![Minister Shankar Narayana Fires On Chandrababu Naidu - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/29/Minister-Shankar-Narayana.jpg.webp?itok=d7WNPf2C)
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ కట్టడికి రేయింబవళ్లు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు రాజకీయ విమర్శలు సిగ్గుచేటని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ప్రతి పనిని విమర్శించడం చంద్రబాబు, టీడీపీ నేతలకు అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కరోనాపై రాజకీయాలు చేయడం పక్కనపెట్టి ప్రజలకు తోడుగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఏపీలోకి వచ్చే వలస కూలీలు, ఇతర ప్రజలకు కరోనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రానికి వచ్చిన వారంతా తప్పని సరిగా 14 రోజుల క్వారంటైన్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి శంకర్ నారాయణ హామీ ఇచ్చారు.
(చదవండి : వారికి రూ. 2 వేలు ఇవ్వండి: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment