సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థపైన, అన్ని ప్రభుత్వ వ్యవస్థలపైన గౌరవం ఉన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు రాకపోతే ఆ పాపం మొత్తం చంద్రబాబుదే అని ఆయన మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు అందించే పథకం ఒక శాశ్వత పథకమని ఆయన అన్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందే ప్లాట్ల కేటాయింపు, ఇళ్ల స్థలాల ఎంపిక వంటి ప్రక్రియలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు, ఎన్నికల కమిషనర్ దుర్భుద్ధితో ఇళ్ల స్థలాల పంపిణీని ఆపే ప్రయత్నం చేశారని శంకర్ నారాయణ దుయ్యబట్టారు. సుమారు 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందని, వారి సొంత ఇంటి కల నెరవేరుతుందని మంత్రి అన్నారు. (అందుకే టీడీపీని వీడాను : శమంతకమణి)
విచక్షణ అధికారం అంటే సమాజానికి, ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడేలా ఉండాలని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. ఎలక్షన్ కమిషనర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అయన మండిపడ్డారు. కరోన వైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా లేని ఈ సమయంలోనే ఎన్నికలు నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తామన్నారు. ప్రజల కష్టాలు తెలిసి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు చేరువగా ఉండే వ్యక్తి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని శంకర్ నారాయణ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment