High Tension In Tadipatri As JC Prabhakar Reddy House Arrest - Sakshi
Sakshi News home page

జేసీ ‍ప్రభాకర్‌ హింసాయుత వ్యాఖ్యలు.. తాడిపత్రిలో హైటెన్షన్‌

Published Mon, Apr 24 2023 11:23 AM | Last Updated on Mon, Apr 24 2023 12:53 PM

Tension In Tadipatri JC Prabhakar Reddy House Arrest  - Sakshi

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో సోమవారం హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ  టీడీపీ నేత జేసీ ‍ప్రభాకర్‌ రెడ్డి హింసాత్మక వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. ఈ వ్యాఖ్యల అనంతరం జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించారు. ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో.. పోలీసులు  జేసీ ప్రభాకర్‌ను తొలుత హౌస్‌ అరెస్టు చేశారు. 

ఈలోపు జేసీ నివాసం వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో డీఎస్పీ చైతన్య  జోక్యం చేసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇంతలో జేసీ ప్రభాకర్‌ పోలీసుల కళ్లుగప్పి బయటకు రావాలని యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, జేసీ ప్రభాకర్‌ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది.

(చదవండి: యువతితో వీడియో కాల్‌: మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతా.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement