గోరంట్ల: డబ్బు విషయంగా ఘర్షణ పడిన స్నేహితులను విడిపించే క్రమంలో మరో స్నేహితుడు హతమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సాములపల్లి వద్ద నివాసముంటున్న సుబ్బన్న, అనంతపురానికి చెందిన సురేష్ బావబామ్మర్దులు. తన స్నేహితుడు షాదర్‌వలితో కలసి బుధవారం సాములపల్లికి సురేష్ వచ్చాడు.
డబ్బు విషయంగా సుబ్బన్నతో సురేష్ గొడవపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆ సమయంలో బ్లేడుతో సుబ్బన్న గొంతు కోసేందుకు సురేష్ ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన షాదర్‌వలి వెంటనే అడు్డకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాదర్‌వలి తలపై బండరాయితో కొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్బన్న, షాదర్‌వలిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షాదర్‌వలి మృతిచెందాడు. సుబ్బన్న పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన సురేష్ పరారీలో ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: దారి తప్పితే జీవితం బుగ్గే..మళ్లీ విస్తరిస్తున్న హెచ్‌ఐవీ)
Comments
Please login to add a commentAdd a comment