జిగ్నేష్ మెవానీ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : దళితులెవ్వరు బీజేపీకి ఓటు వెయ్యకుండా అంబేడ్కర్‌పై ప్రమాణం చేయాలని గుజరాత్ ఎమ్మెల్యే, దళిత ఉద్యమనేత జిగ్నేష్ మెవానీ కోరారు. నాగపూర్‌లో రిపబ్లిక్ యూత్ ఫెడరేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జిగ్నేష్ మాట్లాడుతూ.. దళితులు బీజేపి ఓటు వెయ్యవద్దని, ఓటు వేయకుండా అంబేడ్కర్ పేరుతో ప్రమాణం చేయాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుమారు లక్షమంది చేత ప్రమాణం చేయించాలని పిలుపినిచ్చారు. దీనికి కొరకు మహారాష్ట్రలోని అన్ని జిల్లాలో ప్రచారం చేయాలన్నారు.
త్వరలో జరుగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీష్‌గఢ్, మహారాష్ట్ర ఎన్నికల్లో దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పేర్కొన్నారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, మనుస్మృతిని ఆధారంగా చేసుకుని పరిపాలన చేస్తోందని విమర్శించారు. దేశంలో అతిపెద్ద అబద్దాల కోరుగా ప్రధాని మోదీని వర్ణించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా కూడా కనీసం లక్ష ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. కనీసం మిమ్మల్ని నమ్ముకున్న ఎబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకైన ఉద్యోగాలు కల్పించండి అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment