
సాక్షి, అమరావతి: సామాజికంగా వెనుకబడిన బీసీలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో బీసీలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆయన పేర్కొన్నారు. బీసీలను కేవలం కులవృత్తులకు పరిమితం చేయాలనే దురాలోచన చంద్రబాబుకు ఉందని ఆయన మండిపడ్డారు.
బీసీల్లో అనేకమైన సంచార జాతులు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి టీడీపీకి లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఉన్నతమైన స్థానంలో చూడాలనే దృఢ సంకల్పం సీఎం వైఎస్ జగన్‌ది అని ఆయన స్పష్టం చేశారు.