Shankar Narayana
-
ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ్ తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణపై ఎలక్ట్రికల్ డిటోనేటర్ విసిరినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పవర్ సప్లై లేకపోవడం వల్ల అది పేలలేదని గుర్తించారు. మద్యం మత్తులో డిటోనేటర్ విసిరినట్లు భావిస్తున్నామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.. దుండగుడి పేరు గణేష్‌గా గుర్తించామని పేర్కొన్నారు. నిందితునిది సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంగా గుర్తించామని,. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. నా హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్చి ఉంది నాపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ అన్నారు. కుట్ర కోణాన్ని పోలీసులు చేధించాలని డిమాండ్ చేశారు. దేవుడి దయతో ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు. డిటోనేటర్ పేలి ఉంటే ఘెర ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. నాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నానని ఎమ్మెల్యే శంకర్ నారాయణ చెప్పారు. ఇదీ చదవండి: ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కుట్ర: మంత్రి కాకాణి -
లోకేష్ పై పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఫైర్
-
రైతు పక్షపాతి సీఎం జగన్
పెనుకొండ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి అని వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని వన్శికా గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఎమ్మెల్యే అధ్యక్షతన వైఎసార్సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ జరిగింది. నియోజకవర్గ పరిశీలకుడు మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీంఅహ్మద్ హాజరయ్యారు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు రాయితీతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేయడంతోపాటు గిట్టుబాటు ధరతో పంటలు కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమాతో రైతులను ఆదుకుంటున్నారన్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఎన్నికల హామీలు అమలు చేశారన్నారు. పెనుకొండకు మెడికల్, నర్సింగ్ కళాశాల మంజూరు చేశారని, ఏకంగా ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసిన ఘనత జగనన్నదన్నారు. ఆరోగ్యశ్రీ కింద 2400 జబ్బులను చేర్చి వైద్యాన్ని పేదలకు మరింత దగ్గర చేశారన్నారు. వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1.45 లక్షల కోట్లు, పెనుకొండ నియోజకవర్గంలో రూ.835 కోట్లు జమ చేశారన్నారు. జగనన్న కేబినెట్‌తోపాటు స్థానిక సంస్థల పదవుల్లో 70 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకపక్ష గెలుపే జగనన్న పాలనకు నిదర్శమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్న మరోసారి సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. విమర్శించడమే టీడీపీ పని.. సంక్షేమ పథకాల ద్వారా జగనన్న అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నా టీడీపీ విమర్శించడమే పనిగా పెట్టుకుందని ఎమ్మెల్యే శంకరనారాయణ విమర్శించారు. పచ్చమీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల హామీలను తుంగలో తొక్కడంతోపాటు ఆయన హయాంలో ప్రతి పథకంలోనూ ప్రజల సొమ్మును దోపిడీ చేశారన్నారు. దీంతో ప్రజలు ఆయనకు సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. ధీరుడు జగన్మోహన్రెడ్డి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ధీరుడని, ఇంత వరకు ఇలాంటి నాయకుడిని దేశంలోనే చూడలేదని నియోజకవర్గ పరిశీలకుడు నర్సేగౌడ పేర్కొన్నారు. వాల్మీకులను ఇతర కులాలను ఎస్టీ, ఓబీసీల్లో చేర్చే విషయమై సీఎం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ప్లీనరీకి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు అవకాశవాది.. చంద్రబాబు అవకాశవాది అని, ఆయన పాలన∙చీకటిమయమని ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం కృషి చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో పెనుకొండలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే సోదరులు మాలగుండ్ల రవీంద్ర, మాలగుండ్ల మల్లికార్జున, మార్కెట్‌యార్డ్ వైస్ చైర్మన్ పైడేటి రమణ, కన్వీనర్లు నాగలూరుబాబు, నారాయణరెడ్డి, తిమ్మయ్య, బీకే.నరసింహమూర్తి, లక్ష్మీనరసప్ప, తయూబ్, ఎంపీపీలు గీత, గంగమ్మ, ప్రమీల, సవిత, చంద్రశేఖర్, జెడ్పీటీసీలు గుట్టూరు శ్రీరాములు, డీసీ అశోక్, జయరాంనాయక్, పరిగి శ్రీరాములు, ఏడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ శంకరరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ ఉమర్ఫారూఖ్ఖాన్, వైస్ చైర్మన్లు నందిని, సునీల్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణరెడ్డి, సంగీత,నృత్య అకాడమీ డైరెక్టర్ సువర్ణ, సర్పంచ్‌లు నాగమూర్తి, అశ్వత్థప్ప, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, జయశంకరరెడ్డి, గుట్టూరు ఆంజనేయులు, ప్రభాకర్, గోరంట్ల మార్కెట్‌యార్డు చైర్మన్ బూదిలి వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..) -
అనంతపురం భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి శంకర్ నారాయణ
-
చంద్రబాబు బినామీల్లో పవన్ కల్యాణ్ ఒకడు: శంకర్ నారాయణ
సాక్షి, అనంతపురం: పవన్ కళ్యాణ్‌కు రైతుల గురించి ఏం తెలుసు? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు పవన్‌కు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. పవన్ పరామర్శించిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సాయం చేసిందని తెలిపారు. రైతుల కోసమే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్థరహితమని, ఆయనకు వ్యవసాయంపై అవగాహన లేదని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని సీఎం జగన్ సర్కార్ ఆదుకుందని తెలిపారు. ఒక్కొ రైతు కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం అందజేసిందని చెప్పారు. చంద్రబాబు హయాంలో వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని దుయ్యబట్టారు. 469 మంది రైతులకు చంద్రబాబు చిల్లిగవ్వ సాయం కూడా సాయం చేయలేదని అన్నారు. చంద్రబాబు పాలనలో చనిపోయిన రైతు కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిహారం అందించారని తెలిపారు. చంద్రబాబు బినామీల్లో పవన్ కల్యాణ్ ఒకడు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. సినిమా షూటింగ్‌లు లేనప్పుడు పవన్ రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రైతు ఆత్మహత్యలపై చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. అప్పుడు గాడిదలు కాస్తున్నావా? అని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రభుత్వం కౌలుదారులకు అండగా నిలిచిందని, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కౌలు రైతులకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సాయం చేయలేదని నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షపాతి అని శంకర్ నారాయణ తెలిపారు. -
రూ.2,205 కోట్లతో 8,268 కి.మీ. రోడ్ల పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా నిధులు కేటాయించి రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకర్‌నారాయణ చెప్పారు. రూ.2,205 కోట్లతో 8,268 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ కోసం 1,161 పనులు చేపట్టామని తెలిపారు. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పనులను మే నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. 2010 నుంచి 2019 వరకు కాంగ్రెస్, చంద్రబాబు ప్రభుత్వాలు రోడ్ల నిర్వహణను గాలికొదిలేయడంతో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. గత రెండున్నరేళ్లలో భారీ వర్షాలతో రోడ్ల మరమ్మతుల్లో జాప్యం జరిగిందని చెప్పారు. దీంతో సీఎం జగన్ సమీక్షించి రోడ్ల పునరుద్ధరణ కోసం దిశానిర్దేశం చేశారని, ఆరు నెలలుగా పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ఇప్పటికే 118 పనులు పూర్తి రోడ్ల పునరుద్ధరణ పనుల్లో రూ.158 కోట్ల విలువైన 118 పనులు పూర్తికాగా రూ.697 కోట్ల విలువైన 343 పనులు దాదాపుగా పూర్తికావచ్చాయన్నారు. రూ.260 కోట్ల బిల్లులు చెల్లించామని, ప్లాన్ వర్క్స్ కోసం రూ.1,158.53 కోట్లను నాబార్డ్ నుంచి సమీకరించామని తెలిపారు. వాటిలో 182 పనులు పూర్తికాగా మిగిలిన 51 పనులను జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న వంతెనలకు ఎన్ఐడీఏ–2 పథకం కింద రూ.570.10 కోట్ల రుణం మంజూరుకు నాబార్డ్ సమ్మతించిందని తెలిపారు. రూ.486 కోట్ల నాబార్డు రుణంతో 14 రైల్, రోడ్ వంతెనల పనుల్ని పూర్తిచేస్తామన్నారు. వాటికి అదనంగా మరో 33 ఆర్వోబీలను నిర్మించాలని గుర్తించినట్లు తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.1,980 కోట్లు కేంద్రం వెచ్చించనుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.440 కోట్ల భూసేకరణ వ్యయాన్ని భరిస్తుందని చెప్పారు. సీఆర్ఐఎఫ్ పథకం కింద రూ.2,049 కోట్లతో 1,670 కి.మీ. రోడ్ల రెండులేన్లుగా పేవ్డ్ షోల్డర్స్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లకోసం తీసుకున్న రుణాన్ని టీడీపీ ప్రభుత్వం మళ్లించింది 2019 ఎన్నికల ముందు రోడ్ల పునరుద్ధరణ కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రచార పథకాల కోసం మళ్లించిందని మంత్రి విమర్శించారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ఏటా రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఏటా కేవలం రూ.2 వేల కోట్లే కేటాయించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే రోడ్ల దుస్థితికి కారణమన్నారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.10,360 కోట్లు వెచ్చించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.10,660 కోట్లు తేగలిగితే.. సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలోనే రూ.11,500 కోట్లను కేంద్రం నుంచి రాబట్టారని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ రోడ్ల పునరుద్ధరణ పనులను నాడు–నేడు విధానంలో డాక్యుమెంట్ చేసి రికార్డు చేస్తున్నామని చెప్పారు. -
రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష: మంత్రి శంకర్‌నారాయణ
సాక్షి, అనంతపురం: రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్ష చేస్తున్నారని మంత్రి శంకర్‌నారాయణ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికే దీక్ష అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. హిందూపురం అభివృద్ధికి బాలకృష్ణ ఏనాడు కృషి చేయలేదన్నారు. చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ హిందూపురానికి బాలకృష్ణ చుట్టపు చూపుగా వస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హిందూపురం అభివృద్ధి గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విశిష్టతను గుర్తించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని.. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. -
విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం: శంకర నారాయణ
సాక్షి, అనంతపురం జిల్లా: హంద్రీనీవాను ఎన్టీఆర్ ప్రారంభిస్తే.. బాబు పూర్తి చేశారని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హంద్రీనీవాకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. టీడీపీ నేతలకు ఇప్పటికి రైతులు గుర్తొచ్చారా అంటూ మంత్రి ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ ధ్యేయం అని దుయ్యబట్టారు. (చదవండి: వారికి ఎవరి రికమండేషన్ అవసరం లేదు: పేర్ని నాని) టీడీపీ నేతలు డ్రామాలు: తలారి రంగయ్య రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు పట్టించుకోలేదని ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. ఇప్పుడు సీమ ప్రాజెక్టుల భవిష్యత్ పేరుతో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రాయలసీమలో తాగు,సాగునీటి కష్టాలు తొలగేలా సీఎం జగన్ పకడ్బందీ చర్యలు చేపట్టారని తలారి రంగయ్య అన్నారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
ఓర్వలేకే టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది : శంకర్ నారాయణ
-
టీడీపీ నేతలకు మతిభ్రమించింది: మంత్రి శంకర్‌నారాయణ
సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలకు మతిభ్రమించిందని మంత్రి శంకర్‌నారాయణ మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఎల్లోమీడియా ద్వారా టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేయలేదా? బాబు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నారని, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, కాలువ శ్రీనివాస్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్‌దే అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
వర్షాకాలం ముగియగానే కొత్త రోడ్లనిర్మాణాలు చేపడుతాం : శంకర్ నారాయణ
-
సకాలంలో రహదారుల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల పనుల కోసం పిలిచిన టెండర్లను జూలై 15 నాటికి ఖరారు చేసి పనులు ప్రారంభించాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకర్ నారాయణ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో విజయవాడలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ అండ్ బీ శాఖలో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎన్టీబీ మొదటి దశ, రెండో దశ కింద చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు–నేడు కింద ప్రాథమిక ఆసుపత్రులు, ఇతర ఆసుపత్రుల భవనాల మరమ్మతులు, ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం పనుల ఒప్పందాలను త్వరిత గతిన ఖరారు చేయాలన్నారు. రహదారుల పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఈఎన్సీలు వేణుగోపాల్‌రెడ్డి, ఇనయతుల్లా, పలువురు చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
పూటకో రకం మాట్లాడితే ఊరుకోం.. జేసీకి హెచ్చరిక
అమరావతి: జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం చేసే అరాచకాలు తాడిపత్రి ప్రజలకు తెలుసని, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి దివాకర్‌రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారని మంత్రి శంకర్‌నారాయణ తెలిపారు. అక్రమ మైనింగ్ విషయంలో కోర్టులే జేసీ దివాకర్‌రెడ్డికి అక్షింతలు వేశాయని గుర్తుచేశారు. జేసీ దివాకర్‌రెడ్డి అక్రమ సంపాదన, దౌర్జన్యాలు, హత్యలు అందరికీ తెలుసని చెప్పారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జేసీ దివాకర్‌రెడ్డి పూటకో రకంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి శంకర్‌నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి అసత్య ఆరోపణలు ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఏడాదిన్నరలో రూ.70 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందించినట్లు మంత్రి శంకర్‌నారాయణ వివరించారు. -
రహదారుల అభివృద్దికి 6400 కోట్లు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి 6400 కోట్లు కేటాయించామని రోడ్లు,భవనాల శాఖా మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఈ మేరకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ విధానంలో 85కోట్లు ఆదా అయ్యాయని, ఇప్పటికే టెండర్లు ఖరారు చేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా రుణం తీసుకున్న 3 వేల కోట్లని పక్కదారి పట్టించింని మండిపడ్డారు. 450 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులకి ప్రభుత్వం ఇప్పటికే 550 కోట్లని కేటాయించిందని, నీడా ద్వారా 1158 కోట్లని రోడ్ల అభివృద్ది కోసం సమీకరిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యతగా జిల్లాల నుంచి మొదలుకొని తర్వాత మండలస్ధాయిలో కూడా రోడ్లని అభివృద్ది చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. -
కేంద్రమంత్రిని కలిసిన శంకర నారాయణ
సాక్షి, ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఏపీ రోడ్లు, భవనాల మంత్రి శంకర నారాయణ, ఎంపీ కృష్ణదేవరాయలు మంగళవారం కలిశారు. రాష్ట్రంలో 16 పోర్టులకు జాతీయ రహదారుల కనెక్టివిటీ చేయాలని కేంద్రమంత్రికి వినతించారు. అనంతరం మంత్రి శంకర నారాయణ మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్టు-భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కోస్టల్ రోడ్ మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు. విజయవాడ-బెంగళూరు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను ఫేజ్-1లో చేపట్టాలని, విజయవాడ కాజా టోల్ ప్లాజా-ఒట్టిపాడు వరకు బైపాస్ మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జి, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరామని మంత్రి శంకర నారాయణ తెలిపారు. -
రూ.15,591 కోట్ల ప్రాజెక్టులకు 16న శంకుస్థాపనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కార్యక్రమాలను ఈ నెల 16న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి శంకర నారాయణ శనివారం తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం వైఎస్ జగన్‌లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గత నెల 18వ తేదీన ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా, కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా సోకడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ► ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. మొత్తం 16 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. ► శంకుస్థాపనలు జరిగే 16 ప్రాజెక్టుల్లో.. రూ.2,225 కోట్లతో చేపట్టనున్న రేణిగుంట– నాయుడుపేట ఆరులేన్ల రహదారి, రూ.1,225 కోట్లతో చేపట్టనున్న విజయవాడ బైపాస్, రూ.1,600 కోట్లతో నిర్మించనున్న గొల్లపూడి–చినకాకాని ఆరు లేన్ల రహదారితోపాటు కృష్ణా నదిపై మేజర్ బ్రిడ్జి ముఖ్యమైనవి. ► జాతికి అంకితం చేసే ప్రాజెక్టుల్లో.. రూ.2,075 కోట్లతో నిర్మించిన కడప–మైదుకూరు–కర్నూలు నాలుగు లేన్ల రహదారి (ఎన్‌హెచ్–40), రూ.1,470 కోట్లతో చేపట్టిన విజయవాడ–మచిలీపట్నం నాలుగు లేన్లు (బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌తో కలిపి), రూ.1,100 కోట్లతో చేపట్టిన నలగంపల్లి–ఏపీ/కర్ణాటక సరిహద్దు నాలుగు లేన్లు, రూ.1,470 కోట్లతో నిర్మించిన రణస్థలం–ఆనందపురం ఆరు లేన్ల రోడ్డు, రూ.501 కోట్లతో చేపట్టిన కనకదుర్గ గుడి ఆరు లేన్ల ఫ్లై ఓవర్ ముఖ్యమైనవి. -
‘ఆ సొమ్మును దారి మళ్లించారు’
సాక్షి, విజయవాడ: రహదారులను అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రహదారుల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. 2014లో చంద్రబాబు నాయుడు రూ.3 వేల కోట్లకుపైగా కార్పొరేషన్ ద్వారా అప్పు చేశారని.. ఆ డబ్బును రోడ్ల అభివృద్ధికి ఉపయోగించకుండా ఎన్నికల్లో గెలవడం కోసం, ఇతర కార్యక్రమాలకు దారి మళ్లించారని మండిపడ్డారు. (చదవండి: ‘గత తప్పిదాల వల్లే ఆత్మహత్యలు’) 3వేల కోట్లకు ఏడాదికి 250 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరిన్ని నిధులు కేటాయించారని తెలిపారు. 4న కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ తో పాటు 15 వేల కోట్లు పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉందని.. ప్రణబ్ ముఖర్జీ మరణంతో వాయిదా పడిందని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్లను జాతికి అంకితం చేయడంతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. -
ప్రజాద్రోహి చంద్రబాబు
అనంతపురం సెంట్రల్: రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నిజం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డుకుంటున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న చంద్రబాబు ప్రజాద్రోహిగా మిగిలిపోతారన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. ► కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ► స్టేట్ డిస్టెన్స్ పాటిస్తూ ఇళ్ల పట్టాలు పంపిణీ జరగకుండా ఆ పార్టీ శ్రేణులకు డైరెక్షన్ ఇచ్చి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారు. ► టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా పట్టాలు పొందిన భూములపై నేడు కేసులు వేయిస్తుండటం దారుణం. ► ఫోన్ ట్యాపింగ్‌పై రాద్దాంతం చేయడం తగదు. ఏవైనా ఆధారాలుంటే సమర్పించాలి. -
దీనిని మేమంతా స్వాగతిస్తున్నాం: మంత్రి
సాక్షి, అనంతపురం: పరిపాలన వికేంద్రీకరణకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ చట్టం రద్దును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమని, ఇందుకు మూడు రాజధానులు ఆయన లక్ష్యం అన్నారు. అదే విభజన గాయాలు మానాలంటే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ తథ్యమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి డ్రామాలు ఆడారని, అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని మంత్రి ధ్వజమెత్తారు. రైతుల కడుపు కొట్టి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. సీఎంజగన్ వల్లే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమోందని, రాయలసీమలో హైకోర్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. నిపుణుల నివేదిక మేరకే మూడు రాజధానుల నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..) పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దును గవర్నర్ ఆమోదించడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి శుభ సూచకమని ఆనందం వ్యక్తం చేశారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికై కర్నూలును న్యాయ రాజధానిగా గుర్తించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. రాయలసీమ వాసుల తరుపున సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్సార్ కలలుకన్న రాయలసీమ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి తీరుతామన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అవినీతితో అమరావతిని నిర్మించాలన్న కలలు కల్లలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ: పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దుకు శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలపడాన్ని ఆమె స్వాగతిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో ఉండడం వల్ల ఎంతగానో నష్టపోయామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటులో ఉన్నాయని, మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతోనే మూడు రాజధానులను సీఎం జగన్ తీసుకొచ్చినట్ల ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని, ఏపీలో మూడు రాజధానులు ఎంతో అవసరమన్నారు. శాసనమండలిలో బిల్లులు ఆమోదం పొందకుండా చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన గవర్నర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చారిత్రక అవసరమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. -
మంత్రుల బాధ్యతల స్వీకరణ
సాక్షి, అమరావతి: రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ మంత్రిగా శంకర్ నారాయణ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణలు బుధవారం సచివాలయంలో వేర్వేరుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ నుంచి ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చెట్లెక్కే మా చేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్లమెంట్ మెట్లెక్కించారన్నారు. ► ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ రెండు కీలక ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 వేల కి.మీ. రోడ్లు వేసేందుకు గాను రూ.6,400 కోట్లతో ఎన్డీబీతో చేసుకున్న ఒప్పందంపై సంతకం చేశారు. తూ.గో. జిల్లాలోని వృద్ధ గౌతమి నదిపై ఎదుర్లంక– జి.ముళ్లపాలెం రహదారి కొత్త వంతెన పనులకు సంబంధించి రూ.76.05 కోట్లకు అంచనాలను సవరిస్తూ ఫైల్‌పైనా సంతకం చేశారు. ► మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కర్నూలు జిల్లా బేతంచర్ల బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్, డోన్ బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తూ మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. ► బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ బి.రామారావు, కాపు కార్పొరేషన్ ఎండీ సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు ధనలక్ష్మి, కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతలు చేపట్టిన మంత్రి శంకర్ నారాయణ
-
బాధ్యతలు చేపట్టిన మంత్రి శంకర్ నారాయణ
సాక్షి, అమరావతి: మంత్రి శంకర్ నారాయణ బుధవారం రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సదర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక- జి.ముళ్లపాలెం రహదారి కొత్త వంతెన పనులకు సంబంధించిన ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ్ మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తనకు ఆర్ అండ్ బి శాఖ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల అమలులో తనను ముఖ్య భాగస్వామిని చేశారని పేర్కొన్నారు. మొదటి సారిగా గెలిచిన తనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు కీలక శాఖలు ఎస్సీ, ఎస్టీ బలహీన, మైనారిటీ వర్గాలకు కేటాయించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు వేల కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు గాను రూ. 6400 కోట్లతో ఎన్డీబితో చేసుకున్న ఒప్పందంపై మొదటి సంతకము చేశానని పేర్కొన్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అదే విధంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లాలోని డోన్‌లో బాలికల రెసిడెన్సియల్ స్కూల్, బేతంచెర్లలో బాలుర రెసిడెన్సియల్ స్కూల్‌ను జానియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసే ఫైళ్లపై మంత్రి వేణుగోపాలకృష్ణ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. తను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన వరాలన పంచుతానని తెలిపారు. తమకు గుర్తింపు లేదని ఆత్మ నూన్యతతో ఉన్న బలహీనవర్గాలకు సీఎం వైఎస్ జగన్ పాలనలో గుర్తింపు ఉంటుందన్నారు. బలహీన వర్గాల సంఘల నాయకుల సమస్యను సరైన రీతిలో పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రి శంకర్ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు. (గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు) -
బాబు, వపన్‌లకు పనిపాట లేదు: మంత్రి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు పనిపాట లేదని.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉందని పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటకీ సంక్షేమ పథకాల అమలులో సీఎం వైఎస్ జగన్ రాజీపడలేదన్నారు. ఆయన సంక్షేమ పాలన చూసి ప్రతిక్షాలు ఓర్వలేకపోతున్నాయని మంత్రి మండిపడ్డారు. -
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు.(మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం) సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు. శంకర్ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. కాగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్య్స, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. వారు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.(కొత్త మంత్రులకు జనసేన ఎమ్మెల్యే అభినందనలు) -
సంతోషంగా బీసీలు
సాక్షి, అమరావతి: బీసీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషిని చూసి వారంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్ నారాయణ అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో బీసీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ అధ్యయన కమిటీని వేశారన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో, మహిళలకు పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ను సీఎం వైఎస్ జగన్ కల్పించారు. – స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. కేబినెట్లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. – ఈ నెల 20 బీసీలకు పండుగ రోజు. బీసీల సంక్షేమానికి 28 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 30 వేల జనాభా మించిన బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తాం. – కొత్తవాటితో కలుపుకుని బీసీల కోసం మొత్తంగా 52 కార్పొరేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ల ద్వారా గతంలో 69 కులాలనే పరిగణనలోకి తీసుకోగా, ఇప్పుడు మొత్తం 139 కులాలు కవర్ అవుతున్నాయి. – వైఎస్సార్ చేయూత ద్వారా సింహభాగం లబ్ధి బీసీ మహిళలకే జరుగుతుంది. – గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది. అందుకే బీసీలు గత ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పారు. – బీసీలంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. ఆయనకు బీసీలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు బీసీలను అన్ని విధాలా మోసం చేశారు: మంత్రి ధర్మాన కృష్ణదాస్ – 2014 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి మద్దతిచ్చి గెలిపిస్తే చంద్రబాబు బీసీలను అన్ని విధాలా మోసం చేశారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. – టీడీపీ బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్‌గా కాకుండా బిజినెస్ క్యాస్ట్‌గా చూసింది. – వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల లబ్ధి జరిగింది. – ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలను వాడుకున్నారు తప్ప బీసీల బాగోగులు చూడలేదని అన్నారు. – ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల అభ్యున్నతికి అనేక చట్టాలు చేసిందన్నారు. – మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ యాదవ్, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం
సాక్షి, అనంతపురం : సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకమని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామిలతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఒకేసారి 1088 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచడం ఎక్కడా జరగలేదని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. సీఎం జగన్ గొప్ప మానవతావాది.. ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు సీఎం జగన్ చర్యలు అభినందనీయమని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రతీదీ రాజకీయం చేయడం చంద్రబాబుకు బాగా అలవాటైపోయిందన్నారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్రల వల్లే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందలేదంటూ విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే ఆర్థిక బిల్లును చంద్రబాబు అడ్డుకున్నారని, నీచ రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు అనైతిక రాజకీయాల వల్లే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయని ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. మండలిలో ఆర్థిక బిల్లును టీడీపీ ఎమ్మెల్సీలు కావాలనే అడ్డుకున్నారన్నారు ప్రభుత్వ ఉద్యోగుల ఉసురు చంద్రబాబుకు తప్పదని, ఏపీ అభివృద్ధికి చంద్రబాబే అడ్డుగా ఉన్నారని ఆయన విమర్శించారు. -
‘‘వలస కూలీలను మానవీయ కోణంలో చూడాలి’’
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామ స్థాయిలో విత్తనాల పంపిణీ చారిత్రాత్మకమన్నారు. రైతులకు 40 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీ చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని మంత్రి విమర్శించారు. (‘బాబు కరోనా రాజకీయాలు పక్కనపెట్టాలి’) ఇక ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతి మాట్లాడుతూ... సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారన్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13500 రూపాయల సాయం అందించామని పేర్కొన్నారు. గ్రామాల్లో వేరుశనగ విత్తనాల పంపిణీ అభినందనీయమని, టీడీపీ పాలనలో విత్తనాల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. టీడీనీ పాలనలో రూతులు విత్తనాల కోసం క్యూలో నిలబడి చనిపోయినా చంద్రబాబు పట్టించుకోలేదు మండిపడ్డారు. ఇక సీఎం వైఎస్ జగన్ రైతు కష్టాలు తీర్చారని ఎమ్మెల్యే అన్నారు. కూలీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: కలెక్టర్ వలస కూలీలను మానవీయ కోణంలో చూడాలని ముఖ్యమంత్రి వెఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు వలస కూలీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పారు. వలస కూలీలకు భోజనం, మంచినీరు అందిస్తున్నామని. ఇక ప్రభుత్వ ఖర్చులతోనే వలస కార్మికులను తమ సొంత ఊళ్లకు తరలిస్తున్నామని వెల్లడించారు. అనంతపురం-ఉత్తరప్రదేశ్, అనంతపురం-బీహార్‌కు వెళ్లే వలస కూలీల కోసం శ్రామిక రైళ్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. (కరోనా: నాలుగు రోజులు హిందూపూర్ బంద్) -
‘బాబు కరోనా రాజకీయాలు పక్కనపెట్టాలి’
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ కట్టడికి రేయింబవళ్లు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు రాజకీయ విమర్శలు సిగ్గుచేటని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ప్రతి పనిని విమర్శించడం చంద్రబాబు, టీడీపీ నేతలకు అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కరోనాపై రాజకీయాలు చేయడం పక్కనపెట్టి ప్రజలకు తోడుగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఏపీలోకి వచ్చే వలస కూలీలు, ఇతర ప్రజలకు కరోనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రానికి వచ్చిన వారంతా తప్పని సరిగా 14 రోజుల క్వారంటైన్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి శంకర్ నారాయణ హామీ ఇచ్చారు. (చదవండి : వారికి రూ. 2 వేలు ఇవ్వండి: సీఎం జగన్) -
నీచ రాజకీయాలకు పాల్పడటం దుర్మార్గం
-
లాక్డౌన్: మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి హెచ్చరించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించి.. మద్యం అమ్మకాలను నిషేధించింది. అయితే అనధికారికంగా మత్తు పదార్ధాల విక్రయాలు జరిపినా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖా మంత్రి నారాయణస్వామి తెలిపారు. (కరోనా పరీక్షలు: వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి) లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలు చేయకుంటే ఎక్సైజ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్‌ను తనిఖీ చేయాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు. మళ్ళీ అమ్మకాలు ప్రారంభించిన తర్వాత ఓపెనింగ్ స్టాక్‌కు ఇప్పటి క్లోజింగ్ స్టాక్ సరిగా ఉందో లేదో వెరిఫై చేయాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు. ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని, సక్రమంగా పని చేయని వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. (‘నిజమే చెబుతున్నారా.. చైనాను నమ్మలేం’) ఎవరైనా మద్యం విక్రయిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజ్‌లాల్ సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్లు 18004254868, 94910 30853, 0866 2843131. మత్తుకు బానిసలైన కొంతమంది సహనం కోల్పోయి హానికర ద్రవాలు సేవించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ఆయన కోరారు. వారి విషయంలో కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. (‘ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు’) -
‘ఇళ్ల స్థలాల పంపిణీ ఆపాలని చూశారు’
సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థపైన, అన్ని ప్రభుత్వ వ్యవస్థలపైన గౌరవం ఉన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు రాకపోతే ఆ పాపం మొత్తం చంద్రబాబుదే అని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు అందించే పథకం ఒక శాశ్వత పథకమని ఆయన అన్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందే ప్లాట్ల కేటాయింపు, ఇళ్ల స్థలాల ఎంపిక వంటి ప్రక్రియలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు, ఎన్నికల కమిషనర్ దుర్భుద్ధితో ఇళ్ల స్థలాల పంపిణీని ఆపే ప్రయత్నం చేశారని శంకర్ నారాయణ దుయ్యబట్టారు. సుమారు 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందని, వారి సొంత ఇంటి కల నెరవేరుతుందని మంత్రి అన్నారు. (అందుకే టీడీపీని వీడాను : శమంతకమణి) విచక్షణ అధికారం అంటే సమాజానికి, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడేలా ఉండాలని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. ఎలక్షన్ కమిషనర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అయన మండిపడ్డారు. కరోన వైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా లేని ఈ సమయంలోనే ఎన్నికలు నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తామన్నారు. ప్రజల కష్టాలు తెలిసి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు చేరువగా ఉండే వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని శంకర్ నారాయణ కొనియాడారు. -
‘ప్రపంచాన్ని జయించే ఒకే ఆయుధం విద్య’
సాక్షి, విజయనగరం: అమ్మఒడి, నాడు-నేడు కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు వస్తున్నాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. సోమవారం ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టి ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగో స్థానంలో నిలిపారని ఆయన అన్నారు. భవిష్యత్‌లో దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధిస్తుందని విశ్వరూప్పేర్కొన్నారు. (నిరుపేదల జీవితాలలో మార్పు రావాలి..) ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు, ఆలోచనలు, పరిపాలనా తీరు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. నెల్సన్ మండేలా చెప్పినట్టు ప్రపంచాన్ని జయించడానికి ఒకే ఆయుధం విద్య అని ఆమె అన్నారు. అటవంటి విద్యను సాధించేందుకు ఎదురయ్యే అడ్డంకులు తొలగించే విధంగా, విద్యపై ఆసక్తి కలిగేలా విద్య వ్యవస్థలో సీఎం వైఎస్ జగన్ మార్పులు తీసుకు వస్తున్నారని ఆమె తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో విన్నారని.. ఈరోజు ప్రజలకు అండగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అనేక అవరోధాలు దాటి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి చేరే విధంగా ప్రభుత్వం పథకాలను తీసుకొస్తుందన్నారు. (జగనన్న వసతి దీవెన: ప్రసంగంతో అదరగొట్టిన అభిమన్యు!) జిల్లాలో ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లినవారు, అక్కడ ప్రాణాపాయ స్థితుల్లో పనులు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందన్నారు. ఆ పరిస్థితులు అధిగమించేలా విశాఖ పరిపాలన రాజధాని రాబోతుందని పుష్పశ్రీవాణి అన్నారు. సీఎం జగన్ దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి అని ఆమె కొనియాడారు. గిరిజన మహిళగా నేల మీద కూర్చుని విద్యను అభ్యసించి, ఉపాధ్యాయునిగా ఉన్న తనకు గొప్ప గౌరవం ఇచ్చిన సీఎం జగన్ అభిమానాన్ని మరచిపోలేనని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ.. గతంలో చంద్రబబాబును ఇచ్చిన ప్రోత్సాహకాల కంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ ఇస్తున్నారని గుర్తు చేశారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు తన మంది మార్భాలన్ని కాపాపడుకునేందుకు కులం రంగు పూస్తున్నారని మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని శంకర్ నారాయణ అన్నారు. -
ఢిల్లీలో లాబీయింగా.. హాస్యాస్పదం: ఏపీ మంత్రి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. మండలి రద్దును అడ్డుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తానని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ ఆగదని మంత్రి స్పష్టం చేశారు. విశాఖపట్నంపై చంద్రబాబు అండ్ టీం దుష్ర్పచారం దుర్మార్గమని మండిపడ్డారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీ నివేదికలను బోగి మంటల్లో వేయాలన్న టీడీపీ నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత టీడీపీ పాలనలో లాయర్లు 90 రోజులు ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎవరడిగారని యనమల వ్యాఖ్యానించడం తగదని మంత్రి శంకర్ నారాయణ హెచ్చరించారు. చదవండి: నేను మేనేజ్ చేస్తాగా! రాజ్యాంగం మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది -
అభివృద్ధి చేస్తామంటే..బాబు అడ్డుకుంటున్నారు
-
బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే డ్రామాలు..
సాక్షి, అనంతపురం: ‘అమ్మఒడి పథకం’ వల్ల అక్షరాస్యత శాతం గణనీయంగా పెరుగుతుందని ఏపీ మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. అనంతపురం శారదా మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి మంత్రి శంకర్ నారాయణ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్ర సృష్టిస్తున్నాయని తెలిపారు. అమరావతిలో బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు వద్దంటున్నారని.. రాయలసీమ, ఉత్తరాంధ్ర లకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీ నివేదికలను హైపర్ కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని.. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి అత్యవసరం అని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. దేశం చూపు..జగన్ పాలన వైపు.. అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన వైపు.. దేశం యావత్తు చూస్తోందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అమ్మఒడి పథకం పేద విద్యార్థుల పాలిట ఓ వరం అని ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరాంజనేయులు చెప్పారు. (చదవండి: ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్) (చదవండి: ‘వచ్చారు జగన్.. మెచ్చారు జనం’) -
చంద్రబాబు డ్రామాను ఎవరూ నమ్మరు
-
ఆ ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టం లేదు..
సాక్షి, అనంతపురం: ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తోంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు బినామీ ఆస్తుల పరిరక్షణకు పాకులాడటం సిగ్గుచేటని మంత్రి శంకర్‌నారాయణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోస్టన్, జీఎన్ రావు కమిటీ నివేదికలను హైపర్ కమిటీ పరిశీలిస్తోందని.. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం చంద్రబాబు, టీడీపీ నేతలకు ఇష్టం లేదని... అందుకే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో టీడీపీ నేతలు భారీగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు బినామీలు అమరావతిలో 4,500 ఎకరాలు భూములను కొన్నారన్నారు. చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని.. శివరామకృష్ణయ్య, శ్రీకృష్ణ కమిటీ నివేదికలను ఎందుకు పక్కన పెట్టారో సమాధానం చెప్పాలన్నారు.మాజీ మంత్రి నారాయణ కమిటీ సిఫార్సులతో రాజధాని ఏర్పాటు హాస్యాస్పదమన్నారు. రైతుల నుంచి లాక్కున్న భూముల ను టీడీపీ నేతలు వెనక్కి ఇచ్చేయాలన్నారు. -
‘బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. సోమవారం శాసన మండలిలో బీసీ సబ్ ప్లాన్, ఆదరణ పథకంలో జరిగిన అవినీతిపై శంకర్ నారాయణ మాట్లాడారు. గడిచిన అయిదేళ్లలో ఆదరణ పథకంపై పత్రికల్లో పలు అవినీతి కథనాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఆదరణ పథకం పనిముట్ల నాణ్యతపై పలు చోట్ల ఆరోపణలు వ్యక్తమయ్యాయని మంత్రి తెలిపారు. అయితే వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని శంకర్ నారాయణ చెప్పారు. అవినీతి బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 2015 నుంచి 2019 వరకు బీసీ సబ్‌ప్లాన్ కింద రూ. 36,472 కోట్లు కేటాయింపులు మాత్రమే జరిగాయన్నారు. అయితే వాటిల్లో ఖర్చు చేసింది రూ.28,804.75 కోట్లు మాత్రమే అని మంత్రి తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తమ ప్రభుత్వం రూ.15,061 కోట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. బీసీ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు. -
‘రాష్ట్రం బాగుపడటం చంద్రబాబు, పవన్‌కు ఇష్టం లేదు’
సాక్షి, కర్నూలు: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు రాష్ట్రాన్ని అప్పుల ఊబీలో ముంచి దివాల తీయించేలా చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ మండిపడ్డారు. సోమవారం విలేకురుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేరు, ప్రత్యేకత కోసం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని ఆయన అన్నారు. రాష్ట్రం బాగుపడటం చంద్రబాబుకు ఆయన దత్త పుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదని, ఇందుకోసమే పదే పదే అడ్డుపుల్లలు వేస్తూ విమర్శిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ పథకాలను పచ్చచొక్క నాయకులకే ఇళ్లు, పెంచన్లు, జన్మభూమి పేరిట పంచి పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు ఎటువంటి పక్షపాతం లేకుండా పథకాలను అందేలా తమ ప్రభుత్వం చోరవ తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. -
అబద్ధాలు, బుకాయింపులు బాబుకు అలవాటే
సాక్షి, అమరావతి: మొక్కజొన్న, వేరు శనగకు మద్దతు ధర లేక రైతులు నష్టపో తున్నారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్లు చేయడాన్ని రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకట రమణారావు, శంకరనారాయణ తప్పుబట్టారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాటాడుతూ.. పచ్చి అబద్ధాలు, బుకాయింపులు, బురద చల్లడాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని మండిపడ్డారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆయనకు ఎప్పుడూ ఏదో ఒక అసత్య అజెండా ఉండాలని ధ్వజమెత్తారు. ఇసుక, ఆంగ్ల మాధ్యమం అంశాలు ముగిసిపోవడంతో ఇప్పుడు కొత్తగా మార్కెట్ ధరలంటూ కొత్త పల్లవి అందుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు నైజాన్ని ప్రజలు గమనించాలి చంద్రబాబు పునాదులు కదిలిపోతున్నా యని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తేల్చిచెప్పారు. అందుకే ఆయన అసత్యా లతో ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బాబు అసలు నైజాన్ని ప్రజలు గమనించా లని కోరారు. రైతులతో పాటు వ్యవ సాయ అనుబంధ రంగాలను, అన్ని వృత్తుల వారినీ ఆదుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న సీఎం జగన్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించడంలో చంద్రబాబు దిట్టని మంత్రి శంకరనారాయణ ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకున్నది జగనే.. ధరలు లేక మొక్కజొన్న, వేరుశనగ రైతులు రూ.వందల కోట్లు నష్టపోయారంటున్న చంద్రబాబు పంట మార్కెట్‌కు రాకముందే ఆయన ఏ లెక్కన ఈ నష్టాన్ని అంచనా వేశారో చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. బట్ట కాల్చి ముఖాన వేస్తామంటే కుదరదని అన్నారు. చంద్రబాబు లాగా రైతులను మోసం చేయడం తమ ప్రభుత్వానికి చేతకాదని స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీనాటికి మార్కెట్‌కు వేరుశనగ వస్తుందని అంచనా వేసి, మూడు రోజుల ముందే కొనుగోలు కేంద్రాలు తెరవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కిందని అన్నారు. -
‘బీసీలను వెన్నముకగా చూస్తున్న సీఎం’
సాక్షి, అనంతపురం: బీసీలను వెన్నముకగా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాల మైదానంలో భక్త కనకదాస జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్‌నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. కాగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారని గర్తుచేశారు. బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్‌ది అని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉషాశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కృష్ణప్ప, రాగే పరశురాం, అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఉద్యోగాల కల్పనలో ఏపీ ‘నంబర్ వన్’
సాక్షి, అనంతపురం: ఉద్యోగాల కల్పనలో దేశంలోనే నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు సత్వర పరిష్కరించడానికే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను కేవలం ఐదునెలల్లో నెరవేర్చి ఇతర నాయకుల కంటే తాను భిన్నమైన నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారన్నారు. ప్రజలకు నమ్మకం కలిగింది.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కలిగిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతి పక్షాల పాత్ర నామ మాత్రమేనని చెప్పారు. -
‘చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదు’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చూసి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సిగ్గుపడాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ మండిపడ్డారు. గురువారం జిల్లాలోని అంబేద్కర్ భవన్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేశారని అన్నారు. 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఏనాడూ అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఆలోచించలేదని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు శతవిధాల కుట్ర చేశారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వివరించారు. ఏపీ వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.1150 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. అనంతపురం జిల్లాకు రూ.20.65 కోట్లు వచ్చిందని.. 24000 మంది అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లలో వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనంతవెంకట్రామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. -
‘బాబు డైరెక్షన్లో పవన్ కల్యాణ్’
సాక్షి, అనంతపురం: చంద్రబాబు, పవన్ కల్యాణ్ అదే పనిగా సీఎం జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసమే ఇసుక సరఫరా చేస్తోందని మంత్రి తెలిపారు. కానీ, ముఖ్యమంత్రి జగన్‌ను పవన్, చంద్రబాబు కావాలనే టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు, పవన్ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. అనంతపురం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి శంకర్‌నారాయణ మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనా కాలంలో ఇసుక మాఫియా ద్వారా వందల కోట్లు సంపాదించిన టీడీపీ నాయకులు ఇప్పుడు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. అందుకనే సీఎం జగన్‌పై పసలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఖజానాను చంద్రబాబు ఖాళీ చేశారని, అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత బాబుదేనని అన్నారు. ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. -
మీ మనవడిని.. మీ ‘కంటి వెలుగు’ని..
కరువు సీమ మురిసిపోయింది. రాజన్న బిడ్డకు అడుగడుగునా బ్రహ్మరథం లభించింది. ముఖ్యమంత్రి హోదాలో జిల్లాలో తొలి అడుగు వేసిన వైఎస్ జగన్‌ను జిల్లా ప్రజానీకం అక్కున చేర్చుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి.. అనతికాలంలోనే హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ.. ప్రజల ‘కంటి వెలుగు’గా మారిన సీఎం మరోసారి అనంతపురం జిల్లాపై వరాల వర్షం కురిపించారు. తన చిరునవ్వులతో అందరి హృదయాలను చూరగొన్నారు. సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు విచ్చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంత రైతాంగంపై వరాల జల్లు కురిపించారు. తాగు, సాగునీటి సమస్య లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గురువారం స్థానిక కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం జిల్లా వాసులను ఆకట్టుకుంది. హంద్రీ–నీవా కాలువ ద్వారా ప్రస్తుతం 2,200 క్యూసెక్కుల నీరుకూడా రావడం లేదన్నారు. ఈ కాలువను ఆధునీకరించి 6వేల క్యూసెక్కుల నీటిని ఇదే కాలువ గుండా ప్రవహించేలా చేస్తామన్నారు. ఇదొక్కటే కాకుండా ఈ కాలువ పక్కనే మరో 4వేల క్యూసెక్కుల సామర్థ్యం కల్గిన సమాంతర కాలువ పనులు కూడా చేపడతామన్నారు. జిల్లాను దేవుడు ఆశీర్వదించాడని, పదేళ్లుగా ఎప్పుడూ నిండని విధంగా ఈసారి చెరువులు నిండాయన్నారు. ‘గతంలో దివంగత నేత వైఎస్ హయాంలో చూశాం. మళ్లీ ఇవాల మా మనవడి పరిపానలో చూస్తున్నామని సగర్వంగా జిల్లా ప్రజలు చెబుతున్న మాటలు వింటున్నా’ అన్నారు. మీ అందరి తోడు, ఆశీస్సులు, దీవెనులు మీ బిడ్డకు ఇవ్వండి. మీ అందరి మన్ననలు పొందేలా పరిపాలన చేస్తాడని హామీ ఇచ్చారు. బీసీల గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచిపోయారు: మంత్రి శంకరనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. జ్యోతిరావు ఫూలే ఆలోచనలకు అనుగుణంగా ఆయా వర్గాలకు నామినేటెడ్ పదువులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పరిశ్రమల్లోనూ స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నారన్నారు. జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు అడుగులేస్తున్నారన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైద్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, మహ్మద్ ఇక్బాల్, కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్, డాక్టర్ సిద్దారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జవహర్‌రెడ్డి, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్తికేయమిశ్రా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ అరుణకుమారి, జేసీ డిల్లీరావు, కమిషనర్ పి.ప్రశాంతి, జేసీ–2 సుబ్బరాజు, డీఎంఈ డాక్టర్ వెంకటేశ్, డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, గురునాథరెడ్డి, శివరామిరెడ్డి, నాయకులు నదీంఅహమ్మద్, నవీన్‌నిశ్చల్, మహలక్ష్మీ శ్రీనివాస్, ఆలూరి సాంబశివారెడ్డి, రిటైర్డ్ జడ్జి కిష్టప్ప, రైతు మిషన్ సభ్యులు రాజారాం, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, వైవీ శివారెడ్డి, తోపుదుర్తి చందు, వీఆర్ రామిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనంత చంద్రారెడ్డి, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, గౌస్‌బేగ్, వెన్నపూస రవీంద్రారెడ్డి, బీసీ రమేష్‌గౌడ్, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అవాస్తవాలు రాస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారు
సాక్షి, అనంతపురం: ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కుమ్మక్కై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక సచివాలయం ఉద్యోగ పరీక్షల్లో అవినీతి జరిగిందని కట్టుకథలు అల్లారని ఎల్లోమీడియాపై మండిపడ్డారు. అవాస్తమని తేలడంతో గప్చిప్ అయ్యారన్నారు. ఇకనైనా వాస్తవాలు ప్రచురించాలని.. లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. -
ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలి
సాక్షి నెట్వర్క్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా కాకుండానే రికార్డు స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతుండటాన్ని చూసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కడుపు మండుతోందని వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలు రాసిన ఆ పత్రిక యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో 1.34 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సవ్యంగా ముగుస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. తన ఐదేళ్ల కాలంలో ఉద్యోగాలను భర్తీ చేయక నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిన బాబును వేనకేసుకొస్తూ.. ఇప్పుడు తప్పుడు ప్రచారంతో వారి ద్వారా ఆయనకు రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆదివారం వారు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిచ్చి రాతలు రాస్తే ప్రజలు తరిమి కొడతారు జాతిపిత మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం వైఎస్జగన్ ద్వారా సాధ్యమవుతుంటే ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ ఓర్వలేకపోతున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలలో అక్రమాలు జరిగాయని ఆ పత్రిక తప్పుడు కథనాలు రాస్తే.. దాని ఆధారంగా చంద్రబాబు ఏపీ సీఎంకు బరితెగింపు లేఖ రాశారని మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విశాఖ పార్టీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోటీ పరీక్షలు నిర్వహించే ఏపీపీఎస్సీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అనితమ్మకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంలో తప్పేంటని ప్రశ్నించారు. తప్పుడు కథనాలు ప్రచురించిన రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. గత ఐదేళ్లలో బాబు బాగోతాల గురించి ఏనాడైనా ప్రశ్నించారా అని రాధాకృష్ణను నిలదీశారు. ఇష్టమొచ్చినట్టు పిచ్చి పిచ్చి రాతలు రాస్తే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. తుపాన్ల పేరుతో సేకరించిన చరిత్ర రాధాకృష్ణదని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి పేరును చంద్రజ్యోతిగా మార్చుకోవాలని హితవు పలికారు. అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతి కోల్పోయిన చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, అందుకు ఆంధ్రజ్యోతి పత్రిక వంతపాడుతోందని అనంతపురం జిల్లా హిందూపురంలో మంత్రి శంకరనారాయణ మండిపడ్డారు. చంద్రబాబునాయుడు తన అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుంటూరు జిల్లా నరసరావుపేటలో విమర్శించారు. అక్రమాలు, లాబీయింగ్ ద్వారా ఏ ఒక్కరికీ ఉద్యోగాలు లభించలేదన్నారు. ఏపీపీఎస్సీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉండాలనే నిబంధన ఎక్కడాలేదన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో పేపర్ లీకైందంటూ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. పేపర్ లీకు ద్వారా ఉద్యోగం దక్కించుకుందని ప్రచారం చేస్తున్న బీసీ మహిళ అనిత భర్త ఎంతోమందికి ఉద్యోగాల కోసం పదేళ్ల నుంచి శిక్షణ ఇస్తున్నారన్నారు. ప్రముఖ హిందీ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో ఒక వంటమనిషి రూ.కోటి గెల్చుకున్నారని గుర్తు చేశారు. కాగా, ఆంధ్రజ్యోతి పత్రికపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు కడపలో డిమాండ్ చేశారు. రికార్డు స్థాయి ఉద్యోగాల భర్తీని జీర్ణించుకోలేకే.. రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీని మాజీ సీఎం చంద్రబాబు, ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్ అధిపతి వేమూరి రాధాకృష్ణలు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేపర్ ఎక్కడ లీకయిందో రాధాకృష్ణ చెప్పాలని, అందుకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో కలిసి రేపోమాపో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్ దగ్గరకు వెళ్తామని చెప్పారు. ప్రచురించిన కథనాలను నిరూపించకలేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని పేదల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. రాధాకృష్ణ అకృత్యాలపై దళితులు గొంతువిప్పాలి కులాల మధ్య చిచ్చుపెట్టే ఏబీఎన్ రాధాకృష్ణ అకృత్యాలపై రాష్ట్రంలో ఉన్న దళితులు, గిరిజనులు గొంతు విప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్లో వార్తలు ప్రసారంచేసి దళితులను కించపరిచాయన్నారు. రాధాకృష్ణ అకృత్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన విచారణకు ఆదేశించాలని కోరారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటే దానిని వక్రీకరించి కథనాలు ఇవ్వడంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుడు వార్తలతో పబ్బం గడుపుకుంటారా? పత్రికను అడ్డం పెట్టుకొని భూ దందాలు, పంచాయితీలు చేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వందల కోట్లు వెనకేసుకున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2009 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత వచ్చిన ప్రకటనలు, అక్రమాలు, భూ దందాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు వార్తలతో పబ్బం గడుపుకోవడమే ఆ పత్రిక దిన చర్య అని ధ్వజమెత్తారు. బాబు తప్ప మరొకరు సీఎంగా ఉండకూడదా.. అని ప్రశ్నించారు. ప్రస్తుత నియామకాల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు అత్యధికంగా లబ్ధిపొందుతుంటే ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వేమూరి రాధాకృష్ణపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు తాడిపత్రి: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసి, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ వారిలో అలజడి సృష్టించేలా రాతలు రాసిన ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం తాడిపత్రిలో డీఎస్పీ శ్రీనివాసులుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. -
బీసీ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ శంకరనారాయణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ జస్టిస్ శంకరనారాయణ నిమమితులయ్యారు. జస్టిస్ శంకరనారాయణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సామాజికంగా వెనుకబడిన బీసీలకు న్యాయం చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ బిల్లుకు బడ్జెట్ సమావేశాల సమయంలో ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. -
చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు..
సాక్షి, అనంతపురం: టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. జిల్లాలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదని తెలిపారు. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరని, తనకు పునరావాస కేంద్రం కావాలనడంపై మండిపడ్డారు. జిల్లాలో మాజీమంత్రి పరిటాల సునీత ఆగడాలు మితిమీరి పోయాయన్నారు. నసనకోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా పరిటాల వర్గీయులు దాడి చేశారని మండిపడ్డారు. రాజకీయ హింసను ప్రోత్సహించే సంస్కృతి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేదని స్పష్టం చేశారు. ఓ వైపు హింసా రాజకీయాలు చేస్తూ మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లటం టీడీపీ మానుకోవాలని హెచ్చరించారు. టీడీపీ గూండాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. సీఎం జగన్ వంద రోజుల పాలన చూసి టీడీపీ భయపడుతోందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని శంకరనారాయణ దుయ్యబట్టారు. -
పాము కలకలం .. మంత్రికి తప్పిన ప్రమాదం
సాక్షి, అనంతపురం : మంత్రి శంకర్ నారాయణ పాల్గొన్న స్పందన కార్యక్రమంలో పాము కలకలం సృష్టించింది. మంత్రి ప్రజలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పాము దూసుకొచ్చింది. సిబ్బంది అప్రమత్తంతో మంత్రికి ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలొ మంత్రి శంకర్‌నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. అనంతరం మంత్రి ప్రజలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పాము దూసుకొచ్చింది. ఓ వ్యక్తి కాలు దగ్గర వచ్చి ఆగింది. ఆ వ్యక్తి పామును చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే కాలుకు ఉన్నచెప్పును విసిరి దూరంగా పరుగెత్తాడు. దీంతో పాము ప్రజల్లోకి దూసుకెళ్లింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది మంత్రి శంకర్‌నారాయణను సురక్షితంగా ప్రజల మధ్య నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆ పాము రోడ్డు మీదగా పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
మంత్రి పర్యటనలో పాము కలకలం
-
‘టీడీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం’
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ పథకాల్లో అవకతవకలు జరిగాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీసీ సంక్షేమానికి చెందిన రూ. 1,432 కోట్లను ఇతర శాఖలకు మళ్లించారని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్లకు రెండేళ్లుగా అద్దె చెల్లించలేదని తెలిపారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ల ద్వారా రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. బ్యాంకులతో రుణాల ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఆదరణ పథకంతో పాటు ఇతర అక్రమాలపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. -
నవరత్నాలతో నవోదయం
సాక్షి, అనంతపురం : ‘‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం.. ఇందుకోసం ప్రతి ఒక్కరూ చేయూత ఇవ్వాలి. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, సంక్షేమ ఫలాలు అందించాలనే నిబద్ధతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మనమంతా తోడుగా నిలుద్దాం.’’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన జిల్లా మంత్రి హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమన్నారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ శిరస్సు వంచి ప్రణామం చేద్దామన్నారు. తమ ప్రభుత్వం అన్నదాతలకు అన్నివిధాల అండగా ఉంటుందని, ఆత్మహత్య చేసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్‌రెడ్డి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు, ఏఎస్పీ చౌడేశ్వరిదేవి, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు నదీం అహ్మద్, మహాలక్ష్మి శ్రీనివాస్ పాల్గొన్నారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు అక్టోబర్ 15వ తేదీ నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఇందు కోసం బడ్జెట్లో రూ.3,750 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 అందిస్తామన్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి పెట్టబడి సాయం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ.. ఈ రబీ సీజన్ నుంచే అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ జిల్లాలో ప్రారంభమైందన్నారు. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది ఫసల్, వాతావరణ బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి శంకరనారాయణ వెల్లడించారు. జిల్లాలోని 5,61,219 మంది రైతులకు సంబంధించి 10.25 శాతం బీమా ప్రీమియంలో 6.25 శాతం బీమా ప్రీమియం మొత్తం రూ.222 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలిన 4 శాతం ప్రీమియం రూ.149 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా కింద రూ.7 లక్షలు పరిహారం చెల్లించేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. వైఎస్సార్ వడ్డీలేని రుణాలతో రైతులకు లబ్ధి ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి పంట రుణాల లక్ష్యం రూ.7,070 కోట్లు కాగా... జిల్లాలో ఇప్పటివరకు రూ.5,372 కోట్ల రుణాలు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. రాయితీ వడ్డీ కింద కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీ రూ.161 కోట్లు, మిగిలిన 4 శాతం వడ్డీలేని రుణాల కింద రూ.215 కోట్లను ప్రభుత్వమే రైతుల తరఫున బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 16 రిగ్లోను అందుబాటులో ఉంచి నీటి లభ్యత ఆధారంగా అవసరమైన రైతులకు ఉచితంగా బోర్లు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందు కోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారన్నారు. ఖరీఫ్‌కు సంబంధించి జిల్లాలో రైతులకు పెండింగ్‌లో ఉన్న రూ.937 కోట్లు, రబీకి సంబంధించి రూ.46 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ధర లేక పప్పుశనగను గోదాముల్లో నిల్వ ఉంచిన 3,622 మంది జిల్లా రైతులకు రూ,43 కోట్లను మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి కింద ప్రభుతమే చెల్లిస్తుందని మంత్రి వెల్లడించారు. జిల్లాలో అధికంగా సాగ య్యే వేరుశనగ పంటకు క్వింటాలుకు రూ.5,090, కందికి రూ.5,800, పత్తికి రూ.5,255 మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధే లక్ష్యం జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి నూతన పండ్ల తోటల విస్తరణ, గ్రీన్‌హౌస్‌లు, షెడ్నెట్లు, ఉద్యాన యాంత్రీకరణ, తదితర ప్రోత్సాహకాలకు ఈ ఏడాది రూ.30 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఈ ఏడాది రూ.241 కోట్లతో 32 వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం సాగు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.35 కోట్ల ఖర్చుతో 5,243 హెక్టార్లలో డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.68 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఎన్సీడీసీ రుణాల ద్వారా 557 గొర్రెల యూనిట్లు మంజూరు చేశామనీ, రూ.32 కోట్లతో 2,048 గొర్రెలు, మేకల షెడ్లు, రూ.24.49 కోట్లతో 1,465 మినీ పశు వసతి గృహాలు, రూ.8 కోట్లతో 38 సామాజిక పశు వసతి గృహాలు నిర్మిస్తామన్నారు. పాడిపరిశ్రమ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జనవరి 26 నుంచి ‘జగనన్న అమ్మఒడి’ ‘జగనన్న అమ్మఒడి’ కార్యక్రమం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జనవరి 26న ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు 5,80,494 మంది విద్యార్థులు చదువుతున్నారనీ, వీరిలో 5,43,064 మంది తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్నారన్నారు. అలాగే జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకూ ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని అమలు చేస్తామన్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రారంభిస్తామన్నారు. అలాగే పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మౌలిక వసతుల కల్పన, బోధనా ప్రమాణాలు పెంచడం, ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడం, తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం తదితర చర్యల ద్వారా విద్యాభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. ఈ ఏడాది జూన్నెలలో రాజన్న బడిబాట కార్యక్రమం కింద 18,781 మంది బడీడు పిల్లలను బడిలో చేర్పించామన్నారు. గాంధీ జయంతి నుంచి గ్రామస్వరాజ్యం మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమమైందని మంత్రి శంకరనారాయణ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2వ నుంచి పట్టణాలు, గ్రామాల్లో వార్డు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో గ్రామ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాందీ పలకుతున్నామన్నారు. అర్హులందరికీ ఇళ్లు పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని మంత్రి వెల్లడించారు. ఉగాది పండుగ రోజున పేదలకు ఇళ్ల స్థలాలను చూపిస్తామన్నారు. మహిళల పేరు మీద పట్టాలు పంపిణీ చేసేందుకు తగిన భూమిని గుర్తించే ప్రక్రియ ప్రారంభించామన్నారు. గతంలో అసంపూర్తిగా ఉన్న 76,600 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు రూ.2,011.67 కోట్లు కేటాయించామన్నారు. రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం కల్పిస్తూ మరింత విస్తరిస్తామని మంత్రి శంకరనారాయణ తెలిపారు. వైద్యం అందక ఎవరూ చనిపోయే పరిస్థితి రాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందన్నారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి మండలంలో 104, 108 వాహనాలు ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా పంపిణీలో వినూత్న మార్పులు ప్రజా పంపిణీ వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన మేలురకపు బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోలు, 20 కిలోల ప్యాకెట్ల రూపంలో వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల 12,23,978 మంది కార్డుదారులకు లబ్ధి కలుగుతుందన్నారు. ఉద్యోగుల వేతనం పెంపు గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో రీసోర్స్ పర్సన్, యానిమేటర్లకు నెలకు రూ.10 వేలు, అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.11,500, ఆయా జీతం రూ.7 వేలకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఆశ వర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు ప్రభుత్వం పెంచింది. పారిశుద్ధ్య కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచామన్నారు. గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతం రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచామన్నారు. హోంగార్డుల జీతం రూ.18 వేల నుంచి రూ.21,300లకు, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచామన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చామన్నారు. సంక్షేమ వసతిగృహాలో మౌలిక వసతులు జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. మొదటి విడతగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ, గురుకుల వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.6.32 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 206 ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు ఒక అడాప్షన్ అధికారి నియమించి వాటిలోని 28,938 మంది విద్యార్థులకు మంచి వసతులు, విద్యాబోధన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్న కలెక్టర్‌ను ఈ సందర్భంగా అభినందిస్తున్నామన్నారు. జిల్లాలో 90 వేలు మంది బీసీ, కాపు, ఈబీసీ విద్యార్థులు, 43 వేల మంది ఎస్సీ విద్యార్థులు, 4,592 మంది ఎస్టీ విద్యార్థులు, 14,436 మంది మైనార్టీ విద్యార్థులకు ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేస్తామన్నారు. ‘స్పందన’కు అధిక ప్రాధాన్యం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని మంత్రి శంకరనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 37,230 అర్జీలు రాగా, అందులో 34,991 అర్జీలకు(93.98శాతం) పరిష్కారం చూపించామన్నారు. నాణ్యమైన పరిష్కారం దిశగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. స్పందనతో పాటు రెవెన్యూ సమస్యలపై ప్రతి శుక్రవారం ‘డయల్ యువర్ జేసీ’, ప్రతి శనివారం ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్న కలెక్టర్‌ను అభినందిస్తున్నామన్నారు. కరువు సీమను సస్యశ్యామలం చేస్తాం కరువు సీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో ‘హంద్రీ–నీవా’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని మంత్రి శంకరనారాయణ తెలిపారు. జిల్లాలో 3,45,800 ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకూ ఆయకట్టుకు నీరివ్వలేదన్నారు. జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ పనులను చేపట్టి లక్ష ఎకరాలకు ఆయకట్టుకు నీరిందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూ.458.42 కోట్లతో తుంగభద్ర కాలువ వెడల్పు పనులు, రూ.1,389 కోట్లతో యాడికి కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కాలువ, మిడ్‌పెన్నార్ దక్షిణ కాలువ, ధర్మవరం బ్రాంచ్ కాలువ, చాగల్లు బ్యారేజి కాలువ, జాజికొండ వాడు కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. తుంగభద్ర ఎగువ కాలువ, హంద్రీ–నీవా కాలువ ద్వారా ప్రస్తుతం విడుదలవుతున్న నీటితో జిల్లాలోని జలాశయాలు, చెరువులు నింపేందుకు జిల్లా యంత్రాగం ఏర్పాట్లు చేస్తోందన్నారు. పింఛన్ కానుక పెంచుకుంటూ పోతాం జగన్మోహన్రెడ్డి పింఛన్ పెంపు హామీ ఇచ్చిన తర్వాతే పింఛన్ రూ.2 వేలు పెరిగిందనీ, దాన్ని కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2,250కు పెంచిందని మంత్రి వివరించారు. వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3 వేల పింఛన్ అందిస్తామన్నారు. 40 శాతంపైన వికలత్వం ఉన్న దివ్యాంగులకు రూ.3 వేల పింఛన్ ఇస్తున్నామన్నారు. కిడ్నీ బాధితులకు పింఛను మొత్తాన్ని నెలకు రూ.10 వేలకు పెంచామన్నారు. జూలై 2019 నుంచి ప్రతి నెలా 4,90,692 మందికి రూ.119.60 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు డ్వాక్రా మహిళళకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు విరివిరిగా రుణాలు ఇప్పిస్తామని మంత్రి తెలిపారు. అలాగే అక్కచెల్లమ్మల తరఫున బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి 62,317 సంఘాలకు రూ.1,368.51 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు 7,586 సంఘాలకు రూ.193 కోట్లు రుణాలు అందించామన్నారు. జిల్లాలో ఆగస్టు 2016 నుంచి జూన్ 2019 వరకు వడ్డీలేని రుణాల కింద రూ.265.80 కోట్లు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వడ్డీలేని రుణాల కింద డ్వాక్రా మహిళలకు రూ.1,140 కోట్లు, పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.648 కోట్లు ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించామన్నారు. అలాగే అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా అమలు చేస్తామన్నారు. ఎన్నికల రోజు వరకు పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికి అందిస్తామని మేనిఫేస్టోలో చెప్పామని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 2019, ఏప్రిల్ 11 నాటికి 67,790 సంఘాలకు రూ.1,884.51 కోట్లు అప్పు ఉంది. ఇప్పటివరకు 61,376 సంఘాలకు రూ.1,793.38 కోట్ల రుణాలకు సంబంధించి వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తయిందన్నారు. -
పద్ధతి మారకపోతే పంపించేస్తా
సాక్షి, అనంతపురం: ‘‘ఇదేమైనా కార్యాలయమా..? మరేదైనా అనుకుంటున్నారా..? వేళకు రావాలని తెలీదా.? ఇష్టానుసారం ఎలా వస్తారు..? పద్ధతి మార్చుకోవాలి. తొలిసారి వదిలిపెడుతున్నా. మళ్లీ వస్తా. అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బంది పడతారు.’’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుల కార్యాలయ ఉద్యోగులను హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆయన కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్ పరిశీలించారు. టైపిస్ట్ విజయరాజు, కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్ రిజిస్టర్లో సంతకాలు చేయకపోవడంతో వారు డ్యూటీకి రాలేదా? అని డీడీ యుగంధర్‌ను మంత్రి ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీసుకు వచ్చి బయోమెట్రిక్ వేసి అనుమతితో వెళ్లారని వివరించారు. వచ్చి కూడా రిజిస్టర్లో సంతకం చేయకపోతే ఎలా? ఏమనుకుంటున్నారు? అని మంత్రి మండిపడ్డారు. అనారోగ్య రీత్యా విజయరాజు సరిగా రావడం లేదని, వచ్చినా పని చేయడని డీడీ వివరించారు. మంత్రి స్పందిస్తూ రెగ్యులర్ ఉద్యోగి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే మరొకరిని నియమించుకుని పనులకు ఆటంకం కలుగకుండా చూడాలని సూచించారు. అర్జీల నమోదులో నిర్లక్ష్యంపై ఆగ్రహం ‘స్పందన’ కార్యక్రమానికి అందిన అర్జీల నమోదు ప్రక్రియ సరిగా లేకపోవడంతో మంత్రి శంకరనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కార్యాలయ ఆవరణను పరిశీలించారు. కార్యాలయ స్థలాన్ని ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయించి బంకులను తొలగించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ తప్పనిసరి బీసీ సంక్షేమ వసతి గృహాల్లో కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలని మంత్రి శంకరనారాయణ ఆదేశించారు. బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బీసీలను ఉన్నత స్థాయిలో చూడాలనే ఆలోచనతోనే ఆయన పాలన సాగిస్తున్నారన్నారు. పేదరికం కారణంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో నియోజకవర్గానికి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రుచికరమైన భోజనం అందించేందుకు ప్రతి విద్యార్థికీ నెలకు రూ.1,050 వెచ్చిస్తున్నామన్నారు. హాస్టళ్లను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం వసతి గృహాల స్థితిపై ఫొటోలు తీయిస్తున్నామన్నారు. రెండేళ్ల తర్వాత చేసిన అభివృద్ధిపై ఫొటోలు తీయించి ‘నాడు–నేడు’ అని ప్రజలకు తెలియజేస్తామన్నారు. అలాగే కార్పొరేషన్ ద్వారా అర్హులైన బీసీలకు సంక్షేమపథకాలు అమలు చేస్తామన్నారు. మంత్రి వెంట బీసీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు యుగంధర్, అనంతపురం ఏబీసీడబ్ల్యూఓ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఉన్నారు. -
సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు : శంకర్ నారాయణ
-
గ్రామ వాలెంటరీ వ్యవస్థలో అవినీతికి తావు లేదు
సాక్షి, అమరావతి : గ్రామ వాలెంటరీ వ్యవస్థలో అవినీతికి తావు లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. గ్రామ వాలెంటరీలుగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. జన్మభూమి కమిటీలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. అవినీతి, అక్రమాలతో చంద్రబాబు పాలన కొనసాగిందని మండిపడ్డారు. -
ఏమిటీ దుర్భరస్థితి ?
సాక్షి, తాడికొండ(గుంటూరు) : స్థానిక బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి శంకర నారాయణ.. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో కలిసి పరిశీలించారు. 105 మంది విద్యార్థులకుగాను 20 మరుగుదొడ్లు ఉన్నాయి. వీటిలో 10 మరుగుదొడ్లకు తలుపులు ఊడిపోయి ఉండటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలు ఉండే వసతి గృహంలో ఇలాంటి దుర్భర పరిస్థితి ఏంటని వార్డెన్‌ను ప్రశ్నించారు. ‘కనీస మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత లేదా.. విద్యార్థినులు ఇలాంటి వాటిలో ఎలా కాలకృత్యాలు తీర్చుకుంటార’ని ప్రశ్నించారు. మరమ్మతుల కోసం ఇటీవల అంచనాలు రూపొందించామని బీసీ సంక్షేమ శాఖ డీడీ చినబాబు తెలిపారు. అనంతరం విద్యార్థినులను పిలిచి మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా ? లేదా ? పాలు, గుడ్లు ఎన్నిసార్లు ఇస్తున్నారు. చికెన్ వారంలో ఎన్ని సార్లు అందుతుంది. నాణ్యత ఉంటుందా ? లేదా ? అని ప్రశ్నించారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించిన అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. కష్టపడి చదవండి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ తానూ హాస్టల్లో చదివానని, కష్టపడి చదవాలని సూచించారు. అక్కడ నుంచి స్టోర్ రూమ్‌లో సరుకులను మంత్రి పరిశీలించారు. అనంతరం వండిన అన్నం, కూరలను రుచి చూశారు. బెడ్లు ఒక దానిపై ఒకటి రెండు స్టేర్‌లుగా ఉండటంతో పైన పడుకున్న వారికి ఫ్యాన్లు తగులుతున్నాయని విద్యార్థులు చెప్పగా.. సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. తిరిగి వారం రోజుల్లో ఇదే రోజు వసతి గృహాన్ని తనిఖీ చేస్తానని, ఏమైనా సమస్యలు ఉంటే ఒప్పుకోనని హెచ్చరించారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వసతి గృహాల ఉన్న స్థితిని గుర్తించి ఉన్నత స్థితికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందని తెలిపారు. బీసీలంటే బ్యాక్ బోన్ కులాలు అనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి రుజువు చేస్తున్నారని చెప్పారు. వారి వెంట తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు మండల పార్టీ అధ్యక్షులు తియ్యగూర బ్రహ్మారెడ్డి, బత్లు కిషోర్, కందుల సిద్ధయ్య, మాజీ ఎంపీపీలు బండ్ల పున్నారావు, కొమ్మినేని రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి మల్లంపాటి రా«ఘవరెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. -
కాల్‌మనీ కేసుల్లో రూ.700 కోట్ల వ్యాపారం
సాక్షి, అమరావతి: కాల్‌మనీ కేసుల్లో మొత్తం రూ. 700 కోట్ల వ్యాపారం జరిగిందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శాసన మండలిలో కాల్ మనీ కేసులకు సంబంధించిన అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం సమాధానమిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 కాల్ మనీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. విజయవాడలో 14, పశ్చిమ గోదావరిలో మూడు, కడపలో ఒక కేసు నమోదైనట్టు వివరించారు. విజయవాడలో ఈ కేసులకు సంబంధించి మొత్తం 30 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో ఏడుగురిపై రౌడీషీటు ఓపెన్ చేసినట్టు తెలిపారు. కాల్ మనీ వ్యవహారానికి వ్యతిరేకంగా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం కాల్ మనీ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. బీసీల కోసం 139 కార్పొరేషన్లు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం మొత్తం 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా వెనుకబడిన కులాలకు సంబంధించిన అనేక మంది తమ సమస్యలు తెలుసుకున్నారని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసన మండలి సభ్యులు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. -
ఏపీలో సువర్ణాధ్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిజమైన సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ రాష్ట్ర శాసనసభ నూతన అధ్యాయాన్ని లిఖించింది. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులను మంగళవారం ఆమోదించింది. సామాజిక న్యాయ స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తూ రాజ్యాంగ లక్ష్యాల సాధన దిశగా గొప్ప ముందడుగు వేసింది. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లుతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుల లక్ష్యాలు, ఉద్దేశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ మంగళవారం శాసనసభకు వివరించారు. అనంతరం ఈ బిల్లులపై మంత్రులు, సభ్యులు కూలంకుషంగా చర్చించారు. ఈ బిల్లులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మహిళల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రశంసించారు. రాష్ట్రంలో నూతన సామాజిక విప్లవానికి తెరతీస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని సభ్యులు కొనియాడారు. అనంతరం సభ ఈ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది సుదినం.. కొత్త చరిత్రకు తెరతీస్తూ కీలకమైన బిల్లులను ఆమోదించడం ద్వారా శాసనసభ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చింది. ఎన్నో ఏళ్ల వివక్షకు ముగింపు పలుకుతూ ఆ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా న్యాయమైన అవకాశాలను కల్పించేందుకు రాచబాట పరిచింది. బడుగు, బలహీన వర్గాల కష్టాలను పాదయాత్రలో చూసి చలించిన ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి విప్లవాత్మకమైన ముందడుగు వేశారు. బీసీల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పిస్తూ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో బీసీలు తమ హక్కులకు భంగం వాటిల్లినా, వివక్షకు గురైనా ఆశ్రయించడానికి వారికి ఓ చట్టబద్ధ వేదిక లభించింది. బీసీ జాబితాలో కొత్త కులాల చేర్పు, తొలగింపులను పరిశీలించేందుకు ఓ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. న్యాయాధికారాలు కలిగి ఉండే బీసీ కమిషన్ ఆ వర్గాల హక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి చట్టబద్దత కల్పించింది. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో సగం బడుగు, బలహీన వర్గాలకు దక్కనున్నాయి. అదే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. దాంతో ఆ వర్గాలు ఆర్థికంగా స్వావలంబన సాధనకు మార్గం సుగమమైంది. ఆకాశంలో సగం.. అవనిలో సగం ఉన్న మహిళలకు అవకాశాల్లోనూ సగం కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయానికి ఆమోద ముద్ర వేసింది. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సగభాగం హక్కు దక్కింది. నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి దోహదం చేసేకీలక బిల్లులపై చర్చను ప్రతిపక్ష పార్టీ టీడీపీ బహిష్కరించడం విస్మయపరిచింది. ఆద్యంతం అడ్డుకునేందుకే యత్నం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అధికారం కల్పించే కీలక బిల్లులపై అసెంబ్లీలో చర్చను అడ్డుకోడానికి ప్రతిపక్ష టీడీపీ శతథా యత్నించింది. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లు ఉద్దేశాలను మంత్రి శంకర నారాయణ అసెంబ్లీలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అంతరాయం సృష్టించారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. కొందరు ఏకంగా స్పీకర్ పోడియం మీదకు చేరి నినాదాలు చేశారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం, సాధికారికత కోసం కీలక బిల్లులపై చర్చకు సహకరించాలని ప్రభుత్వం తరఫున మంత్రి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ టీడీపీ సభ్యులు ఏమాత్రం వినిపించుకోలేదు. మంత్రి శంకర నారాయణ ప్రసంగిస్తున్నంతసేపు నినాదాలు చేస్తునే ఉన్నారు. టీడీపీ సభ్యుల అరుపులు, కేకల మధ్యే డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి బిల్లులపై చర్చను కొనసాగించాల్సి వచ్చింది. తమ స్థానాల్లో కూర్చొని చర్చకు సహకరించాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ చేసిన విజ్ఞప్తిని కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. బిల్లుపై చర్చలో పాల్గొంటూ ఎమ్మెల్యేలు వేణుగోపాల్, కరణం ధర్మశ్రీ మాట్లాడుతున్నంతసేపూ టీడీపీ సభ్యులు వారి ప్రసంగానికి అడ్డుతగిలేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. అయినప్పటికీ డిప్యూటీ స్పీకర్ నిబద్ధతతో చర్చను కొనసాగించారు. చివరికి ఎమ్మెల్యే పార్థసారథి ప్రసంగిస్తుండగా చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు అన్ని విధాలా మేలు చేకూర్చే విషయంలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అంబేడ్కర్ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సీఎం చట్టసభల్లో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 366ను పొందుపరిచారు. ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవులు, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. – పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు బీసీల సాధికారికతను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర బీసీలకు సాధికారికత చేకూర్చే చరిత్రాత్మక బిల్లులను అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన బృందం సభకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నిస్తోండటం సబబు కాదు. వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతో సభా వ్యవహారాలను అడ్డుకుంటున్నారు. బీసీలకు శాశ్వత కమిషన్ ఏర్పాటైతే తమ సమస్యలను నోరు విప్పి చెప్పుకోలేని స్థితిలో ఉన్న బీసీల విషయాలను సుమోటో కేసులుగా స్వీకరించే వెసులుబాటు లభిస్తుంది. – చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యే, రామచంద్రాపురం ఇలాంటి సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు గత ప్రభుత్వం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది. కానీ మైనార్టీల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేయడం ఎలాగో సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. వారి పురోభివృద్ధికి ఏకంగా చట్టం తీసుకువస్తున్నారు. అలాంటి సీఎం కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలూ కోరుకుంటున్నారు. – ముస్తఫా, ఎమ్మెల్యే, గుంటూరు ఈస్ట్ టీడీపీ ఓర్వలేకపోతోంది.. దేశ చరిత్రలోనే తొలిసారిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని చూసి ప్రతిపక్ష టీడీపీ ఓర్వలేకపోతోంది. ఇంతటి చరిత్రాత్మక సమయంలో సభలో ఉండకుండా వెళ్లిపోవడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ఆయన తన పాలనలో బీసీలను అన్ని విధాలుగా మోసం చేశారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బీసీలకు న్యాయం చేస్తుంటే కూడా చూడలేకపోతుండటం టీడీపీ నైజాన్ని బయటపెడుతోంది. – అనిల్ కుమార్ యాదవ్, నీటి పారుదల శాఖ మంత్రి ఈ ఘనత సీఎం జగన్‌దే ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి అందరూ అంటుంటారు. మహిళలకు నిజంగా అవకాశల్లో సగం ఇచ్చి సీఎం వైఎస్ జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ, హోం మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలు అవమానాలకు గురయ్యారు. కానీ రాష్ట్రంలో మహిళలను చెల్లిగా, తల్లిగా గౌరవించే మహోన్నత స్వభావం ఉన్న వైఎస్ జగన్ సీఎం కావడం మన అదృష్టం. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, నగరి ఇది పండుగ దినం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇది నిజమైన పండుగ రోజు. రాజకీయ అధికారం, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అణగారిన వర్గాలకు సామాజిక గౌరవం కల్పించారు. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు బీసీల గుండెల్లో సీఎం జగన్ నిలిచిపోతారు బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్ కులాలు అని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే చంద్రబాబు సహకరించకపోగా ఆటంకాలు సృష్టిస్తున్నారు. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. బీసీ హృదయాలలో జగన్ చిరస్మరణీయునిగా ఉంటారు. – కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం బీసీల హక్కుల పరిరక్షణకు నాంది చంద్రబాబు బీసీలకు తీవ్ర ద్రోహం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 550తో రాష్ట్రంలో దాదాపు 500 మంది బీసీ విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారు. చంద్రబాబు పాలనలో రాజధానితో సహా రాష్ట్రమంతటా కుల, మతాల తారతమ్యాలు, కుల వివక్ష విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి సామాజిక రుగ్మతలను రూపు మాపడానికి సీఎం వైఎస్ జగన్ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నియమించాలని నిర్ణయించారు. ఈ కమిషన్‌తో బీసీల హక్కుల పరిరక్షణ సాధ్యపడుతుంది. – కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే, పెనమలూరు మరో అంబేడ్కర్, అల్లూరి అన్ని స్థాయిల్లోని పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగు ముందుకు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్లపై పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇంతే కాకుండా ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ చేయబోమని ప్రకటించడం గిరిజనుల్లో సంతోషం కలిగించింది. అందుకే గిరిజనులు వైఎస్ జగన్‌ను మరో అంబేడ్కర్‌గా, మరో అల్లూరిగా కీర్తిస్తున్నారు. – భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు మహిళా సాధికారికత సాకారం పార్లమెంటులో మహిళా బిల్లు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. కానీ సీఎం వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మహిళా సాధికారికత కలను సాకారం చేశారు. – జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే, శింగనమల దేశ చరిత్రలో ఇదే తొలిసారి అసమానతలకు గురవుతున్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్లపై ఇచ్చే పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వైఎస్ జగన్ నామినేషన్లపై ఇచ్చే పనుల్లో బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా నిజమైన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. – మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే, వేమూరు సామాజిక న్యాయానికి శ్రీకారం బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతి, నిజమైన సామాజిక న్యాయం, సమాన హక్కుల కల్పన పట్ల సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధి, నిబద్ధత దేశానికి ఆదర్శప్రాయం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతో బలహీన వర్గాల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. పాత కమిషన్ బిల్లులున్నా అవి సరిగా పని చేయకపోవడంతో నూతన బిల్లును తీసుకువచ్చాం. ఈ కొత్త శాసనం బీసీలలో విశ్వాసం కలిగిస్తుందని విశ్వసిస్తున్నాం. అన్ని స్థాయిల్లోనూ రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక గౌరవం దక్కుతుందనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానం. అందుకే ఆ వర్గాలకు అన్ని నామినేటెడ్ పదవుల్లో, అన్ని నామినేటెడ్ పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను ప్రవేశపెట్టి ఆ వర్గాల ఆర్థిక స్వావలంబన సాధనకు ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు పురోగతి సాధించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మకమైన విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళా సాధికారికత సాధనకు మార్గం సుగమమవుతుంది. – ఎం.శంకర నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మహిళల అభ్యున్నతికి విప్లవాత్మక నిర్ణయం టీడీపీ ప్రభుత్వంలో మహిళలు పూర్తిగా మోసానికి గురయ్యారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. సున్నా వడ్డీకి రుణాలను ఇవ్వలేదు. బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి దిగేనాటికి రాష్ట్రంలో వాటి సంఖ్యను 40 వేలకు పెంచారు. తహశీల్దార్ వనజాక్షి మీద దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేను అప్పటి సీఎం చంద్రబాబు వెనకేసుకొచ్చారు. అందుకే ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఓడించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు బలోపేతం అయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. – పుష్ప శ్రీవాణి, డిప్యూటీ సీఎం మనసున్న పాలకుడి గొప్ప నిర్ణయం పదేళ్ల పాటు ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు, కన్నీళ్లను దగ్గరి నుంచి చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇది. మనసున్న పాలకుడి పాలన ఎలా ఉంటుందో ఆయన చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దేశానికి ఆదర్శంగా నిలిచారు. – బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం వైఎస్ జగన్‌కు సెల్యూట్.. ఐదు నెలల క్రితం ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చేసి చూపిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విలువలు, విశ్వసనీయత అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల మనసులో నిలిచిపోతారు. అందుకే బీసీ వర్గాల తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సెల్యూట్ చేస్తున్నా. – జోగి రమేష్, ఎమ్మెల్యే, పెడన మహిళల ఆత్మవిశ్వాసం పెంచే మహా విప్లవం తరతరాలుగా మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ముందడుగు వేశారు. మహిళల ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పెంచే మహా విప్లవం ఇది. ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ఇందుకు మహిళా లోకం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – విడదల రజని, ఎమ్మెల్యే, చిలకలూరిపేట -
బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, అమరావతి: సామాజికంగా వెనుకబడిన బీసీలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌నారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో బీసీలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆయన పేర్కొన్నారు. బీసీలను కేవలం కులవృత్తులకు పరిమితం చేయాలనే దురాలోచన చంద్రబాబుకు ఉందని ఆయన మండిపడ్డారు. బీసీల్లో అనేకమైన సంచార జాతులు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి టీడీపీకి లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఉన్నతమైన స్థానంలో చూడాలనే దృఢ సంకల్పం సీఎం వైఎస్ జగన్‌ది అని ఆయన స్పష్టం చేశారు. -
‘చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తూ.. నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ ధన్యవాదాలు తెలిపారు. పనుల్లో 50 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని భావించినందుకు మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బిల్లును సభలో ప్రవేశపెడితే సీఎంకు మంచి పేరు వస్తుందని టీడీపీ ఎమ్మెల్యేలు కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. బీసీలకు చంద్రబాబు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కంటే వైఎస్ జగన్ 20 శాతం అధికంగా ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు. బడుగుబలహీన వర్గాల బాధలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి అని.. పాదయాత్రలో వారికిచ్చిన హామీ మేరకు ఈ బిల్లును ప్రవేశ పెట్టారని తెలిపారు. బీసీల పట్ల చంద్రబాబు గతంలో కపట ప్రేమ చూపించారని మంత్రి విమర్శించారు. -
'ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమే'
సాక్షి, అనంతపురం : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ శనివారం పరిగి మండలం హోన్నంపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమేనని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలు మొలిచాయే తప్ప అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం పేరుతో భూములను చదును చేయడానికి దాదాపు రూ. 175 కోట్ల ప్రభుత్వ నిధులను ఉపయోగించిన బాబు అదే నిధులతో రాజధాని ప్రాంత అభివృద్ధిని మాత్రం చేపట్టడంలో విఫలమవ్వడమే గాక, ఇప్పుడు ఈ తప్పులను మఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదకు నెడుతున్నారని మంత్రి ఆరోపించారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ ఫలాలను అర్హులకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇంటింటికీ చేర్చేందుకే గ్రామ వలంటీర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రూ. 12,500 అందిస్తామని, పంటల బీమా ప్రీమియంలను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. -
నేరుగా మీ ఖాతాల్లోకి జీతాలు : బాలినేని
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం నిర్వహించిన వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం సబ్ కమిటీ వేసిందని తెలిపారు. ఆ కమిటీలో తాను కూడా సభ్యుడుగా ఉన్నానని, ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు వచ్చేలా కృషి చేస్తానని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అందరి కష్టాలను తీర్చే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తారన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖలో రూ. 20 వేల కోట్లు అప్పు చేసిందని, విండ్, సోలార్, పవర్ పీపీఏల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బాలినేని ఆరోపించారు. హెచ్ఆర్ పాలసీ తెచ్చి ప్రత్యక్షంగా ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు వచ్చేలా చేస్తామన్నారు. 3 వేల మందితో ప్రారంభమైన యూనియన్ నేడు 25 వేలకు చేరుకుందని.. ఇందుకు కారుమురి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని కొనియాడారు. అవినీతికి తావు లేదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలను అమ్ముకున్న పరిస్థితిని చూశామని, తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో అందరి సమస్యలు తెలుసుకున్నారని.. తగిన న్యాయం చేస్తారని కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాగా ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వెన్నపూస వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీ విద్యార్థులను చంద్రబాబు నిండా ముంచారు’
సాక్షి, అమరావతి : బీసీ విద్యార్థులకు మాజీ ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారయణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు, మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు గత ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖకు చెందిన 1432 కోట్ల రూపాయల నిధులను మళ్లింపు చేపట్టిన ప్రభుత్వం బీసీ, కాపు, ఈబీసీ, ఎంబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబు తమది బీసీల పార్టీ అని వారిని నిండా ముంచేశారని వ్యాఖ్యానించారు. బీసీ, కాపు, ఈబీసీ విద్యార్థులు ప్రతిరోజు స్కాలర్‌షిప్‌ల కోసం పోన్లు చేస్తున్నారని తెలిపారు. గతేడాది పిల్లలకివాల్సిన నిధులను చంద్రబాబు ఓట్ల ప్రలోభాల కోసం మళ్లించారని ఆరోపించారు. ఎన్నికల ముందు బీసీలను అనేక రకాలుగా మోసం చేసిన చంద్రబాబు విద్యార్థులను కూడా వదల్లేదని విమర్శించారు. -
‘చంద్రబాబు బీసీల ద్రోహి’
సాక్షి,అమరావతి : బీసీలను వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన బీసీల ద్రోహి అంటూ బీసీ శాఖ మంత్రి శంకర్ నారాయణ ఘాటుగా విమర్శించారు. అసెంబ్లీ సంప్రదాయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. బీసీ కనుకే తమ్మినేని సీతారాంను స్పీకర్ చైర్ వద్దకు తీసుకురాలేదని ఆరోపించారు. వైఎస్ జగన్ బీసీలకు పెద్ద పీఠ వేశారని కొనియాడారు. బీసీలకు ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని అన్నారు. బలహీన వర్గాలకు చెందిన ఒక సీనియర్ నాయకుడిని (తమ్మినేని సీతారాం) వైఎస్సార్సీపీ స్పీకర్ పదవికి ఎన్నిక చేస్తే సభా సంప్రదాయాలను గౌరవించి ఆయన్ను అన్ని పార్టీల నాయకులు స్పీకర్ స్థానం వరకు తీసుకువెళ్లి సాదరంగా కూర్చోబెట్టడానికి ప్రతిపక్ష నేత ముందుకు రాకపోవడం ప్రతి ఒక్కరిలోనూ ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత కూడా స్పీకర్ తమ్మినేనిని అభినందిస్తూ సభ్యులు చేసే ప్రసంగాలు ముందుకు సాగకుండా రాజకీయపుటెత్తుగడలు పన్నడంపై కూడా అందరినీ విస్మయానికి గురి చేసిన సంగతి తెలిసిందే. -
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శంకరనారాయణ
-
శంకరనారాయణ అనే నేను..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణకు చోటు దక్కింది. రాజధాని అమరావతిలో నేడు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జిల్లాకు దక్కిన ఒకే మంత్రి పదవిని బీసీలకు కేటాయించడంతో వెనుకబడిన వర్గాలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లయింది. దీంతో పాటు శంకర్‌నారాయణను గెలిపిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని 2014లో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చినట్లయింది. శంకర్‌నారాయణ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా దాదాపు ఏడేళ్లు పనిచేశారు. ఆ తర్వాత హిందూపురంపార్లమెంట్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుకొండ నుంచి వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగారు. 17,415 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పార్థసారథికి 79, 793 ఓట్లు పోలైతే, శంకర్‌నారాయణకు 62,378 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పెనుకొండ బరిలో నిలిచి 16,494 ఓట్లు సాధించారు. అప్పట్లో రఘువీరా బరిలో లేకపోతే శంకర్‌నారాయణ గెలిచే వారనే చర్చ నడిచింది. ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై 15,058 ఓట్లతో శంకరనారాయణ విజయం సాధించారు. సౌమ్యుడిగా, చిన్నా పెద్ద తేడా లేకుండా కలుపుగోలుగా వ్యవహరించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ‘అనంత’లో బీసీలకు పెద్దపీట: అనంతపురం జిల్లాలో బీసీలకు జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి పెద్దపీట వేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీసీ నేత పైలా నర్సింహయ్యను మొదట కొనసాగించారు. తర్వాత శంకరనారాయణకు సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం, అనంతపురం రెండు ఎంపీ స్థానాల్లో సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన గోరంట్ల మాధవ్, తలారి రంగయ్యలకు టిక్కెట్లు ఇచ్చి ఎంపీలుగా గెలిపించారు. దీంతో పాటు పెనుకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ టిక్కెట్లను శంకర్‌నారాయణ, ఉషాశ్రీచరణ్, కాపు రామచంద్రారెడ్డిలకు ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు బీసీ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బీసీ కోటాలో శంకర్‌నారాయణకు చోటు కల్పించారు. జిల్లాలో బోయ, కురుబతో పాటు బీసీలు మొత్తం మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. దీంతో జిల్లాలో బీసీలకు వైఎస్సార్సీపీ పెద్దపీట వేసినట్లయింది. మంత్రివర్గంలో కూడా అత్యధికంగా బీసీలకు చోటు కల్పించారు. వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయాల పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23ఏళ్ల తర్వాత పెనుకొండకు మంత్రి పదవి పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గానికి 23 ఏళ్ల తర్వాత మళ్లీ మంత్రి పదవి లభించింది. 1996లో అప్పటి పెనుకొండ ఎమ్మెల్యే దివంగత పరిటాల రవీంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు 1987–89 మధ్యకాలంలో ఎస్.రామచంద్రారెడ్డి పెనుకొండ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. తాజా ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత బీకే పార్థసారథిపై వైఎస్సార్సీపీ తరపున గెలుపొందిన మాలగుండ్ల శంకర్‌నారాయణను మంత్రి పదవి వరించింది. బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తా నాకు మంత్రి పదవి ఇవ్వడం బీసీలకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేస్తా. నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు, అండగా నిలిచిన తోటి ఎమ్మెల్యేలకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లాలో పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రథమ కర్తవ్యం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించి, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా. తోటి ఎమ్మెల్యేల సహకారంతో ముందుకెళ్తా.– శంకర్‌నారాయణ, మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ప్రొఫైల్ పేరు: మాలగుండ్ల శంకర నారాయణ విద్యార్హత: బీకాం, ఎల్ఎల్బీ తండ్రి: మాలగుండ్ల వకీలు పెద్దయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్, ధర్మవరం తల్లి: యశోదమ్మ సతీమణి: జయలక్ష్మి సోదరులు : మాలగుండ్ల రవీంద్ర, మాలగుండ్ల మల్లికార్జున పిల్లలు: మాలగుండ్ల పృద్వీరాజ్, నవ్యకీర్తి రాజకీయ నేపథ్యం 1995లో టీడీపీ జిల్లా కార్యదర్శి 2005లో ధర్మవరం మున్సిపల్ కౌన్సిలర్ 2011లో వైఎస్సార్సీపీలో చేరిక 2012లో పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి 2019లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై 15,041 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం. -
నిర్బంధంలో వైఎస్సార్సీపీ నేతలు
-
పోరుబాట ఉద్రిక్తం.. నిర్బంధంలో వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, అనంతపురం: కియా కార్ల ఫ్యాక్టరీ వ్యవహారంలో అధికార టీడీపీ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కియా కార్ల ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీ నేతలు ధర్నాను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన పార్టీ నేతలపై అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు నిర్బంధం విధించారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన వైఎస్సార్సీపీ పెనుకొండ సమన్వయకర్త శంకర్‌నారాయణ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు అనంతపురం మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీలను పోలీసులు నిర్భంధించారు. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులను తమ నిర్భందంలో ఉంచుకున్న పోలీసులు.. ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
నేనున్నాను నేనుంటాను
‘అయామ్.. ఐ విల్’. ఇదీ ఈ ఏడాది వరల్డ్ క్యాన్సర్ డే నినాదం. మరో రెండేళ్ల పాటు ఇదే నినాదంతో క్యాన్సర్ డే కార్యక్రమాలు ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తాయి. అయితే యు.ఎస్.లో ఉంటున్న రాజ్యలక్ష్మి దంపతులు గత ఐదేళ్లుగా ఇదే నినాదంతో.. ‘నేనున్నాను.. నేనుంటాను’ అంటూ క్యాన్సర్ పేషెంట్లకు భరోసా ఇవ్వడంతో పాటుఆర్థికంగా తోడ్పాటునిస్తున్నారు. ‘‘మేడమ్! మెడిసిన్స్ స్టాక్ తగ్గుతోంది. మరికొంత పంపిస్తారా’’ హోల్‌సేల్ డ్రగ్గిస్ట్ మాధవి నుంచి ఫోన్.‘‘అలాగే మాధవీ! ఈ నెల ఎక్కువ అవసరం పడ్డాయా? సరే, అరేంజ్ చేస్తాను’’ బదులిచ్చారు రాజ్యలక్ష్మి. వెంటనే మందుల తయారీ కంపెనీకి ఫోన్ చేసి తనకు కావాల్సిన మెడిసిన్స్ ఇండెంట్ చెప్పారామె. ఇంతలో మరో ఫోన్... డాక్టర్ నుంచి. ‘‘మేడమ్! ఈ నెల ఎక్కువ మందిని రిఫర్ చేశాను. అంత అవసరం ఏర్పడింది.’’‘‘ఫర్వాలేదు డాక్టర్ గారూ, ఎంతమంది వచ్చినా పంపించండి’’ భరోసా ఇచ్చారు రాజ్యలక్ష్మి.‘‘అంతకు ముందు మందులు కొనుక్కోలేని పేషెంట్లను చూసి ఓ క్షణం బాధపడి, తర్వాత మర్చిపోయేవాళ్లం. ఇప్పుడు పేషెంట్లకు ధైర్యం చెప్పి మీరు అరేంజ్ చేసిన డీలర్ దగ్గరకు పంపిస్తున్నాం. ఇది మీతో ప్రతిసారీ చెప్తున్న మాటే అయినా మళ్లీ మళ్లీ చెప్పాలనిపిస్తోంది. మందులు సబ్సిడీ ధరల్లో దొరుకుతాయని చెప్పినప్పుడు, అసలే కొనలేని వాళ్లకు ఉచితంగా ఇస్తారని చెప్పినప్పుడు పేషెంట్ కళ్లలో కనిపించే సంతోషం ఇంత అని మాటల్లో చెప్పలేను. వ్యాధి నయం అయినట్లే రిలీఫ్ పొందుతుంటారు. వాళ్లందరి తరఫున మరోసారి కృతజ్ఞతలు’’ అన్నారు ఆ డాక్టర్.‘‘చేస్తున్నది నేను కాదు డాక్టర్ గారూ, ఆ భగవానుడే నా చేత చేయిస్తున్నాడు. సేవ అవసరం నాకు తెలియడానికే నాకు వ్యాధిని ఇచ్చి, వ్యాధిని తగ్గించి, మళ్లీ జీవితాన్నిచ్చినట్లున్నాడు. ఇకపై ఈ జీవితం అభాగ్యుల సేవకోసమే. నాకొక్కదానికే ఈ బాధ తెలిస్తే చాలదనుకున్నాడేమో ఆ భగవంతుడు. నాతో పాటు, నా భర్తనూ క్యాన్సర్ బారిన పడేసి, తిరిగి మమ్మల్ని మామూలు మనుషులను చేశాడు. ఖరీదైన క్యాన్సర్ మందులు కొనుక్కోలేని వాళ్లకు సహాయం చేయడానికి డబ్బును కూడా ఆ భగవంతుడే సమకూర్చాడు. ఆ భగవంతుడిచ్చిన డబ్బును అవసరమైన వాళ్లకు చేరుస్తున్న చేతులు మాత్రమే ఇవి’’ అన్నారు రాజ్యలక్ష్మి మృదువుగా. నిజమే.. ఆమె ఎప్పుడూ తాను సహాయం చేస్తున్నానని చెప్పరు. తాను నమ్మే భగవానుడే చేయిస్తున్నాడంటారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే (గివింగ్ బ్యాక్ టు సొసైటీ) సంకల్పం తనలో కలగడం కూడా ఆ భగవానుని ప్రేరణేనంటారామె. ‘మణీస్ కేఫ్’ వాళ్లమ్మాయి రాజ్యలక్ష్మి ప్లాంజెరీ పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో. అప్పట్లో ప్రసిద్ధి చెందిన మణీస్ కేఫ్ వాళ్లమ్మాయి. తమిళనాడు నుంచి వచ్చి కావలిలో స్థిరపడిన తమిళ కుటుంబం వారిది. కావలిలో న్యాయవాదిగా కెరీర్ మొదలు పెట్టిన రాజ్యలక్ష్మికి నెల్లూరు కోమల విలాస్ వాళ్లబ్బాయి శంకర్‌నారాయణతో వివాహమైంది. కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నారు వాళ్లు. ఆమె హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు కూడా. భర్తకు అమెరికాలో ఉద్యోగం రావడంతో ఆమె ప్రయాణానికి గమ్యం కూడా అమెరికానే అయింది. ప్లాంజెరీ అనేది తమిళనాడులో శంకర్‌నారాయణ పూర్వికుల గ్రామం. ఆ ఊరి పేరే ఇంటిపేరుగా అమెరికాలో స్థిరపడ్డారు వాళ్లు. ఆ సంగతులను యు.ఎస్.నుంచి ‘సాక్షి’తో పంచుకున్నారు రాజ్యలక్ష్మి ప్లాంజెరీ. డాలర్ ఆరు రూపాయల కాలం ‘‘మేము అమెరికా వెళ్లినప్పుడు ఒక డాలర్ ఆరు రూపాయలు. జీవించడానికి, జీవితంలో నిలదొక్కుకోవడానికి మా వారి జీతం సరిపోయేది. మాకు తొలిబిడ్డ అమ్మాయి. ఇంటి వెలుగు అని మురిసిపోయేలోపు పిడుగులాంటి నిజం. పాపాయి స్పెషల్లీ చాలెంజ్డ్ చైల్డ్! వైద్యం చేయించడానికి జీతం సరిపోయేది కాదు. బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటంతో ఎనిమిదేళ్లపాటు పోరాటం చేశాం. మన బంధం ఇంతటితో తీరిపోయిందని చెప్పకుండానే మమ్మల్ని విడిచివెళ్లిపోయింది శారద (పాపాయి పేరు). ఆ ఇంట్లో ఉండబుద్ధయ్యేది కాదు. ఎటైనా వెళ్లిపోవాలనిపించేది. తర్వాత పుట్టిన బాబు పనుల్లో మునిగిపోతున్నా కూడా నాకు పాప గుర్తుకొస్తుండేది. ‘మీ డెస్టినేషన్ ఇది’ అని మా వారికి కొరియాలో ఉద్యోగం చూపించాడు భగవంతుడు. కొరియాకు వెళ్లిన తర్వాత కూడా నేను మామూలు మనిషి కాలేకపోయాను. ఊహలకు తప్ప మాటలకు లేని పాపాయి తరచూ గుర్తుకు వస్తుండేది. కొరియాలో సత్య సాయిబాబా స్పిరిచ్యువల్ గ్యాదరింగ్స్ జరిగేవి. ఇండియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతికి పట్టుకుని మరీ ఆహ్వానించేవాళ్లు. ఆధ్యాత్మిక సత్సంగాల్లో సాంత్వన దొరికింది. ఆ సత్సంగాలు మా జీవిత గమనాన్నే మార్చేశాయి. సత్యసాయి రప్పించారు యు.ఎస్.నుంచి ఏటా సాయిబాబా దర్శనానికి పుట్టపర్తికి వచ్చేవాళ్లం. ఓసారి బాబా మా వారితో ‘ఇప్పటి వరకు సమాజం నుంచి తీసుకున్నావు. ఇక సమాజానికి చేయాల్సింది చాలా ఉంది. హైదరాబాద్‌లో ఉంటూ నువ్వు చేయాల్సిందంతా పూర్తి చేయి’ అన్నారు. ఆ మాటతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాం. సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలైంది. మొదటగా ఇచ్చింది ప్రభుత్వానికే. ఎన్ఆర్ఐకి ఇచ్చే టాక్స్ మినహాయింపును తీసుకోకుండా పూర్తి ట్యాక్స్ కట్టారాయన. అమెరికాలో ఆయన చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌తో ఆదుకున్న ఐవోడబ్లు్యఎ యూనివర్సిటీలో ఏటా మూడు మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. మా పాపకు స్పెషల్ ట్రీట్మెంట్, ట్రైనింగ్ ఇప్పించడానికి అప్పట్లో మా దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. యుఎస్‌లోని రే గ్రాహమ్ అసోసియేషన్ మాకు హెల్ప్ చేసింది. ఆ చారిటీకి మా పాప శారదాదేవి పేరుతో ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నాం. శారద మెమోరియల్‌తో స్పెషల్లీ చాలెంజ్డ్ కిడ్స్‌కి అవసరమైన సర్వీస్ ఇస్తూ ఉంటే శారద మాకు లేదని అనిపించదు. అప్పటికే ఫోర్త్ స్టేజ్! ఆ భగవంతుడు మా చేత... విద్యకు, స్పెషల్ కిడ్స్‌కే కాదు, వైద్యరంగానికీ సేవ చేయించాలనుకున్నాడో ఏమో తెలియదు. మా భార్యాభర్తలిద్దరినీ మూడు నెలల తేడాతో క్యాన్సర్ బారిన పడేశాడు, ఆనక బతికించాడు. 2011లో మా అబ్బాయికి పెళ్లి చేశాం. ‘అరవై నిండాయి, బాధ్యతల నుంచి రిటైరయ్యాం’ అనుకునే లోపు ఆ ఏడాది ఆగస్టులో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడింది. అప్పటికే ఫోర్త్ స్టేజ్. మూడు నెలలే అన్నారు డాక్టర్లు. నాకు వైద్యం మొదలైంది. ఆ ఏడాది డిసెంబర్లో మా వారికి స్టమక్ క్యాన్సర్ బయటపడింది. ఇద్దరమూ ట్రీట్మెంట్ తీసుకున్నాం. నాకు మందులతోనే తగ్గిపోయింది. ఇద్దరం కోలుకున్న తర్వాత క్యాన్సర్ నివారణకు ప్రివెంటివ్ మెడిసిన్ రీసెర్చ్‌కి మావంతుగా తిరిగి ఇవ్వాలనిపించింది. హ్యూస్టన్‌లోని ఎండిఎ రీసెర్చ్‌కి, ఆరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో హోమియో మెడిసిన్ పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్‌కి మా వంతు సాయం చేస్తున్నాం. ఇండియాలో నేరుగా పేషెంట్‌కే సహాయం చేస్తున్నాం. ఏడాదిలో సగం కాలం అమెరికాలో ఉంటాం. అందుకే క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లను కలిసి మేము చేయదలుచుకున్నది చెప్పాం. మాధవి అనే హోల్‌సేల్ డీలర్‌తో అనుసంధానం అయ్యాం. ఎనభై వేలు, లక్ష రూపాయలు ఉండే ఇంజక్షన్లను వేయించుకోలేని వాళ్లకు మేము ఆసరా అవుతున్నాం. పేషెంట్లు వాళ్లు భరించగలిగినంత ఖర్చును వాళ్లు భరిస్తారు, మిగిలిన డబ్బు మేమిస్తాం. ఒక్కొక్కరు నలభై వేలు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఐదు–పది వేలకు మించి భరించలేమంటారు. అసలే ఆధారమూ లేని వాళ్లకు ఫ్రీగా ఇస్తున్నాం. తల్లిగా, గృహిణిగా నా బాధ్యతలు పూర్తయ్యాయి. ఇప్పుడు సోషల్ వర్క్‌లో ఉన్న సంతృప్తిని ఆస్వాదిస్తున్నాను. ఈ జీవితం ఇక సమాజానికి తిరిగి ఇవ్వడానికే. ఏటా ఇంత మొత్తం చదువులకు, ఇంత మొత్తం వైద్యానికి, ఇంత మొత్తం స్పెషల్ కిడ్స్‌కి, ఇంత మా ఇద్దరి మెయింటెనెన్స్‌కి అని విభజించుకుని ఖర్చు చేస్తున్నాం. మా అబ్బాయి ఇక్కడే అమెరికాలో తన ఉద్యోగంలో స్థిరపడ్డాడు. మేము సంపాదించుకున్నదంతా ఇక సమాజసేవకే అంకితం’’ అన్నారు రాజ్యలక్ష్మి. – వాకా మంజులారెడ్డి భయం వద్దు.. ధైర్యం పెంచుకోవాలి నాకు సర్జరీ చేయాల్సిందేనన్నారు డాక్టర్లు. అయితే దేవుడి రూపంలో డాక్టర్ సెంథిల్ ‘మందులతో తగ్గుతుందేమో ప్రయత్నం చేద్దాం’ అన్నారు. మందులు వేసుకుంటూ రోజూ ప్రాణాయామం చేశాను. పచ్చటి చెట్టు కింద కూర్చుని ఉదయం పది నిమిషాలు, మధ్యాహ్నం పది నిమిషాలు, సాయంత్రం పది నిమిషాలు ప్రాణాయామం చేస్తే తగినంత ఆక్సిజెన్ అందుతుంది. దేహం తనను తానే తిరిగి ఆరోగ్యవంతం చేసుకుంటుంది. ఒంటికి రోజూ సూర్యరశ్మి తగలాలి. జీవనశైలిని ఆక్సిజెన్ రిచ్‌గా ఉండేలా చూసుకోవాలి. వైఫై ఎన్విరాన్మెంట్ను తగ్గించుకోవాలి. ముఖ్యంగా బిడ్డల్ని కనాల్సిన వయసులో ఉన్న అమ్మాయిలు మంచి ఆహారం, మంచి గాలిలో జీవించాలి. చేతిలో ఆరోగ్యం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి, ఆ తర్వాత ఆరోగ్యం కోసం వెంపర్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దనేది నా సూచన. ఇక క్యాన్సర్ బారిన పడిన వాళ్లకు చెప్పే మాట ఒకటే.. ఇప్పుడు మంచి మందులున్నాయి. క్యాన్సర్ ప్రాణాంతకం కాదు. ధైర్యంగా ఎదుర్కోవడమే మనిషిగా మనం చేయాల్సింది. నేను భగవంతుడిలో ధైర్యాన్ని వెతుక్కున్నాను. వేద పఠనం ఓ శక్తి తరంగం మోడరన్ లైఫ్స్టయిల్లో క్యాన్సర్ 35 ఏళ్లకే దాడి చేస్తోంది. బయట నూనెలో వేయించిన ఆహారం, సెల్‌ఫోన్ రేడియేషన్ చాలా ప్రమాదకరం. మాది చాలా డిసిప్లిన్డ్ లైఫ్‌స్టయిలే అయినా, హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో మా ఇంటి దగ్గరలో ఉన్న సెల్ టవర్లే క్యాన్సర్ బారిన పడేశాయి. వేదం, రుద్రం, పంచసూక్త పఠనం చేస్తాను. ఆ వైబ్రేషన్స్ ఒట్టి శబ్ద తరంగాలు కాదు, శక్తి తరంగాలు. మనిషిని ఆరోగ్యవంతం చేస్తాయి. మామూలు వ్యక్తుల్లాగే అన్ని పనులూ చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాం. – శంకర్‌నారాయణ ప్లాంజెరీ, -
బీకే పార్థసారథి కాదు.. స్వార్థ సారథి
అనంతపురం , పరిగి : ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి తన క్షేమాన్ని మాత్రమే చూసుకుంటూ స్వార్థ సారథిగా మారారని ఎమ్మెల్యే బీకే పార్థసారథిని వైఎస్సార్సీపీ సమన్వయకర్త కురుబ మాలగుండ్ల శంకరనారాయణ ఎద్దేవా చేశారు. మూడేళ్లుగా రిజర్వాయర్ నిండుతున్నా పెనుకొండ నియోజకవర్గంలో ఒక్క చెరువునూ పూర్తిస్థాయిలో నింపలేని అసమర్థ ఎమ్మెల్యే బీకే అని ధ్వజమెత్తారు. పొరుగు నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలు కృష్ణా జలాలతో చెరువులు నింపుకుంటుంటే పెనుకొండ ఎమ్మెల్యేకు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం ఆయన చేతగాని తనానికి నిదర్శనమన్నారు. పరిగి మండల కేంద్రంలో సోమవారం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జయరాం నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమం జరిగింది. తొలుత వైఎస్సార్ సర్కిల్లో ప్రధాన రహదారిపై దాదాపు గంట సేపు బైఠాయించారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్నా నియోజకవర్గ ప్రజలకు పార్థసారథి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కనీసం తాగునీటి సమస్యను కూడా పరిష్కరించడం లేదని ఆరోపించారు. ఎన్నికలు నాలుగు నెలల్లో ఉండగా ఇప్పుడొచ్చి ఓటమి భయంతో పర్యటనలు చేయడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. దివంతగ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతోనే గొల్లపల్లి రిజర్వాయరు పనులు జరిగాయని శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతరం తహసీల్దారు కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ అంజనరెడ్డికి అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలాజీ, బీసీ సెల్ నాయకుడు డీవీ రమణ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మారుతీశ్వరరావు, సేవాదళ్ నాయకుడు మారుతీరెడ్డి, కార్యకర్తలు, మండల వ్యాప్తంగా ఉన్న పలువురు రైతులు, పెనుకొండ, రొద్దం నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు వైఎస్సార్సీపీ నేత ఓపెన్ ఛాలెంజ్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెనుకొండ సమన్వయకర్త శంకర్‌నారయణ బహిరంగ సవాలు విసిరారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానకి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా పెనుకొండ నియోజకవర్గంలో ఆయన సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిజం కాదా అని పార్థసారథిని నిలదీశారు. పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై చర్చకు వస్తావా అంటూ పార్థసారథికి సవాలు విసిరారు. ‘పాదయాత్ర ఈ రోజు(బుధవారం) నీ మండలం(రొద్దం)లోనే కొనసాగుతోంది. రేపు కూడా ఇదే మండలంలో నా పాదయాత్ర ఉంటుంది. నీవు, నీ అనుచరులు ఇసుకు అక్రమ రవాణాపై చర్చకు వస్తారా?. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని అంటున్నారు.. ఆ అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించాలి. అభివృద్ధి సంగతి అలా ఉంచితే నీ ఆస్తులు ఎంత పెరిగాయో చెప్పాల’ని పార్ధసారథిని నిలదీశారు. -
బాబు ఓ రాజకీయ వ్యభిచారి
అనంతపురం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వ్యభిచారి అని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, హిందూపురం వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్ నారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే వెంటనే రాజీనామా చేసి ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు..ఇప్పుడు మైనార్టీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. శంకర్ నారాయణ మాట్లాడుతూ..అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. -
బాబు ఓ రాజకీయ వ్యభిచారి
-
గర్జన సభ వాయిదా
సాక్షి, అనంతపురం : టీడీపీ చేస్తోన్న అన్యాయంపై వైఎస్సార్ సీపీ తలపెట్టిన గర్జన దీక్ష వాయిదా పడింది. ఈనెల 30న నిర్వహించదలిచిన ఈ సభ వచ్చే నెల 2కు వాయిదా పడినట్లు వైఎస్సార్సీపీ నేతలు ప్రకటించారు. జూలై 2న అనంతపురం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టీడీపీ చేస్తున్న వంచనపై గర్జన దీక్షను చేయబోతున్నట్లు నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణలు తెలిపారు. -
చంద్రబాబు పర్యటనపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జిల్లాలోని రొద్దం మండలం తురకలాపట్నంలో జరిగే జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అయితే చంద్రబాబు పర్యటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో ప్రజాధనం వృధా అవుతోందని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షడుఉ శంకర్ నారాయణ ఆరోపించారు. అనంతలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరుగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే అన్నీ చెరువులకు హంద్రీనీవా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు ప్రాంతాలకు ఇచ్చిన హామీలు నెరవేర్పాలని శంకర్‌నారాయణ పేర్కొన్నారు. -
చంద్రబాబు అసమర్థత వల్లే నిధులు రాలేదు..
రొద్దం: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోవడానికి సీఎం చంద్రబాబు అసమర్థతే కారణమని వైఎస్ఆర్సీపీ నేత శంకరనారాయణ ధ్వజ మెత్తారు. గురువారం హిందూపురంలోని రుద్రపాద ఆశ్రమంలో మండల పార్టీ కన్వీనర్ బి.నారాయణరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు. చంద్రబాబు ఒటుకు కోట్లు కేసు నుంచి బయటపడడానికి ప్రత్యేక హోదాను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. నిధులపై గట్టిగా మాట్లడితే ఎక్కడ కేసులు ప్రస్తావన తెస్తారన్న భయంతోనే నిధుల కేటాయింపులపై మాట్లాడలేక పోతున్నారని విమర్శించారు. నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిన కేంద్రంతో చంద్రబాబు అంటకాగకుండా ధైర్యం ఉంటే బయటకు వచ్చి కేంద్రంతో పోరాటం చేయాలని సూచించారు. ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియచెప్పాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలే పట్టు కొమ్మలని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 14 లోపు ఎవరైనా కొత్త ఓటర్లు ఉంటే జాబితాలో చేర్పించాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మినారాయణరెడ్డి లతో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ శంకర్‌నారాయణ
సాక్షి, తిరుమల : ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శంకర్‌నారాయణ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన తన కుటుంబీకులతో కలిసి ఆలయానికి వచ్చి ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్‌కు తిరుమల ప్రోటోకాల్ జడ్జి సన్యాసినాయుడు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. -
పరిటాల అనుచరుల దాడిపై సర్వత్రా చర్చ
-
ఘటనపై తక్షణమే విచారణకు అదేశించాలి