణంగా కేటాయింపులు 2011 జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. ఇందులో ఎస్సీ జనాభా శాతం 15.45, ఎస్టీ జనాభా 9.27 శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే బీసీల జనాభాపై స్పష్టత ఇవ్వలేదు. అయినా అధికారిక అంచనాల్లో భాగంగా 51.09 శాతంగా లెక్కిస్తున్నారు. ఈ మేరకు సీఎంతో సహా మంత్రులు సైతం ఈ గణాంకాలను ప్రస్తావిస్తున్నారు. సబ్ కమిటీ సైతం 50 శాతాన్ని పరిగణిస్తూ బీసీలకు సగం వాటా దక్కాలని పేర్కొంది. నివేదిక తయారీలోనూ ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మున్ముందు మరిన్ని నిధులు 2018–19లో బీసీ అభివృద్ధి నిధికి ఓ రూపు తీసుకురావాలని భావిస్తున్న అధికార యంత్రాంగం.. ప్రాథమికంగా రూ.30 వేల కోట్ల నిధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. బీసీ ఎస్డీఎఫ్కు చట్టబద్ధత వస్తే తదుపరి ఏడాదిలో భారీ నిధులను కేటాయించే వీలుంటుందని బీసీ కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కోసం అమలు చేసిన ఉప ప్రణాళికలకు బదులుగా 2017–18 నుంచి ఎస్సీ ఎస్డీఎఫ్, ఎస్టీ ఎస్డీఎఫ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్లో మార్పుల దృష్ట్యా వీటిని ప్రత్యేక అభివృద్ధి నిధిగా మార్చి చట్టబద్ధత కల్పించింది. ఇందులో భాగంగా ఎస్సీలకు రూ.14,375.12 కోట్లు, ఎస్టీలకు రూ.8,165.87 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల కంటే అధికంగా ఉన్న బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కనిష్టంగా రూ.30 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. జనాభా నిష్పత్తితో పోలిస్తే ఈ నిధి తక్కువైనప్పటికీ... తొలిసారి అమలు చేస్తున్నందున ఈ మోత్తాన్ని కేటాయిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను సీఎంకు సమర్పించిన తర్వాత ఆయన నిర్ణయాన్ని బట్టి కేటాయింపులు మారే అవకాశం ఉంది. 2018–19 బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం బీసీ ప్రత్యేక అభివృద్ధి నిధిని ప్రవేశపెట్టనుందని బీసీ కమిటీ సభ్యుల్లో ఒకరు పేర్కొన్నారు. 2017–18లో ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ కేటాయింపులు ఇవీ.. కేటగిరీ రూ.కోట్లలో ఎస్సీలకు 14,375.12 ఎస్టీలకు 8,165.87 -
'కుప్పంలో బాబును ఓడిస్తేనే బీసీలకు మేలు '
-
‘కుప్పం నుంచే మన గెలుపు ప్రారంభం కావాలి’
సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన గురువారం పెద్దూరులో తనను కలిసి మద్దతు తెలిపిన ప్రజలతో మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నారని, వారందరికీ చంద్రబాబు ఏం చేశారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ గెలుపు కుప్పం నుంచే మొదలు కావాలని, కుప్పం పార్టీ సమన్వయకర్త చంద్రమౌళికి ఓటు వేసి గెలిపిస్తే కేబినెట్లో కూర్చోబెట్టి చంద్రబాబు కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ నవరత్నాలు పేదల జీవితాల్లో వెలుగు నింపుతాయన్నారు. పాదయాత్ర అనంతరం సెప్టెంబర్‌లో బస్సుయాత్ర మొదలు అవుతుందని, ఆ సందర్భంగా కుప్పం వచ్చి ప్రతి మండలంలోనూ పర్యటిస్తానని ఆయన తెలిపారు. మరోవైపు ప్రజా సంకల్పయాత్రకు పెరుగుతున్న ఆదరణ చూసి సర్కార్‌లో అలజడి మొదలైంది. చంద్రబాబు సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజా సంకల్పయాత్రలో విశేష ఆదరణ పెరుగుతుండటంతో ప్రభుత్వం నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. డోన్ కెమెరాలను, బాడీ కెమెరాలను పెట్టి ప్రతీ అడుగును చిత్రీకరించేందుకు నిఘా ఏర్పాటు చేశారు.పాదయాత్రకు సంబంధించి ఎవరెవరు వైఎస్ జగన్‌ను కలుస్తున్నారనే విషయాలను తెలుసుకుంటున్నారు. -
బీసీలపై టీడీపీ కక్షసాధింపు
సాక్షి, కర్నూలు : జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గ ప్రజలపై అధికార తెలుగుదేశం పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న వారందరికీ రుణాలు రద్దయ్యాయి. వైఎస్ జగన్‌ను కలిసినందుకే తనకు మంజూరైన రుణాన్ని రద్దు చేశారని వెనుకబడిన కులానికి చెందిన లబ్ధిదారుడు అరవప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రజాసంకల్పయాత్రలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. సాయంత్రానికి తనకు మంజూరైన రుణం రద్దు చేశారని తెలిపారు. తనకు మంజూరైన రుణాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. -
బాబూ.. బీసీ మ్యానిఫెస్టో ఎక్కడ?
కర్నూలు (టౌన్): లేనిపోని హామీలతో గత ఎన్నికల్లో లబ్ధి పొందిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత బీసీల మ్యానిఫెస్టోను తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు బి.వై. రామయ్య విమర్శిం చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అధికారం చేపట్టి నాలుగేళ్లు కావస్తున్నా బీసీ కులాలు, ఫెడరేషన్లను పట్టించుకున్న పాపానా పోలేదు. మహానేత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఫెడరేషన్లకు బీజం వేశారు. ఆయన మరణం తరువాత బడుగు బలహీన వర్గాలను పట్టించుకునే వారు లేరు. బోయలు, రజకులు, వడ్డెరులను ఎస్టీలుగా, కాపులను బీసీలుగా, మరికొన్ని కులాలను మరోలా మారుస్తామంటూ సీఎం చంద్రబాబు కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఫెడరేషన్లు ఏర్పాటు చేసి రూ. 10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన ఆయన నాలుగేళ్లలో రూ.4వేల కోట్లు కూడా ఇవ్వలేదు. అబద్ధాలు చెప్పడం, దగా చేయడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకే సాధ్యం. పాదయాత్ర తరువాత వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారు. చంద్రబాబు తరహాలో 500 పేజీలు కాకుండా రెండు పేజీల్లో పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏవిధమైన న్యాయం చేస్తామో వెల్లడిస్తారు’ అని ప్రకటించారు. హుస్సేనాపురంలో ఎమ్మెల్యే రోజా సదస్సుకు తరలి వస్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని బీవీ రామయ్య అన్నారు. సదస్సుకు మహిళలు రావడం నేరమా ..అని ప్రశ్నించా రు. ప్రజలకు అవకాశం ఇస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ పాదయాత్రలకు జనం లేరని సోమిశెట్టి చెప్పడం హాస్యాస్పదమన్నారు. అన్నం తినే వాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. గది నుంచి బయటకు రాకుండా ప్రెస్మీ ట్లు పెట్టే నీకు కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చీము, నెత్తురుంటే పాదయాత్ర వద్దకు వచ్చి జనం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవాలని సూచించారు. -
వైఎస్సార్సీపీ గెలుపులో భాగస్వాములు కండి
కడప కార్పొరేషన్: 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయంలో బీసీలు భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జంగా క్రిష్ణమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం కడపలోని పార్టీ కార్యాలయంలో బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా క్రిష్ణమూర్తి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల(బీసీలు)కు తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదని అన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలు మోసపోయారన్నారు. వైఎస్ఆర్ సుపరిపాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని, అప్పుడు కులాల వారీగా సమస్యలను అధ్యయనం చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబు పోకడను ఎండగట్టాలన్నారు. మండల, వార్డు కమిటీలు కనీసం ముగ్గురు బీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కులానికి ప్రాధాన్యం ఇచ్చి నాయకత్వాన్ని పెంపొందించాలన్నారు. బీసీల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని నవంబర్ 6 నుంచి వైఎస్ జగ¯Œన్మోహన్రెడ్డి చేపట్టబోయే పాదయాత్రలో వినతిపత్రాలు ఇవ్వాలన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బీసీలకు ఏం చేశారని టీడీపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, దానిని తిప్పికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టి అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య, నగర అధ్యక్షుడు చినబాబు మాట్లాడుతూ బీసీలు విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారి సమస్యలు తీర్చగల సమర్థ నాయకుడు జగనేనని తెలిపారు.అనంతరం బీసీ నాయకుల సలహాలు, సూచనలను స్వీకరించారు. 2019లో అధికారంలోకి వస్తున్నాం 2019లో అధికారంలోకి వస్తున్నామని వైఎ స్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి భరోసా ఇచ్చారు. ఇస్త్రీపెట్టెలు, షేవింగ్ కిట్లు, వృత్తి పరమైన సామగ్రి ఇచ్చి బీసీలను కులవృత్తులకే పరిమితం చేయాలని చూసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బలిజలను బీసీల్లో, బోయలను ఎస్టీల్లో చేరుస్తానని ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని, కులాల మధ్య ఉన్న ఆసమానతలను తొలగించడమే ఆయన లక్ష్యమన్నారు. ఒక్కసారి అవకాశం కల్పించండి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఒక్క అవకాశం కల్పించాలని కడప శాసనసభ్యులు ఎస్బి అంజద్‌బాషా కోరారు. 35 ఏళ్లుగా బీసీలు టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నారని, అయితే ఆ పార్టీ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీసీల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ విశేషంగా కృషి చేశారన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారని, ఆరోగ్యశ్రీ, పక్కాఇళ్లు, పింఛన్లు వంటి పథకాలతో ఆదుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ అ«ధికారంలోకి వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. అంతకుముందు వారు మహాత్మా జ్యోతిరావు పూలే, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కె. సురేష్‌బాబు, బీసీ నాయకులు శివయ్య యాదవ్, గోపాలస్వామి, విజయ్‌భాస్కర్, సురేష్‌కుమార్, బోలా పద్మావతి, టీపీ వెంకటసుబ్బమ్మ, పస్తం అంజి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రాయితీ నిధులకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కార్పొరేషన్, ఫెడరేషన్ల బకాయిలకు మోక్షం కలిగింది. వీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2015–16 వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ.102.8 కోట్లు ఇచ్చేందుకు సంబంధించిన ఫైలుపై శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఇందుకు సంబంధించి బీఆర్ఓ (బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్లు) ఒకట్రెండు రోజుల్లో రానున్నాయి. దీంతో నిధులు విడుదలైన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసేందుకు బీసీ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ బకాయిల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా 12,218 మందికి లబ్ధి కలగనుంది. అదేవిధంగా ఫెడరేషన్లకు సంబంధించిన బకాయిలు విడుదల కావడంతో సంఘాలకు సాంత్వన లభించినట్లైంది. స్వయం ఉపాధికి చేయూత... స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని భావిస్తోంది. ఈక్రమంలో కార్పొరేషన్, ఫెడరేషన్లకు కేటాయించిన నిధులను క్రమం తప్పకుండా విడుదల చేయనుంది. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్, 12 బీసీ ఫెడరేషన్ల బకాయిల విడుదలకు పచ్చజెండా ఊపింది. 2016–17 వార్షికంలో నిధుల కేటాయింపు జరగలేదు. దీంతో లబ్ధిదారుల ఎంపిక సైతం నిలిచిపోయింది. ఈక్రమంలో 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి కేటాయించిన నిధులను వేగవంతంగా విడుదల చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. అదేవిధంగా ఫెడరేషన్లకు కూడా సంతృప్తికర స్థాయిలో కేటాయింపులు చేస్తామన్నారు. ఈమేరకు ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
బీసీలు రాజకీయంగా ఎదగాలి
- వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య నంద్యాల వ్యవసాయం: బడుగు, బలహీన వర్గాలు వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగాలని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య అన్నారు. బహుజన సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మంజుల సుబ్బరాయుడు అధ్యక్షతన గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో బీసీ గర్జన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా నిష్పత్తి ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే.లక్ష్మినరసింహయాదవ్ మాట్లాడుతూ.. ఫెడరేషన్ల ద్వారా కులవృత్తికి సంబంధించిన సబ్సిడీ రుణాలను అందించాలన్నారు. కార్యక్రమంలో శివరుద్రయ్య, బీసీ కులాల ఐక్యవేదిక అ«ధ్యక్షుడు శేషఫణి, మాల మహానాడు జాతీయ అ«ధ్యక్షుడు శీలం ఓబుళపతి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిడతల వెంకటస్వామి, వాల్మీకి నాయకులు పరమటూరు శేఖర్, అశోక్‌కుమార్, బీసీ జనసభ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ విద్యలో బీసీలే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలు(బీసీ) ఉపాధ్యాయవిద్యలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సులను అభ్యసిస్తున్నవారిలో 67 శాతం బీసీలు, ఆ తరువాత స్థానంలో ఎస్సీలు ఉన్నారు. రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాల వారీగా, వివిధ కోర్సులను అభ్యసిస్తున్నవారి వివరాలను బీసీ కమిషన్ విద్యాశాఖ నుంచి సేకరించింది. గత ఏడాది ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసినవారిలోనూ బీసీలే అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. టెట్‌కు హాజరైన వారిలో 58.99 శాతం బీసీలుండగా, ఆ తరువాత 18.77 శాతంతో రెండో స్థానంలో ఎస్సీ అభ్యర్థులు ఉన్నట్లు తేల్చింది. పరీక్షకు మొత్తంగా 3,40,567 మంది హాజరైతే అందులో బీసీలు 2,00,922 మంది ఉండటం గమనార్హం. 85 శాతం గ్రామీణ ప్రాంతాల వారే.. ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్న వారిలో 85 శాతం మంది అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయ విద్యపై ఆసక్తి చూపుతున్న వారిలో పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తక్కువేనని పేర్కొంటున్నారు. అందులోనూ వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులే ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా త్వరగా జీవితంలో స్థిరపడవచ్చన్న భావనే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఇంటర్మీడియట్ తరువాతే డీఎడ్ చేసే అవకాశం ఉన్నందునా ఎక్కువ కాలం చదివే అవకాశంలేని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు డీఎడ్ పూర్తి చేసి ప్రభుత్వ రంగం లేదా ప్రైవేటు రంగంలో స్థిరపడవచ్చన్న భావనే ఇందుకు కారణమని చెబుతున్నారు. టెట్‌లో అర్హత సాధించిన ఓసీలు 10 శాతమే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఓసీలే తక్కువగా అర్హత సాధిస్తుండగా, ఎస్సీల్లో ఎక్కువ అర్హత శాతం ఉంది. ఎస్సీల తరువాత ఎస్టీలు ఎక్కువ శాతం అర్హతను సాధిస్తున్నారు. బీసీలు తక్కువ అర్హత పొందుతున్నారు. అయితే ఇందుకు కారణం అర్హత మార్కుల విధానమే. అర్హత మార్కుల విధానం ఓసీలకు 60 శాత, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం ఉంది. గత ఏడాది నిర్వహించిన టెట్‌లో ఓసీలు 10 శాతం మందే అర్హత సాధించగా, బీసీలు 29.40 శాతం మంది, ఎస్సీలు 53.68 శాతం మంది, ఎస్టీలు 38.22 శాతం మంది అర్హత సాధించారు. -
మే 28న బీసీల సమర శంఖారావం: జాజుల
హైదరాబాద్: తమిళనాడు తరహాలో రాష్ట్రం లో కూడా దామాషా ప్రాతిపదికన రిజర్వే షన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను 25% నుంచి 50%నికి పెంచాలని, లేనిప క్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో బీసీల పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ విషయాలపై మే 28న నగరంలో బీసీల సమర శంఖా రావం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బీసీలంతా ఈ శంఖారా వానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్లో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు ప్రకారం రిజర్వే షన్లు పెంచాలని తాము పోరాటం చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. మా విషయంలో చూపని తొందర మైనార్టీ రిజర్వేషన్లలో మాత్రం ఎందుకు ప్రదర్శించారని ప్రశ్నించారు. -
బీసీలకు అరచేతిలో వైకుంఠం...
కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: బీసీలకు అరచేతిలో వైకుంఠం చూపి ఓట్లు దండుకోవాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మంగళవారం బంజారా ఫంక్షన్ హాలులో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ‘యాదవ, కురుమ, గొల్ల’ల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలను మోసం చేసే చర్యలను తిప్పికొట్టేందుకు, హక్కుల పరిరక్షణకు గ్రామగ్రామాన ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చైతన్య సదస్సులను నిర్వ హించాలని పిలుపునిచ్చారు. బీసీల మద్దతు కోసం తాయిలాలు ప్రకటిస్తున్నారే తప్ప సంక్షేమ పథకాల అమల్లో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. సీఎం మాటలకు బడుగు, బలహీన వర్గాలు మోసపోయే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలోనూ బీసీలు బీజేపీ వైపు చూస్తున్నారని, తమ పార్టీకి మద్దతునిస్తున్నారని చెప్పారు. మరోవైపు మోదీ ప్రభుత్వం బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదాను కల్పించడంపై ధన్యవాదాలు తెలుపుతూ ఈ సదస్సు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాటం నర్సింహ యాదవ్, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఎమ్మెల్యే చింత రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై కేసీఆర్ స్పష్టీకరణ
-
బీసీలపై దాడులపై కేఈ మౌనం వీడాలి
-
బీసీలపై దాడులపై కేఈ మౌనం వీడాలి
డోన్ టౌన్: డోన్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి అనుచరులు చేస్తున్న అరాచకాలపై ఆయన మౌనం వీడాలని పీఏసీ చైర్మన్ బుగ్గన డిమాండ్ చేశారు. ఆదివారం తన స్వగృహంలో బుగ్గన డోన్ జెడ్పీటీసీ శ్రీరాములుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ వేలాల సందర్భంగా శుక్రవారం టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారు బీసీలు కాదా అని కేఈని నిలదీశారు. బీసీలకు పెద్దదిక్కుగా చెప్పుకుంటున్న కేఈ బీసీలపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం దారుణమన్నారు. అధికారపార్టీ ముసుగులో కొందరు పట్టణంలోని ప్రధానమైన వనరులను కొల్లగొడుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నారు. ఆర్యవైశ్యులకు చెందిన విలువైన స్థలాలను కబ్జాచేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఏకపక్షంగా టెండర్లను దక్కించుకునేందుకే అధికార పార్టీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కేఈ కృష్ణమూర్తి తమ అనుచరులను అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ఏదో ఒక రోజు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
అన్ని కులాల వారికీ సమన్యాయం
రాజ్యాంగబద్ధంగానే కులాల మార్పు, చేర్పులు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ బీసీల్లో కాపుల చేర్పుపై కాకినాడలో ప్రజాభిప్రాయసేకరణ కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయమై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు జస్టిస్ మంజునాథ కమిషన్ బుధవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన విచారణను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. కమిషన్‌కు తమ వాదనలు, ఆవేదనలు వినిపించేందుకు జిల్లా నలుమూలల నుంచీ బీసీ సామాజికవర్గాల వారు, కాపు సామాజిక వర్గాల వారు పెద్ద సంఖ్యలో కాకినాడకు తరలి వచ్చారు. తమ వాదనలను పూర్తిగా వినిపించకుండా ఆటంకం కల్పించారని బీసీ ప్రతినిధులు కమిషన్ ముందు నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. కాగా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ సీఎంకు బాకా ఊదడానికే వచ్చారని ఆ సామాజిక వర్గీయులు విరుచుకుపడ్డారు. కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆర్ఎంసీ కళాశాల పరిసరాలు, నగరంలో ముఖ్యకూడళ్లలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : అన్ని కులాల వారికీ సమన్యాయం చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేఎల్ మంజునాథ పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే అంశం, వెనుకబడిన వివిధ కులాల వారి గ్రూపుల మార్పుపై ఆయన నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన బీసీ కమిషన్ బుధవారం కాకినాడ రంగరాయ వైద్యకలాశాల ఆడిటోరియంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ మంజునాథ మాట్లాడుతూ అన్ని కులాల వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామన్నారు. ఇప్పటికే 12 జిల్లాల్లో నిర్వహించగా తూర్పు గోదావరి జిల్లా 13వది అన్నారు. 1994 నుంచి అనేక కులాల వారు బీసీల్లో చేర్పు కోసం , గ్రూపుల మార్పు కోసం దరఖాస్తులు పెట్టుకున్నారని చెప్పారు. కమ్మకులం తప్ప అన్ని అగ్రకులాలూ బీసీ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు. అన్ని కులాల వారి ఆర్థిక, సామాజిక తదితర స్థితిగతులు తెలుసుకొనేందుకు సమగ్ర పల్స్ సర్వే చేయాలని కమిషన్ ప్రభుత్వాన్ని కోరిందన్నారు. ఈ సర్వేలో అందరూ పాల్గొని ఉంటారని కమిషన్ భావిస్తోందన్నారు. ఈ సర్వే అన్ని జిల్లాల్లో చేపట్టి ఆరు రకాల ప్రశ్నావళిని కమిషన్ వెబ్సైట్లో పెట్టామన్నారు. మార్పులు కోరిన కులాలు, చేర్పులు కోరిన కులాలకు సంబంధించి చర్యలు తీసుకోవడానికి ప్రజాభిప్రాయం చాలా ముఖ్యమైనదిగా కమిషన్ భావిస్తోందన్నారు. ఏ కులాన్నైనా బీసీల్లో చేర్చాలంటే నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించరాదనేది నిబంధన అన్నారు. దీనికి బీసీ కమిషన్ కట్టుబడి ఉంటుందన్నారు. బీసీల్లో గ్రూపుల మార్పు లేదా బీసీల్లో చేర్పు కోరుతున్న వారు దానికి గల అన్ని అర్హతలతో పాటు పూర్తి సమాచారాన్ని కమిషన్‌కు ఇవ్వాలన్నారు. మాదే కులమో మాకే తెలియదు.. తోలు బొమ్మల వారు ఏ కులానికి చెందిన వారో ప్రభుత్వం చెప్పటం లేదని ఆ సామాజికవర్గానికి చెందిన బాలకృష్ణ వాపోయారు. తమని బీసీలో చేర్చాలని కోరగా రాష్ట్రంలో అన్ని తోలు బొమ్మలాట వర్గాల వారు ఒకే కులం పేరుతో ముందుకు వస్తే కమిషన్ పరిశీలిస్తుందని జస్టిస్ మంజునాథ చెప్పారు. యాదవులను బీసీ ‘డి’ నుంచి బీసీ ‘ఎ’కు మార్చాలని ఆ కులానికి చెందిన కుండల సాయికుమార్ కోరారు. కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన నాగిరెడ్డి భాస్కర్ కూలి పనులతో జీవిస్తున్న తమని బీసీ ‘డి’ నుంచి ‘ఎ’కు మార్చాలని కోరారు. శాలివాహన కులానికి చెందిన వీరభద్రరావు మాట్లాడుతూ కుమ్మర్లుగా పిలిచే తాము స్టీల్ సామగ్రి వచ్చాక కుల వృత్తికి దూరమయ్యామని తమ కులాన్ని బీసీ నుంచి ఎస్టీలోకి మార్చాలని కోరారు. భోజన విరామం అనంతరం కాపు కులాలను బీసీల్లో చేర్చాలని కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ కోరారు. కాపులు దుర్భరమైన, భద్రత లేని వృత్తులు నిర్వహించడంతో పాటు కూలి, పాచిపనులు కూడా వెళుతూ జీవనాన్ని గడుపుతున్నారని వివరించారు. ఈ స్థితి గతులను పరిగణనలోనికి తీసుకొని న్యాయం చేకూర్చాలని కోరారు. కాపు నాయకులు మాట్లాడాక తమకు ప్రతిసారి అవకాశం ఇవ్వాలని కొందరు బీసీ ప్రతినిధులు కోరగా చైర్మన్నిరాకరించారు. మొదట వారు చెప్పింది వినాలని, తర్వాత అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ దశలో బీసీ నాయకులు వాదోపవాదాల నడుమ ప్రజాభిప్రాయ సేకరణ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం జస్టిస్ మంజునాథ అర్ధాంతరంగా ప్రజాభిప్రాయసేకరణను ముగించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన నిజమైన వెనుక బడిన తరగతులు వారి హక్కులను పరిరక్షించాలని కోరుతూ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రజాభిప్రాయ సేకరణలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వేంకటేశ్వరరావు, ప్రొఫెసర్ మల్లెల పూర్ణచంద్రరరావు, ప్రొఫెసర్ శ్రీమంతుల సత్యనారాయణ, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ –2 రాధాకృష్ణమూర్తి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం జ్యోతి, కాపు ఉద్యమ జేఏసీ నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, కల్వకొలను తాతాజీ, ఆకుల రామకృష్ణ, ప్రూటీ కుమార్, సంగిశెట్టి అశోక్, బీసీ నాయకులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పాటి శివకుమార్, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కుట్రలో భాగంగానే రామానుజయ హాజరు : కాపునేతలు కుట్రలో భాగంగానే కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యారని కాపు నేతలు మిండగుదిటి మోహన్, పేపకాయల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు వాపోయారు. ప్రజాభిప్రాయ సేకరణ అర్ధాంతరంగా ముగిశాక వారు విలేకరులతో మాట్లాడుతూ బీసీలు మాట్లాడుతున్నంత సేపు తాము ఏమీ మాట్లాడలేదని, తాము మాట్లాడుతుంటే బీసీలు కావాలనే రభస చేశారని, కాపు కార్పొరేషన్ చైర్మన్ పేరు తాము ఇచ్చిన జాబితాలో లేకున్నా అతనితో ఎలా మాట్లాడించారని వాపోయారు. కాగా కాపు కల్యాణమండపంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ఇది ప్రభుత్వ ప్రచార వేదికలా రామానుజయ మాట్లాడారని విమర్శించారు. ప్రజాభిప్రాయసేకరణ ప్రభుత్వ పథకాల ప్రచారం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వేర్వేరుగా విచారణ చేపట్టాలన్నారు. -
జాట్లకు రిజర్వేషన్లు హళక్కేనా?
న్యూఢిల్లీ: హర్యానాతోపాటు కేంద్రం ఉద్యోగాల్లో ఓబీసీల తరహాలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలో సోమవారం జాట్లు తలపెట్టిన ఆందోళనను తాత్కాలికంగా విరమింప చేయడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి విజయం సాధించాయి. తలనొప్పిగా మారిన జాట్ల రిజర్వేషన్ల అంశం నుంచి తాత్కాలికంగా తప్పుకునేందుకు లేదా ఉపశమనం పొందేందుకు ఈ విజయం ఉపయోగపడుతుంది తప్ప, శాశ్వత పరిష్కారానికి ఎలాంటి దోహదం చేయదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందేందుకు తమను కూడా ఇతర వెనకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్లమెంట్‌కు భారీ ఎత్తున ప్రదర్శన జరిపేందుకు జాట్లు సమాయత్తమవడం, ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకునేందుకు నగరంలో 144వ సెక్షన్ కింద కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించడం తెల్సిందే. అఖిల భారత జాట్ అరక్షన్ సంఘర్ష్ సమితి చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారకూడదనే ఉద్దేశంతో ఇటు కేంద్ర మంత్రులు, అటు మనోహర్ లాల్ కట్టర్ చర్చలు జరిపి తాత్కాలికంగా జాట్లు ఆందోళన విరమించేలా చేశారు. జాట్ల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని, జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ కొత్త చైర్మన్, సభ్యులను నియమించాక ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని కట్టర్ ఆందోళనకారులకు నచ్చచెప్పారు. ఇదే డిమాండ్‌పై గతేడాది జాట్లు హర్యానాలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి 30 మంది మరణించారు. అపార ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఆందోళనకారులపై దాదాపు 21వేల క్రిమినల్ కేసులు దాఖలయ్యాయి. వాటిని ఎత్తివేయడం కూడా నేడు జాట్ల ప్రధాన డిమాండ్లలో ఒక్కటి. అందుకు ప్రభుత్వం కూడా సుముఖంగానే ఉంది. కోర్టుల కారణంగా రిజర్వేషన్ల సమస్య ప్రభుత్వానికి సంక్లిష్టంగా తయారైంది. ఇందులో కోర్టుల తప్పేమి లేదు. ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి విరుద్ధంగా హామీలు ఇవ్వడమే సమస్యకు ప్రధాన కారణం. అటల్ బిహారి వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999లో ఈ సమస్య ప్రారంభమయింది. రాజస్థాన్‌లో జాట్లకు ఓబీసీ హోదా కల్పిస్తామంటూ నాడు ఆయన హామీ ఇచ్చారు. పర్యావసానంగా ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికలప్పుడు ఇది ఎన్నికల అంశమై కూర్చుంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లోని జాట్లకు ఓబీసీ హోదాను కల్పిస్తామని యూపీఏ హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా జాట్ల డిమాండ్లపై సానుకూలంగానే స్పందించింది. జాతీయ బీసీ కమిషన్ అభిప్రాయాన్నే ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న కోర్టులు ప్రభుత్వ ప్రతిపాదనలను కొట్టివేస్తూ వస్తున్నాయి. ఈసారి జాతీయ బీసీ కమిషన్ అభిప్రాయన్నే మార్చి వేస్తామన్న ఉద్దేశంతో కొత్త చైర్మన్, కొత్త సభ్యుల నియామకం తర్వాత జాట్ల రిజర్వేషన్ల ప్రక్రియను చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. బీసీల ప్రయోజనాలకు భిన్నంగా బీసీ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా? కేంద్రం ఒత్తిడికి ఒకవేళ తీసుకున్నా ఆ నిర్ణయం అత్యున్నత న్యాయస్థానం ముందు నిలబడుతుందా? సమాజంలో కులాల వెనకబాటుతనాన్నే ప్రధాన కొలమానంగా తీసుకునే సుప్రీం కోర్టు సామాజికంగా అభివద్ధి చెందిన జాట్లను ఓబీసీల్లో చేర్చేందుకు అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నలు ప్రస్తుతానికి సమాధానం దొరకనివే. జాట్ల అభివద్ధికి సరైన చర్యలు తీసుకోవడంలో మొదటి నుంచి ప్రభుత్వాలు అలసత్వ ధోరణిని అవలంబించడం వల్ల నేడు అన్ని సమస్యలకు పరిష్కారం రిజర్వేషన్లు కల్పించడమేనన్న భ్రమ అందరిలో ఏర్పడింది. -
బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం
కర్నూలు(అర్బన్): రాష్ట్ర బడ్జెట్లో బీసీ కుల వృత్తిదారులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మికాంతయ్య, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవపూజ ధనుంజయాచారి ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం స్థానిక బీసీ భవన్లో ‘ బీసీలు – బడ్జెట్ ’ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెర్లకు రూ.25 కోట్లు, విశ్వ బ్రాహ్మణులకు రూ.30 కోట్లు, ఈడిగలకు రూ.35 కోట్లు, సగరులకు రూ.25 కోట్లు, వాల్మీకులకు రూ.25 కోట్లు, మేదరులకు రూ.20 కోట్లు, భట్రాజులకు రూ.15 కోట్లు కేటాయించారన్నారు. తక్కువ జనాభా ఉన్న కాపులకు రూ.1000 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.75 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ఓసీలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయమా ? అని వారు ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తమది బీసీల ప్రభుత్వం అని చెప్పుకుంటూ వారికే తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బడ్జెట్లో బీసీలకు జరిగిన అన్యాయంపై పునః సమీక్షించి రూ.200 కోట్లు కేటాయించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి కులానికి జనాభా ప్రకారం బడ్జెట్‌ను కేటాయించాలన్నారు. నాయకులు జలం శ్రీను, భాస్కరప్ప, కృష్ణోజిరావు, సర్వేశ్వరబాబు, చిన్న రామయ్య, మల్లికార్జున, రంగమునినాయుడు, డీవీ చంద్ర, పట్నం రాజేశ్వరి, గోగుల సుగుణమ్మ, పోతన, చంద్రికమ్మ, రామకృష్ణ, తిమ్మరాజు, వెంకటస్వామి పాల్గొన్నారు. -
అణచివేత యత్నాన్ని ఐక్యంగా తిప్పికొడదాం
-మంజునాథ కమిషన్‌కు మన గళాన్ని వినిపిద్దాం -జిల్లా బీసీ సంఘాల జేఏసీ సమావేశంలో నేతల పిలుపు రావులపాలెం : ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రభుత్వాలు బీసీలను అణదొక్కాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కాపులను బీసీల్లో చే ర్చేందుకు వేసిన మంజునాథ కమిషన్ వద్దకు జిల్లాలోని నలుమూల నుంచి లక్షలాదిగా తరలివచ్చి ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించాలని జిల్లా బీసీ సంఘం నాయకులు పిలుపు నిచ్చారు. బుధవారం రావులపాలెంలోని కోనసీమ వర్తక సంఘ కల్యాణ మండపంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రారావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బీసీ కులాల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ నాయకుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్వాతంత్య్ర భారతదేశంలో 70 ఏళ్లుగా బీసీలు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, బీసీ జాబితాలో కాపులను చేర్చే ప్రయత్నాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ నెల 22న కాకినాడ వస్తున్న మంజునాథ కమిషన్‌కు బీసీల సమస్యలను, కాపులను చేర్చడం వల్ల కలిగే నష్టాలను సమగ్రంగా వివరించేందుకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీలు తమ వాదన వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతుండటం సమంజసం కాదన్నారు. గ్రామాల్లోకి వెళ్ళి మైక్ ద్వారా ప్రచారం చేసుకునే ప్రయత్నాలకు పోలీస్‌శాఖ ద్వారా అవాంతరాలు కల్పిస్తున్నారన్నారు. ఇప్పటికే రెండు సార్లు జిల్లాలో మంజునాథ కమిషన్ పర్యటన వాయిదా వేసి 12 జిల్లాల్లో ముగిశాక ఆఖరిగా ఇక్కడ పర్యటిస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీలు ఐక్యతను చూపేందుకు సంసిద్ధులుగా ఉండాలన్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడంపై వ్యతిరేకతను కాపుల కవ్వింపు చర్యలను లెక్క చేయకుండా శాంతియుతంగా మంజునాథ కమిషన్‌కు వినిపించాలన్నారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీల్లో అభివృద్ధి చెందిన కాపులను చేర్చడం అన్యాయమన్నారు. కొత్తపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు, రావులపాలెం మండలం అధ్యక్షుడు ఇళ్ళ సతీష్ మాట్లాడుతూ ఇప్పటికే కొత్తపేట ఏఎంసీ చైర్మన్ పదవి ఎంపికలో బీసీలు అన్యాయానికి గురయ్యారన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే వార్డు మెంబరు నుంచి ఉన్నత పదవుల వరకూ బీసీలు అణగదొక్కబడతారని కమిషన్‌కు వివరించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మరుకుర్తి దుర్గాయాదవ్, జిల్లా గౌడ శెట్టిబలిజ సంఘం కన్వీనర్ కుడుపూడి పార్థసారథి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ తులసి, ఎంపీపీ కోట చెల్లయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యులు బొక్కా వెంకటలక్ష్మి, అప్పారి విజయకుమార్, గుబ్బల వీర్రాజు, గుబ్బల సుబ్రహ్మణ్యం, కడలి ఈశ్వరీ, పిల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను బిచ్చగాళ్లనుకుంటున్నారా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ఇవ్వడానికి కేసీఆర్ దానకర్ణుడు.. బర్రెలు, గొర్రెలు తీసుకోవడానికి బీసీలు బిచ్చగాళ్లు అన్నట్టుగా చూస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేయదనే భయంతో బీసీలకు తాయి లాలను ఆశ చూపిస్తున్నారన్నారు. బర్రెలు, గొర్రెలు కాసుకుం టూ బీసీలు చదువుకోవద్దా అని ప్రశ్నించారు. మహిళలు ధైర్యంగా మాట్లాడాలని చెబుతున్న ఎంపీ కవిత.. ముందుగా కేబినెట్లో మహిళలకు అవకాశం ఇవ్వని కేసీఆర్‌ను ప్రశ్నించాలని సూచించారు. కేసీఆర్ ఇంటిలోనే అన్ని ఉద్యోగాలు: రవీంద్ర నాయక్ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారని మాజీ మంత్రి డి.రవీంద్రనాయక్ ఆరోపించారు. ప్రజల ను రెచ్చగొట్టి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన కుటుం బంలోనే హరీశ్, కేటీఆర్‌లకు మంత్రి పదవులిచ్చారని, కుమార్తె కవితను ఎంపీని చేశారని అన్నారు. ఈ మేరకు 22 ప్రశ్నలతో కూడిన లేఖను కేసీఆర్‌కు రాశారు. -
బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేయాలి
హన్మకొండ : బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేయాలని బీసీ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎదునూరి రాజ మొగిలి, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. బీసీ ఉప ప్రణాళిక అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద బీసీ సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివా రం ఈదీక్షలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గత రెండు బడ్జెట్లలో బీసీలపై ప్రభుత్వం వి వక్ష చూపిందని, రెండు శాతం మాత్రమే కేటాయింపులు చేసిందన్నారు. 2017–2018 బడ్జెట్లో బీసీల అభివృద్ధికి పెద్దపీట వేయాలని, ఈ సమావేశాల్లోనే బీసీ ఉప ప్రణాళికని ప్రకటిం చాలని డిమాండ్‌చేశారు. బీసీలను విస్మరిస్తే రాబోయే ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్ప ష్టం చేశారు. బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షు డు బూర రవి మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్ర భుత్వం క్రిమిలేయర్ విధానాన్ని తీసుకురావడం ద్వా రా బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. బీసీల కు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీక్షలో బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గట్టు కోటేశ్వర్, ఎం.చందర్, ఎం.సాంబయ్య, కాశబోయిన రమేష్, బి.శ్రీనివాస్, బి.ఓంకార్, బీసీ సంఘాల నాయకులు తిరునహరి శేషు, కోల జనార్దన్, సాయిని నరేందర్, దిలీప్, ఎ.కుమారస్వామి, ఎ.సాంబయ్య, ఎ.చంద్రనారాయణ, జీఓ.భాస్కర్, సూరం నిరంజన్ కూర్చున్నారు. -
బీసీలు సంఘటితం కావాలి
కాపులను బీసీల్లో చేర్చితే రోడ్డెక్కి ఉద్యమాలు 22న చలో కాకినాడకు సన్నాహక ఏర్పాట్లు రాష్ట్ర బీసీ కులాల జేఏసీ కన్వీనర్ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్ : కాపులను బీసీల్లో చేర్చితే సహించేది లేదని... అదే జరిగితే బీసీలు రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని రాష్ట్ర బీసీ కులాల జేఏసీ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీలంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అమలాపురంలోని శెట్టిబలిజ సంఘం భవనంలో ఆదివారం సాయంత్రం జరిగిన జిల్లా బీసీ కులాల ప్రతినిధుల సమావేశానికి కుడుపూడి అధ్యక్షత వహించి ప్రసంగించారు. రాష్ట్ర బీసీ జేఏసీ ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరై ఈనెల 22న జిల్లాకు మంజునాథ కమిషన్ వస్తున్న సందర్భంగా నిర్వహించనున్న చలో కాకినాడ కార్యక్రమంలో ప్రతి బీసీ సామాజిక వర్గీయుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపులను బీసీల్లో ఎందుకు చేర్చకూడదో..చేర్చితే బీసీలకు నష్టాలు ఎలా ఉంటాయో గణాంకాలతో సహా కమిషన్‌కు వివరించాలని బీసీ జేఏసీ నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే తమ అభ్యంతరాలతో వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు వేసేందుకు కూడా బీసీలు సిద్ధం కావాలని సూచించారు. బీసీలను అణగదొక్కటానికే కాపులను రంగంలోకి దించారని ఆరోపించారు. ఇది చంద్రబాబు పన్నుతున్న కుట్రగా అభివర్ణించారు. సూర్యనారాయణరావు మాట్లాడుతూ బీసీల్లో నేటికీ వెలుగులోకి రాని దాదాపు 40 సంచార జాతుల ఉనికి గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. బీసీలకు రుణాలు, రాయితీలు వద్దని...రాజ్యాధికారాన్ని అందుకునే రిజర్వేషన్లు సంపూర్ణంగా కల్పించాలని డిమాండ్ చేశారు. సంచార జాతుల వారికి కనీసం ఆధార్ కార్డులు కూడా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయటంలేదని ధ్వజమెత్తారు. ఆ జాతుల వారిని గుర్తించి ప్రభుత్వమే ఉన్నత విద్య, కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించాలని రాష్ట్ర గంగిరెడ్ల సామాజిక సంఘం నాయకుడు అమ్మోరు అన్నారు. రాష్ట్ర బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, బీసీ నేతలు గుత్తుల సాయి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, మల్లాడి సత్తిబాబు, గుత్తుల శ్రీనివాసరావు, కుడుపూడి బాబు, వాసంశెట్టి సత్యం, యిళ్ల సత్యనారాయణ, అనుపోజు శ్రీనివాస్, పట్నాల వెంకటరమణ, దొమ్మేటి రాము, బండి రాధమ్మ తదితరులు ప్రసంగించారు. 22న చలో కాకినాడ కార్యక్రమం సన్నాహక ఏర్పాట్లపై సమావేశం విస్తృతంగా చర్చించింది. -
హక్కులను హరిస్తే సహించేది లేదు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు రావులపాలెం(కొత్తపేట) : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బీసీల్లో చేర్చాలనే కోరిక అసమంజసమైనదని దీనిని తిరస్కరిస్తూ మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం రావులపాలెం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ, ఆర్థిక, వ్యాపార, తదితర అన్ని రంగాల్లో కాపులు ముందంజలో ఉన్నారన్నారు. సంచార జీవులు వివక్షకు గురైన కులాలను గుర్తించి ఆనాడు అంబేడ్కర్ బీసీ రిజర్వేషన్లు కల్పించారన్నారు. నేడు కాపులు వివక్షకు గురికాలేదని వారు సంచార జీవులుకాదని బీసీల్లో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబుకు చేర్చే అధికారం లేదన్నారు. మంజునాథ కమిషన్ కేవలం బీసీ కులాల స్థితిగతులను అధ్యయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీయే తప్ప కాపును బీసీల్లో చేర్చేందుకు వేసిన కమిటీ కాదని ఆయన స్పష్టం చేశారు. మంజునాథ కమిషన్ ఇప్పటికే రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిందని తూర్పుగోదావరి జిల్లా మిగిలిఉందని చెప్పారు. ఇప్పటికీ బీసీ కులాలు అనుభవిస్తున్న సాంఘిక, విద్యాపరమైన వెనుకబాటుతనం గురించి కమిషన్‌కు వివరించామన్నారు. కాపు సంఘ నాయకులు కూడా తాము సాంఘికంగా ఎలా వెనుకబడి ఉన్నామో కమిషన్‌కు ఆధారాలు చూపలేకపోయారని, ఈ పరిస్థితుల్లో కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యం కాదనే నివేదికను నిస్పక్షపాతంగా ఇవ్వాల్సి ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లోను, స్థానిక సంస్థల్లోను రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతూ నివేదిక సమర్పించడం ద్వారా బీసీలకు న్యాయం చేయాలని కమిషన్‌ను కోరామన్నారు. బీసీ రిజర్వేషన్ హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లిన సహించేది లేదని న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు, నియోజకవర్గ అధ్యక్షుడు మన్నే నాగేశ్వరరావు, రావులపాలెం, కొత్తపేట మండలాల అధ్యక్షుడు ఇళ్ల సతీష్, గుబ్బల వీర్రాజు, గుబ్బల వెంకటరమణ పాల్గొన్నారు. -
సత్యాగ్రహం
బీసీలను రెచ్చగొడుతున్న బాబు - హామీని అమలు చేయకుండా ఎదురు దాడి - కాపుల నిరసనలపై ఉక్కుపాదం - ఊపిరున్నంత వరకు పోరాటం - మార్చి 26న న్యాయవాదులతో సమీక్ష - కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కర్నూలు(అర్బన్): కాపులకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం చంద్రబాబు..బీసీలను రెచ్చగొడుతున్నారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలనే డిమాండ్‌తో కర్నూలు నగరంలోని మెగాసిరి ఫంక్షన్హాల్లో ఆదివారం చేపట్టిన సత్యాగ్రహ దీక్షలకు ఆయన హాజరయ్యారు. ముందుగా నగరంలోని శ్రీ కృష్ణదేవరాయలు, దామోదరం సంజీవయ్య విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం దీక్షా వేదిక నుంచి మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయంలో చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. హామీని అమలు చేయకుండా.. కాపులు నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించే ప్రాంతాల్లో సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ జాబితాలో ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను ఓసీ జాబితాలో చేర్చేందుకు భారత రాజ్యంగ నిర్మాత డా.బీఆర్ అడ్డుకున్నారన్నారు. అయితే రాజకీయ పరిణామాల్లో ఓసీలుగా మారిన ఆయా కులాలను దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య తిరిగి బీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. కృతజ్ఞతగా...అంబేద్కర్, దామోదరం సంజీవయ్య జయంతి, వర్ధంతుల్లో పాల్గొనాలని కోరారు. తాము కొత్తగా బీసీ రిజర్వేషన్లు కోరడం లేదని, గతంలో ఉన్నవి తిరిగి పునరుద్ధరించాలని అడుతున్నామన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి.. 9వ షెడ్యూల్లో చేర్చి.. కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధం.. ఎంతో సున్నితమైన మనసు ఉన్న తనను ఉద్యమకారుడిగా మార్చింది చంద్రబాబే అని ముద్రగడ అన్నారు. జాతి శ్రేయస్సు కోసం జరుగుతున్న పోరాటంలో చావోరేవో తేల్చుకుంటామని ఉద్విగ్నంగా చెప్పారు. రాజకీయాలకు, గ్రూపులకు అతీతంగా ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొనాలని, ముఖ్యంగా మహిళలు కూడా ఉద్యమ పథాన ముందుండాలన్నారు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టమంటే.. ప్రభుత్వం కేసులను పెడుతోందని విమర్శించారు. ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్న ఏ,బీ,సీ,డీల్‌లో కాకుండా క్రిమిలేయర్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కేవలం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన సరిపోదని, ఇచ్చిన హామీ మేరకు ఏడాది రూ.1000 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేయాలన్నారు. మార్చి 26న న్యాయవాదులతో సమీక్ష ... ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మార్చి 26వ తేదీన న్యాయవాదులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. మరో పది రోజుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సంఘ పెద్దలతో సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. అనుకున్న లక్ష్యం సాధించే ప్రక్రియలో తాము నిద్రపోమని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిద్ర పట్టకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముద్రగడ దీక్ష విరమించారు. సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల రామకృష్ణ, జిల్లా సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి నారాయణరెడ్డి, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డా.విజయశంకర్, అమరం నరసింహారెడ్డి, కొండా విజయ్, పీ నారాయణరెడ్డి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ వై సత్యనారాయణ, ఆర్జా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలపై కేసీఆర్ కపట ప్రేమ: వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో బీసీలకు రూ.6,738 కోట్లు కేటాయించినా కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టా రని, ఇప్పుడేమో బీసీల దృష్టి మళ్లించడానికి సీఎం కపట ప్రేమ చూపిస్తున్నారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని చెప్పిన సీఎం, దాని నుంచి తప్పించుకోవడా నికి బీసీలకు తాయిలాలను ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధులను కేటాయించాలని, వాటిని ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. -
పదివేలకోట్లు కేటాయించండి
ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ. 10వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్. కృష్ణయ్య, ర్యాగ అరుణ, జె. శ్రీనివాస్‌గౌడ్, వై సత్యనారాయణ, గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్ లతో కూడిన బృందం మంగళవారం సచివాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నిల మేనిఫెస్టోలో బీసీలకు రూ. 10వేల కోట్లు కేటాయిస్తామని హామీనిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. బీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్‌ను రూ. 150 కోట్లకు పెంచి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా కృషి చేయాలన్నారు. కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకొనే వారి పారితోషికంతో పాటు కల్యాణలక్ష్మి పథకం మొత్తాన్ని రూ. లక్షకు పెంచాలని వివరించారు. దీనిపై సీఎంతో చర్చించి బడ్జెట్లో నిధులు పెంచుతామని ఆర్థిక మంత్రి ఈటల హామీ ఇచ్చారని బీసీ నేతలు పేర్కొన్నారు. -
బీసీ ఓట్ల కోసమే కేసీఆర్ రాజకీయం
మాజీ ఎంపీ వి.హనుమంతరావు సాక్షి, హైదరాబాద్: బీసీల ఓట్లకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వల వేస్తున్నాడని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. మంగళవారంనాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకలు, చేపలు అంటూ సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయానికి దిగుతున్నాడని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మేల్కొనాలని సూచించారు. బీసీలను సమీకరించి భారీ బహిరంగసభను ఏర్పాటు చేయాలని, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని సభకు ఆహ్వానించాలని కోరారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం బీసీ రిజర్వేషన్లపై న్యాయం జరగదని అన్నారు. దళిత నేత, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మంత్రులు కూడా హాజరుకాకపోవడం దారుణమన్నారు. ఇది దళిత జాతిని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. -
కాపులను బీసీల్లో చేర్చొద్దు
- మంజునాథన్ కమిటీని అడ్డుకుంటాం - రాష్ట్ర బీసీ నాయకుల సమావేశం కొత్తపల్లి (పిఠాపురం) : కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, బీసీ నాయకుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన కొత్తపల్లి ఊరచెరువు సెంటర్లో వున్న సతీష్చంద్రభవన్లో మంగళవారం రాష్ట్ర బీసీ నాయకులు, స్థానిక నాయకులతో మాజీ ఎంపీటీసీ కాకరపల్లి గంగాధర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలు విద్య, ఉద్యోగ అవకాశాలనే కాక రాజకీయ పదవులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులను, హక్కులను కోల్పోతారన్నారు. కాకినాడలో జరగబోయే మంజునాథన్ కమిటీ పర్యటనను అడ్డుకుంటామన్నారు. కాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.1,000 కోట్లు ప్రకటించిందని, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చంద్రబాబు 50 శాతం సబ్సిడీతో రుణాలను అందిస్తున్నారన్నారు. బీసీల్లో 144 కులాలు వున్నాయని వారికి మాత్రం 30 శాతం సబ్సిడీ కల్పిస్తున్నారన్నారు. అధికారం కోసం ఎన్నికల్లో అడగని వాగ్దానాలు చేసి బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. 93 కులాల బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర గణేష్‌బాబు, జిల్లా రజిక సంఘం నాయకుడు మురముళ్ల రాజాబాబు, జిల్లా పద్మశాలి సంఘ నాయకుడు పొన్నగంటి సత్యనారాయణ, పెద్దాపురం నియోజకవర్గ బీసీ నాయకుడు పెంకె వెంకటేష్‌బాబు, జిల్లా మత్స్యశాఖ నాయకుడు తుమ్మల రమేష్, మండల శెట్టిబలిజల సంఘ నాయకుడు కొప్పిశెట్టి ఈశ్వరరావు, మదర్ఇండియా ఇంటర్నేషనల్ చైర్మన్, బీసీ ఐక్య సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లి తిరుపతిరావు పాల్గొన్నారు. -
ప్రత్యేక అధికారులు విధిగా పర్యటించాలి..
నల్లగొండ : ప్రత్యేక అధికారులు వారంలో ఒక రోజు విధిగా మండలాలను పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ గౌవర్ ఉప్పల్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా.. వారి జీవన ప్రమాణాలు మెరుగు పర్చేవిధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని సూచించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతి, హరితహారం, అంగన్వాడీ కేంద్రాల పనితీరు వంటి తదితర అంశాలపై తనిఖీ చేయాలన్నారు. యాదవులకు చేయూతనిచ్చేందుకు గొర్రెల పెంపకాన్ని ప్రోత్సోహించేలా ఎక్కువ మొత్తంలో యూనిట్లను మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని మిషన్ కాకతీయ చెరువులు, మధ్యతరహా, చిన్నతరహా చెరువులు, ప్రాజెక్టుల ప్రాంతాల్లో భారీగా చేప పిల్లలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించానల్నారు. ప్రతి కుటుంబం జీవన స్థితిగతులను అధ్యయనం చేసి వివిధ ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. దళిత, గిరిజన ప్రాంతాల్లో పర్యటించి మౌలిక వసతుల కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ‘క్లీన్ ఏ విలేజ్’ కింద గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలన్నారు. క్లీన్ ఏ ఏవిలేజ్ కార్యక్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక, జిల్లా రిసోర్స్ మ్యాప్‌లను వివిధ కార్యక్రమాల ద్వారా రూపొందించాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులను ప్రోత్సహించడంతో పాటు వారిని సన్మానించనున్నట్లు తెలిపారు. చేనేత, బీడీ కార్మికులకు గృహ నిర్మాణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు మంజూరు చేస్తారని, ఈ మేరకు వారి డేటాను సేకరించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులు అవసరమవుతాయో అంచనాలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్వో కీమ్యానాయక్, డీఆర్డీఓ ఆర్.అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ నియంత్రణ కేంద్రాల్లో సదుపాయాలు కల్పిస్తాం : కలెక్టర్ నల్లగొండ : జిల్లాలోని ఎయిడ్స్ నియంత్రణ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన రాష్ట్ర స్థాయి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు జిల్లాలోని ఎయిడ్స్ కేంద్రాల్లో లోటుపాట్ల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుతెచ్చారు. ఈ సందర్భంగా ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలోని 52 ఎయిడ్స్ నియంత్రణ కేంద్రాల్లో ఉన్నవారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన పెన్షన్లు, మందులు, పౌష్టికాహారంతోపాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు ప్రాజెక్టు డైరక్టర్ జాన్‌బాబు, ఏపీడీ రాంమోహన్, పాల్గొన్నారు. -
బీసీ లకు కార్పొరేషన్ రుణాలు అందాలి
ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(అర్బన్): జిల్లాలో అర్హులైన బీసీలందరికీ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కోరారు. గురువారం ఆమె తన నివాసంలో బీసీ కార్పొరేషన్ ఈడీ కె.లాలాలజపతిరావుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్ ద్వారా అందించిన రుణాలు, బీసీల ఆర్థిక స్థితిగతులపై ఆరా తీశారు. ఏయే పథకాలకు కార్పొరేషన్ రుణాలను అందిస్తున్నదని ప్రశ్నించారు. వివిధ బ్యాంకుల ఆర్థిక సహకారం, కార్పొరేషన్ సబ్సిడీతో బ్యాంకు లింకేజీ పథకాలను అమలు చేస్తున్నట్లు ఈడీ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 1500 మంది బీసీ లబ్ధిదారులకు దాదాపు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఖర్చు చేయడం జరుగుతున్నదని ఈడీ చెప్పారు. జిల్లాలో అధికంగా బీసీల జనాభా ఉన్న కారణంగా ఇంకా ఎక్కువ మందికి రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని ఎంపీ కోరారు. -
నేడు బీసీ సంచార కులాల సమావేశం
కర్నూలు(అర్బన్): స్థానిక శకుంతల కళ్యాణ మండపం వెనుకువున్న కమ్యూనిటీ హాల్లో బీసీ సంచార కులాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు గంగిరెద్దుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు జి. సీతన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అణగారిన, అట్టడుగున ఉన్న అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా కులాలకు చెందిన సంఘాల ప్రతినిధులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. -
బలిజలను తక్షణమే బీసీ జాబితాలో చేర్చాలి
-
బీసీల హక్కుల సాధనకై ఐక్య ఉద్యమాలు
– ప్రకాశం జెడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ నూకపాని బాలాజీ కర్నూలు(అర్బన్): పీడిత, అణగారిన, బీసీ వర్గాల హక్కుల సాధనకు దళిత బహుజనులంతా కలిసి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక శంకరాస్ డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం ద్వితీయ ఆవిర్భావ సదస్సు నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. మద్దిలేటియాదవ్ ఆధ్వర్యంలో బోయ శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బాలాజి మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వినయ్ మాట్లాడుతూ బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు వీరశేఖర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రానున్న ఎన్నికల్లో బీసీలు పోటీ చేసి విజయం సాధించాలన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సమాజ్‌వాది జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్ మాట్లాడుతూ పూలే ఆశయాల మేరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటాలు చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు, అనంతపురం, జిల్లాల అధ్యక్షులు శ్రీరాములు, రవి, ఎమ్మెల్సీ అభ్యర్థి అవ్వారు మల్లికార్జున, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి పోతన తదితరులు పాల్గొన్నారు. -
సీజీజీ పోర్టల్‌లో ‘స్వయం ఉపాధి’ వివరాలు
పొందుపరచాలని సీఎస్ ఆదేశం సాక్షి,, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారు లకు మంజూరైన పథకాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పోర్టల్‌లో పొందుపరచాలని అధికారులను సీఎస్ ప్రదీప్‌చంద్ర ఆదేశించారు. మంజూరైన స్వయంఉపాధి, లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన పథకాల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలన్నారు. మంగళ వారం సచివాలయంలో సంక్షేమ శాఖల్లో స్వయం ఉపాధి పథకాల అమలు తీరును సీఎస్ సమీక్షించారు. గుడుంబా బాధిత కుటుంబాలకు స్వయంఉపాధి కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని ఆదే శించారు. సంక్షేమానికి సంబంధించి ప్రతి శాఖ ద్వారా హాబిటేషన్లు, లబ్ధిదారుల వారీగా వివరాల సేకరణ, శాఖల వారీగా స్వయం ఉపాధి పథకాల మంజూరీని సమీక్షిస్తూ నెలవారీ కార్యాచరణ రూపొం దించుకోవాలన్నారు. అధికారులు అజయ్ మిశ్రా, సోమేశ్‌కుమార్,జలీల్, సందీప్ కుమార్, అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
జిల్లాకు రూ. 80.29కోట్లు మంజూరు
– కాపు ఎంఎస్ఎంఈల ద్వారా గ్రూపుకు రూ. 25లక్షల రుణం – బీసీ, కాపు కార్పొరేషన్ ఈడీ కె.లాలా లజపతిరావు ఎం.తిమ్మాపురం(మహానంది): కాపు, బీసీ కారొ్పరేషన్ల ద్వారా రుణాల పంపిణీకి కర్నూలు జిల్లాకు రూ. 80.29కోట్లు మంజూరు కానున్నట్లు బీసీ, కాపు కారొ్పరేషన్ ఈడీ కె.లాలా లజపతిరావు పేర్కొన్నారు. మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చిన ఆయన మండల కేంద్రంఎం.తిమ్మాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన రుణమేళాను సందర్శించారు. అనంతరం ఎంపీడీఓ నరసింహులు, బ్యాంకు మేనేజర్లతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో బీసీలకు 1790 మందికి ఒక్కొక్కరికి రూ. 2లక్షలు చొప్పున, 1400 మంది కాపులకు రూ. 2లక్షలు చొప్పున రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాపులకు ఎంఎస్ఎంఈ కింద 35 గ్రూపులకు (ఒక్కొక్క గ్రూపుకు రూ. 25లక్షలు ) 8.75కోట్లు విడుదలయ్యాయన్నారు రూ. 25లక్షల్లో రూ. 10లక్షలు సబ్సిడీ, రూ. 10లక్షలు బ్యాంకు రుణం, రూ. 5లక్షలు లబ్ధిదారుడి వాటా ఉంటుందన్నారు. ఫెడరేషన్ల ద్వారా 3887 మందికి రూ. 7.74కోట్లు ఇవ్వనున్నామన్నారు. రుణాల కోసం అర్హులు అందించిన దరఖాస్తులను ఆయా మండల పరిషత్ అధికారులు 48 గంటల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతరం ఆయన మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ధర్మకర్త బాలరాజుయాదవ్, నాయకులు రవిస్వామి, క్రాంతికుమార్ తదితరులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. -
గురుకులాలన్నింటికీ శాశ్వత భవనాలు
శాసనసభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన అన్ని గురుకుల పాఠశాలలకు ఒకే తరహా శాశ్వత భవనాలను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ భవనాల నిర్మాణానికిగాను డిజైన్లు తయారు చేస్తున్నామని, ఫిబ్రవరిలోపు అన్ని చోట్లా స్థలాలను సేకరించి మార్చిలో భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం శాసనసభలో వెల్లడించారు. సంక్షేమ గురుకులాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు హన్మంత్ షిండే, శంకర్‌నాయక్, శోభ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటివరకు అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించి మొత్తం 299 గురుకుల పాఠశాలలుంటే, తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండున్నరేళ్లలోనే 487 గురుకుల పాఠశాలలను అదనంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఒక్కో గురుకుల పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.23 కోట్ల చొప్పున రూ.11,200 కోట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. -
కటాక్షం.. ఎవరికో..!
• 6,973 యూనిట్లు - 60,991 దరఖాస్తులు • జిల్లాలో రుణాలకు వేలాదిగా అర్హులు • నామమాత్రంగా యూనిట్ల కేటారుుంపులు • అయోమయంలో నిరుపేద • ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, కాపులు • లబ్ధిదారుల ఎంపికలో కమిటీ సభ్యులు, ఎంపీడీఓల కీలక పాత్ర భాగ్యలక్ష్యి బంపర్ డ్రా..రండయ్యా రండి, ,రండమ్మా రండి..టికెట్ ధర కేవలం ఒక రూపాయే..ఆ అదృష్టవంతుడు ఎవరో తెల్లవారితే డ్రా.. సంచి తెచ్చుకోండి.. ఒక లక్ష తీసుకుపోండి అని ఒక వ్యక్తి వచ్చీ రాని తెలుగులో చెప్పేవాడు. చాలా సంవత్సరాల క్రితం జిల్లాలోని పలు ప్రధాన కూడలి ప్రాంతాలలో ఒక జట్కా బండి నుంచి మైక్‌లో వినిపించే మాటలు అవి. ఇప్పుడు నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసే రుణాల పరిస్థితి కూడా లాటరీ టికెట్ లాగే మారింది, కాకపోతే అప్పుడు అదృష్టం ఉండాలి. ఇప్పుడు పాలక నేతలైన కమిటీ సభ్యుల కటాక్షం ఉండాలి. కాగా యూనిట్ల కేటారుుంపులు తక్కువగా, అర్హుల నుంచి అందిన దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా ఉన్నారుు. దీంతో ప్రస్తుతం ఈ రుణ భాగ్యలక్ష్మి ఎవరిని వరిస్తుందనేది ఆయా వర్గాల్లో ప్రశ్నార్ధకంగా మారింది. కడప రూరల్: జిల్లాలో 2016-2017 ఆ ర్ధిక సంవత్సరానికి నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాం కుల అనుసంధానంతో సబ్సిడీ రుణాలను అందించాలి. ఆ మేరకు ఆయా వర్గాలకు చెందిన కార్పొరేషన్లకు లక్ష్యాలను నిర్దేశించారు. అరుుతే పాలకులు నామమాత్రంగా యూనిట్లను కేటారుుస్తున్నారు. ఫలితంగా అర్హులు రుణాలు పొందలేక, ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం లేక నిరాశకు లోనవుతున్నారు. బీసీల పరిస్థితి దారుణం... ఈ ఏడాది ప్రభుత్వ సబ్సిడీతో పాటు బ్యాంకర్లు తమ వాటాగా ఎస్సీలకు రూ. 47 కోట్లు, ఎస్టీలకు రూ. 27.30 కోట్లు, బీసీలకు రూ. 23.04 కోట్లు, 10 బీసీ ఫెడరేషన్లకు రూ. 27.30 కోట్లు, కాపులకు రూ. 32 కోట్లు, మైనార్టీలకు రూ. 30.84 కోట్లు, క్రిస్టియన్లకు రూ. 41 లక్షలు అందించాలి. కాగా మొత్తం 6,973 యూనిట్లకు గాను గత ఏడాదిలో రుణాలు పొందగా మిగిలినవి, ఇప్పుడు వచ్చిన దరఖాస్తులనే కలుపుకుంటే ఆన్లైన్లో 60,991 దరఖాస్తులు ఉన్నారుు. వారంతా రుణాలకు అన్ని విధాలా అర్హత గలవారే. కాగా జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అరుుతే బీసీలకు కేవలం 1170 యూనిట్లను కేటారుుంచగా 18,000 దరఖాస్తులు వచ్చారుు. అలాగే బీసీ ఫెడరేషన్లు, ఎస్సీలు, మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏటా నామమాత్రంగా యూనిట్ల కేటారుుంపులు జరుగుతున్నారుు. దీంతో ఎక్కువ మంది అర్హులు లబ్ధి పొందలేక పోతున్నారు. లబ్ధిదారులకు 111 గండాలు... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అర్హుల ఎంపికకు సంబంధించి 111 జీఓను జారీ చేసింది. దీని ప్రకారం ఆయా ఎంపీడీఓలు నాన్ అఫిషియల్ బోర్డును ఏర్పాటు చేసి, అందులో 10 మంది సభ్యులను నియమించాలి. మొన్నటి వరకు ఉన్న జన్మభూమి కమిటీల తరహాలోనే ఈ కొత్త బోర్డు కూడా ఉండబోతోందనే ఆరోపణలు వస్తున్నారుు. అరుుతే ఈ జీఓ ప్రకారం ఎంపీడీఓలు కీలకంగా మారనున్నారు. అన్ని వ్యవహారాలను ఆ అధికారి చూసుకోవడంతోపాటు ఆయా కార్పొరేషన్లకు నివేదికలను కూడా ఆయనే పంపాల్సి ఉంది. కాగా, ఈనెల 15వ తేదీ నుంచి జరిగే ఇంటర్వ్యూల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అనంతరం జనవరి 1వ తేదీ నుంచి రుణాలను ఎంపికై న అర్హులకు పంపిణీ చేయాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు కారణంగా బ్యాంకర్లు బిజీబిజీగా ఉన్నారు. అందువల్ల రుణాల మంజూరుపై ఆ ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అలాగే కొత్త కమిటీలను కూడా నియమించాల్సి ఉంది. మొత్తం మీద ఈ ఏడాది అర్హులు 111 గండాలను దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
లోకేష్‌ను అడ్డుకున్న బీసీ నేతలు
తణుకు : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్కు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ బీసీ సంఘాల నాయకులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను బుధవారం అడ్డుకున్నారు. తణుకు నియోజకవర్గంలో పర్యటించేందుకు వచ్చిన ఆయన వేల్పూరు నుంచి అత్తిలి మార్గంలో వెళుతుండగా కేఎస్ గట్టు గ్రామం వద్ద అడ్డుకున్నారు. వెంకట సుధాకర్‌కు మునిసిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టే సమయంలో రెండున్నరేళ్ల అనంతరం ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. శెట్టిబలిజ వర్గం నుంచి ఆయనను ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ లోకేష్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై లోకేష్ వివరణ ఇస్తూ కొన్ని పార్టీలు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీపై ధ్వజమెత్తేందుకు లోకేష్ ప్రయత్నించగా, శెట్టిబలిజ సంఘం నాయకులు అడ్డుకున్నారు. దీనికి కులాలు, పార్టీల రంగు పులమవద్దని హితవు పలికారు. పార్టీ పెద్దలు అప్పట్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసికెళతానని లోకేష్ హామీ ఇవ్వడంతో బీసీ నేతలు శాంతించారు. -
ఐక్యతతోనే బీసీల హక్కుల సాధన
– కార్తీక వనభోజనాల్లో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(అర్బన్): బీసీలు ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంగన్నబావి సమీపంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనాల కార్యక్రమానికి ఆమె హాజరై ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. బీసీల్లోని అన్ని కులాలకు చెందిన వారిని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే మంచి ఉద్దేశంతో కార్తీక వనభోజనాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మాట్లాడుతూ.. బీసీలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారి హక్కులను సాధించుకునేందుకు సమష్టిగా పోరాడాలన్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతు దేశంలో బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, రాష్ట్ర కార్యదర్శి ఎం. రాంబాబు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావుయాదవ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కె. రామకృష్ణ, నాయకులు బుర్రా ఈశ్వరయ్య, కేతూరి మధు, డా.పుల్లన్న, లక్ష్మినారాయణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంముని పాల్గొన్నారు.