ananthpur
-
జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలు.. తాడిపత్రిలో హైటెన్షన్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో సోమవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. ఈ వ్యాఖ్యల అనంతరం జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించారు. ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో.. పోలీసులు జేసీ ప్రభాకర్‌ను తొలుత హౌస్ అరెస్టు చేశారు. ఈలోపు జేసీ నివాసం వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో డీఎస్పీ చైతన్య జోక్యం చేసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇంతలో జేసీ ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి బయటకు రావాలని యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. (చదవండి: యువతితో వీడియో కాల్: మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతా.. ) -
స్నేహితుల మధ్య ఘర్షణ ... ఒకరి మృతి
గోరంట్ల: డబ్బు విషయంగా ఘర్షణ పడిన స్నేహితులను విడిపించే క్రమంలో మరో స్నేహితుడు హతమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సాములపల్లి వద్ద నివాసముంటున్న సుబ్బన్న, అనంతపురానికి చెందిన సురేష్ బావబామ్మర్దులు. తన స్నేహితుడు షాదర్‌వలితో కలసి బుధవారం సాములపల్లికి సురేష్ వచ్చాడు. డబ్బు విషయంగా సుబ్బన్నతో సురేష్ గొడవపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆ సమయంలో బ్లేడుతో సుబ్బన్న గొంతు కోసేందుకు సురేష్ ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన షాదర్‌వలి వెంటనే అడు్డకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాదర్‌వలి తలపై బండరాయితో కొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్బన్న, షాదర్‌వలిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షాదర్‌వలి మృతిచెందాడు. సుబ్బన్న పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన సురేష్ పరారీలో ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. (చదవండి: దారి తప్పితే జీవితం బుగ్గే..మళ్లీ విస్తరిస్తున్న హెచ్ఐవీ) -
మరికొద్ది గంటల్లో తెల్లారుతుందనంగా... తెల్లారిన బతుకులు
శెట్టూరు: రోజంతా పనులతో అలసిన శరీరాలు రాత్రి గాఢనిద్రలో ఉన్నాయి. తెల్లారితే మళ్లీ బతుకు పోరుకు సిద్ధమవ్వాలి. మరి కొన్ని గంటల్లో ఊరంతా నిద్ర లేస్తుందనగా.. ఒక్కసారిగా భారీ పేలుడు. రెండిళ్లు పూర్తిగా నేలమట్టం. ఏం జరిగింది? ఎలా జరిగింది? అర్థం కాని అయోమయం. ఇళ్ల నుంచి పరుగున రోడ్డుపైకి చేరుకున్న జనం. నేలమట్టమైన ఇంటి శిథిలాల కింద నాలుగు మృతదేహాలు! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం ములకలేడులో చోటు చేసుకున్న పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏం జరిగిందంటే.. ములకలేడుకు చెందిన కొలిమి దాదాపీరా అలియాస్ దాదు (35), షర్ఫూనా (30) దంపతులకు ఆరేళ్ల కుమార్తె నిదా ఫిర్దోషి ఉంది. తల్లి జైనూబీ (65)తో కలిసి దాదు కుటుంబం నివసిస్తోంది. అదే గ్రామంలోని ఓ చికెన్ సెంటర్లో దాదు దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరి ఇంటి పక్కనే మరో ఇంటిలో చిన్నాన్న రజాక్ సాహెబ్ నివాసముంటున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు రజాక్ సాహెబ్ నిద్రలేచాడు. అప్పటికే సిలిండర్ లీకేజీ కారణంగా ఇళ్లంతా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) నిండుకుని ఉంది. అవగాహన రాహిత్యం కారణంగా రజాక్ ఇంట్లో లైట్లు ఆన్ చేయడంతో భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగడంతో రజాక్‌తో పాటు అతని కుమారుడు అబ్దుల్ సాహెబ్ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పక్కపక్కనే ఉన్న రెండిళ్లు కుప్పకూలాయి. మరో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉలిక్కిపడిన గ్రామం.. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ వ్యవసాయ పనులతో అలసిన ములకలేడు వాసులు రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. శనివారం తెల్లవారు జామున 4 గంటలకు పేలుడు ధాటికి ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఎక్కడో.. ఏదో జరిగిందనుకుంటూ నిద్రలోనే ఇళ్ల నుంచి పరుగున బయటకు వచ్చారు. దాదు, రజాక్ ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలుసుకుని గ్రామం మొత్తం అక్కడికి చేరుకుంది. శిథిలాల కింద కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రజాక్, అబ్దుల్‌ను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. పక్క ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా నిద్రలోనే మృత్యుఒడికి చేరుకున్న దాదు, షర్ఫూనా, నిదా ఫిర్దోషి, జైనూబీ మృతదేహాలు బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా మృతదేహాలను తొలగిస్తుంటే పలువురు అయ్యో దేవుడా? అంటూ కంటతడిపెట్టారు. విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం రూరల్ సీఐ శ్రీనివాసులు, శెట్టూరు ఎస్ఐ యువరాజ్, రాష్ట్ర విపత్తుల స్పందన/అగ్నిమాపక సేవల శాఖ అధికారి నజీర్ అహమ్మద్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తీవ్రంగా గాయపడిన రజాక్, ఆయన కుమారుడు అబ్దుల్ని కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అంత్యక్రియలకు వెళ్లివచ్చి... దాదు భార్య షర్ఫూనా పుట్టినిల్లు కనుకూరు గ్రామం. వీరి సమీప బంధువు అనారోగ్యంతో గురువారం మృతి చెందడంతో అంత్యక్రియలను శుక్రవారం కనుకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదు కుటుంబం హాజరైంది. సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. తెల్లారితే ఉపాధి పనుల్లో పాలు పంచుకోవాల్సి ఉంది. ఇంతలో దారుణం చోటు చేసుకోవడంతో ములకలేడు, కనుకూరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంత్రి దిగ్భ్రాంతి.. ములకలేడు ఘటనపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉన్న ఆమెకు విషయాన్ని స్థానిక పార్టీ నేతలు ఫోన్ ద్వారా చేరవేశారు. విషయం తెలుసుకున్న మంత్రి భర్త శ్రీచరణ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శివన్న, నాయకులు జయం ఫణి, బాబు రెడ్డి, సోమనాథరెడ్డి, తిమ్మరాజు, హరినాథరెడ్డి, ముత్యాలు, రమేష్, షేక్షావలి, అప్జల్, సర్పంచ్ నాగరాజు, మన్సూర్ తదితరులు ములకలేడుకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి శ్రీచరణ్‌రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్ నాగరాజు, ఎస్ఐ యువరాజ్ సమక్షంలో వైఎస్సార్ బీమా పథకం కింద తక్షణ సాయంగా రూ.20 వేలను సచివాలయ సిబ్బంది అందించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ రంగయ్య.. ములకలేడులో జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వెంటనే స్పందించారు. గ్రామానికి చేరుకున్న ఆయన స్థానికులతో కలిసి మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజు, వ్యవసాయ మిషన్ సభ్యుడు రాజారాం తదితరులు ఉన్నారు. పెద్ద శబ్దంతో ఉలిక్కిపడ్డాం తెల్లవారుజామున 4 గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. మా ఇంటి గోడలు చీలసాగాయి. భయంతో బయటకు పరుగు తీశాం. బయటికి వచ్చి చూస్తే దాదు, రజాక్ ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి ఉన్నాయి. కాసేపటి వరకూ ఏమీ కనబడలేదు. ఆ తర్వాత చూస్తే రెండిళ్లు పూర్తిగా నేలమట్టమై కనిపించాయి. నా ఇల్లు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు. – అబ్దుల్ రహమాన్, ములకలేడు (చదవండి: 2019లోనే చంద్రబాబును ప్రజలు క్విట్ చేశారు) -
పేదింటికి పెద్ద కష్టం !
అనంతపురం కల్చరల్ /రాప్తాడు: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త కళ్ల ముందే మరణించడంతో ఓ మహిళ కన్నీరు మున్నీరైంది. ఆ బాధ నుంచి తేరుకోకముందే కన్న కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. చిన్న వయసులోనే కట్టుకున్న భర్త మంచం పట్టడంతో భార్య ... తన తండ్రికి ఏమైందో తెలీక ఓ మూడేళ్ల బాలుడు.. ఇలా ఓ కుటుంబాన్ని కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గుత్తి మండలం రజాపురానికి చెందిన ఆదిలక్ష్మమ్మ భర్త మార్కెట్‌యార్డులో పనిచేస్తుండేవాడు. ఆయన చనిపోవడంతో కుమారుడు కృష్ణమూర్తి, కోడలు ఆదెమ్మతో కలసి అనంతపురంలోని చిన్మయనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. ఆదిలక్ష్మమ్మ పెన్షన్‌తో ఆ కుటుంబం జీవనం సాగించేది. అయితే ఆదిలక్ష్మమ్మ 2021 ఫిబ్రవరిలో మరణించడంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరం అక్టోబరులో ఆదెమ్మ కుమారుడు సాకే శ్రీకాంత్ (32)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. కుమారుడికి వచ్చిన జబ్బును చూసి కుంగిపోయిన ఆదెమ్మ భర్త కృష్ణమూర్తి కూడా నవంబరు 1న చనిపోవడంతో ఇక ఆ ఇల్లు దిక్కులేనిదైంది. వారంలో ఐదుసార్లు డయాలసిస్ చేస్తేకానీ శ్రీకాంత్ బతికే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి ఆదెమ్మ , భార్య మల్లిక కన్నీరుమున్నీరవుతున్నారు. కష్టాల్లో శ్రీకాంత్ కుటుంబం బీటెక్ పూర్తి చేసిన సాకే శ్రీకాంత్ ఆరు నెలల కిందట వరకు హుషారుగానే ఉండేవాడు. హైదరాబాద్‌లో అనే సంస్థల్లోనూ పనిచేశాడు. 2018లో వజ్రకరూరు మండలం, కొనకొండ్లకు చెందిన మల్లికతో వివాహం జరగడంతో విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లిలో హార్డ్‌వేర్ ఇంజనీరుగా చేరాడు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే విధి వారిని చిన్నచూపు చూసింది. గత సంవత్సరం అక్టోబరు నెలలో అనారోగ్యంగా ఉందని హాస్పిటల్‌కు వెళితే శ్రీకాంత్ రెండు కిడ్నీలు పాడయ్యాయని తేలింది. దీంతో అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరిగేందుకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశారు. ఆఖరికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు మాత్రం ఆపరేషన్‌తో సమస్య తీరుతుందని దానికి రూ.40 లక్షలు అవసరమవుతాయని తేల్చి చెప్పారు. బిడ్డను బతికించండయ్యా... రెండు కిడ్నీలు పాడైపోయి నా బిడ్డ పడుతున్న బాధ చూడలేకపోతున్నా. ఉన్న డబ్బంతా ఆస్పత్రులకే ఖర్చు పెట్టా. మా ఇంటి భారాన్ని కూతురు, అల్లుడు మోస్తున్నారు. బిడ్డ బతకాలంతే రూ.40 లక్షలు అవసరమంట. దయగల మారాజులు చేతనైంత సాయం చేసి నా కొడుకును బతికించండయ్యా.. – ఆదెమ్మ , సాకే శ్రీకాంత్ తల్లి దాతలు సాయం చేయదలిస్తే... సాకే శ్రీకాంత్ సెల్ నంబర్ – 7658971971 ఎస్బీఐ , జేఎన్టీయూ బ్రాంచ్ అకౌంట్ నం: 30453144331 ఐఎఫ్ఎస్సీ కోడ్ – ఎస్బీఐఎన్ 0021008 గూగుల్‌పే /ఫోన్‌పే నం – 7658971971 -
వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో ఉద్యోగావకాశాలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో వివిధ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ఆ విభాగం హెచ్ఓడీ నరేష్‌యాదవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెటర్నరీ డాక్టర్లు, డ్రైవరు పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29న కర్నూలులోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయం, వీపీసీ క్యాంపస్, కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. వెటర్నరీ డాక్టరు పోస్టుకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేసి ఉండాలి. పశు వైద్యులుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన వారు కూడా అర్హులు. డ్రైవర్లకు 35 ఏళ్ల లోపు వయస్సు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్, మూడేళ్ల అనుభవముండాలి. మరింత సమాచారానికి 94922 22951లో సంప్రదించవచ్చు. (చదవండి : స్మార్ట్‌గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు) -
అమ్మా.. రేషన్ కార్డు వచ్చిందా.. లబ్ధిదారుకు ఎమ్మెల్యే ఫోన్..
అనంతపురం సెంట్రల్: ‘హలో అనురాధమ్మనా మాట్లాడేది. నేను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని మాట్లాడుతున్నా. రేషన్‌కార్డు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నావు కదా కొత్త కార్డు వచ్చిందా.’ అంటూ స్వయంగా ఓ లబ్ధిదారుకు ఫోన్ చేసి ఎమ్మెల్యే ఆరా తీయడం అందరినీ ఆశ్చర్యపరచింది. శనివారం నగరంలో రహమత్‌నగర్‌లోని 27వ సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ లబ్ధిదారురాలికి నేరుగా ఫోన్ చేశారు. సమస్య పరిష్కారమయిందా లేదా అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారు మాట్లాడుతూ.. రేషన్‌కార్డు వచ్చిందని, పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నా రావడం లేదని తెలిపారు. బాధ్యతగా సేవలందించండి అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. అర్హత ఉంటే వెంటనే పథకాలు అందించాలని ఆదేశించారు. ‘స్పందన’ ఫిర్యాదులను రికార్డుల్లో నమోదు చేసి.. పరిష్కారం అయిన వెంటనే పొందుపర్చాలని సూచించారు. దాదాపు 3 నెలలుగా ఫిర్యాదులు రికార్డుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులుగా నియమితులై రెండు సంవత్సరాలు పూర్తవుతోందని.. నేటికీ సరిగా విధులు నిర్వహించకపోవడమేంటని ప్రశ్నించారు. వచ్చామా.. పోయామా అంటే కుదరదని... ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ప్రతి ఇంటికీ వెళ్లాలని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను ఆదేశించారు. ఒక సమస్యపై ప్రజలు తరుచూ తిరగకుండా, సమస్య పరిష్కారమయేంత వరకూ సచివాలయ ఉద్యోగులదే బాధ్యతని తెలియజేశారు. దీర్ఘకాలికంగా ప్రకాష్‌రోడ్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్న రైల్వే ట్రాక్ డ్రెయినేజీ సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ప్రకాష్‌రోడ్డు ప్రాంతానికి సంబంధించి సచివాలయం రహమత్‌నగర్‌లో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కార్యాలయాన్ని మార్చాలని చెప్పారు. అర్హత ఉన్న అందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వయస్సుల్లోనే ఉద్యోగాల్లోకి వచ్చిన మీరు ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలని సూచించారు. కోట్లాది రూపాయలను సచివాలయ వ్యవస్థపై సీఎం వెచ్చిస్తున్నారని, ఆయన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. -
అనంతపురం : ఎస్పీ చొరవతో సకాలంలో చేరిన ఆక్సిజన్ ట్యాంకర్
-
విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
-
ఢిల్లీకి వ్యవసాయోత్పత్తులు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో ఈ నెల 9న ప్రయోగాత్మకంగా అనంతపురం నుంచి ఢిల్లీ మార్కెట్‌కు కిసాన్ రైలు నడిపిన విషయం తెలిసిందే. చీనీ, మామిడి, బొప్పాయి, కర్భూజా, టమాట తదితర ఉత్పత్తులకు ఇక్కడ లభిస్తున్న ధరతో పోల్చుకుంటే ఢిల్లీ అజాద్‌పూర్ మండీలో అధిక ధరలు లభించాయి. దీంతో ఈ నెల 19న రెండో కిసాన్ రైలు పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సారి జిల్లాలో పండిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా పంపితే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని రకాల ఉత్పత్తులు ప్రయోగాత్మకంగా పంపి మార్కెటింగ్ పరిస్థితిపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. వేరుశనగ, పప్పుశనగ, కందులు, రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జ, కొర్రలు, అండుకొర్రలు, ఆముదాలు తదితర అన్ని రకాల ఉత్పత్తులు ఐదారు కిలోలు చొప్పున పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లివచ్చిన కిసాన్‌రైలులో నలుగురు వ్యవసాయశాఖ అధికారులు కూడా ఉన్నారు. రెండో సారి వెళ్లే రైలులో ఇద్దరు అధికారులను పంపించి వ్యవసాయ ఉత్పత్తులకు లభిస్తున్న గిట్టుబాటు ధరలు, అక్కడి ప్రజల వినియోగంపై అధ్యయం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా రాజస్తాన్, గుజరాత్లో పండే వేరుశనగ, పెద్ద సైజు కాబూలీ రకం పప్పుశనగ వాడుతున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తులను అక్కడి వారికి పరిచయం చేస్తే కొంత వరకు ధరలు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనుకున్న ఫలితాలు వస్తే భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తులు కూడా తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు చెబుతున్నారు. కిసాన్‌రైలుకు అడ్డంకులు భవిష్యత్తులో తమ వ్యాపారాలు, కమీషన్లకు గండిపడకుండా ఉండేందుకు దళారులు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. తమ లారీలు, ట్రక్కులు, ఇతరత్రా సరుకు రవాణా వాహనాలకు బాడుగలు లేకుండా పోతుందని భావించిన కొందరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మధ్య దళారీలు కిసాన్ రైలును ఎలాగైనా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 19న ఢిల్లీకి కిసాన్ రైలు ఢిల్లీకి రెండో విడత కిసాన్ రైలు ఈ నెల 19న బయలుదేరుతుందని కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. తొలుత 16న పంపించేందుకు ఏర్పాట్లు చేశామని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 19కి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పంటకోతకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పాటు పంట ఉత్పత్తులు తడిసి నాణ్యత కోల్పోయి రైతుకు నష్టం వాటిల్లే ప్రమాదముండడంతో కిసాన్ రైలు ప్రయాణాన్ని వాయిదా వేసినట్లు వివరించారు. చదవండి: త్వరలోనే ‘పోలవరం’ బకాయిలు రూ.3,805 కోట్లు చెల్లిస్తాం -
రెండు లారీలు ఢీ..ఒకరు మృతి
-
వార్డు వాలంటీర్లపై టీడీపీ నేతల దాడి
-
కరువు సీమలో జలసిరి
-
నీచ రాజకీయాలకు పాల్పడటం దుర్మార్గం
-
చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
రైతులు నష్టపోకుండా సీఎం చర్యలు
-
అనంతపురంలో కట్టుదిట్టంగా లాక్డౌన్
-
రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
మహిళపై చేయిచేసుకున్న టీడీపీ నాయకులు
-
హోంక్వారంటైన్లో ఉన్నవారిపై ప్రత్యేక నిఘా
-
మెడికల్ కాలేజీలోనే కరోనా పరీక్షలు
-
అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
టీడీపీ నేత పరిటాల శ్రీరాంపై కేసు
-
బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కుట్రలు చేశారు
-
అభివృద్ధి చేస్తామంటే..బాబు అడ్డుకుంటున్నారు
-
నిద్రమాత్రలు మింగిన ముగ్గురు విద్యార్ధినులు