Dalit Leader
-
దళిత సంఘం నేత రాంపుల్లయ్యను బెదిరిస్తున్న జేసీ ప్రభాకర్
-
‘‘రేయ్.. నీ కథ చూస్తా!’’ జేసీ బెదిరింపులు వెలుగులోకి
అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు. దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిలిచినా మీటింగ్‌కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే.. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత! -
బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..
-
Vijayawada: మరెవరికీ ఇలాంటి అన్యాయం జరగొద్దు
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్సార్సీపీ దళిత నేత శిరోముండనం చేయించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుండా గిరి చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో అధికారులను ఉపయోగించి మరీ నందెపు జగదీష్‌కు చెందిన భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన జగదీష్.. కూల్చేసిన భవనం ముందే శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా బోండా ఉమాకు నిరసన తెలియజేశారు. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో, అధికార బలంతో భవనాలను కుప్పకూల్చారు. దీనిపై సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తా. దళిత వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా?. బోండా ఉమాకు అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. .. నేను మాజీ కార్పొరేటర్, కో ఆప్షన్ మెంబర్‌ను. నాకు న్యాయం జరగకపోతే, నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తా. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు’’ అని జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. -
యూపీలో భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు
షహరాన్‌పూర్: ప్రముఖ దళిత నాయకుడు, భీమ్ ఆర్మీ అధినేత, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్(36)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ యన గాయపడ్డారు. ప్రస్తు తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షహరాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌బంద్ పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆజాద్‌పై కాల్పులు జరిగాయని పోలీసులు బుధవారం చెప్పారు. కారులో ఉండగానే గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారని చెప్పారు. చంద్రశేఖర్ ఆజాద్ కడుపులోకి ఓ తూటా దూసుకెళ్లిందని అన్నారు. దుండగులు ప్రయాణించిన వాహనంపై హరియాణా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందని వెల్లడించారు. వారిని గుర్తించి, అదుపులోకి తీసుకొనేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టామన్నారు. చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పుల ఘటన పట్ల ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. -
దళిత నేత సందీప్ ను దూషించిన టీడీపీ నేత గడ్డం వెంకటేశ్వరరావు
-
దళిత ఫైర్ బ్రాండ్ ఈశ్వరీబాయి
మూలవాసీ చైతన్యానికి నిలువెత్తు ప్రతీక ఈశ్వరీబాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసిన దళిత ఫైర్‌బ్రాండ్. 1918 డిసెంబర్, 1న హైదరాబాదు చిలకలగూడాలోని సాధారణ దళిత కుటుంబంలో రాములమ్మ, బలరామస్వామి దంపతులకు జన్మించారు. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలలో ప్రావీణ్యమున్న ఈశ్వరీ బాయి ఉపాధ్యాయురాలిగా ఉంటూనే, రాజకీయ, సామాజిక, పోరాటాలలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1942 జూన్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన అఖిల భారత నిమ్న కులాల సభకు ఆమె హైదరాబాదు రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యారు. అంబేడ్కర్‌ను కలిసారు. అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి చురుకుగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. చిలకలగూడా కార్పోరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. 1967లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1969 తెలంగాణా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 1972లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు పదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకురాలి పాత్రలో సమర్థవంతంగా రాణించి, అసెంబ్లీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. 1952 నుండి 1990 వరకు 4 దశాబ్దాలకు పైగా ప్రజా సేవారంగాలలో పనిచేస్తూ, దళి తులు వెనుకబడిన వారి కోసం అవిరళ కృషి చేసారు. రాజకీయాలలో కుల ప్రభావాన్ని తట్టుకొని నిలబడ్డ ఈశ్వరీబాయి నేటి దళిత సమాజానికి దిక్సూచి. ఈ దళిత ఫైర్ బ్రాండ్ 1991 ఫిబ్రవరి 24న కన్నుమూసారు. డా. యస్. బాబూరావు, స్వతంత్ర జర్నలిస్ట్, కావలి మొబైల్ : 95730 11844 -
‘కాంగ్రెస్ చీఫ్‌గా దళిత నేత’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ చీఫ్‌గా కొనసాగేందుకు విముఖత చూపుతున్న రాహుల్ గాంధీ తదుపరి అధ్యక్షుడిగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతను ఎంపిక చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సూచించారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని సీనియర్ నేతలు రాహుల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన అందుకు సిద్ధంగా లేరని, వీలైనంత త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గాంధీ కుటుంబానికి చెందని నేతను పార్టీ చీఫ్‌గా ఎంపిక చేయాలని రాహుల్ కోరుతుండటంతో ప్రియాంక గాంధీకి సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం లేదని సీడబ్ల్యూసీ సభ్యుడు, అసోం మాజీ సీఎం తరుణ్ గగోయ్ పేర్కొన్నారు. పార్టీ చీఫ్‌గా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ సూచించడంతో సమర్ధుడైన నేతను వెతికే పనిలో కాంగ్రెస్ సీనియర్లు నిమగ్నమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు మిత్రపక్షాలకు చెందిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డీఎంకే చీఫ్ స్టాలిన్, జేడీఎస్ కుమారస్వామి తదితరులు కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగాలని రాహుల్‌ను కోరుతున్నా అందుకు ఆయన సిద్ధంగా లేరు. -
జన్మభూమి సభలో దళిత నేతకు అవమానం
సాక్షి, విశాఖపట్నం: దళితులపై టీడీపీ ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉంది. ప్రజాసమస్యల పరిష్కారానికై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న జన్మభూమి - మా ఊరు సభల్లో దళితులకు అడగడుగునా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మరో దళిత నాయకుడికి జన్మభూమి సభలో తీవ్ర అవమానం ఎదురయింది. గోలుగుండ మండలం జోగంపేట జన్మభూమి సభలో స్థానిక ఎంపీటీసీ నూకరత్నంకు చేదు అనుభవం చోటుచేసుకుంది. కక్ష సాధింపుల్లో భాగంగా స్థానిక దళితులను పిలవకుండానే సభను నిర్వహించడం పట్ల నూకరత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులమైనందునే తమను జన్మభూమి సభకు ఆహ్వానించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుల వివక్ష ఎందుకని అధికారులను ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించకుండా సభను నిర్వహించిన అధికారులపైన, మండల నాయకులపైన స్థానిక మంత్రికి, కలెక్టర్‌కు పిర్యాదు చేస్తానని నూకరత్నం తెలిపారు. -
నువ్వేమైనా పుడింగివా.. కళ్లు నెత్తికెక్కాయా?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘నువ్వేం పుడింగివా.. ఎమ్మెల్యేవని విర్రవీగుతున్నావా? ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకే కళ్లు నెత్తికెక్కాయా? మహా నాయకుడివని విర్రవీగుతూ ఫోజులు కొడుతున్నావ్.. నువ్వేమైనా డిక్టేటర్‌ని అనుకుంటున్నావా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండెపి టీడీపీ దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు రెండోరోజు శనివారం ఒంగోలు సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో కొండపి నియోజకవర్గ సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే స్వామిపై చిందులు తొక్కారు. ‘‘నీకు గర్వం పెరిగింది.. గర్వం వచ్చాక మోదీ ఇమేజ్ ఎలా పతనమైందో నీ పరిస్థితి అలాగే అవుతుంది. అలా అవకుండా చూసుకో. నేను కళ్లు తెరిస్తే నిన్నెవరూ పట్టించుకోరు. నేను ఒక్క పిలుపిస్తే నీ పరిస్థితి కార్యకర్తకంటే దిగజారుతుంది. పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీల మాట కూడా వినవా..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మాటలకు బిత్తరపోయిన స్వామికి నోట మాటరాక నిశ్చేష్టుడయ్యారు. సీఎం విరుచుకుపడిన తీరు చూసి ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు సైతం పాపం.. స్వామి.. అంటూ జాలిపడ్డారు. దళితులైన ఎమ్మెల్యే డేవిడ్‌రాజు (యర్రగొండపాలెం), సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ బీఎన్ విజయకుమార్‌లపై సీఎం విరుచుకుపడ్డారు. తన పర్యటనలో తొలిరోజైన శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత ఇదే హాలులో నిర్వహించిన సంతనూతలపాడు, యర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యే డేవిడ్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతనూతలపాడులో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతలే మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. బీఎన్‌ను మార్చాల్సిందేనంటూ కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. సీఎంకు, లోకేష్‌కు ఫిర్యాదులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం.. ఎంపీపీలు, మండల స్థాయి నేతలు చెప్పినట్లు ఎందుకు వినడం లేదంటూ బీఎన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు పనితీరు బాగాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 3 నియోజకవర్గాలకు చెందిన దళిత ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలపై సీఎం తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. సీఎం తన సామాజిక వర్గం నేతల కోసమే దళిత ఎమ్మెల్యేలను చివాట్లు పెట్టారని వారి అనుచర వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన సామాజికవర్గానికి చెందిన మండల స్థాయి నేతలు ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నా పట్టించుకోని చంద్రబాబు.. దళిత ఎమ్మెల్యేలను తిట్టడంపై స్వపక్ష నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. మీ తాత నాకు విధేయుడు.. కొండపిలో వర్గ విభేదాలకు ఆజ్యం పోశావంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ‘‘నిన్ను జిల్లా నాయకుడిని, ఎమ్మెల్యేని చేశాను. మీ తాతను ఎమ్మెల్యే, మంత్రిని చేశాను. వయసులో పెద్దవాడైనా ఆయన విధేయతగా ఉండేవారు. నీ దగ్గర ఆ అలవాటు లేదు. మీ తాత పనితీరు నీకు రాలేదు. పనిమెరుగు పరుచుకో’’ అంటూ సలహాఇచ్చారు. జిల్లా నాయకత్వం వహిస్తే.. అందరిని కలుపుకుపోవాలని చెప్పారు. తననెవరూ ఏ మార్చలేరంటూ సీఎం చెప్పారు. -
‘అంబేడ్కర్ పేరుతో ప్రమాణం చేయండి’
సాక్షి, ముంబై : దళితులెవ్వరు బీజేపీకి ఓటు వెయ్యకుండా అంబేడ్కర్‌పై ప్రమాణం చేయాలని గుజరాత్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమనేత జిగ్నేష్ మెవానీ కోరారు. నాగపూర్‌లో రిపబ్లిక్ యూత్ ఫెడరేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జిగ్నేష్ మాట్లాడుతూ.. దళితులు బీజేపి ఓటు వెయ్యవద్దని, ఓటు వేయకుండా అంబేడ్కర్ పేరుతో ప్రమాణం చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుమారు లక్షమంది చేత ప్రమాణం చేయించాలని పిలుపినిచ్చారు. దీనికి కొరకు మహారాష్ట్రలోని అన్ని జిల్లాలో ప్రచారం చేయాలన్నారు. త్వరలో జరుగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీష్‌గఢ్, మహారాష్ట్ర ఎన్నికల్లో దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పేర్కొన్నారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, మనుస్మృతిని ఆధారంగా చేసుకుని పరిపాలన చేస్తోందని విమర్శించారు. దేశంలో అతిపెద్ద అబద్దాల కోరుగా ప్రధాని మోదీని వర్ణించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా కూడా కనీసం లక్ష ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. కనీసం మిమ్మల్ని నమ్ముకున్న ఎబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకైన ఉద్యోగాలు కల్పించండి అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. -
టీడీపీ దళిత మహిళా నేతపై దాడి
మంగళగిరిరూరల్: తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆ పార్టీకి చెందిన దళిత మహిళా నాయకురాలికి అవమానం జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జి ఎదుటే ఆ పార్టీ నాయకులు కొందరు ఆమెను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సదరు టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దర్శి వనరాణి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ అధినేత రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి ఇంటి వద్ద ఆయనతో పాటు పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా విభాగం జిల్లా కార్యవర్గ సభ్యురాలు దర్శి వనరాణి సమస్యలను వివరిస్తుంటే ‘‘ఇది చౌదర్ల పార్టీ నువ్వు మాట్లాడడానికి వీల్లేదు.. కూర్చో’’ అంటూ పార్టీ నేత పోలవరపు హరిబాబు అడ్డుకున్నాడు. ‘‘పదవులు ఇస్తే మీ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. మీకు పదవులు ఇచ్చినందుకు మా కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోవాలి. కులం తక్కువవాళ్లను పక్కన పెట్టాలి.’’ అంటూ విద్వేషంగా మాట్లాడాడు. దీంతో ఆమె చిన్నబుచ్చుకుని బయటకు వస్తుంటే కులం పేరుతో మరోసారి దూషించి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె భోరుమని విలపించింది. టీడీపీలో మొదటినుంచి పనిచేస్తున్న తమలాంటి వారిని కుల అహంకారంతో అందరి సమక్షంలోనే హరిబాబు దూషించి, దాడికి పాల్పడినా ఎవరూ మాట్లాడలేదని వాపోయారు. పైగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి తన వాహనంలో హరిబాబును తీసుకుని వెళ్లిపోయారన్నారు. తనను అవమానపరిచిన హరిబాబుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి దళితుల గౌరవాన్ని కాపాడాలని ఆమె విలేకరుల సమావేశంలో కోరారు. అనంతరం ఈ సంఘటనపై మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో దళిత సంఘాల నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోలవరపు హరిబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దళితతేజం కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ తీర్మానం టీడీపీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న దళితతేజం కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ టీడీపీ దళితనేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. మంగళగిరిలో నియోజకవర్గ దళిత నేతల అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించారు. దర్శి వనరాణి పట్ల హరిబాబు దాడిచేసి, కులంపేరుతో అసభ్యంగా మాట్లాడాడని, అతనిపై చర్యలు తీసుకునేవరకు దళితతేజం–తెలుగుదేశం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. సమావేశంలో దళిత నాయకులు జ్యోతిబసు, వెలగపాటి విలియం, మరియదాసు, కుక్కమళ్ళ సాంబశివరావు, కొమ్మా లవకుమార్, కంచర్ల ప్రకాశరావు, రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జిగ్నేష్‌పై జులుం.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అహ్మదాబాద్ : దళిత యువ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీపై గుజరాత్ పోలీసులు జులుం ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్తున్న ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళిత ఉద్యమ కార్యకర్త భానుభాయ్ వాంకర్ బలిదానానికి సంతాపంగా సారంగపూర్‌లోని అంబేద్కర్ విగ్రహాం వద్ద సంస్మరణ ర్యాలీ, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు వాంకర్ కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఇందులో పాల్గొనేందుకు తన అనుచరులతో కలిసి జిగ్నేష్ ర్యాలీగా బయలుదేరారు. అయితే ప్రారంభంలోనే ఆయన్ని అడ్డుకున్న పోలీసులు కారులోంచి లాగేశారు. ఆపై కారు తాళాలను బద్ధలు కొట్టి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్న విషయం తెలియరావటం లేదు. దీంతో జిగ్నేష్ అనుచరులు ధర్నాకు దిగారు. ఈ మేరకు యువ నేత సెహ్లా రషీద్ తన ట్విట్టర్లో సందేశాలను, ఆ వీడియోను పోస్ట్ చేశారు. తనకు న్యాయంగా దక్కాల్సిన భూమి కోసం ఏళ్ల తరబడి పోరాటం జరిపిన భానుభాయ్ వాంకర్ గురువారం పటన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మాహుతికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన మృతి చెందారు. ఈ నేపథ్యంలో దళిత వ్యతిరేక బీజేపీ దారుణ హత్యకు పాల్పడిందంటూ జిగ్నేష్ ఆరోపణలకు దిగాడు. యువ నేతలు హర్దిక్ పటేల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్లతో కలిసి జిగ్నేష్ అహ్మదాబాద్-గాంధీనగర్హైవేపై నిరసన ప్రదర్శనలో శనివారం పాల్గొన్నారు. భానుభాయ్ వాంకర్ -
దూసుకొస్తున్న జిగ్నేష్.. టెన్షన్.. టెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ : ఓ పక్క వాటర్ కెనాన్లు, భారీ కేడ్లు, బాష్ప వాయుగోళాలు, లాఠీలు పుచ్చుకొని నిల్చున్న పోలీసులు.. మరోవైపు పెద్ద పెట్టున నినాదాలతో, మద్దతుదారులతో దూసుకొస్తున్న దళిత నేత జిగ్నేష్ మేవానీ. మొత్తానికి పార్లమెంటు వీధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల ఆదేశాలను లెక్కచేయకుండా ర్యాలీకోసం పార్లమెంటు వీధిలో జిఘ్నేష్ మేవాని బయలుదేరారు. పలు నిర్బంధాలను చేధించుకొని ఆయన పార్లమెంటు వీధికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ ర్యాలీ కోసం దాదాపు 600మంది మద్దతు దారులు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు వీధి నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం వరకు రాజ్యాంగం కాపీలతో, మనస్మృతి కాపీలతో 'యువ హంకార్ ర్యాలీ' నిర్వహించి తీరుతామని మేవానీ ప్రకటించారు. అయితే, గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పార్లమెంటు వీధిలో ఆంక్షలు ఉన్నాయని, అక్కడ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ర్యాలీలు నిర్వహిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ, మేవానీ, ఆయనకు మద్దతుగా అస్సాం రైతుల హక్కుల పోరాట ఉద్యమ నేత అఖిల్ గొగోయ్ మరికొందరు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ర్యాలీ కోసం కార్యకర్తలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా.. ఈ ర్యాలీ కోసం దాదాపు 10 వేలమంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు వారిని నిలువరించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. పార్లమెంటు స్ట్రీట్ మొత్తం హైసెక్యూరిటీ జోన్‌గా ప్రకటించడం మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల కొన్ని మెట్రో సర్వీసులు రద్దు చేశారు. విద్య, ఉద్యోగాలు, లింగ సమానత్వంవంటి అంశాలపై పోరాటం చేస్తున్న దళిత సంస్థ బీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. -
దళిత హక్కుల నేతపై భూఆక్రమణ కేసు
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిజ్జవరపు జయరాజుపై భూఆక్రమణ కేసు నమోదైంది. చాణక్యపురిలోని తన స్థలాన్ని జయరాజు ఆక్రమించారని బాలకృష్ణ అనే వ్యక్తి ఏలూరు టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జయరాజుపై శిక్షాస్మృతిలోని 447, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేస్తారన్న సమాచారం తెలియడంతో జయరాజు సరెండర్ పిటిషన్ తో జడ్జి ముందు లొంగిపోయారు. జయరాజుపై పలు భూకబ్జా ఆరోపణలున్నాయి. -
దళితుడినే CM చేస్తామన్న జైరాం
-
తెలంగాణకు దళితుడే సీఎం: జైరాం రమేశ్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేస్తాం: జైరాం రమేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి అన్ని సెంటిమెంట్లను కాంగ్రెస్ ఖాతాలోనే వేసుకుంటాం సాక్షి, నిజామాబాద్/ న్యూస్‌లైన్, కరీంనగర్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ హామీ ఇచ్చారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానం మనస్సులో ఉందన్నారు. తెలంగాణకు కాబోయే సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రాహుల్‌గాంధీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజుకు అప్పగించారని చెప్పారు. జైరాం రమేశ్ సోమవారం నిజామాబాద్, కరీంనగర్లో విలేకరుల సమావేశాల్లో, నిజామాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీల వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే ఇక్కడ సమగ్రాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఇది టీ-20 మ్యాచ్ కాదని, సుదీర్ఘ ప్రణాళికతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, తెలంగాణను మరో జార్ఖండ్‌లా కానీయొద్దని అన్నారు. టీఆర్ఎస్ ఏర్పడిన 2001కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కోరిందని తెలిపారు. 2000లో బీజేపీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఏర్పాటు ఏమైందని ఆ పార్టీ నేత ఎల్కే అద్వానీకి సోనియా లేఖ రాశారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో టీఆర్ఎస్ పాత్ర శూన్యమని అన్నారు. అన్ని సెంటిమెంట్లను కాంగ్రెస్ ఖాతాలోనే వేసుకుంటామని తెలిపారు. టీఆర్ఎస్తో పొత్తుపై అత్యున్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం సొంతంగా గెలిచేంత బలం ఉందంటున్నారని చెప్పారు. హైదరాబాద్ ఆదాయం పూర్తిగా తెలంగాణకే చెందుతుందని, ఇక్కడ ఎవరైనా ఉండవచ్చని తెలిపారు. 1959, 1979, 2002, 2009లలో వెలువడిన తీర్పులు, రాజ్యాంగంలోని ఆర్టికల్-3, 4 ప్రకారమే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. విభజనపై ఎవరు కోర్టుకు వెళ్లినా ఒరిగేదేమీ లేదన్నారు. సింగరేణిపై పూర్తి అధికారం తెలంగాణ రాష్ట్రానికే ఉంటుందని చెప్పారు. తెలంగాణలో నాలుగేళ్లలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంటు నిర్మిస్తామని, ఇది గ్యాస్ ఆధారితమా, బొగ్గు ఆధారితమా అనేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి పదేళ్ల పాటు కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ర్టంలోనూ పరిశ్రమలకు పన్ను రాయితీ ఉంటుందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే పార్టీ తరపున అవకాశం ఇస్తామన్నారు. సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, అందువల్లే ఇన్ని చిక్కులు వచ్చాయని అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు చర్చకు వచ్చినప్పుడు బీజేపీ అగ్రనేతలు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలు భిన్నమైన ప్రకటనలు చేసి ద్వంద్వ విధానాన్ని ప్రదర్శించారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఈ నెల 19న తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను కలుస్తామని చెప్పారు. ఈనెల 18న సీమాంధ్ర, తెలంగాణ జేఏసీలతో భేటి అవుతామన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్ సీఎంగా ఉండగా చట్టం కూడా చేశారని తెలిపారు. అయితే, న్యాయపరమైన సమస్యలతో రిజ ర్వేషన్ నిలిచిపోయిందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, మాజీ మంత్రులు పి.సుదర్శన్ రెడ్డి, షబ్బీర్‌అలీ, మాజీ విప్ ఈరవత్రి అనిల్, ఎంపీలు మధుయాష్కీ, సురేశ్ షెట్కార్, పొన్నం ప్రభాకర్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ మారాడా! ‘అనంత వె ంకట్రామిరెడ్డి పార్టీ మారాడా..! అయితే ఓకే ఓకే’.. అంటూ జైరాం రమేశ్ విలేకరుల సమావేశంలో తడబడ్డాడు. మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డిలు పార్టీ మారడంపై స్పందిస్తూ.. ‘ కాంగ్రెస్‌లో సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. పదవులు, అధికారం కోసం పాకులాడే వారు వెళ్లారు’ అని అన్నారు. ఇదే సందర్భంగా పార్టీలో జనాకర్షణ, సత్తా ఉన్న రఘువీరారెడ్డి, మాణిక్యవరప్రసాద్, చింతా మోహన్, అనంత వెంకట్రామిరెడ్డిలాంటి నేతలున్నారని అన్నారు. పక్కనే ఉన్న డి.శ్రీనివాస్, ఎంపీలు పొన్నం ప్రభాకర్‌లు కలుగచేసుకుని ‘అనంత’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. దీంతో ‘ అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ మారారా... ఒకే ఒకే ’ అని అన్నారు. -
దళితుడినే ముఖ్యమంత్రి చేయాలి
కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం దళితుడినే ముఖ్యమంత్రి చేయాలని నేతకాని విద్యార్థి సంఘం(ఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర నాయకుడు అనపర్తి యువరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన నేతకాని విద్యార్థి సంఘం జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ ఆధీనంలోనే కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందిచాలని అన్నారు. వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించడంతోపాటు మెస్ చార్జీలు పెంచాలని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యాభ్యాసం చేసే వారి కోసం స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కోరరు. నిరుద్యోగులకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రుణాలు అందజేయాలని, భృతి చెల్లించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం హాస్టల్ విద్యార్థులకు వెంటనే దుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జుమిడి గోపాల్, ప్రధాన కార్యదర్శి దుర్గం గణపతి, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు వీవీ ప్రసాద్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు మేడి చరణ్‌దాస్, గంధం శంకర్ తదితరులు పాల్గొన్నారు.