మంత్రి శంకర్ నారాయణ పాల్గొన్న స్పందన కార్యక్రమంలో పాము కలకలం సృష్టించింది. మంత్రి ప్రజలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పాము దూసుకొచ్చింది. సిబ్బంది అప్రమత్తంతో మంత్రికి ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలొ మంత్రి శంకర్‌నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు.