అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్‌లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు.
దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిలిచినా మీటింగ్‌కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే..
ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత!
Comments
Please login to add a commentAdd a comment